పేద పిల్లలకు ఉత్తమ విద్య అందించడమే తప్పన్నట్టు ‘ఈనాడు’ వక్రరాతలు
జగన్ ప్రభుత్వంలో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు
ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధన
మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ విధానం
హైసూ్కల్స్‌లో 62 వేల ఐఎఫ్‌పీ స్క్రీన్లతో డిజిటల్ బోధన
ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలు
8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో 9.53 లక్షల ట్యాబ్స్
1,000 ప్రభుత్వ బడుల్లో సీబీఎస్‌ఈ సిలబస్
ప్రభుత్వ బడుల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య
ఏపీ విద్యా సంస్కరణలకు దేశవిదేశాల్లో ప్రశంసలు
ఇంత ప్రగతి కనిపిస్తున్నా ‘ఈనాడు’ వికృత రాతలు
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చాక విద్యా రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించింది. ఈ నేపథ్యంలో దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ‘ఆర్థిక సమస్యలతో ఏ పేదింటి బిడ్డ చదువు ఆగిపోకూడదు.. వారు బాగా చదవాలి, అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని వారంతా ఉన్నతంగా ఎదగాలి. వారి చదువుకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుంది.. అన్ని సదుపాయాలు కల్పిస్తుంది’ అంటూ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు.
ఇందుకు తగ్గట్టే దేశవిదేశాలు కీర్తించేలా విప్లవాత్మక పథకాలను అమలు చేశారు. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో సౌకర్యాలకు దూరమై కునారిల్లిన ప్రభుత్వ బడులకు జవసత్వాలు కల్పించి వాటిని కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా పరుగులు పెట్టించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు అంతకుముందెన్నడూ లేని రీతిలో పెరిగాయి.
వివిధ రాష్ట్రాలు, దేశాలు, ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్‌లాంటి సంస్థలు ఏపీ విద్యా సంస్కరణలపై ప్రశంసలు కురిపించినా ఈనాడు పత్రిక మాత్రం వాస్తవాలను జీర్ణించుకోలేక మరోసారి వికృత రాతలతో విషం జిమ్మింది. ఐదేళ్ల జగన్ పాలనలో విద్య అస్తవ్యస్తమైపోయిందని.. ‘పాఠశాల విద్యలో ప్రతిదీ సవాలే!’ అంటూ తప్పుడు రాతలకు బరితెగించింది. జగన్ ప్రభుత్వం పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా రాణించేందుకు అవసరమైన అన్ని వసతులు కల్పించింది.
మనబడి నాడు–నేడుతో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. కార్పొరేట్ విద్యా సంస్థలే అసూయచెందేలా కొత్త పాఠశాల భవనాలు, టాయిలెట్ల నుంచి కాంపౌండ్ వాల్ వరకు 11 రకాల సదుపాయాలతో అత్యుత్తమంగా తీర్చిదిద్దింది. ప్రభుత్వ బడి అంటే పగిలిన గోడలు.. పెచ్చులూడే స్లాబులు, నేలబారు చదువులేనన్న అభిప్రాయంతో ఉన్న పరిస్థితి నుంచి.. ఆంధ్రప్రదేశ్‌లో సర్కారు చదువులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి ప్రభుత్వ బడి పిల్లలు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే వరకు తీసుకెళ్లిన ఘనత ఏపీకి మాత్రమే దక్కింది.
దేశంలోనే అత్యత్తమ విద్యా విధానం ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసినట్టు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే కితాబిచ్చినా ఈనాడు పత్రిక మాత్రం అంగీకరించలేక తన అల్పబుద్ధిని చాటుకుంటోంది. ఈ విద్యా సంస్కరణలే తప్పు అనేలా వక్రీకరణలు చేస్తోంది. ఏదోలా ఈ సంస్కరణలను రద్దు చేసి, పేదింటి పిల్లలను ఉత్తమ విద్యకు దూరం చేసే కుట్ర చేస్తున్నట్టు విద్యా రంగ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
శాస్త్రీయంగా సంస్కరణలు
2019కి ముందు ప్రభుత్వం కార్పొరేట్ విద్యకు ఇచ్చిన ప్రాధాన్యం ప్రభుత్వ పాఠశాలలకు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ బడుల్లో పరిస్థితి దిగజారింది. అదే విషయాన్ని ‘అసర్, నాస్’ వంటి సర్వేలు కూడా స్పష్టం చేశాయి. దీంతో 2019లో అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యా నాణ్యతను పెంచేందుకు ఈ సర్వేల అంశాలను ప్రామాణికంగా తీసుకొని పలు కార్యక్రమాలను అమలు చేసింది. టీచింగ్ ఎట్ రైట్ లెవెల్, లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామ్, సపోరి్టంగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి కార్యక్రమాలు అందులో కొన్ని. అసర్ నివేదిక ఆధారంగా రూపొందించిన ‘టీచింగ్ ఎట్ రైట్ లెవెల్’ కార్యక్రమంలో విద్యార్థుల స్థాయికి అనుగుణంగా పలు నూతన విధానాలతో విద్యాబోధన అమలు చేశారు.
ఇందుకోసం ప్రత్యేకంగా ‘ప్రథమ్’ సంస్థతో కలిసి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అందించారు. దీనిద్వారా విద్యార్థుల లెర్నింగ్ ఎబిలిటీ, రీడింగ్ ఎబిలిటీ మెరుగుపడినట్లుగా 2022 బేస్‌లైన్ ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఎంపిక చేసిన కొన్ని జిల్లాల్లో ప్రాథమికోన్నత స్థాయిలో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు ‘లిప్’ ప్రోగ్రాం అమలు చేశారు. విద్యార్థుల క్లాస్ రూమ్ పరీక్షల నిర్వహణలోనూ అనేక మార్పులు తీసుకొచ్చారు.
గతంలో ఫార్మెటివ్ అసెస్‌మెంట్స్‌ను ఎక్కడికక్కడ క్లాస్ రూమ్‌లో టీచర్ రూపొందించి ఇచ్చేవారు. ఇందులో పరీక్ష, ప్రశ్నల నాణ్యత తక్కువగా ఉండడంతో రాష్ట్ర స్థాయిలో నిపుణులతో ప్రశ్నపత్రాలు రూపొందించి అన్ని పాఠశాలల్లోనూ ఒకే తరహా ప్రశ్నపత్రాలు అందించారు. బైజూస్ ఉచితంగా అందించిన ఈ–కంటెంట్‌తోపాటు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) రూపొందించిన తెలుగు, ఇంగ్లిష్, హిందీ కంటెంట్‌ను కూడా ఉపాధ్యాయులకు డీటీహెచ్ చానల్స్ ద్వారా, ఈ–పాఠశాల యాప్ ద్వారా అందజేశారు.
ఒకే సిలబస్.. బోర్డుల ప్రకారం పరీక్షలు
సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ)కి రాష్ట్రంలో 1,000 పాఠశాలలను అనుసంధానించారు. ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి మొదటి బ్యాచ్ సీబీఎస్‌ఈ పరీక్షలు రాస్తారు. అందుకు అవసరమైన ప్రణాళికను ముందే అమల్లోకి తెచ్చారు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ బడుల్లో ఒకటో తరగతి నుంచి పేద పిల్లలకు ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) విద్యను అందించాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 44,478 స్కూళ్లలోనూ జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) సిలబస్‌నే బోధిస్తున్నారు. అన్ని తరగతులకు ఒకే తరహా సిలబస్ ఉంది. పరీక్షా విధానం మాత్రమే ఆయా బోర్డుల ప్రకారం ఉంటుంది.
ఇంగ్లిష్ నైపుణ్యాల పెంపునకు టోఫెల్
విద్యార్థులకు కమ్యూనికేషన్స్ స్కిల్స్, మంచి ఇంగ్లిష్ ఒకాబులరీ నైపుణ్యాలను అందించేందుకు 3వ తరగతి నుంచి టోఫెల్ శిక్షణ ప్రవేశపెట్టారు. అన్ని పాఠశాలల్లో టోఫెల్ బోధనకు ప్రత్యేకంగా పీరియడ్ కేటాయించారు. ఈ ఏడాది తొలిసారి నిర్వహించిన ‘టోఫెల్’ పరీక్షకు దాదాపు 16.50 లక్షల మంది విద్యార్థులు హాజరు కావడం గమనార్హం.
ప్రతి విద్యార్థికీ డిజిటల్ బోధన
నాడు–నేడు పనులు పూర్తయిన హైసూ్కళ్లలో ఇంటర్నెట్‌తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్‌పీ), 45 వేల స్మార్ట్ టీవీలను అందించారు. వీటితో 3డీ పాఠాలను బోధిస్తున్నారు. దేశంలో 25 వేల ఐఎఫ్‌పీలు మాత్రమే ఉంటే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఉండటం విశేషం. 8వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిపి 2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో 9.53 లక్షల మందికి బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్స్ ఇచ్చారు. ‘ఏపీ ఈ–పాఠశాల’ మొబైల్ యాప్, దీక్ష వెబ్‌సైట్, డీటీహెచ్ చానెళ్లు, యూట్యూబ్ చానెల్స్ ద్వారా నిరంతరం పాఠాలను విద్యార్థులకు చేరువ చేసింది. విద్యార్థులకు సబ్జెక్టుల్లో వచ్చిన సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ‘ఏఐ’ టెక్నాలజీతో పనిచేసే ‘డౌట్ క్లియరెన్స్ బాట్’ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది.
భావి నైపుణ్యాలపై విద్యార్థులకు శిక్షణ
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను భవిష్యత్ టెక్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ‘ఫ్యూచర్ స్కిల్స్ కోర్సుల’ను జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆరు నుంచి ఇంటర్ వరకు మూడు దశల్లో విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), 3డీ ప్రింటింగ్, గేమింగ్ వంటి 10 విభాగాల్లో శిక్షణ ఇస్తారు. ఈ కోర్సులను 6,790 ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్స్ ఫెసిలిటేటర్స్‌గా నియమించారు.
పేదలకు ‘ఐబీ’తో అంతర్జాతీయ విద్య
పేదింటి పిల్లలు ప్రపంచానికి దిక్సూచిగా మారాలనే సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్(ఐబీ) బోధన 2025 జూన్ నుంచి ఒకటో తరగతి నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటిదాకా దేశంలో 210 వరల్డ్ క్లాస్ కార్పొరేట్ స్కూళ్లలో మాత్రమే ఐబీ సిలబస్ అమల్లో ఉంది. సంపన్నులు మాత్రమే చదివించగల ఐబీ చదువులను రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలోకి తెచ్చి పేద పిల్లలకు అందించాలన్న సంకల్పంతో జగన్ సర్కారు ముందడుగు వేసింది. ఏటా ఒక తరగతి చొప్పున ఐబీ బోధన పెంచుతూ 2037 నాటికి +2 వరకు విద్యనందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
బాలికల కోసం ప్రత్యేకంగా జూనియర్ కాలేజీలు
హైసూ్కల్ చదువు పూర్తయిన బాలికలు చదువు మానేయకుండా ప్రతి మండలంలోనూ వారి కోసం ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 292 ఉన్నత పాఠశాలలను బాలికల కోసం హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేశారు. 352 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో ఇంటరీ్మడియెట్‌ను ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కోఎడ్యుకేషన్ జూనియర్ కళాశాలలను గరŠల్స్ జూనియర్ కళాశాలలుగా మార్చారు. రాష్ట్రంలోని 679 మండలాల్లోనూ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలను తీసుకొచ్చారు.
మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ బోధన
ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 66,245 మంది సబ్జెక్టు ఉపాధ్యాయులు 3 నుంచి 10 తరగతులకు బోధించాలి. ఇందులో 59,663 మంది ఉపాధ్యాయులు ఇప్పటికే ఆ తరహా సేవలు అందిస్తున్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో 6,582 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్‌జీటీ)కు పదోన్నతి కల్పించి సబ్జెక్ట్ టీచర్లు(స్కూల్ అసిస్టెంట్లు)గా హైసూ్కళ్లకు పంపించారు. ప్రతి స్కూల్లో ఎంత మంది ఉపాధ్యాయులు తగ్గారో ఒక్కరోజైనా ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి పరిశీలించని ‘ఈనాడు’ ఈ విషయంలోనూ కాకి లెక్కలు వేసింది. రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు సుమారు 7 వేల వరకు ఉన్నాయి. అవన్నీ ఏజెన్సీ, కొండ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అక్కడ విద్యార్థుల సంఖ్య 8 నుంచి 15 మంది లోపే ఉన్నా ప్రతి బడికి ప్రభుత్వం ఉపాధ్యాయుడిని నియమించింది. ఇప్పటి వరకు పాకల్లోనూ, శిథిల గదుల్లోనూ కొనసాగిన వీటికి ‘నాడు–నేడు’ కింద కొత్త భవనాలను నిరి్మస్తోంది. కానీ ‘ఈనాడు’ నోటికొచ్చిన ఓ అంకెను ముద్రించి అసత్యాలను ప్రచురిస్తోంది.
హేతుబదీ్ధకరణపైనా అసత్యాలే..
రాష్ట్రంలో 2019 కంటే ముందు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయని పలు సంస్థల అధ్యయనాలు తేల్చాయి. దీంతో వైఎస్ జగన్ సర్కారు ప్రభుత్వ విద్యలో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టి.. 1, 2 తరగతుల బోధన, అభ్యాసంపై దృష్టి పెట్టింది. 3, 4, 5 తరగతులను హైసూ్కల్ విద్యలోకి తీసుకురావడం ద్వారా బీఈడీ, సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ ఉన్న సబ్జెక్ట్ టీచర్ల ద్వారా పిల్లలకు బోధన అందించి అభ్యసనా సామర్థ్యాలను బలోపేతం చేసింది.
ఇందుకోసం ప్రాధమిక పాఠశాలల్లోని 3 నుంచి 5 తరగతులను హైసూ్కల్‌కు మార్చింది. ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీ పిల్లలకు పీపీ–1, పీపీ–2తో పాటు ఒకటి, రెండు తరగతుల బోధన ప్రారంభించింది. దీంతో ఏ స్కూల్‌ను మూసివేయాల్సిన అవసరం తలెత్తలేదు. ఈ సంస్కరణలను ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సైతం స్వాగతించారు. కానీ గత టీడీపీ ప్రభుత్వం మాత్రం విద్యా సంస్కరణలు చేపట్టకుండా సరిపడినంత మంది విద్యార్థులు లేరన్న సాకుతో 2014–2019 మధ్య 1,785 పాఠశాలలను మూసివేయడం గమనార్హం.
ఉన్నత విద్యకు అనువుగా ఇంగ్లిష్ మీడియం
పదో తరగతి లేదా ఇంటర్ తర్వాత పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులు పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే చదవాలి. పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్ మీడియం లేనివారు ఉన్నత విద్యలో వెనుకబడుతున్నారు. మరికొందరు మానేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2020లో రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించగా 97 శాతం మంది ఇంగ్లిష్ మీడియం బోధన తప్పనిసరిగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దీంతో జగన్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టింది. విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషా నైపుణ్యాన్ని పెంచేందుకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు, డిక్షనరీలను కూడా అందించింది. ముగిసిన విద్యా సంవత్సరంలో 93 శాతం పైగా విద్యార్థులు ఇంగ్లి‹Ùలోనే పరీక్షలు రాయడం విశేషం. పదో తరగతిలో ఇంగ్లిష్ మీడియం అమలు చేయకున్నా 2.23 లక్షల మంది విద్యార్థులు కూడా ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాశారు. వీరిలో 1.96 మందికి పైగా ఉత్తీర్ణత సాధించారంటే ఇంగ్లిష్ బోధనను ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ అచీవ్‌మెంట్ సర్వేలోనూ 90 శాతం పైగా ఇంగ్లిష్ మీడియం చదువులనే కోరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment