హైదరాబాద్: ఎస్సీ విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సులను అభ్యసించేందుకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి మార్గదర్శకాల్లో రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేందుకు విద్యార్థుల కుటుంబ ఆదాయం (అభ్యర్థితో సహా) అన్ని వనరులు కలుపుకుని రూ.2 లక్షలకు లోబడి ఉండాలని సవరించింది. అదేవిధంగా టోఫెల్‌కు-80, ఐఈఎల్‌టీఎస్-6.5, జీఆర్‌ఈ-280, జీమాట్-550 కనీస స్కోర్‌ను సాధించి ఉంటేనే అర్హులవుతారని సవరించింది. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ ఉత్తర్వులు జారీచేశారు.