పుష్కరాలకు.. గోదారి సిద్ధం.. | Godari prepared to Pushkar | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు.. గోదారి సిద్ధం..

Published Wed, Apr 1 2015 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 PM

Godari prepared to Pushkar

వేగంగా ముల్లకట్ట వారధి నిర్మాణం
పుష్కరాల వరకు పనులు పూర్తి
ఛత్తీస్‌గఢ్, తెలంగాణకు మెరుగుపడనున్న రవాణా వ్యవస్థ
ఎన్‌హెచ్ -163 పనుల్లో కొనసాగుతున్న జాప్యం

 
 
హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని భూపాలపట్నం వరకు చేపట్టిన 163వ జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో జాప్యం కొనసాగుతోంది. 350 కిలోమీటర్ల మేర చేపట్టాల్సిన రోడ్డు పనులు అక్కడక్కడా  పలు అవాంతరాలతో ముందుకు సాగడంలేదు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఏటూరునాగారం మండలంలోని ముల్లకట్ట వద్ద గోదావరి నదిపై వంతెన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న గోదావరి పుష్కరాల వరకు ఈ వారధి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒప్పందం ప్రకారం ఈ పనులు మే నెల వరకు పూర్తి కావాలి.  ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్-163, ముల్లకట్ట బ్రిడ్జి నిర్మాణ పనులపై ప్రోగ్రెస్ రిపోర్ట్..

ఎన్‌హెచ్-163 పరిస్థితి

 హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లా పస్రా వరకు 243 కి.మీ. మేర రోడ్డు పనులు పూర్తి.   పస్రా నుంచి ఏటూరునాగారం తాళ్లగడ్డ వరకు 47 కి.మీ. రోడ్డు నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది.   వరంగల్ పరిధిలో తాళ్లగడ్డ నుంచి ముల్లకట్ట బ్రిడ్జి వరకు ఉన్న 11.5 కిలోమీటర్లలో 50 శాతం బీటీ రోడ్డు పనులు పూర్తి.  ఖమ్మం జిల్లాలోని వాజేడు మండలం జగన్నాథపురం నుంచి టేకుపల్లి వరకు 7.5 కిలో మీటర్ల రోడ్డుపై కంకర, మెటల్ లెయర్, రోలింగ్ పనులు కొనసాగుతున్నాయి.
 
 ఏటూరునాగారం :  తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని భూపాలపట్నం వరకు చేపట్టిన 163వ జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో జాప్యం  జరుగుతూనే ఉంది. ప్రధానంగా పస్రా నుంచి ఏటూరునాగారం తాళ్లగడ్డ వరకు 47 కి.మీల రోడ్డు నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ రోడ్డు పనులకు గతంలో అటవీశాఖ అధికారులు అడ్డు చెప్పారు. గత ఏడాది డిసెంబర్‌లో రోడ్డు పనులు చేసుకునేందుకు ఆ శాఖ శాఖ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చింది. కానీ, అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో ఈ పనులు ఇంతవరకు మొదలు కాలేదు. ఎన్‌హెచ్ పనుల్లో భాగంగా ఏటూరునాగారం మండలం ముల్లకట్ట వద్ద గోదావరి నదిపై చేపట్టిన బ్రిడ్జి పనులు మాత్రం శరవేగంగా కొనసాగుతున్నారుు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. 2012 ఫిబ్రవరిలో బ్రిడ్జి పనులు ప్రారంభంకాగా..  ఈ ఏడాది జూలైలో జరగనున్న గోదావరి పుష్కరాల వరకు పూర్తి చేసేందుకు అధికారులు కృషిచేస్తున్నారు.

ఏటూరునాగారం తాళ్లగడ్డ నుంచి నుంచి గోదావరి బ్రిడ్జి వరకు 11.5 కిలో మీటర్లు, అవతలివైపున ఖమ్మం జిల్లాలో వాజేడు మండలంలో 7.5 కిలో మీటర్ల వరకు రోడ్డుతోపాటు బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 218.3 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇందులో బ్రిడ్జి నిర్మాణానికి రూ. 98 కోట్లు కేటాయించారు. వరంగల్ జిల్లా ఏటూరునాగారంలో 11.5 కిలోమీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణం ఉండగా.... స్లాబ్‌ల నిర్మాణం పూర్తరుుంది. 50 శాతం బీటీ రోడ్డు పనులు పూర్తి కాగా.. ఇంకా 50 శాతం బీటీ లేయర్లు వేయాలి. అరుుతే ఖమ్మం జిల్లా వైపు 7.5 కిలోమీటర్ల వరకు రోడ్డు నిర్మాణ  పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని వాజేడు మండలం జగన్నాథపురం నుంచి టేకుపల్లి వరకు ఉన్న  7.5 కిలోమీటర్ల రోడ్డుపై కంకర, మెటల్ లెవలింగ్, రోలింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లా వైపు రోడ్డు, లొటపెటల గండి, చీకుపల్లి, జగన్నాథపురం వద్ద  బ్రిడ్జి నిర్మాణ కాంట్రాక్టు పనులు ఓ కంపెనీ దక్కించుకుని పనులను మధ్యలోనే వదిలేసి వెళ్లింది. ఆ పనులను కూడా ప్రస్తుత ముల్లకట్ట బ్రిడ్జి నిర్మాణం చేస్తున్న కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీకి అప్పగించారు. గోదావరి నదిపై 2.5 కిలో మీటర్ల పొడవుతో బ్రిడ్జి పనులు  ప్రారంభమయ్యాయి. వర్షాలు వస్తే పనులు నిలిచిపోయే అవకాశం ఉండడంతో కాంట్రాక్టర్లు త్వరగా పనులు పూర్తి చేసేందుకు పనులను వేగవంతం చేస్తున్నారు. వేసవి కాలంలో గోదావరి నీటి ప్రవహం తక్కువగా ఉండడంతో పిల్లర్లు వేసేందుకు మట్టికట్టలు నిర్మించి బీమ్‌లను అమర్చేందుకు సిద్ధం చేస్తున్నారు. రెండు పిల్లర్ల మధ్య నుంచి గోదావరి ప్రవహం ఉండే విధంగా  మట్టిని నిర్మించారు. ఈ వైపు బీమ్‌లను అమర్చే క్రమంలో పూర్తిగా గోదావరిపై మట్టి పోస్తారు. గతంలో పూర్తయిన స్లాబ్‌ల మధ్య ఉన్న మట్టిని తొలగించి గోదావరి మళ్లిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  ఖమ్మం జిల్లా జగన్నాథపురం నుంచి లోటపెటల గండి వరకు రోడ్డు పనులు, చీకుపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు మందకొడిగా సాగడంతో ఇచ్చిన గడువు తీరేపోయే అవకాశం ఉంది. గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం వర్షాకాలం రాకముందే పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు కృషిచేస్తున్నారు.

22 స్లాబ్‌లు, 37 బీమ్‌ల అమరిక పూర్తి

వంతెన నిర్మాణంలో భాగంగా 44 పియర్స్ (పిల్లర్లు), బ్రిడ్జికి ఇరువైపులా రెండు అబట్‌మెంట్సు నిర్మాణ పనులు పూర్తయ్యూరుు. దీంతో స్లాబ్‌ల పనులు మొదలు పెట్టారు. ఇప్పటివరకు 22 స్లాబ్‌ల పనులు పూర్తి కాగా,  37వ పిల్లర్ వరకు బీమ్‌లను అమర్చారు. బీమ్‌ల వెల్డింగ్, సెంట్రింగ్ పనులు జరుగుతున్నాయి. ఒక్కో పిల్లర్ ఎత్తు భూమిపై నుంచి ఆయా ప్రదేశాన్ని బట్టి 11 మీటర్ల నుంచి 14 మీటర్ల వరకు నిర్మించారు. ప్రతి పియర్  నిర్మాణం పటిష్టంగా ఉండేందుకు 38 మీటర్ల మేర భూమి లోపలికి గొయ్యి తీసి 1.50 మీటర్ల డయా, ఇనుప చువ్వలతో బుట్టను అమర్చారు.

బీమ్‌ల మధ్య సస్పెషన్ ఇచ్చే తీగలు

పిల్లర్, పిల్లర్‌కు మధ్య ఒక్కో గర్డర్(బీమ్) 40 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. ఇప్పటి వరకు 120 గర్డర్స్‌ను పియర్స్‌పైకి చేర్చారు. ఇంకా కొన్ని సిద్ధంగా ఉండగా, మరికొన్నింటిని తయారు చేస్తున్నారు. స్లాబ్‌పై వాహనాల రాకపోకల క్రమంలో బ్రిడ్జిపై ఎలాంటి ఒత్తిడి పడకుండా బీమ్ మధ్యలో సస్పెషన్ తీగలను అమర్చారు.

బ్రిడ్జి ఎత్తు 17.5 మీటర్లు..  18 మీటర్ల వెడల్పు

ముల్లకట్ట వద్ద గోదావరి నీటి మట్టాన్ని పరిగణనలోకి తీసుకొని బ్రిడ్జి ఎత్తును నిర్ణయించారు. మండలంలో ప్రధానంగా 1986లో గోదావరి వరదలు ఎక్కువగా వచ్చాయి. అప్పుడు అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అప్పటి గణాంకాలను లెక్కలోకి తీసుకుని అధికారులు 17.5 మీటర్ల ఎత్తులో బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. బ్రిడ్జిపైన 18 మీటర్ల వెడల్పుతో మూడు లేన్ల రోడ్డు ఉంటుంది.  ఇంకా ఇరువైపులా 1.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్ నిర్మించారు.  కుడి, ఎడమ వైపుల నుంచి నడిచిపోవడానికి వీలుగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. బ్రిడ్జి స్లాబ్‌లు పూర్తి కాగానే దానిపై బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. బ్రిడ్జి పనులు పూర్తయితే  తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారిగా జరిగే పుష్కరాలకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ పనులను ఈఈ సత్యనారాయణ, డీఈఈలు మనోహర్, చంద్రశేఖర్, కృష్ణారెడ్డి, ఏఈఈలు అన్నయ్య, అమరేందర్, దేవేందర్, రామ్మూర్తి, బాబు, ప్రదీప్, తరుణ పర్యవేక్షిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement