Road works
-
గుంతల్లో... చిడతల మేళం!
ముఖ్యమంత్రి చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కొత్త పుంతలు తొక్కుతోంది. చేసేది గోరంత.. ప్రచారం కొండంత అన్నట్లుగా ఆయన హైడ్రామా సాగిస్తుండటం అందరినీ విస్మయపరుస్తోంది. కేవలం రూ.860 కోట్లతో రోడ్ల మీద గుంతలు పూడ్చే పనులకు చంద్రబాబు పత్రికలు, టీవీ చానళ్లతోపాటు సోషల్ మీడియాలో చేసుకుంటున్న విపరీత ప్రచారం వెర్రితలలు వేస్తోంది. ఏదో సాగునీటి ప్రాజెక్టును నిర్మించి ప్రారంభోత్సవం చేసినంత స్థాయిలో ఆయన తెగ హడావుడి చేస్తున్నారు. గుంతలు పూడ్చే కార్యక్రమానికి కూడా ప్రారంభోత్సవం అంటూ జేసీబీలు ఎక్కి మరీ ఫొటోలకు ఫోజులు ఇవ్వడం ఆశ్చర్యపరుస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యంతో విజయవాడను వరదలు ముంచేస్తే.. తీరిగ్గా మేల్కొన్న చంద్రబాబు సహాయక చర్యల పేరిట మీడియాలో ప్రచారం కోసం కక్కుర్తిపడ్డారు. ఆ ప్రచార హైడ్రామాను కొనసాగింపుగా రోడ్ల గుంతలు పూడ్చే పనులకు కూడా ఆయన ప్రచారం చేసుకుంటుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, అమరావతిపబ్లిసిటీ లేకుండానే నాలుగేళ్లలో రూ.43 వేల కోట్ల పనులు..నిజానికి.. 2019 నుంచి 2024 వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి భారీస్థాయిలో నిధులు వెచ్చించినా ఎలాంటి ప్రచార ఆర్భాటాలకు పోలేదు. రోడ్ల గుంతలు పూడ్చటం మాత్రమే కాదు.. వాటితోపాటు పెద్ద సంఖ్యలో జగన్ సర్కారు కొత్త రోడ్లను నిర్మించింది. కోవిడ్ ప్రభావంతో దేశంలో ఏడాదికి పైగా అన్ని రకాల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. దాంతో రోడ్ల నిర్మాణం కూడా ఒక ఏడాదిపాటు నిలిచిపోయింది. కానీ, అందుబాటులో ఉన్న నాలుగేళ్లలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం రోడ్ల మరమ్మతుల కోసమే రూ.4,648 కోట్లు ఖర్చుచేయగా.. కొత్త రోడ్ల నిర్మాణంతో సహ మొత్తం రూ.43వేల కోట్లు వెచ్చించింది. అయినాసరే.. నాటి సీఎం వైఎస్ జగన్ ఎలాంటి ప్రచారం కోరుకోలేదు. అది ప్రభుత్వ బాధ్యతగానే ఆయన భావించారు.అప్పట్లో బాబు వెచ్చించింది రూ.23వేల కోట్లే..ఇక రోడ్ల గురించి గప్పాలు కొట్టుకునే చంద్రబాబు 2014–19 మధ్య చేసింది అంతంతమాత్రమే. ఆ ఐదేళ్లలో రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు, నిర్మాణం కోసం టీడీపీ ప్రభుత్వం ఖర్చుచేసింది కేవలం రూ.24వేల కోట్లే. అంతేకాదు.. రోడ్ల నిర్మాణం కోసం తీసుకున్న రూ.3వేల కోట్ల రుణాన్ని 2019 ఎన్నికల ముందు పసుపు–కుంకుమ పథకానికి మళ్లించింది. కానీ, రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చినట్లుగా బిల్డప్ ఇస్తూ మీడియాలో తెగ ప్రచారం చేసుకుంది. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వంలో కూడా ఈ నాలుగు నెలల్లో రోడ్ల నిర్మాణానికి చేసింది సున్నానే. గుంతలు పూడ్చడానికి కేవలం రూ.860 కోట్లు కేటాయించింది. ఇక కొత్త రోడ్ల నిర్మాణ బాధ్యతల నుంచి ప్రభుత్వం పూర్తిగా తప్పుకుంది. పీపీపీ విధానంలోనే కొత్త రోడ్లను నిర్మిస్తామని ప్రకటించింది. తద్వారా వాహనదారుల నుంచి భారీగా టోలు ఫీజులు వసూలు చేసేందుకు రంగం సిద్ధంచేసింది. ఆ ముసుగులో టీడీపీ పెద్దలే కాంట్రాక్టర్లుగా మారి టోలు బాదుడుకు సిద్ధపడుతున్నారు. -
HYD: ఒక్కసారిగా కుంగిన భూమి.. నడిరోడ్డుపై భారీ గుంత
సాక్షి, హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. దీంతో, రోడ్ల మధ్యలో గుంతలు ఏర్పడుతున్నాయి. ఇక, తాజాగా చందానగర్‌లో రోడ్డు మధ్యలో ఒక్కసారిగా భారీ గుంత పడింది. దీంతో, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.వివరాల ప్రకారం.. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీ నగర్ కాలనీ నుంచి ధర్మపురి క్షేత్రం మార్గంలో శాంతినగర్ ప్రధాన రహదారిపై శుక్రవారం సాయంత్రం ఉన్నట్టుండి రోడ్డు మధ్యలో కుంగి భారీ గుంత ఏర్పడింది. దీంతో, ఈ ఘటనపై స్థానికులు.. జీహెచ్ఎంసీ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులకు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.అయితే, రోడ్డు కుంగి గుంత ఏర్పడిన చోట తాగునీటి పైపు లైన్, డ్రైనేజీ పైపు లైన్లు ఉన్నాయి. దీంతో రహదారి మధ్యలో గుంత ఏర్పడి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రయాణికులు అటు వైపు వచ్చి ప్రమాదాలు బారిన పడకుండా గుంత చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా రోడ్డు కుంగిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్ రైళ్లు -
ఎట్టకేలకు స్పందించారు
‘ఎన్నాళ్లీ నరకం’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనానికి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. వరంగల్ జాతీయ రహదారిపై అసంపూర్తి దశలో నిలిచిపోయిన ఉప్పల్– నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, అధికారులతో కలిసి ఫ్లై ఓవర్ నిర్మాణంపై అక్కడికక్కడే సమీక్షించారు. ఈ సందర్భంగా వరంగల్ రహదారిపై భారీగా ట్రాఫిక్‌జాం ఏర్పడింది. Uppal - Narapally Flyover: ఎన్నాళ్లీ నరకం? -
Uppal - Narapally Flyover: ఎన్నాళ్లీ నరకం?
ప్రత్యక్ష నరకం మీరెప్పుడైనా చవిచూశారా? అయితే.. ఉప్పల్– నారపల్లి రహదారిలో ప్రయాణించండి నరకం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఆరేళ్లుగా వాహనదారులు, ప్రయాణికులు, స్థానికులు, వ్యాపారులు తిప్పలు పడుతూనే ఉన్నారు. వరంగల్ జాతీయ రహదారిలో ఉప్పల్– నారపల్లి మధ్య 6.2 కిలో మీటర్ల మేర చేపట్టిన కారిడార్ ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ పనులు అర్ధాంతరంగా ఆగిపోవడంతో నిత్యం నరకాన్ని అనుభవించాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దుమ్మూ ధూళి.. బురద.. కంకర తేలి గుంతలు ఏర్పడి.. వానొస్తే రోడ్డుపై కుంటలను తలపిస్తున్నాయి. ఎక్కడ గొయ్యి ఉందో తెలియక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుర్గతి పట్టింది. ఆరేళ్లుగా ఈ దురావస్థతోనే ప్రజలు కాలం వెళ్లబుచ్చుతుండటం శాపంలా పరిణమించింది. ఎంతటి దయనీయ పరిస్థితి దాపురించిందో ప్రజాప్రతినిధులు అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తమ గోడు ఎవరితో చెప్పుకోవాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణ బాధితులు. ఇప్పటికైనా ఏళ్లుగా పడుతున్న నరకం నుంచి తమను గట్టెక్కించాలని వేడుకొంటున్నారు. ఉప్పల్: వరంగల్ జాతీయ రహదారిలో ఉప్పల్ నుంచి నారపల్లి వరకు 6.2 కిలో మీటర్ల మేర 148 పిల్లర్లతో ఫ్లై ఓవర్ పనులకు అప్పటి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.625 కోట్లు. 2018 జులైలో ప్రారంభమైన పనులు 2020 జూన్‌లో పూర్తి కావాలి. కానీ.. పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో 6.2 కి.మీ మేర రోడ్డంతా గుంతలమయంగా మారింది. దీంతో ప్రజలు, వాహనదారులు నిత్యం ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ రహదారిలో నిమిషానికి దాదాపు 960 నుంచి 1000 వరకు వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఉప్పల్ కూడా ఒకటి. దీంతో రోడ్డు సరిగా లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అనేక మంది అమాయకులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు సైతం కోల్పోయిన ఘటనలున్నాయి. అభివృద్ధి శరవేగం.. ఇటు అధ్వానం..ఉప్పల్ నుంచి నల్ల చెరువు వరకు రోడ్డుకు ఇరు వైపులా ఉన్న వర్తక, వాణిజ్య దుకాణాలు రోడ్డు వెడల్పు పనులతో తీవ్రంగా నష్టపోయాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నల్ల చెరువు వరకు రోడ్డుకు ఇరువైపులా 450 షాపులు ఉన్నాయి. ఫ్లై ఓవర్ నిర్మాణంతో రోడ్డు సరిగా లేని కారణంగా వ్యాపారాలు పూర్తిగా దెబ్బ తిన్నాయని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల జాబితాల్లో ఉప్పల్ మొదటి స్థానంలో ఉంది. ఒకవైపు మెట్రో రైలు.. మినీ శిల్పారామం, స్కైవాక్ వంతెన, ఉప్పల్ టు నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. ఇలా ఎటు చూసినా అన్నివిధాలా ఉప్పల్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల్లో జాప్యంతో ఇక్కడి ప్రజలు, వాహనదారులు, వ్యాపారులు ఆరేళ్లుగా నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. కేవలం రెండేళ్లలో పూర్తి కావాల్సిన నిర్మాణానికి అనేక అడ్డంకులు రావడంతో పనులు నిలిచి పోయాయి. దీంతో ఇక్కడి ప్రజలకు ఎదురు చూపులే మిగిలాయి. కాంట్రాక్టు రద్దు చేశారా? ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కాంట్రాక్టును గాయత్రీ కన్స్ట్రక్షన్స్ సంస్థ దక్కించుకున్న విషయం విదితమే. కానీ.. పనుల్లో తీవ్ర జాప్యం కారణంగా సదరు సంస్థ గడువులోగా పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో సదరు కాంట్రాక్టును ప్రభుత్వం రద్దు చేసినట్లు ప్రకటించింది. మరో సంస్థకు మిగిలిన పనులను అప్పగించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.బిజినెస్ నిల్.. వరంగల్ జాతీయ రహదారి ఉప్పల్ మార్గంలో స్టేషనరీ, వస్త్ర, వాణిజ్య షాపులు, పూజా సామగ్రి, కిరాణా, ఆటోమొబైల్, ఫర్నిచర్, స్వీట్ దుకాణాలు, హోటళ్లు తదితర అనేక వ్యాపారాలు మనుగడ పొందుతున్నాయి. కాగా.. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల కారణంగా దుమ్మూ ధూళితో వ్యాపారాలు దెబ్బ తిన్నాయి. రోడ్లు వేయక పోవడం, విద్యుత్ స్తంభాలను మార్చకపోవడం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచక పోవడంతో వందలాది మంది వ్యాపారులు అవస్థలు పడుతున్నట్లు వర్తక సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆరేళ్లుగా వ్యాపారాలు నిల్.. కారిడార్ నిర్మాణ పనులు ప్రారంభించినప్పటి నుంచి రోడ్లు లేక దుమ్ము కొట్టుకుపోవడంతో గిరాకీ లేక అవస్థలు పడుతున్నాం. 90 శాతం గిరాకులు దెబ్బతిన్నాయి. వ్యాపారులమంతా తీవ్రంగా నష్టపోయాం. – శేఖర్ సింగ్, ఉప్పల్ వర్తక సంఘం ప్రతినిధి రోడ్డుపైకి రావాలంటే సాహసం చేయాల్సిందే.. ఉప్పల్ రోడ్డు మీదకు రావాలంటే సాహసం చేయాల్సి వస్తోంది. ఏళ్లుగా పాడైపోయిన రోడ్ల మీద వాహనం నడిపి ఆరోగ్యం పోగొట్టుకోవాల్సి వస్తోంది. ఎవరికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయింది. మా బాధలను పట్టించుకునే వారే లేకుండాపోయారు. స్కూల్ పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. – శ్రీనివాస్ గౌడ్, స్కూల్ కరస్పాండెంట్గత ప్రభుత్వ అశ్రద్ధతోనే.. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అశ్రద్ధ వల్లనే రోడ్డు ఎటూ కాకుండా పోయింది. ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పని చేయాలి. కాని పారీ్టలను దృష్టిలో పెట్టుకుని కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరితగతిన ముందుకు వచ్చి నిర్ణయం తీసుకోవాలి. – మేకల శివారెడ్డి, ఉప్పల్ పట్టణ మున్సిపల్ మాజీ చైర్మన్ -
భయానక వాతావరణం సృష్టించేందుకే..
సాక్షి టాస్‌్కఫోర్స్: వైఎస్సార్ జిల్లా నల్లచెరువుపల్లె గ్రామ సమీపంలో చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ హైవే పనుల్లో వాటా అడిగారని, ఇస్తానని చెప్పినా చివరికి పనులు మొత్తం ఇవ్వాలని టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చారని కాంట్రాక్టర్ శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. దీనికి అంగీకరించని తాను 15 రోజులుగా నిలిచిపోయిన పనుల్ని తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భయానక వాతావరణం సృష్టించడానికి గ్రీన్‌ఫీల్డ్ హైవే క్యాంపు ఆఫీసుకు దుండగులు నిప్పుపెట్టారని చెప్పారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే రోడ్డు పనులను మెగా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకుంది. ఇందులో నాలుగు కిలోమీటర్ల మేర పనుల్ని సబ్ కాంట్రాక్ట్ కింద సిద్ధార్థ కంపెనీ యజమాని రామిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి తీసుకున్నారు. ఏప్రిల్‌లో పనులు మొదలుపెట్టారు. పనులు జరుగుతుండగా కూటమి అధికారంలోకి వచ్చి0ది. అప్పటి నుంచి హైవే పనులకు అడ్డంకులు ఎదురయ్యాయి. టీడీపీ నేతలు నల్లచెరువుపల్లె గ్రామ సమీపంలో జరిగే హైవే పనులను అడ్డుకున్నారు. వాటా ఇవ్వందే పనులు చేయకూడదని హుకుం జారీచేశారు. అయినా కాంట్రాక్టర్ పనులు ప్రారంభించడానికి సిద్ధమైన తరుణంలో వారు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో రాయల్టీ లేకుండా గ్రావెల్ తరలిస్తున్నారని అధికారులు టిప్పర్లను సీజ్‌చేశారు. రాయల్టీ అధికారులు విధించిన జరిమానా చెల్లించి టిప్పర్లను తెచ్చుకుని పనులు ప్రారంభించే సమయంలో క్యాంపు ఆఫీసును తగులబెట్టారు. హైవే రోడ్డు పనులు నాలుగు కిలోమీటర్లు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నానని, దాన్లో రెండు కిలోమీటర్లు చేసుకునేందుకు ఇచ్చేస్తానని టీడీపీ నేతలకు చెప్పినట్లు కాంట్రాక్టర్ తెలిపారు. కానీ వారు మొత్తం నాలుగు కిలోమీటర్ల పనులు కావాలంటూ ఒత్తిడి తెచ్చారు. ఇందుకు అంగీకరించని తాను పనులు ప్రారంభించడానికి సిద్ధమయ్యానని, ఈ పనులను ఎలాగైనా ఆపాలనే ఉద్దేశంతో కొంతమంది దుండగులు గ్రీన్‌ఫీల్డ్ హైవే క్యాంపు ఆఫీసును తగులబెట్టారని చెప్పారు. ఈ సంఘటనలో సుమారు రూ.30 లక్షల నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
కామారెడ్డి ఎమ్మెల్యే మరో సంచలన నిర్ణయం..
సాక్షి, కామారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల సమయంలో సొంత మేనిఫెస్టో ప్రకటించడంతోపాటు, ఇద్దరు ఉద్ధండులను ఓడించి చరిత్ర సృష్టించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(కేవీఆర్) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు విస్తరణ కోసం ముందుగా తన ఇంటిని కూల్చేందుకు ముందుకొచ్చారు. కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి అడ్లూర్ రోడ్డు వరకు విస్తరణకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ఇదే రోడ్డులో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇల్లుతోపాటు మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ ఇల్లు కూడా ఉంది. ట్రాఫిక్ పెరగడంతోపాటు, పలుచోట్ల ఆక్రమణలతో ఈ రోడ్డు ఇరుకుగా మారింది. ఈ నేపథ్యంలో రోడ్డు విస్తరణ కోసం స్వచ్ఛందంగా తన ఇంటిని కూల్చేందుకు ఎమ్మెల్యే కేవీఆర్ సిద్ధమయ్యారు. శనివారం ఇంటి కూల్చివేత పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. తన ఇంటితోనే రోడ్డు వెడల్పు పనులు జరిగేలా ప్రణాళిక రూపొందించిన ఆయన.. పదిరోజుల క్రితమే ఇంటిని ఖాళీ చేసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి మారారు. వెయ్యి గజాలకుపైగా స్థలాన్ని మున్సిపల్ అధికారులు అప్పగించారు. మరోవైపు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చేందుకు బల్దియా అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే ఇంటిని కూల్చివేశాక రోడ్డు వెడల్పు పనులు ఏ మేరకు ముందుకు సాగుతాయో అన్న విషయమై పట్టణంలో చర్చ నడుస్తోంది. -
‘గిరి’ రహదారులకు మోక్షం
మెళియాపుట్టి: ‘గిరి’ గ్రామాల రహదారుల కష్టాలకు ఎట్టకేలకు తెరపడింది. శ్రీకాకుళం జిల్లాలోని మెళియాపుట్టి మండలంలో ఉత్తరాంధ్రలోనే అత్యంత ఎత్తయిన గిరిజన గ్రామాలు ఉన్నాయి. వాటికి దశాబ్దాలుగా రహదారి సౌకర్యాలు లేవు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక సీఎం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే రెడ్డి శాంతి ‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించి, గిరి శిఖర గ్రామాలను సందర్శించి వారి సమస్యలు, కష్టాలను తెలుసుకున్నారు. రహదారి కష్టాలు తీరితే అన్ని సౌకర్యాలు వారికి అందుతాయనే ఆలోచన చేసి, విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే కృషి ఫలితంగా ఉత్తరాంధ్రలోనే ఎత్తయిన గిరిశిఖర గ్రామమైన చందనగిరి గ్రామానికి (రూ.1.25 కోట్లతో 3.10 కి.మీ), హడ్డివాడ (రూ.1.75 కోట్లతో 2.3 కి.మీ), కేరాసింగి (రూ.92 లక్షలతో 1.5 కి.మీ), కేరాసింగిగూడ (రూ.1.5కోట్లతో 2.5 కి.మీ), మొత్తంగా రూ.5.42 కోట్లతో గిరి శిఖర గ్రామాలకు వెళ్లే రహదారి పనులకు నిధులు తీసుకువచ్చి పనులు సైతం వేగవంతం చేశారు. ప్రస్తుతం హడ్డివాడ గ్రామానికి రహదారి పూర్తి కాగా.. మిగిలిన గ్రామాలకు రహదారి పనులు చివరి దశలో ఉన్నాయి. గిరిజనులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలోనే గౌరవం లభించిందని, పోడుపట్టాలు అందుకున్నామని, రైతుభరోసాతోపాటుగా అన్ని పథకాలు అందుతున్నాయని ఆయా గిరిజన గ్రామాల ప్రజలు చెబుతున్నారు. కిలోమీటర్ల మేర నడుచుకుంటూ కొండలపైనుంచి కిందికి దిగి, రేషన్ సరుకులు మోసుకుంటూ వెళ్లిన రోజులు మర్చిపోయేలా చేసి కొండలపైకి నేడు ట్రాక్టర్‌పై సరుకులు తీసుకెళ్లి పంపిణీ చేస్తున్నారు. కొద్దిరోజుల్లోనే రహదారి నిర్మాణాలు పూర్తిచేసి గిరిజనుల కష్టాలకు తెరదించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి తెలిపారు. గత తెలుగుదేశం పాలకులు గిరిజనులకు చేసిందేమీ లేకపోవడంతో జగన్మోహన్రెడ్డి ప్రజారంజక పాలనను చూసి ఓర్వలేక విమర్శలకే పరిమితమయ్యారు. ఆనందంగా ఉంది గడప గడపకూ వెళ్లిన సమయంలో రహదారులు చూసి బాధపడ్డాను. వారి గ్రామాలకు వెళ్లి కష్టాలను చూశాను. వారి బతుకులు బాగుచేయాలని ఆలోచించి జగనన్న దృష్టికి సమస్యను తీసుకువెళ్లాను. గిరిజనుల సమస్య అనగానే ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. రహదారుల మంజూరుతో ప్రస్తుతం గిరిజనుల కష్టాలు తీరనున్నందుకు సంతోషంగా ఉంది. ఎమ్మెల్యేగా వారికష్టాలు తీర్చడం చాలా ఆనందంగా ఉంది. గిరిజనాభివృద్ధికి పెద్దపీట వేసిన వ్యక్తి జగనన్న కాబట్టే ఇది సాధ్యమైంది. – రెడ్డి శాంతి, ఎమ్మెల్యే, పాతపట్నం మాటిచ్చారు.. నిలబెట్టుకున్నారు రహదారి కోసం ఎన్నో ఏళ్లు నిరీక్షించాం. ఎంతో మంది చుట్టూ తిరిగాం. కానీ మా స్థితి మారలేదు. మహిళా ఎమ్మెల్యే అయినా.. రెడ్డి శాంతమ్మ కాలినడకన మా గ్రామానికి వచ్చి ‘గడప గడపకూ కార్యక్రమం’ నిర్వహించారు. మా సమస్యలు చెప్పుకొన్నాం. అన్నీ చేస్తానని మాటిచ్చారు. రహదారి మంజూరు చేశారు. రోడ్డు పూర్తి కావడంతో మాకష్టాలు తీరాయి. సంతోషంగా ఉంది. – చందనగిరి పోలయ్య, హడ్డివాడ గ్రామం సంతోషంగా ఉంది జగనన్నను పాదయాత్రలో కలిసి గిరిజనుల కష్టాలను వివరించాను. అధికారంలోకి రాగానే న్యాయం చేస్తాన్నారు. ఎమ్మెల్యే దృష్టికి గిరిజనుల సమస్యలు తీసుకెళ్లా.. ఆమె స్పందించారు. కృషికి ఫలితం లభించింది. ఎంతోకాలంగా కొండప్రాంతాలకు సరైన రహదారులు లేక ఇబ్బందులు పడ్డాం. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో మా గిరిజనుల కష్టాలు తీరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. జెడ్పీటీసీగానే కాకుండా నేను కూడా గిరిజనుల్లో ఒకడ్ని కావడం ఆనందంగా ఉంది. సీఎం జగన్, ఎమ్మెల్యే రెడ్డి శాంతికి రుణపడి ఉంటాను. – గూడ ఎండయ్య, జెడ్పీటీసీ సభ్యుడు, మెళియాపుట్టి మండలం -
ఏకంగా రోడ్డునే దోచేశారు: అవాక్కవుతున్న నెటిజన్లు, వైరల్ వీడియో
బిహార్‌లో మరో వింత చోరీ వైరల్‌గా మారింది. ఏకంగా నిర్మాణంలో ఉన్న రోడ్డునే లూటీ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిహార్ రాష్ట్రంలోని జెహనాబాద్‌లో ఈ షాకింగ్ దొంగతనం చోటు చేసుకుంది. ఈ వైరల్ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహంతో స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపించారు. జెహనాబాద్ గ్రామానికి ముఖ్యమంత్రి గ్రామ సడక్ యోజన కింద రహదారిని నిర్మిస్తున్నారు. కాంట్రాక్టర్ కార్మికులతో కాంక్రీట్ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టారు. కాంట్రాక్టర్లు పాక్షికంగా పూర్తి చేసినా సిమెంట్ పనులను మాత్రం ప్రారంభించలేదు. దీంతో అదును చూసి గ్రామస్తులంతా కలిసి నిర్మాణంలో ఉన్న రోడ్డును లూటీ చేశారు. కొత్తగా వేసిన కాంక్రీటు రోడ్డుకు సంబంధించిన కాంక్రీటు, ఇసుక, చిప్స్ మొత్తాన్ని క్షణాల్లోనే ఖాళీ చేసేశారు. ఒకరికొకరు పోటీ పడి మరీ తన పని కానిచ్చారు. పాక్షికంగా నిర్మించిన రహదారి నిర్మాణ సామగ్రిని దొంగిలించినట్లు గుర్తించినట్లు అధికారులు ధృవకరించారు. జిల్లా కేంద్రానికి మంచి కనెక్టివిటీని అందించాలనే లక్ష్యంతో స్థానిక RJD ఎమ్మెల్యే సతీష్ కుమార్ రెండు నెలల క్రితం రహదారికి శంకుస్థాపన చేశారు. అయితే సిమెంట్ పనులు పూర్తి కాకుండానే గ్రామస్తులు చోరీ చేశారని సతీష్ ఆరోపించారు. దీనిపై మఖ్దుంపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసామన్నారు. ఇది ఇలా ఉంటే అయితే రోడ్డు వేయకముందే అడ్డగోలుగా దోచుకున్నారనీ ఈ రహదారిని ఇంకా మూడు కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉందని వారు చెప్పారు. వాస్తవానికి ఇది స్థానిక పాలనా యంత్రాంగం నిర్లక్ష్యం, వైఫల్యమేనని గ్రామానికి చెందిన కొంతమంది విమర్శించారు. అయితే బిహార్‌లో ఇలాంటి వింత వింత చోరీలు ఇదే మొదటిసారి కాదు. గతంలో రైల్వే ట్రాక్స్ దొంగిలించారు. మరోసారి రైల్వే ఇంజిన్ మాయమైంది. ఆ తరువాత ఏకంగా వంతెననే ఎత్తుకుపోయారు. ఇపుడు మరో దొంగతనంతో తమ రికార్డును తామే అధిగమించారు. ప్రస్తుతం కాంక్రీటు రోడ్డు చోరీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటువంటి దొంగలపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వారిని 5 సంవత్సరాల పాటు అన్ని ప్రభుత్వ సౌకర్యాలకు దూరంగా ఉంచాలంటూ నెటిజన్లు కమెంట్ చేశారు. बिहार में लोगों ने मुख्यमंत्री की सड़क ही लूट ली! जहानाबाद के मखदूमपुर के औदान बीघा गांव में मुख्यमंत्री सड़क ग्राम योजना के तहत सड़क बनाई जा रही थी. दावा है कि ढलाई के समय लोग पूरा मटेरियल ही लूट ले गये. बताया जा रहा कि इससे पहले भी ये सड़क ऐसे ही लूट ली गई थी. (@AdiilOfficial) pic.twitter.com/ZCBiStXr5Y — Utkarsh Singh (@UtkarshSingh_) November 3, 2023 -
డోలీ కష్టాలకు చెక్
శృంగవరపుకోట: గిరిశిఖర గ్రామాల్లో డోలీ మోతలు ఇకపై కనిపించవని ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ కృషితో గిరిశిఖర గ్రామాలకు చేరుకునేందుకు మార్గం సుగమమవుతోందని చెప్పారు. కొండ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలు చకచకా సాగుతున్నాయని, దీనికి విజయనగరం జిల్లా ఎస్.కోట మండలంలోని దబ్బగుంట నుంచి పల్లపుదుంగాడకు వేస్తున్న రోడ్డే నిదర్శనమని అన్నారు. ధారపర్తి పంచాయతీ పరిధిలోని గిరిశిఖర గ్రామాలైన దారపర్తి, పల్లపుదుంగాడ గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన మంగళవారం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పాలనను వివరించారు. పథకాల అందుతున్న తీరును గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. పల్లపుదుంగాడలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ 2019లో ఎన్నికల సమయంలో గ్రామానికి వచ్చినపుడు ప్రాణాల మీదికి వస్తే డోలీ మోతలే దిక్కు అని, దబ్బగుంట నుంచి పల్లపుదుంగాడకు రోడ్డు వేయమని గిరిజనులు అడిగారన్నారు. ఆ మేరకు అటవీశాఖ అనుమతులు సాధించి దబ్బగుంట నుంచి పల్లపుదుంగాడకు ఐదు కిలోమీటర్ల రోడ్డును రూ.4.50 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. పల్లపుదుంగాడ నుంచి దారపర్తి వరకూ మరో 6 కి.మీ మేర రోడ్డు నిర్మాణానికి రూ.5 కోట్లతో ప్రతిపాదనలు పంపించామన్నారు. జల్‌జీవన్ మిషన్ కింద పల్లపుదుంగాడలో ప్రతి ఇంటికి కుళాయిలు వేసి తాగునీరు ఇచ్చామని.. పొర్లు, కురిడి, గూనపాడు, ధారపర్తి గ్రామాల్లో కుళాయిలు వేసే పనులు జరుగుతున్నాయని చెప్పారు. అనంతరం ధారపర్తి ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను ఎమ్మెల్యే సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పినిశెట్టి వెంకటరమణ, స్టేట్ ఫోక్ అకాడమీ డైరెక్టర్ వి.రాంబాబు పాల్గొన్నారు. -
రోడ్డు వేయండి సారూ..
కరీంనగర్ కార్పొరేషన్: రెండు దశాబ్దాల క్రితం వేసిన రోడ్డే దిక్కయింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం రోడ్డును తవ్విన ఆనవాళ్లు నగరమంతటా చెరిగిపోతున్నా ఇక్కడ మాత్రం అలాగే భద్రంగా ఉన్నాయి. మాకు రోడ్డెయండి మహాప్రభో అంటూ అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ కాలనీవాసులు ఏళ్లుగా తిరిగినా పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. నగరంలోని ప్రధాన లింక్ రోడ్డుల్లో ఒకటైన మంకమ్మతోట జ్యోతినగర్ రోడ్డు దుస్థితి ఇది. రెండున్నర కిలోమీటర్లు.. జ్యోతినగర్ మోర్ సూపర్ మార్కెట్ నుంచి కాశ్మీర్‌గడ్డ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వెనుక వైపు వరకు దాదాపు రెండున్నర కిలోమీటర్లు ఈ రోడ్డు ఉంటుంది. 55వ డివిజన్ పరిధిలోని మంకమ్మతోటలోని శ్రీరాంబుక్స్టాల్ నుంచి జ్యోతినగర్ చౌర స్తా వరకు ఉన్న లింక్‌రోడ్డు శిథిలావస్థకు చేరి సంవత్సరాలు గడుస్తున్నా అభివృద్ధికి నోచుకోవడం లే దు. ఇరవైఏళ్లకు ముందు అప్పటి ప్రభుత్వం వేసిన సీసీ రోడ్డు తరువాత ఇప్పటివరకు మళ్లీ రోడ్డు వేయలేదు. రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో తరు చూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. పలుమార్లు మున్సిపల్ అధికారులు వచ్చి చూసినా, ఎలాంటి మార్పు కనిపించడం లేదంటున్నారు. ఇప్పటికై నా రోడ్డును అభివృద్ధి చేయాలని వారు కోరుతున్నారు. పట్టింపు లేదు గుంతలు,పెచ్చులతో రోడ్డు పూర్తిగా చెడిపోవడం, సెట్‌బ్యాక్‌ను పట్టించుకోక ఇరుగ్గా మారడంతో ఈ రోడ్డు వెంట తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు కూడా రోడ్డు మీదనే ట్రాన్స్ఫార్మర్ వేశారు. వినాయక చవితికి డస్ట్ వేస్తరు..కాని నిమజ్జనం వరకు కూడా ఆ డస్ట్ ఉండడం లేదు. ప్రజాప్రతినిధులు పట్టించుకుని ఈ రోడ్డును వెంటనే అభివృద్ధి చేయాలి. – మడపతి రమాపతిరావు, మంకమ్మతోట సమాధానం చెప్పాలి నగరంలో ఎన్నో రోడ్లు అభివృద్ధి చేస్తున్నా ఈ రోడ్డును ఎందుకు పట్టించుకోవడం లేదో ప్రజాప్రతినిధులు చెప్పాలి. 2000 సంవత్సరంలో వేసిన సీసీ రోడ్డు, పూర్తిగా చెడిపోయినా మళ్లీ ఇప్పటివరకు రోడ్డు వేయలేదు. యూజీడీ తవ్వకాల తరువాత మరమ్మతులు కూడా చేయలేదు. ఎన్నిసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసినా పట్టించుకోవడం లేదు. – బద్ధం నర్సింహారెడ్డి, న్యాయవాది -
రోడ్ల పనులు కనిపించడం లేదా?
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిత్యం అసత్య ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న రామోజీరావు.. రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లపై నీరు నిల్వ ఉన్న ప్రదేశాల ఫొటోలు ప్రచురించి ఈనాడు పత్రిక దిగజారుడు పాత్రికేయాన్ని ప్రదర్శించింది. ‘సాఫీ ప్రయాణం సీఎంకేనా’ అంటూ ఓ అసత్య కథనంతో పాఠకులను మోసగించేందుకు ప్రయత్నించింది. ఈనాడు కథనాన్ని ఖండిస్తూ.. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిపై వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతూ ఆర్అండ్బీ శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అత్యంత ప్రాధాన్యతతో రోడ్ల నిర్మాణం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోడ్ల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ఏటా షెడ్యూల్ ప్రకారం రోడ్ల పునరుద్ధరణ పనులు చేపడుతోంది. రెండేళ్లపాటు కోవిడ్ ప్రభావం ఉన్నాసరే రోడ్ల పనులను నిర్లక్ష్యం చేయలేదు. నాలుగేళ్లుగా భారీ వర్షాలు కురుస్తున్నా రోడ్ల పునరుద్ధరణ పనులు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలోనే రూ. 2,400 కోట్లు ఖర్చు చేసి 7,500 కి.మీ. మేర రోడ్లను పునరుద్ధరించింది. కానీ ఈ వాస్తవాన్ని ఈనాడు ప్రస్తావించనే లేదు. రోడ్ల పనులు జరుగుతున్నాయి.. ఈనాడు కథనంలో 13 రోడ్లను పేర్కొంది. ఇందులో 9 రహదారులు ఆర్అండ్బీ విభాగానికి చెందినవి. అందులో 6 రోడ్ల మరమ్మతు పనులు వేగవంతంగా సాగుతున్నాయి. మిగిలిన మూడు రోడ్ల పనులను కూడా త్వరలోనే చేపట్టేందుకు ఆర్అండ్బీ కార్యాచరణ వేగవంతం చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మెరుగ్గా రోడ్ల నిర్మాణం టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రోడ్ల మరమ్మతు పనులకు రూ. 2,953.81 కోట్లు ఖర్చు చేసింది. అంటే ఏడాదికి సగటున రూ. 591 కోట్లు వెచ్చించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలోనే రోడ్ల పునరుద్ధరణకు రూ. 4,148.59 కోట్లు ఖర్చు చేసింది. అంటే ఏడాదికే సగటున రూ. 951 కోట్లు వెచ్చించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగు నెలల్లోనే రూ. 346 కోట్లు ఖర్చు చేసింది. ఇక పంచాయతీరాజ్ శాఖ మరో రూ. 283 కోట్లతో రోడ్లు నిర్మించింది. రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణ కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చించి సకాలంలో పనులు పూర్తి చేస్తున్నా సరే తన మనిషి చంద్రబాబు సీఎంగా లేరన్న అక్కసుతో రామోజీరావు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తున్నారు. -
ఇష్టారాజ్యంగా రోడ్డు విస్తరణ... వంద ఫీట్ల రోడ్డును 85 ఫీట్లకే కుదిస్తున్నారు
తాండూరు టౌన్: పట్టణం మీదుగా వెళ్తున్న నేషనల్ హైవే లింకు రోడ్డు విస్తరణ పనులు అడ్డదిడ్డంగా కొనసాగుతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి అన్నారు. మంగళవారం పలువురు నాయకులతో కలిసి ఎన్‌హెచ్ 167 రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతో బూత్పూర్ నుంచి కర్ణాటకలోని మన్నెకెళ్లి వరకు నేషనల్ హైవే పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తాండూరు పట్టణం గుండా హైవేకు కలిపే లింక్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. రోడ్డు విస్తరణకు వంద ఫీట్ల వరకు ఉండాలని హైవే అధికారులు నిర్ణయించగా.. కేవలం 85 ఫీట్లు మాత్రమే విస్తరణ జరుగుతోందన్నారు. పలువురు బీఆర్ఎస్ నాయకులు భవనాలను కూల్చేయకుండా ఆయా ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా 85 ఫీట్ల మేరకు మాత్రమే విస్తరిస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన రోడ్డు విస్తరణ పనులపై తాండూరు ప్రజలకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, రోడ్డు కాంట్రాక్టరు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. గతంలో నిర్మించిన రోడ్డు డివైడర్‌పైనే సిమెంటు పూత పూసి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. అధికార పార్టీ నాయకుల ఆస్తులను కాపాడేందుకే రోడ్డు ఇరుకుగా నిర్మిస్తున్నారన్నారు. అక్రమాలపై నేషనల్ హైవే అథారిటీ అధికారుల ఫిర్యా దు చేస్తామని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్‌కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను తామే తెచ్చినట్లుబీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఈనెల 22న తాండూరుకు రానున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్తామని తెలిపారు. వీరివెంట పార్టీ పట్టణ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ రజినీకాంత్, మున్సిపల్ ఫ్లో ర్ లీడర్ అంతారం లలిత, కౌన్సిలర్ సాహు శ్రీలత, జిల్లా కార్యదర్శి భద్రేశ్వర్ తదితరులు ఉన్నారు. -
జుక్కల్ నియోజకవర్గానికి రూ.32 కోట్ల నిధులు
మద్నూర్(జుక్కల్): జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, జుక్కల్, పెద్ద కొడప్గల్, పిట్లం, నిజాంసాగర్ ఐదు మండలాలకు రూ.32 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే హన్మంత్‌సింధే వెల్లడించారు. ఆయా మండలాల్లో నిధులను రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్ కోసం వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధికి రూ.335 కోట్లు మంజూరు చేశారని అన్నారు. అతి త్వరలో డిగ్రీ కళాశాల.. మద్నూర్ మండల విద్యార్థులు, ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల అతి త్వరలో రాబోతుందని, దీంతో విద్యార్థుల కళ నెరవేరుతుందని ఎమ్మెల్యే హన్మంత్‌సింధే పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. మద్నూర్‌లో డిగ్రీ కళాశాల లేకపోవడంతో విద్యార్థులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరు కోసం తీవ్రంగా కృషి చేసినట్లు ఆయన అన్నారు. ఆలస్యం లేకుండా మండలానికి డిగ్రీ కళాశాల మంజూరు ఉత్తర్వులు త్వరలో వస్తాయని పేర్కొన్నారు. సెంట్రల్ లైటింగ్ మంజూరుతో బీఆర్ఎస్ నాయకులు టపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేను స్థానిక ప్రజాప్రతినిధులు సన్మానించారు. సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు సురేష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బన్సీపటేల్, ఆత్మకమిటీ చైర్మన్ గంగాధర్, ఉప సర్పంచ్ విఠల్, నాయకులు కంచిన్ హన్మండ్లు, పాకాల విజయ్, కుషాల్ తదితరులు ఉన్నారు. -
వడివడిగా హాయివే.. పామర్రు నుంచి దిగమర్రు వరకు 4 లేన్ల ప్రయాణానికి సిద్ధం
ఆకివీడు: నాలుగు జిల్లాలను అనుసంధానం చేసే ఎన్‌హెచ్ 165 డెల్టా ప్రాంతానికి కీలకం. పామర్రు–(పీపీ) రాష్ట్ర రహదారిగా ఉన్న ఈ రోడ్డును జాతీయ రహదారుల శాఖ రెండు దశాబ్దాల క్రితం విలీనం చేసుకుంది. అయితే రహదారి విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యం ఏర్పడింది. తొమ్మిదేళ్ల క్రితం ఈ రోడ్డు అభివృద్ధికి అప్పటి కేంద్ర మంత్రి ఆకివీడులో భూమి పూజ చేశారు. కృష్ణా జిల్లా పామర్రు నుంచి పశ్చిమ గోదావరి పాలకొల్లు మండలం దిగమర్రు వరకూ 107 కిలోమీటర్ల మేర రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు రూ.1,275 కోట్లు కేటాయించారు. రహదారి విస్తరణ కోసం సరిహద్దు భూముల సేకరణపై కొంత మంది రైతులు, స్థల యజమానులు కోర్టుకు వెళ్లడంతో నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. అయితే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చొరవతో ఈ పనుల్లో మళ్లీ పురోగతి కనిపిస్తోంది. రెండు దశల్లో పనుల నిర్వహణ.. ఈ మొత్తం రహదారి పనులను రెండు ఫేజ్‌లుగా విడదీసి పనులు వేగవంతం చేశారు. పామర్రు నుంచి ఆకివీడు 64 కిలోమీటర్ల మేర ఒక ఫేజ్, అలాగే ఆకివీడు నుంచి దిగమర్రు వరకూ 43 కిలోమీటర్ల మేర మరో ఫేజ్‌లో పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం పామర్రు నుంచి ఆకివీడు వరకూ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 90 కల్వర్టుల నిర్మాణం.. పామర్రు నుంచి ఆకివీడు ఉప్పుటేరు వరకూ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేశారు. రూ.273 కోట్లతో పనులను చేపడుతున్నారు. దీనిలో కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లాల పరిధిలో 90 కల్వర్టులు, 16 వంతెనలు, 2 మేజర్ బ్రిడ్జిల నిర్మాణం వేగంగా జరుగుతోంది. పలు చోట్ల రహదారి విస్తరణ పనులను చేపట్టారు. గుడివాడ, ఆకివీడు వద్ద ఉప్పుటేరుపై మేజర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఆకివీడు నుంచి దిగమర్రుపై కోర్టు వివాదం ఆకివీడు ఉప్పుటేరు నుంచి దిగమర్రు వరకూ రహదారి విస్తరణ కోసం చేపట్టిన భూసేకరణపై కోర్టు వివాదం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న రహదారికి రెట్టింపు భూమి సేకరించాల్సి ఉంది. కొన్ని చోట్ల మూడు లైన్లకు అనుకూలంగా జాతీయ రహదారి భూమి ఉంది. మరికొన్ని చోట్ల రెండు లైన్ల రోడ్డే ఉంది. దీంతో ఆకివీడు, ఉండి, భీమవరం, వీరవాసరం, లంకలకోడేరు ప్రాంతాల్లో భూసేకరణకు ఎన్‌హెచ్ అధికారులు చర్యలు చేపట్టారు. భూ యజమానులకు, ఎన్‌హెచ్ అధికారుల మధ్య అంగీకారం కుదరకపోవడంతో ఆయా ప్రాంతాల్లోని యజమానులు కోర్టును ఆశ్రయించారు. నాలుగు జిల్లాలకు మేలు.. ఎన్‌హెచ్ 165 నాలుగులైన్ల రహదారి విస్తరణ పనులు ఈ ప్రాంతంలో చేపట్టడం ద్వారా రహదారి మరింత అభివృద్ధి చెందుతుందని పలువురు పేర్కొంటున్నారు. దిగమర్రు వరకు రహదారి పనులు పూర్తయితే అక్కడ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు రహదారి అనుసంధానమవుతుందని.. దీని ద్వారా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతోపాటు కృష్ణా జిల్లా ప్రాంత ప్రజలకు మేలు చేకూరుతుందని వివరిస్తున్నారు. వేగంగా పనులు కృష్ణా జిల్లా పరిధిలోని ఎన్‌హెచ్–165 రహదారి విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టు పరిధిలో పామర్రు నుంచి ఆకివీడు ఉప్పుటేరు వంతెన వరకూ రూ.273 కోట్లతో పనులు చేపడుతున్నాం. 90 కల్వర్టులు, రెండు మేజర్ వంతెనల నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. –ఎం.సత్యనారాయణరావు, DE, NH, కృష్ణా జిల్లా కోర్టు అనుమతి రావాలి.. ఎన్‌హెచ్ 165 రహదారికి ఉప్పుటేరు నుంచి దిగమర్రు వరకూ రహదారి విస్తరణ పనులకు కోర్టు అనుమతి ఇవ్వాల్సి ఉంది. పలు చోట్ల రహదారి విస్తరణకు అవసరమయ్యే స్థల సేకరణపై సంబంధిత యజమానులు కోర్టుకు వెళ్లారు. దీంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. నాలుగు జిల్లాలను అనుసంధానం చేసే 165 రహదారి వల్ల ప్రజలకు అనేక ఉపయోగాలున్నాయి. – శ్రీనివాసరావు, DE, NH, పశ్చిమ గోదావరి జిల్లా -
సచివాలయానికి సరికొత్త రహదారులు
సాక్షి, హైదరాబాద్: భవనం వైశాల్యం, నిర్మాణ ప్రత్యేకతల పరంగా దేశంలోనే అతిపెద్ద సచివాలయం. దేశంలో మరే ప్రభుత్వ భవనంపై లేనట్టుగా ఐదంతస్తులకు సరిపడా వైశాల్యంతో రెండు భారీ గుమ్మటాలు.. మంత్రిత్వ శాఖలకు సంబంధించి అన్ని విభాగాలు ఒకేచోట ఉండేలా ఏర్పాటు.. పీక్ అవర్స్‌లో ఆ భవనం చుట్టూ గంటకు 20 వేల వాహనాల ప్రవాహం.. నిత్యం వేల మంది సందర్శకులు వచ్చే ప్రాంగణం.. ముఖ్యమంత్రి, మంత్రులను కలిసేందుకు వచ్చే వీఐపీలు.. అలాంటి కీలకమైన ప్రాంతంలో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడితే ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీన్ని దృష్టిపెట్టుకుని ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు రాకుండా రాష్ట్ర కొత్త సచివాలయం చుట్టూ విశాలమైన రహదారులను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని కొత్త రోడ్లను నిర్మించగా, మిగతా రోడ్లను విశాలం చేయటంతోపాటు మార్పుచేర్పులు చేస్తున్నారు. నలువైపులా నాలుగు రోడ్లు.. సచివాలయం చుట్టూ 4 రోడ్లు సిద్ధమయ్యాయి. ఇప్పుడు వాహనాలు ఒకవైపు నుంచి వచ్చి ఒకవైపే వెళ్లే పరిస్థితి లేకుండా ఎటునుంచి ఎటైనా వెళ్లేలా రోడ్లను సిద్ధం చేశారు. కొత్త భవనాన్ని నిర్మించే సమయంలోనే రోడ్లు, భవనాల శాఖ అధికారులు ఓ ప్రైవేటు సంస్థతో ట్రాఫిక్‌పై అధ్యయనం చేయించారు. కొన్ని రోడ్లు శాస్త్రీయంగా లేకపోవడంతో ట్రాఫిక్ అయోమయం కావడంతోపాటు ప్రమాదాలకు ఆస్కారమిస్తుందని తేలింది. దీంతో వాటన్నింటిని సరిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆమేరకు అధికారులు చర్యలు చేపట్టారు. లుంబినీ వద్ద పాత రోడ్డును మూసేసి.. ♦ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లుంబినీ పార్కువైపు వెళ్లే ప్రధాన రోడ్డు ప్రమాదాలకు ఆస్కారమిచ్చేలా ఉండటంతో లుంబినీ పార్కు వద్ద రోడ్డును మూసేశారు. సచివాలయ ప్రధాన ద్వారం ముందు నుంచి 110 అడుగుల వెడల్పుతో డబుల్ రోడ్డు నిర్మించారు. లుంబినీ వద్ద పాత రోడ్డును మూసేసి ట్రాఫిక్‌ను కొత్త రోడ్డుతో అనుసంధానించారు. ♦ బీఆర్కే భవనం వైపు మళ్లే చోట ఆదర్శనగర్ రోడ్డును వెడల్పు చేస్తున్నారు. అక్కడే ఉన్న కూడలిని మూసేసి వాహనాలకు ఎల్ఐసీ కార్యాలయం వద్ద యూ టర్న్ ఆప్షన్ ఇచ్చారు. ♦ లక్డీకాపూల్ నుంచి వచ్చే రోడ్డును సచివాలయ భవనం వద్ద వెడల్పు చేశారు. ఇక్కడి పెట్రోలు బంకును కూడా తరలించి అక్కడి నుంచి నేరుగా అమరవీరుల స్మారకం వద్దకు వెళ్లేందుకు వీలుగా రోడ్డును నిర్మించారు. ♦ సచివాలయ భవనం వెనక వైపు భవనాన్ని ఆనుకుని రోడ్డును వెడల్పు చేశారు. ఇక్కడే మసీదును నిర్మిస్తున్నారు. దానికి బయటి నుంచి కూడా జనం వచ్చేలా రోడ్డును సిద్ధం చేశారు. ♦ సచివాలయం–ఎన్టీఆర్ గార్డెన్స్ మధ్య (తెలంగాణ సచివాలయం పాత గేటు) ఉన్న రోడ్డును ఖైరతాబాద్ పెద్ద వినాయకుడిని ప్రతిష్టించే ప్రాంతం రోడ్డు వరకు వెడల్పు చేయనున్నారు. ♦ రోడ్లను ఇష్టమొచ్చినట్లు మార్చారని, కూడళ్లను మూసేశారని, ఇది వాహనదారులకు ఇబ్బందిగా ఉందన్న విమర్శలూ కొంతమంది నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఇది తాత్కాలికమేనని, ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు తాజా మార్పులు దోహదపడతాయని అధికారులంటున్నారు. -
కేంద్రం గుడ్‌న్యూస్! రూ.429.28 కోట్లతో మద్నూర్–బోధన్ రోడ్డు విస్తరణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని కామారెడ్డి, నిజామాబాద్, మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేలా మద్నూర్– బోధన్ రహదారి విస్తరణకుగాను రూ.429.28 కోట్ల వ్యయానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర రోడ్డు రవాణ, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌గడ్కరి తెలిపారు. ఈ మేరకు గురువారం కేంద్రమంత్రి ప్రకటన చేశారు. కామారెడ్డి, నిజామాబాద్, నాందేడ్‌లోని ఎన్‌హెచ్–161బీబీలోని మద్నూర్ నుంచి బోధన్ సెక్షన్ వరకు రెండు లైన్ల రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించడానికి ఆమోదం తెలిపారు. 39.032 కిలోమీటర్ల పొడవు గల ఈ ప్రాజెక్టును ఇంజనీరింగ్, సేకరణ, నిర్మాణం(ఈపీసీ) పద్ధతిలో 2022–23 వార్షిక ప్రణాళిక కింద అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎన్‌హెచ్–163జీ(ఖమ్మం–విజయవాడ)లో రేమిడిచెర్ల గ్రామం నుంచి జక్కంపూడి గ్రామం (ఎన్‌హెచ్–16లో) వరకు నాలుగు లైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే సెక్షన్ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 29.709 కిలోమీటర్ల లేఅవుట్‌కు రూ.1,190.86 కోట్లు ఖర్చు అవుతుందని, ఇతర ఎకనామిక్ కారిడార్(ఎన్‌హెచ్(ఒ)) ప్రోగ్రామ్‌ల కింద హైబ్రిడ్ యాన్యుటీ మోడ్‌లో తెలంగాణలోని ఖమ్మం, ఆంధ్రపద్రేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాల్లో నిర్మిస్తామని తెలిపారు. -
AP: మరో 875 రోడ్ల పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా 875 రోడ్లను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో నియోజకవర్గంలో కీలకమైన ఐదురోడ్లను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేందుకు సిద్ధమైంది. ఈ 875 రోడ్లలో ఆర్ అండ్ బి శాఖ పరిధిలో 442, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 300, మున్సిపల్ శాఖ పరిధిలో 133 ఉన్నాయి. రోడ్లను ఎంపికచేసి ప్రతిపాదనలు పంపాలని ఆర్ అండ్ బి, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ రోడ్ల పనులను మార్చిలో ప్రారంభించి జూన్ నాటికి పూర్తిచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. టీడీపీ ప్రభుత్వం రోడ్ల నిర్వహణపై తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రోడ్ల పునరుద్ధరణ నిధులను కూడా 2019 ఎన్నికల ముందు పసుపు–కుంకుమ వంటి పథకాలకు మళ్లించింది. దీంతో రాష్ట్రంలో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి ఏడాది భారీవర్షాలతో రోడ్ల పనులు చేపట్టడం సాధ్యం కాలేదు. అనంతరం రాష్ట్రంలో రోడ్ల పునరుద్ధరణ పనులను పెద్ద ఎత్తున చేపట్టింది. మొదటిదశ కింద రూ.2,205 కోట్లతో 6,150 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బి రోడ్ల పునరుద్ధరణ పనులు చేపట్టింది. ఆ పనులు 95 శాతం పూర్తయ్యాయి. రెండోదశ కింద రూ.1,700 కోట్లతో 6,150 కిలోమీటర్ల మేర రహదారుల పునరుద్ధరణ ప్రణాళికను ఖరారు చేసింది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో మొత్తం 953 రోడ్లను రెండోదశలో పునరుద్ధరించాలని నిర్ణయించింది. వాటిలో రాష్ట్ర ప్రధాన రహదారులు 292, జిల్లా ప్రధాన రహదారులు 661 ఉన్నాయి. ఈ పనులను ఈ ఏడాది చివరినాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంతలో యుద్ధప్రాతిపదికన నియోజకవర్గానికి ఐదు రోడ్ల చొప్పున పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విధానంలో 875 రోడ్ల పునరుద్ధరణ పనులు మొదట పూర్తిచేయనున్నారు. అనంతరం రెండోదశ రోడ్ల పునరుద్ధరణ పనులను చేపట్టి డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని ప్రణాళిక రూపొందించారు. కృష్ణా, గోదావరి జిల్లాల్లో రోడ్ల కోతకు చెక్ నదీపరివాహక ప్రాంతాల్లో దశాబ్దాలుగా వేధిస్తున్న రోడ్ల కోతకు రాష్ట్ర ప్రభుత్వం ముగింపు పలకనుంది. అందుకోసం ఫుల్ డెప్త్ రిక్లమేషన్ (ఎఫ్డీఆర్) టెక్నాలజీతో రోడ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎఫ్డీఆర్ టెక్నాలజీతో వెయ్యి కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఆదేశించారు. మెత్తటి నేలల్లో రోడ్లు నిర్మిస్తున్నా.. వర్షాలు పడినా, వరదలు వచ్చినా నదీతీర ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురవుతున్నాయి. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దశాబ్దాలుగా ఈ సమస్య వేధిస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఎఫ్డీఆర్ సాంకేతికతతో రోడ్లు నిర్మించనుంది. ఆర్ అండ్ బి శాఖకు చెందిన 500 కిలోమీటర్ల రోడ్లు, పంచాయతీరాజ్ శాఖకు చెందిన 500 కిలోమీటర్ల రోడ్లను ఈ సాంకేతికతతో నిర్మిస్తారు. పైలట్ ప్రాజెక్టుగా తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో గజ్జరం నుంచి హుకుంపేట వరకు 7.50 కిలోమీటర్ల మేర ఎఫ్డీఆర్ టెక్నాలజీతో రోడ్డు నిర్మించారు. ఆ రోడ్డును పరిశీలించిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ (సీఐఆర్) నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మెత్తటి నేలలున్న ప్రాంతాల్లో అదే టెక్నాలజీతో రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. -
Telangana: రూ.3 వేల కోట్లు.. 4 వేల కిలోమీటర్లు
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో రోడ్లను మెరుగుపరిచే నిర్వహణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. కనీసం నాలుగు వేల కిలోమీటర్ల మేర రోడ్లను పూర్తిస్థాయిలో మరమ్మతు చేసి మెరుగుపరచాలని రోడ్లు, భవనాల శాఖ నిర్ణయించింది. అలాగే గత రెండేళ్లలో కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతిని వాహనదారులకు నరకాన్ని చూపుతున్న రోడ్లను కూడా బాగు చేయనున్నారు. ఇందుకు రూ.3 వేల కోట్లు ఖర్చు కానున్నట్టు రోడ్లు, భవనాల శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రోడ్లను అద్దాల్లా మెరిసేలా చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ కదలిక వచ్చింది. గతంలోనూ నిధుల కోసం పలుమార్లు ప్రతిపాదనలు రూపొందించి వాటి విడుదల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో, ఈసారి స్వయంగా ముఖ్యమంత్రే ఆదేశించిన నేపథ్యంలో నిధులు వెంటనే మంజూరయ్యే అవకాశం ఉందని అంటున్నారు. బడ్జెట్ కేటాయింపుల పరిమితితో సంబంధం లేకుండా ఈ నిధులు విడుదల కానున్నాయి. ఏడో వంతు మాత్రమే.. రాష్ట్ర రహదారుల విభాగం పరిధిలో 28 వేల కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ ఉంది. ఇందులో ఇప్పుడు 4 వేల కి.మీ. పరిధిలో మాత్రమే పనులు జరగనున్నాయి. అంటే ఏడో వంతు మాత్రమే. ప్రతిరోడ్డుకు ఐదేళ్లకోసారి రెన్యూవల్ పనులు జరగాలని ఇండియన్ రోడ్ కాంగ్రెస్ చెప్తోంది. అయితే అది ఖర్చు తో కూడుకున్న వ్యవహారం అయినందున కనీసం ఏడేళ్లకోసారి అయినా మరమ్మతు జరగాలన్నది నిపుణుల మాట. రాష్ట్రంలో 28 వేల కి.మీ. రాష్ట్ర రహదారులున్నందున ప్రతియేటా 4వేల కి.మీ. రోడ్లకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో పెద్ద ఎత్తున డబుల్ రోడ్ల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు ఈ రోడ్ల పనులు చేపట్టారు. ఇందులో కొన్నింటిని పూర్తి చేశారు. వీటి నిర్మాణం వల్ల ఆయా ప్రాంతాల్లో ఏర్పడ్డ కొత్త రోడ్లనే రెన్యువల్స్‌గా భావిస్తున్నారు. అవి తప్ప విడిగా రోడ్డు రెన్యువల్ పనులు చేపట్టలేదు. ఫలితంగా చాలా రోడ్లు బలహీనపడ్డాయి. గత మూడేళ్లుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. పునరుద్ధరణ పనులకు నిధులులేక.. బాగా దెబ్బతిన్న ప్రాంతాల్లో వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. రోడ్ల దుస్థితిపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో ఇటీవల ముఖ్యమంత్రి సమీక్షించి వాటిని మెరుగు పరిచేందుకు ఆదేశాలివ్వటంతో సుదీర్ఘ విరామం తర్వాత వాటికి మంచిరోజులు రాబోతున్నాయి. రూ.3 వేల కోట్లలో దాదాపు రూ.700 కోట్లు వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు కేటాయించారు. -
గుండెల్ని పిండేస్తున్న వీడియో.. స్పందించిన గడ్కరీ కార్యాలయం
వైరల్: గుండెల్ని పిండేస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్లో వైరల్ అవుతోంది. రోడ్డు విస్తరణలో భాగంగా జేసీబీతో ఓ భారీ వృక్షాన్ని నేల్చకూల్చగా.. అంతకాలం ఆ చెట్టు మీద గూళ్లు కట్టుకుని జీవిస్తున్న పక్షులు చెల్లాచెదురు అయిపోయాయి. అంతకంటే బాధాకరం ఏంటంటే.. పాపం ఆ చెట్టు కిందే నలిగి కొన్ని చనిపోవడం. వైరల్ అయిన ఈ వీడియో.. కేంద్రం మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయం దాకా చేరడంతో చర్యలకు సిద్ధమయ్యారు అధికారులు. వైరల్ అవుతున్న వీడియోలో కొన్ని పక్షులు ఎగిరిపోగా.. మరికొన్ని పక్షులు, పిల్ల పక్షులు మాత్రం సమయానికి ఎగరలేక ఆ చెట్టు కిందే నలిగి చనిపోయాయి. అక్కడున్న చాలామంది పక్షుల పరిస్థితిని చూస్తూ అరవడం వీడియోలో గమనించొచ్చు. It not about road widening.. It’s about “how we treat other living-beings on earth..” Hope concerned authorities must have taken needful legal action..#wilderness #UrbanEcology #nature #ConserveNature pic.twitter.com/aV16cIWmo8 — Surender Mehra IFS (@surenmehra) September 2, 2022 చెట్టు నెలకొరిగాక.. చనిపోయిన పక్షుల్ని బాధతో ఒకవైపుగా వేశారు స్థానికులు. ప్రస్తుతం ఈ విషాదకరమైన వీడియో వైరల్ అవుతోంది. దీంతో చాలామంది కేంద్ర రోడ్డు రవాణ, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ట్యాగ్ చేస్తూ.. ఫిర్యాదులు చేశారు. మనుషులు ఎంత క్రూరంగా మారిపోయారో అని కామెంట్లు చేస్తున్నారు చాలామంది. దీనికి ఫలితం అనుభవించక తప్పదంటూ మరికొందరు కామెంట్లు చేశారు. అయితే.. ఈ ఘటన ఆగష్టు తొలివారంలోనే కేరళ మలప్పురం జిల్లా తిరురంగడి వీకే పడి ప్రాంతంలో చోటుచేసుకుంది. ఐఎఫ్ఎస్ అధికారి సురేందర్ మెహ్రా ఈ వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. క్రూరమైన ఈ పనికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాన్ని కోరారు. మరోవైపు ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కాస్వాన్ కూడా ఈ వీడియోను పోస్ట్ చేసి తన అసంతృప్తి వెల్లగక్కారు. అటు ఇటు తిరిగి ఈ వీడియో కాస్త గడ్కరీ కార్యాలయానికి చేరింది. దీంతో.. Everybody need a house. How cruel we can become. Unknown location. pic.twitter.com/vV1dpM1xij — Parveen Kaswan, IFS (@ParveenKaswan) September 2, 2022 నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్యాలయం స్పందించింది. విషయం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ దాకా వెళ్లిందని, ఆయన వీడియో చూసి విచారం వ్యక్తం చేశారని తెలిపింది. సేవల్ వెట్‌ల్యాండ్స్ ఇంటర్నేషనల్ మూమెంట్ సీఈవో థామస్ లారెస్స్ ఫిర్యాదు మేరకు.. స్వయంగా స్పందించిన మంత్రి నితిన్ గడ్కరీ.. ఈ ఘటనకు సంబంధించిన కాంట్రాక్టర్‌ను, బాధ్యులైన వాళ్లను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో.. రంగంలోకి దిగిన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని సదరు కాంట్రాక్టర్‌ను, స్థానిక అధికారులను కోరింది. మరోవైపు ఈ ఘటనపై కేరళ అటవీ శాఖ విభాగం స్పందించింది. ఆ చెట్టు కూల్చివేతలకు అనుమతులు లేకపోవడంతో జేసీబీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై కేరళ అటవీ పరిరక్షణ శాఖ మంత్రిణేకే ససీంద్రన్ ఈ ఘటనను క్రూరమైన చర్యగా అభివర్ణించారు. తమ అనుమతులు లేకుండానే ఈ ఘటన జరిగిందని ఆయన నేషనల్ హైవేస్ అథారిటీపై ఆరోపణలు గుప్పించారు. ఇదీ చదవండి: మనిషి జీవితం నీటి బుడగ.. అందుకు ఉదాహరణే ఈ వీడియో -
యాదాద్రి మూడో ఘాట్ రోడ్డులో రాకపోకలు
యాదగిరిగుట్ట: యాదాద్రి కొండపైకి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డును మరమ్మతుల కోసం మూసివేయడంతో.. అధికారులు ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలను మూడో ఘా ట్‌రోడ్డు నుంచి మళ్లిస్తున్నారు. కొండపైకి వెళ్లే రోడ్డు మధ్యలో ట్రాఫిక్ పోలీసులు సూచిక బో ర్డులను ఏర్పాటు చేశారు. రెండో ఘాట్ రోడ్డు ను కూడా మరమ్మతుల కోసం ఇప్పటికే మూ సివేశారు. దీంతో ఒకే మార్గంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
అమరాయవలసలో హైవేకు అడ్డంగా కంచె
మెంటాడ (విజయనగరం జిల్లా): విశాఖపట్నం– రాయపూర్ హరిత రహదారి పనులను విజయనగరం హెచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం అడ్డుకుంది. రోడ్డు విస్తరణ పనుల కోసం తమ నుంచి సేకరించిన నాలుగు ఎకరాల భూమికి పరిహారం చెల్లించలేదని ఆరోపిస్తూ మెంటాడ మండలం అమరాయవలస వద్ద మంగళవారం రాత్రి రోడ్డుకు అడ్డంగా స్తంభాలు వేసి కంచె నిర్మించింది. పరిహారం అందించే వరకు కంచె తొలగించేది లేదని హెచరీస్ యాజమాన్య ప్రతినిధులు స్థానిక విలేకరులకు తెలిపారు. రోడ్డు పనులు పూర్తవుతున్నా జాతీయ రహ దారి అధికారులు పరిహారం చెల్లించేందుకు చొరవ చూపడంలేదని ఆరోపించారు. అందువల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ విషయం హైవే అధికారులకు తెలియనట్టు సమాచారం. (క్లిక్: హంగేరీ క్రికెట్ జట్టులో రాణిస్తున్న సిరిపురం కుర్రోడు) -
రహదారి నిర్మాణంలో నయా టెక్నాలజీ
సాక్షి, విశాఖపట్నం: సమస్యకు పరిష్కారం చూపాలి. సమాజానికి ఉపయుక్తంగా నిలవాలి. పరిశోధనల ప్రధాన ఉద్దేశం ఇది. రైల్వేలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్(బ్రిడ్జెస్)గా పనిచేస్తున్న సాలూరు మురళీకృష్ణ పట్నాయక్ ఇదే ఉద్దేశంతో పరిశోధన చేసి.. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ స్వీకరించారు. ఏయూ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆచార్యులు పి.వి.వి సత్యనారాయణ పర్యవేక్షణలో ఆయన పరిశోధన చేశారు. వాల్తేరు డీఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి నుంచి అభినందనలు అందుకున్నారు. విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన మురళీకృష్ణ పట్నాయక్ చిన్నతనం నుంచి విద్యపై ఆసక్తిని పెంచుకున్నారు. తండ్రి సాలూరు శంకరనారాయణరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో.. ఆయనే ప్రేరణగా నిలిచారు. పట్నాయక్ పాలిటెక్నిక్‌లో సివిల్ ఇంజినీరింగ్ చదివారు. రైల్వేలో 1988లో ఉద్యోగంలో చేరి ఏఎంఐఈ పూర్తి చేశారు. అనంతరం ఏయూలో ఎంటెక్ చదివారు. అనంతరం పీహెచ్‌డీలో ప్రవేశం పొంది విజయవంతంగా పూర్తి చేశారు. వ్యర్థాలకు అర్థం చెప్పాలనే... విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్లలో భారీగా యాష్(బూడిద) ఏర్పడుతుంది. దీనిని నిల్వ చేయడం, పునర్వినియోగం విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు తలకుమించిన భారం. అదే విధంగా క్రషర్‌ల్లో వివిధ సైజ్‌ల్లో కంకర తయారు చేసినపుడు క్రషర్ డస్ట్ ఏర్పడుతుంది. ఈ రెండు పరిశ్రమల్లో ఉత్పత్తి అయ్యే యాష్, క్రషర్ డస్ట్‌లు పర్యావరణపరంగా సమస్యలకు కారణమవుతున్నాయి. పర్యావరణ ప్రాధాన్యం కలిగిన ఇటువంటి అంశాన్ని తన పరిశోధన అంశంగా పట్నాయక్ ఎంచుకున్నారు. ఎన్టీపీసీలో నిరుపయోగంగా ఉన్న యాష్‌ను, వివిధ క్రషర్‌ల్లో ఏర్పడే డస్ట్‌ను ఉపయుక్తంగా మార్చే దిశగా తన పరిశోధన ప్రారంభించారు. గ్రావెల్‌కు ప్రత్యామ్నాయంగా.. రహదారులు, రైల్వే లైన్లు నిర్మాణం చేసే సమయంలో నిర్ణీత ఎత్తు వరకు నేలను చదును చేయడం, రాళ్లు, గ్రావెల్, మట్టి, కంకర వంటి విభిన్న మెటీరియల్స్‌ను ఉపయోగిస్తారు. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి. వీటిలో కొన్నింటికి ప్రత్యామ్నాయంగా ఉచితంగా లభించే యాష్‌ను ఉపయోగిస్తే కలిగే సామర్థ్యాన్ని పట్నాయక్ అంచనా వేశారు. నాలుగు పొరలుగా రహదారిని నిర్మిస్తారు. సబ్ గ్రేడ్, సబ్ బేస్ కోర్స్, బేస్ కోర్స్, సర్ఫేసే కోర్స్‌గా ఉంటుంది. మధ్య రెండు పొరలుగా వేసే సబ్ బేస్ కోర్స్, బేస్ కోర్స్‌లో గ్రావెల్, కంకర వివిధ పాళ్లలో కలిపి వినియోగిస్తారు. ఈ రెండింటి లభ్యత తక్కువగా ఉంది. పైగా అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. వీటికి ప్రత్యామ్నాయంగా తగిన పాళ్లలో బాటమ్ యాష్, క్రషర్ డస్ట్‌లను కలిపి వినియోగించే అంశాన్ని ప్రయోగశాల పరిస్థితుల్లో ఆయన అధ్యయనం చేశారు. సీబీఆర్ రేషియో ప్రామాణికంగా.. రహదారుల నిర్మాణంతో నాణ్యతను గుర్తించడానికి, గణించడానికి కాలిఫోర్నియా బేరింగ్ రేషియో(సీబీఆర్)ను ప్రామాణికంగా తీసుకున్నారు. సీబీఆర్ రేషియో 30 కంటే అధికంగా ఉంటే నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నట్లు లెక్క. ప్రస్తుతం వినియోగిస్తున్న గ్రావెల్, కంకరలకు బదులు తగిన పరిమాణంలో బాటమ్ యాష్, క్రషర్ డస్ట్‌లను కలిపి వినియోగించి.. సీబీఆర్ రేషియోను ఆయన గణించారు. కేంద్ర జాతీయ రహదారులు –మంత్రిత్వ శాఖ నిర్ధారించిన ప్రామాణికాలు పరిశీలిస్తే.. సబ్ బేస్ కోర్స్‌కు లిక్విడ్ లిమిట్ 25 కన్నా తక్కువ, ప్లాస్టిసిటీ ఇండెక్స్ 6 కన్నా తక్కువగా, సీబీఆర్ వాల్యూ 30 కన్నా అధికంగా ఉండాలి. పట్నాయక్ ప్రయోగశాల పరిస్థితుల్లో చేసిన ప్రయోగాల ఫలితాలను విశ్లేషిస్తే.. లిక్విడ్ లిమిట్ 22 నుంచి 24, ప్లాస్టిసిటీ ఇండెక్స్ 6 కన్నా తక్కువగా, సీబీఆర్ వాల్యూ 33 నుంచి 72 వరకు వచ్చాయి. ఎర్ర కంకర(గ్రావెల్)కు బాటమ్ యాష్‌ను 20 నుంచి 100 శాతం వరకు కలపగా సీబీఆర్ వాల్యూ 33 నుంచి 65 వరకు, క్రషర్ డస్ట్‌ను 20 నుంచి 100 శాతం వరకు కలపగా సీబీఆర్ వాల్యూ 33 నుంచి 72 శాతం వరకు రావడం ఆయన గుర్తించారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా.. థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బాటమ్ యాష్ నిల్వలు పెరిగిపోతున్నాయి. ఇది థర్మల్ విద్యుత్ సంస్థలకు పెనుభారంగా మారింది. క్రషర్ యూనిట్ల ద్వారా క్రషర్ డస్ట్ వెలువడుతోంది. యాష్, క్రషర్ డస్ట్ పర్యావరణానికి సమస్యగా మారాయి. వీటిని ఉపయోగించాలనే లక్ష్యంతో ఈ పరిశోధన చేశాను. ప్రయోగశాల పద్ధతిలో అధ్యయనం చేశాను. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల నిర్మాణంలో, రైల్వే లైన్ల నిర్మాణంలో శాస్త్రీయ అధ్యయనంతో నిర్ణీత పరిమాణంలో వీటిని వినియోగించవచ్చు. తద్వారా నిర్మాణ భారం తగ్గుతుంది. పర్యావరణానికి మేలు జరుగుతుంది. పశ్చిమబెంగాల్లో తుమ్లుక్ థిగా రైల్వే లైన్ నిర్మాణంలో బాటమ్ యాష్‌ను వినియోగించారు. భవిష్యత్‌లో ఇటువంటి నిర్మాణాలు జరగాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ సాలూరు మురళీకృష్ణ పట్నాయక్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్(బ్రిడ్జెస్), వాల్తేర్ డివిజన్ -
అనకాపల్లి, అల్లూరి జిల్లాల మీదుగా 10 కి.మీ. రహదారి నిర్మాణం
మాడుగుల నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవాపురం వరకు.. దట్టమైన అడవిలో నుంచి సాగే 10 కిలోమీటర్ల రహదారి.. 15 ఏళ్ల క్రితమే నిర్మాణం ప్రారంభమైనా ఇప్పటికీ పూర్తి కాలేదు. అటవీ శాఖ అనుమతులు లభించక మధ్యలోనే నిలిచిపోయింది. ఇన్నాళ్లకు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు చొరవతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రూ.2 కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణం చకచకా సాగుతోంది. కాకులు దూరని కారడవిలో పొక్లెయిన్లతో జంగిల్ క్లియరెన్స్ చేస్తూ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు. సాక్షి, అనకాపల్లి: అడవి బిడ్డలకు త్వరలో డోలి కష్టాలు తీరనున్నాయి. చదువు కోవాలని ఆశపడే విద్యార్థుల కలలు నెరవేరబోతున్నాయి. అటవీ ఉత్పత్తులను విక్రయించడానికి రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. మొత్తంగా ప్రగతి పరవళ్లు తొక్కబోతోంది. అనకాపల్లి, అల్లూరి జిల్లాల పరిధిలో మాడుగుల నుంచి దేవాపురం వరకు కీలకమైన రహదారి నిర్మాణం అనేక కష్టనష్టాలను ఎదుర్కొని ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఐటీడీఏ సహకారంతో రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ రహదారి కొండలు, గుట్టల మీదుగా సాగుతుంది. పక్కా రోడ్డు వేయడం కష్టసాధ్యమే అయినా ఈ సత్సంకల్పాన్ని సుసాధ్యం చేయాలని అందరూ శ్రమిస్తున్నారు. వాణిజ్యంలో ప్రత్యేక గుర్తింపు మైదాన ప్రాంతాల నుంచి గిరిజన ప్రాంతాలకు మధ్యనున్న మారుమూల గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నాయంటే దానికి కారణం సరైన రహదారి లేకపోవడమే. వందేళ్ల క్రితమే మాడుగుల వాణిజ్య రంగంలో గుర్తింపు పొందింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు విశాఖ ఏజెన్సీలోని 11 మండలాల్లో పండించిన పిప్పలి, పసుపు, బత్తాయి, నారింజ, అరటి, చింతపండు, సపోట, మొక్కజొన్న, అనాస, సీతాఫలం, అలచందలు, తదితర పంటలు మాడుగుల చేరుకుంటాయి. ప్రాసెసింగ్ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు, జిల్లాలకు ఏడాదికి వందల టన్నుల్లో రవాణా జరుగుతుంది. సరైన రోడ్లు, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో మాడుగుల మండలంలో కొన్ని గ్రామాలతోపాటు నేటి అల్లూరి సీతారామరాజు జిల్లాలో సుమారు 30 గ్రామాలు ఈనాటికీ అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిపోయాయి. దేవాపురం, అయినాడ, సలుగు పంచాయతీల పరిధిలో ఉన్న ఈ గ్రామాలవారు నిత్యావసర సరుకులతోపాటు ఇతర వస్తువులు కావాలంటే 10 కిలోమీటర్ల దూరం కొండలు, గుట్టలు దిగి మాడుగుల రావల్సి వచ్చేది. గిరిజనులు పండించిన పంటలను కావిళ్లతో, గంపలతో నడుచుకుంటూ తీసుకువస్తారు. రహదారి సౌకర్యం లేక ఈ ప్రాంత విద్యార్ధులను చదివించడానికి కూడా ఇష్టం చూపించరు. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో ప్రస్తుతం ఆ గ్రామాలు అల్లూరి జిల్లాలో ఉన్నాయి. గతంలో సగంలోనే నిలిచిన రోడ్డు పనులు 15 ఏళ్ల క్రితం మాడుగుల పట్టణం నుంచి ఉబ్బలింగేశ్వరస్వామి ఆలయం వరకు రోడ్డు నిర్మాణం జరిగింది. అటవీశాఖ అనుమతి లేకపోవడంతో అక్కడితో పనులు నిలిపోయాయి. చాలామంది రాజకీయ నాయకులు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడానికి పూనుకున్నారు. కానీ ఫలితం లేకపోయింది. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాడుగుల–దేవాపురం రోడ్డుకు మోక్షం కలిగింది. గత ఎన్నికలకు ముందే ఈ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. దానిని నెరవేరుస్తూ అటవీ శాఖ అడ్డంకులున్నా అధిగమించి ప్రస్తుతం రోడ్డు నిర్మాణం శరవేగంతో చేస్తున్నారు. రెండు జిల్లాలకు చెందిన 13 మండలాల్లో గల 30 గ్రామాల రైతులు, చిరు వ్యాపారస్తులు, ప్రజలు సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గిరిపుత్రులకు అండగా ప్రభుత్వం గిరిజనమంటే సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి అమితమైన ప్రేమ. వారి అభివృద్ధికి, వారి గ్రామాలకు రోడ్డు నిర్మాణాలను చేపట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. మాడుగుల నుంచి దేవాపురం వరకు రహదారి సౌకర్యం లేపోవడంతో గిరిజన గ్రామాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లడంతో అటవీశాఖ అనుమతులు లభించాయి. మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి మండలాల్లో ఉన్న గిరిజన గ్రామాలకు ఇప్పటికే రహదారుల నిర్మాణం జరుగుతోంది. –బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం రుణపడి ఉంటాం.. గత 30 ఏళ్లుగా దేవాపురం రోడ్డు కోసం పోరాడుతున్నాము. గతంలో మాడుగుల పట్టణం నుంచి ఉబ్బలింగేశ్వరాలయం వరకు రోడ్డు నిర్మాణం జరిగింది. అటవీశాఖాధికారుల అనుమతులు లేకపోవడంతో అప్పట్లో రోడ్డు పనులు నిలిచిపోయాయి. ఇన్నళ్లకు మా కల నెరవేరుతోంది. రెండు జిల్లాల ప్రజలు సీఎంకు, డిప్యూటీ సీఎంకు రుణపడి ఉంటారు. – వేమవరపు వెంకటరమణ, మాడుగుల మాజీ సర్పంచ్ త్వరితగతిన నిర్మాణ పనులు ఇటీవల అటవీశాఖ అనుమతులు లభించాయి. గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నాం. దాదాపు 10 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులను రూ.2 కోట్లకు పైగా అంచనా వ్యయంతో చేపట్టాం. వర్షాలు లేకుండా ఉంటే నెల రోజుల్లో ఫార్మేషన్ పూర్తి చేస్తాం. మరో ఆరునెలలలోపు ఈ రోడ్డు అప్‌గ్రెడేషన్ కూడా పూర్తిచేస్తాం. ఇది పూర్తయితే రెండు జిల్లాల్లో గల 13 మండలాల్లో గల 30 గిరిజన గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుంది. – రోణంకి గోపాలకృష్ణ, ఐటీడీఏ పీఓ -
తక్షణమే పూర్తి చేయాలి.. సీఎం జగన్ ఆదేశాలు
-
ముమ్మరంగా రహదారుల పనులు
తుని: రాష్ట్రంలో అత్యంత నాణ్యతా ప్రమాణాలతో, పారదర్శక విధానాలతో రహదారుల అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతుంటే ఓ వర్గం మీడియా పని గట్టుకొని పాత ఫొటోలు చూపించి దుష్ప్రచారం చేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. శనివారం కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కార్యాలయంలో ఆయన ఆర్అండ్బీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రహదారులు దెబ్బ తిన్నాయని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుందన్నారు. ఈ సమావేశంలో మంత్రి ఇంకా ఏమన్నారంటే.. ► ఓ వర్గం మీడియా పని గట్టుకొని పాత ఫొటోలు చూపించి దుష్ప్రచారం చేస్తోంది. చంద్రబాబు చర్యలతో పాడైన ఒక్కో వ్యవస్థను కచ్చితమైన ప్రణాళికతో సరిదిద్దుతున్నాం. ► రాష్ట్రంలో సీఎం జగన్ పాలనకు మెచ్చి.. కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితన్ గడ్కరీ ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని జాతీయ రహదారుల ప్రాజెక్టులను మన రాష్ట్రానికి మంజూరు చేశారు. ► 8,268 కిలోమీటర్ల మేర రాష్ట్ర హైవేలు, జిల్లా రహదారుల అభివృద్ధికి సంబంధించి 1,167 మేజర్ పనులు చేపట్టేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.2,205 కోట్ల రుణం తీసుకున్నాం. ఇందులో 438 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నాం. ► పూర్తి చేసిన 2,756 కిలోమీటర్లు పనులకు రూ.700 కోట్ల మేర కాంట్రాక్టర్లకు చెల్లించాం. గత ప్రభుత్వ హయాంలో మంజూరై ఆగి పోయిన 233 పనులు చేపట్టేందుకు ఎన్ఐడిఏ పథకం కింద నాబార్డు రూ.1,558 కోట్లు రుణం ఇచ్చింది. వీటిలో 182 పనులు పూర్తి కాగా, 51 పనులు ఈ నెలఖారుకు పూర్తవుతాయి. ► 2021–22లో గుంతలు పూడ్చడానికి రూ.86 కోట్లు మంజూరు చేశాం. èఒకప్పుడు రహదారులు ఏలా ఉండేవి? ప్రస్తుతం అభివృద్ధి చేసిన రోడ్లు ఎలా ఉన్నాయి? అనే విషయాలను ప్రజలకు తెలియజేసేందుకు నాడు–నేడు ఫొటో ప్రదర్శన రాష్ట్రంలోని కలెక్టరేట్లలో ఏర్పాటు చేశాం. -
AP: కనికట్టొద్దు..‘కళ్లు’ పెట్టి చూడు.. విషం చిమ్ముతున్న ‘ఈనాడు’
‘మనం వేసిందే ఫొటో.. రాసిందే వార్త.. నిజానిజాలు దేవుడికెరుక.. రాష్ట్రంలో సగం మందినైనా నమ్మించగలిగితే మన బాబుకు మేలు చేసినట్లే..’ అనే సిద్ధాంతంతో ‘ఈనాడు’ దినపత్రిక వాస్తవాలకు మసి పూస్తోంది. పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తోంది. కనికట్టు కథనాలతో ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వంపై విషం నింపుతోంది. రాష్ట్రంలో రహదారుల మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయన్న నిజానికి పాతర వేయాలని చూస్తోంది. పాత, మారుమూల శివారు ఫొటోలతో పతాక స్థాయిలో దుష్ప్రచారానికి తెరలేపింది. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో రోడ్ల పరిస్థితి నాడునేడు మచ్చుకు కొన్ని ఉదాహరణలతో ‘సాక్షి’ ప్రజల ముందుంచుతోంది. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోని కేబీఎన్ కళాశాల నుంచి చిట్టినగర్ జంక్షన్ వరకు ఉన్న కేటీ (కొత్తూరుతాడేపల్లి) రోడ్డు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ రోడ్డు తొలి ఫేజ్‌లో ఎడమ వైపు భాగంలో పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో అధిక ట్రాఫిక్, కల్వర్టుల నిర్మాణం దృష్ట్యా నిర్మాణ పనులు ఒక వైపు మాత్రమే జరుగుతున్నాయి. పనులు దాదాపు పూర్తయ్యాయి. చిట్టినగర్ జంక్షన్ నుంచి కేబీఎన్ కళాశాల వైపు ఇప్పటికే సర్వే పూర్తవగా చిట్టినగర్ ఏరియాలో పనులు ప్రారంభమయ్యాయి. ఈ వాస్తవాలను ‘ఈనాడు’ విస్మరించడం గమనార్హం. విజయవాడలోని కేటీ రోడ్డుపై బురద జల్లుతూ ఈనాడు వేసిన ఫొటో.. సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: పురపాలక, పట్టణాభివృద్ధి విభాగం నెల రోజులుగా నగరాలు, పట్టణాల్లో యుద్ధ ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులకు నడుం బిగించడాన్ని పట్టించుకోని ‘ఈనాడు’.. పట్టణ రోడ్లను ప్రభుత్వం పట్టించుకోలేదని శుక్రవారం తప్పుడు కథనాన్ని వండి వార్చింది. ఇప్పటికే 118 పట్టణ స్థానిక సంస్థల్లో (యూఎల్బీ) గుంతలను గుర్తించిన అధికారులు వాటి మరమ్మతులకు రూ.60.53 కోట్లు విడుదల చేసి పనులు చేపట్టారు. కొన్నిచోట్ల గుంతలను పూడ్చగా, మరికొన్ని చోట్ల కొత్తగా సీసీ రోడ్లు వేశారు. 33 పట్టణాల్లో నూరు శాతం గుంతలు పూడ్చగా, 21 పట్టణాల్లో పనులు కొనసాగుతున్నాయి. మిగిలిన నగరాలు, పట్టణాల్లో పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. రోడ్ల మరమ్మతుల కోసం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కమిషనరేట్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి, ఆయా పట్టణ స్థానిక సంస్థల్లో జరుగుతున్న మరమ్మతు పనులను పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటు కొత్తగా ఏర్పడే గుంతలను కూడా పూడ్చడంతో పాటు, మున్సిపాలిటీల్లో ఈ అంశాన్ని నిరంతర ప్రక్రియగా చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు గుంతలను గుర్తించి వాటిని ఆన్లైన్ చేయడంతో పాటు పూడ్చిన తర్వాత నాడునేడు కింద వెబ్సైట్లో ఉంచుతున్నారు. కానీ ఇవేమీ పట్టని ఆ పత్రిక.. అన్ని చోట్లా ఏక కాలంలో పనులు నిర్వహించడం సాధ్యం కాదని తెలిసీ, విష ప్రచారానికి దిగింది. ఏ మున్సిపాలిటీలో రోడ్ల మరమ్మతు పనులు ఎలా జరుగుతున్నాయో మాట మాత్రం ప్రస్తావించకుండా, పురపాలక శాఖ వెబ్‌సైట్‌ను సైతం పరిశీలించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేసింది. శర వేగంగా పనులు రాష్ట్రంలో మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలు ఉండగా, వాటిలో 118 పట్టణాల్లోనే 43,563 గుంతలు ఉన్నట్టు మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు గుర్తించారు. ఇప్పటి దాకా 34,316 గుంతలకు టెండర్లు ఖరారు కావడం.. 21,720 గుంతలను పూడ్చంతో పాటు, కొన్నిచోట్ల బీటీ రోడ్ల స్థానంలో సీసీ రోడ్లు కూడా వేశారు. అంటే 49.86 శాతం పాట్ హోల్స్‌ను పూడ్చారు. గ్రేటర్ విశాఖ, గుంటూరు, విజయవాడ నగరాల్లోని రోడ్లకు అత్యధికంగా గుంతలు ఉన్నట్టు లెక్క తేల్చారు. అధికంగా దెబ్బతిన్న రోడ్లను జీవీఎంసీ, విజయవాడ, గుంటూరులోనే గుర్తించారు. విశాఖ మహానగరంలో 6,679 గుంతలను గుర్తించగా 4,208 (63 శాతం) గుంతలను పూడ్చారు. విజయవాడలో 6,314 పాట్ హోల్స్ ఉండగా, 4,400 (దాదాపు 70 శాతం) పూడ్చారు. గుంటూరు నగరంలో 3,482 గుంతలను గుర్తిస్తే వాటిలో 2,260 గుంతలు (65 శాతం) పూడ్చారు. మిగిలిన యూఎల్బీల్లో సైతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గుంతల గుర్తింపునకు యాప్ పట్టణాల్లో పాట్ హోల్స్ గుర్తింపునకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేకంగా యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. స్థానిక మున్సిపల్ ఇంజినీరింగ్ సిబ్బంది నిత్యం పట్టణ రోడ్లను పర్యవేక్షిస్తూ వారి దృష్టికి వచ్చిన గుంతలను ఎప్పటికప్పుడు యాప్‌లో ఫొటోతో అప్లోడ్ చేయాలి. ఈ క్రమంలో ఆ చిత్రం ఏ ప్రాంతంలో ఉందో అక్షాంశాలు, రేఖాంశాలతో సహా సదరు మున్సిపల్ కమిషనర్‌తో పాటు మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం, సీడీఎంఏ కార్యాలయంలోని ఉన్నత స్థాయి అధికారులకు సైతం చేరుతుంది. గుంతలను పూడ్చిన అనంతరం తిరిగి అదే ప్రాంతంలో నుంచి ఫొటోను యాప్‌లో అప్లోడ్ చేయడం ద్వారా పనుల ప్రగతి తెలుసుకునేలా ఏర్పాటు చేశారు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన యాప్ పనితీరును పరిశీలించి, వార్డు ఎమినిటీ కార్యదర్శులు సులభంగా వినియోగించేలా కొన్ని మార్పులు చేస్తున్నారు. ఇది నిరంతర ప్రక్రియ పట్టణ స్థానిక సంస్థల్లో రోడ్లను బాగు చేయడమనేది మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల బాధ్యత. ఈ పనులు నిరంత ప్రక్రియ. 365 రోజులు పనులు చేయాల్సిందే. కేవలం వర్షాకాలం ముందు పనులు చేసి వదిలేస్తే సరికాదు. మరమ్మతు పనులపై సీడీఎంఏలోనూ పర్యవేక్షణకు ప్రత్యేకంగా అధికారులను నియమించాం. స్థానికంగా పనులు జరుగుతున్న తీరు, ప్రగతిని తెలుసుకునేందుకు యాప్‌ను కూడా రూపొందించి, అందుబాటులోకి తెచ్చాం. త్వరలో జీవీఎంసీ, విజయవాడ కార్పొరేషన్లలో రోడ్ల మరమ్మతులకు ఆధునిక యంత్రాలను అందుబాటులోకి తేస్తాం. -ప్రవీణ్ కుమార్, సీడీఎంఏ అంతటా అదే పరిస్థితి అని ఎలా చెబుతారు? ఒక రోడ్డుకు సంబంధించి నాలుగు ఫొటోలు పెట్టి, ఒంగోలు నగరంలోని రోడ్లన్నీ ఇదే విధంగా ఉన్నాయనటం సమంజసం కాదు. కేశవరాజుకుంట రోడ్డు నిర్మాణ దశలో ఉంది. ఆ రోడ్డుకు పొడిగింపే ముక్తినూతలపాడు రోడ్డు. దీనికి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ కూడా ఆమోదించింది. – ఎం.సుందరరామి రెడ్డి, ఒంగోలు నగర పాలక సంస్థ మున్సిపల్ ఇంజనీర్ వేగంగా పనులు ప్రకాశం జిల్లాలో దాదాపు రూ.716 కోట్లతో రోడ్ల మరమ్మతులు, విస్తరణ పనులు చేపట్టాం. పనులు వేగంగా జరుగుతున్నాయి. చాలా పనులు పూర్తయ్యాయి. రోడ్డు పనులకు సంబంధించి ఫొటో ఎగ్జిబిషన్‌ను కలెక్టరేట్లో నాలుగు రోజుల కిందటే ఏర్పాటు చేశాం. – మీడియాతో కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఒంగోలు విజయనగరం కార్పొరేషన్‌లోని ఆర్అండ్బి రైతు బజారు నుంచి ఉడా కాలనీ మీదుగా అయ్యన్నపేట జంక్షన్ వరకు వెళ్లే రహదారిని విస్తరించాలని రెండేళ్ల క్రితం వీఎంఆర్డీఏ అధికారులు పనులు ప్రారంభించారు. ఆ మార్గంలోని పలు భవనాలకు పరిహారం చెల్లించి తొలగించేందుకు యత్నించగా కొందరు యజమానులు తమకు ఎక్కువ నష్టపరిహారం ఇవ్వాలని కోర్టును ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని విస్మరించి ఈ రోడ్డును అభివృద్ధి చేయలేదని ఈనాడు తప్పుడు కథనం ప్రచురించింది. -
కరకట్ట రోడ్డు విస్తరణను వేగంగా పూర్తి చేయండి
సాక్షి, అమరావతి: అసెంబ్లీ, సచివాలయానికి వెళ్లేందుకు వీలుగా కరకట్ట రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని, అనుకున్న సమయం కంటే ముందే పూర్తిచేయాలని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సీఆర్డీఏ అధికారులను అదేశించారు. సచివాలయంలో సోమవారం ఏపీ సీఆర్డీఏ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. విభాగాల వారీగా చేస్తున్న పనులను సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భవనాల నిర్మాణ ప్రగతిపైనా మంత్రి ఆరా తీశారు. పట్టణాభివృద్ధి విభాగంపై నిర్వహించిన సమీక్షలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. 124 యూఎల్బీల్లో చెత్త సేకరణ కోసం ఇప్పటివరకు 1.13 కోట్ల మూడు రంగుల డబ్బాలు పంపిణీ చేశామని, మరో 10 లక్షల డబ్బాల పంపిణీ ఈ నెలాఖరుకు పూర్తవుతుందని వివరించారు. -
ముమ్మరంగా రోడ్డు విస్తరణ పనులు
బాపట్ల: జిల్లా కేంద్రమైన బాపట్లలో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రోడ్ల విస్తర్ణ జిల్లా కేంద్రానికి అనుగుణంగా సాగుతున్నాయి. పట్టణంలోని ముఖ్యమైన రోడ్లు విస్తర్ణతోపాటు సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పట్టణంలో ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టారు. మొత్తం 13 రోడ్లును విస్తరించడంతోపాటు వాటిలో విశాలమైన రోడ్లు పురప్రజలతోపాటు జిల్లా కేంద్రానికి వస్తోన్న ప్రజలకు కూడా స్వాగతం పలికేవిధంగా ఉన్నాయి. పట్టణంలో విశాలమైన రోడ్లు... బాపట్ల పట్టణంలోని ఎంతో కీలకమైన రథంబజారు, శివాలయం రోడ్డు, సూర్యలంక రోడ్డు, రైల్వే స్టేషన్ ఎదురు రోడ్డు, బృందానం రోడ్డు, ప్యాడిషన్పేట, అక్బర్పేటరోడ్డు నిర్మాణ పనులు పూర్తి కాగా, తాజాగా ప్రధాన రహదారిగా ఉన్న జీబీసీ రోడ్డు విస్తర్ణ పనులు చేపట్టారు. మొత్తం 80 అడుగుల వెడల్పుతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. కొత్తబస్టాండ్ వద్ద నుంచి దగ్గుమల్లివారిపాలెం వరకు 80 అడుగుల రోడ్డు, అక్కడ నుంచి ఇంజినీరింగ్ కళాశాల పక్కన జాతీయరహదారి వరకు 120 అడుగుల రోడ్డు విస్తర్ణకు చర్యలు చేపట్టారు. మరోవైపు కర్లపాలెం రోడ్డుకు ఇరువైపుల ఉన్న చెట్లు తొలగించి కలెక్టరేట్‌కు ప్రధాన రహదారిగా తీర్చిదిద్దేందుకు చర్యలు మొదలయ్యాయి. కలెక్టరేట్‌కు ఇరువైపు రోడ్లు ఇలా... బాపట్ల జిల్లా కలెక్టరేట్ ఏర్పాటు చేసిన మానవ వనరుల కేంద్రానికి వెళ్ళే రోడ్లు విస్తర్ణ పనులు చేపట్టారు. గుంటూరు ప్లై ఓవర్ బ్రిడ్జికి ఇరువైపులా విస్తర్ణ పనులు చేపట్టి రోడ్లు వేస్తున్నారు. రోడ్లుకు ఇరువైపులా విస్తర్ణ చేయడంతోపాటు సెంటర్ లైటింగ్‌లో పనులు చేపట్టడంతో రోడ్లు అందంగా రూపురేఖలు మారుతున్నాయి. వేగంగా జాతీయ రహదారి పనులు... మరోవైపు జాతీయరహదారి పనులు వేగంగా సాగుతున్నాయి. బాపట్ల బైపాస్ రోడ్డు నాలుగులైన్లు విస్తరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి చేపట్టిన చర్యలకు జాతీయ రహదారి నుంచి అనుమతులు రావడంతో నాలుగులైన్లు పనులు సాగుతున్నాయి. ఎనిమిది కిలోమీటర్లు మేరకు సెంటర్ డివైర్డర్లతోపాటు సెంటర్లైటింగ్తో రోడ్లు పనులు సాగుతున్నాయి. -
20 రోజులు.. 22 లక్షలు వృధా.. ఇలా కూడా పని చేస్తారా!
గత ఆరేళ్లుగా వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడి చివరకు వారి సమస్యలను హైదరాబాద్ ఎంపీకి విన్నవించగా ఆయన చొరవతో డ్రైనేజీ పైప్‌లైన్‌ను నిర్మించారు. కానీ పూర్తయిన 20 రోజులకే దాన్ని తొలగించి నూతనంగా బాక్స్ టైప్ డ్రైనేజీ కాలువను నిర్మిస్తున్నారు. అధికారుల సమన్వయ లోపంతో 20 రోజుల కోసం లక్షలాది రూపాయల ప్రజాధనం వృధా అవుతోందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి,రాజేంద్రనగర్(హైదరాబాద్): ఫోర్ట్‌వ్యూ కాలనీ గూండా ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నీరు, డ్రైనేజీ నీటి కోసం జీహెచ్ఎంసీ ప్రాజెక్టు అధికారులు రూ.7.40కోట్లతో బాక్స్ టైప్ డ్రైనేజీ కాలువను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులు జరుగుతున్నాయి. గత కొన్నేళ్లుగా వరద, డ్రైనేజీ నీటి కారణంగా కాలనీలోని దాదాపు 350 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ చొరవతో.. ► గత ఆరేళ్లుగా సమస్యను పరిష్కరించాలంటూ ఆందోళనలు, ప్రజాప్రతినిధులు, అధికారుల చూట్టూ తిరిగారు. వర్షం కురిసిన ప్రతి సారి ఈ కాలనీలో డ్రైనేజీ, వరద నీరు చొచ్చుకు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత మూడు నెలల క్రితం ఈ సమస్యపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని కలిసిన ఫోర్ట్‌వ్యూ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు తమ సమస్యను వివరించారు. స్పందించిన ఆయన రూ. 22 లక్షలతో డ్రైనేజీ పైపులైన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించగా 20 రోజుల క్రితం పనులు పూర్తయ్యాయి. ఎగువ నీటితోనే ఇబ్బంది.. ► కాలనీకి సంబంధించిన నీరు కాకుండా ఎగువ ప్రాంతం నుంచి వచ్చే మురుగు నీరే ఈ బస్తీకి ప్రధాన సమస్యగా మారింది. ఈ పైపులైన్ నిర్మించి 20 రోజులు పూర్తి కావస్తున్న సమయంలో ప్రాజెక్టు అధికారులు పైపులైన్‌ను తొలగించి డ్రైయిన్ బాక్స్ కాలువను నిర్మించేందుకు పనులను ప్రారంభించారు. దీంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనాలోచిత నిర్ణయంతో.. ► ఫోర్ట్‌వ్యూ కాలనీ రహదారులు 40 అడుగుల విస్తీర్ణంలో ఉండగా ప్రస్తుతం ఓ పక్క నుంచి డ్రైనేజీ పైపులైన్‌ను కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ డ్రైనేజీ పైపులైన్ ఓ వైపు నుంచే బాక్స్ టైప్ డ్రైనేజీ బాక్స్‌ను నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. 5 అడుగుల డ్రైయిన్ బాక్స్ కోసం స్థలం ఉందని అధికారుల అనాలోచిత నిర్ణయంతో ప్రజాధనం వృధా అవుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ పైపులైన్ పక్కనుంచే బాక్స్ టైప్ డ్రైనేజీని నిర్మించాలని వారు కోరుతున్నారు. సమస్య తిరిగి పునరావృతం.. జీహెచ్ఎంసీ ప్రాజెక్టు ఎస్ఈ పంత్‌తో పాటు అధికారులందరిని కలిసి సమస్యను వివరిస్తున్నాం. ప్రస్తుతం నిర్మించిన డ్రైనేజీ పైపులై¯Œ ను తొలగించకుండా బాక్స్ టైప్ నాలాను ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. మా వినతిని ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. డ్రైనేజీ పైపులైన్‌ను తొలగిస్తే సమస్య తిరిగి పునరావృతం అవుతుంది. – ఫోర్ట్‌వ్యూ కాలనీ అధ్యక్షుడు షాహేద్ పీర్ రూ.22 లక్షల ప్రజాధనం వృధా.. కాలనీలను ఇబ్బందులకు గురి చేసే విధంగా జీహెచ్ఎంసీ ప్రాజెక్టు అధికారులు వ్యవహరిస్తున్నారు. దక్షిణ మండల జోనల్ కమిషనర్‌తో పాటు స్థానిక జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదించకుండానే పనులు చేపడుతున్నారు. దీంతో రూ. 22 లక్షల ప్రజాధనం వృధా అవుతుంది. ఉన్నతాధి కారులు ఈ విషయంలో వెంటనే స్పందించాలి. – సుజాత్‌ఖాన్, ఫోర్ట్‌వ్యూ కాలనీ -
రూ.2,205 కోట్లతో 8,268 కి.మీ. రోడ్ల పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా అత్యధికంగా నిధులు కేటాయించి రోడ్ల పునరుద్ధరణ పనులు చేపడుతున్నామని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి శంకర్‌నారాయణ చెప్పారు. రూ.2,205 కోట్లతో 8,268 కిలోమీటర్ల మేర రోడ్ల పునరుద్ధరణ కోసం 1,161 పనులు చేపట్టామని తెలిపారు. విజయవాడలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పనులను మే నాటికి పూర్తిచేస్తామని చెప్పారు. 2010 నుంచి 2019 వరకు కాంగ్రెస్, చంద్రబాబు ప్రభుత్వాలు రోడ్ల నిర్వహణను గాలికొదిలేయడంతో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు. గత రెండున్నరేళ్లలో భారీ వర్షాలతో రోడ్ల మరమ్మతుల్లో జాప్యం జరిగిందని చెప్పారు. దీంతో సీఎం జగన్ సమీక్షించి రోడ్ల పునరుద్ధరణ కోసం దిశానిర్దేశం చేశారని, ఆరు నెలలుగా పనులు వేగం పుంజుకున్నాయని తెలిపారు. ఇప్పటికే 118 పనులు పూర్తి రోడ్ల పునరుద్ధరణ పనుల్లో రూ.158 కోట్ల విలువైన 118 పనులు పూర్తికాగా రూ.697 కోట్ల విలువైన 343 పనులు దాదాపుగా పూర్తికావచ్చాయన్నారు. రూ.260 కోట్ల బిల్లులు చెల్లించామని, ప్లాన్ వర్క్స్ కోసం రూ.1,158.53 కోట్లను నాబార్డ్ నుంచి సమీకరించామని తెలిపారు. వాటిలో 182 పనులు పూర్తికాగా మిగిలిన 51 పనులను జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు. నిర్మాణంలో ఉన్న వంతెనలకు ఎన్ఐడీఏ–2 పథకం కింద రూ.570.10 కోట్ల రుణం మంజూరుకు నాబార్డ్ సమ్మతించిందని తెలిపారు. రూ.486 కోట్ల నాబార్డు రుణంతో 14 రైల్, రోడ్ వంతెనల పనుల్ని పూర్తిచేస్తామన్నారు. వాటికి అదనంగా మరో 33 ఆర్వోబీలను నిర్మించాలని గుర్తించినట్లు తెలిపారు. వీటి నిర్మాణానికి రూ.1,980 కోట్లు కేంద్రం వెచ్చించనుండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.440 కోట్ల భూసేకరణ వ్యయాన్ని భరిస్తుందని చెప్పారు. సీఆర్ఐఎఫ్ పథకం కింద రూ.2,049 కోట్లతో 1,670 కి.మీ. రోడ్ల రెండులేన్లుగా పేవ్డ్ షోల్డర్స్‌తో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రోడ్లకోసం తీసుకున్న రుణాన్ని టీడీపీ ప్రభుత్వం మళ్లించింది 2019 ఎన్నికల ముందు రోడ్ల పునరుద్ధరణ కోసం తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాన్ని టీడీపీ ప్రభుత్వం రాజకీయ ప్రచార పథకాల కోసం మళ్లించిందని మంత్రి విమర్శించారు. రోడ్ల నిర్వహణ, మరమ్మతుల కోసం ఏటా రూ.8 వేల కోట్లు వెచ్చించాల్సి ఉండగా టీడీపీ ప్రభుత్వం ఏటా కేవలం రూ.2 వేల కోట్లే కేటాయించిందన్నారు. టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే రోడ్ల దుస్థితికి కారణమన్నారు. ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం రోడ్ల నిర్వహణకు రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటికే రూ.10,360 కోట్లు వెచ్చించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఐదేళ్లలో కేంద్రం నుంచి రూ.10,660 కోట్లు తేగలిగితే.. సీఎం వైఎస్ జగన్ మూడేళ్లలోనే రూ.11,500 కోట్లను కేంద్రం నుంచి రాబట్టారని చెప్పారు. రాష్ట్రంలో రోడ్లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఆర్ అండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ రోడ్ల పునరుద్ధరణ పనులను నాడు–నేడు విధానంలో డాక్యుమెంట్ చేసి రికార్డు చేస్తున్నామని చెప్పారు. -
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హిమాయత్‌నగర్ రోడ్లే రీకార్పెటింగ్ చేస్తున్నారా?
సాక్షి, సిటీబ్యూరో: గతంతో పోలిస్తే నగరంలో రహదారుల అవస్థలు కొంతమేర తగ్గాయి. గతంలో మాదిరిగా ఎగుడుదిగుళ్లు.. అధ్వానపు రహదారులు అన్ని ప్రాంతాల్లో లేవు. దాదాపు రెండేళ్ల క్రితం ప్రారంభించిన సమగ్ర రోడ్డు నిర్వహణ పథకం (సీఆర్ఎంపీ) కింద ప్రధాన రహదారుల మార్గాల్లో 709 కి.మీ మేర పనుల్ని పేరెన్నికగన్న పెద్ద ఏజెన్సీలకు కాంట్రాక్టుకిచ్చారు. కాంట్రాక్టులో భాగంగా ఎప్పటికప్పుడు రోడ్లను సాఫీ ప్రయాణానికి అనుగుణంగా ఉంచాల్సిన బాధ్యత వాటిదే. అంతే కాదు.. రోడ్ల మధ్య డివైడర్లు, రోడ్ల పక్కల ఫుట్‌పాత్‌లు.. రోడ్డుకిరువైపులా పచ్చదనం పెంపు తదితర పనులు సైతం వాటివే. అంతేకాదు.. పారిశుద్ధ్య నిర్వహణ కూడా వాటిదే. ఫుట్‌పాత్‌లు, పారిశుద్ధ్యం, డివైడర్ల నిర్వహణ వంటి పనుల సంగతెలా ఉన్నా ప్రధాన రహదారుల మార్గాల్లో మాత్రం ఇదివరకులా సమస్యల్లేవు. బాగున్న రోడ్లే మళ్లీ మళ్లీ.. సీఆర్ఎంపీలో భాగంగా నిధుల ఖర్చు చూపేందుకు బాగున్న రోడ్లనే మళ్లీ మళ్లీ చేస్తున్నారనే విమర్శలున్నాయి. ముఖ్యంగా వీఐపీలు పర్యటించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లతో పాటు హిమాయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో బాగున్న రోడ్లకే రీకార్పెటింగ్ చేస్తున్నారనే విమర్శలున్నాయి. మరోవైపు రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో జరుపుతున్న మిల్లింగ్ శాస్త్రీయంగా జరగడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో రోడ్డు ఎత్తు పెరుగుతోందని, మరమ్మతుల సందర్భంగా డైవర్షన్లకు సైనేజీల ఏర్పాట్లు వంటివి చేయడం లేదనే ఫిర్యాదులున్నాయి. శివారు సమస్యలు పట్టవా..? ప్రధాన రహదారుల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకివ్వగా.. మిగిలిన ఇతర మార్గాలు.. ముఖ్యంగా శివార్లలోని రోడ్లు.. అక్కడి కాలనీల్లోని అంతర్గత రహదారులు మాత్రం మారలేదు. దాదాపు 300 కి.మీ మేర మెటల్ రోడ్లను సీసీ రోడ్లుగా మార్చాలని ఏడాదిన్నర క్రితమే ప్రతిపాదించినా పనులు జరగలేదు. దీంతో అక్కడి సమస్యలు తీరలేదు. వానలొస్తే బురదమయంగా మారుతున్న రోడ్లతో ప్రజల అవస్థలు వర్ణనాతీతం. జోనల్ కమిషనర్లకే అధికారాలివ్వడంతో వారు ఆడింది ఆటగా సాగుతోందనే ఆరోపణలున్నాయి. ప్రధాన కార్యాలయం ప్రే„ý కపాత్ర వహించడం మాని.. పర్యవేక్షించాలని పలు ఎన్జీఓ సంఘాలు, ప్రజలు కోరుతున్నారు. శివారు ప్రాంతాల్లోనూ రోడ్ల సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు పేర్కొన్నారు. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని, లేని పక్షంలో సంబంధిత ఏఈలపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 16వేల ఫిర్యాదులు పరిష్కరించినట్లు తెలిపారు. నిర్ణీత వ్యవధిలో పరిష్కరించకుంటే సీఆర్ఎంపీ ఏజెన్సీలకు పెనాల్టీలు విధించి, బిల్లుల చెల్లింపుల్లో మినహాయిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు రూ. 15లక్షల పెనాల్టీలు విధించినట్లు పేర్కొన్నారు. కచ్చితమైన లెక్కలు జోన్లనుంచి అందాల్సి ఉందన్నాన్నారు. సీఆర్ఎంపీ.. స్వరూపం.. ► గ్రేటర్లో మొత్తం రోడ్లు: 9013 కి.మీ. ► సీఆర్‌ఎంపీలోని రోడ్ల పొడవు: 709 కి.మీ ► అయిదేళ్ల వరకు నిర్వహణతో సహా మొత్తం అంచనా వ్యయం : రూ1839 కోట్లు ► సీఆర్ఎంపీ పనులకు ఇప్పటి వరకు చేసిన ఖర్చు : రూ.594 ► ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) ఇప్పటి వరకు ఖర్చు రూ.177.98 కోట్లు ► ఇప్పటి వరకు రీకార్పెట్ చేసిన మొత్తం రోడ్లు: 496 కి.మీ ► ఈ ఆర్థిక సంవత్సరంలో రీకార్పెట్ చేసిన రోడ్లు:124 కి.మీ జీహెచ్ఎంసీలో ఇతర మార్గాల్లో చేసిన రోడ్ల పనులు ► ఈ ఆర్థిక సంవత్సరం మంజూరైన పనులు: 2,562 ► అంచనా వ్యయం: రూ 644కోట్లు ► ఇప్పటి వరకు పూర్తయిన పనులు: 802 ► వీటికైన వ్యయం: రూ. 177 కోట్లు ► పురోగతిలోని పనులు: 1,760 ► వాటి అంచనా వ్యయం రూ.467 కోట్లు ► 2021లో పూడ్చిన గుంతలు: 15,696 ► ఈ ఆర్థిక సంవత్సరం పరిష్కరించిన ఫిర్యాదులు: 15,849. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కొత్త రహదారి.. రాబోయే రోజుల్లో నాలుగు వరుసలుగా..
శంషాబాద్ రూరల్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో కొత్త దారి ఏర్పాటు కానుంది. ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో వచ్చే నెలలో జరగనున్న శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈ మార్గాన్ని ఔటర్ రింగు రోడ్డుకు అనుసంధానం చేస్తున్నారు. ఫిబ్రవరి 5న రామానుజుల విగ్రహావిష్కరణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడకు రానున్నారు. ఈ రోడ్డు మార్గంలోనే ఆయన ప్రయాణించేందుకు అధికారులు ప్రత్యామ్నాయంగా ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. శంషాబాద్ నుంచి బెంగళూరు జాతీయ రహదారి మీదుగా ఓ దారి, శ్రీశైలం రహదారి నుంచి తుక్కుగూడ సమీపంలోంచి మరో దారి ఇది వరకే ఉండగా.. ప్రస్తుతం గొల్లపల్లి మీదుగా పెద్దగోల్కొండలోని ఔటర్ రోటరీ జంక్షన్‌ను అనుసంధానం చేస్తూ కొత్తగా రహదారిని విస్తరిస్తున్నారు. విమానాశ్రయం రెండో దశ విస్తరణలో భాగంగా ఎయిర్‌పోర్టు ఆవరణలో కార్గో వాహనాల కోసం నాలుగు వరసల రహదారి ఏర్పాటు చేశారు. ఈ రహదారి ముఖ్యంగా కార్గో టెర్మినల్ నుంచి సరుకుల వాహనాల రాకపోకల కోసం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇది వరకు ఉన్న ఎయిర్‌పోర్టు మార్గాలో విమాన ప్రయాణికులు రాకపోకలు సాగిస్తే.. కొత్తగా ఏర్పాటు చేసిన మార్గంలో కార్గో వాహనాలకు అనుమతి ఇవ్వనున్నారు. కార్గో వాహనాలు ఔటర్ మీదుగా పెద్దగోల్కొండ రోటరీ జంక్షన్ నుంచి ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లేలా మార్గం ఏర్పాటు చేశారు. (చదవండి: ‘సహకార’ అప్పు.. దాడుల ముప్పు!) రూ.6 కోట్లతో విస్తరణ పనులు.. ఎయిర్‌పోర్టు లోపల నుంచి కార్గో వాహనాల కోసం గొల్లపల్లి శివారు వరకు 4 వరుసల రోడ్డు నిర్మాణం ఇది వరకే పూర్తి చేశారు. శంషాబాద్ నుంచి గొల్లపల్లి మీదుగా పెద్దగోల్కొండ ఔటర్ జంక్షన్ వరకు ఉన్న రహదారితో ఎయిర్‌పోర్టు రోడ్డును గొల్లపల్లి వద్ద అనుసంధానం చేస్తున్నారు. దీంతో గొల్లపల్లి నుంచి పెద్దగోల్కొండ జంక్షన్ వరకు ఉన్న దారిని సుమారు రూ.6 కోట్లతో విస్తరిస్తున్నారు. 7 మీటర్ల వెడల్పు ఉన్న ఈ దారిని ప్రస్తుతం 10 మీటర్లకు విస్తరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ మార్గాన్ని నాలుగు వరుసలుగా విస్తరించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రధాని రోడ్డు మార్గం ఇలా.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామనగరానికి రోడ్డు మార్గంలో చేరుకోవడానికి గొల్లపల్లి నుంచి ఔటర్ జంక్షన్ మీదుగా పీ– వన్ రోడ్డు మీదుగా చేరుకుంటారు. ప్రత్యామ్నాయ రోడ్డు మార్గంగా ఈ రహదారిని నిర్ణయించడంతో ఈ మార్గంలో మొక్కలు, అందమైన పూల మొక్కలను నాటుతున్నారు. పెద్దగోల్కొండ ఔటర్ జంక్షన్ వద్ద రంగులు వేసి అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ మార్గంలో వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. (చదవండి: జంక్షన్’లోనే లైఫ్ ‘టర్న్’) -
Andhra Pradesh: శాసన రాజధానికి రహదారి
సాక్షి, అమరావతి: ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది కుడి కరకట్ట రోడ్డు విస్తరణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. బ్యారేజీ వద్ద కొండవీటి వాగు వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు కరకట్ట రోడ్డును 15.52 కిలోమీటర్ల మేర రూ.150 కోట్ల ఖర్చుతో విస్తరించనున్నారు. కొండవీటి వాగు వరద ఎత్తిపోతల పథకం వద్ద నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. అనంతరం విస్తరణ పనులకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. పూర్తి నాణ్యతతో సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సూచించారు. కరకట్ట పటిష్టం.. అమరావతి స్మార్ట్ అండ్ సస్టెయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ నిధులతో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో కరకట్ట రోడ్డు విస్తరణ పనులు జరగనున్నాయి. 10 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలుగా ఈ రోడ్డును విస్తరిస్తున్నారు. రెండు లైన్లలో వాహనాలు వెళ్లేందుకు, మరో రెండు వరుసలు ఇరువైపులా నడకదారుల కోసం కేటాయించారు. ఈ రోడ్డులో కొండవీటి వాగు బ్రిడ్జిని పునఃనిర్మించనున్నారు. అమరావతి ఎన్–1, ఎన్–2, ఎన్–3 రహదారులతోపాటు సీడ్ యాక్సెస్ రోడ్డు, గొల్లపూడి – చినకాకాని –విజయవాడ బైపాస్ రోడ్లను కరకట్ట రోడ్డుకు అనుసంధానం చేస్తారు. దీనిద్వారా రాజధాని ప్రాంతానికి పూర్తిస్థాయి రహదారి సౌకర్యం కలుగుతుంది. సచివాలయం, పలు విద్యా సంస్థలతోపాటు ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, హరిశ్చంద్రపురం, వైకుంఠపురం గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. సచివాలయం, హైకోర్టుకు వెళ్లేందుకు ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది. రోడ్డు విస్తరణతో కరకట్ట పటిష్టంగా మారి తరచూ వరదల ముంపు బారిన పడే ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, మందడం, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, రాయపూడి గ్రామాలకు మేలు జరుగుతుంది. ఈ రోడ్డు వల్ల ప్రధానంగా విజయవాడ వైపు నుంచి సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టుకు వెళ్లి వచ్చే అధికారులు, ఉద్యోగులు, ప్రజల ట్రాఫిక్ సమస్యలు తీరతాయి. హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, అనిల్‌కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ, చెరకువాడ శ్రీరంగనాథరాజు, నారాయణస్వామి, సీహెచ్ వేణుగోపాలకృష్ణ, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్, గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలత, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, మద్దాలి గిరి, అన్నాబత్తుల శివ, షేక్ ముస్తఫా, గుంటూరు మేయర్ మనోహర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణా నది కరకట్ట పనులకు రేపు సీఎం జగన్ శంకుస్థాపన
సాక్షి, అమరావతి: కృష్ణా నది కరకట్ట విస్తరణ పనులకు రేపు సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10:25 గంటల ప్రాంతంలో సీఎం చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభంకానున్నాయి. ప్రకాశం బ్యారేజి వద్దనున్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు 15.525 కి.మీ. మేర కుడివైపు కరకట్ట రోడ్డు విస్తరణ పనులు జరుగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం రూ. 150 కోట్లు ఖర్చు చేయనుందని తెలిపారు. అమరావతి స్మార్ట్ అండ్ సస్టెయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ నిధులతో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగనున్నట్లు పేర్కొన్నారు. 10 మీటర్ల వెడల్పుతో రెండు వరుసల రహదారితో పాటు ఇరువైపులా రెండు వరుసల నడకదారులను నిర్మించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ రహదారిలో కొండవీటి వాగు బ్రిడ్జిని పునర్మించడంతో పాటు వెంకటాయపాలెం, రాయపూడి అవుట్ ఫాల్ స్లూయిస్, వరద పర్యవేక్షణ కేంద్రాలను నిర్మిస్తామని వివరించారు. ఈ రహదారితో అమరావతిలోని ఎన్-1 నుంచి ఎన్-3 రోడ్లను అలాగే ఉండవల్లి- రాయపూడి- అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్, గొల్లపూడి- చిన్నకాకాని- విజయవాడ బైపాస్ రోడ్లకు అనుసంధానిస్తామని తెలిపారు. కరకట్ట రహదారి నిర్మాణం ద్వారా అమరావతి, సచివాలయం, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్ధలు, తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక, తుళ్ళూరు మండలం వెంకటపాలెం, మందడం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, అమరావతి మండలం హరిశ్చంద్రాపురం, వైకుంఠపురం గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. చదవండి: ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ -
రాష్ట్రంలో రూ.3,300 కోట్లతో రోడ్ల నిర్మాణం
పి.గన్నవరం: రాష్ట్రంలో రూ.3,300 కోట్ల వ్యయంతో 2,400 రహదారులను నిర్మిస్తున్నట్టు పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ బి.సుబ్బారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి 2,300 రహదారి పనులు ప్రగతిలో ఉన్నాయని వివరించారు. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఊడిమూడిలంక వద్ద వశిష్ట నదీ పాయపై నాలుగు లంక గ్రామాల ప్రజలకు అవసరమైన వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.49.5 కోట్లు మంజూరు చేసింది. వంతెన నిర్మాణ ప్రాంతాన్ని ప్రాజెక్ట్ ఎస్ఈ ఎం.నాగరాజు, ఈఈ చంటిబాబు, డీఈఈ ఎ.రాంబాబుతో కలిసి ఆదివారం సుబ్బారెడ్డి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా రూ.1,150 కోట్లతో వంతెనలు, రహదారుల నిర్మాణానికి టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు. పీఎంజీఎస్‌వై కింద మంజూరైన రూ.2,600 కోట్లతో 3,285 కిలోమీటర్ల మేర రహదారులను ఆధునికీకరిస్తున్నామని వివరించారు. ఇంతవరకు 2,300 కి.మీ. మేర రహదారులకు టెండర్లు పూర్తయ్యాయని, మిగిలిన వాటికి త్వరలో ఖరారవుతాయని తెలిపారు. అంతకుముందు ఆయన ఊడిమూడిలంకలో ప్రజలు, నాయకులతో సమావేశమయ్యారు. ఇక్కడ వంతెన నిర్మించాలని దశాబ్దాలుగా కోరుతున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ సమస్యను ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా లంక గ్రామాల ప్రజలు అప్పట్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఇక్కడ వంతెన నిర్మాణానికి ఆయన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. వంతెన నిర్మాణానికి సాంకేతిక బిడ్ పరిశీలనలో ఉందని, అది కూడా పూర్తయితే పనులు ప్రారంభిస్తామని సుబ్బారెడ్డి చెప్పారు. -
పల్లెకు సొబగులు.. ప్రజలకు వసతులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పల్లెలకు మహర్దశ పట్టింది. దశాబ్దాలుగా సమస్యలతో కునారిల్లుతున్న గ్రామాల్లో అభివృద్ధి మంత్రం వినిపిస్తోంది. సాధారణ రోడ్లు మొదలుకుని అధునాతన నిర్మాణాల వరకు అన్ని హంగులతో గ్రామాలు కొత్త శోభ సంతరించుకుంటున్నాయి. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టిన ఏడాది, పదినెలల్లోనే పల్లెల్లో పెద్దఎత్తున అభివృద్ధి పనులు మొదలయ్యాయి. జిల్లాలో ఉన్న 941 పంచాయతీల్లో మొత్తం రూ.2,500 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు వేగంగా నిర్మిస్తున్నారు. ఇళ్ల పట్టాలు అందజేశారు. పక్కాగృహాల నిర్మాణాలకు చర్యలు తీసుకున్నారు. 24 గంటలు వైద్యసేవలందేలా ఆరోగ్య కేంద్రాలకు వసతులు సమకూరుతున్నాయి. సీసీ రోడ్లు, పక్కా రోడ్లు నిర్మిస్తున్నారు. రోడ్ల పనులకు సుమారు రూ.500 కోట్లు మంజూరయ్యాయి. మనబడి నాడు–నేడు కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలల స్థాయికి మారుతున్నాయి. ఒకప్పుడు పిచ్చి మొక్కలతో కళావిహీనంగా ఉన్న పాఠ«శాలలు నేడు అందంగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరందేలా ఏర్పాట్లు చేశారు. మంచి ఫర్నిచర్, ఆహ్లాదకరమైన పెయింటింగ్‌లతో స్కూళ్లు ఆకట్టుకుంటున్నాయి. 1,054 పాఠశాలల్లో మరుగుదొడ్ల మరమ్మతులు చేపట్టారు. ఇప్పటికే 519 పూర్తయ్యాయి. 40 సచివాలయ భవనాల నిర్మాణం పూర్తి గ్రామ సచివాలయాలు ప్రజలకు విశేషంగా సేవలందిస్తున్నాయి. నూతన భవనాల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే 40 సచివాలయ భవనాల నిర్మాణం పూర్తయింది. బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, కుల, నివాస, ఆదాయ తదితర పత్రాలను సచివాలయాల్లోనే వేగంగా అందజేస్తున్నారు. జిల్లాలో 660 రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటికి సొంత భవనాలు నిర్మిస్తున్నారు. స్థలం, అంతస్తులను బట్టి రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఒక్కో భవనానికి ఖర్చు చేస్తున్నారు. ఇందుకోసం దాదాపు రూ.198 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా ఎరువులు, పురుగుమందులు తక్కువ ధరకే అందేలా చూస్తున్నారు. వాటిద్వారానే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఈ–క్రాప్ వివరాలను అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేస్తున్నారు. జిల్లాలో 75 పీహెచ్సీలుండగా వాటికి అనుబంధంగా పల్లెల్లో 556 హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఒక స్టాఫ్ నర్సు ఉండేలా చూసి 24 గంటలు వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ సెంటర్ల ఏర్పాటుకు రూ.250 కోట్లు వరకు వెచ్చిస్తున్నారు. మర్రిపాడు మండలం డీసీపల్లిలోని రైతుభరోసా కేంద్రం 53 వేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం జిల్లాలో 53 వేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఇంటిస్థలం పట్టాలు పంపిణీ చేశారు. టిడ్కో ఇళ్లను అందజేశారు. చక్కటి లే అవుట్లలో రూపుదిద్దుకుంటున్న కాలనీల్లో అన్ని వసతులు కల్పిస్తున్నారు. పలు పల్లెలకు ప్రధాన రహదారులను కలుపుతూ లింకు రోడ్లు నిర్మిస్తున్నారు. ఇలా జిల్లాలో సుమారు రూ.500 కోట్ల వరకు పంచాయతీరాజ్ రోడ్లు మంజూరు చేశారు. ఇలా అన్ని రంగాల్లో గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. -
‘ఉపాధి’తో శాశ్వత ఆస్తులు
సాక్షి, అమరావతి: రికార్డు స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఉపాధి పథకం ద్వారా పనులు కల్పించింది. స్థానిక ప్రజలకు శాశ్వత అవసరాలకు ఉపయోగపడేలా ఆస్తుల కల్పన దిశగా పేదలకు పనులు కల్పింస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 515 గ్రామాల్లో కొత్తగా ఆట స్థలాలను తయారు చేశారు. మరో 461 గ్రామాల్లో పార్కులు ఏర్పాటు చేశారు. 6,396 ప్రాంతాల్లో మట్టి రోడ్లు.. 5,007 చోట్ల అంతర్గత రోడ్డు పనులు చేశారు. చిన్నా, పెద్ద తరహా ఆస్తులతో కలిపి దాదాపు ఐదు లక్షల వరకు ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పనులు చేపట్టారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య 275 రోజుల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 77,70,594 మంది కూలీలకు 22,10,99,729 పని దినాలు కల్పించారు. ఈ పథకం ద్వారా పనులు చేసుకోవడం ద్వారా 46.71 లక్షల కుటుంబాలు రూ.5,084 కోట్ల మేర వేతనాల రూపంలో లబ్ధి పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఈ స్థాయిలో ఎప్పుడూ పనులు కల్పించలేదని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. లాక్డౌన్ నేపథ్యంలో పెద్ద ఎత్తున పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు తిరిగి వచి్చన 3,85,625 కుటుంబాలకు చెందిన 6,27,989 మందికి పనులు కల్పించడానికి వీలుగా కొత్తగా జాబ్ కార్డులు మంజూరు చేశారు. -
సాగిపోదాం.. సాఫీగా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారుల రూపు మారుతోంది. వేలకోట్ల రూపాయలతో విస్తరణ, మరమ్మతు పనులు చురుగ్గా సాగుతున్నాయి. పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేస్తున్నారు. ప్రస్తుతం రూ.5 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఇందులో రూ.4,316 కోట్లతో రహదారుల విస్తరణ, రూ.684 కోట్లతో రోడ్ల నిర్వహణ, ప్రత్యేక మరమ్మతులు చేపట్టారు. ఇవికాకుండా రూ.2,168 కోట్లతో 7,116 కి.మీ. మేర రోడ్లు, వంతెనలను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని ఇటీవల ఆర్ అండ్ బీ శాఖ సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో రోడ్లపై ఎక్కడా గుంతలు కనిపించకూడదని సూచించారు. ఇందుకు మూడువేల కిలోమీటర్ల రోడ్లకు రూ.303 కోట్లు అవసరమని ఆర్ అండ్ బీ శాఖ ఆర్థికశాఖకు ప్రతిపాదించింది. డిసెంబరు నాటికల్లా వర్షాలకు దెబ్బతిన్న రోడ్లపై గుంతల్ని పూడ్చేందుకు ఆర్ అండ్ బీ శాఖ ప్రణాళిక రూపొందించింది. రోడ్ల మరమ్మతుల పర్యవేక్షణకు ప్రభుత్వం సీఈలు, ఎస్ఈలను నియమించింది. గ్రామీణ రహదారుల కోసం రూ.1,089 కోట్ల మేర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ పథకం కింద సాయమందించాలని నాబార్డును కోరారు. మరోపక్క రూ.6,400 కోట్లతో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) రుణ సాయంతో రహదారుల ప్రాజెక్టులు చేపడుతున్న విషయం తెలిసిందే. జిల్లా ప్రధాన రహదారులకు ప్రాధాన్యం ► జిల్లా ప్రధాన రహదారులకు ప్రాధాన్యం దక్కనుంది. మొత్తం మరమ్మతులు చేసే మూడువేల కి.మీ.లలో 2,060 కి.మీ. మేర జిల్లా ప్రధాన రహదారులకు రూ.197 కోట్లు కేటాయించేందుకు ప్రతిపాదించారు. 940 కి.మీ. రాష్ట్ర రహదారులకు రూ.106 కోట్లు కేటాయించనున్నారు. ► రాష్ట్ర రహదారులపై ప్యాసింజర్ కార్ యూనిట్లు (పీసీయూ) రోజుకు 6 వేలు దాటిన వాటిని మొదటి ప్రాధాన్యతగా తీసుకుని రోడ్ల నిర్వహణ చేపట్టనున్నారు. ► గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో రోడ్లు విస్తరణ, మరమ్మతులకు రూ.4,150 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. ► 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లలో గ్రామీణ రహదారుల కోసం రూ.2,748.21 కోట్ల బడ్జెట్ కేటాయించినా రూ.2,103.34 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. ► ఆర్ అండ్ బీకి కేటాయించిన నిధుల్ని వేరే పథకాలకు మళ్లించారు. రోడ్ల మరమ్మతులకు రూ.122 కోట్లు ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న గ్రామీణ రోడ్లకు రూ.122.15 కోట్లతో మరమ్మతులు చేయడానికి పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీరింగ్ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సెప్టెంబర్, అంతకు ముందు కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 207 రోడ్లు దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. 28 చోట్ల రాకపోకలకు అంతరాయం కలిగే రీతిలో ఆ రోడ్లకు గండ్లు పడ్డాయి. అన్ని జిల్లాల ఎస్ఈలు దెబ్బతిన్న రోడ్ల వివరాలు పంపినట్టు ఈఎన్సీ సుబ్బారెడ్డి తెలిపారు. ► గండ్లు పూడ్చివేతతోపాటు రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నచోట అత్యవసరంగా రూ.10.25 కోట్లతోను, ఆయా రోడ్లకు రూ.111.90 కోట్లతో పూర్తిస్థాయిలోను మరమ్మతులు చేయాలని ప్రతిపాదించారు. ► కర్నూలు జిల్లాలో ఏడుచోట్ల పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీరింగ్ విభాగం పరిధిలోని భవనాలు, వైఎస్సార్ కడప జిల్లాలో ఐదు పాఠశాలల ప్రహరీలు వర్షాలకు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులకు రూ.1.55 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విశాఖ జిల్లాలో పాడేరు నుంచి సుజనాకోట వరకు రూ.20 కోట్లతో రహదారి పనులు జరుగుతున్నాయి. పెదబయలు మండలం దూడకోట పంచాయతీ కేంద్రం నుంచి అత్యంత మారుమూల జాముగూడ వరకు రూ.13.21 కోట్లతో రోడ్డు నిర్మిస్తున్నారు. ఒడిశా సరిహద్దులో కెందుగూడ వరకు, ముంచంగిపుట్టు మండలం మారుమూల లబ్బూరు జంక్షన్ నుంచి మారుమూల గ్రామం బుంగాపుట్టు వరకు రూ.14 కోట్లతో రోడ్డు నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట–దోన్బాయి–వీరఘట్టం వరకు 25 కి.మీ. రోడ్డు నిర్మాణాన్ని రూ.24 కోట్లతో చేపట్టారు. డిసెంబర్‌కల్లా రాష్ట్రంలో గుంతల్లేని రహదారులు వర్షాలకు రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. ప్రాధాన్యత క్రమంలో రోడ్లను నిర్వహించేందుకు ప్రతిపాదనలు రూపొందించాం. వాహనాల రద్దీ ఎక్కువ ఉండే రోడ్లు గుర్తించి వాటి మరమ్మతులు, నిర్వహణ చేపడుతున్నాం. డిసెంబర్ నాటికల్లా రోడ్ల నిర్వహణ మెరుగ్గా ఉంటుంది. గ్రామీణ రహదారులను విస్తరించడం, నిర్వహణ కోసం నాబార్డుకు ప్రతిపాదనలు పంపించాం. రూ.1,089 కోట్ల ప్రతిపాదనల్లో రూ.440 కోట్లతో రోడ్ల నిర్వహణ చేపట్టే ప్రణాళికలున్నాయి. – వేణుగోపాల్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ -
కొత్తగా నిర్మించే ఇళ్లకు నిబంధనలు తప్పనిసరి
సాక్షి, పాలమూరు: పట్టణ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన జంక్షన్ వెడల్పు, రోడ్డు విస్తరణ పనులకు అందరూ సహకరించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు. జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న జంక్షన్ అభివృద్ధి పనులను ఆదివారం రాత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొత్త కాలనీల్లో నిబంధనల ప్రకారమే ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ రోడ్లు అక్రమించుకోవద్దన్నారు. గతంలో గ్రామాలను మున్సిపాలిటీల్లో వీలినం చేసిన సందర్భాల్లో పంచాయతీలుగానే కొనసాగించాలనే డిమాండ్ ప్రజల నుంచే వచ్చేదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ విధానాలు చూసి అందరూ మున్సిపాలిటీల్లో కొనసాగాలనే కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్‌చైర్మన్ గణేష్, కలెక్టర్ వెంకట్రావ్ పాల్గొన్నారు. -
ఇది జాతీయ రహదారా?
పశ్చిమగోదావరి,ఆకివీడు: జిల్లాలో జాతీయరహదారి 216పై ప్రయాణం నరకాన్ని తలపిస్తుంది. జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఉప్పుటేరు వంతెన వద్ద నుంచి ఆకివీడు ప్రధాన సెంటర్ వరకూ జాతీయరహదారి పలు చోట్ల చెరువుల్ని తలపిస్తుంది. భారీ వర్షాలకు రహదారి పూర్తిగా మునిగిపోయింది. పలుచోట్ల గుంతలు పడి ద్విచక్ర వాహన చోదకులు అవస్థలు పడుతున్నారు. రాత్రి పూట ఈ ప్రాంతంలో వాహనంపై ప్రయాణిస్తే అంతే సంగతులని పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జాతీయ రహదారికి కనీస మరమ్మతులు చేపట్టడంలేదు. గతంలో ప్రపంచ బ్యాంక్ నిధులతో నిర్మించిన పక్కా డ్రెయిన్ అడ్రస్సు లేకుండా పోయింది. ఆయా ప్రాంతాల్లో ఆక్రమణలతో డ్రెయిన్‌ను పూడ్చివేశారు. ఇటీవల రహదారి పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టినప్పటికీ వర్షం రావడంతో పనులు నిలిచిపోయాయి. రహదారి పునర్నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ ఆక్రమణల్లో ఉన్న మార్జిన్లు తొలగించి, పక్కా డ్రెయిన్ సదుపాయం కల్పిస్తేనే వర్షంనీరు పారుదలకు మార్గం ఏర్పడుతుందని చెబుతున్నారు. డ్రెయిన్, మార్జిన్లలో ఉన్న మట్టి తొలగించాలని పలువురు కోరుతున్నారు. -
కారడవిలో కాంతిరేఖ
పశ్చిమగోదావరి ,బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ అభివృద్ధితో పాటు గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల ప్రజలను వరద కష్టాల నుంచి గట్టెక్కించడంతో పాటు రాకపోకలకు వీలుగా ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణంపై దృష్టి సారించింది. గోదావరి వరద పోటెత్తిన సమయాల్లో పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ వెనుక ఉన్న 19 గిరిజన గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. దీంతో గిరిజనులు రాకపోకలకు వీలులేక, నిత్యావసర సరుకులు అందక నానా అవస్థలు పడుతున్నారు. వీరి కష్టాలను తీర్చేలా జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత డ్యామ్‌లో పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉన్న సమయాల్లోనూ గిరిజన గ్రామాలకు ఇబ్బందులు కలగకుండా అటవీ ప్రాంతమైన గడ్డపల్లి నుంచి కొట్రుపల్లి మీదుగా కొరుటూరు వరకు ప్రత్యామ్నాయ రోడ్డు మార్గం ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఆదేశాలతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఐటీడీఏ, పోలవరం ప్రాజెక్టు అధికారులు సమన్వయంతో రోడ్డు నిర్మాణానికి సంకల్పించారు. ఇది పూర్తయితే రోడ్డు మార్గంలో ఉన్న మరికొన్ని గ్రామాల ఆదివాసీలకూ జీవనోపాధి లభిస్తుందని అధికారుల చెబుతున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే ఏజెన్సీ అందాలు, జలతారు వాగు ప్రవాహాల మధ్య పర్యాటకంగానూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. 15 కిలోమీటర్లు.. రూ.10 కోట్లు దట్టమైన అటవీ ప్రాంతంలో పాపికొండల నడుమ దాసన్ రోడ్డు మార్గం ఉంది. ఇది బ్రిటిష్ కాలంలో దాసన్ అనే ఇంజినీర్ ఏర్పాటు చేశారు. రాళ్లతో పేర్చి ఉన్న ఈ రోడ్డు గడ్డపల్లి దాటిన తర్వాత కట్రుపల్లి మీదుగా చిలుకలూరు, రావిగూ డెం బంగ్లా రహదారి మీదుగా కొ రుటూరు వరకూ సుమారు 15.49 కిలోమీటర్ల మేర ఉంది. కొండ ప్రాంతంపై నుంచి 13 మ లుపులు తిరుగుతూ ఉండే ఈ దారి తిరుపతి కొండలను తలపి స్తోంది. దీనిని బీటీ రోడ్డుగా మా ర్చేందుకు రూ.10 కోట్లతో అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. ఇటీవల పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో పాటు పోలవరం ప్రాజెక్టు ఎస్ఈ నాగిరెడ్డి, ఐటీడీఏ పీఓ ఆర్వీ సూర్యనారాయణ, డీఎఫ్ఓ పి.రామకృష్ణ, ఆర్డీఓ ప్రసన్నలక్ష్మి, డీఎస్పీ పి.వెంకటేశ్వరరావు రోడ్డు మార్గంలో పర్యటించి నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. 19 గ్రామాలకు మరింత మేలు దాసన్ రోడ్డు నిర్మాణం పూర్తయితే గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న 19 గిరిజన గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుంది. వరదల సమయంలో కూడా వారికి సహాయ సహాకారాలను అందించడం సులభమవుతుంది. వారు సులభంగా బయటకు వచ్చేందుకు ఇబ్బందులు తొలగుతాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రకృతి అందాల నడుమ రహదారి ఉండటం వల్ల టూరిజంగానూ అభివృద్ధి చెందుతుంది. రోడ్డు కొరుటూరు చేరుకుని పాపికొండల నడుమ కలవడంతో పర్యాటకులను కనువిందు చేస్తుంది. గోదావరి బోటు ఎక్కకుండా రోడ్డు మార్గంలో వాహనాల ద్వారా పాపికొండలకు చేరుకోవచ్చు. మార్గమధ్యలో జలతారు వాగు ప్రవాహాలు కనువిందు చేస్తాయి. దిగువ ప్రాంతాలకు లాభదాయకం దాసన్ రోడ్డు నిర్మాణం పూర్తయితే దిగువ ప్రాంతంలో ఉన్న పులిరామన్నగూడెం, కన్నారప్పాడు, ముంజులూరు, చింతపల్లి, గడ్డపల్లి గ్రామాల ప్రజలకూ ప్రయోజనం కలుగనుంది. రవాణా సౌకర్యంతో మెరుగైన వైద్య సేవలు అందించవచ్చు. గిరిజనులకు ఉపాధి అవకాశాలు కలగడంతో వారు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఐటీడీఏ రుణాలు పొంది స్వయం సమృద్ధి సాధించవచ్చు. -
రోడ్లు ఇలా.. ప్రయాణం ఎలా?
నల్లకుంట: లాక్డౌన్ కారణంగా రోడ్లు నిర్మానుష్యంగా మారడంతో ప్రభుత్వం రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి తదితర పనులును పునఃప్రారంభించింది. ప్రభుత్వం ఈ నెల 31వరకు లాక్డౌన్ పొడిగింపుతో నిబంధనలతో కూడి న అనుమతులు ఇవ్వడంతో ప్రజలు రోడ్ల మీదికి వస్తున్నారు. లాక్‌డౌన్‌కి ముందు ఆగిన పనులు, లాక్డౌన్ కొన సాగింపుతో ప్రారంభించిన పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అసంపూర్తిగా రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణ పనుల కోసం తవ్విన గుంతలు ప్రమాదాలకు తావిస్తున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు ఆగిన పనులు.. నాలుగు నెలల క్రితం నల్లకుంట డివిజన్లోని నల్లకుంట రైల్వే ట్రాక్, నర్సింహ బస్తీ, విజ్ఞానపురి కాలనీ తదితర ప్రాంతాల్లో సీసీ రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభించారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ఆఘమేఘాలతో రోడ్లను తవ్వి వదిలేశారు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా చేపట్టిన పనులు ముందుకు సాగలేదు. లాక్‌డౌన్‌కి ముందు నత్తనడకన సాగిన అభివృద్ధి పనులపై విమర్శలు వెలువెత్తడంతో జీహెచ్ఎంసీ అధికారులు కాంట్రాక్టర్‌ను పురమాయించి పనులు పునఃప్రారంభించారు. ఇంతలో కోవిడ్–19 కారణంగా మళ్లీ పనులు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల పూర్తయిన సీసీ రోడ్డు పనులకు క్యూరింగ్‌చేసే దిక్కు కూడా లేకుండా పోయింది. మరికొన్ని చోట్లల్లో అభివృద్ధి పనులు చేసినప్పటికీ రోడ్లపై పోసిన మట్టికుప్పలను తొలగించలేదు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం లాక్డౌన్లో సడలింపులు ఇవ్వటంతో నల్లకుంట బస్తీవాసులు బయటకి వస్తున్నా కొద్దిపాటి దూరానికి 2 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తోందని, కొందరు ఆ మట్టి దిబ్బలపై నుంచే రాకపోకలు సాగిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారని వాహనదారులు, స్థానికులు పేర్కొంటున్నారు. పట్టించుకోని అధికారులు.. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి చౌరస్తాలో రెండు వారాల క్రితం కేబుల్ పనుల కోసం రోడ్డును తవ్వారు. పనులు పూర్తయినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల రోడ్డుకి ప్యాచ్‌వర్క్స్ పనులు పూర్తిచేయలేదు. దీంతో మట్టి రోడ్డుపైకి చేరుతుండడంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఆ మట్టి, దుమ్ము ధూళి కారణం ఎక్కడేం ప్రమాదం జరుగుతోందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, అధికారులు ఇప్పటికైనా స్పందించి తవ్వి వదిలేసిన రోడ్లకు ప్యాచ్‌వర్క్ పూర్తి చేసి, రోడ్లపై వదిలేసిన మట్టి దిబ్బలను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు. -
నెల రోజుల్లో స్టీల్ బ్రిడ్జి రెడీ
లక్డీకాపూల్ : పంజగుట్టలో రూ.23 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన స్టీల్ బ్రిడ్జి, రోడ్డు విస్తరణ పనులను వేగంగా పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థను మంత్రి కె.తారక రామారావు ఆదేశించారు. ఆదివారం మేయర్ బొంతు రామ్మోహన్, శాసన సభ్యులు దానం నాగేందర్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్‌లతో కలిసి నిర్మాణ పనులను తనిఖీ చేశారు. రోడ్డు విస్తరణ చేసి నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి గడ్డర్ల అమర్చే పనులను పరిశీలించారు. లాక్డౌన్ వలన కలిగిన వెసులుబాటుతో అదనంగా కార్మికులను, నిపుణులను నియమించి రేయింబవళ్లు పనులు చేయిస్తున్న కాంట్రాక్టర్‌ను అభినందించారు. ఇదే స్ఫూర్తితో తగిన రక్షణ చర్యలు తీసుకుంటూ, ఆధునిక యంత్రాలతో మరో నెలరోజులలో పనులను పూర్తిచేయాలన్నారు. స్టీల్ బ్రిడ్జి, రెండు వైపులా రెండు లేన్ల విస్తరణ పనులు 50 శాతం పూర్తి అయినట్లు జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్ శ్రీధర్ ఈ సందర్భంగా వివరించారు. నిత్యం రద్దీగా ఉండే పంజాగుట్ట మార్గంలో ప్రయాణించే వాహనదారుల ఇబ్బందులు మరో నెల రోజుల్లో పూర్తిగా తొలగిపోనున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మన్నె కవిత గోవర్ధన్‌రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
పంజగుట్ట కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపులు
సాక్షి, సిటీబ్యూరో: పంజగుట్ట శ్మశానవాటిక వద్ద రోడ్డు విస్తరణ, స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తున్నట్లు ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ శుక్రవారం ప్రకటించారు. ఇవి శనివారం నుంచి ఈ ఏడాది జూన్ 3 వరకు అమలులో ఉంటాయన్నారు. ఎస్ఎన్టీ జంక్షన్ నుంచి ఎన్ఎఫ్సీఎల్, పంజగుట్ట చౌరస్తాల వైపు ఏ భారీ వాహనాలను అనుమతించరు. ఈ నేపథ్యంలో ఫిల్మ్‌నగర్ జంక్షన్, రోడ్ నెం.45 జంక్షన్, రోడ్ నెం.36 వైపు నుంచి వచ్చే వాహనాలు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్–యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్–మైత్రీవనం మీదుగా లేదా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్–రోడ్ నెం.45–బీవీబీ జంక్షన్– రోడ్ నెం.12 మీదుగా ప్రయాణించాలని ఆయన సూచించారు. -
నాబార్డు నిధులతో రోడ్లకు మహర్దశ
నెల్లూరు(బారకాసు): జిల్లాలోని కావలి, గూడూరు డివిజన్లలో గల పలు ప్రాంతాల్లో రోడ్లకు మహర్దశ పట్టనుంది. రూ.22.37 కోట్ల నాబార్డు నిధులతో ఆర్ అండ్ బీ అధికారులు ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో రోడ్డు పనులను ప్రారంభించారు. ఇవి వివిధ దశల్లో ఉన్నాయి. త్వరలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) ద్వారా మరికొన్ని ప్రాంతాల్లో రోడ్ల పనులు చేపట్టేందుకు సంబంధిత అధికారులు చర్యలు ప్రారంభించారు. దీంతో మూడు నెలల్లోపు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రహదారులను సుందరంగా తయారు చేయనున్నారు. నాబార్డు నిధులతో 8 పనులు నాబార్డు నుంచి విడుదలైన రూ.22.37 కోట్లతో 8 రోడ్ల పనులు చేపట్టారు. ఇందులో కావలి డివిజన్లో ఆరు, గూడూరు డివిజన్లో రెండు వర్కులు వివిధ దశల్లో ఉన్నాయి. గూడూరు డివిజన్లో ఏర్పేడు నుంచి చెన్నూరు వరకు 3.5 కిలోమీటర్లు, బంగారుపేట నుంచి చెన్నై, కోల్‌కతా రోడ్డు వరకు 4.9 కిలోమీటర్ల మేర తారు రోడ్డు పనులను ప్రారంభించారు. దీనికి రూ.6.85 కోట్లను వెచ్చించారు. కావలి డివిజన్లో ఆరు రోడ్ల పనులకు గానూ రూ.12.52 కోట్లు వెచ్చించారు. ఇందులో రెండు పనులు జరగ్గా, మిగిలిన నాలుగు పనులకు అటవీశాఖ అనుమతులివ్వకపోవడంతో నిలిచిపోయాయి. అల్లూరు నుంచి ఉడ్‌హౌస్‌పేట వరకు మూడు బ్రిడ్జిల పనులు జరుగుతున్నాయి. కావలి నుంచి తుమ్మలపెంట వరకు 0.5 కిలోమీటర్ వరకు రోడ్డు పనులను ఇప్పటికే పూర్తి చేశారు. ఉదయగిరి నుంచి బండగానిపల్లి, తిమ్మసముద్రం నుంచి చోడవరం, జంగాలకండ్రిగ నుంచి చెన్నూరు, కోవూరు నుంచి యల్లాయపాళెం వరకు జరగాల్సిన రోడ్డు పనులు అటవీ శాఖ అనుమతులు లభించక నిలిచిపోయాయి. త్వరలో ఎన్డీబీ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం ఎన్డీబీ ప్రాజెక్ట్ ద్వారా మరికొన్ని ప్రాంతాల్లో రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా చేపట్టే రోడ్ల పనులకు చైనా వారు 70 శాతం నిధులను రుణంగా ఇవ్వగా, మిగిలిన 30 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. దీని కోసం ఆర్ అండ్ బీ అధికారులు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే రోడ్ల నిర్మాణ పనులు ఎక్కడెక్కడ చేపట్టాలో గుర్తించడంతో పాటు అందుకు ఎంత నిధులు అవసరమో కూడా నిర్ణయించారు. ఫేజ్ – 1కు సంబంధించిన టెండర్లను పిలిచేందుకు సిద్ధం చేస్తున్నారు. ఫేజ్ – 2లో జరిపే పనుల కోసం అంచనాల్లో ఉన్నారు. నిధులను వెచ్చించనుంది ఇలా.. ఎన్డీబీ ప్రాజెక్ట్ ద్వారా రూ.428.62 కోట్లతో 15 రోడ్ల పనులు చేపట్టనున్నారు. ఆయా పనులను ఫేజ్ – 1, 2 ద్వారా పూర్తి చేయనున్నారు. ఫేజ్ – 1లో రూ.128.56 కోట్లతో ఆరు రోడ్ల పనులు, ఫేజ్ – 2లో తొమ్మిది రోడ్ల పనులకు రూ.300.06 కోట్లు వెచ్చించనున్నారు. ఇందులో ఫేజ్ – 1 ద్వారా తోటపల్లిగూడూరు నుంచి సీఎస్‌పురం, సూళ్లూరుపేట నుంచి సంతవేలూరు, రాజుపాళెం నుంచి ఇస్కపల్లి, కావలి నుంచి తుమ్మలపెంట, బుచ్చి నుంచి దగదర్తి, ముంబై హైవే రోడ్డు నుంచి కోవూరు వరకు ఆరు పనులు చేపట్టనున్నారు. అదే విధంగా ఫేజ్ – 2 ద్వారా నందనం నుంచి ఉదయగిరి, సంగం నుంచి కలిగిరి, సంగం నుంచి విరువూరు మీదుగా కలువాయి, నెల్లూరు నుంచి తాటిపర్తి, నెల్లూరుపాళెం నుంచి వింజమూరు, పాత మద్రాస్ రోడ్డు నుంచి కోట, విద్యానగర్ మీదుగా సముద్ర తీర ప్రాంతం వరకు, ఏర్పేడు నుంచి నాయుడుపేట వరకు, రాపూరు రోడ్డు, సూళ్లూరుపేట నుంచి నాయుడుపేట, దుగరాజపట్నం వరకు, గూడూరు నుంచి జయంపు వరకు రోడ్డు పనులు చేపట్టేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. మూడు నెలల్లో పూర్తి ఆర్ అండ్ బీ శాఖ ద్వారా ఆయా రోడ్డు పనులను మరో మూడు నెలల్లో పూర్తిచేసేందుకు యత్నిస్తున్నాం. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్లకు మహర్దశ పట్టనుంది.– వివేకానంద, ఎస్ఈ, ఆర్ అండ్ బీ -
హైవే.. మృత్యుకేక
జిల్లా జాతీయ రహదారి నెత్తురోడుతోంది. సుదీర్ఘ పొడవున్న ఈ రహదారిపై నిత్యం ఏదో ఒక చోట మృత్యుకేక వినిపిస్తోంది. వాహనాల రద్దీని తట్టుకునేందుకు వీలుగా ఏడాదికిపైగా నాలుగు లైన్ల రోడ్డును ఆరులైన్లుగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారింది. ప్రధానంగా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు దారిని అంచనా వేయలేక మృత్యువాత పడుతున్నారు. ఇందులో ఎక్కువగా కార్లలో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలే గాలిలో కలిసిపోతున్నాయి. ఇవి కూడా రాత్రిళ్లు చోటు చేసుకోవడం గమనార్హం. శ్రీకాకుళం, కాశీబుగ్గ: జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న రోడ్ల ప్రమాదాలు కలవరం కలిగిస్తున్నాయి. నిద్రమత్తులో కొందరైతే, బయటపడని కారణాలతో మరికొందరు ఏమరుపాటుగా ప్రమాదాలకు గురై మృత్యవాత పడుతున్నారు. కొద్ది నెలల వ్యవధిలో పలు సంఘటనలకు జిల్లా కేంద్ర బిందువుతోంది. అటువంటి ప్రమాదాలకు గల కారణాలు, ఇతర జాగ్రత్తలు పోలీసుల చర్యలతో సాక్షి ప్రత్యేక కథనం.. జిల్లా వ్యాప్తంగా ఎన్‌హెచ్ 16 విస్తరణపనులు... విశాఖపట్నం నుంచి మన జిల్లా వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. నరసన్నపేట వరకు ఆరు లైన్ల రోడ్డు విస్తరణ, అక్కడ నుంచి ఇచ్ఛాపురం వరకు ముందస్తుగా వంతెనలు, ప్లైఓవర్ల నిర్మాణాలు వేగవంతమయ్యాయి. ఈ తరుణంలో అధికంగా రాత్రిళ్లు పనులు చేస్తుండటం, పూర్తిస్థాయి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, అప్పటి వరకు అదే రోడ్డులో రాకపోకలు కల్పించి, అకస్మాత్తుగా రాత్రి పదకొండు గంటల తర్వాత దారి మళ్లింపు వంటి చర్యలు ప్రమాదకరంగా మారుతున్నాయి. రోడ్డు విస్తరణ మంచిదైనప్పటికి అటుగా ప్రయాణించే ప్రయాణికులకు ప్రాణాపాయంగా మారుతోంది. ఈ పనులు గమనించక సొంపేట మండలం వద్ద ప్రమాదంలో ఇద్దరు జవాన్లు బోల్తాపడగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. టోల్‌గేటు వద్ద సిబ్బంది నిర్లక్ష్యం జిల్లాలో చిలకపాలెం, మడపాం, ఇచ్ఛాపురం టోల్గేట్ల వద్ద సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కారులో వచ్చిన వారికి రాత్రిళ్లు నిలిపివేసి ఫేస్‌వాష్ చేయించడం, డ్రైవర్ ఇతర ప్రయాణికుల కళ్లలో నిద్ర రాకుండా డ్రాప్స్ వేయించడం వంటి నిబంధనలు ఉన్నప్పటికీ, ఒకట్రెండు రోజులు మాత్రమే అమలు చేసి వదిలేశారు. ప్రమాదానికి ప్రధాన కారణాలు... ♦ వ్యక్తిగత పనులపై ఎక్కువగా సుదూర ప్రాంతాలకు కారులో వెళ్లి వస్తున్నారు. వివిధ బాధ్యతల దృష్ట్యా నిద్రలేనప్పటికీ వారే డ్రైవింగ్ చేయడం, 500 కిలోమీటర్ల తర్వాత కనీసం విశ్రాంతి తీసుకోకుండా ఉదయానికి చేరుకోవాలనే ఆతృతతో అనుకోని ప్రమాదాలకు గురవుతున్నారు. ♦ అధికంగా ప్రమాదాలు.. రాత్రిళ్లు ప్రయాణించడం, నిద్రమత్తు ఆవరించడం, మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడం, కొత్త ప్రాంతానికి వెళ్తున్నప్పుడు దారి అంచనా వేయలేక, వంటి కారణాలు. ♦ ఒక కారును చూసి మరో కారు పోటీపడి ఓవర్టేక్ చేసే క్రమంలో ముందు వాహనాలను ఢీకొనడం, దాబాల వద్ద మద్యం సేవించడం, వివాహాలు, విందు వినోదాలకు హాజరై మద్యం మత్తులో కార్లలో ప్రయాణించి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల కారు ప్రమాదాలు... ♦ జనవరి 4న పలాస నియోజకవర్గం మందస మండలం కొత్తపల్లి గ్రామానికి సమీపంలో జాతీయ రహదారిపై వేకువజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సింహాచలం నుంచి బరంపురం వెళ్తుండగా పలాసలో టీ తాగి వెళ్తుండగా నిద్దమత్తులో రోడ్డు పక్కన కల్వర్టులోకి దూసుకుపోవడంతో రెండు కుటుంబాలకు చెందిన ఐదుగురు ప్రాణాలు విడిచారు. ♦ జనవరి 6న పలాస మండలం రంగోయి జాతీయ రహదారిపై నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు అతివేగంతో వెళ్లి డివైడర్‌కు తగిలి కారు బోల్తా పడింది. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ♦ ఇటీవల ఐదు రోజుల క్రితం వంశధార కాలువలో కారు పడిపోయిన సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మృత్యవాత పడ్డారు. వీరు ఒడిశా నుంచి అర్ధరాత్రి వేళ వస్తుండగా మలుపును గుర్తించకపోవడంతో కారు కాలువలోకి దూసుకుపోయింది అధికంగా మలుపు రోడ్లు... సువిశాలమైన జాతీయ రహదారిలో శ్రీకాకుళం దాటి పలాస వచ్చినప్పటికీ 80 కిలోమీటర్లు పడుతుంది. ఆ తర్వాత అధికంగా మలుపుల రోడ్లు ప్రారంభం కావడంతో ప్రమాదాలకు కారణంగా భావిస్తున్నాం. హైవే పెట్రోలింగ్, టోల్‌గేటు వద్ద ఫేస్‌వాస్, డ్రాప్స్ వేయడం వంటి చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవల ఎస్పీ ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ కారు యజమానులకు, డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నాం. –ఎన్ శివరామరెడ్డి, పోలీసు డివిజన్ అధికారి, కాశీబుగ్గ విస్తరణ పనులు పూర్తయితే.. లక్ష్మీపురం జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా వద్ద కారు ప్రయాణికులకు ఫేస్‌వాస్ చేయిస్తున్నాం. కళ్ల మంటలు, ఇతర సమస్యలు ఉంటే డ్రాప్స్ వేస్తున్నాం. ప్రమాదాల రీత్యా హరిపురం వద్ద విశ్రాంతి తీసుకోవడానికి చక్కనైన భవనాలు కట్టిస్తున్నారు. దీంతోపాటు 24 గంటల ప్రథమ చికిత్స పాయింట్ ఏర్పాటు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి.– శ్రీనివాసరావు, మేనేజర్ జాతీయ రహదారి టోల్‌ప్లాజా, లక్ష్మీపురం, పలాస -
డెడ్‌లైన్ @ మే15
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మే 15 తర్వాత రోడ్డు కటింగ్‌లకు అనుమతులివ్వరాదని, సీసీటీవీల ఏర్పాటుతోపాటు ఆయా అవసరాల కోసం రోడ్డు కటింగ్ చేసి పనులు పూర్తయ్యాక 48 గంటల్లోగా తిరిగి పునరుద్ధరణ జరగాలని, జంక్షన్లలో ఆయా అవసరాల కోసం వివిధ శాఖలు వేర్వేరు పోల్స్ నిర్మించకుండా అందుబాటులోని పోల్స్‌ను సమష్టిగా వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ, పోలీసు అధికారుల సమావేశం నిర్ణయించింది. సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌కు హైదరాబాద్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడంతోపాటు పాటు సీఆర్ఎంపీ కింద రోడ్ల నిర్వహణ ప్రాజెక్ట్‌ను పైలట్‌గా నిర్వహిస్తున్నందున వీటిపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ జితేందర్‌లఆధ్వర్యంలో సీఆర్ఎంపీ ఏజెన్సీలు, సీసీటీవీలు ఏర్పాటు చేస్తున్న ఎల్అండ్టీ, జియో సంస్థల ప్రతినిధులతో జీహెచ్ఎంసీలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్‌కుమార్ మాట్లాడుతూ, పోలీసు, జోనల్ కమిషనర్లు, ఏజెన్సీల ప్రతినిధులు జోనల్ స్థాయిలో చర్చించుకొని రోడ్ కటింగ్ పనులను వెంటనే చేపట్టి త్వరితంగా పూర్తిచేయాలన్నారు. స్మార్ట్ సిటీ కింద జంక్షన్లలో సీసీటీవీల ఏర్పాటుకు ఎల్అండ్టీ సంస్థ మూడు దశల్లో రోడ్ కటింగ్‌లకు 2662 జంక్షన్లలో దరఖాస్తు చేసుకోగా, 2557 చోట్ల అనుమతులిచ్చామన్నారు. ఇది 59 కి.మీ.ల మేర ఉందన్నారు. నెట్వర్క్ ఏర్పాటు కోసం రిలయన్స్ జియో 1077 జంక్షన్లలో మైక్రో కట్టింగ్‌కు అనుమతులు కోరితే మొదటి విడతగా దరఖాస్తు చేసిన 493 చోట్ల దాదాపు 26 మీటర్ల కటింగ్‌కు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. ఓపెన్ ట్రెంచింగ్ కంటే వీలైనంత మేర మైక్రో ట్రెంచింగ్ చేసుకోవాలన్నారు. రిలయెన్స్ జియో ఏజెన్సీ సీసీ కెమెరాల కోసం 5280 పోల్స్ ఏర్పాటుకు 221 మీటర్ల పొడవున రోడ్ కటింగ్‌కు అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు. రోడ్ కటింగ్ ప్రాంతాల్లో శిథిలాలను తొలగించాల్సిన బాధ్యత ఏర్పాటు సంస్థలదేనని స్పష్టం చేశారు. జితేందర్ మాట్లాడుతూ, నగరంలోని పదివేల సీసీకెమెరాలనుకమాండ్ కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానించనున్నట్లు తెలిపారు.కమాండ్ కంట్రోల్‌రూమ్‌నుంచి ట్రాఫిక్ పరిస్థితుల్ని పర్యవేక్షిస్తామని, జలమండలి, విద్యుత్ వంటి విభాగాలు కూడా తమ అవసరాల కోసం వాటిని వినియోగించుకోవచ్చునన్నారు. నిర్భయ కింద మరో 3వేల సీసీకెమెరాలు మంజూరయ్యాయన్నారు.అన్ని రకాల పార్కింగ్‌లకు కలిపి ఇంటిగ్రేటెడ్ పార్కింగ్ సిస్టం, డార్క్‌స్పాట్స్ రిపేర్లు, వీధివ్యాపారులకు లొకేషన్ల లింక్‌తో గుర్తింపుకార్డుల జారీ, తదితర అంశాల గురించి చర్చించారు. సమావేశంలో జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ జియాఉద్దీన్, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్, రాచకొండ అడిషనల్ కమిషనర్ సుధీర్‌బాబు, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎల్.ఎస్.చౌహాన్, రాచకొండ ట్రాఫిక్ డీసీపీ దివ్యచరణ్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు ఎన్.రవికిరణ్, వి.మమత తదితరులు పాల్గొన్నారు. -
మా భవిష్యత్తుకు ఏం హామీ ఇస్తారు?
సాక్షి, బెంగళూరు: చిప్కో ఉద్యమం అందరికీ తెలిసే ఉంటుంది. జనాలు గుంపులుగా చేరి ఒకరి చేతులు మరొకరు పట్టుకుంటూ చెట్లను ఆలింగనం చేసుకుని వాటిని నరకకుండా రక్షిస్తుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే గురువారం కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. బెంగళూరు శివారు ప్రాంతమైన సర్జపూర- అట్టిబెలె మార్గంలో ప్రభుత్వం రోడ్డు వెడల్పు చేపట్టాలని ప్రణాళికలు రచించింది. అందుకోసం టెండర్లు సైతం నిర్వహించింది. ఈ క్రమంలో కాంట్రాకర్లు ఆ ప్రాంతానికి రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉన్న చెట్లను నరికేందుకు మార్కింగ్ చేసుకోగా సుమారు 1800 చెట్లను నిర్ధాక్షిణ్యంగా కూల్చేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన స్థానికులు, విద్యార్థులు గురువారం సాయంత్రం అంతా ఏకమై చెట్లను నరకడానికి వీల్లేదంటూ మానవహారం చేపట్టారు. ‘చెట్లను నరకవద్దు’ అంటూ నినాదాలిచ్చారు. ‘ఇప్పటికే రోడ్లు వెడల్పుగా ఉన్నందున ఈ పనులు అనవసరం. కాలుష్య కోరల్లో చిక్కుకున్న బెంగళూరు జీవించడానికి వీల్లేని నగరంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఉన్న కొన్ని చెట్లను కూడా నరికేసి మా భవిష్యత్తుకు ఏం హామీ ఇవ్వగలరు?’ అని ప్రశ్నించారు. (నిరసనలతో అరాచకం) చెట్లు.. బాహ్య ఊపిరితిత్తులు రోడ్డు వెడల్పు.. పర్యావరణాన్ని నాశనం చేస్తుందే తప్ప ట్రాఫిక్ సమస్యను పరిష్కరించదని నిరసనకారులు పేర్కొన్నారు. ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని కోరారు. సబర్బన్ రైళ్లు నడుపడం, బస్ సర్వీసులు పెంచడం ద్వారా ప్రజలకు కార్లు వాడాల్సిన పని తప్పుందన్నారు. బెంగళూరు ఇప్పటికే డేంజర్ జోన్లో ఉందని, కనుక మరిన్ని చెట్లను కోల్పోవడం ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాలతో వాతావారణాన్ని క్షీణింపజేయడమే కాక మన ఆరోగ్యాలను ప్రమాదంలోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్జపుర గ్రామవాసి దీపాంజలి నాయక్ మాట్లాడుతూ..చెట్లు లేకుండా బతకలేం.. అవి మనకు బాహ్య ఊపిరితిత్తులు. 100యేళ్ల పైబడి వయస్సున్న చెట్లను నరకివేయడం మాకు ఏమాత్రమూ ఇష్టం లేదు. పైగా ఇలాంటి చెట్లను మళ్లీ నాటడం ఎంతో కష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కాంట్రాకర్లు మాత్రం వాళ్లు అవేవీ పట్టించుకోకుండా నిరసన చేస్తున్న సమయంలోనే రహదారి సర్వే చేయడం గమనార్హం. (గుడ్రంగా తిరుగుతున్న మొక్క) -
‘నాణ్యత..నై’పై కొనసాగుతున్న విచారణ
సాక్షి, చుంచుపల్లి(ఖమ్మం) : అటవీశాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం రేంజ్ పరిధిలోని చాతకొండ నుంచి లక్ష్మీదేవిపల్లి, ఇల్లెందు క్రాస్ రోడ్ మీదుగా కేసీఎం కళాశాల వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ప్రహరీ నాణ్యత విషయంలో విచారణ కొనసాగుతోంది. రూ.6.32 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రహరీ పనుల్లో అధికారుల పర్యవేక్షణ లోపంతో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలను పాటించలేదని గత నెల 25న ‘నాణ్యత నై’ అనే శీర్షికతో సాక్షి కథనాన్ని వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు డిసెంబర్ 31న ఈ నిర్మాణాలపై విచారణ జరిపారు. ప్రహరీ నిర్మాణంలో ఉపయోగించిన ఇసుక, సిమెంట్ నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. దీనిపై పూర్తి నివేదికలను పంపాలని జిల్లా అటవీ అధికారులను విజిలెన్స్ అధికారి రాజా రమణారెడ్డి ఆదేశించారు. దీంతో సోమవారం సీసీఎఫ్ రాజారావు, డీఎఫ్ఓ రాంబాబు ప్రహరీ నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గోడల నిర్మాణంలో వాడిన పిల్లర్ల నాణ్యతలను, ఇసుక, సిమెంట్ పరిమాణాల శాంపిళ్లను సేకరించారు. ఈ పనులను కెమెరాలో రికార్డు చేశారు. కాగా, ఈ ప్రహరీ గోడల నిర్మాణ పర్యవేక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులపై బదిలీ వేటు పడినట్లు తెలిసింది. కొత్తగూడెం రేంజ్ అధికారిని ఆ బాధ్యతల నుంచి తప్పించి స్థానిక ఎఫ్‌ఎస్‌ఓకు ఇంచార్జ్ బాధ్యత అప్పగించారని సమాచారం. నిర్మాణ పనులను పర్యవేక్షించిన డీఆర్వోపైనా బదిలీ వేటు వేసినట్లు తెలిసింది. ఈ విషయమై జిల్లా అటవీ శాఖాధికారి రాంబాబును వివరణ కోసం పలుమార్లు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
14నెలల్లో రోడ్డు పనులు పూర్తి : మంత్రి
పాలమూరు: మహబూబ్‌నగర్– జడ్చర్ల రోడ్డు వెడల్పు పనులు 14నెలల్లో పూర్తి చేసి జిల్లా ప్రజలకు కానుకగా ఇస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం ఈ రోడ్డు పనులను సంబంధిత అధికారులతో క లిసి మంత్రి పరిశీలించారు. అనంతరం ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆయన మా ట్లాడుతూ.. జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్ వ రకు ఉన్న రోడ్డు మార్గంలో కొన్ని ఏళ్లుగా దాదా పు వందలామంది ప్రాణాలు కోల్పోయినా గత ప్రభుత్వాలకు రోడ్డు వెడల్పు చేయాలన్నా సోయి లేకుండాపోయిందన్నారు. తెలంగాణ రా ష్ట్రం ఏర్పాటైన తర్వాత జిల్లా కేంద్రాలకు, మం డల కేంద్రాలకు, గ్రామీణా ప్రాంతాలకు రోడ్లు వేసి ప్రయాణికులకు సులభతరం చేయడం జ రిగిందన్నారు. ఎన్నో రోజుల నుంచి కలలు కం టున్న జడ్చర్ల–మహబూబ్‌నగర్ రోడ్డును ము ఖ్యమంత్రి చొరవతో పనులు ప్రారంభించుకున్నామన్నారు. అందరు అధికారుల సహకారంతో రోడుడ పనులు వేగంగా పూర్తిచేస్తామన్నా రు. భవిష్యత్‌లో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా తక్కువ సమయంలో గమ్యం చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. విస్తరణ పనులకు ప్రజలు సహకరించాలి మహబూబ్‌నగర్ పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డు విస్తరణ పనులకు సహకరించాలని మంత్రి కోరారు. దీని ద్వారా పనులు త్వరగా పూర్తి అయ్యి అన్ని రకాలుగా లాభాలు ఉంటాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా చర్చించి 167జాతీయ రహదారికి ఈ రోడ్డును అనుసంధానం చేసినట్లు తెలిపారు. మహబూబ్‌నగర్ పట్టణంలో ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు ఉండే ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేశామని తెలిపారు. కొందరు వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డు విస్తరణ పనులకు సహకారం అందిస్తున్నారని మిగతా వారు కూడా ఇద్దే పద్ధతిలో సహకరించాలని కోరారు. పాలమూరు పట్టణం హైదరాబాద్ నగరానికి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని ఈ అభివృద్ధిలో అందరూ బాగస్వామ్యం కావాలన్నారు. ఇప్పటికే ఐటీ కారిడార్ తీసుకురావడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
20,000 చెట్లపై హైవేటు
సాక్షి, హైదరాబాద్ : అభయారణ్యంలో చెట్లు బిక్కుబిక్కుమంటు న్నాయి. హైవే విస్తరణకు అవి బలికానున్నాయి. వనం గుండా జనం వెళ్లేందుకుగాను వృక్షాలపై వేటు వేయనున్నారు. నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో 83 చ.కి.మీ. పరిధిలో (దాదాపు 20 వేల ఎకరాల్లో) యురేనియం తవ్వకాలకు రంగం సిద్ధం అవుతున్న తరుణంలోనే ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ జోన్ పరిధిలో మరో ఉపద్రవం ఎదురుకానుంది. రోడ్డు విస్తరణపేరిట పులుల అభయారణ్యంలోని నేష నల్ హైవే 765 మీదుగా దాదాపు 60 కి.మీ. పరిధిలో 20 వేల చెట్ల వరకు నేలకూలనున్నాయి. మార్కింగ్‌లు పూర్తి... నేషనల్ హైవేస్ అథారిటీ ఆధ్వర్యంలో తోకపల్లి నుంచి హైదరాబాద్ వరకు చేపడుతున్న రోడ్డుప్రాజెక్టులో భాగంగా రోడ్డుకు ఇరువైపులా వేలాది చెట్లు కొట్టేందుకు రాష్ట్ర అటవీశాఖ నేతృత్వంలో మార్కింగ్‌లు కూడా పూర్తయ్యాయి. ఆమ్రాబాద్ పులుల అభయార ణ్యం మీదుగా శ్రీశైలంకు వెళ్లే మార్గం ఇరుకుగా ఉన్న నేపథ్యంలో రోడ్డు విస్తరణ చేపట్టాలని నేషనల్ హైవే అథారిటీ నుంచి రాష్ట్ర అటవీశాఖకు అయిదారు నెలల కిందటే ప్రతిపాదనలు అం దాయి. వీటిని నాగర్‌కర్నూల్ జిల్లా అటవీ అధి కారులకు అటవీశాఖ పంపించింది. ఈ ప్రతి పాదనలకు అనుగుణంగా ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ నివేదికను సిద్ధం చేసింది. మరో వారం, పదిరోజుల్లోనే ఈ నివేదికపై మళ్లీ జిల్లా అటవీ అధికారి, డీఎఫ్‌వో, ఫీల్డ్ ఆఫీసర్లు వాల్యువేషన్ రిపోర్ట్‌ను సిద్ధం చేసి రాష్ట్ర అటవీ శాఖకు పంపిస్తారు. ఇక్కడి నుంచి రాష్ట్ర వన్యప్రాణి బోర్డుకు, కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు, కేంద్ర వన్యప్రాణిబోర్డుకు ఈ నివేదికలు పంపించాక, ఈ ప్రాజెక్టు ఎప్పుడు ‘ప్రారంభించాలనే దానిపై నేషనల్ హైవేస్ అథారిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా ఎన్ని వేల చెట్లు పోతాయి, వాట విలువ ఏమిటీ, అడవి ఏ మేరకు నష్టపోతుంది, దెబ్బతినే అటవీ భూమి విస్తీర్ణం ఎంత తదితర వివరాలను ఈ నివేదికలో జిల్లా అటవీ అధికారులు పొందుపరుస్తారు. తదనుగుణంగా డబ్బు రూపంలో ఎంత పరిహారమివ్వాలి, కోల్పోయిన అటవీభూమికి ఇతర భూములు ఎక్కడ ఎన్ని ఎకరాల మళ్లించాలి.. తదితర అంశాలపై నేషనల్ హైవే నిర్ణయం తీసుకుంటుంది. శని, ఆదివారాల్లోనే రద్దీ... శ్రీశైలంకు వెళ్లే వాహనాల రద్దీ శని, ఆదివారాల్లోనే ఎక్కువగా ఉంటుందనేది అటవీ శాఖ అధికారుల అంచనా. మామూలు రోజుల్లో ఈ దారిలో వెళ్లే వాహనాల సంఖ్య వెయ్యిలోపే ఉంటుందని, వీకెండ్స్, సెలవురోజుల్లో రెండున్నర వేల వరకు వీటి సంఖ్య ఉంటుందని చెబుతున్నారు. అందువల్ల రోడ్డు విస్తరణతో అడవికి నష్టం చేయడం సరికాదని పర్యవరణవేత్తలు కూడా సూచిస్తున్నారు. విస్తరణ ఎందుకు? ఇరుకైన సింగిల్ రోడ్డు వల్ల శ్రీశైలం దేవస్థానానికి వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయని నేషనల్ హైవేస్ అథారిటీ తన ప్రతిపాదనల్లో పేర్కొంది. ఈ రోడ్డులో మూలమలుపులు ఉన్నందున ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని విస్తరణ ద్వారా సరిచేయాలని తెలిపింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మన్ననూరు గ్రామం నుంచి శ్రీశైలం దేవాలయానికి వెళ్లేందుకు ఉన్న శ్రీశైలం బ్రిడ్జి వరకు రోడ్డు విస్తరణ చేపడతారు. దోమలపెంట గ్రామం వద్ద ఈ రోడ్డు ముగుస్తుంది. ఈ 60 కి.మీ. పరిధి అంతా కూడా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలోనే ఉంది. రోడ్డు వెడల్పు వల్ల అడవికి, వేలాది చెట్లకు, జంతువులకు, పులుల అభయాణ్యానికి నష్టం జరుగుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. వాహనాలు పెరిగి కాలుష్య ప్రభావం కూడా ఈ టైగర్ రిజర్వ్‌పై పడుతుంది.వాహనాల వేగం పెరిగి జంతువులు ప్రమాదాల బారిన పడే అవకాశం పెరుగుతుంది. -
ప్రజాధనం రోడ్డు పాలు
ఒంగోలు సిటీ:ఒంగోలు నగర శివారు అభివృద్ధిలో వేగం పుంజుకుంది. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న మార్గాల వెంట రాకపోకలు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ రహదారి నుంచి మామిడిపాలెం వయా పోలీసు శిక్షణా కళాశాల మార్గంలో విపరీతమైన ట్రాఫిక్ పెరగిపోయింది. ఇక్కడి మట్టిరోడ్డును తారురోడ్డుగా అభివృద్ధి చేయడానికి అంచనాలను తయారు చేశారు. ఎన్నికలకు ముందుగా నగరపాలక సంస్థలో నిధులు ఉండడంతో ఈ మార్గంలోని మట్టిరోడ్డును తారురోడ్డుగా అభివృద్ధికి చేయడానికి నిర్ణయించారు. ఈ ప్రాంతంలో అత్యధికంగా శిక్షణ కానిస్టేబుళ్లు, పోలీసు అధికారులతో పాటు బాణాసంచా గోదాములు, మామిడిపాలెంకు వెళ్లే వారితో రద్దీగా మారింది. రోడ్డు వేయడం అనివార్యమైంది ఎన్నికలు కొద్ది వారాల్లోనే వస్తాయనంగా ఈ రోడ్డు పనికి హడావుడిగా టెండర్లను వేసి పనులు మొదలు పెట్టారు. అనతి కాలంలోనే రోడ్డు పని పూర్తయిందనిపించారు. రోడ్డు వేసిన కొద్ది రోజుల వరకు నిగనిగలాడింది. ఆ తర్వాత ఎండలు మొదలయ్యాయి. ఎండ వేడికి నెర్రెలు బారింది. రోడ్డుమార్గంలో అంతా పగుళ్లు వచ్చేశాయి. మట్టి రోడ్డు ఉన్నప్పుడు వాహనాలు, ద్విచక్రవాహనాలు వెళ్లినా ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడలా కాదు. ద్విచక్ర వాహనం నెర్రెబారిన రోడ్డులో వెళ్లాలంటే ప్రమాదాలను తప్పించుకొని మరీ వెళ్లాల్సిందే. నిత్యం ప్రమాదాలకు హేతువుగా ఈ రోడ్డు మారింది. రూ. కోటిపైనే నెర్రెపాలు.. జాతీయ రహదారి అభివృద్ధి పనులకు సుమారు రూ.కోటిపైనే నిధులను వెచ్చించారు. వేసిన రోడ్డు వేసినట్టే దెబ్బతింది. ప్రజల డబ్బు మొత్తం వృథా అయింది. సుమారు నాలుగున్నర కిలోమీటర్ల పొడవునా ఈ రోడ్డును నిర్మించారు. మట్టి రోడ్డుపై ముందు వెట్‌మిక్స్ వేసి రోడ్డును అభివృద్ధి చేశారు. మట్టిరోడ్డుపై ఒక పొర వెట్‌మిక్స్ వేసి ఆ తర్వాత రెండు పొరలు తారు రోడ్డు వేశారు. ఈ ప్రాంతం చౌడునేల. మెతక స్వభావంతో ఉంటుంది. ఇక్కడ రోడ్డు వేయడానికి సాంకేతికంగా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని పటిష్ట పరిచి ఆ తర్వాత రోడ్డు అభివృద్ధి పనులు చేయాలి. రోడ్డు ప్రతిపాదించిన సమయానికి సమయం అంతగా లేదు. అందుబాటులో నిధులు ఉన్నాయి. ఇంకేం వెంటనే తారు పరిచి రోడ్డు వేస్తే పోలా అనుకున్నారేమో చకచకా పనులు కానిచ్చేశారు. కొద్ది రోజులకే బయటపడిన డొల్లతనం.. రోడ్డు వేసిన కొద్ది రోజులకే ఎండ వేడికి తారు మెతకబడి తారు బయటకు వచ్చింది. తారు ఉష్ణోగ్రతల దెబ్బకి బురబురలాడి పనిలోని డొల్లతనాన్ని బయటవేసింది. ఎక్కడిక్కడే రోడ్డు బద్దలుగా విరిగింది. రోడ్డు మార్గంలో పలు చోట్ల నెర్రెబారింది. ఈ ప్రాంతంలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మట్టి రోడ్డు ఉన్నప్పుడు దర్జాగా వాహనాలు వచ్చేవి. ఇప్పుడు వాహనాలు రావాలంటే ఎక్కడ బండి పడిపోతుందోనని భయపడుతున్నారు. రోడ్డు పనిలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. ఎక్కడ నాణ్యతలను పాటించలేదు. కాంట్రాక్టర్‌కు లాభం చేకూర్చడానికి, అధికారులు తమ పర్సంటేజీలను దండుకొనేందుకే తూతూ మంత్రంగానే రోడ్డు పనిని కానిచ్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కొద్ది రోజులకు కనుమరుగు.. రానున్న కొద్దిరోజులకే రోడ్డు కనుమరుగయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఎండ వేడికే నెర్రెబారిన రోడ్డు కాస్త చినుకులు పడ్డాయంటే ఇక రోడ్డు తారు లేచి పోవడం ఖాయమంటున్నారు. తేలికపాటి వర్షం కురిసినా రోడ్డుపై తారు లేచిపోతుందని అంటున్నారు. వర్షాకాలం మొదలయ్యేలోగానే రూ. కోటి రోడ్డు కన్పించకుండా పోతుందన్న వ్యాఖ్యానాలు స్థానికుల నుంచి నెలకున్నాయి. జాతీయ రహదారి నుంచి మామిడిపాలెం మార్గంలో వేసిన రోడ్డు పనిలో నాణ్యత విషయంలో అడుగడుగునా లోపాలే ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులు కల్పించుకొని విచారిస్తేనే రోడ్డు నాణ్యత విషయంలోని డొల్లతనం బయటపడుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. -
కమిషనర్ వర్సెస్ కాంట్రాక్టర్లు
సాక్షి, గుంటూరు: ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ ఉందన్న సామెతకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులు అద్దం పడుతున్నాయి. నిధులు ఉన్నా కార్పొరేషన్ కమిషనర్, కాంట్రాక్టర్ల మధ్య విభేదాలతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. బిల్లులు ఇస్తేనే చేస్తామంటూ కాంట్రాక్టర్లు.. ఇంజినీరింగ్ అధికారులతో కుమ్మక్కై ఇష్టానుసారం చేస్తుండటం వల్లే ఇవ్వకుండా తిప్పుతున్నామంటూ కమిషనర్ భీష్మించి కూర్చోవడంతో నగరంలో పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. పనుల దగ్గరకు రాకుండానే ఆరోపణలు ఎలా చేస్తారంటూ కాంట్రాక్టర్లు కమిషనర్‌పై మండిపడుతున్నారు. బిల్లులు చెల్లించాలంటూ వెళ్లిన తమపై కమిషనర్ అవమానకరంగా ప్రవర్తించారంటూ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్, కార్పొరేషన్ ప్రత్యేక అధికారి కోన శశిధర్‌తోపాటు, సీఎస్‌ను కలసి ఫిర్యాదు చేసేందుకు సమాయత్తం అవుతుండటంతో వివాదం ముదిరి పాకాన పడింది. దీనికి తోడు ప్రభుత్వం కార్పొరేషన్ నిధుల్ని సైతం పసుపుకుంకుమ వంటి పథకాలకు మళ్లించడంతో ఖజానా ఖాళీ అయి కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ కారణంగానే కమిషనర్ బిల్లులు పెట్టడం లేదనే వాదనలు ఉన్నాయి. ఏదేమైనా కమిషనర్ వర్సెస్ కాంట్రాక్టర్స్ పోరు నగర ప్రజలకు శాపంగా మారిందని చెప్పవచ్చు. ఆచితూచి వ్యవహరిస్తున్న కమిషనర్ గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌గా శ్రీకేష్ లఠ్కర్ ఏడాది కిందట బాధ్యతలు చేపట్టారు. ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే గత కమిషనర్‌పై వేటు పడిందనే విషయం తెలుసుకున్న ఆయన మొదటి నుంచి ఇంజినీరింగ్ అధికారులు పెట్టే బిల్లులపై కొర్రీలు వేస్తూ వస్తున్నారు. కొందరు కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కై అడ్డగోలుగా పనులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు రావడంతో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. గత డిసెంబరు నుంచి బిల్లులన్నీ పెండింగ్‌లో పెట్టడంతో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా వారు పనుల్ని నాసిరకంగా నిర్వహించారనే అనుమానం వస్తే క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు చేపట్టడం, బాగా చేసిన వారికి ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించడం చేస్తే ఇబ్బందులు లేకుండా ఉండేవని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కాని అందరినీ ఒకే విధంగా భావించి నిలిపివేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కమిషనర్ తీరుపై మండిపడుతున్న కాంట్రాక్టర్లు నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు సుమారు రూ. 100 కోట్ల వరకు బకాయిలు ఉండటంతో బుధవారం అసోసియేషన్ నాయకులు కమిషనర్‌ను కలసి బిల్లులు చెల్లించాలని కోరేందుకు వెళ్లారు. అయితే, ఆ సమయంలో సైతం తమను అవమానకరంగా మాట్లాడారంటూ అసోసియేషన్ నేతలు మండి పడుతున్నారు. కక్ష సాధింపు చర్యలకు దిగుతున్న కమిషనర్‌పై కలెక్టర్, సీఎస్‌లకు ఫిర్యాదు చేసేందుకు కాంట్రాక్టర్ల అసోసియేషన్ నాయకులు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా 14వ ఆర్థిక సంఘం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో పూర్తిచేసిన పనులకు సైతం సుమారుగా రూ. 25 కోట్ల వరకు బిల్లులు చెల్లించకుండా కమిషనర్ నిలిపివేయడంపై కాంట్రాక్టర్లు మండిపడుతున్నారు. ఇంజినీరింగ్ అధికారులు పనుల్ని పరిశీలించి బిల్లులు చెల్లించాలంటూ పంపిన 80 ఫైళ్లను ఒకేసారి వెనక్కు పంపడం చూస్తుంటే కమిషనర్ ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లపై ఏస్థాయిలో ఆగ్రహంతో ఉన్నారో అర్థమవుతోంది. నిలిచిపోయిన అభివృద్ధి పనులు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్, కాంట్రాక్టర్ల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఎఫెక్ట్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై పడింది. కొంత మేర పనులు నిర్వహించినప్పటికీ బిల్లులు చెల్లించకుండా కమిషనర్ ఇబ్బందులు పెడుతున్నారంటూ కాంట్రాక్టర్లు నిలిపివేశారు. ముఖ్యంగా లాల్పురం రోడ్డు విస్తరణ, డ్రెయిన్ నిర్మాణ పనులు చేపట్టేందుకు రూ. 6 కోట్లు మంజూరయ్యాయి. కొంత మేర పూర్తయినప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ నిలిపివేశారు. పొన్నూరు రోడ్డు, విజయవాడ రోడ్లలో డివైడర్ నిర్మాణంతోపాటు, సెంట్రల్ లైటింగ్ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లకు సైతం పార్ట్ బిల్లులు చెల్లించకపోవడంతో నిలిపివేశారు. రింగ్‌రోడ్డు రోడ్డు విస్తరణ పనులు సైతం మధ్యలోనే ఆగిపోయాయి. అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య జరుగుతున్న గొడవలు నగరంలో పనులు నిలిచిపోయే స్థాయికి వెళ్లడం నగర ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తోంది. -
ఇదేం ‘దారి’ద్య్రం !
పాల్వంచరూరల్: భద్రాచలం జాతీయ రహదారి నిర్మాణ పనులు ప్రారంభమై మూడేళ్లు గడుస్తున్నా ఇంకా నత్తనడకనే సాగుతున్నాయి. దీంతో ప్రయాణికుల రాకపోకలకు తీవ్రంగా ఇబ్బంది కలుగుతోంది. పెంచిన గడువు ప్రకారం గత మార్చి నెలాఖరు నాటికే పనులు పూర్తి కావాల్సి ఉండగా కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. మూడవ ప్యాకేజీ కింద సుమారు రూ.229 కోట్ల వ్యయంతో సారపాక నుంచి రుద్రంపూర్ వరకు 42 కిలోమీటర్ల మేర ఫోర్ లేన్ జాతీయ రహదారి పనులు సాగుతున్నాయి. 2017 నాటికే ఈ పనులు పూర్తి కావాల్సి ఉన్నా.. ఇప్పటికి 36 కిలోమీటర్ల వరకు మాత్రమే రోడ్డు నిర్మించారు. ఇంకా 6 కిలోమీటర్ల రహదారి పనులు చేపట్టాల్సి ఉంది. మొర్రేడు, గోధుమ వాగులపై రెండు బ్రిడ్జీలు కూడా నిర్మించాల్సి ఉంది. ఇవి కాకుండా పెద్దమ్మగుడి సమీపంలో కల్వర్టు పనులు చేపట్టాలి. ఇల్లెందు క్రాస్ రోడ్డు నుంచి సింగరేణి గెస్ట్ హౌస్ వరకు ఒకవైపు రహదారి పనులు ఇప్పుడిప్పుడే మొదలుపెట్టారు. రామవరం వద్ద గోధుమ వాగుపై బ్రిడ్జి పనులు ఇంకా పూర్తి కాలేదు. గోదావరి బ్రిడ్జిదీ ఇదే దుస్థితి.. భద్రాచలం వద్ద గోదావరిపై నిర్మిస్తున్న రెండో బ్రిడ్జి పనులు సైతం నత్తనడకనే సాగుతున్నాయి. ఇక జాతీయ రహదారికి ఇరువైపులా డ్రైనేజీ పనులు కూడా అస్తవ్యస్తంగానే చేశారు. 54 కిలోమీటర్ల దూరం డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉండగా, ఇప్పటి వరకు 24 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేశారు. ఇంకా 30 కిలోమీటర్ల మేర పనులు చేయాల్సి ఉంది. పెద్దమ్మగుడి ఎదుట ఇంకా నిర్మాణ పనులు పూర్తికాలేదు. ఆరోగ్యమాత చర్చి నుంచి సీ కాలనీ గేటు, బస్టాండ్ సెంటర్ నుంచి దమ్మపేట సెంటర్ వరకు పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మించలేదు. అయితే ఒకవైపు రోడ్డు ఎత్తుగా, మరోవైపు తక్కువ ఎత్తు ఉండటంతో వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. పెద్దమ్మగుడి సమీపంలోని జగన్నాధపురంలో ఒకవైపు రోడ్డు నిర్మాణం కోసం గుంతలు తవ్వి నిర్లక్ష్యంగా వదిలేశారు. పనులు చేసే మార్గంలో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. కేవలం ఇసుక బస్తాలను కొన్ని చోట్ల, డ్రమ్ములను మరికొన్ని చోట్ల పెట్టారు. దీంతో రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. హైవే పనులు నత్తనడకన సాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2017 జూలై నాటి రహదారి నిర్మాణ పనులు పూర్తి చేయాలనే ఒప్పందం ఉండగా, జాప్యం కావడంతో అ«ధికారులు గడువును ఏడాది పాటు పొడిగించారు. అది కూడా పూర్తయినా.. పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఇక రోడ్డు పనులు నిలిపిన చోట హెచ్చరిక బోర్డులుగా రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయక పోవడంతో రాత్రి వేళల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. అస్తవ్యస్తంగా ఫుట్‌పాత్ నిర్మాణం.. జాతీయ రహదారి నిర్మాణం పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయనే ఆరోపణలు వస్తుండగా.. ఫుట్‌పాత్ పనులు మరీ దారుణంగా ఉన్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుట్‌ఫాత్ నిర్మాణం చేసిన తర్వాత క్యూరింగ్ చేయక పోవడం, పటిష్టంగా నిర్మించకపోవడంతో అక్కడక్కడ ఇటుకలు లేచి పోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫుట్ఫాత్ నిర్మాణ పనులను పటిష్టంగా చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. త్వరగా పూర్తిచేయాలి భద్రాచలం నుంచి రుద్రంపూర్ వరకు నాలుగు సంవత్సరాల క్రితం చేపట్టిన హైవే రోడ్డు నేటికీ పూర్తి కాలేదు. చేస్తున్న పనుల్లోనూ నాణ్యత లేదనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు త్వరగా, నాణ్యంగా చేపట్టాలి. – షఫీ, రామవరం ఇంకెన్నాళ్లకు పూర్తి చేస్తారో జాతీయ రహదారి పనులు నత్తడకన సాగుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు ప్రమాదకరంగా మారింది. ఫుట్ఫాత్ పనులు కూడా సక్రమంగా నిర్వహించడం లేదు. వేసవిలో క్యూరింగ్ లేకుండా పనులు చేస్తున్నారు. – రాము, పాల్వంచ రెండు వాగులపై బ్రిడ్జీలు నిర్మించాల్సి ఉంది జాతీయ రహదారి నిర్మాణ పనులు అపకుండా నిర్వహిస్తున్నాం. దాదాపుగా పూర్తి కావచ్చాయి. మొర్రేడు వాగు, గోధుమ వాగులపై రెండు బ్రిడ్జీలను నిర్మించాల్సి ఉంది. మూడు నెలల్లో ఈ పనులు పూర్తిచేస్తాం. గోదావరి నదిపై కూడా బ్రిడ్జి నిర్మాణం అక్టోబర్ నాటికి పూర్తి చేస్తాం. ఈ ఏడాది జనవరి నాటికి రోడ్డు పనులు పూర్తి చేయకపోవడంతో కాంట్రాక్టర్‌కు పదిశాతం అపరాధ రుసుం విధించాం. – వెంకటేశ్వరరావు, హైవే ఈఈ -
ఆహ్లాదం.. వేగిరం
నీటివనరుల పరిరక్షణ, మత్స్య సంపద పెంపు, వ్యవసాయానికి భరోసాతోపాటు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ కింద చేపట్టిన మినీ ట్యాంక్బండ్ల నిర్మాణాలు జిల్లాలో పూర్తికావొచ్చాయి. సివిల్ వర్క్స్ పూర్తి కాగా.. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తుదిమెరుగులు దిద్దనున్నారు. మరో నెల, రెండు నెలల్లో అంటే వర్షాకాలంలో మెతుకు సీమ ఆహ్లాదసీమగా మారనుంది. దీంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, మెదక్ : మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2015లో ప్రతిష్టాత్మకంగా మినీ ట్యాంక్బండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున అందుబాటులో ఉన్న పెద్ద చెరువులను ఎంపిక చేసి.. విడతల వారీగా అభివృద్ధి చేయాలని సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లా కేంద్రం, మెదక్ నియోజకవర్గ పరిధిలోని పిట్లం, గోసముద్రం మినీ ట్యాంక్‌బండ్ పనులు తుది దశలో కొనసాగుతున్నాయి. దీంతోపాటు నర్సాపూర్‌లోని రాయరావు చెరువు బ్యూటిఫికేషన్ సైతం పూర్తయింది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రత్యేక శోభను సంతరించుకోనుంది. సకాలంలో వర్షాలు కురిస్తే... జూన్ లేదా జూలై నుంచి ప్రతి రోజూ ‘మినీ’జాతరేనని అధికారులు భావిస్తున్నారు. పిట్లం, గోసముద్రం కలిపి.. మెదక్ పట్టణ సమీపంలోని పిట్లం, గోసముద్రం చెరువులు రెండింటినీ కలిపి మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసేందుకు 2016లో అనుమతులు వచ్చాయి. ఈ మేరకు రూ.9.52 కోట్లు మంజూరు కాగా.. మిషన్ కాకతీయ పథకంలో సివిల్ వర్క్స్ చేపట్టారు. ఈ పనులు తుది దశలో ఉన్నాయి. ఇప్పటివరకు సుమారు రూ.7 కోట్ల వ్యయమైనట్లు అధికారులు చెబుతున్నారు. కట్టల బలోపేతం, వెడల్పు, జంక్షన్ పాయింట్ల నిర్మాణాలు చేశారు. కట్టపైన రెయిలింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ లెక్కన సివిల్ వర్క్స్ పూర్తయినట్లే. ఆ తర్వాత పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గ్రీనరీ, అలంకరణ, వసతుల కల్పన వంటి పనులు చేపట్టాల్సి ఉంది. ఇది పూర్తయితే పిట్లం, గోసముద్రం మినీ ట్యాంక్ బండ్ అందుబాటులోకి వచ్చినట్లే. మల్లెచెరువుకు మహర్దశ మరోవైపు మెదక్ నియోజకవర్గంలోని రామాయంపేటలో ఉన్న మల్లెచెరువును సైతం మినీట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మొదటి దఫాలో రూ.3 కోట్ల పైచిలుకు నిధులు మంజూరు కాగా.. పనులు గత నెలలో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కట్టపై బ్రిడ్జి నిర్మాణంతోపాటు కట్ట వెడల్పు పనులు కొనసాగుతున్నాయి. ఇది కూడా నెల, రెండు నెలల్లో పూర్తి కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇది పూర్తయితే పట్టణ ప్రజలకు ప్రధానంగా మురికి నీటి సమస్య తొలగడంతోపాటు ఆహ్లాదకర వాతావరణం అందుబాటులోకి రానుంది. ‘రాయరావు’ అందం చూడతరమా.. నర్సాపూర్ నియోజకవర్గంలోని రాయరావు చెరువు బ్యూటిఫికేషన్‌కు తొలివిడతగా రూ.2.90 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో చెరువు కట్ట బలోపేతం, పంట కాల్వల నిర్మాణంతోపాటు బతుకమ్మ పండుగకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు నర్సాపూర్‌కు చెందిన జెడ్పీ చైర్పర్సన్ రాజమణిమురళీధర్ యాదవ్ దంపతులు తమ కుమారుడు అజయ్ యాదవ్ స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో చెరువు కట్టపై పలు అభివృద్ధి పనులు చేపట్టారు. పట్టణ పరిధిలోని బీవీ రాజు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యం సహకారంతో కట్టపై విద్యుద్దీకరణ, వాకింగ్ ట్రాక్, కట్టపై గ్రిల్స్ ఏర్పాటు, మొక్కలు నాటడం, బెంచీల ఏర్పాటు, ఓపెన్ జిమ్ పరికరాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రాయరావు చెరువు బ్యూటిఫికేషన్ పూర్తి కాగా.. మినీ ట్యాంక్‌బండ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదించే యోచనలో ఉన్నారు. కౌడిపల్లి చెరువు.. నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లిలోని పెద్దచెరువును సైతం మినీట్యాంక్ బండ్‌గా మార్చే పనులు సాగుతున్నాయి. గతంలోనే రూ.4 కోట్లు మంజూరు కాగా.. కట్ట బలోపేతం వంటి తదితర పనులు చేపట్టారు. కట్టపై సీసీ రోడ్డు నిర్మాణం తదితర పనులు అలాగే ఉన్నాయి. ఇది మిషన్ కాకతీయ పథకంలో లేనందున నిధుల లేమి సమస్య ఏర్పడినట్లు తెలుస్తోంది. దీని కోసం నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. తూప్రాన్ పెద్దచెరువు.. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న తూప్రాన్ మండలం జిల్లాల విభజనలో మెదక్‌లో చేరింది. ఇక్కడ పెద్దచెరువును మినీట్యాంక్‌బండ్‌గా మార్చాలని సంకల్పించారు. రూ.7 కోట్ల వ్యయంతో బ్యూటిఫికేషన్ పనులు చేపట్టారు. పనులు దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. తాజాగా.. మినీట్యాంక్ బండ్‌గా మార్చేందుకు రూ.4 కోట్లు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. నిధులు విడుదల కాగానే.. మిగిలిన పనులు పూర్తిచేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
రోడ్డేస్తూ.. నిధులు నొక్కేస్తూ..
సాక్షి, సింగరాయకొండ (ప్రకాశం): రూపాయి..రెండు రూపాయలు కాదు..ఏకంగా రూ.80 లక్షలు..అందులో రూ.40 లక్షలు దాతలు ఇచ్చినవి.. మరో రూ.40 లక్షలు రూర్బన్ నిధులు. ఆ డబ్బులతో ఏం చేస్తున్నారో..ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఆ పనులకు ఓ పద్ధతి పాడు ఉండదు. ఇక నాణ్యత అనేది బూతద్దం వేసి వెతికినా కనిపించదు. కాంట్రాక్టర్ ఏం చేసినా ఎవ్వరూ అడ్డుచెప్పరు. పనులను పర్యవేక్షించే అధికారులు లేరు..బాధ్యత వహించే ప్రజాప్రతినిధులు కనిపించరు. సింగరాయకొండలో జాతీయ రహదారిని దాతల సహాయంతో స్మార్ట్ రోడ్డుగా నిర్మించేందుకు సుమారు రూ.40 లక్షలకుపైగా నిధులు వసూలు చేశారు. ఆ నగదుతో రోడ్డు పనులు ప్రారంభించి పూర్తి చేయకుండానే అర్థాంతరంగా నిలిపివేశారు. ఇప్పుడు రూర్బన్ పథకం కింద సుమారు రూ.40 లక్షలు నిధులు మంజూరు చేయించి అదే రోడ్డును తారుతో వెడల్పు చేయడంతో పాటు, మధ్యలో డివైడర్‌ను నిర్మిస్తున్నారు. అయితే రోడ్డు నిర్మాణంలో కమీషన్ల కారణంగా అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు ఎవ్వరూ కన్నెత్తి చూడటం లేదు. దీంతో పనులు నాసిరకంగా జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆ నిధులు ఏమయ్యాయో..? మూడేళ్ల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దాతల సహాయంతో గ్రామాల్లో స్మార్ట్ రోడ్లు నిర్మించి ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యే స్వామి నియోజకవర్గస్థాయి అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి స్థానికంగా ఉన్న జాతీయరహదారిని వెడల్పు చేయడంతో పాటు మధ్యలో డివైడర్ నిర్మించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో అప్పటికప్పుడు అధికారులు సుమారు రూ.40 లక్షల అవసరమవుతుందని ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రకారం మండలంలోని ఫ్యాక్టరీలు, వ్యాపార సంస్థలు, దాతల నుంచి నిధులు సమీకరించే పనిచేపట్టారు. ఓ పక్క నిధులు సమీకరిస్తూనే మరో పక్క రోడ్డు పనులు చేపట్టారు. నిధులు సేకరణ పూర్తయినా రోడ్డు మాత్రం ఇరువైపులా తవ్వి కంకర వేసి రోలింగ్ చేసి వదిలేశారు. ఇప్పుడు మరలా అదే రోడ్డుకు మరల రూ.40 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో సుమారు 1.20 కిలోమీటర్ల దూరం స్టేట్ బ్యాంకు దగ్గర నుంచి పాకల రోడ్డు వరకు ఇరువైపులా తారురోడ్డు వేయడంతో పాటు మధ్యలో డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లు పిలిచారు. ఇటీవల టెండర్లు వేసిన కాంట్రాక్టరు పనులు ప్రారంభించాడు. అయితే రోడ్డు వెడల్పుకు రూ.18 లక్షలు, డివైడర్, సెంట్రల్ లైటింగ్‌కు రూ.22 లక్షలు ఖర్చు అవుతుందని అధికారులు తెలిపారు. ఇష్టారాజ్యంగా డివైడర్ నిర్మాణం.. డివైడర్ నిర్మాణంపై కూడా ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. డివైడర్ నిర్మించే చోట గతంలో ఉన్న రోడ్డును పూర్తిగా తొలగించాల్సి ఉంది. అప్పుడే డివైడర్ మధ్యలో మొక్కలు వేసినపుడు అవి బాగా పెరగటానికి అవకాశం ఉంటుంది. అయితే గతంలో రైల్వేస్టేషన్ రోడ్డులో వేసినట్లు రోడ్డు తొలగించకుండానే డివైడర్ నిర్మిస్తుండటాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాక విద్యుత్ స్తంభాలు తొలగించకుండా రోడ్డు వెడల్పు చేయటంతో లారీల వంటి వాహనాలను రోడ్డు పై నిలుపుతున్నారని, దీనికి తోడు డివైడర్ కారణంగా రోడ్డు కుదించుకుపోయి ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రజలు అధికారుల పనితీరును విమర్శిస్తున్నారు. నాసిరకంగా అభివృద్ధి పనులు.. ఎట్టకేలకు రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో జాతీయ రహదారిని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతారని అందరు ఆనందపడ్డారు. అయితే వీరి ఆశలు అడియాశలయ్యాయి. వాస్తవానికి మొదట రోడ్డు మార్జిన్లో ఉన్న కరెంటు స్తంభాలను, విద్యుత్ ట్రాన్స్‌ఫారాలను తొలగించి దూరంగా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆ తరువాతే రోడ్డు పనులు ప్రారంభించాలి. కానీ అవేమి చేయకుండా రోడ్డు పనులు చేపట్టారు. దీంతో అజాగ్రత్తగా ఉంటే విద్యుత్ ట్రాన్స్‌ఫారాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్లో పనులు ప్రారంభించగా..మొదట జేసీబీతో రోడ్డును తవ్విన తర్వాత క్యూరింగ్ చేయకుండా తూతూ మంత్రంగా రోలింగ్ చేసి వదిలేశారు. తరువాత ఒకటిన్నర నెలల తరువాత రోడ్డు మార్జిన్లలో ఉన్న మట్టి పైనే నీటితో నామమాత్రంగా క్యూరింగ్ చేసి తరువాత తారు చల్లి రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. అయితే రోడ్డు నిర్మాణంలో ఉపయోగించిన తారులో నాణ్యత లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్డు వేసిన తరువాత రోజే తారు లేచిపోతుందని మోటార్‌సైకిల్ స్టాండ్ వేస్తేనే గుంటలు పడుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అంతేకాక రోడ్డు నిర్మాణం కూడా ఇష్టారాజ్యంగా చేస్తుండటంతో సిమెంట్ రోడ్డు కన్నా తారు రోడ్డు ఎత్తుగా ఉంటుందని, దీంతో చిన్నపాటి వర్షం కురిసినా నీరు రోడ్డు పై నిలిచి రోడ్డు ధ్వంసమయ్యే అవకాశ ముందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పనులు అధ్వానంగా ఉన్నాయి జాతీయరహదారి అభివృద్ధి పనులు అధ్వాన్నంగా ఉన్నాయి. నాసిరకం తారు వాడుతున్నారు. దీన్ని ఎవ్వరూ పట్టించుఐకోవడం లేదు. దీనికి తోడు మార్జిన్లో వేసే రోడ్డు ఎత్తుగా ఉంది. దీంతో చిన్న వర్షానికి కూడా రోడ్డు పై నీరు నిలిచి రోడ్డు పాడయ్యే అవకాశం ఉంది. - తెనాలి రామస్వామి, సింగరాయకొండ నాణ్యత లోపించింది జాతీయరహదారి అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపించింది. కొత్తగా వేసిన రోడ్డుపై మోటారుసైకిల్ స్టాండు వేస్తేనే గుంట పడుతుంది. రోడ్డు మార్జిన్లలోని విద్యుత్ స్తంభాలు తొలగించకుండా రోడ్డు వెడల్పుతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ రోడ్డు ఎన్నికల కోసం వేస్తున్న రోడ్డులాగా ఉంది తప్ప ప్రజలకొరకు వేస్తున్న రోడ్డులా లేదు. - షేక్ లియాఖత్, మాజీ ఏఎంసీ వైస్‌చైర్మన్, సింగరాయకొండ -
సాక్షిపై ఎమ్యెల్యే శంకర్ అక్కసు
ఆయన ఒక ప్రజాప్రతినిధి. ప్రజల బాగోగుల గురించి పట్టించుకోవాల్సిన వ్యక్తి. మూడేళ్లుగా రోడ్డు పనులు చేయించకపోవడంపై స్థానికలు నిలదీయడంతో విచక్షణ కోల్పోయారు. ఈ సంఘటనను చిత్రీకరిస్తున్న సాక్షి విలేకరిపై చిందులేశారు. వార్త రాసి ఏం పీకుతారంటూ అసభ్య పదజాలంతో దూషించారు. ఈ సంఘటన పెద్దమండ్యం మండలంలో బుధవారం జరిగింది. ఎమ్మెల్యే శంకర్‌యాదవ్ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు, పెద్దమండ్యం: మండలంలోని మందలవారిపల్లె నుంచి తుమ్మలవంకతండా వరకు రూ.4.50 కోట్లతో తారు రోడ్డు, పెద్దేరు నదిపై బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్యె ల్యే శంకర్‌యాదవ్ బుధవారం శిలా ఫలకం ఆవిష్కరించారు. అనంతరం గ్రామ పరిధిలోని దేనేనాయక్ తండాకు వెళ్లారు. అక్కడ స్థానికులతో మాట్లాడుతూ తండాలను కలుపుతూ రోడ్డు వేశామని తెలిపారు. దీనిపై స్థానికులు మాట్లాడుతూ తండాల్లో సిమెంటు రోడ్లు ఎందుకు వేయలేదని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద తండాలో సిమెంటు రోడ్లు వేసేందుకు మూడేళ్ల క్రితం కంకర, ఇసుక తోలి అలాగే వదిలేశారని మండిపడ్డారు. తండాల్లో సిమెంటు రోడ్ల కోసం రూ.60 లక్షలు వచ్చిందని చెప్పి కంకరు, ఇసుక తోలి వదిలేస్తే ఏం ఉపయోగమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న సాక్షి విలేకరి ఫొటోలు తీస్తుండగా ఎమ్యెల్యే గమనించారు. విచక్షణ కోల్పోయారు. సాక్షి పేపరులో వార్త రాసి ఏం పీకుతారంటూ చిందులేశారు. అనంతరం దండువారిపల్లెకు రూ.1.23 కోట్లతో చేపట్టనున్న తారురోడ్డు పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇక్కడా ఎమ్మెల్యేకు గ్రామస్తుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఐదేళ్లుగా రోడ్డు వేయకుండా ఇప్పుడు వచ్చారా అంటూ నిలదీశారు. -
‘నగు’బాట
మంత్రి కాలవ.. ప్రజలను మాయ చేయడంలో దిట్ట. జనం కళ్లకు గంతలు కట్టి లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు నమ్మిస్తున్నారు. అభివృద్ధి మాటున రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఎన్నికల వేళ అరచేతిలో వైకుంఠం చూపుతూ ఓట్లు దండుకునేందుకు పన్నాగం పన్నారు. ఇందుకోసం ఒకే పనికి పదే పదే భూమిపూజలు, శంకుస్థాపనలు చేసేస్తున్నారు. రాయదుర్గం పట్టణంలోని రోడ్డు విస్తరణ పనులు కూడా తన ఓటు రాజకీయానికి వాడుకున్నారు. 2014లో ప్రారంభమైన 4 కి.మీ రోడ్డు విస్తరణ పనులకు గతంలోనే రెండుసార్లు శంకుస్థాపన చేసిన మంత్రి కాలవ.. ఎన్నికల కోడ్ వస్తుండటంతో 1.3 కి.మీ మాత్రమే పూర్తయిన పనులకు ముచ్చటగా మూడోసారి శంకుస్థాపన చేసి నవ్వులపాలయ్యారు. రాయదుర్గం : పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రతరం కావడంతో రోడ్డు విస్తరణకు అధికారులు ప్రతిపాదనలు పంపగా.. 2014 డిసెంబర్లో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతపురం రోడ్డులోని పాలశీతలీకరణ కేంద్రం నుంచి లక్ష్మీబజార్, పాతబస్టాండ్, వినాయక సర్కిల్, తేరు బజార్ మీదుగా మొలకాల్మూరు రోడ్డులోని చెక్‌పోస్టు సమీపంలో హైవే రోడ్డుకు లింక్ కలుపుతూ 4 కి.మీ, రోడ్డు విస్తరణకు రూ.9.10 కోట్లు మంజూరయ్యాయి. అంతేకాకుండా తాగునీటి పైపులైను, డ్రైనేజీ, విద్యుత్ స్తంభాల ఏర్పాటు కోసం అదనంగా మరో రూ.4.59 కోట్ల నిధులు మంజూరు చేశారు. దీంతో మొత్తంగా రూ.13.69 కోట్లు మంజూరు కాగా.. అంతా తానే చేయించినట్లు ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించిన కాలవ శ్రీనివాసులు ప్రచార ఆర్భాటం చేశారు. ఆరు నెలల్లో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దిడంతో పాటు మౌలిక వసతులకు పెద్దపీట వేస్తామంటూ ప్రతి సమావేశంలోనే ప్రసంగాలు దంచేశారు. మార్కింగ్‌లో లోపించిన పారదర్శకత 2015 నవంబర్ 26న రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం కాగా... తొలుత ఆక్రమణలు తొలగింపు కార్యక్రమం చేపట్టారు. అయితే ఆక్రమణల తొలగింపులో కూడా అధికార పార్టీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరించారు. తమకు కావాల్సిన వారి భవనాలు, స్థలాలు కాపాడేందుకు అధికారులపై ఒత్తిడి తెచ్చే మార్కింగ్ మార్చేశారు. ఈ క్రమంలో రూ.లక్షలు చేతులు మారాయి. అందువల్లే లక్ష్మీబజార్లో 80 అడుగుల మేర వేసిన మార్కింగ్....వినాయక సర్కిల్ నుంచి తేరుబజార్ వరకు 72 అడుగులకే కుచించుకుపోయింది. అంతేకాకుండా రోజుకోసారి మార్కింగ్ మారుస్తూ ఇక్కడి టీడీపీ కీలక నేతలు వ్యాపారుల నుంచి భారీగా దండుకున్నారు. ఇప్పటికి మూడుసార్లు రోడ్డు విస్తరణ పనులకు మంత్రి కాలవ శ్రీనివాసులు ఇప్పటికి మూడుసార్లు శంకుస్థాపన చేశారు. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పుడల్లా పట్టణంలో ఆర్భాటంగా సమావేశం నిర్వహించడం.. రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఇలా ఇప్పటికి మూడుసార్లు భూమిపూజ, శంకుస్థాపన చేశారు. ప్రచార ఆర్భాటంపై ఉన్న శ్రద్ధ పనులు చేయించడంపై లేకపోవడంతో నాలుగేళ్లు గడిచినా పట్టణంలోని రోడ్డు విస్తరణ పనులు 1.3 కి.మీ మేర మాత్రమే పూర్తయ్యాయి. అయినప్పప్పటికీ తన వల్లే రాయదుర్గం పట్టణం సుందరమైపోయినట్టు, జిల్లాలో ఎక్కడా లేని అభివృద్ధి జరిగినట్లు మంత్రి గొప్పలు చెప్పుకుంటున్నారు. సగం పనులతో సంబరాలు పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వినాయకసర్కిల్ , తేరుబజార్ వరకు కేవలం 1.3 కి.మీ. సీసీ రోడ్డు వేశారు. అరకొరగా డివైడర్లు వేసి, విద్యుత్ దీపాలు అమర్చారు. 1.3 కి.మీ.లలో కూడా ఇప్పటికీ పూర్తిస్థాయిలో పనులు జరగలేదు. లింక్ రోడ్లను కలుపుతూ రోడ్లు వేయలేదు. రెండు రోడ్ల మధ్య దారులు వదిలిన చోట డివైడర్ల పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. అయినప్పటికీ త్వరలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉండటంతో మంత్రి కాలవ హడావుడి చేశారు. రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయని చెప్పి ప్రజలను మభ్య పెట్టేందుకు ఈ నెల 22వ తేదీన రాత్రి వేళ హడావుడిగా జెడ్పీ చైర్మన్ పూల నాగరాజుతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. అన్నీ అప్పటికప్పుడే మంత్రి కాలవ రోడ్డు విస్తరణ పనులకు ప్రారంభోత్సవం చేయాలని నిర్ణయించుకోవడంతో...అధికారులు కూడా హడావుడిగానే పనులు చేసేశారు. సీసీ రోడ్డుకు లింక్ కలుపుతూ 140 మీటర్ల బీటీ రోడ్డును ప్రారంభోత్సవానికి మూడు రోజుల ముందు వేశారు. అలాగే డివైడర్లకు అక్కడక్కడా రంగుల ప్యాచ్‌లు వేశారు. అలాగే ఆఘమేఘాల మీద శిలాఫలకం ఏర్పాటు చేశారు. ఈ పనుల్లో నాణ్యత లోపించడంతో కణేకల్లు రోడ్డును కలుపుతూ ఏర్పాటు చేసిన సర్కిల్లో 20వ తేదీ కట్టిన డివైడర్ 21వ రోజే పడిపోయింది. తేరుబజార్ రోడ్డు విస్తరణలో అధికార పార్టీ రాజకీయం ఇక తేరుబజార్‌లో జరిగిన రోడ్డు విస్తరణ పనులను అధికార పార్టీ ప్రజాప్రతినిధులే అడ్డుకున్నారు. వినాయక సర్కిల్ నుంచి తేరుబజార్ వరకు 1.5 మీటర్ల డివైడర్ వేయగా, పట్టుపట్టి దాన్ని ఒక మీటర్‌కు కుదించారు. అలాగే తేరు వద్ద నుంచి గుమ్మఘట్ట, మొలకాల్మూరు రోడ్డు క్రాస్ వరకు సీసీ రోడ్డు వేయకుండా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే బాధితులతో కోర్టులో కేసు వేయించినట్లు అధికార పార్టీలోని ఒకవర్గం నాయకులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఈ ప్రచార ఆర్భాటం మాని...చిత్తశుద్ధితో అభివృద్ధి పనులు చేయాలని, లేకపోతే సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్పితీరుతామని దుర్గం వాసులు మంత్రి హెచ్చరిస్తున్నారు. -
పచ్చని చెట్లపై గొడ్డలి వేటు!
త్రిపురాంతకం: పచ్చని చెట్లను నిలువునా కూల్చేస్తున్నారు. అనంతపురం–అమరావతి నేషనల్ హైవే విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు రోజురోజకూ కనుమరుగవుతున్నాయి. పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం డివిజన్లో అనంతపురం–అమరావతి హైవే సుమారు 135 కిలోమీటర్లు మేర విస్తరించి ఉంది. గిద్దలూరు నుంచి త్రిపురాంతకం మండలం వరకు రోడ్డు విస్తరణ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో భారీగా రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. డివిజన్లో 135 కిలోమీటర్ల మేర పనులు జరుగుతుండగా త్రిపురాంతకం మండలంలో నేషనల్ హైవే సుమారు 40 కిలోమీటర్లు వరకు విస్తరించి ఉంది. ఈ రోడ్డుకు ఇరువైపులా ఏళ్ల తరబడి పెరిగిన వృక్షాలను కూల్చి వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో రోడ్డుకు ఇరువైపులా నీడను ఇవ్వడంతో పాటు పర్యావరణం పరిరక్షణకు ఉపయోగపడుతున్న వృక్షాలు కనుమరుగై పోతున్నాయి. ఇది వరకూ రోడ్డుపై ప్రయాణం చెట్ల మధ్య ఆహ్లాదకరంగా ఉండేది. అలాంటిది రోడ్లు విస్తరణ, పెరుగుతున్న వాహనాల రాకపోకలు, ప్రమాదాల నివారణ, భవిష్యత్ అవసరాలు దృష్యా కర్నూలు–గుంటూరు రోడ్డును అనంతపురం–అమరావతి నేషనల్ హైవేను తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ మేరకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. విస్తరణ పనులతో ఏళ్లతరబడి ఉన్న చెట్లు తొలగించక తప్పడం లేదన్న అభిప్రాయాన్ని అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు. తొలుత విస్తరణ జరుగుతున్న ప్రాంతంలో మొక్కలు నాటి క్రమేణా చెట్లను తొలగించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేదా రోడ్డు విస్తరణలో వంపులు తొలగిస్తూ పనులు చేపట్టి ఒక పక్కన కొంతవరకు చెట్లను ఉంచితే నష్టం జరిగేది కాదన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. రోడ్డు నిర్మాణం పూర్తయ్యే సరికి పూర్తిగా చెట్ల ఆనవాలు కనిపించే అవకాశం ఉండదు. అందుకు ఇప్పటి నుంచైనా తిరిగి చెట్లు పెంచేందుకు నేషనల్ హైవే అథారిటీ తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ వినిపిస్తోంది. పర్యావరణానికి ముప్పు నేషనల్ హైవేపై రోజూ వేలాది వాహనాలు ప్రయాణం చేస్తున్నందున వాటి నుంచి వచ్చే పొగ కారణంగా కలుషిత వాతావరణం ఏర్పడే ప్రమాదం లేకపోలేదు. చెట్లు ఉంటే వాతావరణానికి ఎలాంటి భంగం కలగదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చెట్లు కొట్టేయడంతో పర్యావరణం దెబ్బతింటోంది. ఈ ప్రాంతంలోని చెట్లతో కొంత వరకు ఉపయోగకరంగా ఉంది. ఈ చెట్లన్నీ కూల్చివేతతో రోడ్డు ఎడారిగా కనిపిస్తోంది. తిరిగి రోడ్డుకు ఇరువైపులా చెట్లు పెంచాల్సిన అవసరాన్ని గుర్తించి ఏళ్ల తరబడి జీవించే అడవి జాతి వృక్షాలతో పాటు తొందరగా పెరిగి పచ్చని వాతావరణం కల్పించే చెట్లు పెంచితే ఉపయోగం ఉంటుంది. ఇప్పటి నుంచే దానికి తగిన విధంగా ప్రయత్నం చేయడంతో పాటు మొక్కలు పెరిగే వరకు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. మొక్కలు వేసి వదిలేస్తే అవి బతికే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అమాత్యునిపైనే ఆశలు!
స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా సరైన రోడ్లు లేని గ్రామాలెన్నో.. ఆర్టీసీ బస్సుల ముఖం చూడని పల్లెలెన్నో.. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, ప్రత్యేక తెలంగాణలోనూ రవాణా సౌకర్యాల్లో పెద్దగా మార్పు రాలేదు.. పల్లెలకు బస్సుల రాకపోకలు పెద్దగా పెరగలేదు.. అయితే, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి రవాణా శాఖ మంత్రిగా నియమితులు కావడంతో ఉమ్మడి జిల్లాల ప్రజలు ఆయనపైనే ఆశలు పెట్టుకున్నారు. ఉభయ జిల్లాల్లో రవాణా కష్టాలు తీరడంతో అన్ని గ్రామాలకు రోడ్ల నిర్మాణం, బస్సు సౌకర్యం కలుగుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. సాక్షి, కామారెడ్డి: సమాజ పురోభివృద్ధిలో రోడ్డు, రవాణా వ్యవస్థ అత్యంత కీలకమైనది. సాంకేతికంగా దూసుకుపోతున్న నేటి కాలంలో సరైన రవాణా సౌకర్యాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో దశాబ్దాలుగా రవాణా రంగం అభివృద్ధికి నోచుకోలేదు. ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లాలంటే సరైన రవాణా సౌకర్యాలు లేక ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో సగానికి పైగా గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడవడం లేదు. రోడ్డు సౌకర్యం ఉన్న అన్ని గ్రామాలకు బస్సులు నడుపుతామన్న ఆర్టీసీ ప్రకటనలు మాటలకే పరిమితమవుతున్నాయి. దీంతో ప్రజలు ఆటోలు, జీపులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఆర్అండ్బీ, రవాణా శాఖ మంత్రి గా నియమితులు కావడంతో ఉమ్మడి జిల్లా ప్ర జలు ఆయన పైనే ఆశలు పెట్టుకుంటున్నారు. జిల్లాకు చెందిన వ్యక్తే రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినందున ఉమ్మడి జిల్లాలో రవాణా కష్టాలు తీరుతాయని భావిస్తున్నారు. ఇదీ పరిస్థితి.. నిజామాబాద్ రీజియన్ పరిధిలోని కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఆరు బస్ డిపోలు ఉన్నా యి. వాటి పరిధిలో 668 బస్సులు మాత్రమే ఉ న్నాయి. రోజు సగటున 3.50 లక్షల మంది ఆ యా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఆయా బస్సు లు రోజుకు సరాసరిగా 2.85 లక్షల కిలోమీటర్లు తిరుగుతుండగా, ఆర్టీసీకి రూ.90 లక్షల ఆదా యం సమకూరుతోంది. కామారెడ్డి జిల్లాలో 526 పంచాయతీలు, నిజామాబాద్ జిల్లాలో 530 పం చాయతీలు ఉన్నాయి. వాటికి తోడు ఆవాస గ్రా మాలు మరో వంద ఉంటాయి. అయితే, ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో బస్సు ముఖం చూడని గ్రా మాలెన్నో ఉన్నాయి. సగానికి పైగా గ్రామాలకు బస్సులు వెళ్లడం లేదు. దీంతో ప్రజలు ఆటోల్లో నే ప్రయాణిస్తున్నారు. ఆటోలో పరిమితి మించి ప్రజలను తరలిస్తుండడంతో తరచూ ప్రమాదా లు జరుగుతున్నాయి. గతేడాది ముప్కాల్ సమీపంలో ఆటో ప్రమాదవశాత్తు బావిలో పడి పదకొండు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. చిన్నాచితకా ప్రమాదాలు జరగడం, ఒకరిద్దరు మృతి చెందడం నిత్యకృత్యంగా మారింది. ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటే ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారమే ఉండదు. పల్లెలకు వెళ్లని బస్సులు.. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో మెజారిటీ గ్రామాలకు వివిధ పథకాల ద్వారా మంచి రోడ్లు వేశారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరుసలు, మారుమూల గ్రామాల నుంచి సైతం మండల కేంద్రాలు, ప్రధాన రహదారులను కలుపుతూ బీటీ రోడ్లు వేశారు. దాదాపు అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఉంది. అయితే, గతంలో రోడ్డు బాగా లేదనే సాకుతో ఆర్టీసీ బస్సులు నడిపేది కాదు. కానీ ఇప్పుడు రోడ్డు సౌకర్యం ఉన్న గ్రామాలకు బస్సులు వెళ్లడం లేదు. కొన్ని గ్రామాలకు విద్యార్థుల సౌకర్యార్థం బస్సులు నడుపుతున్నారు. ఉదయం గ్రామాలకు వెళ్లి పిల్లల్ని పట్టణాలకు చేరుస్తాయి. తరువాత సాయంత్రం తిరిగి ఊళ్లకు వెళ్లి దింపి వస్తాయి. మిగతా సమయాల్లో ఆయా గ్రామాలకు బస్సు సౌకర్యం ఉండక పోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆటోల్లోనే ప్రయాణించాల్సి వస్తోంది. బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాల నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రానికి ఎక్స్‌ప్రెస్ బస్సు సౌకర్యం లేదు. వెనుకబడిన ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గంలోని జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, పెద్దకొడప్గల్ తదితర మండలాల నుంచి జిల్లా కేంద్రానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు రెండు, మూడు బస్సులు ఎక్కాల్సి వస్తోంది. హామీలుగానే బస్ డిపోలు.. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని నందిపేటలలో బస్ డిపోలు ఏర్పాటు చేయడానికి రెండు దశాబ్దాల క్రితమే ప్రయత్నాలు జరిగాయి. ఆర్టీసీ స్థలాన్ని కూడా సేకరించింది. దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ అక్కడ డిపోలు ఏర్పాటు కాలేదు. ప్రతీ ఎన్నికల్లోనూ బస్ డిపో ఏర్పాటు అంశాన్ని నేతలు ప్రస్తావిస్తారు. ఆ తరువాత మరిచిపోవడం పరిపాటిగా మారింది. ఎల్లారెడ్డిలో బస్‌డిపో ఏర్పాటు చేస్తే ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజక వర్గాల్లోని ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఎల్లారెడ్డి, జుక్కల్ ప్రాంతాల్లోని గ్రామాలకు కామారెడ్డి, బాన్సువాడ డిపోలకు చెందిన బస్సులే దిక్కవుతున్నాయి. అక్కడే బస్‌డిపో ఏర్పాటు చేస్తే ఎంతో మేలు జరిగేది. అలాగే నందిపేటలోనూ బస్‌డిపో ఏర్పాటు చేయకపోవడం మూలంగా ఆ ప్రాంత ప్రజలకు అసౌకర్యంగా ఉంది. నష్టాల సాకుతో ఎత్తివేసిన భీమ్‌గల్ బస్ డిపోను తిరిగి తెరిపిస్తామని నేతలు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. దీంతో భీమ్‌గల్ పరిధిలోని మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం అంతంత మాత్రంగానే మారింది. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో రెండో డిపో ఏర్పాటు ఎంతో అవసరం. కామారెడ్డిలో చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేయడంతో పట్టణ జనాభా లక్షన్నర దాటింది. పట్టణానికి వలస వచ్చే వారి సంఖ్య పెరిగింది. స్థానికంగా లోకల్ బస్సులు నడపాల్సిన అవసరం కూడా ఏర్పడింది. ప్రమాదమని తెలిసినా.. గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఆటోల్లోనే ప్రయాణిస్తున్నారు. ఆటోల్లో ప్రయాణం ఒక్కోసారి ప్రాణాల మీదికి తెస్తున్నా, తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రమాదాలు జరిగినపుడు ఆటోవాలాలను ఇబ్బంది పెట్టడమే తప్ప, ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామన్న ఆలోచనలు చేయడం లేదు. ఆర్టీసీ బస్సు ముఖం చూడని గ్రామాలు ఎన్నో ఉన్నప్పటికీ ఆయా గ్రామాలకు బస్సులను నడిపే విషయంలో ప్రజాప్రతినిధు లు కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. పెరిగిన జనాభాకు అనుగుణంగా ఆర్టీసీ బస్‌డిపోలను ఏర్పాటు చేయడంతో పాటు అదనపు బస్సులను కేటాయించాల్సిన అవసరం ఎంతో ఉంది. రవాణా మంత్రిగా ప్రశాంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలో నెలకొన్న రవాణా కష్టాలను తీర్చడానికి ఏమేరకు ప్రయత్నిస్తారో వేచి చూడాలి. -
బాటలు బాగా లేవు..
వరంగల్ అర్బన్ : వరంగల్‌లో ప్రజలు నడిచే బాటలు ఏ ఒక్కటి కూడా బాగా లేదు.. ప్రజలకు అత్యంత ప్రధానమైన సదుపాయాలపై దృష్టి సారించండి.. ప్రణాళికలు రూపొందించి అభివృద్ది చేయాల్సిన బాధ్యత మనపై ఉంది.. అని వరంగల్‌తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ మహా నగర పాలక సంస్థ కౌన్సిల్ హాల్లో బుధవారం సమసన్వయ సమావేశం నిర్వహించారు. ఇన్చార్జి మేయర్ ఖాజాసిరాజుద్దీన్, కమిషనర్ రవికిరణ్, కార్పొరేటర్లతోపాటు వరంగల్ మహానగర పాలక సంస్థ, ‘కుడా’ రైల్వే, ఆర్అండ్బీ, ఎన్పీడీసీఎల్, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రత్యేక నిధులు, స్మార్ట్‌సిటీ, హృదయ్, అమృత్, జనరల్ ఫండ్, సీడీఎఫ్ నిధులపై ఎమ్మెల్యే ఆరా తీశారు. ప్రధాన రహదారులు, జంక్షన్లు, బస్ షెల్టర్లు, ఇంటింటా తాగునీటి నల్లాలు, సరఫరా, అండర్ బ్రిడ్జి విస్తరణ పనులు తదితర అంశాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించి సూచనలు చేశారు. కాలనీల్లో అండర్ డ్రైయినేజీ లేకుండానే మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ల(ఎస్టీపీ)ను ఎవరు అడుగుతున్నారని అధికారులను ప్రశ్నించారు. అండర్ బ్రిడ్జి మూడో దారికి డీపీఆర్ రూపొందించాలి.. వరంగల్ అండర్ బ్రిడ్జి మూడో దారికి డీపీఆర్ రూపొందించి.. అందజేయాలని రైల్వే ఇంజినీర్లకు ఎమ్మెల్యే సూచించారు. ప్రస్తుతం ఉన్న రహదారికి తోడుగా మరో రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. హెడ్ పోస్టాఫీస్ నుంచి ఖమ్మం రోడ్డు మీదుగా వంద ఫీట్ల రహదారి విస్తరిస్తున్నందున మూడో దారి ప్రతిపాదనలు అందజేయాలన్నారు. ప్రధాన రహదారిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. రహదారుల విస్తరణ, అభివృద్ధిపై దృష్టి పెట్టండి.. స్మార్ట్‌సిటీ, సీఎం ప్రత్యేక నిధులతో రూపొందించిన ప్రణాళికలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. రూ.257 కోట్లతో 13 రహదారుల ప్రతిపాదనలు, టెండర్ల ప్రక్రియపై ప్రశ్నించారు. ప్రతిపాదనల్లో కొన్ని రహదారులను స్మార్ట్‌సిటీ బోర్డు రద్దు చేసి రూ.130కోట్టతో రెడ్డిపురం, బంధం చెరువు, రంగ సముద్రంలో ఎస్టీపీ ప్లాంట్‌కు ప్రవేశపెట్టి ఆమోదించినట్లు లీ అసోసియేట్స్ ప్రతినిధి తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఎంజీఎం నుంచి పోచమ్మమైదాన్, వెంకట్రామ జంక్షన్, లేబర్ కాలనీ, కాశిబుగ్గ నుంచి ఏనుమాముల మార్కెట్, వెంకట్రామ జంక్షన్ నుంచి ఆర్టీసీ బస్ స్టేషన్ మీదుగా హెడ్ పోస్టాఫీస్ వరకు రహదారులను అభివృద్ధి పర్చాలన్నారు. హెడ్ఫోస్టాఫీ నుంచి ఖమ్మం రోడ్డు మీదుగా నాయుడుపెట్రోల్ పంపు వరకు రహదారి ఆక్రమణలను తొలగించి వంద ఫీట్ల రోడ్డుగా అభివృద్ధి చేయాలన్నారు. హెడ్‌ఫోస్టాఫీస్ నుంచి వరంగల్ చౌరస్తా, ఒకవైపు హంటర్ రోడ్డు, మరో వైపు పోచమ్మమైదాన్, ఎంజీఎం రోడ్డు నుంచి ఇందిరా గాంధీ బొమ్మ, కొత్తవాడ వంద ïఫీట్ల రోడ్డు, రైల్వే గేట్ ఫ్లై ఓవర్ నుంచి రంగశాయిపేట, దసరా రోడ్లు, శివనగర్ ప్రశాంతి ఆస్పత్రి రోడ్ల అభివృద్ది పనులపై ఆరా తీశారు. కొన్ని రహదారులకు రెండో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఇంజినీర్లు తెలపగా.. తొలి దఫాలో ఈ రహదారులను అభివృద్ధి చేయాలని నన్నపునేని ఆదేశించారు. ఎస్ఎన్ఎం క్లబ్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం.. వరంగల్ ఎస్ఎన్ఎం క్లబ్లో వెయ్యి గజాల్లో తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ప్రతిపాదనలు రూపొందించాలని ఆర్అండ్బీ అధికారులకు నరేందర్ సూచించారు. ఈ అంశం న్యాయ వివాదంలో ఉందని టౌన్‌ప్లానింగ్ అధికారులు వివరించారు. ఎస్ఎన్ఎం క్లబ్ స్థలంపై కోర్టుకు వెళ్లిన వారితో చర్చించామని.. వారు కేసు విత్ డ్రా చేసుకునేందుకు అంగీకరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. 600 గజల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్మించాల్సి ఉంటుందని ఇంజినీర్లు వివరించారు. ఏప్రిల్ నాటికి ఇంటింటికీ తాగునీరు.. అమృత్ పనుల్లో నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. 33 వాటర్ ట్యాంక్‌లకు గాను 30 ట్యాంక్‌లు నిర్మాణంలో ఉన్నాయని, మూడు స్థల వివాదాల్లో ఉండడం వల్ల పనులు ప్రారంభం కాలేదని పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లు తెలిపారు. బల్దియా, రెవెన్యూ, ‘కుడా’ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. 2.10 లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని.. ప్రస్తుతం 1.10 లక్షల కనెక్షన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో ఉన్న ఇళ్లకు ఇంటి నంబర్లు ఇచ్చి నల్లా కనెక్షన్ల ద్వారా ఏప్రిల్ నుంచి ఇంటింటా తాగునీరు అందించాలని నరేందర్ అదేశించారు. అదేవిధంగా వరంగల్ ఆర్టీసీ బస్ స్టేషన్‌ను మోడల్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. నగరంలో 163 ఆధునిక బస్ షెల్టర్ల నిర్మాణాలపై దృష్టిసారించాలన్నారు. కోమటిపల్లి, ఉర్సు రంగ సముద్రం, చిన్నవడ్డేపల్లి చెరువు అభివృద్ధి ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. వరంగల్ టెక్స్టైల్ పార్కులో ఇండోర్ స్టేడియం నిర్మించేందుకు ప్రతిపాదనలు అందజేయాలని సూచించారు. ఇంజినీర్ల తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి.. బల్దియా ఇంజినీర్లు, ఇతర శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనపడుతోందని ఎస్ఈ బిక్షపతిపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఇంజినీర్లు సహకరించకపోవడం వల్ల రహదారుల అభివృద్ధి పనులు జరగడం లేదని ఆర్అండ్బీ అధికారులు వ్యక్తం చేయడం ఇంజినీర్ల పనితీరుకు నిదర్శనమన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ నాగేశ్వర్, ‘కుడా’ పీఓ అజిత్‌రెడ్డి, సీపీ నర్సింహాచారి, సెక్రటరీ విజయలక్ష్మి, ఎంహెచ్ఓ రాజారెడ్డి, తూర్పు డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు గుండా ప్రకాశ్ రావు, బయ్యస్వామి, కుందారపు రాజేందర్, ఝెలగం లీలావతి, రిజ్వీనా షమీమ్, శారద జోషి, అశ్రిత రెడ్డి, వేణుగోపాల్, కేడల పద్మ, మురహరి భాగ్యలక్ష్మి, కావటి కవిత, మేడిది రజిత, సులోచన ఆర్అండ్బీ, రైల్వే, ‘కుడా’ అధికారులు పాల్గొన్నారు. -
నడవాలంటే నరకమే..
వీణవంక(హుజూరాబాద్): అడుగు తీసి అడుగు వేద్దామంటే కంకరరాళ్లు ఎక్కడ గుచ్చుకుంటాయోననే భయం... చీకటి పడితే రోడ్డు మధ్యనున్న విద్యుత్ స్తంభాలకు తాకుతామేమో అనే ఆందోళన... వాహనాలు వెళ్తుంటే అంతెత్తు లేస్తున్న దుమ్ము ఊపిరాడకుండా చేస్తోంది. దీంతో గత ఆరు నెలలుగా వీణవంక – జమ్మికుంట రహదారిపై నడిచే వాహనదారులకు నకరం నిత్యం నరకం కనిపిస్తోంది. ప్రయాణికుల అష్టకష్టాలు.. వీణవంక–జమ్మికుంట ఫోర్‌లైన్ రోడ్డు పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి. ప్రయాణికుల సౌలభ్యం కోసం చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. పనులు ప్రారంభించి ఏడాది గడిచినా ఇంకా సా..గుతూనే ఉన్నాయి. నిత్యం రద్దీగా ఉండే రహదారి వెంట వాహనదారులు, ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. రూ.33 కోట్లతో నిర్మాణం.. సంవత్సరం క్రితం వీణవంక–జమ్మికుంట మధ్య 12.5 కిలోమీటర్ల ఫోర్‌లైన్ రోడ్డు కోసం రూ.33 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్ మొదట వల్భాపూర్–నర్సింగాపూర్ గ్రామాల మధ్య పనులు ప్రారంభించారు. ఆరు నెలల క్రితం కంకరపోసి వదిలేశారు. తర్వాత వల్భా పూర్ నుంచి జగ్గయ్యపల్లి మధ్య కొంతదూరం వరకు కంకరపోసి పోశారు. మిగతా మట్టిపోసి అంతటితో వదిలేశాడు. దీంతో వాహనదారులు దుమ్ముతో పాటు కంకరతో నరకయాతన పడుతున్నారు. కంకరపై వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు... పాత కల్వర్టుల స్థానంలో కొత్త కల్వర్టులు నిర్మించారు. రోడ్డు వెడల్పు కావడంతో రోడ్డును ఆనుకొని వ్యవసాయ బావులు ఉన్నాయి. ప్రమాదకర వ్యవసాయ బావుల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. వల్భాపూర్– రంగమ్మపల్లి గ్రామాల మధ్య విద్యుత్ స్తంభాలు రోడ్డుకు అడ్డంగా అతి ప్రమాదకరంగా ఉన్నాయి. రాత్రి సమయంలో స్తంభాలు కనిపించక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత శనివారం రాత్రి ఓ యువకుడు బైక్‌పై జమ్మికుంటకు వెళ్తుండగా చీకట్లో స్తంభాన్ని ఢీకొనడంతో గాయాలయ్యాయి. విద్యుత్ స్తంభాల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. దుమ్ము ధూళితో సతమతం.. జగ్గయ్యపల్లి– నర్సింగాపూర్ గ్రామాల మధ్య దుమ్ము విపరీతంగా లేస్తోంది. రోడ్డుపై నీటిని సక్రమంగా చల్లించకపోవడంతో దుమ్ములేచి ఇబ్బందులు పడుతున్నారు. ఈ రూట్లో నిత్యం ఆర్టీసీ బస్సులు 16 ట్రిప్పులు నడుస్తుంటాయి. వందలాది ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇతర వాహనాలు తిరుగుతుంటాయి. కంకర జారడం వల్ల ప్రమాదాలు జరగడంతో పాటు వాహనాల టైర్లు త్వరగా చెడిపోతున్నాయని ప్రయాణికులు పేర్కొంటున్నారు. బిల్లు మంజూరులో జాప్యం వల్లేనా? పోర్‌లైన్ రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌కు జరుగుతున్న పనులకు సకాలంలో బిల్లులు రావడం లేదని సమాచారం. దీంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇంకా మూడు నెలల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా.. పనులు అడుగు కూడా ముందుకు కదలకపోవడం గమనార్హం. ఇదే పరిస్థితి కొనసాగితే పనులు పూర్తి కావడానికి ఎంకాలం పడుతుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై ఆర్అండ్బీ ఏఈ స్వప్నను వివరణ కోరగా దుమ్ము లేవకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రమాదకరంగా ఉన్న స్తంభాల వద్ద రక్షణ చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు. పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తామన్నారు. రోడ్డు మధ్యలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు -
మేమింతే..!
మాగనూర్(మక్తల్): మహబూబ్‌నగర్ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు త్రిబుల్ లేన్ రోడ్డు పనులు చురుగ్గా సాగుతున్నాయి.. ఇందులో మహబూబ్‌నగర్ నుంచి మరికల్ వరకు పనులు పూర్తికాగా.. ప్రస్తుతం అక్కడి నుంచి కర్ణాటక శివారు శక్తినగర్ వరకు రోడ్డు పనులను మరో కాంట్రాక్టర్ చేపడుతున్నాడు.. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ రోడ్డు పనుల కోసమంటూ చెరువు మట్టిని తరలిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 ఫీట్ల లోతు వరకు మట్టిని ఇష్టారాజ్యంగా పొక్లెయినర్లతో తవ్వుతుండడాన్ని స్థానికులు తప్పుపడుతున్నారు. ప్రభుత్వ పనుల కోసమే అయినా.. అదే ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ప్రజలకు ఉపయోగపడే చెరువు నుంచి మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తుండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఇదంతా మాగనూరు మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కనే జరుగుతున్నా.. రెవెన్యూ అధికారులు మాత్రం తామెవరికీ అనుమతి ఇవ్వలేదని చెప్పడం గమనార్హం. పొలాలకు దారి మాగనూరు మండల కేంద్రంలోని మెన్ రోడ్డు పక్కనే సామన్‌చెరువు ఉంటుంది. ఈ చెరువు నీరు ఆయకట్టు రైతులు పొలాలు పండించుకునేందుకు, వేసవిలో పశువుల దాహార్తి తీర్చేందుకు ఉపయోగపడుతోంది. అంతేకాకుండా ఈ చెరువు మీదుగా అటు వైపు ఉన్న పొలాల్లోకి దాదాపు యాభై మంది రైతులు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం రోడ్డు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ జేసీబీలు, పొక్లెయినర్లు పెట్టి మరీ ఏకంగా 20ఫీట్ల లోతు వరకు తవ్వి మట్టి తరలిస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్‌లో ప్రమాదాలకు ఆస్కారముందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కోసం వెళ్లిన పశువులు కానీ మనుషులు కానీ అందులో పడితే ప్రాణాలు కోల్పోవాల్సిందేనని చెబుతున్నారు. అనుమతులు లేవు.. ప్రభుత్వ భూముల్లోని చెట్లను కొట్టేందుకు కూడా అధికారుల అనుమతి తీసుకోవాలి. ఇక మట్టి తవ్వాలన్నా, తరలించాలన్నా మైనింగ్, రెవెన్యూ అధికారుల అనుమతి తప్పనిసరి. గ్రామాల్లోని వ్యవసాయ భూమిలో ఇళ్లు నిర్మించాలన్నా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్‌గా అనుమతి పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మాగనూర్ మండలంలో మాత్రం చాలామంది తమ పొలాల్లో మట్టి తరలించుకునేందుకు రైల్వేలైన్ కాంట్రాక్టర్, రోడ్డు పనుల కాంట్రాక్టర్‌కు అవకాశహిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. దీనిని ఆసరాగా చేసుకున్న కాంట్రాక్టర్ తమనెవరూ ఏమీ చేయలేరనే ధైర్యంతో ఏకంగా చెరువుపై కన్నేశాడు. ఇక చెరువు నుంచి సైతం 20 ఫీట్ల లోతు వరకు తవ్వకాలు చేపట్టడం అధికారుల దృష్టికి వచ్చే అవకాశమున్నా ఎందుకు పట్టించుకోవడం లేదో సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతోంది. నిబంధనలకు తిలోదకాలు మాగనూరు నుంచి కర్ణాటక శివారు వరకు రోడ్డు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ పనుల్లో మొదటి నుంచి నిబంధనలను విస్మరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రోడ్డు నిర్మాణంలో ఓ పక్క వాహనాలను వెళ్లుటకు అవకాశం కల్పించి మరో పక్క రోడ్డు నిర్మించాలి. కానీ అందుకు విరుద్ధంగా కాం ట్రాక్టర్ వాహనాలు వెళ్లేందుకు వీలు లేకుండా ఒకేసారి మొత్తం ఉన్న రోడ్డును త్రవ్వి కొత్త రోడ్డు ను నిర్మిస్తుండడం మూలంగా వాహనచోదకులు, ప్రయాణికులు ప్రమాదాలను గురై మృత్యువాత పడుతున్నారు. అలాగే రోడ్డుకు కల్వర్టులు నిర్మిస్తున్న సమయంలో ముందుగా హెచ్చరిక బోర్డులు కానీ స్పీడ్ బ్రేకర్లు కానీ నిర్మించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే మా ర్గంలో ఇటీవల ఓ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు, అయినప్పటికీ రోడ్డు పను ల్లో నిబంధనలు పాటించని అంశాన్ని పట్టించుకోని అధికారులు.. ఇప్పుడు మట్టి తరలింపుపై కూడా స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సామన్‌చెరువు నుంచి మట్టి తరలిస్తున్న అంశంపై స్థానికులు ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
పల్లె రోడ్లకు మరమ్మతులు!
ఐదేళ్ల క్రితం గ్రామాల్లో నిర్మించిన పంచాయతీరాజ్ బీటీ రోడ్లు చాలా వరకు ధ్వంసమై గుంతల మయంగా మారాయి. వీటి మరమ్మతులకు ఆ శాఖ శ్రీకారం చుట్టింది. ఇంజినీరింగ్ విభాగం అధికారులు పనుల అంచనాలను రూపొందించారు. కలెక్టర్ రామ్మోహన్ రావు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. ఇటీవలే అన్ని పంచాయతీలకు పాలక వర్గాలు కొలువు దీరాయి.. ఈ తరుణంలో పల్లె ప్రగతికి బాటలు వేసే గ్రామాల్లోని మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్ (పీఆర్) రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించింది. ఐదేళ్ల క్రితం నిర్మించిన చాలా వరకు పీఆర్ రోడ్లు గుంతల మయంగా మారాయి. వీటిపై ప్రయాణించాలంటే వాహనదారులు జంకుతున్నారు. కొన్ని రోడ్లైతే అడుగుకోగుంత ఏర్పడటంతో గంట సేపు ప్రయాణిస్తే నడుం నొప్పి వచ్చే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పీఆర్ రోడ్ల మరమ్మతులకు ఆ శాఖ శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఐదేళ్లు, అంతకు ముందు నిర్మించిన రోడ్లన్నింటికీ బీటీ రెన్యూవల్స్ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అన్ని మండలాల నుంచి ప్రతిపాదనలు తయారుచేసింది. 42 రోడ్లకు రూ.21 కోట్లు.. జిల్లాలో ఉన్న పంచాయతీరాజ్ రోడ్లలో ఐదేళ్లు, అంతకు ముందు నిర్మించి మరమ్మతులకు నోచుకోని 42 రోడ్లకు ఈసారి బీటీ రెన్యూవల్ చేయాలని ఆ శాఖ ఇంజనీరింగ్ విభాగం నిర్ణయించింది. రూ.21 కోట్లతో ఈ పనుల అంచనాలను అధికారులు రూపొందించారు. ఈ మేరకు నిధుల మంజూరు కోసం జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. తారు రోడ్డు లేని పంచాయతీలు.. జిల్లాలో అనేక తండాలు, నివాసిత ప్రాంతాలు ఇప్పుడు పూర్తిస్థాయిలో నూతన పంచాయతీలుగా మారాయి. ఇలా ఏర్పడిన అన్ని గ్రామ పంచాయతీలకు తారు రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా తారు రోడ్డు లేని గ్రామ పంచాయతీల వివరాలను పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇతర జిల్లాలతో పోల్చితే తారు రోడ్డు లేని గ్రామ పంచాయతీలు జిల్లాలో అతితక్కువ. జిల్లా వ్యాప్తంగా కేవలం మూడు కొత్త పంచాయతీలకు మాత్రమే తారు రోడ్డు లేదని అధికారులు గుర్తించారు. ధర్పల్లి మండలం మోబిన్‌సాబ్ తండా, నడిమిబల్ రాంతండా, వర్ని మండలం చిలుక తండాకు మాత్రమే బీటీ రోడ్లు లేవు. వీటికి కూడా బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపారు. బ్లాక్ స్పాట్ల వద్ద.. మెండోరా వద్ద 2018 మార్చి 25న ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 19 మందితో ప్రయాణిస్తున్న ఆటో రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు, నలుగురు మహిళలు సహా 11 మంది మృతి చెందారు. జిల్లా చరిత్రలోనే ఇంత భారీ రోడ్డు ప్రమాదం జరగలేదు. ఇలా 46 రోడ్లలో 75 బావులు ప్రమాదకరంగా పొంచి ఉన్నాయి. ఈ బావుల వద్ద రక్షణ గోడలు నిర్మించాలని, పాడుబడిన బావులైతే పూడ్చి వేయాలని గతంలోనే నిర్ణయించారు. అయితే ఈ పనులకు మోక్షం లభించలేదు. తాజాగా ఇలాంటి బ్లాక్స్పాట్ల వద్ద రక్షణగోడల నిర్మాణానికి రూ.3.50 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయి. ప్రతిపాదనలు పంపాము ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పీఆర్ రోడ్ల మరమ్మతు పనులకు సంబంధించిన అంచనాలు ఇటీవల రూపొందించాము. అలాగే బీటీ రోడ్లు లేని గ్రామ పంచాయతీల గుర్తింపు ప్రక్రియను కూడా పూర్తి చేశాము. మూడు పంచాయతీలకు బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాము. అలాగే రోడ్లపై ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో చేపట్టనున్న పనులకు సంబంధించి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించాము. నీలకంఠేశ్వర్,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ -
హైవే..పూర్తికాదే!
పాల్వంచరూరల్: పేరుకు జాతీయ రహదారి నిర్మాణమే అయినప్పటికీ.. పనులు మాత్రం మారుమూల బీటీ రోడ్లకంటే నెమ్మదిగా సాగుతున్నాయి. విజయవాడ నుంచి ఇబ్రహీం పట్టణం వరకు చేపట్టిన 30వ నంబర్ జాతీయ రహదారి జిల్లాలో భద్రాచలం, సారపాక వద్ద ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి 161 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల్లో మన జిల్లాల్లోనే నిర్మితమవుతోంది. ఆ తర్వాత ఖమ్మం జిల్లా మీదుగా రోడ్డు ఉంటుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కలిపే ప్రతిష్టాత్మక పనుల్లో ప్రస్తుతం కొత్తగూడెం, పాల్వంచ సమీపంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వాస్తవానికి 2017 జూలై నాటికే అందుబాటులోకి రావాల్సి ఉండగా.. అగ్రిమెంట్‌ను అధికారులు పొడిగించి మార్చి నెలఖారునాటికి గడువునిచ్చారు. అయినా..కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ జాప్యం నెలకొంది. మూడో ప్యాకేజీ కింద రూ.229 కోట్ల వ్యయంతో సారపాక నుంచి రుద్రంపూర్ వరకు 42 కిలోమీటర్ల పనులు సాగుతున్నాయి. 35 కిలోమీటర్ల వరకు పూర్తి చేశారు. ఇంకా 7 కిలోమీటర్ల నిర్మాణం మిగిలి ఉంది. ముర్రేడు, గోదుమ వాగులపైన రెండు వంతెనలు నిర్మించాలి. పెద్దమ్మగుడి సమీపంలో కల్వర్టు పూర్తి చేయాల్సి ఉంది. ఇల్లెందు క్రాస్ రోడ్డు నుంచి సింగరేణి అతిథి గృహం వరకు ఒకవైపు రహదారిని మాత్రం పోశారు. మరో వైపునకు మోక్షం లభించట్లేదు. లక్ష్మీదేవిపల్లి నుంచి రామవరం గోదుమవాగు వరకు రోడ్డు నిర్మాణం పనులు ఇంకా మొదలు కాలేదు. రోడ్డు పక్కన డ్రెయినేజీలు కూడా అస్తవ్యస్తంగానే ఉన్నాయి. 54 కిలోమీటర్లకు గాను కేవలం 24 కిలోమీటర్లే పూర్తయింది. మూడు కల్వర్టులు కట్టాల్సి ఉంది. పెద్దమ్మ గుడి వద్ద ఎప్పుడో..? కొత్తగూడెం పట్టణ పరిధి, పెద్దమ్మగుడి ఆలయం ఎదుటి నుంచి ఇంకా నిర్మాణ పనులను ప్రారంభించలేదు. కేవశవాపురం – ఇందిరానగర్ కాలనీ వరకు ఒకవైపు వరస రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. ఆరోగ్యమాత చర్చి వద్ద నుంచి సీ–కాలనీ గేటు, బస్టాండ్ సెంటర్ మీదుగా దమ్మపేట సెంటర్ వరకు పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మాణం చేయలేదు. దీంతో వాహనాలు డైవర్షన్‌పై రాకపోకలు సాగిస్తున్నాయి. ఒకవైపు రోడ్డు ఎత్తుగా, మరోవైపు లోతట్టుగా ఉండడం, దుమ్ము లేస్తుండడంతో ప్రమాదకరంగా మారింది. పెద్దమ్మ గుడి సమీపంలోని జగన్నాథపురంలో ఒకవైపు నిర్మాణం కోసం గుంతలు తవ్వి నిర్లక్ష్యంగా వదిలేశారు. రహదారికి ఇరువైపులా సైడ్‌కాల్వలు అస్తవ్యస్తంగా వదిలేశారు. హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయనేలేదు. కేవలం ఇసుక బస్తాలను కొన్నిచోట్ల, మరికొన్ని చోట్ల డ్రమ్‌లను ఉంచి..బాధ్యులు చేతులు దులుపుకున్నారు. రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. నవభారత్ నుంచి ఇల్లెందు క్రాస్‌రోడ్డు వరకూ పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. అసంపూర్తి పనులతో సమీప కాలనీలకు రాకపోకలు ఇబ్బందికరంగా మారాయి. డివైడర్‌కు సంబంధించి అక్కడక్కడా నాసిరకం పనులతోనే మమ అనిపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఫుట్‌పాత్ నిర్మాణ పనులు ఇంకా దారుణంగా ఉన్నాయని స్థానికులు అంటున్నారు. పుట్‌పాత్‌లో ఇటుకలు, సిమెంట్ వేసి..ఆ తర్వాత క్యూరింగ్ చేయకపోవడం, పటిష్టంగా నిర్మించని కారణంగా అప్పుడే దెబ్బతింటోంది. పనులు నిలిపిన చోట హెచ్చరిక బోర్డులు, రాత్రి వేళ గుర్తించేలా రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. గడువును పొడిగించాల్సి ఉంది.. జాతీయ రహదారి నిర్మాణ పనులు ఆపకుండా నిర్వహిస్తున్నాం. ఇంకా 7 కిలోమీటర్ల రహదారి మాత్రం నిర్మించాల్సి ఉంది. కొత్తగూడెం పట్టణ పరిధి, పెద్దమ్మగుడి వద్ద పూర్తి చేస్తాం. మిగిలిన రెండు బ్రిడ్జిలను కట్టిస్తాం. డిసెంబర్ వరకు గడువును నిర్దేశించాం. అయితే..ఇంకా కొంతకాలం పడుతుందని, ఈ గడువు పెంచాలని ప్రతిపాదనలు పంపాం. – వెంకటేశ్వరరావు, ఈఈ, నేషనల్ హైవే -
మాయదారి ప్రతిపాదనలు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణమే తొలి ప్రాధాన్యత అంటూ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా ప్రగల్భాలు పలుకుతోంది. కానీ కనీసం ప్రాజెక్టుకు వెళ్లే ఏటిగట్టు రహదారిని ఇప్పటివరకు నిర్మించలేకపోయింది. సింగిల్ రోడ్డుగా ఉన్న ఈ రహదారి నిర్మాణ సామగ్రిని తరలిస్తున్న భారీ వాహనాల తాకిడికి గోతులమయంగా మారింది. రహదారి విస్తరణకు అధికారులు మూడుసార్లు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం పైసా విదల్చలేదు. పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్టుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామంటూ చెప్పుకుంటున్న ప్రభుత్వం నాలుగున్నరేళ్లు గడిచినా కనీసం రహదారిని కూడా నిర్మించలేకపోయింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి పోలవరం చేరాలంటే సింగిల్ రోడ్డుగా ఉన్న ఏటిగట్టు మార్గమే దిక్కు. అది కూడా 60 మలుపులతో ప్రమాదకరంగా ఉంది. అయినప్పటికీ రోడ్డు విస్తరణకు నోచుకోలేదు. ప్రాజెక్టు నిర్మాణ పనులకు వినియోగించే భారీ యంత్రాలన్నీ ఈ ఇరుకు రోడ్డు మార్గంలో చేరాల్సిందే. పోలవరం నుంచి కొవ్వూరు వరకు వెళ్లే రోడ్డు మార్గం ఐదున్నర మీటర్ల వెడల్పు ఉంది. దీనిలో కొంత మేర మూడున్నర మీటర్లకు కుచించుకుపోయింది. ప్రక్కిలంక నుంచి పోలవరం వరకు రోడ్డు అధ్వానంగా మారింది. ఒక వాహనం వెళ్తుంటే మరో వాహనం పక్కకు తప్పుకోవడానికి పాట్లు పడాల్సిన పరిస్థితి. దీంతో తరచూ ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. భారీ వాహనాల రాకపోకలతో రోడ్డు మొత్తం గోతులమయంగా మారింది. కనీసం తాత్కాలిక మరమ్మతులకు కూడా నోచుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఇదే రోడ్డుపై ప్రయాణిస్తున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. మూడేళ్ల కిందట సీఎం చంద్రబాబు పోలవరం సందర్శనకు వచ్చిన సమయంలో ఏటిగట్టు రోడ్డు దుస్థితిని ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మూడుసార్లు ప్రతిపాదనలు పోలవరం నుంచి కొవ్వూరు వరకు 30 కిలోమీటర్ల పొడవున ఉన్న రోడ్డును వెడల్పు చేసేందుకు ఆర్అండ్బీ అధికారులు మూడుసార్లు సర్వే చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఏ ఒక్క ప్రతిపాదన ఇప్పటివరకు మంజూరు కాలేదు. రెండేళ్ల క్రితం ఏటిగట్టుపై ఆర్అండ్బీ రోడ్డు ఫోర్‌లైన్ నిర్మాణానికి రూ.300 కోట్లతో ప్రతిపాదన పంపారు. ఏమైందో ఏమో కానీ ఏడాదిన్నర క్రితం ఫోర్‌లైన్ స్థానే డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.100 కోట్లతో మరో ప్రతిపాదనను తయారు చేసి అధికారులు ప్రభుత్వానికి పంపించారు. దానికి కూడా ప్రభుత్వం అంగీకరించలేదు. ఏడాది క్రితం మరోసారి సర్వే చేశారు. ఈసారి జాతీయ రహదారిలో భాగంగా జీలుగుమిల్లి నుంచి పోలవరం మీదుగా కొవ్వూరు వరకు 85 కిలోమీటర్ల పొడవునా, పదిమీటర్ల వెడల్పుతో నిర్మించేందుకు రూ.493 కోట్లతో మరో ప్రతి పాదన పంపారు. ఆ ప్రతిపాదనా అటకెక్కింది. భారీ వాహనాల రాకపోకలు ప్రాజెక్టు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నా ప్రభుత్వం ప్రచార ఆర్భాటం కోసం సందర్శన పేరుతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలను తరలిస్తోంది. దీంతో నిత్యం రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుంచి 100 బస్సులతో పాటు ఇతర వాహనాలు రాకపోకలు సాగి స్తున్నాయి. ఇవి కాక నిర్మాణ సామగ్రి కోసం భారీవాహనాలు వస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు, నిత్యం తిరిగే వాహనదారులతో రాకపోకలు పెరిగాయి. రోడ్డు మూడున్నర మీటర్ల వెడల్పు మాత్రమే ఉండడంతో తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహనాలను తప్పించబోయి పలు ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. ఏటిగట్టు రోడ్డుపై ప్రయాణం అంటేనే ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రోడ్డు వెడల్పు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం ఏదో ఒక ప్రతిపాదనకు అంగీకరించి రహదారిని త్వరగా విస్తరించాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు. అవస్థలు పడుతున్నాం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లేందుకు ఉన్నది ఒక్కటే రోడ్డు మార్గం. ఈ రోడ్డు మార్గాన్ని విస్తరించకపోవడం వల్ల నిత్యం అనేక అవస్థలు పడుతున్నాం. దీనికి తోడు భారీ వాహనాల రాకపోకలతో మరింత ఇబ్బందికరంగా మారింది. ప్రధానంగా రోడ్డు వెడల్పు లేకపోవడంతో ఒకేసారి రెండు వాహనాలు తప్పుకునే పరిస్థితి లేదు. రోడ్డును వెడల్పు చేయాల్సి ఉంది. – బుగ్గా మురళీకృష్ణ, పోలవరం నిధులు మంజూరు చేయాలి నిత్యం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి 100 బస్సులతో పాటు భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లాలంటే ఉన్నది ఒక్కటే రోడ్డు మార్గం కావడంతో అన్ని వాహనాలు ఈ రోడ్డు మార్గంలో వెళ్లాల్సిందే. గంటా శ్రీనివాసరావు, తాడిపూడి -
ఇదేం దారి ద్య్రం!
పాల్వంచరూరల్: కిన్నెరసాని అభయారణ్యం పరిధిలో మంజూరైన ఆర్అండ్బీ రహదారి విస్తరణ పనులకు వైల్డ్‌లైఫ్ శాఖ ద్వారా అనుమతులు రాక ఏడాది కాలంగా స్తంభించాయి. మండల పరిధిలోని రాజాపురం నుంచి ఉల్వనూరు, చండ్రాలగూడెం మీదుగా కొత్తగూడెం మండలం మైలారం నుంచి కొత్తగూడెం క్రాస్ రోడ్డు వరకు రహదారి నిర్మాణానికి రూ.62 కోట్లు గత ఏడాది మంజూరయ్యాయి. అయితే ఇందులో 51 కిలోమీటర్ల ఆర్అండ్బీ రహదారి విస్తరణ పనులకు వైల్డ్‌లైఫ్ అనుమతి తప్పనిసరి. కాగా, అభయారణ్యంలో రోడ్డు విస్తరణకు ఆ శాఖ అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో రాజాపురం నుంచి ఉల్వనూరు వరకు రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్.. రాజాపురం నుంచి రోడ్డు విస్తరణ పనులు చేస్తుండగా గత మే నెలలో వైల్డ్‌లైఫ్ శాఖఅధికారులు నిలిపివేశారు. రోడ్డు పొడవునా కల్వర్టులు కూడా నిర్మించారు. అయితే అవి రోడ్డుకు ఎత్తుగా ఉండటంతో వర్షాకాలంలో రాకపోకలకు ప్రమాదకరంగా మారిందని వాహనచోదకులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఉల్వనూరు గ్రామ సమీపంలో, మల్లారం క్రాస్ రోడ్డు వద్ద రోడ్డుపై కంకర తేలి గుంతలు ఏర్పడ్డాయి. ప్రతిపాదనలు పంపినా పర్మిషన్ రాలే.. రోడ్డు నిర్మాణం పనులు నిలిచిపోవడంతో అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆర్అండ్బీ శాఖ ఈఈ ప్రభుత్వం ద్వారా ఢిల్లీకి ప్రతిపాదనలు పంపించారు. స్వయంగా పలుమార్లు ఢిల్లీ వెళ్లి సంబంధిత అధికారులతో చర్చించారు. అయినా రోడ్డు విస్తరణకు అనుమతి ఇచ్చేందుకు వైల్డ్‌లైఫ్ అధికారులు నిరాకరించారు. దీంతో చండ్రాలగూడెం నుంచి మైలారం వరకు వైల్డ్‌లైఫ్ పరిధిలో లేని 8 కిలోమీటర్ల మేర మాత్రమే రోడ్డు నిర్మించారు. అయితే పాత రోడ్డుపైనే కొత్తగా నిర్మిస్తే తమకు అభ్యంతరం లేదని వైల్డ్‌లైఫ్ అధికారులు అంటున్నారు. అంతకుమించి విస్తరిస్తే ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. అంతేగాక.. గతంలో నిర్మించిన రోడ్డుకు సైతం వైల్డ్‌లైఫ్ అనుమతులు లేవని చెపుతున్నారు. అయితే ఆ శాఖ పర్మిషన్ లేకుండా పాత రోడ్డు కూడా ఎలా నిర్మించారనేది స్థానికంగా చర్చనీయాంశమైంది. వైల్డ్‌లైఫ్ అనుమతి ఇవ్వడం లేదు మండల పరిధిలోని రాజాపురం నుంచి ఉల్వనూరు వరకు వైల్డ్‌లైఫ్ శాఖ పరిధిలో నిర్మించాల్సిన తారు రోడ్డు పనులకు ఆ శాఖ అనుమతి ఇవ్వడం లేదు. దీంతో ఏడాది కాలంగా పనులు నిలిచిన మాట వాస్తవమే. అనేక సార్లు ఢిల్లీకి వెళ్లి వైల్డ్‌లైఫ్ శాఖ అధికారులతో మాట్లాడినా, ప్రభుత్వం ద్వారా ప్రతిపాదనలు పంపినా అనుమతికి నిరాకరించారు. ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాం. చివరికి పాత రోడ్డునే పునరుద్ధరించాలనే ఆలోచన కూడా ఉంది. మరోసారి వైల్డ్‌లైఫ్ ఉన్నతాధికారులతో చర్చిస్తాం. – రాజేశ్వరరెడ్డి, ఆర్అండ్బీ ఈఈ -
చీపురుతో చిమ్మితే కంకర తేలుతోంది!
కర్నూలు, కోవెలకుంట్ల: అధికారపార్టీ నాయకుల అవినీతికి అడ్డూ అదుపులేకుండా పోతోంది. పది కాలాల పాటు పదిలంగా ఉండాల్సిన సీసీరోడ్ల నిర్మాణాల్లో అక్రమాలకు పాల్పడ్డారు. చీపురుతో చిమ్మితే కంకర తేలుతుండటంతో రోడ్లు ఎంత నాణ్యతతో నిర్మించారో తెలుస్తోంది. కోవెలకుంట్ల మండలం లింగాల గ్రామంలో రూ.61 లక్షలతో నిర్మించిన సీసీరోడ్లు ప్రారంభించిన ఇరవై రోజులకే కంకర తేలి అధ్వానంగా మారాయి. గ్రామంలోని ఓసీ కాలనీలో రూ.30.10 లక్షలు, ఎస్సీ, బీసీ కాలనీల్లో రూ.30.90 లక్షలతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ, ఎస్డీఎఫ్ నిధులతో ఇటీవల సీసీరోడ్లు, డ్రైనేజీ ఏర్పాటు చేశారు. నిర్మాణ సమయంలో తగినపాళ్లలో సిమెంట్ కలుపకుండా అధిక భాగం ఇసుక, కంకరతో రోడ్ల నిర్మాణం చేపట్టడంతో రోడ్లు వేసిన కొన్ని రోజులకే దెబ్బతిని కంకర బయట పడింది. గత నెల 24వ తేదీ బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఈ రోడ్లకు ప్రారంభో త్సవం చేశారు. సీసీరోడ్లపై ఉదయం, సాయంత్రం వేళల్లో ఆయా కాలనీల్లో ఇళ్ల ముందు చీపురుతో ఊడ్చితే కంకర చిప్స్ వస్తున్నాయని స్థానిక మహిళలు వాపోతున్నారు. రోడ్లపై కంకర బయటపడటంతో రోడ్లపై చెప్పులు లేకుండా నడిచేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంకర పాదాల్లో గుచ్చుకుంటుండటంతో రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు. ఎస్సీ, ఓసీ కాలనీల్లో రోడ్ల నిర్మాణాలను మధ్యలో వదిలేయడంతో పారిశుద్ధ్యం లోపించి దుర్వాసన వస్తోందని కాలనీవాసులు చెబుతున్నారు. సీసీరోడ్ల ప్రారంభోత్సవంలో శిలాఫలకాలు, డ్రమ్స్, డప్పులు, తదితర హంగు, ఆర్భాటాలకు కావాల్సిన మొత్తాన్ని రోడ్ల నిర్మాణానికి కేటాయించిన నిధుల్లో కోత పెట్టాల్సి వస్తోందని అధికారపార్టీకి చెందిన ఓ నాయకుడు తెలిపారు. బిల్లులు నిలుపుదల: గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో సీసీరోడ్ల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదన్న విషయం మా దృష్టికి వచ్చింది. దెబ్బతిన్న రోడ్డు స్థానంలో తిరిగి రోడ్డువేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశాం. మరమ్మతులు చేసేవరకు ఫైనల్ బిల్లు లు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టాం. – నజీర్ అహమ్మద్, పంచాయతీరాజ్ ఏఈ -
ఎస్‌ఎన్‌ఏకు మహర్దశ
సాక్షి, నిజాంసాగర్(జుక్కల్): కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలను కలిపే సంగారెడ్డి – నాందేడ్ – అకోల (ఎస్ఎన్ఏ) జాతీయ రహదారి విస్తరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. మూడు రాష్ట్రాలకు సరిహద్దు కూడలిగా ఉన్న జుక్కల్ నియోజకవర్గం మీదుగా ఉన్న నాందేడ్– సంగారెడ్డి డబుల్ రోడ్డును నాలుగు లైన్ల రహదారిగా విస్తరిస్తున్నారు. సదరు రహదారి విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 2,793 కోట్లు మంజూరు చేసింది. దాంతో 135 కిలోమీటర్ల మేర ఉన్న రోడ్డును నాలుగు లైన్ల రహదారిగా మారుస్తున్నారు. నాలుగు లైన్ల రహదారికి అనుమతి హైదరాబాద్, సంగారెడ్డి ప్రాంతాల నుంచి నాందేడ్ వరకు విస్తరించి ఉన్న ఎస్ఎన్ఏ డబుల్ రోడ్డును నాలుగు లైన్ల రహదారిగా మార్చేందు కు జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తున్న ఎస్ఎన్ఏ రోడ్డును నాలు గు లైన్లుగా విస్తరించాలని కోరారు. అంతే కాకుం డా సదరు రోడ్డు మార్గంలో ఉన్న ఆందోల్, నారాయణఖేడ్, జుక్కల్ నియోజకవర్గాలు వ్యాపార పరంగా, పరిశ్రమల పరంగా అభివృద్ధి సాధిస్తాయని కేంద్రానికి విన్నవించారు. ఎంపీ బీబీపాటిల్ విజ్ఞప్తి మేరకు కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ ఎస్ఎన్ఏ రోడ్డును నాలుగు లైన్ల రహదారికి అనుమతించారు. అంతేకాకుండా నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 2,793 కోట్లు మంజూరు చేసింది. మొదటి దఫాలో సదరు రహదారి విస్తరణ పనులకు ఆమోదం తెలిపారు. పనులు ప్రారంభం సంగారెడ్డి జిల్లా కంది నుంచి మహారాష్ట్రలోని దెగ్లూర్ వరకు ఉన్న సంగారెడ్డి – నాందేడ్ – అకోల జాతీయ రహదారి విస్తరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గడిచిన ఏడాదిన్నర నుంచి రోడ్డు సర్వే పనులు కొనసాగాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న భూముల యజమానులతో ఆర్‌ఆండ్‌బీ, రెవెన్యూ అధికారులు పలు దఫాలుగా సమావేశం అయ్యారు. విస్తరణ పనులకు భూముల కేటాయింపు పూర్తవడంతో నెల రోజుల నుంచి విస్తరణ పనులు నిర్వహిస్తున్నారు. దెగ్లూర్ నుంచి మద్నూర్, జుక్కల్, పెద్దకొడప్గల్, పిట్లం, నిజాంసాగర్ మండలాల మీదుగా ఉన్న రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించారు. నాలుగు లైన్ల రహదారి కోసం ఇరువైపులా సరిహద్దులు పెట్టారు. అంతేకాకుండా సదరు రోడ్డుకు ఇరువైపులా ఉన్న భారీ వృక్షాలను ఆర్అండ్బీ అధికారుల ఆధ్వర్యంలో తొలగిస్తున్నారు. రహదారి విస్తరణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ బిచ్కుందలో మాకం వేశారు. రహదారి విస్తరణ పనులను 18 నెలల కాలంలో పూర్తి చేయాలని నిర్దేశించడంతో పనులపై దృష్టి సారించారు. 2020 సంవత్సరం నాటికి నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనులు పూర్తయ్యేలా ఆర్అండ్బీ అధికారులు పనులు మరింత వేగవంతం చేశారు. రహదారి విస్తరణ పనులు చేపడుతుండడంతో ఆయా మండలాల ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఛత్తీస్‌గఢ్‌లో మావోల ఘాతుకం
చర్ల/పర్ణశాల: ఛత్తీస్‌గఢ్‌లో తమ హెచ్చరికలను పట్టించుకోకుండా రోడ్డు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ హరిశంకర్ సాహూను మావోయిస్టులు హతమార్చారు. ఈ ఘటన సుక్మా జిల్లాలో గురువారం జరిగింది. దోర్నపాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇప్పనపల్లి గ్రామం దగ్గర మిస్మా–చిరోర్డ్‌గూడ రోడ్డు పనులను ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం కింద చేపట్టారు. ఏడాది క్రితమే పనులు మొదలైనా మావోల హెచ్చరికలతో నిలిపివేశారు. కాగా, కాంట్రాక్టర్ ఆ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం మళ్లీ ప్రారంభించారు. దీంతో గురువారం ఉదయం సాయుధులైన దాదాపు డజను మంది మావోయిస్టులు రోడ్డు నిర్మాణప్రాంతానికొచ్చి పనులు ఆపేయాలని అక్కడి కార్మికులను బెదిరించారు. అక్కడే ఉన్న హరిశంకర్‌ను తలపై పదునైన ఆయుధాలతో కొట్టి చంపారు. హరిశంకర్ ఎస్యూవీ వాహనం, మరో ఐదు వాహనాలను తగలబెట్టారు. రోడ్డు పనులకు వాడుతున్న ట్రక్కులు, రోడ్డు రోలర్లనూ దహనం చేశారు. -
సీఎం పళనిస్వామిపై సీబీఐ విచారణ
చెన్నై: రోడ్డు కాంట్రాక్టు పనుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై సీబీఐ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో చేపట్టిన రూ.3,500 కోట్ల విలువైన కాంట్రాక్టు పనులను ముఖ్యమంత్రి పళనిస్వామి తన బంధువులకు, బినామీలకు అప్పగించారని ఆరోపిస్తూ డీఎంకే నేత ఆర్ఎస్ భారతి గతంలో పిటిషన్ వేశారు. ఈ కేసులో డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్(డీవీఏసీ) అందజేసిన నివేదికను పరిశీలించిన జస్టిస్ ఏడీ జగదీశ్ చంద్ర శుక్రవారం ఈ ఆదేశాలిచ్చారు. దర్యాప్తునకు సంబంధించిన అన్ని పత్రాలను వారంలోగా సీబీఐకి అందజేయాలని డీవీఏసీని ఆదేశిస్తూ.. ప్రాథమిక విచారణ నివేదికను మూడు నెలల్లోగా అందజేయాలని సీబీఐని కోరారు. రాష్ట్రంలో చేపట్టిన రోడ్డు కాంట్రాక్టు పనుల్లో అవకతవకలు జరిగాయనీ, వీటిపై డీవీఏసీ విచారణకు ఆదేశించాలని కోరుతూ డీఎంకే నేత భారతి జూన్‌లో హైకోర్టులో పిటిషన్ వేశారు. స్పందించిన న్యాయస్థానం.. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని, రోజువారీ నివేదికను అందజేయాలని డీవీఏసీని సెప్టెంబర్ 12వ తేదీన ఆదేశించింది. అయితే, డీవీఏసీ దర్యాప్తు సీఎం పళనిస్వామికి అనుకూలంగా సాగుతోందని ఈనెల 9న జరిగిన విచారణ సందర్భంగా పిటిషనర్ భారతి అనుమానాలు వ్యక్తం చేయడంతో సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు తాజాగా ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీఎం రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. -
రోడ్డు పూర్తయింది.. అవినీతి తేలింది!
అనంతపురం, ఉరవకొండ/కూడేరు: ప్రజలకు నాలుగు కాలాల పాటు సేవలందించాల్సిన రహదారుల నిర్మాణంలో కాంట్రాక్టర్ సొంత లాభం చూసుకుంటున్న తీరు విమర్శలకు తావిస్తోంది. జిల్లాకు చెందిన నిర్మాణ సంస్థ.. అందునా అధికార పార్టీ అండదండలు.. కోట్లాది రూపాయల వ్యయం.. నాణ్యత పాటించకపోవడంతో రోడ్డు పూర్తయిన నెలల వ్యవధిలోనే కంకర తేలిపోయింది. అంతేకాదు.. అడుగడుగునా ఓ డొల్లతనం బయటపడుతోంది. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో చేపట్టిన 75 కిలోమీటర్ల రోడ్డులో భాగంగా రాచానపల్లి వద్ద వంతెనతో పాటు పెన్నహోబిళం వద్ద మరో వంతెన నిర్మించారు. నాలుగు నెలల క్రితం పనులు పూర్తయ్యాయి. రయ్.. రయ్‌మంటూ దూసుకుపోవచ్చనుకున్న వాహన చోదకులు తాజా పరిస్థితిని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. నిర్మాణంలో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు స్థానికులు వాపోతున్నారు. ఉరవకొండ బైపాస్‌ను పరిశీలిస్తే.. ఎమ్మెల్సీ చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ ఆదేశాలతో 20 అడుగుల రోడ్డును కుదించినట్లు చర్చ జరుగుతోంది. స్థానిక టీడీపీ నాయకులు చందా వెంకటస్వామికి చెందిన భూములను కాపాడేందుకే ఈ కుదింపు చేపట్టినట్లు తెలుస్తోంది. పైపులైన్ నిర్మాణ పనుల్లోనూ ఇదే రీతిన వ్యవహరించారు. కేకే పెట్రోల్ బంకు వద్ద నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రాంతంలో వేసిన డివైడర్లు కొద్ది రోజులకే ధ్వంసమయ్యాయి. చాలా చోట్ల లేయర్ వేయకుండా వదిలేయడంతో కంకర తేలి గుంతలు పడ్డాయి. రోడ్డును నిశితంగా పరిశీలిస్తే.. ఎన్హెచ్ఏఐ పనితీరు ఎలా ఉందో అర్థమవుతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అందునా.. టీడీపీ దత్తత సంస్థ కావడం వల్లే అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించినట్లు చర్చ జరుగుతోంది. అసంపూర్తిగా డ్రైనేజీ పనులు కూడేరు మండల పరిధిలోని కుష్టు రోగుల కాలనీ నుంచి శివరాంపేట గ్రామం వరకు రహదారి పనులు చేపట్టారు. కూడేరులో ప్రధాన రహదారికి ఇరువైపులా మూడు అడుగుల వెడల్పు, పొడవుతో నిర్మించిన డ్రెయినేజీలు నాసిరకంగా ఉన్నాయి. కొన్నిచోట్లఅసంపూర్తిగా వదిలేశారు. స్టేట్ బ్యాంక్ వద్ద ఇళ్ల ముందు డ్రైనేజీ నిర్మాణానికి కొన్ని నెలల క్రితం గుంతలు తీసినా ఇప్పటికీ నిర్మాణం చేపట్టని పరిస్థితి. అదేవిధంగా రెడ్డి హోటల్ వద్ద, ట్రాన్స్‌కో కార్యాలయం సమీపంలో డ్రెయినేజీలు అసంపూర్తిగా ఉండటంతో మురుగు నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. ఈ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది అనంతపురం–బళ్లారి జాతీయ రహదారి. రోడ్డు పూర్తయి నాలుగు నెలలు కూడా గడవక మునుపే విడపనకల్లు సమీపంలో ఇలా కంకర తేలింది. జిల్లాకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్.. అందునా ఆ సంస్థ యజమాని అమిలినేని సురేంద్ర సొంత నియోజకవర్గం మీదుగా వెళ్తున్న రోడ్డు విషయంలో పాటించిన నాణ్యతను చూస్తే ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో ఆయన పాత్ర ఇట్టే అర్థమవుతోంది. -
‘దారి’ద్య్రం
జిల్లాలో గ్రామీణ రోడ్లు అధ్వానంగా మారా యి. చినుకుపడితే చిత్తడిగా తయారవుతున్నాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. రాకపోకలు సాగించలేక ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తిప్పలు ఎదుర్కొంటున్నారు. నిధులు ఉన్నా సంబంధిత శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారవుతోంది. నిధులు ఖర్చు చేయకపోవడంతో వెనక్కి వెళ్లే పరిస్థితి దాపురించింది. ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. చిత్తూరు ఎడ్యుకేషన్: జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆర్డీఎఫ్ (రూరల్ డెవలప్ మెంట్ ఫండ్) కింద 2017–18లో 59 పనులు మంజూరయ్యాయి. ఇందులో 31 పనులు పూర్తిచేయగా, 28 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ పనులకు రూ.1948.7 లక్షలు ఖర్చవుతుందని అంచనా. సీఆర్ఆర్ కింద 363 పనులకుగాను 196 పూర్తయ్యాయి. 167 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. సీఆర్ఆర్ (ఎస్సీ సబ్‌ప్లాన్)లో 313 పనులకు 143 పూర్తికాగా, 170 పెండింగ్‌లో ఉన్నాయి. ఎంజీఎన్‌ఆర్‌జీఎస్‌లో 195 పనులకుగాను 115, అంగన్వాడీ భవన నిర్మాణాల్లో 856కు గాను 616, పంచాయతీ భవనాలు 587కు 158, ఎంజీఎన్ఆర్జీఎస్ కన్వర్జెన్సీలో సీసీరోడ్లు 12,743 పనులకు 8,455 పెండింగ్‌లో ఉన్నాయి. పంచాయతీరాజ్ పరిధిలోని పనులు ఏళ్ల తరబడి జరుగుతుండడంతో విమర్శలు వెలువెత్తుతున్నా యి. సీఆర్ఆర్ ఎస్సీ సబ్‌ప్లాన్ కింద మంజూరైన పనుల్లో చిత్తూరు పీఆర్ఐ, మదనపల్లె, తిరుపతి పరిధిలో పనులు ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. పంచాయత్‌రాజ్ శాఖలోని పీఆర్ఐ, పీఐయూ, క్వాలిటీ కంట్రోల్ శాఖల మధ్య సమన్వయలోపం ఉండడంతో పనులు త్వరితగతిన పూర్తి చేయలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోలింగ్ అంతంతమాత్రమే.. జిల్లాలో జరుగుతున్న రహదారులన్నీ నిబంధనల ప్రకారం నిర్మించాలి. తారు రోడ్లకు ఇరువైపులా రోలింగ్ చేయకుండా వదిలేస్తున్నారు. తారు రోడ్లలో రెండు పొరలుగా తారు వేయాలి. ఈ పనులు అలా జరగడం లేదు. కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులు కుమ్మక్కై నాసిరకమైన రోడ్లను వేస్తున్నారు. తారురోడ్లను రెండు పొరలుగా వేయకపోవడంతో ఎక్కడికక్కడ కొద్దిరోజులకే తారు ఎండ కు కరిగిపోతోంది. పర్యవేక్షించాల్సిన క్వాలిటీ కంట్రోల్ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అదేతీరు.. జిల్లాలో ఎంజీఎన్ఆర్జీఎస్ ద్వారా 2017–18 సంవత్సరాల్లో చిత్తూరు, మదనపల్లె, తిరుపతికి గత ఆర్థిక సంవత్సరంలో 12,743 పనులు మంజూరయ్యాయి. వాటిలో 4,288 పనులు పూర్తి చేశారు. ఇంకా 8,455 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది మరో 29 పనులు మంజూరయ్యాయి. మొత్తం 8,484 పనులు ఉండగా, అందులో 838 పనులు మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన వాటిలో 2,242 పనులు జరుగుతుండగా, 5,388 పనులు ఇప్పటివరకు ప్రారంభమే కాలేదు. ఈ పనులకు విడుదలైన రూ.1.45 కోట్లలో ఇప్పటివరకు పూర్తయిన పనులకు రూ.85 లక్షలు ఖర్చు చేశారు. సకాలంలో నిధులను ఖర్చు చేయకపోవడంతో ఆ నిధులు వెనక్కు వెళ్లే పరిస్థితి నెలకొంటోంది. ఆలస్యంగా భవనాల పనులు.. పంచాయతీరాజ్‌శాఖ ఇంజినీరింగ్ అధికారుల పరిధిలో జిల్లాలో అంగన్వాడీ, సీడీపీఓ, వెటర్నరీ, గ్రామపంచాయతీ భవనాలను నిర్మించాలని ప్ర భుత్వం ఆదేశాలిచ్చింది. ఆ పనులకు గాను నిధులు సైతం విడుదలయ్యాయి. క్షేత్రస్థాయిలో ఆ భవనాల పనులు ముందుకు సాగడంలేదు. పం చాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు సరైన శ్రద్ధ చూపకపోవడంవల్లే పనులు ఆలస్యంగా జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో 856 అంగన్వాడీ భవనాలు మంజూరుకాగా అందులో 240 భవనాలు పూర్తి చేశారు. 616 భవనాల పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఎస్డీపీ కింద 184 అంగన్వాడీ భవనాలు మంజూరవగా అందులో 126 పూర్తి చేశారు. 58 పెండింగ్‌లో ఉన్నాయి. గ్రామపంచాయతీ పనుల్లో 587కు గాను 429ని పూర్తి చేశారు. 158 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా యంత్రాంగం, జెడ్పీ సీఈఓ పనులపై సమీక్షలు, పర్యవేక్షించకపోవడం వల్లే ఆ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. నాకు తెలియదు...ఈఈలను అడిగి తెలుసుకోండి పనుల పెండింగ్ వివరాలు నాకు తెలియదు. మండలాల ఈఈలను అడిగి తెలుసుకోండి. వారు అక్కడ సమస్యలను చెబుతారు. సీసీ రోడ్లు లక్ష్యం మేరకు పనులు నిర్వహించాం. –అమరనాథరెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ -
అలా సాగు..తున్నాయి
శ్రీకాకుళం, ఎచ్చెర్ల క్యాంపస్/ రణస్థలం: 16వ నంబరు జాతీయ రహదారిపై నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అతివేగానికి పెట్టింది పేరైన ఈ రహదారిపై ఏ కారణంతోనైనా ట్రాఫిక్ సమస్య తలెత్తినా దారి పొడవునా వాహనాలు నిలిచిపోయే పరిస్థితి. దీనికితోడు ఏదో ఒకచోట ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని విస్తరణ పనులు వేగవంతం చేయాలి. అయితే పక్క జిల్లాలతో పోల్చితే మన జిల్లాకు సంబంధించి పనుల్లో జాప్యమవుతోంది. ఇప్పటికీ భూములు కోల్పోయిన వారికి పరిహారాలు చెల్లింపులో, బైపాస్ భూ సేకరణలో వేగవంతం కావడంలేదు. జిల్లాలో పైడిభీమవరం నుంచి ఇచ్ఛాపురం వరకు 16వ నంబరు జాతీయ రహదారి విస్తరించి ఉండగా, ట్రాఫిక్, ప్రమాదాలు, వాహనాల రాకపోకల సంఖ్య ఆధారంగా రణస్థలం నుంచి నరసన్నపేట వరకు 54.20 కిలోమీటర్లు ఆరులైన్లుగా విస్తరిస్తున్నారు. నరసన్నపేటలో ఇప్పటికే బైపాస్ నిర్మాణం నాలుగు లైన్ల విస్తరణ సమయంలోనే పూర్తయ్యింది. ప్రస్తుతం ఎచ్చెర్లలో కింతలిమిల్లు నుంచి చిలకపాలెం టోల్‌ప్లాజా వరకు ఐదు కిలోమీటర్లు బైపాస్ నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకోసం 81.77 ఎకరాల సేకరణ చేపట్టారు. రణస్థలం నుంచి లావేరు మండలం రావివలస వరకు మూడున్నర కిలోమీటర్లు బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. ఈ నిర్మాణానికి 66.36 ఎకరాలు సేకరిస్తున్నారు. భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వ ధరలు, పట్టణ ప్రాంతాల ఆధారంగా డబ్బులు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. భూ సేకరణ రెవెన్యూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో చురుగ్గా సాగని పనులు రణస్థలం నుంచి నరసన్నపేటకు ఆరులైన్లు, రెండు బైపాస్ రోడ్ల నిర్మాణం పనులు ఆఫ్కో ఇన్ఫ్రా సంస్థ టెండర్లు దక్కించుకుంది. అంచనా విలువ రూ. 1,665 కోట్లు, రోడ్డు నిర్మాణానికి రూ.1,183 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ఈ సంస్థ ఎచ్చెర్ల సమీపంలో స్థలం లీజుకు తీసుకుని సామగ్రి, సిబ్బంది నివాసాలు కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరులైన్ల రోడ్డు నిర్మాణానికి సిబ్బంది సర్వే, నిర్మాణ పాయింట్లు గుర్తింపు పూర్తి చేశారు. సిమెంట్, కాంక్రీట్, బీటీ ఇలా మూడు లేయర్లతో రోడ్డు నిర్మాణం చేపడతారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం నుంచి రణస్థలం వరకు, జిల్లా పరిధిలో పైడిభీమవరం నుంచి రణస్థలం వరకు ఆరులైన్ల విస్తరణ పనులు పూర్తవుతున్నాయి. ఈ ప్రాజెక్టు టెండరును అశోక్ బిల్డర్స్ కాంట్రాక్టు సంస్థ రూ. 1,187 కోట్లకు దక్కించుకుంది. మొత్తంగా 48 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. ప్రమాదాల నియంత్రణకు మార్గం ప్రస్తుతం బైపాస్, ఆరులైన్ల రోడ్లు పూర్తయితే ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. భారీ వాహనాలు బైపాస్ రోడ్డుపై నుంచి తరలించొచ్చు. పెరుగుతున్న వాహన రవాణాకు సైతం సరిపడే వ్యవస్థ వస్తుంది. బైపాస్ భూసేకరణ నష్టపరిహారం చెల్లింపులు పూర్తయిన వెంటనే పనలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. రణస్థలం నుంచి ఆరులైన్ల రోడ్డు నిర్మాణం చేపట్టేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంజినీరింగ్ సిబ్బంది నిరంతరం జాతీయ రహదారిపై సర్వే నిర్వహిస్తున్నారు. మరోవైపు శాటిలైట్ సర్వేలు సైతం అనేకసార్లు చేశారు. కాంట్రాక్టు గడువులోపు పూర్తి కావాలంటే వేగవంతం చేస్తేనే సాధ్యమవుతోంది. గడువులోగా పనులు పూర్తవుతాయి 2017 నవంబరులో ప్రారంభించిన ఈ పనులకు కాంట్రాక్టు గడువు 2020 మే 14 వరకు ఉంది. ఆలోగా ఆరు లైన్ల విస్తరణ, బైపాస్ రోడ్లు పూర్తవుతాయి. రోడ్ల నిర్మాణ పనులు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహిస్తాం. ప్రస్తుతం వాహనాల రాకపోకలు, భవిష్యత్తు అవకాశాల ఆధారంగా పనులు చేస్తున్నాం. రోడ్డు నిర్మాణానికి సంబంధించి పనులు కొనసాగుతున్నాయి. – జేసీహెచ్ వేంకటరత్నం, ఎన్‌హెచ్ విశాఖపట్నం ప్రాంతీయ ప్రాజెక్టు డైరెక్టర్ -
ఆదిలోనే హంసపాదు..
పేరుకే జాతీయ రహదారి.. పంచాయతీలో వేసే అంతర్గత రహదారుల కంటే అధ్వానంగా నిర్మిస్తున్నారు. చాలా చోట్ల రహదారి కుంగిపోతుండగా అప్పుడే దానికి మరమ్మతులు చేస్తున్నారు. జాతీయ రహదారి నాణ్యతపై స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణాజిల్లా, కృత్తివెన్ను: పశ్చిమగోదావరి జిల్లా దిగమర్రు నుంచి ప్రకాశం జిల్లా ఒంగోలు వరకు విస్తరించిన 216 జాతీయ రహదారి కృత్తివెన్ను మండలంలో పల్లెపాలెం వద్ద నుంచి మునిపెడ వరకు సుమారు 20 కిలోమీటర్లు మేర ఉంది. పల్లెపాలెం నుంచి గరిశపూడి వరకు జరుగుతున్న పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో పాటు ఈ ప్రాంతంలో ఇప్పటికే మొదటి లేయర్ పూర్తిచేసుకున్న చోట సిమెంటు రోడ్డు అడ్డంగా రెండుగా చీలిపోవడంతో ఇదేనా జాతీయ రహదారి అంటూ స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. అడుగడుగునా పగుళ్లే.. పల్లెపాలెం వద్ద నుంచి గరిశపూడి వరకు చాలా మేర సింగిల్ లైన్ రహదారి మొదటి దశ పూర్తయింది. ఇక్కడ గరిశపూడి, సీతనపల్లి మెగా స్కీం, బోలుగొంది అడ్డరోడ్డు తదితర ప్రాంతాల్లో జాతీయ రహదారి పగుళ్లిచ్చింది. వేసిన సిమెంటు రోడ్డు అడ్డంగా రెండుగా చీలిపోయే రీతిలో పగుళ్లివ్వడంతో ప్రతిష్టాత్మకమైన జాతీయ రహదారి నిర్మాణంపై స్థానికుల్లో పలు అనుమానాలకు దారితీస్తుంది. సిమెంటు రోడ్డు నిర్మాణం తరువాత వాటర్ క్యూరింగ్ విషయంలోనూ సరైన శ్రద్ధ చూపలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తూతూమంత్రంగా ఎర్త్ వర్క్ జాతీయ రహదారి నిర్మాణ సమయంలో ఎర్త్ వర్కును పటిష్టంగా చేయాల్సిన అవసరం ఉంది. రోడ్డు మొత్తానికి ఎర్త్ వర్కే కీలకం. కానీ ఇక్కడ మాత్రం ఎర్త్ వర్క్ పనుల సమయంలో సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించలేదన్న విమర్శలున్నాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ రహదారి నిర్మాణం పూర్తికాకుండానే కొన్ని చోట్ల రోడ్డు కుంగిపోతుంది. సీతనపల్లి మెగాస్కీం సమీపంలో ఇదే తరహాలో రోడ్డు దెబ్బతినడం దాన్ని సరిచేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆదిలోనే ఇలా ఉంటే భవిష్యత్తులో రహదారి భద్రత ఎలా ఉం టుందన్న సందేహం ప్రజల్లో వ్యక్తమవుతుంది. రహదారి నిర్మాణ సమయంలో సరైన ప్రాథమిక చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బోలుగొంది అడ్డరోడ్డు, గరిశపూడి, మాట్లాం తూము, అంబేడ్కర్ నగర్ తదితర ప్రాంతాల్లో చిన్నపాటి చినుకు పడితే వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఉంటుంది. ఈ ప్రదేశాల్లో ప్రమాదాలు సైతం నిత్యకృత్యమయ్యాయి. వీటిపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారి పగుళ్లపై సంబంధిత అధికారులను ప్రశ్నించగా రోడ్డును పూర్తిస్థాయిలో నాణ్యతగా తమకు అప్పగించాల్సిన బాధ్యత నిర్మాణ కంపెనీదంటూ చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
అడ్డగోలు రోడ్లు!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని పలు ప్రధాన రహదారులు సైతం పరమ అధ్వానంగా ఉండి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నప్పటికీ పట్టించుకోని జీహెచ్ంఎసీ....అవసరం లేని ప్రాంతాల్లో మాత్రం ఇబ్బడిముబ్బడిగా రోడ్ల పనులు చేస్తోంది. ముఖ్యంగా, శివారు ప్రాంతాల్లో ఈ పనులెక్కువగా జరుగుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై విచ్చలవిడిగా అవసరమున్నా లేకపోయినా రోడ్ల పేరిట నిధులు కుమ్మరిస్తున్నారు. ఒకసారి వేసిన రోడ్లను తిరిగి తవ్వకుండా ఉండేందుకు వరదనీటి కాలువలతోపాటే డ్రైనేజీ, తాగునీటి పైప్లైన్ల పనులన్నీ పూర్తయ్యాకే రోడ్లను వేయాల్సి ఉండగా, వరదనీటి కాలువల సంగతటుంచి కనీసం తాగునీరు, డ్రైనేజీల పనులు మొదలేకాకున్నా లక్షలాది రూపాయలతో రోడ్ల పనులు చేస్తున్నారు. ఎవరి కమీషన్లు వారికి అందుతుండటంతో అసలక్కడ నిజంగా రోడ్లు వేయాల్సిన అవసరముందా..లేదా అన్నది కూడా పట్టించుకోకుండా ఎక్కడ పడితే అక్కడ రోడ్లు వేస్తున్నారు. సాధారణంగా ఏదైనా కాలనీలో రోడ్లు వేయాలంటే అక్కడి నివాస స్థలాల్లో దాదాపు 80 శాతం మేర ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాకే, తాగునీరు, డ్రైనేజీల పనులయ్యాక రోడ్లు వేయాలి. కానీ 20 శాతం మేర ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి కానప్పటికీ రోడ్లు వేస్తున్నారు. ఇలా రోడ్లు వేసినా, తర్వాత తాగునీరు, డ్రైనేజీ అవసరాల కోసం ఎలాగూ తవ్వాల్సి వస్తుంది కనుక నాణ్యతను పట్టించుకోకుండా నాసిరకం పనులతో పైపై పూతలతో మమ అనిపిస్తున్నారు. ఈ పనుల్లో ఎవరి కందాల్సిన వాటాలు వారికి అందుతుండటంతో ఎలాంటి అభ్యంతరాలు, ఆటంకాల్లేకుండా పనులు కానించేస్తున్నారు. రోడ్లువేసినా, కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పెరిగాక డ్రైనేజీ, తాగునీటి అవసరాల కోసం ఎలాగూ రోడ్లను తవ్వాల్సి ఉంటుంది కనుక నాణ్యతను పట్టించుకోవడం లేదు. ఆయా అవసరాల కోసం రోడ్లను తవ్వాక, తిరిగి మళ్లీ రోడ్లు వేయాలి కనుక ‘డబుల్ ధమాకా’గా కాంట్రాక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హడావిడిగా పనులు చేస్తున్నారు. ఇందుకు మచ్చుతునక ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని హస్తినాపురం డివిజన్లోని భూపేష్గుప్తానగర్ శ్రీరమణ కాలనీ, హనుమాన్‌నగర్ తదితర ప్రాంతాల్లోని పనులు. అక్కడ బీటీతోపాటు సీసీ రోడ్ల పనులు కూడా జరుగుతున్నాయి. ఎన్నికల సమయం కావడంతో ఎవరూ పట్టించుకోరనే తలంపుతో ఇష్టానుసారం అధికమొత్తాల అంచనాలతో పనులు చేపట్టారనే ఆరోపణలున్నాయి. అధికార వికేంద్రీకరణ పేరిట ప్రధాన కార్యాలయంలోని అధికారులు జోన్లు, సర్కిళ్లలో జరుగుతున్న పనులను పట్టించుకోకుండా స్థానిక అధికారులకు అధికారాలు కట్టబెట్టారు. పై స్థాయిలో ఆ పనుల్ని కనీసం తనిఖీలు చేస్తున్నవారు సైతం లేకపోవడంతో స్థానిక అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు ఆడింది ఆట.. పాడింది పాటగా సాగుతోంది. ఇలాంటి పనుల్లో కొన్నింటికి మంత్రుల స్థాయిలోని వారి నుంచి కూడా సిఫార్సులుండటంతో ఉన్నతాధికారులు మౌనం వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్ని ఆసరా చేసుకొని, ఎన్ని ప్రాంతాల్లో వీలైతే అన్ని ప్రాంతాల్లో రోడ్ల పేరిట నిధులు దుబారా చేస్తున్నారు.నాలుగైదు ఇళ్లు లేని చోట కూడా రోడ్లు వేస్తున్నారు. నిబంధనలు తుంగలో.. ఒకసారి రోడ్డు వేశాక తిరిగి తవ్వకుండా ఉండేందుకు డ్రైనేజీ, తాగునీటి పైపులైన్లు, తదితర పనులన్నీ పూర్తయ్యాకే రోడ్డు వేయాలి. ఈ నిబంధనల్ని తుంగలో తొక్కి రోడ్ల పనులు చేస్తున్నారు. నిజంగా ప్రజలకు అవసరమున్న చోట చేయకుండా అవసరం లేని చోట్ల జరుగుతున్న ఈ పనులు పలు విమర్శలకు తావిస్తున్నాయి. మరోవైపు ఆయా స్థలాల్లో రియల్ వ్యాపారం చేసేవారు రోడ్ల సదుపాయం కూడా ఉందని చెప్పి తమ ప్లాట్లకు డిమాండ్ పెంచుకునేందుకు రాజకీయ పైరవీలతో పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ ఉన్నా.. నగరంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొత్తగా ఎలాంటి పనులు చేపట్టడం కానీ, టెండర్లు పూర్తిచేయడం కానీ చేయరాదు. ఇప్పటికే ప్రారంభమై పురోగతిలో ఉన్న పనుల్ని మాత్రం పూర్తిచేయవచ్చు. దీన్ని అడ్డుపెట్టుకొని.. హడావుడిగా పనులు చేస్తూ కోడ్‌కు ముందే ప్రారంభమయ్యాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పరిశీలిస్తాం.. కాలనీలు ఏర్పడకున్నా.. అవసరం లేని ప్రాంతాల్లో రోడ్లు వేస్తుండటాన్ని జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ జియావుద్దీన్ దృష్టికి తీసుకెళ్లగా, పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. తాగునీరు, డ్రైనేజీలైన్లు వేశాకే రోడ్లు వేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. -
ప్రగతికి దారేది?
చిత్తూరు అర్బన్: రూ.వందల కోట్ల ప్రాజెక్టు.. 37 కి.మీ దూరం రోడ్డు.. ఇప్పటికి పూర్తయ్యింది 1.6 కి.మీ..ఉన్నది ఏడాది మాత్రమే గడువు..ఓ వైపు కలెక్టర్ నుంచి చీవాట్లు..మరోవైపు సమయం మించిపోతోంది..ఏం చేయాలి..? ఏం చేద్దాం..! ఇదీ.. చిత్తూరు వైపు జరుగుతున్న జాతీయ రహదారి పనులను సబ్ లీజుకు దక్కించుకున్న నలుగురు భాగస్వాముల ఆందోళన. అధికారమే పెట్టుబడిగా రూ.306 కోట్ల విలువైన పనులను బినామీ పేరిట సబ్ లీజుకు చేజిక్కించుకున్న చిత్తూరు జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి వ్యూహం బెడిసికొడుతోంది. చిత్తూరు మీదుగా జరుగుతున్న ఎన్‌హెచ్–4 పనులు పూర్తిగా స్తంభించడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచడం లేదు. అనుభవం లేకున్నా రూ.వందల కోట్ల విలువైన పనులు పూర్తిచేస్తే ఎటులేదన్నా రూ.50 కోట్ల వరకు మిగుల్చుకోవచ్చనుకున్న టీడీపీ ప్రజాప్రతినిధి పాచిక పారడం లేదు. జనం కంట్లో దుమ్ము.. బంగారుపాళ్యం మండలం నలగాంపల్లెనుంచి తమిళనాడులోని రాణిపేట సరిహద్దు ఉన్న ఆంధ్ర బార్డర్ వరకు చెన్నై–బెంగళూరు జాతీయ రహదారి నాలుగు లేన్ల విస్తరణ పనులను హైదరాబాద్‌కు చెందిన గాయత్రీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దక్కించుకుంది. కేంద్ర జాతీయ రహదారుల శాఖ ఇందుకోసం రూ.306 కోట్లు కేటాయించింది. గాయత్రీ కంపెనీ నుంచి జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి నాయుడు, పాలసముద్రం జెడ్పీటీసీ చిట్టిబాబు నాయుడు, మరో ఇద్దరు కలిసి ప్రాజెక్టు పనులను సబ్లీజుకు తీసుకున్నారు. ఈ పనులు ఆశించిన స్థాయిలో వేగంగా జరగడం లేదు. దీంతోపాటు మొదలైన పూతలపట్టు, పలమనేరు, మదనపల్లె జాతీయ రహదారుల విస్తరణ పనులు 70 శాతం పూర్తయితే చిత్తూరు ప్రోగ్రెస్ ఇందులో సగానికి కూడా చేరుకోలేదు. నిర్ణీత గడువు లోపు రోడ్డు పనులు పూర్తవుతాయో లేదో అనే సందిగ్ధత నెలకొంది. పనులు ప్రారంభించి ఏడాది కావస్తున్నా నిత్యం దుమ్ముధూళితో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. అయినా టీడీపీ నేతల్లో చలనం కనిపించడం లేదు. పుంజుకోని పనులు.. 37 కిలోమీటర్ల దూరం జరగాల్సిన రోడ్డు పనులు గతేడాది నవంబరు 15న ప్రారంభించారు. అగ్రిమెంటు ప్రకారం వచ్చే ఏడాది నవంబరు 14వ తేదీకి పూర్తి కావాలి. ఇప్పటివరకు రెండు నాలుగు లేన్ల రోడ్డులో 1.63 కి.మీ మాత్రమే వందశాతం పూర్తయ్యింది. చెరోవైపు అక్కడక్కడ రోడ్డు వేయడంతో సగటున 6.4కి.మీ పూర్తి చేశారు. ఈ దూరంలో 74 ప్రాంతాల్లో కల్వర్టులు నిర్మించాల్సి ఉంది. 32 మాత్రమే పూర్తి చేశారు. ఇందుకు దశలవారీగా రూ.56.26 కోట్ల బిల్లులు కూడా తీసుకున్నారు. ప్రస్తుతం పనులు నిలిచిపోయి వారం రోజులవుతోంది. చేసిన కొద్దిపాటి పనులకు బిల్లులు వస్తేనే మళ్లీ మొదలుపెట్టాలని టీడీపీ నేతలు భీష్మించుకూర్చోవడమే దీనికి ప్రధాన కారణం. కలెక్టర్ ఆగ్రహం.. ప్రతివారమూ ఎన్‌హెచ్–4 పనులను పర్యవేక్షిస్తూ కన్సల్టెన్సీగా వ్యవహరిస్తున్న ఆర్వీ కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ ప్రద్యుమ్న సమీక్ష నిర్వహిస్తున్నారు. గీర్వాణి ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల్లో తీవ్రజాప్యం నెలకొనడంతో కన్సల్టెన్సీపై కలెక్టర్ మండిపడుతున్నారు. పనులను జెడ్పీ చైర్పర్సన్ సబ్లీజుకు తీసుకుని నెమ్మదిగా చేస్తుండడం వల్ల ప్రాజెక్టులో జాప్యం నెలకొందని గతవారం జరిగిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అభివృద్ధి మంత్రం జపిస్తూ నటిస్తున్న టీడీపీ నేతలు ఇప్పటికైనా సామర్థ్యం ఉన్న వారికి పనులు అప్పగించి పక్కకు తప్పుకుంటారో.. చిత్తూరు అభివృద్ధికి గుదిబండగా మారతారోనని సామాన్యులు సైతం విమర్శలు ఎక్కుపెడుతున్నారు. -
గ్రీన్ హైవే.. టెన్షన్
మోర్తాడ్(బాల్కొండ): గ్రీన్ హైవే నిర్మాణం ఏమో కానీ, రైతుల్లో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఉన్న భూములు పోతే ఇక ఏం చేసుకుని బతికేదనే ఆందోళన అన్నదాతల్లో నెలకొంది. ముప్కాల్ మండలంలోని వేంపల్లి మీదుగా వెళ్లే 44వ జాతీయ రహదారి నుంచి మంచిర్యాల వరకు గ్రీన్ హైవే నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బోధన్ నుంచి జగదల్పూర్ వరకు 63వ జాతీయ రహదారి విస్తరించి ఉంది. ఈ రోడ్డును నాలుగు లేన్ల రహదారిగా మార్చాలని కేంద్రం తొలుత యోచించింది. అయితే, పెద్ద మొత్తంలో ఇళ్లు, చెట్లు, వ్యవసాయ భూములకు నష్టం కలగనుంది. అంతేకాక మిషన్ భగీరథ పథకానికి సంబంధించిన పైప్లైన్లకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. ఈ నేపథ్యంలో అన్ని కష్ట నష్టాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. సరికొత్త రహదారికి శ్రీకారం చుట్టింది. రైతులకు తీరని నష్టం.. ప్రస్తుతం ఉన్న 63వ జాతీయ రహదారిని విస్తరించడానికి బదులు మరో మార్గంలో కొత్త హైవేను నిర్మిస్తే తక్కువ నష్టంతో సరిపెట్టవచ్చని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. దీంతో వేంపల్లి నుంచి మంచిర్యాల వరకు 125 కిలోమీటర్ల పొడవున కొత్త రహదారిని నిర్మించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ మేరకు సర్వే ప్రక్రియ పూర్తి చేశారు. అయితే, కొత్తగా నిర్మించనున్న ఈ మార్గంలో చేసిన సర్వే ప్రకారం.. మన జిల్లాకు సంబంధించి వందలాది ఎకరాల భూముల్లోంచి ఈ కొత్త రోడ్డు నిర్మించనున్నారు. వేంపల్లి, రెంజర్ల, శెట్పల్లి, తొర్తి, తిమ్మాపూర్, ఏర్గట్ల గ్రామాలకు చెందిన రైతులు విలువైన పంట భూములు కోల్పోనున్నారు. త్వరలోనే నోటిఫికేషన్..! గ్రీన్ హైవే నిర్మాణంలో భాగంగా రోడ్డు నిర్మాణంలో భాగంగా నష్టపోయే చెట్ల స్థానంలో అధిక సంఖ్యలో మొక్కలను నాటడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు, హైవే నిర్మాణానికి సంబంధించిన సర్వే కూడా పూర్తికావడంతో త్వరలోనే భూ సేకరణకు నోటిఫికేషన్‌ను జారీ అయ్యే అవకాశం ఉంది. గ్రీన్ హైవే నిర్మాణానికి సేకరించే భూమికి నష్ట పరిహారం అందించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పరిశీలించనుంది. ఆందోళనలో రైతులు.. అయితే, రహదారి నిర్మాణం కోసం విలువైన భూములు కోల్పోతున్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల తరబడి ఆ భూములను నమ్ముకుని బతుకుతున్నామని, జీవనాధారమైన భూములు కోల్పోతే ఏం చేసుకుని బతకాలని వాపోతున్నా రు. నష్ట పరిహారం తమకు ముఖ్యం కాదని, కో ల్పోతున్న భూములకు బదులు భూములు ఇవ్వా లని రైతులు చెబుతున్నారు. తరతరాల నుంచి చేస్తున్న వ్యవసాయ భూములను కోల్పోవడం వ ల్ల భారీ మొత్తంలో నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ప్రత్యామ్నాయ మార్గం చూడాలని రైతులు కోరుతున్నారు. అయి తే, రహదారి నిర్మాణాలకు సహకరించాలని నేషన ల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పేర్కొంటున్నారు. ప్రమాదాల నివారణ, రవాణా సదుపాయం కోసం జాతీయ రహదారుల నిర్మా ణం, విస్తరణ కీలకమైదని వారు చెబుతున్నారు. -
మునగాల మండలంలో జానకీరామ్..
మునగాల (కోదాడ) : 2014డిసెంబర్ 6వ తేదీన 65వ నంబర్ జాతీయ రహదారిపై మునగాల మండలం ఆకుపాముల శివారులో సాయంత్రం 6.45గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ హీరో, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ రెండో కుమారుడు నందమూరి జానకీరామ్(38) దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ నుంచి తన సొంత కారు (టాటా సఫారీ ఈఎక్స్, ఏపీ 29 బీడీ-2323)లో విజయవాడలో జరిగే ఓ కార్యక్రమానికి వెళ్తుండగా నాలు గేళ్ల క్రితం ఈ ప్రమాదం సంభవించింది. ఆకుపాముల వద్ద వరినారుతో వస్తున్న ఓట్రాక్టర్(ట్రాలీ) రాంగ్రూట్లో రోడ్డును క్రాస్ చేస్తుండగా అదే సమయంలో అతివేగంగా వస్తున్న జానకీరామ్ కారు ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జుకాగా ట్రాలీ ఫల్టీ కొట్టింది. దీంతో కారులో ఉన్న జానకీరామ్ తీవ్రంగా గాయపడ్డారు. జానకీరామ్‌ను ముందుగా ఎవరూ గుర్తించలేదు. ప్రమాద సంఘటన తెలుసుకున్న పలువురు గ్రామస్తులు జానకీరామ్ సెల్‌ఫోన్ ద్వారా డైల్డ్కాల్కు రింగ్ చేయగా అవతల వైపు నుంచి హరికృష్ణ ఫోన్ ఎత్తడంలో ప్రమాదం జరిగిన వ్యక్తి జానకీరామ్గా గ్రహించారు. గాయపడ్డ జానకీరామ్‌ను గ్రామస్తులు 108లో కోదాడలోని తిరుమల ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో జానకీరామ్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లుగా ధ్రువీకరించారు. అతివేగమే ప్రమాదానికి కారణం ఈ రోడ్డు ప్రమాదానికి కారణం అతివేగమేనని పోలీసులు నాడు గుర్తించారు. దీనికి తోడు రహదారిపై వరినారుతో ఉన్నట్రాక్టర్, ట్రాలీ రాంగ్రూట్లో రోడ్డును క్రాస్ చేయడం మరొక కారణం. ఈ ప్రాంతంలో ఉన్న క్రాసింగ్ వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో తరచు ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. -
రోడ్ల దుస్థితిపై వైఎస్సార్సీపీ వినూత్న నిరసన