Highway construction
-
ఛార్జింగ్ స్టేషన్లు అవసరం లేని ఎలక్ట్రిక్ వాహనాలు..!
ఇకపై భవిష్యత్తు రవాణా ఇదే.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో అందరూ ఎలక్ట్రిక్ వాహనాలవైపు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టిసారించేలా వినియోగదారులను ప్రోత్సహిస్తోంది. దాంతో పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో కరెంట్‌తో నడిచే భారీ వాహనాలు వస్తున్నాయి. అధిక లోడుతో వెళ్లే ఇవి ఎక్కువగా హైవేలపై కనిపిస్తుంటాయి. వీటికి పెద్దమొత్తంలో కరెంట్ అవసరం అవుతోంది. మధ్యలో ఛార్జింగ్ అయిపోయినా లేదా ఛార్జింగ్ కోసం ఎక్కడైనా ఆగినా సమయం వృథా అవుతుంది. కాబట్టి విద్యుత్‌తో నడిచే భారీ ట్రక్కులపై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపడంలేదు. కానీ అలాంటి వారితోపాటు తరచూ సుదూర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ప్రభుత్వం ఎలక్ట్రిక్ హైవేలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో విదేశీ తరహాలో దేశంలో మొదటిసారిగా హైవేలో ఎలక్ట్రిసిటీ సిస్టమ్ టెక్నాలజీ రాబోతోంది. ఇకపై హైవేలో వెళ్లే భారీ వాహనాలు పవర్ ద్వారా నడవనున్నాయి. రైళ్లు, మెట్రో ట్రెయిన్లు ఎలా అయితే కరెంటుతో నడుస్తున్నాయో అలానే హైవే ఎలక్ట్రిక్ వాహనాలు కూడా పరుగులు పెట్టనున్నాయి. గతంలో ఈ ఎలక్ట్రిక్ హైవే టెక్నాలజీని జర్మనీ మొదటిసారి ఉపయోగించింది. ఇందులో భాగంగా హైవేపై వెళ్లే ట్రక్కుల పైభాగంలో రైళ్ల మాదిరి కరెంట్ సరఫరా కోసం ప్రత్యేక ఏర్పాటు ఉంటుంది. దాని నుంచి ట్రక్కులోని బ్యాటరీల్లోకి విద్యుత్ సరఫరా అవుతుంది. అవి రీచార్జ్ అవుతూ ట్రక్కు ముందుకుసాగుతుంది. హైవే నుంచి డైవర్షన్ తీసుకున్న తర్వాత ఎలాగూ అప్పటికే బ్యాటరీలు ఛార్జ్ అవుతాయి కాబట్టి అందులోని విద్యుత్‌ను వినియోగించుకుని వాహనం కదులుతుంది. ఈ టెక్నాలజీతో మార్గం మధ్యలో మళ్లీ ఛార్జింగ్ చేసుకోకుండా వాహనం కదులుతున్నప్పుడే చార్జ్ అయ్యే వెసులుబాటు ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి: కొత్త సంవత్సరంలో రూపాయి దారెటు? సోలార్ ఎనర్జీ సాయంతో రహదారులపై ట్రక్కులు, బస్సులు పరుగులు పెట్టేందుకు వీలుగా ఎలక్ట్రిక్ హైవేలు అభివృద్ధి చేయబోతున్నట్లు ఇటీవల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం సోలార్, పవన విద్యుత్ ఆధారిత ఛార్జింగ్ మెకానిజంను ఉపయోగించుకోవాలన్న దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉందని మంత్రి అన్నారు. దిల్లీ-జైపుర్ మధ్య భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ హైవేను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే జర్మనీ, స్వీడన్, నార్వే వంటి దేశాల్లో ఈ సాంకేతికతను వినియోగిస్తున్నారని తెలిపారు. రహదారిపై ఏర్పాటు చేసిన పవర్ కేబుళ్ల విద్యుత్‌ను వాడుకొని వాహనాలు సునాయాసంగా ప్రయాణిస్తాయన్నారు. -
2024 కల్లా అమెరికాకు దీటుగా రోడ్లు: నితిన్ గడ్కరీ
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్లను 2024 నాటికి అమెరికాకు దీటుగా తీర్చిదిద్దుతామన్నారు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. లఖ్‌నవూలో జరిగిన ‘ఇండియన్ రోడ్డు కాంగ్రెస్’ 81వ సదస్సులో రోడ్ల నిర్మాణంపై ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌కు రూ.8,000 కోట్లు విలువ చేసే రోడ్డు ప్రాజెక్టులను ప్రకటించారు. ఉత్తర్‌ప్రదేశ్ రహదారులను అగ్రరాజ్యానికి దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం త్వరలోనే రూ.5 లక్షల కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు నితిన్ గడ్కరీ. ఈ ఏడాది ఆగస్టులో రాజ్యసభలో మాట్లాడుతూ భారత్‌లోని రోడ్ల మౌలిక సదుపాయాలు త్వరలోనే అమెరికా తరహాలో ఉంటాయని పేర్కొన్నారు. రహదారుల నిర్మాణానికి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ‘షాహబాద్-హర్దోర్ బైపాస్, షాజహాన్‌పుర్ టూ షాహబాద్ బైపాస్, మోరాబాద్- థాకుర్వారా-కషిపుర్ బైపాస్, ఘాజిపుర్-బలియా బైపాస్‌లతో పాటు 13 ఆర్వోబీలు, మొత్తం రూ.8వేల కోట్లు ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. సాంకేతికత, పర్యావరణ పరిక్షణ, వినూత్నత, భద్రత, నాణ్యత.. వంటి అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రహదారుల అభివృద్ధి జరగాలి.’ అని గడ్కరీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్‌తో కాకుండా సీఎన్జీ, ఇథనాల్, మిథనాల్‌తో నడిచే వాహనాలను ఉపయోగించాలని పిలుపునిచ్చారు గడ్కరీ. విద్యుత్తు వాహనాలను వినియోగించాలన్నారు. ఫలితంగా రవాణ వ్యయాలు తగ్గుతాయన్నారు. మరోవైపు.. లక్నోలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు గడ్కరీ. యూపీలో జాతీయ రహదారుల నిర్మాణంపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: రాహుల్ అంటే భారత్.. భారత్ అంటే రాహుల్: యూపీ కాంగ్రెస్ -
అమరాయవలసలో హైవేకు అడ్డంగా కంచె
మెంటాడ (విజయనగరం జిల్లా): విశాఖపట్నం– రాయపూర్ హరిత రహదారి పనులను విజయనగరం హెచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం అడ్డుకుంది. రోడ్డు విస్తరణ పనుల కోసం తమ నుంచి సేకరించిన నాలుగు ఎకరాల భూమికి పరిహారం చెల్లించలేదని ఆరోపిస్తూ మెంటాడ మండలం అమరాయవలస వద్ద మంగళవారం రాత్రి రోడ్డుకు అడ్డంగా స్తంభాలు వేసి కంచె నిర్మించింది. పరిహారం అందించే వరకు కంచె తొలగించేది లేదని హెచరీస్ యాజమాన్య ప్రతినిధులు స్థానిక విలేకరులకు తెలిపారు. రోడ్డు పనులు పూర్తవుతున్నా జాతీయ రహ దారి అధికారులు పరిహారం చెల్లించేందుకు చొరవ చూపడంలేదని ఆరోపించారు. అందువల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ విషయం హైవే అధికారులకు తెలియనట్టు సమాచారం. (క్లిక్: హంగేరీ క్రికెట్ జట్టులో రాణిస్తున్న సిరిపురం కుర్రోడు) -
దేశంలోనే తొలి 'ఎలక్ట్రిక్ హైవే'.. ఆ నగరాల మధ్య నిర్మాణం!
ఢిల్లీ: దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ హైవేను నిర్మించేందుకు ప్రణాళిక రచిస్తోంది భారత ప్రభుత్వం. తొలి రహదారిని దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలమధ్య నిర్మించనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ రహదారిపై ట్రాలీబస్సుల మాదిరిగానే ట్రాలీ ట్రక్కులను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గడ్కరీ తెలిపారు. దాని ద్వారా కాలుష్యం తగ్గటంతో పాటు సామర్థ్యం పెరుగుతుందన్నారు. ఢిల్లీలో నిర్వహంచిన హైడ్రాలిక్ ట్రైలర్ ఓనర్స్ అసోసియేషన్ కార్యక్రమం వేదికగా తొలి ఎలక్ట్రిక్ హైవే వివరాలను బహిర్గతం చేశారు గడ్కరీ. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.2.5 లక్షల సొరంగాలను నిర్మించినట్లు తెలిపారు. 'ఢిల్లీ నుంచి ముంబై వరకు ఎలక్ట్రిక్ హైవే నిర్మించాలని ప్రణాళిక చేస్తున్నాం. ట్రాలీబస్సుల మాదిరిగానే మీరు ట్రాలీట్రక్కులను ఈ దారిలో తీసుకొస్తాం.' అని తెలిపారు. అయితే.. ఈ రహదారి గురించి పూర్తి వివరాలను వెల్లడించలేదు. ఎలక్ట్రిక్ హైవే అంటే ఏమిటి? ఎలక్ట్రిక్ హైవే అనగానే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. వాహనాలకు ఈ రహదారులపై వెళ్తున్న క్రమంలో ఓవర్‌హెడ్ విద్యుత్తు లైన్ల ద్వారా పవర్ సరఫరా చేస్తారు. రైల్వే ట్రాక్‌ల మాదిరిగానే ఉంటాయి. హైవే పొడవున ఓవర్‌హెడ్ విద్యుత్తు లైన్లు ఏర్పాటు చేస్తారు. ట్రాలీబస్సులు, ట్రాలీట్రక్కులను ఉపయోగించటం ద్వారా కాలుష్యం తగ్గటంతో పాటు రవాణా సామర్థ్యం పెరుగుతుందనేది కేంద్రం ఆలోచన. మరోవైపు.. పెట్రోల్, డీజిల్‌ల ద్వారా కాలుష్యం పెరిగిపోతున్న క్రమంలో భారీ వాహనాల ఓనర్లు ఇథనాల్, మెథనాల్, గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయాలవైపు వెళ్లాలని కోరారు నితిన్ గడ్కరీ. అలాగే.. అన్ని జిల్లా కేంద్రాలను నాలుగు లైన్ల రహదారులతో అనుసంధానిస్తామన్నారు. ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోతుందని, ఆర్టీఓల ద్వారా అందే సేవలను డిజిటలైజ్ చేస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించటమే తమ లక్ష్యమన్నారు. వస్తు రవాణా వ్యయం చైనా, ఐరోపా, అమెరికాలతో పోలిస్తే భారత్‌లోనే అధికమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: Reverse Waterfall: ఆకాశంలోకి ఎగిరే జలపాతాన్ని ఎప్పుడైనా చూశారా? -
బెంగళూరు–బెజవాడ @ 370 కిలో మీటర్లు
సాక్షి, అమరావతి: సాగిపో.. హాయిగా అంటూ రానున్న రోజుల్లో బెంగళూరు నుంచి విజయవాడకు ఎంచక్కా రోడ్డు ప్రయాణం చేయవచ్చు. ప్రస్తుతం బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకోవాలంటే పలు మలుపులు తిరుగుతూ 560 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేయాలి. వామ్మో.. బెంగళూరు నుంచి విజయవాడకు రోడ్డు ప్రయాణమా అంటూ భయపడే పరిస్థితి ఉంది. ఈ ఇబ్బందులు త్వరలో తీరనున్నాయి. త్వరలో దాదాపు 370 కిలోమీటర్ల అధునాతన రహదారి అందుబాటులోకి రానుంది. ఈ రోడ్డు మీదుగా పెద్దగా ప్రయాణ బడలిక లేకుండా తక్కువ సమయంలో సుఖంగా చేరుకోవచ్చు. బెంగళూరు నుంచి విజయవాడకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారతమాల ప్రాజెక్టు రెండోదశ కింద దాదాపు రూ.10 వేల కోట్లతో చేపట్టనున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందిస్తున్నారు. ఒక్క గ్రీన్‌ఫీల్డ్ హైవేతో రాష్ట్రమంతటికి కనెక్టివిటీ ఇప్పటివరకు విజయవాడ నుంచి బెంగళూరుకు నేరుగా సరైన రోడ్డు కనెక్టివిటీ లేదు. రెండు దశాబ్దాలుగా బెంగళూరుకు సరకు రవాణా కూడా బాగా పెరిగింది. కానీ సరైన రహదారి లేకపోవడంతో వ్యయప్రయాసలు ఎక్కువ అవుతున్నాయి. దీనికి పరిష్కారంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బెంగళూరు నుంచి విజయవాడ వరకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంతవరకు ఒక్క గ్రీన్‌ఫీల్డ్ హైవే కూడా లేని విషయాన్ని గుర్తుచేశారు. బెంగళూరు – విజయవాడ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే రూట్ మ్యాప్ బెంగళూరు నుంచి విజయవాడకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మిస్తే... ఆరు జిల్లాలకు బెంగళూరుతో కనెక్టివిటీ పెరుగుతుంది. మరోవైపు ఆ గ్రీన్‌ఫీల్డ్ హైవేను కోల్కత్తా – చెన్నై హైవే–65తో అనుసంధానిస్తారు. దీంతో శ్రీకాకుళం వరకు జాతీయ రహదారి మీదుగా కనెక్టివిటీ కల్పించినట్లు అవుతుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారతమాల రెండోదశ కింద ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. 2023 ఏడాదిలో ఈ హైవే నిర్మాణానికి సన్నాహాలు చేపడతామని కేంద్రం మొదట చెప్పింది. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒత్తిడి తేవడంతో ఈ ఏడాదే సన్నాహాలు మొదలుపెట్టి పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. కిలోమీటరుకు రూ.25 కోట్లు బెంగళూరు–విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం కేంద్ర రవాణా, జాతీయ రహదారులశాఖ మూడు రూట్ మ్యాప్‌లను ప్రతిపాదించింది. రూట్‌మ్యాప్‌ను నిర్ణయించేది రాష్ట్ర ప్రభుత్వమే. బెంగళూరు నుంచి అనంతపురం జిల్లాలోంచి పులివెందుల మీదుగా వైఎస్సార్, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల మీదుగా విజయవాడ వరకు హైవే నిర్మాణ రూట్‌మ్యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదించింది. ప్రస్తుతం ఉన్న రోడ్డు మార్గాన్ని బట్టి బెంగళూరు నుంచి విజయవాడకు 560 కిలోమీటర్ల దూరం ఉంది. సాధ్యమైనంత తక్కువ దూరంతో నిర్మించే గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను 370 కిలోమీటర్లు ఉండేలా డిజైన్‌ను ఖరారు చేశారు. కిలోమీటరుకు దాదాపు రూ.25 కోట్లు వెచ్చించి ఈ హైవే నిర్మిస్తారు. భూసేకరణ వ్యయం దాదాపు రూ.745 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ ప్రకారం ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేని దాదాపు రూ.10 వేల కోట్లతో నిర్మించనున్నారు. అందుకోసం డీపీఆర్ రూపొందించే బాధ్యతను టెండర్ల ద్వారా అర్వీ అసోసియేట్స్‌కు అప్పగించారు. ఈ హైవేతో ఇవీ ప్రయోజనాలు ► రెండు రాష్ట్రాల మధ్య వీలైనంత తక్కువ దూరంతో మెరుగైన రోడ్డు కనెక్టివిటీ సాధ్యపడుతుంది. ► ప్రస్తుతం ఉన్న రహదారితో నిమిత్తం లేకుండా వేరుగా నిర్మిస్తారు. ► హైవే వీలైనంతవరకు తక్కువ మలుపులతో నేరుగా ఉంటుంది. ► ఈ రోడ్డు మార్గంలో సమీప పట్టణ ప్రాంతాల నుంచి హైవే మీదకు చేరేందుకు, హైవే నుంచి బయటకు వచ్చేందుకు ప్రత్యేక అండర్‌పాస్‌లు నిర్మిస్తారు. ► హైవేకు ఇరువైపులా, మధ్యలో డివైడర్ పొడవునా పచ్చదనం పెంపొందిస్తారు. -
కిలోమీటర్‌కు రూ. 27 కోట్లు ఎక్కువ వ్యయం!
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో గత ప్రభుత్వ హయాంలో అత్యంత భారీ వ్యయంతో చేపట్టిన రహదారుల నిర్మాణ పనులను పున:సమీక్షించేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) కసరత్తు చేస్తోంది. పనులన్నింటినీ విడివిడిగా సమీక్షించి, రివర్స్ టెండరింగ్ ద్వారా ఖర్చు తగ్గించేందుకు ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలించనున్నారు. ఆర్భాటాలు, అనవసర ఖర్చులను తగ్గించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఆర్డీఏ అధికారులను ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రాధాన్యత ప్రకారం రోడ్ల నిర్మాణం ప్రస్తుతం రాజధానిలో జనాభా పెద్దగా లేదు కాబట్టి రోడ్లను మొదట రెండు వరుసలుగా నిర్మించాలని, అవసరాన్ని బట్టి విస్తరించేందుకు భూమిని అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు నిర్ణయించారు. జాతీయ రహదారికి అనుసంధానం చేసే రోడ్ల నిర్మాణానికి తొలుత ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందుకనుగుణంగా ఆయా రోడ్లకు రివర్స్ టెండరింగ్ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు రైతులకిచ్చిన ప్లాట్ల లేఔట్ల అభివృద్ధి పనులను చేపట్టేందుకు కసరత్తు ప్రారంభించారు. అనవసర వ్యయాన్ని తగ్గించి, వీటిలో కొన్నింటి విషయంలో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. న్యాయమూర్తులు, ఉన్నతాధికారుల కోసం నిర్మిస్తున్న 115 బంగ్లాల పనులు 25 శాతం కంటే తక్కువే జరిగాయి. ఇప్పటికే 75 శాతం పూర్తయిన ఉన్నతాధికారులు, ఉద్యోగుల నివాస భవనాల పనులు మరో రూ.2,830 కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యే పరిస్థితి ఉండడంతో వాటిని మొదలుపెట్టనున్నారు. వచ్చే నెలలో ఈ పనులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రహదారుల నిర్మాణంలో అవినీతి పర్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) రాజధానిలో దాదాపు రూ.13 వేల కోట్ల విలువైన 34 రోడ్ల పనులను 23 ప్యాకేజీలుగా విభజించి, వివిధ సంస్థలకు అప్పగించింది. కిలోమీటర్‌కు సగటున రూ.42 కోట్ల భారీ వ్యయంతో ఈ రోడ్ల పనులను చేపట్టడంపై అప్పట్లో ఆందోళన వ్యక్తమైంది. జాతీయ రహదారుల సంస్థ కిలోమీటర్‌కు కేవలం రూ.15 కోట్ల వ్యయంతో రోడ్లు నిర్మిస్తుండగా, రాజధాని అమరావతిలో గత ప్రభుత్వం అందుకు రెండు రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టడం గమనార్హం. అంటే ఒక్కో కిలోమీటర్‌కు రూ.27 కోట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రాజధానిలో పనుల విషయంలో సాధ్యమైనంత వరకు ఖర్చు తగ్గించాలని, అవసరాన్ని బట్టి రివర్స్ టెండరింగ్ చేపట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. నిధుల లభ్యతను బట్టి పనులు ‘‘రాజధానిలో ప్రాధాన్యతను బట్టి దశల వారీగా పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అనవసర వ్యయం తగ్గించాలని స్పష్టం చేశారు. రాజధానిలో పనుల విషయంలో నిధుల లభ్యతను బట్టి ముందుకెళతాం’’ – లక్ష్మీనరసింహం, సీఆర్డీఏ కమిషనర్ -
మార్చికి రెండు హైవే కారిడార్లు పూర్తి
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్రం మీదుగా వెళ్లే రెండు హైవే కారిడార్లు పూర్తికానున్నాయి. వీటిలో విజయవాడ–జగదల్పూర్ హైవే (ఎన్‌హెచ్–30) దాదాపు పూర్తయింది. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం నుంచి మైలవరం, తిరువూరు, భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం మీదుగా ఈ హైవే వెళుతుంది. 2015లో ప్రారంభమైన ఈ హైవే నిర్మాణంలో భూ సేకరణ ఇబ్బందులు లేకపోవడంతో త్వరితగతిన పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ భూభాగం పరిధిలో తిరువూరు వరకు సుమారు 90 కిలోమీటర్ల మేర ఈ హైవే ఉంటుంది. మొత్తం రెండు ప్యాకేజీలుగా విభజించి రూ.515 కోట్లతో ఈ కారిడార్ నిర్మాణం చేపట్టారు. ఈ హైవేలో ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత కొండపల్లి వద్ద అరకొరగా పనులు అసంపూర్తిగా ఉన్నాయి. దాదాపు మొత్తం 98 శాతం పనులు పూర్తి అయ్యాయి. అయితే కోస్తా రాస్తాగా పేరు గాంచిన కత్తిపూడి–ఒంగోలు హైవే (ఎన్‌హెచ్–216) పనులు మాత్రం మిగిలిపోయాయి. 2016లోనే ప్రారంభమైన కత్తిపూడి–ఒంగోలు హైవేలో ఒంగోలు వైపు పనులు మాత్రం పూర్తి కాలేదు. మొత్తం తొమ్మిది ప్యాకేజీలుగా విభజించి రూ.3,800 కోట్లతో పనులు చేపట్టారు. ఈ హైవేలో ఒక ప్యాకేజీ కింద మాత్రమే పనులు పూర్తి మిగిలిన 8 ప్యాకేజీల కింద పనులు సాగుతున్నాయి. మార్చి ఆఖరు నాటికి పనులు పూర్తి చేసేలా ఎన్హెచ్ఏఐ ఆదేశాలు జారీ చేసింది. కత్తిపూడి–కాకినాడ–దిగమర్రు–మచిలీపట్నం–ఒంగోలు వరకు ఈ జాతీయ రహదారిని నాలుగు, రెండు లేన్లుగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ రెండు హైవేలు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తీరడంతో పాటు పారిశ్రామికాభివృద్ధి వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. అనంత–అమరావతి ఎక్స్‌ప్రెస్ వే అలైన్మెంట్లో స్వల్ప మార్పు అనంతపురం నుంచి అమరావతి వరకు నిర్మించే ఎక్స్‌ప్రెస్ వే అలైన్మెంట్లో స్వల్ప మార్పు చేశారు. అనంతపురం నుంచి అమరావతి వరకు 385 కి.మీ. నిర్మించే ఈ ఎక్స్‌ప్రెస్ వేను గుంటూరు జిల్లా తాడికొండ మీదుగా అమరావతి రాజధాని వరకు నిర్మించేందుకు తొలుత ప్రతిపాదించారు. అయితే అనంతపురం నుంచి నేరుగా చిలకలూరిపేట బైపాస్కు అనుసంధానం చేస్తే 68 కి.మీ. మేర నిర్మాణం తగ్గుతుందన్న ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. ఏ ప్రాంతంలో అనుసంధానం చేయాలన్న విషయంలో నాలుగు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు. -
మరో హైవే..
ఖమ్మంఅర్బన్: వాణిజ్యపరంగా దూసుకుపోతున్న ఖమ్మం నగరం చుట్టూ జాతీయ రహదారులు విస్తరిస్తున్నాయి. నగరాన్ని ఆనుకుంటూ మరో నేషనల్ హైవే వెల్లబోతోంది. ఇప్పటికే సూర్యాపేట–ఖమ్మం–అశ్వారావు పేట జాతీయ రహదారికి సంబంధించిన నిధులు మంజూరై.. భూ సేకరణ పనులు దాదాపు పూర్తికాగా.. తాజాగా వరంగల్–ఖమ్మం నగరాలను కలుపుతూ ఇంకో నేషనల్ హైవే రాబోతోంది. సూర్యాపేట–అశ్వారావుపేట రహదారికి అనుసంధానం చేసే విధంగా నిర్మించే వరంగల్–ఖమ్మం నేషనల్ హైవేకు సంబంధించి.. ఒడిశాకు చెందిన ఎస్ఎం కన్సల్టెన్సీ ఏజెన్సీ బృందం మంగళవారం ప్రాథమిక సర్వే చేసింది. ఖమ్మం నగరం, రఘునాథపాలెం మండలాల సరిహద్దున ఉన్న పొలాల్లో సర్వే కొనసాగింది. గూగుల్ మ్యాప్ అధారంగా సర్వే చేశారు. వరంగల్ నుంచి ఖమ్మం వరకు సుమారు 112 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణం కోసం సర్వే చేస్తున్నారు. ఇప్పటివరకు 60 కిలో మీటర్ల మేర సర్వే పూర్తయినట్లు బృందం సభ్యులు తెలిపారు. వరంగల్ నుంచి ఖమ్మం రూరల్ మండలం మీదుగా రఘునాథపాలెం, ఖమ్మం నగరాన్ని కలుపుతూ.. కొణిజర్ల మండలం తనికెళ్ల వద్ద ఉన్న ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో.. సూర్యాపేట–అశ్వారావుపేట జాతీయ రహదారికి అనుసంధానం చేసే విధంగా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. మరో 10 రోజుల్లో సర్వే పూర్తవుతుందని సర్వే బృందంలోని సభ్యుడు ఒకరు తెలిపారు. రెండు నేషనల్ హైవేలు, ఔటర్ రింగురోడ్డు నిర్మాణాలు పూర్తయితే ఖమ్మం పరిసర ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకోనుంది. జిల్లాలోని ప్రధాన పరిశ్రమగా ఉన్న గ్రానైట్ వ్యాపారానికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. మార్కెటింగ్ పరంగా ముడి సరుకుల ఎగుమతి, దిగుమతులకు అనుకూలం కానుంది. ఔటర్ రింగ్‌రోడ్డు.. సూర్యాపేట–అశ్వారావుపేట, వరంగల్–ఖమ్మం జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ.. ఖమ్మం నగరం చుట్టూ ఔటర్ రింగ్‌రోడ్డు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అధికారులు సర్వే కూడా చేశారు. సుమారు 35 నుంచి 40 కిలోమీటర్ల మేర రోడ్డు కోసం ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. రింగ్ రోడ్డు కోసం ప్రభుత్వం రూ.200కోట్లు కేటాయించినట్లు ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుతోపాటు జాతీయ రహదారుల నిర్మాణంతో ఖమ్మం చుట్టూ రవాణాపరంగా సమస్యలు తొలగనున్నాయి. ప్రధానంగా ట్రాఫిక్ సమస్య చాలా వరకు తీరనుంది. -
ఓట్లు మేము వేస్తే.. రోడ్లు రాజులకేస్తారా?
తూర్పుగోదావరి, తాళ్లరేవు (ముమ్మిడివరం): జి.వేమవరం పంచాయతీలో నాన్‌లేఔట్ స్థలంలో లక్షలాది రూపాయల ప్రభుత్వ నిధులతో రహదారి నిర్మాణం చేపట్టడం పట్ల గ్రామస్తులు బుధవారం తీవ్ర ఆందోళన చేశారు. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్దకు గ్రామస్థులు అధిక సంఖ్యలో చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఓట్లు మేము వేయాలా...రోడ్లు రాజులకు వేస్తారా అంటూ ప్రజా ప్రతినిధులను నిలదీశారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అక్కడకు చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు గండి వీరబాబు, గండి సత్యనారాయణ, యర్రంనీడి అప్పారావు, అనుకూలి శ్రీనివాసరావు, పుణ్యమంతుల శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ గ్రామానికి ఏమాత్రం ఉపయోగ పడని సుబ్బరాజు అనే వ్యక్తి కోసం ఉపాధి, ఎస్డీఎఫ్ నిధులు వెచ్చించడం భావ్యమా అని ప్రశ్నించారు. ఈ రహదారి నిర్మాణానికి స్థానిక ఎంపీటీసీ కొబ్బరికాయ కొట్టడం దారుణమన్నారు. చర్చల సమయంలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు అనుకూలి శ్రీనివాసరావుపై ఎమ్మెల్యే సమక్షంలో కోరంగి ఎస్సై సుమంత్ దురుసుగా ప్రవర్తించడాన్ని గ్రామస్తులు తప్పుబట్టారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. గ్రామంలో అన్ని పరిస్థితులు తెలిసినా పట్టించుకోకుండా ప్రైవేటు వ్యక్తులకు రోడ్డు నిర్మించడంలో ఏఎంసీ చైర్మన్ మందాల గంగ సూర్యనారాయణ పాత్ర ప్రత్యక్షంగా ఉందన్నారు. నాన్ లేఅవుట్ స్థలంలో ప్రభుత్వ నిధులతో రహదారిని నిర్మించేందుకు సహకరించిన మండల ఇంజినీర్ నున్న వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై గంగ సూర్యనారాయణ మాట్లాడుతూ ఆ నిధులను రద్దు చేసి స్థానిక శ్మశాన వాటికకు వెళ్లే రహదారిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక నాయకులు గండి లోవరాజు, అనుకూలి రాము, శ్రీపాదం శ్రీనివాస్, గండి అప్పన్న, సీకాల రాంబాబు, అనుకూలి దుర్గారావు పాల్గొన్నారు. -
పుష్కరాలకు.. గోదారి సిద్ధం..
వేగంగా ముల్లకట్ట వారధి నిర్మాణం పుష్కరాల వరకు పనులు పూర్తి ఛత్తీస్‌గఢ్, తెలంగాణకు మెరుగుపడనున్న రవాణా వ్యవస్థ ఎన్‌హెచ్ -163 పనుల్లో కొనసాగుతున్న జాప్యం హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని భూపాలపట్నం వరకు చేపట్టిన 163వ జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో జాప్యం కొనసాగుతోంది. 350 కిలోమీటర్ల మేర చేపట్టాల్సిన రోడ్డు పనులు అక్కడక్కడా పలు అవాంతరాలతో ముందుకు సాగడంలేదు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఏటూరునాగారం మండలంలోని ముల్లకట్ట వద్ద గోదావరి నదిపై వంతెన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న గోదావరి పుష్కరాల వరకు ఈ వారధి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒప్పందం ప్రకారం ఈ పనులు మే నెల వరకు పూర్తి కావాలి. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్-163, ముల్లకట్ట బ్రిడ్జి నిర్మాణ పనులపై ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఎన్‌హెచ్-163 పరిస్థితి హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లా పస్రా వరకు 243 కి.మీ. మేర రోడ్డు పనులు పూర్తి. పస్రా నుంచి ఏటూరునాగారం తాళ్లగడ్డ వరకు 47 కి.మీ. రోడ్డు నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. వరంగల్ పరిధిలో తాళ్లగడ్డ నుంచి ముల్లకట్ట బ్రిడ్జి వరకు ఉన్న 11.5 కిలోమీటర్లలో 50 శాతం బీటీ రోడ్డు పనులు పూర్తి. ఖమ్మం జిల్లాలోని వాజేడు మండలం జగన్నాథపురం నుంచి టేకుపల్లి వరకు 7.5 కిలో మీటర్ల రోడ్డుపై కంకర, మెటల్ లెయర్, రోలింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఏటూరునాగారం : తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని భూపాలపట్నం వరకు చేపట్టిన 163వ జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతూనే ఉంది. ప్రధానంగా పస్రా నుంచి ఏటూరునాగారం తాళ్లగడ్డ వరకు 47 కి.మీల రోడ్డు నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ రోడ్డు పనులకు గతంలో అటవీశాఖ అధికారులు అడ్డు చెప్పారు. గత ఏడాది డిసెంబర్లో రోడ్డు పనులు చేసుకునేందుకు ఆ శాఖ శాఖ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చింది. కానీ, అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో ఈ పనులు ఇంతవరకు మొదలు కాలేదు. ఎన్‌హెచ్ పనుల్లో భాగంగా ఏటూరునాగారం మండలం ముల్లకట్ట వద్ద గోదావరి నదిపై చేపట్టిన బ్రిడ్జి పనులు మాత్రం శరవేగంగా కొనసాగుతున్నారుు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. 2012 ఫిబ్రవరిలో బ్రిడ్జి పనులు ప్రారంభంకాగా.. ఈ ఏడాది జూలైలో జరగనున్న గోదావరి పుష్కరాల వరకు పూర్తి చేసేందుకు అధికారులు కృషిచేస్తున్నారు. ఏటూరునాగారం తాళ్లగడ్డ నుంచి నుంచి గోదావరి బ్రిడ్జి వరకు 11.5 కిలో మీటర్లు, అవతలివైపున ఖమ్మం జిల్లాలో వాజేడు మండలంలో 7.5 కిలో మీటర్ల వరకు రోడ్డుతోపాటు బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 218.3 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇందులో బ్రిడ్జి నిర్మాణానికి రూ. 98 కోట్లు కేటాయించారు. వరంగల్ జిల్లా ఏటూరునాగారంలో 11.5 కిలోమీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణం ఉండగా.... స్లాబ్‌ల నిర్మాణం పూర్తరుుంది. 50 శాతం బీటీ రోడ్డు పనులు పూర్తి కాగా.. ఇంకా 50 శాతం బీటీ లేయర్లు వేయాలి. అరుుతే ఖమ్మం జిల్లా వైపు 7.5 కిలోమీటర్ల వరకు రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని వాజేడు మండలం జగన్నాథపురం నుంచి టేకుపల్లి వరకు ఉన్న 7.5 కిలోమీటర్ల రోడ్డుపై కంకర, మెటల్ లెవలింగ్, రోలింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లా వైపు రోడ్డు, లొటపెటల గండి, చీకుపల్లి, జగన్నాథపురం వద్ద బ్రిడ్జి నిర్మాణ కాంట్రాక్టు పనులు ఓ కంపెనీ దక్కించుకుని పనులను మధ్యలోనే వదిలేసి వెళ్లింది. ఆ పనులను కూడా ప్రస్తుత ముల్లకట్ట బ్రిడ్జి నిర్మాణం చేస్తున్న కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి అప్పగించారు. గోదావరి నదిపై 2.5 కిలో మీటర్ల పొడవుతో బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయి. వర్షాలు వస్తే పనులు నిలిచిపోయే అవకాశం ఉండడంతో కాంట్రాక్టర్లు త్వరగా పనులు పూర్తి చేసేందుకు పనులను వేగవంతం చేస్తున్నారు. వేసవి కాలంలో గోదావరి నీటి ప్రవహం తక్కువగా ఉండడంతో పిల్లర్లు వేసేందుకు మట్టికట్టలు నిర్మించి బీమ్‌లను అమర్చేందుకు సిద్ధం చేస్తున్నారు. రెండు పిల్లర్ల మధ్య నుంచి గోదావరి ప్రవహం ఉండే విధంగా మట్టిని నిర్మించారు. ఈ వైపు బీమ్‌లను అమర్చే క్రమంలో పూర్తిగా గోదావరిపై మట్టి పోస్తారు. గతంలో పూర్తయిన స్లాబ్‌ల మధ్య ఉన్న మట్టిని తొలగించి గోదావరి మళ్లిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురం నుంచి లోటపెటల గండి వరకు రోడ్డు పనులు, చీకుపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు మందకొడిగా సాగడంతో ఇచ్చిన గడువు తీరేపోయే అవకాశం ఉంది. గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం వర్షాకాలం రాకముందే పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు కృషిచేస్తున్నారు. 22 స్లాబ్‌లు, 37 బీమ్ల అమరిక పూర్తి వంతెన నిర్మాణంలో భాగంగా 44 పియర్స్ (పిల్లర్లు), బ్రిడ్జికి ఇరువైపులా రెండు అబట్మెంట్సు నిర్మాణ పనులు పూర్తయ్యూరుు. దీంతో స్లాబ్‌ల పనులు మొదలు పెట్టారు. ఇప్పటివరకు 22 స్లాబ్‌ల పనులు పూర్తి కాగా, 37వ పిల్లర్ వరకు బీమ్‌లను అమర్చారు. బీమ్ల వెల్డింగ్, సెంట్రింగ్ పనులు జరుగుతున్నాయి. ఒక్కో పిల్లర్ ఎత్తు భూమిపై నుంచి ఆయా ప్రదేశాన్ని బట్టి 11 మీటర్ల నుంచి 14 మీటర్ల వరకు నిర్మించారు. ప్రతి పియర్ నిర్మాణం పటిష్టంగా ఉండేందుకు 38 మీటర్ల మేర భూమి లోపలికి గొయ్యి తీసి 1.50 మీటర్ల డయా, ఇనుప చువ్వలతో బుట్టను అమర్చారు. బీమ్ల మధ్య సస్పెషన్ ఇచ్చే తీగలు పిల్లర్, పిల్లర్‌కు మధ్య ఒక్కో గర్డర్(బీమ్) 40 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. ఇప్పటి వరకు 120 గర్డర్స్‌ను పియర్స్పైకి చేర్చారు. ఇంకా కొన్ని సిద్ధంగా ఉండగా, మరికొన్నింటిని తయారు చేస్తున్నారు. స్లాబ్‌పై వాహనాల రాకపోకల క్రమంలో బ్రిడ్జిపై ఎలాంటి ఒత్తిడి పడకుండా బీమ్ మధ్యలో సస్పెషన్ తీగలను అమర్చారు. బ్రిడ్జి ఎత్తు 17.5 మీటర్లు.. 18 మీటర్ల వెడల్పు ముల్లకట్ట వద్ద గోదావరి నీటి మట్టాన్ని పరిగణనలోకి తీసుకొని బ్రిడ్జి ఎత్తును నిర్ణయించారు. మండలంలో ప్రధానంగా 1986లో గోదావరి వరదలు ఎక్కువగా వచ్చాయి. అప్పుడు అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అప్పటి గణాంకాలను లెక్కలోకి తీసుకుని అధికారులు 17.5 మీటర్ల ఎత్తులో బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. బ్రిడ్జిపైన 18 మీటర్ల వెడల్పుతో మూడు లేన్ల రోడ్డు ఉంటుంది. ఇంకా ఇరువైపులా 1.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్ నిర్మించారు. కుడి, ఎడమ వైపుల నుంచి నడిచిపోవడానికి వీలుగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. బ్రిడ్జి స్లాబ్‌లు పూర్తి కాగానే దానిపై బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. బ్రిడ్జి పనులు పూర్తయితే తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారిగా జరిగే పుష్కరాలకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ పనులను ఈఈ సత్యనారాయణ, డీఈఈలు మనోహర్, చంద్రశేఖర్, కృష్ణారెడ్డి, ఏఈఈలు అన్నయ్య, అమరేందర్, దేవేందర్, రామ్మూర్తి, బాబు, ప్రదీప్, తరుణ పర్యవేక్షిస్తున్నారు.