bills
-
లోక్‌సభలో జమిలి బిల్లులు
కీలక ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకునే దిశగా మోదీ ప్రభుత్వం ముందడుగు వేసింది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకూ ఏక కాలంలో ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన రెండు జమిలి బిల్లులను కేంద్రం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీన్ని రాజ్యాంగంపైనే దాడిగా విపక్షాలు అభివర్ణించాయి. మోదీ సర్కారుది ఫక్తు నియంతృత్వ ధోరణి అంటూ మండిపడ్డాయి.అధికార, విపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభలో యుద్ధ వాతావరణం నెలకొంది. చివరికి వ్యవహారం ఓటింగ్ దాకా వెళ్లింది. జమిలి బిల్లులపై జేపీసీలో కూలంకషంగా చర్చిద్దామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించినా విపక్షాలు శాంతించలేదు. రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ లేదని తెలిసీ మోదీ సర్కారు విఫలయత్నం చేస్తోందని ఎద్దేవా చేశాయి.న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలపై కేంద్రం మరో కీలక ముందడుగు వేసింది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకూ ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులను మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. విపక్షాల ఆందోళనల మధ్యే కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్ రాజ్యాంగ (129వ సవరణ) సవరణ బిల్లును సభ ముందుంచారు. ఇది ఫక్తు నియంతృత్వ చర్య అంటూ కాంగ్రెస్ తదితర విపక్షాలు దుయ్యబట్టాయి. వాటి అభ్యంతరాలను మంత్రి కొట్టిపారేశారు. రాష్ట్రాలు అనుభవిస్తున్న ఏ అధికారాలనూ ఈ బిల్లు తగ్గించబోదని స్పష్టం చేశారు.దాదాపు 90 నిమిషాల పాటు అధికార, ప్రతిపక్షాల నడుమ వాడివేడి చర్చ జరిగింది. కాంగ్రెస్‌తో పాటు డీఎంకే, తృణమూల్, సమాజ్‌వాదీ, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ), మజ్లిస్ తదితర పార్టీలు బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాయి. వాటిపై ఓటింగ్‌కు పట్టుబట్టాయి. దాంతో ఎల్రక్టానిక్, పేపర్ స్లిప్ పద్ధతిన ఓటింగ్ జరిగింది. 269 మంది అనుకూలంగా ఓటేయడంతో బిల్లులను ప్రవేశపెట్టారు. దానికి వ్యతిరేకంగా ఏకంగా 198 మంది ఓటేయడం విశేషం. నూతన పార్లమెంటు భవనంలో ఎల్రక్టానిక్ ఓటింగ్ వ్యవస్థను ఉపయోగించడం ఇదే తొలిసారి. కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును కూడా మంత్రి సభలో ప్రవేశపెట్టారు.పుదుచ్చేది, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలను కూడా లోక్‌సభతో పాటే నిర్వహించేందుకు వీలు కల్పించడం దీని ఉద్దేశం. ప్రతిపాదిత బిల్లులు మౌలిక నిర్మాణ సూత్రానికి గొడ్డలిపెట్టన్న విపక్షాల ఆరోపణలు నిరాధారాలని మేఘ్వాల్ అన్నారు. రాజ్యాంగ సార్వభౌమత్వం, దాని సమాఖ్య–లౌకిక స్వభావాలు, కేంద్ర–రాష్ట్రాల మధ్య అధికారాల విభజన, న్యాయసమీక్ష వంటి కీలక సూత్రాలకు ఈ బిల్లుల ద్వారా అణుమాత్రం కూడా మార్పులు చేయబోవడం లేదని స్పష్టం చేశారు. విపక్షాల ఆరోపణలన్నీ రాజకీయ దురుద్దేశపూరితాలని విమర్శించారు.వాటిని విపక్ష సభ్యులు తీవ్రంగా ఖండించారు. బిల్లుపై తమ అభ్యంతరాలను వారంతా సభ ముందుంచారు. వాటిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. జమిలి బిల్లుపై ప్రతి దశలోనూ లోతైన చర్చ జరగాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశమని తెలిపారు. ‘‘జమిలి బిల్లులు కేంద్ర మంత్రివర్గం ముందుకు వచ్చినప్పుడు మోదీ అదే చెప్పారు. లోతైన చర్చ నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ సంఘం పరిశీలనకు పంపాలని అభిప్రాయపడ్డారు’’ అని మంత్రి వెల్లడించారు. డీఎంకే సభ్యుడు టీఆర్ బాలు కూడా వాటిపై జేపీసీ పరిశీలన కోరారని గుర్తు చేశారు.‘‘రాజ్యాంగ (129వ సవరణ) బిల్లుపై జేపీసీలో విస్తృతంగా చర్చ చేపట్టవచ్చు. అనంతరం జేపీసీ ఇచ్చే నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదిస్తుంది. తదనంతరం బిల్లుపై పార్లమెంటులో మరోసారి మనమంతా చర్చించుకోవచ్చు’’ అని విపక్షాలకు సూచించారు. రెండు బిల్లులను జేపీసీకి నివేదిస్తూ సభలో తీర్మానం ప్రవేశపెడతానని మేఘ్వాల్ ప్రకటించారు. ఆ మేరకు బుధవారం తీర్మానం లోక్‌సభ ముందుకు వచ్చే అవకాశముంది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు సాధారణ మెజారిటీ చాలు.కానీ అవి గట్టెక్కాలంటే ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రస్తుతం రెండు సభల్లోనూ అంతటి మెజారిటీ లేదు. జమిలి ఎన్నికలపై ఏర్పాటైన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ముందు 32 పార్టీలు ప్రతిపాదనకు మద్దతివ్వగా 15 పార్టీలు వ్యతిరేకించడం తెలిసిందే.మూడొంతుల మెజారిటీ ఏదీ?జమిలి బిల్లులు రాజ్యాంగ వ్యతిరేకమని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా విమర్శించారు. పార్లమెంటు ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పునరుద్ఘాటించారు. రాజ్యాంగ సవరణలకు కావాల్సిన మూడింట రెండొంతుల మెజారిటీ బీజేపీకి లేదని లోక్‌సభలో ఓటింగ్‌తో తేలిందని కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్ అన్నారు. ‘‘కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు కుప్పకూలాలి? ఇందులో ఏమన్నా అర్థముందా?’’ అని ప్రశ్నించారు. సభలో రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు మోదీ సర్కారు ప్రయతి్నంచిందని మనీశ్ తివారీ మండిపడ్డారు. ఓటింగ్ వ్యవహారం బీజేపీకే బెడిసికొట్టిందని పార్టీ ఎంపీ మాణిక్కం ఠాగూర్ అన్నారు. పాలనలో స్థిరత్వానికే: కేంద్రంజమిలి ఎన్నికలు భారత్‌కు కొత్తేమీ కాదని కేంద్రం పేర్కొంది. 1951 నుంచి 1967 దాకా అన్ని రాష్ట్రాల శాసనసభలకూ లోక్‌సభతో పాటే ఎన్నికలు జరిగాయని గుర్తు చేసింది. ‘‘పలు రాష్ట్రాల్లో అసెంబ్లీలు గడువుకు ముందే రద్దవడం వల్ల 1968, 1969 నుంచి జమి లికి బ్రేక్ పడింది’’ అని మంగళవారం ఉదయం లోక్‌సభలో జమిలి బిల్లులను ప్రవేశపెట్టడానికి ముందు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. నాలుగో లోక్‌సభ కూడా 1970లో గడువుకు ముందే రద్దయింది. దాంతో 1971లో సాధారణ ఎన్నికలు జరిగి ఐదో లోక్‌సభ కొలువుదీరింది. ఎమర్జెన్సీ నేపథ్యంలో దాని గడువును ఆర్టీకల్ 352 సాయంతో 1977 దాకా పొడిగించారు.అనంతర కాలంలో ఆరో, ఏడో, తొమ్మిదో, 11వ, 12వ, 13వ లోక్‌సభలు కూడా అర్ధాంతరంగానే ముగిశాయి. ‘‘పలు రాష్ట్రాల్లో శాసనసభలకూ అదే పరిస్థితి ఎదురవుతూ వస్తోంది. దాంతో తరచూ ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరిగే పరిస్థితి నెలకొంది. దాంతో పార్టీలు, నేతలు, చట్టసభ్యులు, అధికారులు పాలనను పక్కన పెట్టి ఎన్నికలను ఎదుర్కోవడంలో గడపాల్సి వస్తోంది. అందుకే కోవింద్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా దేశ ప్రయోజనాల రీత్యా జమిలి ఎన్నికలను తిరిగి పట్టాలపైకి తేవాలని సంకల్పించాం. పాలనలో స్థిరత్వానికి అది వీలు కల్పిస్తుంది’’ అని కేంద్రం వివరించింది. రాజ్యాంగంపై దాడి: కాంగ్రెస్జమిలి బిల్లులను రాజ్యాంగ మౌలిక నిర్మాణంపై దాడిగా కాంగ్రెస్ సభ్యుడు మనీశ్ తివారీ అభివర్ణించారు. వాటిని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. రాజ్యాంగంలోని ఇటువంటి కీలకాంశాలను సవరించే అధికార పరిధి పార్లమెంటుకు లేదని ఆయన గుర్తు చేశారు. ‘‘జమిలి ఎన్నికలు జరపాలంటే కేంద్ర, రాష్ట్రాల చట్టసభలకు నిర్ణిత కాలావధి కల్పించే ఆర్టీకల్ 83, 172లను కూడా సవరించాల్సి ఉంటుంది. కనుక సమాఖ్య వ్యవస్థ మౌలిక లక్షణమైన ప్రజాస్వామ్య నిర్మాణపు పునాదులనే ఈ బిల్లులు కదిలిస్తాయి’’ అని వాదించారు. దేశంలో నియంతృత్వాన్ని తేవడమే బీజేపీ ఉద్దేశమని సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు ధర్మేంద్ర యాదవ్ ఆరోపించారు.అసెంబ్లీల గడువును లోక్‌సభతో ముడిపెట్టడం ప్రజా తీర్పును న్యూనతపరచడమేనని తృణమూల్ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ విమర్శించారు. తమకు నచి్చన ప్రభుత్వాన్ని ఐదేళ్ల కాలానికి ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉంటుందని టీఆర్ బాలు గుర్తు చేశారు. జమిలి ద్వారా దానికి గండికొట్టే అధికారం కేంద్రానికి లేదన్నారు. బిల్లులపై మాట్లాడేందుకు అధికార పక్ష సభ్యులకే స్పీకర్ ఓం బిర్లా ఎక్కువగా అవకాశమిస్తున్నారని విపక్ష సభ్యులు అభ్యంతరం వెలిబుచ్చడం ఉద్రిక్తతకు దారితీసింది.‘‘పార్లమెంటుకు మీరు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారా? ఆ హక్కు ప్రతి పార్టీకీ ఉంది’’ అంటూ రిజిజు దుయ్యబట్టారు. బిల్లులకు బేషరతుగా మద్దతిస్తున్నట్టు బీజేపీ మిత్రపక్షాలు శివసేన (షిండే), టీడీపీ ప్రకటించాయి. బిల్లులను జేపీసీకి పంపాలని సుప్రియా సులే (ఎన్సీపీ–ఎస్పీ) కోరారు. ఈ బిల్లులు ప్రాంతీయ పార్టీలకు మరణ శాసనమని అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్) ఆరోపించారు. -
అన్న క్యాంటీన్లు నిర్మించా... నాకు అన్నం లేకుండా చేస్తున్నారు
పిఠాపురం: ‘రూ.40లక్షలు అప్పు తెచ్చి అన్న క్యాంటీన్లు నిర్మించాను. లంచం ఇవ్వలేదని అధికారులు ఆరు నెలలుగా బిల్లులు చెల్లించకుండా నిలిపివేసి నాకు అన్నం లేకుండా చేస్తున్నారు. ఐదుసార్లు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(గ్రీవెన్స్)లో ఫిర్యాదు చేశా. అయినా ప్రయోజనం లేదు. అలాంటప్పుడు ఈ పరిష్కార వేదికలు ఎందుకు?’ అంటూ కాకినాడ జిల్లా కలెక్టర్‌తోపాటు అధికారులను ఓ కాంట్రాక్టర్ నిలదీశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని అంబేడ్కర్ భవన్లో సోమవారం కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యాన నియోజకవర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.పిఠాపురానికి చెందిన మున్సిపల్ కాంట్రాక్టర్ సూరవరపు దివాణం తాను చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తనకు రావాల్సిన బిల్లుల గురించి కలెక్టర్, అధికారులను గట్టిగా నిలదీయడంతో ఆయన్ను పోలీసులు బయటకు గెంటేశారు. ఈ సందర్భంగా దివాణం మాట్లాడుతూ గొల్లప్రోలు, పిఠాపురం, ఏలేశ్వరం, తుని పట్టణాల్లో తాను కాంట్రాక్టు తీసుకుని అన్న క్యాంటీన్లు నిర్మించానని తెలిపారు. అప్పులు చేసి రూ.40 లక్షల పెట్టుబడి పెట్టానని, వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా అధికారులకు, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావుకు ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదన్నారు. పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించిన బిల్లు ఇవ్వాలంటే కౌన్సిల్లో తీర్మానం చేయాలని, దానికి 5 శాతం కమీషన్ ఇవ్వాలంటున్నారని ఆరోపించారు. తాను 30 శాతం తక్కువకు టెండర్ వేసి పనులు చేశానని, అయినా తనకు బిల్లు ఇవ్వడానికి లంచాలు డిమాండ్ చేస్తూ ఏడిపిస్తున్నారని చెప్పారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినతిపత్రం ఇస్తే న్యాయం జరుగుతుందని భావించి ఐదుసార్లు ఫిర్యాదు చేసినా... ఇక్కడ కూడా అన్యాయమే జరుగుతోందన్నారు. కాలువల్లో పూడికలు తీశానని, వాటికి కూడా బిల్లులు రావాల్సి ఉందన్నారు. తన బిల్లుల గురించి కలెక్టర్‌ను గట్టిగా అడిగితే ‘నీ దిక్కున్న వాడితో చెప్పుకో..’ అని అంటున్నారని దివాణం చెప్పారు. పేదలకు అన్నం పెడుతున్నారని తన భార్య పుస్తెలతాడు తాకట్టు పెట్టి, అప్పులు చేసి అన్న క్యాంటీన్లు కట్టించానని, చెప్పారు. ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వం చాలా మంచిదని ఆయన చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో డబ్బులు ఉంటేనే పనులు చేయించి బిల్లులు చెల్లించేవారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో పనులు చేయించుకుని లంచాల కోసం బిల్లులు చెల్లించకుండా ఏడిపిస్తున్నారని ఆరోపించారు. కాగా, దివాణంకు త్వరలో బిల్లులు చెల్లించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. -
మీరు వెళ్లిపోండి.. లేదంటే..
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో కట్టబెట్టిన కాంట్రాక్టులను ఇప్పుడు తన అస్మదీయులకు కట్టబెట్టేందుకు సామదానభేద దండోపాయాలు ఉపయోగిస్తున్న టీడీపీ కూటమి సర్కారు బాగోతాల్లో మరొకటి వెలుగులోకి వచ్చి0ది. రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కాలపరిమితి ఉన్నప్పటికీ ఉన్నఫళంగా రద్దుచేసుకుని వెళ్లిపోవాలని అల్టిమేటం జారీచేస్తూ రాష్ట్రంలో కాంట్రాక్టు సంస్థలను బెంబేలెత్తిస్తోంది. పైగా.. నెలల తరబడి బిల్లులు చెల్లించకుండా పొగపెడుతూ ‘మీ అంతట మీరు వెళ్లిపొండి’ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా ఉన్నతాధికారుల ద్వారా హెచ్చరిస్తోంది. 108 అంబులెన్సులు, 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)ల నిర్వహణ విషయంలో ఇప్పుడిదే జరుగుతోంది. గత ప్రభుత్వంలో ఈ రెండు సర్వీసుల నిర్వహణ కాంట్రాక్టును అరబిందో సంస్థ దక్కించుకుంది. 2027 వరకూ ఈ కాంట్రాక్టు కాలపరిమితి ఉంది. కానీ, ఉన్నఫళంగా ఎంఓయూను రద్దుచేసుకుని వెళ్లిపోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. పైసా విదల్చని ప్రభుత్వం.. 104, 108 వాహనాల నిర్వహణను తన అస్మదీయులకు కట్టబెట్టేందుకు ప్రస్తుత నిర్వహణ సంస్థ అరబిందోను రాష్ట్ర ప్రభుత్వం పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు వైద్యశాఖ వర్గాల్లోనే పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహణ సంస్థకు నయాపైసా చెల్లించలేదు. సాధారణంగా ప్రతి మూడునెలలకు ఒకసారి ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ, ఏప్రిల్ నుంచి అక్టోబరు మధ్య రెండు క్వార్టర్లకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ఇప్పటివరకూ మంజూరు చేయలేదు. ‘సిబ్బందికి మూడునెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. పైగా.. వాహనాలను నడపాలంటే రోజుకు రూ.20 లక్షలు డీజిల్ కోసం ఖర్చుచేయాల్సి ఉంటుంది. డీజిల్ కొనుగోలుకు కూడా ఇబ్బంది పడుతున్నాం’.. అని ప్రభుత్వానికి సంస్థ తెలియజేసినా చంద్రబాబు సర్కారు కనికరించడంలేదు. వీలైనంత త్వరగా రద్దుచేసుకోండి.. ప్రభుత్వం తమపట్ల విముఖత వ్యక్తపరుస్తుండటంతో చేసేదేమీ లేక మీరెలా చెబితే అలా చేస్తామని సంస్థ యాజమాన్యం తెలియజేసింది. ఎంఓయూలోని నిబంధనల ప్రకారం సబ్ కాంట్రాక్టు ఇచ్చి మీరు పక్కకు తప్పుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో.. ప్రభుత్వ పెద్దలు చెప్పిన జేవీ కంపెనీ ఆఫ్ ఎమర్జెంట్ మెడికల్ సర్వీసెస్, యునైటెడ్ హెల్త్‌కేర్ సంస్థలకు సబ్ కాంట్రాక్టు ఇవ్వాలని అరబిందో సంస్థ కూడా వైద్యశాఖకు ప్రతిపాదించింది.అయితే, ఆయా సంస్థలకు సబ్ కాంట్రాక్టు ఇచ్చినప్పటికీ అరబిందో సంస్థ పేరిటే కార్యకలాపాలన్నీ నడుస్తాయి కాబట్టి అరబిందో ప్రస్తావనే లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో సబ్ కాంట్రాక్టు ప్రస్తావనను ప్రభుత్వం విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఎంఓయూను మీరే రద్దుచేసుకుని వెళ్లిపోండని అరబిందోకు తేల్చిచెప్పినట్లు సమాచారం. ఎలాగైనా ఎంఓయూ రద్దుచేసి తీరాలని ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉండటంతో వైద్యశాఖ ఉన్నతాధికారులు సైతం ఈ విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. వీలైనంత త్వరగా ఎంఓయూ రద్దు చేసుకోండని సంస్థ ప్రతినిధులతో ఇప్పటికే పలుమార్లు చర్చించారు. అంతేకాక.. ప్రభుత్వానికి విస్తృతమైన అధికారులున్నాయని, కాంట్రాక్టును రద్దుచెయ్యొచ్చని బెదిరించినట్లు కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ‘యునైటెడ్ కింగ్డమ్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ (యూకే ఎన్హెచ్ఎస్) నిర్వహణ కాంట్రాక్టులో భాగస్వామిగా ఉందని.. ఇక్కడి పరిస్థితులపై సమాచారం ఇచ్చామని.. ఆ సంస్థ స్పందన ఆధారంగా ఎంఓయూ రద్దుపై తుది నిర్ణయం తెలియజేస్తాం’.. అని అరబిందో చెప్పినట్లు సమాచారం. సిబ్బందిలో ఆందోళన మరోవైపు.. ఇప్పటికే మూడు నెలలుగా వేతనాల్లేక 104, 108లో పనిచేసే 6,500 మంది సిబ్బంది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. దసరా, దీపావళి ఇలా పండుగలన్నీ పస్తులతోనే గడిపారు. ఈ పరిస్థితుల్లో నిర్వహణ సంస్థ మారుతోందంటూ ప్రభుత్వమే ఎల్లో మీడియాలో లీకులిచ్చి కథనాలు రాయిస్తుండడంతో సిబ్బంది కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. నిర్వహణ సంస్థ మారితే తమకు రావాల్సిన బెని్ఫట్స్ రాకుండా పోతాయేమోనని వారు ఆవేదన చెందుతున్నారు. పెండింగ్ వేతనాలు చెల్లించండిరాష్ట్రవ్యాప్తంగా 104 సిబ్బంది నిరసనపెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనాలను తక్షణమే చెల్లించడంతో పాటు, ఉద్యోగ భద్రత సహా పలు డిమాండ్ల పరిష్కారం ఎజెండాగా 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ) సిబ్బంది నిరసన బాట పట్టారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా మండలాల్లో మెడికల్ ఆఫీసర్లకు తమ సమస్యలపై డీఈవోలు, డ్రైవర్లు వినతి పత్రాలు అందజేశారు. బుధవారం డీఎంహెచ్వోలు, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలోనూ నోడల్ అధికారులకు వినతి పత్రాలు అందజేస్తామని ఏపీ 104 ఎంఎంయూ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఫణికుమార్ తెలిపారు. 8వ తేదీ తహసీల్దార్లు, ఎంపీడీవోలకు, 10న జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని వెల్లడించారు. 11న గ్రీవెన్స్‌లో వినతులిస్తామని, 14వ తేదీన డ్రైవర్లు, డీఈవోలు అధికారిక గ్రూప్‌ల నుంచి లెఫ్ట్ అయి పనులు నిలుపుదల చేస్తామన్నారు. నిరసన చేస్తున్నన్ని రోజులూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామన్నారు. -
బాబూ.. బేల మాటలేల?
‘విశాఖ స్టీల్‌ప్లాంట్ గురించి నేను ఒకటే చెబుతున్నాను.. ఇది ఆంధ్రుల మనోభావాలకు చెందిన ప్రాజెక్టు. ఉద్యోగులు, యాజమాన్యం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. మంచి మేనేజ్మెంట్ ఏర్పాటు చేసుకోవాలి. సమర్థవంతంగా ప్లాంట్‌ని నడిపించాలి. సెయిల్ మాదిరిగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను లాభాల బాట పట్టించాలి? ఇవీ.. పరవాడ పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయింపులో చొరవ తీసుకోవల్సిన ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడంపై స్టీల్‌ప్లాంట్ ఉద్యోగ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం: ఇటీవల పరవాడ పర్యటనలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సెయిల్‌కు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ఉన్న తేడా తెలియదా అంటూ కార్మిక సంఘాలు ప్రశి్నస్తున్నాయి. సెయిల్‌కు సొంత గనులు ఉండటం వల్లే లాభాల బాటలో పయనిస్తోంది. సెయిల్‌కు, స్టీల్‌ప్లాంట్‌కు ఉత్పత్తి వ్యయంలో చాలా తేడా ఉంది. సెయిల్‌తో పోలిస్తే స్టీల్‌ప్లాంట్‌కు మూడు రెట్లు ఉత్పత్తి వ్యయం అవుతోంది. సొంత గనులు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ప్లాంట్‌కు గనులు కేటాయించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ కార్మిక సంఘాలు చంద్రబాబు, పవన్ దృష్టికి సొంతగనుల కేటాయింపు విషయాన్ని పలుమార్లు విన్నవించినా.. కేంద్రంతో ఒక్కసారి కూడా సంప్రదింపులు జరపలేదు. ఇప్పుడు మాత్రం.. లాభాల బాట నడిపించాల్సిన బాధ్యత ఉద్యోగులు, కార్మికులదే అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడటంపై ఉక్కు పోరాట కమిటీ నాయకులు మండిపడుతున్నారు. మేనేజ్మెంట్ బాధ్యత ఎవరిది బాబూ.? స్టీల్‌ప్లాంట్‌కు మంచి మేనేజ్మెంట్ ఏర్పాటు చేసుకోవాలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైనా కార్మికులు మండిపడుతున్నారు. ప్లాంట్‌కు ఉన్నతాధికారుల నియామకం, సీఎండీ నియామకం మొదలైన బాధ్యతలన్నీ కేంద్రం పరిధిలో ఉంటాయి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో జతకట్టిన టీడీపీ, జనసేన ఈ విషయంపై ఎప్పుడూ చర్చించిన పాపానపోలేదు. అలాంటిది.. మంచి మేనేజ్మెంట్ను ఉద్యోగులు ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు అనడమేంటని ప్రశి్నస్తున్నారు. ఐదు నెలల్లో ఉక్కు కోసం ఏం చేశారు.? ప్లాంట్‌ను కాపాడుకుంటామంటూ ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు ఈ ఐదు నెలల్లో పట్టించుకున్న పాపానపోలేదు. ఉద్యోగులు, కార్మికులకు ఉన్న సదుపాయాల్ని యాజమాన్యం కోత విధించినా స్పందించలేదు. ఉద్యోగుల వీఆర్ఎస్, మరో ప్లాంట్‌కు బదిలీలకు పూనుకున్నా.. ఉద్యోగుల హెచ్ఆర్ఏ తొలగించినా నోరెత్తిలేదు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్టీల్‌ప్లాంట్ క్వార్టర్స్‌లో యూనిట్‌కి రూ.8 చొప్పున విద్యుత్ చార్జీలు పెంచి వసూలు చేసినా మాట్లాడలేదు. లీవ్ ఎన్‌క్యా‹మెంట్, ఎల్‌టీఏ(లాంగ్ ట్రావెల్ అలవెన్స్), లాంగ్‌లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్ఎల్టీసీ), ఎల్టీసీ(లీవ్ ట్రావెల్ కన్సెషన్) కూడా నిలిపేశారు. దీనికి తోడు చంద్రబాబు ప్రభుత్వం గోరుచుట్టుపై రోకలిపోటులా రూ.80 కోట్ల విద్యుత్ బిల్లుల బకాయిల చెల్లించకపోతే సరఫరా నిలిపేస్తామంటూ నోటీసులు జారీ చేసింది. అలాగే స్టీల్‌ప్లాంట్‌కు ప్యాకేజీ ఇస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం మొదట ఇచ్చిన రూ.500 కోట్లలో రూ.237 కోట్లు జీఎస్టీకి చెల్లించగా మిగిలిన ధనంతో ముడి పదార్థాలు కొనుగోలు చేశారు. రెండోసారి ప్యాకేజీ పేరుతో రూ.1140 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి.. బ్యాంకులకు రుణాల పేరిట తిరిగి తీసేసుకుంది. ఇలా ప్రతి విషయంలోనూ ప్లాంట్‌ని నిర్వీర్యం చేసేందుకు యతి్నస్తుంటే కూటమి నేతలు నోరుమెదపకపోవడం ఏంటని కార్మిక సంఘాలు ప్రశి్నస్తున్నాయి.నక్కపల్లిలో ప్రైవేట్ ప్లాంట్‌కు సొంత గనులా? అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మిట్టల్ ప్రైవేట్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పైగా దానికి సొంత గనుల కేటాయింపులోనూ రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఉన్న స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించకుండా ప్రైవేట్‌కు కొమ్ము కాస్తుండడం చూస్తే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు విశాఖ ఉక్కుపై ఉన్నది కపట ప్రేమ అని తేటతెల్లమవుతోందంటూ ఉద్యోగ సంఘ ప్రతినిధులు విమర్శిస్తున్నారు.గనుల కేటాయింపులో వివక్ష కారణంగా..? గతంలో వరుసగా సాధించిన లాభాలతో 6.3 మిలియన్ టన్నుల సామర్థ్యానికి, ఆ తర్వాత 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యానికిప్లాంట్ విస్తరణ జరిగింది. ఒక రకంగా విస్తరణ స్టీల్‌ప్లాంట్‌కు నష్టం తెచ్చిందని చెప్పవచ్చు. విస్తరణ పూర్తయ్యే నాటికి ఉన్న వనరులన్నీ కరిగిపోగా రుణాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా దేశంలోని ప్రైవేటు ప్లాంట్లకు గనులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించడంలో వివక్ష చూపుతూ వస్తుంది. దీని వల్ల ఇతర ప్లాంట్లలో టన్నుకు 40 శాతం ముడి పదార్థాలకు వ్యయం అవుతుండగా సొంత గనులు లేని విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు 65 శాతం వ్యయం అవుతోంది. కొన్నిసార్లు ఉత్పత్తి వ్యయం కంటే తక్కువకే ఉత్పత్తులను స్టీల్‌ప్లాంట్ అమ్ముకోవాల్సి వస్తోంది. దీంతో గత నాలుగున్నరేళ్ల కాలంలో మూడేళ్ల పాటు నష్టాలను చవిచూసింది. ఈ పరిస్థితుల్లో ప్లాంట్ రుణాలు రూ.20 వేల కోట్లకు మించిపోయాయి. అయితే స్టీల్‌ప్లాంట్ ఈ 30 ఏళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల రూపేణా రూ. 40 వేల కోట్లు చెల్లించడం గమనార్హం. వీటిని వద్దని చెప్పినా ప్లాంట్ సజీవంగా బతికేది.ఉద్యోగులపై నిందలు వేయడం సరికాదు స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు ఉంటే సెయిల్ కంటే ఎక్కువ లాభాలు సాధించేది. ఉక్కు యాజమాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది కానీ ఉద్యోగులు కాదు. కేంద్ర ప్రభుత్వం ప్లాంట్‌ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నంలో చేస్తున్న సహాయ నిరాకరణ వల్ల స్టీల్‌ప్లాంట్ ఈ పరిస్థితికి చేరింది.. తప్ప ఉద్యోగుల వల్ల కాదు. సీఎం చంద్రబాబుకి అందిన తప్పుడు సమాచారం వల్లే ఆయన అలా మాట్లాడుతున్నారేమో. – మంత్రి రాజశేఖర్, స్టీల్ ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి -
బిల్లు బకాయిలు చెల్లిస్తేనే డయాఫ్రం వాల్!
సాక్షి, అమరావతి: కొత్త డయాఫ్రం వాల్ పనుల సన్నాహాల సాక్షిగా పోలవరంలో 2016–19 మధ్య మరో కమీషన్ల బాగోతం బట్టబయలైంది. అప్పట్లో తాము చేసిన డయాఫ్రం వాల్ పనులకు సంబంధించి రూ.94 కోట్ల బిల్లులు చెల్లించలేదని.. ఇప్పుడు అవి చెల్లిస్తేనే కొత్త డయాఫ్రం వాల్ పనులను చేపడతామని బావర్ సంస్థ ప్రతినిధులు తేల్చి చెప్పినట్లు జలవనరుల శాఖ అధికారవర్గాలు తెలిపాయి. ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌కి బిల్లులు చెల్లించామని.. అక్కడి నుంచి బిల్లులు వసూలు చేసుకోవాలంటూ అధికారులు చేసిన సూచనను బావర్ ప్రతినిధులు తోసిపుచ్చుతున్నారు. ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లిస్తామని నాటి ప్రభుత్వం 2017 ఫిబ్రవరి 6న ఉత్తర్వులు (జీవో ఆర్టీ నెంబరు 41) జారీ చేస్తేనే తాము పనులు చేశామని స్పష్టం చేస్తున్నారు. కానీ.. ఎస్క్రో అకౌంట్ ద్వారా తమకు బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టారని పేర్కొంటున్నారు.ట్రాన్స్ట్రాయ్ను అడ్డుపెట్టుకుని చంద్రబాబు, లోకేష్ సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి దోచుకున్నారంటూ ఆ సంస్థ అధినేత రాయపాటి రంగారావు 2024 జనవరి 12న మీడియాకు వెల్లడించడం గమనార్హం. కమీషన్ల కోసం పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారంటూ 2019 ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ సైతం ఆగ్రహం వ్యక్తం చేయడం అప్పట్లో సంచలనం కలిగించింది. కమీషన్ల కోసమే ఎస్క్రో అకౌంట్ తుంగలోకి.. పోలవరం ప్రాజెక్టులో వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేయకుండానే.. ఎర్త్ కమ్ రాక్ ఫిల్(ఈసీఆర్ఎఫ్) డ్యామ్ గ్యాప్–2లో పునాది డయాఫ్రం వాల్ పనులను బావర్ సంస్థకు సబ్ కాంట్రాక్టు కింద 2016లో టీడీపీ ప్రభుత్వం అప్పగించి చారిత్రక తప్పిదానికి పాల్పడింది. ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్ ద్వారా కాకుండా ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లిస్తామని నాడు హామీ ఇచ్చి తుంగలో తొక్కింది. ఎందుకంటే.. ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లిస్తే కమీషన్లు వసూలు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ క్రమంలో 2018 జూన్ నాటికి గ్యాప్–2లో డయాఫ్రం వాల్‌ను బావర్ సంస్థ పూర్తి చేసింది. చేసిన పనులకు బిల్లుల రూపంలో రూ.56 కోట్లు, జీఎస్టీ రూపంలో రూ.38 కోట్లు వెరసి రూ.94 కోట్ల మేర బిల్లులు బావర్‌కు టీడీపీ ప్రభుత్వం బకాయిపడింది. బావర్ సంస్థ ఇదే అంశాన్ని అప్పట్లో అనేక మార్లు జలవనరుల శాఖ దృష్టికి తెచ్చి బిల్లులు చెల్లించాలని కోరింది. అయితే తాము ట్రాన్స్ట్రాయ్కు బిల్లులు చెల్లించేశామని, ఆ సంస్థ నుంచి వసూలు చేసుకోవాలని అధికారులు సూచించారు. కానీ.. అప్పటికే ట్రాన్స్ట్రాయ్ దివాలా తీసింది. చంద్రబాబు ప్రభుత్వం చారిత్రక తప్పిదం వల్ల గోదావరి వరదల ఉద్ధృతికి డయాఫ్రంవాల్ ధ్వంసమైంది. డీఆర్ఐకి ఫిర్యాదు చేసినా.. రూ.94 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంపై బావర్ సంస్థ అప్పట్లో డీఆర్ఐకి ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై 2018 నుంచి అనేక మార్లు డీఆర్ఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించినా స్పందించలేదు. 2014 ఎన్నికల్లో ఖర్చుల కోసం చంద్రబాబు, లోకేష్ తమ వద్ద రూ.150 కోట్లు తీసుకున్నారని.. ఆ తర్వాత పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి తమను నాశనం చేశారని ట్రాన్స్ట్రాయ్ అధినేత రాయపాటి రంగారావు మీడియాకు ఎక్కడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో బావర్ సంస్థకు చెల్లించాల్సిన రూ.94 కోట్ల బిల్లులు ఏ బాబు జేబులోకి చేరాయనే చర్చ కాంట్రాక్టర్లలో జోరుగా సాగుతోంది. -
కాంట్రాక్టర్లకు బిల్లుల కోసమే ‘కాళేశ్వరం’ కార్పొరేషన్!
సాక్షి, హైదరాబాద్: బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొంది కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం కోసమే కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ ఏర్పాటైందని నీటిపారుదల శాఖ చీఫ్ అకౌంట్స్ అధికారి పద్మావతి, కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ అధికారి కొమర్రాజు వెంకట అప్పారావు వెల్లడించారు. కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. బుధవారం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న ముగ్గురు అధికారులను వేర్వేరుగా క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. నాటి నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ ఆదేశాలతో కార్పొరేషన్ రుణాలను సమీకరించిందని ఓ ప్రశ్నకు సమాధానంగా కొమర్రాజు వెంకట అప్పారావు తెలిపారు. కాళేశ్వరం కార్పొరేషన్‌కు స్వతహాగా ఆదాయం ఏమీ లేదన్నారు. రుణా లు మంజూరైన వెంటనే కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరపకుండా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని.. వాటిపై వచ్చే వడ్డీలతో కార్పొరేషన్ నిర్వహణ జరుగుతోందని చెప్పారు. కాంట్రాక్టర్ల బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీలను సైతం కార్పొరేషన్ అవసరాలకు వాడుకుంటున్నామని వివరించారు. పూర్తయిన పనులన్నింటినీ కార్పొరేషన్ ఆస్తులుగానే పరిగణిస్తామని తెలిపారు. రామగుండం ఫెర్టిలైజర్, ఎనీ్టపీసీ నుంచి నీటి విడుదలకు సంబంధించిన బిల్లులు 2023 నుంచి వస్తున్నాయని వివరించారు. కొలతలు చూశాకే బిల్లులు ఇస్తారా? అని కమిషన్ ప్రశ్నించగా.. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సిద్ధం చేసిన బిల్లులను పేఅండ్‌అకౌంట్స్ విభాగం పరిశీలించి కార్పొరేషన్‌కు పంపిస్తుందని, తర్వాత చెల్లింపులు చేస్తామని బదులిచ్చారు. కాగ్ అభ్యంతరాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించామన్నారు.మిమ్మల్ని మీరే రక్షించుకోవాలినీటి పారుదల శాఖ బడ్జెట్ రూపకల్పనలో మీ పాత్ర ఏమిటని ఆ శాఖ చీఫ్ అకౌంట్స్ అదికారి పద్మావతిని కమిషన్ ప్రశ్నించగా.. చీఫ్ ఇంజనీర్ల నుంచి వివరాలను సేకరించి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపిస్తానని ఆమె బదులిచ్చారు. కార్పొరేషన్ రుణాల తిరిగి చెల్లింపు కోసం ప్రభు త్వం బడ్జెట్లో నిధులు కేటాయిస్తోందని తెలిపారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ అభ్యంతరాల విషయంలో మీ అభిప్రాయమేంటి? రుణాలపై నిర్వహించిన సమావేశాల్లో గత ప్రభుత్వంలోని సీఎంఓ అధికారులు పాల్గొన్నారా? ప్రాజెక్టుతో ఆర్థికభారం పడే అవకాశం ఉండటంతో ఆర్థిక క్రమశిక్షణ కోసం సలహాలు ఏమైనా ఇచ్చారా?’ కమిషన్ ప్రశ్నించగా.. ఆమె సమాధానం దాటవేసినట్టు తెలిసింది. ‘కాళేశ్వరం ప్రాజెక్టుతో పడే ఆర్థిక భారం? దీనికి మీ సమర్థన ఉందా? రాష్ట్రంపై ఈ భారం రానున్న రోజుల్లో ఎలా ఉంటుంది? మీ బాధ్యతగా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారా?’ అన్న ప్రశ్నలకు తాను జవాబు చెప్పలేనని పేర్కొన్నట్టు సమాచారం. ఇక ఆర్థిక క్రమశిక్షణ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకున్నదెవరని ప్రశ్నించగా.. అది చాలా విస్తృతమైన అంశమని, దానిపై తానేమీ చెప్పలేనని చెప్పినట్టు తెలిసింది. దీంతో కమిషన్ కొంత ఘాటుగా స్పందిస్తూ.. ‘‘విచారణ సందర్భంగా ఎవరినో రక్షించే ప్రయత్నం చేయవద్దు. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. విచారణలో వాస్తవాలనే తెలపాలి. దాపరికాలు వద్దు’’ అని పేర్కొన్నట్టు సమాచారం. మరోవైపు బిల్లులను పరిశీలించి చెల్లింపులకు సిఫారసు చేయడమే తన బాధ్యత అని వర్క్ అకౌంట్స్ డైరెక్టర్ ఫణిభూషణ్ శర్మ కమిషన్‌కు వివరించారు. కాగ్ నివేదికలోని ఒకటి రెండు విషయాలు మాత్రమే వాస్తవాలని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచి్చందని తెలిపారు. -
ఇదెక్కడి రోగం?
సాక్షి, అమరావతి: ఏదైనా ఓ వ్యవస్థను నిర్వీ ర్యం చేయాలనుకుంటే సీఎం చంద్రబాబు తొలుత పథకం ప్రకారం దానిపై దుష్ప్రచారం ప్రారంభిస్తారు. తాను అనుకున్నది సాధించడం కోసం ప్రజల మెదడును ట్యూన్ చేసేలా పార్టీలోనే కొందరు నాయకులతో ప్రకటనలు చేయిస్తారు. అనుకూల మీడియాలో ఈమేరకు కథనాలతోపాటు టీవీ చానళ్లలోనూ తన మనుషుల ద్వారా చర్చలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ విషయంలోనూ అదే పంథాను కొనసాగిస్తున్నారు. మేనిఫెస్టోలో ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెడతానని హామీ ఇచ్చి చివరకు ప్రజల ఆరోగ్యానికి పొగ బెట్టారు. ఇన్నాళ్లూ ఆరోగ్యశ్రీ పథకం ట్రస్టు పర్యవేక్షణలో పకడ్బందీగా కొనసాగుతుండగా అధికారంలోకి వచ్చీ రాగానే ఆ స్థానంలో బీమా ప్రవేశపెట్టడానికి సిద్ధం కావాలంటూ వైద్య శాఖకు హుకుం జారీ చేశారు. మరోవైపు ‘‘ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు. ఆస్పత్రులకు బిల్లులు రావడం లేదు. రోగులకు చికిత్సలు అందడం లేదు. ప్రజలు వైద్యం కోసం కేంద్రం అమలు చేసే ఆయుష్మాన్ భారత్ కార్డును వెంటబెట్టుకుని ఆస్పత్రులకు వెళ్లాలి..’’ అని టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. మాజీ సీఎంలు వైఎస్సార్, వైఎస్ జగన్‌ల ముద్రను చెరిపేయాలనే దురుద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగారుస్తూ రాష్ట్రంలోని కోట్ల మంది నిరుపేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. అధికారంలోకి వచ్చీ రావడంతోనే ఆరోగ్యశ్రీని నిర్వీ ర్యం చేసే పనికి శ్రీకారం చుట్టారు. మరోవైపు ఆరోగ్యశ్రీ బిల్లుల బకాయిలు చెల్లించకుండా, ప్రజలకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందకుండా చేస్తున్నారు. అడ్డుకుని అభాండాలు2019–24 మధ్య ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలతో బలోపేతం చేసింది. అంతకుముందు టీడీపీ హయాంలో బిల్లుల చెల్లింపుల్లో జరిగిన తీవ్ర ఉన్న జాప్యానికి చెక్ పెట్టారు. ప్రజలకు వైద్య సేవలపై ఏ మాత్రం ప్రభావం పడకుండా ఎప్పటికప్పుడు ఆస్పత్రులకు బిల్లులను చెల్లిస్తూ వచ్చారు. ఈ ఏడాది జనవరి వరకూ పెండింగ్ లేకుండా బిల్లులు చెల్లించారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి వైద్య సేవల క్లెయిమ్‌లను ట్రస్ట్ పరిశీలించి, ఆమోదించడం.. అనంతరం బిల్లులను ట్రస్ట్ ప్రాసెస్ చేసి ఆర్థిక శాఖకు పంపి అక్కడ సీఎఫ్ఎంఎస్ ఐడీలు రావడానికి రెండు నెలల సమయం పట్టింది. సాధారణంగా ప్రతి నెలా ఇదే పద్ధతిలో బిల్లులను ప్రాసెస్ చేస్తారు. ఈ ప్రక్రియలో మార్చిలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో బిల్లులను చెల్లించలేకపోయారు. వాస్తవానికి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన ఆరోగ్యశ్రీ పథకం ఎన్నికల నియమావళిలోకి రాదు. పథకానికి సంబంధించిన బిల్లులు చెల్లింపులు చేయడానికి వీలుంటుంది. అయితే ఆ సమయంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అప్పటికే అమలులో ఉన్న పథకాలకు ఎలాంటి చెల్లింపులు చేయకుండా చంద్రబాబు ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదులు చేసి అడ్డుకున్నారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కోడ్ అమలులో ఉంది. దీంతో జనవరి, ఫిబ్రవరి నెలలకు మరో మూడు నెలల బిల్లులు వచ్చి చేరాయి. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ బకాయిలను చెల్లించకుండా తాత్సారం చేస్తూ యథావిధిగా గత ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ పథకాన్ని నిరీ్వర్యం చేయాలనే లక్ష్యాన్ని అమలు చేస్తోంది. పేదల్లో కలవరపాటు ఓవైపు బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేయడం, మరోవైపు బీమా పేరిట ఆరోగ్యశ్రీ పథకానికి చంద్రబాబు సర్కారు పొగబెడుతుండటంతో పేదల్లో కలవరపాటు మొదలైంది. గత ఐదేళ్లలో దురదృష్టవశాత్తూ ఏదైనా జబ్బు చేస్తే ఆరోగ్యశ్రీ కార్డుతో వెళితే ఎంత ఖరీదైన వైద్యమైనా ఉచితంగా లభించే పరిస్థితి ఉండేది. 2019 అనంతరం రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారికి పథకాన్ని వర్తింపజేయడంతో ప్రైవేట్ ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని జీవించే మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యశ్రీ రక్షగా నిలిచింది. అనంతరం చికిత్స వ్యయ పరిమితిని రూ.5 లక్షలు నుంచి దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.25 లక్షలకు వైఎస్ జగన్ పెంచారు. టీడీపీ హయాంలో కేవలం 1,059 ప్రొసీజర్లతో అస్తవ్యస్థంగా ఉన్న ఆరోగ్యశ్రీకి ప్రాణం పోసి ప్రొసీజర్లను ఏకంగా 3,257కి పెంచారు. ఐదేళ్లలో 45.10 లక్షల మందికి ఉచితంగా చికిత్సలు అందించి ఆరోగ్యశ్రీ పథకానికి రూ.13 వేల కోట్లకు పైగా వెచ్చించారు. అంతేకాకుండా శస్త్ర చికిత్సలు జరిగిన 24.59 లక్షల మందికి కోలుకునే సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ.1,465 కోట్లకుపైగా ఆర్థిక సాయం అందించి కష్టకాలంలో గత ప్రభుత్వం అండగా నిలిచింది. మరోవైపు నాడు–నేడు కింద రూ.17 వేల కోట్లకు పైగా నిధులతో ప్రభుత్వాస్పత్రులను సదుపాయాలతో తీర్చిదిద్దడంతోపాటు 17 వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టారు. 108, 104 వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు దేశంలోనే ఎక్కడా లేనటువంటి ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి వినూత్న కార్యక్రమాలను అమలు చేశారు. తద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కల్పించారు. ఒక్క ఆరోగ్యశ్రీనే కాకుండా..కేవలం ఒక్క ఆరోగ్యశ్రీనే కాకుండా ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగంలో గత ఐదేళ్లలో చేపట్టిన సంస్కరణలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసేలా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేయడంతో పాటు మన విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయడానికి తలపెట్టిన కొత్త వైద్య కళాశాలలకు అనుమతుల విషయంలోనూ కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రజలకు తాముంటున్న చోటే స్పెషాలిటీ వైద్య సేవలను అందించడంతోపాటు నిరంతర వైద్య పర్యవేక్షణ కల్పిస్తూ తెచి్చన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కూటమి సర్కారు నిలిపివేసింది.కొత్త ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు కావస్తున్నా ఆస్పత్రుల్లో మందుల సరఫరాపై కనీసం దృష్టి పెట్టలేదు. దీంతో ఆస్పత్రులను మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో వందకుపైగా రకాల మందుల కొరత ఉంది. గత ప్రభుత్వంలో బోధనాస్పత్రుల్లో 607 రకాల డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలున్న మందులు అందుబాటులో ఉండేవి. గ్రామ స్థాయిలోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లోనూ 105 రకాల మందులను అందుబాటులో ఉంచిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానికే దక్కింది. -
నిధులైనా... విధులైనా...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో ప్రథమ పౌరులు గందరగోళంలో పడ్డారు. వారం రోజుల్లో పదవీకాలం ముగియనుండటం.. గతంలో సొంత నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఇంకా రాకపోవడంపై సర్పంచులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పెండింగ్ బిల్లులకు సంబంధించి నిధులైనా ఇవ్వాలని.. లేకుంటే మరో ఆరు నెలలపాటు పదవీకాలమైనా పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన అంటే ప్రజాస్వామ్యానికి విలువే ఉండదని స్పష్టం చేస్తున్నారు. అప్పులు చేసి మరీ గ్రామాల్లో పనులు చేయించామని.. పెండింగ్ బిల్లులు రాకపోతే సమస్యల్లో మునిగిపోతామని వాపోతున్నారు. ఊర్లలో పనులు చేయించి.. రాష్ట్రంలో 12,752 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పార్టీ రహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ గ్రామాలకు సర్పంచ్‌లు ఎన్నికయ్యారు. అందులో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల సానుభూతిపరులు కూడా ఉన్నారు. గత ఐదేళ్లుగా పంచాయతీలకు నిధులు, ఇతర పనుల విషయంలో ఇబ్బందులు ఉన్నా గ్రామాల అభివృద్ధి కోసం కృషిచేశారు. గ్రామంలో అభివృద్ధి పనులతోపాటు వివిధ పథకాల కింద మంజూరైన ప్రాజెక్టుల పనులూ చేశారు. పంచాయతీల్లో నిధులు లేకున్నా.. చాలా మంది సర్పంచులు సొంత డబ్బుతోనో, అప్పులు తెచ్చో పనులు పూర్తి చేయించారు. గడువు ముగుస్తుండటంతో.. ప్రస్తుతం గ్రామాల్లో సర్పంచులు, పాలకవర్గాల పదవీకాలం ఫిబ్రవరి 1వ తేదీతో ముగుస్తోంది. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పటికిప్పుడు గ్రామ పంచాయతీ (జీపీ) ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేనట్టు సంకేతాలు ఇచ్చింది. ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో.. అవి ముగిశాక పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. సర్పంచుల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో.. వారినే మరో ఆరు నెలలు కొనసాగించేందుకు, లేదా వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందిని గ్రామాలకు ప్రత్యేక అధికారులుగా నియమించేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుత సర్పంచులలో చాలా వరకు బీఆర్ఎస్కు అనుకూలమైనవారేనన్న ఆలోచనతో ఉన్న కాంగ్రెస్ సర్కారు.. వారినే ఇన్చార్జులుగా కొనసాగించేందుకు సుముఖంగా లేనట్టు సంకేతాలు ఇచ్చింది. వచ్చే ఆరు నెలల పాటు (పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేదాకా) గ్రామాల్లో పాలన బాధ్యతను ప్రత్యేకాధికారులకు అప్పగించేందుకు మొగ్గుచూపుతోంది. ఇది సర్పంచులలో కలకలం రేపుతోంది. ‘ప్రత్యేక’పాలనతో ఇబ్బందులేనంటూ.. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన మొదలవబోతోందంటూ జిల్లా, మండల స్థాయిలో అధికారులు హడావుడి చేస్తున్నారని సర్పంచులు అంటున్నారు. సొంత నిధులతో కొత్త పంచాయతీ భవనాలు, శ్మశానవాటికలు, క్రీడా మైదానాలు వంటివి నిర్మించామని.. ఉపాధి హామీ, ప్రత్యేక అభివృద్ధి నిధి, రాష్ట్ర ఆర్థిక సంస్థ పరిధిలోని పనులు చేపట్టామని చెప్తున్నారు. తమ పదవీకాలం ముగిసేలోగా పెండింగ్ బిల్లులైనా ఇప్పించాలని, లేదా ఎన్నికలు జరిగేదాకా సర్పంచ్‌లుగా కొనసాగించాలని సీఎం రేవంత్‌రెడ్డికి, పంచాయతీరాజ్ మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేస్తున్నారు. తాము రాజకీయ పార్టీల గుర్తులపై ఎన్నికకాలేదని, తమను ఒక రాజకీయపక్షానికే అనుకూలమైనవారిగా పరిగణించవద్దని కోరుతున్నారు. తమను క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై ప్రభుత్వపరంగా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించేవారిగా గుర్తించాలని అంటున్నారు. ప్రత్యేకాధికారుల పాలన అంటే ఇబ్బందేనని.. గ్రామాల్లో అభివృద్ధి జరగదని సర్పంచులు పేర్కొంటున్నారు. అధికారులు కేవలం ఆఫీస్ వేళల్లోనే అందుబాటులో ఉంటారని.. వారాంతాలు, సెలవు రోజుల్లో వారిని సంప్రదించే అవకాశమే ఉండదని చెప్తున్నారు. దీనితో ప్రజలకు సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు. గ్రాంట్లపై ఆధారపడిన చోట సమస్య ఎక్కువ ఏడాదికిపైగా పెండింగ్ బిల్లుల సమస్య వెంటాడుతోందని.. సొంత నిధులతో చేసిన పనులకు బిల్లులు రాక ఇబ్బందిపడుతున్నామని సర్పంచ్‌లు చెప్తున్నారు. సొంత ఆదాయ వనరులు అధికంగా ఉన్న పలు మేజర్ గ్రామ పంచాయతీలు, పెద్ద గ్రామాల్లో ఇబ్బంది పెద్దగా లేదని.. ఆదాయ వనరులు అంతగా లేని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు, గ్రాంట్లపై ఆధారపడిన మధ్య, చిన్నతరహా గ్రామాలకు సమస్య ఎక్కువగా ఉందని అంటున్నారు. ఇలాంటి గ్రామ పంచాయతీల్లో రూ.6 లక్షల నుంచి రూ.11 లక్షల దాకా పెండింగ్ బిల్లులు ఉన్నాయని.. మొత్తంగా రూ.1,200 కోట్ల మేర బకాయిలు ఉండొచ్చని సర్పంచుల సంఘాలు అంచనా వేస్తున్నాయి. గతంలో రాష్ట్ర ఆర్థిక సంఘం, ఇతర అభివృద్ధి నిధులు సకాలంలో విడుదలకాకపోవడంతోపాటు నిధుల వ్యయంపై ఫ్రీజింగ్ పెట్టడంతో పెండింగ్ బిల్లుల సమస్య పెరిగిందని అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థికసంఘం నిధులు నేరుగా పంచాయతీలకే అందడంతో.. కొందరు సర్పంచులు కొంతమేర బిల్లులు రాబట్టుకోగలిగారని చెప్తున్నాయి. కొనసాగిస్తే భరోసా! గతంలో సకాలంలో బిల్లులు రాక, అభివృద్ధి, ఇతర పనుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక, ఇతర కారణాలతో పలువురు సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్నారని సర్పంచుల సంఘాలు గుర్తు చేస్తున్నాయి. అందువల్ల పెండింగ్ బిల్లులపై ప్రభుత్వం వెంటనే ఏదైనా హామీ ఇవ్వాలని కోరుతున్నాయి. లేకుంటే పంచాయతీలకు ఎన్నికలు జరిగేదాకా ఇప్పుడున్నవారినే కొనసాగిస్తే పెండింగ్ బిల్లుల రాకపై సర్పంచులకు భరోసా ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. పెండింగ్ బిల్లుల సమస్యను వెంటనే పరిష్కరించాలి: యాదయ్యగౌడ్ ఫిబ్రవరి 1న తమ పదవీకాలం ముగుస్తున్నందున పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సీఎం రేవంత్‌రెడ్డిని తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఒక ప్రకటనలో కోరారు. సర్పంచులు అప్పులు తెచ్చి గ్రామాభివృద్ధికి పాటుపడ్డారని, అలాంటి వారి సమస్యలకు రాజకీయ రంగు రుద్దవద్దని విజ్ఞప్తి చేశారు. వివిధ పనులు చేసిన బిల్లులు రాక, తెచి్చన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందిపడుతున్నామని.. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. -
అన్నీ అమ్ముకుని నౌకపై దేశాలు తిరుగుతూ...
భూమిమీద బతికే మనిషికి అన్నీ సమస్యలే... ఇంటి రెంట్ మొదలుకొని ఇన్స్యూరెన్స్ వరకూ అన్నీ మోయలేనంత భారమే. అందుకే దీనికి పరిష్కారం క్రూయిజ్ షిప్లో బతకడం అంటూ తేల్చిపారేస్తున్నారు జాన్, హెన్సెస్సీ దంపతులు. క్రూయిజ్ షిప్లో నివసించడం అంటూ మొదలుపెడితే మీరు యుటిలిటీ బిల్లులు, ఆటో బీమా, ఆస్తి బీమా మొదలైనవి అస్సలు చెల్లించాల్సిన అవసరం లేదని జాన్, హెన్సెస్సీలు ముక్తకంఠంతో చెబుతున్నారు. క్రూయిజ్ షిప్లో నివసించేందుకు సిద్ధమైన జాన్, హెన్సెస్సీ దంపతులు 2020లో ఫ్లోరిడా(అమెరికా)లోని తమ ఇల్లు, వ్యాపారం, విలువైన వస్తువులను విక్రయించేశారు. రాయల్ కరీబియన్ క్రూయిజ్ లైన్స్‌లో 274 రోజుల ప్రయాణం కోసం టిక్కెట్లను కొనుగోలు చేశారు..‘ఇప్పుడు మేము టెలిఫోన్ బిల్లు, షిప్పింగ్ బిల్లు చెల్లిస్తే సరిపోతుంది. కొన్ని క్రెడిట్ కార్టు మా దగ్గర ఉన్నాయి. ఇకపై మేము ఇంటి అద్దె, వాహన బీమా, ఆస్తి బీమా, యుటిలిటీ బిల్లులు... ఇలా పెద్ద జాబితాను చెల్లించాల్సిన అవసరం లేదు’ అని ఆ దంపతులు పేర్కొన్నారు. ఈ దంపతులు త్వరలో రెసిడెన్షియల్ క్రూయిజ్ షిప్ ఎక్కనున్నారు. దానిలో వారు క్యాబిన్‌ను కొనుగోలు చేశారు. ఇందుకోసం వారు ‘విల్లా వీ’ని ఎంచుకున్నారు. ఇది శాశ్వత నివాసాన్ని అందించే తొలి క్రూయిజ్ షిప్‌లలో ఒకటి. దీనిలోని ప్రయాణికులలో 30శాతం మంది పూర్తి సమయం దీనిలోనే ఉంటారు. మిగిలిన 85శాతం ప్రయాణికులు యూఎస్ పౌరులు. ఈ క్రూయిజ్ షిప్‌లోని క్యాబిన్ ధర 99 వేల డాలర్లు(ఒక డాలర్ రూ. 83). సీ వ్యూ కలిగిన బాల్కనీ విల్లాల ధర 249 వేల డాలర్లు. క్యాబిన్లలో కిచెన్, అతిథుల కోసం లివింగ్ రూమ్‌లో పుల్ డౌన్ బెడ్ ఉంటాయి. ఇందులో నివాసం కల్పించుకున్నవారు పోర్ట్ ఛార్జీలు చెల్లించాక తమ కుటుంబాలను ఉచితంగా ఆన్‌బోర్డ్‌లోకి తీసుకువచ్చేందుకు అనుమతివుంటుంది. ‘విల్లా వీ’ సీఈఓ మైకేల్ పెటర్సన్ మీడియాతో మాట్లాడుతూ తమ షిప్‌లోని దాదాపు సగం క్యాబిన్లలో వ్యాపార యజమానులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారన్నారు. కాగా జాన్, హెన్సెస్సీ దంపతులు క్రూయిజ్‌లో ఉంటూనే తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వీలైనంత వరకు నడుస్తుంటారు. ఈ భారీ షిప్ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి భూగోళాన్ని చుట్టుముడుతుంది. వెచ్చని వాతావరణంలో ఉండేందుకు సూర్యుడిని అనుసరిస్తుంది. జాన్, హెన్సెస్సీ దంపతులు తమకు కనిపించినవారందరికీ ఈ భూమిమీద నివసించడం కన్నా ఇలా క్రూయిజ్ షిప్లో బతకడమే చౌకైనదని, అదే ఉత్తమమని సలహా ఇస్తుంటారు. ఇది కూడా చదవండి: పాక్ రాజకీయాల్లో పెను సంచలనాలు! -
ఇది విజయమా... వైఫల్యమా?
చరిత్ర సృష్టించటం మంచిదే. కానీ ఆ చరిత్ర తరతరాలు చెప్పుకొనేలా వుండాలి. ఈ నెల 4న ప్రారంభమై ఎజెండా అంశాలన్నీ పూర్తికావటంతో ఒకరోజు ముందు గురువారం నిరవధిక వాయిదా పడిన పార్లమెంటు సమావేశాలు ఫలవంతమయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. లోక్‌సభ వరకూ చూస్తే ఈ సమావేశాలు దాదాపు 62 గంటలు సాగాయి. అత్యంత కీలకమైన 18 బిల్లులు చర్చల అనంతరం ఆమోదం పొందాయి. ఇందులో భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), సాక్ష్యాధారాల చట్టం స్థానంలో కొత్త చట్టాలుగా వస్తున్న భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులున్నాయి. టెలికమ్యూనికేషన్ల బిల్లువుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాల బిల్లుంది. వార్తాపత్రికల, మేగజిన్ల కొత్త రిజిస్ట్రేషన్ చట్టం తాలూకు బిల్లు కూడావుంది. మొత్తంగా లోక్‌సభ 74 శాతం ఉత్పాదకతను చూపింది. రాజ్యసభ సైతం 17 బిల్లుల్ని ఆమోదించింది. సమావేశాలు 65 గంటల పాటు సాగాయి. దాని ఉత్పాదకత రేటు 79 శాతం వుంది. ఈ 17వ లోక్‌సభకు సంబంధించిఇవి 14వ సమావేశాలు. వీటన్నిటా ఈ సమావేశాలే అత్యంత ఫలవంతమైనవని గణాంకాలు వివరి స్తున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికల్లోగా మరో సమావేశం మాత్రమే జరుగుతుంది. అందులో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టడం మినహా మరే ఇతర కార్యకలాపాలూ వుండకపోవచ్చు. అయితే బాధాకరమైన అంశమేమంటే... ఈ ప్రధాన బిల్లుల చర్చల్లో దాదాపుగా విపక్షం లేదు. ఇరవైరెండేళ్ల నాటి చేదు అనుభవాన్ని గుర్తుకు తెస్తూ ఈనెల 13న యువకులు పదడుగుల ఎత్తునున్న ప్రేక్షకుల గ్యాలరీ నుంచి కిందకు దూకి పొగగొట్టాలు వదిలి దిగ్భ్రమపరిచారు. పార్లమెంటువెలుపల సైతం అదే సాగింది. అమెరికాలో వున్న ఖలిస్తానీ తీవ్రవాది పన్నూ పార్లమెంటుపై దాడిచేస్తామని అంతకు చాలారోజులముందే బెదిరించాడు. అప్రమత్తంగా వుండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం సూచించాయి. అయినా పార్లమెంటు భద్రత వ్యవహారాలు చూసే వ్యవస్థ నిద్రాణమై వుంది. దాడి జరిగి పదిరోజులు గడుస్తున్నా దానికి సూత్రధారులెవరో ప్రజలకు తెలియలేదు. 2001 దాడినుంచి భద్రతా వ్యవస్థలు ఏ గుణపాఠమూ నేర్చుకోలేదని ఈ పరిణామం తెలియజేసింది. ఇదిగాక దేశాన్ని ఆశ్చర్యపరిచిన ఘటన మరొకటుంది. అది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సభా బహిష్కరణ. ఇన్ని చేదు ఉదంతాల మధ్య సమావేశాలు ఫలవంతంగా జరిగాయని అనుకోగలమా? విపక్షాలు పాలకులను నిలదీయటం, అర్థవంతమైన చర్చల ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సర్వసాధారణం. తమ సూచనలనూ, సలహాలనూపట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించే ప్రభుత్వానికి మూకుమ్మడిగా తమ అసమ్మతిని తెలియ జేయటానికి వాకౌట్ ఒక ఆయుధం. తగిన జవాబిచ్చినా విపక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగా సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని, నినాదాలు చేస్తున్నారని, ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారని, అధ్యక్ష స్థానాన్ని కించపరుస్తున్నారని, దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని భావించినప్పుడు అందుకు కారకులైనవారిపై సస్పెన్షన్ వేటు వేయటం కూడా కొత్తేమీ కాదు. కానీ అటువంటి ఉదంతాలు రాను రాను పెరుగుతుండటం, రివాజుగా మారటం ఆందోళన కలిగిస్తోంది. ఈసారి ఉభయ సభలనుంచీ 146 మంది ఎంపీలు సస్పెండయ్యారు. లోక్‌సభలోకి యువకులు చొరబడటంపై ప్రధాని, హోంమంత్రి ప్రకటన చేయాలంటూ సభలో ఆందోళన నిర్వహించటం, వెల్‌లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించటం కారణంగా ఈ సస్పెన్షన్లు చోటుచేసుకున్నాయి. కొందరు ఎంపీలపై సభాహక్కుల కమిటీకి ఫిర్యాదు వెళ్లింది. దేశం మొత్తాన్ని దిగ్భ్రమలో పడేసిన ఉదంతంపై ప్రకటన చేసే విషయంలోకేంద్రం ఎందుకంత పట్టుదలకు పోయిందో ఆశ్చర్యం కలిగిస్తుంది. లోక్‌సభలో దాడిచేసిన ఉదంతంపై ప్రకటన చేసినంత మాత్రాన విపక్షాలకు లొంగిపోయినట్టు కాదు... సంప్రదాయ విరుద్ధం అసలే కాదు. ఈ ఉదంతం వెనక ఏ శక్తులున్నాయో, వారి ఉద్దేశాలేమిటో వివరించటం వల్ల, తదనంతరం తీసుకున్న పటిష్ట చర్యలేమిటో చెప్పటంవల్ల దేశ ప్రజలకు సాంత్వన కలుగుతుంది. ఈ సస్పెన్షన్ల పర్యవసానంగా అత్యంత కీలకమైన బిల్లులపై విపక్షం ఆలోచనలేమిటో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. ఉదాహరణకు ఐపీసీ స్థానంలో వచ్చిన భారతీయ న్యాయసంహిత బిల్లు పోలీసులకు తగినంత జవాబుదారీతనం ఇవ్వకుండానే వారికి విస్తృతాధి కారాలు కట్టబెడుతున్నదని నిపుణులంటున్నారు. సీఆర్పీసీ స్థానంలో తెచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహితలో ఏ చర్య ఉగ్రవాదమో, ఏది కాదో నిర్ణయించే అధికారాన్ని పోలీసులకు ఇచ్చారు. దీన్ని న్యాయస్థానాల్లో సవాలు చేస్తామని విపక్షాలంటున్నాయి. ఇక టెలికాం బిల్లు అంశానికొస్తే జాతీయ భద్రతా ప్రయోజనాల కోసమంటూ తాత్కాలికంగా టెలికాం సర్వీసుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొనేందుకు అది వీలుకల్పిస్తోంది. సీఈసీ, ఈసీల నియామకం సంగతి సరేసరి. వీటన్నిటిపైనా లోతైన చర్చ సాగొద్దా? పౌరుల్లో తలెత్తిన సందేహాలకు సమాధానాలు దొరకాల్సిన అవసరం లేదా? కనీసం అందుకోసమైనా విపక్షాల సస్పెన్షన్లు ఎత్తివేసివుంటే పాలకపక్షం పెద్ద మనసు వెల్లడయ్యేది. గత దశాబ్దం వరకూ రాజీవ్‌గాంధీ హయాంలో 66 మంది ఎంపీల సస్పెన్షనే రికార్డుగా నమోదైతే, ఈసారి ఆ సంఖ్య 146కి ఎగబాకటం ఆందోళనకరం. సమావేశాల అంతరా యానికి కారకులెవరన్న అంశాన్నలా వుంచితే... సమన్వయంతో, సదవగాహనతో మెలగి పార్లమెంటరీ వ్యవస్థ ఔన్నత్యాన్ని నిలబెట్టడం ఇరుపక్షాల బాధ్యత కాదా? -
Winter Parliament Session 2023: క్రిమినల్ చట్టాలకు ఆమోదం
న్యూఢిల్లీ: బ్రిటిష్ వలస పాలన నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మూడు కీలక బిల్లులకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను లోక్‌సభ బుధవారం మూజు వాణి ఓటుతో ఆమోదించిన విషయం తెలిసిందే. భారతీయ న్యాయ సంహిత బిల్లు, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిల్లు, భారతీయ సాక్ష్య బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ఇండియన్ పీనల్ కోడ్–1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్–1898, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్–1872 స్థానంలో ఈ మూడు బిల్లులను తీసుకొచ్చారు. ‘ఈ బిల్లులు చట్ట రూపం దాల్చితే ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ మొదలుకొని తీర్పు వరకు అన్నీ ఆన్లైన్ అవుతాయి. దేశ విద్రోహ చట్టం రద్దయి పోయింది. రాజద్రోహాన్ని దేశద్రోహంగా మార్చారు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు భంగం కలిగించే చర్యలకు కొత్త చట్టం ప్రకారం శిక్షలుంటాయి’అని అమిత్ షా వివరించారు. దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టులు డిజిటైజ్ అవుతాయని చెప్పారు. వీటిల్లో చండీగఢ్ మొట్టమొదటగా డిజిటైజ్ అవుతుందన్నారు. బ్రిటిష్ పాలనలో గాంధీజీ, తిలక్, సావర్కర్ వంటి వారిని జైళ్లకు పంపిన నిబంధనలను తొలగించడం సంతోషాన్నిచ్చిందని మంత్రి చెప్పారు. బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు సభలో లేనప్పటికీ మంత్రి ఆ పార్టీపై విమర్శలు చేశారు. ఇటాలియన్ అద్దాలు ధరించిన వారు భారత పార్లమెంట్ కొత్త క్రిమినల్ చట్టాలను రూపొందించడాన్ని సగర్వంగా భావించరంటూ కాంగ్రెస్ నేత సోనియానుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్‌కు ‘కౌన్సిల్’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభలో అధికారం చేపడుతున్న కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలో మాత్రం విచిత్రమైన స్థితిని ఎదుర్కోనుంది. 40 మంది సభ్యులున్న మండలిలో 37 మంది ప్రతిపక్షాలకు చెందిన వారు కాగా కేవలం ముగ్గురు (బీఆర్ఎస్ను వీడిన ఇద్దరితో కలిపి) మాత్రమే కాంగ్రెస్ సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం గవర్నర్ కోటాలో రెండు స్థానాలు మాత్రమే ఖాళీగా ఉండగా, ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు సభ్యులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో ప్రస్తుతం కేవలం ఐదు స్థానాలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అయితే మూడు ఖాళీలు మాత్రమే స్వల్ప సమయంలో భర్తీ అయ్యే అవకాశం ఉంది. 2025 మార్చి లోపు ఏ కోటాలోనూ రిటైర్ అయ్యే సభ్యులు ఎవరూ లేకపోవడంతో కాంగ్రెస్ తరఫున పెద్ద సంఖ్యలో సభ్యులు మండలిలో అడుగు పెట్టేందుకు ఏడాదిన్నర వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. స్థానిక సంస్థల కోటాలో 14 స్థానాలు ఉండగా 2028లో 18 మంది రిటైర్ అవుతారు. ప్రస్తుతం మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ సహా ఎక్కువమంది బీఆర్ఎస్కు చెందిన వారే ఉండటంతో శాసనస భ ఆమోదించే తీర్మానాలు, బిల్లులు మండలిలో నెగ్గడం బీఆర్ఎస్పైనే ఆధారపడి ఉంటుంది. ముగ్గురు తోడయ్యే చాన్స్ శాసనమండలిలో గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు ఈ ఏడాది ఆగస్టులో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను కేసీఆర్ ప్రభుత్వం సిఫారసు చేసింది. అయితే వీరు రాజకీయ పార్టీల సభ్యులుగా ఉన్నారనే కారణంతో గవర్నర్ తిరస్కరించారు. దీంతో ఈ రెండు ఖాళీల్లో ఇద్దరిని గవర్నర్ కోటాలో నామినేట్ చేసే అవకాశం కొత్త ప్రభుత్వానికి ఉంటుంది. ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి జగిత్యాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినా ఓటమి పాలు కావడంతో ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి (కల్వకుర్తి), కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ఆయన కుమారుడు రాజేశ్‌రెడ్డి (నాగర్‌కర్నూల్) కాంగ్రెస్ టికెట్ కోసం బీఆర్ఎస్ను వీడారు. కసిరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ప్రస్తుతం మండలిలో జీవన్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి మాత్రమే కాంగ్రెస్ సభ్యులుగా కొనసాగనున్నారు. మరోవైపు కసిరెడ్డితో పాటు ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి (జనగామ), కడియం శ్రీహరి (స్టేషన్ ఘనపూర్) కూడా ప్రస్తుత ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికవడంతో మండలిలో 3 సీట్లు ఖాళీ కానున్నాయి. వీరిలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి గ్రాడ్యుయేట్స్, కసిరెడ్డి స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన నేపథ్యంలో వీరి స్థానంలో కొత్తగా వచ్చే వారు ప్రత్యక్ష ఎన్నిక ద్వారానే మండలిలో అడుగు పెట్టాల్సి ఉంటుంది. కడియం శ్రీహరి ఎమ్మెల్యే కోటాలో ఎన్నిక కావడంతో కాంగ్రెస్‌కు ఉన్న సంఖ్యా బలం ప్రకారం పార్టీ ఎంపిక చేసిన వారికి ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుంది. అంటే ఇప్పటికిప్పుడు గవర్నర్ కోటాలో ఇద్దరు, ఎమ్మెల్యే కోటాలో ఒకరే కాంగ్రెస్ తరఫున మండలికి ఎన్నికయ్యేందుకు అవకాశం ఉందన్నమాట. బీఆర్ఎస్ తరహాలో వలసలు? తొలిసారి 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు కాంగ్రెస్, టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుని మండలిలో బలోపేతమైంది. ఇప్పుడదే తరహా వ్యూహాన్ని కాంగ్రెస్ కూడా అనుసరిస్తుందా? అన్న అంశంపై చర్చ ప్రారంభమైంది. -
పార్లమెంట్ సమావేశాల్లో 18 బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 నుంచి 22 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో 18 బిల్లులను ప్రవేశ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో రెండు జమ్మూకశ్మీర్, పుదుచ్చేరిలలో మహిళా రిజర్వేషన్ల వర్తింపు బిల్లులు, ఐపీసీ స్థానంలో తెచ్చే మూడు నేర శిక్షాస్మృతి బిల్లులు ఉన్నాయి. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ బులెటిన్ విడుదల చేసింది. శీతాకాల సమావేశాల్లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్యను 107 నుంచి 114కు పెంచే బిల్లు పార్లమెంట్ ముందుకు రానుంది. దీనివల్ల కశ్మీర్ నుంచి వలస వెళ్లినవారికి, శరణార్థులకు, ఎస్టీలకు చట్టసభలో ప్రాతినిథ్యం లభించనుంది. ఈ బిల్లులతోపాటు 2023-24కు సంబంధించి సప్లిమెంటరీ గ్రాంట్లపై సమావేశాల్లో చర్చ, ఓటింగ్ జరగనుంది. ఐపీసీ చట్టాల స్థానంలో ద భారతీయ న్యాయ సంహిత, ద భారతీయ నాగరిక సురక్ష సంహిత, ద భారతీయ సాక్ష్య బిల్లును కేంద్రం తీసుకొస్తుంది. మరోవైపు సమావేశాల ప్రారంభానికి ముందు డిసెంబర్ 2న అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. చదవండి: దంపతుల పోట్లాట దెబ్బకు.. దారి మళ్లిన విమానం! -
తమిళనాడు పిటిషన్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీస్
న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల ఆమోదంలో గవర్నర్ తాత్సారం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు స్పందన కోరింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జే/బీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ మేరకు నోటీసు జారీ చేసింది. రాజ్యాంగ బద్ధమైన ఒక అధికారం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వ విధులను అడ్డుకుంటోందని తమిళనాడు ప్రభుత్వం పిటిషన్లో ఆరోపించింది. జోక్యం చేసుకోవాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన 12 బిల్లులు గవర్నర్ ఆర్ఎన్ రవి వద్ద పెండింగ్‌లో ఉన్నాయని విచారణ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 20న చేపడతామని తెలిపింది. -
కీలక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
-
నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు జరుగనున్న ఈ సమావేశాలు పాత భవనంలో మొదలై మంగళవారం గణేశ్ చతుర్ధి సందర్భంగా కొత్త భవనంలోకి మారనున్నాయి. సమావేశాల్లో తొలిరోజు పార్లమెంట్లో 75 ఏళ్ల ప్రయాణంపై చర్చతో పాటు పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ప్రత్యేక చర్చ సహా కీలక బిల్లులు... సమావేశాల్లో ప్రధానంగా డిసెంబర్ 9, 1946న తొలిసారి పార్లమెంట్ సమావేశమైంది. అది మొదలు 75 ఏళ్ల ప్రయాణంపై తొలిరోజు చర్చ జరుగనుంది. ఈ 75 ఏళ్ల ప్రస్థానంలో పార్లమెంట్ విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలపై సభ్యులు మాట్లాడనున్నారు. దీంతో పాటే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకానికి సంబంధించిన బిల్లును కూడా ప్రభుత్వం సభ ముందుకు తేనుంది. గత వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ïదీంతో పాటే లోక్‌సభలో ’ది అడ్వొకేట్స్ (సవరణ) బిల్లు, 2023’, ’ది ప్రెస్ అండ్ రిజి్రస్టేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు, 2023’ఉన్నాయి. ’ది పోస్టాఫీస్ బిల్లు, 2023’నూ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) బిల్లులు సైతం ఈ సమావేశాల్లోనే తెస్తారనే ప్రచారం జరుగుతున్నా కేంద్ర వర్గాలు ధ్రువీకరించడం లేదు. నిరుద్యోగం..ద్రవ్యోల్బణంపై విపక్షాల పట్టు.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో పాల్గొనేందుకు ఇండియా బ్లాక్‌కు చెందిన మొత్తం 24 పారీ్టలు అంగీకరించాయి. చైనా దురాక్రమణ, కుప్పకూలుతున్న ఆర్ధిక వ్యవస్థ, పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అదానీ కంపెనీ అక్రమాలు సహా పలు కీలక అంశాలను సమావేశాల్లో చర్చించాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాం«ధీ ఇదివరకే ప్రధాని మోదీకి లేఖ రాశారు. పార్లమెంట్ నూతన భవనంపై జాతీయ జెండా పార్లమెంట్ నూతన భవనం గజద్వారంపై ఆదివారం సాయంత్రం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన వెంట లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు. అంతకుముందు ధన్‌ఖడ్, బిర్లాలకు సీఆర్పీఎఫ్ పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ బలగాలు వేర్వేరుగా గౌరవవందనం సమరి్పంచాయి. రేపు ఎంపీల ఫొటో సెషన్ ఎంపీలందరికోసం మంగళవారం ప్రత్యేక ఫొటో సెషన్ ఏర్పాటు చేశారు. పార్లమెంట్ సభ్యులంతా మంగళవారం ఉదయం 9.30 గంటలకు జరిగే గ్రూప్ ఫొటో సెషన్‌కు రావాల్సిందిగా లోక్‌సభ సెక్రటేరియట్ కోరింది. మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాల్సిందే అఖిలపక్షం భేటీలో రాజకీయ పార్టీల పట్టు సోమవారం నుంచి మొదలయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని పలు రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని గట్టిగా కోరాయి. అయితే, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యేక సెషన్ నేపథ్యంలో ఆదివారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్షం భేటీకి పలు రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ సమావేశంలోనే సభ ముందుంచాలని పలువురు నేతలు కోరారు. బిల్లు ఏకాభిప్రాయంతో ఆమోదం పొందుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, కొన్ని ప్రాంతీయ పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీలు, ఎస్సీలకు ప్రత్యేక కోటా కావాలంటూ డిమాండ్ చేస్తుండటం అడ్డంకిగా మారింది. -
ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఏ ఏ బిల్లులు ప్రవేశపెడతారు?
-
సగం సమయం కూడా పని చెయ్యలేదు
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ సమయంలో సగం కూడా పని చెయ్యలేదు. అయినప్పటికీ రికార్టు స్థాయిలో 23 బిల్లులు పాసయ్యాయి. మణిపూర్‌లో జాతుల ఘర్షణ ఈ సారి ఉభయసభల్ని కుదిపేసింది. లోక్‌సభ కార్యకలాపాలు 43% జరిగితే, రాజ్యసభ 55% సమయం కార్యకలాపాలు కొనసాగించింది. పాలసీ రీసెర్చ్ స్టడీస్ (పీఆర్ఎస్) అందించిన డేటా ప్రకారం లోక్‌సభ 17 రోజులు సమావేశమైంది. అవిశ్వాస తీర్మానంపై 20 గంటల సేపు చర్చ జరిగింది. ఈ చర్చలో 60 మంది సభ్యులు పాల్గొన్నారు. పార్లమెంటు ఆమోదించిన బిల్లుల్లో ఢిల్లీలో పాలనాధికార బిల్లు, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటక్షన్ బిల్లు, అటవీ సంరక్షణ సవరణ బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు ప్రధానమైనవి. ఈసారి సభలో ప్రవేశ పెట్టిన బిల్లుల్లో 56% కేవలం ఎనిమిది రోజుల్లో పార్లమెంటు ఆమోదాన్ని పొందాయి. మరో 17% బిల్లుల్ని కమిటీల పరిశీలనకు పంపారు. -
అసెంబ్లీ సమావేశాలకు తెర
సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజుల పాటు కొనసాగిన తెలంగాణ శాసనసభ ఎనిమిదో విడత సమావేశాలు ఆదివారం ముగిశాయి. తెలంగాణ రెండో శాసనసభ (2018–23)కు ఇవే చివరి విడత సమావేశాలు కావడంతో సభ్యులు భారంగా వీడ్కోలు పలికారు. చివరి రోజు సమావేశంలో ‘ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల సేవల విలీనం’బిల్లు తీవ్ర ఉత్కంఠ నడుమ సభ ముందుకు వచ్చి ఆమోదం పొందింది. ఆదివారం ఉదయం ప్రశ్నోత్తరాలు లేకుండా నేరుగా జీరో అవర్‌తో ప్రారంభమైన సభ ఆ తర్వాత ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం – స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతి’అనే అంశంపై జరిగిన లఘు చర్చకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు 2.30 గంటల పాటు సవివరంగా సమాధానం ఇచ్చారు. అనంతరం మూడు ప్రభుత్వ బిల్లుల ఆమోదం, గద్దర్‌కు సంతాపం ప్రకటించిన తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఉభయ సభలు హుందాగా సాగాయి: వేముల అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రజాస్వామ్య బద్ధంగా, సభ్యుల సస్పెన్షన్లు లేకుండా సాఫీగా జరిగాయని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. దేశంలోనే నంబర్‌వన్ అనే రీతిలో నడిపాం: పోచారం 2019 జనవరి 18న శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన తాను అందరి సహకారంతో దేశంలోనే నంబర్ వన్ అనే రీతిలో సభను నడిపానని పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఉద్యోగులను ప్రభుత్వ సేవల్లోకి తీసుకోవడం) బిల్లు 2023 శానసభ ఆమోదించడం పట్ల స్పీకర్ పోచారం, సీఎం కేసీఆర్‌కు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ అసెంబ్లీలోని వారి చాంబర్లలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. సురవరం ప్రతాపరెడ్డిపై వెలువరించిన ‘ససురవరం–తెలంగాణం’ మూడు సంకలనాలను శాసనసభలో సీఎం కేసీఆర్‌కు వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అందజేశారు. 4 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో శాసనసభ 26.45 గంటలు, శాసన మండలి 23.10 గంటల పాటు సమావేశమైంది. -
నేడు అసెంబ్లీ ముందుకు మరో మూడు బిల్లులు
-
శాసనసభ ముందుకు 10 కీలక బిల్లులు
-
‘అవిశ్వాసం’ పూర్తయ్యేదాకా సభలో బిల్లులు ఆమోదించొద్దు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ఇతర బిల్లులను ఆమోదించడం సరైంది కాదని కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మనీశ్ తివారీ అభిప్రాయపడ్డారు. అవిశ్వాసంపై చర్చ, ఓటింగ్ జరిగి ఫలితం తేలిన తర్వాతే ఇతర బిల్లును ప్రవేశపెట్టడం లేదా ఆమోదించడం చేయాలని అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంపై లోక్‌సభలో విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం దీనిపై 10 రోజుల్లోగా చర్చ, ఓటింగ్ నిర్వహించాల్సి ఉంది. బిల్లులను ఇష్టారాజ్యంగా ఆమోదింపజేసుకోవడానికి ఈ గడువును వాడుకోవద్దని మనీశ్ తివారీ హితవు పలికారు. అలా చేయడం పార్లమెంటరీ సంప్రదాయాలకు, నైతిక విలువలకు విరుద్ధమన్నారు. -
మరుగుదొడ్ల నిర్మాణంలో రూ.కోటి స్వాహా!
చింతపల్లి : మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసే బిల్లుల్లో అధికారులు చేతివాటం ప్రదర్శించారు. ఆన్లైన్లో లబ్ధిదారులకు బిల్లు చెల్లించినట్లుగా చూపించి.. ఏకంగా సుమారు రూ.కోటికి పైగా స్వాహా చేశారు. చింతపల్లి మండలంలో అధికారులు మరుగుదొడ్ల బిల్లుల్లో మొదటి విడత చెల్లించి.. రెండో విడతలో మొండి చేయి చూపించారు. మరి కొందరికి అసలు బిల్లులే చెల్లించలేదు. పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అధికారులు వాటిని పంచుకు తిన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిధులు స్వాహా చేసినట్లు తెలియడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. రూ.6వేల చొప్పున రెండు విడతల్లో.. స్వచ్ఛ భారత్ మిషన్ కింద చింతపల్లి మండలంలోని 34 గ్రామాల్లో 3,874 మందిని మరుగుదొడ్లు లేనివారిని లబ్ధిదారులుగా గుర్తించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి రెండు విడతల్లో రూ.6వేల చొప్పున రూ.12 వేలను లబ్ధిదారుడికి ప్రభుత్వం అందిస్తుంది. మరుగుదొడ్డి నిర్మాణ దశలను ఫీల్డ్ అసిస్టెంట్లు తనిఖీ చేసి నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్డి వద్ద లబ్ధిదారుడిని ఉంచి ఫొటో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. తర్వాత పంచాయతీ కార్యదర్శి, సంఘబంధం అధ్యక్షురాలు, సర్పంచ్ సంతకం చేసి పరిశీలించి రెండు విడతల్లో రూ.6 వేల చొప్పున లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తారు. మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి అయిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లు ధ్రువీకరణ అనంతరం గ్రామపంచాయతీ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. ఈ వెసులుబాటును అవకాశంగా చేసుకుని అంతా కుమ్మకై ్క బిల్లులు కాజేశారని ఆరోపణలు వస్తున్నాయి. అక్రమాలకు తెరలేపిన అధికారులు.. మరుగుదొడ్ల బిల్లులు బిల్లు ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా ఉండడం ఏమిటని అధికారులను ఇటీవల కొందరు లబ్ధిదారులు నిలదీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. 2018 సంవత్సరంలో మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు 2019లోపే కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించింది. అయితే మొదటి విడత రూ.6 వేలు లబ్ధిదారులకు ఇచ్చి, మరో రూ.6 వేలు కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్టు మింగేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు అనుకూలంగా ఉన్న వారు మరుగుదొడ్లు నిర్మించుకోకున్నా నిర్మాణం జరిగినట్లుగా ఆన్లైన్ చేసి నిధులు స్వాహా చేశారని తెలుస్తోంది. పలు గ్రామాల్లో సొంతంగా మరుగుదొడ్లు నిర్మించుకున్న వారి సొమ్మును సైతం మింగేశారు. అసలైన లబ్ధిదారులు డబ్బుల గురించి అడిగితే ఆర్థిక సంవత్సరం ముగియడంతో నిధులు మురిగిపోయాయని చెబుతూ వస్తున్నారు. పైసా ఇవ్వలేదు స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా నా తల్లి పిల్లి యాదమ్మ పేరు మీద 2019లో మరుగుదొడ్డి నిర్మించుకున్నా. ఇందుకు సంబంధించి బిల్లు ఇవ్వాలని ఎన్నిసార్లు ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులను కలిసినా పట్టించుకోవడం లేదు. మరుగుదొడ్డి నిర్మించుకొని నాలుగేళ్లు కావస్తున్నా పైసా ఇవ్వలేదు. ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలి. – పిల్లి లింగం, చింతపల్లి బిల్లులు ఇప్పించేలా చూస్తాం మరుగుదొడ్డి నిర్మించుకొని బిల్లు అందని కొందరు ఎంపీడీఓ కార్యాలయంలో సంప్రదించారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా మరుగుదొడ్డి నిర్మించుకుని బిల్లులు పొందని వారిని ఏపీఓను సంప్రదించాలని సూచించాం. బిల్లులు అందని వారికి బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. – రాజు, ఎంపీడీఓ, చింతపల్లి బిల్లులు అందలే.. చింతపల్లి మండల కేంద్రంలోనే 180 మంది లబ్ధిదారులకు మొదటి విడత బిల్లు రూ.6 వేలు అందగా.. రెండో విడతకు సంబంధించి రూ.6 వేలు రావాల్సి ఉంది. కుర్మేడు గ్రామంలో 130, కుర్రంపల్లిలో 130 మందికి రెండు విడతలకు సంబంధించి బిల్లులు రావాల్సి ఉంది. వెంకటంపేట, నసర్లపల్లి గ్రామాల్లో మరుగుదొడ్డి నిర్మించుకోని వారి పేరిట బిల్లులు స్వాహా చేయగా మరుగుదొడ్డి నిర్మించుకున్న వారికి మాత్రం బిల్లులు అందించలేదు. నెల్వలపల్లి, ఉప్పరపల్లి, గడియగౌరారం, మల్లారెడ్డిపల్లి, హోమంతాలపల్లి, వింజమూరు గ్రామాల్లో కూడా లబ్ధిదారులకు బిల్లులు అందాల్సి ఉంది. -
అంగన్వాడీ కేంద్రాలకు బిల్లులు ఎప్పుడిస్తారో..?
కొత్తగూడెంటౌన్: అంగన్వాడీ కేంద్రాలకు బిల్లులు చెల్లించకపోవడంతో టీచర్లపై ఆర్థికభారం పడుతోంది. బిల్లుల మంజూరు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సివస్తోంది. ప్రతి నెలా వచ్చిన వేతనంలో సగానికి పైగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని అంగన్వాడీ టీచర్లు వాపోతున్నారు. కేంద్రాల నిర్వహణకు అద్దె చెల్లింపులు, గ్యాస్, ఈవెంట్, కూరగాయలు, పోషణ్ అభియాన్, స్టేషనరీ తదితర ఖర్చులు నెలకు సుమారు రూ. 6 వేలకు పైగా వస్తున్నాయని పేర్కొంటున్నారు. జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు 1,434, మినీ కేంద్రాలు 626.. మొత్తం 2,060 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రానికి గ్యాస్ బిల్లు రూ.1200, ప్రతి నెలా 15 రోజులకు ఒక ఈవెంట్ చొప్పున రెండు ఈవెంట్లకు రూ.500, నెలకు సరిపడా కూరగాయలు రూ.600, మీటింగ్‌కు రూ.300, స్టేషనరీ ఖర్చులు ఏడాదికి రూ.1000తో పాటు పోషణ్ అభియాన్‌కు రూ.100ల చొప్పున నెలకు మొత్తం రూ.6,200 ఖర్చవుతోందని అంగన్వాడీ టీచర్లు పేర్కొంటున్నారు. అద్దె భవనాల్లో 785 కేంద్రాలు కొనసాగుతుండగా అద్దె బకాయి విడుదల చేయడం లేదు. ప్రతి అంగన్వాడీ కేంద్రం నిర్వహణకు అద్దె నెలకు ప్రాంతాన్ని బట్టి రూ. 600, రూ.1500, రూ.2 వేలు. రూ.3 వేల వరకు చెల్లించాల్సి ఉంది. కేంద్రాల నిర్వహణపై ప్రభావం అంగన్వాడీ కేంద్రాల్లో గ్యాస్‌కు సంబంధించి రూ.1,200 చొప్పున మూడు నెలల బిల్లు పెండింగ్‌లో ఉంది. ఈవెంట్ బిల్లులు 5 నెలకు రూ.2,500 చెల్లించాల్స ఉంది. ఆరోగ్యలక్ష్మి బిల్లు 3 నెలలుగా చెల్లించడంలేదు. కూరగాయల బిల్లు నెలకు రూ.600 చొప్పున ఏడాది నుంచి చెల్లించడంలేదు. జిల్లాలో 785 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఒక్కో సెంటర్‌కు ఏరియాను బట్టి రూ.600 నుంచి రూ.3 వేల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం 8 నెలలుగా అద్దె బకాయి చెల్లించడంలేదు. మీటింగ్ ఖర్చులు కూడా ఏడాది నుంచి ఇవ్వడం లేదని టీచర్లు వాపోతున్నారు. ఏడాదికాలంగా బకాయిలు చెల్లించకుండా ఉంటే తాము కేంద్రాలను ఎలా నడపాలని అంగన్వాడీ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణపై ప్రభావం పడుతోందని చెబుతున్నారు. -
10,783 కనెక్షన్లకు ‘జీరో’ బిల్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను కొందరు అధికారులు, సిబ్బంది మరింతగా ముంచుతున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. నాగర్‌కర్నూల్ డివిజన్ పరిధిలో ఏకంగా 10,783 విద్యుత్ కనెక్షన్లకు జీరో యూనిట్ల వినియోగంతో బిల్లులు జారీ చేస్తున్నట్లు సంస్థ విజిలెన్స్ విభాగం విచారణలో తేలింది. దీంతో సంస్థ ప్రతి నెలా రూ. లక్షల్లో ఆదాయాన్ని నష్టపోయినట్లు వెల్లడైంది. అయితే ఆయా బిల్లుల వాస్తవ మొత్తాలను వినియోగదారుల నుంచి కొందరు అధికారులు, సిబ్బంది వసూలు చేసుకొని జేబులో వేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) చైర్మన్ తన్నీరు శ్రీరంగారావుకు జి.సత్యనారాయణ అనే న్యాయవాది చేసిన ఫిర్యాదుతో ఈ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ప్రతి విద్యుత్ కనెక్షన్‌కు ఒక మీటర్, ఆ మీటర్‌కు ఒక విశిష్ట సంఖ్య ఉంటుంది. కానీ ఒకే మీటర్ నంబర్‌తో 10,783 సర్విసు కనెక్షన్లు ఉన్నట్లు విజిలెన్స్ తేల్చినట్లు సమాచారం. 2,788 కనెక్షన్లపైనే విచారణ.. ఈఆర్సీ సూచనలతో టీఎస్ఎస్పీడీసీఎల్ విజిలెన్స్ విభాగంతో విచారణ జరిపించింది. 10,783 సర్వీసు కనెక్షన్లలో 2,788 కనెక్షన్లను మాత్రమే విజిలెన్స్ విభాగం తనఖీ చేయగలిగింది. సిబ్బంది కొరతతో మిగిలిన కనెక్షన్లను తనిఖీ చేయలేకపోయింది. తనఖీ చేసిన 2,788 కనెక్షన్లలో కేవలం 687 కనెక్షన్లకే మీటర్లున్నాయని, మిగిలిన 2101 కనెక్షన్లకు మీటర్లు లేవని గుర్తించింది. తనిఖీ చేసిన కనెక్షన్లకు సంబంధించి తప్పుడు మీటర్ రీడింగ్‌ను నమోదు చేసి బిల్లులు జారీ చేయడంతో సంస్థ రూ. 9.32 లక్షల ఆదాయాన్ని నష్టపోయినట్టు నిర్ధారించింది. 10,783 కనెక్షన్లలో ఏకంగా 4,842 కనెక్షన్లకు మీటర్లే లేవని నాగర్‌కర్నూల్ డీఈ మరో నివేదికలో టీఎస్ఎస్పీడీసీఎల్కు తెలియజేశారు. ఒక్క నాగర్‌కర్నూల్ డివిజన్ పరిధిలోనే ఈ పరిస్థితి బయటపడగా రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా అవకతవకతలతో డిస్కంలు రూ. వందల కోట్ల మేర ఆదాయాన్ని నష్టపోతున్నాయని ఆరోపణలున్నాయి. 41 మందిపై చర్యలకు ఆదేశం.. నాగర్‌కర్నూల్ డివిజన్లో వెలుగు చూసిన భారీ అక్రమాల్లో స్థానికంగా పనిచేసే 41 మంది ఓఅండ్ఎం విభాగం అధికారులు, సిబ్బంది, మరో ముగ్గురు అకౌంట్స్ విభాగం అధికారులను బాధ్యులుగా విజిలెన్స్ విభాగం తేల్చింది. ఈ నివేదిక ఆధారంగా 14 మంది ఏఈలు, నలుగురు ఏడీఈలు, మరొక డీఈపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎండీ జి.రఘుమారెడ్డి ఆదేశించారు. వారి బాధ్యతారాహిత్యం, విధుల్లో నిర్లక్ష్యంతోనే మీటర్ రీడర్లు అక్రమాలకు పాల్పడ్డారని, వారితోపాటు ప్రైవేటు మీటర్ రీడింగ్ ఏజెన్సీపైనా చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ఈ వ్యవహారంలో ఇంకా ఎవరినీ సస్పెండ్ చేయలేదని అధికార వర్గాలు తెలిపాయి.