ఛత్తీస్‌గఢ్‌లో డబ్బు కట్టలతో కాంగ్రెస్ ఎమ్మెల్యే.. బీజేపీ ఫైర్.. | Chhattisgarh Congress MLA Seen With Huge Cash In Viral Video | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో డబ్బు కట్టలతో కాంగ్రెస్ ఎమ్మెల్యే.. బీజేపీ ఫైర్..

Published Sun, Sep 17 2023 7:45 PM | Last Updated on Sun, Sep 17 2023 8:58 PM

Chhattisgarh Congress MLA Seen With Huge Cash In Viral Video - Sakshi

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే డబ్బు కట్టల ముందు కూర్చున్న వీడియో రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. చంద్రాపూర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే రామ్ కుమార్ యాదవ్ డబ్బు కట్టల ముందే కూర్చున్నారు. దీనిపై రాష్ట్ర బీజేపీ మండిపడింది. అవినీతి మయంగా రాష్ట్ర ప్రభుత్వం మారిపోయిందనడానికి ఇదే నిదర్శనమని ఆరోపించింది. 

ఛత్తీస్‌గఢ్ బీజేపీ జనరల్ సెక్రటరీ ఓపీ చౌదరి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో రామ్ కుమార్ చౌదరి బెడ్‌పై కూర్చున్నారు. ఇందులో ఆయన ముందే డబ్బుల కట్టలు ఉన్నాయి. వాటి పక్కనే మరో వ్యక్తి కూర్చుని ఉన్నారు. ఇది కాస్త బయటకు రావడంతో రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. 

చంద్రపూర్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే రామ్ కుమార్ పేదవానిగా తనను తాను చెప్పుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఉన్న ఇంట్లోనే ఉంటున్నట్లు కూడా పేర్కొన్నారు. తన తండ్రి ఇప్పటికీ పశువుల కాపరేనని పలుమార్లు అన్నారు. కానీ ప్రస్తుతం డబ్బుల కట్టలు వెలుగులోకి రావడం వివాదాస్పదంగా మారింది. తనపై బురదజల్లేందుకు ఆ వీడియోను సృష్టించారని ఎమ్మెల్యే రామ్ కుమార్ చౌదరి ఆరోపించారు.  

ఇదీ చదవండి: ఒడిశాను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement