వైరల్‌: అభివృద్ధి అన్నందుకు యువకుడి చెంప చెల్లుమనిపించిన ఎమ్మెల్యే | Viral Video: Punjab Congress Mla Slaps Man Who Asks Development Constituency | Sakshi
Sakshi News home page

Punjab Congress Mla Slaps Video: ఏం అభివృద్ధి చేశారన్న యువకుడు.. చెంప చెల్లుమనిపించిన ఎమ్మెల్యే

Published Wed, Oct 20 2021 6:34 PM | Last Updated on Wed, Oct 20 2021 8:48 PM

Viral Video: Punjab Congress Mla Slaps Man Who Asks Development Constituency - Sakshi

చంఢీగడ్‌: సాధారణంగా ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం సహజం. కానీ ఓ రాజకీయ నాయకుడిని అతని నియోజకవర్గంలోని అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఓ యువకుడిని చితకబాదాడు. ఈ షాకింగ్‌ ఘటన పంజాబ్‌లోని పఠాన్‌కోటలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ కావడంతో రాజకీయ దుమారం రేగింది. దీంతో అక్కడి అధికార పార్టీకి ఈ ఘటన తలనొప్పిగా మారింది. 

ఆ వీడియోలో.. పఠాన్‌కోట్ జిల్లాలోని బోయా నియోజకవర్గ ఎమ్మెల్యే జోగిందర్‌ పాల్‌ స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎమ్మెల్యే ప్రసంగం కొనసాగుతుండగా ఓ యువకుడి వచ్చి నియెజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో తెలపాలని ప్రశ్నిస్తాడు. దీంతో అతని ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది పోయి కోపంతో ఊగిపోయిన ఎమ్మెల్యే ఆ యువకుడిని చెంప చెల్లుమనిపించారు. అంతేకాకుండా అక్కడ ఉన్న పోలీసులు, ఇతర నేతలు కూడా ఆ వ్యక్తిని చితకబాదారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.  

రాష్ట్ర హోం మంత్రి సుఖ్జీందర్ సింగ్ రాంధవా ఈ అంశంపై మాట్లాడుతూ: "ఎమ్మెల్యే ఈ విధంగా ప్రవర్తించకూడదు. మేము ప్రజా ప్రతినిధులు, వారికి సేవ చేయడానికి ఇక్కడ ఉన్నామని తెలిపారు. దెబ్బలు తిన్న ఆ యువకుడి తల్లి తన కుమారుడు ప్రజా నాయకుడిని ఒక సాధారణ ప్రశ్న అడిగినందుకు ఇంత దారుణంగా కొట్టడమేం‍టని ఆవేదన వ్యక్తం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement