Rajasthan police
-
రాజస్థాన్ దౌసా జిల్లాలో దారుణం..నాలుగేళ్ల చిన్నారిపై..!
-
Arti Singh Tanwar: పోలీస్ వీడియో పాఠాలు
మోసం, లైంగిక దోపిడి నుంచి అమ్మాయిలను రక్షించే లేడీ సబ్ ఇన్స్పెక్టర్గా ఆర్తిసింగ్ తన్వర్కి మంచి పేరుంది. దీంతోపాటు సైబర్ నేరగాళ్ల నుంచి ఎంత అలెర్ట్‌గా ఉండాలో సోషల్ మీడియా ద్వారా అవగాహన కలిగిస్తుంటుంది. చట్టం గురించి వీడియో పాఠాలు చెబుతుంటుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు, మోటివేషనల్ స్పీచ్‌లు ఇస్తుంటుంది. ఆమె గైడ్లైన్స్కి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. రాజస్థాన్ పోలీస్ అకాడమీలో విధులు నిర్వర్తిస్తున్న ఆర్తిసింగ్ తన అభిరుచితో బాధ్యత గల సామాజికవేత్తగానూ ప్రశంసలు అందుకుంటోంది. ఈ లేడీ సబ్ ఇన్స్పెక్టర్ తన విధుల ద్వారానే కాదు రోజూ ఇచ్చే స్ఫూర్తిమంతమైన స్పీచ్‌లు, ఎలాంటి మోసం జరగకుండా ఇచ్చే సైబర్ గైడెన్స్‌తో ప్రతిరోజూ చర్చలో ఉంటుంది. ‘నా అభిరుచిని వృత్తితో జోడీ కట్టించాను. ఫలితం ఎంతోమందికి చేరువయ్యాను’ అంటారు ఈ లేడీ పోలీస్. ► వృత్తి... ప్రవృత్తితో కలిసి.. ఆర్తిసింగ్ కుటుంబ సభ్యులు, బంధువుల్లో చాలామంది పోలీసులుగా ఉన్నారు. వారిలాగే ఆర్తి కూడా పోలీస్ వృత్తినే ఎంచుకుంది. 2012లో రాజస్థాన్ పోలీస్ అకాడమీలో చేరి 2014లో సబ్ ఇన్ స్పెక్టర్‌గా విధులను చేపట్టింది. ‘నేను సోషల్ మీడియా ఫ్రెండ్లీగా ఉంటాను. చేస్తున్న పనుల ద్వారానే నలుగురిలో అవగాహన కలిగిస్తే చాలనుకున్నాను. మహిళల గళం వినిపించాల్సిన చోటు, సైబర్ అవగాహన, సందేశాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఫాలోవర్స్ ఎప్పుడు ఇంతగా పెరిగిపోయారో తెలియనే లేదు’ అనేస్తారు ఆమె నవ్వుతూ. ► సోషల్ మీడియా సెల్... పోలీస్ అకాడమీలో శిక్షణ ఇవ్వడంతోపాటు సోషల్ మీడియా సెల్ కూడా నిర్వహిస్తోంది ఈ సబ్ ఇన్స్పెక్టర్. ‘ఇటీవల మా సిబ్బందికి పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఫొటోతో ఓ మెసేజ్ వచ్చింది. గిఫ్ట్ కార్డుల సాకుతో ఎవరో నకిలీ నంబర్ తో డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. వెంటనే అందరినీ అప్రమత్తం చేశాను. ఇలాగే.. షాపింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్, మెసేజ్‌లలో వచ్చే షార్ట్ లింక్స్... వంటి ఆన్లైన్ మోసాలు ప్రతిరోజూ నమోదవుతున్నాయి. ఈ మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో అవగాహన తప్పనిసరి అనుకున్నాను. లైవ్ ఇంటరాక్షన్ ద్వారా మోసాన్ని నివారించడానికి సూచనలు ఇస్తుంటాను. బాధితులు తమ అనుభవాలను కామెంట్స్‌లో లేదా డైరెక్ట్ మెసేజ్ ద్వారా తెలియజేస్తారు. దీంతో వారికి తక్షణ సహాయం అందివ్వడానికి ప్రయత్నిస్తుంటాం. మోసం, లైంగిక దోపిడీని ఎలా నివారించాలో సూచించే వీడియోలను అప్లోడ్ చేస్తుంటాను’ అని వివరిస్తారు ఆమె. ► యువతకు వీడియో పాఠాలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు, టైమ్ టేబుల్ తయారు చేసుకోవడం, రోజువారీ సిలబస్‌ను ఎలా సిద్ధం చేసుకోవాలి, ఏ సబ్జెక్టులను ఎప్పుడు, ఎలా చదవాలి, కంటెంట్ సులభంగా ఎలా గుర్తుంచుకోవచ్చు... ఇలాంటి వీడియోల కోసం యువత ఎదురు చూస్తుంటుంది. ► కొత్త టెక్నాలజీ పరిచయం సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వీడియోల ద్వారా షేర్ చేస్తుంటుంది ఆర్తి. మొబైల్ హ్యాక్ అయితే ఏం చేయాలి? ఇంట్లోని స్మార్ట్ టీవీ హ్యాక్ అయితే సమస్యను ఎలా పరిష్కరించాలి? సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ కొత్త ఫీచర్లు ఏమిటి?.. వీటికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటుంది ఆర్తి. ► ఖాకీ యూనిఫాంలో.. ‘నా వీడియోలలో చాలా వరకు నేను ఖాకీ యూనిఫాంలోనే కనిపిస్తాను. ఆఫీసులో పని చేస్తున్నప్పుడు చట్టపరమైన సమాచారాన్ని చిన్న చిన్న వీడియోలు చేసి పోస్ట్ చేస్తాను. కొన్నిసార్లు ఇంటి నుంచి ఆఫీసుకు లేదా ఆఫీసుకు నుంచి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు కారులో వీడియోలు షూట్ చేసి అప్లోడ్ చేస్తుంటాను. పోస్ట్ చేసిన గంటల్లోనే వేలల్లో వ్యూస్ వస్తాయి. దీనిని బట్టి ప్రజల్లో చట్టం, న్యాయం, మోసాలకు సంబంధించిన అవగాహన ఎంత అవసరం ఉందో గ్రహించవచ్చు’ అని చెప్పే ఆర్తిసింగ్ను ‘మా మంచి పోలీస్’ అంటూ ప్రశంసిస్తున్నారు ఆమె ఫాలోవర్స్. ప్రతిరోజూ అవగాహన రీల్ ప్రతిరోజూ లక్షలాది మంది ఫాలోవర్లు ఆర్తి గైడెన్స్ రీల్స్ కోసం ఎదురు చూస్తుంటారు. వాటిలో చట్టం, న్యాయానికి సంబంధించి అవగాహన కంటెంట్‌కే ప్రాధాన్యమిస్తుంటుంది. ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్‌ల ద్వారా నాలుగు లక్షల మందికి పైగా ప్రజలు ఆర్తి సూచనలను ఫాలో అవుతున్నారు. -
నాది వాటర్ పిస్టల్ కాదు: కాంగ్రెస్ ఎమ్మెల్యే వర్సెస్ దోపిడి దొంగ
జైపూర్: జగన్ గుర్జార్ అనే దోపిడి దొంగ హత్య, అపహరణ, లూటీలు, దోపిడిలకు సంబంధించి సుమారు 120కి పైగా కేసులు ఎదుర్కొంటున్నాడు. అయితే ఇటీవలే ధోల్పూర్ ఎమ్మెల్యేను బెదిరించినందుకు గానూ రాజస్థాన్ పోలీసులు అతనిపై మరింత నిఘా పెట్టారు. గత నెల ధోల్పూర్లోని కొంతమంది దుకాణదారులతో గుర్జర్‌కు గొడవ జరిగినప్పుడు ఈ వివాదం ప్రారంభమైనట్లు సమాచారం. అంతేకాదు దుకాణదారులను భయపెట్టేందుకు గుర్జర్ గాల్లోకి కూడా కాల్పులు జరిపాడని స్థానికులు చెప్పారు. దీంతో వ్యాపారులు పోలీసులకు, గిరిరాజ్ మలింగకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు తన గురించి వెతుకుతున్నారని తెలుసుకుని ఆగ్రహంతో ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ మలింగను బెదిరిస్తూ ఒక వీడియోని విడుదల చేశాడు. ఆ వీడియోలో.. "కాంగ్రెస్ నాయకుడిని దుర్భాషలాడుతూ కనిపించాడు. అంతేకాదు మలింగ ఒక వ్యక్తిని చంపమని తనను అడిగాడని పేర్కొన్నాడు. పైగా ఆ వ్యక్తిని జస్వంత్ ఎమ్మెల్యే అని, కానీ తాను అతన్ని చంపలేదని కూడా చెప్పాడు. అంతేకాదు తనను ఎటువంటి భద్రతా లేకుండా ఎదుర్కొవాలంటూ ఎమ్మెల్యేకి ఒక సవాలు కూడా విసిరాడు". అయితే బారీ ఎమ్మెల్యే ఆ ఆరోపణలను ఖండించాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కూడా ప్రతిస్పందనగా దోపిడి దొంగను ఉద్దేశించి ఒక వీడియోని విడుదల చేశారు. ఆ వీడియోలో ఆ ఎమ్మెల్యే మాట్లాడుతూ...నేను ఎటువంటి పోలీసు రక్షణ తీసుకోలేదు. నేను అతని కోసం ఎదురుచూస్తున్నాను. అతను మగాడైతే నా ఇంటికి వచ్చి నన్ను ఎదుర్కోవాల అని ఒక కౌంటర్ వీడియో విడుదల చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మలింగ మాట్లాడుతూ...ఈ వ్యక్తులు స్థానిక గుండాలు. పైగా నా ప్రజలను బెదరిస్తూ ఉంటే చూస్తూ కూర్చోను. నా దగ్గర ఉన్నది వాటర్ పిస్టల్ కాదు అని ఆగ్రహంగా చెప్పారు. ఈ క్రమంలో స్థానిక పోలీసులు మాట్లాడుతూ..జగన్ గుర్జర్‌ను అరెస్టు చేసిన వారికి రూ. 50 వేల రివార్డ్‌ను ప్రకటించాం. మేము అతని ఆచూకి కోసం చంబల్, మోరెనాలో వెతుకుతున్నాము. అతన్ని త్వరలోనే అరెస్టు చేస్తాం. అని ధోల్పూర్ పోలీసు సూపరింటెండెంట్ శివరాజ్ మీనా చెప్పారు. (చదవండి: మూడేళ్ల క్రితమే పెళ్లి.. వరుసకు బావతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో) -
హైదరాబాద్‌లో ఐపీఎల్ బెట్టింగ్: రూ.16 కోట్లు సీజ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో అతి పెద్ద ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టైంది. హైదరాబాద్‌లో రాజస్తాన్ రాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్) సోదాలు చేపట్టింది. ఈ తనిఖీల్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్ నడుపుతున్న గణేణ్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురు సభ్యుల నుంచి రూ.16కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణ, ముంబై, ఢీల్లీ రాజస్థాన్ కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ నడుస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. సైబరాబాద్ పరిధిలో ఈ ముఠా బెట్టింగ్‌కు పాల్పడుతోందని తెలిపారు. అరెస్టైన వారిలో గణేష్, సురేష్, పంకజ్, సత్తయ్యతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని చెప్పారు. ఐపీఎల్-2020 మొదలైనప్పటి నుంచి దేశ వ్యాప్తంగా అతిపెద్ద క్రికెట్ బెట్టింగ్ ముఠా అని పోలీసులు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో ముఠాలను ఏర్పాటు చేసి గణేష్ బెట్టింగ్ నడుపుతున్నాడని తెలిపారు. (function(w,d,s,u,n,i,f,g,e,c){w.WDMObject=n;w[n]=w[n]||function(){(w[n].q=w[n].q||[]).push(arguments);};w[n].l=1*new Date();w[n].i=i;w[n].f=f;w[n].g=g;e=d.createElement(s);e.async=1;e.src=u;c=d.getElementsByTagName(s)[0];c.parentNode.insertBefore(e,c);})(window,document,"script","//api.dmcdn.net/pxl/cpe/client.min.js","cpe","5f686da28ba2a6d8cbff0ede",{scroll_to_pause: true}); -
జైలులో నిద్రలేని రాత్రి గడిపా : పాయల్
గాంధీ-నెహ్రు కుటుంబాలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంతో బాలీవుడ్ నటి పాయల్ రోహత్గిని రాజస్తాన్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మంగళవారం సాయంత్రం బుండి సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. తనను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. జైలులో చాలా భయపడినట్టు చెప్పిన పాయల్.. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. జైలులో రాత్రి నిద్ర పట్టలేదని.. చాలా భయమేసిందని చెప్పారు. ‘నేను ఎప్పుడు దేశం గురించే ఆలోచిస్తాను. అలాగే చరిత్రను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. కానీ అకారణంగా జైలుకు వెళ్లాలని కోరుకోను. భవిష్యత్తులో వీడియోలు తీయడం మానుకోను. ఇకపై మరోసారి తప్పు జరగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను. నెహ్రు కుటుంబంపై నేను చేసిన వీడియో.. చిక్కులు తీసుకువస్తుందని అనుకోలేదు. నాకు చట్టాలపై అంతగా అవగాహన లేదు. చట్టపరమైన సమస్యలు ఎదురుకాకుండా.. భావ ప్రకటన స్వేచ్ఛని సద్వినియోగం చేసుకుంటాను. న్యాయవ్యవస్థకు చాలా ధన్యవాదాలు’ అని పాయల్ చెప్పారు. జైలులో గడిపిన అనుభవం గురించి మాట్లాడుతూ.. ‘నన్ను లేడీస్ జనరల్ వార్డ్‌లో ఉంచారు. అక్కడ చాలా చలిగా ఉండటంతో.. రాత్రి అంతా నిద్ర లేకుండా గడిపాను. చాపపై పడుకున్నాను. అక్కడి పరిస్థితులు చూస్తే చాలా భయమేసింది. జైలులో ఆహారం అసలు బాగోలేదు. కానీ స్పైసీ ఫుడ్ కోరుకునే వారికి అది బాగుంటుంది. నేను జైలుకు వెళ్లడం మొదటిసారి.. ఇదే చివరిసారి కూడా అవుతుందని అనుకుంటాన’ని తెలిపారు. -
కూతురిని అమ్మేశాడు
సాక్షి, హైదరాబాద్: మద్యానికి బానిసైన ఓ తండ్రి కన్న కూతుర్ని రూ.3 లక్షలకు అమ్మేశాడు. ఆమెను కొని.. పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు నగరంలో మకాం పెట్టాడు. మరోపక్క బాలిక మిస్సింగ్‌పై రాజస్తాన్ హైకోర్టులో హెబియస్ కార్పస్ దాఖలైంది. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన సిట్ బృందం నగరానికి వచ్చి.. బాలికను గుర్తించడానికి యాచకుల వేషంలో రెండ్రోజుల పాటు మాటు వేసింది. చివరికి చిన్నారి ఆచూకీ కనుగొని రాజస్తాన్‌కు తరలించింది. బాలిక ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణిగా గుర్తించారు. మేనమామ వద్ద దించి వస్తానని.. రాజస్తాన్‌లోని బర్మేర్ జిల్లా సివాన ప్రాంతానికి చెందిన రాజురామ్ మద్యం మత్తులో గత జూన్ 22న తన కుమార్తె (13)ను తీసుకుని ఇంట్లోంచి బయల్దేరాడు. ఆమెను మేనమాన రామ్‌లాల్ వద్ద దించి వస్తానని ఇంట్లో చెప్పాడు. మద్యానికి అవసరమైన డబ్బు కోసం కుమార్తెను అమ్మేయాలని ముందే పథకం వేసిన ఇతగాడు సివాన ప్రాంతానికే చెందిన గోపారామ్ మాలీ సాయం తీసుకున్నాడు. వీరిద్దరూ సన్వాలా రామ్ దాస్పా అనే వ్యక్తితో కలిసి చిన్నారిని బర్మేర్ ప్రాంతానికి చెందిన భరత్‌కుమార్ (32)కు రూ.3 లక్షలకు అమ్మేశారు. తన సోదరుడైన మోహన్‌లాల్ సహకారంతో భరత్ ఆ చిన్నారిని పెళ్లి చేసుకున్నాడు. ఆర్థికంగా స్థితిమంతుడైన భరత్.. బాలికతో కలిసి హైదరాబాద్ నగర శివార్లలోని ఆదిభట్ల పోలీసుస్టేషన్ పరిధి తుర్కయాంజాల్‌లో ఉన్న పరిచయస్తుడి వద్ద ఆశ్రయం పొందాడు. నిలదీసి అడిగితే.. నిజం చెప్పాడు జూన్ 26న బాలిక మేనమామ రామ్‌లాల్ సివానలోని సోదరి వద్దకు వచ్చాడు. చిన్నారి గురించి వాకబు చేయగా, తనకేం తెలియదని చెప్పాడు. దీంతో అనుమానించిన కుటుంబసభ్యులు రాజురామ్ను నిలదీశారు. కుమార్తెను రూ.3 లక్షలకు బర్మేర్‌కు చెందిన వ్యక్తికి అమ్మేశానని, ఇందుకు గోపారామ్ సహకరించాడని చెప్పాడు. దీంతో బాలిక మేనమామ రామ్‌లాల్ ఫిర్యాదుతో జూన్ 30న సివాన ఠాణాలో మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే, కేసు దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యం వహించడంతో రామ్‌లాల్ రాజస్తాన్ హైకోర్టును ఆశ్రయించి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు.. చిన్నారిని తండ్రే విక్రయించాడని, దాదాపు మూడురెట్ల వయసున్న వ్యక్తితో పెళ్లి చేశాడని తెలిసినా పోలీసులు పట్టనట్లు వ్యవహరించడాన్ని తప్పుపట్టింది. బాలిక కోసం గాలింపు మొదలైందిలా.. సివాన పోలీసుస్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) దౌడ్ ఖాన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం (సిట్) కేసు దర్యాప్తు చేపట్టింది. ప్రాథమిక ఆధారాలతో జూలై చివరి వారంలో చిన్నారి తండ్రి రాజురామ్, దళారిగా వ్యవహరించిన గోపారామ్ను అరెస్టు చేశారు. విచారణలో సన్వాలా రామ్ దాస్పా పేరు బయటికొచ్చింది. అతడిని విచారించగా, బర్మేర్‌కు చెందిన భరత్‌కుమార్‌కు చిన్నారిని అమ్మేశామని, అతడు పెళ్లి చేసుకున్నాడని చెప్పాడు. దీంతో సివాన పోలీసులు భరత్, మోహన్‌లాల్ కోసం గాలింపు ప్రారంభించారు. చాటింగ్ చేయబోతే.. జాడ దొరికింది పోలీసులు గాలిస్తున్నారని తెలిసి భరత్‌కుమార్, మోహన్‌లాల్ తమ సెల్ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. రెండుసార్లు హైదరాబాద్ వచ్చిన సివాన పోలీసులు.. వివిధ ప్రాంతాల్లో గాలించి వెనుదిరిగారు. వారం క్రితం వాట్సాప్‌లో చాటింగ్ చేయడానికి భరత్‌కుమార్ తన సెల్‌ఫోన్ ఆన్ చేశాడు. ఫలితంగా అతడి ఆచూకీ తుర్కయాంజాల్‌లో ఉన్నట్లు సివాన పోలీసులు గుర్తించారు. వెంటనే హెడ్–కానిస్టేబుల్ సేతాన్ సింగ్, మరో కానిస్టేబుల్ సిటీకి వచ్చారు. తమ కదలికలు బయటపడితే భరత్‌కుమార్.. బాలికను తీసుకుని పారిపోతాడని అనుమానించారు. దీంతో యాచకుల వేషంలో రెండురోజుల పాటు తుర్కయాంజాల్ ప్రాంతంలో గాలించారు. చివరకు మంగళవారం బాలికను కనిపెట్టి రెస్క్యూ చేయడంతో పాటు భరత్‌కుమార్, మోహన్‌లాల్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. -
ఈ పోలీస్ ‘మామూలోడు’ కాదు!
జైపూర్: వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది. అందుకే ఓ పోలీస్ అధికారి తన ప్రీ వెడ్డింగ్‌ను అంతే వినూత్నంగా ప్లాన్ చేసుకున్నారు. కానీ అది కాస్తా బెడిసి కొట్టింది. పోలీస్ యూనిఫామ్‌లోనే షూటింగ్ చేయడంపై కేసు నమోదైంది. రాజస్తాన్‌కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) ధన్పత్ సింగ్ వివాహం నిశ్చయమైంది. అందుకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ షూట్‌ను మూడు నెలల కిందట జరిపారు. ఇది కాస్తా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయింది. ఈ వీడియోలో తనకు కాబోయే భార్య స్కూటీపై వెళ్తుండగా ఆ ఎస్సై ఆమెను ఆపుతాడు. హెల్మెట్ పెట్టుకోనందుకు ఫైన్ కట్టమంటాడు. దీంతో అతని చొక్కా జేబులో కొంత డబ్బు పెట్టి వెళ్లిపోతుంది. ఇదంతా ఎస్సై పోలీస్ యూనిఫాంలోనే షూట్ చేయడంతో ఉన్నతాధికారులు ఆయనపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. యూనిఫాంలో ఉండి లంచం తీసుకోవడం దాన్ని ప్రోత్సహించేలా ఉందని మందలిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు నమోదైందని, దర్యాప్తు చేస్తామని ఐజీ హవా సింగ్ గుమారియా తెలిపారు. దీనిపై ఎస్సై ధన్పత్ స్పందిస్తూ.. ‘ఈ వీడియో కావాలని తీసింది కాదు. నేను యూనిఫాంలో ఉన్న సన్నివేశాన్ని తీసేయాల్సిందిగా వీడియో గ్రాఫర్‌కు చెప్పాను. కానీ తాను మొత్తం వీడియోను అలాగే సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు’అని చెప్పారు. -
ఆ బాధితురాలికి పోలీస్ ఉద్యోగం
జైపూర్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అల్వార్ గ్యాంగ్‌రేప్ కేసు బాధితురాలికి రాజస్తాన్ ప్రభుత్వం పోలీస్ శాఖ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. గత నెలలో రాజస్తాన్‌లోని థనగాజి-ఆల్వార్ బైపాస్ రోడ్డు వద్ద బైక్‌పై వెళుతున్న దంపతులను అడ్డగించిన ఐదుగురు దుండగులు.. వారిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి భర్త ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మే 2న స్థానిక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. మే 4న ఈ జుగుప్సాకరమైన ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దుండగుల్లోని ఒకరు ఈ దుశ్చర్యను తన మొబైల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో అధికార, ప్రతిపక్షాలు మధ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగాయి. ప్రధాని నరేంద్రమోదీ, బీఎస్సీ ఛీఫ్ మాయావతి, ప్రముఖులంతా ఈ ఘటనను ఖండించారు. రాజకీయంగా దుమారం రేగంతో పోలీసులు సైతం వేగంగా స్పందించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భావించగా.. బాధితురాలు పోలీసు శాఖలో పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేసింది. గ్యాంగ్ రేప్‌లకు పాల్పడే దుండగుల తాట తీస్తానని తెలపడంతో రాజస్తాన్ ప్రభుత్వం ఆ దిశగా అవకాశం కల్పిస్తూ.. బాధితురాలికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. -
రణ్వీర్ ట్వీట్‌కు.. పోలీసుల సినిమాటిక్ రిప్లై
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ చేసిన ఓ ట్వీట్‌కు రాజస్తాన్ పోలీసుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ ట్వీట్‌కు రాజస్తాన్ పోలీసులు ఇచ్చిన రిప్లై సరదాగా ఉండటమే కాకుండా, మనసుకు హత్తుకునేలా ఉంది. తొలుత ఓ ట్వీట్లో రణ్వీర్, రాజస్తాన్ పోలీసులతో కలిసి దిగిన ఓ ఫొటోను షేర్ చేసి వారికి ధన్యవాదములు తెలిపారు. అయితే దీనిపై సినిమాటిక్‌గా స్పందించిన రాజస్తాన్ పోలీసులు.. రణ్వీర్ సినిమాలలో కొన్ని పేర్లను ఉదహరిస్తు ఓ సందేశాన్ని ఉంచారు. ‘మీరు గల్లీ బాయ్‌గా వచ్చారు. కానీ బాజీరావు మస్తానీ, సూపర్ పోలీసు సింబా లాగా గొప్ప స్థాయికి ఎదిగారు. మీతో ఉంటే ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. నెక్స్ట్ టైమ్ నువ్వు రాజస్తాన్‌కు.. నీ భార్య దీపికా పదుకోన్‌తో కలిసి రావాలి.. అప్పుడు ప్రజలు బ్యాండ్ బాజా భారత్‌తో వస్తార’ని సరదాగా వ్యాఖ్యానించారు. You came like a #GullyBoy .@RanveerOfficial but turned out you were much more - Bajirao Mastani, & eventually a super cop #Simba. Always a delight to be with you. Next time you are in Raj with @deepikapadukone, people will come with Band Baaja Baraat. @JalorePolice @MumbaiPolice https://t.co/hMmghp0Mcp — Rajasthan Police (@PoliceRajasthan) January 28, 2019 -
ఆ గోరక్షకులను గుర్తిస్తే నగదు రివార్డు!
గో సంరక్షణ పేరిట 55 ఏళ్ల పెహ్లూ ఖాన్‌ను కిరాతకంగా చంపిన ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాజస్థాన్ పోలీసులు ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. పెహ్లూ ఖాన్‌ను కొట్టిచంపిన 'గోరక్షకుల' గురించి ఎవరైనా సమాచారం ఇస్తే.. వారికి రూ. 5వేల రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఆరుగురు దుండగులను గుర్తించారు. హర్యానాకు చెందిన పెహ్లూ ఖాన్ రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా మీదుగా గోవులను వాహనంలో తరలిస్తుండగా.. ఆయన బృందంపై రహదారిపై మాటువేసిన గోరక్షకులు అత్యంత దారుణంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్‌కు చెందిన కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్టు భావిస్తున్నారు. ఈ దాడిలో నలుగురు గాయపడగా.. తీవ్రంగా గాయపడిన పెహ్లూ ఖాన్ అల్వార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ అమానుష దారుణంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ప్రేమజంట కోసం హైదరాబాద్‌కు రాజస్థాన్ పోలీసులు
-
లింగనిర్ధారణ కేసులో వైద్యుడి అరెస్టు
గుజరాత్లో అక్రమంగా లింగనిర్ధారణ చేసిన కేసులో ఒక వైద్యుడిని, మధ్యవర్తిని రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌లోని మెహసానా ప్రాంతంలో గల ఒక ప్రైవేటు ఆస్పత్రిలో పోలీసు బృందం డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది. డాక్టర్ జయంతి లాల్ పటేల్ (64), మధ్యవర్తి నీరవ్ పటేల్ (23)లను ఈ సందర్భంగా అరెస్టు చేశారు. ఇద్దరినీ స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా, మేజిస్ట్రేట్ వారిని ఒకరోజు పోలీసు కస్టడీకి పంపారు. లింగనిర్ధారణ చేసినందుకు డాక్టర్ రూ. 15వేలు తీసుకునేవారని, అయితే మధ్యవర్తి మరో రూ. 20వేలు తీసుకునేవారని పోలీసులు చెప్పారు. పిల్లలు పుట్టకముందే లింగ నిర్ధారణ పరీక్షలు చేసేవారిని పట్టుకోడానికి రాజస్థాన్ పోలీసులు తమ రాష్ట్రం వెలుపల నిర్వహించిన ఆపరేషన్లలో ఇది ఐదోది కావడం గమనార్హం. -
కబ్జా భూమిని వాద్రా కంపెనీకి అమ్మారు!
బికనీర్: ప్రభుత్వ భూమి కొనుగోలు వ్యవహారంలో రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీకి రాజస్థాన్ పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారు. కుట్రపూరితంగా మోసం చేసి కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని ఆయన కంపెనీకి అమ్మారని పోలీసులు తేల్చారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడైన రాబర్ట్ వాద్రా, ఆయన తల్లి ప్రమోట్ చేస్తున్న 'స్కై లైట్ హస్పిటాలిటీ'పై వసుంధరారాజే నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వం 2014లో కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీ కొనుగోలు చేసిన 69.55 హెక్టార్లు ప్రభుత్వ భూమిని అభియోగాలు మోపారు. అయితే ఈ భూమి విషయంలో బొనాఫైడ్ కొనుగోలు దారుగా ఉన్న వాద్రాను మోసపోయారని, ఆయన మోసానికి బాధితుడయ్యారని డీఎస్పీ రామావతర్ సోని విలేకరులకు తెలిపారు. ప్రభుత్వ భూమిని ఆయన కంపెనీకి అమ్మినట్టు విచారణలో తేలిందని ఆయన వివరించారు. భూముల కొనుగోలు విషయంలో రాబర్ట్ వాద్రా కంపెనీలు అవకతవకలకు పాల్పడినట్టు రాజస్థాన్, హర్యానాలోని బీజేపీ ప్రభుత్వాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. -
ప్రేమజంటని రాజస్థాన్ తరలించిన పోలీసులు
విజయవాడ: రాజస్థాన్ నుంచి పారిపోయి వచ్చి... విజయవాడ శివారులోని కానూరులో తలదాచుకున్న ఓ ప్రేమ జంటను ఆ రాష్ట్ర పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... రాజస్థాన్‌లోని పఠాన్జోన్సిరి మండలం బార్విన్న గ్రామానికి చెందిన పూరన్కుమారి, బాబూరాం గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఆ విషయం పెద్దలకు తెలిసింది. దాంతో వారిని కట్టడి చేశారు. దీంతో ఇంట్లో ఎవరికి చెప్పకుండా పారిపోయారు. ఆ క్రమంలో కానూరు వచ్చారు. స్థానికంగా ఉంటున్న ఆదే గ్రామానికి చెందిన రత్నరాందేవసి ఇంట్లో కొన్ని రోజులుగా తలదాచుకుంటున్నారు. కాగా పిల్లలు ఆచూకీ తెలియకపోవడంతో వారివారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ప్రేమ జంట కానూరులో ఉన్నట్లు గుర్తించారు. రాజస్థాన్ పోలీసులు కానూరు చేరుకుని ప్రేమజంటను గురువారం రాజస్థాన్ తీసుకెళ్లారు.