జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో పేరుకుపోయిన రూ.58 కోట్ల మొండి బకాయిల వసూలే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామని డీసీసీబీ డిప్యూటీ రిజిస్ట్రార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఓఎస్డీ ఎస్వీ ప్రసాద్ అన్నారు.
గుర్రంపోడు : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో పేరుకుపోయిన రూ.58 కోట్ల మొండి బకాయిల వసూలే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామని డీసీసీబీ డిప్యూటీ రిజిస్ట్రార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఓఎస్డీ ఎస్వీ ప్రసాద్ అన్నారు. మంగళవారం మండలంకేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల గుర్రంపోడు సహకార సంఘం పరిధిలోని 151 మంది బకాయిదారులైన రైతులకు నోటీసులు ఇచ్చామన్నారు. మండలంలో సహకార సంఘం ద్వారా 3 కోట్ల 86 లక్షల మొండి బకాయిలు వసూలు కావాల్సి ఉందన్నారు. తీసుకున్న అప్పు కట్టాల్సిన బాధ్యత రుణగ్రహీతలపైనే ఉంటుందన్నారు. సహకార చట్టం ప్రకారం ఎన్‌ఫోర్స్‌మెంట్ రిజిస్ట్రార్ చర్యలపై హైకోర్టులో అప్పీలు చేసుకునే వీలు మాత్రమే ఉండేలా కఠిన చట్టాలు అమలులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ చెర్మన్ కుప్ప రాములు ఉన్నారు.