సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసనసభ మంగళవారం 14 సవరణ బిల్లులను మూజువాణి ఓటుతో ఆమోదించింది. వీటిలో ఉద్యాన మొక్కల పెంపకం నియంత్రణ బిల్లు నుంచి మున్సిపల్ కార్పొరేషన్ల సవరణ బిల్లు వరకు ఉన్నాయి. మరో రెండు బిల్లులు.. ఏపీ మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ (సవరణ) బిల్లును, సీఎం వైఎస్ జగన్ తరఫున ఏపీ సినిమా (నియంత్రణ), సవరణ బిల్లు–2021ను మంత్రి పేర్ని నాని సభలో ప్రవేశపెట్టారు.
శాసనసభ ఆమోదించిన బిల్లులు..
- మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టిన ఏపీ హార్టికల్చర్ నర్సరీల నియంత్రణ సవరణ బిల్లు–2021
- మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తరఫున మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టిన ఏపీ పంచాయతీరాజ్ (సవరణ) బిల్లు–2021, ఏపీ సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్ (ఎస్‌హెచ్‌జీ) ఉమెన్ కో– కంట్రిబ్యూటరీ పెన్షన్ (సవరణ) బిల్లు–2021; మున్సిపల్ కార్పొరేషన్స్ (సవరణ) బిల్లు–2021. పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రవేశపెట్టిన ఏపీ బొవైన్ బ్రీడింగ్ (పశు సంతతి) (ఉత్పత్తి నియంత్రణ, పశు వీర్య అమ్మకం, కృత్రిమ గర్భోత్పత్తి సేవలు) బిల్లు–2021
- ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రవేశపెట్టిన ఏపీ భూహక్కుల, పట్టాదార్ పాస్ పుస్తకాల (సవరణ) బిల్లు–2021, ఏపీ అసైన్డ్ భూముల (బదిలీల నిషేధం) సవరణ బిల్లు–2021, ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి తరఫున ప్రవేశపెట్టిన ఏపీ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, విదేశీ మద్యం (సవరణ) బిల్లు–2021
- ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ప్రవేశపెట్టిన శ్రీ వేంకటేశ్వర వైద్య శాస్త్రాల సంస్థ (సవరణ) బిల్లు–2021.మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ప్రవేశపెట్టిన ఏపీ ధర్మాదాయ, హిందూ మత సంస్థల, దేవదాయ (సవరణ) బిల్లు–2021, ఏపీ ధర్మాదాయ, హిందూ మతసంస్థల, ధర్మాదాయ (రెండో సవరణ) బిల్లు–2021
- మంత్రి సురేష్ తరఫున మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టిన ఏపీ విద్యా (సవరణ) బిల్లు–2021, ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (సవరణ) బిల్లు–2021, ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ప్రవేశపెట్టిన ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు, నియంత్రణ (సవరణ) బిల్లు.
Comments
Please login to add a commentAdd a comment