ఉన్నత విద్య బలోపేతానికి జగన్ కృషి – చంద్రబాబు హయాంలో నీరుకారిన చదువులు
వర్సిటీ పోస్టులను భర్తీ చేయని టీడీపీ ప్రభుత్వం – అడ్డగోలు నోటిఫికేషన్లతో నాడు న్యాయవివాదాలు
నేడు పోస్టుల భర్తీకి జగన్ ప్రభుత్వం అడుగులు
నాణ్యమైన విద్యతో రాష్ట్రంలో పెరుగుతున్న ప్లేస్‌మెంట్లు ఓర్వలేని రామోజీ, బాబుల విషప్రచారం...
బాగా చదివే విద్యార్థులను వెన్నుతట్టి...ప్రోత్సహిస్తే ..మరింతగా వారు రాణిస్తారు..ఆ విద్యార్థుల ప్రతిభకే ప్రభుత్వం పట్టం గడుతూ... దేశ, విదేశాల్లో ఉన్నత చదువులకు వారికి చేయూతనందిస్తుంటే...వారి తల్లిదండ్రులే వేనోళ్ల కొనియాడుతున్న అపురూప దృశ్యం ఈ రోజు నవ్యాంధ్రలో అపూర్వంగా కనిపిస్తోంది.. రామోజీరావుకు ఒక్కరికే విద్యారంగ ప్రగతి నచ్చడం లేదు.. ఇంకా చెప్పాలంటే ఈ పచ్చమద్దతుదారుకు ఒంటిపై తేళ్లూ జెర్రులు పాకుతున్నట్లుగా ఉంది... పచ్చపార్టీ కొమ్ముకాయకపోతే తనకు రోజు గడవదు...పచ్చను రోజూ ఏదోలా పైకి లేపనిదే తనకు నిద్ర పట్టదు...ఈ మానసిక అల్లకల్లోలంలో మంచినీ చెడుగా చెప్పడం పెద్ద దురలవాటుగా మార్చుకున్నారు...
శనివారం నాటి ఈనాడులో తన పిచి్చని, దౌర్భాగ్యాన్నంతా రంగరించి ‘ఈ చదువులు మాకొద్దు మామా’ శీర్షికన ప్రచురించిన కథనం ఇలాంటిదే...విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పడమంటే నాణ్యమైన విద్యను నేరి్పంచడం...వారి భవిష్యత్తుకు జీవితకాల భరోసా ఇవ్వడం...ఇవేవీ చంద్రబాబు పద్నాలుగేళ్లలో చేయలేక, చేవలేక చతికిల పడితే కేవలం అయిదంటే అయిదేళ్లలో చేసి చూపించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధి రామోజీరావుకు మహా కంటగింపుగా ఉంది...మా బాబు సాధించలేకపోయిన ఘనతను జగన్ సాధిస్తారా? ...అనే ఈర‡్ష్య అణువణువునా జీరి్ణంచుకుపోయిన రామోజీలోని విషమంతా అక్షరాల్లో కుమ్మరించి, జనంలోకి వదులుతున్నారు...ఈ అవాస్తవాల విషానికి విరుగుడుగా వాస్తవాల ఫ్యాక్ట్‌చెక్ ఇది...
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యార్థులను అత్యున్నత ప్రమాణాలు, నైపుణ్యాలతో ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నా, ఈనాడు రామోజీరావుకొక్కరికే అవేవీ కనిపించడం లేదు. గత ప్రభుత్వ హయాంలో విద్యారంగం ఎందుకూ కొరగాకుండా పోయినా, అదే అద్భుతమన్నట్లు వరి్ణంచిన ఈనాడు ఇప్పుడు విద్యారంగం పురోభివృద్ధి సాధిస్తున్నా అవాస్తవాలను అచ్చేస్తోంది.. ఓ రిక్షా కార్మికుడు, వ్యవసాయ కూలీ, వెయిటర్..ఇలా రోజు పనిచేస్తే గానీ పొద్దుగడవని కుటుంబాల బిడ్డలు పెద్ద చదువుల్లో రాణిస్తుంటే అక్కసు వెళ్లగక్కుతోంది.
ప్రతిభ ఉంటే ఆ విద్యారి్థకి ఎంత సాయమైనా చేసి చదివించే సంస్కరణలను సీఎం జగన్ ప్రవేశపెడితే.. కుట్ర కథనాలతో అసత్యాలను ప్రచారం చేస్తోంది. సీఎం జగన్ ఉన్నత విద్యను మొత్తం ఉచితం చేసేశారు. టీడీపీ ఐదేళ్లలో ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టల్ ఖర్చుల కింద రూ.12 వేల కోట్లు చెల్లిస్తే.. 59 నెలల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 27 లక్షల మంది విద్యార్థులకు ఏకంగా రూ.18 వేల కోట్లకు పైగా చెల్లిస్తుండటం విశేషం. ఇందులో గత ప్రభుత్వం 2017 నుంచి ఇవ్వాల్సిన రూ.1,778 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలూ ఉన్నాయి
ఉన్నత చదువుల్లో భాగంగా పేద విద్యార్థులకు భోజన వసతి ఖర్చు కోసం ఏడాదికి రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆరి్థక సాయాన్ని ఈ ప్రభుత్వం అందిస్తోంది. గతంలో కుల ప్రాతిపదికన, కోర్సు ప్రాతిపదికన కేవలం రూ.4 వేల నుంచి రూ.10 వేలు మాత్రమే ఇచ్చేవారు. ఇంత మేలు చేస్తుంటే ఎన్నికల్లో చతికిలపడ్డ చంద్రబాబును ఎలాగైనా గద్దెనెక్కించేందుకు తనవంతు దుష్ట యజ్ఞాన్ని చేస్తోంది.
ఆరోపణ: వర్సిటీల్లో 76 శాతం పోస్టుల ఖాళీ
వాస్తవం: విశ్వవిద్యాలయాలలోని ఖాళీలు భర్తీ కాకపోవడానికి కారణం గత ప్రభుత్వం కాదా? గత ప్రభుత్వం అధికారంలో ఉన్న మొదటి తొమ్మిదేళ్లూ అంటే 1995 నుంచి 2004 వరకు, రాష్ట్రం విడిపోయాక 2014 నుంచి 2019 వరకూ విశ్వవిద్యాలయాల్లో ఒక్క ఆచార్యుడినైనా నియమించారా? దీనిపై ఎప్పుడైనా రామోజీరావు చంద్రబాబును ప్రశి్నంచారా? గత ప్రభుత్వం చేపట్టిన అడ్డగోలు నియామక ప్రక్రియపై పలు కేసులు అప్పుడే కోర్టుల్లో నమోదయ్యాయి. వాటిని కోర్టులో పరిష్కరించి గత సెప్టెంబర్ నాటికి ప్రభుత్వం వర్సిటీల వారీగా నోటిఫికేషన్లను విడుదల చేసింది. దీని ప్రకారం 18 వర్సిటీల్లో 3,295 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. వీటిని భర్తీ చేస్తే సీఎం జగన్‌కు ఎక్కడ మంచి పేరొస్తుందోనన్న కుట్రలతో చంద్రబాబు వాటిపైనా కోర్టుల్లో కేసులు వేయించడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది.
ఆరోపణ: పీజీ చదివినా ఏం లాభం? ఉద్యోగాలు రావట్లేదు...
వాస్తవం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచి్చన తర్వాత ఉన్నత విద్యలో విప్లవాత్మక సంస్కరణలను తెచ్చారు. కరిక్యులమ్‌ను పూర్తి స్థాయిలో మార్పు చేయడంతో పాటు మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దారు. 10 నెలల తప్పనిసరి ఇంటర్న్íÙప్‌తో చదువు సమయంలోనే ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించారు. మైక్రోసాఫ్ట్‌తో కలిసి అప్‌స్కిల్లింగ్ చేపట్టారు. ఇవన్నీ చేయడంతోనే డిగ్రీ, బీటెక్‌లో ఉండగానే ఆంధ్రప్రదేశ్ యువత ఎంఎన్‌సీ కంపెనీల్లో భారీ వార్షిక ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధిస్తోంది.
ఇలా చంద్రబాబు హయాంలో కేవలం 35 వేలుగా ఉన్న క్యాంపస్ ఉద్యోగాలు 2022–23 విద్యా సంవత్సరంలో 1.80 లక్షలకు పెరిగాయి. ఇందులో ఒక్క సంప్రదాయ డిగ్రీతోనే 60 వేలకు పైగా ఉద్యోగాలు సాధించారు. వీటిల్లో మళ్లీ 17 వేల వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులూ ఉండటం మరో విశేషం. ఇలా డిగ్రీ స్థాయిలో మంచి ఉద్యోగాలు రావడంతో యువత కుటుంబ ఆరి్థక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి ముందుగా ఉద్యోగాల్లో చేరిపోతున్నారు.
అనంతరం ఆన్‌లైన్ సరి్టఫికేషన్, దూరవిద్య.. ఇలా వివిధ రూపాల్లో తమకు నచి్చన పీజీ కోర్సులను అభ్యసిస్తున్నారు. కొన్ని కంపెనీలయితే తమ ఉద్యోగుల్లో సామర్థ్యాన్ని పెంచేందుకు అవే ప్రైవేట్ వర్సిటీలతో అనుసంధానమైన పీజీ, ఎంటెక్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వీటన్నింటి ఫలితంగానే నేరుగా పీజీ చదివే వారి సంఖ్య కొంత తగ్గింది.
ఆరోపణ: ఓట్ల కోసమే ఎడెక్స్ కోర్సులు
వాస్తవం: విదేశాలకు వెళ్లి చదువుకోలేని విద్యార్థుల కోసం ప్రఖ్యాత ప్రపంచ వర్సిటీల కోర్సులను సీఎం జగన్ ప్రభుత్వం ఎడెక్స్ ద్వారా అందిస్తోంది. వరల్డ్ క్లాస్ విద్యను అందుకున్నప్పుడే విద్యార్థులు మంచి ఉద్యోగం, మెరుగైన జీతం సంపాదిస్తారని బలంగా విశ్వసిస్తోంది. ప్రపంచ దిగ్గజ ఎడ్యుటెక్ సంస్థ ‘‘ఎడెక్స్’’ ద్వారా 260కి పైగా వరల్డ్ క్లాస్ వర్సిటీలు, కంటెంట్ పార్టనర్స్‌తో కలిసి 2 వేలకు పైగా కోర్సులను అందుబాటులోకి తెచి్చంది.
హార్వర్డ్, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా, న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక వర్సిటీల నుంచి వివిధ కోర్సుల్లో ఏపీ విద్యార్థులు సరి్టఫికేషన్లు పొందేలా ప్రోత్సహిస్తోంది. ఉన్నత విద్యామండలి ‘ఎడెక్స్’ కోర్సులు ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఏకంగా 1.80 లక్షలకు పైగా విద్యార్థులు సరి్టఫికేషన్లు సాధించారు. ఈ ఎడెక్స్ కోర్సులను బయట నేర్చుకోవాలంటే ఒక్కో కోర్సుకు రూ.30 వేలకు పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి.
తొలి విడతలో 4 లక్షల మందికి ఈ కోర్సులను ఉచితంగా అందిస్తోంది. వీరందరూ ఒక్కో కోర్సు చొప్పున చదువుకుంటే మార్కెట్ రేటు ప్రకారం ఏకంగా రూ.382 కోట్ల వ్యయమవుతుంది. ఇంత ఖరీదైన కోర్సులను విద్యార్థులపై నయాపైసా భారం లేకుండా ఈ మొత్తాన్ని ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. ఎడెక్స్ ద్వారా స్థానికంగా అధ్యాపకుల కొరతను అధిగమించడంతో పాటు నాణ్యమైన బోధననూ అందించగలుగుతోంది.
ఆరోపణ: డిగ్రీ విద్య అస్తవ్యస్తం... నాణ్యమైన బీఈడీ విద్య లేదు..
వాస్తవం: డిగ్రీలో సింగిల్ మేజర్, మైనర్ విధానంతో విద్యారి్థని ఒక ప్రధాన సబ్జెక్టులో నిపుణుడిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది. పాశ్చాత్య దేశాల్లో ఈ తరహా విద్యా విధానాన్ని అవలంబించడంతోనే అక్కడ ఉన్నత విద్యలో విద్యార్థులు బాగా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే కళాశాల విద్యాశాఖ సుమారు 80 రకాల సింగిల్ మేజర్ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. వీటికి తోడు 100కి పైగా మైనర్ సబ్జెక్టుల్లో విద్యార్థులు నచి్చన వాటిని చదువుకోవడానికి అవకాశమూ కలి్పస్తోంది.
మరోవైపు యూజీసీ నిబంధనల ప్రకారం దేశంలోనే తొలిసారిగా నాలుగేళ్ల డిగ్రీని (హానర్స్) ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగాన్ని యూజీసీ సైతం ప్రశంసించింది. చంద్రబాబు హయాంలో కళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్, బయటి రాష్ట్రాల విద్యార్థులను నిలువు దోపిడీ చేసేందుకు బీఈడీ, డీఈడీ కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. మౌలిక సౌకర్యాలు లేకుండా కాగితాలపై విద్యార్థులను చూపించి ప్రజాధనాన్ని దోపిడీ చేసేవారు.
వీటికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయడం, తన అనుయాయులకు అక్రమార్జన నిలిచిపోవడంతోనే రామోజీరావు ఏడుపు ఎక్కువైంది. ఎంటెక్ కోర్సుల్లోనే ఇదే తంతు నడిచేది. బీటెక్‌లో సున్నా ప్రవేశాలు ఉన్న కాలేజీల్లో ఎంటెక్ 90–100 శాతం ప్రవేశాలు ఉండేవి. అంటే ఇక్కడ చదువు చెప్పేది ఉండదు. కేవలం ఫీజుల కోసమే కళాశాలల బోర్డులు తగిలించుకుని కనిపించేవి.
ఆరోపణ: ఈఏపీసెట్‌లో 500లోపు ర్యాంకర్లు ఏపీలో చేరడం లేదు.. ప్రతిభావంతులు బయటికి వెళ్లిపోతున్నారు..
వాస్తవం: ఈఏపీసెట్‌లో టాప్ 500 లోపు ర్యాంకర్లు కచి్చతంగా ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు కచి్చతంగా జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌లోనూ అర్హత సాధిస్తున్నారు. అలాంటప్పుడు వారు జాతీయ వర్సిటీలను కోరుకోవడంలో తప్పేముంది. వారు మినహా ఏపీలో మిగిలిన విద్యార్థులు ఇంజనీరింగ్ చేరుతున్నారు కదా. వీరిలో నుంచే దాదాపు అర కోటికిపైగా ప్యాకేజీలు పొందుతున్న విద్యార్థులు ఏటా కనిపిస్తున్నారు. మరి వీరంతా ఈనాడు దృష్టిలో ప్రతిభావంతులు కాదా?
ఆరోపణ: నాణ్యమైన విద్య కోసం ప్రైవేటు విశ్వవిద్యాలయాల వైపు చూపు?
వాస్తవం: చంద్రబాబు హయాంలో ప్రైవేట్ యూనివర్సిటీల్లో మెరిట్ ఉన్నా పేదింటి విద్యార్థులు చదువుకోవాలంటే రూ.లక్షలు వెచి్చంచాల్సిన పరిస్థితి. ఆ చదువులు కావాలంటే ఆస్తుల్ని అమ్ముకోవాల్సి వచ్చేది. ఆస్తులు లేనివారు నిరాశతో, ప్రత్యామ్నాయాలు వెతుక్కునేవారు. సీఎం జగన్ మెరిట్ సాధించిన పేద విద్యార్థులకు ప్రైవేట్ వర్సిటీల్లో పైసా చెల్లించకుండానే ఉన్నత విద్యను అందిస్తున్నారు. గ్రీన్‌ఫీల్డ్ వర్సిటీల్లో 35 శాతం, బ్రౌన్‌ఫీల్డ్ వర్సిటీల్లో 70 శాతం కనీ్వనర్ కోటా సీట్లను రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం వారికే కేటాయించేలా జగన్ ప్రైవేట్ వర్సిటీ బిల్లులో మార్పులు చేశారు. రెండేళ్లలో 7 వేల మంది వరకు విట్, ఎస్‌ఆర్‌ఎం, మోహన్‌బాబు, సెంచూరియన్ వంటి ప్రైవేటు వర్సిటీల్లో విద్యను అభ్యసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment