హసనాపురం మాజీ సర్పంచ్ కిడ్నాప్ | Hasanapuram former Sarpanch kidnapped | Sakshi
Sakshi News home page

హసనాపురం మాజీ సర్పంచ్ కిడ్నాప్

Published Mon, Nov 10 2014 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 4:09 PM

అస్సోం రాష్ట్రంలో కాంట్రాక్టు పనులు చేయిస్తున్న రామాపురం మండలం హసనాపురం గ్రామ మాజీ సర్పంచ్ పప్పిరెడ్డి మేహ శ్వరరెడ్డిని ఆదివారం బోడో మిలిటె ంట్లు కిడ్నాప్ చేశారు.

రామాపురం:  అస్సోం రాష్ట్రంలో కాంట్రాక్టు పనులు చేయిస్తున్న రామాపురం మండలం హసనాపురం గ్రామ మాజీ సర్పంచ్ పప్పిరెడ్డి మేహ శ్వరరెడ్డిని ఆదివారం బోడో మిలిటె ంట్లు కిడ్నాప్ చేశారు. దివాస్ జిల్లా గౌడీ(అటవీ) ప్రాంతంలో ఇతను కిడ్నాప్‌కు గురైనట్లు బంధువులు తెలిపారు. క్లాస్‌వన్ కాంట్రాక్టర్ అయిన మహేశ్వరరెడ్డి గుజరాత్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, అస్సోం రాష్ట్రాలలో ఐఎల్‌ఎఫ్( రాంకీ కంపెనీ )లో సబ్ కాంట్రాక్టర్‌గా పని చేయిస్తున్నారు.

అస్సోం రాష్ట్రం దివాస్ జిల్లాలో రూ.45 కోట్లతో 70 కిలోమీటర్ల వరకు రోడ్డుపనులు చేయిస్తున్నారు. గత వారం రోజులుగా బోడో మిలిటెంట్లు (సయ్యద్ గ్రూపు) నుంచి ప్రమాదం పొచి ఉందని అక్కడి పోలీసు వర్గాలు ముందస్తుగా హెచ్చరించినట్లు సమాచారం. అస్సోంలో ఇటీవల కురిసిన వ ర్షాలకు చేసిన పనులు కొట్టుకుపోవడంతో పనులకు సంబంధిన బిల్లులు ఆగిపోయాయి.

దీంతో వారం రోజుల నుంచి అక్కడే ఉండి పనులు పర్యవే క్షించి ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చేందుకు విమానం టికె ట్ కూడా మహేశ్వరరెడ్డి సిద్ధం చేసుకున్నారు. ఉదయం పనుల వద్దకు సైట్ ఇంజనీర్‌తో కలసి వెళ్తుండగా మహేశ్వరరెడ్డితో పాటు సైట్ ఇంజనీర్‌ని మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. కొద్ది దూరం వెళ్లిన తరువాత సైట్ ఇంజనీర్‌ను వదిలిపెట్టినట్లు సమాచారం.

హసనాపురం పంచాయతీకి చెందిన పప్పిరెడ్డి గంగిరెడ్డి మూడవ సంతానమైన మహేశ్వరరెడ్డి ఢిల్లీలో ఏజీబీఎస్సీ చదివి క్లాస్ వన్ కాంట్రాక్టర్‌గా స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో గచ్చిబౌలీ రాంకీ టవర్స్ యు బ్లాక్ 204లో నివాసముంటున్నారు. భార్య సుభద్రమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె నిషితాకు ఇటీవలే వివాహం చేశారు. ఆయన హసనాపురం గ్రామ సర్పంచ్‌గా ఉన్న సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మోహన్‌రెడ్డి, ద్వారకనాథరెడ్డిలకు ఇతను సన్నిహితుడు.
 
మహేశ్వరరెడ్డి కిడ్నాప్‌తో గ్రామస్తుల్లో ఆందోళన

హసనాపురం గ్రామానికి చెందిన మహేశ్వరరెడ్డిని బోడో మిలిటెంట్లు కిడ్నాప్ చేశారనే విషయం తెలియడంతో హసనాపురం గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అలాగే మహేశ్వరరెడ్డి సతీమణి స్వగ్రామమైన గాలివీడు మండలం నూలివీడు గ్రామంలో కూడా ఆందోళన నె లకొంది.
 
గాలివీడులో ఆందోళన

గాలివీడు: మండల పరిధిలోని నూలివీడుకు చెందిన రెడ్డెప్పరెడ్డి అల్లుడు, క్లాస్-1 కాంట్రాక్టర్ అయిన పి.మహేశ్వరరెడ్డి(50)ని ఆదివారం ఉదయం బోడో మిలిటెంట్లు అస్సాంలో కిడ్నాప్ చేసినట్లు తెలియగానే నూలివీడు, ప్యారంపల్లెలోని ఆయన సమీప బంధువులు ఆందోళన చెందుతున్నారు.  గాలివీడు మండలంలో వేరుశనగ కాయల వ్యాపారం మానేసిన తర్వాత క్లాస్-1 కాంట్రాక్టర్‌గా ఎదిగిన ఆయన విశాఖపట్టణం, బెంగళూరు, హైదరాబాదు నగరాల్లో కాంట్రాక్టు పనులు చేసేవారు. ప్రస్తుతం అస్సోం రాష్ర్టంలో రూ. 16 కోట్లతో చేపట్టిన పనులు నిర్వహిస్తున్నట్లు బంధువులు తెలిపారు.

హైదరాబాదులోని ఆయన బంధువులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ద్వారా అస్సోం ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్‌తో కిడ్నాప్ విషయం గురించి మాట్లాడినట్లు సమాచారం. కిడ్నాప్ సమాచారం తెలుసుకున్న రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే మోహన్‌రెడ్డిలు హుటాహుటిన అస్సోంకు బయలుదేరి వెళ్లారు.
 
అస్సోం అడిషనల్ డీజీపీతో చర్చించిన శ్రీకాంత్‌రెడ్డి


రాయచోటి: అస్సోం రాష్ట్రం దివాస్ జిల్లాలో పప్పిరెడ్డి మహేశ్వరరెడ్డి కిడ్నాప్‌కు గురైన విషయంపై అస్సోం రాష్ట్ర అడిషనల్ డీజీపీ ఆర్‌పి ఠాకూర్‌తో రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి చర్చించారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆర్మీ రంగంలోకి దిగినట్లు అడిషనల్ డీజీపీ తెలిపారు. రాత్రి వేళ కూడా మహేశ్వరరెడ్డికోసం గాలిస్తామన్నారు. అలాగే  ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి పేషీలో పనిచేస్తున్న అధికారి భానుతో, దివాస్ జిల్లా ఎస్పీతో కూడా ఎమ్మెల్యే మాట్లాడారు.  ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి సోమవారం ఉద యం అస్సోంకు బయలుదేరి వెళ్లనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement