
హరిత రహదారికి అడ్డంగా విజయనగర్ హెచరీస్ నిర్మించిన కంచె
విశాఖపట్నం– రాయపూర్ హరిత రహదారి పనులను విజయనగరం హెచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం అడ్డుకుంది.
మెంటాడ (విజయనగరం జిల్లా): విశాఖపట్నం– రాయపూర్ హరిత రహదారి పనులను విజయనగరం హెచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం అడ్డుకుంది. రోడ్డు విస్తరణ పనుల కోసం తమ నుంచి సేకరించిన నాలుగు ఎకరాల భూమికి పరిహారం చెల్లించలేదని ఆరోపిస్తూ మెంటాడ మండలం అమరాయవలస వద్ద మంగళవారం రాత్రి రోడ్డుకు అడ్డంగా స్తంభాలు వేసి కంచె నిర్మించింది.
పరిహారం అందించే వరకు కంచె తొలగించేది లేదని హెచరీస్ యాజమాన్య ప్రతినిధులు స్థానిక విలేకరులకు తెలిపారు. రోడ్డు పనులు పూర్తవుతున్నా జాతీయ రహ దారి అధికారులు పరిహారం చెల్లించేందుకు చొరవ చూపడంలేదని ఆరోపించారు. అందువల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ విషయం హైవే అధికారులకు తెలియనట్టు సమాచారం. (క్లిక్: హంగేరీ క్రికెట్ జట్టులో రాణిస్తున్న సిరిపురం కుర్రోడు)