guideline
-
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అదనపు చక్కెర సంకలితాలతో వచ్చే ప్రోటీన్ సప్లిమెంట్లు వినియోగించొద్దని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ నేషన్ ఇన్స్టిట్యూట్ఆప్ న్యూట్రిషియన్(ఐపీఎంఆర్-ఎన్ఐఎన్) పిలుపునిచ్చింది. వీటివల్ల మూత్రపిండాలకు ఎముకలకు హాని కలుగుతుందని, ఆరోగ్యకరమైన వ్యక్తులకు వీటి అవసరం లేదని పేర్కొంది. ప్రోటీన్ల అవసరాన్ని భర్తీ చేసుకునేలా సమతుల్యమైన ఆహార సరిపోతుందని తెలిపింది. పైగా అందుకోసం కొత్త ఆహార మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. చాలామంది సహజసిద్ధంగా సమతుల్య ఆహారంలో వచ్చే పోషకాలను వదిలిపెట్టే కృత్రిమంగా ప్రోటీన్ పౌడర్లు, ప్రోటీన్ సప్లిమెంట్లను ఆశ్రయిస్తున్నారని డైటీషియన్లు చెబుతున్నారు. నిజానికి ఈ ప్రోటీన్ సప్లిమెంట్లన్నీ గుడ్లు, పాలు, పాల విరుగుడు లేదా సోయా, బఠానీలు లేదా బియ్యం వంటి మొక్కల మూలాలతోనే తయారు చేస్తారని అన్నారు. ఈ చక్కెర సంకలితాలతో కూడిన ఈ ప్రోటీన్ సట్లు మూత్రపిండాలు, ఎముకల ఆరోగ్యానికి తీవ్రమైన హానిని కలిగిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. పప్పుధాన్యాలు, పప్పులు, గింజలు, గుడ్లు, పౌల్ట్రీ, చేపలు మొదలైనవి అన్ని వయసుల వారికి కావాల్సిన ప్రోటీన్లను అందిస్తాయని అన్నారు. అలాగే ఏ రకమైన ప్రొటీన్ పౌడర్లు లేదా సప్లిమెంట్లను ఇవ్వడానికి ముందు ఒక వ్యక్తికి ప్రోటీన్ ఎంత మేర అవసరం అనేది అంచనా వేసి సదరు క్లినిక్ లేదా న్యూటీషియన్ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. మంచి నాణ్యమైన ప్రోటీన్ పొందడానికి 3:1 నిష్పత్తిలో పప్పులతో కూడిన తృణధాన్యాల కలయిక శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు అందజేస్తాయని అన్నారు. ఆహారం ద్వారా తీసుకునే ప్రోటీన్ కండరాల నష్టాన్ని నివారిస్తుందని అన్నారు. అలాగే వినియోగించిన ప్రోటీన్‌ను సమర్థవంతంగా వినియోగించుకునేలా తగిన శారీరక శ్రమ కూడా ఉండాలని డైటీషియన్లు సూచించారు. సమతుల్య ఆహారం శరీర పనితీరుకు అవసరమైన 20 ముఖ్యమైన అమైనో ఆమ్లాల అవసరాన్ని తీరుస్తుందని చెప్పారు. ఇక మన శరీరం సంశ్లేషణ చేయలేని ఈ అమైనో ఆమ్లాలలో కొన్నింటిని పొందడానికి, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ప్రోటీన్ వంటి విభిన్న ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా ముఖ్యం అని ఐపీఎంఆర్-ఎన్ఐఎన్ పేర్కొంది. సాదారణ ఆరోగ్యవంతమైన వ్యక్తులకు ప్రోటీన్ సప్లిమెంట్లను సిఫార్సు చెయ్యకూడదని పేర్కొంది. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన రోగుల స్థితిని అనుసరించి వైద్య నిపుణులు ప్రోటీన్ సప్లిమెంట్లను సిఫార్సు చేయాలని నూట్రిషియన్లు చెబుతున్నారు.(చదవండి: ఇన్స్టంట్ నూడుల్స్ మంచివి కావా? తింటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందా?) -
మనబడి నాడు-నేడు పనులు.. ఏపీ సర్కార్ మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మనబడి నాడు–నేడు కార్యక్రమంలో చేపట్టే నిర్మాణ పనుల వద్ద భద్రతా చర్యలు కట్టుదిట్టంగా చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్) కాటమనేని భాస్కర్ అధికారులకు స్పష్టం చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు తావుండరాదని పేర్కొన్నారు. నాడు–నేడు రెండోవిడత కింద రూ.8 వేలకోట్లతో 22,344 స్కూళ్లలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతున్న సంగతి తెలిసిందే. వీటిలో అదనపు తరగతి గదులు, కిచెన్షెడ్లు, భవనాలు తదితర నిర్మాణ పనులు కూడా ఎక్కువగా ఉన్నాయి. పాఠశాలల్లో పిల్లలు, ఇతర వ్యక్తులు ప్రమాదాలకు గురికాకుండా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. నాడు–నేడు కింద చేపడుతున్న పనులు ఇవే.. నాడు–నేడు రెండోవిడతలో ప్రభుత్వం 22,344 స్కూళ్లలో 9 రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. ♦నిరంతర నీటిసరఫరాతో మరుగుదొడ్లు ♦ఫ్యాన్లు, ట్యూబులైట్లతో విద్యుత్తు సదుపాయం ♦మంచినీటి సదుపాయం n విద్యార్థులు, టీచర్లకు ఫర్నిచర్ ♦స్కూలు అంతటికీ రంగులు ♦మేజర్, మైనర్ రిపేర్లు n గ్రీన్ చాక్‌బోర్డులు ♦ఇంగ్లిష్ ల్యాబ్‌లు, అదనపు తరగతి గదులు n స్కూళ్లకు ప్రహరీలు నాడు–నేడు పనులు జరగుతున్న ప్రాంతాల్లో తప్పనిసరిగా తీసుకోవలసిన జాగ్రత్తలు ♦హెడ్మాస్టరు, ఇంజనీర్, పేరెంట్సు కమిటీ సభ్యులు కలిసి పాఠశాల ఆవరణ మొత్తాన్ని తిరిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను, వ్యక్తులకు గుచ్చుకునేలా ప్రమాదకరంగా ఉన్న వస్తువులను గుర్తించాలి. ♦నిర్మాణ ప్రాంతం వైపు ఇతరులు వెళ్లకుండా దాన్ని ప్రత్యేకించేలా ఫెన్సింగ్, సేఫ్టీ టేప్‌లు ఏర్పాటు చేయాలి. ♦విద్యార్థులు, సిబ్బంది స్కూలులోకి సురక్షితంగా వెళ్లేలా మార్గాలు ఏర్పాటు చేయాలి. ♦నిర్మాణ సామగ్రి, మిషనరీ, ఇతర మెటీరియల్‌ను స్కూలులోకి తెప్పించడం, నిర్మాణ వ్యర్థాలను స్కూలునుంచి బయటకు పంపించడం వంటి పనులను స్కూలు ప్రారంభంగాకముందు లేదా తరగతులు ముగిసిన తరువాత మాత్రమే చేయాలి. ♦ ప్రమాదానికి ఆస్కారముండే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు పెట్టాలి. ♦పాత నిర్మాణాలను కూల్చే సమయంలో పక్కన ఉన్న భవనాలకు నష్టం జరగని విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్మాణాల ప్రాంతాల్లో గుంతలు తవ్వితే వాటిచుట్టూ కంచె ఏర్పాటు చేయాలి. బ్లూసీట్లు, హోర్డింగులు పెట్టాలి. ♦పనిచేసే ప్రతి కార్మికుడు హెల్మెట్, బూట్లు, గ్లవుజ్‌లు, మాస్కులు వంటి వ్యక్తిగత రక్షణ పరికరాలు ధరించేలా చూడాలి. నిర్మాణ ప్రాంతాల్లో ఫస్ట్ ఎయిడ్ పరికరాలను అందుబాటులో ఉంచాలి. ♦నిర్మాణ ప్రాంతాల్లో గుంపులుగా చేరకుండా చూడాలి. ♦ప్రమాదాలు జరిగే పక్షంలో అత్యవసర నిష్క్రమణ మార్గాలను ముందుగానే ప్లాన్ చేయాలి. -
మార్గదర్శకం కావాలి
నీతి ఆయోగ్‌కు ప్రధాని మోదీ పిలుపు న్యూఢిల్లీ: దేశంలో సమూల మార్పులు తెచ్చేలా వచ్చే 15 ఏళ్ల కోసం దేశాభివృద్ధికి దార్శనిక పత్రం రూపొందించాలని నీతి ఆయోగ్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. స్వల్ప మార్పులకు కాలం ఎప్పుడో చెల్లిపోయిందంటూ.. 21వ శతాబ్దంలో దేశ అభివృద్ధికి పునాది వేయటానికి మార్గదర్శక ప్రణాళిక కావాలన్నారు. ఆయన గురువారం నీతి ఆయోగ్ సభ్యులను కలసి ముచ్చటించారు. ‘‘సమూల మార్పు తక్షణావసరం. గత మూడు దశాబ్దాల్లో సాంకేతికత అనేది మార్పుకు చోదకశక్తిగా ఆవిర్భవించింది. ఈ మార్పు వేగం ఆగదు. ప్రజల జీవితాలను మెరుగుపరచటానికి సమూల మార్పును అందించే సాహసం, సామర్థ్యం ప్రభుత్వానికి ఉన్నాయి’’ అని అన్నారు. భారత సహజ, మానవ వనరులను తెలివిగా వినియోగించుకోవటం ఈ మార్పుకు కేంద్ర బిందువుగా ఉంటుందన్నారు. ఖనిజ సంపద, అపారమైన సౌరశక్తి సామర్థ్యం, అంతంతమాత్రమే వినియోగించుకుంటున్న తీర ప్రాంతాలను ఉదాహరణలుగా చూపారు. వ్యవసాయరంగంలో.. కేవలం వ్యవసాయ ఉత్పాదకతను పెంచటంపైన మాత్రమే కాకుండా.. ఉజ్వల గ్రామీణ ఆర్థికవ్యవస్థ సమగ్ర అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఆహార శుద్ధి రంగం ప్రాధాన్యతను.. అందులో గిడ్డంగుల అభివృద్ధి, సాంకేతికత వినియోగం ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. సుపరిపాలనకు సామర్థ్యాలను నిర్మించుకోవాల్సిన అవసరాన్ని ఉద్ఘాటిస్తూ.. సమాచార వివరాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాల్సిన ప్రాధాన్యతను ప్రముఖంగా ప్రస్తావించారు. ‘ప్రయోగాలు చేసే వ్యక్తిని నేను. నాకు ఆత్మవిశ్వాసముంది’ అని ప్రధానిపేర్కొన్నట్లు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా తెలిపారు. -
అంబేడ్కర్ విద్యానిధి మార్గదర్శకాల్లో సవరణ
హైదరాబాద్: ఎస్సీ విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సులను అభ్యసించేందుకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి మార్గదర్శకాల్లో రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేందుకు విద్యార్థుల కుటుంబ ఆదాయం (అభ్యర్థితో సహా) అన్ని వనరులు కలుపుకుని రూ.2 లక్షలకు లోబడి ఉండాలని సవరించింది. అదేవిధంగా టోఫెల్‌కు-80, ఐఈఎల్టీఎస్-6.5, జీఆర్ఈ-280, జీమాట్-550 కనీస స్కోర్‌ను సాధించి ఉంటేనే అర్హులవుతారని సవరించింది. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ ఉత్తర్వులు జారీచేశారు.