మాస్టర్ ప్లాన్ మారింది...
బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్‌పై నిరాసక్తత
నదిలోకి వెళ్లి స్నానం చేస్తున్న భక్తులు
నీటి ప్రవాహం వెంట ఏర్పాట్లకు సిద్ధమైన యంత్రాంగం
పగటి వేళ 35 డిగ్రీ సెల్సియస్ దాటిన ఉష్ణోగ్రత
నీటి కంటే నీడలేమితోనే భక్తుల ఇబ్బందులు
హన్మకొండ : నాలుగు నెలల క్రితం రూ పొందించిన ప్రణాళిక, రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన అభివృద్ధి పనులు పుష్కరాల వేళ అ క్కరకు రాకుండా పోతున్నాయి. గోదావరి న దిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండడం, తీ రం వెంట చేపట్టిన ఏర్పాట్లు నిరుపయోగమయ్యూరుు. దీంతో నదీ తీరం నుంచి సుమారు కిలో మీటరు వరకు కొత్తగా ఏర్పాట్లు చేయూ ల్సి వస్తోంది. ఈ మేరకు బుధవారం జిల్లా క లెక్టర్ కరుణ, ఐటీడీఏ పీవో అమయ్‌కుమార్, ములుగు ఆర్డీవో మహేందర్ పుష్కరఘాట్లు సందర్శించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రణాళిక రూపొందించారు. ఏర్పాట్లు చేయడంలోనూ నిమగ్నమయ్యారు.
బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్‌పై నిరాసక్తత
జిల్లాలో ముల్లకట్ట, రామన్నగూడెం, మంగపేటలో మూడు పుష్కరఘాట్లు ఏర్పాటు చేశా రు. భక్తులు స్నానం చేసేందుకు వీలుగా బ్యా టరీ ఆఫ్ ట్యాప్స్ బిగించారు. మహిళలు దు స్తులు మార్చుకునేందుకు గదులు, పిండప్రదానాలు తదితర పూజలు చేపట్టేందుకు వీ లుగా గదులు, షెడ్డులు ఏర్పాటు చేశారు. గో దావరి గట్టుపైనే వైద్య శిబిరం, మంచినీటి తదితర సౌకర్యాలు కల్పించారు. అయితే వ ర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నదిలో తగి నంత నీటి ప్రవాహం లేదు. ముల్లకట్ట, రామన్నగూడెంలో గట్టు నుంచి కిలోమీటరుకు పై గా దూరంలో నీటి ప్రవాహం ఉంది. మంగపేటలో సుమారు50 అడుగుల దూరం వెళ్తేనే నీ టి లభ్యత ఉంది. గోదావరి నదిలోని నీటి ప్ర వాహంలోనే పుణ్యస్నానాలు చేసేందుకు భక్తు లు ఆసక్తి చూపిస్తున్నారు. గట్టు సమీపంలో పుష్కరఘాట్ మెట్ల వద్ద ఏర్పాటు చేసిన బ్యా టరీ ఆఫ్ ట్యాప్స్ కింద స్నానం చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. సుమారు కిలోమీటరు దూరంలోని నీటి ప్రవాహంలోకి వెళ్లి భ క్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. బు ధవారం భక్తులను తరలించేందుకు ట్రాక్టర్లు ఏర్పాటు చేశారు. అరుుతే, మంగళ, బుధవారాల్లో మధ్యాహ్నం వేళ 35డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. వీరు సేదదీరేందుకు రామన్నగూడెంలో మూడు, మంగపేటలో మూడు షామియానాలు ఏర్పాటు చేశారు.
పనులు వేగవంతం చేయూలి..
నదీ ప్రవాహంలోనే భక్తులు పుణ్యస్నానాలు చేస్తుండడంతో అక్కడ చలువ పందిళ్లు నిర్మించాలని, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక ఏర్పాటు ్లయుద్ధప్రాతిపదికన చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. మంచినీటి సౌకర్యం కల్పనతోపాటు పిండప్రదానలు, పుష్కరశాంతి తదితర పూలు చేసేందుఉ ఏర్పాట్లు చేయూల్సి ఉంది. తొలి రోజు జిల్లాలోని మూడు పుష్కరఘాట్లలో సుమారు 15వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. రెండోరోజు రెండు పుష్కరఘాట్లలోనే దాదాపు 50వేల మంది పుష్కర స్నానాలు ఆచరించారని అంచనా. గురువారం అమవాస్య కావడంతో పిండప్రదానం వంటి కార్యక్రమాలు అధికంగా చేపడతారని, ఆ తర్వాత శని, ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈమబేరకు ఏర్పాట్లు వేగవంతం చేయూల్సి ఉందంటున్నారు. మరోవైపు రాజమండ్రి దుర్ఘటన నేపథ్యంలో హైదరాబాద్, ఇతర జిల్లాల భక్తులు వరంగల్ జిల్లాలో జరిగే పుష్కరాలకు హాజరయ్యేం దుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుం డా ఉండేందుకు వీలుగా నదిలో నీటిప్రవహాం ఉన్న చోట సౌకర్యాలు కల్పించాలి.