జైపూర్: వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది. అందుకే ఓ పోలీస్ అధికారి తన ప్రీ వెడ్డింగ్‌ను అంతే వినూత్నంగా ప్లాన్ చేసుకున్నారు. కానీ అది కాస్తా బెడిసి కొట్టింది. పోలీస్ యూనిఫామ్‌లోనే షూటింగ్ చేయడంపై కేసు నమోదైంది. రాజస్తాన్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) ధన్‌పత్ సింగ్ వివాహం నిశ్చయమైంది. అందుకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ షూట్‌ను మూడు నెలల కిందట జరిపారు. ఇది కాస్తా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయింది. ఈ వీడియోలో తనకు కాబోయే భార్య స్కూటీపై వెళ్తుండగా ఆ ఎస్సై ఆమెను ఆపుతాడు. హెల్మెట్ పెట్టుకోనందుకు ఫైన్ కట్టమంటాడు.
దీంతో అతని చొక్కా జేబులో కొంత డబ్బు పెట్టి వెళ్లిపోతుంది. ఇదంతా ఎస్సై పోలీస్ యూనిఫాంలోనే షూట్ చేయడంతో ఉన్నతాధికారులు ఆయనపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. యూనిఫాంలో ఉండి లంచం తీసుకోవడం దాన్ని ప్రోత్సహించేలా ఉందని మందలిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు నమోదైందని, దర్యాప్తు చేస్తామని ఐజీ హవా సింగ్ గుమారియా తెలిపారు. దీనిపై ఎస్సై ధన్‌పత్ స్పందిస్తూ.. ‘ఈ వీడియో కావాలని తీసింది కాదు. నేను యూనిఫాంలో ఉన్న సన్నివేశాన్ని తీసేయాల్సిందిగా వీడియో గ్రాఫర్‌కు చెప్పాను. కానీ తాను మొత్తం వీడియోను అలాగే సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశారు’అని చెప్పారు.
ఈ పోలీస్ ‘మామూలోడు’ కాదు!
Published Thu, Aug 29 2019 4:14 AM | Last Updated on Thu, Aug 29 2019 4:50 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment