అధికారులతో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
పాలమూరు: మహబూబ్‌నగర్– జడ్చర్ల రోడ్డు వెడల్పు పనులు 14నెలల్లో పూర్తి చేసి జిల్లా ప్రజలకు కానుకగా ఇస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం ఈ రోడ్డు పనులను సంబంధిత అధికారులతో క లిసి మంత్రి పరిశీలించారు. అనంతరం ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆయన మా ట్లాడుతూ.. జడ్చర్ల నుంచి మహబూబ్‌నగర్ వ రకు ఉన్న రోడ్డు మార్గంలో కొన్ని ఏళ్లుగా దాదా పు వందలామంది ప్రాణాలు కోల్పోయినా గత ప్రభుత్వాలకు రోడ్డు వెడల్పు చేయాలన్నా సోయి లేకుండాపోయిందన్నారు. తెలంగాణ రా ష్ట్రం ఏర్పాటైన తర్వాత జిల్లా కేంద్రాలకు, మం డల కేంద్రాలకు, గ్రామీణా ప్రాంతాలకు రోడ్లు వేసి ప్రయాణికులకు సులభతరం చేయడం జ రిగిందన్నారు. ఎన్నో రోజుల నుంచి కలలు కం టున్న జడ్చర్ల–మహబూబ్‌నగర్ రోడ్డును ము ఖ్యమంత్రి చొరవతో పనులు ప్రారంభించుకున్నామన్నారు. అందరు అధికారుల సహకారంతో రోడుడ పనులు వేగంగా పూర్తిచేస్తామన్నా రు. భవిష్యత్‌లో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా తక్కువ సమయంలో గమ్యం చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు.
విస్తరణ పనులకు ప్రజలు సహకరించాలి
మహబూబ్‌నగర్ పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డు విస్తరణ పనులకు సహకరించాలని మంత్రి కోరారు. దీని ద్వారా పనులు త్వరగా పూర్తి అయ్యి అన్ని రకాలుగా లాభాలు ఉంటాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా చర్చించి 167జాతీయ రహదారికి ఈ రోడ్డును అనుసంధానం చేసినట్లు తెలిపారు. మహబూబ్‌నగర్ పట్టణంలో ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు ఉండే ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేశామని తెలిపారు. కొందరు వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డు విస్తరణ పనులకు సహకారం అందిస్తున్నారని మిగతా వారు కూడా ఇద్దే పద్ధతిలో సహకరించాలని కోరారు. పాలమూరు పట్టణం హైదరాబాద్ నగరానికి ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని ఈ అభివృద్ధిలో అందరూ బాగస్వామ్యం కావాలన్నారు. ఇప్పటికే ఐటీ కారిడార్ తీసుకురావడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment