సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మనబడి నాడు–నేడు కార్యక్రమంలో చేపట్టే నిర్మాణ పనుల వద్ద భద్రతా చర్యలు కట్టుదిట్టంగా చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్) కాటమనేని భాస్కర్ అధికారులకు స్పష్టం చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు తావుండరాదని పేర్కొన్నారు.
నాడు–నేడు రెండోవిడత కింద రూ.8 వేలకోట్లతో 22,344 స్కూళ్లలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతున్న సంగతి తెలిసిందే. వీటిలో అదనపు తరగతి గదులు, కిచెన్‌షెడ్లు, భవనాలు తదితర నిర్మాణ పనులు కూడా ఎక్కువగా ఉన్నాయి. పాఠశాలల్లో పిల్లలు, ఇతర వ్యక్తులు ప్రమాదాలకు గురికాకుండా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు.
నాడు–నేడు కింద చేపడుతున్న పనులు ఇవే..
నాడు–నేడు రెండోవిడతలో ప్రభుత్వం 22,344 స్కూళ్లలో 9 రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది.
♦నిరంతర నీటిసరఫరాతో మరుగుదొడ్లు
♦ఫ్యాన్లు, ట్యూబులైట్లతో విద్యుత్తు సదుపాయం
♦మంచినీటి సదుపాయం n విద్యార్థులు, టీచర్లకు ఫర్నిచర్
♦స్కూలు అంతటికీ రంగులు
♦మేజర్, మైనర్ రిపేర్లు n గ్రీన్ చాక్‌బోర్డులు
♦ఇంగ్లిష్ ల్యాబ్‌లు, అదనపు తరగతి గదులు n స్కూళ్లకు ప్రహరీలు
నాడు–నేడు పనులు జరగుతున్న ప్రాంతాల్లో తప్పనిసరిగా తీసుకోవలసిన జాగ్రత్తలు
♦హెడ్మాస్టరు, ఇంజనీర్, పేరెంట్సు కమిటీ సభ్యులు కలిసి పాఠశాల ఆవరణ మొత్తాన్ని తిరిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను, వ్యక్తులకు గుచ్చుకునేలా ప్రమాదకరంగా ఉన్న వస్తువులను గుర్తించాలి.
♦నిర్మాణ ప్రాంతం వైపు ఇతరులు వెళ్లకుండా దాన్ని ప్రత్యేకించేలా ఫెన్సింగ్, సేఫ్టీ టేప్‌లు ఏర్పాటు చేయాలి.
♦విద్యార్థులు, సిబ్బంది స్కూలులోకి సురక్షితంగా వెళ్లేలా మార్గాలు ఏర్పాటు చేయాలి.
♦నిర్మాణ సామగ్రి, మిషనరీ, ఇతర మెటీరియల్‌ను స్కూలులోకి తెప్పించడం, నిర్మాణ వ్యర్థాలను స్కూలునుంచి బయటకు పంపించడం వంటి పనులను స్కూలు ప్రారంభంగాకముందు లేదా తరగతులు ముగిసిన తరువాత మాత్రమే చేయాలి.
♦ ప్రమాదానికి ఆస్కారముండే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలి.
♦పాత నిర్మాణాలను కూల్చే సమయంలో పక్కన ఉన్న భవనాలకు నష్టం జరగని విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్మాణాల ప్రాంతాల్లో గుంతలు తవ్వితే వాటిచుట్టూ కంచె ఏర్పాటు చేయాలి. బ్లూసీట్లు, హోర్డింగులు పెట్టాలి.
♦పనిచేసే ప్రతి కార్మికుడు హెల్మెట్, బూట్లు, గ్లవుజ్‌లు, మాస్కులు వంటి వ్యక్తిగత రక్షణ పరికరాలు ధరించేలా చూడాలి. నిర్మాణ ప్రాంతాల్లో ఫస్ట్ ఎయిడ్ పరికరాలను అందుబాటులో ఉంచాలి.
♦నిర్మాణ ప్రాంతాల్లో గుంపులుగా చేరకుండా చూడాలి.
♦ప్రమాదాలు జరిగే పక్షంలో అత్యవసర నిష్క్రమణ మార్గాలను ముందుగానే ప్లాన్ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment