developments
-
Telangana: బంగ్లాదేశ్ పరిణామాలపై పోలీస్ శాఖ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: బంగ్లాదేశ్ పరిణామాలపై తెలంగాణ పోలీస్‌శాఖ అలర్ట్ అయ్యింది. బంగ్లాదేశ్ ఉద్రిక్తత పరిస్థితులపై హైదరాబాద్‌లో పోలీసులు నిఘా ఉంచారు. హైదరాబాద్‌లో ఉన్న బంగ్లాదేశీయులపై నిఘా పెట్టారు. హైదరాబాద్‌కి అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల ప్రకారం చర్యలు తీసుకుంటామని డీజీపీ జితేందర్ వెల్లడించారు.ఎలాంటి పరిణామాలనైన ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సిద్ధంగా ఉందన్న డీజీపీ.. బాలాపూర్ పరిధిలో ఐదువేల మందికిపైగా రోహింగ్యాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో వారికి గుర్తింపు కార్డులు వచ్చాయని సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఇతర దేశాల నుండి వచ్చే వారిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని.. అలాగే, రాచకొండ కమిషనరేట్ పరిధిలో నివసిస్తున్న రోహింగ్యాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందని సీపీ పేర్కొన్నారు. -
యాదాద్రిలో అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన టీటీఏ టీమ్
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ సేవాడేస్ కార్యక్రమాలు తెలంగాణలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లాలో పర్యటించిన టీటీఏ టీమ్ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం వలిగొండలో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. టిటిఎ ఫౌండర్ డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి స్వయంగా నిర్మించిన వెంకటేశ్వర ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా కాలేజీ విద్యార్థుల కోసం మల్లారెడ్డి కంప్యూటర్, ఫర్నిచర్ వంటివి అందించడంపై ప్రిన్సిపల్ లక్ష్మీకాంత్ ధన్యవాదాలు తెలిపారు . అనంతరం మల్లారెడ్డి స్వస్థలం సుంకిశాలకు చేరుకోని అక్కడ పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సుంకిశాల గ్రామంలో మల్లారెడ్డి స్కూల్, కాలేజ్, దేవాలయాలు నిర్మించి చాలా అభివృద్థి చేశారని గ్రామస్థులు కొనియాడారు. మల్లారెడ్డి చేస్తున్న పలు సేవాకార్యక్రమాలను వారు ప్రశంసించారు. -
నాలుగేళ్లలో ఏపీ వైద్యరంగంలో విప్లవాత్మక సంస్కరణలు
-
మన బడి నాడు-నేడుతో పాఠశాలల్లో ఆధునిక వసతులు
-
సర్వశ్రేయో నిధితో ఆలయాల అభివృద్ధి
విజయనగరం టౌన్: జీర్ణోద్ధరణకు గురైన ఆలయాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. సర్వశ్రేయోనిధి (సీజీఎఫ్, కామన్ గ్రాంట్ ఫండ్) కింద జిల్లాకు రూ.20 కోట్లు కేటాయించింది. జిల్లాలోని 44 ఆలయాల అభివృద్ధి పనులను చేపట్టింది. పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆలయాలు కొత్తశోభను సంతరించుకుంటుండడంతో భక్తులు సంతోషపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై అర్చకులు, ఆయా ఆలయాల అధికారులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో మొత్తం 461 ఆలయాలు ఉన్నాయి. ఇందులో రూ.25 లక్షలకు పైబడి వార్షిక ఆదాయం వస్తున్న 6 (ఎ) కేటగిరీకి చెందిన ఆలయాలు 6 వరకూ ఉన్నాయి. రూ.2లక్షలు పైబడి వార్షిక ఆదాయం వస్తున్న 6 (బి) కేటగిరీకి చెందిన ఆలయాలు 15 వరకూ ఉన్నాయి. వీటితో పాటు 6(సి) కేటగిరీలో రెండు లక్షల రూపాయలలోపు ఆదాయం ఉన్న ఆలయాలు 30 వరకూ ఉన్నాయి. ఇవి కాకుండా మిగతా ఆలయాలకు ఎటువంటి ఆదాయం లేదు. వీటిలో అధిక ఆలయాలు జీర్ణోద్ధరణకు గురయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సర్వ శ్రేయోనిధి కింద రూ. 20 కోట్లు కేటాయించడంతో జిల్లాలో 44 ఆలయాలు అభివృద్ధికి నోచుకుంటున్నాయి. ఇటీవల కాలంలో రామతీర్థం బోడికొండపైన నూతనంగా నిర్మాణమైన ఆలయమే దీనికి నిదర్శనం. దాంతో పాటు రామతీర్థం ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించడం విశేషం. విజయనగరం డివిజన్ పరిధిలో ఇప్పిలి వీధి శ్రీరామమందిరానికి రూ. 20 లక్షలు, నాగవంశపు వీధి రామమందిరానికి రూ.50 లక్షలు, మండపం వీధి సంపత్ వినాయకస్వామి ఆలయానికి రూ.75 లక్షలు, కొత్తపేట రామమందిరానికి రూ.50 లక్షలు, గాయత్రీనగర్ వెంకటేశ్వరస్వామి ఆలయానికి రూ.40 లక్షలు, బోయవీధి రామమందిరానికి రూ.20 లక్షలు, పల్లివీధి కోదండరామాలయానికి రూ.40 లక్షలు, మండపం వీధి జగన్నాథస్వామి పురాణకాలక్షేప మండపానికి రూ. 80లక్షలను ప్రభుత్వం కేటాయించింది. వీటితో పాటు అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి రూ.50 లక్షలు కేటాయింపులు జరిగాయి. చీపురుపల్లి డివిజన్ పరిధిలో నిమ్మలవలస గ్రామం శ్రీరామమందిరానికి రూ.30 లక్షలు, గరివిడి మండలం ఆర్తమూరు కోదండరామాలయానికి రూ.40 లక్షలు, మెరకముడిదాం పులిగుమ్మి రామాలయానికి రూ. 30 లక్షలు, చీపురుపల్లి కనకమహాలక్ష్మి ఆలయానికి రూ.15 లక్షలు, గరివిడి నీలాద్రిపురం రామాలయానికి రూ.25 లక్షలు, రామతీర్థం శ్రీరామస్వామి దేవస్థానానికి కోటి రూపాయలు, బోడికొండపై కోదండరామ ఆలయ నిర్మాణానికి రూ. 3 కోట్లు కేటాయించింది. పోలిపల్లి గ్రామం పైడితల్లి ఆలయానికి రూ. 50 లక్షలు, భోగాపురం మండలం నందిగాం రామలింగేశ్వరస్వామి ఆలయానికి రూ.50 లక్షలు, చీపురుపల్లి మండలం పత్తికాయలవలసలో ఉన్న శ్రీరామమందిరానికి రూ.16 లక్షలు, చీపురుపల్లి మండలం పర్లలో ఉన్న శ్రీరామాలయానికి రూ.40 లక్షలు, మెంటాడలో ఉన్న సీతారామఆలయానికి రూ. 25లక్షలు మంజూరు చేసింది. ఎస్.కోట డివిజన్ పరిధిలో కొత్తవలస గులివిందాడ శ్రీరామలయానికి రూ.40 లక్షలు, ఎల్.కోట జమ్మాదేవిపేట రామాలయానికి రూ. 44 లక్షలు, గంట్యాడ పెదవేమలి శ్రీరామాలయానికి రూ.16 లక్షలు, వేపాడ రామయ్యపేట రాములవారు, బంగారమ్మ తల్లి ఆలయానికి రూ.20 లక్షలు, గంట్యాడ కొర్లాం శ్రీరామాలయానికి రూ.40 లక్షలు, జామి శ్రీరామాలయానికి రూ.50 లక్షలు ఎల్.కోటకొత్తపాలం మల్లివీడు పంచాయతీ శ్రీరామాలయానికి రూ.30 లక్షలను కేటాయించింది. ఎల్.కోట రాగరాయిపురం భూలోకమాత ఆలయానికి రూ.30 లక్షలు, వేపాడ వల్లంపూడి సీతారామస్వామి ఆలయానికి రూ.50 లక్షలు, కొత్తవలస గనిశెట్టిపాలెం శ్రీరామాలయానికి రూ.19లక్షల 30వేలు, ఎస్.కోట గవరపాలెం శ్రీరామాలయానికి రూ.40 లక్షలు, ఎస్.కోట పుణ్యగిరి ధారగంగమ్మ, శివాలయానికి రూ.30 లక్షలు కేటాయింపులు జరిపింది. బొబ్బిలి రెవెన్యూ డివిజన్ పరిధిలోని గరుగుబిల్లి తోటపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి రూ.83 లక్షలు, సాలూరు వడ్డివీధి రామాలయానికి రూ. 13 లక్షలు, సీతానగరం కాసాపేట శ్రీరామాలయానికి రూ.40 లక్షలు, సీతానగరం నిడగల్లు శ్రీ నీలకంఠేశ్వరస్వామి ఆలయానికి రూ. 50 లక్షలు, కొమరాడ దేవునిగుంప సోమేశ్వరస్వామి ఆలయానికి రూ. 50 లక్షలు, బొబ్బిలి కారడ గ్రామంలో ఉన్న ఉమారామలింగేశ్వరస్వామి ఆలయానికి రూ.40 లక్షలు, పార్వతీపురం పిట్టలవలస నీలకంఠేశ్వరస్వామి ఆలయానికి రూ. 25 లక్షలు, మక్కువ డి.సిర్లం సంగమేశ్వరస్వామి ఆలయానికి రూ. 49 లక్షలు, గరివిడి నీలాద్రిపురం శ్రీరామాలయానికి రూ. 25 లక్షలు, బాడంగి మండలం ముగడలో ఉన్న శ్రీరామమందిరానికి రూ. 12 లక్షలు, రేజేరులోని శ్రీరామమందిరానికి రూ. 12 లక్షలు కేటాయించింది. కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తికాగా, మరికొన్ని చోట్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయాల పునర్నిర్మాణంతో ఆయా గ్రామాల్లో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి. శరవేగంగా పునరుద్ధరణ పనులు ప్రభుత్వం సర్వశ్రేయోనిధి కింద మంజూరు చేసిన నిధులతో ఆలయాలు పునరుద్ధరణ పనులు చేపట్టాం. ప్రస్తుతం శరవేగంగా పనులు జరుగుతున్నాయి. రామతీర్థంలోని బోడికొండపై కోదండరామస్వామి ఆలయ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. కొండకింద రామస్వామి ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు దేవాలయాల పునరుద్ధరణ, కొత్తదేవాలయాల నిర్మాణ పనులకు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను కేటాయించేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికోసం జిల్లా నుంచి 54 దరఖాస్తులు అందాయి. – జె.వినోద్‌కుమార్, దేవదాయశాఖ సహాయకమిషనర్, విజయనగరం (చదవండి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం) -
చెరువులను పరిరక్షించండి
సాక్షి, సిటీబ్యూరో: హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల అభివృద్ధి, పరిరక్షణకు, చెరువుల సుందరీకరణకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలు చేపట్టాలని అధికారులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. హెచ్ఎండీఏ కార్యకలాపాలు, చేపట్టిన ప్రాజెక్టులపై శనివారం నానక్‌రామ్ గూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎండీఏ పరిధిలో చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టులు, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన అంశాలపై అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చెరువుల సంరక్షణపై ప్రత్యేకంగా చర్చించారు. నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ సైతం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చెరువుల సంరక్షణకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని కేటీఆర్ సూచించారు. హెచ్ఎండీఏతో పాటు జీహెచ్ఎంసీ కూడా అనేక చెరువులను అభివృద్ధి చేస్తోందని, ఈ మేరకు రెండు సంస్థలు సమన్వయంతో ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. గండిపేట సుందరీకరణను మరింత వేగంగా విస్తృతస్థాయిలో చేపట్టాల్సిన అవసరం ఉందని, ఇది అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా మారుతుందన్నారు. భూముల భద్రతపై దిశానిర్దేశం.. మరోవైపు హెచ్ఎండీఏ అదీనంలోని ప్రభుత్వ భూములను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రేడియల్ రోడ్లు, మూసీ ప్రక్షాళన, మూసీపై బ్రిడ్జీల నిర్మాణం, హెచ్ఎండీఏ ల్యాండ్ పూలింగ్ ప్రణాళికలు, లాజిస్టిక్ పార్కుల నిర్మాణం, రానున్న స్వల్ప , దీర్ఘకాలిక భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రణాళికలపై అధికారులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. -
వైరల్: అభివృద్ధి అన్నందుకు యువకుడి చెంప చెల్లుమనిపించిన ఎమ్మెల్యే
చంఢీగడ్: సాధారణంగా ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం సహజం. కానీ ఓ రాజకీయ నాయకుడిని అతని నియోజకవర్గంలోని అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఓ యువకుడిని చితకబాదాడు. ఈ షాకింగ్ ఘటన పంజాబ్‌లోని పఠాన్‌కోటలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో రాజకీయ దుమారం రేగింది. దీంతో అక్కడి అధికార పార్టీకి ఈ ఘటన తలనొప్పిగా మారింది. ఆ వీడియోలో.. పఠాన్‌కోట్ జిల్లాలోని బోయా నియోజకవర్గ ఎమ్మెల్యే జోగిందర్ పాల్ స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎమ్మెల్యే ప్రసంగం కొనసాగుతుండగా ఓ యువకుడి వచ్చి నియెజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో తెలపాలని ప్రశ్నిస్తాడు. దీంతో అతని ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది పోయి కోపంతో ఊగిపోయిన ఎమ్మెల్యే ఆ యువకుడిని చెంప చెల్లుమనిపించారు. అంతేకాకుండా అక్కడ ఉన్న పోలీసులు, ఇతర నేతలు కూడా ఆ వ్యక్తిని చితకబాదారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. రాష్ట్ర హోం మంత్రి సుఖ్జీందర్ సింగ్ రాంధవా ఈ అంశంపై మాట్లాడుతూ: "ఎమ్మెల్యే ఈ విధంగా ప్రవర్తించకూడదు. మేము ప్రజా ప్రతినిధులు, వారికి సేవ చేయడానికి ఇక్కడ ఉన్నామని తెలిపారు. దెబ్బలు తిన్న ఆ యువకుడి తల్లి తన కుమారుడు ప్రజా నాయకుడిని ఒక సాధారణ ప్రశ్న అడిగినందుకు ఇంత దారుణంగా కొట్టడమేంటని ఆవేదన వ్యక్తం చేసింది. Joginder Pal, the @INCPunjab MLA from Bhoa assembly seat in Pathankot district, when asked by a young man about his performance in the last 4.5 years....this is how the MLA responded....@ndtv pic.twitter.com/p2AVSOtqjx— Mohammad Ghazali (@ghazalimohammad) October 20, 2021 -
ప్రతి బడిలో 10 మార్పులు
-
సర్జికల్ నీడిల్ తయారీకి మూలం ఈ కందిరీగే!
సాక్షి సెంట్రల్ డెస్క్: ప్రకృతి నిండా ఎన్నో టెక్నాలజీలు. ప్రతి సమస్యకు, ప్రతి అవసరానికి ప్రకృతిలో ఓ పరిష్కారం రెడీగా ఉంటుంది. దాన్ని గుర్తించి, మన అవసరాలకు తగినట్టుగా మలచుకోగలిగితే చాలు. ఎప్పుడో ఆది మానవుల నుంచి ఇప్పుడు గొప్ప గొప్ప శాస్త్రవేత్తల దాకా ప్రకృతి నుంచి స్ఫూర్తి పొంది ఆవిష్కరణలు చేసినవారే. ఈ మధ్య కూడా అలాంటివెన్నో కనిపెట్టారు. నేడు (మే 11న) నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా అలాంటి కొన్ని ఆవిష్కరణలేంటో చూద్దామా? ► కందిరీగ.. సర్జరీ నీడిల్ అవసరం: మెదడు వంటి అత్యంత సున్నిత అవయవాలకు సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు.. కణాలు దెబ్బతినకుండా వాడగలిగే నీడిల్ ప్రకృతి పరిష్కారం: ఓ రకం కందిరీగ వుడ్ వాస్ప్‌గా పిలిచే ఓ రకం కందిరీగ.. తన తొండం వంటి నిర్మాణంతో చెట్ల కాండానికి రంధ్రాలు చేసి గుడ్లు పెడుతుంది. శాస్త్రవేత్తలు దీని ఆధారంగా మెదడు శస్త్రచికిత్స కోసం ఉపయోగించే ప్రత్యేకమైన నీడిల్‌ను రూపొందించారు. ► తిమింగలాలు.. మోటార్ బ్లేడ్లు అవసరం: గాలి ద్వారా కరెంటు ఉత్పత్తి చేసే విండ్ టర్బైన్లు మరింత సమర్థవంతంగా, తక్కువ ధ్వని చేస్తూ పనిచేయాలి. ఉత్పత్తి సులువు కావాలి. ప్రకృతిలో దొరికిన పరిష్కారం: హ్యాంప్బ్యాక్ తిమింగలం రెక్కలు ఈ రకం తిమింగలాల్లో రెక్కల అంచులు ఎగుడుదిగుడుగా ఓ ప్రత్యేక నిర్మాణం (ట్యూబర్కల్స్) తో ఉంటాయి. దీంతో వేగంగా ఈదగలుగుతాయి. దీనిని స్ఫూర్తిగా తీసుకున్న వేల్ పవర్ కార్పొరేషన్ సంస్థ విండ్ టర్బైన్ల రెక్కల అంచులకు ట్యూబర్కల్స్ డిజైన్‌ను చేర్చింది. దీనివల్ల టర్బైన్ల సామర్థ్యం పెరిగినట్టు గుర్తించింది. ఈ మోడల్‌ను టర్బైన్లకే గాకుండా ఫ్యాన్లు, కంప్రెసర్లు, మోటార్లలోనూ వాడొచ్చని చెబుతోంది. ► ఆల్చిప్పలు.. ఆక్సెటిక్ మెటీరియల్ అవసరం: గట్టిగా సాగదీసినా, తీవ్ర ఒత్తిడికి లోనైనా ఎదుర్కొని.. మరింత మందంగా, బలంగా మారే మెటీరియల్ (ఆక్సెటిక్) తయారీ. ప్రకృతిలో దొరికిన పరిష్కారం: ఆల్చిప్పలు ఆల్చిప్పల లోపలి పొర నిర్మాణం ‘ఆక్సెటిక్’తరహాలో ఉంటుంది. ఆల్చిప్పను తెరవడానికి ప్రయత్నించిన కొద్దీ ఆ పొర మరింత మందంగా, బలంగా మారి అడ్డుకుంటుంది. ఆ పొర నిర్మాణం తీరును గుర్తించిన శాస్త్రవేత్తలు.. వివిధ ఆక్సెటిక్ మెటీరియల్స్‌ను రూపొందించారు. క్రీడా పరికరాల్లో, ఔషధ రంగంలో, ప్యాకింగ్‌లో వాటిని వినియోగిస్తున్నారు. ► నత్తలు.. ఆపరేషన్ గ్లూ అవసరం: శరీరంలో ఏదైనా అవయవానికి శస్త్రచికిత్స చేసినప్పుడు కోతపెట్టిన భాగాలు తిరిగి అతుక్కునేందుకు వీలయ్యే గమ్. ప్రకృతిలో దొరికిన పరిష్కారం: నత్తలు నత్తలు ముందుకు కదలడానికి శరీరం దిగువన ఓ జారుడు పదార్థాన్ని వదులుతూ ఉంటాయి. దాన్ని స్లగ్ స్లైమ్ అంటారు. ఇటు జారుడుగా ఉండటంతోపాటు కాస్త ఒత్తిడిపెడితే అత్యంత గట్టిగా అతుక్కునే జిగురుగానూ ఈ పదార్థం పనిచేస్తుంది. దీనిని స్ఫూర్తిగా తీసుకుని శాస్త్రవేత్తలు.. శస్త్రచికిత్సల్లో కోత పెట్టిన అవయవాలను అతికించే సూపర్ గ్లూను రూపొందించారు. ముఖ్యంగా గుండె ఆపరేషన్లు జరిగినప్పుడు ఈ సూపర్ గ్లూతోనే అతికించి ప్రాణాలు కాపాడుతున్నారు. ► షార్క్ చర్మం.. ఫాస్ట్ స్విమ్మింగ్ అవసరం: చాలా వేగంగా ఈత కొట్టడానికి వీలయ్యే దుస్తులు ప్రకృతి పరిష్కారం: షార్క్ చేపల చర్మం ఈత కొడుతున్నప్పుడు నీళ్ల నుంచి ఎదురయ్యే ఘర్షణ వల్ల వేగం మందగిస్తుంది. అయితే షార్క్ చేపలు నీళ్లలో అత్యంత వేగంగా ఈదగలుగుతాయి. వాటికి ఉన్న ప్రత్యేకమైన చర్మం నీటి ఘర్షణను అధిగమించేందుకు తోడ్పడుతుంది. దాని నుంచి స్ఫూర్తి పొందిన స్పీడో అనే కంపెనీ.. ఫాస్ట్ స్కిన్ పేరిట ప్రత్యేక దుస్తులను తయారుచేసింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో మెడల్స్ పొందిన 98 శాతం క్రీడాకారులు ఈ దుస్తులను ధరించినట్టు ఆ కంపెనీ తెలిపింది. ఆ తర్వాతి నుంచి ఈత పోటీల్లో ఆ దుస్తుల వాడకాన్ని నిషేధించారు. ► చెదలు.. చల్లటి ఇండ్లు అవసరం: ఏసీల వంటివి అవసరం లేకుండా సహజ సిద్ధంగా చల్లగా ఉండే ఇండ్లు. ప్రకృతి పరిష్కారం: చెదల పుట్టలు చెదలు పెట్టే పుట్టల నిర్మాణం విభిన్నంగా ఉంటుంది. ఆ పుట్టల డిజైన్ గాలి ధారాళంగా ప్రసరిస్తూ, చల్లగా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అదే తరహాలో అపార్ట్మెంట్లు, ఇండ్ల నిర్మాణానికి డిజైన్లు రూపొందించారు. ఇలాంటి డిజైన్‌తోనే జింబాబ్వేలోని హరారేలో ప్రఖ్యాత ఈస్ట్‌గేట్ సెంటర్‌ను నిర్మించారు. ► మంతా రేస్.. సూపర్ స్పీడ్ విమానాలు అవసరం: తేలికగా, తక్కువ ఇంధన వినియోగంతో వేగంగా, ఎక్కువ దూరం వెళ్లే విమానాలు ప్రకృతి పరిష్కారం: మంతా రేస్ మంతా రేస్ అనేవి బల్లపరుపుగా ఉండే ఓ రకం సముద్ర జీవులు. సముద్రంలో చప్పుడు రాకుం డా, వేగంగా దూసుకెళ్లే సామర్థ్యం వీటి సొంతం. ఈ మంతా రేస్ శరీర నిర్మాణాన్ని అనుసరించి బోయింగ్, నాసా శాస్త్రవేత్తలు ప్రత్యేక విమానాలను రూపొందిస్తున్నారు. బోయింగ్ కంపెనీ ఇప్పటికే ఎక్స్–48సీ మానవ రహిత విమానాన్ని తయారు చేసింది. ఇవి తక్కువ ఇంధనంతో వేగంగా, ఎక్కువ దూరం ప్రయాణించగలవు. -
ఆ విషయం రాష్ట్రపతికి తెలియజేశారా?
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రం కొత్త పుంతలు తొక్కుతోందని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. దళిత సంక్షేమానికి పెట్టని కోటగా పరిస్థితి కొనసాగుతుంటే టీడీపీ నాయకులు భరించలేక పోతున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు రాజన్నదొర, చెట్టి ఫాల్గుణలతో కలిసి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 'అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికిన టీడీపీ నేతల మాటలు నీటి మీద రాతలే అయ్యాయి. సీఎం జగన్ మాత్రం ఏడాది కాలంలోనే 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు ముందుకొచ్చారు. ఆయనలో అంబేద్కరిజం కనిపిస్తోంది. ఈమధ్య టీడీపీ నాయకులు ఢిల్లీ వెళ్తే ప్రజల ప్రయోజనాల కోసం ఏమైనా అడుగుతారేమోనని అనుకున్నాను. కానీ స్కాం కేసులో ఇరుక్కున్న మాజీ మంత్రులను విడిచిపెట్టాలని రాష్ట్రపతిని కలిశారని తెలిసింది. మాజీ సీఎం చంద్రబాబు సహాయకుడు శ్రీనివాసరావు అక్రమాస్తులు బయట పడినప్పుడు, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినప్పుడు ఈ విషయం రాష్ట్రపతికి తెలియజేశారా?’ అంటూ ప్రశ్నించారు. టీడీపీ పాలనలోచంద్రబాబు సొంతంగా రాజ్యాంగాన్ని అమలు చేశారే తప్పా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎక్కడా అమలు చేయలేదు. చంద్రబాబుకు రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం లేదని, గతంలో అన్ని రంగాలను నాశనం చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషనర్‌గా న్యాయ కోవిదుడైన దళితుడిని నియమిస్తే ఎందుకు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన వికేంద్రీకరణ కోసం మూడు ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని సీఎం జగన్ ఆలోచనలు చేస్తుంటే టీడీపీ నేతలు అమరావతిలో వ్యాపారాల కోసం అక్కడ ఉద్యమాలు చేస్తున్నారన్నారు. రాజధానిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తుంటే టీడీపీ నాయకులు అడ్డుకున్నారని మేరుగ నాగార్జున తెలిపారు. (చంద్రబాబు దళిత ద్రోహి: మేరుగ) అభివృద్ధి భయం పట్టుకుంది: రాజన్నదొర విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు స్వాగతిస్తున్నామని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. ఐదేళ్లూ ఉత్తరాంధ్రను పట్టించుకోని టీడీపీ నాయకులు.. ఇప్పుడు సీఎం జగన్ అభివృద్ధి చేస్తుంటే మాత్రం అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో గిరిజనులకు ఎంత ఖర్చు చేశారో, తమ ప్రభుత్వం ఏడాది కాలంలోనే ఎంత ఖర్చు చేశామన్నదానిపై చర్చకు సిద్ధమని రాజన్నదొర అన్నారు. టీడీపీ నాయకులకు జగన్మోహన్రెడ్డి అభివృద్ధి మంత్రం భయం పట్టుకుందని అన్నారు. టీడీపీ హయాంలో గిరిజనులకు మంత్రి పదవి ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. శవ రాజకీయం కోసం అర్హత లేని వ్యక్తికి ఆరు నెలలు మంత్రి పదవి ఇచ్చి మధ్యలోని తీసేసారంటూ దుయ్యబట్టారు. టీడీపీ ఐదేళ్ల కాలంలో కనీసం గిరిజన సలహా మండలి కూడా నియమించలేదని రాజన్నదొర పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు గిరిజనుల ద్రోహి సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను ఆదరించారని అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు. బీసీ ,ఎస్సీ ఎస్టీ మహిళలకు మంత్రులు, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గిరిజనులకు భూమి పట్టాలిస్తే ఇప్పడు సీఎం జగన్.. నాలుగింతలు ఎక్కువగా భూమి పట్టాలిచ్చారని పేర్కొన్నారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో చంద్రబాబునాయుడు బాక్సైట్ తవ్వకాల పేరిట గిరిజనుల ఆస్తులను దోచుకోవడానికే ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విశాఖపట్నం విజన్
విశాఖ నగరం మూడు వైపులా విస్తరిస్తోంది.అభివృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతోంది. వలసలతో రోజురోజుకు జనాభా పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలతోపాటు అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా విశాఖ మహా ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్డీఏ) మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. మరోవైపు నగరం ఆర్థికంగా, సామాజికంగా ఎలా ఎదగాలనే అంశంపైనా మాస్టర్ ప్లాన్‌కి అనుబంధంగా పర్స్పెక్టివ్ ప్లాన్‌కి తుదిమెరుగులు దిద్దుతోంది. సాక్షి, విశాఖపట్నం: వీఎంఆర్డీఏ పరిధిలో ప్రస్తుతం 46 మండలాలు, 1,312 గ్రామాలున్నాయి. మాస్టర్‌ప్లాన్ రూపొందించేందుకు విశాఖపట్నంలోని 5 వర్గాలు, 45 రెవెన్యూ, 55 మత్స్యకార గ్రామాలు, 13 వార్డులను పరిగణనలోకి తీసుకొని.. సలహాలు, సూచనలు ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా వివరాలు సేకరించారు. అలాగే విజయనగరం జిల్లాలోని 48 రెవెన్యూ, 19 మత్స్యకార గ్రామాలు, 5 వార్డులు, రెండు వర్గాల ప్రజల అభిప్రాయాలతోనూ, శ్రీకాకుళం జిల్లాలోని 32 రెవెన్యూ, 41 మత్స్యకార గ్రామాలు, 9 వార్డులు, రెండు వర్గాల అభిప్రాయాలతో రూపొందించారు. మొత్తం మూడు విభాగాల్లో విజన్‌ని ప్రాథమికంగా సిద్ధం చేశారు. ఆర్థిక, ఉపాధి, జనాభా అవకాశాలపై ప్రధానంగా దృష్టిసారించారు. 12.5 మిలియన్ల జనాభాను అంచనా వేస్తూ ప్రణాళిక రూపొందించారు. మొత్తం ఆదాయంలో పారిశ్రామిక రంగం 40 శాతం వాటా, సేవారంగం 50 శాతం, వ్యవసాయ రంగం వాటా 10 శాతంగా ఉండేలా అంచనాలు వేశారు. అదే విధంగా ఉద్యోగ, ఉపాధి కల్పనలో పారిశ్రామిక రంగంలో 28 శాతం, సేవా రంగంలో 45, వ్యవసాయ రంగంలో 27 శాతం ఉండేలా అంచనాలు రూపొందించారు. మొత్తం ఉద్యోగుల సంఖ్య 19 లక్షల నుంచి 56 లక్షలకు పెరుగుతుందని అంచనా వేశారు. మొత్తంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై వీఎంఆర్డీఏ విజన్ రూపొందించింది. మూడో మాస్టర్‌ప్లాన్ ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించేందుకు గత 35 సంవత్సరాలుగా వుడా మాస్టర్ ప్లాన్స్ రూపొందించింది. మొదటిసారిగా 1989 నుంచి 2001 వరకూ 1721 చ.కి.మీ విస్తీర్ణంలో మాస్టర్ ప్లాన్ అభివృద్ధి చేసింది. రెండోసారి 2006 నుంచి 2021 వరకూ 1,721 చ.కి.మీ విస్తీర్ణంలో మాస్టర్ ప్లాన్ చేశారు. ఇప్పుడు నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో 6,501.65 చ.కి.మీ విస్తీర్ణంలో 2041 వరకూ మాస్టర్ ప్లాన్ రూపుదిద్దుకుంటోంది. మొత్తంగా మాస్టర్ ప్లాన్‌ను 3 దశల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏఏ ప్రాంతాల్లో.. ఎలాంటి అభివృద్ధి..? మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా.. ఆ ప్రాంత భౌగోళిక స్థితిగతులను అనుసరించి విభిన్న కోణాల్లో అభివృద్ధి చెయ్యాలని మాస్టర్‌ప్లాన్‌లో వీఎంఆర్డీఏ సిద్ధమవుతోంది. వాటిని ఓసారి పరిశీలిస్తే... ఆరు దశల్లో పెర్స్పెక్టివ్ ప్లాన్ మాస్టర్ ప్లాన్‌కి అనుబంధంగా పర్స్పెక్టివ్ ప్లాన్‌ను వీఎంఆర్డీఏ రూపొందిస్తోంది. ఫీల్డ్ సర్వేలు, ట్రాఫిక్ సర్వేలు, బేజ్ మ్యాప్, అందుబాటులో ఉన్న భూ వినియోగం, వ్యూహాత్మక ప్రణాళిక, జోనల్ డెవలప్మెంట్ ప్లాన్లు.. ఇలా ఆరు దశల్లో 2051–పెర్స్పెక్టివ్ ప్లాన్‌పైనా కసరత్తులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ముసాయిదాపై ప్రాథమిక సమీక్షను స్టేక్హోల్డర్లతో వీఎంఆర్డీఏ ప్రతినెలా నిర్వహిస్తోంది. 46 మండలాలు.. 1,312 గ్రామాలు.. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తరించిన వీఎంఆర్డీఏ.. ఆ మేరకు ప్రణాళిక తయారు చేసింది. 2041 నాటికి జనాభా ఎంత పెరుగుతుంది. ఆర్థిక ప్రగతి ఎలా ఉండబోతుంది.? ఉద్యోగ కల్పన, ఏ ఏ అంశాలపై ప్రధానంగా దృష్టిసారించాలనే విషయాల్ని క్రోడీకరించారు. భోగాపురం విమానాశ్రయం నుంచి అచ్యుతాపురం పారిశ్రామిక కారిడార్ వరకూ ట్రాన్సిస్ట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్–టీఓడీ కారిడార్(రవాణా ఆధారిత అభివృద్ధి వ్యవస్థ) ఏర్పాటు చెయ్యనున్నారు. మెట్రో కారిడార్ వెంబడి ఆర్థిక అభివృద్ధి చెందేలా కారిడార్ ఏర్పాటు విజయనగరం, అనకాపల్లి, నక్కపల్లి, భీమిలి ప్రాంతాలు గణనీయంగా విస్తరించనున్న నేపథ్యంలో శాటిలైట్ టౌన్‌షిప్‌లు విస్తరణ. ఈ టౌన్‌షిప్‌లను అనుసంధానం చేస్తూ బీఆర్టీఎస్ కారిడార్లు ఏర్పాటు. ఏడు ప్రాంతాల్లో రవాణా స్టేషన్లు నిర్మాణం. అరకులోయ, బుద్ధిస్ట్ సర్క్యూట్, హిందూ దేవాలయాల సర్క్యూట్, బీచ్, కోస్టల్ టూరిజం, ఎకో టూరిజం అభివృద్ధి చేస్తూ పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు. సహజ సంపద, వ్యవసాయ భూముల పరిరక్షణ. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక. జోన్ల వారీగా వ్యూహాత్మక ప్రణాళిక ఎన్ఏడీ జంక్షన్ నుంచి పెందుర్తి వరకు.. చివరి వరకూ బీఆర్టీఎస్ కనెక్టివిటీ రహదారుల అభివృద్ధి మేఘాద్రి రిజర్వాయర్ ప్రాంతాన్ని ఆహ్లాదకరమైన పార్కు స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన ప్రాంతాభివృద్ధి, ఎంపిక చేసిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన గాజువాక–స్టీల్‌ప్లాంట్ పరిసరాలు నగర విస్తరణకు ప్రణాళికలు అంతర్గత రహదారుల విస్తరణ మెట్రో, సిటీ బస్సులతో నగర అంతర్గత రవాణా వ్యవస్థని అచ్యుతాపురం వరకూ మెరుగుపరచడం ఆటోనగర్, దువ్వాడ రైల్వే స్టేషన్ పరిసరాల్లో విభిన్న తరహా అభివృద్ధికి ప్రణాళికలు ఎన్‌హెచ్–16లో పాదచారుల రక్షణ వ్యవస్థకు ప్రణాళికలు భీమిలి పరిసరాల్లో.. జీవీఎంసీతో కలిసి బీచ్ రోడ్డు అభివృద్ధి హెరిటేజ్ ప్రాంతంతో పాటు పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ఫిషింగ్ హార్బర్ డెవలప్మెంట్ విశాఖపట్నం–విజయనగరం–భోగాపురం వరకూ రహదారుల అనుసంధానం భోగాపురం విమానాశ్రయం వరకూ టూరిజం అభివృద్ధి అనకాపల్లి పరిసరాలు నగర విస్తరణకు వ్యూహాత్మక ప్రణాళికలు విశాఖపట్నం నుంచి అనకాపల్లి, అచ్యుతాపురం ఇండ్రస్టియల్ ప్రాంతం వరకూ బస్ ఆధారిత రవాణా వ్యవస్థ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు బైపాస్ రహదారులు అనకాపల్లి టౌన్ ప్రధాన వీధిని పాదచారులకు అనుగుణంగా మార్పు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాంతాలకు రహదారుల సౌకర్యం విస్తరించడం. మధురవాడ పరిసరాలు నగర విస్తరణకు ప్రణాళికలు మెట్రో రైలు మార్గం ఐటీ హిల్స్ పరిసరాల్ని విభిన్న అవసరాలకు అనుగుణంగా సెజ్‌గా మార్పు పరిసర ప్రాంతాల్లో సామాజికాభివృద్ధి పోర్టు ఏరియా పరిసరాలు మెట్రో, సిటీ బస్సులతో రవాణా వ్యవస్థ మెరుగు బీఆర్టీఎస్ కారిడార్ అభివృద్ధి యారాడ, సింహాచలం ప్రాంతాల్లో ఆక్రమణలకు చెక్ చెప్పడం పెదవాల్తేరు, చినవాల్తేరు పరిసరాలు ప్రాంతాభివృద్ధికి ప్రణాళికలు మెట్రో, సిటీ బస్సు సౌకర్యాలు స్మార్ట్‌సిటీ, ప్రాంత ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టుల అమలు బీచ్‌ఫ్రంట్ రీ డెవలప్మెంట్ దసపల్లా హిల్స్ పరిసరాలు ఆయా ప్రాంతాల అభివృద్ధి హెరిటేజ్ ఏరియా సంరక్షణ, పరిసరాల అభివృద్ధి మెట్రో, సిటీ బస్సులతో కనెక్టివిటీ స్మార్ట్‌సిటీ, ప్రాంత ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టుల అమలు మార్చి నాటికి మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ వీఎంఆర్డీఏ పరిధిలో నివసిస్తున్న ప్రజలకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరి్ధష్ట ప్రణాళిక రూపొందిస్తున్నాం. దీనికి సంబంధించిన డేటా కలెక్షన్ పూర్తయింది. వచ్చిన వివరాలను పరిశీలన చేస్తున్నాం. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్‌ని మార్చి నెలాఖరునాటికి సిద్ధం చేస్తాం. విశాఖ నగరానికి సమాన పోలికలున్న కొచ్చిన్, చెన్నై, సూరత్, ముంబై నగరాల్ని అధ్యయనం చేసేందుకు సిద్ధమవుతున్నాం. ఈనెలలో కొచ్చిన్, చెన్నై నగరాలు, వచ్చే నెలలో సూరత్, ముంబై నగరాలకు మా బృందాలు వెళ్తున్నాయి. అక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అంశాలపై నివేదిక సిద్ధం చేసి.. ఆ తరహా పరిస్థితులు వీఎంఆర్డీఏ పరిధిలోని ప్రజలకు ఎదురవకుండా సమగ్ర మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. –పి.కోటేశ్వరరావు, వీఎంఆర్డీఏ కమిషనర్ -
అవమానాల నుంచి..విప్లవాలనెంచి
తినేందుకు తిండి లేదు.. రోగమొస్తే మందుబిళ్లకూ దిక్కులేని స్థితి.. గణతంత్ర రాజ్యంగా అవతరించినప్పుడు ఇదీ భారత్ పరిస్థితి! మరి ఇప్పుడు.. అన్ని రంగాల్లోనూ స్వయంసమృద్ధి.. అగ్రరాజ్యాల కళ్లు కుట్టే స్థాయిలో ఆర్థిక అభివృద్ధి! శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో భారత్ ఘన విజయాలను తరచిచూస్తే.. హరిత విప్లవం విజయాలు.. 1947 నాటికి గోధుమ దిగుబడి 60 లక్షల టన్నులు వరి దిగుబడి 24 లక్షల టన్నులు 2017–18 నాటికి గోధుమలు 10 కోట్ల టన్నులు వరి దిగుబడి 11.2 కోట్ల టన్నులు క్షీర విప్లవం..(1955లో దిగుమతులు) వెన్న 500 టన్నులు పాలపొడి 3,000 టన్నులు 2016లో భారత్ ఎగుమతి చేసిన పాలు 36 వేల టన్నులు 2018 నాటికి పాలు, పాల ఉత్పత్తుల ఎగుమతుల విలువ 17.2 కోట్ల డాలర్లు క్షీర విప్లవానికి ఆద్యుడు వర్గీస్ కురియన్ అని చాలామందికి తెలుసు. అప్పట్లో పాలను పొడిగా మార్చే సాంకేతికతను భారత్‌కు ఇచ్చేందుకు ఐరోపా దేశాలు నిరాకరించాయి. దీంతో హెచ్.ఎం.దలయా అనే డెయిరీ శాస్త్రవేత్త మామూలు స్ప్రే గన్, ఎయిర్ హీటర్ల సాయంతో ఓ యంత్రాన్ని తయారు చేయడంతో పరిస్థితి మారింది. గేదె పాలను పొడిగా మార్చలేమన్న యూరోపియన్ల అంచనాను తప్పు అని నిరూపించారు. హెచ్.ఎం.దలయా వల్లే భారత్‌లో క్షీర విప్లవ ప్రస్థానం మొదలైంది. ప్రపంచానికి మందులిచ్చాం విదేశీ కంపెనీల పెత్తనం నుంచి మూడో అతిపెద్ద మం దుల తయారీ కేంద్రంగా ఎదగడం వరకు గత 70 ఏళ్లలో భారత ఫార్మా రంగం సాధించిన ప్రగతి అనితర సాధ్యమనే చెప్పాలి. 1954లో హిందుస్తాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్, ఆ తర్వాతి కాలంలో సోవియట్ యూనియన్ సాయంతో ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసూటికల్స్ లిమిటెడ్ ఏర్పాటుతో బహుళజాతి కంపెనీల ఒంటెత్తు పోకడలకు అడ్డుకట్ట పడితే.. 1970లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పేటెంట్ చట్టాన్ని సవరించడంతో జెనరిక్ మందుల తయారీ సులువైంది. నేషనల్ కెమికల్ లేబొరేటరీస్, రీజినల్ రీసెర్చ్ లేబొరేటరీ (ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)లు మందుల తయారీ రంగంలో పరిశోధనలకు ఊతమిచ్చాయి. ఐఐసీటీ వంటి సీఎస్ఐఆర్ పరిశోధనశాలలు సిప్రోఫ్లాక్సిన్, అజిత్రోమైసిన్, డైక్లోఫెనాక్ వంటి మందులను చౌకగా తయారు చేయడం.. ఆ టెక్నాలజీని ప్రైవేట్ కంపెనీలకు బదలాయించడంతో జనరిక్ మందుల విప్లవం మొదలైంది. విదేశీ కంపెనీల పెత్తనం నుంచి మూడో అతిపెద్ద మం దుల తయారీ కేంద్రంగా ఎదగడం వరకు గత 70 ఏళ్లలో భారత ఫార్మా రంగం సాధించిన ప్రగతి అనితర సాధ్యమనే చెప్పాలి. 1954లో హిందుస్తాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్, ఆ తర్వాతి కాలంలో సోవియట్ యూనియన్ సాయంతో ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసూటికల్స్ లిమిటెడ్ ఏర్పాటుతో బహుళజాతి కంపెనీల ఒంటెత్తు పోకడలకు అడ్డుకట్ట పడితే.. 1970లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పేటెంట్ చట్టాన్ని సవరించడంతో జెనరిక్ మందుల తయారీ సులువైంది. నేషనల్ కెమికల్ లేబొరేటరీస్, రీజినల్ రీసెర్చ్ లేబొరేటరీ (ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ))లు మందుల తయారీ రంగంలో పరిశోధనలకు ఊతమిచ్చాయి. ఐఐసీటీ వంటి సీఎస్ఐఆర్ పరిశోధనశాలలు సిప్రోఫ్లాక్సిన్, అజిత్రోమైసిన్, డైక్లోఫెనాక్ వంటి మందులను చౌకగా తయారు చేయడం.. ఆ టెక్నాలజీని ప్రైవేట్ కంపెనీలకు బదలాయించడంతో జనరిక్ మందుల విప్లవం మొదలైంది. ఐటీతో మున్ముందుకు తమకు అక్కరకు రాని యంత్రాలను భారత్‌కు పంపడం.. అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయడం.. ఇదీ 1960– 70లలో దేశంలోని డేటా ప్రాసెసింగ్ రంగం పరిస్థితి. ఐబీఎం, ఐసీఎల్ కంపెనీల గుత్తాధిపత్యం ఉన్న సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు మిలిటరీ, పరిశోధన సంస్థల్లోనూ ఇదే తంతు. ఈ నేపథ్యంలో 1970లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఏర్పాటైంది. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్), కంప్యూటర్ మెయిన్టెనెన్స్ కార్పొరేషన్ (సీఎంసీ), స్టేట్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల ఏర్పాటుతో దేశంలో ఐటీ విప్లవానికి బీజాలు పడ్డాయి. రైల్వే రిజర్వేషన్ల కంప్యూటరీకరణకు ప్రత్యేకమైన టెక్నాలజీని అభివృద్ధి చేసిన తర్వాత వెనుదిరిగి చూసింది లేదు. ఐటీ ఉత్పత్తులు, సేవల రంగంలో ఈ రోజు భారత్ ఓ తిరుగులేని శక్తి. టెలికం విప్లవం ఒకప్పుడు ఇంటికి ఫోన్ కావాలంటే నెలల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి. టెలికామ్ రంగంలో కీలకమైన స్విచింగ్ టెక్నాలజీ కొన్ని బహుళజాతి కంపెనీల చేతుల్లోనే ఉండటం ఇందుకు కారణం. అయితే 1960లలో టెలికామ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుతో దేశంలో టెలికామ్ విప్లవానికి అంకురం పడింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత భారత్ తొలిసారి 100 లైన్ల ఎలక్ట్రానిక్ స్విచ్‌ను అభివృద్ధి చేయగలిగింది. ఇదే సమయంలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఐఐటీ బాంబే శాస్త్రవేత్తలు సంయుక్తంగా మిలటరీ అవసరాల కోసం డిజిటల్ ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ స్విచ్ తయారు చేశారు. 1984లో శాం పిట్రోడా నేతృత్వంలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ–డాట్) ఏర్పాటుతో పల్లెపల్లెనా టెలిఫోన్ ఎక్సే ్చంజ్ల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. సీ–డాట్ అభివృద్ధి చేసిన టెక్నాలజీని ప్రైవేట్ కంపెనీలకు ఉచితంగా ఇవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక గ్రామీణ ప్రాంతాల్లోనూ టెలిఫోన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. సమాచార విప్లవం 1975.. భారత్ సొంత ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగించిన సంవత్సరం. ఐదేళ్లు తిరగకుండానే ఎస్ఎల్వీ–3 రాకెట్‌తో రోహిణి ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇస్రో ప్రయోగించిన ప్రయోగించిన మొత్తం ఉపగ్రహాలు 238 వరకు ఉంటే అందులో విదేశీ ఉపగ్రహాలు 104. ఇన్శాట్, ఐఆర్ఎస్ శ్రేణి ఉపగ్రహాలు దేశంలో సమాచార విప్లవానికి నాంది పలికాయి. విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, వాతావరణ అంచనాలు, తుపాను హెచ్చరికలను సామాన్యుడికి చేరువ చేసిందీ పరిణామం. హాలీవుడ్ సినిమా బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో అంగారకుడిపైకి అంతరిక్ష నౌకను పంపగలిగినా.. జాబిల్లిపై నీటి జాడను కనిపెట్టేందుకు ప్రయోగాలకు కేంద్రంగా నిలిచినా అది భారత్‌కే చెల్లింది. సొంతంగా రాకెట్ కూడా తయారు చేసుకోలేని దశ నుంచి ఇరుగుపొరుగు దేశాలకు జీపీఎస్ వ్యవస్థలను అందించే స్థాయికి ఎదగడం మనం గర్వించాల్సిన విషయమే! అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాలకే వాడాలని మన విధానం. విద్య, ఆరోగ్యం దేశ నలుమూలలకు చేర్చేందుకు ఉపగ్రహాలను వాడతామని 1960లలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ డైరెక్టర్ విక్రమ్ సారాభాయ్ ఆలోచనలను పట్టించుకున్న వారు కొందరే. రాకెట్, ఉపగ్రహ నిర్మాణంలో అప్పటికి మనకున్న టెక్నాలజీ సున్నా! అయితే దశాబ్దం తర్వాత ఆర్యభట్ట ప్రయోగంతో భారత్ తన సత్తా చాటుకుంది. -
కోమటిబండ.. అడవికిదే అండ!
సాక్షి, హైదరాబాద్ : అది అంతర్థాన దశలో ఉన్న అటవీ ప్రాంతం. వర్షాకాలంలో కొంచెం పచ్చగా కనిపించినా.. మిగిలిన కాలమంతా బీడు భూములను తలపించేది. అడవి సన్నబడటంతో వేటగాళ్లు జంతువుల మీద పడ్డారు. కుందేళ్లు, కొండ గొర్రెలు, నెమళ్లను వేటాడారు. బతకలేని జీవజాలం వలస వెళ్లిపోయింది. ఇలాంటి అడవికి కొత్త జవ సత్వాలు తొడిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. పైలట్ ప్రాజెక్టు కింద తీసుకుని.. మొక్కలు పెంచింది. మొక్కలు ఎదగకుండా అడ్డం పడుతున్న పొదలను, తీగ జాతులను తీసివేసి గాలి, వెలుతురు సహజంగా అందేట్లు చేసింది. అధికారులు ఎండిపోయిన చెట్లను గుర్తించి వాటి స్థానంలో కొత్తవి నాటారు. మొత్తానికి అడవి çపునరుజ్జీవం పోసుకుంది. దట్టమైన చెట్లతో ఓ రూపం సంతరించుకుంది. వలస వెళ్లిపోయిన జీవజాలాన్ని మళ్లీ దగ్గరకు పిలుచుకుంది. అదే సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలోని కోమటిబండ అటవీ ప్రాంతం. ఈ అడవే జిల్లా కలెక్టర్లకు పాఠ్యాంశమైంది. తెలంగాణలో అంతరించిపోతున్న సహజ అడవుల పునరుజ్జీవనానికి మార్గం చూపింది. సేద్యం.. స్మగ్లింగ్.. కరువు.. గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని ములుగు మండలం నర్సంపల్లి, వర్గల్ మండలం మీనాజీపెట, లింగాయపల్లి, మైలారం, వర్గల్, తున్కిఖల్సా, గజ్వేల్ మండలం కోమటిబండ, సంగాపూర్ ప్రాంతాల్లో మొత్తం 2,379 హెక్టార్లలో అటవీ ప్రాంతం ఉంది. గతంలో దట్టమైన చెట్లతో విస్తరించి ఉన్న అడవిలో.. కుందేళ్లు, కొండగొర్రెలు, దుప్పులు, నెమళ్లు, పెద్ద పిట్ట, పౌడికంటి వంటి వివిధ రకాల జంతువులు, పక్షులు జీవనం చేసేవి. కాలక్రమేణా అడవి రూపు కోల్పోయింది. రైతులు అడవి భూము ల్లో సేద్యం చేయటం, స్మగ్లర్లు చెట్లను నరికి హైదరాబాద్‌కు స్మగ్లింగ్ చేయటం, వరుస కరువులతో పూర్తి అంతర్ధాన దశకు చేరుకుంది. సహజ, కృత్రిమ పునరుజ్జీవం.. సహజ పునరుజ్జీవం, (ఏఎన్ఆర్–యాడెడ్ నేచురల్ రీ జనరేషన్), కృత్రిమ పునరుజ్జీవం (ఏఆర్–ఆర్టిఫిషియల్ రీ జనరేషన్) పద్ధతిలో అడవిని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసింది. సహజంగా పుట్టిన మొక్కలను సహజ వాతావరణంలోనే పెంచడాన్ని ఏఎన్ఆర్ అని, ఎండిపోయిన మొక్కలను డీ కంపోజ్ చేసి వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటడాన్ని ఏఆర్ అని అంటారు. ఈ మేరకు గజ్వేల్ రేంజ్ పరిధిలో 439 హెక్టార్లలో ఏఎన్ఆర్, 370 హెక్టార్లలో ఏఆర్ విధానంలో మొక్కల పెంపకం చేపట్టినట్లు పీసీసీఎఫ్ పీకే ఝా వివరించారు. 2015–16లో 70 లక్షల మొక్కలు, 2016–17లో కోటి 21 లక్షలు, 2017–18లో కోటి 57 లక్షలు నాటినట్లు చెప్పారు. తొలి రెండేళ్లలో నాటిన మొక్కలు పెరిగి పెద్దయ్యాయి. దట్టమైన అడవి రూపుదిద్దుకుంటోంది. కొండ గొర్రెలు, నెమళ్లు, కుందేళ్లు, పక్షులు మళ్లీ వచ్చాయి. కలెక్టర్ల అధ్యయనం.. కోమటిబండను సందర్శించాల్సిందిగా కలెక్టర్లను గతేడాది ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన ప్లాంటేషన్ తీరుపై కలెక్టర్లు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. నాలుగో విడత హరితహారంలో రాష్ట్రవ్యాప్తంగా కోమటిబండ సూత్రాన్నే అమలు చేయాలని నిర్ణయించారు. అంతర్ధాన దశలో ఉన్న అడవులను గుర్తించి పునర్జీవం పోయాల ని నిర్ణయించారు. పండ్ల మొక్కలు తగ్గిపోవటంతో కోతులు వనాలు వదిలి ఊళ్ల మీద కు మళ్లాయని, తిరిగి వాటిని వనాల్లోకి పంపాలంటే సాధ్యమైనన్ని ఎక్కువ పండ్ల మొక్కలు నాటాలని భావించి ఆ మేరకు ప్రణాళికలు రూపొందించారు. కోతులు ఇష్టంగా తినే 25 రకాల పండ్ల మొక్కలను గుర్తించి నాటేందకు సిద్ధంగా ఉంచారు. ఈ ఏడాది 39.5 కోట్ల మొ క్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఖమ్మం జిల్లాలో అమలు అంతర్థాన దశలో ఉన్న కోమటిబండ అడవిని ఏఎన్ఆర్, ఏఆర్ పద్ధతుల్లో దట్టమైన అడవిగా మార్చిన తీరు బాగుంది. ఖమ్మం జిల్లాలో కూడా అంతర్థాన దశలో ఉన్న అడవులను గుర్తించాం. హరితహారంలో అక్కడ ఏఎన్ఆర్, ఏఆర్ పద్ధతుల్లో ఆ అడవులకు పునరుజ్జీవం పోసేందుకు సిద్ధంగా ఉన్నాం. –లోకేశ్ కుమార్, కలెక్టర్, ఖమ్మం సహజ పునరుత్పత్తి బాగుంది ములుగు నర్సరీ బాగుంది. కోమటిబండలో సహజ పునరుత్పత్తితో అడవిని కాపాడటం బాగుంది. అటవీ శాఖ అధికారులతో ఇంటరాక్షన్‌లో అనేక విషయాలు తెలిశాయి. కొత్తగూడెం ప్రాంతంలో అటవీ భూముల్లో బ్లాక్ ప్లాంటేషన్ చేయబోతున్నాం. ఇది కోమటిబండలోని ఏఆర్ తరహాలోనే ఉంటుంది. – రాజీవ్ గాంధీ హనుమంతు, కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం ఫైర్ లైన్స్ ఆకట్టుకున్నాయి ఫారెస్టు ప్రాంతంలో సహజంగా పుట్టిన మొక్కలకు శాస్త్రీయంగా గాలి, వెలుతురు అందే ఏర్పాట్లు చేశారు. వేసవిలో మంటలు చెలరేగితే పక్కకు వ్యాపించకుండా ఫైర్ లైన్స్ ఏర్పాటు చేశారు. అవెన్యూ ప్లాంటేషన్ చక్కగా చేశారు. కిలోమీటర్ల కొద్ది మొక్కలకు రక్షణ గార్డులు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది నూటికి నూరుపాళ్లు సూర్యాపేట జిల్లాలో అమలు చేసే ప్రయత్నంలో ఉన్నాం. – సురేంద్ర మోహన్, కలెక్టర్, సూర్యాపేట అటవీ అధికారుల కృషితోనే.. పక్కా ప్రణాళికతో కోమటిబండ ఫారెస్టును తిరిగి పూర్వ స్థితిలోకి తీసుకురాగలిగాం. ఫారెస్టు అధికారులు, సిబ్బంది కృషి అభినందనీయం. ముందుగా అడవిలో తీగ జాతి మొక్కలను తొలగించాం. దీంతో సహజమైన చెట్టుకు ఎండ, వెలుతురు తగిలింది. ఎండిపోయిన చెట్లను తీసేసి కొత్త మొక్కలు నాటాం. ఈ ఏడాది జిల్లాలోని అటవీ భూముల్లో బ్లాక్ ప్లాంటేషన్‌పై దృష్టి పెట్టాం. – వెంకట్రామిరెడ్డి, కలెక్టర్, సిద్దిపేట -
పాలమూరును సస్యశ్యామలం చేస్తాం
భూత్పూర్ (దేవరకద్ర) : స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్లు గడిచినా ఏ ప్రభుత్వం రైతులకు సాగునీరందించలేదని, తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ చొరవతో రైతులకు సాగునీరందిస్తున్నా మని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఎల్కిచర్ల సమీపంలో మ ంగనూరు, లట్టుపల్లి నుంచి వచ్చే కేఎల్ ఐ కాల్వను ఎల్కిచర్ల, మద్దిగట్ల ద్వారా కమాలొద్దీన్‌పూర్ వరకు చేపట్టే కాల్వ పనులకు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ కేఎల్ఐ ద్వారా ఎల్కిచర్ల, మద్దిగట్ల, కమాలొద్దీన్‌పూర్ వరకు చేపట్టే కాల్వ ప నులకు రూ.110 కోట్లు మంజూరు చేశారని, కేఎల్ఐ 25 టీఎంసీల సామర్థ్యం ఉండగా 40 టీఎంసీలకు పెంచామన్నా రు. మూడు నెలల్లో కాల్వ నిర్మాణం ప నులు పూర్తిచేసేలా పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్, అధికారులను ఆ దేశించారు. మంగనూరు, లట్టుపల్లి రైతు లు భూములు ఇవ్వడానికి నాగర్‌కర్నూ ల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో సమావేశం నిర్వహించి అక్కడి రైతులను ఒప్పించి అక్కడి నుంచి కాల్వ పనులు త్వ రగా చేపట్టేలా చర్యలు తీసుకుంటామని నిరంజన్‌రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడు తూ నిరంజన్‌రెడ్డి సహకారంతోనే దేవరకద్ర నియోజకవర్గంలోని 10 గ్రామాల కు, వనపర్తి నియోజకవర్గంలో 15 గ్రా మాలకు సాగునీరందించే పనులను ప్రా రంభించామన్నారు. కార్యక్రమంలో రై తు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేట ర్ బస్వరాజ్‌గౌడ్, మండల కోఆర్డినేటర్ నర్సింహులు, జెడ్పీటీసీ చంద్రమౌళి, వై స్ ఎంపీపీ శేఖర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ చం ద్రశేఖర్‌గౌడ్, నాయకులు నారాయణ గౌడ్, సర్పంచ్‌లు చంద్రయ్య,నాగయ్య, అశోక్‌రెడ్డి, యాదిరెడ్డి పాల్గొన్నారు. పెట్టుబడి సాయంతో మేలు వనపర్తి రూరల్: పెట్టుబడి సాయం పథకం రైతుల పాలిట వరంలాంటిదని నిరంజన్‌రెడ్డి అన్నారు. మండలంలోని అప్పాయిపల్లి, చందాపూర్, చిమనగుంటపల్లిలో ఆయన రైతులకు పెట్టుబడి సాయం చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శంకర్‌నాయక్, జెడ్పీటీసీ వెంకటయ్యయాదవ్, మున్సిపల్ చైర్మన్ రమేష్‌గౌడ్, సర్పంచ్ విష్ణు, కౌన్సిలర్లు గట్టుయాదవ్, రమేష్, సతీష్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రవి, గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు కురుమూర్తియాదవ్, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు నర్సింహ, తహసీల్దార్ రాజేందర్‌గౌడ్, మండల ప్రత్యేకాధికారి బాలక్పష్ణ, వ్యవసాయాధికారి హన్మంతురెడ్డి పాల్గొన్నారు. -
కోటి ఆశలతో..
సాక్షి, నిర్మల్: 2018.. కొత్తసంవత్సరం.. సరికొత్త లక్ష్యాలు. అందరికీ ఉన్నట్లే పాలకులు, అధికారులకూ ఉంటాయి. జిల్లాను అన్ని రంగాల్లోనూ సమప్రాధాన్యతతో అభివృ ద్ధి చేయాల్సిన గురుతర బాధ్యత వాళ్లపైనే ఉంది. గతేడాది కొన్నిరంగాల్లో దూ సుకెళ్తే.. మరికొన్నింట్లో కనీసం అడుగు ముందుకు పడని పరిస్థితి. ఈనేపథ్యంలో గత లోపాలను అధిగమించి పురోభివృద్ధి వైపు పరుగులు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. కొత్త సంవత్సరంలో కొత్త బడ్జెట్ కూడా రానుంది. అందులో జిల్లా కు ఎక్కువ నిధులు, పథకాలు రాబట్టుకో వాల్సిన అవసరమూ ఉంది. కొత్త సంవత్సరంపై పెట్టుకున్న కోటి ఆశలు నెరవేరాలని జిల్లా ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అభివృద్ధికి అనుకూల అంశాలు.. రాష్ట్రంలోని చాలా జిల్లాలకంటే అభివృద్ధికి కావాల్సిన అనుకూల అంశాలు నిర్మల్‌కే ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్–నాగ్‌పూర్ ప్రధాన మార్గమైన ఎన్‌హెచ్ 44, మరోవైపు మహారాష్ట్రలోని పలు ప్రధాన నగరాల నుంచి మంచిర్యాలవైపు వెళ్తున్న ఎన్‌హెచ్ 61 రోడ్లకు కూడలిగా ఉంది. రోడ్డు, రవాణాపరంగా ఇబ్బంది లేదు. ఈ నేపథ్యంలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాల్సిన అవసరముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్‌లో ఇప్పటికీ చెప్పుకోదగ్గ పరిశ్రమ లేకపోవడం లోటుగా మారిందన్న భావన ఉంది. అలాగే ఉన్నతవిద్యకు సంబంధించి మరిన్ని కోర్సులు, వివిధ కళాశాలలూ రావాల్సిన అవసరముంది. వైద్యం, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో జిల్లా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రగతిని సాధిస్తోంది. పలుశాఖల్లో పేరుకుపోయిన అవినీతిని పారదోలాల్సిన అవశ్యకత చాలా ఉంది. ఇక శాంతిభద్రతల విషయంలోనూ పోలీస్‌శాఖ మంచి పేరే సంపాదించుకుంది. కానీ.. ఇటీవల ఎస్పీ విష్ణు ఎస్ వారియర్‌ను ఆ దిలాబాద్ ఎస్పీగా బదిలీ చేశారు. జిల్లాకు పూ ర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. భారం.. బాధ్యత.. బాసర నుంచి మొదలుకుంటే కడెం దాకా 19మండలాలతో జిల్లా ఏర్పడింది. కొత్తజిల్లాగా ఏర్పడి పద్నాలుగు నెలలు మాత్రమే అయింది. ఈకాలంలో చెప్పుకోదగ్గ అభివృద్ధినే సాధించింది. కానీ.. ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకు ఇంకా చేరుకోలేదు. జిల్లా నుంచి రాష్ట్ర దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రిగా అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఉండడం నిర్మల్‌కు వరంగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు పలు అభివృద్ధి పనులు ఆయన హయాంలోనే వచ్చాయి. అయితే కొన్నింట్లో ఇంకా వెనుకబడే ఉండడం లోపాలుగా మారుతున్నాయి. కొత్త ఏడాదిలో వాటినీ అధిగమించాలని జిల్లావాసులు కోరుతున్నారు. కొత్తగా కలెక్టర్‌గా వచ్చిన ఎం.ప్రశాంతిపైనా జిల్లావాసులు పెద్ద ఆశలే పెట్టుకున్నారు. మంత్రి, కలెక్టర్ సమన్వయంతో జిల్లాను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లాల్సిన భారం, బాధ్యత వారిపైనే ఉంది. 2018లో జిల్లా గణనీయమైన అభివృద్ధిని సాధించాలని జిల్లాప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అభివృద్ధే ధ్యేయంగా.. జిల్లాగా ఏర్పాటు చేయడం మొదలు అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయంగా కృషిచేస్తున్నాం. జిల్లాగా ఏర్పడిన స్వల్పకాలంలోనే ఎన్నో అభివృద్ధి పనులను మొదలు పెట్టాం. విద్య,వైద్యం, వ్యవసాయం, అనుబంధ రంగాలు, రోడ్లు, గోదాంలు.. ఇలా అన్నిరంగాల్లో అభ్యున్నతి సాధిస్తున్నాం. ఇప్పటికే ఎల్లపల్లిలో డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తిచేశాం. త్వరలోనే జిల్లాలో మిగతా చోట్లా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమవుతాయి. అలాగే త్వరలో జిల్లాకు రానున్న సీఎం చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులను ప్రారంభింపజేస్తాం. కొత్త ఏడాదిలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో జిల్లాను మరింత అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగుతాం. – అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి మష్టిగా ప్రగతి వైపు.. కొత్తగా ఏర్పడిన జిల్లాకు కొత్త కలెక్టర్‌గా ఇటీవలే బాధ్యతలు చేపట్టాను. అన్నిశాఖల సమన్వయంతో అభివృద్ధి పథంలో జిల్లాను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యం. కొత్త సంవత్సరంలో జిల్లాను ప్రగతి బాట పట్టించేందుకు శాయశక్తులా కృషిచేస్తాం. అన్నిరంగాలపై దృష్టి సారిస్తాం. ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుంటూ సత్వరమే పరిష్కరించేందుకు కృషిచేస్తాం. గతంలోని లోపాలను సరిదిద్దుకుంటూ అభివృద్ధి పథకాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా వెంటవెంటనే ప్రారంభించేలా చూస్తాం. రాష్ట్రంలో జిల్లాను మంచి స్థానంలో నిలిచే లక్ష్యంతో ఈ ఏడాది కృషిచేయాలనుకుంటున్నాం. ఇందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అందరి సహకారం అవసరం. – ఎం.ప్రశాంతి, కలెక్టర్ -
పోలీస్ స్టేషన్ల ఆధునికీకరణకు చర్యలు
హోం మంత్రి చినరాజప్ప కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : రాష్ట్రంలోని పోలీస్‌స్టేçÙన్లను ఆధునికీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు డిప్యూటీ సీఎం, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. పోలీస్ కన్వన్ష¯ŒS హాలులో ఏపీ పోలీసు అధికారుల సంఘం రూపొందించిన 2017 పోలీస్ డైరీని గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రాజప్ప మాట్లాడుతూ 2016లో జిల్లా లో జరిగిన ఆందోళనలపై పోలీసులు ఎంతో సంయమనం పాటించారని కితాబిచ్చారు. నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నట్టు చెప్పారు. ఎస్పీ ఎం.రవిప్రకాశ్ మాట్లాడుతూ అధికారుల తప్పులు పునరావృతమైతే ఏ స్థాయి అధికారినైనా ఉపేక్షించమన్నారు. ఏఎస్పీ ఏఆర్ దామోదర్, ఓఎస్డీ వై.తరవిశంకర్‌రెడ్డి, జిల్లా పోలీసు అధికారుల సంఘ గౌరవాధ్యక్షుడు జి.బలరామమూర్తి, జిల్లా అధ్యక్షుడు జి.బ్రహ్మాజీరావు, కార్యదర్శి మధుసూదనరావు పాల్గొన్నారు. జిల్లాలో రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం.. కాకినాడ రూరల్ (కాకినాడ రూరల్ నియోజకవర్గం) : జిల్లాలోని పలు రహదారుల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నట్టు డిప్యూటీ సీఎం చినరాజప్ప చెప్పారు. ఇంద్రపాలెం వద్ద ఆర్అండ్బీ వంతెనను ఆయన ప్రారంభిం చారు. జగన్నాథపురం వద్ద రూ.100 కోట్లతో వంతెన, రోడ్ల విస్తరణకు సీఎం చంద్రబాబు అంగీకరించారన్నారు. సర్పవరం వద్ద నాలుగు లైన్ల వంతెనకు శంకుస్థాపన చేశారు. సూర్యారావుపేటలో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభిం చారు. జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు, ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, దాట్ల బుచ్చిరాజు, కలెక్టర్ అరుణ్‌కుమార్ పాల్గొన్నారు. -
గ్రంథాలయాల అభివృద్ధికి కృషి
ఉప ముఖ్యమంత్రి రాజప్ప బాలాజీచెరువు(కాకినాడ) : మారిన సాంకేతిక పద్ధతులకు అనుగుణంగా గ్రంథాలయాలను అభివృద్ధి చేసి పాఠకులకు మెరుగైన సేవలందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సూచించారు. గ్రంథాలయ వారోత్సవాలను జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో సోమవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరంలో గ్రంథాలయ ఉద్యమం భారత జాతిని ఐక్యం చేసి ఏకోన్ముఖంగా నడిపించిందన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకునేందుకు విజ్ఞాన భాండాగారాలైన గ్రంథాలయాలను ఆదరించాలని కోరారు. గ్రంథాలయాల్లో సాహితీ గ్రంథాలతో పాటు పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. గ్రంథాలయ సెస్ వసూళ్లను వేగవంతం చేసి మండల, ,గ్రామీణశాఖ గ్రంథాలయాలను అభివృద్ధి చేయడంతో పాటు కేంద్ర గ్రంథాలయ భవన ఆధునికీకరణకు కృషి చేస్తానని చెప్పారు. జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు గ్రంథాలయాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. గ్రంథాలయ సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విశాలాంధ్ర బుక్‌హౌస్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మ¯ŒS నల్లమిల్లి వీర్?రడ్డి, కార్యదర్శి మారిశెట్టి సత్యనారాయణ, సభ్యులు గద్దేపల్లి దాసు, పాఠకులు పాల్గొన్నారు. -
పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి చర్యలు
డిప్యూటీ సీఎం చినరాజప్ప సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన మధురపూడి : రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భూమిపూజ చేయనున్న నేపథ్యంలో.. సంబంధిత ఏర్పాట్ల పరిశీలనకు రాజప్ప శనివారం ఇక్కడకు వచ్చారు. సీఎం సభ, ఎంఓయూ, భూమిపూజ జరిగే ప్రాంతాలను పరిశీలించారు. వాటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, ఇప్పటికే విజయవాడ ఎయిర్‌పోర్టు అభివృద్ధి పూర్తయిందన్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం విస్తరణకు 850 ఎకరాలు సేకరించామని తెలిపారు. ఆ భూములకు రూ.350 కోట్ల పరిహారం చెల్లించామన్నారు. కడప, తిరుపతి, భోగాపురం విమానాశ్రయాల అభివృద్ధికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయ విస్తరణ పనులకు సంబంధించిన భూమిపూజకు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు ఎం.వెంకయ్య నాయుడు, పి.అశోక్‌గజపతిరాజు తదితరులు వస్తారని తెలిపారు. కొందరు రైతులకు భూ పరిహారం అందలేదని విలేకర్లు ప్రస్తావించగా, లీగల్ సమస్యలు పరిష్కారమయ్యాక వారికి పరిహారం అందుతుందని చెప్పారు. అనంతరం రాజప్ప జెట్ ఎయిర్వేస్ విమానంలో హైదరాబాద్ వెళ్లారు. పనుల పరిశీలనకు వచ్చిన కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ మాట్లాడుతూ, సీఎం భూమిపూజ చేయడంతో ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులు మొదలవుతాయని చెప్పారు. రూ.181 కోట్లతో రన్‌వే విస్తరణ, ప్రహరీ, ఐసొలేషన్ బే నిర్మాణ పనులు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ బి.రాజకుమారి, సబ్‌కలెక్టర్ విజయ కృష్ణన్, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎం.రాజకిషోర్, కోరుకొండ తహశీల్దార్ రియాజుద్దీన్, సీతానగరం ఎంపీడీఓ డి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, వర్షం కారణంగా సీఎం పర్యటనకు ఆటంకం కలుగుతుందేమోనన్న సందేహాలు అధికారుల్లో నెలకొన్నాయి. ఏర్పాట్లన్నీ పూర్తి చేశాక వర్షం కురిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన చెందుతున్నారు. -
మొక్కల పెంపకం సామాజిక బాధ్యత
జిల్లా అటవీ అధికారి అప్పన్న ధవళేశ్వరం : మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని జిల్లా అటవీ అధికారి అప్పన్న పిలుపునిచ్చారు. ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం జరిగిన వనం–మనం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొక్కలను పరిరక్షిస్తామని తొలుత విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 23 శాతం విస్తీర్ణంలో మొక్కలు ఉన్నాయన్నారు. దీనిని 2029 నాటికి 50 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా తమ శాఖ ప్రతి శనివారం పాఠశాలలు, కళాశాలల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఇప్పటికే అనేక పాఠశాలల్లో నర్సరీలు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎఫ్ఆర్ఓ టి.శ్రీనివాసరావు, కాకినాడ ఎఫ్ఆర్ఓ జి.మురళీకృష్ణ, అనపర్తి ఎఫ్ఎస్ఓ ఎస్.వెంకట రమణ, కళాశాల పీడీ శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటక ప్రాంతాల్లో సదుపాయాలు
సమీక్షా సమావేశంలో కలెక్టర్ అరుణ్‌కుమార్ కాకినాడసిటీ : జిల్లాలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా గుర్తించిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై మంగళవారం కలెక్టరేట్‌లోప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలో 71 ప్రాంతాలను పర్యాటకప్రాంతాలుగా గుర్తించామని, వీటిలో ప్రధానమైన ప్రాంతాల్లో ఆయా శాఖలు రోడ్లు, విద్యుత్, మంచినీటి సౌకర్యం, టాయిలెట్స్ వంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులకు వెంటనే అంచనాలు రూపొందిస్తే ఆయా శాఖల నుంచి నిధులు ఖర్చుచేస్తామన్నారు. హోప్ ఐలాండ్‌కు కోరంగి నుంచి టూరిజం బోట్స్ కోరంగి నుంచి హోప్‌ఐలాండ్‌కు టూరిజం బోట్స్ నడిపేలా చర్యలు తీసుకోవాలని టూరిజం అధికారులకు కలెక్టర్ సూచించారు. దీని వల్ల ప్రకృతి సిద్ధమైన వనరులను పర్యాటకులు తిలకించే అవకాశం లభిస్తుందని, ఈ మేరకు కోరంగి అభయారణ్య వద్ద డ్రెడ్జింగ్ పనులు చేపట్టాలన్నారు. అదే విధంగా హోప్‌ఐలాండ్‌లో అనువుగా ఉన్న 90 హెక్టార్లలో పెద్ద ఎత్తున మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టాలని, దీని కోసం ఒక ప్రణాళిక రూపొందించాలని అభయారణ్య డీఎఫ్‌వో ప్రభాకర్‌కు ఫోన్లో సూచించారు. జిల్లాలో పర్యాటక ప్రాంతమైన ఆదుర్రులో రూ.1.20కోట్లతో అప్రోచ్‌రోడ్డు, గట్ల పటిష్టత, భవన నిర్మాణాల కొనసాగుతున్నాయని, ఈ ప్రాంతాలకు పాశర్లపూడి నుంచి అప్పనపల్లి వరకు హౌస్‌బోట్ ప్రతిపాదన కూడా ఉందన్నారు. పాపికొండలకు పర్యాటకులను తీసుకువచ్చే బోట్లకు తప్పనిసరిగా రెండు ఇంజన్లు, నీటి లోతులు తెలిపే పరికరాలు, బీమా ఉండాలన్నారు. ఇటువంటి సౌకర్యాలు కలిగిన బోట్లను మాత్రమే అనుమతించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఏజన్సీలోని రంప వాటర్ ఫాల్స్ వద్ద కమ్యూనిటీ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేయాలని గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులకు సూచించారు. భూపతిపాలెం రిజర్వాయర్ గట్లపై ఉపాధిహామీ పథకం ద్వారా మొక్కలను పెంచాలని, మారేడుమిల్లిలో సోలార్ విద్యుత్ ద్వారా ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేయాలని, ధవళేశ్వరంలో సర్ఆర్దర్కాటన్ మ్యూజియంను ఆధునికీకరించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ భీమశంకరం, ఆర్‌డబ్ల్యూస్ ఎస్ఈ రాజేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రూ.7కోట్లతో పురావస్తుశాఖ పనులు
కొల్లాపూర్: రాష్ట్రవ్యాప్తంగా రూ.7కోట్లతో పురావస్తుశాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆ శాఖ డైరెక్టర్ విశాలాక్షి వెల్లడించారు. మంగళవారం ఆమె మండలపరిధిలోని మంచాలకట్ట రామ తీర్థాలయాన్ని సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వరంగల్ జిల్లాలోని జాకారం, కొండపర్తిలో ఆలయ పునర్నిర్మాణానికి, హైదరాబాద్ స్టేట్ మ్యూజియం ఆధునికీకరణ, ఖైరతాబాద్ మాస్క్, పురానాపూల్ గేట్ నిర్మాణ పనులు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చేపట్టినట్లు వివరించారు. సోమశిలలోని పురాతన విగ్రహాలను రీఅలైన్మెంట్ ద్వారా దిమ్మెలపై ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మంచాలకట్ట రామ తీర్థాలయాన్ని కూడా మరింత అభివృద్ధి చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ సీఈసీ సభ్యుడు రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ నరేందర్‌రెడ్డి డైరెక్టర్ విశాలాక్షి్మని కలిశారు. మంచాలకట్ట రామ తీర్థాలయ ప్రాశస్త్యాన్ని దేవాదాయ శాఖ, పురావస్తు శాఖలు సరైన రీతిలో ప్రచారం చేయడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో రామ తీర్థాలయ అభివృద్ధికి చర్యలు చేపడతామని డైరెక్టర్ విశాలాక్షి వెల్లడించారు. ఆమె వెంట పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ రహీంషాఅలీ, ఏడీలు నాగరాజు, నర్సింగ్‌నాయక్ ఉన్నారు. -
అభివృద్ధి పనుల్లో ప్రజాప్రతినిధులు సహకరించాలి
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కాకినాడ సిటీ: అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు సహకారం అందించాలని, తద్వారా ప్రజలకు వాటి ఫలితాలు అందుతాయని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ బి.రామాంజనేయులు తెలిపారు. గురువారం అంబేడ్కర్ భవన్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇతర శాఖల నిధుల అనుసంధానంతో చేపట్టే పనులపై ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ మొదటి విడతగా అన్ని జిల్లాల్లో ప్రజాప్రతినిధులకు, గ్రామ పంచాయతీలలో మౌలిక సదుపాయాల కల్పనపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. రెండో విడతగా పంచాయతీ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలకు సర్పంచ్ల ఆధ్వర్యంలో అవగాహన ఏర్పాటు చేస్తామన్నారు. పూర్తిస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలపై వారికి అవగాహన ఉండాలని, నిధుల కేటాయింపు, చేసిన ఖర్చుపై అవగాహన ఉంటేనే అభివృద్ధి సాధించగలమన్నారు. కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చడానికి ఉపాధి హామీ పథకం నిధులు ఇస్తామన్నారు. ఈ పథకంలో గత సంవత్సరం రూ.280 కోట్లు ఖర్చు చేయగా, ఈ సంవత్సరం 25 శాతం ఎక్కువ నిధులు కేటాయించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. పంచాయతీరాజ్ ఎస్ఈ వెంకటేశ్వరరావు, డీపీఓ శర్మ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎం.రాజేశ్వరరావు, జెడ్పీ సీఈఓ కె.పద్మ ప్రసంగించారు. సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, ఎంపీడీఓలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వాటాకొస్తే సరి..!
వాటర్‌షెడ్ పథకానికి రూ.2.49 కోట్ల నిధులు నిలిపిన కేంద్రం ఆగిన అభివృద్ధి పనులు ఇప్పటివరకు కేంద్రం వాటా 90, రాష్ట్ర వాటా 10 శాతం రాష్ట్ర వాటా పెంచాల్సిందేనంటూ కేంద్రం ఆదేశం చిత్తూరు: వాటర్‌షెడ్ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులను నిలిపివేసింది. ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర వాటా పెంచేంతవరకు నిధులు ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. రాష్ట్రం ఎటూ తేల్చకపోవడంతో గత ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు జిల్లాకు ఇవ్వాల్సిన రూ.2.49 కోట్ల నిధులను నిలుపుదల చేసింది. దీంతో జిల్లాలో వాటర్‌షెడ్ అభివృద్ధి పనులు ముందుకు సాగే పరిస్థితి లేకుం డా పోయింది. జిల్లాలో వాటర్‌షెడ్ పథకం కింద 2009 -10 నుంచి 5 నుంచి 7 ఏళ్ల కాలపరిమితితో పనులు మొదలెట్టారు. 2009-10లో తొమ్మిది మండలాల పరిధి లో 9 ప్రాజెక్టుల కింద 55 వాటర్‌షెడ్ పనులతో38.25 వేల హెక్టార్లలో అభివృద్ధి పనులను చేపట్టాల్సి ఉంది. 2010-11లో 14 మండలాల పరిధిలో 18 ప్రాజెక్టుల కింద 115 వాటర్‌షెడ్ పనుల కింద 77.13 వేల హెక్టార్ల పరిధిలో, 2011-12లో 10 మండలాల పరిధిలో 20 ప్రాజెక్టుల కింద 105 వాటర్షెడ్ల పరిధిలో 82.68 వేల హెక్టార్ల పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. వీటిలో 40 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. ఇక 2012-13లో రెండు మండలాల పరిధిలో 11 ప్రాజెక్టుల కింద 60 వాటర్షెడ్ల పరిధిలో 43.83 వేల హెక్టార్లలో, 2014-15లో ఒక్క మండల పరిధిలో నాలుగు ప్రాజెక్టుల కింద 24 వాటర్షెడ్ల పరిధిలో 16వేల హెక్టార్లలో అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. అయితేపై రెండేళ్లకు సంబంధించి పనుల్లో పురోగతి లేకుండా పోయింది. కేంద్రం సైతం మొక్కుబడిగా నిధులు ఇవ్వడంతో వాటర్షెడ్ల పనులు జరగడం లేదు. మొత్తంగా ఆరేళ్ల కాలపరిమితిలో 36 మండలాల పరిధిలో 62 ప్రాజెక్టుల కింద 359 వాటర్షెడ్ల పరిధిలో 2.54లక్షల హెక్టార్లలో వాటర్‌షెడ్ అభివృద్ధి పనులు జరగాల్సి ఉంది. ఇందుకోసం రూ.305.59 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం రూ.136 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2014-15 ఏడాదికి సంబంధించి పనులు ప్రతిపాదనలకే పరిమితయ్యాయి. ఒక్క పని కూడా ప్రారంభం కాలేదు. 2012-13కు సంబంధించి కూడా మొక్కుబడి పనులతో సరిపెట్టారు. తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు కేంద్రం ఇవ్వాల్సిన 90 శాతం వాటా రూ.2.49 కోట్ల నిధులను నిలిపివేయడంతో పనులు దాదాపు నిలిచిపోయాయి. ఇప్పటివరకు వాటర్షెడ్లకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం 90 శాతం నిధులు ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం వాటాగా ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వాటాను 20 నుంచి 25 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై ఎటూ తేల్చలేదు. దీంతో కేంద్రం నిధులను నిలుపుదల చేయడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం నిధుల వాటా విషయం తేల్చితే తప్ప అభివృద్ధి పనులు మొదలయ్యే పరిస్థితి లేదని అధికారులంటున్నారు. -
మాస్టర్ ప్లాన్ మారింది...
బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్‌పై నిరాసక్తత నదిలోకి వెళ్లి స్నానం చేస్తున్న భక్తులు నీటి ప్రవాహం వెంట ఏర్పాట్లకు సిద్ధమైన యంత్రాంగం పగటి వేళ 35 డిగ్రీ సెల్సియస్ దాటిన ఉష్ణోగ్రత నీటి కంటే నీడలేమితోనే భక్తుల ఇబ్బందులు హన్మకొండ : నాలుగు నెలల క్రితం రూ పొందించిన ప్రణాళిక, రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన అభివృద్ధి పనులు పుష్కరాల వేళ అ క్కరకు రాకుండా పోతున్నాయి. గోదావరి న దిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండడం, తీ రం వెంట చేపట్టిన ఏర్పాట్లు నిరుపయోగమయ్యూరుు. దీంతో నదీ తీరం నుంచి సుమారు కిలో మీటరు వరకు కొత్తగా ఏర్పాట్లు చేయూ ల్సి వస్తోంది. ఈ మేరకు బుధవారం జిల్లా క లెక్టర్ కరుణ, ఐటీడీఏ పీవో అమయ్‌కుమార్, ములుగు ఆర్డీవో మహేందర్ పుష్కరఘాట్లు సందర్శించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రణాళిక రూపొందించారు. ఏర్పాట్లు చేయడంలోనూ నిమగ్నమయ్యారు. బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్‌పై నిరాసక్తత జిల్లాలో ముల్లకట్ట, రామన్నగూడెం, మంగపేటలో మూడు పుష్కరఘాట్లు ఏర్పాటు చేశా రు. భక్తులు స్నానం చేసేందుకు వీలుగా బ్యా టరీ ఆఫ్ ట్యాప్స్ బిగించారు. మహిళలు దు స్తులు మార్చుకునేందుకు గదులు, పిండప్రదానాలు తదితర పూజలు చేపట్టేందుకు వీ లుగా గదులు, షెడ్డులు ఏర్పాటు చేశారు. గో దావరి గట్టుపైనే వైద్య శిబిరం, మంచినీటి తదితర సౌకర్యాలు కల్పించారు. అయితే వ ర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నదిలో తగి నంత నీటి ప్రవాహం లేదు. ముల్లకట్ట, రామన్నగూడెంలో గట్టు నుంచి కిలోమీటరుకు పై గా దూరంలో నీటి ప్రవాహం ఉంది. మంగపేటలో సుమారు50 అడుగుల దూరం వెళ్తేనే నీ టి లభ్యత ఉంది. గోదావరి నదిలోని నీటి ప్ర వాహంలోనే పుణ్యస్నానాలు చేసేందుకు భక్తు లు ఆసక్తి చూపిస్తున్నారు. గట్టు సమీపంలో పుష్కరఘాట్ మెట్ల వద్ద ఏర్పాటు చేసిన బ్యా టరీ ఆఫ్ ట్యాప్స్ కింద స్నానం చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. సుమారు కిలోమీటరు దూరంలోని నీటి ప్రవాహంలోకి వెళ్లి భ క్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. బు ధవారం భక్తులను తరలించేందుకు ట్రాక్టర్లు ఏర్పాటు చేశారు. అరుుతే, మంగళ, బుధవారాల్లో మధ్యాహ్నం వేళ 35డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. వీరు సేదదీరేందుకు రామన్నగూడెంలో మూడు, మంగపేటలో మూడు షామియానాలు ఏర్పాటు చేశారు. పనులు వేగవంతం చేయూలి.. నదీ ప్రవాహంలోనే భక్తులు పుణ్యస్నానాలు చేస్తుండడంతో అక్కడ చలువ పందిళ్లు నిర్మించాలని, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక ఏర్పాటు ్లయుద్ధప్రాతిపదికన చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. మంచినీటి సౌకర్యం కల్పనతోపాటు పిండప్రదానలు, పుష్కరశాంతి తదితర పూలు చేసేందుఉ ఏర్పాట్లు చేయూల్సి ఉంది. తొలి రోజు జిల్లాలోని మూడు పుష్కరఘాట్లలో సుమారు 15వేల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. రెండోరోజు రెండు పుష్కరఘాట్లలోనే దాదాపు 50వేల మంది పుష్కర స్నానాలు ఆచరించారని అంచనా. గురువారం అమవాస్య కావడంతో పిండప్రదానం వంటి కార్యక్రమాలు అధికంగా చేపడతారని, ఆ తర్వాత శని, ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈమబేరకు ఏర్పాట్లు వేగవంతం చేయూల్సి ఉందంటున్నారు. మరోవైపు రాజమండ్రి దుర్ఘటన నేపథ్యంలో హైదరాబాద్, ఇతర జిల్లాల భక్తులు వరంగల్ జిల్లాలో జరిగే పుష్కరాలకు హాజరయ్యేం దుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుం డా ఉండేందుకు వీలుగా నదిలో నీటిప్రవహాం ఉన్న చోట సౌకర్యాలు కల్పించాలి. -
ఒక్క పైసా కూడా ఖర్చుపెట్టని గృహ నిర్మాణశాఖ!
- చట్టసభల్లో సీఎం సిద్ధు వెల్లడి సాక్షి, బెంగళూరు : నిధుల లేమి వల్ల అభివృద్ధి పనులు ఆగిపోవడం సర్వసాధారణం. అయితే వేల కోట్ల రూపాయల నిధులు అందుబాటులో ఉండి కూడా ఖర్చుకాకపోవడం రాష్ట్ర గృహనిర్మాణశాఖలోనే చోటు చేసుకుంటోంది. ఈ విషయాలన్నీ చట్టసభకు సాక్షాత్తు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం తెలియజేశారు. వర్షాకాల సమావేశాల్లో భాగంగా చిక్కమగళూరు జిల్లా తరికెరె ఎమ్మెల్యే జీ.హెచ్ శ్రీనివాస్ అడిగిన ఓ ప్రశ్నకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. ‘2015-16 బడ్జెట్లో గృహ నిర్మాణ శాఖకు రూ.3,818 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో మే 30 వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. ఈ శాఖకు అంబరీష్ మంత్రిత్వ బాధ్యతలు వహిస్తున్నారు.’ అని పేర్కొన్నారు.