పరిశ్రమలపై పనికిమాలిన కథ | Ramoji Rao Eenadu Fake News on AP Industries | Sakshi
Sakshi News home page

పరిశ్రమలపై పనికిమాలిన కథ

Published Sat, May 11 2024 8:25 AM | Last Updated on Sat, May 11 2024 8:27 AM

Ramoji Rao Eenadu Fake News on AP Industries

లేనిది ఉన్నట్లుగా రామోజీ అడ్డగోలు రాతలు 

సాక్షి, అమరావతి : అసత్యాలను అక్షరాలుగా పేర్చడంలో ఆరితేరిన రామోజీరావు అనేకానేక అబ­ద్దల కథనాలతో ఈనాడును నింపేస్తున్నారు. రా­ష్ట్రంలో దినదినాభివృద్ధి చెందుతున్న పరి­శ్రమ­ల­పైనా విషం చిమ్ముతున్నారు. వాస్తవాలు తెలు­సుకోకుండా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంపై బు­రద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న పరి­శ్ర­మ­లు తీసుకునే రుణాలపై రిజిస్ట్రేషన్‌ చార్జీలకు సంబంధించి కనీస అవగాహన లేకుండా, లే­ని భారాన్ని ఉన్నట్లు చూపిస్తూ వైఎస్‌ జ­గ­న్‌ ప్రభుత్వంపై అభాండాలు వేశారు. ప్ర­జల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చే­శారు. 

చిన్న, మధ్య తరహా పరిశ్రమలు గ­తంలో ఎంత రుణం తీసుకున్నా రూ.10 వేలు చె­ల్లిస్తే సరిపోయేదని, ఇప్పుడు దాన్ని 25 రెట్లు పెంచి వాటిపై భారం వేశారంటూ పచ్చి అబద్ధాన్ని ఈ­నా­డులో అచ్చేశారు. నిజానికి మార్ట్‌గేజ్‌ బాండ్‌కు చె­ల్లించాల్సిన స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులో ఎ­టు­వంటి మార్పు లేదు. గతంలో ఉన్న ఛార్జీలే ఇ­ప్ప­టికీ అమల్లో ఉన్నాయి. అయినా 25 రెట్లు పెరిగిందని అబద్దాలు ప్రచురించేశారు. ఎక్కడ ఏ పరి­శ్రమ­కు ఎలా పెరిగిందో మాత్రం చూపలేకపోయారు. దా­న్నిబట్టే ఈనాడులో అచ్చేసింది పచ్చి అబద్ధమని తేలిపోయింది.

ఆ రెండింటికీ తేడా తెలియదా?
డిపాజిట్‌ ఆఫ్‌ టైటిల్‌ డీడ్స్‌ దస్తావేజుకి, మార్ట్‌గేజ్‌ బాండ్‌కి తేడా తెలియకుండా రామోజీ అవాస్త­వా­ల­తో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. నిజా­నికి సూక్ష్మ, చిన్న పరిశ్రమలు రుణాలు పొందిన­ప్పుడు ఇచ్చే డిపాజిట్‌ ఆఫ్‌ టైటిల్‌ డీడ్స్‌కు మా­త్ర­మే వెయ్యి రూపాయల స్టాంప్‌ డ్యూటీ వర్తిస్తుంది. మ«­ద్య తరహా పరిశ్రమలకు ఎప్పుడూ స్టాంప్‌ డ్యూ­టీ మినహాయింపు లేదు. మధ్యతరహా పరిశ్రమ రూ.5 కోట్లు రుణం తీసుకుంటే దాని మార్ట్‌గేజ్‌ బాండ్‌కి స్టాంప్‌ డ్యూటీగా 0.5 శాతం చొప్పున 2.5 లక్షలు చెల్లిస్తున్నారనడం పూర్తి అవాస్తవం.

 డిపాజిట్‌ ఆఫ్‌ టైటిల్‌ డీడ్స్‌ని మార్ట్‌గేజ్‌
బాండ్‌గా ఊహించుకుని దానికి 0.5 శాతం స్టాంప్‌ డ్యూటీ కట్టాలనే కాకి లెక్క వేసి ప్రజలను మాయ చేయాలనేది రామోజీ ప్రయత్నం. ఒకవేళ ఏదైనా పరిశ్రమ తీసుకునే ఎన్ని కోట్ల రుణానికైనా డిపాజిట్‌ ఆఫ్‌ టైటిల్‌ డీడ్స్‌ దస్తావేజుకు చెల్లించే స్టాంప్‌ డ్యూటీ రూ.50 వేలు మాత్రమే. 0.5 శాతం స్టాంపు డ్యూటీ డిపాజిట్‌ ఆఫ్‌ టైటిల్‌ డీడ్స్‌కు వర్తించ­దు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు స్టాంపుల చ­ట్టం ప్రకారం వెయ్యి రూపాయల స్టాంప్‌ డ్యూటీ క­డి­తే సరిపోతుంది. 25 రెట్ల భారం ఎక్కడ వే­సి­నట్లు? ఈ కనీస పరిజ్ఞానం కూడా రామోజీకి లేదు.

వాస్తవానికి రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రజలు, పరిశ్రమలకు అనుకూలంగా అనేక మార్పులు జరిగాయి. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల వ్యవస్థతో పాటు ఈ–స్టాంపింగ్‌ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిద్వారా గతంలోకంటే సులభంగా ప్రజలు రిజిస్ట్రేషన్ల సేవలు పొందుతున్నారు. ఇలాంటి అంశాలను తప్పుదోవ పట్టించే క్రమంలో రామోజీరావు ఉద్దేశపూర్వకంగానే పరిశ్రమలపై రిజిస్ట్రేషన్ల ఛార్జీలతో బాదేస్తున్నారంటూ ఒక కల్పిత కథనాన్ని ప్రచురించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement