Transportation System
-
మందుల సరఫరాకు సొంత రవాణా
సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రులకు మందులు సరఫరా చేసే రవాణా వ్యవస్థను ఇక ప్రభుత్వమే చేపడుతోంది. ఈ దిశగా ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన మందులను ఏపీఎంఎస్ఐడీసీ (రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ) కొనుగోలు చేసి, జిల్లా కేంద్రాల్లో ఉన్న సీడీఎస్ (సెంట్రల్ డ్రగ్ స్టోర్)లకు చేరుస్తుంది. అక్కడి నుంచి బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరవేయాలి. ఇప్పటిదాకా ప్రైవేటు వాహనాల ద్వారానే రవాణా చేసేవారు. ఇకపై కొద్ది రోజుల్లో ఈ వ్యవస్థను రద్దు చేసి, ప్రభుత్వమే సొంత వాహనాలతో ప్రతి ఆస్పత్రికి మందులను చేర వేయనుంది. నెలకు రూ.10 లక్షలు ఆదా కొన్ని ప్రైవేటు కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద మందుల సరఫరాకు వాహనాలు ఇచ్చాయి. ఈ వాహనాలతోనే మందులు సరఫరా చేయనున్నారు. జిల్లాకు అవసరాన్ని బట్టి రెండు నుంచి నాలుగు వాహనాలు మందుల సరఫరాకే పని చేస్తాయి. సొంతంగా వాహనాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల నెలకు రూ.10 లక్షల లెక్కన ఏడాదికి రూ.1.20 కోట్లు ఆదా అవుతాయి. అంతేకాకుండా మందులను సకాలంలో చేర్చేందుకు అవకాశం ఉంది. గతంలో ప్రై వేటు రవాణా వ్యవస్థ ఉండటం వల్ల సెంట్రల్ డ్రగ్ స్టోర్ల నుంచి జిల్లా, తాలూకా, మండల స్థాయి ఆస్పత్రులకు మందులు చేర వేయడంలో తీవ్ర జాప్యం జరిగేది. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. ముందే రూట్ మ్యాప్ వేసుకుని ఏ జిల్లాలో వాహనాలు ఆ జిల్లాలో అవసరం మేరకు పని చేస్తాయి. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ప్రతి రోజూ కొన్ని ఆస్పత్రులకు ముందే రూట్ మ్యాప్ నిర్ణయిస్తారు. దీని ప్రకారం ఆ ప్రాంతంలో ఉన్న ఆస్పత్రులకు ఇండెంట్ మేరకు మందులు సకాలంలో వెళతాయి. పటిష్టంగా మందుల రవాణా వ్యవస్థ ఇన్నాళ్లూ ప్రైవేటు సంస్థ మందులు సరఫరా చేసేది. ఇప్పుడు ప్రభుత్వ పరిధిలోనే చేస్తున్నాం. దీంతో మందుల రవాణా వ్యవస్థ పటిష్టం కావడంతో పాటు సకాలంలో పేద రోగులకు మందులు అందించే అవకాశం ఉంటుంది. గతంలో కంటే తక్కువ వ్యయంతోనూ ఈ రవాణా జరుగుతుంది. – విజయరామరాజు, ఎండీ, రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ -
దీవెన యాత్ర
ప్రాచీనకాలం నుంచి మన దేశంలో యాత్రలంటే తీర్థయాత్రలే! ఎలాంటి రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో సైతం మన పూర్వీకులు తప్పనిసరిగా తీర్థయాత్రలు చేసేవారు. రవాణా వ్యవస్థ మెరుగుపడిన తర్వాత తీర్థయాత్రలే కాదు, వినోదం కోసం చేసే విహారయాత్రలు, సాహస యాత్రలు కూడా పెరిగాయి. వినోదం కోసం విలాసభరితమైన విహారయాత్రలు ఎన్ని చేసినా, జీవితకాలంలో కనీసం కొన్ని పుణ్యక్షేత్రాలనైనా దర్శించుకోవడం భారతీయుల ఆనవాయితీ. దర్శనీయమైన పుణ్యక్షేత్రాలకు, వివిధ మతాలకు చెందిన చరిత్రాత్మక ప్రార్థన కేంద్రాలకు మన దేశం ఆలవాలం. జనవరి 25న జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా మన దేశంలో జాతీయస్థాయిలో ప్రఖ్యాతి పొందిన పుణ్యక్షేత్రాలతో తెలుగు రాష్ట్రాల్లోని పేరెన్నిక గల పుణ్యక్షేత్రాల గురించిన విశేషాలు మీకోసం... తిరుపతి తిరుమల భారతదేశంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించుకునే పవిత్ర క్షేత్రం తిరుమల. శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన ఈ క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ క్షేత్రంలో ఏటా జరిగే బ్రహ్మోత్సవాలు, మకర సంక్రాంతి, ఉగాది తదితర పర్వదినాల్లోనైతే భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. తూర్పు కనుమల్లోని శేషాచలం పర్వతశ్రేణులపై ఏడుకొండల మీద వెలసినందున శ్రీవేంకటేశ్వరస్వామిని భక్తులు ఏడుకొండలస్వామిగా పిలుచుకుంటారు. ఇక్కడి సహజ శిలాతోరణం ఒక భౌగోళిక అద్భుతం. ఇదే కాకుండా, ఆకాశగంగ, పాపవినాశనం జలపాతాలు, శ్రీవారి పాదముద్రలు సందర్శకులకు కనువిందు చేస్తాయి. తిరుపతి–తిరుమలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా గోవిందరాజులస్వామి ఆలయం, ఆదివరాహస్వామి ఆలయం, తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయాలను ఇవే కాకుండా ఇక్కడి కోదండ రామాలయం, వరదరాజస్వామి దేవాలయం, ఇస్కాన్ ఆలయం, జీవకోన, కపిలతీర్థం వంటి సందర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి. శ్రీవేంకటేశ్వర నేషనల్ పార్క్‌లో అరుదైన వృక్షజాతులను, పక్షులను చూడవచ్చు. శ్రీవేంకటేశ్వర జూలాజికల్ పార్కులో అరుదైన జంతుజాలాన్ని, పక్షులను చూడవచ్చు. తిరుపతికి చేరువలోనే మరికొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.వాటిలో శ్రీకాళహస్తి సుప్రసిద్ధ శైవక్షేత్రం. కాలసర్పదోషం వంటి గ్రహదోషాలకు పరిహారంగా భక్తులు ఇక్కడ ప్రత్యేకపూజలు చేయించుకుంటారు. కాణిపాకంలోని వినాయక ఆలయం, కార్వేటినగరంలోని వేణుగోపాల స్వామి ఆలయం, నారాయణవనంలోని కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, కైలాసనాథస్వామి ఆలయం, గుడిమల్లంలోని పరశురామేశ్వర ఆలయం, ముక్కోటిలోని శివాలయం, అప్పలాయగుంటలో ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయం, నగలాపురంలో వేదనారాయణస్వామి ఆలయం వంటి చాలా సందర్శనీయ ఆలయాలు ఉన్నాయి. తిరుపతికి చేరువలో విహారయాత్రలకు అనువైన ప్రదేశాలు కూడా చాలానే ఉన్నాయి. అటవీ సౌందర్యానికి ఆలవాలమైన తలకోన, కళ్యాణి ఆనకట్ట, నారాయణవనంలోని కైలాసకోన, ఆంధ్రా ఊటీగా పేరుపొందిన హార్స్లీ హిల్స్ వంటి ప్రదేశాలు ఆటవిడుపుగా గడపటానికి అనువుగా ఉంటాయి. వారణాసి ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాల్లో ఒకటైన వారణాసిని కాశీ అని కూడా అంటారు. పవిత్ర గంగా తీరంలో ఉన్న కాశీ క్షేత్రాన్ని గురించిన ప్రస్తావన చాలా పురాణాల్లో కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ఈ నగరం నిత్యం పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అందుకే దీనికి వారణాసి అనే పేరు వచ్చింది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం వారణాసిలో ఉంది. ఇక్కడ విశ్వేశ్వరాలయంతో పాటు విశాలాక్షి ఆలయం, అన్నపూర్ణ ఆలయం, కాలభైరవ ఆలయం, సంకటమోచన ఆలయం, వారాహీమాత ఆలయం, దుర్గామాత ఆలయం, కవళీమాత ఆలయం, తులసీ మానసమందిరం వంటి పురాతన ఆలయాలు ఎన్నో సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడ గంగానది ఒడ్డున యాత్రికులు స్నానాలు ఆచరించేందుకు వీలుగా అనేక స్నానఘట్టాలు కనిపిస్తాయి. వీటిలో కాశీ విశ్వనాథ ఆలయం పక్కనే ఉన్న దశాశ్వమేధ ఘాట్, మణికర్ణికా ఘాట్ల ప్రస్తావన పురాణాల్లోనూ కనిపిస్తుంది. కార్తీకమాసంలోను, మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ భక్తుల రద్దీ మరింతగా కనిపిస్తుంది. వారణాసిలో ముస్లిం పాలకుల హయాంలో నిర్మించిన పురాతన మసీదులు సందర్శకులను ఆకట్టుకుంటాయి. దశాశ్వమేధఘాట్ సమీపంలోని జంతర్‌మంతర్, గంగాతీరం తూర్పువైపున రామనగర్ కోట, ఈ కోటలో ఉన్న మ్యూజియం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. శబరిమల మన దేశంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉన్న క్షేత్రాలలో శబిరమల ఒకటి. కేరళలోని సహ్యాద్రి పర్వతశ్రేణుల్లోని శబరిమలపై వెలసిన అయ్యప్పను దర్శించుకునేందుకు దీక్షలు తీసుకున్న భక్తులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. దట్టమైన అడవులు, పద్దెనిమిది కొండల మధ్య కేంద్రీకృతమైన శబరిమలకు సాగించే యాత్ర అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది. శబరిమల యాత్రలో ఏటా నవంబరు 17న జరిగే మండలపూజ, మకరసంక్రాంతి రోజున జరిగే మకరవిళక్కు ప్రధాన ఘట్టాలు. ఈ రెండు రోజుల్లోను, ప్రతి మలయాళ నెలలోనూ ఐదో రోజున అయ్యప్పస్వామి ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. మిగిలిన అన్ని రోజులూ ఆలయాన్ని మూసి ఉంచుతారు. శబరిమల యాత్ర ఎరుమేలితో మొదలవుతుంది. ముందుగా ఎరుమేలిలోని మసీదులో కొలువైన వావరుస్వామిని భక్తులు దర్శించుకుంటారు. దట్టమైన అడవుల గుండా సాగే కాలినడక మార్గంలో అళదానదిలోను, పంపానదిలోను భక్తులు స్నానాలు ఆచరిస్తారు. పచ్చని అడవులు, కొండలు, కోనల మీదుగా సాగే శబరిమల యాత్ర పర్యాటకులకు గొప్ప అనుభూతినిస్తుంది. ఏడాది పొడవునా భక్తుల తాకిడి ఉండకపోయినా, మండలపూజ, మకరవిళక్కు సీజన్లో మాత్రం ఇక్కడ విపరీతంగా భక్తుల రద్దీ కనిపిస్తుంది. షిరీడీ ఆధ్యాత్మిక ప్రవక్త అయిన సాయిబాబా నివాసం ఉన్న షిరిడీ గడచిన శతాబ్దకాలంలో ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రాచుర్యం పొందింది. మహారాష్ట్రలోని షిరిడీ పట్టణం ఇక్కడి సాయిబాబా ఆలయం కారణంగా అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందింది. మన దేశంలో తిరుపతి తర్వాత ఏడాది పొడవునా భక్తులు అత్యధిక సంఖ్యలో సందర్శించుకునే యాత్రా స్థలం షిరిడీనే. ప్రేమ, కరుణ, శాంతి, సహనం, గురుపూజ వంటి ఉన్నత విలువలను, దేవుడు ఒక్కడేనంటూ మత సామరస్యాన్ని బోధించిన షిరిడీ సాయిబాబాకు దేశ విదేశాల్లో కోట్లాదిగా భక్తులు ఉన్నారు. షిరిడీలో సాయిబాబా అస్తికలను ఉంచిన షిరిడీసాయి ప్రధాన ఆలయంతో పాటు, సాయిబాబా తన జీవితంలో ఎక్కువకాలం గడిపిన ద్వారకామాయి మసీదు, దానికి సమీపంలోని చావిడి, గురుషాన్ వద్దనున్న వేపచెట్టు తదితర ప్రదేశాలను భక్తులు పెద్దసంఖ్యలో సందర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడి సాయి హెరిటేజ్ విలేజ్, దీక్షిత్‌వాడా మ్యూజియం, వెట్ ఎన్ జాయ్ వాటర్ పార్క్ సందర్శకులను ఆకట్టుకుంటాయి. షిరిడీలోని పురాతన ఖండోబా ఆలయం, షిరిడీకి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలోని శింగణాపూర్‌లో ఉన్న శనైశ్చర దేవాలయాలను కూడా భక్తులు పెద్దసంఖ్యలో సందర్శించుకుంటూ ఉంటారు. రామేశ్వరం ద్వాదశ జ్యోతిరింగ క్షేత్రాల్లో ఒకటైన రామేశ్వరం పురాణకాలం నుంచి ప్రసిద్ధి పొందింది. సాక్షాత్తు శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని రామాయణం చెబుతోంది. బ్రాహ్మణుడైన రావణుడిని వధించిన తర్వాత బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తుడు కావడం కోసం రాముడు ఇక్కడ ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగం రామనాథేశ్వర లింగంగా ప్రసిద్ధి పొందింది. కాశీలోని విశ్వనాథుడిని దర్శించుకున్న భక్తులు అక్కడి నుంచి గంగా జలాన్ని తీసుకొచ్చి రామేశ్వరంలోని రామనాథస్వామిని దర్శించుకుని, తీరంలోని సముద్రంలో కలిపితేనే కాశీయాత్ర పూర్తి చేసుకున్న ఫలితం దక్కుతుందని భక్తులు విశ్వసిస్తారు. తమిళనాడు రామేశ్వరం ఒక చిన్న దీవి. ప్రధాన భూభాగం నుంచి దీనిని పంబన్ కాలువ వేరు చేస్తోంది. రాముడు ఇక్కడే సేతువు నిర్మించి వానర సైన్యంతో లంకపైకి దండెత్తి వెళ్లాడని పురాణాలు చెబుతున్నాయి.ప్రస్తుతం ఇక్కడ కనిపించే రామేశ్వర ఆలయాన్ని క్రీస్తుశకం పదో శతాబ్దిలో శ్రీలంక చక్రవర్తి పరాక్రమ బాహు నిర్మించాడు. ఈ ఆలయంతో పాటు ఇక్కడ కనిపించే రామపాదాలు, విభీషణాలయం, సేతువు ఉన్న ధనుష్కోటి ప్రాంతం, సువిశాలమైన బీచ్‌లు సందర్శకులకు కనువిందు చేస్తాయి. సారనాథ్ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చేరువలో ఉన్న సారనాథ్ నాలుగు ప్రధాన బౌద్ధక్షేత్రాల్లో ఒకటి. బోధిగయలో జ్ఞానోదయం పొందిన ఐదు వారాలకు సారనాథ్ చేరుకున్న గౌతమ బుద్ధుడు ఇక్కడే తన శిష్యులకు మొదటి ‘ధర్మ’ ఉపదేశం చేశాడు. దీనినే ధర్మచక్ర పరివర్తన సూత్రం అంటారు. ఇక్కడే బుద్ధుని ఐదుగురు శిష్యులతో మొదటి బౌద్ధసంఘం ఏర్పడింది. బుద్ధుని కాలంలో సారనాథ్‌ను ఉసీపట్నం అనేవారు.ఇక్కడి మూలగంధి కుటీరంలో బుద్ధుడు ఐదేళ్లు గడిపాడు. సారనాథ్‌లో బౌద్ధులకు చెందిన అనేక పురాతన చారిత్రక ఆధారాలు నేటికీ చెక్కుచెదరకుండా కనిపిస్తాయి. అశోకుడు స్థాపించిన స్థూపాలు, వాటికపై బుద్ధుని సూక్తులను, అశోకుని శాసనాలను చూడవచ్చు. వీటిలో నాలుగు సింహాలతో కూడిన అశోకస్థూపం మన జాతీయచిహ్నంగాను, ఇందులోని అశోకచక్రం మన జాతీయ జెండాపైన గౌరవం పొందుతున్నాయి. ఇక్కడి చుఖంది స్థూపంలో బుద్ధుని అస్థికలను భద్రపరచారు. సారనాథ్‌లోని జింకల పార్కులోనే బుద్ధుడు తొలి ఉపదేశం చేసిన ప్రదేశాన్ని చూడవచ్చు. శతాబ్దం కిందటి తవ్వకాల్లో బయటపడిన మ్యూజియంలో ఉన్న పురాతన కళాఖండాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. వారణాసికి వెళ్లే యాత్రికుల్లో చారిత్రక విశేషాలపై ఆసక్తిగలవారు సారనాథ్‌ను కూడా తప్పక సందర్శించుకుంటూ ఉంటారు. అజ్మీర్ రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాకు ముస్లింలతో పాటు ఇతర మతస్తులూ పెద్ద సంఖ్యలో వస్తుంటారు. సూఫీ సాధువు మొయినుద్దీన్ చిస్తీ సమాధి చెందిన ఈ దర్గా అజ్మీర్‌లోని తారాగఢ్ కొండ దిగువన ఉంది. ఇక్కడ ప్రార్థనలు జరిపిన తర్వాతే మొఘల్ చక్రవర్తి అక్బర్‌కు కొడుకు పుట్టాడని ప్రతీతి. అందుకే అక్బర్ తన పట్టమహిషితో కలసి ఈ దర్గాను దర్శించుకోవడానికి ఆగ్రా నుంచి కాలినడకన వచ్చేవాడని చెబుతారు. ఆగ్రా నుంచి అజ్మీర్ దర్గాకు చేరుకునే మార్గంలో ప్రతి రెండు మైళ్లకొకటి చొప్పున నిర్మించిన ‘కోసే మీనార్’ స్తంభాల వద్ద ఆగి కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ అక్బర్ దంపతులు పాదయాత్ర సాగించేవారని చెబుతారు. హైదరాబాద్ నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇచ్చిన విరాళంతో అజ్మీర్ దర్గా ప్రధాన ద్వారాన్ని నిర్మించారు. నిజాం ద్వారం తర్వాత షాజహాన్ నిర్మించిన షాజహానీ దర్వాజా, మహమ్మద్ ఖిల్జీ నిర్మించిన బులంద్ దర్వాజా చూపరులను ఆకట్టుకుంటాయి. ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఏటా రజాబ్ నెలలోని ఆరో రోజు లేదా ఏడో రోజున మొయినుద్దీన్ చిస్తీ వర్ధంతి సందర్భంగా ఉర్సు వేడుకలను నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో లక్షలాదిగా జనం పాల్గొంటారు. కోరికలు తీరాలని ప్రార్థనలు జరిపే భక్తులు కొందరు ఈ దర్గాకు చాదర్లు సమర్పించుకుంటారు. ఇక్కడకు చేరువలోనే మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన అక్బరీ మసీదు కూడా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఆరావళి పర్వతాల నడుమ ఉన్న అజ్మీర్ నగరానికి పదకొండు కిలోమీటర్ల దూరంలోనే ఉన్న పుష్కర్‌లో అత్యంత అరుదైన బ్రహ్మదేవుని ఆలయం ఉంది. అజ్మీర్‌లోని కొండపై ఎనిమిదో శతాబ్దికి చెందిన ఒకటో అజయరాజా నిర్మించిన ‘అజయమేరు’ కోటనే ఇప్పుడు తారాగఢ్ కోటగా పిలుస్తున్నారు. అజయమేరు కోట ఉన్న నగరం కావడం వల్ల గతంలో దీనిని అజయమేరు నగరంగా పిలిచేవారు. కాలక్రమేణా ఈ పేరే అజ్మీర్‌గా మారింది. తారాగఢ్ కోటకు చేరువలోని పృథ్వీరాజ్ విగ్రహం, నగరంలోని పురాతన సరోవరాలు, వాటి పరిసరాలు చూపరులను ఆహ్లాదపరుస్తాయి. ఇక్కడి ‘సోనీజీ కీ నసియాన్’ జైన ఆలయంలోని ప్రధాన మందిరాన్ని ‘స్వర్ణనగరి’ అని అంటారు. వెయ్యి కిలోల బంగారంతో నిర్మించిన ఈ మందిరం చూపరులను ఆకట్టుకుంటుంది. అజ్మీర్‌లో ఒకప్పుడు అక్బర్ కొడుకు సలీం నివసించిన పురాతన భవనంలో ప్రస్తుతం మ్యూజియం కొనసాగుతోంది. ఇందులోని పురావస్తువులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. పాత గోవా ఉత్తర గోవా జిల్లాలోని పాత గోవా ప్రాంతాన్నే పోర్చుగీసు భాషలో ‘వెల్హ గోవా’ అని, ఇంగ్లిష్‌లో ఓల్గోవా అని అంటారు. ఇక్కడి ‘బేసిలికా ఆఫ్ బామ్ జీసస్’ చర్చిలో పదహారో శతాబ్దికి చెందిన రోమన్ కేథలిక్ క్రైస్తవ మత బోధకుడు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అస్థికలు ఉంటాయి. వీటిని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి క్రైస్తవులతో పాటు ఇతర మతాలకు చెందిన పర్యాటకులు కూడా పెద్దసంఖ్యలో వస్తుంటారు.పురాతనమైన ఈ చర్చిని యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తించింది. ఇదే కాకుండా, ఇక్కడ చర్చ్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ అసిసీ, చాపెల్ ఆఫ్ సెయింట్ కేథరీన్, రాయల్ చాపెల్ ఆఫ్ సెయింట్ ఆంథోనీ, చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ మౌంట్, చర్చ్ ఆఫ్ సెయింట్ జాన్ ఆఫ్ గాడ్ వంటి పురాతన చర్చిలు చాలా కనిపిస్తాయి. ఇక్కడి పురాతన చర్చిల్లో ఒకటైన చర్చ్ ఆఫ్ సెయింట్ అగస్టీన్ శిథిలాలు మాత్రమే ప్రస్తుతం కనిపిస్తాయి. గోవా సముద్ర తీర సౌందర్యాన్ని తిలకించే పర్యాటకుల్లో చాలామంది ఈ పురాతన చర్చిలను తిలకించడానికి పాత గోవాకు వస్తుంటారు. గోవాలో పోర్చుగీసుల హయాంలో నిర్మించిన చర్చిలు మాత్రమే కాకుండా, శతాబ్దాల నాటి హిందూ ఆలయాలు కూడా కనిపిస్తాయి. గోవాలోని పన్నెండో శతాబ్ది నాటి మహాదేవ శివాలయం, పదిహేనో శతాబ్దికి చెందిన మహామాయ కాళికా దేవాలయం, ఇక్కడి కవ్లే ప్రాంతంలోని శాంత దుర్గా ఆలయం, అమోనా ప్రాంతంలోని భేతాళ ఆలయం, మషేల్లోని శ్రీ దేవకీ కృష్ణ రవల్నాథ్ ఆలయం వంటి అరుదైన దేవాలయాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. పండుగ వేళల్లో ఈ ఆలయాల వద్ద భక్తుల రద్దీ కనిపిస్తుంది. అమృత్సర్ పంజాబ్‌లోని అమృత్సర్ సిక్కులకు పవిత్రక్షేత్రం. ఇక్కడి స్వర్ణదేవాలయం సిక్కులకు అత్యంత పవిత్ర ప్రార్థన కేంద్రం. స్వర్ణదేవాలయాన్నే ‘హరిమందిర్ సాహిబ్’ అంటారు. ప్రతిరోజూ లక్షలాది మంది సందర్శించుకునే ఈ ఆలయానికి సిక్కులతో పాటు ఇతర మతస్తులూ వస్తుంటారు. అమృత్‌సర్‌లో స్వర్ణదేవాలయమే కాకుండా రామాయణ కాలానికి చెందిన మరికొన్ని పవిత్ర స్థలాలు కూడా ఉన్నాయి.ఇక్కడ వాల్మీకి తీర్థస్థల్లో వాల్మీకి ఆశ్రమం ఉంది. వాల్మీకి ఆశ్రమానికి చేరువలోనే ఉన్న ‘రామతీర్థ’ ఆశ్రమంలోనే సీతాదేవి లవకుశులకు జన్మనిచ్చినట్లు ప్రతీతి. అశ్వమేధం చేసిన రాముడు విడిచిన యాగాశ్వాన్ని లవకుశులు బంధించి, దానికి రక్షణగా వచ్చిన హనుమంతుడిని ఒక చెట్టుకు కట్టేశారని పురాణాల కథనం. ఇక్కడి దుర్గయినా ఆలయానికి చేరువలోని చెట్టుకే లవకుశులు హనుమంతుడిని కట్టేశారని చెబతారు. సిక్కుల నాలుగో గురువైన గురు రామదాస్ ఈ నగరాన్ని స్థాపించినందున ఇదివరకు ఈ నగరాన్ని రామదాస్నగర్ అనేవారు. ఇక్కడి గోవింద్గఢ్ కోట, రామ్‌బాగ్ ప్యాలెస్, మహారాజా రంజిత్‌సింగ్ మ్యూజియం సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడి జలియన్‌వాలాబాగ్ నాటి బ్రిటిష్ పాలకుల దాష్టీకానికి నిలువెత్తు సాక్షిగా కనిపిస్తుంది. పూరీ ఒడిశాలోని బంగాళాఖాతం తీరంలోనున్న పూరీ శ్రీక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. బలభద్ర, సుభద్రా సమేతుడై జగన్నాథుడు వెలసిన పూరీ క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రమని కూడా అంటారు. పూరీలోని జగన్నాథ ఆలయం దాదాపు వెయ్యేళ్ల నాటిది. దాదాపు నాలుగు లక్షల చదరపు అడుగుల సువిశాల స్థలంలో నిర్మించిన పూరీ జగన్నాథ ఆలయ ప్రాంగణంలో 120 ఉపాలయాలు, పూజ మందిరాలు ఉన్నాయి.యావత్ భారతదేశంలోనే అతిపెద్ద వంటశాల ఈ ఆలయంలోనే ఉంది. ఇక్కడ ప్రతిరోజూ 56 వంటకాలను వండి, ఇక్కడి దేవతామూర్తులకు నివేదిస్తారు. ఏటా ఆషాఢ శుక్ల విదియ నాడు జరిగే జగన్నాథ రథయాత్రను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాదిగా సందర్శకులు వస్తుంటారు. రథయాత్రలో జగన్నాథ బలభద్ర సుభద్రలు గుండిచా మందిరానికి చేరుకుంటారు. ఆషాఢ శుక్ల దశమి వరకు ఇక్కడ కొలువుదీరే జగన్నాథుడు దశావతారాల్లో భక్తులకు దర్శనమిస్తాడు. పూరీలోని విమలాదేవి ఆలయంలో ఆశ్వీయుజ మాసం ప్రారంభానికి ఎనిమిది రోజుల ముందు నుంచి విజయదశమి వరకు పదహారు రోజుల పాటు జరిగే పూజలకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. పూరీ సముద్ర తీరానికి పర్యాటకులు నిత్యం పెద్దసంఖ్యలో వస్తుంటారు. పూరీకి చేరువలోని కోణార్క్ సూర్యదేవాలయం, సాక్షిగోపాల్‌లోని సాక్షిగోపాల ఆలయం కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. పూరీకి చేరువలోనే ఉన్న ఒడిశా రాజధాని భువనేశ్వర్ ‘ఆలయ నగరం’గా ప్రసిద్ధి పొందింది. పూరీ వచ్చే పర్యాటకుల్లో చాలామంది భువనేశ్వర్‌లోని పురాతన లింగరాజ్ ఆలయం, రాజారాణీ ఆలయం, ఖండగిరి, ఉదయగిరి గుహలు, ఇతర సందర్శనీయ ప్రదేశాలు చూపరులను ఆకట్టుకుంటాయి. -
చార్మినార్ చుట్టూ ట్రామ్వే!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర సిగలో మరో ఆకర్షణ వచ్చి చేరనుంది. హైదరాబాద్‌కు ప్రతీక అయిన చారిత్రక చార్మినార్ ప్రాంతానికి న్యూ జనరేషన్ ట్రామ్వే ఏర్పాటు దిశగా రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే మెట్రోరైలు అందుబాటులోకి వచ్చినప్పటికీ వివిధ రవాణా వ్యవస్థలను వినియోగించుకోవడం ద్వారా ప్రజా రవాణావైపు ప్రజానీకాన్ని మళ్లించేందుకు ట్రామ్‌వేను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫ్రాన్స్‌లోని బోర్డో నగరంతో కుదుర్చుకున్న సిస్టర్ సిటీ ఒప్పందంలో భాగంగా పట్టణ ప్రాంత పునరుద్ధరణ కింద అక్కడ విజయవంతంగా నడుస్తున్న ట్రామ్‌వేను హైదరాబాద్‌లో అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై చర్చించేందుకు బోర్డో మెట్రోపోలిస్ ప్రతినిధి విక్టర్ బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. పలువురు ఉన్నతాధికారులతో పాటు చార్మినార్ పథకం ప్రాజెక్టు డైరెక్టర్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ముషార్రఫ్ ఫారుఖీని కలిశారు. సమగ్ర అధ్యయనం చేపట్టాక ట్రామ్వే మార్గాన్ని ఎంపిక చేయనున్నారు. సుందరీకరణ పనులు దాదాపు పూర్తి... స్వచ్ఛ భారత్ పథకంలో భాగమైన స్వచ్ఛ ఐకానిక్ ప్రదేశాల ప్రాజెక్టు కింద చార్మినార్ ఎంపికవడంతో దాని పరిసరాల్లో చేపట్టిన సుందరీకరణ పనులు (చార్మినార్ పాదచారుల పథకం) ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి. అమృత్సర్ స్వర్ణ దేవాలయం తరహాలో పరిసరాల్ని అధికారులు తీర్చిదిద్దుతున్నారు. నగరానికి వచ్చే పర్యాటకుల్లో ఎక్కువశాతం చార్మినార్‌ను సందర్శించకుండా వెనుదిరగరు. ఈ నేపథ్యంలో పర్యాటక ఆకర్షణగా, పర్యావరణపరంగానూ ట్రామ్వే ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కోల్‌కతా మినహా మిగిలిన నగరాల్లో చతికిల... దేశంలో చెన్నై, ఢిల్లీ, కాన్పూర్, ముంబై, నాసిక్, పట్నా తదితర ప్రాంతాల్లో వందేళ్ల క్రితమే ట్రామ్‌వేలను ఏర్పాటు చేసినప్పటికీ అవి కొనసాగలేక మూతపడ్డాయి. అయితే ఒక్క కోల్‌కతాలో మాత్రమే ప్రజల అభిమానాన్ని చూరగొనడంతో అక్కడ ట్రామ్వే సేవలు కొనసాగుతున్నాయి. చార్మినార్ కేంద్రంగా పాతబస్తీకి... ఎల్బీనగర్–మియాపూర్ మార్గంలో మెట్రోరైలు త్వరలో ఎంజే మార్కెట్ మీదుగా పరుగులు తీయనుంది. అక్కడి నుంచి చార్మినార్ లేదా గుల్జార్‌హౌస్ వరకు ట్రామ్వే ఏర్పాటు చేయాలని ఏడాదిన్నర క్రితమే అధికారులు భావించారు. చార్మినార్ వద్ద ఉన్న చిరువ్యాపారులను అక్కడి నుంచి తరలించేందుకు సాలార్జంగ్ మ్యూజియం వద్ద స్కైవే నిర్మాణానికి ఇటీవల సిద్ధమయ్యారు. దీంతోపాటు పార్కింగ్ సదుపాయాలు మొదలైనవి పరిగణనలోకి తీసుకొని అన్నివిధాలా అనుకూలమైన మార్గంలో చార్మినార్ వైపు ట్రామ్‌వేను ఏర్పాటు చేయాలని ప్రస్తుతం యోచిస్తున్నారు. జీహెచ్ఎంసీ, బోర్డో సిటీ మధ్య కుదిరిన సిస్టర్సిటీ ఒప్పందంలో భాగంగా ట్రామ్‌వేకు బోర్డో మెట్రోపోలిస్ సాంకేతిక సహకారం అందిస్తోంది. మరికొన్ని మార్గాల్లోనూ ట్రామ్‌వేపై వచ్చిన అభిప్రాయాలివీ చార్మినార్ ఔటర్ రింగ్‌రోడ్ మీదుగా..అఫ్జల్‌గంజ్–సాలార్జంగ్ మ్యూజియం–మీరాలం మండి–శాలిబండ–ముర్గీచౌక్–ఖిల్వత్ ప్యాలెస్–సిటీ కాలేజ్–హైకోర్టు–అఫ్జల్‌గంజ్.చార్మినార్ ఇన్నర్ రింగ్‌రోడ్ మీదుగా..గుల్జార్‌హౌస్–మిట్టికాషేర్–రాయల్ ఫంక్షన్ హాల్–మీర్‌మొమిన్ దర్గా–మొఘల్‌పురా–పారిస్ కార్నర్–పంచ్‌మొహల్లా–మిట్టికాషేర్– గుల్జార్‌హౌస్. ఇతర మార్గాలు మదీనా– గుల్జార్ హౌస్– ఖిల్వత్–హుస్సేనీ ఆలం–గోల్కొండ గోల్కొండ– కుతుబ్‌షాహీ టూంబ్స్ ఎంజే మార్కెట్–అబిడ్స్–నాంపల్లి– స్నో వరల్డ్–ట్యాంక్‌బండ్ ఏడాదిన్నర క్రితం చేసిన ప్రాథమిక అధ్యయనం మేరకు.. పైలట్ ప్రాజెక్టుగా ఎంజే మార్కెట్ నుంచి చార్మినార్ వరకు ట్రామ్వే 2.3 కి.మీ. ప్రాజెక్టు అంచనా వ్యయం(రూ. కోట్లలో) 250 ఆదాయం అంచనా(రూ. కోట్లలో) 75 నిర్వహణ ఖర్చులు (రూ. కోట్లలో) 45 సగటు వేగం గంటకు 20 కిలోమీటర్లు ఒక్కో వాహనంలో ప్రయాణికుల సామర్థ్యం 650 మెట్రోరైలు కంటే ప్రయాణ చార్జీ తక్కువ. భూసేకరణ అవసరం ఉండదు. ఉన్నా చాలా స్వల్పం పట్టాల మధ్య నుంచే విద్యుత్ సరఫరా.దీన్నే న్యూ జనరేషన్ ట్రామ్‌వేగా వ్యవహరిస్తారు. -
మెరుగైన రవాణా వ్యవస్థ.. ఓ భ్రమ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ట్రాఫిక్ సమస్య అంతకంతకూ జటిలమవుతోంది. నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రజానీకం యాతన పడుతున్నారు. ఇక రాజధాని ప్రాంతమైన విజయవాడలో ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంది. ఈ సమస్య పరిష్కారంలో భాగంగా మెరుగైన రవాణా వ్యవస్థ నెలకొల్పుతామని ప్రభుత్వం హడావుడి చేసింది. కమిటీని సైతం ఏర్పాటు చేసింది. ఏళ్లు గడుస్తున్నా ప్రణాళికలు రూపొందించలేదు. మరోవైపు సమీకృత రవాణా వ్యవస్థ నెలకొల్పేందుకంటూ రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్(రైట్స్) అనే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కానీ అది కాగితాలను దాటలేదు. అదే సమయంలో ఈ పేరిట ప్రభుత్వాధికారులు రూ.లక్షలు వెచ్చించి అధ్యయన యాత్రలు చేస్తూ రాష్ట్రాలు, దేశాలు చుట్టి వస్తున్నారు తప్ప ప్రణాళికలు, ప్రతిపాదనలు రూపొందించట్లేదు. దీంతో మెరుగైన రవాణా వ్యవస్థ ఓ భ్రమగానే మిగిలిపోతోంది. మొక్కుబడి.. రాష్ట్రంలో సమీకృత రవాణా వ్యవస్థ ఏర్పాటుకోసమంటూ గతేడాది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. సీఎస్‌తో కలిపి మొత్తం 13 మందితో కమిటీ ఏర్పాటైంది. కానీ ఇంతవరకూ ఒక్కసారి కూడా ఇది భేటీ కాలేదు. ఆర్అండ్బీ అధికారులను కమిటీలో సభ్యులుగా నియమించి రవాణా శాఖ కమిషనర్‌కు చోటు కల్పించలేదు. ఈ కమిటీ రాష్ట్రంలో పర్యాటకం, పరిశ్రమల అభివృద్ధి, ఏవియేషన్ సెక్టార్, జల రవాణా, సీఆర్డీఏలో రవాణా, రోడ్లు, రైల్వేలకు సంబంధించి మెరుగైన రవాణా వ్యవస్థకోసం ప్రణాళిక రూపొందించాలి. ఏళ్లు గడుస్తున్నా ఆ దిశగా చర్యల్లేవు. కమిటీని మొక్కుబడికే ఏర్పాటు చేశారనే విమర్శలు రవాణా రంగం నుంచే వినిపిస్తుండడం గమనార్హం. ‘రైట్స్’ ప్రతిపాదనలపైన సమీక్షేది? ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో మెరుగైన రవాణా వ్యవస్థకు సంబంధించి రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్(రైట్స్) సంస్థ కొన్ని ప్రతిపాదనలు చేసింది. మెట్రో, రోడ్డు రవాణాకు బహుళ ఫ్లై ఓవర్ల నిర్మాణాలు తదితరాలపై సర్వే నిర్వహించిన ఆ సంస్థ రాజధానిలో లైట్ మెట్రో, రోడ్డు రవాణాకు సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టవచ్చో.. తెలియజేస్తూ ప్రతిపాదనలిచ్చింది. అలాగే విశాఖ, తిరుపతి, గుంటూరు నగరాల్లో రవాణా వ్యవస్థపైనా సూచనలు చేసింది. అయితే ఈ సంస్థ ఇచ్చిన ప్రతిపాదనలపై ఇంకా సమీక్షించలేదు. ఆర్టీసీదీ ఇదే దారి.. ఆర్టీసీ కూడా ఇదే దారిలో నడుస్తోంది. మెరుగైన రవాణా వ్యవస్థకు రూ.కోట్లు ఖర్చు చేసి సలహా కమిటీలు ఏర్పాటు చేసుకుంటోంది తప్ప అవి ఇస్తున్న సూచనలను పట్టించుకోవట్లేదు. ఆర్టీసీలో నష్టాలను అధిగమించడంపై సూచనలిచ్చేందుకు యాజమాన్యం రెండేళ్లక్రితం రూ.10 కోట్లు ఖర్చు చేసి బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) సహకారాన్ని కోరింది. ప్రొఫెసర్ రవికుమార్ నేతృత్వంలో ఐఐఎం బృందం ఆర్టీసీ స్థితిగతుల్ని నెలల తరబడి అధ్యయనం చేసి నివేదిక ఇచ్చింది. ప్రజారవాణా వ్యవస్థలో ఆర్టీసీ వాటాగా ఉన్న 35 శాతాన్ని 50 శాతానికిపైగా పెంచుకోవాలని, ఇందుకోసం రాష్ట్రంలో ప్రతి పల్లెకు బస్సులు నడపాలని సూచించింది. అంతేగాక ఏటా ఆర్టీసీకి ప్రభుత్వం గ్రాంట్ రూపంలో రూ.200 కోట్లు కేటాయించాలని సిఫారసు చేసింది. ఇటీవలే ఆర్టీసీలో మెరుగైన రవాణా సేవలకు అవసరమైన సలహాలకోసం ఢిల్లీకి చెందిన వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిŠూట్యట్ ఇండియా(డబ్ల్యూఆర్‌ఐఐ)తో ఏపీఎస్ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూఆర్‌ఐఐ ప్రతినిధులు పలు సూచనలు చేశారు. అయితే ఈ సలహాలను ఇంతవరకు ఆర్టీసీ అమలు చేయలేదు. -
రైల్వే వల్లే పోర్టుకు నష్టం
- తగినన్ని గూడ్సు వ్యాగన్లను ఇవ్వట్లేదు - పార్లమెంటరీ కమిటీకి కృష్ణబాబు నివేదన - పోర్టులో పర్యటించిన కమిటీ సభ్యులు సాక్షి, విశాఖపట్నం: రైల్వేశాఖ తగినన్ని గూడ్సు వ్యాగన్లను సరఫరా చేయకపోవడం వల్ల విశాఖ పోర్టులో రవాణా వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని పోర్టు చైర్మన్ ఎం.కృష్ణబాబు కేంద్ర వాణిజ్యశాఖ అనుబంధ పార్లమెంటరీ కమిటీకి నివేదించారు. సకాలంలో వ్యాగన్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఎగుమతులు, దిగుమతుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా డాక్టర్ చందన్ మిత్రా నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులు సోమవారం పోర్టు, కంటైనర్ టెర్మినల్, షిప్‌యార్డు, ఫిషింగ్‌హార్బర్‌లో పర్యటించారు. ప్రత్యేకంగా బోటులో వెళ్లి ఇన్నర్, అవుటర్ హార్బర్ ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి సౌకర్యాలు, సమస్యలను పోర్టు చైర్మన్ ఎం.కృష్ణబాబు, ఎంపీ కంభంపాటి హరిబాబు వారికి వివరించారు. హుద్‌హుద్ తుపానుతో దెబ్బతిన్న బోట్లకు చేస్తున్న మరమ్మతులను కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ బృందంలో ఎంపీలు శాంతారామ్ నాయక్, జితేంద్ర చౌదరి, కేఆర్పీ ప్రభాకరన్, సుధార్ గుప్తా, బోధ్‌సింగ్ భగత్, చరణ్‌జిత్‌సింగ్ సింగ్రోరి, జాయ్ అబ్రహాం ఉన్నారు. పోర్టు యాజమాన్యం, ఎగుమతిదారులు, బెర్తుల నిర్వాహకులు, కార్మికులతో పాటు కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులతో పార్లమెంటరీ కమిటీ సాయంత్రం నోవాటెల్ హోటల్లో సమావేశమైంది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ చందన్ మిత్రా మాట్లాడుతూ విశాఖతో పాటు ముంబై, చెన్నై, కలకత్తా తదితర మేజరు పోర్టుల్లో సైతం సరకు రవాణాలో జాప్యం జరుగుతోందన్నారు. పోర్టులను ఆధునికీకరించడం ద్వారా వాటి సామర్థ్యాన్ని పెంపొందించవచ్చని చెప్పారు. విశాఖ పోర్టు అభివృద్ధి, ఎదుర్కొంటున్న సమస్యలపై చైర్మన్ ఎం.టి.కృష్ణబాబు వివరించారు. 2020 సంవత్సరం నాటికల్లా దాదాపు పది కోట్ల టన్నుల సరుకు ఎగుమతి, దిగుమతి సామర్ధ్యాన్ని సాధిస్తుందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా భావనపాడు వద్ద శాటిలైట్ పోర్టు నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్నామని, దీనిద్వారా బల్క్ కార్గో ఎగుమతులు నిర్వహిస్తామని వివరించారు. అయితే విశాఖ పోర్టులో సరుకుల రవాణాకు రోజుకు 20 గూడ్సురైళ్లు అవసరం కాగా సగమే అందుబాటులో ఉంటున్నాయని చెప్పారు. విజయనగరం-రాయ్‌పూర్ రైల్వే లైన్ సామర్థ్యం పెంచాలని, సత్వరమే విద్యుదీకరణ పనులు చేపట్టాలని అన్నారు. దీనికి ఎంపీ కంభంపాటి హరిబాబు స్పందిస్తూ ఈ విషయమై ఈనెల 27న నగరానికి వస్తున్న రైల్వే మంత్రి సురేష్‌ప్రభుతో చర్చిస్తామని చెప్పారు. డివిజినల్ రైల్వే మేనేజర్ చంద్రలేఖ ముఖర్జీ స్పందిస్తూ అలమండ, కోరుకొండ మీదు విజయనగరం వరకు మూడో లైన్ జూలై నెల నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అలాగే వచ్చే నవంబరు నాటికి రాయగడ రైల్వేలైను విద్యుదీకరణ పనులు విజయనగరం వరకు పూర్తవుతాయని వెల్లడించారు. స్టీల్డోర్స్ అసోసియేషన్ ప్రతినిధి కృష్ణకుమార్, వేదాంత సంస్థ యాజమాన్యం ప్రతినిధులు, పోర్టు ఉద్యోగుల సంఘం ప్రతినిధి డీకే శర్మ, కస్టమ్స్ శాఖ చీఫ్ కమిషనర్ దీప బి.దాస్‌గుప్తా మాట్లాడారు. సీఐఐ తరఫున ఆర్వీఎస్ రాజు, పలువురు కార్మిక సంఘాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
పుష్కరాలకు.. గోదారి సిద్ధం..
వేగంగా ముల్లకట్ట వారధి నిర్మాణం పుష్కరాల వరకు పనులు పూర్తి ఛత్తీస్‌గఢ్, తెలంగాణకు మెరుగుపడనున్న రవాణా వ్యవస్థ ఎన్‌హెచ్ -163 పనుల్లో కొనసాగుతున్న జాప్యం హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని భూపాలపట్నం వరకు చేపట్టిన 163వ జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో జాప్యం కొనసాగుతోంది. 350 కిలోమీటర్ల మేర చేపట్టాల్సిన రోడ్డు పనులు అక్కడక్కడా పలు అవాంతరాలతో ముందుకు సాగడంలేదు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఏటూరునాగారం మండలంలోని ముల్లకట్ట వద్ద గోదావరి నదిపై వంతెన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న గోదావరి పుష్కరాల వరకు ఈ వారధి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒప్పందం ప్రకారం ఈ పనులు మే నెల వరకు పూర్తి కావాలి. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్-163, ముల్లకట్ట బ్రిడ్జి నిర్మాణ పనులపై ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఎన్‌హెచ్-163 పరిస్థితి హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లా పస్రా వరకు 243 కి.మీ. మేర రోడ్డు పనులు పూర్తి. పస్రా నుంచి ఏటూరునాగారం తాళ్లగడ్డ వరకు 47 కి.మీ. రోడ్డు నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. వరంగల్ పరిధిలో తాళ్లగడ్డ నుంచి ముల్లకట్ట బ్రిడ్జి వరకు ఉన్న 11.5 కిలోమీటర్లలో 50 శాతం బీటీ రోడ్డు పనులు పూర్తి. ఖమ్మం జిల్లాలోని వాజేడు మండలం జగన్నాథపురం నుంచి టేకుపల్లి వరకు 7.5 కిలో మీటర్ల రోడ్డుపై కంకర, మెటల్ లెయర్, రోలింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఏటూరునాగారం : తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని భూపాలపట్నం వరకు చేపట్టిన 163వ జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతూనే ఉంది. ప్రధానంగా పస్రా నుంచి ఏటూరునాగారం తాళ్లగడ్డ వరకు 47 కి.మీల రోడ్డు నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ రోడ్డు పనులకు గతంలో అటవీశాఖ అధికారులు అడ్డు చెప్పారు. గత ఏడాది డిసెంబర్లో రోడ్డు పనులు చేసుకునేందుకు ఆ శాఖ శాఖ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చింది. కానీ, అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో ఈ పనులు ఇంతవరకు మొదలు కాలేదు. ఎన్‌హెచ్ పనుల్లో భాగంగా ఏటూరునాగారం మండలం ముల్లకట్ట వద్ద గోదావరి నదిపై చేపట్టిన బ్రిడ్జి పనులు మాత్రం శరవేగంగా కొనసాగుతున్నారుు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. 2012 ఫిబ్రవరిలో బ్రిడ్జి పనులు ప్రారంభంకాగా.. ఈ ఏడాది జూలైలో జరగనున్న గోదావరి పుష్కరాల వరకు పూర్తి చేసేందుకు అధికారులు కృషిచేస్తున్నారు. ఏటూరునాగారం తాళ్లగడ్డ నుంచి నుంచి గోదావరి బ్రిడ్జి వరకు 11.5 కిలో మీటర్లు, అవతలివైపున ఖమ్మం జిల్లాలో వాజేడు మండలంలో 7.5 కిలో మీటర్ల వరకు రోడ్డుతోపాటు బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 218.3 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇందులో బ్రిడ్జి నిర్మాణానికి రూ. 98 కోట్లు కేటాయించారు. వరంగల్ జిల్లా ఏటూరునాగారంలో 11.5 కిలోమీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణం ఉండగా.... స్లాబ్‌ల నిర్మాణం పూర్తరుుంది. 50 శాతం బీటీ రోడ్డు పనులు పూర్తి కాగా.. ఇంకా 50 శాతం బీటీ లేయర్లు వేయాలి. అరుుతే ఖమ్మం జిల్లా వైపు 7.5 కిలోమీటర్ల వరకు రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని వాజేడు మండలం జగన్నాథపురం నుంచి టేకుపల్లి వరకు ఉన్న 7.5 కిలోమీటర్ల రోడ్డుపై కంకర, మెటల్ లెవలింగ్, రోలింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లా వైపు రోడ్డు, లొటపెటల గండి, చీకుపల్లి, జగన్నాథపురం వద్ద బ్రిడ్జి నిర్మాణ కాంట్రాక్టు పనులు ఓ కంపెనీ దక్కించుకుని పనులను మధ్యలోనే వదిలేసి వెళ్లింది. ఆ పనులను కూడా ప్రస్తుత ముల్లకట్ట బ్రిడ్జి నిర్మాణం చేస్తున్న కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి అప్పగించారు. గోదావరి నదిపై 2.5 కిలో మీటర్ల పొడవుతో బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయి. వర్షాలు వస్తే పనులు నిలిచిపోయే అవకాశం ఉండడంతో కాంట్రాక్టర్లు త్వరగా పనులు పూర్తి చేసేందుకు పనులను వేగవంతం చేస్తున్నారు. వేసవి కాలంలో గోదావరి నీటి ప్రవహం తక్కువగా ఉండడంతో పిల్లర్లు వేసేందుకు మట్టికట్టలు నిర్మించి బీమ్‌లను అమర్చేందుకు సిద్ధం చేస్తున్నారు. రెండు పిల్లర్ల మధ్య నుంచి గోదావరి ప్రవహం ఉండే విధంగా మట్టిని నిర్మించారు. ఈ వైపు బీమ్‌లను అమర్చే క్రమంలో పూర్తిగా గోదావరిపై మట్టి పోస్తారు. గతంలో పూర్తయిన స్లాబ్‌ల మధ్య ఉన్న మట్టిని తొలగించి గోదావరి మళ్లిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురం నుంచి లోటపెటల గండి వరకు రోడ్డు పనులు, చీకుపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు మందకొడిగా సాగడంతో ఇచ్చిన గడువు తీరేపోయే అవకాశం ఉంది. గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం వర్షాకాలం రాకముందే పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు కృషిచేస్తున్నారు. 22 స్లాబ్‌లు, 37 బీమ్ల అమరిక పూర్తి వంతెన నిర్మాణంలో భాగంగా 44 పియర్స్ (పిల్లర్లు), బ్రిడ్జికి ఇరువైపులా రెండు అబట్మెంట్సు నిర్మాణ పనులు పూర్తయ్యూరుు. దీంతో స్లాబ్‌ల పనులు మొదలు పెట్టారు. ఇప్పటివరకు 22 స్లాబ్‌ల పనులు పూర్తి కాగా, 37వ పిల్లర్ వరకు బీమ్‌లను అమర్చారు. బీమ్ల వెల్డింగ్, సెంట్రింగ్ పనులు జరుగుతున్నాయి. ఒక్కో పిల్లర్ ఎత్తు భూమిపై నుంచి ఆయా ప్రదేశాన్ని బట్టి 11 మీటర్ల నుంచి 14 మీటర్ల వరకు నిర్మించారు. ప్రతి పియర్ నిర్మాణం పటిష్టంగా ఉండేందుకు 38 మీటర్ల మేర భూమి లోపలికి గొయ్యి తీసి 1.50 మీటర్ల డయా, ఇనుప చువ్వలతో బుట్టను అమర్చారు. బీమ్ల మధ్య సస్పెషన్ ఇచ్చే తీగలు పిల్లర్, పిల్లర్‌కు మధ్య ఒక్కో గర్డర్(బీమ్) 40 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. ఇప్పటి వరకు 120 గర్డర్స్‌ను పియర్స్పైకి చేర్చారు. ఇంకా కొన్ని సిద్ధంగా ఉండగా, మరికొన్నింటిని తయారు చేస్తున్నారు. స్లాబ్‌పై వాహనాల రాకపోకల క్రమంలో బ్రిడ్జిపై ఎలాంటి ఒత్తిడి పడకుండా బీమ్ మధ్యలో సస్పెషన్ తీగలను అమర్చారు. బ్రిడ్జి ఎత్తు 17.5 మీటర్లు.. 18 మీటర్ల వెడల్పు ముల్లకట్ట వద్ద గోదావరి నీటి మట్టాన్ని పరిగణనలోకి తీసుకొని బ్రిడ్జి ఎత్తును నిర్ణయించారు. మండలంలో ప్రధానంగా 1986లో గోదావరి వరదలు ఎక్కువగా వచ్చాయి. అప్పుడు అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అప్పటి గణాంకాలను లెక్కలోకి తీసుకుని అధికారులు 17.5 మీటర్ల ఎత్తులో బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. బ్రిడ్జిపైన 18 మీటర్ల వెడల్పుతో మూడు లేన్ల రోడ్డు ఉంటుంది. ఇంకా ఇరువైపులా 1.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్ నిర్మించారు. కుడి, ఎడమ వైపుల నుంచి నడిచిపోవడానికి వీలుగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. బ్రిడ్జి స్లాబ్‌లు పూర్తి కాగానే దానిపై బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. బ్రిడ్జి పనులు పూర్తయితే తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారిగా జరిగే పుష్కరాలకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ పనులను ఈఈ సత్యనారాయణ, డీఈఈలు మనోహర్, చంద్రశేఖర్, కృష్ణారెడ్డి, ఏఈఈలు అన్నయ్య, అమరేందర్, దేవేందర్, రామ్మూర్తి, బాబు, ప్రదీప్, తరుణ పర్యవేక్షిస్తున్నారు. -
సిద్దిపేట రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
సిద్దిపేట జోన్: మూడు దశాబ్దాల సిద్దిపేట వాసుల రైల్వే లైన్ ఆశలు మళ్లీ చిగురించాయి. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైను నిర్మాణానికి రైల్వేబోర్డు అనుమతి మంజూరు చేయడంతో సిద్దిపేట ప్రాంత వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మూడు నిబంధనలతో రైల్వే బోర్డు నూతన మార్గానికి ఆమోదముద్ర వేయడం, సీఎం కేసీఆర్ కూడా సిద్దిపేట బిడ్డే కావడంతో ఈ సారి సిద్దిపేట రైల్వే లైనుకు తప్పకుండా మోక్షం కలుగుతుందని ఇక్కడి వారు భావిస్తున్నారు. మూడు దశాబ్దాల కల కరీంనగర్, మెదక్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ జిల్లాలకు కేంద్ర బిందువుగా ఉన్న సిద్దిపేట వ్యాపార, వాణిజ్యపరంగా దినదినాభివృద్ధి చెందుతోంది. సరిగ్గా 3 దశాబ్దాల క్రితం అప్పటి పాలకులు ఎన్నికల హామీగా సిద్దిపేటకు రైల్వే మార్గం అనే నినాదాన్ని తెరమీదకు తెచ్చారు. ఒక దశలో దివంగత నేత ఇందిరాగాంధీ హయాంలోనే రైల్వే మార్గం కోసం తొలి అడుగు పడింది. నాటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఇదే హామీని పాలకులు వినిపిస్తున్నారు. 1999లో 154 కిలోమీటర్ల మేర రైల్వే లైన్‌కు ప్రతిపాదనలు రూపొందించారు. కానీ తదుపరి చర్యలు కొనసాగలేదు. ఇదే సమయంలో కేంద్ర కార్మిక శాఖా మంత్రి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ 2006లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పూర్తి స్థాయిలో ప్రాజెక్టు రూపకల్పనలో సఫలీకృతం అయ్యారు. అప్పట్లోనే కేంద్రం కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ కోసం రూ.40 కోట్లను రైల్వే బడ్జెట్లో కేటాయించి, రాష్ట్ర ప్రభుత్వానికి మూడు నిబంధనలు విధించింది. అప్పుడు రాష్ట్రంలో ఉన్న సర్కార్ కేంద్ర నిబంధనలన్నీ ఒప్పుకున్నప్పటికీ తదుపరి చర్యలు తీసుకోలేదు. అయితే తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టగానే కొత్తపల్లి- మనోహరాబాద్ ప్రాజెక్టుపై దృష్టి సారించారు. ప్రాజెక్టు వ్యయం రూ. 935 కోట్లలో మూడవ వంతు భారం భరించడంతోపాటు రైల్వేలైన్ కోసం అయ్యే భూసేకరణకు ముందుకు వచ్చారు. అంతేకాకుండా కేంద్రం విధించిన నిబంధన మేరకు 5 సంవత్సరాల పాటు నష్టాన్ని భరించడానికి అంగీకారం తెలిపారు. దీంతో రైల్వే బోర్డు కొత్తపల్లి-మనోహరాబాద్ మార్గానికి అనుమతిని ఇచ్చింది. వ్యాపార, వాణిజ్య పురోగతి ఇప్పటికే కేవలం రహదారి మార్గాల ద్వారా రవాణ వ్యవస్థను వినియోగించుకుని దినదినాభివృద్ధి చెందుతున్న సిద్దిపేట భవిష్యత్‌లో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైను ద్వారా సికింద్రాబాద్, మేడ్చల్, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, కొత్తపల్లి వరకు సిద్దిపేటతో అనుసంధానం పెరగనుంది. వ్యాపార, వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతున్న సిద్దిపేటలో రైల్వే లైన్ ఆధారంగా భవిష్యత్‌లో రాక్ పాయింట్ ఏర్పాటు చేసే అవకాశం మెండుగా ఉంది. దీంతో వ్యాపారస్తులకు మేలు జరుగుతుంది. అదేవిధంగా సిద్దిపేట నుంచే నేరుగా సుదూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఏర్పడుతుంది. అన్ని రంగాల్లో సిద్దిపేట అగ్రగామిగా నిలిచే అవకాశం పుష్కలంగా ఉందన్న వాదనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. -
‘సహకార’ నిబంధనల సరళీకరణ
ముంబై: రాష్ట్రంలో సహకార గృహ నిర్మాణ సంఘాలకు సంబంధించి నిబంధనలను సరళీకరించనున్నట్లు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు తెలిపారు. ఈ మేరకు వచ్చే మూడు నెలల్లో దీర్ఘకాలిక విధానాలను ప్రభుత్వం రూపొందించనున్నట్లు ఆయన వివరించారు. విధానసభలో బుధవారం గవర్నర్ ఉభయసభలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలోని కరువు ప్రాంతాల్లో దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నీటివిధానాన్ని రూపొందించనున్నామన్నారు. అలాగే అడవులు, వన్యప్రాణ సంరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. విదర్భ, సహ్యాద్రి ఏరియాల్లోని పులుల సంరక్షణ ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలకు పునరావాస చర్యలను ముమ్మరం చేస్తామన్నారు. అలాగే ఆ ప్రాంతంలో టూరిజంను అభివృద్ధి చేసేందుకు తగిన కార్యాచరణ చేపడతామని గవర్నర్ చెప్పారు. వచ్చే ఐదేళ్లలో తమ ప్రభుత్వం వీలైనన్ని ఎక్కువ స్మార్ట్ సిటీలను అభివృద్ధిచేస్తామని స్పష్టం చేశారు. ముంబై మహానగరంలో రవాణావ్యవస్థను పటిష్టంచే యడానికి రోడ్లు, రైల్వే వ్యవస్థలను అనుసంధానం చేసేందుకు కృషిచేస్తామన్నారు. ‘2022 వరకల్లా అందరికీ ఇళ్లు’ అనే నినాదాన్ని నిజం చేసేందుకు తగిన చర్యలు చేపడతామన్నారు. మాడా, ఎమ్మెమ్మార్డీయే, సిడ్కో, నాగపూర్ అభివృద్ధి ట్రస్ట్ వంటి ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ సంస్థల ద్వారా బహుళ అంతస్తులను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రం అభివృద్ధి దిశలో శీఘ్రగతిన అడుగులు వేసేలా తమ ప్రణాళికలు ఉంటాయని చెప్పారు. మరాఠీ మీడియం పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరాఠీ మీడియంనుంచి చాలా మంది పిల్లలు ఇంగ్లిష్ మీడియం వైపు తరలిపోతున్నట్లు సర్వేల్లో తేలిన నేపథ్యంలో మరాఠీ మీడియం పాఠశాలల్లోనే ఆంగ్ల భాషపై విద్యార్థులు పట్టు పెంచుకునేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. మాతృభాషలో విద్య ప్రాధాన్యంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. అలాగే అందరికి నాణ్యమైన విద్యను అందించడం తమ లక్ష ్యమని వివరించారు. ఈ మేరకు రాష్ట్రంలోని పాఠశాలల స్థాయిని మదించేందుకు ‘స్టేట్ ఎక్రిడిటేషన్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్’ను ఏర్పాటుచేయనున్నట్లు గవర్నర్ తెలిపారు. నాణ్యమైన ఉన్నతవిద్యను వీలైనంతమంది ఎక్కువమందికి అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో రెండు కొత్త ఐఐఐటీలు, ఒక ఐఐఎంను స్థాపించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర చరిత్రను, శివాజీ కాలం నాటి ప్రాభవాన్ని కన్నులకు కట్టినట్లు చూపించే కోటల సంరక్షణకు కమిటీని నియమించనున్నట్లు విద్యాసాగర్ రావు చెప్పారు. రాష్ట్రంలో సాంస్కృతిక, కళా రంగాలను అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పారు. అలాగే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా చట్టాలపై సమీక్ష నిర్వహిస్తామని ఆయన వివరించారు. -
కొనసాగిన ‘సమైక్య’ జోరు
=రోడ్లన్నీ దిగ్బంధనం =కొనసాగిన ‘సమైక్య’ జోరు =స్తంభించిన రవాణా వ్యవస్థ =రోడ్లపైనే వంటావార్పు =స్వచ్ఛందంగా సహకరించిన ప్రజలు =పలుచోట్ల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల అరెస్ట్ సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ల దిగ్బంధనం కార్యక్రమం రెండోరోజూ విజయవంతమైంది. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వ మొండివైఖరిని జనం తీవ్రంగా నిరసించారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన రోడ్ల దిగ్బంధనం, వంటావార్పు, రాస్తారోకో కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. సమైక్యాంధ్ర ఆకాంక్షను చాటిచెప్పారు. సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్రను కాపాడుకోవడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండోరోజు కూడా రహదారుల దిగ్బంధనం కార్యక్రమం విజయవంతంగా జరిగింది. దీంతో జిల్లా వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించింది. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ప్రజలు స్వచ్ఛందంగా ఆందోళనకు సహకరించారు. ఆందోళనకారులు రోడ్లపైనే వంటావార్పు నిర్వహించారు. కొన్ని చోట్ల ఆర్టీసీ సిబ్బంది కూడా వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు. పలుచోట్ల వైఎస్సార్సీపీ నాయకులతో పాటు వందమందికి పైగా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఉదయభాను అరెస్ట్... జగ్గయ్యపేట మండలంలోని గట్టు భీమవరం టోల్‌ప్లాజా సమీపంలో వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఎనిమిది గంటల నుంచి దాదాపు 12 గంటల వరకు రహదారిని దిగ్బంధించి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు భానుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి చిల్లకల్లు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విజయవాడలో పార్టీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ ఆధ్వర్యంలో గొల్లపూడి జూతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై రెండువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో జలీల్‌ఖాన్‌తో పాటు 25 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త పి.గౌతంరెడ్డి ఆధ్వర్యంలో సింగ్‌నగర్ ఫ్లైఓవర్ వద్ద రాస్తారోకో నిర్వహించి, వంటావార్పు చేపట్టారు. రెండు గంటల పాటు రోడ్డుపై ఆటపాట నిర్వహించారు. తూర్పు నియోజకవర్గంలో పార్టీ అధికార ప్రతినిధి చందన సురేష్ ఆధ్వర్యంలో కృష్ణలంక ఫైర్‌స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై కార్యకర్తలు రాస్తారోకో జరిపారు. పోలీసులు 10 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. తిరువూరులో జాతీయరహదారిపై నియోజకవర్గ సమన్వయకర్త బండ్రపల్లి వల్లభాయ్ ఆధ్వర్యంలో రాస్తారోకో, వంటావార్పు కార్యక్రమాలు జరిగాయి. విజయవాడ - జగదల్పూర్ జాతీయరహదారిపై రెండుగంటలసేపు రాస్తారోకో నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను బలవంతంగా తొలగించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు జాతీయరహదారిపై కబడ్డీ ఆడారు. ఏకొండూరు మండలం కంభంపాడులో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కైకలూరులో వెయ్యిమందితో... కైకలూరులో జాతీయ రహదారిపై వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వెయ్యిమందికి పైగా విద్యార్థులు, కార్యకర్తలు గంటపాటు రోడ్డు దిగ్బంధనం చేశారు. విద్యార్థులు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాస్కులు ధరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. పులిగడ్డలో 216 జాతీయ రహదారి దిగ్బంధనం కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. రైతువిభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి సంఘీభావం తెలిపారు. రహదారిపై భోజనాలు చేసి నిరసన తెలిపారు. గుడ్లవల్లేరు, నందివాడ మండలాల్లో రహదారుల దిగ్బంధనం జరిగింది. పామర్రులో రహదారుల దిగ్బంధనానికి పూనుకోగా పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా పార్టీ నేతలు ఉప్పులేటి కల్పన, కుక్కల నాగేశ్వరరావులను అరెస్ట్ చేశారు. మైలవరంలో నియోజకవర్గ సమన్వయకర్త జ్యేష్ఠ రమేష్‌బాబు ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ యార్డు వద్ద విజయవాడ-భద్రాచలం జాతీయ రహదారిపై వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి రహదారిని దిగ్బంధించారు. వంటవార్పూ కార్యక్రమం నిర్వహించి రోడ్డుపైనే భోజనాలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు జ్యేష్ఠ రమేష్‌బాబుతో పాటు మరో ఐదుగురు నేతలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కి తరలించారు. ఇబ్రహీంపట్నంలో వినూత్న నిరసన... ఇబ్రహీంపట్నంలో నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రింగ్ సెంటర్‌ను దిగ్బంధనం చేశారు. విభజనకు పాల్పడిన సోనియాగాంధీ, సహకరించిన చంద్రబాబు దిష్టిబొమ్మలను వేర్వేరు మంచాలపై పడుకోబెట్టి చీపుళ్లతో కొడుతూ నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో జోగి రమేష్‌తో పాటు మరో నలుగురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కంచికచర్ల మండలం కీసర టోల్గేట్ వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై పార్టీ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహనరావు ఆధ్వర్యంలో రోడ్డు దిగ్బంధనం చేపట్టారు. రోడ్డుపైనే దుస్తులు ఇస్త్రీ చేసి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు ఆయనతోపాటు 19 మంది నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. నూజివీడులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నూజివీడు-విస్సన్నపేట, నూజివీడు-మైలవరం, నూజివీడు-జంక్షన్, నూజివీడు-విజయవాడ రహదారులను దిగ్బంధించారు. గన్నవరం గాంధీబొమ్మ సెంటర్లో జాతీయ రహదారి, గన్నవరం-నూజివీడు రహదారిని దిగ్బంధించారు. హనుమాన్‌జంక్షన్‌లో పార్టీ నేత దుట్టా రామచంద్రరావు ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై భారీ మానవహారం నిర్మించి రోడ్డు దిగ్బంధనం కార్యక్రమం నిర్వహించారు. బందరు నియోజకవర్గంలోని కోనేరు సెంటరులో నాలుగు వైపులా రోడ్లను దిగ్బంధించారు. మచిలీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో గూడూరు మండలంలో విజయవాడ- మచిలీపట్నం జాతీయ రహదారిపై రోడ్డు దిగ్బంధనం చేపట్టారు. ఉయ్యూరులో రోడ్లు దిగ్బంధించారు. గండిగుంట బైపాస్ వద్ద మూడుగంటలపాటు రాస్తారోకో చేశారు. ఉయ్యూరు ప్రధాన సెంటర్లో వంటావార్పు నిర్వహించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు పడమట సురేష్‌బాబు, తాతినేని పద్మావతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. -
సంక్షోభంలో టెక్స్టైల్
సాక్షి, బెంగళూరు: సమైక్యాంధ్ర నినాదంతో రెండు నెలలుగా ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న సమ్మె ఇక్కడి టెక్స్టైల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బెంగళూరు చుట్టు పక్కల ఉన్న గార్మెంట్ ఫ్యాక్టరీలకు వచ్చే ఆర్డర్లు కూడా గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను విభజించడానికి సీడబ్ల్యుసీలో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకిస్తూ రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సమ్మె ప్రభావం కర్ణాటకలోని వివిధ ప్రాంతాలతో పాటు ముఖ్యంగా బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న టెక్స్టైల్ రంగంపై కూడా పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కడప జిల్లాల్లోని కదిరి, పులివెందుల, అనంతపురం జిల్లా కేంద్రం, హిందూపురం తదితర ప్రాంతాలకు చెందిన వస్త్ర వ్యాపారులు బెంగళూరులో హోల్‌సేల్ ధరలకు వస్త్రాలు కొనుగోలు చేసి అక్కడి వారాంతపు సంతల్లో, చిన్నచిన్న దుకాణాల్లో రీటైల్‌గా అమ్ముతుంటారు. ఇక కదిరిలోని వస్త్ర వ్యాపారులైతే వారానికి ఒకసారి బెంగళూరుకు వచ్చి ఇక్కడి గాంధీనగర్, కమర్షియల్ స్ట్రీట్ తదితర చోట్ల దుస్తులను కొనుగోలు చేసి తీసుకెళుతుంటారు. అయితే సమ్మె కారణంగా కదిరి, పులివెందుల, హిందూపురం, అనంతపురం జిల్లాకేంద్రం ప్రాంతాల్లోని దుకాణాలు వుూతపడటం వల్ల బెంగళూరులోని హోల్‌సేల్ మార్కెట్లో దుస్తులు కొనుగోలు బాగా తగ్గిపోయింది. దీంతో బెంగళూరులోని హోల్‌సేల్ వస్త్ర వ్యాపారులకు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వ్యాపార వాటాలో కోత పడింది. ఇక సమ్మె ప్రభావం మొదట్లో ఇక్కడి గార్మెంట్ ఫ్యాక్టరీలపై అంతగా పడకున్నా ఇప్పుడిప్పుడే ఆ తీవ్రత పెరుగుతోంది. ఇక్కడి గార్మెంట్ ఫ్యాక్టరీలకు వచ్చే ఆర్డర్లలో రాయలసీమ జిల్లాలతో పాటు విజయవాడ, విశాఖపట్టణం తదితర ప్రాంతాల వాటా ఎక్కువగా ఉంది. అయితే సమైక్యాంధ్ర సమ్మె కారణంగా ఆయా ప్రాంతాల్లో వ్యాపారాలు స్తంభించడంతో ఇక్కడి గార్మెంట్ యూనిట్లకు ఆర్డర్ల సంఖ్య బాగా తగ్గుతోంది. రవాణా వ్యవస్థ స్తంభించడమూ కారణమే... సమ్మె ప్రభావం టెక్స్టైల్ రంగంపై పడటానికి రవాణా వ్యవస్థ స్తంభించడం కూడా ఒక కారణమనే వాదన వినిపిస్తోంది. చిరు వ్యాపారులు తాము కొనుగోలు చేసిన దుస్తుల రవాణాకు సాధారణంగా కేఎస్ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ బస్సులనే వాడుతుంటారు. అయితే రెండు నెలలుగా ఇక్కడి కేఎస్ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లడం లేదు. కొనుగోలు చేసిన వస్త్రాల రవాణాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండటం కూడా టెక్స్టైల్ రంగంపై ప్రభావం చూపడానికి మరో కారణం. ఈ విషయంపై హోల్‌సేల్ వస్త్రవ్యాపారి సయ్యద్ ఖురేషి సాక్షితో మాట్లాడుతూ.... ‘సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న సమ్మె వల్ల ఇక్కడి నుంచి ఏపీఎస్, కేఎస్ ఆర్టీసీ బస్సులు ఆంధ్రవైపు వెళ్లడం లేదు. చిరు వస్త్రవ్యాపారులకు ప్రైవేటు వాహనాల్లో రవాణా చేసే స్తోమత ఉండదు. అందువల్ల కూడా వారు ఇక్కడ దుస్తులను కొలుగోలు చేయడం నిలిపివేశారు’ అని తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు బస్సులు న డపక పోవడంతో ఈ రెండు నెలల్లో కేఎస్ ఆర్టీసీ రోజుకు సగటున రూ.40 లక్షల ఆదాయం కోల్పోవడంతో మొత్తం రూ.24 కోట్ల ఆయానికి గండి పడింది. ఇక బెంగళూరు నుంచి ఏపీకి బస్సులను నడుపుతున్న ఏపీఎస్ ఆర్టీసీ కూడా రూ.6 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. -
ఉద్యోగుల సమ్మెతో స్తంభించిన పాలన
ఏలూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుండటం.. ఉద్యోగులు, అధికారులు సైతం ప్రజలతో కలిసి ఉద్యమంలో మమేకం కావడంతో జిల్లాలో పాలన పూర్తిగా స్తంభించింది. ప్రభుత్వ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై కలెక్టర్ సిద్ధార్థజైన్, జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు దృష్టి సారించారు. ఈ నెలాఖరు వరకూ వేచిచూసే ధోరణిని అవలంబించాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈలోగా ప్రజలకు అందించాల్సిన సేవలపై పలు కీలక నిర్ణయూలు తీసుకున్నారు. ఉద్యమం నేపథ్యంలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచడంతోపాటు, ధరలు పెరగకుండా చూడటం వంటి చర్యలు చేపట్టారు. ఇప్పటికే హోల్‌సేల్ వ్యాపారులతో సంప్రదింపులు జరిపిన ఉన్నతాధికారులు కిలో కందిపప్పును రూ.67కు, ఉల్లిని రూ.35కు అందించేందుకు చర్యలు చేపట్టారు. అయితే, పాలనాపరమైన, ప్రజాపరమైన సేవలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. వ్యవసాయ శాఖ జేడీ వీడీవీ కృపాదాస్ మినహా వ్యవసాయ అధికారులంతా నిరవధిక సమ్మెలో ఉన్నారు. దీంతో గతేడాది ఖరీఫ్ పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహా రం అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి రూ.30 కోట్లు రైతుల ఖాతాల్లో జమకాలేదు. వ్యవసాయ అధికారులు విధుల్లోకి వస్తే గాని వీటిని సరి చేసే పరిస్థితి లేదు. ఈలోగా 46 మండలాల్లో నష్టపోయిన రైతుల జాబితా ఆధారంగా వారి అకౌంట్లను సరిచూసే పనిని జేడీ చేపట్టారు. ఇందుకు ఇతర జిల్లాలకు చెందిన అవుట్ సోర్సింగ్ సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ మొదటి వారానికి కొలిక్కి తీసుకురావాలనే యోచనలో ఉన్నారు. రేషన్ పంపిణీకి ప్రత్యేక చర్యలు.. ఉద్యమం నేపథ్యంలో పేదలకు రేషన్ డిపోల ద్వారా నిత్యావసర సరుకులు అందించడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అవసరమైతే పోలీసు బలగాలను రంగంలోకి దింపి సరుకులను పంపిణీ చేయూలనే యోచనకు ఉన్నతాధికారులు వచ్చారు. కౌలు రైతులకు రుణాలందించే విషయంలో ఇబ్బందులను పర్యవేక్షించేందుకు వ్యవసాయ శాఖ జేడీ, ఎల్డీఎం, జేసీ రంగంలోకి దిగారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కుంటుపడకుండా చూసే బాధ్యతను సర్పంచ్‌లకు అప్పగించారు.