fake news
-
సీన్ మారిందని ఎల్లోమీడియాకూ స్పష్టమైనట్లుంది!
అంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజల తిరుగుబాటు వేడి బాగానే తగులుతున్నట్లుంది. టీడీపీ జాకీమీడియా ‘ఆంధ్రజ్యోతి’ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై పెడుతున్న శోకండాలే దీనికి నిదర్శనం. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలు, ర్యాలీలు విజయవంతం కావడంతో టీడీపీ, దాని తోకమీడియాలిప్పుడు ప్రజల దృష్టి మరల్చేందుకు నానా తంటాలూ పడుతున్నాయి. ప్రభుత్వంపై ఆరునెలల్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న అంచనాలను వైఎస్సార్సీపీ పిలుపునకు ప్రజలు స్పందించిన తీరు దాన్ని ధ్రువీకరించింది. తమ కోడి కూయనిదే తెల్లవారదనుకునే ఈనాడు, ఆంధ్రజ్యోతులు ఈ వార్తలను కప్పిపుచ్చేందుకు, గత ప్రభుత్వం పాలనే ఛార్జీల పెంపునకు కారణమంటూ బుకాయించే యత్నం చేసింది. కాకపోతే ప్రజలు తమకు కలిగిన నొప్పిని కూడా మరచిపోతారని అనుకుందీ ఎల్లో మీడియా! చంద్రబాబు మాకిచ్చిన హామీ ఏమిటి? ఇప్పుడు జరుగుతున్నదేమిటి? అన్న ఆలోచన, విచక్షణ లేకుండా ప్రజలుంటారా? ప్రజల చెవుల్లో పూలు పెట్టి అధికారమైతే కొట్టేశామని టీడీపీ, జనసేన, బీజేపీలు సంతోషించవచ్చు. తమ వంచన చాతుర్యానికి ఈనాడు, ఆంధ్రజ్యోతులు మురిసి పోతూండవచ్చు. అయితే ఇది ఎంతో కాలం నిలవదన్న విషయం ఈపాటికి వీరికి అర్థమయ్యే ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా స్వర్గంగా మారిందన్న భ్రమ కల్పించడానికి కూటమి, ఎల్లో మీడియా తంటాలు పడుతున్నాయి. తమ ఈ తాజా పాచిక పారడం లేదన్న విషయమూ వారికి స్పష్టమవుతోంది. మనసులోని ఆందోళనను మరింత పెంచుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా ప్రజలపై ఏకంగా రూ. 15 వేల కోట్ల భారం పెట్టింది ప్రభుత్వం. దీంతో సహజంగానే ప్రజల్లో ఆగ్రహం నెలకొంది. ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు తప్పంతా జగన్‌దే అని జాకీ పత్రిక నీచమైన కథనం ఇచ్చింది. ‘‘నాడు షాకులు ..నేడు శోకాలు’’ అంటూ హెడింగ్ పెట్టి, విద్యుత్ చార్జీల బాదుడు జగన్ దే అని నిస్సిగ్గుగా రాసింది. ఇది నిజమే అయితే చంద్రబాబుకు తాను విద్యుత్ చార్జీలు పెంచవలసిన అవసరం ఏమి వస్తుంది. కూటమి ప్రభుత్వం ఒక్క పైసా కూడా పెంచలేదని, వచ్చే ఏడాది సర్దుపోటు ఉందని ఎల్లో మీడియా చెబుతోంది. దానిని ఎవరైనా నమ్ముతారా? ఇది ఏ రకంగా జరుగుతుందో ఎక్కడైనా చెప్పారా? అంటే ఇప్పటికైతే నోరుమూసుకుని ఈ రూ.15 వేల కోట్లు చెల్లించాలని చెప్పడమే కదా? చంద్రబాబు టైమ్ లో పెండింగ్ లో పెట్టిన సుమారు రూ.47 వేల కోట్ల బిల్లులను జగన్ పాలనలో చెల్లించారా?లేదా? అప్పుడు జగన్ ఏమైనా చంద్రబాబు నిర్వాకం గురించి ఏనాడైనా శోకించారా? మరి ఇప్పుడు ఎందుకు ఈ జాకీ మీడియా గుక్కపెట్టి రోదిస్తోంది?విద్యుత్తు సంస్కరణలకు తానే ఆద్యుడినని చెప్పుకునే చంద్రబాబు కాలం నుంచే సర్దుబాటు ఛార్జీల విధానం ఉందన్న విషయాన్ని మరచిపోయింది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే ఒకలా.. అధికారంలో ఉంటే మరోలా వ్యవహరిస్తారన్నది అందరికీ తెలుసు. ఇందుకు తగ్గట్టుగానే.. అధికారంలోకి వస్తే ఐదేళ్లపాటు విద్యుత్ ఛార్జీలు పెంచబోనని, 30 శాతం మేర తగ్గిస్తానని ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన ఆయన ఆ తరువాత యాభై నుంచి వంద శాతం పెంచేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లోమీడియా ఈ పెంపునూ సమర్థించేందుకు జగన్‌పై నిందలేసే పనిలో పడ్డాయి. ఇచ్చిన హామీ ఎందుకు తప్పుతున్నారని మాత్రం ప్రశ్నించవీ పత్రికలు! ఆర్థిక, రాజకీయ సంబంధాల కారణంగానే ఎల్లో మీడియాకు ప్రజావసరాల కంటే సొంత ప్రయోజనాలే ఇలాంటి కథనాలు రాస్తున్నారని అనుకోవాలి. చంద్రబాబు టైమ్‌లో అధిక రేట్లకు చేసుకున్న సోలార్ విద్యుత్తు ఒప్పందాలను సమీక్షించేందుకు జగన్ ముఖ్యమంత్రిగా ప్రయత్నిస్తే... చంద్రబాబు, ఆయన జాకీ మీడియా కాని తీవ్రంగా వ్యతిరేకించాయి. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఆగిపోతాయని యాగీ చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ ద్వారా చౌకగా అంటే యూనిట్‌కు రూ.2.49లకే కొనుగోలు చేసినా దాన్ని ఈ మంద మెచ్చుకోలేదు సరికదా అభాండాలేసింది. అమెరికాలో నమోదైన కేసులో జగన్ పేరుందంటూ తప్పుడు కథనాలు రాసింది. కేంద్రం సూచనల మేరకు రైతుల వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి ఉచిత విద్యుత్తు ఇచ్చేందుకు జగన్ చేసిన ప్రయత్నాన్ని ఉరితాళ్లుగా అభివర్ణించిన ఎల్లోమీడియా అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని కొనసాగిస్తూండటం వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. మీడియా ఇంత దుర్మార్గంగా మారితే ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదమో ఆలోచించాలి.విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపునకు స్పందన ఎలా ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉండింది. కొంతమంది వైఎస్సార్సీపీ నేతలు ఆరు నెలలకే రోడ్లపైకి రావడమేంటని ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నారు కూడా. టీడీపీ కూటమి కేసులు పెడుతుందన్న భయం దీనికి ఒక కారణమైంది. కానీ పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తలు మాత్రం ఈ సమస్యపై ప్రజల గొంతుకయ్యారు. పార్టీకి కట్టుబడి ఉన్న నేతలు ధైర్యంగా బయటకు రావడంతో ప్రజలకు కాస్త ఉపశమనం కలిగినట్లయింది.ఆరు నెలలుగా వైఎస్సార్సీపీని అణచి వేసేందుకు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న టీడీపీకి ఇది అశనిపాతమే. ఎల్లోమీడియా మాత్రం తనదైన శైలిలో వాస్తవాలను వక్రీకరించేందుకు తన వంతు ప్రయత్నం మానలేదు. ఈ నేపధ్యంలోనే జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రజలు తండోపతండాలుగా వెళ్లి స్వాగతం పలుకుతున్నారు.ఎవరు నిజాయితీగా పాలన చేసింది ప్రజలు అర్దం చేసుకుంటున్నారనిపిస్తుంది. ధర్మవరం మీదుగా బెంగుళూరు వెళుతున్నప్పుడు ఆయా గ్రామాల వద్ద పార్టీ కార్యకర్తలు, ప్రజలు అభివాదం పలికి ఆయనతో సెల్పీలు దిగడానికి పోటీపడిన వైనం, జయ జయ ధ్వానాలు చేసిన తీరు ఆయన క్రేజ్ ను తెలియచేస్తున్నాయి. పార్టీ కార్యకర్తల్లో పెరిగిన విశ్వాసానికి ఇవన్ని దర్పణం పడుతున్నాయని చెప్పవచ్చు. ‘‘బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ’’ అన్న చంద్రబాబు నినాదం అసలు అర్థం కాస్తా.. ‘బాబు ష్యూరిటీబాదుడు గ్యారంటీ’గా మారిపోయిందన్నమాట.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సీనియర్ సిటిజన్లు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదా?
‘దేశంలో 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు’ ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్న ఓ వార్త. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇలాంటి చాలా వార్తలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు లేదా సందేహాస్పదమైన న్యూస్ పోర్టల్లలో ఇటీవల ఎక్కువయ్యాయి. వీటిలో చాలా మటుకు ఫేక్ న్యూస్ లేదా తప్పుడు సమాచారమే ఉంటోంది.తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. భారతదేశం స్వాతంత్య్రం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఇకపై పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని ఆ వార్త సారాంశం. "కేంద్ర ప్రభుత్వం భారీ ప్రకటన - వీళ్లు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు" అని సోషల్ మీడియా సందేశం పేర్కొంది.“భారతదేశంలోని సీనియర్ సిటిజన్లు పెన్షన్, ఇతర పథకాల ద్వారా వచ్చే ఆదాయంతో జీవిస్తున్నారు. అయితే, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, సీనియర్ సిటిజన్లు ఇకపై వారి ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. వారు ఎలాంటి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు’’ అని అందులో రాసుకొచ్చారు.అయితే ఇది ఫేక్ వార్త అని, అందులో పేర్కొన్న దాంట్లో నిజం లేదని ప్రభుత్వానికి చెందిన వార్తా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం (PIBFactCheck) తేల్చింది. 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు కేవలం పెన్షన్, వడ్డీ ఆదాయానికి సంబంధించి మాత్రమే ఐటీఆర్ (ITR) (సెక్షన్ 194P ప్రకారం) ఫైల్ చేయడం నుండి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. ఇతర పన్ను వర్తించే అన్ని ఆదాయాలపైనా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. A message circulating on social media claims that as India commemorates 75 years of its Independence, senior citizens above 75 years of age will no longer have to pay taxes.#PIBFactCheck✔️This message is #fake pic.twitter.com/kFVbGje5FB— PIB Fact Check (@PIBFactCheck) December 29, 2024 -
ఆపదలో ఉన్నా.. డబ్బులు పంపండి!
‘నాకు యాక్సిడెంట్ అయ్యింది అక్కా..ఆసుపత్రిలో ఉన్నాను..అర్జెంట్‌గా బిల్లు కట్టాలని అంటున్నారు..నేను తర్వాత వివరంగా మాట్లాడతాను. ముందు నేను పంపిన నంబర్‌కు గూగుల్ పే చెయ్యి’అని మలక్‌పేట్‌కు చెందిన ఓ గృహిణికి వాట్సప్ కాల్ వచ్చింది. వాట్సప్ ప్రొఫైల్ ఫొటో తన సోదరుడిదే..మాట కొంచెం తేడాగా ఉన్నా..నంబర్ కూడా తనదే ఉంది. నిజంగానే ఆసుపత్రిలో ఉన్నాడనుకుని రూ.50 వేలు ఫోన్‌పే చేసింది. తర్వాత తెలిసింది అది సైబర్ మోసగాళ్ల పని అని.. ఇది కేస్ 01. కేస్–02 మనోజ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆఫీస్‌లో ఉన్న సమయంలో వాట్సప్ మెసెంజర్లో ఓ మెసేజ్ వచ్చింది. ‘నేను మా అమ్మను ఆసుపత్రికి తీసుకువచ్చాను. హడావుడిలో పర్స్ తీసుకురాలేదు. నేను చెప్పిన అకౌంట్‌కి ఆసుపత్రి వాళ్లకు రూ.75 వేలు పంపించు. నేను నీతో కాసేపటి తర్వాత ఫోన్లో వివరంగా మాట్లాడతాను..’అని ఆ మెసేజ్ సారాంశం. ప్రొఫైల్ ఫొటో, వివరాలు తన కొలీగ్ ప్రశాంత్వే..నిజంగానే స్నేహితుడు ఆపదలో ఉన్నాడేమో అని ఆన్లైన్లో డబ్బులు పంపాడు మనోజ్. ‘అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది’ అని సాయంత్రం ప్రశాంత్‌కి ఫోన్ చేస్తేగానీ మనోజ్ కు తెలియదు తాను సైబర్‌మోసానికి గురయ్యానని. ప్రొఫైల్ క్లోనింగ్ అంటే..? ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్, స్నాప్‌చాట్.. ఇలాంటి సోషల్ మీడియా వేదికలలో పలువురు పంచుకునే వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు, అందులో పేర్కొంటున్న సమాచారం, అభిరుచులు ఇలా అన్ని వివరాలు సేకరించి కొద్దిపాటిగా పేర్లు మార్చి నకిలీ ప్రొఫైల్స్‌ను తయారు చేయడమే ప్రొఫైల్ క్లోనింగ్. ఆ తర్వాత స్నేహితులు, బంధువులు, సహోద్యోగులు ఇలా అందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపుతారు. ఆ తర్వాత మోసానికి తెరతీస్తారు. ఆపదలో ఉన్నానని, అత్యవసరంగా కొంత డబ్బు అవసరం ఉందని, ఇలా మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌తో మోసాలకు పాల్పడతారు. ఎలా గుర్తించాలి.. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? మనకు బాగా తెలిసిన వ్యక్తుల ఫొటో లు, ప్రొఫైల్స్‌తో ఉన్న ఫోన్ నంబర్లు, సోషల్ మీడియా ఖాతాల నుంచి అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్‌గానీ, మెసేజ్ కానీ వస్తే.. అది సైబర్ నేరగాళ్ల పనే అయిఉండొచ్చని అనుమానించాలి. కంగారుపడిపో యి వెంటనే డబ్బులు పంపవద్దు. అసలు విషయం ఏంటన్నది నేరుగా వాళ్ల ఫోన్ నంబర్‌కు ఫోన్ చేసి నిర్ధారించుకోవాలి. ఫేస్బుక్, ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా యాప్‌లలో వ్యక్తి గత సమాచారం అవసరానికి మించి పంచుకోకపోవడమే మేలు. కుటుంబసభ్యు లు, స్నేహితులతో ఉన్న సన్నిహితమైన ఫొ టోలు, వీడియోలు పంచుకోవద్దు. మనం సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టే సమాచారమే సైబర్ నేరగాళ్లు వినియోగించుకుని మోసాలకు తెరతీస్తున్నారన్నది గుర్తించాలి. ప్రొఫైల్ లాక్ ఉపయోగించకపోతే మోసాలకు అవకాశం ఉంది. కాబట్టి ప్రైవసీ సెట్టింగ్‌లు తప్పక పెట్టుకోవాలి. -
నిజాలు బయటపెట్టిన సీబీఐ
-
Editor Comment: కలి బాబులు కుమ్మక్కె క్యారెక్టర్ పై పుస్తున్న మరకలు
-
అవినీతి, వెన్నుపోటుకు ఈనాడు, ABN బ్రాండ్ అంబాసిడర్..
-
Big Question: రాష్ట్రానికి మేలు జరిగితే ఎల్లో బ్యాచ్ కు ఏడుపెందుకు ?
-
KSR Live Show: కరెంట్ చార్జీలు పెంచి కప్పిపుచ్చే కుట్ర.. డైవెర్షన్ లో బాబు సిద్ధహస్తుడు
-
ఓ కరపత్రం ‘ఏడు’పు కథ!
సాక్షి, అమరావతి: వక్రీకరణలే పరమావధిగా పచ్చి అబద్ధాలను కుమ్మరిస్తున్న ఈనాడు.. గత సర్కారు ఏడు గంటల్లోనే సెకీతో ఒప్పందాన్ని క్యాబినెట్ భేటీలో ఆమోదించుకుందంటూ మరోసారి బుకాయించింది. రాష్ట్ర రైతాంగానికి ఉచిత విద్యుత్తుకు ఢోకా లేకుండా ప్రయోజనం జరుగుతోంటే రూ.లక్ష కోట్లకుపైగా భారం అంటూ అసత్య ఆరోపణలు చేసింది. ఈ ఒప్పందానికి ఐఎస్టీఎస్ చార్జీలు వర్తించవని తెలిసినా పదేపదే విషం చిమ్ముతూ అదే ఒరవడి కొనసాగిస్తోంది. నిజానికి రెండున్నర నెలల పాటు సుదీర్ఘ కసరత్తు.. లాభనష్టాల బేరీజు.. నిపుణుల కమిటీ పరిశీలన.. మంత్రివర్గంలో చర్చ.. చివరిగా విద్యుత్తు నియంత్రణ మండలి గ్రీన్ సిగ్నల్.. ఇన్ని దశలు దాటి ప్రక్రియలన్నీ పక్కాగా పాటించాకే సెకీతో ఒప్పందం కార్యరూపం దాల్చింది.వ్యవసాయ ఉచిత విద్యుత్తుకు ఢోకా లేకుండా పాతికేళ్ల పాటు అత్యంత చౌకగా సౌర విద్యుత్‌ను అందిస్తామని, అంతర్రాష్ట్ర ప్రసార చార్జీల నుంచి సైతం మినహాయింపు కల్పిస్తామని 2021 సెప్టెంబర్ 15న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ స్వయంగా ప్రతిపాదిస్తూ లేఖ రాసింది. దీనిపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సెకీ కోరడంతో 2021 సెప్టెంబర్ 16న (అప్పటికి వారం ముందే కేబినెట్ భేటీ తేదీని నిర్ణయించారు) కేబినెట్ సమావేశంలో దీన్ని టేబుల్ ఐటమ్‌గా ప్రవేశపెట్టారు. అంతేగానీ సెకీ లేఖపై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవటం కోసంగానీ.. ఆమోదించడం గానీ జరగలేదు. ముఖ్యమైన విషయాలు అత్యవసరంగా క్యాబినెట్ దృష్టికి వచ్చినప్పుడు టేబుల్ ఐటమ్ కింద ప్రవేశపెట్టడం పరిపాటి, ఆనవాయితీ. అందులో ఏం తప్పు ఉంది? ఈ క్రమంలో దీనిపై లోతైన అధ్యయనానికి కమిటీని నియమించి క్యాబినెట్‌కు నివేదిక ఇవ్వాలని గత ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ దశలన్నీ పూర్తయ్యాకే 2021 అక్టోబర్ 28న క్యాబినెట్ సమావేశంలో ఒప్పందానికి ఆమోదం లభించింది. ఏపీఈఆర్సీ నుంచి కూడా అనుమతి తీసుకోవాలని డిస్కమ్‌లను నిర్దేశించారు. అంతేగానీ ఈనాడు చెబుతున్నట్లుగా హడావుడిగా ఒప్పందాన్ని ఆమోదించాలనుకుంటే అంతకుముందు జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే ఆమోదించి ఉండాలి కదా? నెలల తరబడి ఎందుకు ఆగుతారు? ఇలా సుదీర్ఘంగా చర్చలు, పలు ప్రక్రియలు ముగిశాకే 2021 డిసెంబర్ 1న సెకీతో ఒప్పందం జరిగింది. అర్థ రహిత ఆరోపణలు..2021 సెప్టెంబర్ 15న సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) యూనిట్ రూ.2.49కే సౌర విద్యుత్‌ను సరఫరా చేస్తామని చెప్పింది. నిజానికి ఈ ధర అప్పటి వరకు ఇతర మార్గాల్లో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు వస్తున్న విద్యుత్ ధరల కంటే చాలా తక్కువ. పైగా కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రోత్సాహం కింద ‘అంతర్ రాష్ట్ర ప్రసార ఛార్జీల (ఐఎస్టీఎస్) నుంచి మినహాయింపు’ కూడా ఈ ఒప్పందానికి వర్తింపజేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సెకీ లేఖ రాసింది.అయితే సెకీ నుంచి విద్యుత్‌ను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 7 గంటల వ్యవధిలోనే అంగీకరించిందని, రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలేమిటి? అంత విద్యుత్ వినియోగించగలమా? లాంటి అంశాలను పరిగణలోకి తీసుకునేందుకు తగినంత సమయం కేటాయించలేదని ఈనాడు మొదటి ఆరోపణ చేసింది. సెకీ ప్రతిపాదన వల్ల ప్రజలపై రూ.1,10,000 కోట్ల మేర ఆర్ధిక భారం పడుతుందని ఆలోచించలేదనేది రెండో ఆరోపణ. కానీ ఈ రెండూ పచ్చి అబద్ధాలే. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు అల్లుకున్న కట్టుకథలు మినహా ఇందులో ఏ ఒక్కటీ వాస్తవం కాదు. రెండున్నర నెలలు.. విశ్లేషించాకే అనుమతి..సౌర విద్యుత్తుకు సంబంధించి పలు ప్రయోజనాలను కల్పిస్తూ 2021 సెప్టెంబర్ 15న సెకీ నుంచి ప్రతిపాదన వచ్చింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య విద్యుత్ విక్రయ ఒప్పందం (పవర్ సేల్ అగ్రిమెంట్) 2021 డిసెంబర్ 1న జరిగింది. అంటే ప్రతిపాదనకు – ఒప్పందానికి మధ్య రెండున్నర నెలల కంటే ఎక్కువ వ్యవధి ఉంది. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరితోనూ ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ఈ రెండున్నర నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సెకీ మధ్య పలు పర్యాయాలు సంప్రదింపులు జరిగాయి. సెకీ ప్రతిపాదనలో లోటుపాట్లను, ఒప్పందం వల్ల కలిగే లాభనష్టాలను లోతుగా విశ్లేషించారు. అంతేకాకుండా ఈ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) ఆమోదాన్ని 2021 నవంబర్ 8న కోరారు. 2021 నవంబర్ 11న ఏపీఈఆర్సీ నుంచి దీనికి ఆమోదం లభించింది. సెకీ ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన కసరత్తు, అందుకోసం తీసుకున్న సమయం రెండున్నర నెలలకంటే ఎక్కువ ఉన్నట్లు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా ఈనాడు మాత్రం 7 గంటల్లోనే ఆమోదం తెలిపేశారంటూ పచ్చి అబద్ధాలను ప్రచురించింది.క్షుణ్నంగా సుదీర్ఘ కసరత్తు..సెకీ ఒప్పందాన్ని అమలు చేయాలనే నిర్ణయాన్ని మంత్రి మండలి సెప్టెంబర్ 16వ తేదీన తీసుకుందని ఈనాడు మరో ఆరోపణ చేసింది. వాస్తవం ఏమిటంటే మంత్రి మండలి సమావేశాన్ని అప్పటికప్పుడు నిర్ణయించలేదు. అంతకుముందు వారం రోజుల క్రితమే ఆ సమావేశం షెడ్యూల్ ఖరారైంది. అంటే.. కేబినెట్ సమావేశం తేదీపై నిర్ణయం తీసుకునే నాటికి సెకీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి రాలేదు. సమావేశానికి ఒక రోజు ముందు మాత్రమే సెకీ లేఖ అందింది. తమ లేఖపై వీలైనంత త్వరగా స్పందన తెలియజేయాలని ఆ లేఖలో సెకీ కోరింది. అయితే మొత్తం ప్రక్రియకు కనీసం 2 నుంచి 3 నెలల సమయం పడుతుందనే వాస్తవాన్ని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం.. సెకీ కోరినట్లుగా ప్రక్రియను ఆలస్యం చేయకూడదని భావించి తగిన మార్గదర్శకాల కోసం 2021 సెప్టెంబర్ 16న మంత్రి మండలి సమావేశంలో ఈ అంశాన్ని టేబుల్ ఐటమ్‌గా ఉంచింది. ఈ ప్రతిపాదనపై మరింత క్షుణ్నంగా అధ్యయనం చేయాలని రాష్ట్ర ఇంధన శాఖను నాటి సమావేశంలో మంత్రి మండలి ఆదేశించింది. సెకీ ప్రతిపాదనను పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ(ఏపీపీసీసీ) చైర్మన్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కమిటీ సభ్యులు పలుదఫాలు సెకీ అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం 2021 అక్టోబర్ 25న సెకీ ప్రతిపాదనకు అనుకూలంగా కమిటీ తన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించింది.దీంతో అక్టోబర్ 28న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ సిఫార్సులను మంత్రి మండలి ముందు ఉంచారు. ఏపీఈఆర్సీ అనుమతికి లోబడి సెకీతో పీఎస్ఏ అమలును ఆమోదించాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. దీంతో 2021 నవంబర్ 8న ఏపీఈఆర్సీ ఆమోదం కోసం డిస్కంలు దరఖాస్తు చేశాయి. 2021 నవంబర్ 11న ఏపీఈఆర్సీ ఆమోదం పొందిన తర్వాతే 2021 డిసెంబర్ 1న ఒప్పందం జరిగింది. కాబట్టి టీడీపీ, ఈనాడు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, దురుద్దేశపూర్వకంగా చేస్తున్నవని స్పష్టం అవుతోంది.కరపత్రమా... కళ్లు తెరువు⇒ ట్రాన్స్మిషన్ చార్జీలు పడతాయంటూ ఈనాడు నిస్సిగ్గుగా అబద్ధాలు ⇒పాతికేళ్ల పాటు అంతర్రాష్ట్ర ప్రసార చార్జీలు వర్తించవని లేఖలోనే చెప్పిన ‘సెకీ’ ‘సెకీ’ ఒప్పందంతో లాభాలివీ..⇒ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) యూనిట్ రూ.2.49కే సోలార్ విద్యుత్తు అందచేస్తామంటూ తనకు తానుగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ⇒ ఈ ప్రతిపాదనకు ఏపీ అంగీకరించడం వల్ల 25 ఏళ్ల పాటు ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు లభిస్తుందని 2021 సెప్టెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో సెకీ స్పష్టం చేసింది.⇒ ఈ చారిత్రక ఒప్పందం వల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.3,750 కోట్లు చొప్పున 25 ఏళ్ల పాటు దాదాపు రూ.లక్ష కోట్ల మేర విద్యుత్తు భారం నుంచి ఆర్ధిక ప్రయోజనం చేకూరుతుంది.⇒ ఐఎస్టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు అనేది మరే ఇతర ప్రాజెక్ట్‌కి దక్కని చాలా కీలకమైన ప్రయోజనం. ఇతర రాష్ట్రంలో ఉన్న సోలార్ పవర్ ఉత్పాదక కేంద్రం నుంచి విద్యుత్ సరఫరా కోసం మరే ఇతర సంస్థతో ఒప్పందం చేసుకుంటే మన రాష్ట్రం ఐఎస్టీఎస్ ఛార్జీలను చెల్లించాల్సి వచ్చేది. అప్పుడు అది చాలా భారంగా మారుతుంది. ప్రతి నెలా మెగావాట్‌కు సుమారు రూ.4 లక్షలు దానికే ఖర్చవుతుంది.⇒ రాష్ట్ర డిస్కంలు మునుపెన్నడూ ఇంత తక్కువ ధరకు సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. ⇒ ఇది కేంద్ర సంస్థ సెకీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం. ఇందులో మూడో వ్యక్తి ప్రమేయానికి తావే లేదు. అలాంటప్పుడు ఇక లంచాలకు ఆస్కారం ఎక్కడుంటుంది?⇒ టీడీపీ హయాంలో కుదుర్చుకున్న అధిక ధరల పీపీఏలతో పోలిస్తే సెకీతో సగం కంటే తక్కువ ధరకే ఒప్పందం కుదిరింది. -
సీఎం చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ పై స్పందించిన సీపీఐ రామకృష్ణ
-
నిజాలను పాతరేసి నిస్సిగ్గుగా వైఎస్ జగన్ పై నిందలు
-
రాజ్యాంగ హక్కులపై ఉక్కుపాదం మోపిన చంద్రబాబు సర్కార్
-
ఎల్లోమీడియా తప్పుడు వార్తలపై మాజీ MLA కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఫైర్
-
అలాగైతే రాధాకృష్ణ, లోకేష్‌లను జైల్లో పెట్టాలి: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: టీడీపీ అధికారిక వెబ్సైట్లో చేసేవన్నీ ఫేక్ పోస్టులేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో ప్రస్తావించారు. తల్లిని చంపడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడని టీడీపీ అధికారిక వెబ్ సైట్లో ఓ పోస్ట్ చేశారు. దానికి కారు టైర్ పేలిన పాత కథనం ఒకటి జత చేశారు. స్వయంగా విజయమ్మే ఇది ఫేక్ న్యూస్ అని లేఖ ఇచ్చారు. కానీ, ఆ లేఖ కూడా ఫేక్ అని ప్రచారం చేశారు. చివరకు.. అదంతా అబద్ధమని విజయమ్మ టీవీ ముందుకు వచ్చి చెప్పుకోవాల్సి వచ్చింది. ఇదంతా టీడీపీ అధికారిక వెబ్సైట్లోనే జరిగింది. మరి నారా లోకేష్‌ను ఎందుకు అరెస్టు చేయలేదు?. ఇంతకుమించి దిగజారిపోయి.. దారుణంగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. నా భార్య(వైఎస్ భారతి) కడప పోలీస్ అధికారితో ఫోన్లో మాట్లాడిందని ఆంధ్రజ్యోతిలో ఓ కథనం ఇచ్చింది. అది ఫేక్ కథనం. అలాంటప్పుడు రాధాకృష్ణను జైల్లో పెడతారా?. ఎల్లో మీడియా అలానే ఉంది.. సోషల్ మీడియా అలానే ఉంది అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. -
కుట్ర రాజకీయాలకు కేరాఫ్ చంద్రబాబు
సాక్షి, అమరావతి : చంద్రబాబు తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు, ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాక కుటుంబాల్లో కుంపట్లు పెడుతున్నారని వైఎస్సార్సీపీ నిప్పులు చెరిగింది. 2022లో వైఎస్ విజయమ్మ వాహనం టైర్ పంక్చరైన ఘటన 2024 ఎన్నికల ముందు జరిగినట్లుగా.. ‘ఎక్స్’లో వీడియో అప్లోడ్ చేసి, ఆ ప్రమాదం వెనుక కుట్ర ఉందంటూ.. దానిని జగన్‌కు ఆపాదిస్తూ నీచమైన కుతంత్రానికి పాల్పడింది. దీనిపై వైఎస్సార్సీపీ శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. చంద్రబాబును ట్యాగ్ చేస్తూ ‘పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు.. వెన్నుపోటు రాజకీయాలు, హత్యా రాజకీయాలకు అలవాటుపడ్డ శాడిస్ట్ సీబీఎన్‌కు ఎక్కడ ఏం జరిగినా అలాగే కనిపిస్తుంది. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక కుటుంబాల్లో చంద్రబాబు చిచ్చు పెడుతూ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నాడు. ఈ సందర్భంగా చంద్రబాబును కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. ఇవి మా అనుమానాలే కాదు.. ప్రజల అనుమానాలు కూడా. ‘చంద్రబాబూ.. నీ సొంత చెల్లెలుకు తిరుపతిలో యాక్సిడెంట్ చేయించింది నువ్వేనా? మీ బావమరిది నందమూరి హరికృష్ణ బతికుంటే నీకు ఎప్పుడైనా ఇబ్బందే అనుకుని నువ్వే కారు యాక్సిడెంట్ చేయించి చంపించావా? నందమూరి హరికృష్ణ కొడుకు నందమూరి జానకీరామ్ని కూడా నువ్వే యాక్సిడెంట్ చేయించి చంపించావా? జూ.ఎన్టీఆర్‌ను కూడా కారు యాక్సిడెంట్లో చంపాలనుకున్నావా? నీ తమ్ముడు రామ్మూర్తినాయుడిని గొలుసులతో కట్టేసి, బంధించి చంపాలనుకున్నావా? దమ్ముంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి’ అని నిలదీసింది. ఏ పార్టీ దిగజారని నీచ స్థాయికి టీడీపీ నీచమైన ఆరోపణ చేయడం, దాన్ని టీడీపీ అధికారిక ట్విటర్ హ్యాండిల్లో పోస్ట్ చేయడం చూస్తుంటే.. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత నీచ స్థాయికి దిగజారనంత పాతాళానికి టీడీపీ దిగజారి పోయిందని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఎన్టీఆర్ మరణం వెనక ఉన్న కుట్ర ప్రపంచానికంతటికీ తెలుసు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి హరికృష్ణ మరణం వెనక కుట్ర ఉందని, ఆయన శవం వద్ద చంద్రబాబు రాజకీయాలు మాట్లాడిన తీరే అందుకు నిదర్శనం అని నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు. ఇదే విషయాన్ని కేటీఆర్ కూడా చెప్పారని గుర్తు చేస్తున్నారు. ఎన్టీఆర్‌కు అసలైన వారసుడు జూ.ఎన్టీఆర్‌కు యాక్సిడెంట్ జరగడం వెనక.. ‘కొడుకు రాజకీయ భవిష్యత్’ను వెలిగించే కుట్ర ఉందనే విషయం చంద్రబాబు ‘రాజకీయం’ గమనిస్తున్న పరిశీలకులందరికీ తెలుసని చెబుతున్నారు. సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడిని ఇంట్లో బంధించడం వెనుకా కుట్ర ఉందనే అనుమానాలు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమయ్యాయి. ఇంతకంటే దిగజారడు అని అనుకున్న ప్రతిసారీ.. అది తప్పు అని నిరూపించుకుంటారనే వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. -
పెద్ద కుట్రలో పావుగా షర్మిల..?
-
బుడమేరుకు మళ్లీ వరదనే పుకార్లు నమ్మొద్దు
-
ఫేక్ వార్తలు ప్రచారం.. టీవీ ఛానెల్‌కు పెద్దిరెడ్డి పరువు నష్టం నోటీసులు
సాక్షి, తిరుపతి: తనపై నిరాధార వార్తలు వేసినందుకు బిగ్ టీవీకి పరువు నష్టం నోటీసులు ఇచ్చారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో పెద్దిరెడ్డిపై బిగ్ టీవీ తప్పుడు వార్తలు ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి చర్యలకు దిగారు.కాగా.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విష ప్రచారం చేసిన మరో మీడియా సంస్థకు నోటీసులు వెళ్లాయి. మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులో పరువు నష్టం వేసేందుకు బిగ్ టీవీకి ఇప్పటికే పెద్దిరెడ్డి తరపు న్యాయవాదులు నోటీసులు పంపించారు. ఇక, తాజాగా బిగ్ టీవీకి పరువు నష్టం కింద రూ.50కోట్లకు నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా తనపై నిరాధారంగా వార్తలు వేసి, వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారిపై న్యాయపరంగా బుద్ధి చెబుతామని పెద్దిరెడ్డి హెచ్చరించారు.ఇక, గతంలో ఈనాడు, ఈటీవీ, మహా న్యూస్‌కు పరువు నష్టం కింద 100 కోట్ల రూపాయలు చెల్లించాలని పెద్దిరెడ్డి నోటీసులు ఇచ్చారు. తనపై తప్పుడు వార్తలు రాసిన కారణంగా ఈనాడు, ఈటీవీకి రూ.50కోట్లు.. మహా న్యూస్‌కు రూ.50కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: కూటమి నేతలు గాడిదలు కాస్తున్నారా?: వడ్డే శోభనాద్రీశ్వరరావు -
ప్రకాశం బ్యారేజ్ కి కొట్టుకొచ్చిన బోట్లు టీడీపీవే
-
బోటు రాజకీయం బోల్తా
-
‘ఆమె తల్లిదండ్రుల్ని అనవసరంగా లాగొద్దు’
కోల్‌కతా: ఆర్జీ కర్ హాస్పిటర్ జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో ప్రతిపక్ష బీజేపీ నకిలీ ఆరోపణలు, అసత్య ప్రచారం చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) మండిపడింది. ఎంతో సున్నితమైన ఈ ఘటనపై బీజేపీ చెత్త రాజకీయం చేస్తోందని ఆ రాష్ట్ర మంత్రి శశీ పంజ వ్యాఖ్యానించారు. ‘ఈ కేసును పక్కదారి పట్టించడానికి పోలీసులు యత్నించారని, హడావుడిగా తమ కూతురు అంత్యక్రియలు పూర్తి చేయించారు. తమకు లంచం కూడా ఇవ్వజూపారని బాధితురాలి తల్లిండ్రులు ఆరోపించినట్లు ఓ వీడియో వైరల్ అయింది. తాము అలా అనలేదని.. అసత్య ఆరోపణలని ఖండించినట్లు మరో వీడియో వైరల్‌గా మారింది. అందులో వారు తమ కూతురికి జరిగిన దారుణానికి న్యాయం కావాలని కోరారు. .. ఇప్పటికే బాధితురాలి తల్లిదండ్రుల హృదయం ముక్కలైంది. ఇక్కడ రాజకీయాలు చేయటం సరికాదు. రాజకీయాలతో బాధితురాలి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదు. వాళ్లను అలా ఒంటరిగా వదిలేయండి’ అని అన్నారామె. అంతేకాదు ఉద్దేశపూర్వకంగా బీజేపీ, బీజేపీ ఐటీ సెల్ కేసును తప్పుదోవ పట్టించేందుకు నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తోందని మంత్రి ఆరోపించారు. పోస్ట్‌మార్టం రిపోర్టు విషయంలో సైతం బీజేపీ అసత్య ఆరోపణలు చేసిందని అన్నారామె. ‘కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐకి కేసు బదిలీ అయి 23 రోజులు గడిచాయి. ఇంతవరకు సీబీఐ నుంచి ఎటువంటి పురోగతి నివేదిక వెల్లడికాలేదు. సీబీఐ ఈ కేసు పురోగతిపై నివేదికను అందించాలని కోరుతున్నా. కోల్‌కతా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసినప్పుడు.. రెగ్యులర్ అప్డేట్లు ప్రెస్‌మీట్ ద్వారా బయటపెట్టారు’ అని మరో మంత్రి బ్రత్యా బసు అన్నారు. -
ఎల్లోమీడియా దుష్ప్రచారంపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్
-
‘ఈనాడు’ తప్పుడు రాతలు.. సజ్జల వార్నింగ్
సాక్షి, గుంటూరు: ‘ఈనాడు’ తప్పుడు రాతలను వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. ముంబై నటికి వేధింపుల కేసులో తన పేరు ప్రస్తావనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేశారు.‘మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న హత్యలు, దౌర్జన్యాలు, దాడులు, ఆస్తుల విధ్వంసంతో అరాచక పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం కూటమి ప్రభుత్వం, దానికి సంబంధించిన మీడియా కొత్త పన్నాగం మొదలు పెట్టింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బ తీయడం, ఆ పార్టీ నాయకుల వ్యక్తిత్వ హననం లక్ష్యంగా అవాస్తవ కథనాలు రాస్తున్నారు. ఆ తర్వాత వాటిని పట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు.’’ అని సజ్జల మండిపడ్డారు.‘‘ముంబై నటికి వేధింపులు. సజ్జల సహాయం’.. ‘అంటూ ఈనాడు పత్రిక రాసిన కథనం కూడా ఆ కోవలోనిదే. ఆ పత్రిక రాసిన కథనాన్ని పట్టుకుని టీడీపీ, ఆపార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, మరికొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ కథనం పూర్తిగా అవాస్తవం. అసంబద్ధం. అన్యాయంగా, అడ్డగోలుగా రాశారు. నా ప్రతిష్టను దెబ్బ తీసేలా ఇలాంటి కథనం రాసినందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాను’ అని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. -
ప్రతి పేద కుటుంబానికీ రూ.46,715.. నిజమేనా?
‘దేశంలోని ప్రతి పేద కుటుంబానికీ కేంద్ర ప్రభుత్వం రూ.46,715 ఇస్తోంది. అర్జెంటుగా మీ వివరాలన్నీ ఇచ్చేయండి’ ఇదీ వాట్సాప్‌లో విస్తృతంగా చలామణి అవుతోన్న ఓ సందేశం. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) స్పందించింది. నిజమా.. ఫేకా అన్నది తేల్చేసింది.దేశంలో రోజుకో ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. ముఖ్యంగా వాట్సాప్‌లో వచ్చిన వార్తలను కొందరు అవగాహనలేని వాళ్లు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి వార్త ఒకటి వాట్సాప్‌లో హల్ చల్ చేస్తోంది. దేశంలోని ప్రతి పేద కుంటుంబానికీ కేంద్ర ఆర్థిక శాఖ రూ.46,715 ఆర్థికసాయం అందిస్తోందనేది దాని సారాంశం. అంతటితో ఆగకుండా వ్యక్తిగత వివరాలను కోరుతూ ఓ లింక్ సైతం అందులో ఉంది.ఇది పూర్తిగా ఫేక్ సమాచారమని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తేల్చింది. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా తెలియజేసింది. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనేది చేయలేదని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుదోవ పట్టించే సందేశాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనధికార లింక్‌లలో వ్యక్తగత వివరాలను అందిస్తే దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది.A #WhatsApp message with a link claims to offer financial aid of ₹46, 715 to the poor class in the name of the Ministry of Finance and, is further seeking the recipient's personal details#PIBFactCheck✔️This message is #FAKE✔️@FinMinIndia has announced no such aid! pic.twitter.com/rFrYeBsbfd— PIB Fact Check (@PIBFactCheck) August 25, 2024 -
రాజకీయాల నుంచి వైదొలగడం లేదు: మాయావతి
లక్నో: తాను రాజకీయాల నుంచి వైదొలగనున్నట్లు వస్తున్న ప్రచారాన్ని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) చీఫ్ మాయావతి ఖండించారు. తాను క్రియాశీలక రాజకీయాలకు దూరం అవుతున్నాననే వార్తలు పూర్తిగా అవాస్తవమని సోమవారం స్పష్టం చేశారు.తాను రాజకీయాల వైదొలగటం లేదని, కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఉద్దేశపూర్వంగా కొన్ని మీడియా సంస్థలు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. చివరి శ్వాసవరకు తాను బీఎస్పీని ముందుకు తీసుకెళ్లటంలో పోరాటం కొనసాగిస్తానని అన్నారు.‘‘డాక్టర్. అంబేద్కర్, కాన్షీరామ్ వారసులైన బహుజనులను బలహీనపరిచే ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టడానికి నా చివరి శ్వాస వరకు ఆత్మగౌరవ ఉద్యమానికి అంకితం అవుతాను. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు. నేను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు పార్టీని ఆకాష్ ఆనంద్ ముందుకు తీసుకువెళ్తారు. నాపై వస్తున్న అసత్య ప్రచారాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయి’’ అని ‘ఎక్స్’లో తెలిపారు. అయితే గత కొన్ని రోజులుగా మాయావతి రాజకీయాలకు దూరంగా ఉండనున్నారని వార్తలు వస్తున్నాయి.26-08-2024-BSP PRESS NOTE-SANYAS FAKE NEWS pic.twitter.com/nhbBIEJhUl— Mayawati (@Mayawati) August 26, 2024