Nadu Nedu AP
-
తెలుగు రచయితల సభలా లేక...
ఈ మధ్య విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు జరిగాయి. అయితే వీటి తీరు చూస్తే అవి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సభలు అనిపిస్తుంది. ఒక కులం వారి ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాటు చేశారా? అనిపించకమానదు. అదే సమయంలో తెలుగు భాషోద్దణ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోని పేద పిల్లలకు విద్యను దూరం చేయడానికి కుట్ర జరుగుతుందా అన్న అనుమానమూ రాకమానదు. ధనిక ఆసాములంతా ఒక చోట చేరి కడుపు నిండిన కబుర్లు చెప్పుకున్నట్లుగా ఉందన్న భావన కలుగుతుంది. వీరి మాటలు ప్రభుత్వ స్కూళ్లను నీరు కార్చి, ప్రైవేటు విద్యా వ్యవస్థను ప్రోత్సహించేలా ఉన్నాయి. ఈ రచయితల సభలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రముఖులు లేదంటే వారికి మద్దతు ఇచ్చే మేధావి వర్గానికి చెందినవారే ఎక్కువగా ఉన్నారన్న అభిప్రాయం వచ్చింది. వేదికకు రామోజీరావు పేరు పెట్టడం, ఆయన కోడలు శైలజ వచ్చి తెలుగు గురించి ఉపన్యాసం ఇవ్వడం వంటివి ఈ సభల అజెండాను స్పష్టం చేస్తోంది. ఈ సభలలో పాల్గొన్న ప్రముఖులు ఎవరైనా తమ పిల్లలు, లేదా మనుమళ్లు తెలుగు మాధ్యమంలోనే చదువుతున్నారని చెప్పినట్లు కనిపించలేదు. ప్రధాన అతిధిగా పాల్గొన్న సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈసారి మరింతగా ఓపెన్ అయ్యారు. ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి జగన్ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవోని రద్దు చేయాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. బహుశా ఇదంతా ముందస్తుగానే ఒక అవగాహనతో జరిగి ఉంటుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ టైమ్‌లో విద్య, వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యత లభించింది. ‘నాడు నేడు’ కార్యక్రమం కింద స్కూళ్లు, ఆసుపత్రుల రూపురేఖలను మార్చివేశారు. ఆంగ్ల మాధ్యమంతోపాటు సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ వంటి జాతీయ, అంతర్జాతీయ సిలబస్‌లను ప్రవేశపెట్టి పేద పిల్లలకు అతి ఖరీదైన విద్యను ఉచితంగా అందించడానికి జగన్ కృషి చేశారు. అది సహజంగానే పెత్తందారి వర్గానికి నచ్చదు. ప్రైవేటు స్కూళ్లలో ఖర్చు చేసి చదువుకుంటున్న తమ పిల్లలకు, ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలకు తేడా లేకుండా పోవడం కూడా అంతగా నచ్చదు. అలాంటి తరుణంలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలు ఐక్య రాజ్య సమితి వరకు వెళ్లారు.ప్రైవేటు స్కూళ్ల పిల్లలతో పోటీ పడి ఆంగ్లంలో మాట్లాడగలిగే స్థితికి చేరుకుంటున్నారు. అలాగని తెలుగును తక్కువ చేయలేదు. తెలుగును నిర్భంద సబ్జెక్ట్‌గా చేర్చారు. అయినా కొందరు హైకోర్టుకు వెళ్లారు.ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించారు.జగన్ వెనక్కి తగ్గకుండా ద్విభాష పుస్తకాలు తయారు చేయించారు. దీని తర్వాత కూడా ఈ ఫ్యూడల్ శక్తులకు తృప్తి కలగలేదు. ఇప్పుడు రచయితల సభల పేరుతో ప్రభుత్వ విద్యపై విరుచుకుపడ్డారని అనుకోవాలి. ప్రస్తుత పరిస్థితిలో ఆంగ్ల మాధ్యమంలో చదువుకోక పోతే దేశ, విదేశాలలో మన పిల్లలు పోటీ పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చైనాలో ఆ భాషలోనే చదువుతున్నారు కదా అని కొందరు అనవచ్చు. కాని అక్కడి పరిస్థితి వేరు. మన దేశ వాతావరణం వేరు. అయినా చైనాకు చెందిన లక్షల మంది ఇప్పుడు ఆంగ్ల భాషను అభ్యసించి అమెరికా తదితర దేశాల దారి పడుతున్న విషయాన్ని విస్మరించరాదు. ఎన్వీ రమణ ఉపన్యాసాన్ని పరిశీలించండి. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాద్యమం ప్రవేశ పెడుతూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన ‘జీవో8’ను రద్దు చేయాలని అన్నారు. ఆ జీవో పై ఒకరు హైకోర్టుకు వెళ్లి విజయం సాధించారని, దానిపై అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని, ఇప్పుడు ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ ను ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. బహుశా చంద్రబాబు ప్రభుత్వంతో ఉన్న అవగాహన వల్లే ఇలా మాట్లాడి ఉంటారా? అని ప్రముఖ విద్యా వేత్త కంచె ఐలయ్య ప్రశ్నించారు. గత ప్రభుత్వం తెలుగు భాషను అణచివేయడానికో, అభివృద్ది చేయడానికో ఆ జీవో తెచ్చిందని రమణ అన్నారు. నిజంగా అంత పెద్ద స్థాయికి వెళ్లిన వ్యక్తి ఇలా మాట్లాడడం శోచనీయం. ఆంగ్లంలోనే ఉద్యోగాలు వస్తాయని అనుకోవడం భ్రమ అని ఆయన చెబుతున్నారు. ప్రజలు తెలుగు భాషను ఆదరిస్తే ప్రభుత్వాలు దిగివస్తాయని మాజీ చీఫ్ జస్టిస్ అన్నారు. సరిగ్గా ఇదే అంశంపై రమణ స్వయంగా కొన్ని గ్రామాలకు, ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి పిల్లలు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటే బాగుంటుంది కదా! తెలుగు భాషకు ఎవరూ వ్యతిరేకం కాదు. దానిని రక్షించుకోవల్సిందే. కాని అదే సమయంలో పేదల బతుకు తెరువు కూడా ముఖ్యమే అన్న సంగతి గుర్తుంచుకోవాలి. పైరవి చేసుకుని ఉద్యోగాలు సంపాదించుకోవడమో, ఉన్నత స్థాయికి చేరుకోవడం అందరికి సాధ్యం కాదు. మంచి విద్య వారికి కీలకంగా ఉంటుంది. ఇప్పుడు అమెరికా వెళ్లి స్థిరపడిన లక్షలాది మంది తెలుగువారు ఆంగ్లం నేర్చుకున్న తర్వాతే వెళ్లగలిగారన్నది వాస్తవం. అంతెందుకు! ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ రచయిత, మాజీ ఎంపీ యార్గగడ్డ లక్ష్మీప్రసాద్ కుమారుడు అమెరికాలోనే నివసిస్తున్నారు. ఆయనకు ఆంగ్లంపై పట్టు వచ్చాకే వెళ్లగలిగారా? లేదా? తెలుగు మీడియంలోనే చదువుకుని ఉంటే అది సాధ్యం అయ్యేదా? ఒకవేళ సాధ్యమైనా ఎంత కష్టపడి ఉండాలి? మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ కూడా తెలుగు గురించి మాట్లాడారు. మరి వారి ఆధ్వర్యంలో నడిచే పబ్లిక్ స్కూల్ లో తెలుగు మీడియం ఉందో, లేదో చెప్పి ఉండాల్సింది. ఆమె కుంటుంబంలోని పిల్లలంతా ఎక్కడ, ఏ భాషలో చదివారో చెప్పినట్లు లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఆంగ్ల మీడియంలోనే చదివారు. ఇప్పుడు మనుమడు దేవాన్ష్ కూడా ఇంగ్లీష్ మీడియంలో అభ్యసిస్తున్నారు కదా? ఇటీవల దేవాన్ష్ చెస్‌లో మెడల్ సాధించారని వార్తలు వచ్చాయి. ఆయన తెలుగు మీడియంలో చదివి ఉంటే ఈ చెస్ లో గెలవగలిగేవారా అని కంచె ఐలయ్య ప్రశ్నించారు.ప్రైవేటు స్కూళ్లలో అత్యధిక శాతం ఆంగ్ల మీడియమే ఉంది కదా? రాష్ట్ర మంత్రి నారాయణకు చెందిన విద్యా సంస్థలలో ఏ మీడియం ఉందో చెప్పాలి కదా? ఇంకా నయం. ఆయనను ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెట్టలేదు. ప్రభుత్వ స్కూళ్లలోనే తెలుగు మీడియం ఎందుకు? ప్రైవేటు స్కూళ్లలో కూడా అదే ప్రకారం తెలుగు మీడియం ఉండాలని వీరంతా ఎందుకు డిమాండ్ చేయలేదు? ఇక్కడే వీరి స్వార్దం కనిపిస్తుంది. రామోజీ జ్ఞాపకార్డం అంతా శుభోదయం అని పలకరించుకోవాలని శైలజా కిరణ్ సూచించారు. తెలుగు మీద అంత ప్రేమ ఉంటే కనీసం తెలుగు రాష్ట్రాలలో అయినా తమ సంస్థ మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ పేరులో ఆంగ్లం లేకుండా చూసుకోవాలి కదా! చిట్ ఫండ్స్‌ను తెలుగీకరించిన తర్వాత ఆమె సలహాలు ఇస్తే బాగుంటుందని కొందరు వ్యంగ్యంగా అంటున్నారు. ఈనాడు దినపత్రికలో తెలుగు రచయితల సభల వార్తలను కవర్ చేసిన సందర్భంలో పలు ఆంగ్ల పదాలు ఎందుకు వాడారో తెలియదు. ఉదాహరణకు కేబీఎన్ కళాశాల అని అన్నారే కాని, దానిని తెలుగులో రాయలేదు. సుప్రీంకోర్టు, జస్టిస్ వంటి ఆంగ్ల పదాలనే వినియోగించారు. నెట్ లో పెట్టిన వార్తల కింద ఎడిషన్ నేమ్, ఆంధ్రప్రదేశ్ అని, పేజ్ నెంబర్ అంటూ ఆంగ్ల ఆక్షరాలతోనే రాశారు. అంటే దాని అర్థమేమిటి? తెలుగు భాషను రక్షించుకుంటూనే ఆంగ్ల భాషపై తెలుగు పిల్లలు పట్టు పెంచుకుంటేనే వారికి భవితవ్యం ఉందన్నది వాస్తవం. అందుకే 95 శాతం మంది ప్రజలు తమ పిల్లలను ఆంగ్ల మీడియంలోనే చదివించుకుంటున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలలో అయితే అది నూటికి నూరు శాతం ఉంటోంది. ప్రభుత్వ విద్యా సంస్థలలోనే ఎందుకు తెలుగు మాధ్యమం అన్నదానికి ఈ పెద్దలు ఎవరూ సమాధానం చెప్పలేరు. ఇప్పటికే ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఇలా ఆంగ్ల మీడియం కూడా పూర్తిగా ఎత్తివేస్తే ఏపీలో పేద పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో చదివించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతిమంగా వారి చదువులకు గండం ఏర్పడుతుంది. తెలుగు రచయితల సభ చివరికి పేదల పాలిట శాపంగా మారితే వారి రచనలకే విలువ లేకుండా పోతుంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఇది కదా జగన్ మార్క్ అంటే.. ప్రభుత్వ స్కూళ్లను చూసి పవన్ ఆశ్చర్యం!
సాక్షి,కాకినాడ : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా తన హయాంలో నాడు– నేడు పథకం కింద పాఠశాలల రూపు రేఖలను సమూలంగా మార్చి వేసిన సంగతి తెలిసిందే.. ఆ మార్పుల్ని చూసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్కూల్స్ కంటే ప్రభుత్వ స్కూల్స్ బాగున్నాయంటూ పొగిడారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాకినాడ జిల్లా గొల్లప్రోలు జడ్పీ బాలుర హైస్కూల్‌ను పవన్ కల్యాణ్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు-నేడు పథకం కింద తీసుకొచ్చిన మౌలిక సదుపాయాలు చూసి ఆశ్చర్యపోయారు. అంతేకాదు, తరగతి గదుల్లో మార్పు చూసి ఇది ప్రభుత్వ పాఠశాలా? లేక ప్రైవేటు పాఠశాల అంటూ పక్కనే ఉన్న అధికారుల్ని అడిగారు. ఆ తర్వాత విద్యార్థులు వేసిన డ్రాయింగ్స్‌ని చూసి చాలా బాగున్నాయంటూ మెచ్చుకున్నారు.Feel The Difference pic.twitter.com/bsk9hYHNV6— Graduate Adda (@GraduateAdda) November 4, 2024 ఆ తర్వాత అదే స్కూల్లో పదవ తరగతి గదిలో విద్యార్ధులు కూర్చునే బెంచీలను పరిశీలించారు. తరగతి గదిలో విద్యార్థులతో కరచాలనం చేస్తూ ఈ బెంచ్‌లు ఎప్పుడు వచ్చాయని అడగారు. అందుకు పవన్ పక్కనే ఉన్న కలెక్టర్ షాన్ మోహన్ ఇవి నాడు-నేడు పథకం ద్వారా పథకం కింద వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినవి అంటూ బదులిచ్చారు. PK: ఇది ZPH స్కూల్ నా ⁉️Some One: అవును సార్ PK: ప్రైవేట్ స్కూల్ కంటే బాగుంది 👍ఇది కదా @ysjagan మార్క్ 🔥🔥🔥 pic.twitter.com/YXJRuUmVhl— For A Reason (@forareason_in_X) November 5, 20242014-2019 చంద్రబాబు హయాంలో ఈ సందర్భంగా 2014-2019 గత చంద్రబాబు హయాంలో నాడు పవన్ అల్లూరి సీతారామరాజు జిల్లా, డుంబ్రిగుడ మండలంలోని దుంబ్రిగుడ గ్రామానికి చెందిన కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించారు. ఆ సమయంలో అధ్వాన్నంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లను చూసి విచారం వ్యక్తం చేశారు. కూర్చోవడానికి బెంచీలు లేక.. నేల మీద కూర్చొని పాఠాలు వింటున్న విద్యార్థుల్ని పరామర్శించారు. ఆ వీడియోల్ని నెటిజన్లు వీడియోలు షేర్ చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ పాఠశాల దుస్థితిని, వైఎస్ జగన్ హయాంలోని మారిన ప్రభుత్వ రూపురేఖలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.చదవండి : ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి.. ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ -
ఈ విషానికి విరుగుడేదీ?
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చాక విద్యా రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించింది. ఈ నేపథ్యంలో దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ‘ఆర్థిక సమస్యలతో ఏ పేదింటి బిడ్డ చదువు ఆగిపోకూడదు.. వారు బాగా చదవాలి, అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇంగ్లిష్ మీడియంలో చదువుకుని వారంతా ఉన్నతంగా ఎదగాలి. వారి చదువుకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుంది.. అన్ని సదుపాయాలు కల్పిస్తుంది’ అంటూ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు.ఇందుకు తగ్గట్టే దేశవిదేశాలు కీర్తించేలా విప్లవాత్మక పథకాలను అమలు చేశారు. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో సౌకర్యాలకు దూరమై కునారిల్లిన ప్రభుత్వ బడులకు జవసత్వాలు కల్పించి వాటిని కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా పరుగులు పెట్టించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు అంతకుముందెన్నడూ లేని రీతిలో పెరిగాయి. వివిధ రాష్ట్రాలు, దేశాలు, ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్‌లాంటి సంస్థలు ఏపీ విద్యా సంస్కరణలపై ప్రశంసలు కురిపించినా ఈనాడు పత్రిక మాత్రం వాస్తవాలను జీర్ణించుకోలేక మరోసారి వికృత రాతలతో విషం జిమ్మింది. ఐదేళ్ల జగన్ పాలనలో విద్య అస్తవ్యస్తమైపోయిందని.. ‘పాఠశాల విద్యలో ప్రతిదీ సవాలే!’ అంటూ తప్పుడు రాతలకు బరితెగించింది. జగన్ ప్రభుత్వం పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా రాణించేందుకు అవసరమైన అన్ని వసతులు కల్పించింది.మనబడి నాడు–నేడుతో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. కార్పొరేట్ విద్యా సంస్థలే అసూయచెందేలా కొత్త పాఠశాల భవనాలు, టాయిలెట్ల నుంచి కాంపౌండ్ వాల్ వరకు 11 రకాల సదుపాయాలతో అత్యుత్తమంగా తీర్చిదిద్దింది. ప్రభుత్వ బడి అంటే పగిలిన గోడలు.. పెచ్చులూడే స్లాబులు, నేలబారు చదువులేనన్న అభిప్రాయంతో ఉన్న పరిస్థితి నుంచి.. ఆంధ్రప్రదేశ్‌లో సర్కారు చదువులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి ప్రభుత్వ బడి పిల్లలు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే వరకు తీసుకెళ్లిన ఘనత ఏపీకి మాత్రమే దక్కింది.దేశంలోనే అత్యత్తమ విద్యా విధానం ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసినట్టు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే కితాబిచ్చినా ఈనాడు పత్రిక మాత్రం అంగీకరించలేక తన అల్పబుద్ధిని చాటుకుంటోంది. ఈ విద్యా సంస్కరణలే తప్పు అనేలా వక్రీకరణలు చేస్తోంది. ఏదోలా ఈ సంస్కరణలను రద్దు చేసి, పేదింటి పిల్లలను ఉత్తమ విద్యకు దూరం చేసే కుట్ర చేస్తున్నట్టు విద్యా రంగ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయంగా సంస్కరణలు 2019కి ముందు ప్రభుత్వం కార్పొరేట్ విద్యకు ఇచ్చిన ప్రాధాన్యం ప్రభుత్వ పాఠశాలలకు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ బడుల్లో పరిస్థితి దిగజారింది. అదే విషయాన్ని ‘అసర్, నాస్’ వంటి సర్వేలు కూడా స్పష్టం చేశాయి. దీంతో 2019లో అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యా నాణ్యతను పెంచేందుకు ఈ సర్వేల అంశాలను ప్రామాణికంగా తీసుకొని పలు కార్యక్రమాలను అమలు చేసింది. టీచింగ్ ఎట్ రైట్ లెవెల్, లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, సపోరి్టంగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి కార్యక్రమాలు అందులో కొన్ని. అసర్ నివేదిక ఆధారంగా రూపొందించిన ‘టీచింగ్ ఎట్ రైట్ లెవెల్’ కార్యక్రమంలో విద్యార్థుల స్థాయికి అనుగుణంగా పలు నూతన విధానాలతో విద్యాబోధన అమలు చేశారు.ఇందుకోసం ప్రత్యేకంగా ‘ప్రథమ్’ సంస్థతో కలిసి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అన్ని ప్రభుత్వ పాఠశాలలకు అందించారు. దీనిద్వారా విద్యార్థుల లెర్నింగ్ ఎబిలిటీ, రీడింగ్ ఎబిలిటీ మెరుగుపడినట్లుగా 2022 బేస్‌లైన్ ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఎంపిక చేసిన కొన్ని జిల్లాల్లో ప్రాథమికోన్నత స్థాయిలో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు ‘లిప్’ ప్రోగ్రాం అమలు చేశారు. విద్యార్థుల క్లాస్ రూమ్ పరీక్షల నిర్వహణలోనూ అనేక మార్పులు తీసుకొచ్చారు.గతంలో ఫార్మెటివ్ అసెస్‌మెంట్స్‌ను ఎక్కడికక్కడ క్లాస్ రూమ్‌లో టీచర్ రూపొందించి ఇచ్చేవారు. ఇందులో పరీక్ష, ప్రశ్నల నాణ్యత తక్కువగా ఉండడంతో రాష్ట్ర స్థాయిలో నిపుణులతో ప్రశ్నపత్రాలు రూపొందించి అన్ని పాఠశాలల్లోనూ ఒకే తరహా ప్రశ్నపత్రాలు అందించారు. బైజూస్ ఉచితంగా అందించిన ఈ–కంటెంట్‌తోపాటు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన తెలుగు, ఇంగ్లిష్, హిందీ కంటెంట్‌ను కూడా ఉపాధ్యాయులకు డీటీహెచ్ చానల్స్ ద్వారా, ఈ–పాఠశాల యాప్ ద్వారా అందజేశారు. ఒకే సిలబస్.. బోర్డుల ప్రకారం పరీక్షలుసెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)కి రాష్ట్రంలో 1,000 పాఠశాలలను అనుసంధానించారు. ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి మొదటి బ్యాచ్ సీబీఎస్ఈ పరీక్షలు రాస్తారు. అందుకు అవసరమైన ప్రణాళికను ముందే అమల్లోకి తెచ్చారు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ బడుల్లో ఒకటో తరగతి నుంచి పేద పిల్లలకు ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) విద్యను అందించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 44,478 స్కూళ్లలోనూ జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) సిలబస్‌నే బోధిస్తున్నారు. అన్ని తరగతులకు ఒకే తరహా సిలబస్ ఉంది. పరీక్షా విధానం మాత్రమే ఆయా బోర్డుల ప్రకారం ఉంటుంది. ఇంగ్లిష్ నైపుణ్యాల పెంపునకు టోఫెల్ విద్యార్థులకు కమ్యూనికేషన్స్ స్కిల్స్, మంచి ఇంగ్లిష్ ఒకాబులరీ నైపుణ్యాలను అందించేందుకు 3వ తరగతి నుంచి టోఫెల్ శిక్షణ ప్రవేశపెట్టారు. అన్ని పాఠశాలల్లో టోఫెల్ బోధనకు ప్రత్యేకంగా పీరియడ్ కేటాయించారు. ఈ ఏడాది తొలిసారి నిర్వహించిన ‘టోఫెల్’ పరీక్షకు దాదాపు 16.50 లక్షల మంది విద్యార్థులు హాజరు కావడం గమనార్హం. ప్రతి విద్యార్థికీ డిజిటల్ బోధన నాడు–నేడు పనులు పూర్తయిన హైసూ్కళ్లలో ఇంటర్నెట్తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్‌పీ), 45 వేల స్మార్ట్ టీవీలను అందించారు. వీటితో 3డీ పాఠాలను బోధిస్తున్నారు. దేశంలో 25 వేల ఐఎఫ్‌పీలు మాత్రమే ఉంటే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఉండటం విశేషం. 8వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిపి 2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో 9.53 లక్షల మందికి బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్స్ ఇచ్చారు. ‘ఏపీ ఈ–పాఠశాల’ మొబైల్ యాప్, దీక్ష వెబ్సైట్, డీటీహెచ్ చానెళ్లు, యూట్యూబ్ చానెల్స్ ద్వారా నిరంతరం పాఠాలను విద్యార్థులకు చేరువ చేసింది. విద్యార్థులకు సబ్జెక్టుల్లో వచ్చిన సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ‘ఏఐ’ టెక్నాలజీతో పనిచేసే ‘డౌట్ క్లియరెన్స్ బాట్’ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. భావి నైపుణ్యాలపై విద్యార్థులకు శిక్షణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను భవిష్యత్ టెక్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ‘ఫ్యూచర్ స్కిల్స్ కోర్సుల’ను జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆరు నుంచి ఇంటర్ వరకు మూడు దశల్లో విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), 3డీ ప్రింటింగ్, గేమింగ్ వంటి 10 విభాగాల్లో శిక్షణ ఇస్తారు. ఈ కోర్సులను 6,790 ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్స్ ఫెసిలిటేటర్స్‌గా నియమించారు. పేదలకు ‘ఐబీ’తో అంతర్జాతీయ విద్య పేదింటి పిల్లలు ప్రపంచానికి దిక్సూచిగా మారాలనే సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్(ఐబీ) బోధన 2025 జూన్ నుంచి ఒకటో తరగతి నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటిదాకా దేశంలో 210 వరల్డ్ క్లాస్ కార్పొరేట్ స్కూళ్లలో మాత్రమే ఐబీ సిలబస్ అమల్లో ఉంది. సంపన్నులు మాత్రమే చదివించగల ఐబీ చదువులను రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలోకి తెచ్చి పేద పిల్లలకు అందించాలన్న సంకల్పంతో జగన్ సర్కారు ముందడుగు వేసింది. ఏటా ఒక తరగతి చొప్పున ఐబీ బోధన పెంచుతూ 2037 నాటికి +2 వరకు విద్యనందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. బాలికల కోసం ప్రత్యేకంగా జూనియర్ కాలేజీలు హైసూ్కల్ చదువు పూర్తయిన బాలికలు చదువు మానేయకుండా ప్రతి మండలంలోనూ వారి కోసం ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 292 ఉన్నత పాఠశాలలను బాలికల కోసం హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేశారు. 352 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో ఇంటరీ్మడియెట్ను ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కోఎడ్యుకేషన్ జూనియర్ కళాశాలలను గరŠల్స్ జూనియర్ కళాశాలలుగా మార్చారు. రాష్ట్రంలోని 679 మండలాల్లోనూ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలను తీసుకొచ్చారు. మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ బోధనప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 66,245 మంది సబ్జెక్టు ఉపాధ్యాయులు 3 నుంచి 10 తరగతులకు బోధించాలి. ఇందులో 59,663 మంది ఉపాధ్యాయులు ఇప్పటికే ఆ తరహా సేవలు అందిస్తున్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో 6,582 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ)కు పదోన్నతి కల్పించి సబ్జెక్ట్ టీచర్లు(స్కూల్ అసిస్టెంట్లు)గా హైసూ్కళ్లకు పంపించారు. ప్రతి స్కూల్లో ఎంత మంది ఉపాధ్యాయులు తగ్గారో ఒక్కరోజైనా ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి పరిశీలించని ‘ఈనాడు’ ఈ విషయంలోనూ కాకి లెక్కలు వేసింది. రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు సుమారు 7 వేల వరకు ఉన్నాయి. అవన్నీ ఏజెన్సీ, కొండ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అక్కడ విద్యార్థుల సంఖ్య 8 నుంచి 15 మంది లోపే ఉన్నా ప్రతి బడికి ప్రభుత్వం ఉపాధ్యాయుడిని నియమించింది. ఇప్పటి వరకు పాకల్లోనూ, శిథిల గదుల్లోనూ కొనసాగిన వీటికి ‘నాడు–నేడు’ కింద కొత్త భవనాలను నిరి్మస్తోంది. కానీ ‘ఈనాడు’ నోటికొచ్చిన ఓ అంకెను ముద్రించి అసత్యాలను ప్రచురిస్తోంది. హేతుబదీ్ధకరణపైనా అసత్యాలే..రాష్ట్రంలో 2019 కంటే ముందు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయని పలు సంస్థల అధ్యయనాలు తేల్చాయి. దీంతో వైఎస్ జగన్ సర్కారు ప్రభుత్వ విద్యలో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టి.. 1, 2 తరగతుల బోధన, అభ్యాసంపై దృష్టి పెట్టింది. 3, 4, 5 తరగతులను హైసూ్కల్ విద్యలోకి తీసుకురావడం ద్వారా బీఈడీ, సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ ఉన్న సబ్జెక్ట్ టీచర్ల ద్వారా పిల్లలకు బోధన అందించి అభ్యసనా సామర్థ్యాలను బలోపేతం చేసింది.ఇందుకోసం ప్రాధమిక పాఠశాలల్లోని 3 నుంచి 5 తరగతులను హైసూ్కల్‌కు మార్చింది. ప్రాథమిక పాఠశాలల్లో అంగన్వాడీ పిల్లలకు పీపీ–1, పీపీ–2తో పాటు ఒకటి, రెండు తరగతుల బోధన ప్రారంభించింది. దీంతో ఏ స్కూల్‌ను మూసివేయాల్సిన అవసరం తలెత్తలేదు. ఈ సంస్కరణలను ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు సైతం స్వాగతించారు. కానీ గత టీడీపీ ప్రభుత్వం మాత్రం విద్యా సంస్కరణలు చేపట్టకుండా సరిపడినంత మంది విద్యార్థులు లేరన్న సాకుతో 2014–2019 మధ్య 1,785 పాఠశాలలను మూసివేయడం గమనార్హం. ఉన్నత విద్యకు అనువుగా ఇంగ్లిష్ మీడియం పదో తరగతి లేదా ఇంటర్ తర్వాత పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులు పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే చదవాలి. పాఠశాల స్థాయిలో ఇంగ్లిష్ మీడియం లేనివారు ఉన్నత విద్యలో వెనుకబడుతున్నారు. మరికొందరు మానేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2020లో రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించగా 97 శాతం మంది ఇంగ్లిష్ మీడియం బోధన తప్పనిసరిగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దీంతో జగన్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టింది. విద్యార్థుల్లో ఇంగ్లిష్ భాషా నైపుణ్యాన్ని పెంచేందుకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు, డిక్షనరీలను కూడా అందించింది. ముగిసిన విద్యా సంవత్సరంలో 93 శాతం పైగా విద్యార్థులు ఇంగ్లి‹Ùలోనే పరీక్షలు రాయడం విశేషం. పదో తరగతిలో ఇంగ్లిష్ మీడియం అమలు చేయకున్నా 2.23 లక్షల మంది విద్యార్థులు కూడా ఇంగ్లిష్ మీడియంలో పరీక్షలు రాశారు. వీరిలో 1.96 మందికి పైగా ఉత్తీర్ణత సాధించారంటే ఇంగ్లిష్ బోధనను ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వేలోనూ 90 శాతం పైగా ఇంగ్లిష్ మీడియం చదువులనే కోరుకున్నారు. -
వరుసగా ఐదోసారి ‘అమ్మఒడి’
సాక్షి, అమరావతి: ‘జగనన్న అమ్మఒడి’ పథకం నిధులను వచ్చేనెలలో తల్లుల ఖాతాల్లో జమచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. గత నాలుగేళ్లుగా విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత మొదటి నెలలో ఈ పథకాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి సుమారు 43 లక్షల మంది విద్యార్థుల తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను అందించనుంది. వచ్చేనెల 12న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.అదేరోజు ప్రభుత్వ బడుల్లో చదువుతున్న సుమారు 43 లక్షల మందికి పైగా విద్యార్థులకు ‘జగనన్న విద్యాకానుక’ కింద నాణ్యమైన యూనిఫారంతో పాటు పుస్తకాలను అందజేయనున్నారు. మన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించాలని, వారు అంతర్జాతీయంగా రాణించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పాఠశాల విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల అభ్యసన ఫలితాలను మెరుగుపరిచే లక్ష్యంతో సమగ్ర విద్యా, పరిపాలనా సంస్కరణలను అమలుచేసింది.‘మనబడి నాడు–నేడు’ కింద డిజిటల్ మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదులు కల్పించడంతో పాటు జగనన్న అమ్మఒడి, విద్యాకానుక, గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, ప్రతి పాఠశాలలోను మరుగుదొడ్లు–వాటి నిర్వహణకు ప్రత్యేక నిధి వంటివి ఏర్పాటుచేసింది. రాష్ట్రంలో మొత్తం 58,950 పాఠశాలలు ఉండగా, 72,20,633 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో 43.10 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరందరికీ అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించాలని 2019–20 విద్యా సంవత్సరంలోనే ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఐదోసారి రూ.6,400 కోట్ల పంపిణీకి ఏర్పాట్లు..ఇక నవరత్నాల్లో భాగంగా ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు జగనన్న అమ్మఒడి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.15 వేలు చొప్పున అందజేస్తోంది. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కాగానే 2019–20 విద్యా సంవత్సరంలో తొలిసారి 42,33,098 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,349.6 కోట్లు జమచేసి ఇచ్చిన మాట నిలుపుకున్నారు.ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకే కాక, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న వారికీ అమ్మఒడి అమలుచేసి, 2022–23 విద్యా సంవత్సరం వరకు నాలుగు విడతల్లో రూ.26,067 కోట్ల నిధులను తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. ఇక ఐదోసారి 2023–24 విద్యా సంవత్సరానికి జూన్ నాలుగో వారంలో సుమారు రూ.6,400 కోట్ల నిధులను జమచేయనున్నారు. గత విద్యా సంవత్సరంలో 75 శాతం హాజరున్న ప్రతి విద్యార్థికీ నగదు జమకానుంది. కార్పొరేట్ స్కూళ్లు ప్రభుత్వ బడులతో పోటీపడేలా..గత టీడీపీ ప్రభుత్వంలో బడులు తెరిచి 6–7 నెలలు అయినప్పటికీ యూనిఫారం సంగతి దేవుడెరుగు, కనీసం పాఠ్యపుస్తకాలు కూడా అందించలేని దుస్థితి. ఇక ఇతర వస్తువుల ఊసే ఉండేది కాదు. ఆ పరిస్థితిని సమూలంగా మారుస్తూ జగనన్న ప్రభుత్వం పాఠశాలలు తెరిచిన రోజే రూ.2,400 విలువైన జగనన్న విద్యా కానుక కిట్ అందజేస్తోంది. కార్పొరేట్ స్కూళ్లే ప్రభుత్వ బడులతో పోటీపడేలా, మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి అమలుచేస్తోంది. దీంతో గత నాలుగు విద్యా సంవత్సరాల్లో రెండేళ్లు కోవిడ్ ఇబ్బందులు తలెత్తినా సంస్కరణలు ఆగలేదు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఇంగ్లిష్ మీడియం బోధన, డిజిటల్ ఎడ్యుకేషన్, టోఫెల్, సీబీఎస్ఈ సిలబస్ అమలుతో మన విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుంటున్నారు.ప్రతిభావంతులకు ‘జగనన్న ఆణిముత్యాలు’ సత్కారం..ఇదిలా ఉంటే.. విద్యా రంగంలో సంస్కరణల కొనసాగింపుగా, విద్యలో నాణ్యత, నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు.. విద్యార్థుల కృషిని అభినందించి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడిచిన విద్యా సంవత్సరంలో గొప్ప ముందడుగు వేసింది. ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుకుని ప్రతిభ చాటిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించింది. 2023 మార్చిలో ఇంటర్, టెన్త్ పరీక్షల్లో వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలోని విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్లను తలదన్ని అత్యధిక మార్కులు సాధించారు.వీరిలో మొదటిస్థానంలో నిలిచిన 22,768 మందికి ‘జగనన్న ఆణిముత్యాలు బ్రిలియన్స్ అవార్డు’లను ప్రదానం చేశారు. రాష్ట్రస్థాయి విజేతలకు ప్రథమ స్థానంలో ఉన్న వారికి రూ.లక్ష, ద్వితీయ స్థానంలో ఉన్నవారికి రూ.75 వేలు, తృతీయ బహుమతిగా రూ.50 వేలు నగదు బహుమతిగా అందజేశారు. అలాగే, జిల్లా స్థాయి ప్రథమస్థానంలో నిలిచిన వారికి రూ.50 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.30 వేలు, తృతీయ స్థానంలో ఉన్నవారికి రూ.15 వేలు ప్రదానం చేశారు.ఇక నియోజకవర్గ స్థాయిలో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన వారికి రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు చొప్పున ఇవ్వగా, పాఠశాల స్థాయిలో రూ.3 వేలు, రూ.2 వేలు, రూ.వెయ్యి చొప్పున ప్రదానం చేశారు. 2023–24 విద్యా సంవత్సరంలోనూ ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోను విద్యార్థులు భారీ సంఖ్యలో రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించారు. స్కూళ్లు తెరిచిన అనంతరం వీరిని కూడా సత్కరించేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు.బడి తెరిచిన తొలిరోజే ‘జగనన్న విద్యాకానుక’ మరోవైపు.. ప్రభుత్వ, ఎయిడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు బడి తెరిచిన తొలిరోజు జూన్ 12న జగనన్న విద్యా కానుక కిట్లను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. ప్రతి విద్యార్థికీ రూ.2,400 విలువైన కిట్‌లో బైలింగువల్ పాఠ్య పుస్తకాలు (ఇంగ్లిష్–తెలుగు), నోట్‌బుక్స్, వరŠుక్బక్స్, కుట్టు కూలితో మూడు జతల యూనిఫామ్ క్లాత్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు–తెలుగు డిక్షనరీ, ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీ గల కిట్‌ను మొదటిరోజే అందజేయనుంది.ఇప్పటివరకు ఇలా నాలుగు సార్లు అందజేయగా, గతేడాది రూ.1,042.53 కోట్ల ఖర్చుతో 43,10,165 మంది విద్యార్థులకు విద్యాకానుకను అందించారు. 2024–25 విద్యా సంవత్సరానకి కూడా అంతే సంఖ్యలో కిట్లను సిద్ధంచేస్తున్నారు. ఇప్పటికే పుస్తకాల ముద్రణ దాదాపు పూర్తయింది. ఎన్నికల నేపథ్యంలో రవాణా నిలిపివేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం విద్యాకానుక కిట్లు స్టాక్ పాయింట్లకు చేరుస్తారు.గత విద్యా సంవత్సరాల్లో అమ్మఒడి, విద్యాకానుక పంపిణీ ఇలా..జగనన్న అమ్మ ఒడి.. సంవత్సరం లబ్ధిదారులు నగదు (రూ.కోట్లలో)2019–20 42,33,098 రూ.6,349.62020–21 44,48,865 రూ.6,673.42021–22 42,62,419 రూ.6,393.62022–23 42,61,965 రూ.6,392.9జగనన్న విద్యాకానుక ఇలా..విద్యా సం. లబ్ధిదారులు నిధులు (రూ.కోట్లలో)2020–21 42,34,322 రూ.648.102021–22 47,32,064 రూ.789.212022–23 45,14,687 రూ.886.692023–24 43,10,165 రూ.1,042.53 -
నాడు–నేడుకు దేశం ఫిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ విద్యా వ్యవస్థలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన నాడు–నేడుతో పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. ఆ అంశం యావత్ దేశాన్ని ఆకర్షిస్తోంది. నాడు–నేడు ద్వారా బడుగు, బలహీన వర్గాల పిల్లలకు పెద్దపీట వేయడాన్ని ఉత్తరాది రాష్ట్రాలు కొనియాడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పాఠశాలల పరిస్థితులు, ప్రస్తుతం సీఎం జగన్ హయాంలో పాఠశాలల స్థితిగతులపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కళ్లకు కట్టినట్లు వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. నాడు–నేడు షార్ట్ వీడియోలు ట్రెండీగా మారాయి. ఏపీలోని నాడు–నేడుపై దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ► రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు విద్యాసంస్థలను పట్టించుకోలేదు. ► విద్య, మధ్యాహ్న భోజన విషయంలో సైతం సర్కారీ బడులపై బాబు చిన్నచూపు చూశారు. ► 2014–19 మధ్య దాదాపు 1,785 పాఠశాలలను మూసివేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుంది.► 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక మెజార్టీ సీట్లతో గెలిచి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 58 నెలల్లో దాదాపు రూ.73 వేల కోట్లతో 45 వేల ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేశారు. ► 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ల ద్వారా విద్యాబోధన అందిస్తున్నారు. ఏ ఒక్క పిల్లవాడు చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో..సీఎం జగన్ అమ్మఒడి కింద ఏటా రూ.15 వేలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.సోషల్ మీడియాలో పలువురి కామెంట్లు ఇలా..► ఇది కేవలం విజనరీ సీఎం జగన్ వల్లే సాధ్యం► నాకు ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ అంటే ఇష్టం.. మంచి విద్య, అద్భుతమైన ఆట స్థలాలు ► అవును ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా విద్యార్థులకు అవసరమే► దేశంలో ప్రతి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ని స్ఫూర్తిగా తీసుకోవాలి► ఏపీ సీఎం జగన్ కింగ్ ట్రెండింగ్‌లో కావ్య వీడియోసీఎం జగన్ విద్యా వ్యవస్థలో నాడు–నేడు ద్వారా తీసుకొచి్చన విప్లవాత్మక మార్పులను గుర్తిస్తూ ఢిల్లీకి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ‘కావ్య’ ఓ వీడియోను రూపొందించారు. ►విద్యా వ్యవస్థలో దేశంలోనే ఏపీ సరికొత్త అడుగులు వేసిందని, గతంలో ఉన్న అధ్వాన పరిస్థితిని సమూలంగా మార్చివేసిందంటూ ప్రశంసలు కురిపించారు. ►అత్యాధునిక ఫర్నిచర్, ఫ్యాన్లు, మరుగుదొడ్లు వంటివి ఏర్పాటు చేశారని.. ఆ రోజుల్లో మనకు ఇటువంటి సౌకర్యాలు లేవే అంటూ.. సీఎం జగన్ చేసిన మంచి పనిని మెచ్చుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ►ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి, ఐబీ సిలబస్‌ను పరిచయం చేయడం అభినందనీయమని, ఈ ఐదేళ్ల కాలంలో ఏపీలో నిరక్షరాస్యత తగ్గిందని, బడుగు, బలహీన వర్గాల వారికి చదువుపై ఆసక్తి పెరిగిందంటూ వీడియో చేశారు. ►ఆ వీడియోను యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేయడంతో పదిలక్షలకు పైగా నెటిజన్లు వీడియో చూసి, వేల సంఖ్యలో షేర్ చేస్తూ ‘సూపర్ ఏపీ స్కూల్స్’ అంటూ కితాబు ఇస్తున్నారు. ►మరికొంత మంది నాడు–నేడుపై షార్ట్ వీడియోస్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఉత్తరాది జనం ఫిదా అవుతున్నారు. ►యూపీ, హరియాణా, రాజస్థాన్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఈ తరహా విద్య ఉంటే బాగుంటుందంటూ కామెంట్ల రూపంలో వారి అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. ►దేశవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తూ ఇదే తరహా నాణ్యమైన విద్య దేశం మొత్తం తీసుకురావాలని, సీఎం జగన్‌ను కొనియాడుతూ లైకులు, కామెంట్లు, షేర్ చేస్తున్నారు. -
మామయ్య గోరుముద్ద..చదువుపైనే శ్రద్ధ
గతం ముద్దన్నం...నీళ్ల సాంబారు... అదీ అరకొర... ఇదీ చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో బడిపిల్లలకు అందించే మధ్యాహ్న భోజన తీరు. ఆయన పాలనంటేనే కరువు. చంద్రబాబు సీఎంగా ఉన్న 2014–19 మధ్య రాష్ట్రంలో చాలావరకు కరువు పరిస్థితులు ఏర్పడి, ప్రజలకు ఉపాధి కూడా కరువైంది. ఫలితంగా నిరుపేదలు తిండికి కూడా దూరమయ్యారు. బడికి వెళ్లిన పేదల పిల్లలకు ఒక్క పూటైనా కడుపు నిండా అన్నం దొరుకుతుందని భావిస్తే.. అక్కడా ఆకలితో అలమటించేలా చేశారు. రోజూ ఒకేరకమైన మెనూవల్ల దానిని తినలేక, ఆకలితో ఉండలేక పేదింటి పిల్లల బాధ వర్ణనాతీతం. ఈ అన్నం తిన్నవారికి కడుపునొప్పి సర్వ సాధారణం. కౌమారదశ బాలికలైతే అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేవారు. బడికి వచి్చన పిల్లల్లో 30 శాతంలోపే మధ్యాహ్న భోజనం చేసేవారు. ఏటా సగటున రూ.450 కోట్లు మాత్రమే దీనికి కేటాయించే వారు. ఒక్కో విద్యార్థికి వంట ఖర్చు రూ.3.59 మాత్రమే కేటాయించారు. అదీ ఏజెన్సీలకు ఎప్పుడూ సకాలంలో చెల్లించిన పాపాన పోలేదు. ప్రస్తుతం పాలనపై చిత్తశుద్ధి... విద్యారంగంపై సరికొత్త విజన్గల ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో అనేక సంస్కరణలు అమలుచేశారు. పేదింటి పిల్లలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు ‘గోరుముద్ద’ పథకాన్ని స్వయంగా రూపొందించారు. 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు ‘జగనన్న గోరుముద్ద’ కింద నాణ్యమైన, పౌష్టికాహారాన్ని ఆరోగ్యకరమైన వాతావరణంలో వండి వడ్డిస్తున్నారు. ఒక్కో విద్యార్థి వంట ఖర్చును రూ.8.57 పెంచారు. బడ్జెట్ కూడా ఏడాదికి సగటున రూ.1,400 కోట్లకు పెరిగింది. సోమవారం నుంచి శనివారం వరకు రోజుకో మెనూతో 16 రకాల పదార్థాలను అందిస్తున్నారు. విద్యార్థుల్లో రక్తహీనత తగ్గించేందుకు ఫోరి్టఫైడ్ సార్టెక్స్ బియ్యంతో అన్నం, వారంలో మూడు రోజులు బెల్లంతో చేసిన రాగిజావ, మూడ్రోజులు బెల్లం చిక్కీ ఇస్తున్నారు. ఉడికించిన గుడ్డు ఐదు రోజుల పాటు తప్పనిసరి చేశారు. దీనివల్ల 90శాతం మంది పిల్లలు మధ్యాహ్న భోజనాన్ని వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో ప్రభుత్వం అన్ని దశల్లోను శ్రద్ధ తీసుకుంటోంది. రోజుకో మెనూ చొప్పున ఆరు రోజులకు 16 రకాల పదార్థాలు పిల్లలకు వడ్డిస్తున్నారు. ఉపాధ్యాయులు మొబైల్ యాప్‌లో విద్యార్థుల హాజరుతో పాటు భోజనం చేసేవారి సంఖ్యను రాష్ట్ర స్థాయి వరకు తెలుసుకునేలా ‘ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టం ఫర్ మిడ్ డే మీల్స్ అండ్ శానిటేషన్’ (ఐఎంఎంఎస్) యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ప్రతిరోజు బడిలో ఉన్న సరుకుల స్టాక్‌తో పాటు భోజనం అంశాలను ఫొటోలతో సహా అప్లోడ్ చేస్తున్నారు. భోజనం చేశాక, వంటపై విద్యార్థులే స్వయంగా రిజిస్టర్లో నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో 1–10 తరగతుల్లో 43 లక్షల మంది విద్యార్థులు ఉంటే.. ప్రతిరోజు హాజరైనవారిలో సగటున 34,89,895 మంది (90 శాతం) గోరుముద్ద తీసుకుంటున్నారు. మిగిలిన 10 శాతం మందిలో బాలికలు ప్రత్యేక పరిస్థితుల్లో ఇంటి నుంచి అన్నం తెచ్చుకుని బడిలో కూరలు తీసుకుంటున్నారు. పిల్లలు తీసుకునే ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో ఏఐ టెక్నాలజీ యాప్ ద్వారా తెలుసుకుని అందుకు తగ్గట్టు ఎప్పటికప్పుడు మార్పులు చేస్తున్నారు. సోమవారం: హాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్ పులావు, గుడ్డు కూర, చిక్కీ మంగళవారం:ఉదయం 10.20కు రాగిజావ, మధ్యాహ్నం 12.20కు చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు బుధవారం: వెజిటబుల్ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ గురువారం: ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్ బాత్/నిమ్మకాయ పులిహోర, టమాటా పచ్చడి, ఉడికించిన గుడ్డు శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ శనివారం: ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్ పొంగల్ ‘గోరుముద్ద’కు జాతీయ అవార్డు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందిస్తున్న జగనన్న గోరుముద్ద అమలుకు కేంద్ర ప్రభుత్వం కితాబునిచ్చింది. రక్తహీనత నివారణ, మెరుగైన ఆరోగ్యం లక్ష్యంగా పనిచేయడాన్ని కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ గుర్తించి గతేడాది నవంబర్‌లో జాతీయ స్థాయి ప్రథమ బహుమతి రాష్ట్రానికి అందజేసింది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో రాగి జావ, ఉడికించిన గుడ్ల పంపిణీ, ఎముకల బలాన్ని పెంచేందుకు చిక్కీ(వేరుశనగ బార్) పంపిణీ చేస్తూ విద్యార్థులందరికీ శారీరక ఆరోగ్యమే ప్రాథమిక లక్ష్యంగా గోరుముద్ద కొనసాగుతోందని స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ జోయా అలీ రిజ్వీ అవార్డు వేడుకలో అభినందించడం గమనార్హం. వంట ఏజెన్సీలకు ఖర్చులు పెంపు గత ప్రభుత్వంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ఏనాడు సకాలంలో డబ్బులు చెల్లించలేదు. 2014–18 వరకు వంటపాత్రల సరఫరా లేదు. ఈ ఏడాది 43 లక్షల మంది విద్యార్థులకు స్టీలు గ్లాసులు అందించారు. 44,617 పాఠశాలలకు రూ.41 కోట్ల వ్యయంతో స్టీలు వంట పాత్రలను ప్రభుత్వం అందించింది. గత ప్రభుత్వం 2014–18 మధ్య పిల్లల భోజన ఏడాది వ్యయం రూ.450 కోట్లు అయితే, ప్రస్తుత ప్రభుత్వంలో అది సగటున రూ.1449 కోట్లకు పెంచింది. వంట ఖర్చు, అదనపు మెనూ, ఆహార ధాన్యాలు, రవాణాతో సహా మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. గత ప్రభుత్వంలో 2014–18 మధ్య విద్యార్థుల వంట ఖర్చు రూ.3.59 నుంచి రూ.6.51 మధ్య మాత్రమే కాగా.. ప్రస్తుతం ఆ ఖర్చు రూ.8.57కు పెంచి చెల్లిస్తున్నారు. ఏటా సగటున రూ.1449 కోట్ల ఖర్చు ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందించినప్పుడే చదివింది ఒంటబడుతుందని నమ్మిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిల్లలకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ‘గోరుముద్ద’కు శ్రీకారం చుట్టారు. బడికి వచ్చే ప్రతి పేద బిడ్డకు రుచికరమైన పౌష్టికాహారం అందిస్తూ.. వారు స్కూలుకు వచ్చేందుకు ఆసక్తి చూపేలా మెనూ రూపొందించారు. ప్రభుత్వ బడుల్లోని 43 లక్షల మంది విద్యార్థుల కోసం రోజుకో మెనూ చొప్పున 16 రకాల ఐటమ్స్‌తో ‘జగనన్న గోరుముద్ద’ అందిస్తున్నారు. ఉదయం 9.30 గంటలకే విద్యార్థుల హాజరుకు అనుగుణంగా పిల్లల అభిప్రాయాలు తీసుకుని ఆ మేరకు వంట చేస్తున్నారు. రోజుకు సగటున 34.90 లక్షల మంది విద్యార్థులు గోరుముద్ద తింటున్నారు. భోజనం పూర్తయ్యాక అభిప్రాయాలు విద్యార్థులే రిజిస్టర్లో నమోదు చేస్తున్నారు. ‘గుడ్’ అని ‘నాట్ గుడ్’ అని నిర్భయంగా చెప్పే స్వేచ్ఛను ప్రభుత్వం విద్యార్థులకు కల్పించింది. గత ప్రభుత్వంలో నీళ్ల సాంబారు, ముద్ద అన్నం కోసం ఏటా రూ.450 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే.. గోరుముద్ద కోసం ప్రభుత్వం ఏటా సగటున రూ.1449 కోట్ల చొప్పున ఈ ఐదేళ్లలో రూ.7,244.6 కోట్ల నిధులు వెచి్చంచింది. పౌష్టికాహారం కోసం ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యం పిల్లల్లో రక్తహీనత తగ్గించేందుకు వారంలో మూడురోజులు బెల్లంతో చేసిన రాగిజావ, మరో మూడురోజులు చిక్కీ ఇస్తున్నారు. వారంలో ఐదు రోజులు ఉడికించిన గుడ్డు తప్పనిసరి. విద్యార్థుల్లో రక్తహీనత నివారణకు ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యాన్నే వాడుతున్నారు. ప్రతి గురువారం బడి పిల్లల ఆరోగ్యం పరీక్షించేందుకు స్థానిక ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది పరీక్షలు చేస్తారు. రక్తహీనత నివారణకు మాత్రలు ఇవ్వడంతో పాటు వారు సక్రమంగా వాడుతున్నారో లేదో పరిశీలిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఇదే మెనూ పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనాన్ని అల్యూమినియం పాత్రల్లో వండేవారు, దీనివల్ల పిల్లలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించిన జగనన్న ప్రభుత్వం వాటి స్థానంలో పూర్తి స్టీలు పాత్రలు అందించింది. -
ఆనందాల ఏలుబడి
ప్రభుత్వ బడుల్లో కల్పించిన సదుపాయాలు 1. నిరంతరం నీటి సరఫరాతో మరుగుదొడ్లు 2. శుద్ధి చేసిన తాగునీరు 3. పూర్తి స్థాయి మరమ్మతులు 4. ఫ్యాన్లు, లైట్లతో విద్యుదీకరణ 5. విద్యార్థులు, సిబ్బందికి ఫరి్నచర్ 6. గ్రీన్ చాక్‌బోర్డులు 7. భవనాలకు పెయింటింగ్ 8. ఇంగ్లిష్ ల్యాబ్ 9. కాంపౌండ్ వాల్; 10. కిచెన్ షెడ్ 11. అదనపు తరగతి గదుల నిర్మాణం సాక్షి, అమరావతి: ప్రభుత్వ విద్యకు జగనన్న ప్రభుత్వం పట్టం కట్టింది. అలా ఇలా కాదు.. అక్షరానికి అగ్రాసనం వేసి, సౌకర్యాలకు సమున్నత స్థానం కల్పించారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేనట్లుగా.. నిధులు కేటాయించి సర్కారు బడి రూపురేఖల్ని సమూలంగా మార్చింది. కార్పొరేట్ విద్యా రంగం ఈర‡్ష్యపడేలా కొత్త పాఠశాల భవనాలు.. టాయిలెట్ల నుంచి కాంపౌండ్ వాల్ వరకు 11 రకాల సదుపాయాలు కల్పించారు. నాడు–నేడు రెండు దశల్లో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు చేశారు. తెలుగు, ఇంగ్లిషులో టెక్టŠస్ బుక్స్ అందించి ప్రతి విద్యార్థి ఇంగ్లిష్‌ను సులభంగా నేర్చుకునేలా చర్యలు తీసుకున్నారు. కేవలం విద్యా సంస్కరణల కోసం జగనన్న ప్రభుత్వం జూన్ 2019 నుంచి ఫిబ్రవరి 2024 వరకు రూ.72,919 కోట్లు ఖర్చు చేసి విద్యా రంగంలో సంస్కరణల పట్ల తన నిబద్ధత చాటుకుంది. సర్కారు బడిలో డిజిటల్ శకం ఒకప్పుడు బ్లాక్ బోర్డులపై రాసే సుద్దముక్కలు లేక ఇబ్బందులు పడిన దశ నుంచి ప్రభుత్వ బడి డిజిటల్ బోధనతో సరికొత్త హంగులు సంతరించుకుంది. స్కూల్లో చదువుకునేందుకు అనువైన వాతావరణం ఉన్నప్పుడే చిన్నారులు ఆసక్తి చూపుతారన్న ఆలోచనతో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం మనబడి నాడు–నేడు పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 11 రకాల సదుపాయాలు కల్పించారు. సరికొత్తగా.. నాడు–నేడులో పాఠశాలల రూపురేఖలు మారాయి. ఈ పనులన్నీ పూర్తి పారదర్శకతతో కొనసాగేందుకు తల్లిదండ్రుల కమిటీని ఏర్పాటు చేశారు. నాడు–నేడు పనులు చేపట్టిన అన్ని ఉన్నత పాఠశాలల్లోను ఇంటర్నెట్తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లతో 3డీ డిజిటల్ పాఠాలను బోధిస్తున్నారు. ప్రా«థమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలతో పాఠాలతో పాటు టోఫెల్ శిక్షణ అందిస్తున్నారు. నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు బైజూస్ పాఠాలను ఉచితంగా బోధిస్తున్నారు. దేశంలో 25 వేలఐఎఫ్‌పీలు ఉంటే.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఒక విప్లవం. . అమ్మ ఒడితో అండగా.. ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అందించేందుకు, అంతర్జాతీయంగా రాణించాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో ప్రభుత్వం పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యం ఇచి్చంది. ‘మనబడి నాడు–నేడు’ కింద డిజిటల్ మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదులతో పాటు జగనన్న అమ్మ ఒడి, విద్యాకానుక, గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు–వాటి నిర్వహణకు ప్రత్యేక నిధి వంటివి ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మొత్తం 58,950 పాఠశాలలు ఉండగా, 72,20,633 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో 43.10 లక్షల మంది చదువుతున్నారు. వీరికి అత్యున్నత ప్రమాణాలతో విద్య కోసం 2019–20 విద్యా సంవత్సరంలోనే ప్రభుత్వం సంస్కరణలు మొదలుపెట్టింది. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లల తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు చొప్పున జమ చేశారు. టెక్ ప్రపంచంలో రాణించేలా.. ప్రస్తుత టెక్ ప్రపంచంలో మన విద్యార్థులు రాణించేందుకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న టెక్నాలజీ కోర్సులపై స్కూల్ స్థాయిలోనే అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను భవిష్యత్ టెక్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 2024–25 విద్యా సంవత్సరం నుంచి ఫ్యూచర్ స్కిల్స్ కోర్సుల్ని ప్రవేశపెడుతోంది. ఆరు నుంచి ఇంటర్ వరకు మూడు దశల్లో విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్ శిక్షణ ఇవ్వనున్నారు. టెక్ అంశాల్లో విద్యార్థుల ఆలోచన శక్తిని విస్తరించడం, విజ్ఞానంలో ముందుండేందుకు ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), 3డీ ప్రింటింగ్, గేమింగ్ వంటి 10 విభాగాల్లో శిక్షణ ఇస్తారు. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ కోసమే దాదాపు రూ.2400 కోట్లు ఖర్చు చేస్తోంది. నాస్కామ్, జేఎన్టీయూ నిపుణులు, ఏపీ ఎస్సీఈఆరీ్ట, స్వతంత్ర నిపుణులతో ఫ్యూచర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఈ కోర్సులను 6,790 ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్స్ ఫెసిలిటేటర్స్‌గా నియమిస్తోంది. విద్యార్థుల ప్రతిభకు పట్టం విద్యా రంగంలో సంస్కరణల కొనసాగింపుగా, విద్యలో నాణ్యత, నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు.. విద్యార్థుల కృషిని అభినందించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మరో గొప్ప ముందడుగు వేసింది. ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదువుకుని ప్రతిభ చాటిన వారిని ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించింది. 2023 మార్చిలో ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలో అత్యధిక మార్కులు సాధించి, మొదటి స్థానాల్లో నిలిచిన 22,768 మంది స్టేట్ బ్రిలియన్స్ అవార్డులు అందుకున్నారు. -
కళసాకారం..
ప్రభుత్వ బడులకు పండుగొచ్చింది. స్కూళ్లు పిల్లలతో కళకళలాడుతున్నాయి. ఐదేళ్ల క్రితం ఎవరూ కలలో కూడా ఊహించనిదీ విప్లవాత్మక మార్పు.మార్పులో మేము సైతం అంటూ పాలుపంచుకుంది హైదరాబాద్ కు చెందిన యువ ఆర్టిస్ట్ విజయ్,స్వాతి జంట. పిల్లల నవ్వులతో మమేకమైంది.. బడి ప్రాంగణాలే కాన్వాసుగా వారి ఆటపాటలే కుంచెలుగా మలచి వర్ణచిత్రాలను ‘రంగ’రించింది. పాఠశాలకు జీవం ఉట్టిపడే చిత్రాలతో కొత్త కళ తెచ్చింది. ఆ యువ ఆర్టిస్టు జంటతో ‘సాక్షి’ ముచ్చటించింది. వారి మాటల్లోనే.. అలా మొదలైంది: మేం ఇద్దరం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నాం వాటితో అనుబంధం ఉంది. గత 2017లో ఒక ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని మాకు చేతనైన విధంగా రంగులద్దాం. ఆ సమయంలో ఎవరైనా చొరవ తీసుకుని అన్ని స్కూళ్లకు ఇలాగే రంగులద్దితే ఎంత బావుండో అనుకున్నాం. పూజారి కోరిందీ దేవుడు ఇచ్చిందీ ఒకటే అన్నట్టు ఆంధ్రప్రదేశ్ స్కూల్లో లార్జ్‌స్కేల్ ఆర్ట్ వర్క్స్ కోసం మమ్మల్ని చింతూరు ఐటీడీఎ పీవో అప్రోచ్ అయ్యారు. అలా 2020లో జులై నెలలో నాడు–నేడు కోసం మా వర్క్ స్టార్ట్ అయింది. అది కేవలం మా బొమ్మల వరకే కాదనీ, మొత్తం పాఠశాలల రూపు రేఖలే మార్చే కార్యక్రమం అనీ తెలిశాక మా ఆనందం రెట్టింపయింది. మా కల నిజం అవుతోందని సంబరపడ్డాం. ఆర్ట్ వర్క్ కోసం రోజుల తరబడి ఆయా స్కూళ్లలో గడిపాం. పిల్లలు చదువుకుంటున్నప్పుడు, ఆడుకుంటున్నప్పుడు.. హ్యాపీగా ఫీలైన జాయ్ మూమెంట్స్‌ని క్యాప్చర్ చేసి వాటినే ఆర్ట్ వర్క్స్‌గా మలిచాం. తద్వారా పిల్లలు మరింతగా వాటితో కనెక్ట్ అయ్యారు. వాళ్లని వాళ్లు 30–30 స్కేల్ ఆర్ట్ వర్క్‌లో చూసుకుని థ్రిల్ అయ్యేవారు. పదే పదే చూసుకోవడం, పేరెంట్స్‌కి, ఫ్రెండ్స్‌కీ చూపించే సమయంలో వాళ్ల ముఖంలో సంతోషం అమూల్యం. మాటల్లో వర్ణించలేం. అలా హెడ్ మాస్టర్, టీచర్లు, స్టాఫ్.. మా స్కూల్‌కు బెస్ట్ ఆర్ట్ వర్క్ చేయండి అంటూ అడిగి మరీ చేయించుకున్నారు. చాలా వరకూ ట్రైబల్ ఏరియా స్కూల్స్‌లో చేశాం. ప్రతీ స్కూల్లో వర్క్ ముగించుకుని వచ్చేటప్పుడు చుట్టాలను వదిలి వెళ్తున్న ఫీలింగ్ కలిగింది. ప్రభుత్వ పాఠశాలల పునర్వైభవ విజయంలో మాకు కూడా చిన్న పాత్ర ఉండడం జీవితంలో మేం మర్చిపోలేని మధుర జ్ఞాపకం. – సత్యార్థ్ నాడు అలా.. ఇకపై ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడాలంటే నాడు–నేడుకు ముందు, ఆ తర్వాత అని విభజించి మాట్లాడాల్సిందే. సర్కారు బడులంటే టాయిలెట్స్ కనిపించవు, పైనా కిందా గచ్చు పెచ్చులూడుతూ ఉంటుంది. వానపడితే పుస్తకాలు బల్లల కింద దాచుకోవాలి. ఫ్యాన్లు శబ్ధాలు చేస్తాయి తప్ప తిరగవు. బాగా పాఠాలు చెప్పే టీచర్లు కరువు. ప్రాంగణం పందులు, పశువులకు ఆలవాలం. అందువల్లే పిల్లలను చేర్చలేని దుస్థితి. నేడు ఇలా.. బెస్ట్ బెంచీలు, గ్రీన్ బోర్డ్స్, ఫ్లోరింగ్, ఫ్యాన్స్, టాయిలెట్స్, క్రీడా పరికరాలతో సహా ప్లే గ్రౌండ్, పుస్తకాలు, బ్యాగ్స్, ట్యాబ్స్.. పూటకో మెనూతో మధ్యాహ్న భోజనం.. ఇలా కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా చక్కటి వసతులు సమకూరాయి. పిల్లలు, టీచర్లలో నవోత్సాహం కనిపిస్తోంది. ఇప్పుడు ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే జాయిన్ చేయాలి అనే పరిస్థితి వచ్చింది. -
నాడు చతికిల‘బడి’.. నేడు ఉజ్వలంగా మారి..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ బడులను గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తిగా నిర్వీర్యం చేశారు. బడుల అభివృద్ధిని పూర్తిగా వదిలేయడంతో చాలా వరకూ శిథిలావస్థకు చేరాయి. ఇలాంటి బడుల్లో ఉండలేక చాలామంది పేదింటి పిల్లలు చదువుకు దూరమయ్యారు. బడులను బాగు చేయాల్సిన ఆ ప్రభుత్వం.. సరిపడినంత మంది విద్యార్థులు లేరన్న సాకుతో 2014–19 మధ్య 1,785 పాఠశాలలను మూసివేసింది. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను సైతం విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా పూర్తిస్థాయిలో అందివ్వలేకపోయింది. పేద పిల్లలకోసం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతలేకుండా చేసింది. తన వర్గంగా భావించిన నారాయణ, శ్రీచైతన్య వంటి విద్యా సంస్థలకు మేలు చేసేలా ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేశారు. చివరికి ఎంతో అనుభవం ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా నారాయణ విద్యా సంస్థల సిబ్బందితో శిక్షణ ఇచ్చేందుకు కాంట్రాక్టు అప్పగించేలా దిగజార్చింది. జగన్ హయాంలో బడులకు మహర్దశ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదింటి పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని అనేక సంస్కరణలను అమలు చేసింది. 58 నెలల్లో దాదాపు రూ.73 వేల కోట్ల నిధులను వెచ్చింది 45 వేల ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చేలా ప్రణాళికను అమలు చేసింది. ఓ పక్క పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లి ఖాతాలో జగనన్న అమ్మఒడి కింద రూ.15 వేలు జమ చేసే సంక్షేమ పథకాన్ని అందిస్తూనే మరో పక్క విద్యా సంస్కరణలను అమలు చేసింది. తద్వారా బడిలో హాజరుశాతం గణనీయంగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 2021లో విద్యా సంస్కరణలపై అధ్యయనం చేసింది. ఎంతోమంది నిపుణులైన ఉపాధ్యాయుల సూచనలతో ‘నాడు–నేడు’ పథకానికి శ్రీకారం చుట్టింది. మూడో తరగతి నుంచే అత్యున్నత ప్రమాణాలను అందిస్తూ సబ్జెక్టు టీచర్లతో విద్యా బోధన చేపట్టింది. ఫలితంగా 3వ తరగతి నుంచే విద్యార్థులకు బీఈడీ అర్హత గల సబ్జెక్టు టీచర్ల ద్వారా విద్యాబోధన అందిస్తున్నారు. అంతేగాక 2014–2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వం మూసివేసిన 1,785 పాఠశాలలను తిరిగి తెరిపించింది. సర్కారు బడుల నిర్వహణలో ఇద్దరికీ ఉన్న వ్యత్యాసం ఇది. గత ప్రభుత్వం సర్కారు బడులపై చిన్నచూపు చూసింది. ప్రైవేటు యాజమాన్యాల మత్తులో పడి పూర్తిగా నిర్వీర్యం చేసింది. రకరకాల కారణాలతో పెద్ద సంఖ్యలో మూసివేసింది. పైగా విద్యనందించడం ప్రభుత్వ బాధ్యత కాదంటూ సరికొత్త భాష్యం చెప్పింది. ఫలితంగా వేలాదిమంది నిరుపేదలు చదువులకు దూరమయ్యారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు విద్యారంగంలో ప్రత్యేక సంస్కరణలు తీసుకొచ్చింది. ఆధునిక దేవాలయాలుగా తీర్చిదిద్దింది. ప్రతి గ్రామంలో సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత ఆకర్షణీయంగా తరగతిగదులను మార్చింది. మూతపడిన పాఠశాలలను తెరిపించడమే గాకుండా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తయారు చేసింది. ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేసి... జాతీయ స్థాయి పరీక్షలను సమర్థంగా ఎదుర్కొనేలా పిల్లలకు తర్ఫీదునిచ్చింది. రాష్ట్రంలో నెలకొన్న విద్యావిప్లవం నేడు అంతర్జాతీయ వేదికల ప్రశంసలు అందుకునేలా చేసింది. ఉత్తమ ఫలితాల సాధనలో ముందంజ గత ప్రభుత్వం విధానాలతో నిర్వీర్యమైన ప్రభుత్వ విద్యను గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అప్పటికే పలు సంస్థలు చేసిన అధ్యయనాల్లో ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలు వయసుకు తగిన అభ్యాస ఫలితాలను సాధించలేకపోతున్నారని, బోధనా ప్రమాణాలు సైతం తక్కువగా ఉన్నాయని తేల్చారు. ఆరో తరగతికి వచ్చే విద్యార్థులు తక్కువ లెర్నింగ్ స్టాండర్డ్స్‌తో ఉంటున్నారని, సిలబస్‌ను సైతం అర్థం చేసుకోలేకపోతున్నారని, బేసిక్స్ కూడా తెలియడం లేదని తెలుసుకున్నారు. అప్పటినుంచి దానిని అధిగమించేందుకు ప్రత్యేక దృష్టిసారించారు. ► 2021–22 విద్యా సంవత్సరం నుంచి అంగన్వాడీల నుంచి ఉన్నత పాఠశాలల వరకు ప్రభుత్వంలోని అన్ని మేనేజ్మెంట్లలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. ► అంగన్వాడీలను పీపీ–1, పీపీ–2 బోధన స్థాయికి పెంచడంతో పాటు ప్రాధమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలతో, హైస్కూళ్లల్లో 62 వేల ఐఎఫ్‌పీ స్క్రీన్స్‌తో డిజిటల్ విద్యాబోధన ప్రవేశపెట్టారు. ప్రభుత్వ బడిపిల్లలు ఇంగ్లిష్‌లో రాణించేందుకు టోఫెల్ శిక్షణను ప్రవేశపెట్టారు. ► బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టి ఇంగ్లిష్ నేర్చుకోవడం సులభతరం చేశారు. ప్రాధమిక పాఠశాలల్లోని ఒకటి నుంచి 5 తరగతుల విద్యార్థులకు పాఠ్య పుస్తకాల్లో పదాలతోనే పిక్టోరియల్ డిక్షనరీని రూపొందించి అందించారు. ‘రోజుకో ఇంగ్లిష్ పదం’ నేర్చుకునే విధానం ప్రవేశపెట్టారు. ► 1000 పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను అమలు చేశారు. ఈ సంస్కరణల ఫలితాలను సైతం తల్లిదండ్రులు చూశారు. 2023–24 విద్యా సంవత్సరంలో దాదాపు 94 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాశారు. 2022–23లో పదో తరగతి, ఇంటర్మీడియట్లో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు అన్నీ ప్రభుత్వ విద్యార్థులే కైవసం చేసుకున్నారు. 2025 జూన్ నుంచి ఇంటర్నేషనల్ బాకలారియెట్ బోధనకు శ్రీకారం చుట్టనున్నారు. -
సర్కార్ బడుల్లో పెరిగిన విద్యార్థుల చేరికలు
-
యువత ‘భద్రత’లో ఏపీ నంబర్ వన్
గుంటూరు ఎడ్యుకేషన్: నైపుణ్యాభివృద్ధి, ఇంటర్న్‌షిప్ ఉద్యోగాల కల్పనలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలుస్తున్నదని, ఉన్నత విద్యారంగంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలే అందుకు కారణమని పలువురు వక్తలు స్పష్టం చేశారు. గుంటూరు ఏసీ కళాశాలలో సోమవారం ఏపీఎస్సీహెచ్ఈ ఆధ్వర్యంలో ‘ఉన్నత విద్యలో సంస్కరణలు–యువతకు సాధికారత’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొమ్మాలపాటి మోజెస్ అధ్యక్షత వహించిన సదస్సుకు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) వైస్ చైర్మన్ ప్రొఫెసర్, కె.రామమోహనరావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సాధారణ డిగ్రీ కోర్సులతో యువతకు ప్రయోజనం లేదని గుర్తించిన సీఎం జగన్ ప్రభుత్వం ఉన్నత విద్యలో సమూల మార్పులు తెచ్చిందన్నారు. ఆ.. సంస్కరణలు అద్భుతమైన ఫలితాలిస్తున్నాయని చెప్పారు. ఉన్నత విద్యలో నవరత్నాల వంటి తొమ్మిది కార్యక్రమాలను రూపొందించిన సీఎం వైఎస్ జగన్ ఎంతో నిబద్ధతతో అమలు చేస్తున్నారని తెలిపారు. ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశపెట్టిన ఇంటర్న్ షిప్ విధానంలో విద్యార్థులను పరిశ్రమలకు అనుసంధానం చేయడంతో విద్యార్థులు తమలోని సామర్థాన్ని, నైపుణ్యాలను స్వయంగా తెలుసుకుని ముందుకు వెళుతున్నారని చెప్పారు. రూ.32కోట్లు వెచి్చంచి రాష్ట్రంలోని 1.25 లక్షల మంది యువతకు పైసా ఖర్చు లేకుండా మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్సు అందించడం గొప్ప విషయమన్నారు. బీహెచ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.కౌసల్యాదేవి, ఏసీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ ఎం.కుసుమకుమారి, జీఏ షాలిని, బి.విజయకుమార్, అధ్యాపకులు ఎం.రత్నరాజు, సీహెచ్ అనిత, ఎన్జే సాల్మన్‌బాబు మాట్లాడారు. వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. యువతకు దిశా, దశ నిర్దేశనం ఉన్నత విద్యలో ఏపీ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు యువతకు దిశా, దశ చూపుతున్నాయి. నైపుణ్యాలు లేనిదే సమాజంలో రాణించలేరనే సదుద్దేశంతో ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపడుతున్నది. విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విజ్ఞానాన్ని అందిస్తూ, ప్రపంచంలో ఎక్కడైనా రాణించగల స్థైర్యాన్ని కల్పించడం అభినందనీయం. – కేఎఫ్ పరదేశిబాబు, ఏసీ కళాశాల కరస్పాండెంట్ ఎన్ఈపీ అమల్లో ఏపీ అగ్రస్థానం.. జాతీయ నూతన విద్యా విధానం–2020 అమల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపారు. విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీపడే విధంగా నైపుణ్యంతో కూడిన విద్యను అందించేందుకు ఆయన సాహసోపేతమైన నిర్ణయాలతో ముందుకు వెళుతున్నారు. విజ్ఞానం, నైపుణ్యం, నూతన ఆవిష్కరణల దిశగా విద్యార్థులు ముందుకు సాగాలి. – డాక్టర్ కె.మోజెస్, ప్రిన్సిపాల్, ఏసీ కళాశాల ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ ఉన్నత విద్యారంగంలో అమలు చేస్తున్న అనేక సంస్కరణలతో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. పరిశ్రమలను విద్యాసంస్థలకు అనుసంధానం చేయడంలో సఫలీకృతమైన ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను యువతరానికి అందిస్తోంది. – పి.మల్లికార్జునప్రసాద్, ప్రిన్సిపాల్, హిందూ కళాశాల ఊహకందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధారణ సెల్‌ఫోన్‌తో మొదౖలెన ఆధునిక సాంకేతికత.. ఇంటర్నెట్తో వేగం పుంజుకుని ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్ వరకు ఎదిగింది. ఈ పరిస్థితుల్లో నైపుణ్యం లేనిదే విద్యార్థులు రాణించలేరు. ఉన్నత విద్య దశలోనే పోటీతత్వంతో ముందుకు వెళ్లాలి. – డాక్టర్ ఎంఎస్ శ్రీధర్, పీజీ కోర్సుల డీన్, ఏసీ కళాశాల -
నాడు నేడు పథకంపై ప్రశంసల జల్లు
-
Visakhapatnam: అరే.. ఇది మన బడేనా!
చోడవరం రూరల్: విరిగిపోయిన బెంచీలు.. చెట్టు కింద క్లాసులు.. రంగు వెలసిన గోడలు.. శిథిలావస్థలో భవనాలు.. ఒకనాటి ప్రభుత్వ బడుల దుస్థితి.. ఇప్పుడు అందుకు భిన్నంగా కళకళలాడుతున్న తమ పాఠశాలను చూసి సంక్రాంతికి సొంతూరు వచ్చిన పూర్వ విద్యార్థులు ఆశ్చర్యపోయారు. తమ స్కూలు ఇంత అభివృద్ధి చెందుతుందని కలలో కూడా ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశారు. మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నా లక్ష్మీపురం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎప్పుడూ సమస్యలతో సావాసం చేసేది. సర్కారు బడి అంటే అందరికీ అలుసే. ఆనాడు చదువుకున్న తరగతి గదిలో కూర్చొని మురిసిపోతున్న పాత విద్యార్థులు మొక్కుబడిగా నిర్వహించేవారు. ఇప్పుడు “మన బడి నాడు–నేడు’ కార్యక్రమంలో కనీవినీ ఎరుగని రీతిలో పాఠశాలను కార్పొరేట్ స్కూలు తరహాలో తీర్చిదిద్దడంతో పూర్వ విద్యార్థులు “అరే.. ఇది మనం చదివిన బడేనా’ అని ఆశ్చర్యపోయారు. వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాల నిమిత్తం స్థిరపడిన లక్ష్మీపురం గ్రామానికి చెందిన శిరిసోళ్ళ వరహాలునాయుడు, పండూరి నాగేశ్వరరావు, బంటు శ్రీనివాసరావు, పడాల భాస్కర్, గుమ్మాల త్రినాథ్, కంఠంరెడ్డి శ్రీనివాసరావు తదితరులు సంక్రాంతికి తమ స్వగ్రామానికి వచ్చి, సోమ, మంగళవారాల్లో తమ పాఠశాలను సందర్శించారు. వారిని పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ భూతనాధు రామారావు, పూర్వ చైర్మన్ ఎస్.వరహాలునాయుడు కలిశారు. రూ.63 లక్షలతో తరగతి గది భవనాల మరమ్మతులు, నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టినట్టు చెప్పారు. పాఠశాల విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంతోపాటు, టోఫెల్ శిక్షణ సైతం అందిస్తున్నట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎ.వి.జగన్నాథరావు వివరించారు. తాము ఇపుడు చదువుకుంటే ఎంతో బాగుండేదని, ఇంగ్లీషు అంటే భయపడే తమకు నేడు పాఠశాలలో ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన చేస్తుండడం ఒకింత ఈర‡్ష్య కలిగిస్తోందని పూర్వ విద్యార్థులు చెప్పారు. మనోగతం మాటల్లోనే.... గర్వపడుతున్నా.. నేను (1993–1998 బ్యాచ్) చదువుకున్న కాలంలో మా ఊరి విద్యార్థులే ఉండేవారు. నేడు పట్టణ ప్రాంతమైన చోడవరం నుంచే కాకుండా చుటుపక్కల ఉన్న దామునాపల్లి, మైచర్లపాలెం, వరహాపురం, తునివలస, ఖండిపల్లి, అడవి అగ్రహారం, నర్సయ్యపేట, గోవాడ వంటి సుదూర గ్రామాల నుంచి విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నారంటే ఇక్కడి విద్యాబోధన, వసతులే కారణం. ఒక సైనికునిగా దేశం పట్ల ఎంత గర్వపడతానో.. మా ఊరి బడిని చూసి ఇప్పుడు అంతే గర్వపడుతున్నాను. – పండూరి నాగేశ్వరరావు, ఆర్మీ ఉద్యోగి కాంపిటీటివ్ స్కిల్స్ పెరుగుతాయి నేను (1999–2004 బ్యాచ్) చదువుకునేటప్పుడు పోటీ పరీక్షలకు వెళ్లడానికి తగిన నైపుణ్యం అందించే సౌకర్యం పాఠశాలలో ఉండేది కాదు. కానీ నేడు అమలు చేస్తున్న బోధనా సంస్కరణలు ఇప్పటి పిల్లల్లో మంచి స్కిల్స్‌ను పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వారికి ట్యాబ్‌లను అందచేయడంతో పాటు తరగతుల్లోను డిజిటల్ విధానంలో విద్యాబోధన చేయడం కలలో కూడా ఊహించనిది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నూటికి నూరు మార్కులు వేయవచ్చు. –పడాల భాస్కర్, డిప్యూటీ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సామర్లకోట -
గిరిసీమలో ‘కొత్త’బడులు
సాక్షి, అమరావతి: గిరిజన స్కూళ్లకు మహర్దశ పట్టింది. ఇప్పటి వరకు చెట్ల కింద, పూరిపాకల్లో కొనసాగుతున్న గిరిజన గ్రామాల్లో చదువులకు ప్రభుత్వం కొత్త రూపునిస్తోంది. తక్కువ మంది విద్యార్థులున్న బడులకు సైతం పక్కా భవనాలు నిర్మింస్తోంది. మరిన్ని శిథిలమైన భవనాలకు మెరుగులు అద్దుతోంది. ఆరు జిల్లాల్లో 1,331 గిరిజన సంక్షేమ పాఠశాలలు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. గత ప్రభుత్వంలో మైదాన ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తే.. గిరిజన గ్రామాల్లో పూర్తిగా గాలికి వదిలేశారు. రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లో విద్యను పట్టించుకోకపోవడంతో అక్కడి పిల్లలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’తో దాదాపు 1,331 గిరిజన స్కూళ్లను సుమారు రూ.500 కోట్లతో సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారు. వీటితో పాటు మరో 817 పాఠశాల భవనాల్లో విద్యుత్, తాగునీరు, టాయిలెట్ సౌకర్యాలు కల్పింస్తున్నారు. ఇప్పటికే నాడు–నేడు మొదటి దశలో 350, రెండో దశలో మరో 74.. మొత్తం 424 గిరిజన సంక్షేమ పాఠశాలలను పూర్తి చేశారు. కొండ ప్రాంతాల్లోని గూడేల్లో ఎన్నో ఏళ్లుగా పాఠశాలలున్నా వాటిలో అత్యధిక ప్రాంతాల్లో పక్కా భవనాల్లేవు. ఇలాంటి చోట బడులు, పాకలు లేదా చెట్ల కింద నామమాత్రంగా నడుస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఉన్న పాఠశాలల భవనాలు బీటలు వారి శిథిలమయ్యాయి. ఇలాంటి పాఠశాలలకు కొత్త భవనాలు నిర్మించడంతో పాటు పాత వాటికి మెరుగులు దిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. మారుమూల బడుల్లోనూ సకల సదుపాయాలు తొలి విడతలో 26 జిల్లాల్లోనూ 20 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులున్న 1,331 స్కూళ్లను గుర్తించారు. వీటిలో కొత్త భవనాలు నిర్మించాల్సినవి దాదాపు 500 వరకూ ఉండగా, మిగిలినవి మెరుగులు దిద్దాల్సినవి. మొత్తం రూ.500 కోట్లతో ఆయా పనులు చేపట్టారు. ఇప్పటికే 424 స్కూళ్ల పనులు పూర్తిచేయగా, మిగిలిన స్కూళ్లను రెండు నెలల్లో పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతుల కల్పన విభాగం లక్ష్యంగా నిర్దేశించుకుంది. కేవలం భవనాలు నిర్మింంచడమే కాకుండా వాటికి విద్యుత్, తాగునీరు, మరుగు దొడ్లను సైతం తప్పనిసరి చేసింది. ప్రస్తుతం నాడు–నేడు రెండో దశ పనుల్లో భాగంగా ఈ స్కూళ్లను బాగుచేస్తుండగా, మూడో విడతలో ఏజెన్సీలోని 20 మంది కంటే తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను తీర్చిదిద్దాలని నిర్ణయించారు. -
తృప్తిగా.. కడుపు నిండుగా..మధ్యాహ్న భోజనం
నాడు నీళ్ల సాంబారు, ముద్ద అన్నం పప్పుకు, రసానికి తేడానే ఉండదు పేరుకే ఏటా రూ.450 కోట్ల బడ్జెట్ సరుకులకు డబ్బు చెల్లింపులో తీవ్ర జాప్యం సరుకులు ఎవరెవరో ఇళ్లకు ఎత్తుకుపోయే పరిస్థితి వంట వాళ్లనూ పట్టించుకోని వైనం ఎవరికీ పట్టని భోజనం నాణ్యత వంటశాల లేక స్కూలంతా పొగ సగటున 50 శాతం మంది విద్యార్థులకే భోజనం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం సీతంపాలెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో భోజనం కోసం ఎండలో క్యూలైన్లో వేచిఉన్న విద్యార్థులు నేడు రోజుకో మెనూ చొప్పున మొత్తంగా 16 రకాల ఐటమ్స్ గోరుముద్ద పేరుతో రుచికరమైన భోజనం సగటున 90% మంది విద్యార్థులకు భోజనం భోజనం పూర్తయ్యాక ఆహారంపై ఆరా.. బాగుంటే ‘గుడ్’ లేకుంటే ‘నాట్ గుడ్’ అని నిర్భయంగా చెప్పే స్వేచ్ఛ నాణ్యత కోసం కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు పిల్లలతో కలిసి తినే ఏర్పాటు ఎంత మంది భోజనం చేస్తున్నారో ఆన్లైన్లో పక్కాగా రికార్డు 43 లక్షల మంది ప్రతి రోజూ సంతృప్తికరంగా భోజనం సోమవారం హాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్ పులావు, గుడ్డు కూర, చిక్కీ మంగళవారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు బుధవారం వెజిటబుల్ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ గురువారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్ బాత్/ నిమ్మకాయ పులిహోర, టొమాటో పచ్చడి, ఉడికించిన గుడ్డు శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ శనివారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్ పొంగల్ 2019–20లో రూ.979.48 కోట్లు, 2020–21లో రూ.1,187.49 కోట్లు, 2021–22లో రూ.1,840.05 కోట్లు, 2022–23లో రూ.1,548.58 కోట్లు, 2023–24లో రూ.1,689 కోట్లు బడ్జెట్ ప్రత్యేకంగా వంట గది, ఎప్పటికప్పుడు బిల్లులు విద్యార్థులకు తరగతి గది పక్కన వరండాల్లో భోజనం పెడుతున్న దృశ్యం -
AP: ఇదీ మార్పు.. రహదారి రయ్..రయ్..
నాడు ► రాష్ట్రవ్యాప్తంగా రహదార్లు పూర్తిగా నిర్లక్ష్యం ► మరమ్మతుల నిర్వహణను ఏమాత్రం పట్టించుకోని వైనం ► రోడ్ల పునరుద్ధరణకు 2017–18లో తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణం ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లింపు ► 2019 నాటికి రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్న రోడ్లు ► అప్పుడు భారీ వర్షాలు, మహమ్మారి కోవిడ్ లేదు ► ఐదేళ్లలో రోడ్ల నిర్మాణానికి వెచ్చించిన నిధులు రూ.2,953.81 కోట్లు ► ఈ లెక్కన ఏడాదికి సగటున రూ.591 కోట్లు ► రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారుల పునరుద్ధరణకు వెచ్చించిన నిధులు రూ.4,325 కోట్లే ► పంచాయతీరాజ్ రోడ్ల కోసం రూ.3,160.38 కోట్లు మాత్రమే . ► ఇతరత్రా కలిపి మొత్తంగా 2014 నుంచి 2019 వరకు రోడ్లకు వెచ్చించిన నిధులు రూ.23,792.19 కోట్లు నేడు ► వరుసగా రెండేళ్లు భారీ వర్షాలు, కోవిడ్ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా రోడ్ల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు ► ప్రాధాన్యతా క్రమంలో రహదారుల నిర్మాణం ► ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోని రహదారులకు మోక్షం ► గ్రామీణ ప్రాంతాల రహదారుల నిర్మాణానికి సత్వర చర్యలు ► రోడ్ల మరమ్మతులకు రూ.4,148.59 కోట్లు ► రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణానికి రూ. 7,340 కోట్లు ► పంచాయతిరాజ్ రోడ్ల నిర్మాణానికి రూ. 5,443.69 కోట్లు ► జాతీయ రహదారుల నిర్మాణానికి రూ. 25,304 కోట్లు ► మొత్తంగా నాలుగున్నరేళ్లలో వెచ్చించిన మొత్తం రూ.42,236.28 కోట్లు ► మొత్తంగా రోడ్ల నిర్మాణం 7,600 కిలోమీటర్లు -
తరగతి మారిపోయింది
ఇప్పుడు ఆ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు కూడా అందుబాటులోకి వచ్చాయి. మొదటి దశ ముగిసిన వెంటనే ప్రభుత్వం గతేడాది జూలైలో నాడు–నేడు రెండో దశ పనులను రూ.8 వేల కోట్ల వ్యయంతో చేపట్టింది. 22,217 పాఠశాలలను రెండో దశలో ఎంపిక చేసి, నిర్మాణ పనులు ప్రారంభించింది. ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో 2023 మార్చిలో ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలో అత్యధిక మార్కులు సాధించి, మొదటి స్థానాల్లో నిలిచిన 22,768 మంది పిల్లలకు అవార్డులు అందించింది. – సాక్షి, అమరావతి నాడు పెచ్చులూడిన స్లాబులు 4 నెర్రలు బారిన గోడలు విరిగిపోయిన బెంచీలు 4 కటిక నేలపై చదువులు వస్తారో రారో తెలియని అయ్యవార్లు మచ్చుకైనా కనిపించని వాష్ రూమ్‌లు కొన్ని చోట్ల పశువులకు నెలవు ఎక్కడో ఒక చోట మాత్రమే టీవీలు సబ్జెక్ట్ టీచర్లు కరువు విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదనేలా ప్రభుత్వ తీరు నేడు కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా నూతన భవనాలు చిన్నారులను ఆకట్టుకునేలా పెయింటింగ్స్ సైన్స్ ల్యాబ్‌లు సరికొత్తగా డెస్‌్కలు, కుర్చీలు, ఇతర పరికరాలు రన్నింగ్ వాటర్‌తో టాయ్లెట్లు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అదనపు తరగతి గదులు, వంటషేడ్లు పరిశుభ్రమైన మంచి నీరు ప్రతి పాఠశాలకూ రక్షణ గోడ ప్రతి తరగతి గది డిజిటలైజేషన్ మొత్తంగా 12 రకాల సదుపాయాలు ఇంగ్లిష్ మీడియం, బైజూస్ పాఠాలు 3వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ కౌమార దశలోని బాలికలకు స్వేచ్ఛ శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’ పథకం మొదటి దశలో రూ.3,700 కోట్లతో 15,715 స్కూళ్లను అభివృద్ధి చేసింది. -
AP: చక్కదిద్దారు!
బ్లాక్ బోర్డుపై రాసేందుకు నాలుగు సుద్ధ ముక్కల కోసం కూడా వెతుక్కోవాల్సిన దుస్థితి నుంచి ఏకంగా ట్యాబ్‌లు, ఐఎఫ్‌పీ స్క్రీన్స్, స్మార్ట్ టీవీలతో మన ప్రభుత్వ స్కూళ్లు సరికొత్తగా ఆవిష్కృతమయ్యాయి. పగిలిన గోడలు.. పెచ్చులూడే శ్లాబులు.. చెట్ల కింద వానాకాలం చదువులు అనే దురవస్థ నుంచి ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులను ఏకంగా ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే స్థాయికి తీసుకెళ్లిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికే దక్కింది. నాలుగంటే నాలుగేళ్లలోనే సాకారమైన మార్పులు ఇవన్నీ! సాక్షి, అమరావతి: చదువుకునేందుకు లక్షలు ధారపోయాల్సిన పరిస్థితి నుంచి పిల్లలు సర్కారు బడికొస్తే చాలు ఎదురు డబ్బులిచ్చి మరీ ప్రోత్సహిస్తోందీ వైఎస్ జగన్ ప్రభుత్వం. మనసుంటే మార్పు వచ్చి తీరుతుందని బలంగా నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంస్కరణల బాటతో మన విద్యా వ్యవస్థ 2019కి ముందు.. ఆ తర్వాత అని దేశమంతా చర్చించుకునేలా చేశారు. విద్యారంగంపై వెచ్చిస్తున్న వ్యయాన్ని భావి తరాల బంగారు భవిష్యత్తు కోసం పెట్టు పెట్టుబడిగా దృఢంగా విశ్వసించారు. కార్పొరేట్‌ను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను డిజిటల్ బోధన బాట పట్టించారు. అక్షరానికి అగ్రాసనం వేస్తూ పేదింటి పిల్లలను అక్కున చేర్చుకున్నారు. నాడు – నేడు ద్వారా ఇప్పటికే రెండు దశల్లో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తెచ్చారు. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధన, 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ విధానం, 1,000 ప్రభుత్వ స్కూళల్లో సీబీఎస్ఈ సిలబస్ ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే సాధ్యమైంది. మధ్యాహ్నం ప్రతి విద్యార్థి సంతృప్తిగా భుజించేలా రోజుకో రుచికరమైన మెనూతో గోరుముద్ద అమలు చేస్తున్నారు. ఏటా సగటున రూ.1,400 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.6,995.34 కోట్ల బడ్జెట్‌ను పిల్లల భోజనం కోసం కేటాయించింది. వారంలో ఐదు రోజులు ఉడికించిన గుడ్డు, మూడు రోజులు రాగిజావ, బెల్లం చిక్కీను అందచేస్తూ పిల్లల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధను అత్యుత్తమ చర్యగా విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు. సర్కారు స్కూళ్లలో ప్రాథమిక స్థాయి నుంచే టోఫెల్ శిక్షణతో పాటు 2025–26 నుంచి ఐబీ సిలబస్‌ను సైతం అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది ప్రభుత్వం. కేవలం విద్యారంగంలో సంస్కరణల కోసమే నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం రూ.71 వేల కోట్లకు పైగా ఖర్చు చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రధమం. అమ్మ ఒడి నుంచి ఆణిముత్యాలు.. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు, అంతర్జాతీయంగా రాణించాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో పాఠశాల విద్యకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. అభ్యసన ఫలితాలను మెరుగుపరిచే లక్ష్యంతో సమగ్ర విద్య సంస్కరణలను అమలు చేసింది. ‘మనబడి నాడు–నేడు’ ద్వారా మౌలిక సదుపాయాలు, అదనపు తరగతి గదులను సమకూర్చింది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లను పరిశుభ్రంగా మారుస్తూ నిర్వహణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మొత్తం 58,950 పాఠశాలలు ఉండగా 72,20,633 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 44,617 ప్రభుత్వ పాఠశాలల్లో 43.10 లక్షల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. వీరందరికీ అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించాలని 2019–20లోనే ప్రభుత్వం సంస్కరణలు ప్రారంభించింది. నవరత్నాలు పథకంలో భాగంగా పిల్లలను బడికి పంపించే తల్లికి రూ.15 వేలు చొప్పున తొలిసారి 42,33,098 మంది ఖాతాల్లో రూ.6,349.6 కోట్లు జమచేసి ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాట నిలుపుకొన్నారు. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకే కాకుండా ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న వారికీ అమ్మ ఒడి అమలు చేసి 2022–23 వరకు రూ.25,809.50 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ చేసి ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రతిభకు ప్రోత్సాహం.. విద్యా రంగ సంస్కరణల కొనసాగింపు, నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు విద్యార్థుల కృషిని అభినందించి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ ఏడాది మరో గొప్ప ముందడుగు వేసింది. ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదివి ప్రతిభ చాటిన వారిని ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించింది. 2023 ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి మొదటి స్థానాల్లో నిలిచిన 22,768 మంది స్టేట్ బ్రిలియన్స్ అవార్డులు అందుకున్నారు. సదుపాయాలు.. విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో నేర్చుకునేలా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం మనబడి నాడు–నేడు ద్వారా శ్రీకారం చుట్టింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 11 సదుపాయాలను కల్పించింది. నిరంతర నీటి సరఫరాతో టాయిలెట్లు, తాగునీరు, మరమ్మతులు, ఫ్యాన్లు, లైట్లతో విద్యుదీకరణ, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, భవనాలకు పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, అదనపు తరగతి గదులు నిర్మించింది. నాడు–నేడు మొదటి విడతలో 15,715 పాఠశాలల్లో రూ.3,669 కోట్లతో సౌకర్యాలు కల్పించారు. రెండో దశలో రూ.8,000 కోట్లతో 22,344 పాఠశాలల్లో పనులు వడివడిగా చేపట్టారు. నాడు–నేడు పనులు చేపట్టిన అన్ని ఉన్నత పాఠశాలల్లో ఇంటర్నెట్తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లతో 3డీ డిజిటల్ పాఠాలను బోధిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 33 వేల స్మార్ట్ టీవీలతో పాఠాలతో పాటు టోఫెల్ శిక్షణ అందిస్తున్నారు. నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు బైజూస్ పాఠాలను ఉచితంగా అందించడం గమనార్హం. దేశంలో 25 వేల ఐఎఫ్‌పీలు ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లోనే 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో విప్లవంగా నిలిచిపోయింది. డిజిటల్ శకం.. ప్రభుత్వ పాఠశాలల్లో 4 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉత్తమ కంటెంట్ ఉచితంగా అందించేందుకు అతిపెద్ద ఎడ్ టెక్ కంపెనీ బైజూస్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఈ కంటెంట్‌ను ఇంటర్ విద్యార్థులకు కూడా అందిస్తుండడం విశేషం. ఎనిమిదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు కలిపి 2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో 9.53 లక్షల మందికి బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్స్ ఇచ్చి ఇంటి వద్ద కూడా డిజిటల్ పాఠాలు నేర్చుకునేలా చర్యలు తీసుకుంది. ఏపీ ఈ పాఠశాల మొబైల్ యాప్, దీక్ష వెబ్సైట్, డీటీహెచ్ చానెళ్లు, యూట్యూబ్ చానెల్ లాంటి వాటి ద్వారా విద్యార్థులు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా చదువుకునే ఏర్పాటు చేసింది. విద్యార్థుల సందేహాల నివృత్తికి ‘ఏఐ’ టెక్నాలజీతో పనిచేసే ‘డౌట్ క్లియరెన్స్ బాట్’ యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, టోఫెల్ శిక్షణలో ఎదురయ్యే క్లిష్టమైన సందేహాలను ఇది సునాయాసంగా నివృత్తి చేస్తుంది. సబ్జెక్టు టీచర్లు.. టోఫెల్ శిక్షణ పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా రాణించాలంటే ఇంగ్లిష్ భాషపై పట్టు ఎంతో అవసరం. అందుకోసం ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రవేశపెట్టడంతో పాటు ప్రాథమిక స్థాయి నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్)తో ప్రభుత్వం టోఫెల్ శిక్షణ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా 3 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు టోఫెల్ శిక్షణనిస్తున్నారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లను నియమించి ఉత్తమ బోధన అందుబాటులోకి తెచ్చింది. పాఠ్యాంశాల సంస్కరణ.. విద్యార్థుల్లో నేర్చుకునే తత్వం, జిజ్ఞాస పెంచేందుకు ప్రభుత్వం పాఠ్యాంశాల్లో సంస్కరణలు తీసుకొచ్చింది. మూస పద్ధతిలో ఉన్న పాఠాలను 2020–21 నుంచి సమూలంగా మార్చింది. 21వ శతాబ్దపు నైపుణ్యాలను పెంపొందించేందుకు క్లాస్రూమ్ బేస్డ్ అసెస్మెంట్ను అమలు చేస్తోంది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా పాఠశాలలను ఫౌండేషన్, ఉన్నత పాఠశాలలుగా మార్చింది. అన్ని పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల అవసరాన్ని తీర్చేలా భారీగా పదోన్నతులు కల్పించారు. బోధనా సామర్థ్యాలు పెంచేందుకు, సీబీఎస్ఈ బోధనకు అనుగుణంగా ‘టీచర్ కెపాసిటీ బిల్డింగ్’ శిక్షణనిచ్చింది. ఇందుకోసం ఇఫ్లూ, రివర్సైడ్ లెర్నింగ్ సెంటర్లలో ఉపాధ్యాయ శిక్షణ ఇచ్చారు. సీబీఎస్ఈ.. మండలానికో కాలేజీ ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను ప్రారంభించింది. ప్రతి మండలంలో బాలికల కోసం ఒక జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసింది. 292 ఉన్నత పాఠశాలలను బాలికల కోసం హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేశారు. మొత్తం 352 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్‌ను ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలను గరŠల్స్ జూనియర్ కళాశాలలుగా మార్చారు. దీంతో మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల అందుబాటులోకి వచ్చింది. టెక్నాలజీపై శిక్షణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను టెక్ నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం 2024–25 నుంచి ఫ్యూచర్ స్కిల్స్ కోర్సులను ప్రవేశపెడుతోంది. ఆరు నుంచి ఇంటర్ వరకు మూడు దశల్లో ఫ్యూచర్ స్కిల్ శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థుల ఆలోచన శక్తిని విస్తరించడం, విజ్ఞానంలో ముందుండేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), 3డీ ప్రింటింగ్, గేమింగ్ లాంటి పది విభాగాల్లో శిక్షణ ఇస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ కోసమే దాదాపు రూ.2,400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. నాస్కామ్, జేఎన్టీయూ నిపుణులు, ఏపీ ఎస్సీఈఆర్టీ, స్వతంత్ర నిపుణులతో ఫ్యూచర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఈ కోర్సులను 6,790 ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు ఇంజనీరింగ్ చివరి ఏడాది విద్యార్థులను ఫ్యూచర్ స్కిల్స్ ఫెసిలిటేటర్స్‌గా నియమిస్తున్నారు. ఐబీ దిశగా అడుగులు.. ‘మన పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా ఎదగాలి. ప్రపంచానికి దిక్సూచిగా మారాలి’ అన్న సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ) బోధన ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దేశంలో 210 వరల్ట్ క్లాస్ కార్పొరేట్ స్కూళ్లలో మాత్రమే అందుబాటులో ఉన్న ‘ఐబీ’ బోధనను ప్రభుత్వ స్కూళల్లోకి తెచ్చి పేద పిల్లలకు ఉచితంగా అందించాలన్న సంకల్పంతో సీఎం జగన్ అడుగులు ముందుకు వేశారు. 2025 – 26 నుంచి ఐబీ బోధన ప్రవేశపెట్టి ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుతూ + 2 వరకు అందించేలా చర్యలు తీసుకున్నారు. విద్యార్థుల్లో క్రిటికల్ థింకింగ్, లేటరల్ థింకింగ్, డిజైన్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంటి నైపుణ్యాలకు సాన పెట్టడంతోపాటు అంతర్జాతీయంగా అత్యుత్తమ స్థాయిలో ఉద్యోగాలుయ పొందేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. కేవలం నాలుగున్నరేళ్లలోనే ఇన్ని అద్భుతమైన సంస్కరణలు తవిద్యారంగంలో తేవడం చరిత్రాత్మకమని, ఇది ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామని విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు. విద్యా సాధికారత.. స్కూళ్లలో పూర్తి స్థాయిలో మౌలిక వసతులతో పాటు ఆంగ్ల మాధ్యమం వల్ల విద్యా సాధికారత దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. ప్రాథమిక స్థాయి నుంచి బలమైన పునాదులను నిర్మిస్తోంది. ఇప్పడు మన ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న ఉత్తమ విద్యతో నైపుణ్యం గల మానవ వనరులను సృష్టించడం సాధ్యమేనని బలంగా నమ్ముతున్నా. – ప్రొఫెసర్ కె.శ్రీరామమూర్తి, ఏయూ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్ పదేళ్లలో అద్భుతాలు సృష్టిస్తారు.. గతంలో నేను ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలకు పుస్తకాలు, యూనిఫారం లాంటివి డొనేట్ చేసేవాడిని. ఈ ప్రభుత్వం వచ్చాక నోటు పుస్తకాల నుంచి యూనిఫారం, బూట్లు వరకు ఆ అవసరం లేకుండా అన్నీ ఉచితంగా అందిస్తోంది. స్వేచ్ఛ న్యాప్కిన్స్ ఇస్తున్నారు. ఆటలు ఆడిస్తున్నారు. పిల్లలకు నేర్పే విధానం, నేర్చుకునే విధానం సంపూర్ణంగా మారింది. ప్రభుత్వ విద్యలో ఇదో గొప్ప సంస్కరణ. కార్పొరేట్ స్కూళ్లలోనూ ఇన్ని వసతులు లేవు. ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు మరో 10 ఏళ్లలో అద్భుతాలు సృష్టిస్తారనడంలో సందేహం లేదు. – డాక్టర్ రాజశేఖర్, గైనకాలజిస్ట్, కర్నూలు ఆ ఇబ్బందులు తొలగించారు.. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్లు లేకపోవడం బాలికలకు అతి పెద్ద సమస్య. ఈ ప్రభుత్వం ఆ సమస్యను దూరం చేసింది. బాలికలకు స్వేచ్ఛ పేరుతో శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా ఇస్తున్నారు. గతంలో ఈ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడేవారు. నాడు–నేడుతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోను ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం పెరిగింది. ఇంగ్లిష్ మీడియం, టోఫెల్ శిక్షణ, రక్తహీనత నివారణకు బెల్లం చిక్కీతో పాటు ఐరన్ మాత్రలు ఇవ్వడం ప్రశంసనీయం. – వడిశెట్టి గాయత్రి, పీజీ లెక్చరర్, పిఠాపురం -
అంగన్వాడీలను అందంగా తీర్చిదిద్దాలి
సాక్షి, అమరావతి: ‘మన అంగన్వాడీ నాడు–నేడు’ రెండో దశలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రెండో దశలో అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కమిషనర్(మౌలిక సదుపాయాలు) కె.భాస్కర్ సాంకేతిక మార్గదర్శకాలను సోమవారం జారీచేశారు. ‘మన అంగన్వాడీ నాడు–నేడు’ రెండో దశలో రూ.214.22 కోట్లతో 20,534 కేంద్రాల రూపురేఖలు మార్చనున్నట్లు మార్గదర్శకాల్లో స్పష్టంచేశారు. ఈ పనులకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులు, అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్లను ఆదేశించారు. మొత్తం 20,534 అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు ప్రధాన, చిన్న మరమ్మతు పనులను ఈ నెలాఖరులోపు గుర్తించాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న టాయిలెట్లో రన్నింగ్ వాటర్ సమస్యలు, రక్షిత మంచినీటి పైపులు, సంప్‌లు, ఎలక్ట్రికల్ వైరింగ్, ట్యూబ్‌లైట్లు, సీలింగ్ ఫ్యాన్లు, పెయింటింగ్, శ్లాబ్, ఫ్లోరింగ్, గోడలకు మరమ్మతులు వంటివి ఈ నెలాఖరులోగా గుర్తించాలని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. ఈ నెల మూడో వారంలో కమిటీల సమావేశాలు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పిల్లల తల్లులతో కమిటీలు నియమించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఒక్కో కమిటీలో ముగ్గురు తల్లులు, సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్, వార్డు కార్యదర్శి, అంగన్వాడీ వర్కర్, మహిళా శిశు సంక్షేమశాఖ సూపర్వైజర్, మహిళా పోలీసు, సమీపంలోని స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఉండాలని తెలిపారు. ఆ కమిటీల పేరుతో జాతీయ బ్యాంకుల్లో ఖాతాలను తెరవాలని సూచించారు. ఈ నెల మూడో వారంలో తల్లుల కమిటీల సమావేశాలను ఏర్పాటుచేసి అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టాల్సిన మరమ్మతు పనులను గుర్తించడంతోపాటు వాటికి అంచనాలను రూపొందించి తీర్మానం చేసి అంగన్వాడీ సూపర్వైజర్కు సమర్పించాలని ఆదేశించారు. ఈ నెల చివరి వారంలో మరమ్మతు పనుల అంచనాలను సమగ్ర శిక్ష పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. అంచనాలకు జిల్లా కలెక్టర్లు పరిపాలన అనుమతులను మంజూరు చేస్తారని తెలిపారు. మరమ్మతులకు అవసరమైన మెటీరియల్‌ను స్థానికంగా కొనుగోలు చేసి పనులు చేపట్టాలని పేర్కొన్నారు. తలుపులు, కిటికీలు, వాటర్ ట్యాంకులు, పైపులైన్లు, సంప్లతోపాటు ఏమైనా పరికరాలకు మరమ్మతులు చేయడం సాధ్యం కాకపోతే కొత్తవి ఏర్పాటుచేయాలని ఆదేశించారు. మెటీరియల్ కొనుగోలు, పనుల వివరాలను ఎప్పటికప్పుడు ‘ఎం బుక్’లో నమోదు చేయాలని సచివాలయాల ఇంజినీరింగ్ అసిస్టెంట్, వార్డు కార్యదర్శులకు సూచించారు. -
AP: ప్రభుత్వ బడి పిల్లలకు ట్యాబ్‌లు సిద్ధం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థులకు మరింత మెరుగైన సదుపాయాలతో ట్యాబ్‌ల పంపిణీకి సర్వం సిద్ధమైంది. వీటిని ఈ నెల 21న విద్యార్థులకు అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గతేడాది కంటే మెరుగైన సామర్థ్యం ఉన్న ట్యాబ్‌లను ఎంపిక చేసి, వాటిలో ఎనిమిదో తరగతితోపాటు 9, 10 తరగతుల పాఠ్యాంశాలను చేర్చారు. గత విద్యా సంవత్సరం ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం 5,18,740 ట్యాబ్‌లను బైజూస్ కంటెంట్‌తో పంపిణీ చేసింది. ఈ ఏడాది 4.30 లక్షల ట్యాబ్‌ల పంపిణీకి టెండర్లు పిలవగా శాంసంగ్, ఏసర్, మార్క్ వ్యూ, లావా సంస్థలు ముందుకు వచ్చాయి. ఆయా సంస్థల నుంచి 2.50 లక్షల యూనిట్లు విజయవాడలోని స్టాక్ పాయింట్‌కు చేరాయి. మరో 1.80 లక్షల యూనిట్లు ఈ వారంలో అందనున్నాయి. ఇప్పటిదాకా వచ్చిన ట్యాబ్‌ల్లో అధికారులు సాంకేతిక అంశాలను పరిశీలించారు. వీటిని మంగళవారం ప్రాంతీయ సంయుక్త అధికారుల కార్యాలయాలకు తరలించారు. రెండు, మూడు రోజుల్లో ఇవి ఉన్నత పాఠశాలలకు చేరనున్నట్టు పాఠశాల విద్యాశాఖ మౌలిక సదుపాయాల కల్పన కమిషనర్ కాటమనేని భాస్కర్ ‘సాక్షి’కి తెలిపారు. అలాగే ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ బోధన కోసం అందిస్తున్న ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్‌పీ)ను సైతం రెండో దశ నాడు–నేడు పనులు పూర్తయిన స్కూళ్లల్లో బిగించనున్నారు. రెండో దఫాలో 30 వేల ఐఎఫ్‌పీలు, 22 వేల స్మార్ట్ టీవీలు ఈ నెల 21 నాటికి స్కూళ్లకు చేరనున్నాయి. మరింత మెరుగ్గా.. గతేడాది ఎనిమిదో తరగతి విద్యార్థులకు 8.7 అంగుళాల తెర, 3 జీబీ ర్యామ్, 32 జీబీ రోమ్, 64 జీబీ ఎస్డీ కార్డు గల ట్యాబ్‌లను అందించారు. వాటిలో అదే తరగతి పాఠ్యాంశాలను అప్లోడ్ చేశారు. అయితే, ఈ ఏడాది ట్యాబ్‌ల సామర్థ్యం పెంచడంతోపాటు అదనపు తరగతుల డిజిటల్ పాఠాలను సైతం అప్లోడ్ చేయడం విశేషం. వచ్చే వారం విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్‌లు 8.7 అంగుళాల తెర, 4 జీబీ ర్యామ్, 64 జీబీ రోమ్, 256 జీబీ ఎస్డీ కార్డుతో ఉండనున్నాయి. వీటిలో ఎనిమిదో తరగతితోపాటు 9, 10 తరగతుల బైజూస్ ఈ–కంటెంట్‌ను సైతం అప్లోడ్ చేశారు. అంతేకాకుండా విద్యార్థులకొచ్చే సందేహాలను నివృత్తి చేసేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పనిచేసే డౌట్ క్లియరెన్స్ యాప్ ‘ఈ–ట్యూటర్’ను కూడా అందుబాటులో ఉంచారు. అలాగే భవిష్యత్తులో విద్యార్థులకు ఇంటర్మీడియట్ పాఠాలను సైతం అప్లోడ్ చేసేంత స్పేస్ కూడా ఈ ట్యాబ్‌ల్లో ఉంది. 30 వేల ఐఎఫ్‌పీలు, 22 వేల స్మార్ట్ టీవీలు.. గతేడాది ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సెక్షన్‌కు ఒకటి చొప్పున 30,715 ఐఎఫ్‌పీ స్క్రీన్లను అందుబాటులోకి తెచ్చారు. అలాగే ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది విద్యార్థులకు ఒక స్మార్ట్ టీవీ చొప్పున 10,038 స్మార్ట్ టీవీలను సరఫరా చేశారు. ఈ ఏడాది 30 వేల ఐఎఫ్‌పీలు, 22 వేల స్మార్ట్ టీవీలను ఈ నెల 21 నాటికి అందుబాటులోకి తేనున్నారు. అన్ని ట్యాబ్‌ల్లో ‘డ్యులింగో’ యాప్ పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా రాణించేందుకు, విదేశాల్లో సైతం విజయవంతమైన కెరీర్‌ను అందుకునేందుకు వీలుగా ప్రభుత్వ పాఠశాలల్లో విదేశీ భాషలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఉపాధ్యాయులకు కూడా వివిధ భాషల్లో శిక్షణ ఇవ్వాలని ఇటీవల విద్యాశాఖ అధికారులు హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) అధికారులతో చర్చించారు. ఈ క్రమంలో విదేశీ భాషలు అందించే యాప్ ‘డ్యులింగో’ను ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఇవ్వనున్న ట్యాబ్‌ల్లో ఇన్స్టాల్ చేశారు. గత డిసెంబర్లో ఇచ్చిన 5,18,740 ట్యాబ్‌లతోపాటు ఈ ఏడాది ఇవ్వనున్న 4.30 లక్షల ట్యాబ్‌ల్లోనూ ఈ డ్యులింగ్ యాప్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా విద్యార్థులు సులభంగా విదేశీ భాషలు నేర్చుకునే వీలుంది. ఉన్నత తరగతులకు కూడా ఉపయోగపడేలా.. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. విద్యార్థులతోపాటు పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు కూడా వీటిని అందిస్తాం. ఇప్పటికే దాదాపు 2.50 లక్షల యూనిట్లు అందాయి. వారంలోగా మొత్తం 4.30 లక్షల ట్యాబ్‌లు స్కూళ్లకు చేరతాయి. ఈసారి ట్యాబ్‌ల సామర్థ్యం పెంచాం. అంతేకాకుండా 8, 9, 10 తరగతుల ఈ–కంటెంట్‌తోపాటు డౌట్ క్లియరెన్స్ యాప్‌ను, ఈ–డిక్షనరీని కూడా అప్లోడ్ చేశాం. కొత్త ట్యాబ్‌ల్లో భవిష్యత్తులో ఇంటర్మీడియట్ పాఠాలను సైతం అప్లోడ్ చేయొచ్చు. విద్యార్థులు పై తరగతులకు వెళ్లినప్పుడు పాత పాఠాలను తొలగించి కొత్త కంటెంట్‌ను అప్లోడ్ చేస్తాం. – కాటమనేని భాస్కర్, కమిషనర్, పాఠశాల విద్య నాడు–నేడు మౌలిక వసతుల కల్పన -
మాటలు కాదు... మీ రాతలతోనే చేటు
సాక్షి, అమరావతి: ఇదెక్కడి కుట్ర రామోజీ? పేదలంతా వైఎస్ జగన్ పక్షాన నిలుస్తున్నారనే భయంతో వారిలో విభజన తెచ్చేందుకు కులాల పేరిట రెచ్చగొట్టడం అమానుషం కాదూ? ఎస్సీలను రకరకాలుగా తూలనాడి, వారిని కట్టు బానిసల్లా చూసిన చంద్రబాబు నాయుడికి వత్తాసుగా మరీ ఇంతలా దిగజారి రాయాలా? దళితులు శుభ్రంగా ఉండరని.. అసలు దళితుల్లో పుట్టాలని ఎవరైనా ఎందుకు కోరుకుంటారని రకరకాల మాటలు మాట్లాడిన చంద్రబాబును ఎవరైనా మరిచిపోగలరా? పేదల్లో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలేనని భావించి... వారి కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం నెలవారీ పింఛన్‌ను వెయ్యి రూపాయల నుంచి రూ.3వేలకు పెంచుతూ వస్తున్న మాట నిజం కాదా? పింఛన్లు అందుకుంటున్న వారి సంఖ్య ఏ మేరకు పెరిగిందో కనిపించటం లేదా? వైఎస్సార్ చేయూత సహా ఇప్పుడు ఎస్సీలకు, ఇతర పేదలకు అందుతున్న పథకం చంద్రబాబు హయాంలో ఒక్కటైనా ఉందా? అసలు పేదల్ని వారి పేదరికం నుంచి బయటపడేసేందుకు బాబు హయాంలో ఒక్క అడుగైనా పడిందా? ఇపుడు ఆ ప్రయత్నం సంపూర్ణంగా జరుగుతుంటే ఒక్కనాడు కూడా కనీసం ప్రశంసించకుండా... పైపెచ్చు వాళ్లలో విభజన తెస్తూ... మాకు అందరికంటే ఎక్కువేం చేశారు? అని ఒకరిద్దరితో అనిపిస్తూ... అదే దళితుల మాటగా రెచ్చిపోయి మీ ఎల్లో ఛానెళ్లలో ప్రసారం చేస్తూ పైశాచికానందం పొందుతున్న మాట నిజం కాదా? దాన్నే మీరు కూడా అచ్చువేస్తూ అబద్ధాలను నిజం చెయ్యాలనుకుంటే సాధ్యమయ్యే పనే అనుకుంటున్నారా? అసలు ఎస్సీలకు, ఇతర బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్షేమాన్ని మీరు వేరే ఏ ప్రభుత్వంతోనైనా పోల్చగలరా? ఇంకా ఎన్నాళ్లీ అబద్ధాలు? దళితులు, బలహీనవర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటే ఓర్వలేరు!. ఇంగ్లిష్ మీడియం ద్వారా మాతృభాషను దెబ్బతీస్తున్నారంటూ పెడబొబ్బలు పెడతారు. మీ పిల్లలు, మీ చంద్రబాబు పిల్లలు మాత్రం ఇంగ్లీషు మీడియంలోనే చదువుతారు. మీ మంత్రులేమో ఇంగ్లీషు మీడియం స్కూళ్లు నడుపుతారు. కానీ బడుగుల పిల్లలకు ఇంగ్లీషు మీడియం వద్దంటూ కోర్టుల్లో మీ వందిమాగధుల చేత పిటిషన్లు వేయించటం నిజం కాదా? ఎందుకంటే బడుగుల పిల్లలు బాగా చదువుకుని మీ పెత్తందార్ల పక్కన దర్జాగా కూర్చుంటానే కదా మీ భయం? ఇళ్లు లేని బడుగు, బలహీనవర్గాలకు ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకున్నది మీరు కాదా? ఒకో ఇంటి ద్వారా దాదాపు రూ.15 లక్షల విలువైన ఆస్తిని సమకూర్చిన ప్రభుత్వాన్ని పేదలంతా నెత్తిన పెట్టుకుంటుంటే మీరు మాత్రం ఇలా విమర్శలు గుప్పిస్తుండటాన్ని ఏమనుకోవాలి? అమరావతిలో మీ పక్కన బడుగు, బలహీనవర్గాల వారుంటే సామాజిక సమతౌల్యం దెబ్బతింటుందని నిస్సిగ్గుగా కోర్టులో చెప్పుకున్నది నిజం కాదా? ఈ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ బడుగు, బలహీనవర్గాలకు మేలు చేసింది. మీకు కనీసం అలాంటి ఆలోచన కూడా రాలేదు కదా? ఇవేమీ చెయ్యకున్నా చంద్రబాబును దళితుల పాలిట దేవుడిగా ప్రచారం చేస్తున్న మీ పచ్చమీడియాను అసలు నమ్మే వారెవరైనా ఉన్నారా?ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మల అభ్యున్నతి కోసం అర్హతలున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఏటా రూ.18,750 ఇస్తోంది. బాబు హయాంలో ఇదెప్పుడైనా చూశారా? ఓవైపు ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో రాష్ట్రం శ్రీలంకలా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోదంటూ గగ్గోలు పెట్టేదీ మరోవైపు చంద్రబాబు ఫ్రీగా బెంజికార్లు ఇస్తామంటుంటే.. అది సాధ్యమేనంటూ డప్పు కొట్టేదీ మీరే. దీన్నేమనుకోవాలి? ‘మాటలే స్వీటు.. చేతలు చేటు’ అంటూ శుక్రవారం ‘ఈనాడు’ వండి వార్చిన దుర్మార్గపు కథనంలో అసలు నిజమేదైనా ఉందా? ఇదిగో చూద్దాం... కుల కార్పొరేషన్ల నిర్వీర్యం ఎక్కడ? వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసిందని ఈనాడు విషం కక్కింది. వాస్తవానికి టీడీపీ హయాంలో ఒకటే కార్పొరేషన్‌గా ఉన్న ఎస్సీ కార్పొరేషన్‌ను జగన్ ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా మార్చింది. మాల కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్‌గా విడదీసింది. వీటిద్వారా ఎస్సీల అభ్యున్నతికి, సంక్షేమానికి పెద్దపీట వేసింది. టీడీపీ హయాంలో ఒకటే కార్పొరేషన్ కాగా... దీనిద్వారా లబ్ధి కలిగింది అతికొద్ది మందికి. కానీ ఇపుడు సంతృప్త స్థాయిలో... అంటే అర్హతలున్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందుతున్నాయి. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమవుతోంది. పచ్చ దండుకు మింగుడు పడనిది ఇదే. పింఛన్ వ్యయం 227 శాతం అధికం.. చంద్రబాబు ప్రభుత్వం కేవలం 8,66,835 మంది ఎస్సీలకు నెలకు రూ.వెయ్యి చొప్పున మొత్తం రూ.4,415 కోట్లు, 3,01,242 మంది ఎస్టీలకు రూ.1,373 కోట్లు మాత్రమే ఇచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు 12,15,030 ఎస్సీలు (గత ప్రభుత్వం కంటే 18.41 శాతం ఎక్కువ)కు నెలకు రూ.2,750 చొప్పున మొత్తం రూ.14,418 కోట్లు (గత ప్రభుత్వం కంటే 227 శాతం అధిక మొత్తం) అందించింది. అలాగే ఎస్టీలకు 3,94,753 మంది (గతం కంటే ఆరు శాతం ఎక్కువ)కు రూ.4,694 కోట్లు (గతం కంటే 241 శాతం అధికం) ఇచ్చారు. దేశంలోనే మొదటి స్థానం ఎస్సీ కాంపొనెంట్ అమల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశంలోని 20 రాష్ట్రాల్లో ఎస్సీ కాంపొనెంట్ కింద చేసిన ఖర్చు కన్నా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో చేసిన ఖర్చే అధికంగా ఉండటం విశేషం. ఎస్సీ కాంపొనెంట్ ద్వారా దేశవ్యాప్తంగా 12.41లక్షల స్వయంసహాయక సంఘాలు ఏర్పాటైతే, ఒక్క మన రాష్ట్రంలోనే 8.54 లక్షల సంఘాలు ఏర్పాటయ్యాయి. భూమి కొనుగోలు పథకం ఎత్తివేసింది ఎవరు? వాస్తవం: గత టీడీపీ ప్రభుత్వం భూమి కొనుగోలు పథకానికి ఎంతమేర భూమి సేకరించిందనే వివరాలే లేవు. దీన్నిబట్టే ఈ పథకాన్ని ఎవరు ఎత్తేశారో తెలుస్తుంది. దశాబ్దాల క్రితం భూమి కొనుగోలు కోసం ఎస్సీ కార్పొరేషన్ల నుంచి రుణాలు తీసుకున్న ఎస్సీల భూమి తనఖాలో ఉండిపోయింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అలాంటి రుణాలన్నింటినీ రద్దుచేసి, వారికి ఆ భూములపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పించింది. ఎస్సీల జీవితాల్లో ఇదో మైలురాయి. ఈ ప్రభుత్వ మేలుతో 14,223 దళిత మహిళలకు 16,213 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు లభించాయి. మరో 3,57,085 మంది ఎస్సీలకు, 1,20,477 మంది ఎస్టీలకు సైతం అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు లభించాయి. ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంటి నిర్మాణాలకు గత ప్రభుత్వం ఒక్క సెంటు భూమిని కూడా కొనలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు బాసటగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సుమారు 31 లక్షలకుపైగా ఇళ్లపట్టాలు ఇస్తే అందులో 6,36,732 మంది లబ్ధిదారులు ఎస్సీ అక్కచెల్లెమ్మలే. అంటే లబ్దిదారుల్లో 20.7 శాతం. తద్వారా ఆయా కుటుంబాలకు జగన్ ప్రభుత్వం రూ.10,949 కోట్ల లబ్ధి చేకూర్చింది. అంతేకాకుండా వారి కోసం చేస్తున్న 4,18,646 ఇళ్ల నిర్మాణ రూపంలో మరో రూ.10,949 కోట్ల మేర కూడా లబ్ధి చేకూరుతోంది. ఇక 1,41,496 మంది ఎస్టీ అక్కచెల్లెమ్మలు (మొత్తం లబ్ధిదారుల్లో 4.6 శాతం) ఉన్నారు. చరిత్రలో ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో ఎస్సీ, ఎస్టీలకు అండగా నిలబడలేదు. ఎస్సీలకు 12,816 ఎకరాలు, ఎస్టీలకు 5,978 ఎకరాల అసైన్డ్ భూములపై ఈ ప్రభుత్వం పూర్తి యాజమాన్య హక్కులు కల్పించింది. హాస్టళ్లకూ నాడు – నేడు.. ఈనాడు తన కథనంలో ‘హాస్టళ్లు సంక్షోభ వసతి కేంద్రాలు’గా ఉన్నాయంటూ అబద్ధాలను అచ్చేసింది. వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత 168 సోషల్ వెల్ఫేర్ స్కూళ్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. వీటికి టీడీపీ ప్రభుత్వం మరో 21 స్కూళ్లను మాత్రమే అదనంగా చేర్చగలిగింది. ఇందులో కూడా 15 స్కూళ్లను 2019 ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు మాత్రమే... అదీ కాగితాలపైనే ప్రకటించింది. ఈ ప్రభుత్వం వచ్చాక సోషల్ వెల్ఫేర్ స్కూళ్లలో మరమ్మతుల కోసం ఇప్పటికే 64.33 కోట్లు ఖర్చు చేసింది. 39 సివిల్ వర్కుల కోసం మరో రూ.1౩౩.90 కోట్లు ఖర్చు పెట్టింది. దీంతో ఈ భవనాలన్నీ నిర్వహణలోకి వచ్చాయి. అలాగే 177 స్కూళ్లలో నాడు–నేడు పనులకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది, ఇందుకు రూ.318 కోట్లు ఖర్చు చేయనుంది. నాణ్యమైన విద్య అందుతోంది ఇప్పుడే.. ‘నాణ్యమైన విద్యకు తిలోదకాలు’ ఇచ్చారంటూ ఈనాడు మరో అబద్ధాన్ని పేర్చింది. వాస్తవానికి ఈ ప్రభుత్వం విద్యను అత్యంత ప్రాధాన్యంగా గుర్తించింది. నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను సర్వ సదుపాయాలతో తీర్చిదిద్దింది. జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మ ఒడి వంటి పథకాలను అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ, ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టింది. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేస్తోంది. ఈ పథకాల వల్ల అత్యధిక శాతం లబ్ధి పొందుతోంది.. బడుగు, బలహీనవర్గాల పిల్లలే. టోఫెల్ లాంటి ఉన్నతాదాయ వర్గాల పిల్లలకే పరిమితమైన వాటిని కూడా ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల పిల్లలకు అందుబాటులోకి తెచ్చింది. ఇటీవలే ప్రభుత్వం సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ క్రమంలో మెయిన్స్‌కు అర్హత సాధిస్తే రూ.లక్ష , ఇంటర్వ్యూలకు క్వాలిఫై అయినవారికి అదనంగా రూ.50 వేల చొప్పున ప్రోత్సాహకాలను ప్రకటించింది. పిల్లలంతా బడిలో ఉండాలనే ఏకైక ధ్యేయంతో జగనన్న అమ్మఒడి కింద ఇప్పటివరకు 8,84,131 మంది ఎస్సీ విద్యార్థుల తల్లులకు రూ.15 వేల చొప్పున రూ.5,335.7 కోట్లు అందించింది. అలాగే 2,86,379 ఎస్టీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,714.75 కోట్లు జమ చేసింది. జగనన్న వసతి దీవెన ద్వారా 5.06 లక్షల మందికిపైగా ఎస్సీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.834 కోట్లు నేరుగా వేసింది. 83 వేల మంది ఎస్టీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.135. కోట్లను జమ చేసింది. జగనన్న విద్యాదీవెన కింద రూ.5.4 లక్షల మంది ఎస్సీ విద్యార్థుల తల్లులకు రూ.2,081 కోట్లు అందించింది. అలాగే 1.11 లక్షల మంది ఎస్టీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.346 కోట్లు జమ చేసింది. ఈ మొత్తాలన్నీ అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవినీతికి చోటు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమయ్యాయి. మరింత మెరుగ్గా విదేశీ విద్యా దీవెన గత ప్రభుత్వం అమలు చేసిన విద్యోన్నతి పథకం రద్దైందని ఈనాడు గగ్గోలు పెట్టింది. కానీ గత ప్రభుత్వం హయాంలో ఈ పథకంలో జరిగిన లోపాలను, అవినీతిని, అక్రమాలను గుర్తించి ఆ స్థానంలో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రతిభ ఉన్న విద్యార్థులందరికీ సమాన అవకాశాలు దక్కేలా, ప్రతిష్టాత్మక కాలేజీల్లో సీటు సాధించిన వారికి పూర్తి స్థాయిలో ఫీజులు చెల్లించేలా పథకాన్ని సమున్నతంగా తీర్చిదిద్ది అమలు చేస్తోంది. 21 కోర్సులలో క్యూఎస్ ర్యాంకింగ్ లేదా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంక్‌ల ప్రకారం టాప్ 50లో నిలిచిన విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు గరిష్టంగా రూ.1.25 కోట్లు లేదా 100 శాతం ట్యూషన్ ఫీజును ప్రభుత్వం చెల్లిస్తోంది. మిగిలిన వర్గాలకు రూ.కోటి లేదా అసలు ట్యూషన్ ఫీజు (ఏది తక్కువ అయితే అది) చెల్లిస్తున్నారు. స్వయం ఉపాధి పథకాల కింద ► టీడీపీ ప్రభుత్వ హయాంలో 2,02,414 మందికి రూ.2,726 కోట్లు ► ఈ ప్రభుత్వం హయాంలో ఇప్పటివరకు వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత ద్వారా ఎస్సీల్లో 23,17,558 మందికి రూ.7,075.29 కోట్లు. ఎస్టీలకు 4,72,018 మందికి రూ.1,392 కోట్లు లబ్ధి చేకూరింది. ► ఎస్సీ లబ్ధిదారుల స్థిరమైన జీవనోపాధి, ఆర్థిక అభ్యున్నతి కోసం పౌర సరఫరాల సంస్థ ద్వారా 2020–21లో రాష్ట్ర ప్రభుత్వం రూ.133.67 కోట్లతో 2,300 ఫోర్ వీలర్ మినీ ట్రక్ మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ వాహనాలను ప్రజా పంపిణీ వ్యవస్థ డోర్ డెలివరీ కోసం అందించింది. జాతీయ ఎస్సీ కులాల ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్ఎస్ఎఫ్డీసీ) ద్వారా స్వయం ఉపాధి పథకం కింద రూ.63.20 కోట్లతో 1,038 యూనిట్లను అమలు చేసింది. -
తూర్పుగోదావరి జిల్లాలోని పాఠశాలల్లో నాడు నేడు
-
చకచకా డిజిటలైజేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. విద్యార్థిపై చేసే ఖర్చు భవిష్యత్ పెట్టుబడిగా భావించి, అన్ని సదుపాయాలను అందిస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఇప్పటికే 30,715 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్‌పీ)లు అందించగా, ఈ డిసెంబర్లో ఇచ్చే 32 వేల స్క్రీన్లతో కలిపి మొత్తం 63 వేలు అందుబాటులోకి రానున్నాయి. స్మార్ట్ టీవీలు 33 వేలకు చేరడంతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోను డిజిటలైజేషన్ పూర్తవుతుంది. మరోపక్క ట్యాబ్స్ పంపిణీ 10 లక్షలకు పైగా చేరుకుంటుంది. దీంతో దేశంలోనే ప్రభుత్వ విద్యలో పూర్తిస్థాయి డిజిటల్ టెక్నాలజీని అనుసరించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది. అన్ని ఉన్నత పాఠశాలల్లో ఐఎఫ్‌పీలు, ప్రాథమిక పాఠశాలలకు స్మార్ట్ టీవీల అమరిక డిసెంబర్ 21 నాటికి పూర్తి కానుంది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖలోని నాడు–నేడు కమిషనరేట్ అధికారులు ప్రణాళికసిద్ధం చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో 4,800 ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి వరకు సెక్షన్‌కు ఒకటి చొప్పున 30,715 ఐఎఫ్‌పీ స్క్రీన్లను అందుబాటులోకి తెచ్చి డిజిటల్ బోధన చేపట్టారు. ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది విద్యార్థులకు ఒక స్మార్ట్ టీవీ చొప్పున 10,038 స్మార్ట్ టీవీలను సరఫరా చేసిన విషయం తెలిసిందే. రెండో దఫాలో 32 వేల ఐఎఫ్‌పీలు, 22 వేల స్మార్ట్ టీవీలను పాఠశాలలకు అందించనుంది. -
ఓర్వలేని కళ్లన్నీ నీ మీదే తల్లీ!
ఎదగాలి నాన్నా... నువ్వింకా ఇంకా పైపైకి... ఈ లోకం గుర్తించేంత పైకి ఎదగాలి తల్లీ! దిగువ కులాల వృత్తి చట్రాల్లో బందీలై వెనుకబాటుతనాన్ని వారసత్వంగా మోసుకొస్తున్న మీ అమ్మానాన్నల కలలు ఫలించేలా... మీకు అండగా నిలబడిన మీ జగన్ మామ ఆశీస్సులు సాకారమయ్యేలా ఎదగాలి తల్లీ! అసూయా దృక్కులు నిన్ను వెన్నాడుతాయ్. భయపడకు! ఓర్వలేని తనం శాపనార్థాలు పెడుతుంది. చలించకు! పెత్తందార్లు పగబడతారు. ప్రతిఘటించు! నీ వెనుక మీ మేనమామ ఉన్నాడు. తరతరాలుగా మీ తాత ముత్తాతల దగ్గర్నుంచీ మీ అమ్మానాన్నల దాకా మిమ్మల్ని తొక్కిపెట్టి ఉంచిన పెత్తందార్లు ఇప్పుడు నీ చదువు మీద యుద్ధం ప్రకటించారు. భయం లేదులే! అభయం దొరికింది కదా... ఇక దృష్టి పెట్టి చదువు! చదువే నీ తిరుమంత్రం. చదువే నీ రణతంత్రం. అంబేడ్కర్, ఫూలే, సావిత్రీబాయి, నారాయణ గురులు ఉపదేశించిన విముక్తి మార్గం చదువు. నువ్వు అమెరికాకు వెళ్లి ఐక్యరాజ్యసమితి వేదికపై ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడుతుంటే మన పెత్తందార్లు కళ్లల్లో నిప్పులు పోసుకున్నారు తెలుసా? నువ్వు అంతర్జాతీయ యూనివర్సిటీల్లో మాట్లాడుతుంటే ఈర్ష్యతో వాళ్ల కడుపులు కుతకుతలాడాయి తెలుసా? కానీలే, ‘రానీ, రానీ, వస్తే రానీ! కోపాల్, తాపాల్, శాపాల్ రానీ’ అన్నాడు కదా శ్రీశ్రీ. నిప్పులు పోసుకున్న వాళ్ల కళ్లు పేలిపోనీ, రగిలిన కడుపులు పగిలిపోనీ, ఇప్పుడా పెత్తందార్లు మీ అమ్మానాన్నలపైనే కాదు, అండగా నిలబడిన మీ జగన్ మామ మీద, చదువుకుంటున్న మీ మీద కూడా యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధంలో గెలవాలంటే మీ కర్తవ్యం ఏమిటో తెలుసా? బాగా చదవాలి. పైపైకి ఎదగాలి. అడవులు కొండలు ఎడారులా మనకడ్డంకి అంటూ ముందుకు సాగాలి. సరిహద్దుల్నీ సముద్రాల్నీ దాటుకుంటూ వెళ్లాలి. ఆకాశాన్ని చీల్చుకుంటూ పైకెగరాలి. ఆరుద్ర పాట తెలుసుకదా! ‘‘గ్రహ రాశుల నధిగమించి, ఘనతారల పథము నుంచి, గగనాంతర రోదసిలో,గంధర్వ గోళ గతులు దాటి’’ అలా సాగిపోవాలి. ఇంతకూ పెత్తందార్లంటే ఎవరో తెలుసా చిన్నా? వాళ్లూ అందరిలాగే ఉంటారు. కోరలూ కొమ్ములూ కనిపించవు. కాకపోతే డబ్బు ఉన్నదనే అహంకారంతో కనిపించని కొమ్ములు మొలుస్తాయి. ఈ సృష్టిలో ప్రతీదీ తమకే కావాలనుకుంటుంది పెత్తందార్ల వర్గం. భూమి, గాలి, నీరు, ఆకాశం మీద కూడా వాళ్లకే హక్కు ఉన్నట్టు భావిస్తారు. పొలాలు, ఫ్యాక్టరీలు, డబ్బు, అధికారం, హోదా అన్నీ వాళ్లకే ఉండాలి. మంచి చదువులు చదివితే తెలివి తేటలొస్తాయి. కనుక మంచి చదువులు తమ పిల్లలకే ఉండాలి. పేద పిల్లలు కూడా మంచి చదువులు చదివితే తమ పిల్లలతో సమానంగా ఉంటారు. మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు. తమకు నౌకర్లు, చాకర్లు, డ్రైవర్లు, వంట వాళ్లు దొరకరు. సినిమా వాళ్లకు ‘పవర్ స్టార్’.. ‘పంచర్స్టార్’ అని వెర్రికేకలు వేసే ఫ్యాన్స్ దొరకరు. ఈ కారణాల వల్ల ఇంగ్లీష్ మీడియంలో చదివితే చెడిపోతా రని వాళ్లు ప్రచారంలో పెడుతున్నారు. మాతృభాషలో విద్యాబోధన ఆవశ్యక తను గురించి సుద్దులు చెప్పడానికి కొందరు పెద్దల్ని రంగంలోకి దించుతారు. ఇప్పటికే దించారు కూడా! మాతృభాష లోనే పాఠాలు నేర్చుకుంటే జ్ఞానం పెరుగు తుందనీ, సులభంగా అర్థమవుతాయనీ చెబుతారు. అంతేగాకుండా అంతా ఆంగ్ల మీడియంలో చదివితే తెలుగు సంస్కృతి దెబ్బతింటుందని వాపోతారు. అలాంటి వాళ్లు మీకు తగిలినప్పుడు రెండు ప్రశ్నలు వేయండి. ఒకటి – ఇప్పుడు ఇంగ్లీషులో చదవకపోతే పై చదువులకు వెళ్లినకొద్దీ ఇంగ్లీషులోనే చదవాల్సిన పాఠాలకు ఎలా అలవాటు పడతామని అడగాలి. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ఎలా నెగ్గుతామని అడగాలి. మీరు పై చదువులు పెద్దగా చద వొద్దని కదా వారి ఉద్దేశం. అందుకని మీరా ప్రశ్న అడగ్గానే గతుక్కుమంటారు. ఇక రెండో అంశం – ‘అయ్యా! గత యాభయ్యేళ్లుగా మా అమ్మానాన్నలు, తాతముత్తాతలు తెలుగులోనే చదివి, తెలుగు భాషకు సేవలు చేసి అలసిపోయారు. ఇప్పుడు కొంతకాలం మేము ఇంగ్లీషులో చదువుకుంటాము. మీ పెత్తందార్లంతా ఇంతకాలం ఇంగ్లీషు చదువులు చదివారు కదా! ఇప్పుడు పిల్లల్ని మనవల్నీ తెలుగు మీడియంలో చదివించండి. వారు తెలుగు భాషను రక్షిస్తారు. మేం ఇంగ్లీష్ చదువుకొని అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతామ’ని చెప్పండి. ఏమంటారో చూద్దాం. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యాన్నిస్తూ ‘నాడు – నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి మీకు తెలుసు. ఈ కార్యక్రమం ఫలితంగా శిథిలా వస్థకు చేరిన సర్కారు బళ్లు మళ్లీ చిగురించాయి. ప్రైవేట్ స్కూళ్లను మించి సకల హంగులు సంతరించుకున్నాయి. మీకిస్తున్న బూట్లు, బ్యాగ్, బెల్ట్, యూనిఫామ్ అన్నీ బెస్ట్‌గా ఉండాలని స్వయంగా సీఎం హోదాలో ఉన్న మీ మేనమామ స్వయంగా సెలెక్ట్ చేసి పంపిస్తున్నారు. ‘గోరుముద్ద’ మెనూ కూడా ఆయనే తయారు చేశారు. కూలినాలి చేసుకునే పేద తల్లులు వారి బిడ్డల్ని స్కూళ్లకు పంపించేలా ప్రోత్సహించడం కోసం ‘అమ్మ ఒడి’ పేరుతో నగదు అందజేస్తున్న సంగతి కూడా మీకు తెలిసిందే. ఈ మొత్తం కార్యక్రమాల్లో భాగంగా మూడేళ్ల కిందనే ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం బోధనను ప్రారంభించారు. ఏటా ఒక్కో తరగతిని పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు తొమ్మిదో తరగతి వరకు అంతా ఇంగ్లీష్ మీడియమే. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభించిన ఆదిలోనే పెత్తందారీ ప్రతిఘటన మొదలైంది. తెలుగు భాషోద్యమం పేరుతో ఓ నకిలీ ఉద్యమాన్ని ప్రారంభించడానికి యెల్లో మీడియాతో కలిసి చంద్రబాబు ప్లాన్ చేశారు. కానీ, క్షేత్రస్థాయి నుంచి వ్యతిరేకత వస్తుందన్న సమాచారంతో కాస్త వెనక్కు తగ్గారు. కొద్దిరోజుల విరామం తర్వాత మళ్లీ చంద్రబాబు మొదలుపెట్టారు. ఈసారి ప్రత్యక్షంగా పేద తల్లితండ్రుల మెదళ్లలోకి దూరాలని ప్రయత్నించారు. శ్రీకాకుళం నుంచి రోడ్డు మార్గం ద్వారా వస్తున్న చంద్రబాబుకు విశాఖ సమీపంలో ఓ పదిమంది కూలీలు రోడ్డు పక్కన కనిపించారు. వెంటనే వాహనాన్ని ఆపేసి వాళ్ల మధ్యన కూర్చున్నారు. ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత ‘‘ఆయనేదో (జగన్) ఇంగ్లీష్ మీడియం అంటున్నాడు. ఏమొస్తది ఇంగ్లీష్ మీడియంతో! కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోద్ది. మన పిల్లలు మొద్దబ్బాయి లుగా తయారవుతారు...’’ అంటూ ఇంకేదో చెప్పబోయారు. అక్కడున్న జనమంతా అసహ నంతో ‘జై జగన్’ అని నినాదాలు చేయడంతో చల్లగా జారుకున్నారు. పెత్తందార్ల కూటమికి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయకుడు. ఆయన సమన్వయంలోనే యెల్లో మీడియా పనిచేస్తున్నది. ఈ మీడియా సమూహంలో అతి ముఖ్యుడు రామోజీరావు. ఆయన చంద్రబాబుకు గురుపాదుల వంటివారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఎకరాల విశాల సామ్రాజ్యాన్ని అక్రమ పద్ధతుల్లో విస్తరించారు. ఈ విస్తరణలో భాగంగా ఆయన చట్టాలను కూడా యథేచ్ఛగా ఉల్లంఘించారు. ఆయనకు ‘ఈనాడు’ అనే పత్రిక, ‘ఈటీవీ’ పేరుతో చానళ్లున్నాయి. తాను తెలుగు కోసమే పుట్టినట్టు, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసమే గాలి పీల్చుకుంటున్నట్టు ఆయన డప్పు వేయించుకుంటారు. ఆయన స్థాపించిన ఫిలిం సిటీ చేరువలో కొండల మీద రమాదేవి పబ్లిక్ స్కూల్ పేరుతో ఒక పాఠశాలను స్థాపించారు. అది మాత్రం పక్కా ఇంగ్లీష్ మీడియం, సెంట్రల్ సిలబస్. తెలుగు మీడియం పాఠశాల పెడితే భారీగా ఫీజులు కట్టి ఎవరు చదు వుకుంటారు? కనక తనకు కలెక్షన్ కోసం సంపన్నులు చదువుకునే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండాలి. పేద బిడ్డలు మాత్రం కనీస వసతులు లేని ప్రభుత్వ బడుల్లో తెలుగు మీడియం చదవాలి. ఇదీ వారి నీతిసారం. ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ గురుపాదులవారు రాజ గురువుగా చక్రం తిప్పిన రోజుల్లోనే ప్రభుత్వరంగంలోని విద్యా వ్యవస్థ శిథిలమైపోయి వీథికో ప్రైవేట్ స్కూల్, ఊరికో కార్పొరేట్ కాలేజీ బ్రాంచీలు విస్తరించాయి. చదువు అంగడి సరుకుగా రూపాంతరం చెందింది. పేదలు డ్రాపౌట్లుగా మిగిలి పోయారు. ఫలితంగా రెండు తరాల పేదలు నాణ్యమైన చదువుకు నోచుకోక జీవన ప్రమా ణాలను కోల్పోవలసి వచ్చింది. ఈ మానవ కల్పిత మహా సంక్షోభం మీద పరిశోధన జరగవలసిన అవసరం ఉన్నది. ఇంగ్లీష్ మీడియం విద్యకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడేందుకు చంద్రబాబు, ఆయన ముఠా వెనుకడుగు వేసినా పరోక్ష ప్రయత్నాలను మాత్రం ఆపలేదు. తెలుగు భాషా సంస్కృతుల ముసుగులో వివిధ వేదికల ద్వారా ఇంగ్లీష్ మీడియంపై విషం చల్లుతూనే వస్తున్నారు. రాజ్యాంగబద్ధ పద వుల్లో పనిచేసిన పెద్దమనుషుల సేవలను కూడా ఇందుకోసం విరివిగా వినియోగించు కున్నారు. అయినా ఫలితం కలుగలేదు. ప్రజల సంపూర్ణ మద్దతుతో ఇంగ్లీషు మీడియంతో పాటు ఆనక విద్యాసంస్కర ణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేసిన తర్వాత, ఐఎఫ్‌పీ స్క్రీన్లను అందుబాటులోకి తెచ్చిన తర్వాత ఆ యా విద్యా ర్థుల నాణ్యతా ప్రమాణాలు పెరిగినట్టుగా అసెస్మెంట్ పరీక్షల్లో ఉపాధ్యా యులు గుర్తించారు. ఈ స్ఫూర్తితో దశలవారీగా ఐబీ సిలబస్‌ను కూడా అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఇక లాభం లేదనుకున్న పెత్తందారీ ముఠా ఎన్నికలకు ఇంకో ఆరు నెలల సమయం ఉండగా ఆఖరు కృష్ణుడిని రంగంలోకి దించింది. పవన్ కల్యాణ్:ది లాస్ట్ కృష్ణా తన సహచరుడు నాదెండ్ల మనోహర్‌తో కలిసి శుక్రవారం నాడు ఇంగ్లీష్ మీడియంపై, విద్యాసంస్కరణలపై విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి రాగానే ఈ విద్యావిధానంపై కేసులు పెట్టి దీంతో సంబంధం ఉన్న వారందరినీ జైలుకు పంపుతారట! తమ పిల్లల్ని ఏ స్కూల్లో, ఏ మీడి యంలో, ఏ సిలబస్‌తో చదివించారో కూడా పవన్, మనోహర్‌లు ఈ సమావే శంలో చెబితే బాగుండేది. కానీ చెప్పలేదు. పవన్ హెచ్‌ఎమ్‌వి రికార్డులాంటోడు. అందులో రికార్డయిందే చెప్పగలడు. కానీ, పేద విద్యార్థుల ప్రగతికి ఉద్దేశించిన ఇంగ్లీష్ మీడియంపై యుద్ధం ప్రకటించి తాను ఏ వర్గం తరఫున పనిచేస్తున్నాడో చాటి చెప్పుకున్నాడు. లంకలో పుట్టిన ప్రతివాడూ రాక్షసుడే అన్నట్టు ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించే ప్రతివాడూ పెత్తందార్ల తాబేదారే! నీవారెవరో పరవారెవరో గుర్తించడానికి ఇది మాత్రమే లిట్మస్ టెస్ట్ తల్లీ! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
వరల్డ్ క్లాస్ విద్య
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల ప్రొఫైళ్లను సంపూర్ణంగా మారుద్దామని అధికార యంత్రాంగానికి సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రైవేట్ స్కూళ్ల కంటే ఉన్నతంగా తీర్చిదిద్దుదామన్నారు. ఈ క్రమంలో ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ తరగతి గదులు, నాడు–నేడు పనులతోపాటు ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ) సిలబస్‌ను అందుబాటులోకి తేవడం, నిత్యం టోఫెల్ శిక్షణా తరగతులను నిర్వహించడం ద్వారా ప్రభుత్వ స్కూళ్లను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణల అమలు, పురోగతిపై సీఎం జగన్ గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టోఫెల్ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధతపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రస్తుతం వారంలో 3 రోజుల పాటు మూడు తరగతుల చొప్పున శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు పేర్కొనగా ఇకపై ప్రతి రోజూ టోఫెల్ శిక్షణకు ఒక పీరియడ్ కేటాయించేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. తద్వారా విద్యార్థులు క్రమంగా నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్‌ను ప్రవేశపెట్టడంపై సంపూర్ణ మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు. దశలవారీగా ఐబీ సిలబస్‌ను అమలు చేసేందుకు పూర్తి స్థాయిలో అధ్యయనం నిర్వహించాలని సూచించారు. ప్రస్తుతం అనుసరిస్తున్న సిలబస్‌ను ఐబీతో అనుసంధానిస్తూ ఈ ప్రక్రియ సజావుగా, సులభంగా జరిగేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. విద్యాశాఖలో సంస్కరణల అమలు, పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్యాబ్‌ల పంపిణీ.. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులు, తరగతి ఉపాధ్యాయులకు రెండో విడత ట్యాబుల పంపిణీకి సిద్ధం కావాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లోని డిజిటిల్ అసిస్టెంట్లతో డివైజ్‌ల వినియోగంపై విద్యార్థులకు శిక్షణ ఇప్పించాలి. నాడు–నేడు రెండో దశ పనులు పూర్తయిన అన్ని పాఠశాలల్లో కూడా డిసెంబర్ కల్లా ఐఎఫ్‌పీ బోర్డులు, స్మార్ట్ టీవీలు ఏర్పాటు పూర్తి కావాలి. జూనియర్ కాలేజీలుగా మార్చేందుకు గుర్తించిన హైస్కూళ్లలో ఐఎఫ్‌పీ సహా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. అత్యంత నాణ్యంగా ఆహారం.. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా పౌష్టికాహారాన్ని అందించేందుకు అధికంగా నిధులు వెచ్చిస్తున్నాం. ఆరోగ్యకరమైన, రుచికరమైన మెనూ తీసుకొచ్చాం. రాగిజావ అందిస్తున్నాం. వీటిల్లో ఏ ఒక్కటీ క్వాలిటీ తగ్గకూడదు. విద్యార్థులకు పెట్టే భోజనం నూటికి నూరుశాతం నాణ్యతగా ఉండాల్సిందే. పాఠశాలల్లో విద్యార్థులు తినే భోజనంపై ప్రతి రోజూ అధికారుల పర్యవేక్షణ మరింత మెరుగ్గా ఉండాలి. ఈమేరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) పాటించాలి. బలహీనంగా, రక్తహీనతతో బాధపడుతున్న విద్యార్థులను ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం ద్వారా గుర్తించి వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. నిత్యం పౌష్టికాహారం, సమయానికి మందులు అందేలా చర్యలు తీసుకోవాలి. ఫలించిన స్పెషల్ డ్రైవ్ ప్రాథమిక విద్యలో 100 శాతం పిల్లలు బడిలోనే రాష్ట్రంలో చిన్నారులను విద్యవైపు నడిపించేలా చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ సత్ఫలితాలను ఇచ్చిందని అధికారులు సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తెచ్చారు. ప్రాథమిక విద్యలో నూటికి నూరు శాతం పిల్లలు బడిలోనే ఉన్నారని వివరించారు. సీనియర్ సెకండరీ విభాగంలో 96.94 శాతం మంది, హయ్యర్ సెకండరీ విభాగంలో 74.9 శాతం స్కూళ్లలోనే ఉన్నట్టు తెలిపారు. అమ్మఒడి పథకంతోపాటు 10, 12వ తరగతులు ఫెయిల్ అయిన విద్యార్థులకు రీ అడ్మిషన్, స్కిల్ సెంటర్లలో చేర్పించి వారికి ఓపెన్ స్కూల్ అడ్మిషన్, వలంటీర్లు, సచివాలయాల ద్వారా నిర్వహించిన ప్రచారంతో సత్ఫలితాలు వచ్చాయన్నారు. 1 నుంచి 12వ తరగతి వరకు ప్రస్తుతం 83,52,738 మంది విద్య అభ్యసిస్తున్నట్టు వెల్లడించారు. తొలి విడతగా నిర్దేశించుకున్న మేరకు 4,804 స్కూళ్లలో 30,213 ఐఎఫ్‌పీ ప్యానళ్లు, 6,515 స్కూళ్లలో స్మార్ట్ టీవీలను బిగించామని అధికారులు వివరించారు. ఇప్పటికే ఐఎఫ్‌పీ, స్మార్ట్ టీవీల వినియోగింపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామన్నారు. 91.33 శాతం మంది ఇంగ్లీషు మీడియంలోనే పరీక్షలు ఐఎఫ్‌పీ ప్యానళ్లు ఏర్పాటు చేసిన చోట రెండు రకాల ఇంటర్నెట్ సర్వీసులు అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. స్మార్ట్ ఫోన్లో, ఫోన్ ఎస్డీ కార్డులో, యూట్యూబ్‌లో, ట్యాబుల్లో, ఐఎఫ్పీలో, అధీకృత వెబ్సైట్లలో, ఇ–పాఠశాల డీటీహెచ్‌ల్లో ఇలా ఎందులోనైనా ఒకే విధమైన పాఠ్యప్రణాళిక, ఒకే పాఠ్యాంశాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచామన్నారు. ఆగస్టులో నిర్వహించిన మొదటి అసెస్మెంట్లో మూడో తరగతి నుంచి 9 వతరగతి వరకూ దాదాపు 91.33 శాతం మంది పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాశారని చెప్పారు. 6 నుంచే ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇతర అత్యాధునిక టెక్నాలజీపై సమీక్షలో అధికారులు పలు అంశాలను సీఎంకు నివేదించారు. ఆరో తరగతి నుంచి కృత్రిమ మేధను ప్రత్యేక సబ్జెక్టుగా బోధించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. శిక్షణ, బోధన కార్యక్రమాలకు సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజీలను అనుసంధానం చేయడంతో పాటు ఏఐపై పాఠ్యాంశాలు బోధించేందుకు ప్రత్యేకంగా యాప్ రూపొందిస్తున్నట్టు వివరించారు. అవసరమైన చోట అదనపు గదులు, సదుపాయాలు.. ప్రభుత్వ పాఠశాలల్లో రెండో విడత నాడు–నేడు పనులు చురుగ్గా జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలను అందుబాటులోకి తెస్తుండగా వాటిల్లో ఒకటి బాలికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొత్తం 679 మండలాలకుగాను 473 మండలాల్లో బాలికలు, కో–ఎడ్యుకేషన్ కాలేజీలను అందుబాటులోకి తెచ్చామన్నారు. మిగిలిన చోట్ల హైస్కూళ్లను ప్లస్ టూగా మార్చేందుకు జాబితా రూపొందిస్తున్నామన్నారు. అవసరమైన మేరకు అదనపు తరగతి గదుల నిర్మాణం, మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు తెలిపారు. సమీక్షలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ (మౌలిక వసతుల కల్పన) కాటమనేని భాస్కర్, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ నిధి మీనా, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ సి.ఎన్ దీవాన్‌రెడ్డి, ఏపీఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ నాగార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు.