సాక్షి, విశాఖ: విశాఖ జిల్లాలో మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. జిల్లాలోని జీకే వీధి మండలం కుంకుంపూడిలో శుక్రవారం అర్థరాత్రి ఓ జేసీబీని దగ్ధం చేశారు. స్థానికంగా రోడ్డు పనులు జరుగుతున్నాయి. వాటిని అడ్డుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న జేసీబీకి నిప్పు పెట్టారు.
ఇద్దరు గిరిజనులను తమ వెంట తీసుకెళ్లారు. దీంతో అక్కడి గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కొంతకాలంగా ఈ రహదారి నిర్మాణాన్ని మావోలు వ్యతిరేకిస్తున్నారు. కానీ భద్రతా దళాల పర్యవేక్షణలో రహదారి నిర్మాణం జరుగుతోంది. సిబ్బంది లేని సమయంలో మావోయిస్టులు ఈ సంఘటను పాల్పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment