ample
-
ఆంపిల్ ర్యాంప్
వారంతా సాఫ్ట్వేర్ ఉద్యోగులు.. నిత్యం కంప్యూటర్లతో తలమునకలవుతుంటారు.. అయితేనేం.. మోడల్స్‌కు మేమేం తీసిపోమంటూ.. అలవోకగా ర్యాంప్ వాక్ చేశారు.. అంతేకాదు.. ఆహూతులను ఆసాంతం అలరించారు.గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ ఈ వేడుకకు వేదికైంది.. ‘ఆంపిల్ లాజిక్’ సంస్థ 15వ వార్షికోత్సవంలో భాగంగా శుక్రవారం ఉత్సాహభరిత వాతావరణంలో సంస్థ ఉద్యోగులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.. క్రీడల, ఇతర పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు సంస్థ ప్రోత్సాహకాలను అందజేసి, సత్కరించింది. ఉద్యోగుల సహకారంతో సంస్థ దినదినాభివృద్ధి చెందుతుందని సీఈఒ మన్నె వెంకన్న చౌదిరి పేర్కొన్నారు. – లక్డీకాపూల్ -
జీవిత కథ
‘‘అమ్మా జాగ్రత్త! ఈ వయసులో నిన్ను ఒంటరిగా పంపడం ఇష్టంలేదు. నాకూ రావాలనే వుంది కానీ ఈ నెలాఖరుకు రిటైర్ అవుతుండటంతో సెలవు పెట్టడం కుదరక నేను రాలేకపోతున్నాను. రాజమండ్రి స్టేషన్‌కు మావయ్య కొడుకు రామం వస్తానన్నాడు. జాగ్రత్తగా దిగు. వెళ్ళగానే ఫోనుచేయి.’’ గౌతమీ ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీలో తల్లిని కూర్చోబెట్టి జాగ్రత్తలు చెప్పాడు శ్రీహర్ష.‘‘గోదావరికీ నాకూ ఉన్న అనుబంధం నీకు తెలిసిందే కదరా. పుష్కరాలలో గోదావరిలో స్నానం చేయందే నాకు తోచదని నీకు తెలుసుకదా. నాకేం ఫరవాలేదు. నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్లు ...’’ తనయునికి ధైర్యం చెప్పింది గౌతమి.అమ్మ చేతిలో చేయివేసి ఆప్యాయంగా తడిమి రైలు దిగాడు శ్రీహర్ష.గౌతమీ ఎక్స్‌ప్రెస్ నెమ్మదిగా బయలుదేరి వేగం పుంజుకుంది.స్టేషన్లో శ్రీహర్ష కొనియిచ్చిన పుష్కరాల స్పెషల్ పత్రిక తీసి పేజీలు తిరగేసింది. గోదావరిలో కేరింతలు కొడుతున్న చిన్నపిల్లల ఫైలు ఫొటోలు చూస్తూంటే తన బాల్యం గుర్తుకువచ్చింది గౌతమికి. ఎనభై నాలుగు సంవత్సరాల క్రితం గోదావరి పుష్కరాల మొదటిరోజున పుట్టిన అమ్మాయికి గౌతమి అని పేరు పెట్టారు తల్లిదండ్రులు.గౌతమి బాల్యమంతా రాజమండ్రిలో గడిచింది.ముగ్గురు అబ్బాయిల తరువాత పుట్టిన అమ్మాయి కావడంతో గౌతమి గారాబంగా పెరిగింది.చిన్నతనంలో ఆడుకున్న ఆటలు... వామనగుంటలు... తొక్కుడుబిళ్ళ... సంక్రాంతికి ముగ్గులు పెట్టడం... గొబ్బెమ్మలు... గుర్తుకు వచ్చాయి గౌతమికి.‘ఈకాలం పిల్లలకు ఈ ఆటలేవీ తెలియవు. ప్రస్తుతం నడుస్తున్నది టెక్నాలజీ యుగం. అప్పటి బాల్యం స్వేచ్ఛావిహారం. బండెడు పుస్తకాల బరువు లేదు. హోంవర్కుల బెడద లేదు. ఆడుతూ పాడుతూ చదువులు. సుమతీ శతకం, వేమన శతకం అమ్మ వంట చేస్తూ వల్లెవేయించేది.’ బాల్య స్మృతులు తలచుకొని మురిసిపోయింది గౌతమి.టీసీ వచ్చి టికెట్ చెక్ చేశాడు.పై బెర్త్ మీద యువతి లైట్ ఆర్పి బెర్త్ ఎక్కి పడుకుంది.తన బెర్త్‌పై దుప్పటి పరుచుకుని నడుం వాల్చింది గౌతమి.కళ్ళు మూసుకుంటే చిన్నప్పుడు మొదటి పుష్కరస్నానం చేసిన ఘటన తలపుకొచ్చింది.అప్పటికి గౌతమి వయసు పన్నెండేళ్ళు.తల్లిదండ్రులు, తాతయ్యలు, అమ్మమ్మ... మామ్మ... పెదనాన్నలు... మావయ్యలు... వాళ్ళ పిల్లలు... అందరూ కలిసి నలభైమంది కలిసికట్టుగా గోదావరి చేరుకున్నారు.పిల్లలు గోదావరిలో ఉత్సాహంగా ఉరకలేశారు. ఒరేయ్ కృష్ణా జాగ్రత్తరా... పెద్దోడా నీకసలే తొందర... నెమ్మదిగా దిగు... చిన్నా... నువ్వు పెద్దాడి చెయ్యి పట్టుకో... గౌతమీ, మగాళ్ళతో సమానంగా ఏమిటీ పరుగులు... అంటూ పెద్దలుహెచ్చరిస్తున్నా వినీ విననట్లు పిల్లలు గోదావరిలో ఈదులాటలు...అరగంటపైగా నదిలో జలకాలాడి బయటకు వస్తే చెప్పలేని ఆనందం...‘‘మంచి మొగుడు రావాలని గోదావరమ్మకు మొక్కుకో’’ తల్లి సలహా.స్నానాలయ్యాక ఇంటికి చేరి అమ్మకు వంటపనిలో సహాయం చేయడం... బంధుమిత్రులతో కలిసి విందుభోజనం. ‘పుష్కరాల పన్నెండు రోజులూ రోజూ ఇంటికి వచ్చిన బంధువులతో కలిసి వెళ్ళి స్నానం చేసి వచ్చిన రోజులు మరచిపోదామన్నా మరపురావు. గోదావరితో అనుబంధం అప్పుడే బలపడింది.’ అనుకుంటూ చలిగా అనిపిస్తే రగ్గు తీసి కప్పుకుంది గౌతమి. పడుకుందామ నుకున్నా నిద్ర రావడంలేదు. మనసు నిండా ఆలోచనలు.రెండోసారి పుష్కరాలు గుర్తుకు తెచ్చుకుంది గౌతమి.పుష్కరానికీ పుష్కరానికీ మధ్య ఆ పన్నెండేళ్ళలో దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. దేశమంతా సంబరాలు జరుగుతున్న రోజున ఇంట్లో స్వీట్లు చేసి అందరికీ పంచింది తల్లి. ఇంటిపైన జెండా ఎగరేశాడు తండ్రి.ఆ పుష్కరాలకి వయసు తెచ్చిన అందాలతో భాసిల్లింది గౌతమి. వివాహమైంది. భర్త రాఘవరావు అమలాపురంలో స్కూల్ టీచర్. గౌతమి ఇంటిపేరు మారింది.మొదటిసారి పుష్కరాలకి తల్లిదండ్రులు తోడుంటే రెండోసారి పుష్కరాలకు అత్తమామలు, భర్తతో కలిసి గోదావరికి వెళ్ళింది గౌతమి.భర్త, అత్తమామలు, ఆడపడుచులు... మరుదులు... పెద్దత్తగారు... పిల్లలు అందరూ కలిసి గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు.అటు తిరిగితే భర్త... ఇటు తిరిగితే అత్తమామలు... మధ్యలో ఒదిగి ఉండవలసిన జీవితం.తన వైవాహిక జీవితాన్ని తలచుకుంటూ బెర్తుపై లేచి కూర్చుంది గౌతమి.అత్తారింటికి వెళ్ళడానికి ముందు ఉమ్మడి కుటుంబంలో సర్దుకుపోయే మనస్తత్వం అలవరచుకోమని తల్లి నూరిపోసింది.భయంభయంగా అమలాపురంలోని అత్తారింట్లో అడుగుపెట్టింది గౌతమి. మొదటిరోజే పెద్దకోడలికి వంటగది అప్పజెప్పింది అత్తగారు.ఆ ఇంట్లో ఆవిడదే పెత్తనమని గ్రహించింది కోడలు. మామగారు నోరులేని మనిషి. ఆ రోజుల్లో అత్తగారి ఆంక్షల వలయంలో పగలంతా వంటగదికే అంకితమయ్యేది గౌతమి.నాలుగువందల గజాల స్థలంలో పది కొబ్బరిచెట్ల మధ్య పెంకుటిల్లు...రోజూ తెల్లవారుజామున లేచి ఇంటిచుట్టూ తుడిచి... నీళ్ళు జల్లి... ముగ్గులేసేది. కాస్త పొద్దెక్కగానే వంటింట్లో చేరి అందరికీ కాఫీలు... ఫలహారాలు... కట్టెలపొయ్యి మీద వంటలు... వంట పూర్తయ్యేసరికి పొగకికళ్ళుఉబ్బిపోయేవి.మధ్యాహ్నం భోజనాల తరువాత... రోట్లో ఇడ్లీ పప్పు... పచ్చళ్ళు రుబ్బడం... తిరగలిలో పప్పులు... బియ్యంనూక విసరడం... ఏదో ఒక పని ఎదురుచూసేది.ఇంటికి వచ్చే పోయే చుట్టాలతో ఇల్లు కళకళలాడుతుండేది.పని పని పని... పగలంతా క్షణం తీరిక లేని పని.పగలంతా ఎంత అలసినా... రాత్రి భర్త చేరువలో సేదతీరేది.రాఘవరావు నెమ్మదస్తుడు. అతని మంచితనం ఆమెకు వరమయింది.‘‘పచ్చని పసిమిఛాయ... కలువ రేకుల్లాంటి కళ్ళు... చంద్రబింబం లాంటి మోము... అన్నిటికీ మించి నీ ఓర్పు, మంచితనం... అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం... నాకోసం దివిపై వెలసిన దేవతవు’’ అని భర్త పొగుడుతుంటే సిగ్గుల మొగ్గయ్యేది భార్య.భర్త అనురాగ బలంతో భార్య అలసట మాయమయ్యేది.భర్త తలపుకు రాగానే కళ్ళు చెమ్మగిల్లాయి గౌతమికి.కళ్ళు తుడుచుకుని మంచినీళ్ళు తాగి బెర్త్‌పై మేనువాల్చింది. ‘నిద్ర రావడంలేదు... ఎందుకో గతం పదే పదే గుర్తుకువస్తోంది.’ అనుకుంటూ అంతలోనే లేచి కూర్చుంది. మూడోసారి పుష్కరాలకు వెళ్ళేసరికి ఇద్దరు పిల్లలు తోడయ్యారు.అబ్బాయి శ్రీహర్ష. అమ్మాయి శ్రీలత.భర్త, అత్తగారు, పిల్లలు... మరుదులు, తోటికోడళ్ళతో కలిసి రాజమండ్రి చేరుకుంది గౌతమి.ఈమధ్య కాలంలో మావగారు గుండెపోటుతో మరణించారు.స్నానం చేస్తూ అత్తగారు కన్నీరు కార్చారు. ఆమె చేయి పట్టుకుని స్నానం చేయించి గట్టు మీదకు తీసుకొచ్చింది. రాఘవరావు తండ్రికి పిండప్రదానం చేశాడు.పిల్లలు గోదావరిలో దిగి జలకాలాడుతుంటే బాల్యం గుర్తుకువచ్చి,‘అప్పటి అమ్మ స్థానంలో ఇప్పుడు నేను... నా స్థానంలో నా పిల్లలు...’ అనుకుంటూ జీవితచక్రంలో జరిగిన మార్పుల్ని తలచుకుని గోదావరి గట్టుపై నిలబడి నవ్వుకున్న ఘటన తలపుకొచ్చి పెదవులపై చిరుదరహాసం మెరిసింది.పుష్కరాల నుండి తిరిగి వచ్చిన రెండేళ్ళకి ఉమ్మడికుటుంబం విచ్ఛిన్నమయింది. పెద్దమరిది ట్రాన్స్ఫర్ చేయించుకుని ఏలూరులో మకాం పెట్టాడు.చిన్నమరిది తునికి మకాం మార్చాడు.బంధుమిత్రుల రాకపోకలు తగ్గిపోయాయి. అత్తగారు అనారోగ్యంతో కుదేలయింది.‘‘పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. కాకినాడ విద్యాలయాలకు పెట్టింది పేరు. అక్కడిపిఠాపురం రాజావారి హైస్కూల్లో చదువు బాగుంటుందంటున్నారు. కాకినాడ మారిపోదాం...’’ ప్రతిపాదించింది గౌతమి.రాఘవరావు సమ్మతించాడు.కాకినాడ ట్రాన్స్‌ఫర్‌కు ప్రయత్నించి, ఆరు నెలల్లో ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు.కాకినాడకు మకాం మారింది.అమలాపురంలో ఇల్లు అమ్మేసి తన వాటా డబ్బుతో కాకినాడలో ఇల్లు కొందామని తల్లితో చెప్పాడు రాఘవరావు.అమలాపురంలో ఇల్లు అమ్మడానికి అత్తగారు మొదట ఒప్పుకోలేదు.నాలుగు నెలలు పోరి తల్లిని ఒప్పించాడు రాఘవరావు. కాకినాడలో చిన్న ఇల్లు కొనుక్కుని స్థిరపడ్డారు రాఘవరావు దంపతులు. ‘ఎప్పటి సంగతులో తలపుకొస్తే నిన్న గాక మొన్న జరిగినట్లనిపిస్తోంది’ అనుకుంది గౌతమి.నిద్ర ఎగిరిపోయింది.నాలుగోసారి పుష్కరాలకు వెళ్ళినప్పుడు... తలచుకుంటూ సర్దుకుకూర్చుంది గౌతమి.అత్తగారు కాలంచేశారు. పన్నెండేళ్ళ కాలంలో ఇంట్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆధునిక సౌకర్యాలు సమకూర్చాడు రాఘవరావు.గ్యాస్‌స్టవ్ వచ్చింది. ఫ్రిజ్ వంటింట్లో చేరింది. మిక్సీ కొనుక్కున్నారు.డాబా మీద మూడు గదులు కట్టి అద్దెకిచ్చారు.ట్యూషన్స్ చెపుతూ రాబడి పెంచుకున్నాడు రాఘవరావు. గౌతమికి పనిభారం తగ్గింది. విశ్రాంతి సమయంలో రామాయణ, భారతాలు చదవడం మొదలుపెట్టింది.పెద్దలనుండి సలహాలు తీసుకునే స్థాయినుండి శ్రేయోభిలాషులకు సలహాలిచ్చే స్థాయికి ఎదిగింది గౌతమి.గోదావరి నదిలో స్నానంచేసి గట్టుమీద నిలుచున్న గౌతమి జీవితం సుఖదుఃఖాల మిళితం అనుకుంటూ గోదావరమ్మకు ప్రణమిల్లింది.‘నా చిన్నప్పుడు నలభైమందితో కలిసి ఆనందం ఉత్సాహంతో ఉక్కిరిబిక్కిరవుతూ గోదావరిలో జలకాలాడాను. ఈరోజున కేవలం నలుగురం రాగలిగాం. రోజులెలా మారిపోయాయో...’ నిట్టూర్చింది గౌతమి.‘‘ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అర్థాంగీ’’ అడిగాడు భర్త నవ్వుతూ భుజంమీద చేయివేసి.‘‘పుష్కరానికీ పుష్కరానికీ మధ్య జీవితంలో వచ్చిన మార్పులు తలచుకుంటూంటే ఆశ్చర్యంగా వుంది. మనుషులు ఎలా మారినా గోదావరి మాత్రం అలాగే వయ్యారంగా పరుగులెడుతోంది.’’ అంది గౌతమి తడిబట్టలు పిండుతూ.‘‘మనిషి జీవితంలో మహా అయితే ఆరేడు పుష్కరాలు చూస్తాడు. ఓ పుష్కరం గడిచిందంటే పన్నెండేళ్ళ కాలం కరిగిపోయినట్లే. జరిగిపోయిన పుష్కరకాలంలో చేసిన తప్పులు సమీక్షించుకుని మరో పుష్కరంలో సాధించాల్సిన లక్ష్యాలు నిర్దేశించుకుని చేసిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడగలిగితే మనిషి జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది. ప్రణాళిక లేకుండా పరుగులు తీస్తే జారిపడడం ఖాయం’’ అన్నాడు రాఘవరావు.‘‘పుష్కరస్నానంతో పాపాలు పోతాయంటే... చేసిన తప్పులు సరిదిద్దుకుని మిగిలిన జీవితమైనా ధర్మబద్ధంగా జీవించమని హెచ్చరించడమే ఈ స్నానాల పరమార్థం కావచ్చు..’’ తన అభిప్రాయం వ్యక్తీకరించింది గౌతమి. పుష్కరఘాట్ వద్ద కొత్తగా ప్రతిష్టించిన గోదావరిమాత విగ్రహాన్ని దర్శించుకున్నారు.భద్రాచలం వెడదామని పిల్లలు సరదాపడితే ‘‘అలాగే’’ అంటూ భద్రాచలం బయలుదేరారు.గతంగతః అనుకుంటూ జ్ఞాపకాలు నెమరువేసుకుంటూంటే చిన్న కుదుపు.రైలు స్టేషన్లో ఆగినట్టుంది.బోగీలో లైట్లు వెలిగాయి.ఎదుటి బెర్తు మీద వ్యక్తి సామాను తీసుకుని దిగిపోతున్నాడు. ‘‘ఏవూరు?’’ అడిగింది గౌతమి. ‘‘విజయవాడ’’ అంటూ అతను గబగబా గుమ్మంవైపు వెళ్లిపోయాడు.సెల్లో టైము చూస్తే మూడయింది. తెల్లారడానికి ఇంకా మూడు గంటలు గడవాలి. ఏమిటో ఈరాత్రి నిద్రరావడం లేదు. మనసులో ఏదో దిగులు. లైటు ఆర్పింది గౌతమి.అరవై ఏళ్ళ వయసులో ఐదోసారి పుష్కరాలకు వెళ్ళినప్పటి సంఘటనలు మదిని తట్టాయి. కిందటి పుష్కరాలకి, ఈ పుష్కరాలకి మధ్యకాలంలో తల్లిదండ్రులు స్వర్గస్తులయ్యారు. పెదనాన్న, పెద్దమ్మలు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. అన్నయ్యలు మరణించారు.పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోయారు. అబ్బాయి, అమ్మాయిల పెళ్ళిళ్లు జరిగాయి.రాఘవరావు రిటైర్ అయ్యాడు.భార్యాభర్తలు స్వంతగూటిలో మిగిలారు.ఒకప్పుడు చేతినిండా పని... క్షణం తీరికలేని జీవితం...ఇప్పుడు కావలసినంత తీరుబడి... ఇద్దరికి వండుకోవడం... పుస్తకాలు చదవడం...స్నానం చేస్తూ పన్నెండేళ్ళ జీవిత గమనంలో వచ్చిన మార్పుల్ని తలచుకుంటూంటే అయినవాళ్ళు గుర్తుకొచ్చి దుఃఖం పొంగిపొరలి కన్నీటి వరద గోదావరిలో కలిసింది.స్నానం చేసి గట్టుమీద నిలుచున్న గౌతమికి గలగల పారుతున్న గోదావరి మాత్రమే నిత్య సత్యమని తోచింది.‘‘ఒకతరం జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఆదరించిన అత్తమామలు, పెద్దమ్మలు, పెదనాన్నలు... గురువులు... పెద్దలు... ఒక్కొక్కరిగా ఒరిగిపోతూ... కళ్ళముందే కాలగర్భంలో కలుస్తూంటే పదిరోజుల పరితాపంలో జీవితం భ్రమ అనే సత్యం బోధపడుతుంది. అంతలోనే మరోతరం... కూతుళ్ళు, కొడుకులు, మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు, చిన్నారులు అనురాగం కురిపిస్తూ అలరిస్తూంటే జీవితం సత్యమనే భ్రమలో మునిగిపోతాం’’ అంది గౌతమి.భార్య బాధపడుతోందని తెలుసుకుని ఆమెని అనునయించాడు భర్త.‘‘కాలగమనం ఆగదు... పరుగెడుతూనే ఉంటుంది. తరాలు మారుతూనే ఉంటాయి. భావాలు, భావోద్వేగాలు, సుఖాలు, దుఃఖాలు, కోపాలు, రోషాల మధ్య కొట్టుమిట్టాడే మనిషి బంధాలు అనుబంధాలు పెనవేసుకుని జీవితంపై మమకారంతో బతుకుతాడు. జీవితం క్షణభంగురమని తెలిసీ చిరంజీవి కావాలనుకుంటాడు. వయసు పెరుగుతూంటే జీవితమే మనిషికి పాఠాలు నేర్పుతుంది గౌతమీ. మనం మన తల్లిదండ్రుల్ని గౌరవించాం. మన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి, మంచి పౌరులుగా తీర్చిదిద్దాం. మన బాధ్యతలు మనం సక్రమంగా నెరవేర్చామన్న తృప్తితో శేషజీవితాన్ని భగవధ్యానంలో గడిపేద్దాం’’ తత్వబోధ చేశాడు రాఘవరావు. ఆనాటి సన్నివేశం కళ్ళకు కట్టినట్లయింది గౌతమికి. నిడదవోలు వచ్చిందని పై బెర్తు మీద యువతి దిగి వెళ్ళిపోయింది.ఇంకో గంటలో రాజమండ్రిలో ఉంటాననుకుంటూ సర్దుకుకూర్చుంది గౌతమి.క్రితంసారి పుష్కరాలకు కొడుకు, కోడలు, మనుమలతో రాజమండ్రి వచ్చిననాటి సంగతి గుర్తుకు తెచ్చుకుంది.ఇరవైఏళ్ళ మనవరాలు నదిలో స్నానం చేసి వస్తుంటే తనే నడచి వస్తున్నట్లు ఫీలయింది గట్టుమీద నించున్న గౌతమి.మనవరాలు అచ్చు తన పోలికే.‘‘మా అమ్మాయిలో నాకు అమ్మ కనిపిస్తుంది’’ అన్నాడు శ్రీహర్ష.‘‘ఆరోజుల్లో అందరూ నన్ను అమ్మలా వున్నాననే వారు... ఇప్పుడు మనవరాలు నా పోలిక... జీన్స్ ప్రభావం... వారసత్వం వెన్నంటే వుంటుంది’’ గర్వంగా చూసింది గౌతమి.‘‘మనకి వయసయిపోతోంది. మళ్ళీ పుష్కరాలకి ఉంటామో... ఉండమో... పద... తనివితీరా స్నానం చేద్దాం’’ అన్న భర్త మాటలకు ఉలిక్కిపడింది గౌతమి.‘‘ఛ... అవేం మాటలండీ...’’ అంటూనే భర్త చేయిపట్టుకుని నదిలోకి దిగింది.తథాస్తు దేవతలుంటారు కాబోలు...అదే భర్తతో ఆఖరి పుష్కరస్నానం...ఆ పుష్కరాల నుండి వచ్చిన నాలుగేళ్లకి భర్త కాలంచేశాడు.భర్త చనిపోయాక కాకినాడలో ఇల్లు అమ్మేసి హైదరాబాదులో కొడుకు పంచన చేరింది గౌతమి. ఆనాటి సంఘటనలన్నీ ఒకదాని వెంట ఒకటిగా గౌతమికి కనులముందు కదలాడాయి. గోదావరి వంతెనపై రైలు నడుస్తున్న శబ్దం ఆమె కర్ణపుటాలకు తాకింది. ఆలోచనల్లోంచి తేరుకుని, కిటికీ తెర తొలగించి గోదావరమ్మకు నమస్కరించింది.‘నదిలో స్నానం చేస్తూంటే అమ్మ ఒడిలో ఉన్నంత హాయి’ అనుకుంది. నదీమతల్లితో పెనవేసుకున్న అనుబంధం మనసును తడిమింది.ఉదయభానుడు ఉత్సాహంగా తొంగిచూస్తున్నాడు.రాజమండ్రి స్టేషన్లో బండి ఆగుతూంటే... బ్యాగ్ తీసుకుని గుమ్మం దగ్గరకు చేరుకుంది గౌతమి.బోగీ దగ్గరే నించున్నాడు రామం.బ్యాగ్ అందుకుని చేయి అందించి గౌతమికి రైలు దిగడంలో సహాయం చేశాడు.‘‘ప్రయాణం బాగా జరిగిందా అత్తయ్యా... రాత్రి నిద్రపట్టిందా...’’ అడిగాడు రామం ముందుకు అడుగులేస్తూ.‘‘ఓ నిక్షేపంగా...’’ నవ్వుతూ బదులిచ్చింది గౌతమి.‘‘నడవగలవా... వీల్‌చైర్æమాట్లాడనా...’’ అడిగాడు మళ్ళీ.‘‘భగవంతుని దయవలన అనారోగ్యమేమీ లేదురా... నీ స్పీడు అందుకోలేకపోయినా నెమ్మదిగా నడవగల ఓపిక వుంది. అందరూ కులాసాయే కదా’’ అడిగింది గౌతమి. యోగక్షేమాలు మాట్లాడుకుంటూ ఆటోస్టాండ్ చేరారిద్దరూ.గౌతమిని సాదరంగా ఆహ్వానించింది సునీత, రామం భార్య.‘‘ఈరోజు విశ్రాంతి తీసుకో. రేపు తెల్లవారు జామునే గోదావరి స్నానానికి వెడదాం.’’ అన్నాడు రామం.‘‘ఈ గోదావరి పుష్కరాలు మహా పుష్కరాలుట. నూట నలభై నాలుగు సంవత్సరాలకోసారి ఇలాంటి మహత్తర పుష్కరాలొస్తాయట. మన జీవితకాలంలో రావడం మన అదృష్టం. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో పుష్కరస్నానం చేయాలని నా కోరిక’’ సునీత తెచ్చిన కాఫీకప్పు అందుకుంటూ చెప్పింది గౌతమి.‘‘అలాగే అత్తయ్యా... నేను తీసుకువెళ్ళి స్నానం చేయిస్తాగా. నాలుగురోజులు మా ఇంట్లో ఉంచమని చెపితే వినకుండా శ్రీహర్ష రేపు రాత్రికే రిజర్వేషన్ చేయించేశారు. నాలుగు రోజులు మా ఇంట్లో ఉండొచ్చు కదా...’’ అడిగాడు రామం.‘‘శ్రీహర్ష నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు. అతికష్టం మీద వాడిని ఒప్పించి బయలుదేరాను’’ అంటూ స్నానానికి లేచింది గౌతమి. తెల్లవారుజామునే పుష్కరఘాట్ చేరుకున్నారు రామం, గౌతమి. గౌతమి చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు రామం. గేటు మూసివుంది. ఘాట్‌లోకి ఎవరినీ వెళ్ళనీయడంలేదు. ముఖ్యమంత్రిగారి స్నానం, పూజలు అయ్యాక యాత్రికుల్ని పంపుతారని చెప్పుకుంటున్నారు.అక్కడున్న చిన్నగుంపు మధ్య నిలబడ్డారు రామం, గౌతమి. జనం నెమ్మదిగా చేరుతున్నారు. రెండు గంటల సమయం గడిచింది. జనం పోటెత్తారు. ముందుకీ వెనక్కీ కదలలేని పరిస్థితి. గౌతమికి అంతసేపు నిలబడ్డం వల్ల ప్రయాసగా ఉంది. రామం వెనక్కు వెళ్ళిపోదామన్నాడు. వెనక్కి తిరిగిచూస్తే వెళ్ళడం చాలా కష్టమనిపించి ఆగారు. ఇంతలో గేట్లు తెరుస్తున్నారని అరిచారు. అంతే. ఒక్కసారి తోపులాట మొదలైంది. ఎవరో వెనక్కు నెట్టారు. తోపులాటలో రామం, గౌతమి విడిపోయారు. వెనుకనుండి ముందుకు, ముందునుంచి వెనుకకు నెట్టబడిబ్యాలెన్స్ తప్పి కూలబడింది గౌతమి. ఎనభైనాలుగేళ్ళ వృద్ధురాలికి కళ్ళు తిరిగినట్లయి ఆయాసం మొదలైంది. పక్కవారిని గమనించే స్థితిలో ఎవరూ లేరు. ఉరుకులు... పరుగులు... గౌతమి మీద ఎవరిదో కాలు పడింది.‘అమ్మా’ అన్న ఆర్తనాదం గాలిలో కలిసిపోయింది.గౌతమి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిశాయి. వేదంలా ఘోషిస్తూ గోదావరి గంభీరంగా ప్రవహిస్తోంది. -
కావేరీ పుష్కరాలు
గంగానది తర్వాత అంతటి పవిత్రమైనదిగా భావించే నది కావేరి. అందుకే కావేరిని దక్షిణ గంగ అని పిలుస్తారు. దేవగురువైన బృహస్పతి తులారాశిలో ప్రవేశించడంతో కావేరీనదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయి. బృహస్పతి ఈ సెప్టెంబర్ 12న కన్యారాశి నుంచి తులారాశిలో కాలు పెడుతున్నాడు. 23 వరకు అక్కడే ఉంటాడు కాబట్టి ఈ 12 రోజులూ ఆ నది పుష్కర శోభను సంతరించుకుంటుంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు కావేరీ పుష్కరాలలో పుణ్యస్నానాలు చేసి పునీతులవుతారు. నర్మదా నదీతీరంలో తపస్సు, కురుక్షేత్రంలో దానం, కాశీక్షేత్రంలో మరణించడం వల్ల కలిగే ఫలం కేవలం పుష్కర స్నానం వల్ల కలుగుతుందని పురాణోక్తి. ఎక్కడ పుట్టింది? పూర్వం బ్రహ్మగిరి పర్వత ప్రాంతంలో కావేరుడనే రాజు ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో బ్రహ్మని గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ఆయన తపస్సుకు మెచ్చి, ఓ అందాల పాపను ప్రసాదించాడు. కావేరి అని పేరు పెట్టుకుని రాజు ఆ బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. యుక్తవయసు రాగానే ఆమెను అగస్త్య మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు. వివాహ సమయంలో తనను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టకూడదని అగస్త్యుని కోరింది కావేరి. అంగీకరించాముని. అగస్త్యుడు ఓ రోజున తన శిష్యులకు తత్త్వశాస్త్ర రహస్యాలను బోధించడం కోసం శిష్యులను దూరంగా తీసుకెళ్లి పాఠాలు చెబుతున్నాడు. భర్త తనను విడిచి వెళ్లడంతో కావేరి కోపంతో ఒక తటాకంలో దూకింది. అయితే, ఆమె బ్రహ్మవర ప్రసాదిని కావడంతో మరణించడానికి బదులు నదిగా మారిపోయి బ్రహ్మగిరి పర్వతాల మీదుగా ప్రవహిస్తూ వెళ్లింది. ఆమే కావేరీ నదిగా ప్రసిద్ధికెక్కింది.మరో కథ ఏమిటంటే, తనని విడిచి ఉండరాదన్న భార్య కోరికను మన్నించి అగస్త్యుడు ఆమెను జలరూపంలోకి మార్చి తన కమండలంలో ఉంచుకుని ఎల్లప్పుడూ తనవద్దే ఉంచుకునేవాడు. అయితే, ఒకసారి ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైన క్షామం వచ్చింది. వర్షాలు లేక జలాశయాలన్నీ ఎండిపోయాయి. పంటలు పండక ప్రజలు అల్లాడుతూ, విఘ్నేశ్వరుని ప్రార్థించారు. వినాయకుడు ఆవు రూపంలో అగస్త్యుని వద్దకు వచ్చి, గడ్డిమేస్తున్నట్లు నటిస్తూ, కమండలాన్ని తన ముట్టెతో కింద పడేలా చేశాడు. దాంతో కావేరి కాస్తా నదీరూపాన్ని సంతరించుకుని, అక్కడినుంచి తన పుట్టినిల్లైన బ్రహ్మగిరి వరకూ ప్రవహించింది. దాంతో ఆయా ప్రదేశాలన్నీ ససస్యశ్యామలమయ్యాయి.కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ఉన్న కొడగు జిల్లాలోని తలాకావేరి అనే ప్రదేశంలో పుట్టిన కావేరి తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో ప్రవహిస్తుంది. హేమవతి, పింషా, అర్కవతి, కుంబిని, భవాని, నొయ్యల్, అమరావతి నదులు కావేరికి ఉపనదులు. తలకావేరి, కుషల్ నగర్, శ్రీరంగపట్టణ, భవాని, ఈరోడ్, నమ్మక్కళ్, తిరుచిరాపల్లి, కుంభకోణం, మాయావరం, పుంపుహార్ నగరాల గుండా ప్రవహిస్తుంది. చందనపు అడవులకు, ప్రకృతి సౌందర్యానికీ పెట్టింది పేరైన కూర్గ్ కావేరీనది వరప్రసాదమే. బెంగళూరు పులి టిప్పుసుల్తాన్ రాజధాని శ్రీరంగపట్టణం కావేరీ నది ఒడ్డునే ఉంది. తమిళనాడులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన శ్రీరంగం, కుంభకోణం, అందాలకు నెలవైన బృందావన్ గార్డెన్స్... కావేరీనది ఒడ్డునే ఉన్నాయి. పుణ్యతీర్థాలు చెన్నకేశవ స్వామి ఆలయం: 12వ శతాబ్దంలో హొయసాల రాజుల కాలానికి చెందిన ఈ ఆలయ నిర్మాణం, శిల్పచాతుర్యం అపురూపం, అనితర సాధ్యం. మూడవ నరసింహ వర్మ నిర్మించిన ఈ ఆలయం కావేరీ పుష్కరస్నాన భక్తులకు అవశ్య సందర్శనీయం. భగందేశ్వర ఆలయం: కర్ణాటకలోని భగమండలంలోగల ఈ ఆలయం భగంద మహర్షి పేరు మీదుగా నెలకొన్నది. భగమండలంలోగల త్రివేణీ సంగమంలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. విశ్వేశ్వరాలయం, కర్ణాటక: 8వ శతాబ్దంలో చాళుక్యల శిల్పకళారీతిలో నిర్మించిన ఈ ఆలయం అత్యంత పురాతనమైనది. కావేరీ పుష్కరఘాట్లలో ఇది తలమానికమైనది. శ్రీరంగపట్నంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం, సోమనాథపురలోని వేణుగోపాలస్వామి ఆలయం, గంజాంలోని నిమిషాంబాలయం కూడా తప్పక చూడదగ్గవి. పుష్కర స్నాన విధి ముందుగా పుష్కర నదికి ప్రార్థన చేసి తీరంలో ఉండి మట్టిని మూడుసార్లు నీటిలో వేసి తరువాత సంకల్ప సహితంగా పుష్కర స్నానం చేయాలి. పితృదేవతలకు తర్పణం, తీర్థోపవాసం చేయాలి. మృత్తికా స్నానం, పుష్కర స్నానం చేసి ముక్కోటి దేవతలకు, మునులకు తర్పణ విడవాలి. మళ్లీ ప్రవాహానికి అభిముఖంగా స్నానం చేయాలి. దీర్ఘాయువునిచ్చే నదీపూజలు: పుష్కర యాత్రలు చేసిన వారికి, నదీ పూజలు నిర్వహించిన వారివి వ్యాధులు, పాపాలూ తొలగి, దీర్ఘాయుష్షు లభిస్తుందని పురాణగాథలు విదితం చేస్తున్నాయి. ఏమిటీ పుష్కరం? పుష్కరం అంటే పన్నెండేళ్ల కాలం. దేవ గురువు బృహస్పతి తులారాశిలోకి ప్రవేశించినప్పుడు కావేరికి పుష్కరాలు వస్తాయి. ఈ సమయంలో నదికి ఆధి దైవిక శక్తులు వస్తాయి. ఈ çసమయంలో స్నాన, దాన, జప, అర్చన, ధ్యాన, హోమ, తర్పణాది అనుష్ఠానాలకు, పితృపిండ ప్రదానానికి అక్షయమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రోక్తి. ఈ కర్మల వలన శారీరక, మానసిక మలినాలు తొలగి పవిత్రత, ఆధ్యాత్మిక తేజస్సు కలుగుతాయి. పుష్కరాలలో ఆర్.వి.ట్రావెల్స్ ప్రస్థానం ముఖ్యమైన నదులు పన్నెండు. పన్నెండేళ్ల కాలంలో ప్రతి సంవత్సరం ఒక్కో పుణ్యనదికి పుష్కరం రావడం, ఆ పుష్కరస్నానం ఆచరించి పునీతులవడానికి దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది యాత్రికులు పుష్కరస్నానం కోసం రావడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రతి పుష్కరాలలో భక్తులు వసతి, రవాణా, భోజన సంబంధిత విషయాలలో అసౌకర్యానికి గురికావడం, ఎక్కువ మోతాదులో డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి రావడమూ చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి ఏ విధమైన సమస్యలు లేకుండా దేశంలో ఎక్కడ పుష్కరాలు జరిగినా మేమున్నాం అని ముందుకొస్తూ యాత్రికులకు కావలసిన రవాణా, వసతి, భోజనం, సరైన గైడింగ్ సదుపాయాలు కల్పిస్తూ ప్రతి ఏటా వేలాదిమంది యాత్రికులను పుష్కరాలకు పంపడంలో ముందుండేది... తెలుగువారి ఆత్మీయ యాత్రా సంస్థ ‘ఆర్.వి.టూర్స్ అండ్ ట్రావెల్స్’ సంస్థ. ఆర్.వి. ట్రావెల్స్ కావేరి పుష్కర యాత్రలు ఈ సంవత్సరం ఆర్.వి. టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏ భక్తునికి ఎటువంటి అసౌకర్యం కనపడకుండా ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలలో సేవలందిస్తోంది. ప్రతి ఒక్కరూ వెళ్లి పుష్కరస్నానం ఆచరించే విధంగా ఆర్.వి. టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ కేవలం హైదరాబాద్ నుండి మైసూర్–హైదరాబాద్ వరకు రవాణా, లగ్జరీ వసతి, మూడు పూటలా భోజన సదుపాయాలతో కేవలం రూ. 4699కే అద్భుత ప్యాకేజీని అందిస్తోంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోగలరని మనవి. అంతేకాకుండా కావేరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న మహాపుణ్యక్షేత్రాలైన అటు తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగం, జంబుకేశ్వరం, మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, తిరుచెందూరు, చిదంబరం, కుంబకోణం వంటి పుణ్యక్షేత్రాలకు, ఇటు కర్నాటక రాష్ట్రంలో శ్రీరంగపట్నం, మైసూరు, శ్రావణబెల్గోల, ధర్మస్థలం, వర్నాడు, కొక్కిసుబ్రమణ్యం, ఉడిపి, శృంగేరి, గోకర్ణం లాంటి మహా పుణ్యక్షేత్రాలు అన్ని కలిపి ప్రత్యేక తమిళనాడు యాత్రా ప్యాకేజీ... అలాగే ప్రత్యేక కర్ణాటక యాత్రా ప్యాకేజీని ఆర్.వి. టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు అందుబాటులోకి తెస్తున్నారు. మహాపవిత్రమైన కావేరి పుష్కరాలకు వెళ్లాలనుకునేవారు తప్పనిసరిగా ఆర్.వి. టూర్స్ అండ్ ట్రావెల్ ్స వారు దిగువ ఇచ్చిన ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు. -
రూ.వందల కోట్లు కృష్ణార్పణం
-
రూ.వందల కోట్లు కృష్ణార్పణం
సర్కారు అవినీతిలో కొట్టుకుపోయిన పుష్కర ఘాట్లు.. రోడ్లు! వేసిన రోడ్లు గుంతలమయం.. కొన్ని చోట్ల రోడ్లే మాయం.. ఇంకొన్నిచోట్ల సొంత రియల్ఎస్టేట్ వెంచర్లకు రోడ్లు ప్రభుత్వ అండతో అధిక అంచనాలతో పనులు మంజూరు ప్రతి పనిలోనూ స్థానిక పచ్చ నేతలకు కమీషన్లు పుష్కరాలు జరిగింది 135 గ్రామాలు, ఒక నగర ప్రాంతంలోనే లోటు బడ్జెట్లోనూ రూ.1472.39 కోట్లు ఖర్చు.. సరాసరి ఊరికి రూ.11 కోట్లు సాక్షి, అమరావతి: ఒక్కొక్క ఊరికి రూ. 11 కోట్లు ఖర్చు పెట్టారంటే ఆ ఊరి రూపురేఖలే మారిపోవాలి. కానీ పుష్కరాల సందర్భంగా రూ.1472 కోట్లు ఖర్చుపెట్టినా కృష్ణాతీరం వెంట ఉన్న గ్రామాల్లో ఆ మేరకు పనుల ఆనవాళ్లు కనిపించడంలేదు. నామినేషన్లపై పనులు దక్కించుకున్న అధికార పార్టీ నేతలు అరకొర పనులతో కనికట్టు చేసేశారు. కొన్ని చోట్ల ఉన్న రోడ్లపైనే కంకరపోసి బిల్లులు చేయించుకున్నారు. మరికొన్నిచోట్ల రోడ్లు వేయకుండానే వేసినట్లు చూపించేశారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి ప్రైవేటు రియల్ ఎస్టేట్ వెంచర్లకు రోడ్లు వేసేశారు. ఘాట్ల నిర్మాణంలో ఎలాంటి నిబంధనలూ పాటించకుండా కంకరపోసి టైల్స్ అతికించేశారు. పుష్కరాలు ముగిసి నెలరోజులైనా మరికొన్ని చోట్ల ఘాట్ల పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కోట్ల మంది ప్రజల భక్తి విశ్వాసాలే పెట్టుబడిగా వందల కోట్ల ప్రజాధనాన్ని పుష్కరాల పనుల పేరుతో తెలుగు తమ్ముళ్లు దోచేసుకున్నారు. పుష్కరాల పనులు జరిగిన ప్రాంతాల్లో ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో ఈ విషయం సచిత్రంగా స్పష్టమైంది. రూ.1472 కోట్ల పనుల ఆనవాళ్లేవీ? రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా కృష్ణా పుష్కరాల పనులకోసం రూ.1349.37 కోట్ల నిధులు మంజూరు చేశారు. దీనికి తోడు రాష్ట్రంలోని వివిధ ఆలయాల ఆస్తులకు సంబంధించిన కామన్ గుడ్ ఫండ్ నుంచి మరో రూ.123.02 కోట్లు దేవాదాయ శాఖ ఖర్చు చేసింది. మొత్తంగా పుష్కరాలకోసం రూ.1472.39 కోట్లు ఖర్చు చేయగా... అందులో రూ.1186.83 కోట్లతో రోడ్లు వంటి వివిధ నిర్మాణ పనులు చేపట్టారు. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల మాదిరి ఇతర అభివృద్ధి పథకాల్లో భాగంగా అక్కడ మరికొన్ని నిధులతో అదే సమయంలో జరిగిన అభివృద్ధి పనులు వీటికి అదనం. గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లోని 135 గ్రామాల(శివారు గ్రామాలతో కలిపి)తో పాటు విజయవాడ నగరంలోనే రూ.1472.39 కోట్ల వ్యయంతో పుష్కర పనులను చేపట్టారు. అంటే ఒక్కొక్క ఊరికి సరాసరి రూ.11 కోట్లు వ్యయం. కానీ కృష్ణా తీరం వెంట ఉన్న ఆ గ్రామాల్లో రెండు మూడు నెలల కిందట ఉన్న సమస్యలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. వీలున్న చోటల్లా టీడీపీ నేతలే నామినేషన్ ద్వారా పనులను దక్కించుకొని తూతూ మంత్రంగా పూర్తిచేయడంతో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధీ కనిపించడంలేదు. మిగిలిన చోట్ల పనులకు వాస్తవాని కన్నా అధికం మొత్తం అంచనాలతో మంజూరు చేశామంటూ టెండరు ద్వారా పనులు పొందిన వారి నుంచి స్థానిక అధికార పార్టీ నేతలు కమీషన్లు కొట్టేశారు. నెలకే గుంతలు... లేదంటే పగుళ్లు పుష్కరాలకు జలవనరుల శాఖ గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో మొత్తం రూ. 334 కోట్ల ఖర్చుతో 188 ఘాట్లు, ఘాట్ల వద్ద ఫ్లాట్ ఫారం పనులను చేపట్టారు. గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లా కలెక్టర్లు డిసెంబరు, జనవరి నెలలలోనే ఘాట్ల నిర్మాణాల అనుమతుల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపినా రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలలో గానీ వాటికి అనుమతులు మంజూరు చేయలేదు. టెండర్లు ప్రక్రియ మిగిలింది కేవలం రెండు నెలల సమయమే. ప్రభుత్వమే పనులు మంజూరు చేసిందే ఆలస్యం చేయడంతో కాంట్రాక్టర్లు కూడా తాము చేసే పనుల్లో నాణ్యత పట్టించుకోకూడదనే ఉద్దేశంతో ఆఖరిరోజు వరకు పనులు చేస్తూ వచ్చారు. సిమెంట్ పని అంటే కనీసం వారం రోజుల పాటు నీటితో క్యూరింగ్ చేయాల్సి ఉన్నప్పటికీ... పుష్కరాల ముందు రోజు కూడా చాలా ఘాట్లలో పనులు చేపట్టారు. దీంతో ఆ ఘాట్ల పుష్కరాలు జరుగుతున్న రోజుల్లోనే పగుళ్లు ఇచ్చాయి. కొన్ని చోట్ల ఘాట్ల వద్ద సిమెంట్ ప్లాట్‌ఫారాలు కుంగిపోయాయి. ఆర్ అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖ ద్వారా పుష్కరాల కోసం వేసిన రోడ్లన్నీ నెల రోజులకే గుంతలమయం అయ్యాయి. -
అక్షరాలా అరకోటి!
పదో రోజు పుష్కరాలకు పోటెత్తిన జనం - మహబూబ్‌నగర్‌లో 37 లక్షలు, నల్లగొండలో 13 లక్షల మంది స్నానాలు సాక్షి ప్రతినిధులు, మహబూబ్‌నగర్/నల్లగొండ: కృష్ణా తీరం జనసంద్రమైంది. ఆది వారం సెలవు రోజు కావడం, మరో రెండ్రోజుల్లో పుష్కరాలు ముగియనుండడంతో జనం పోటెత్తారు. వరుసగా 10వ రోజు భక్తులతో ఘాట్లు కిటకిటలాడాయి. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలో 50 లక్షలకుపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోనే 37 లక్షలకుపైగా స్నానాలు చేశారు. నల్లగొండ జిల్లాలో 13 లక్షల మంది పుష్కర స్నానాలు చేశారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే హైదరాబాద్-కర్నూల్ జాతీయ రహదారి పుష్కర యాత్రికుల వాహనాలతో కిక్కిరిసిపోయింది. పాలమూరు జిల్లాలో రంగాపూర్‌లో 9.5 లక్షలు, నది అగ్రహారంలో 8.57 లక్షలు, బీచుపల్లిలో 6.5 లక్షలు, సోమశిలలో 5.91 లక్షలు, గొందిమళ్లలో 3.15 లక్షలు, పాతాళగంగలో 1.55 లక్షలు, పస్పులలో 1.5 లక్షలు, కృష్ణ ఘాట్‌లో 1.52 లక్షల మంది స్నానాలు ఆచరించారు. అయితే నీటిమట్టం తగ్గడం వల్ల పలుచోట్ల స్నానాలకు అవకాశం లేకపోవడంతో అధికారులు భక్తులను మునగాన్దిన్నె, బూడిదపాడు, పంచదేవ్‌పహాడ్, గుమ్మడం, జటప్రోలు, క్యాతూర్, పాతాళగంగ ఘాట్లకు తరలించారు. నీటిమట్టం తగ్గడంతో ఆదివారం జూరాల పుష్కరఘాట్‌ను మూసివేశారు. మరోవైపు జనం తండోపతండాలుగా కదలడంతో షాబాద్ నుంచి అలంపూర్ వరకు వివిధ ప్రాంతాల్లో పెద్దఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. సోమశిల, కొల్లాపూర్ ప్రధాన రహదారి జనసంద్రంగా మారడంతో మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా వాహనాలను క్రమబద్ధీకరించారు. బీచుపల్లిలో సినీనటుడు సునీల్ పుష్కర స్నానం చేశారు. నల్లగొండలో జనమే జనం.. నల్లగొండ జిల్లాలోని 28 ఘాట్లలో 13 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. ముఖ్యంగా నాగార్జునసాగర్, వాడపల్లి, మట్టపల్లి ఘాట్లు భక్తులతో పోటెత్తాయి. వాడపల్లిలో తెలంగాణ అమరవీరులకు పిండ ప్రదానం చేశారు. నదిలో పడి బాలుడి మృతి.. నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిన్నమునిగల్లో విషాద కర ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ముత్తినేని లక్ష్మణ్, సుధారాణి దంపతులు పుష్కర స్నానం ఆచరించేందుకు హైదరాబాద్ నుంచి వచ్చారు. వీరి పెద్దకుమారుడు హార్థిక్ (12) ప్రమాదవశాత్తు నదిలోని ఓ గుంతలో పడిపోయాడు. వెంటనే అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మరోవైపు పెదవూరం మండలం సంగారం స్టేజీ వద్ద ఎదురెదురుగా వస్తున్న కారు, మినీ బస్సు ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయింది. కారులో బెలూన్లు తెరచుకోవడంతో డ్రైవర్‌కు స్వల్పగాయాలు మినహా ఎవరికీ ఏమీ కాలేదు. బలవంతంగా టోల్ వసూలు షాద్‌నగర్/అడ్డాకుల: పుష్కరాలకు వెళ్లే జనంతో మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పరిధిలోని రాయికల్ టోల్‌ప్లాజా, అడ్డాకుల మండలంలోని శాఖాపూర్ టోల్గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆరుసార్లు రాయికల్ టోల్గేట్లను ఎత్తివేశారు. కానీ శాఖాపూర్ వద్ద బలవంతంగా టోల్ వసూలు చేశారు. -
పుష్కరాలకు వెళ్తే అది మరిచిపోకండి..
సాక్షి,వీకెండ్: కృష్ణా పుష్కరాలకు మీరు విజయవాడ వెళ్తున్నారా? మీ వెంట పిల్లలు, వృద్ధులను తీసుకెళ్తున్నారా? అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. భక్తజన రద్దీలో వీరు తప్పిపోయే ప్రమాదం ఉంది. ఇలా తప్పిపోయిన వారిని వారి కుటుంబీకుల దగ్గరికి చేర్చేందుకు పుష్కర పర్యవేక్షణాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకు వలంటీర్ల సేవలు వినియోగించుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో ‘కృష్ణా పుష్కరాలు చైల్డ్ ట్రాకింగ్’ అనే యాప్ ద్వారా సేవలందిస్తున్నారు. ఈ యాప్ వివరాలు మీకోసం.. – గాజులరామారం వివరాల నమోదు.. పుష్కర ఘాట్ల వద్ద ఉన్న హెల్ప్‌డెస్క్‌లో సంప్రదించి మీ ఫోన్లోని ‘కృష్ణా పుష్కరాలు చైల్డ్ ట్రాకింగ్’ యాప్‌లో వివరాలు నమోదు చేయాలి. యాప్ ఓపెన్ చేయగానే పిల్లలు, వృద్ధులు అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. మీకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకొని గార్డియన్, చిరునామా, ఫోన్ నంబర్ తదితర వివరాలు నమోదు చేయాలి. అనంతరం అక్కడి హెల్ప్‌డెస్క్ సిబ్బంది పిల్లలు, వృద్ధుల చేతికి ఒక హ్యాండ్ ట్యాగ్ వేస్తారు. ఇది తడవదు, చిరగదు. ఒకవేళ మీ దగ్గర యాప్ లేకపోయినా ఫర్వాలేదు. నేరుగా హెల్ప్‌డెస్క్‌కు వెళ్లి వివరాలు నమోదు చేయించుకోవచ్చు. అప్పగిస్తారిలా.. తప్పిపోయిన పిల్లలు, వృద్ధులను పుష్కర ఘాట్లలో పనిచేస్తున్న వలంటీర్లు వాకబు చేస్తారు. వారి చేతికున్న ట్యాగ్ సహాయంతో గార్డియన్ వివరాలు సేకరిస్తారు. సంబంధిత వ్యక్తులకు ఫోన్ చేసి సందేశం ఇస్తారు. ఒకవేళ ఫోన్ పోతే అడ్రస్ ఆధారంగా వారిని కుటుంబీకులకు అప్పగిస్తారు. ► ఈ యాప్ కృష్ణా జిల్లా వ్యాప్తంగా మాత్రమే అందుబాటులో ఉంది. 2000 మంది వలంటీర్లు దీని కోసం పనిచేస్తున్నారు. సుమారు 10 లక్షల ట్యాగ్లు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. ► యాప్ సౌకర్యం అందుబాటులో లేని జిల్లాల్లో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. పుష్కర ఘాట్లలోని హెల్ప్‌డెస్క్‌లలో సంప్రదిస్తే వారు హ్యాండ్ ట్యాగ్‌లపై సంరక్షకుల పేరు, ఫోన్ నంబర్, చిరునామా.. తదితర వివరాలు రాసి పిల్లలు/ వృద్ధుల చేతికి వేస్తారు. ఒకవేళ ఎవరైనా తప్పిపోతే వలంటీర్లు గుర్తించి ఈ వివరాల ఆధారంగా కుటుంబీకుల దగ్గరికి చేరుస్తారు. -
యాడ్రోబ్ ద్వారా కృష్ణా పుష్కర జలం
కృష్ణా నదీ పుష్కరాల సందర్భంగా పవిత్ర కృష్ణా నదీ జలాలను కృష్ణా జల్ బ్రాండ్ పేరుతో నగరానికి చెందిన ఈ కామర్స్ కంపెనీ యాడ్‌రోడ్‌డాట్‌ఇన్ డోర్ డెలివరీ చేయనున్నది. ఈ నెల 13 నుంచి 23 వరకూ హైదరాబాద్‌లో ఈ అవకాశాన్ని అందిస్తున్నామని యాడ్రోబ్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ నగరంలో అయితే 1 లీటర్ రూ.101 మాత్రమేనని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని ఇతర నగరాలకు రూ.151 అని, భారత్‌లోని ఏ ఇతర నగరాలకైతే రూ.201 అని యాడ్‌రోబ్‌డాట్‌ఇన్ ఎండీ కేశిరెడ్డి రాజిరెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా పుష్కరాల సందర్భంగా కృష్ణా నదికి హారతి, దీపం సమర్పించే పుష్కర దీపం ప్యాకేజీని కూడా ఆఫర్ చేస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలకు యాడ్‌రోబ్‌డాట్‌ఇన్ వెబ్‌సైట్‌ను చూడాలని పేర్కొన్నారు. -
పుష్కరుడికి ఘన వీడ్కోలే...
అంత్యపుష్కరాలు సందర్భం ‘నర్మదా తీరం తపస్సుకు... గంగాతీరం మరణానికి.. కురుక్షేత్రం దానానికి శ్రేష్ఠమైనది.. అయితే ఈ మూడింటికన్నా గౌతమీ తీరం పరమపవిత్రం’ అని గౌతమీ మాహాత్మ్యం చెబుతోంది. అంతటి మహత్యమున్న గౌతమీ గోదావరి తీరం అంత్యపుష్కరాలకు సిద్ధమవుతోంది. దేశంలో ఏ నదికి.. చివరకు హిందువులు అత్యంత పవ్రితంగా భావించే గంగానదికి కూడా లేనివిధంగా గోదావరికి అంత్యపుష్కరాలు ఉన్నాయి. జులై 31, ఆదివారం నాడు ఆరంభమైన ఈ అంత్యపుష్కరాలు పన్నెండు రోజులపాటు అంటే ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. ఈ మహాక్రతువులో వేలాదిమంది భక్తులు పుణ్యస్నానాలు చేసి, పితృదేవతలకు పిండప్రదానం చేసే మహత్కార్యంలో నిమగ్నమవనున్నారు. పుష్కరాలు.. అంత్య పుష్కరాల సమయంలోనే కాదు.. ఏడాది పొడవునా పుష్కరుడు గోదావరిలోనే ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. పుష్కరుడి ప్రవేశం దేశంలో గోదావరితోనే మొదలవుతోంది. ఇక్కడ ఏడాది పాటు ఉండి మిగిలిన నదుల్లోకి ప్రవేశిస్తాడు. ‘స్కందపురాణం, గౌతమీ మహత్యం’లో పేర్కొన్నట్టు... బ్రహ్మదేవుడు పుష్కరుడిని గురుడు సింహారాశిలో ప్రవేశించిన తొలి 12 రోజులు, చివరి 12 రోజులు మాత్రమే కాకుండా ఏడాదంతా మధ్యాహ్నం రెండుగంటలపాటు నివసించమని కోరాడు. ఈ కారణంగానే గోదావరికి అంత్యపుష్కరాలు నిర్వహిస్తారు. పుష్కరాల సమయంలో నదీస్నానం, పితృదేవతలకు పిండప్రదానం చేయడం అత్యంత పుణ్యకార్యమని భక్తుల విశ్వాసం. పుష్కరాలు, అంత్యపుష్కరాల సమయంలో గోదావరి నదీస్నానం చేస్తే మూడున్నర కోట్ల తీర్థాల్లో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అంత్యపుష్కరం మూఢంలో మొదలవుతున్నా ఆ ప్రభావం ఉండదంటున్నారు అన్నవరం దేవస్థానం ప్రధానసలహాదారుడు, రాజగురువు ఎం.ఆర్.వి.శర్మ. ‘తీర్థాలను తొలిసారిగా సందర్శించేటప్పుడు మూఢమి మంచిది కాదని ధర్మశాస్త్రం చెబుతోంది. కాని గోదావరికి ఆ దోషం లేదు. తొలిసారి మూఢమిలో సైతం సందర్శించుకోవచ్చు. ఎందుకంటే పుష్కరుడు గోదావరిలో ఏడాది పొడవునా ఉంటారు’ అని ఆయన అన్నారు. పుణ్యఫలాన్నిచ్చే పితృతర్పణాలు పుష్కరాల సమయంలో పితృదేవతలకు తర్పణాలు ఇస్తే ఎంత పుణ్యఫలమో... అంత్య పుష్కరాల సమయంలో ఇచ్చినా అంతే పుణ్యఫలం దక్కుతుందని వేదపండితులు చెబుతున్నారు. పుణ్యనదీతీరాల్లో అదృశ్య రూపాల్లో పితృదేవతలు సంచరిస్తుంటారు. తమ వంశీకులు ఎవరైనా తీర్థయాత్రలకు నదీతీరాలకు వస్తారని, తర్పణాలు ఇస్తే వారు ఆనందిస్తారని నమ్మకం. ఈ కారణంగా అంత్యపుష్కరాలకు గోదావరి నదితీరంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఆనుకుని ఉన్న ఘాట్ల వద్ద పితృదేవతలకు పిండప్రదానం చేయనున్నారు. ఎక్కువ మంది ఉత్తరాంధ్రావాళ్లే! గోదావరి పుష్కరాలకే కాదు.. అంత్యపుష్కరాలకు సైతం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. వీరితోపాటు ఈసారి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్దసంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నారు. ఎంపిక చేసిన ఘాట్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో పిండప్రదానాలకు అనుమతి ఇచ్చారు. వైదిక విధులకు సంబంధించిన సామగ్రిని ఘాట్ల వద్ద అందుబాటులో ఉంచారు. నదిలో భక్తులు గల్లంతవకుండా పడవలతో రక్షణచర్యలు చేపట్టనున్నారు. వీటిపై గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. రాజమహేంద్రవరం, కొవ్వూరులో భక్తుల విశ్రాంతికి సత్రాలు, కమ్యూనిటీ భవనాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. రెగ్యులర్ బస్సులతోపాటు గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఆర్టీసీ సుమారు 150 బస్సులను నడుపుతోంది. - నిమ్మకాయల సతీశ్ కుమార్, సాక్షి అమలాపురం తెలంగాణ లో అంత్యపుష్కరాల ఏర్పాట్లు గోదావరి అంత్య పుష్కరాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం బాసర, సోన్ (నిర్మల్), మంచిర్యాల, చెన్నూరు గోదావరి వంటి నాలుగు ప్రధాన ఘాట్లను ఎంపిక చేసింది. నిన్నటి నుంచి పన్నెండు రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలకు అన్ని రకాల వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. జిల్లాలో నాలుగు ఘాట్లు ఏర్పాటు చేయనున్నారు. బాసర వద్ద నాలుగు స్నాన ఘాట్టాలు, సోన్‌లో రెండు, మంచిర్యాల, చెన్నూరులో ఒక్కొక్కటి చొప్పున స్నాన ఘట్టాలు ఏర్పాటు చేసినట్లు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ విజయ రామారావు తెలిపారు. బాసరలో ఏకకాలంలో 20వేల మంది భక్తులు స్నానమాచరించే వీలుంది. సోన్‌లో 6వేల మంది, మంచిర్యాలలో 10 వేలు, చెన్నూరులో 5వేల మంది పుష్కర స్నానం చేసే వీలుంది. గోదారిలో దిగి సాన్నాలు చేసేలా అన్ని ఘాట్ల వద్ద మెష్యూలు ఏర్పాటు చేయనున్నారు. బాసరలో 30 మందిని, మిగిలిన మూడు ఘాట్ల వద్ద పన్నెండు మంది చొప్పున గజ ఈతగాళ్లను నియమించారు. ఘాట్ల వద్ద దుస్తులు మార్చేందుకు గదులు.. ఆశ్రయం పొందే విధంగా తడకలతో నిర్మించిన గదులు.. పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయనున్నారు. భక్తులను తరలించే విధంగా.. ఆర్టీసీ ముందస్తుగా 11 ప్రత్యేక బస్సులు నడిపించాలని నిర్ణయించింది. ఖమ్మం జిల్లాలో... గత ఏడాది జరిగిన గోదావరి పుష్కరాలకు ఖమ్మం జిల్లాలోని గోదావరి తీరంలో ఉన్న భద్రాచలం, దుమ్ముగూడెం, వెంకటాపురం, బూర్గంపాడు మణుగూరు మండలాలల్లో ఎనిమిది పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. భద్రాచలం, పర్ణశాల, ఇరవెండి పుష్కర ఘాట్లలో అధిక సంఖ్యలో భక్తులు పుష్కర పుణ్య స్నానాలు చేశారు. భద్రాచలం, పర్ణశాలలో ఎక్కువ సంఖ్యలో అంత్య పుష్కరాల సమయంలో పుణ్య స్నానాలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఘాట్ల విస్తీర్ణం సరిపోతుందని అధికారులు భావిస్తున్నారు. తాగునీరు, వసతి, ఇతర సౌకర్యాలపై ఇప్పుడిప్పుడే కసరత్తు మొదలు పెట్టారు. భద్రాచలం పుష్కర ఘాట్‌లో అధిక సంఖ్యలోనే భక్తులు పుణ్య స్నానాలు చేయడంతో పాటు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకునే అవకాశం ఉంది. దీనిపై జిల్లా స్థాయి అధికారులతో ఒక్కసారి కూడా సమీక్ష జరగలేదు. భద్రాచలం సబ్ కలెక్టర్ మాత్రమే ఈ నెల 26న భద్రాచలంకు సంబంధించిన డివిజన్ స్థాయి అధికారులతో సమీక్షించారు. అంచనాలకు మించి భక్తులు వచ్చినట్లయితే ఇబ్బందులు తలెత్తుతాయి. అధికార యంత్రాంగం అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇలా... అంత్యపుష్కరాలకు ఉభయ గోదావరి జిల్లాలు సిద్ధమవుతున్నాయి. పురాణ ప్రసిద్ధి, చారిత్రిక నేపథ్యం ఉన్న ప్రాంతాల్లో భక్తులు పుణ్యస్నానాలు, పితృదేవతలకు తర్పణాలు వదలనున్నారు. అంత్యపుష్కరాలకు చారిత్రాత్మక నగరం రాజమహేంద్రవరం, కొవ్వూరులతోపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పుష్కరఘాట్లు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు జిల్లాల్లో పుష్కరాలకు 284 ఘాట్ల నిర్మాణం జరిగింది. అంత్యపుష్కరాలకు తక్కువ మంది భక్తులు వచ్చే అవకాశమున్నందున ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఆనుకుని ఉన్న 33 ఘాట్లను ఏ-1గా ప్రభుత్వం గుర్తించింది. వీటిలో తూర్పుగోదావరి జిల్లాలో 16 ఘాట్లు.. పశ్చిమగోదావరి జిల్లాలో 17 ఘాట్లు ఉన్నాయి. రాజమహేంద్రవరం కోటిలింగాలు, పుష్కరఘాట్లతోపాటు మరో ఐదు ఘాట్లు, కోటిపల్లి, అప్పనపల్లి, ముక్తేశ్వరం తొగరపాయతోపాటు పశ్చిమాన కొవ్వూరు గోష్పాదక్షేత్రం, నర్సాపురం వలంధరరేవు ఘాట్లతో సహా రెండు జిల్లాల్లో కలిపి రోజుకు రెండు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశముంది. అంత్యపుష్కరాలకూ అంతే ప్రభావం! ఆది పుష్కరాలకు ఎంత ప్రభావం ఉంటుందో, అంత్యపుష్కరాలు కూడా అంతే ప్రాశస్త్యం, ప్రభావం కలిగి ఉంటాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ప్రజల్లోనే అంత్య పుష్కరాల గురించిన అవగాహన లేకపోవడం విచారకరం. ఈ విషయంలో పండితులు, మీడియా ప్రచారం చేయడం అవసరం. అంత్యపుష్కరాలలో కూడా స్నానం జపం త ర్పణం పిండప్రదానం వంటి కర్మలను ఆచరించడం ద్వారా పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని శాస్త్రోక్తి. ఆది పుష్కరాలలో స్నానం చేశాం కదా, మళ్లీ అంత్య పుష్కరాలలో చేయవచ్చా అని చాలామందికి సందేహం ఉంటుంది. అయితే అవకాశం ఉంటే ఎన్నిరోజులయినా, ఎన్ని సార్లయినా చేయవచ్చు. ప్రజలందరూ ఈ అంత్యపుష్కరాలను సద్వినియోగం చేసుకుని భగవదనుగ్రహాన్ని పొందవచ్చు. - మద్దికుంట శ్రీకాంత్ శర్మ హిందూ ధర్మ ప్రచారకులు ఆది పుష్కరవిధులు నిర్వర్తించని వారికి ఊరట! బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరశోభ వస్తుంది. అది మొదటి 12 రోజులూ, ప్రతిరోజూ అపరాహ్ణ కాలంలో రెండు గడియలు, సింహరాశి నుండి కన్యారాశిలో ప్రవేశించడానికి ముందు మరొక పన్నెండు రోజులు గోదావరి జలాలలో పుష్కరుడితో పాటు బృహస్పతి, బ్రహ్మాది దేవతలు, పితృదేవతలు అందరూ ఉంటారు. ఆది పుష్కరాలలో గోదావరిలో పుష్కరస్నానం కానీ, దాన జపతపాదులు కానీ, పితృకర్మలు కానీ చేయడం వీలు కానివారు అంత్యపుష్కరాలుగా చెప్పబడే చివరి 12 రోజులూ చేసుకోవచ్చును. పుష్కరాలలో చేసే ఈ కర్మలకు ఫలితం ఎన్నో రెట్లు ఉంటుంది. ఎప్పుడు చేసినా ఫలితం ఒకేవిధంగా ఉంటుంది. ఎందుకో కానీ ఈ సౌలభ్యాన్ని గురించి ఎవరూ అంతగా పట్టించుకున్నట్లు కనపడదు. రాబోయే కృష్ణాపుష్కరాల మీద చూపే శ్రద్ధ, దానికి ముందుగా వస్తున్న గోదావరి అంత్యపుష్కరాల మీద కూడా చూపిస్తే, ఆది పుష్కరాలలో పుష్కరవిధులు నిర్వర్తించడం కుదరని వారికి ఎంతో ఊరట కలుగుతుంది. కృష్ణానది ఆదిపుష్కరాల రద్దీ తగ్గుతుంది. - డా.ఎన్.అనంతలక్ష్మి పౌరాణిక ప్రవచకులు పుణ్యనదీతీరాల్లో అదృశ్య రూపాల్లో పితృదేవతలు సంచరిస్తుంటారు. తమ వంశీకులు ఎవరైనా తీర్థయాత్రలకు నదీతీరాలకు వస్తారని, తర్పణాలు ఇస్తే వారు ఆనందిస్తారని నమ్మకం. ఈ కారణంగా అంత్యపుష్కరాలకు గోదావరి నదితీరంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఆనుకుని ఉన్న ఘాట్ల వద్ద పితృదేవతలకు పిండప్రదానం చేయనున్నారు. -
గోదావరి అంత్య పుష్కరాలు ప్రారంభం
దేశంలో ఒక్క గోదావరి నదికి మాత్రమే వచ్చే అంత్య పుష్కరాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సరస్వతీ (వీఐపీ) ఘాట్‌లో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీ మాగంటి మురళీమోహన్, నగర మేయర్ పంతం రజనీశేషసాయి, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, స్థానిక ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు గోదావరి నదీమ తల్లికి ఉదయం పూజలు చేసి అంత్య పుష్కరాలను ప్రారంభించారు. ఈ నెల 11వ తేదీ వరకూ గోదావరి అంత్య పుష్కరాలు జరగనున్నాయి. గత ఏడాది జూలై 14 నుంచి 12 రోజులపాటు ఆది పుష్కరాలు జరగ్గా చివరి 12 రోజులూ అంత్య పుష్కరాలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరంతోపాటు జిల్లాలోని వివిధ ఘాట్లలో, గోదావరి నదీ పాయలలో వేకువజాము నుంచే ప్రజలు అంత్య పుష్కర స్నానాలు ఆరంభించారు. పితృ దేవతలకు పిండప్రదానాలు నిర్వహించారు. ఘాట్ల వద్ద ఉన్న దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మొదటి రోజు రాజమహేంద్రవరంలో అధికారుల అంచనా మేరకు భక్తులు రాలేదు. జిల్లాలోని అంతర్వేది, అప్పనపల్లి, అయినవిల్లి తదితర గ్రామీణ ఘాట్లలో కూడా భక్తుల సంఖ్య తక్కువగానే ఉంది. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో కొంతమేర భక్తుల కోలాహలం కనిపించింది. రోజుకు 1.5 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. పోలీసు శాఖ 3,000 మందితో బందోబస్తు నిర్వహించింది. భోజన, వసతులు కల్పించకపోవడంతో వారు ఇబ్బందులు పడ్డారు. కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, అంత్యపుష్కరాల నోడల్ అధికారి వి.విజయరామరాజు, అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
మతాలకతీతంగా పుష్కరాలు: చంద్రబాబు
సాక్షి, అమరావతి : పుష్కరాలు మతాలకు అతీతమైనవని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పుష్కరమనేది నదికి కృతజ్ఞతలు తెలుపుకునే కార్యక్రమం కాబట్టి హిందువులతో పాటు ముస్లింలు, క్రైస్తవులు కూడా మతాలకతీతంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. బుధవారం విజయవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. రూ.123 కోట్లతో నిర్మించిన ఇన్నర్ రింగ్‌రోడ్డును ప్రారంభించారు. రూ.10.5 కోట్లతో ముస్లింల కోసం నిర్మించనున్న షాదీఖానాకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడను సుందర నగరంగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించినట్లు చెప్పారు. ఒకవైపు కృష్ణానది, మరోవైపు నగరం మధ్యలోంచి పారుతున్న కాలువలు ఉండడం అదృష్టమని, త్వరలోనే కొత్త విజయవాడను చూస్తారని అన్నారు. ధనిక, పేద తేడా లేకుండా పుష్కరాలకు వచ్చే అతిథులను గౌరవించాలని, నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రజలంతా పుష్కరాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హజ్ యాత్రికుల కోసం త్వరలో విజయవాడ నుంచి జెద్దాకి నేరుగా విమాన సర్వీసులను తీసుకొస్తానని బాబు హామీ ఇచ్చారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్న ముసాఫిర్ ఖానా స్థానంలో ఐదంతస్తుల్లో నిర్మిస్తున్న షాదీఖానాను ఏడాదిలోగా పూర్తి చేస్తామని చెప్పారు. కనకదుర్గగుడి వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పుష్కరాలకు సిద్ధం కావడం లేదని, పనులు త్వరగా పూర్తిచేయాల్సిందిగా భద్రత ప్రమాణాల దృష్ట్యా ఒత్తిడి తీసుకురాలేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పుష్కరాల తర్వాత బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. రింగ్‌రోడ్డుతో గంట ఆదా! ఇన్నర్ రింగ్‌రోడ్డు అందుబాటులోకి రావడం తో హైదరాబాద్, చెన్నై జాతీయ రహదారుల నుంచి వచ్చే వాహనాలు ఇకమీదట విజయవాడ సిటీలోకి రాకుండా నేరుగా కోల్‌కతా జాతీయ రహదారిని చేరుకోవచ్చు. దీనివల్ల గంట సమయం కలసి వస్తుందని అంచనా. 2008లో దీనికి శంకుస్థాపన చేశారు. -
31 నుంచి అంత్య పుష్కరాలు
మంగపేట : మండలంలో ఈనెల 31 నుంచి ఆగస్టు 11 వరకు గోదావరి అంత్య పుష్కరాలు ఉంటాయని తెలంగాణ బ్రాహ్మణ సంఘం మంగపేట అధ్యక్షుడు కొయ్యడ నర్సింహామూర్తి, నిర్వాహక కార్యదర్శులు గూడా వాసుదేవమూర్తి, అనిపెద్ది నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అంత్య పుష్క ర పుణ్య సమయంగా భావించి మహా పుష్కర పుణ్యసమయాన పితృదేవతలకు, వారి బంధువులు, స్నేహితులు పిండ ప్రధాన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చన్నారు. అలాగే గోదావరిలో సంకల్ప సహిత పుణ్యస్నానాలు, పవిత్ర గోదావరి దర్శనం, దాన ధర్మాలతో కూడిన కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చ న్నారు. -
కాలిబాట రోడ్డూ..
ఇంద్రకీలాద్రికి రెండో రోడ్డు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ ప్రకటన పుష్కరాల నాటికి సిద్ధం చేస్తామని వెల్లడి వాస్తవంలో ఇంకా ఇళ్ల తొలగింపేపూర్తికాని వైనం మరో రెండు మూడు నెలలు పడుతుందంటున్న దుర్గగుడి అధికారులు పుష్కరాల కోసం ప్రారంభించిన పనులు ఇంకా ప్రారంభ దశే దాటలేదు. వాటిని పూర్తిచేయకుండానే అధికా రులు కొత్త పనుల్ని ప్రారంభిస్తున్నారు. ఈ విధంగా ప్రారంభించిన పనుల్ని పుష్కరాల్లోగా పూర్తిచేస్తామంటూ ఒక వైపు ఉన్నతాధికారులు ఆర్భాటంగా ప్రకటించేస్తున్నారు. మరోవైపు ఆ పనులు ఏ విధంగా పూర్తవుతాయో అర్థంగాక కిందిస్థాయి అధికారులు జుట్టు పీక్కుంటున్నారు. విజయవాడ : దుర్గమ్మ భక్తుల సౌకర్యార్థం పుష్కరాల నాటికి ఒక కొత్త ఘాట్ రోడ్డును నిర్మిస్తామని కలెక్టర్ బాబు.ఎ గత శనివారం ప్రకటించారు. భవానీ, పున్నమి ఘాట్లలో స్నానం చేసిన భక్తులు నేరుగా అమ్మవారి దర్శనానికి వెళ్లేందుకు వీలుగా దీనిని నిర్మించనున్నట్లు చెప్పారు. ఇది కాలిబాట భక్తులకు మాత్రమే ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన పుష్కర సమావేశం అనంతరం కలెక్టర్ ఈ విషయం వెల్లడించారు. వాస్తవంలో మాత్రం.. కలెక్టర్ ప్రకటించినట్లు కాలిబాట రోడ్డు నిర్మించాలంటే విద్యాధరపురం హెడ్ వాటర్ వర్క్స్ ఎదురుగా సుమారు 138 ఇళ్లను తొలగించాలి. అక్కడ సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్డు నిర్మించాలి.సాక్షి, విజయవాడ : దుర్గమ్మ భక్తుల సౌకర్యార్థం పుష్కరాల నాటికి ఒక కొత్త ఘాట్ రోడ్డును నిర్మిస్తామని కలెక్టర్ బాబు.ఎ గత శనివారం ప్రకటించారు. భవానీ, పున్నమి ఘాట్లలో స్నానం చేసిన భక్తులు నేరుగా అమ్మవారి దర్శనానికి వెళ్లేందుకు వీలుగా దీనిని నిర్మించనున్నట్లు చెప్పారు. ఇది కాలిబాట భక్తులకు మాత్రమే ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన పుష్కర సమావేశం అనంతరం కలెక్టర్ ఈ విషయం వెల్లడించారు. వాస్తవంలో మాత్రం.. కలెక్టర్ ప్రకటించినట్లు కాలిబాట రోడ్డు నిర్మించాలంటే విద్యాధరపురం హెడ్ వాటర్ వర్క్స్ ఎదురుగా సుమారు 138 ఇళ్లను తొలగించాలి. అక్కడ సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్డు నిర్మించాలి. ప్రస్తుతం రెవెన్యూ శాఖ ఇక్కడ ఇళ్లను తొలగించే పనిలో ఉంది. ఆ తరువాత ఈ స్థలాన్ని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి అప్పగించాల్సి ఉంటుంది. ఆ తరువాత దేవస్థానం అధికారులు దీన్ని పరిశీలించి రోడ్డు నిర్మాణానికి మార్కింగ్ చేయాల్సి ఉంటుంది. రోడ్డు కూడా ఒకే రూట్లో కాకుండా రెండు మూడు మార్గాలు చూసుకుని భక్తులకు ఏది వీలుగా ఉంటుందో నిర్ణయించుకుని దాన్ని చివరకు ఖరారు చేయాల్సి ఉంది. ఆ తరువాత ఆ మార్గంలో కొండను తొలగించడం ప్రారంభించారు. అనంతరం సిమెంట్‌తో మెట్లను నిర్మించాలి. కొంతమేర మెట్లు, మరికొంత నడిచే ప్రదేశం, తిరిగి మెట్లు నిర్మించాల్సి ఉంటుంది. చివరగా రెండువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించాలి. ఇదంతా జరిగే సరికి కనీసం రెండు మూడు నెలలు పట్టే అవకాశం ఉందని తెలిసింది. కాంట్రాక్టర్‌కూ స్పష్టత ఇవ్వలేదు... ఇంద్రకీలాద్రికి కొత్త రోడ్డు నిర్మాణానికి రూ.1.08 కోట్లతో కాంట్రాక్టర్‌ను ఖరారు చేశారు కాని పనులు ఎప్పటి నుంచి ప్రారంభించాలనేది అతనికి ఇప్పటి వరకు స్పష్టంగా చెప్పలేదు. పుష్కరాల లోపుగా ఈ కొత్త రోడ్డు నిర్మించడం కష్టమేనని దుర్గగుడి అధికారులే పెదవివిరుస్తుండగా, ఈ రోడ్డును పుష్కరాల నాటికి సిద్ధం చేస్తామని మంత్రి ఉమా సమక్షంలో కలెక్టర్ చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి. ఫ్లైఓవర్ ఏమైంది? పుష్కరాల నాటికి ఇంద్రకీలాద్రి వద్ద ఫ్లైఓవర్ పూర్తి చేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కలెక్టర్ బాబు.ఎ గత కొన్ని నెలలుగా హడావుడి చేస్తూ వచ్చారు. చివరకు శనివారం కలెక్టర్ మాట్లాడుతూ పుష్కరాల నాటికి ఫ్లైఓవర్ పూర్తి కాదని, కుమ్మరపాలెం సెంటర్ నుంచి వారధి వరకు నాలుగు రోడ్ల రహదారిని మాత్రమే పూర్తి చేస్తామని ప్రకటించారు. ఫ్లైఓవర్‌ను పిల్లర్ల దాకా నిర్మించి వదిలేసి పుష్కరాల తరువాత చేపడతామని చెప్పారు. ఇంద్రకీలాద్రికి కొత్త రోడ్డు నిర్మాణం పరిస్థితి కూడా ఇదే తరహాలో ఉంటుందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఘాట్ల నిర్మాణం, అర్జునవీధి విస్తరణ, ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూస్తే అదే పదివేలని పలువురు స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. -
పుష్కరం తరుముకొస్తోంది.. పనులు పూర్తయ్యేదెప్పుడో?
ప్రధాన ఘాట్లన్నీ ఇంకా పనుల దశలోనే.. పుష్కరాలకు నెలరోజులే సమయం టైమ్ దగ్గర పడటంతో హడావుడి మేళం నాణ్యతకు తిలోదకాలు పుష్కరాల నాటికి పూర్తయ్యేది డౌటే..! చైనా డిజైన్లు అన్నారు.. అంతర్జాతీయ ఘాట్లు.. రివర్ ఫ్రంట్లు.. రోడ్లకు ఇరువైపులా గ్రీనరీ అని మభ్యపెట్టారు. 2.5 కిలోమీటర్ల పొడవునా ఒకటే ఘాట్ అంటూ హడావుడి చేశారు. కృష్ణా, గోదావరి పవిత్ర సంగమ ప్రాంతాన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామంటూ కోతలు కోశారు. ప్రభుత్వం చెప్పిన ఆ మాటలన్నీ నీటిమూటలే అయ్యాయి. అభివృద్ధి మాట అటుంచితే పుష్కరాల నాటికి కనీసం ఘాట్లయినా ఓ కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. నెల రోజుల్లో పుష్కరాలు ప్రారంభం కానుండగా, ఇంకా కనీసం 25శాతం పనులు కూడా పూర్తికాలేదు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కీలకమైన ఘాట్ల వద్ద పరిస్థితిని ‘సాక్షి’ పరిశీలించగా, అసంపూర్తి పనులు, బురదతో నిండిన రేవులే కనిపించాయి. - సాక్షి, విజయవాడ ఆలస్యంగా పనులు.. భక్తులకు వెతలు అమరావతి : రాజధాని అమరావతిలోనూ పుష్కర స్నానఘట్టాల పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. వర్షాల వల్ల ఈ ఆలస్యం రెట్టింపు అవుతోంది. ధ్యానబుద్ధ విగ్రహం నుంచి అమరేశ్వర స్నానఘాట్‌ను కలుపుకొని సుమారు 1.3 కిలోమీటర్ల మేర ఘాట్‌ను రూ.16కోట్లతో నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు కాంక్రీట్ పనులు 30శాతం పూర్తయ్యాయి. అమరేశ్వర ఘాట్‌లో గ్రానైట్ పనులు పూర్తయినా.. ఆంజనేయస్వామి ఘాట్‌లో కాలేదు. పుష్కరాలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పనులు హడావుడిగా చేస్తున్నారు. దీనివల్ల నాణ్యత తగ్గుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమరేశ్వరస్వామి గుడికి ఉత్తరం వైపు పనులు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. అలాగే, అమరేశ్వరస్వామి దేవస్థానం మొదటి ప్రాకారంలో నేలను చదును చేసి భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. ఆలయాలకు రంగులు వేసే పని 60 శాతం పూర్తయింది. రెండు, మూడో ప్రాకారంలో గ్రానైట్ వేయడం పూర్తవుతోంది. క్యూలైన్ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. 30 రోజులు గడువు..30 శాతం పనులు పూర్తి తాడేపల్లి (తాడేపల్లి రూరల్) : సీతానగరంలో కృష్ణానది ఒడ్డున ఆంజనేయస్వామి దేవస్థానం నుంచి సుమారు అర కిలోమీటరు పొడవున నిర్మిస్తున్న పుష్కర ఘాట్ పనులు 30 శాతం కూడా పూర్తికాలేదు. గతంలో ఐదు ఘాట్లు ఉండగా అన్నింటినీ కలుపుతూ ఒకే ఘాట్‌గా నిర్మిస్తున్నారు. ఈ ఘాట్‌లో ఇంకా కాంక్రీట్ పనులు కూడా పూర్తికాలేదు. పనులు పూర్తయిన తర్వాతే మెట్ల నిర్మాణం చేపట్టి టైల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అరకిలోమీటరు పొడవున నిర్మిస్తున్న ఈ ఘాట్లను సగం వరకూ కూడా కాంక్రీట్ పనులు పూర్తికాలేదు. పాత ఘాట్లకు మాత్రం శుక్రవారం నుంచి టైల్స్ అంటించే కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. ఘాట్లకు వాటరింగ్ కూడా చేయట్లేదు. బ్యారేజీ నుంచి పుష్కర ఘాట్ల వరకూ కృష్ణానది ఒడ్డున ఉన్న రిటైనింగ్ వాల్ కూలిపోతున్నా పట్టించుకోకుండా సీసీ రోడ్లు నిర్మిస్తున్నారు. పుష్కర నగర్లు ఏర్పాటుచేసే విషయాల్లో పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తోంది. పార్కింగ్, భక్తులు వేచి ఉండేందుకు తాత్కాలిక వసతికి ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎప్పటికి పూర్తయ్యేనో..? రేపల్లె : స్థానిక పెనుమూడి పుష్కర ఘాట్‌ను 500 మీటర్లకుపైగా దూరంతో నిర్మిస్తున్నారు. ఇందుకు రూ.5.19 కోట్లు ఖర్చుచేసి ఈనెల 15వ తేదీ నాటికి పూర్తిచేసేలా పనులు ప్రారంభించారు. ఈ పనులు ప్రారంభమై 40 రోజులవుతున్నా 40 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. పనులు ఎలాగైనా పూర్తి చేయాలనే లక్ష్యంతో కాంట్రాక్టర్లు నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పవిత్ర సంగమం.. అగమ్యగోచరం కృష్ణా, గోదావరి నదుల సంగమ ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. ఇబ్రహీంపట్నం నుంచి తుమ్మలపాలెం వరకూ 2.1 కిలోమీటర్ల మేర పుష్కర ఘాట్‌ను నిర్మించాలని మొదట్లో నిర్ణయించారు. ప్రస్తుతం ఇక్కడ మట్టి పనులు మాత్రమే జరుగుతున్నాయి. నదిలో రిటైనింగ్ వాల్ నిర్మించాల్సి ఉంది. కాంక్రీట్ ఫ్లోరింగ్, ఘాట్ పైన మెట్లు నిర్మించాల్సి ఉంది. తొలుత నిర్ణయించినట్లు 2.1 కిలోమీటర్ల నిర్మాణం సాధ్యంకాదని భావించిన అధికారులు 1.2 కిలోమీటరుకు కుదించారు. గోదావరి జలాలు వస్తున్న వైపు 275 మీటర్లు ఘాట్‌ను నూతనంగా నిర్మించాలని నిర్ణయించి ఇటీవలే పనులు ప్రారంభించారు. గోదావరి నీరు వచ్చే కాల్వపై ఫుట్‌బ్రిడ్జిలు నిర్మించాలని, ఘాట్‌కు గ్రానైట్ రాళ్లు వేయాలని అధికారులు భావించారు. ప్రస్తుతం సమయాభావం వల్ల ఫుట్బ్రిడ్జిలకు స్వస్తి పలికారు. గ్రానైట్ రాళ్లకు బదులుగా సాధారణ టైల్స్ వేస్తున్నారు. హారతి వేదిక ఏమైనట్టు? కృష్ణా-గోదావరి సంగమం వద్ద కృష్ణమ్మ హారతులు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నది మధ్యలో శాశ్వత నిర్మాణం ఏర్పాటుచేసి అక్కడ హారతులు నిర్వహిస్తామని కూడా చెప్పింది. ఇప్పటివరకు అక్కడ ఏవిధమైన ఏర్పాట్లు జరుగుతున్న దాఖలాలు లేవు. ఇబ్రహీంపట్నం నుంచి ఫెర్రి ఘాట్ వరకూ వెళ్లే మార్గం పనులు చేస్తున్నారు. ఇక్కడ భక్తుల కోసం ఏర్పాటు చేస్తామనే విశ్రాంతి ప్రదేశంలోనూ పనులు ఏమాత్రం జరగడం లేదు. ప్రతిపాదనలు పక్కకు.. ప్రకాశం బ్యారేజీ దిగువ నుంచి భవానీపురంలోని భవానీఘాట్ వరకూ 2.3 కిలోమీటర్లు ఒకటే ఘాట్ నిర్మించాలని తొలుత భావించారు. అయితే, మధ్యలో హెడ్‌వాటర్ వర్క్స్ వెల్స్ ఉండటంతో పున్నమి ఘాట్ నుంచి భవానీ ఘాట్ వరకూ 1.5 కిలోమీటర్ల మేర ఒకటే ఘాట్ నిర్మించాలని నిర్ణయించారు. భవానీ ఘాట్ వద్ద 700 మీటర్ల ఘాట్‌ను నిర్మించాలని తొలుత నిర్ణయించినా పుష్కరాల నాటికి 300 నుంచి 350 మీటర్ల కంటే ఎక్కువ నిర్మాణం పూర్తికాకపోవచ్చని భావిస్తున్నారు. గతంలో వందమీటర్ల ఘాట్ ఉండేది. దీన్ని తొలగించి ఏకఘాట్ చేయాలని నిర్ణయించి తిరిగి నిర్మించడం ప్రారంభించారు. మిగిలిన ఘాట్లతో పోలిస్తే ఇక్కడ పనిలో కాస్త పురోగతి కనిపిస్తోంది. మట్టి పనులు పూర్తయ్యాయి. కాంక్రీట్ వర్క్ ప్రారంభించారు. పున్నమి ఘాట్ 800 మీటర్లకు గానూ 300 మీటర్లకు మించి పూర్తికాకపోవచ్చని ఇంజినీర్లు భావిస్తున్నారు. నదిలో కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. ఇంకా మెట్ల నిర్మాణం జరగాల్సి ఉంది. పున్నమి ఘాట్‌కు వెళ్లే మార్గంలో ఇళ్లు తొలగించారు కానీ రోడ్ల నిర్మాణం ప్రారంభించకపోవడంతో పుష్కరాల నాటికి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. నత్తనడకన దుర్గాఘాట్ పనులు ప్రకాశం బ్యారేజీ నుంచి దుర్గాఘాట్ చివరి వరకూ 0.8 కిలోమీటరు మేర ఒకే ఘాట్‌ను నిర్మిస్తున్నారు. దీన్ని తొలుత చైనా బృందం సహాయంతో నిర్మించాలని భావించారు. అయితే వారివద్ద యంత్రపరికరాలు లేకపోవడంతో సోమా కంపెనీకి అప్పగించారు. గతంలో ఉన్న వీఐపీ ఘాట్‌ను, దుర్గాఘాట్‌ను పూర్తిగా తొలగించి అక్కడ నిర్మాణం పనులు చేపట్టారు. ఘాట్‌ను నదిలోకి విస్తరిస్తున్నారు. నదిలో రిటైనింగ్‌వాల్, ఫ్లోరింగ్ ఒకవైపు జరుగుతుంటే ఘాట్ పై భాగంలో మట్టిపనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం 25 శాతం మించి పనులు జరగలేదు. ఈ ఘాట్‌పైనే వత్తిడి ఉంటుందని భావిస్తున్న అధికారులు దీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సా..గుతూ.. ప్రకాశం బ్యారేజీ దిగువన అప్రాన్ నుంచి కృష్ణవేణి, పద్మావతి, సీతమ్మవారి పాదాలు తదితర ఘాట్లన్నీ కలిపి ఒకే ఘాట్ కింద సుమారు 2.3 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్నారు. నదిలో నీరు లేకపోవడం, గతంలో ఇక్కడ ఘాట్లు ఉండటం వల్ల కొంతమేర పనులు వేగంగా జరుగుతున్నాయి. నదిలో నీరు లేకపోవడంతో ఇక్కడ పుష్కర కాల్వలు తవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవైపు నదిలో పుష్కర కాల్వ తవ్వకం పనులతో పాటు మట్టిపని, కాంక్రీట్ వర్క్ జరుగుతోంది. ఘాట్‌లో నుంచి రోడ్డు మీదకు వచ్చే మార్గాలను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఆలస్యానికి కారణాలు ఇవే.. ఘాట్ల నిర్మాణం పనులు గత ఏడాది ఆగస్టులో గోదావరి పుష్కరాలు అవ్వగానే ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. డిజైన్ల ఖరారు, కాంట్రాక్టర్లకు నామినేషన్‌పై అప్పగింత, ఇంజినర్ల కేటాయింపులో జాప్యం కారణంగా గత మే 15 వరకు పనులకు శ్రీకారం చుట్టలేదు. దీంతో ఇప్పుడు పగలు రాత్రి హడావుడిగా చేయాల్సి వస్తోంది.వాస్తవంగా ఎండాకాలంలో జరగాల్సిన పనులు వర్షాకాలం ప్రారంభమయ్యాక చేస్తుండటంతో ముందుకు సాగని పరిస్థితి. ప్రకాశం బ్యారేజీ ఎగువన నదిలో నీరు ఉంది. మట్టిపనులు చేయడం అధికారులకు తలకుమించిన భారంగా మారింది. నీటి ప్రవాహానికి అడ్డుకట్టవేసిన తరువాత పనులు చేయాల్సి వస్తోంది.ఘాట్లకోసం గోతులు తవ్వుతుంటే నీరు వస్తూనే ఉండటం కూడా ఆలస్యానికి మరో కారణం. ఒకవైపు ప్లైఓవర్, మరోవైపు పుష్కరఘాట్ల నిర్మాణ పనులు జరగడం వల్ల పనులు అనుకున్నంత వేగంగా జరగట్లేదు. అనేక ప్రాంతాల్లో పేదలు నివసిస్తున్న ఇళ్లను ఖాళీ చేయించాలి. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడం, కోర్టు నుంచి స్టే తీసుకురావడంతో అధికారులు పనులు వేగంగాచేయలేకపోతున్నారు. పవిత్ర సంగమం వద్ద జంగిల్ క్లియరెన్స్ ఘాట్ల నిర్మాణానికి ప్రభుత్వం ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోలేదు. మే 15వ తేదీ వరకు ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడం, ఉన్న సమాయాని కంటే ఎక్కువ పనిని అప్పగించడంతో పనులు పూర్తయ్యే అవకాశం కనిపించట్లేదు. కాంట్రాక్టర్లకు సకాలంలో ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. దీంతో పెద్దమొత్తంలో సిబ్బందిని నియమించి పనులు చేయించడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఒకవైపు పుష్కర పనులు నత్తనడకన సాగుతుంటే పుష్కరాల విధుల్లో ఉన్న ఇంజినీర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఎస్ఈ నుంచి జేఈల వరకూ బదిలీ చేయడం, బదిలీ అయిన వారికి కొత్తచోట చార్జింగ్ తీసుకుని, తిరిగి ఇక్కడకు వచ్చి విధులు నిర్వహించమని చెప్పడం కూడా ఒక కారణమే. ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్లు, అధికారులు తనిఖీలు చేస్తూ హడావుడి చేయడమే తప్ప వాస్తవంగా పుష్కరాలు ఎంతమేరకు చేయాలనే అంశంపై కాంట్రాక్టర్లకు స్పష్టత ఇవ్వడం లేదు. పుష్కరాల తరువాత కూడా పనులు చేయాల్సి ఉండటంతో అయినంత వరకే చేద్దామనే ఆలోచనలో కాంట్రాక్టర్లు ఉన్నట్టు సమాచారం. -
ఆగస్టు 8 నుంచి స్కూళ్లకు సెలవు
పుష్కరాల సందర్భంగా విజయవాడలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలకు ఆగస్టు 8 నుంచి 25వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తున్నామని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. ఆయా విద్యాసంస్థల భవనాల్లో పుష్కర విధులకు వచ్చే సిబ్బందికి వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. అన్ని భవనాలను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని, ఏ సంస్థకూ దీని నుంచి మినహాయింపు ఉండదని స్పష్టంచేశారు. ఆయా భవనాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, నీటి సదుపాయం కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. -
పుష్కర తొక్కిసలాటపై విచారణ 28కి వాయిదా
► 29 మందిని బలిగొన్న దుర్ఘటనపై ఆధారాలు సమర్పించని ప్రభుత్వం ► మరో రెండు వారాల గడువు అడిగిన ప్రభుత్వ న్యాయవాది ► ఈ నెల 29తో ముగియనున్న ఏకసభ్య కమిషన్ కాలపరిమితి రాజమహేంద్రవరం క్రైం(తూర్పుగోదావరి జిల్లా) : గత ఏడాది పుష్కరాల తొలిరోజున తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటపై ఏర్పాటు చేసిన జస్టిస్ సోమయాజులు ఏకసభ్య కమిషన్ విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది. గురువారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో బహిరంగ విచారణ నిర్వహించిన కమిషన్ కొద్దిసేపటికే వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ శాఖలు ఒకచోట లేనందున ఆధారాలు లేవని, వాటిని సమర్పించేందుకు మరో రెండు వారాల గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది చింతపెంట ప్రభాకరరావు కోరడంతో కమిషన్ ఈ నెల 28 లోపు ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న ఆధారాలు సమర్పించాలని, లేకుంటే సమన్లు జారీ చేయూల్సి వస్తుందని పేర్కొంది. ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభించిన కమిషన్ కేవలం 23 నిమిషాలు ప్రభుత్వ న్యాయవాది వాదనలు మాత్రమే విని వెంటనే 28కి వాయిదా వేసింది. ఈ విచారణలో కమిషన్‌కు సహాయకుడిగా ప్రముఖ న్యాయవాది మద్దూరి శివ సుబ్బారావు వ్యవహరించగా ప్రముఖ న్యాయవాది, బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ళ సుబ్బారావు, వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్ బొంతా శ్రీహరి, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు టి.అరుణ్, న్యాయవాది శ్రీనివాస్ తదితరులు హాజరయూరు. పలు అనుమానాలు... కమిషన్ కాలపరిమితి ఈ నెల 29తో పూర్తి కానుంది. కమిషన్‌కు మొదట్లో కలెక్టర్ నివేదిక సమర్పించినప్పుడు అన్ని ఆధారాలూ తమ వద్ద ఉన్నాయని, ఎప్పుడు సమర్పించమంటే అప్పుడు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అలాంటిది 29తో కమిషన్ కాలపరిమితి ముగియనుండగా ఏ విధమైన ఆధారాలు లేవ ంటూ మరో రెండు వారాల గడువు కోరడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే గడువులు కోరుతూ వాయిదాలు వేరుుస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 29 మంది ప్రాణాలు కోల్పోరుున ఆ దుర్ఘటన జరిగి ఏడాది కావస్తున్నా, కమిషన్ ఏర్పాటు చేసి తొమ్మిది నెలలైనా ఎందుకీ జాప్యమనే విమర్శలు వినిపిస్తున్నారుు. -
పుష్కరాలు వచ్చేస్తున్నాయ్
► జూలై 31 నుంచి ఆగస్ట్ 11 వరకు అంత్య పుష్కరోత్సవం ► తీర్థ విధులు, పితృకార్యాలకు మరో అవకాశం ► ఒక్క గోదావరి నదికే సొంతం ► ఏర్పాట్లపై దృష్టి పెట్టని సర్కారు కొవ్వూరు : గోదావరి అంత్య పుష్కరాల వేళ సమీపిస్తోంది. దేశంలోని ఏ నదికీ లేనివిధంగా గోదారమ్మకు మాత్రమే ఆది, అంత్య పుష్కరాలు నిర్వహిం చడం సంప్రదాయం. గత ఏడాది జూలై 14నుంచి 25వ తేదీ వరకు ఆది పుష్కరాలు నిర్వహించగా.. ఈ ఏడాది జూలై 31 నుంచి ఆగస్ట్ 12వ తేదీ వరకు 12 రోజులపాటు అంత్య పుష్కరాలు నిర్వహించేందుకు ముహూర్తం నిర్ణయమైంది. ఈ పుష్కరాల్లోనూ తీర్థ విధులు, పితృదేవతా కార్యక్రమాలు, పూజలు, దానధర్మాలు వంటివి నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. తద్వారా ఆది పుష్కరాల్లో పొందిన ఆధ్యాత్మిక ఫలాలను అంత్య పుష్కరాల్లోనూ పొందవచ్చని పేర్కొంటున్నారు. గోదావరి నదిలో పుష్కరుడు జలరూపుడై ఏడాదిపాటు ఉంటాడని ప్రతీతి. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లోని రాజ మండ్రి, కొవ్వూరు, నరసాపురం, పెనుగొండ మండలం సిద్ధాంతంతోపాటు నది వెంబడి ఉన్న తాళ్లపూడి, పోల వరం, నిడదవోలు, పెరవ లి, ఆచంట, పెనుగొండ, యలమంచిలి మండలాల్లోనూ అంత్య పుష్కరాలు నిర్వహిస్తారు. జిల్లాలో మొత్తంగా 94 స్నానఘట్టాలు ఉన్నాయి. ఒడిశా యాత్రికులు రాక అంత్య పుష్కరాల సమయంలో ఒడిశా యాత్రికులు అధిక సంఖ్యలో ఇక్కడకు వచ్చి నదీ స్నానం ఆచరించి తీర్థవిధులు నిర్వర్తిస్తారు. ఒడిశా భక్తులు ఆది పుష్కరాల కంటే.. అంత్య పుష్కరాలకే అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఏర్పాట్లపై దృష్టి ఏదీ గత ఏడాది జరిగిన ఆది పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి కోటిన్నర మంది జిల్లాలోని పుష్కర ఘాట్లకు వచ్చి స్నానాలు ఆచరించారు. అంత్య పుష్కరాల్లో కనీసం 30 శాతం మంది అంటే 45 లక్షల మంది జిల్లాలోని వివిధ పుష్కర ఘాట్లకు వస్తారని అంచనా వేస్తున్నారు. అంత్య పుష్కరాలు ముగిసిన మరునాటి నుంచి (ఆగస్ట్ 12 నుంచి) కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ దృష్ట్యా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు గోదావరి అంత్య పుష్కరాల్లో స్నానమాచరించి, ఆ తరువాత కృష్ణా పుష్కరాలకు వెళుతుంటారు. ఈ నేపథ్యంలో గోదావరి తీరం వెంబడి మలి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాల్సి ఉండగా, ప్రభుత్వం ఇప్పటివరకు ఆ దిశగా దృష్టి సారించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. -
విశ్వాసం లేని వారు పుష్కరాలు ఎలా నిర్వహిస్తారు..
మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి వన్‌టౌన్ : భక్తి విశ్వాసాలపై ఏమాత్రం నమ్మకం లేని ప్రభుత్వం పుష్కరాలను ఏవిధంగా నిర్వహిస్తుందని మాజీ శాసనసభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. వన్‌టౌన్‌లోని వివిధ ప్రాంతాల్లో కూల్చివేసిన ఆలయాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. భక్తుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో పురాతనమైన ఆలయాలను ముందస్తు హెచ్చరికలు లేకుండా కూల్చివేస్తున్న అధికారులు, ప్రభుత్వ తీరు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందన్నారు. 86 ఏళ్ల చరిత్ర ఉన్న దాసాంజనేయస్వామి ఆలయాన్ని, రాయల్‌హోటల్ సమీపంలోని గంగానమ్మ గుడిని రాత్రికిరాత్రి తొలగిం చటం అమానుషమన్నారు. హెచ్‌బీ కాలనీ వద్ద రోడ్డు పక్కన ఉన్న కనకమహాలక్ష్మీ ఆలయాన్ని, పక్కనే జెండాచెట్టును కూల్చటం ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రార్థన మందిరాలను కాపాడుకోవాలే తప్పఅరాచకానికి తెగబడితే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. పార్టీ ఓబీసీ విభాగ ఇన్చార్జి శివకుమార్పట్నాయక్, నేతలు అడ్డూరి శ్రీరామ్, భోగవల్లి గురుదత్, పోతిన శ్రీనివాసరావు, డేరుంగుల రమణ, పిళ్లా శ్రీను పాల్గొన్నారు. -
మృత్యువే గెలిచింది...
అప్పుడు మరణాన్ని జయించి...ఇప్పుడు ఓడిపోయింది నరకయాతన అనుభవిస్తూ17 రోజుల తరువాత ఊపిరి వదిలిన పారమ్మ శోక సంద్రంలో కుటుంబ సభ్యులు బాడంగి: పుష్కరాల తొలిరోజున రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన పారవృు్మ మత్యువుతో పోరాడి ఓడిపోయింది. దాదాపు 17 రోృలు మత్యువుతో పోరాడిన పారమ్మ శుక్రవారం తుదిశ్వాస విడిచింది. బాడంగి మండలం పాల్తేరుకు చెందిన పారమ్మ పుష్కరాల తొలిరోజునే పుణ్యస్నానం చేద్దామని రాజమండ్రి బయల్దేరింది. అయితే పుష్కరాల రేవులో జరిగిన తొక్కిసలాటలో కిందపడి తీవ్రంగా గాయపడింది. ముందు చనిపోయిందని భావించిన పోలీసులు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు తెలివి రాగా అక్కడ నుంచి జీఎస్ఎల్ ఆస్పత్రికి మార్చారు. ప్రమాదంలో ఆమె పక్కటెముకలు విరిగిపోవడంతో కూర్చోలేక, నిలుచోలేక ఆమె నరకయాతన అనుభవించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ముందు చిన్నగా మాట్లాడేదని దీంతో ఆశలు పెంచుకున్నామని అవి అడియాసలు అయ్యాయని, నాలుగు రోజుల కిందట రక్తమార్పిడి చేయగా శరీరంలో మార్పు వచ్చి చనిపోయిందని కుమారుడు సింహాచలం తెలిపాడు. ప్రభుత్వం తవ*ుకు ’25 వేల ఆర్థిక సాయం అందించిందని చెప్పారు. తొక్కిసలాటలో చావు నుంచి తప్పించుకున్నందుకు ఎంతో సంతోషించామని కానీ చివరకు ఇలా చనిపోతుందని అనుకోలేదని కుమారుడు, కుమార్తె కామాక్షి కన్నీటి పర్యంతమయ్యారు. పారమ్మకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తెతో పాటు మనుమలు, మనుమరాళ్లు ఉన్నారు. పారవృు్మ మతి విషయం తెలిసి ఆ కుటుంబం విషాదంతో మునిగిపోయింది. -
పుష్కర సైడ్‌లైట్స్
పుష్కరాల ముగింపు ఒక్క రోజే మిగిలి ఉంది. శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతంలోని మంగపేట, రామన్నగూడెం, ముళ్లకట్ట పుష్కరఘాట్లు కిక్కిరిపిసోయూరుు. 11వ రోజు పుష్కరాల సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనలు క్లుప్తంగా.. ►గోదారి ప్రవాహం పెరిగింది. గతంలో ఏర్పాటు చేసి న కంచెలు కొట్టుకపోయాయి. శుక్రవారం మంగపే ట ఘాట్ వద్ద పోలీసులు, అధికారులు కాపాల ఉన్నారు. ►గోదావరి ఉప్పొంగడంతో భక్తుల కోసం వేసిన టెంట్లు నీటిలో నానిపోయూరుు. దీంతో భక్తులు నిలుచోడానికి, పిండ ప్రదానాలు చేయడానికి నీడ కరువైంది. ►కళాకారుల ప్రదర్శన కోసం ఏర్పాటు చేసిన టెంట్ కూలిపోరుుంది. అదే టెంట్ కింద శుక్రవారం ప్రదర్శనలు కొనసాగారుు. ►గోదావరి నదీ తీరంలో దొరికే గులక రాళ్లను భక్తులు తమ ఇంటికి తీసుకెళ్తూ కనిపించారు. ►మంగపేట ఘాట్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమరాల ద్వారా ఐటీడీఏ పీవో అమయ్‌కుమార్, ములుగు ఆర్డీవో మహేంద్రజీలు భక్తుల సౌకర్యాలు, ఏర్పాట్లను పర్యవేక్షించారు. ►మంగపేట పుష్కర ఘాట్‌పై ఏర్పాటు చేసిన కమ్యూనికేషన్ సెంటర్ ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు ►పుష్కరసమాచారాన్నిఉన్నతాధికారులకుచేరవేశారు. ►మంగపేట ఘాట్‌వద్ద గోదావరి ఉధృతి పెరగడంతో చాలామంది షవర్ల కింద స్నానాలు ఆచరించారు. ►రెండు రోజులుగా కురిసిన వర్షాలతో గుంతల్లో భారీగా నీరు చేరింది. భక్తులు వాహనాల పార్కింగ్‌కు ఇబ్బంది పడ్డారు. ►పుష్కర స్నానాలు ఆచరించినవారు గోదావరి నీటిని బాటిళ్లు, టిన్నుల్లో ఇంటికి తీసుకెళ్లడం కనిపించింది. పుష్కర నీటిని ఇళ్లలో నిల్వ ఉంచితే శుభసూచకమని చెప్పారు. ►మంపేటలో భక్తులు తిరుగు ప్రయూణంలో ఇబ్బంది పడ్డారు. వృద్ధులు సుమారు 2 కిలోమీటర్ల పొడువు నడవలేక అవస్థలుపడ్డారు. ►రామన్నగూడెం గోదావరి నదిలో మహిళలు వేసిన రవిక ముక్కలను కొందరు సేకరించడం కని పించింది. ►మంగపేటలో సీఎం కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చిత్రపటానికి ధరావత్ మోహన్‌గాంధీనాయక్ క్షీరాభిషేకం చేశారు. ►మాజీ డిప్యూటీ సీఎం తాటి కొండ రాజయ్య మంగపేట పుష్కరఘాట్ వద్ద పుష్కరస్నానం చేశారు. గోదావరి నది ఒడ్డున ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు జోహార్లు అర్పించారు. -ఏటూరునాగారం/ములుగు/మంగపేట/ ఎస్‌ఎస్‌తాడ్వారుు -
పుష్కర న్యూస్ ట్రాక్
పుష్కరాలు ముగి యడానికి మరో రెండు రో జులే ఉండడంతో జిల్లాలో ని మంగపేట, రామన్నగూడెం, ముళ్లకట్ట పుష్కరఘాట్లకు జనం పోటెత్తుతున్నారు. 10వరోజు పుష్కరాల సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనలు ఇలా..భక్తులు గోదావరి దిగువ ప్రాంతంవైపు వెళ్లొద్దని ఏటూరునాగారంలో పోలీసులు అడ్డుకున్నారు. పుష్కర స్నానానికి వచ్చిన వరంగల్ మీల్స్ కాలనీకి చెందిన వేల్పుల ఐలయ్య(55) మంగపేట ఘాట్‌లో స్నానం ఆచరిస్తుండగా ఫిడ్స్ వచ్చారుు. 108 అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు.మంగపేట, కమలాపురం మధ్యలో వాహనాలు భారీగా నిలిచిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యూరుు. ములుగు డీఎస్పీ బానోతు రాజమహేంద్రనాయక్, మంగపేట ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి ద్విచక్రవాహనంపై తిరుగుతూ ట్రాఫిక్‌ను నియంత్రించారు. గోదావరి ఒడ్డున భక్తులకు నీడను కల్పించేందుకు వేసిన టెంట్ల కిందకు వరద నీరు చేరింది. అధికారులు, సిబ్బంది టెంట్లను మార్చకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.దుస్తులు మార్చుకునే తాత్కాలిక గదుల చుట్టూ వరద నీరు చుట్టుముట్టింది. స్త్రీలు దుస్తులు మార్చుకునే గదులను మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఏర్పాటు చేయలేదు. రామన్నగూడెం గోదావరి పుష్కరాల కవరేజ్ కోసం వెళ్లిన ఓ విలేకరి కెమెరాను స్థానిక ఎస్సై వినయ్‌కుమార్ లాక్కున్నారు. ఫొటోలు తీయడంతో భక్తులు ఎక్కువ సమయం నీటిలో గడుపుతున్నారని అన్నారు. భక్తుల గస్తీ కోసం వెళ్లిన స్థానిక ఎస్సై వినయ్‌కుమార్ గురువారం రామన్నగూడెం గోదావరి నీటిలో పడవపై నుంచి నీటిలో పడిపోయారు. తోటి అధికారులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఎస్సై క్షేమంగా ఒడ్డుకు చేరడంతో ఊపిరి పీల్చుకున్నారు. పుష్కర భక్తులతో మల్లూరు హేమాచల క్షేత్రం గురువారం కిక్కిరిసిపోయింది. భక్తులు చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి రావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.కమలాపురం ఇన్‌టెక్ వెల్ నదీ తీరంలో బిల్ట్ వ్యవస్థాపకుడు లలిత మోహన్‌థ్రాపర్‌కు 50 మంది కార్మికులు పిండ ప్రదానం చేశారు. కమలాపురంలోని లక్ష్మీదేవరను భక్తులు గోదావరి పుష్కరాలకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా భారీ ఊరేగింపు నిర్వహించారు. - ఏటూరునాగారం/ములుగు/మంగపేట -
జన కోటి.. భక్తిని చాటి
జిల్లాలో 1.21 కోట్లకు చేరిన పుష్కర యాత్రికుల సంఖ్య మహాపర్వం ముగిసే నాటికి కోటిన్నరకు చేరుతుందని అంచనా ఆది.. అంత్య పుష్కరాలనేవి గోదావరి నదికి మాత్రమే సొంతం. పావన వాహిని మహాపర్వంలో తొలి అంకమైన ఆది పుష్కరాలు రెండు రోజుల్లో పరిసమాప్తం కానున్నాయి. పుష్కర ఏడాదిలో ఏ రోజున గోదావరి స్నానం చేసినా సంపూర్ణ ఫలం దక్కుతుందనేది పండితుల ఉవాచ. అయినా.. భక్తులు మాత్రం ఆది పుష్కర పర్వంలోనే నదీ స్నానం చేయాలనే తలంపుతో గడచిన పది రోజులుగా గోదారమ్మ చెంతకు పోటెత్తి వస్తూనే ఉన్నారు. జలజ్జననిపై తమకున్న అపార భక్తిని చాటుతున్నారు. జిల్లాలోని 97 ఘాట్లలో పుష్కర పుణ్యస్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య గురువారం కోటి దాటింది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఆది పుష్కరాలు ముగింపు దశకు చేరుకోవడంతో గోదావరి చెంతకు యాత్రికులు వెల్లువలా తరలివస్తున్నారు. గురువారం రాత్రికి జిల్లాలోని 97 పుష్కర ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య 1.21 కోట్లకు చేరింది. శుక్ర, శనివారాల్లో ఈ సంఖ్య కోటిన్నరకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో గురువారం పుష్కర స్నానం ఆచరిం చారు. కొవ్వూరులో మధ్యాహ్నం నుంచి యాత్రికుల రద్దీ పెరగడంతో పట్టణం కిక్కిరిసిపోయింది. రానున్న రెండురోజుల్లో రద్దీ విపరీతం కానున్న దృష్ట్యా ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎస్పీ భాస్కర్ భూషణ్ వెల్లడించారు. బస్సులు తిరిగే రహదారి పక్కన ప్రత్యేకంగా ఇనుప గడ్డర్లను ఏర్పాటు చేశారు. ఏర్పాట్లపరంగా గోష్పాద క్షేత్రం ప్రాంతాన్ని మూడంచెలుగా విభజించి రద్దీని నియంత్రిస్తున్నారు. యాత్రికులు ఐదు నిమిషాలకు మించి ఘాట్లలో ఉండకుండా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. ఇదిలావుండగా, గురువారం పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో పుష్కరాల ఏర్పాట్లు, యాత్రికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఘాట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నామని చెప్పారు. కొవ్వూరు వీఐపీ ఘాట్‌ను మంత్రులు అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్, పీతల సుజాత గురువారం పరిశీలించి సౌకర్యాలపై ఆరా తీశారు. నరసాపురంలో రద్దీ రెట్టింపు గోదావరి పుష్కర సంబరం ముగింపు దశకు చేరుకోనుండటంతో నరసాపురంలో భక్తుల తాకిడి గంటగంటకూ పెరుగుతోంది. గడచిన నాలుగు రోజులతో పోలిస్తే గురువారం రద్దీ రెట్టింపైంది. వలంధర రేవులో స్నానాలు చేయడానికి గంటకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. పిండ ప్రదానాల షెడ్డు సరిపోక ఉదయం వచ్చిన వారు మధ్యాహ్నం వరకు వేచి ఉన్నారు. వారం రోజులుగా పిండ ప్రదాన షెడ్లు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులకు సంబంధించిన ఏర్పాట్లు అరకొరగా ఉన్నప్పటికీ సరిదిద్దే ప్రయత్నం చేయలేదు. పారిశుధ్య పరిస్థితులు ఏమాత్రం మెరుగుపడకపోవడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ విషయంలో పోలీసులు మళ్లీ చేతులెత్తేశారు. పాలకొల్లు రహదారి మీదుగా వచ్చే వాహనాలను అదుపు చేయకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో సుదూర ప్రాంతాల నుంచి ప్రైవేటు బస్సులలో వచ్చిన వారు పట్టణానికి చేరుకునే వీలులేక చించినాడ, యలమంచిలి ఘాట్లకు వెళ్లారు. గురువారం రాత్రి గోదావరి మాతకు హారతి ఇచ్చే కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. పెనుగొండలోనూ పోటెత్తిన భక్తులు పెనుగొండలో రాత్రి పొద్దుపోయే వరకు భక్తులు పోటెత్తారు. పిండ ప్రదానాల షెడ్లు, దుస్తులు మార్చుకునే గదులకు సంబంధించి ఇబ్బందులు తప్పలేదు. పిండ ప్రదానాలు జరిగేచోట ఒక కుటుంబం గోదానం ఇచ్చే సందర్భంలో అపశృతి చోటుచేసుకుంది. గోవు జనంలోకి పరుగు తీయడంతో స్వల్పతొక్కిసలాట జరిగి ఇద్దరు గాయపడ్డారు. ఆచంట మండలంలోని ఘాట్లకు బస్ సర్వీసులు లేక యాత్రికులు అవస్థలు పడుతున్నారు. మండలంలోని కరుగోరుమిల్లి, భీమలాపురం, పెదమల్లం ఘాట్లకు ఆర్టీసీ బస్సులు వెళ్లడం లేదు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి రావడంతో యాత్రికుల జేబులకు చిల్లు పడుతోంది. పట్టిసీమ క్షేత్ర దర్శనం లేదు గోదావరి నీటిమట్టం పెరగడంతో పట్టిసీమ క్షేత్రానికి భక్తులు చేరుకునే వీలులేకపోయింది. లాంచీల రాకపోకలను ఇంకా పునరుద్ధరించలేదు. భక్తుల రద్దీ బాగా పెరిగింది. ఇదే సందర్భంలో సీఎం చంద్రబాబు పర్యటన పుష్కర యాత్రికులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు కొయ్యలగూడెం, పోలవరం నుంచి వచ్చే మార్గాల్లో చంద్రబాబు పర్యటన కారణంగా ట్రాఫిక్‌ను నిలిపివేశారు. దీంతో భక్తులు ఎక్కడికక్కడ నిలిచిపోయి మూడు గంటల ఆలస్యంగా ఘాట్లకు చేరుకున్నారు. -
భక్తజన హోరు
ఒక్కరోజే 4 లక్షల మంది పుష్కర స్నానాలు గోదావరి తీరం భక్తి పారవశ్యంలో తడిసి ముద్దవుతోంది. పుష్కరాల తొమ్మిదో రోజు బుధవారం భక్తులు పోటెత్తారు. మంగపేట, రామన్నగూడెం ఘాట్లలో సుమారు నాలుగు లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. - సాక్షి, హన్మకొండ హన్మకొండ :గోదావరి తీరం భక్తి పారవశ్యంలో తడిసి ముద్దవుతోంది. పుష్కరాలు ప్రారంభమై తొమ్మి ది రోజులు గడుస్తున్నా భక్తుల ప్రవాహనం తగ్గ డం లేదు. బుధవారం మంగపేటలో 2.50లక్షలు, రామన్నగూడెం ఘాట్‌లో 1.50లక్షల మం ది పుష్కరస్నానం చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న చిరు జల్లులతో రహదారులు చిత్తడిగా మారినా లెక్కచేయకుండా భక్తులు పుష్కరస్నానాలకు తరలివస్తూనే ఉన్నారు. పస్రా నుంచి ప్రకృతి అందాలు.. గోదావరి తీరానికి చేరుకునే దారిలో ప్రకృతి అం దాలకు ముఖద్వారంగా ములుగు స్వాగతం ప లుకుతోంది. అక్కడి నుంచి దాదాపు 70 కిలోమీటర్ల మేర పచ్చని చెట్ల నడుమ ప్రయూణం సాగుతోంది. గోవిందరావుపేట మండలం పస్రా దా టాక ఏటూరునాగారం అభయారణ్యం గుండా సాగే ప్రయాణం, అప్పటి వరకు ఉన్న బడలికను దూరం చేస్తోంది. శని, ఆదివారాల్లో రాష్ట్ర వ్యా ప్తంగా పుష్కరదారుల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడి నా.. భక్తులు అతితక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్నది ఈ మార్గంలోనే కావడం గమనార్హం. ఏటూరునాగారం నుంచి కమలాపురం వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపు లా పచ్చని చెట్ల నడుమ భక్తులు భోజనాలు చే యడం, సేదదీరడం వనభోజనాలను గుర్తు కు తెచ్చారుు. మంగపేట సమీపంలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుంటున్న భక్తులు.. ఇక్కడ సహాజ సిద్ధంగా వెలసి న మంచినీటి ధారలు ఆస్వాదిస్తూ ఆనందం పొందుతున్నారు. మంగపేట, రామన్నగూడెంలో చేసే పుష్కర స్నా నం చేసి గోదారమ్మ అనుగ్రహం పొందిన భక్తులకు ఈ ప్రయూణం చక్కని అనుభూతి కలిగి స్తోంది. తొమ్మిదోరోజు భారీగా భక్తులు కర్మకాండలు నిర్వహించేందుకు అనువైన రోజని తెలియడంతో భక్తు లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో పూజారుల కొరత ఏర్పడగా సామూహిక పిండప్రదానం చేయాల్సి వచ్చింది. కాగా, ఎన్పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణ, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాద వ్ మంగపేట, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నర్సారెడ్డి రామన్నగూడెం లో పుష్కరస్నానాలు చేశారు. తొమ్మిది రోజుల్లో 17,05,850 మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారని అంచనా. మంగపేట మహానగరం పుష్కరాలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులు, వేలాది వాహనాలతో మంగపేట మహానగరాన్ని తలపిస్తోంది. తొమ్మిది రోజుల నుంచి భక్తుల రాకతో మంగపేట సందడిగా మారింది. -కొమరగిరి సురేష్, శారదా వస్త్రాలయం చెరగని ముద్ర రాష్ట్రంలో మొదటిసారి గోదావరి పుష్కరాలు మంగపేటలో నిర్వహించ డం ఆనందంగా ఉంది. దీని ద్వారా రాష్ట్రంలో మంగపేటకు చెరగని ముద్ర పడినట్లయ్యింది. - రావుల కృష్ణవేణి, శ్రావ్య జిరాక్స్ నా జన్మ ధన్యమైంది పుష్కరాలకు వచ్చే భక్తులకు ఉచిత బస్సులను నడిపే అవకాశం కలిగినందుకు మా జన్మ ధన్యమైంది. వేలాది మందిని పుష్కరాలకు తరలించడంలో కలిగిని ఆనందం మరేదానిలో లేదు. -గుడెల్లి రాములు, డ్రైవర్, హన్మకొండ -
హెల్ప్‌డెస్క్‌లు భేష్
తప్పిపోయిన పిల్లలు తల్లిదండ్రుల చెంతకు ఇప్పటివరకు 64 మంది చిన్నారులకు రక్షణ ఇందూరు/మోర్తాడ్ : జిల్లాలోని 11 ప్రాంతాలలో ఏర్పాటు చేసిన 18 పుష్కరఘాట్లలో పుణ్య స్నానాలు ఆచరించడాని కి ప్రజలు పిల్లా పాపలతో వస్తున్నారు. భక్తుల ర ద్దీ ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పిపోయిన పిల్లలను తిరిగి తల్లిదండ్రుల చెం తకు చేర్చడానికి జిల్లా మహిళా, శిశు సంక్షే మ శాఖ ఆధ్వర్యంలో ప్రతీ ఘాట్ వద్ద హెల్ప్ డెస్క్‌లను ఏ ర్పాటు చేశారు. వారం రోజులుగా పుష్కరాలలో మొ త్తం 64 మంది పిల్లలు తప్పిపోయారు. హెల్ప్ డెస్క్ సిబ్బంది వీరిని క్షే మంగా వారి వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు అందజేసి ఘనతను చాటుకున్నారు. సమస్య తలెత్తకుండా తప్పిపోయిన పిల్లలు కుటుంబసభ్యులకు చెందిన వారో కాదో పూర్వాపరా లు, గుర్తింపు కార్డులు పరిశీలించిన తరువాతే అప్పగించారు. ఎక్కువగా పోచంపాడ్, కందకుర్తి, తడ్పాకల్, తుంగిని ఇంకా ఒకటి రెండు పుష్కరప్రాం తా లలో నిత్యం లక్షల మంది స్నానా లు ఆచరించడానికి వచ్చారు. ఇక్కడ భక్తుల రద్దీ గణనీయంగా పెరగడం తో చిన్న పిల్లలు చాలా మంది తప్పిపోయారు. ఈ క్రమంలో పుష్కర ప్రాంతాలలో ఉన్న హెల్ప్ డెస్క్ సిబ్బందికి కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో తప్పిపోయిన పిల్లలను వెతికి మరీ వారికి అందించా రు. ఒంటరిగా కనిపించిన పిల్లలను హెల్ప్ డెస్క్‌కు తీసుకువచ్చి పిల్లల వివరాలు కుటుంబ సభ్యులకు తె లిసేలా మైకు ద్వారా ప్రచారం నిర్వహించారు. తద్వారా పిల్లల ఆచూకీ తొందరగా లభించింది. హెల్ప్ డెస్క్‌ల విధుల నిర్వహణను బాధిత తల్లిదండ్రులు కొనియాడారు. అధికారులు కూడా వారిని అభినందించారు. పుష్కర ఘాట్ల వద్ద ఒక వేళ హెల్ప్ డె స్క్‌లు లేకుంటే జన ప్రవాహంలో తప్పిపోయిన పిల్ల ల ఆచూకీ అంత సులభంగా లభించేది కాదు. -
జలం.. జనం
ఎనిమిదో రోజూ భక్తుల పుణ్యస్నానాలు ♦ కిటకిటలాడుతున్న పుష్కరఘాట్లు ♦ {తివేణి సంగమంలో ప్రత్యేక పూజలు ♦ పోచంపాడ్లోనూ కొనసాగిన రద్దీ ♦ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ కవిత ♦ మంత్రి పోచారం, కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ ♦ తరలివచ్చిన వీఐపీలు, వీవీఐపీలు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మహా పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. దూరప్రాంతాల నుంచి చాలా మంది వస్తుండడంతో పోచం పాడ్, తడపాకల్, కందకుర్తి, తుంగిని, సావె ల్, ఉమ్మెడ, గుమ్మిర్యాల్ సహా పుష్కరఘాట్ల న్నీ రద్దీగా మారాయి. పుష్కరస్నానాల అనంతరం భక్తులు దైవదర్శనాల కోసం బారులు తీరుతున్నారు. త్రివేణి సంగమానికి భక్తుల రాకపోకలు భారీగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, క ర్ణాటక, మహారాష్ర్ట నుంచి భారీగా భక్తులు వస్తున్నారు. ఇందుకు తగినట్లుగా అధికారు లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప ర్యవేక్షిస్తూ లోపాలను సవరిస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి పో చారం శ్రీనివాస్‌రెడ్డి పుష్కరఘాట్లను పరిశీ లించారు. కలెక్టర్ డి. రొనాల్డ్‌రోస్ సుడిగాలి పర్యటనతో పుష్కరఘాట్లలో అధికారులను అప్రమత్తం చేశారు. ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు. కందకుర్తిలో అదేజోరు కందకుర్తిలో భక్తుల సంఖ్య పెరుగుతోంది. మం గళవారం రెండు లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమంగా ప్ర సిద్ధి చెందడంతో భక్తుల సంఖ్య భారీగా పెరి గింది. నీరు కూడా సమృద్ధిగా చేరుతుండటంతో భక్తుల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఉద యం తొమ్మిది గంటల నుంచి రాత్రి వరకు పు ణ్యస్నానాలు చేస్తున్నారు. కందకుర్తి పుష్కర క్షేత్రానికి కిలోమీటరు దూరంలో ఎగువ భాగాన ఉన్న సంగమేశ్వరాలయం వద్ద గోదావరి నది లో నీళ్లు నిల్వ ఉండటంతో భక్తులు అధిక సం ఖ్యలో ఆ ప్రాంతానికి వెళ్తున్నారు. కందకుర్తి ని టీఎస్ ఆర్టీసీ జేఎండీ రమణారావు సందర్శించారు. జేసీ రవీందర్‌రెడ్డి ఘాట్ల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. వైద్య ఆరోగ్య శాఖ శిబిరా న్ని సందర్శించా రు. పోచంపాడ్లోనూ భక్తుల రద్దీ కొనసాగింది. హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి సైతం ఇక్కడికి తరలివచ్చారు. రెండు లక్షల వరకు గోదావరిలో పుష్కరస్నానం ఆచరించారు. వచ్చే దారి, వెళ్లే దారి ఒకటే కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రా జెక్ట్ నుంచి నీటి విడుదల జరుగుతుండటంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. అన్ని పుష్కరఘాట్లకు తాకిడి తడపాకల్, దోంచంద, గుమ్మిర్యాల్‌లోని పుష్క ర క్షేత్రాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజామున పుణ్యస్నానాలు ఆచరిస్తే బా గుంటుందనే నమ్మకంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. తడపాకల్‌లో జనం రద్దీ ఉదయం నుంచి కొనసాగుతూనే ఉంది. దోంచంద, గుమ్మిర్యాల్‌కు కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి గోదారమ్మకు నీరాజనం పలి కారు. గంగమ్మతల్లి ఆశీస్సులను భక్తులు పొం దారు. బినోల ఘాట్‌లో 8120 మంది భ క్తులు పుష్కర స్నానాలు చేశారు. గ్రామాభివధ్ది కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత అన్నదానకార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఉమ్మెడ పుష్కర ఘాట్ లో ఎనిమిదవ రోజు పుష్కర భక్తులు తాకి డి తగ్గలేదు. వివిద ప్రాంతాల నుంచి 21 వేల మందికి పైగా భక్తులు గోదావరినదిలో పుష్కర స్నానం చేశారు. పుష్కరాల ఉత్సవాలలో భాగం గా చాకు లింగం ఆధ్వర్యంలో కళాకారులు బుర్రకథను వినిపించారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక అధికారి జడ్పీ సీఈఓ మోహన్‌లాల్ పర్యవేక్షణ చేశారు. పుష్కరఘాట్లకు వీఐపీల తాకిడి ఎస్ఆర్ఎస్పీ పుష్కర ఘాట్ల వద్ద ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి పుష్కర స్నానమాచరించారు. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కు టుంబ స భ్యులు పుష్కర స్నానమాచరించి పుణ్య పూ జలు నిర్వహించారు. కర్నూల్ జిల్లా పా ణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పు ణ్యస్నానాలు ఆచరించారు.తెలంగాణ సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు దంపతులు పుణ్య స్నానమాచరించారు. రాష్ట్ర గిడ్డం గుల సంస్థ మాజీ చైర్మన్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్, ఐటీ కమిషనర్ శ్రీధర్, ఐఓసీ సీఈఓ నందకిషోర్ పవిత్ర స్నానాలు చేశారు. మాజీ మంత్రి శనిగరం సం తోష్ రెడ్డి పుష్కర స్నానం ఆచరించారు. నిజా మాబాద్ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం దంపతులు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌ డ్ , మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వ ర్లు, వికారబాద్ ఎమ్మెల్యే సం జీవ్రావు పుష్కర స్నానమాచరించారు. దోంచంద పుష్కరఘాట్ లో మంగళవారం సినీ, టీవీ ఆర్టిస్టులు మీణా కు మారి, నందకిషోర్ పుష్కరస్నానాలు చేశారు. ఆచరిం చా రు. -
పుష్కరాల్లో కనిపించని కేఈ
పక్కనపెట్టిన సీఎం దేవాదాయ మంత్రి మాణిక్యాలరావుకూ దక్కని ప్రాధాన్యత హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పుష్కరాల్లో కీలక బాధ్యత నిర్వహించాల్సిన రెవెన్యూ శాఖను పర్యవేక్షించే కేఈ కృష్ణమూర్తి ఈ మహాక్రతువుకు దూరంగా ఉన్నారు. పుష్కరాల విషయంలో ముఖ్యమంత్రి చ ంద్రబాబు ఆయనను పూర్తిగా పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ నెల 14న పుష్కరాలు ప్రారంభమైనప్పటి నుంచి కనీసం దరిదాపుల్లోకి కూడా కేఈ కృష్ణమూర్తి రాలేదు. పుష్కరాలకు ఆరు నెలల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ప్రభుత్వం నిర్వహించిన ఏ సమీక్షా సమావేశంలోనూ ఆయన పాల్గొనలేదు. అదే సమయంలో పుణ్య స్నానాలకు ప్రధాన కేంద్రమైన రాజమండ్రి లో పర్యటించలేదు. మరో నాలుగు రోజుల్లో పుష్కరాలు ముగియనుండగా ఇప్పటివరకు ఉప ముఖ్యమంత్రి అటువైపు వెళ్లకపోవడం అధికార టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. బుధవారం రాజమండ్రిలో జరగనున్న మంత్రివర్గ సమావేశానికైనా ఆయన హాజరవుతారా? అనేది అనుమానంగానే ఉంది. ఇన్నిరోజులుగా కేఈ దూరంగా ఉన్నా చంద్రబాబు ఏనాడూ వాకబు చేయకపోగా ఆయన గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. పుష్కరాల కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంతో పాటు ఏ ఒక్క కమిటీలోనూ ఆయనను నియమించలేదు. ఏపీ రాజధాని భూ సేకరణ విషయంలోనూ కేఈని దూరం పెట్టిన విషయం తెలిసిందే. పుష్కరాల విషయంలో దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావును కూడా మొదటినుంచీ చంద్రబాబు దూరం పెడుతూ వచ్చారు. పుష్కరాల వ్యవహారాలను మంత్రి నారాయణకు అప్పగించారు. కొద్ది రోజుల కిందట మంత్రి మాణిక్యాలరావుకు చిన్నపాటి శస్త్ర చికిత్స జరిగిందని, అందువల్ల విశ్రాంతి తీసుకుంటున్నారని, పుష్కరాలు ముగిసిన తరువాత విధులకు హాజరవుతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరో మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా పుష్కరాలకు దూరంగా ఉంటున్నారు. అన్ని జిల్లాల మంత్రులు అక్కడే మకాం వేసినా గంటా అటువైపు వెళ్లడం లేదు. పుష్కరాల విషయంలో మంత్రివర్గంలోని కొందరికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్న కారణంగానే గంటా దూరంగా ఉంటున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. -
మహా పుష్కరాలపై పిల్ కొట్టివేత..
{పభుత్వాలది ప్రచారం ఎంతమాత్రం కాదు అది కేవలంసమాచారం ఇవ్వడమే అలా చేయడం {పభుత్వాల బాధ్యత అన్ని మతాలను సమానంగా చూడటమే లౌకికవాదం ధర్మాసనం స్పష్టీకరణ హైదరాబాద్: మహాపుష్కరాలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) హైకోర్టు కొట్టేసింది. పుష్కరాలకోసం ప్రభుత్వాలు చేస్తోంది ప్రచారం కాదని, ప్రజలకు సమాచారాన్నే అందిస్తున్నాయని స్పష్టంచేసింది. ప్రజల మతవిశ్వాసాలకు సంబంధించి న కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయడం ప్రభుత్వాల బాధ్యతని తేల్చిచెప్పింది. పుష్కరాలద్వా రా ప్రభుత్వాలు ఓ మతాన్నే ప్రోత్సహిస్తున్నాయన్న వాదనల్లో అర్థంలేదంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. మహాపుష్కరాలకు ప్రచారం చే యడం లౌకికస్ఫూర్తికి విరుద్ధంగా ప్రకటించాలని, రాజమండ్రిలో పుష్కరాల ప్రారంభం రోజున జరిగిన తొక్కిసలాటలో 29 మంది చనిపోవడానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును బాధ్యుడిగా చేయాలంటూ పౌరహక్కుల సంఘం నేత చిల్కా చంద్రశేఖర్ దాఖలు చేసిన పిల్‌ను ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున వి.రఘునాథ్ వాదనలు వినిపిస్తూ.. గోదావరిలో స్నానమాచరిస్తే పుణ్యం, మోక్షం కలుగుతుందంటూ ఇరుప్రభుత్వాలు ప్రచారం హోరెత్తిస్తున్నాయని, ప్రజల డబ్బుతో ప్రభుత్వాలిలా ఓ మతపరమైన కార్యక్రమాలకు ప్రచారం చేయడం లౌకికస్ఫూర్తికి విరుద్ధమన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ప్రభుత్వాలు మహాపుష్కరాలకే కాదు.. పలు ఇతర మతకార్యక్రమాలకూ ఇలానే చేస్తున్నాయి. ప్రధాని రంజాన్‌కు ఈద్ ముబారక్ చెబితే తప్పవుతుందా? హ్యాపీ దీపావళి అంటే ఓ మతానికి మద్దతు పలుకుతున్నట్లా? మీ ప్రకారం ఓ పండుగకు సెలవు ప్రకటించడమూ తప్పన్నట్లు ఉంది. లౌకికస్ఫూర్తిని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అన్నిమతాల్ని సమానంగా చూడటమే లౌకికవాదం. ప్రధాని, సీఎంలూ రంజాన్‌కు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయ డం.. ఎవరైనా ఆహ్వానిస్తే వెళ్లడం సర్వసాధారణం. ఇలా వెళ్లడం ఓ మతాన్ని ప్రోత్సహించినట్లవుతుందని అనగలమా? వినాయకచవితి, దసరాలకు విగ్రహాల నిమజ్జనానికి ప్రభుత్వాలు కోట్ల సొమ్ము ఖర్చుచేస్తూ ప్రజలకిబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇలాచేయడం ప్రభుత్వాల బాధ్యత. దీన్ని ఓ మతాన్ని ప్రోత్సహించడానికి చేస్తున్నారనడానికి వీల్లేదు కదా? పుష్కరాలకు వెళితే మీకు అదిస్తాం.. ఇదిస్తాం.. అని చెబితే తప్పు. అలా ప్రభుత్వాలు చేస్తుంటే చెప్పండి. మేం జోక్యం చేసుకుంటాం. అంతేతప్ప ఇటువంటి వ్యాజ్యాల్లో మాత్రం కాదు’’ అని వ్యాఖ్యానించింది. అత్యంత దురదృష్టకరం రాజమండ్రిలో పుష్కరాల ప్రారంభం రోజున తొక్కిసలాట జరిగి 29 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇవి అసహజ మరణాలు కానేకాదని, ఓ మనిషి చేసిన హత్యలని రఘునాథ్ నివేదించారు. ఏపీ సీఎం చంద్రబాబే దీనికి బాధ్యులని, ఆయన ప్రచారంకోసం ఓ డాక్యుమెంటరీ చిత్రీకరణకు చేసిన ఏర్పాట్లవల్లే అంతమంది మృత్యువాత పడ్డారని తెలిపారు. రాజకీయలబ్ధికోసమే డాక్యుమెంటరీకి శ్రీకారం చుట్టారన్నారు. తెల్లవారుజాము 2 గంటల నుంచి ఉదయం 8.30 గంటల వరకు చంద్రబాబుకోసం జనాల్ని క్యూలైన్లలో నిలిపేశారని, దీంతో తొక్కిసలాట జరిగిందని వివరించారు. 29 మంది చనిపోయినా ఏపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టూ లేదని, అసహజ మరణాలని ఎఫ్ఐఆర్ నమోదు చేసి చేతులు దులుపుకుందని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఆ ఘటన అత్యంత దురదృష్టకరమంది. కాగా లౌకికవాదానికి ముడిపెట్టి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని విచారించలేమని, దీన్ని కొట్టేస్తున్నామని పేర్కొంది. -
ముక్కోటి దాటింది..
ట్రాఫిక్ సమస్య తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న భక్తులు ప్రధాన క్షేత్రాల్లోనూ తొందరగానే దర్శనం ఏపీలో మంగళవారం తగ్గిన పుష్కర భక్తులు రాజమండ్రి: పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని పవిత్ర గోదావరిలో ముక్కోటి మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారు. భక్తజనం ఎక్కువవుతుండటంతో పుష్కరాలకు మరో 4 రోజు లుండగానే కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. అయితే ఉభయగోదావరి జిల్లాల్లో మంగళవారం భక్తుల రద్దీ అనూహ్యంగా తగ్గింది. కోటి లింగాల రేవు, పుష్కర ఘాట్లు మినహా మిగిలిన ఘాట్లలో తెల్లవారుజాము నుంచే పెద్దగా ర ద్దీ కనిపించలేదు. అలాగే సరస్వతీ (వీఐపీ) ఘాట్‌కు వచ్చే వీఐపీల తాకిడి కూడా తగ్గింది. ఉభయ గోదావరి జిల్లాల్లో సోమవారం 47 లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరిస్తే మంగళవారం రాత్రి 8 గంటల సమయానికి 34,03,457 మంది భక్తులు మాత్రమే పుణ్య స్నానాలను ఆచరించారు. తూర్పున 24,06,858 మంది, పశ్చిమలో 10,86,201 మంది పుష్కర స్నానమాచరించారు. తూర్పులో లక్ష మంది, పశ్చిమలో 70 వేలమంది వరకు భక్తులు పుష్కరస్నానాల కోసం ఇంకా వేచి ఉన్నారు. దీంతో ఇప్పటివరకు ఉభయగోదావరి జిల్లాల్లో పుష్కర స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 3,09,42, 618కు చేరింది. రాజమండ్రి అర్బన్ పరిధిలోని ఘాట్లలో 1,17,62,323 మంది పుష్కర స్నానం చేయగా, తూర్పుగోదావరిలోని గ్రామీణ ఘాట్లలో 93,78,081 మంది, పశ్చిమలో మరో 98,02,214 మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
ఇదీ.. బాబు తీరు
పుష్కరాలను ఘనంగా నిర్వహించి, రాష్ట్రానికి గుర్తింపు తేవాలన్న తపనకంటే తనకు పేరు ప్రఖ్యాతులు రావాలన్న తలంపుతో చంద్రబాబు వ్యవహరించిన తీరువల్లే 29 మంది మరణించారు. పుష్కరాల పనుల్లో అడుగడుగునా చంద్రబాబు స్వార్థపూరితంగా వ్యవహరించారు. ఒక మహాకార్యం తలపెట్టినప్పుడు అందరినీ కలుపుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కాని చంద్రబాబు మాత్రం క్రెడిట్ అంతా తనకే దక్కాలనే అభిప్రాయంతో తానే సర్వస్వంగా వ్యవహరించారు. సమీక్షలు, సమావేశాలు, క్షేత్రస్థాయి పనుల తీరు పరిశీలన.. ఇలా అన్ని పనులను చంద్రబాబే స్వయంగా పర్యవేక్షించారు. దీంతో ఉన్నతాధికారులు ఎవరూ ఏర్పాట్లలో లోపాలను సరిదిద్దడానికి సాహసించలేదు. ఒకవేళ లోపాలను ఎత్తిచూపితే చంద్రబాబు ఆగ్రహిస్తారేమోనని మిన్నకుండిపోయారు. మహాకుంభమేళా తరహాలో పుష్కరాలను నిర్వహించాలని తలచి, రూ.1,685 కోట్లను కేటాయించి, పుష్కరాల కీర్తి అంతా తనకే దక్కాలని భావించి చివరకు దేవాదాయశాఖ మంత్రిని కూడా పక్కనబెట్టారు. గోదావరికి ప్రతి 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాపుష్కరాలు ఇవేనంటూ.. పుష్కరాల్లో స్నానమాచరిస్తే పాపాలన్నీ పోతాయంటూ హడావుడి చేశారు. మూడుకోట్ల మందికిపైగా భక్తులు హాజరవుతారని ప్రకటించారు. సినీ మాయాజాలంతో నిర్వహించిన నిత్యహారతి సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందంటూ పీఠాధిపతులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను చంద్రబాబు పట్టించుకోలేదు సరి కదా నిత్యహారతి సక్సెస్ అయ్యిందంటూ హర్షం వ్యక్తం చేశారు. కుంభమేళాకన్నా గొప్పగా గోదావరి పుష్కరాలు నిర్వహించారని, చంద్రబాబు మాత్రమే ఇలాంటివి చేయగలరని ప్రచారం చేసుకోవడానికి పుష్కరాలపై డాక్యుమెంటరీ తీయించి, దాన్ని నేషనల్ జియోగ్రఫీ చానల్లో ప్రసారం చేయించడం ద్వారా దేశ విదేశాల్లో చంద్రబాబు అంటే అబ్బో అనిపించుకోవాలని ఎత్తుగడ వేశారు. ఇలా పుష్కరాలకు సంబంధించిన అన్ని వ్యవహారాల్లో అన్నీ తానై వ్యవహరించిన చంద్రబాబు... ఇప్పుడు జరిగిన దుర్ఘటనతో మాత్రం తనకేమీ సంబంధం లేదని చెప్పడం విడ్డూరంగా లేదూ..? -
ఏమార్చడంలో దిట్ట
ఆడి తప్పడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేర్పరి. ఒకే అంశంపై విపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడంలో ఆయనది అందెవేసిన చేయి. రాజకీయ లబ్ధే పరమావధిగా రెండు నాల్కల ధోరణితో ముందుకెళ్లడమే చంద్రబాబు జీవిత పరమార్థం. ఇందుకు చంద్రబాబునాయుడి రాజకీయ జీవిత పుటలను తిరగేస్తే పేజీకో ఉదాహరణ కన్పిస్తుంది. అప్పుడు 2004 కృష్ణా పుష్కరాల్లో ఘాట్ రెయిలింగ్ కూలీ ఐదుగురు మరణించడానికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ►కృష్ణా పుష్కరాల ఘటనపై... మీకు చేతకాకపోతే తప్పుకోండి అంటూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై గంభీర స్వరంతో విరుచుకుపడ్డారు. ►అప్పటి దుర్ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ►కృష్ణా పుష్కరాల్లో విజయవాడ వద్ద ఐదుగురు మరణించిన సంఘటనపై స్మారక స్థూపం నిర్మించాలని చంద్రబాబు డెరైక్షన్‌లో టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ► కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు ఏపాటివో తొలిరోజు జరిగిన ఘటనతోనే డొల్లతనం బయట పడిందని బాబు విరుచుకుపడ్డారు. (నిజానికి కృష్ణా పుష్కరాలు జరగడానికి మూడు నెలల ముందు మాత్రమే వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.) ►‘కాంగ్రెస్ నిర్వాకం వల్లే కృష్ణా పుష్కరాల్లో ఘోరం జరిగింది. గతంలో గోదావరి పుష్కరాలను పకడ్బందీగా నిర్వహించాం. మేమే గ్రేట్’ అని చంద్రబాబు డబ్బా కొట్టుకున్నారు. ఇప్పుడు ► గోదావరి పుష్కరాలు తొలిరోజున.. బాబు ప్రచార ఆర్భాటం కారణంగా 29 మంది మరణించడాన్ని చిన్న దుర్ఘటనంటూ కొట్టిపారేస్తున్నారు. రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌పై కనీసం స్పందించడంలేదు. ► తన నిర్వాకం వల్ల 29 మంది అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోతే.. సంఘటన జరిగి వారం రోజులు కావ స్తున్నా ఉలుకు పలుకు లేదు. ► తన నేతృత్వంలోనే జరిగిన పుష్కరాల్లో జరిగిన అపశ్రుతికి, తనకూ సంబంధమేమీ లేదంటున్నారు. ► ఇప్పుడు 29 మంది మరణించినా బాబుగానీ, ఆయన ప్రభుత్వంలోని మంత్రులుగానీ, టీడీపీ నేతలెవరికీ స్థూపం విషయం గుర్తుకు రావడంలేదు. ► మరి ఇప్పుడు కూడా తొలిరోజే తొక్కిసలాట జరిగి అంతకు మించిన జనం విగతజీవులయ్యారు. మరి ఈ ప్రభుత్వం ఏర్పాట్లు ఏపాటివో? (ఏడాది పాలన పూర్తి చేసుకున్న బాబు దాదాపు ఎనిమిది నెలల ముందు నుంచి పుష్కరాల పనులు ప్రారంభించారు. స్వయంగా చంద్రబాబే పనులను సమీక్షించారు. ) ►మరి ఈసారి గోదావరి పుష్కరాల్లో ‘ఆ పకడ్బందీ’ ఏమైంది? ప్రచారం కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టారా? అని ప్రశ్నిస్తే.. సమాధానమే లేదు. -
పుష్కర ప్రభంజనం
తెలంగాణలో ‘పుష్కర’ మార్గాల్లో స్తంభించిన ట్రాఫిక్ కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయిన వాహనాలు జన జాతరగా కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం, బాసర శనివారం ఒక్కరోజే 50 లక్షల మందికిపైగా భక్తుల పుష్కర స్నానం సెలవులతో పెరిగిన భక్తుల సంఖ్య.. నేడు కూడా ఇదే స్థాయిలో రద్దీ హైదరాబాద్: రాష్ట్రంలోని రహదారులన్నీ శనివారం పుష్కర బాట పట్టాయి. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో పెద్ద సంఖ్యలో జనం పుష్కరాలకు బయలుదేరడంతో.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. పలు చోట్ల రహదారులపై కిలోమీటర్ల పొడవునా వేలాది వాహనాలు నిలిచిపోయాయి. బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం.. ఇలా అన్ని చోట్లా ఇదే పరిస్థితి. దీంతో భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. శనివారం ఒక్కరోజే దాదాపు 50 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు చేసినట్లు అంచనా. ఇందులో ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 26 లక్షల మంది పుష్కర స్నానం చేశారు. ధర్మపురిలో ఏకంగా 10 లక్షల మంది, కాళేశ్వరంలో ఏడున్నర లక్షల మంది, భద్రాచలంలో 5 లక్షల మంది, బాసరలో లక్షన్నర మంది పుష్కర స్నానాలు చేశారు. ఆదివారం కూడా ఇదే స్థాయిలో రద్దీ నెలకొనే అవకాశమున్నట్లు అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. వరుస సెలవుల నేపథ్యంలో గోదావరి పుష్కర స్నానానికి భక్తులు పోటెత్తారు. నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో పుష్కర స్నానాలకు 4 రోజుల్లో భక్తుల సంఖ్య సాధారణంగానే ఉంది. శనివారం సెలవు కావటంతో భక్తుల సంఖ్య పెరుగుతుందని ఊహించిన ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. కానీ రద్దీ అంచనాలను మించింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్లే జాతీయ రహదారి, హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారి కిటకిటలాడాయి. టోల్గేట్ల వద్ద నాలుగైదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పుష్కర ఘాట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్- నిజామాబాద్ జాతీయ రహదారిపై తూప్రాన్ టోల్గేట్ దగ్గర నిత్యం 11 వేల వాహనాలు ముందుకు సాగుతుండగా శనివారం ఏకంగా 67 వేల వాహనాలు వెళ్లాయి. హైదరాబాద్-విజయవాడ హైవేపై చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి, హైదరాబాద్-వరంగల్ హైవేపై బీబీనగర్ టోల్గేట్ల వద్ద రోజువారీ వాహనాల సంఖ్య కంటే శనివారం 18 వేలకుపైగా వాహనాలు అదనంగా వెళ్లాయి. ఎన్ని ఏర్పాట్లు చేసినా.. పుష్కర భక్తుల తాకిడిని తట్టుకునేందుకు ఆర్టీసీ 2,600 అదనపు బస్సులు నడుపుతోంది. దక్షిణ మధ్య రైల్వే ఇటు బాసర, అటు భద్రాచలం, మంచిర్యాల, మణుగూరు వైపు దాదాపు 200 ట్రిప్పుల అదనపు రైళ్లను నడుపుతోంది. కానీ శనివారం ఇవి ఏమూలకూ సరిపోలేదు. కొన్ని పుష్కర కేంద్రాలకు ఇక భక్తులు రావొద్దంటూ అధికారులు ఓ దశలో హెచ్చరికలు కూడా చేయాల్సి వచ్చింది. పరిస్థితి తీవ్రతను ముందే ఊహించిన ముఖ్యమంత్రి ప్రధాన పుష్కర కేంద్రాలకు మంత్రులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పంపి పరిస్థితిని పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు. నీళ్లు తక్కువగా ఉండటంతో వరంగల్ జిల్లా మంగపేట పుష్కరఘాట్ వద్ద రోజూ 20 వేలలోపే భక్తులు వస్తుండగా.. శనివారం ఆ సంఖ్య మూడు లక్షలను దాటిందని అధికారులు చెబుతున్నారు. మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ధర్మపురిలో పుణ్యస్నానం చేశారు. ఎక్కడికక్కడే.. పుష్కరాలకు భక్తులు పోటెత్తడంతో ధర్మపురికి ఇరువైపులా దాదాపు 20 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఐదారు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు, ఉన్నతాధికారులు సైతం నడుచుకుంటూ వెళ్లి ట్రాఫిక్‌ను సరిదిద్దారు. ఇక త్రిలింగ క్షేత్రమైన కాళేశ్వరం వద్ద తెల్లవారుజాము నుంచే వాహనాల రద్దీ ప్రారంభం కావడంతో కాటారం నుంచి కాళేశ్వరం వరకు దాదాపు 28 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు నాలుగు గంటల పాటు ఎక్కడి వాహనాలు అక్కడే ఉండిపోయాయి. పుష్కర పనులను పర్యవేక్షించేందుకు కాళేశ్వరం వస్తున్న మంత్రి సి.లక్ష్మారెడ్డి సైతం మూడు గంటలపాటు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయారు. మరోవైపు గోదావరి పుష్కరాలకు వెళ్లే వాహనాలతో నిజామాబాద్ జిల్లాలోనూ తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు తప్పలేదు. హైదరాబాద్-నిజామాబాద్ జాతీయ రహదారిపై ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇక భద్రాచలంలోనూ ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. ఖమ్మం నుంచి భద్రాచలం వరకు ప్రయాణానికి ఏకంగా 8 గంటల సమయం పట్టింది. ఆదివారం పుష్కర స్నానం చేసేందుకు శనివారం సాయంత్రం నుంచే వస్తున్న వాహనాల కారణంగా మరింత ఇబ్బంది ఎదురైంది. దీంతో భద్రాద్రికి వచ్చే వాహనాలను కొత్తగూడెం, పాల్వంచ తదితర ప్రాంతాల్లోనే నిలిపివేశారు. పుష్కరాలకు వెళ్లే వాహనాలతో నల్లగొండ జిల్లాలోని పంతంగి, గూడూరు, కేతేపల్లి టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. వరంగల్ జిల్లాలో మంగపేట, రామన్నగూడెం, ముల్లకట్ట ఘాట్ల వద్ద శనివారం మూడు లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు. ఇక్కడ తాడ్వాయి -ఏటూరునాగారం, కమలాపురం-మంగపేట మధ్య నాలుగైదు కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. -
భక్తగోదారి
♦ భక్తులకు జయేంద్రస్వామి ప్రవచనాలు ♦ మణుగూరులో ప్రవీణ్ తొగాడియా.. ♦ పర్ణశాల, మోతెకు పెరుగుతున్న భక్తులు భద్రాద్రికి భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. మిగిలిన ఘాట్లకు కూడా భారీగా భక్తులు తరలివస్తున్నారు. భద్రాచలంలో స్నానమాచరించేందుకు సామాన్య భక్తులతో పాటు వీఐపీలు కూడా అమితాసక్తి చూపుతున్నారు. రాజమండ్రి ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌తోపాటు పొరుగురాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువగా భద్రాద్రికి వస్తున్నారు. స్వల్ప లోటుపాట్లు మినహా భద్రాచలంలో పుష్కరస్నానాలు ప్రశాంతంగా కొనసాగుతుండటంపై హర్షం వ్యక్తమవుతోంది. గురువారం నాడు చినజీయర్‌స్వామి, జయేంద్రసరస్వతితో పాటు వీహెచ్‌పీ నేత ప్రవీణ్తొగాడియూ పుష్కరపూజలు చేశారు. - భద్రాచలం నుంచి సాక్షి బృందం భద్రాచలం నుంచి సాక్షి బృందం : పుష్కరవేళ రామనామస్మరణతో గౌతమీ తీరం మార్మోగింది. మహా పుష్కరాలలో స్నానమాచరించేందుకు మూడోరోజు గురువారం జిల్లాలోని 8 పుష్కరఘాట్లకు భక్తులు పోటెత్తారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భద్రాచలానికి తరలివచ్చారు. స్నానమనంతరం రామాలయూన్ని దర్శించుకునేందుకు బారులు తీరారు. స్వామివారి దర్శనానికి 6 గంటలకు పైగా సమయం పట్టింది. పలువురు భక్తులు గోదావరి పుష్కర ఘాట్ల వద్ద పునర్వసు మండపంలో ఏర్పాటు చేసిన శ్రీ సీతారాములవారి ఉత్సవ మూర్తులకు పూజలు చేసి వెనుదిరిగారు. భద్రాచలంలో రామాలయ దర్శనానికి ఎక్కువ సమయం పడుతుండటంతో పలువురు పర్ణశాలకు తరలివెళ్లారు. జీయర్ మఠంలో భక్తులకు ప్రచనాలు ఇచ్చిన అనంతరం త్రిదండి చినజీయర్ స్వామి రామాలయాన్ని దర్శించుకొని శ్రీసీతారాముల వారికి పూజలు చేశారు. బుధవారం రాత్రి భద్రాచలం వచ్చిన కంచికామకోటి పీఠాధిపతి జయేంద్రసరస్వతి స్వామివారు గురువారం ఉదయం రామాలయూనికి సమీపంలో ఉన్న సీతానిలయంలో భక్తులకు ఆశీర్వచనాలు అందించి, ప్రవచనాలు ఇచ్చారు. స్వామివారి నిత్యకల్యాణాన్ని ఉత్తర ద్వార దర్శనంలో శాస్త్రోక్తంగా జరిపించారు. కల్యాణవేడుకలో కూడా భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. వరుసగా సెలవుదినాలు కావటంతో భక్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు స్వామివారి దర్శనాన్ని మిథిలాస్టేడియంలో కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాచలానికి వీఐపీల తాకిడి కూడా పెరుగుతోంది. మణుగూరు మండలం కొండాయిగూడెంలో జరిగిన శివలింగ ప్రతిష్టోత్సవంనకు విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు ప్రవీణ్‌తొగాడియా హాజరయ్యారు. పర్ణశాల, మోతే, వెంకటాపురం మండలం రామచంద్రాపురం ఘాట్లలో కూడా భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. ఏపీ నుంచి తరలివస్తున్న భక్తులు రాజమండ్రి పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. భద్రాచలం ఘాట్లలో స్నానమాచరించే వారిలో సగం మంది ఏపీలోని వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన వారు ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు ఆర్టీసీ బస్సులు సరిపడా లేక ఇబ్బంది పడుతున్నారు. భద్రాచలం, మోతె ఘాట్లకు వచ్చే భక్తులు ఎక్కువ దూరం కాలినడకనే ప్రయాణించాల్సి వస్తోంది. ఖమ్మం, కుక్కునూరు రహదారి నుంచి వచ్చే వాహనాలను సారపాక సమీపంలోని పార్కింగ్ ప్రదేశంలో నిలిపి, అక్కడ నుంచి ఆర్టీసీ బస్సుల్లో వస్తున్నారు. ఆర్టీసీ బస్సుల ద్వారా వస్తున్న భక్తులను పుష్కర ఘాట్లకు దూరంగా ఉన్న చర్ల రోడ్‌లోని మార్కెట్‌యార్డు ప్రాంగణం, అంబేద్కర్ సెంటర్ పరి సరాల్లోని రహదారులపై వదులుతున్నారు. రెండుకిలోమీటర్ల మేర నడిచి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. పుష్కర ఘాట్లలో సరిపడా టెంట్లు లేకపోవటంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. బుధవారం రా త్రి కురిసిన వర్షానికి ఘా ట్లలో ఏర్పాటు చేసిన టెంట్లు కూలిపోగా, వాటిని గురువారం సాయంత్రం వరకూ సరిచేయలేదు. శాస్త్రోక్తంగా నిత్యకల్యాణం ఉత్తర ద్వారంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయం నుంచి స్వామివారిని ఊరేగింపుగా ఉత్తర ద్వారం వద్దకు తీసుకొచ్చి పూజలు నిర్వహించారు. శుక్రవారం ఉత్తరద్వారంలో స్వామివారి కల్యాణం అనంతరం పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తామని దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు తెలిపారు. -
మూడోవంతు బస్సులు రాజమండ్రికే..
సగం రూట్లలో ప్రైవేటు వాహనాలే దిక్కు ఒంగోలు : పుష్కరాల పుణ్యమాని మూడోవంతు బస్సులు రాజమండ్రికే పరిమితమయ్యాయి. దీంతో సగం రూట్లలో ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. ప్రైవేటు వాహనాలే ప్రజలకు దిక్కయ్యాయి. జిల్లాలో మొత్తం 750 సర్వీసులున్నాయి. వాటిలో పాతిక బస్సులు ఎప్పుడూ సర్వీసింగ్‌లో ఉంటుంటాయి. అంటే తిరిగేది కేవలం 725 మాత్రమే. వాటిలో 120 సర్వీసులు సుదూర ప్రాంతాలైన హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు తిరుగుతూ ఉంటాయి. వాటిని మినహాయిస్తే మిగిలిన బస్సుల సంఖ్య 605. వీటిలో మరో 15 సర్వీసులు అద్దెకు ఇచ్చారు. అంటే మిగిలిన సర్వీసుల సంఖ్య 590. వాటిలో 70 బస్సులను పుష్కరాల ప్రారంభంలోనే రాజమండ్రికి పంపారు. పుష్కరాలు జరిగినంత కాలం ఈ బస్సులన్నీ రాజమండ్రి డిపో పరిధిలోనే సేవలు అందిస్తాయి. రోజువారీ మరో 50 బస్సులు జిల్లానుంచి పుష్కరాలకు ప్రయాణీకులను తీసుకొని వెళ్తున్నాయి. అదే విధంగా మరో 50 బస్సులు రాజమండ్రి నుంచి ఒంగోలు వస్తున్నాయి. దీని ప్రకారం మొత్తం 170 బస్సులు రాజమండ్రికి పంపిస్తున్నారు. ఇవి కాకుండా ఇక ప్రత్యేకంగా ఎవరైనా బస్సులు బుక్ చేసుకుంటే రాజమండ్రికి 34 గంటలు చొప్పున బస్సులను అద్దెకు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే గురువారం మరో 50 పల్లెవెలుగు సర్వీసులను రాజమండ్రికి పంపాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో అదనంగా మరో 50 సర్వీసులు రాజమండ్రికి బయల్దేరాయి. దీంతో 230 బస్సులు పుష్కరాలకే కేటాయించినట్లయింది. ఇక మిగిలింది కేవలం 360. అంటే మొత్తం మూడు వంతుల్లో రెండు వంతులు మాత్రమే జిల్లాలో తిరుగుతున్నాయి. ఒక వంతు బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఆర్టీసీకి ఆదాయం తక్కువగా ఉన్న రూట్లలో బస్సులను తగ్గించేశారు. దీంతో ఆయా మార్గాలలో ప్రజలకు ప్రైవేటు వాహనాలే దిక్కుగా మారిపోయాయి. శుక్ర, శనివారాలలో రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనంగా మరో 50 సర్వీసులను జిల్లానుంచి పుష్కరాలకు తిప్పేందుకు అధికారులు యత్నిస్తుండడం గమనార్హం. -
పుష్కర స్టేషన్లపై ప్రత్యేక దృష్టి
రాజమండ్రి స్టేషన్లో సీనియర్ రైల్వే అధికారులు మకాం తొక్కిసలాట జరగకుండా ప్రత్యేక చర్యలు విజయవాడ స్టేషన్లోనూ ఏర్పాట్లు విజయవాడ : పుష్కరాలు తొలిరోజున రాజమండ్రి పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో 27 మంది ప్రాణాలు కోల్పోవడంతో అన్ని శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా విజయవాడ డివిజన్ పరిధిలోని రాజమండ్రి, గోదావరి, నర్సాపురం స్టేషన్ల నుంచి భక్తులు రాకపోకలు సాగిస్తూ ఉండటంతో ఆయా స్టేషన్లపై పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లు రైల్వే డీఆర్ఎం అశోక్‌కుమార్ తెలిపారు. ప్రతి గంటకు 40 వేల మంది..... విజయవాడ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్లలో రోజుకు 50 వేల మంది ప్రయాణికులు రాజమండ్రి వెళ్లుతున్నారని అంచనా. ఇదిలా ఉండగా రాజమండ్రి స్టేషన్లో ప్రతి గంటకు 40 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రాజమండ్రిలోని నాలుగు ఫ్లాట్‌పారాలు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల రద్దీ మరింత పెరిగితే తొక్కిసలాట జరుగుతుందని భావిస్తున్న అధికారులు పుష్కర స్టేషన్లపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నట్లు తెలిసింది. బుధవారం రద్దీ ఎక్కువగా వుండటంతో గుడివాడ నుంచి నడిచే పాసింజర్ రైలును రద్దు చేసి రాజమండ్రికి తరలించారు. తరలి వెళ్లిన సీనియర్ అధికారులు.... విజయవాడలోని హెడ్ క్వార్టర్స్‌లో ఉండి డివిజన్లోని అన్ని ఏర్పాట్లును పరిశీలించే డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) అశోక్‌కుమార్, ఏడీఆర్ఎం ఎన్.ఎస్.ఆర్. ప్రసాద్, సీనియర్ కమర్షియల్ మేనేజర్ ఎన్.వి. సత్యనారాయణ, సీనియర్ పీఆర్వో ఎఫ్.ఆర్. మైఖేల్ తదితర కీలక అధికారులు మూడు రోజులుగా రాజమండ్రిలోనే మకాం వేసి, ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు పుష్కర స్టేషన్ల నుంచి వారి వారి గమ్యస్థానాలకు పంపేందుకు ప్రయత్నిస్తారని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఆయా స్టేషన్లలో సిబ్బంది తక్కువగా వుండటంతో 1,500 మందిని ప్రత్యేకంగా డివిజన్లోని అన్ని ప్రాంతాల నుంచి తరలించారు. అంతేకాకుండా చోరీలు జరగకుండా ఉండేం దుకు, రద్దీ సమయాల్లో అవాంఛనీయ ఘటన లు జరగకుండా డివిజన్లోని అన్ని స్టేషన్ల నుంచి 1,600 మంది జీఆర్పీ, 400 మంది ఆర్పీఎఫ్ సిబ్బందిని పుష్కర స్టేషన్లకు తరలించా రు. పుష్కరయాత్ర పూర్తి చేసుకుని వచ్చే ప్రయాణికులు గమస్థానాలకు వెళ్లేం దుకు సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేక విచారణా కేంద్రాలను, టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. విజయవాడ స్టేషన్‌పై పెరుగుతున్న రద్దీ... విజయవాడ రైల్వేస్టేషన్‌కు వచ్చే ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. ముఖ్యంగా శని(రంజాన్), ఆదివారాలు సెలవు దినాలు కావడంతో ప్రయాణికుల సంఖ్య మరింత ఎక్కువగా వుంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో విజయవాడ నుంచి రాజమండ్రి, నర్సాపురం తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు రైళ్ల సమాచారాన్ని ప్రత్యేక బోర్డుల ద్వారా ప్రదర్శిస్తున్నారు. అలా గే తూర్పు, పశ్చిమ ముఖద్వారం వద్ద ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారం తెలియచేసేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా స్పెషల్ రైళ్ల రాకపోకల వివరాలను ఎప్పటి కప్పుడు మైక్‌ల ద్వారా ప్రసారాలు చేస్తూ ప్రయాణికులకు తెలియచేస్తున్నారు. -
ఆ రెండు రోజులు హైటెన్సన్
శని, ఆదివారాల్లో భద్రాద్రికి పోటెత్తనున్న భక్తజనం ఊ 10 లక్షల మంది వస్తారని అంచనా.. భద్రతా ఏర్పాట్లలో మంత్రి తుమ్మల, కలెక్టర్, ఎస్పీ ఊ అదనపు బలగాలను రప్పిస్తున్న అధికారులు మిథిలా స్టేడియంలో ప్రత్యేక దర్శనాలు ఊ వీఐపీలు ఆ రెండు రోజులు రావద్దు.. భద్రాచలంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మూడు రోజులపాటు విజయవంతంగా పుష్కరాలను నిర్వహించిన అధికారులు శని, ఆదివారాలపై ప్రత్యేక దృష్టి సారించారు. రాజమండ్రి ఘటన నేపథ్యంలో ఇప్పటికే ఏపీ నుంచి భక్తుల తాకిడి అధికమైంది. అయితే శనివారం రంజాన్ పర్వదినం సందర్భంగా, ఆదివారం సెలవు రోజులు కావడంతో రోజుకు 5 లక్షల మంది చొప్పున రెండు రోజుల్లో పది లక్షల మంది భక్తులు భద్రాచలానికి వస్తారని అంచనా వేస్తున్న అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వరంగల్ రేంజ్ ఐజీ నవీన్‌చంద్, కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి, ఎస్పీ షానవాజ్ ఖాసీంలు గురువారం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. -భద్రాచలం నుంచి సాక్షి ప్రతినిధి బొల్లం శ్రీనివాస్ -
మాస్టర్ ప్లాన్ మారింది...
బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్‌పై నిరాసక్తత నదిలోకి వెళ్లి స్నానం చేస్తున్న భక్తులు నీటి ప్రవాహం వెంట ఏర్పాట్లకు సిద్ధమైన యంత్రాంగం పగటి వేళ 35 డిగ్రీ సెల్సియస్ దాటిన ఉష్ణోగ్రత నీటి కంటే నీడలేమితోనే భక్తుల ఇబ్బందులు హన్మకొండ : నాలుగు నెలల క్రితం రూ పొందించిన ప్రణాళిక, రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన అభివృద్ధి పనులు పుష్కరాల వేళ అ క్కరకు రాకుండా పోతున్నాయి. గోదావరి న దిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండడం, తీ రం వెంట చేపట్టిన ఏర్పాట్లు నిరుపయోగమయ్యూరుు. దీంతో నదీ తీరం నుంచి సుమారు కిలో మీటరు వరకు కొత్తగా ఏర్పాట్లు చేయూ ల్సి వస్తోంది. ఈ మేరకు బుధవారం జిల్లా క లెక్టర్ కరుణ, ఐటీడీఏ పీవో అమయ్‌కుమార్, ములుగు ఆర్డీవో మహేందర్ పుష్కరఘాట్లు సందర్శించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రణాళిక రూపొందించారు. ఏర్పాట్లు చేయడంలోనూ నిమగ్నమయ్యారు. బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్‌పై నిరాసక్తత జిల్లాలో ముల్లకట్ట, రామన్నగూడెం, మంగపేటలో మూడు పుష్కరఘాట్లు ఏర్పాటు చేశా రు. భక్తులు స్నానం చేసేందుకు వీలుగా బ్యా టరీ ఆఫ్ ట్యాప్స్ బిగించారు. మహిళలు దు స్తులు మార్చుకునేందుకు గదులు, పిండప్రదానాలు తదితర పూజలు చేపట్టేందుకు వీ లుగా గదులు, షెడ్డులు ఏర్పాటు చేశారు. గో దావరి గట్టుపైనే వైద్య శిబిరం, మంచినీటి తదితర సౌకర్యాలు కల్పించారు. అయితే వ ర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నదిలో తగి నంత నీటి ప్రవాహం లేదు. ముల్లకట్ట, రామన్నగూడెంలో గట్టు నుంచి కిలోమీటరుకు పై గా దూరంలో నీటి ప్రవాహం ఉంది. మంగపేటలో సుమారు50 అడుగుల దూరం వెళ్తేనే నీ టి లభ్యత ఉంది. గోదావరి నదిలోని నీటి ప్ర వాహంలోనే పుణ్యస్నానాలు చేసేందుకు భక్తు లు ఆసక్తి చూపిస్తున్నారు. గట్టు సమీపంలో పుష్కరఘాట్ మెట్ల వద్ద ఏర్పాటు చేసిన బ్యా టరీ ఆఫ్ ట్యాప్స్ కింద స్నానం చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. సుమారు కిలోమీటరు దూరంలోని నీటి ప్రవాహంలోకి వెళ్లి భ క్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. బు ధవారం భక్తులను తరలించేందుకు ట్రాక్టర్లు ఏర్పాటు చేశారు. అరుుతే, మంగళ, బుధవారాల్లో మధ్యాహ్నం వేళ 35డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. వీరు సేదదీరేందుకు రామన్నగూడెంలో మూడు, మంగపేటలో మూడు షామియానాలు ఏర్పాటు చేశారు. పనులు వేగవంతం చేయూలి.. నదీ ప్రవాహంలోనే భక్తులు పుణ్యస్నానాలు చేస్తుండడంతో అక్కడ చలువ పందిళ్లు నిర్మించాలని, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక ఏర్పాటు ్లయుద్ధప్రాతిపదికన చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. మంచినీటి సౌకర్యం కల్పనతోపాటు పిండప్రదానలు, పుష్కరశాంతి తదితర పూలు చేసేందుఉ ఏర్పాట్లు చేయూల్సి ఉంది. తొలి రోజు జిల్లాలోని మూడు పుష్కరఘాట్లలో సుమారు 15వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. రెండోరోజు రెండు పుష్కరఘాట్లలోనే దాదాపు 50వేల మంది పుష్కర స్నానాలు ఆచరించారని అంచనా. గురువారం అమవాస్య కావడంతో పిండప్రదానం వంటి కార్యక్రమాలు అధికంగా చేపడతారని, ఆ తర్వాత శని, ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈమబేరకు ఏర్పాట్లు వేగవంతం చేయూల్సి ఉందంటున్నారు. మరోవైపు రాజమండ్రి దుర్ఘటన నేపథ్యంలో హైదరాబాద్, ఇతర జిల్లాల భక్తులు వరంగల్ జిల్లాలో జరిగే పుష్కరాలకు హాజరయ్యేం దుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుం డా ఉండేందుకు వీలుగా నదిలో నీటిప్రవహాం ఉన్న చోట సౌకర్యాలు కల్పించాలి. -
పుష్కరస్నానానికి పుట్టెడు కష్టాలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కిలోమీటర్ల కొద్దీ కాలినడక... తాగడానికి గుక్కెడు నీళ్లు కరువు... నిలుచునేందుకు నీడ లేదు.. ఘాట్లు ఎటు చూసినా బురదమయం... ఆ నీటిలోనే స్నానాలు... బట్టలు మార్చుకునేందుకు కనీసం వసతుల్లేవు.. దైవదైర్శనానికి గంటల తరబడి క్యూ... అడుగడుగునా పోలీసు తనిఖీలు... కాళేశ్వరం, ధర్మపురి ప్రాంతాల్లో పుష్కరస్నానాలకు భక్తులు పడుతున్న పాట్లకు నిదర్శనాలివి. గోదావరిలోకి పుష్కరుడి రాకతో పవిత్ర స్నానమాచరించాలని గంపెడాశతో వేకువజామునే బయలుదేరిన లక్షలాది మంది భక్తులకు బందోబస్తు పేరుతో పోలీసులు, నామమాత్రపు ఏర్పాట్లతో అధికారులు చుక్కలు చూపించారు. పిల్లాపాపలతో, బంధుమిత్రులతో ఎంతో ఉల్లాసంగా పుష్కరాలకు వెళ్లిన భక్తులు నానాపాట్లు పడుతూ స్నానమాచరించి దైవదర్శనం చేసుకుని వెనుదిరగాల్సి వచ్చింది. కాళేశ్వరంలో భక్తుల తిప్పలు త్రివేణి సంగమమైన కాళేశ్వరానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని భావించిన పోలీసులు దేవాలయం, పుష్కరఘాట్లకు రెండు కిలోమీటర్ల దూరంలో తాత్కాలిక బస్టాండ్, వాహనాల పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి వచ్చే ఆర్టీసీ సహా ప్రైవేటు వాహనాలన్నింటినీ అక్కడే నిలిపివేశారు. వృద్ధులు, మహిళలు, బాలింతలు, వికలాంగులు సహా ప్రతి ఒక్కరూ కాళేశ్వరం వెళ్లాలంటే రెండు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి రావడంతో చాలా ఇబ్బంది పడ్డారు. తీవ్ర ఎండ, ఉక్కపోత ఉండగా, టెంట్లు, చలువ పందిళ్లు లేక నానాపాట్లు పడ్డారు. చెట్లనీడన సేదదీరారు. ట్యాంకర్లు ఉన్నా నీరు అందించేవారే లేకపోవడంతో తాగునీటికి అల్లాడారు. వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి దండుకున్నారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దర్శనం కూడా కష్టాల నడుమే సాగింది. క్యూలైన్ల వద్ద ఎలాంటి ఏర్పాట్లు లేక ఎండ, ఉక్కపోతతో అల్లాడిపోయారు. 5 కిలోమీటర్లు నడిస్తేనే పుష్కర స్నానం ధర్మపురి వైపు వచ్చే వాహనాలను పుష్కర ఘా ట్లకు 5కిలోమీటర్ల దూరంలోనే పోలీసులు నిలి పేశారు. అక్కడి నుంచి ఘాట్ల సమీపానికి ఉచి తంగా వాహనాలు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పినా అందుబాటులోకి రాకపోవడం తో వృద్ధులు, వికలాంగులు తీవ్ర అవస్థలు పడ్డారు. పుష్కరాలతో సంబంధం లేకుండా ఇతర జిల్లాలకు వెళ్లే వాహనాలను సైతం కరీం నగర్-జగిత్యాల రహదారిపైనే నిలిపివేయడం తో వారి బాధ వర్ణణాతీతం. అష్టకష్టాలు పడి ఘాట్ల వద్దకు వెళ్తే మురికినీటి స్నానమే దిక్కయింది. సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మొబైల్ వాటర్ క్యాన్లతో నీటిని సరఫరా చేశారు. పురోహితులు సరిపడా లేక భక్తులు వారికోసం వెతుక్కోవాల్సి వచ్చింది. సీఎం కేసీఆర్ ధర్మపురిలోనే ఉండడంతో పోలీసులు అన్నివైపులా బందోబస్తు చేపట్టడంతో భక్తులు ఎటునుంచి వెళ్లాలో తెలియక అవస్థలు పడ్డారు. లక్ష్మీనృసింహస్వామివారి దర్శనానికి నాలుగు గంటలకుపైగా క్యూలో నిల్చోవాల్సి వచ్చింది. దీంతో చాలా మంది స్వామివారి దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారు. బురదలోనే పుష్కర స్నానం గోదావరిఖనిలోని పుష్కరఘాట్ వద్ద నీటి ప్రవాహం లేకపోవడంతో నది మధ్య నుంచి కాలువను తవ్వారు. పుష్కరఘాట్ ఎత్తుప్రాంతంలో ఉండడంతో నీరు రాలేదు. దీంతో మంగళవారం పుష్కరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, ఇతర ప్రముఖలంతా బురదమయంగా మారిన నీటిలోనే పుష్కర స్నానాలు చేయాల్సి వచ్చింది. షవర్లలోనూ బురదనీరే వచ్చింది. భక్తులు నది మధ్యలోకి వచ్చి నీటి ప్రవాహం వద్ద స్నానాలాచరించారు. ఇక్కడ దుస్తులు మార్చుకునేందుకు గదులు ఏర్పాటు చేయలేదు. కోటిలింగాల, మంథనిలోనూ ఇక్కట్లే కోటిలింగాలకు తొలిరోజు 15 వేల మందికిపైగా భక్తులు వచ్చినట్లు అధికారుల అంచనా. కొత్తగా కట్టిన స్నానఘట్టాల దగ్గర నీరు లేకపోవడంతో ఇరుకుగా ఉన్న పాత ఘాట్లలోనే భక్తులు పుష్కర స్నానాలు కానిచ్చేశారు. చాలామంది షవర్ల కిందే స్నానాలు చేశారు. పుష్కరఘాట్ల వద్ద ఇనుపజాలీలతో పలువురు గాయపడ్డారు. పిండ ప్రదానానికి వేదిక ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. పాత రేవు పిండ ప్రదానానికి అనుకూలంగా ఉండ గా భక్తులు అక్కడికే వెళ్లగా... అక్కడ స్నానాలు చేయొద్దని పోలీసులు అడ్డుకున్నారు. మంథనిలో తొలిరోజు 30 వేల మంది భక్తులు పుష్కర స్నానమాచరించినట్లు అధికారుల అంచనా. పార్కింగ్ నుంచి ఘాట్ల దాకా రెండు కిలోమీటర్ల మేర నడవాల్సి వచ్చింది. అరకొర ఏర్పాట్లతో ఇక్కడా భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. -
కన్నీటి గోదారి...
పుణ్య తిథుల్లోనే భక్తుల రద్దీ కొవ్వూరు నుంచి సాక్షి ప్రతినిధి : విశేష ప్రాశస్త్యం ఉన్న పుష్కరాలకు భక్తుల రాక నిరంతరాయంగా కొనసాగుతోంది. మరోవైపు అధికారులు పుణ్య తిథులు, వాటి ప్రాశస్త్యాన్ని బట్టి రద్దీ పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తిథి, నక్షత్రాన్ని దీనికి అనుగుణంగా ఉండే దేవతా గణాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అధికారిక అంచనాలు ఇలా.. ఈ నెల 15వ తేదీ శివనక్షత్రం, 16వ తేదీ అమవాస్య కావడంతో పిండ ప్రదానానికి శ్రేష్టమైన రోజు, 17వ తేదీ దక్షిణాయన పుణ్యకాలం ఉండటం, 18 వారాంతం కావడం, 19వ తేదీ ప్రత్యేక ప్రాధాన్యత ఉన్న మఖ నక్షత్రం కావడం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. 20వ తేదీ పుబ్బ నక్షత్రం, 21వ తేదీ ఉత్తర, 22వ తేదీ హస్త నక్షత్రాలు కావడంతో భక్తులు సాధారణ సంఖ్యలో పుష్కర స్నానాలు ఆచరించే అవకాశం ఉంది. ఈ నెల 23వ తేదీ గురువారం సప్తమి, చిత్త నక్షత్రం కావడంతో పుణ్యస్నాన ఆచరణకు యోగ్యమైన రోజు. 24వ తేదీ గురువారం అష్టమి, స్వాతి నక్షత్రం రోజున పుష్కర యాత్రికుల సంఖ్య సాధారణంగా ఉంటుంది. 25వ తేదీ శనివారం విశాఖ నక్షత్రం, ఆఖరి రోజుకావడంతో అధిక సంఖ్యలో భక్తులు పుష్కర స్నానం చేసే అవకాశం ఉంది. ఎప్పుడేం జరిగింది? రాజమండ్రి: గోదావరి మహా పుష్కరాలు ప్రారంభమైన రాజమండ్రి పుష్కర్ ఘాట్ మంగళవారం తెల్లవారుజాము నుంచే జనసంద్రంగా మారింది. తొలిరోజు దాదాపు లక్ష మంది భక్తుల తరలివచ్చారు. వారిని నియంత్రించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. ప్రభుత్వ అధికారులు, పోలీసుల వైఫల్యం కారణంగా 27 మంది ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఎప్పుడేం జరిగిందంటే...? ►తెల్లవారుజామున 3 గంటల నుంచే పుష్కర్‌ఘాట్‌కు భక్తుల రాక. ► 5.45 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు. ► 5.50 గంటలకు కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి ఆగమనం. ► 6 గంటల నుంచి పుష్కరాల ప్రారంభోత్సవానికి వేదపండితుల మంత్రోచ్ఛరణలు. ► 6.28 గంటలకు సీఎం చంద్రబాబు, జయేంద్ర సరస్వతి స్వామి పుష్కర స్నానం చేశారు. ► 6.45 గంటల నుంచి చంద్రబాబు తన పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. ► 7.30 గంటలకు చంద్రబాబు పుష్కరఘాట్ నుంచి బయటకు వెళ్లారు. ►8 గంటల వరకు పుష్కరఘాట్ వెలుపల చంద్రబాబు బట్టలు మార్చుకున్నారు. ► 8.30 గంటలకు పుష్కరఘాట్ నుంచి సీఎం కాన్వాయ్ బయల్దేరింది. ►8.30 గంటలకు పుష్కరఘాట్ మొదటి గేటును తెరిచారు. అప్పటివరకు నిరీక్షిస్తున్న భక్తులు ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. ► 9 గంటలకు స్నానం చేసిన భక్తులు బయటకు వస్తుండగా.. బయట ఉన్న వారు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు ► 9.30 గంటలకు మూడు గేట్లు ఒక్కసారిగా తెరవడంతో భక్తుల మధ్య తోపులాట ప్రారంభమైంది. ►9.30 నుంచి 10.30 వరకూ భక్తుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ► 10.30 గంటలకు భక్తులను నిలువరించేందుకు పోలీసులు, అధికారుల ప్రయత్నించారు. ►11 గంటలకు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ► 11 గంటలకు అప్పటికే మృతి చెందిన వారిని ఒకచోటుకి తరలించారు. ►11.30 గంటలకు ఆక్టోపస్ (బ్లాక్ కమెండోల) బృందం రంగ ప్రవేశం చేసింది. ► 11.30 గంటల నుంచి భక్తులు ఘాట్‌లో ప్రవేశించడంపై పోలీసుల ప్రత్యేక దృష్టి సారించారు. ►12 గంటల నుంచి పుష్కరఘాట్‌లో భక్తుల రద్దీ తగ్గింది. పుష్కరాల్లో మృతులు వీరే.. గోదావరి పుష్కరాల్లో రాజమండ్రి ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృతిచెందారు. వీరిలో 24 మంది మహిళలు కాగా, ఇద్దరు పురుషులు, మరొక బాలుడు ఉన్నారు. వీరిలో ఇద్దరిని గుర్తించాల్సి వుంది. మృతుల్లో 15 మంది ఉత్తరాంధ్రవాసులే ఉన్నారు. మృతి చెందిన వారు.. 1. దేశినీడి కృష్ణవేణి(52), వేమగిరి-రాజమండ్రి 2. బి.రాజ్యలక్ష్మీ(50), ఉండి-పశ్చిమగోదావరి జిల్లా 3. గొర్రెల మంగమ్మ(60), వెలమతోట- వైజాగ్ 4. ఎ.గౌరి(16), వైజాగ్ 5. పుట్టు నాగలక్ష్మీ(42), బలగ-శ్రీకాకుళం 6. పర్వతాల రాజేశ్వరి(32), పోలీస్ కాలనీ-నెల్లూరు జిల్లా 7. ఎల్.బి.పేరమ్మ(53), నెల్లూరు 8. లంబ తిరుపతమ్మ(40), కాశీపురం-శ్రీకాకుళం 9. ఎం.మహాలక్ష్మీ(65)-వైజాగ్ 10. పాండవుల విజయలక్ష్మీ(61), చినముసలివాడ-వైజాగ్ 11. మైగాపుల లక్ష్మణరావు(65), తాడేపల్లిగూడెం 12. ఎ.బయ్యారమ్మ(45)-వైజాగ్ 13. పి.మీనాక్షి(65), జంషెడ్పూర్ 14. ఎం.అనంతలక్ష్మీ(30), ధవళేశ్వరం 15. జడ్డు నరసమ్మ(50), సరసనపల్లి-శ్రీకాకుళం 16. బి.ప్రశాంత్‌కుమార్(15), బలగ-శ్రీకాకుళం 17. కొత్తకోట కళావతి(60), బొద్దూరు-శ్రీకాకుళం 18. కె.జానకమ్మ(55)-నెల్లూరు 19. పైలా పెంటమ్మనాయుడు(60), సరసనపల్లి-శ్రీకాకుళం 20. సి.రంగస్వామి(60), జయశ్రీనగర్-బెంగుళూరు 21. మట్టపర్తి సత్యవతి(55), ధవళేశ్వరం 22. ఎస్.అమ్మాయమ్మ(75), శ్రీకాకుళం 23. అమలాపురం పైడితల్లి(55), బొబ్బిలి-విజయనగరం 24. పుట్నూరి అమరావతి(45), ఆమదాలవలస-శ్రీకాకుళం 25. ఆదిపాక నారాయణమ్మ(60), కొత్తవలస, విజయనగరం జిల్లా + ఇద్దరిని గుర్తించాల్సి ఉంది. వీరిద్దరూ మహిళలే. గాయపడినవారు వీరే.. పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడినవారి వివరాలు: బిక్కిన వెంకటలక్ష్మి (రాజమండ్రి లాలాచెరువు), హరి కిరణ్మయి (పలాస), యండమూరి రత్నం (యానాం), సురేష్(విశాఖపట్నం), హనుమంతరావు (రాజమండ్రి), గనివాడ కృష్ణవేణి (విజయనగరం), ఇందిర (శ్రీకాకుళం), సత్యవతి (సింహాచలం), కన్నూరి బాబూజీ (తేజపురం-విశాఖ జిల్లా), శకుంతల (కృష్ణపురం), స్వర్ణలత (పలాస), రమాదేవి (రాజమండ్రి తిలక్ రోడ్డు) తీవ్రంగా గాయపడ్డారు. వీరితోపాటు 49 మంది స్వల్పంగా గాయపడ్డారు. వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో మరో 150 మంది చికిత్స పొందారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ఒక్కసారిగా వెనుకవైపు నుంచి తోసివేశారు మేము తెల్లవారుజామున వచ్చినా.. 8. 30 వరకూ ఘాట్‌లోకి రానివ్వలేదు. ఒక్కసారిగా భక్తులందరూ ఘాట్‌లోకి ప్రవేశించడంతో తొక్కిసలాట జరిగింది. శ్రీకాకుళం జిల్లా నుంచి 20 మంది వరకూ వచ్చాం. తొక్కిసలాటలో మా బంధువులు పోట్నూరి అమరావతి, భరతం ప్రశాంతి, కొత్తకోట కళావతి మృతి చెందారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియలేదు. గాయాలపాలైనవారిని సకాలంలో హాస్పటల్‌కు తీసుకువెళ్లి ఉంటే కొంతమంది అయినా బతికేవారు. - సొంగల తేజ, శ్రీకాకుళం అంతమందికీ ఒకే ఒక్క అంబులెన్స్ సంఘటన జరిగిన సమయంలో పుష్కర ఘాట్‌లో ఒకే ఒక్క అంబులెన్స్ ఉండడంతో గాయాలపాలైనవారికి సకాలంలో వైద్య సేవలు అందించలేకపోయారు. దీంతో చాలామంది మృతి చెందారు. గాయాలపాలైనవారికి పట్టించేందుకు కనీసం మంచినీళ్లు కూడా లేవు. చచ్చిపోతున్నాం మంచినీళ్లు ఇవ్వమన్నా వినిపించుకున్న నాథుడు లేడు. ముఖ్యమంత్రి తన స్నానానికి భక్తులను బలి తీసుకున్నారు. - జి.అప్పలనాయుడు, నరసన్నపల్లి, రేగిడి మండలం, శ్రీకాకుళం సౌకర్యాలు సరిగా లేవు పుష్కరాల రేవులో బారికేడ్లు ఏర్పాటు చేసి ఉంటే ఇంత తొక్కిసలాట జరిగి ఉండేది కాదు. ఏర్పాట్లు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. వీఐపీలకు వేరే ఘాట్ ఉన్నా సీఎం చంద్రబాబు ఇదే ఘాట్‌లో స్నానం చేయడంవల్ల స్నానం చేసేందుకు ఆలస్యమై, తొందరలో తొక్కిసలాట జరిగింది. - వెంకటేష్, శ్రీకాకుళం జిల్లా అమ్మ చనిపోయింది.. స్నానం చేసేందుకు మా అమ్మ, నేను, మా అబ్బాయి కలిసి వెళ్లాం. స్నానాల రేవులోంచి బయటకు వచ్చేవారు ఒకే దారి అవడంతో రద్దీ అధికమైంది. ఈ తొక్కిసలాటలో మా అమ్మ చనిపోయింది దేవుడా... -జనపాల అరుణకుమారి, విశాఖజిల్లా . -
బాబే కారణం
బాధ్యత వహిస్తూ ఎలాగూ రాజీనామా చేయరు కనీసం జాతికైనా క్షమాపణ చెప్పండి మృతులకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి హైదరాబాద్: పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో 27 మంది మృతి చెందడానికి ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని పీసీసీ నేతలు ఆరోపించారు. ఇందిరా భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కృష్ణా పుష్కరాల సమయంలో ఒకరిద్దరు చనిపోతే అందుకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు 27 మంది చనిపోతే ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాజీనామా ఎలాగూ చేయరు! కనీసం జాతికి క్షమాపణ చెప్పాలని, తప్పు ఒప్పుకోవాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. వీఐపీ ఘాట్నువదిలి సామాన్యులు స్నానాలు చేసే ఘాట్ వద్ద ముఖ్యమంత్రి నాలుగు గంటలపాటు తన కుటుంబ సభ్యులతో కలిసి పూజలు, స్నానాలు చేయడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని ఆరోపించారు. గోదావరి పుష్కరాలకు రూ.1,600 కోట్లు వెచ్చిస్తున్నామంటూ ఆరు నెలలుగా మీడియాలో ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడానికే చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇచ్చారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేవుళ్లకు నిలయమైన చోట కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడం ఎంతవర కు సబబు అని నిలదీశారు. విగ్రహం పెట్టకపోతే ఈ అనర్థం జరిగేది కాదన్నారు. మృతుల రోదనలు వినిపించడం లేదా?: చిరంజీవి పుష్కరాల్లో తొక్కిసలాట ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చిరంజీవి చెప్పారు. ప్రభుత్వ అసమర్థత వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. పాలనా అనుభవం లేని వ్యక్తి ప్రభుత్వ సలహాదారుగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాదాసు గంగాధరం, శైలజానాథ్, గిడుగు రుద్రరాజు, తులసిరెడ్డి పాల్గొన్నారు. దుర్ఘటనపై సోనియా, రాహుల్ దిగ్భ్రాంతి న్యూఢిల్లీ: రాజమండ్రిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 27 మంది మరణించడంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో కాంగ్రెస్ శ్రేణులంతా పాలుపంచుకోవాలని సోనియా గాంధీ ఆదేశించారు. పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డితో ఆమె ఫోన్లో మాట్లాడారు. రాజమండ్రి దుర్ఘటనపై ఆరా తీశారు. పుష్కర యాత్రికులకు సహాయ సహకారాలు అందించేందుకు రాజమండ్రికి వెళ్లాలని సోనియాగాంధీ సూచించారు. దీంతో రఘువీరారెడ్డి, చిరంజీవి తదితర ముఖ్య నేతలు హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లారు. -
గుణపాఠాలు నేర్వలేదు!
గత పుష్కరాలను విజయవంతంగా నిర్వహించిన అధికారిని పట్టించుకోని వైనం హైదరాబాద్: ముఖ్యమంత్రి సలహాలు, సూచనల మేరకు మాత్రమే పుష్కరాలు జరగాలి అనుకున్నారేమో కానీ... ఈసారి పుష్కర ఏర్పాట్లలో అధికారుల ప్రణాళికలు ఏవీ అమలు పెట్టలేదు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకొని.. గత పుష్కరాన్ని విజయవంతంగా నిర్వహించిన అనుభవం ఉన్న అధికారుల సూచనలు, సలహాలనైనా తీసుకొన్న దాఖలాలు కనిపించలేదు. తాజా దుర్ఘటన నేపథ్యంలో పుష్కరాల నిర్వహణలోని ఈ లోపం తేటతెల్లం అవుతోంది. ‘పుష్కరస్నానాలు చేయడానికి వచ్చే వీఐపీలు సామాన్య ప్రజల ఘాట్ల వైపు రాకూడదు...’ 2003 సంవత్సరంలో జరిగిన పుష్కరాల సందర్భంగా నాటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ జవహర్‌రెడ్డి పెట్టిన నియమం ఇది. వీఐపీలకు ప్రత్యేక ఘాట్ ఉన్న నేపథ్యంలో రాజకీయ,సినీ, సామాజిక ప్రముఖులంతా అటువైపు వెళ్లి స్నానాలు చేసుకొనేలా ఏర్పాట్లు చేశారు. దీని వల్ల సామాన్య భక్తులు స్నానాలు చేసే ఘాట్లలో ఎలాంటి ఇబ్బందీ తలెత్తదు. అప్పట్లో ఈ నియమాన్ని తప్పనిసరిగా అమలు చేశారు. నాటి కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయలు పుష్కర ఘాట్‌లోనే స్నానం చేస్తామని పట్టుబట్టినా లక్షలాది భక్తుల భద్రతా చర్యల దృష్ట్యా పుష్కర ఘాట్‌కు వస్తే సాధారణ భక్తుల్లాగే స్నానం చేయాలే తప్ప వీఐపీ సౌకర్యాలు కల్పించడం, సాధారణ భక్తులను స్నానం చేయకుండా నిలుపుదల చేయడం సాధ్యం కాదని జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. సాధారణ భక్తుల్లో ఒకరిగా వచ్చి స్నానం చేసి వెళ్తే అభ్యంతరం లేదని నేతలకు కలెక్టర్ తెలిపారు. దీంతో వెంకయ్య నాయుడు, దత్తాత్రేయలు సామాన్య భక్తులతో కలిసే అప్పుడు పుష్కర ఘాట్‌లో స్నానం చేశారు. ఈ తరహా ఏర్పాటు ఈ సారి లేకపోవడం... గత అనుభవాలను పట్టించుకోకపోవటంతో దుర్ఘటన జరిగిపోయింది. విదేశాల్లో ‘పుష్కర’ మంత్రులు సాక్షి, హైదరాబాద్: పుష్కరాలను పర్యవేక్షించాల్సిన కీలక సమయంలో ముఖ్యమంత్రి సహా కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సిన మంత్రులంతా విదేశీ పర్యటనల్లో తలమునకలయ్యారు. పుష్కర ఏర్పాట్లకు మంత్రులతో ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉపసంఘంలో సభ్యులైన యనమల, నారాయణ ఈనెల 4 నుంచి 9వ తేదీ వరకూ సీఎం చంద్రబాబుతో పాటు జపాన్‌లో పర్యటించారు. పుష్కరాల కమిటీ ఛైర్మన్ పరకాల ప్రభాకర్ సైతం సీఎంతో పాటు జపాన్ పర్యటనకు వెళ్లారు. మంత్రులు కామినేని శ్రీనివాస్, చింతకాయల అయ్యన్నపాత్రుడు తానా సభలకు వెళ్లి వచ్చారు. తిరుమలలోనూ అదే నియమం.. తిరుమలలో గరుడోత్సవానికి గతంలో ముఖ్యమంత్రులు హాజరయ్యేవారు. ఇరుకైన మాడ వీధుల్లో గరుడోత్సవానికి మందీమార్బలంతో ముఖ్యమంత్రులు రావడంతో తొక్కిసలాటలు జరిగి సాధారణ పౌరులు గాయపడేవారు. దీంతో అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అజేయ కల్లం గరుడోత్సవానికి ముఖ్యమంత్రి, ఇతర వీఐపీలు రాకుండా ఉంటే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో 2004 నుంచి గరుడోత్సవానికి ముఖ్యమంత్రి హోదాలోని వారు హాజరు కావడం మానేశారు. -
‘శోక’ మహేంద్రి
పుష్కరాల తొలి రోజే ప్రాణాలు కోల్పోయిన అభాగ్యులు శవాల గుట్టలా రాజమండ్రి ఆస్పత్రి ప్రాంగణం మిన్నంటిన బంధువుల రోదనలు బాబును నిలదీసిన బాధితులు రాజమండ్రి: అయినవారిని పోగొట్టుకున్న బంధువులు, మిత్రుల రోదనలతో రాజమహేంద్రవరం(రాజమండ్రి) ప్రభుత్వాసుపత్రి ప్రాంగణం శోకసాగరమైంది. పుష్కరాల తొలి రోజే తొక్కిసలాటలో బలైపోయిన 27 మంది అభాగ్యుల మృతదేహాలతో ఆ ప్రాంతం శ్మశానాన్ని తలపించింది. మృతుల్లో ఎక్కువ మంది ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందినవారే ఉన్నారు. పుణ్యం కోసం వస్తే... పుష్కర స్నానంతో ఎంతో పుణ్యం కలుగుతుందని బంధుమిత్రులతో కలిసి వచ్చిన వారి కుటుంబాల్లో విషాదమే మిగిలింది. మృత దేహాలను పోస్టు మార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. మార్చురీ వద్ద సరిపడినంత చోటు లేకపోవడంతో ఆరుబయటే పడుకోబెట్టి, అందరూ చూస్తుండగానే పోస్టుమార్టం నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా వేమగిరికి చెందిన దేశినీడి కృష్ణవేణి(52) మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడానికి వీల్లేదంటూ ఆమె బంధువులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లిపోయారు. అయితే మళ్లీ పోస్టుమార్టానికి తీసుకువచ్చారు. సాయంత్రానికి పోస్టుమార్టం చేసి మృతదేహాలను లారీల్లో వారి స్వగ్రామాలకు తరలించారు. రాజమహేంద్రి.. శోకమహేంద్రమైంది ఓవైపు పోస్టుమార్టం జరుగుతుండగా మరోవైపు మృతుల కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. భర్తను పోగొట్టుకుని భార్య, పిల్లలు దూర మై తల్లి, సోదరి దూరమై సోదరుడు, మనవలు దూరమై అమ్మమ్మలు పడుతున్న వేదన వర్ణణాతీతం. ఇలా ప్రతి ఒక్కరూ చనిపోయిన తమవారితో పెనవేసుకున్న బంధాలను గుర్తు చేసుకుని విలపిస్తుంటే పుష్కర శోభతో వైభవంగా వెలిగిపోవాల్సిన రాజమహేంద్రి.. గుండె పగిలి శోకమహేంద్రియై కన్నీరు పెట్టింది. నేతలపై జనాగ్రహం పుణ్యం కోసం గోదారమ్మ ఒడికి వచ్చినవారిని తమ నిర్లక్ష్యంతో మృత్యు ఒడికి చేర్చిన పాలకులపై బాధితుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిదానంగా మృతదేహాలను చూసేందుకు వచ్చిన మంత్రి కామినేని శ్రీనివాస్‌ను వారు అడ్డుకున్నారు. తమవారి ప్రాణాలు తిరిగివ్వమంటూ కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. దానికే తననేదో చేసేస్తున్నారనుకున్న అమాత్యుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత సీఎం చంద్రబాబుతో కలిసి వచ్చారు. సీఎంను సైతం బాధితులు నిలదీశారు. ‘మీ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మావారి ప్రాణాలు పోయాయ’ంటూ దుమ్మెత్తిపోశారు. దీంతో ఆయన అక్కడ ఎక్కువ సమయం ఉండకుండా వెనుదిరిగారు. -
పోటెత్తిన భక్త జనం
రాజమహేంద్రికి ఆధ్యాత్మిక శోభ తొలిరోజు కిక్కిరిసిన ఘాట్లు రాజమండ్రి: ఎటుచూసినా భక్తజన సందోహమే.. రహదారులన్నీ జన గోదారులను తలపించాయి. గోదారమ్మను చూడాలి.. పుష్కర స్నానమాచరించి పాపవిమోచనం పొందాలని కోరుకుంటూ లక్షలాదిగా భక్తులు మంగళవారం రాజమహేంద్రికి పోటెత్తారు. గోదావరి పుష్కరాలు ఆరంభం కావడంతో ఈ చారిత్రక నగరం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. సోమవారం అర్ధరాత్రి నుంచే తరలివచ్చిన జనవాహినితో రాజమహేంద్రి పులకించిపోయింది. ఒకవైపు లక్షలాదిగా భక్తజనం, మరోవైపు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వీఐపీలు.. తొలి రోజు పుష్కర స్నానమాచరించారు. వాస్తవానికి పుష్కర ఘడియలు ప్రారంభం కాకముందే వేకువజామున మూడు గంటల నుంచే పుష్కర స్నానాలు మొదలయ్యాయి. ఇక పుష్కర ఘడియలు ఆరంభమైనప్పటి నుంచి మంగళవారం రాత్రి వరకూ రాజమండ్రిలో లక్షలాదిగా భక్తజనం పుష్కర స్నానాలు ఆచరిస్తూనే ఉన్నారు. జయేంద్ర సర స్వతి పూజలు పుష్కరాలను అధికారికంగా ప్రారంభించేందుకు కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి తెల్లవారుజామున ఆరు గంటల సమయంలో పుష్కర ఘాట్‌కు చేరుకున్నారు. శాస్త్రోక్తంగా పుష్కర క్రతువులన్నీ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. సరిగ్గా 6.26 గంటలకు శిష్యబృందంతో ఘాట్‌లో అడుగుపెట్టిన స్వామీజీ తొలుత మట్టి తీసి నదిలో వేసి ఆ తర్వాత పుష్కర స్నానమాచరించారు. తొలుత తూర్పు దిశగా తిరిగి.. తర్వాత ఉత్తరం వైపు తిరిగి పుష్కర స్నానం చేశారు. గోదావరి పుష్కరాలు ప్రారంభమైనట్టు ప్రకటించారు. పితృదేవతలకు చంద్రబాబు పిండప్రదానం జయేంద్ర సరస్వతితోపాటు ఘాట్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కర ఘడియల్లోనే కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పుష్కర స్నానమాచరించారు. సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, ఎన్టీఆర్ మరో కుమార్తె గారపాటి లోకేశ్వరి, ఆమె తనయుడు శ్రీనివాస్, చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడి భార్య ఇందిర, చంద్రబాబు సోదరి హైమావతితోపాటు మరో 10 మంది బంధువులు పుష్కర స్నానం చేశారు. అనంతరం తల్లిదండ్రులు, అత్తమామలతోపాటు ఇతర పితృదేవతలకు చంద్రబాబు శాస్త్రోక్తంగా పిండప్రదానం చేశారు. అనంతరం గోదానం చేశారు. ఈ కార్యక్రమం పుష్కర ఘాట్‌లో రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి ఆవిష్కరించిన శ్రీకృష్ణుని అవతారంలోని ఎన్టీఆర్ విగ్రహం వెనుక జరిగింది. వీఐపీ ఘాట్ అయిన సరస్వతి ఘాట్‌కు ప్రముఖుల తాకిడి తెల్లవారుజాము నుంచే మొదలైంది. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్రావ్ భగవత్ మధ్యాహ్నం 2 గంటలకు స్నానమాచరించారు. చంద్రబాబు ఆయనను దుశ్శాలువతో సత్కరించారు. హైకోర్టు న్యాయమూర్తులు శివశంకర్, సుబ్బారావు, శాసనమండలి చైర్మన్ చక్రపాణి తదితరులు పుష్కర స్నానమాచరించారు. స్తంభించిన రాజమహేంద్రి నాయకుల హడావుడి, పోలీసుల నిర్లక్ష్యం ఫలితంగా పుష్కర రాజధాని రాజమండ్రిలో మంగళవారం జనజీవనం స్తంభించింది. పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట జరగడంతో పోలీసులు ఆంక్షలను కఠినతరం చేశారు. 16వ నంబర్ జాతీయ రహదారిపై మధ్యాహ్నం నుంచి గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. భక్తులు, రాజమండ్రివాసులు నరకం అనుభవించారు. 16వ నంబర్ జాతీయ రహదారి నుంచి, కొవ్వూరు, కాకినాడ, రామచంద్రపురంవైపు నుంచి వచ్చే భక్తుల బస్సులు, ప్రైవేట్ వాహనాలను శివార్లలోనే ఆపేయాలని పోలీసులు ప్రణాళిక రూపొందించారు. అయితే చాలామంది అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ తమ వాహనాల్లో రాజమండ్రికి వచ్చేస్తున్నారు. మంత్రుల కాన్వాయ్‌లు, టీడీపీ నేతల కార్లు, అధికారుల వాహనాలతో రాజమండ్రి కిక్కిరిసిపోయింది. పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట తర్వాత పోలీసులు ఒక్కసారిగా ఆంక్షలను కఠినతరం చేశారు. 16వ నంబరు జాతీయ రహదారిపై నుంచి రాజమండ్రిలోకి వాహనాలు రాకుండా నిలిపేశారు. దీంతో లాలాచెరువు నుంచి మోరంపూడి సెంటర్ వరకూ ట్రాఫిక్ స్తంభించిపోయింది. విజయవాడ-విశాఖ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. -
పులకించిన గోదావరి
తెలంగాణలో పుష్కరాల తొలిరోజే 30 లక్షల మంది పుణ్య స్నానాలు నదిలో నీళ్లు లేకున్నా పోటెత్తిన భక్తజనం ఏ ధర్మపురిలో కుటుంబసమేతంగా సీఎం కేసీఆర్ పుష్కరస్నానం భద్రాద్రికి భక్తుల వరద.. ఏ త్రివేణి సంగమం కాళేశ్వరం కళకళ.. తరలివచ్చిన లక్షలాది మంది భక్తులు హైదరాబాద్/నెట్వర్క్: జనవాహిని ఉప్పొంగింది. గోదావరి పులకించింది. పుష్కరుడు ఆగమించిన వేళ తెలంగాణ యావత్తూ కొత్త శోభతో కళకళలాడింది. బాసర నుంచి భద్రాచలం దాకా గోదావరి తీరం భక్తజన సంద్రాన్ని తలపించింది. రాష్ట్రంలో గోదావరి మహా పుష్కరాలు అంగరంగవైభవంగా మొదలయ్యాయి. మంగళవారం తొలిరోజే దాదాపు 30 లక్షల మంది పుణ్య స్నానాలతో తరించారు. నదిలో పెద్దగా నీళ్లు లేకపోయినా జనం లెక్కచేయలేదు. అన్ని ఘాట్లు భక్తుల జయజయధ్వానాలతో మార్మోగాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో జనం పోటెత్తగా.. వరంగల్ జిల్లాలోని మూడు ఘాట్ల వద్ద కాస్త పలుచగా కనిపించారు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో మూడు లక్షల మంది దాకా పుణ్యస్నానాలు ఆచరించారు. భద్రాద్రిలో దాదాపు రెండు లక్షల మందికిపైగా నదీ స్నానం చేశారు. బుధవారం నుంచి తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. భద్రాచలం, బాసర, ధర్మపురి, కాళేశ్వరం తదితర క్షేత్రాలకు రద్దీ పెరగనున్నందున ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. కిక్కిరిసిన భద్రాద్రి: భద్రాచలం భక్తులతో కిక్కిరిసిపోయింది. రెండు లక్షలకుపైగా భక్తులు తరలివచ్చారు. ఉదయం 6.21 గంటలకు త్రిదండి చినజీయర్ స్వామి ఇక్కడే పుష్కరస్నానం చేశారు. శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం నుంచి సుదర్శన చక్రాన్ని తీసుకువచ్చి పూజలు చేశారు. మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు కూడా భద్రాద్రిలోనే పుణ్య స్నానాలు ఆచరించారు. ఆదిలాబాద్ జిల్లా బాసరలో నీళ్లు లేకున్నా లక్ష మంది వరకు స్నానం చేశారు. జిల్లావ్యాప్తంగా తొలిరోజు 4 లక్షల మంది స్నానాలు చేశారు. నిజామాబాద్ జిల్లాలో లక్షన్నర మంది స్నానాలు చేశారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత పోచంపాడు వద్ద ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి స్నానమాచరించారు. వరంగల్ జిల్లాలో పెద్దగా భక్తులు రాలేదు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మంగపేట వద్ద స్నానమాచరించారు. ధర్మపురిలో సీఎం పుణ్యస్నానం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం ఉదయం కుటుంబసమేతంగా గోదావరి మాతకు పూజలు చేశారు. ఉదయం సరిగ్గా 6.21 గంటలకు పుణ్యస్నానం చేసి పుష్కరాలు ప్రారంభించారు. అంతకుముందు వివిధ పీఠాలకు చెందిన ఏడుగురు స్వామీజీలు శాస్త్రోక్తంగా స్నానాలు ఆచరించి సీఎం దంపతులకు ఆశీస్సులు అందజేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా ఇక్కడే పుణ్యస్నానం చేశారు. పుష్కర స్నానం అనంతరం ధర్మపురిలో పుష్కర పైలాన్ ఆవిష్కరించారు. నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున త్రివేణీసంగమ క్షేత్రం కాళేశ్వరానికి కూడా భక్తులు భారీగా వచ్చారు. రెండు లక్షలకుపైగా భక్తులు ఇక్కడ స్నానాలు ఆచరించారు. కాళేశ్వరం ఆయానికి సాధారణ రోజుల్లో రూ.2 లక్షల చొప్పున ఆదాయం ఉండగా మంగళవారం ఒక్కరోజే రూ.25 లక్షల దాకా సమకూరడం విశేషం. కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం, ధర్మపురి, మంథని, కోటిలింగాల క్షేత్రాల్లో తొలిరోజు దాదాపు 10 లక్షల మంది పుష్కర స్నానాలు చేసినట్టు అంచనా. -
మనీషికి పుష్కరస్నానం
కాశీకి వెళ్లి గంగానదిలో స్నానం చేసేవాళ్లు అక్కడ తమకు ఇష్టమైనదేదైనా వదిలేసి రావడం మన సంప్రదాయం. పుష్కరాల్లో ఇలాంటి సంప్రదాయం ఏదీ లేదు గానీ, పుష్కరాలు జరిగే ఈ పన్నెండు రోజుల్లోనూ మన దుర్గుణాల్లో ఒక పన్నెండింటిని వదులుకుందాం. మన పాపాలను పుష్కరస్నానాలు కడిగేస్తాయి. మన మనసులోని మాలిన్యాలను మనం కడిగేసుకుందాం. ఈ మనోస్నానం మనిషిని మనీషిగా మారుస్తుంది. పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాలు పన్నెండు రోజుల పాటు జరుగుతాయి. పుష్కరాల ముఖ్యోద్దేశాలు.. పాప ప్రక్షాళన, పితృదేవతల సంస్మరణ. అయితే, మన జీవితాలను మనం ఏమాత్రం తీర్చిదిద్దుకోకుండా, మన లోపాలను మనం ఏమాత్రం సవరించుకోకుండా, మన పాపాలను మనం ఏమాత్రం మానుకోకుండా ఎంతటి పవిత్రనదిలో మునకలేసినా ఫలితం ఏముంటుంది? మన జీవితాలను పవిత్రంగా తీర్చిదిద్దుకుందాం. మనలో సర్వ సాధారణంగా కనిపించే, పుష్కరాల్లో మనం కడిగేసుకోవలసిన కొన్ని అవలక్షణాలు ఇవి.. జీవహింస వినోదం కోసమో, మానసిక సంతృప్తి కోసమో జీవహింసకు పాల్పడటం చాలామందికి అలవాటు. ఇదంత మంచి లక్షణం కాదు. అయినా, మనలో ఎంతోమంది మూగజీవాలను హింసించడాన్ని ఘనకార్యంగా భావిస్తుంటారు. మూగ జీవాలనే కాదు, మితిమీరిన అహంకారంతో, అదుపులేని ఆగ్రహంతో, అధికార బలగర్వంతో తమ కంటే బలహీనులైన సాటి మనుషులనూ హింసించేవారు లేకపోలేదు. భౌతికంగా, మానసికంగా బలహీనులను హింసించి ఆనందించే లక్షణాన్ని మానసిక రుగ్మతగా పరిగణిస్తారు. అందువల్ల హింసను విడనాడదాం. ‘అహింసో పరమో ధర్మః’ అనే ఆర్యోక్తిని త్రికరణ శుద్ధిగా పాటిద్దాం. వంచన ఆధునిక కాలంలో మనుషులు వంచనాశిల్పంలో ఆరితేరిపోతున్నారు. చిన్న చిన్న చిల్లర మోసాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీసే పెద్దపెద్ద కుంభకోణాల వరకు వంచన మన జీవనశైలిలో భాగంగా మారిపోయింది. మోసానికి గురైనప్పుడు మనం ఎంతగా బాధపడతామో, మనం మోసగిస్తే ఎదుటి వారూ అంతే బాధపడతారు. వంచనకు పాల్పడేవారికి తాత్కాలిక ప్రయోజనాలు ఉంటే ఉండొచ్చు గానీ, వంచనకు గురైన వారు మాత్రం జీవితాంతం కుమిలిపోతూనే ఉంటారు. ఈ వాస్తవాన్ని గుర్తెరిగి, మన వంచనాశిల్ప నైపుణ్యాన్ని గోదారిలో విడిచేద్దాం. అబద్ధం అవసరం ఉన్నా, లేకున్నా అబద్ధాలాడనిదే పూటగడవదు చాలామందికి. విపత్కర పరిస్థితుల్లో అబద్ధం ఆడటం తప్పుకాదని ‘శుక్రనీతి’ చెబుతున్నా, అంతటి విపత్తులేవీ లేకుండానే, అనవసరంగా చెబుతున్న అబద్ధాలే ఎక్కువగా ఉంటున్నాయి. జనాభాలో అరవై శాతం మంది అబద్ధాలాడకుండా పట్టుమని పది నిమిషాలైనా ఉండలేరని మెసచుసెట్స్ వర్సిటీ అధ్యయనంలో తేలింది. అబద్ధాలాడే వారు సాధించేది ఏమీ లేకపోగా, సమాజంలో తమ విలువనే కోల్పోతారు. అబద్ధాలను గోదావరిలో వదిలేద్దాం. ‘నిజం’గా నిఖార్సయిన జీవితాన్ని జీవిద్దాం. తారతమ్యం ఎదుటి వ్యక్తిని సాటి మనిషిగా గుర్తించి, సమాదరించే సంస్కారం చాలామందిలో కొరవడుతోంది. కుల మత ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఎదుటివాళ్ల పట్ల చూపే గౌరవ మర్యాదలలో తారతమ్యాలను పాటించడం తరతరాలుగా కొనసాగుతున్న సామాజిక రుగ్మత. ఈ రుగ్మత నయం కావాలంటే, ఒక సంస్థకు యజమాని అయినా, ఆ సంస్థలో అతి చిన్న ఉద్యోగి అయినా..ఏ స్థాయికి చెందిన వారైనా ఎదుటి వ్యక్తులను సాటి మనుషులుగా గౌరవించడాన్ని అలవాటుగా చేసుకుంటే చాలు. పవిత్ర గోదావరిలో మనుషుల మధ్య తారతమ్యాలను త్యజిద్దాం. రుణభారం మన జన్మలో మనకు తటస్థించే వాటన్నింటికీ రుణానుబంధాలే కారణమనేది మన సనాతన విశ్వాసం. అలాగని రుణభారంలో కూరుకుపోతే మాత్రం మన బతుకులు దా‘రుణం’గా తయారవుతాయి. మన సమాజంలో ఒప్పుల కుప్పలు అరుదుగా తప్ప కనిపించరు గానీ, అప్పుల కుప్పల్లాంటి అప్పారావులు అడుగడుగునా కనిపిస్తారు. చేతిలో క్రెడిట్‌కార్డులు ఉన్నాయి కదా అని, ఆర్థిక శక్తికి మించి ‘అప్పుచేసి పప్పుకూడు’ తినాలనే ధోరణి అంత క్షేమం కాదు. అలాంటి అప్పుల నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. రుణభార విముక్తి కోసం పుష్కరాలలో సంకల్పం చెప్పుకుందాం. అసూయ మనశ్శాంతిని కరువు చేసే అవలక్షణాల్లో అసూయ ఒకటి. ఎదుటివారి ఉన్నతికి ఓర్వలేక అసూయతో రగిలిపోతూ ఉంటారు కొందరు. ఉన్నతిని కోరుకోవడం, అందుకు ప్రయత్నించడంలో ఎలాంటి తప్పులేదు గానీ, ఇతరుల ఉన్నతిని చూడలేకపోవడం అంత మంచిది కాదు. అసూయ ముదిరితే అదే అనారోగ్యానికి దారితీస్తుంది. అధిక రక్తపోటు, నిద్రలేమి వంటి జబ్బులు రావడానికి అసూయ కూడా ఒక కారణం. మానసిక ప్రశాంతతను పూర్తిగా హరించే అసూయను పుష్కర స్నానంతో కడిగేసుకుందాం. వృథా ప్రకృతి వనరులను వృథా చేయడం మనలో చాలామందికి ఉన్న పాడు అవలక్షణం. తిండిని, నీటిని ఇష్టానుసారం వృథా చేస్తాం. అవసరానికి మించి తినడం, భుక్తాయాసంతో తినలేని స్థితిలో తిండిని వృథా చేయడం రెండూ నైతిక నేరాలే! మనం తిరిగి సృష్టించలేని ప్రకృతి వనరులను విచ్చలవిడిగా వృథా చేయడం ఏమాత్రం క్షంతవ్యం కాదు. తిండిని వృథా చేస్తే కొన్ని దేశాలు జరిమానాలు విధిస్తున్నాయి. మన దేశంలో అలాంటి చట్టాలేవీ లేకపోయినా, భావి తరాల సంక్షేమం కోసం పుష్కరాలను పురస్కరించుకుని వనరుల వృథాను మానుకుందాం. చులకన చాలామందికి జనాలతో సామరస్యంగా మెలగడం తెలియదు. నోటికొచ్చిన మాటలతో తేలికగా ఎదుటి మనిషిని చులకన చేస్తారు. తమ కంటే బలహీనులను, స్త్రీలను మాటలతో గాయపరుస్తారు. భౌతిక గాయాల కంటే, పరుషమైన మాటల వల్ల కలిగే మానసిక గాయాలు మనుషులను ఎక్కువగా బాధిస్తాయి. ఎదుటివారు ఏం చేస్తే మనకు బాధ కలుగుతుందో, ఎదుటి వారి పట్ల మనం అలాంటి పని చేయకుండా ఉండటమే అసలు సిసలు ధర్మం అని పురాణాలు చెబుతున్నాయి. గోదారి సాక్షిగా ధర్మ వర్తనను అలవరచుకుందాం. పరదూషణ ఇతరుల గురించి చెడు మాట్లాడటం చాలామందికి అలవాటు. ముఖ్యంగా ఇతరుల పరోక్షంలో వారిని దుర్భాషలాడటం, వారి గురించి చెడు వ్యాఖ్యానాలు సాగించడం ఒకరకమైన మానసిక జాడ్యం. ఇలాంటి మాటలను ఆలకించడమూ మానసిక జాడ్యమే! ఇతరుల పరోక్షంలో మనం వారి గురించి చెడుగా మాట్లాడుతుంటే, మన పరోక్షంలో మన గురించి ఇతరులూ అలాంటి సంభాషణలే సాగిస్తుంటారనే స్పృహతో మెలగడం మంచిది. పరదూషణ వల్ల ఒరిగేదేమీ ఉండదు, పైగా మన సంస్కారరాహిత్యమే బయటపడుతుంది. పుష్కరాల సందర్భంగా మనం సంస్కారాన్ని పెంచుకుందాం. నిరాదరణ గతించిపోయిన పెద్దలను సంస్మరించుకునే సందర్భం పుష్కరాలు. అయితే, కొందరు ఇంకా జీవించే ఉన్న తమ పెద్దలను నిరాదరణకు గురి చేస్తుంటారు. ముదిమి మీదపడ్డ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలపాలు చేస్తుంటారు. గతించిపోయిన పెద్దలను సంస్మరించుకునే భక్తిశ్రద్ధలు ఉన్నవాళ్లు ఇంకా జీవించే ఉన్న తమ పెద్దలను ఆదరించకపోవడం సరైన పని కాదు. ‘మాతృదేవో భవః పితృదేవో భవః’ అనే ఆర్యోక్తిని చిన్నప్పటి నుంచి నూరిపోసే సమాజంలో పుట్టి పెరిగిన మనం పుష్కరాల సాక్షిగా మన పెద్దలను గౌరవాదరాలతో చూసుకుందాం. స్వార్థం మనలో సర్వసాధారణంగా కనిపించే అతిపెద్ద అవలక్షణం స్వార్థం. స్వార్థంలో ఎలాంటి పరమార్థం లేకపోగా, అది అనర్థదాయకం అని తెలిసినా, స్వార్థచింతనను ఏమాత్రం మానుకోలేం. స్వార్థప్రయోజనాల కోసం కొందరు ఎంతటి నీచానికైనా దిగజారుతుంటారు. స్వార్థం మితిమీరిన వారు ఇతరులు ఎంతటి ఆపదలో ఉన్నా, ఆదుకోవడానికి ముందుకు రారు. పుణ్య పురుషార్థాలు కోరి చేసే పుష్కర స్నానాల్లో స్వార్థబుద్ధిని వదులుకుని, ఆర్తులను ఆదుకుందాం. ద్వేషం మన పట్ల మనలో మితిమీరి పేరుకుపోయిన అసహనం, కోపం, నిస్సహాయతలే ఎదుటి వారి పట్ల ద్వేషంగా పరిణమిస్తాయి. ప్రపంచంలోని అన్ని మతాలూ ప్రేమను ప్రబోధిస్తుంటే, మనం ఇతరుల పట్ల ద్వేషాన్ని పెంచుకోవడంలో అర్థం లేదు. ముందుగా మనల్ని మనం ప్రేమించుకుంటే, ఇతరులనూ అదేరీతిలో ప్రేమించగలం. ఇతరులను ద్వేషించడం వల్ల మనకే మనశ్శాంతి కరువవుతుంది. మనలోని అలజడిని, అశాంతిని తగ్గించుకుని, ద్వేషాన్ని గోదారిలో విడిచిపెడదాం. -
పుష్కరాల్లో పోలీసులే కీలకం
ఖమ్మంక్రైం : పుష్కరాల్లో జిల్లా పోలీస్ యంత్రాంగం తీసుకునే చర్యలు చాలా కీలకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి అన్నారు. గురువారం రాత్రి ఎస్పీ క్యాంపు కార్యాలయంలోని మినీకాన్ఫరెన్స్హాలులో పోలీస్ అధికారులతో ఆయన పుష్కరాలపై సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న గోదావరి పుష్కరాలకు ఎంతో వ్యయ ప్రయాసలతో పుష్కర స్నానాలు ఆచరించేందుకు వస్తున్న భక్తులకు ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. భక్తులు తిరిగి తమ స్వస్థలాలకు క్షేమంగా వెళ్లేంతవరకు అన్ని శాఖల సమన్వయంతో పోలీసులు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. డిజిటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా దైవదర్శనానికి ఎంత సమయం పడుతుంది, ఎంతమంది భక్తులు పుష్కర ఘాట్లలో ఉన్నారు. అలాగే దైవదర్శన క్యూలో ఎంత మంది ఉన్నారనే సమాచారాన్ని భక్తులకు తెలి పేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. పుష్కరఘాట్ల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నట్లయితే అక్కడే ఉన్న వాచ్‌టవర్ ద్వారా పోలీస్ అధికారులను అప్రమత్తం చేయడం, కొంతసమయం భక్తులను నిలిపి రద్దీ తగ్గిన తర్వాత యథావిధిగా కొనసాగించాలని సూచించారు. ఎస్పీ షానవాజ్‌ఖాసిం మాట్లాడుతూ జూలై 14 నుంచి 25 వరకు జరిగే గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ప్రతి రోజు ఎంతమంది భక్తులు వస్తున్నారనే విషయాన్ని పోలీస్ చెక్‌పోస్టుల ద్వారా వచ్చే సమాచారాన్ని బట్టి కార్యాచరణ రూపొందించి, అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్న ట్లు తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ సాయికృష్ణ, డీఎస్పీలు అశోక్‌కుమార్, దక్షిణామూర్తి, రాంరెడ్డి, సురేందర్‌రావు, కవిత, వీరేశ్వరరావు, రాజేష్, సాయిశ్రీ, ఏఆర్ డీఎస్పీ సంజీవ్, సీఐలు రమణమూర్తి, శ్రీనివాసరెడ్డి, నరేష్‌రెడ్డి, రహమాన్, అంజలి పాల్గొన్నారు. -
కోట్ల పనులకు తూట్లు
పుష్కర ఏర్పాట్ల అంచనాల్లోనే వంచన అధికారులు, కాంట్రాక్టర్ల కుమ్మక్కు పర్యవేక్షించకుండా పరోక్ష సాయం మచ్చుకైనా కానరాని నాణ్యత నేడు కలెక్టర్ పుష్కరఘాట్ల సందర్శన పుష్కర స్నానం..పుణ్యఫలం. పుష్కరాల పనులేమో ధనఫలం! రూ.కోట్లు ఖర్చు చేసినా.. లక్షల స్థారుు నాణ్యత కూడా పనుల్లో కన్పించడం లేదు. పుష్కర పనులకు భారీగా అంచనాలు రూపొందించారు. అవి మంజూరయ్యూక తూతూమంత్రంగా పనులు కానిచ్చేస్తున్నారు. అధికారులు వత్తాసు పలుకుతుండగా.. కాంట్రాక్టర్లు భారీమొత్తంలో డబ్బు దండుకుంటున్నారు. ఈ అంచనాల మాటున దాగిన వంచన ‘సాక్షి’ పరిశీలనలో బహిర్గతమైంది. వరంగల్: ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద మాత్రమే 2003 పుష్కరాల సందర్భంగా పుష్కరఘాట్ నిర్మించారు. పుష్కర స్నానాలకు ఒకే రోజు వచ్చిన భక్తులు లక్షకు మించలేదు. కానీ, గతంలో లక్షలాదిగా భక్తులు వచ్చారని, ఈసారి కూడా తరలివస్తారని అధికారులు అంచనాలు సిద్ధం చేసి పనులు ప్రతిపాదించారు. నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖ, ఆర్డబ్ల్యూఎస్, ఎండోమెంట్, రోడ్లు, భవనాల శాఖతో కలిపి సూమారు రూ. 25కోట్లు కేటాయించినట్లు తెలిసింది. పుష్కరాల్లో చేపట్టే పనులను ఉద్దేశించిన జీఓల్లో అభివృద్ధి పనుల పేర్లు స్పష్టంగా పేర్కొనకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది. కాంట్రాక్టర్లు కోరిన విధంగా పనులకు రూపకల్పన చేసినట్లు తెలిసింది. పంచాయతీ రాజ్ పరిధిలో.. పంచాయతీరాజ్ మైన ర్ ఇరిగేషన్ శాఖకు రూ.9.70కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద పాత ఘాట్‌కు అదనంగా 100మీటర్ల నిర్మాణం, ముల్లకట్ట, మంగపేట గోదావరి రేవు వద్ద స్నాన ఘట్టాలు నిర్మిస్తున్నారు. ఇవి పూర్తికావస్తున్నారుు. నాణ్యతపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ, చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖకు రోడ్ల మరమ్మతు కోసం రూ.10.59 కోట్లు కేటాయించింది. తారురోడ్లు పెచ్చులు లేస్తూ వాస్తవాన్ని కళ్లకు కడుతున్నారుు. ఏటూరునాగారం నుంచి రామన్నగూడెం వరకు రూ.1.40 కోట్లతో రోడ్డు మరమ్మతులు చేశారు. ఇరువైపులా సైడ్ బర్మ్‌లు పోసి రోలింగ్ చేయాల్సి ఉన్నా విస్మరించారు. ఇది ట్రాఫిక్ సమస్యకు దారితీస్తుంది. స్వరాష్ట్రంలో తొలి పుష్కరాలు.. సరిగ్గా ఎనిమిది రోజుల్లో ప్రారంభమవుతారుు. వీటిని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడాన్ని కాంట్రాక్టర్లు తమకు అనుకూలంగా మల్చుకుంటున్నారు. అధికారులతో కుమ్మక్కై భారీగా అంచనాలు రూపొందించి.. సర్కారు సొమ్మును దండుకుంటున్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత విస్మరిస్తున్నా.. అధికారులు చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. -
దోచుకోవడానికే హడావుడి పనులు
పుష్కరాల పనుల తీరుపై వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి విమర్శలు రాజమండ్రి: ‘‘గోదావరికి జూలై 14న పుష్కరాలు మొదలవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏడాది క్రితం తెలియదా? నెల రోజుల నుంచి మాత్రమే పుష్కరాల పను లు ఆరంభించారు. ఇలా ఆలస్యంగా ఎందుకు చేస్తున్నారంటే.. ఆఖరి రోజుల్లో హడావుడిగా పనులు చేసి నిధులు దోచుకోవచ్చనే ఉద్దేశంతోనే. టెండర్లు పిలిచినా పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని చెప్పి అవినీతికి పాల్పడవచ్చనే. నామినేషన్ పద్ధతిలో తన వందిమాగధులకు పనులు ఇవ్వడానికే ఈ జాప్యం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాజమండ్రిలో ఆదివారం పర్యటించిన ఆయన పుష్కరాల పనులను పరిశీలించారు.కోటిలింగాల ఘాట్‌ను సందర్శించి.. అక్కడ జరుగుతున్న నిర్మాణ పనుల తీరుతెన్నుల గురించి సాగునీటి పారుదలశాఖ అధికారులు, కాంట్రాక్టరును అడిగి తెలుసుకున్నారు. కోటిలింగాల ఘాట్ విస్తరణ పనుల కోసం అక్కడ ఉన్న పేదల ఇళ్లను అర్ధంతరంగా తొలగించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. బాధితులను పరామర్శించిన అనంతరం జగన్మోహన్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘‘పుష్కరాలకు రూ. 200 కోట్లు కేటాయించినట్టు చంద్రబాబు అసెం బ్లీలో చెబుతారు. కాదు రూ. 1,400 కోట్లని యనమల రామకృష్ణుడు అంటున్నారు. ఇప్పటివరకు విడుదలైంది మాత్రం కేవలం రూ. 86 కోట్లు మాత్రమే. ఇప్పటికీ చాలా పనులు మొదలు కాలేదు. టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని చెబుతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటే పనులను చంద్రబాబు, ఆయన మంత్రివర్గం, ఎమ్మెల్యేలు భాగాలు చేసుకోవాలనే’’ అని ఆరోపించారు. పుష్కరాలకు అభివృద్ధి పనులు చేయాల్సిందే అని చెప్పిన జగన్.. ఆ పేరుతో అక్కడ 30 ఏళ్లుగా నివాసముంటున్నవారి ఇళ్లను రాత్రికి రాత్రి ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. నవ దంపతులకు జగన్ ఆశీర్వాదం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనపర్తి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు డాక్టర్ గౌతమ్‌రెడ్డి వివాహ వేడుకలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. కొత్త దంపతులను ఆశీర్వదించారు. -
పుష్కరాలకు.. గోదారి సిద్ధం..
వేగంగా ముల్లకట్ట వారధి నిర్మాణం పుష్కరాల వరకు పనులు పూర్తి ఛత్తీస్‌గఢ్, తెలంగాణకు మెరుగుపడనున్న రవాణా వ్యవస్థ ఎన్‌హెచ్ -163 పనుల్లో కొనసాగుతున్న జాప్యం హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని భూపాలపట్నం వరకు చేపట్టిన 163వ జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో జాప్యం కొనసాగుతోంది. 350 కిలోమీటర్ల మేర చేపట్టాల్సిన రోడ్డు పనులు అక్కడక్కడా పలు అవాంతరాలతో ముందుకు సాగడంలేదు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఏటూరునాగారం మండలంలోని ముల్లకట్ట వద్ద గోదావరి నదిపై వంతెన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న గోదావరి పుష్కరాల వరకు ఈ వారధి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఒప్పందం ప్రకారం ఈ పనులు మే నెల వరకు పూర్తి కావాలి. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్-163, ముల్లకట్ట బ్రిడ్జి నిర్మాణ పనులపై ప్రోగ్రెస్ రిపోర్ట్.. ఎన్‌హెచ్-163 పరిస్థితి హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లా పస్రా వరకు 243 కి.మీ. మేర రోడ్డు పనులు పూర్తి. పస్రా నుంచి ఏటూరునాగారం తాళ్లగడ్డ వరకు 47 కి.మీ. రోడ్డు నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. వరంగల్ పరిధిలో తాళ్లగడ్డ నుంచి ముల్లకట్ట బ్రిడ్జి వరకు ఉన్న 11.5 కిలోమీటర్లలో 50 శాతం బీటీ రోడ్డు పనులు పూర్తి. ఖమ్మం జిల్లాలోని వాజేడు మండలం జగన్నాథపురం నుంచి టేకుపల్లి వరకు 7.5 కిలో మీటర్ల రోడ్డుపై కంకర, మెటల్ లెయర్, రోలింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఏటూరునాగారం : తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని భూపాలపట్నం వరకు చేపట్టిన 163వ జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతూనే ఉంది. ప్రధానంగా పస్రా నుంచి ఏటూరునాగారం తాళ్లగడ్డ వరకు 47 కి.మీల రోడ్డు నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ రోడ్డు పనులకు గతంలో అటవీశాఖ అధికారులు అడ్డు చెప్పారు. గత ఏడాది డిసెంబర్లో రోడ్డు పనులు చేసుకునేందుకు ఆ శాఖ శాఖ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇచ్చింది. కానీ, అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో ఈ పనులు ఇంతవరకు మొదలు కాలేదు. ఎన్‌హెచ్ పనుల్లో భాగంగా ఏటూరునాగారం మండలం ముల్లకట్ట వద్ద గోదావరి నదిపై చేపట్టిన బ్రిడ్జి పనులు మాత్రం శరవేగంగా కొనసాగుతున్నారుు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. 2012 ఫిబ్రవరిలో బ్రిడ్జి పనులు ప్రారంభంకాగా.. ఈ ఏడాది జూలైలో జరగనున్న గోదావరి పుష్కరాల వరకు పూర్తి చేసేందుకు అధికారులు కృషిచేస్తున్నారు. ఏటూరునాగారం తాళ్లగడ్డ నుంచి నుంచి గోదావరి బ్రిడ్జి వరకు 11.5 కిలో మీటర్లు, అవతలివైపున ఖమ్మం జిల్లాలో వాజేడు మండలంలో 7.5 కిలో మీటర్ల వరకు రోడ్డుతోపాటు బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 218.3 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇందులో బ్రిడ్జి నిర్మాణానికి రూ. 98 కోట్లు కేటాయించారు. వరంగల్ జిల్లా ఏటూరునాగారంలో 11.5 కిలోమీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణం ఉండగా.... స్లాబ్‌ల నిర్మాణం పూర్తరుుంది. 50 శాతం బీటీ రోడ్డు పనులు పూర్తి కాగా.. ఇంకా 50 శాతం బీటీ లేయర్లు వేయాలి. అరుుతే ఖమ్మం జిల్లా వైపు 7.5 కిలోమీటర్ల వరకు రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని వాజేడు మండలం జగన్నాథపురం నుంచి టేకుపల్లి వరకు ఉన్న 7.5 కిలోమీటర్ల రోడ్డుపై కంకర, మెటల్ లెవలింగ్, రోలింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఖమ్మం జిల్లా వైపు రోడ్డు, లొటపెటల గండి, చీకుపల్లి, జగన్నాథపురం వద్ద బ్రిడ్జి నిర్మాణ కాంట్రాక్టు పనులు ఓ కంపెనీ దక్కించుకుని పనులను మధ్యలోనే వదిలేసి వెళ్లింది. ఆ పనులను కూడా ప్రస్తుత ముల్లకట్ట బ్రిడ్జి నిర్మాణం చేస్తున్న కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి అప్పగించారు. గోదావరి నదిపై 2.5 కిలో మీటర్ల పొడవుతో బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయి. వర్షాలు వస్తే పనులు నిలిచిపోయే అవకాశం ఉండడంతో కాంట్రాక్టర్లు త్వరగా పనులు పూర్తి చేసేందుకు పనులను వేగవంతం చేస్తున్నారు. వేసవి కాలంలో గోదావరి నీటి ప్రవహం తక్కువగా ఉండడంతో పిల్లర్లు వేసేందుకు మట్టికట్టలు నిర్మించి బీమ్‌లను అమర్చేందుకు సిద్ధం చేస్తున్నారు. రెండు పిల్లర్ల మధ్య నుంచి గోదావరి ప్రవహం ఉండే విధంగా మట్టిని నిర్మించారు. ఈ వైపు బీమ్‌లను అమర్చే క్రమంలో పూర్తిగా గోదావరిపై మట్టి పోస్తారు. గతంలో పూర్తయిన స్లాబ్‌ల మధ్య ఉన్న మట్టిని తొలగించి గోదావరి మళ్లిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురం నుంచి లోటపెటల గండి వరకు రోడ్డు పనులు, చీకుపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు మందకొడిగా సాగడంతో ఇచ్చిన గడువు తీరేపోయే అవకాశం ఉంది. గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం వర్షాకాలం రాకముందే పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు కృషిచేస్తున్నారు. 22 స్లాబ్‌లు, 37 బీమ్ల అమరిక పూర్తి వంతెన నిర్మాణంలో భాగంగా 44 పియర్స్ (పిల్లర్లు), బ్రిడ్జికి ఇరువైపులా రెండు అబట్మెంట్సు నిర్మాణ పనులు పూర్తయ్యూరుు. దీంతో స్లాబ్‌ల పనులు మొదలు పెట్టారు. ఇప్పటివరకు 22 స్లాబ్‌ల పనులు పూర్తి కాగా, 37వ పిల్లర్ వరకు బీమ్‌లను అమర్చారు. బీమ్ల వెల్డింగ్, సెంట్రింగ్ పనులు జరుగుతున్నాయి. ఒక్కో పిల్లర్ ఎత్తు భూమిపై నుంచి ఆయా ప్రదేశాన్ని బట్టి 11 మీటర్ల నుంచి 14 మీటర్ల వరకు నిర్మించారు. ప్రతి పియర్ నిర్మాణం పటిష్టంగా ఉండేందుకు 38 మీటర్ల మేర భూమి లోపలికి గొయ్యి తీసి 1.50 మీటర్ల డయా, ఇనుప చువ్వలతో బుట్టను అమర్చారు. బీమ్ల మధ్య సస్పెషన్ ఇచ్చే తీగలు పిల్లర్, పిల్లర్‌కు మధ్య ఒక్కో గర్డర్(బీమ్) 40 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. ఇప్పటి వరకు 120 గర్డర్స్‌ను పియర్స్పైకి చేర్చారు. ఇంకా కొన్ని సిద్ధంగా ఉండగా, మరికొన్నింటిని తయారు చేస్తున్నారు. స్లాబ్‌పై వాహనాల రాకపోకల క్రమంలో బ్రిడ్జిపై ఎలాంటి ఒత్తిడి పడకుండా బీమ్ మధ్యలో సస్పెషన్ తీగలను అమర్చారు. బ్రిడ్జి ఎత్తు 17.5 మీటర్లు.. 18 మీటర్ల వెడల్పు ముల్లకట్ట వద్ద గోదావరి నీటి మట్టాన్ని పరిగణనలోకి తీసుకొని బ్రిడ్జి ఎత్తును నిర్ణయించారు. మండలంలో ప్రధానంగా 1986లో గోదావరి వరదలు ఎక్కువగా వచ్చాయి. అప్పుడు అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అప్పటి గణాంకాలను లెక్కలోకి తీసుకుని అధికారులు 17.5 మీటర్ల ఎత్తులో బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. బ్రిడ్జిపైన 18 మీటర్ల వెడల్పుతో మూడు లేన్ల రోడ్డు ఉంటుంది. ఇంకా ఇరువైపులా 1.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్ నిర్మించారు. కుడి, ఎడమ వైపుల నుంచి నడిచిపోవడానికి వీలుగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. బ్రిడ్జి స్లాబ్‌లు పూర్తి కాగానే దానిపై బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. బ్రిడ్జి పనులు పూర్తయితే తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారిగా జరిగే పుష్కరాలకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ పనులను ఈఈ సత్యనారాయణ, డీఈఈలు మనోహర్, చంద్రశేఖర్, కృష్ణారెడ్డి, ఏఈఈలు అన్నయ్య, అమరేందర్, దేవేందర్, రామ్మూర్తి, బాబు, ప్రదీప్, తరుణ పర్యవేక్షిస్తున్నారు. -
కాలుష్య నివారణ దిశగా అడుగులు
మే నెలలో గోదావరి శుద్ధి కార్యక్రమం తీరంలో ప్లాస్టిక్‌పై నిషేధం ‘సాక్షి’ కథనానికి స్పందన రాజమండ్రి : కాలుష్యం కోరల నుంచి గోదావరికి విముక్తి కలిగించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మలినాలను తొలగించి పుష్కరాలనాటికి నదీజలాలను కాలుష్యరహితం చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. నదీ కాలుష్యంపై ‘కాలుష్య కాసారం’ శీర్షికన గత నెల 28న ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. రాజమండ్రిలో గురువారం జరిగిన సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్.. ఈ బాధ్యతను ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు హెచ్.అరుణ్‌కుమార్, కాటమనేని భాస్కర్లకు అప్పగించారు. మే నెలలో గోదావరి నది నీటిమట్టం తక్కువగా ఉంటుంది. అదే సమయంలో కాలుష్యం కూడా ఎక్కువవుతుంది. ఆ సమయంలో తీరగ్రామాల్లో నదిలో పెరిగిన నాచు, ఇతర పదార్థాలను తొలగిస్తారు. నీటి అడుగున ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్తను పూర్తిగా తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడతారు. ఇందుకు మత్స్యకారుల సహకారం తీసుకుంటారు. స్నానఘట్టాల్లో గోదావరిని కలుషితం చేయవద్దనే బోర్డులు పెట్టి సేవాసంస్థల ఆధ్వర్యంలో నిఘా ఉంచుతారు. ఈ బాధ్యతను ప్రధానంగా ఆధ్యాత్మిక సేవాసంస్థలకు అప్పగించాలని ప్రసాద్ సూచించారు. నదీ కాలుష్యాన్ని నివారించాలనే నినాదంతో ఘాట్ల వద్ద ఇప్పటినుంచే ప్రచారం చేపట్టే బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించారు. ఇందుకోసం ఇప్పటికే యానాం ఎమ్మెల్యే ముందుకు వచ్చినట్టు సమాచారం. గోదావరి తీర గ్రామాల్లో పారిశుధ్య చర్యలపై అవగాహన కార్యక్రమాలు చేపడతారు. రాజమండ్రిలోని పలు స్నానఘట్టాల్లో వేలాదిగా ప్లాస్టిక్ వ్యర్థాలు తేలుతూంటాయి. నగరంలోని మురుగు కాలువల ద్వారా ఇవి నదిలో చేరుతున్నాయి. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని నదీతీర ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. -
పుష్కరాలకూ కన్సల్టెన్సీ కావాలా?
చంద్రబాబు ప్రభుత్వ తీరుపై కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: మన రాష్ట్రంలో పుష్కరాలను మనం నిర్వహించుకోవడానికి కూడా కన్సల్టెన్సీల అవసరం కావాల్సి వచ్చిందా? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు సర్కారుపై ధ్వజమెత్తింది. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి శుక్రవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులు, అధికారుల ప్రభుత్వం నడుస్తోందా? లేదంటే విదేశీ కన్సల్టెన్సీల ప్రభుత్వం నడుస్తోందా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. ప్రభుత్వంలోగానీ, రాష్ట్రంలోగానీ ఏదైనా రంగానికి సంబంధించి నిపుణులు లేకుంటేనే.. ఆయా రంగానికి విదేశీ కన్సల్టెన్సీల అవసరం ఏర్పడుతుందని, కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అన్నింటికీ విదేశీ కన్సల్టెన్సీలను నియమించుకునే తీరు కనబడుతోందని విమర్శించారు. ‘‘గోదావరి పుష్కరాల బాధ్యతలను కన్సల్టెన్సీకే ఇచ్చారు.. తాత్కాలిక రాజధాని నిర్మాణం ప్లాన్ రూపకల్పన బాధ్యతలు విదేశీ కన్సల్టెన్సీకి ఇచ్చారు. ఇక రెవెన్యూ చట్టంలో మార్పులు తేవడానికి కన్సల్టెన్సీ.. సీఎం విదేశీ పర్యటన ప్రణాళిక రూపకల్పనకు కన్సల్టెన్సీ.. నీటి పారుదలశాఖలో అంశాలకు కన్సల్టెన్సీ.. ప్రభుత్వ ప్రచార బాధ్యతల నిర్వహణకు కన్సల్టెన్సీ.. చివరకు రోడ్ల పనుల నాణ్యతా తనిఖీలనూ కన్సల్టెన్సీకి ఇస్తున్నారు’’ అని ఆయన దుయ్యబట్టారు. సీఎంకు తన ప్రభుత్వంలోని మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్‌లపై నమ్మకం లేక కన్సల్టెన్సీల నియామకానికి వెళుతున్నారా? అని ప్రశ్నించారు. ఒకవైపు రాష్ట్రంలో లోటు బడ్జెట్ అంటూ కన్సల్టెన్సీల పేరుతో రూ.వందల కోట్లను విదేశీ సంస్థలకు చెల్లించడమేమిటని తప్పుపట్టారు.చంద్రబాబు కుటుంబానికి సింగపూర్‌లో హోటళ్లు, కంపెనీలున్నాయన్న ప్రచారం ఉందని, ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమాలకు విదేశీ కన్సల్టెన్సీలను నియమించుకుని.. వాటిద్వారా అక్కడ తన సంస్థలకు క్విడ్ ప్రో కో జరుగుతోందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయని ఆయన చెప్పారు. లోటు బడ్జెట్ అంటూనే..: రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూనే చంద్రబాబు ప్రభుత్వం రూ.కోట్లా ప్రజాధనాన్ని వృథా చేస్తోందని మోహన్‌రెడ్డి విమర్శించారు. కన్సల్టెన్సీలకు రూ.వంద కోట్లు, సంక్రాంతి సంబరాలకు రూ.324 కోట్లు.. కేవలం సంచులపై చంద్రబాబు ఫొటో వేసుకోవడానికి రూ.15 కోట్లు.. ఇంకా విదేశీ పర్యటనలకు, వాస్తు పేరుతో కోట్లలో ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు.మరోవైపు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వేల కోట్ల నిధులను తేవడంలోనూ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నారు. -
నిధులు మూరెడు.. పనులు బారెడు
ఆర్అండ్బీ శాఖ జాబితాలో కొత్త పనులు ఇంకా అంచనాల తయారీలోనే అధికారులు పుష్కరాలు తరుముకొస్తున్నా కొలిక్కి రాని ప్రక్రియ రాజమండ్రి : వరద వేళ గోదావరి ప్రవాహంలా.. కాలం పరుగు పెడుతూ మహాపర్వం.. పుష్కరాలను చేరువ చేస్తోంది. అయినా ఈ బృహ్ఘట్టానికి సంబంధించి.. నిధులు మూరెడు, పనులు బారెడు అన్న చందాన తయారైంది ఆర్అండ్బీ శాఖ పరిస్థితి. ఈ శాఖ పుష్కరాలకు రూ.180 కోట్లు వ్యయమయ్యే పనులను ప్రతిపాదించగా ఇందులో జిల్లాకు రూ.87 కోట్లు మాత్రమే ఇచ్చారు. కాగా ప్రజా ప్రతినిధులు ప్రతిపాదిస్తున్న పనులు మరో రూ.వంద కోట్లు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటికి ఇప్పుడు కొత్తగా ప్రతిపాదనలు తయారు చేసి పంపుతున్నారు శాఖ అధికారులు. గతంలో వేసిన అంచనాలు కూడా పాత స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్ (ఎస్ఎస్ఆర్)ల ప్రకారం రూపొందించారు. ఇప్పుడు వాటిని కూడా సవరించాల్సి రావడంతో ఈ శాఖ పనులన్నీ గందరగోళంగా మారాయి. పుష్కరాలకు ఐదు నెలల కాలం ఉంది. ఇంకా ప్రభుత్వం నుంచి కొత్త, పాత పనులకు తుది ఆమోదం రావాలి. దీంతో అధికారులు ఒత్తిడికి గురవ్వాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. కాగా ఆర్అండ్బీ ఎస్ఈ సీఎస్ఎన్ మూర్తి మాత్రం పనులన్నీ సకాలంలో చేస్తామని చెబుతున్నారు. ప్రతిపాదనలు పెరిగినా..నిధులు పెరగవు.. గత ఆగస్టులో జరిగిన పుష్కరాల కేబినెట్ కమిటీ తొలి సమావేశంలో ఆర్అండ్బీ శాఖ రూ.180 కోట్ల మేర అంచనాలు ఇవ్వగా కేవలం రూ.87 కోట్లే మంజూరయ్యాయి. ఈ ప నులు చేపట్టే సమయంలో కొత్త ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం మా త్రమే పనులు చేస్తామని కాంట్రాక్టర్లు పనులను బహిష్కరించడం తో మళ్లీ పనుల ప్రతిపాదనలను సవరించారు. మరో పక్క కొత్తగా పనులు పుట్టుకొస్తున్నాయి. రాజ మండ్రి నుంచి గోదావరిపై నిర్మిస్తున్న నాలుగు లేన్ల వంతెన క్రాసింగ్ వరకూ కోరుకొండ రోడ్డు ను నాలుగు లేన్లుగా విస్తరించేందుకు ముందుగా ఆర్అండ్బీ అధికారులు ప్రతిపాదనలు పంపారు. కానీ ఇటీవల రాజమండ్రిలో పుష్కర పనుల్ని సమీక్షించిన ముఖ్యమంత్రి ఈ రోడ్డును మధురపూడి వరకూ విస్తరించాలని సూచించారు. అంటే కొత్తగా మరో ఏడు కిలోమీటర్లు పొడిగించాల్సి ఉంటుంది. ఇందుకు కొత్తగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు ఆర్అండ్బీ అధికారులు. మరో వంక రాజమండ్రి నుంచి నాలుగు లేన్ల వంతెన అప్రోచ్ రోడ్డు వరకూ సీతానగరం వైపు కూడా నాలుగు లేన్లుగా విస్తరించాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. వాటిని కూడా చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు చేశారు. ఇంకా కోనసీమలో కూడా పలు రోడ్డు పనులను చేపట్టాలని ఆయా ప్రాంతాల నేతలు కొత్తగా అధికారులకు సూచించారు. ఇలా అధికారుల వద్ద పనుల జాబితా పెరుగుతోంది. కానీ నిధులు మాత్రం కొత్తగా వచ్చి చేరడం లేదు. మంజూరైన పనుల్లోనూ మార్పులు.. ఆర్అండ్బీ అధికారులు సుమారు రూ.25 కోట్లకు పైగా కొత్త పనులు ప్రతిపాదించగా వాటిని ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. ఫిబ్రవరి 3న పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో పుష్కరాల సాధికారిత కమిటీ రెండో విడత సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో పనులు ప్రారంభించడం, ముగించడం వంటి అంశాలపై చర్చిస్తామని కమిటీ కన్వీనర్ జె.మురళి చెప్పారు. అంటే ఆ పాటికల్లా పనులకు పరిపాలనా పరమైన ఆమోదాలు లభించాలి. మరో వంక సాధికారిత కమిటీ మంజూరైన పనుల్లో కూడా మార్పులు చేర్పులు చేస్తోంది. కొన్ని పనులను రద్దుచేసి మరి కొన్ని పనులకు కొత్తగా అవకాశం కల్పిస్తున్నారు. సాధ్యమైనంత వరకూ ఉన్న నిధుల్లోనే పనులు సర్దుబాటు చేసేందుకు కమిటీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పాత వాటి సవరింపులు, కొత్త పనులపై మళ్లీ అంచనాలు, జీఓలు.. ఇలా అన్నీ మళ్లీ మొదటికి వస్తాయి. ఆర్అండ్బీ శాఖలో కూడా ఇలా పనుల్లో మార్పులు చేస్తున్నట్టు సమాచారం. -
కాళేశ్వరా.. కష్టాలు తీరేనా?
మంథని/మహదేవపూర్: త్రివేణి సంగమ క్షేత్రం కాళేశ్వరం అభివృద్ధిలో ఆమడదూరంలో ఉంది. క్షేత్రంపై అధికారులు, పాలకులు శీతకన్ను వేస్తుండడంతో నిర్లక్ష్యానికి గురవుతోంది. వచ్చే జూలైలో జరుగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై గురువారం కలెక్టర్ నీతుకుమారిప్రసాద్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. పుష్కరాల పుణ్యమా అని కాళేశ్వరంలో కష్టాలు తీరేనా అని భక్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా ఆలయానికి ప్రతిరోజు సుమారు రెండు లక్షల మంది మన రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వస్తారనేది ఇటు ప్రభుత్వం అటు దేవాదాయ శాఖ వర్గాల అంచనా. ఇంతమంది భక్తులకు సరిపడా కనీస సౌకర్యాలు ప్రస్తుతం ఇక్కడ లేవు. పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల ద్వారా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. రూ.200 కోట్లకు ప్రతిపాదనలు పంపితే రూ.37 కోట్లకు మాత్రమే అనుమతి లభించింది. ఈ అరకొర నిధులతో ఏ మేరకు అభివృద్ధి పనులు చేపడుతారనేది సమీక్ష సమావేశంలో కలెక్టర్ తీసుకునే నిర్ణయంపైనే ఇది ఆధారపడి ఉంది. బోరు నీటితో అభిషేకం గోదావరి, ప్రాణహిత, సరస్వతి(అంతర్వాహిని) నదుల సంగమ క్షేత్రంగా విరాజిల్లుతున్న కాళేశ్వరంలో ఒకే పానవట్టంపై కొలువైన కాళేశ్వర-ముక్తీశ్వర స్వామివార్లకు నిత్యం బోరు నీటితోనే అభిషేకం చేస్తున్నారు. గోదావరి నుంచి ఆలయానికి నీటి సరఫరా లేకపోవడంతో ఆలయ అర్చకులు తప్పసరి పరిస్థితుల్లో బోరు నీటిని వినియోగిస్తున్నారు. ఈ సమస్య మొదటి నుంచి అర్చకులను, భక్తులను ఇబ్బంది పెడుతున్నా పరిష్కారం కావడం లేదు. కేవలం రూ.5లక్షలు వెచ్చించి గోదావరి నుంచి పైపులైను ఏర్పాటు చేస్తే నదీ జలంలో స్వామివారికి అభిషేకం చేసే భాగ్యం కలుగుతుంది. భక్తులకు నీడ కరువే.. కాళేశ్వరం ఆలయంలో శివరాత్రి సందర్భంగా జరిగే జాతరకు వచ్చే భక్తులకే సరిపడా సౌకర్యాలు లేవు. ఇక పన్నెడు రోజుల పాటు జరిగే పుష్కరాల్లో ప్రతి రోజు వచ్చే రెండులక్షల మందికి సరిపడా వసతులు ఎలా అనేది ప్రశ్న. జాతరకు వచ్చే భక్తులు ఆలయ ఆవరణలోని చెట్లు చేమల నీడన సేద తీరాల్సిందే. ఆలయంలో ప్రస్తుతం టీటీడీ వారు నిర్మించిన సత్రంలో 15 గదులకు 5గదులు మాత్రమే భక్తుల కోసం సిద్ధంగా ఉన్నాయి. రాజరాజేశ్వర స్వామి వారి సత్రంలో 20 గదులు ఉన్నప్పటికీ అనేక గదులు విధులకు వచ్చే వివిధ శాఖలకే కేటాయించడం జరుగుతోంది. సింగరేణి గెస్ట్‌హౌస్‌లో ఉన్న 7గదులు వీఐపీల కోసమే కేటాయిస్తున్నారు. ఇవికాకండా మరో మూడు వసతిగృహాలు ఉన్నప్పటికీ అవి దాతల సహాయంతో నిర్మించినవి కావడం వల్ల దాతలు వస్తే వారికే ఆయా వసతిగృహాలను కేటాయిస్తారు. భక్తులకు రాజరాజేశ్వర స్వామి సత్రంలో ఉన్న రెండు హాళ్లు, ఆలయ ఆవరణలోని మూడు రేకుల షెడ్లు మాత్రమే నీడనిస్తాయి. పుష్కరాలు వర్షాకాంలో వస్తుండటంతో భక్తులకు సరిపడా డార్మెటరీలు నిర్మించాల్సి ఉంది. వీటితో పాటు ఆలయ ఆవరణతో పాటు గోదావరి ప్రాంతంలో స్నానపు గదులు, మరుగుదొడ్లను నిర్మించాల్సి ఉంది. పుష్కరాల నిధుల్లో ఏడు డార్మెటరీ భవనాల కోసం రూ.28లక్షలకు ప్రతిపాదనలు పంపగా వాటికి అవకాశం లభించలేదు. డార్మెటరీ భవనాలకు నిధులు మంజూరు చేస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు. స్నాన ఘట్టాలు పెంచాలి ప్రస్తుతం గోదావరి నది ఒడ్డుపై సుమారు వంద మీటర్ల వరకే స్నానఘట్టాలు నిర్మించి ఉన్నాయి. వర్షాకాలం పుష్కర భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న ఘాట్‌కు రెండు వైపులా సుమారు మూడు వందల మీటర్ల వరకు స్నానఘట్టాలను నిర్మించాల్సి ఉంది. శ్రాద్ధమండపాలు నిర్మించాలి కాళేశ్వరంలో పిండప్రదానాలు ఎక్కువగా చేస్తుంటారు. కాని గోదావరి తీరంలో శ్రాద్ధమండపాలు అందుబాటులో లేవు. పుష్కరాల్లో ఎక్కువ మంది భక్తులు పిండ ప్రదానాలు చేయడం ఆనవాయితీ. దీంతో ఇక్కడ మూడు శ్రాద్ధ మండపాలు నిర్మిస్తే సౌకర్యంగా ఉంటుందని ఆలయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇరుకు రోడ్లు, పార్కింగ్ కరువు కాళేశ్వరం వచ్చే భక్తులు బస్టాండ్ నుంచి గోదావరి నది వరకు వెళ్లే రోడ్డు ఇరుకుగా ఉండటం వల్ల శివరాత్రి, ఇతర జాతరల సమయాల్లోనే భక్తులకు అనేక ఇబ్బందులు కలుగుతూ ట్రాఫిక్ జామ్ అవుతోంది. బస్టాండ్ నుంచి గోదావరి వరకు గల రోడ్డును ప్రస్తుతం ఉన్న దానికంటే రెట్టింపుగా నిర్మించాల్సి ఉంది. రోడ్డుతో పాటు వాహనాల పార్కింగ్ కోసం స్థలం లేకపోవటం కారణంగా సాధారణ భక్తుల వాహనాలు గోదావరి నదికి చాలా దూరంలో నిలిపివేస్తున్నారు. వీఐపీలు వారి బంధువుల వాహనాలకు గోదావరి వరకు అనుమతి ఇస్తున్నారు. ఈ కారణంగా సాధారణ భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాల పార్కింగ్ గోదావరి ప్రాంతంలో కాకుండా గ్రామం మొదట్లోనే ఏర్పాటు చేయాలి. పది గంటలే విద్యుత్ సరఫరా ఆలయంతో పాటు కాళేశ్వరం బస్టాండ్ నుంచి గోదావరి వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. పుష్కరాల సమయంలో రాత్రి పగలు ఆలయం తెరిచి ఉండటం, పుష్కర స్నానాలు ఆచరించటానికి వచ్చే భక్తులు ముఖ్యంగా మహిళలకు ఇబ్బందులు కలగకుండా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం క్షేత్రంలో కేవలం పది గంటలే విద్యుత్ సరఫరా జరుగుతుండగా, 24 గంటలు విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలి. ఆలయంలోకి వెళ్లే భక్తులకు క్యూలైన్ల నిర్మించి వాటిపై ఫైబర్ షెడ్లు ఏర్పాటు చేయాలి. సాధారణ సమయాల్లోనే భక్తులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూస్తున్న అధికారులు పుష్కర సమయంలో వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా ఎన్నో ఏర్పాట్లను చేయాల్సి ఉంది. లేకుంటే పుష్కర భక్తులకు అష్టకష్టాలు తప్పవు.