ఖమ్మంక్రైం : పుష్కరాల్లో జిల్లా పోలీస్ యంత్రాంగం తీసుకునే చర్యలు చాలా కీలకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి అన్నారు. గురువారం రాత్రి ఎస్పీ క్యాంపు కార్యాలయంలోని మినీకాన్ఫరెన్స్‌హాలులో పోలీస్ అధికారులతో ఆయన పుష్కరాలపై సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న గోదావరి పుష్కరాలకు ఎంతో వ్యయ ప్రయాసలతో పుష్కర స్నానాలు ఆచరించేందుకు వస్తున్న భక్తులకు ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. భక్తులు తిరిగి తమ స్వస్థలాలకు క్షేమంగా వెళ్లేంతవరకు అన్ని శాఖల సమన్వయంతో పోలీసులు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
డిజిటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా దైవదర్శనానికి ఎంత సమయం పడుతుంది, ఎంతమంది భక్తులు పుష్కర ఘాట్లలో ఉన్నారు. అలాగే దైవదర్శన క్యూలో ఎంత మంది ఉన్నారనే సమాచారాన్ని భక్తులకు తెలి పేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. పుష్కరఘాట్ల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నట్లయితే అక్కడే ఉన్న వాచ్‌టవర్ ద్వారా పోలీస్ అధికారులను అప్రమత్తం చేయడం, కొంతసమయం భక్తులను నిలిపి రద్దీ తగ్గిన తర్వాత యథావిధిగా కొనసాగించాలని సూచించారు.
ఎస్పీ షానవాజ్‌ఖాసిం మాట్లాడుతూ జూలై 14 నుంచి 25 వరకు జరిగే గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ప్రతి రోజు ఎంతమంది భక్తులు వస్తున్నారనే విషయాన్ని పోలీస్ చెక్‌పోస్టుల ద్వారా వచ్చే సమాచారాన్ని బట్టి కార్యాచరణ రూపొందించి, అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్న ట్లు తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ సాయికృష్ణ, డీఎస్పీలు అశోక్‌కుమార్, దక్షిణామూర్తి, రాంరెడ్డి, సురేందర్‌రావు, కవిత, వీరేశ్వరరావు, రాజేష్, సాయిశ్రీ, ఏఆర్ డీఎస్పీ సంజీవ్, సీఐలు రమణమూర్తి, శ్రీనివాసరెడ్డి, నరేష్‌రెడ్డి, రహమాన్, అంజలి పాల్గొన్నారు.
పుష్కరాల్లో పోలీసులే కీలకం
Published Fri, Jul 10 2015 5:00 AM | Last Updated on Thu, Mar 21 2019 7:25 PM
Advertisement