జైపూర్: జగన్ గుర్జార్ అనే దోపిడి దొంగ హత్య, అపహరణ, లూటీలు, దోపిడిలకు సంబంధించి సుమారు 120కి పైగా కేసులు ఎదుర్కొంటున్నాడు. అయితే ఇటీవలే ధోల్‌పూర్ ఎమ్మెల్యేను బెదిరించినందుకు గానూ రాజస్థాన్ పోలీసులు అతనిపై మరింత నిఘా పెట్టారు. గత నెల ధోల్‌పూర్‌లోని కొంతమంది దుకాణదారులతో గుర్జర్‌కు గొడవ జరిగినప్పుడు ఈ వివాదం ప్రారంభమైనట్లు సమాచారం.
అంతేకాదు దుకాణదారులను భయపెట్టేందుకు గుర్జర్ గాల్లోకి కూడా కాల్పులు జరిపాడని స్థానికులు చెప్పారు. దీంతో వ్యాపారులు పోలీసులకు, గిరిరాజ్ మలింగకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు తన గురించి వెతుకుతున్నారని తెలుసుకుని ఆగ్రహంతో ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ మలింగను బెదిరిస్తూ ఒక వీడియోని విడుదల చేశాడు. ఆ వీడియోలో.. "కాంగ్రెస్ నాయకుడిని దుర్భాషలాడుతూ కనిపించాడు. అంతేకాదు మలింగ ఒక వ్యక్తిని చంపమని తనను అడిగాడని పేర్కొన్నాడు. పైగా ఆ వ్యక్తిని జస్వంత్ ఎమ్మెల్యే అని, కానీ తాను అతన్ని చంపలేదని కూడా చెప్పాడు.
అంతేకాదు తనను ఎటువంటి భద్రతా లేకుండా ఎదుర్కొవాలంటూ ఎమ్మెల్యేకి ఒక సవాలు కూడా విసిరాడు". అయితే బారీ ఎమ్మెల్యే ఆ ఆరోపణలను ఖండించాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కూడా ప్రతిస్పందనగా దోపిడి దొంగను ఉద్దేశించి ఒక వీడియోని విడుదల చేశారు. ఆ వీడియోలో ఆ ఎమ్మెల్యే మాట్లాడుతూ...నేను ఎటువంటి పోలీసు రక్షణ తీసుకోలేదు. నేను అతని కోసం ఎదురుచూస్తున్నాను. అతను మగాడైతే నా ఇంటికి వచ్చి నన్ను ఎదుర్కోవాల అని ఒక కౌంటర్ వీడియో విడుదల చేశారు.
ఈ మేరకు ఎమ్మెల్యే మలింగ మాట్లాడుతూ...ఈ వ్యక్తులు స్థానిక గుండాలు. పైగా నా ప్రజలను బెదరిస్తూ ఉంటే చూస్తూ కూర్చోను. నా దగ్గర ఉన్నది వాటర్ పిస్టల్ కాదు అని ఆగ్రహంగా చెప్పారు. ఈ క్రమంలో స్థానిక పోలీసులు మాట్లాడుతూ..జగన్ గుర్జర్‌ను అరెస్టు చేసిన వారికి రూ. 50 వేల రివార్డ్‌ను ప్రకటించాం. మేము అతని ఆచూకి కోసం చంబల్, మోరెనాలో వెతుకుతున్నాము. అతన్ని త్వరలోనే అరెస్టు చేస్తాం. అని ధోల్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ శివరాజ్ మీనా చెప్పారు.
(చదవండి: మూడేళ్ల క్రితమే పెళ్లి.. వరుసకు బావతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో)
Comments
Please login to add a commentAdd a comment