bribery demand
-
YSR Kadapa: రిజిస్ట్రేషన్లపై నిఘా నేత్రం
సాక్షి, కడప కోటిరెడ్డిసర్కిల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత మూడేళ్లుగా అవినీతి రహిత పాలన చేస్తున్నారు. నాడు ప్రతిపక్ష నేతగా చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజలకు నవరత్నాల పథకాల్లో భాగంగా ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు. అవినీతికి అడ్డాగా ఉన్న శాఖల్లో ఒకటైన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌లో భూములు, స్థలాల క్రయ విక్రయదారుల నుంచి అధికారులతోపాటు దస్తావేజు లేఖర్లు వేలల్లో లంచాలు వసూలు చేసి వారి జేబులను ఖాళీ చేసేవారు. దీంతో ఆ శాఖలో అవినీతికి చెక్ పెట్టేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆ శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలో కెమెరాల ఏర్పాటు వైఎస్సార్ జిల్లాలో కడప అర్బన్, కడప రూరల్, కడప చిట్స్, సిద్దవటం, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, వేంపల్లె, కమలాపురం, దువ్వూరు, అన్నమయ్య జిల్లాలో చిట్వేలి, పుల్లంపేట, రాజంపేట, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, సుండుపల్లె, మదనపల్లె, పీలేరు, బి.కొత్తకోట, కలికిరి, వాయల్పాడు, తంబళ్లపల్లెలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. మొత్తం 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో కార్యాలయాలకు ప్రతిరోజు వచ్చి వెళ్లే వారిని పరిశీలించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అవినీతికి చెక్ పెట్టేందుకు అవకాశం ఉంటుంది. చదవండి: (ఆర్ఎంపీల చేతిలో అస్త్రాలివే.. ఇష్టమొచ్చినట్లు వాడితే అంతే సంగతులు) వెబ్సైట్లో దస్తావేజు నమూనా స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారంలో క్రయ విక్రయదారులు ఎక్కువగా దస్తావేజుల లేఖర్లను ఆశ్రయించడంతో పదుల సంఖ్యలో దస్తావేజు లేఖర్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. వారితోపాటు కొంతమంది రిజిస్ట్రేషన్ సిబ్బంది కాకుండా బినామీలు కార్యాలయాలు తెరిచి తమ వారితో నిర్వహిస్తున్నారు. దీంతో దస్తావేజుల తయారీ సమయంలో లేఖర్లు చెప్పిందే వేదంగా అక్కడి వ్యవహారాలు నడిచేవి. క్రయ విక్రయదారులను లేఖర్ల బాధ నుంచి తప్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా నమూనా దస్తావేజులను ఆ శాఖ వెబ్సైట్లో పొందుపరిచారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు స్థిరాస్తి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో ప్రజలు లంచాల బారిన పడకుండా వారి సొంత గ్రామాల్లో వార్డుల పరి«ధిలోనే స్థిరాస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరిగేలా ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించింది. ఇప్పటికే ఈ ప్రక్రియకు సంబంధించి సచివాలయ సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేసుకున్నారు. అవినీతిపై ఫిర్యాదు చేయవచ్చు వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి అధికారులు, సిబ్బంది తీరుపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే నేరుగా ఫోన్ చేసి సమాచారం అందించవచ్చు. లంచాలపై ఫిర్యాదు చేయాలనుకుంటే 14400 నంబరుకుగానీ, జిల్లా రిజిస్ట్రార్‌కుగానీ నేరుగా సమాచారం అందించవచ్చు. ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. – బి.శివరాం, డీఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ, కడప 14400 నంబరుతో ఫ్లెక్సీల ఏర్పాటు అవినీతికి అడ్డుకట్ట వేసేలా, అలాగే లంచగొండితనంపై ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం తీసుకు వచ్చిన టోల్ ఫ్రీ నంబరు 14400పై ప్రజ లకు అవగాహన కలిగేలా వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలోని 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. -
ట్రెండ్ మారింది.. ఎవ్వరూ నేరుగా లంచం తీసుకోవట్లే.. అంతా సెపరేటే!
సాక్షి, వరంగల్: కాలం మారింది. ఇప్పుడు అధికారులెవ్వరూ నేరుగా లంచం తీసుకోవట్లే. గోడకు సీసీ కెమెరాలు, ఫోన్లలో రికార్డింగులు వచ్చినప్పటి నుంచి బల్లాకింద చేతులు పెట్టట్లేదు. ఏది ఉన్నా.. సామరస్యంగానే అవినీతికి పాల్పడుతున్నారు. మధ్యవర్తులను పెట్టుకొని లంచాల పర్వం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ విభాగాల్లో లంచానికి ఓ కొత్త టర్మినాలజీ కూడా ఉంది. ఉదాహరణకు ఆఫీస్ చార్జ్, ఫార్మాలిటీ, స్పెషల్ ఫీజు వంటి పదాలను విస్తృత అర్థంలో లంచానికి వాడుతున్నారు. మహానగరంలో ఇంటి పర్మిషన్ తీసుకునే సమయంలో పైన పేర్కొన్న పదాలు తరచూ వినిపిస్తాయి. ఆయా విభాగాల అధికారులకు మధ్యవర్తుల ద్వారా కనీసం లక్ష రూపాయలైనా చదివించుకోవాల్సిందే! రాష్ట్ర ప్రభుత్వం సేవల్లో సులభతరం, సత్వ రం, పారదర్శకం కోసం టీఎస్–బీపాస్‌ను తీసుకొ చ్చింది. స్వీయ «ధ్రువీకరణ (సెల్ఫ్ సర్టిఫికెట్) ఆధారంగా తక్షణమే భవన నిర్మాణ పర్మిషన్ తీసుకోవచ్చు. కానీ.. ప్రజలకు టీఎస్–బీపాస్‌పై అవగాహన లేక బల్దియా లైసెన్స్ సర్వేయర్లను ఆశ్రయిస్తున్నారు. దరఖాస్తులు, ప్లాన్లు, ఫీజుల సొమ్ము సైతం నెట్ బ్యాంకింగ్ ద్వారా స్వీకరిస్తున్నారు. వీటిని ఆన్లైన్లో అప్లోడ్ చేసే బాధ్యతను మహా నగర పాలక సంస్థ గుర్తింపు పొందిన ప్రైవేట్ లెసెన్స్ సర్వేయర్లకే అప్పగించింది. దీంతో ప్రైవేటు సర్వేయర్లు అదనపు వసూళ్లతో భవన నిర్మాణదారులకు చుక్కలు చూపిస్తున్నారు. కాస్త చదువుకున్న వారు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు సొంతంగా పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నా.. అధికారులు పర్మిషన్ అప్రూవల్ చేయడం లేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి. గంటల్లో పని.. వేలల్లో ఫీజు! కొత్తగా ఇంటికి పర్మిషన్ తీసుకోవాలంటే ఇంటి వైశాల్యాన్ని బట్టి కొంత రుసుము ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇది నేరుగా ప్రభుత్వానికి చేరుతుంది. కానీ.. నక్షాలు (ప్లాన్) గీసే లైసెన్స్డ్ సర్వేయర్లు ఒక ప్లాన్ గీస్తే ఎంత తీసుకోవాలి అనేదానిపై స్పష్టత లేదు. ఇదే అదనుగా ప్రైవేట్ సర్వేయర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మహానగరంలో కొత్త ఇంటి నిర్మాణ పనుల కోసం వచ్చే వారి నుంచి ఆన్లైన్ పేరుతో అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. బిల్డింగ్ ప్లాన్లు ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు లైసెన్స్డ్ ప్రైవేట్ సర్వేయర్లు పెద్దమొత్తంలో నగదు వసూలు చేస్తున్నారు. ప్లాన్ గీసేందుకు ముందు ప్రైవేటు సర్వేయర్ ప్లాట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొలతల ప్రకారం ప్లాన్(నక్ష) గీసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా రెండు, మూడు గంటల వ్యవధిలో పూర్తవుతుంది! కానీ.. ఇందుకు సర్వేయర్లు వేలల్లో ఫీజు వసూలు చేస్తుంటారు. చదవండి: హైదరాబాద్: భార్య కోసం ఇద్దరు భర్తల లొల్లి.. మీడియా సమావేశం పెట్టి మరీ.. అ‘ధనం’ కావాల్సిందే! సర్వేయర్ గీసిచ్చిన ప్లాన్ ఆధారంగా టౌన్ ప్లానింగ్ అధికారులు పర్మిషన్ ఫైల్‌ను ఉన్నతాధికారుల వద్దకు పంపిస్తారు. ఆ తర్వాత వారు డాక్యుమెంట్లు వెరిఫై చేసి అప్రూవల్ ఇస్తారు. పర్మిషన్ కోసం వచ్చిన వారి నుంచి సర్వేయర్లు ముందుగా తక్కువ మొత్తంలో నగదు తీసుకుంటారు. ఆ తర్వాత ఆన్లైన్, వివిధ కారణాల పేరుతో అదనపు పైకం కావాలని వేధిస్తారు. ప్రజలెవరైనా విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే ప్రైవేట్ సర్వేయర్లు మాకేం సంబంధం? మీ ఇష్టం ఎంతైనా ఇవ్వండి.. అంటూ బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు సైతం ఉన్నాయి. సర్వేయర్లు కాదు.. మధ్యవర్తులు మహా నగర పాలక సంస్థ నుంచి లైసెన్స్ పొందిన సర్వేయర్లు 85 మంది వరకు ఉంటారు. ఏడాదికోసారి లైసెన్స్ రెన్యూవల్ కోసం రూ.10వేలు చెల్లిస్తారు. భవన నిర్మాణాలు, నల్లా కనెక్షన్లకు సంబంధించిన ప్లాన్లు వీరు గీసి ఇవ్వాల్సి ఉంటుంది. టౌన్ ప్లానింగ్ అధికారుల పరిధిలో వీరంతా పని చేయాలి. పేరుకు మాత్రం ప్రైవేట్ సర్వేయర్లు అయినా.. తెర వెనుక మాత్రం సెటిల్మెంట్లు చేస్తున్నారు. భవన నిర్మాణ అనుమతులు తొందరంగా రావాలంటే వీరి ద్వారా వెళ్లాల్సిందే. టౌన్ ప్లానింగ్ అధికారులకు, ప్రజలకు మధ్య వారధిలా(మధ్యవర్తులుగా) పని చేస్తున్నారు. కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్ కార్యాలయాల్లో కొందరు బడా సర్వేయర్ల కనుసన్నల్లో బిల్డింగ్ అనుమతుల ఫైళ్లు పరిష్కారమవుతున్నాయనేది బహిరంగ రహస్యమే. చదవండి: పెద్దలు పెళ్ళికి నిరాకరించారని ప్రేమ జంట ఆత్మహత్య వాస్తవానికి.. గతంలో మాన్యువల్ విధానం ఉన్నప్పుడు బిల్డింగ్ ప్లాన్ గీసేందుకు రూ.3వేల నుంచి రూ.4వేలు తీసుకునే వారు. గత నాలుగేళ్లుగా ఆన్లైన్ బిల్డింగ్ అప్లికేషన్ విధానం అమల్లోకి వచ్చింది. భవన నిర్మాణ ప్లాన్, దస్తావేజులు తదితర వివరాలన్నీ స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నామని చెప్పి ఒక్కో దరఖాస్తుదారుడి నుంచి రూ.15వేల నుంచి రూ.25వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇదేంటని అడిగితే ఆన్లైన్ సేవలకు అదనపు రుసుములని చెబుతున్నారు. ఇదే విషయమై గతంలో చాలామంది టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ.. తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. ఆధునిక సేవలు నగర ప్రజలకు అదనపు భారంగా మారాయి. లైసెన్స్ సర్వేయర్ అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వం పురపాలక చట్టం–2019 తీసుకొచ్చింది. భవన నిర్మాణ అనుమతులకు ఎవరి ప్రమేయం లేకుండా స్వీయ ధ్రువీకరణతో సాధారణ వ్యక్తి కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 21 రోజుల్లోగా భవన నిర్మాణ దరఖాస్తు పరిష్కారం కాకపోయినా అనుమతి వచ్చినట్లుగా భావించవచ్చు. సర్వేయర్లను ఆశ్రయించాల్సిన పని లేదు. – వెంకన్ననాయక్, బల్దియా సిటీ ప్లానర్ అధికారులకూ తాయిలాలు! ఫైల్ అప్రూవల్ కావాలంటే చాలా పెద్ద తతంగం ఉంటుంది. ప్రైవేట్ సర్వేయర్లు వివిధ శాఖల అధికారులకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతారు. ఈ క్రమంలో నోటికెంతొస్తే అంత వసూలు చేస్తారు. ఏదైనా అడిగితే నాలుగైదు విభాగాల అధికారులకు చెల్లించగా నాకేం మిగలదు! అని సమాధానం చెబుతారు. అంటే ఈ లెక్కన అన్ని విభాగాల అధికారులకు తాయిలాలు అందుతున్నట్లే కదా! చదవండి: పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. వ్యర్ధాలపై తస్మాత్ జాగ్రత్త.. -
Bribe: కదిరి తహశీల్దార్ ఆడియో వైరల్.. కలెక్టర్ సీరియస్
అనంతపురం అర్బన్: కదిరి తహసీల్దారు మారుతిపై కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ చర్యలు తీసుకున్నారు. ఆయన్ను కదిరి తహసీల్దారు స్థానం నుంచి రిలీవ్ చేస్తూ..కలెక్టరేట్లో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: యాంకర్ అనసూయ ఇంట్లో తీవ్ర విషాదం పట్టాదారు పాసు పుస్తకం మంజూరుకు తహసీల్దారు లంచం అడుగుతున్నట్లుగా వాయిస్ రికార్డ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో ఆయనపై కదిరి ఆర్డీఓ ద్వారా ప్రాథమిక విచారణ చేయించారు. ఆర్డీఓ ఇచ్చిన నివేదికపై కలెక్టర్ సంతృప్తి చెందలేదు. ఈ వ్యవహారంపై జాయింట్ కలెక్టర్‌తో సమగ్ర విచారణ చేయించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. విచారణ అధికారి నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. -
ఢిల్లీ: తెలుగు ఎంపీ నివాసంలో సీబీఐ సోదాలు
సాక్షి, ఢిల్లీ: టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు.. ముగ్గురిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి నుంచి ముగ్గురు వ్యక్తులు లంచం డిమాండ్ చేశారు. వారిని రాజీవ్ భట్టాచార్య, శుభాంగి గుప్తా, దుర్గేశ్ కుమార్‌గా గుర్తించారు. సీబీఐ సోదాల సమయంలో ఎంపీ ఇంట్లో లేరు. మిగిలిన వారిద్దరూ ఎవరో తెలియదు: ఎంపీ సీబీఐ సోదాలపై ఎంపీ మాలోతు కవిత స్పందించారు. దుర్గేష్‌కుమార్ తమ డ్రైవర్ అని, నా నివాసంలోని స్టాఫ్ క్వార్టర్స్ అతనికి ఇచ్చానని పేర్కొన్నారు. మిగిలిన వారిద్దరూ ఎవరో తనకు తెలియదన్నారు. ఢిల్లీలో తనకు పీఏలు లేరని.. పట్టుబడినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు. చదవండి: మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలో దారుణం.. నాంపల్లి హైకోర్టుకు హాజరైన విజయశాంతి -
లంచం అడిగే.. అడ్డంగా దొరికిపాయే..
సాక్షి, శ్రీకాకుళం: మ్యుటేషన్ కోసం లంచం డిమాండ్ చేసిన మందస వీఆర్ఓ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. మందస మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన ప్రభాకర్ పండాకు బుడారిసింగి పంచాయతీలో 67 సెంట్ల భూమి ఉంది. ఆయన మృతి చెందడంతో కుమారుడు రాజేష్‌పండా తన తండ్రి పేరున ఉ న్న భూమికి మ్యుటేషన్ కావాలని పది రోజుల కిందట సోంపేట మండలంలోని కొర్లాంలో గల మీ సేవలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దడానికి వీఆర్ఓ బి.రేణుకారాణి రంగంలోకి దిగారు. రూ.3వేలు లంచం ఇస్తే గానీ పని జరగదని రాజేష్ పండాకు తేల్చి చెప్పారు. దీంతో ఆయన అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. బాధితుడి వాదనలు విన్న ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ఎస్ రమణమూర్తి తన సిబ్బందితో కలిసి మందస తహసీల్దార్ కార్యాలయంలోనే వీఆర్వోను పట్టుకునేందుకు ప్లాన్ వేశారు. సీఐలు భాస్కరరావు, హరి, ఎస్ఐలు సత్యారావు, చిన్నంనాయుడులతో పాటు సుమారు 15 మంది సిబ్బంది బుధవారం మందస తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని మాటు వేశారు. రాజేష్‌పండా నగదును వీఆర్వో రేణుకారాణికి ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రెవెన్యూ కార్యాలయంలోనే ఈ సంఘటన జరగడంతో అధికారులు, ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. ఎప్పటి నుంచో తహసీల్దార్ కార్యాలయంపై ఆరోపణలు వినిపిస్తుండగా, వీఆర్వో అదే కార్యాలయంలో దొరికిపోవడంతో స్థానికంగా ఈ సంఘటన సంచలనం కలిగిచింది. మందస తహసీల్దార్ కార్యాలయంలో అవినీతికి పాల్పడిన వీఆర్ఓ బి.రేణుకారాణిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాం. ఆమెను విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తాం. అధికారులు, ఉద్యోగు లు, సిబ్బంది అవినీతిపై బాధితులు ఏసీబీకి ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం జీతం ఇస్తోంది. అవినీతికి పాల్పడితే ఎవ్వరైనా ఉపేక్షించం. 14400 అనే నంబరు కు గానీ, ఏసీబీ డీఎస్పీ 9440446124, సీఐలు 7382629272, 9440446177 అనే నంబర్లకు ఫిర్యాదు చేయాలి. లంచం తీసుకోవడం, ఇవ్వడమూ నేరమే. బాధితులకు ఏసీబీ అండగా ఉంటుంది. – బీఎస్ఎస్వీ రమణమూర్తి, డీఎస్పీ, యాంటీ కరప్షన్ బ్యూరో చదవండి: భార్యపై పెట్రోల్ పోసి హత్య చేసిన భర్త -
డిప్యూటీ తహసీల్దార్ నారాయణపై సస్పెన్షన్ వేటు
సాక్షి, మెదక్ : జిల్లాలోని నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తిలో 112 ఎకరాలకు ఎన్ఓసీ కోసం రూ.1.12 కోట్ల లంచం డిమాండ్ ఘటనలో అదనపు కలెక్టర్ నగేశ్, నర్సాపూర్ ఆర్డీఓ అరుణారెడ్డితోపాటు మరో ముగ్గురు కటకటాలపాలయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ బాగోతాన్ని మరువక ముందే మెదక్ కలెక్టరేట్లో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్న నారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. గతంలో పనిచేసిన జిన్నారం మండలంలో మృతిచెందిన తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి.. నకిలీ పట్టాపాస్ బుక్కులు సృష్టించడంలో ఆయన పాత్ర ఉన్నట్లు తేలింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం రాత్రి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. (రూ.80 కోట్ల భూమికి ఎసరు) అదేవిధంగా.. ఆ సమయంలో అక్కడ వీఆర్వోగా ఉండి.. ఆ తర్వాత మెదక్ జిల్లా నర్సాపూర్‌లో గిరిధావర్‌గా పని చేసి 2016లో రిటైర్డ్ అయిన జె.వెంకటేశ్వర్రావు హస్తం కూడా ఉన్నట్లు గుర్తించగా.. క్రిమినల్ చర్యలకు సర్కారు ఆదేశించడం కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ఖాజీపల్లి గ్రామంలో సర్వే నంబర్ 181లో అసైన్డ్ భూమి ఉంది. ఈ భూములు రూ.కోట్ల విలువ చేస్తుండడంతో ఇదివరకే కన్నేసిన ఎక్స్ సర్వీస్మెన్లకు సహకరించి.. భారీగా దండుకునేందుకు అప్పటి మండల రెవెన్యూ శాఖ అధికారులు స్కెచ్ వేశారు. 2013లో దరఖాస్తు రాగా.. అప్పుడు తహసీల్దార్‌గా పనిచేసిన, ప్రస్తుత కామారెడ్డి ఆర్డీఓ జి.నరేందర్, డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసిన, ప్రస్తుత మెదక్ కలెక్టరేట్లో విధులు నిర్వర్తిస్తున్న డీటీ కె.నారాయణ, ఖాజీపల్లి వీఆర్ఓగా పనిచేసి.. నర్సాపూర్‌లో గిరిధావర్‌గా రిటైర్డ్ అయిన జె.వెంకటేశ్వర్రావు కుట్రకు తెరదీశారు. (అడిషనల్ కలెక్టర్ కేసుపై కోర్టులో ఏసీబీ పిటిషన్) స్థానికంగా పనిచేసి మృతిచెందిన తహసీల్దార్ పేరుతో ఫోర్జరీ సంతకం చేసి నకిలీ పట్టా సర్టిఫికెట్లు సృష్టించారు. నలుగురు ఎక్స్సర్వీస్మెన్లు ఒక్కొక్కరికి ఐదు ఎకరాల చొప్పున రూ.80 కోట్ల విలువైన 20 ఎకరాలు కట్టబెట్టారు. అసైన్డ్ భూమి కావడంతో ఎన్ఓసీ తప్పనిసరి అయింది. ఈ క్రమంలో 2019లో సదరు వ్యక్తులు దరఖాస్తు చేసుకోగా.. సంగారెడ్డి కలెక్టర్‌కు అనుమానం వచ్చి విచారణ జరిపించారు. మృతి చెందిన తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి.. నకిలీ పట్టాలు సృష్టించినట్లు విచారణాధికారి నిగ్గు తేల్చడంతో వీరిపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ ఘటనలో భాగస్వాములైన ముగ్గురిపై బొల్లారం పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రస్తుత కామారెడ్డి ఆర్డీఓతోపాటు మెదక్ కలెక్టరేట్ డీటీపై సస్పెన్షన్ వేటు పడింది. ఏసీబీ నజర్.. 112 ఎకరాలకు రూ.1.12 కోట్ల లంచం ఘటనలో అదనపు కలెక్టర్ నగేశ్, నర్సాపూర్ ఆర్డీఓ అరుణారెడ్డి, చిలప్‌చెడ్ తహసీల్దార్ సత్తార్, సర్వే, ల్యాండ్ జూనియర్ అసిస్టెంట్ వసీంతోపాటు ఏసీ బినామీ కోల జీవన్ గౌడ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న వీరిని విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకునేందుకు ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఖాజీపల్లి భూబాగోతంలో మెదక్ కలెక్టరేట్ డిప్యూటీ తహసీల్దార్ ఉండడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయనపై నజర్ వేసినట్లు తెలుస్తోంది. ముందస్తు బెయిల్ కోసం.. ఫోర్జరీ.. నకిలీ పట్టాలు సృష్టించి రూ.80 కోట్ల భూమిని కట్టబెట్టిన ఘటనలో ఎనిమిది మంది రెవెన్యూ అధికారులు, నలుగురు ఎక్స్ సర్వీస్మెన్లపై కేసు నమోదైన విషయం తెలిసిందే. పోలీసులు ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో డీటీ నారాయణతోపాటు మిగిలిన వారు తమ అడ్వకేట్ ద్వారా మెదక్ జిల్లా కోర్టులో ముందస్తు (యాంటిసిపేటరీ) బెయిల్‌కు అప్లై చేసినట్లు సమాచారం. కాగా, డిప్యూటీ తహసీల్దార్ నారాయణ ప్రస్తుతం సెలవులో ఉన్నారు. సుమారు నెల రోజులుగా విధులకు రావడం లేదని జిల్లా ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా వరుసగా అవినీతి కోణాలు వెలుగు చూడడం రెవెన్యూ వర్గాల్లో అలజడి రేపుతోంది. -
పాసు పుస్తకాలకెళ్తే.. ఆర్ఐకి రూ. 35 లక్షల అప్పు
సాక్షి, మేడ్చల్: కొత్త పాసు పుస్తకాల కోసం అప్పటి కీసర తహసీల్దార్ నాగరాజు ఆశ్రయించగా, ఆర్ఐ కిరణ్ ఇళ్లు నిర్మించుకుంటున్నాడని రూ.35 లక్షలు అప్పు ఆయనకు ఇప్పించి, ఇప్పటి వరకు ఇవ్వలేదని కీసర దాయారకు చెందిన రైతు కుంటోళ్ల దశరథ తెలిపారు. మా రాంపల్లి దాయార గ్రామానికి సంబంధించిన భూముల వ్యవహారంలో పాసు పుస్తకాల జారీ విషయంపై రియల్టర్ బ్రోకర్ల నుంచి రూ. 1.10 కోట్లు లంచం తీసుకుంటూ... ఏసీబీకి చిక్కటంతో ఆయన లంచావతారం బయటపడిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. గతంలోనే డబ్బులివ్వాలని తహసీల్దార్ నాగరాజుకు వద్దకు వెళ్లితే... తనపై అక్రమంగా 353 ఐపీసీ కింద కేసు నమోదు చేయించి తీవ్రంగా వేధించారని దశరథ తెలిపారు. కీసర దాయార గ్రామంలో 173, 174, 175, 176, 179, 213 సర్వే నంబర్లలో తొమ్మిది ఎకరాల భూమికి సంబంధించిన కొత్త పాసు పుస్తకాల కోసం నాగరాజును తరచు కలిసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు పాసు పుస్తకాలు ఇవ్వకపోగా ఆర్ఐ కిరణ్‌కు ఇప్పించిన రూ. 35 లక్షలు ఇవ్వలేదన్నారు. ఈ విషయమై జిల్లా రెవెన్యూ అధికారులు, కలెక్టర్ సకాలంలో స్పందించి న్యాయం చేయాలని ఆయన కోరారు. కొత్త పాసు పుస్తకాలు కూడా ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఏసీబీకి పట్టుబడ్డ వెంకటేశ్వరరెడ్డి: రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కోనసాగుతున్నాయి. సర్వేయర్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరెడ్డిపై అధికారలు తనిఖీలు నిర్వహించారు. రూ. 5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి వెంకటేశ్వరరెడ్డి రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. ఆయన సర్వే రిపోర్టు ఇవ్వడం కోసం లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. -
ఏసీబీ వలలో పీఆర్ చేప
అనంతపురం క్రైం: అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) గాలానికి పంచాయతీరాజ్ చేప చిక్కింది. గురువారం అనంతపురంలోని సప్తగిరి సర్కిల్లో కాపుగాసిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ రబ్బానిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం పెద్ద చర్చనీయాంశమైంది. ఏసీబీ డీఎస్పీ అల్లాబకాష్ తెలిపిన వివరాల మేరకు.. విడపనకల్లు మండలం బి.కొత్తకోటకు చెందిన బాబాఫకృద్దీన్, అతని స్నేహితులు ఓబులేసు, నగేష్, ఆంజనేయులు, రంగనాథ్, సయ్యద్లాల్బాషా 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్‌లలో ఎలక్ట్రిక్ పరికరాలు ఏర్పాటు చేసేందుకు రూ.32 లక్షలతో కాంట్రాక్ట్‌ను తీసుకున్నారు. రాయదుర్గం, విడపనకల్లు రూరల్, విడపనకల్లు, తదితర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ పరికరాలను ఏర్పాటు చేశారు. అయితే సర్వశిక్ష అభియాన్(ఎస్ఎస్ఏ)లో నిధులు లేనందున బిల్లులను పంచాయతీ రాజ్ శాఖ నుంచి చెల్లించాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో బిల్లుల కోసం బాబాఫకృద్దీన్ అతని మిత్రులు ధర్మవరం పంచాయతీరాజ్ డివిజన్ సూపరింటెండెంట్ రబ్బానిను కలిశారు. అయితే బిల్లులు పాస్ చేయాలంటే ఈఈకి 1శాతం, తనతో పాటు సిబ్బందికి 0.25 శాతం పర్సెంటేజ్ ప్రకారం రూ.40 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాబా ఫకృద్దీన్ అతని స్నేహితులు ప్రస్తుతం తమకు రూ.19,38,884 బిల్లు రావాలని త్వరగా చేయాలని కోరారు. ఇందుకు రూ.25,500 ఇవ్వాలని రబ్బాని డిమాండ్ చేయగా...అందుకు ఒప్పుకున్న ఫకృద్దీన్ అతని మిత్రులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అరెస్టు ఇలా.. పంచాయతీ రాజ్ సూపరింటెండ్ రబ్బాని గురించి తెలుసుకున్న ఏబీసీ తిరుపతి డీఎస్పీ, అనంతపురం ఇన్చార్జ్ డీఎస్పీ అల్లాబకాష్ నేతృత్వంలో సీఐలు ప్రభాకర్, సత్యనారాయణ, చక్రవర్తి తదితరులు రంగంలోకి దిగారు. గురువారం మధ్యాహ్నం బాబాఫకృద్దీన్ ద్వారా రబ్బానిని సప్తగిరి సర్కిల్‌కు రప్పించారు. బాబాఫకృద్దీన్ రూ.25,500 లంచం రబ్బానికి ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడులు చేసి రబ్బానిని అదుపులోకి తీసుకున్నారు. పంచాయతీరాజ్ కార్యాలయానికి తీసుకెళ్లి కెమికల్ టెస్టు చేయడంతో లంచం తీసుకున్నట్లు రికార్డెడ్‌గా రుజువైంది. విచారణలో కొందరి పేర్లు ఏసీబీ అధికారులు సూపరింటెండెంట్ రబ్బానిని ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఈ సందర్భంగా రబ్బాని తనతో పాటు కొందరి అధికారులకు ఇందులో వాటా ఉందని తెలిపినట్లు సమాచారం. పంచాయతీరాజ్ ఈఈ అస్లాంబాషా, సీనియర్ అసిస్టెంట్ నరసయ్య, డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ నాగశేఖర్ రెడ్డి పేర్లు చెప్పారు. వారిపై కూడా విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ అల్లాబకాష్ తెలిపారు. కాగా ప్రస్తుతం తమ అదుపులో ఉన్న రబ్బానిని శుక్రవారం కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన సూగూరు వీఆర్వో
పెబ్బేరు: మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం సూగూరు వీఆర్వో వెంకటరమరణ రూ.6వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. సూగూరుకి చెందిన రైతులు ఆడెం ఆంజనేయులు, ఆడెం భాగ్యమ్మ, ఆడెం మద్దిలేటి, ఆడెం బాల్రాంలకు 2ఎకరాల 19గుంటల భూమి ఉంది. భాగ పరిష్కారాల అనంతరం వేర్వేరుగా వారి పేర్లపై రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మూడు డాక్యుమెంట్ల జిరాక్స్‌లతో తమ పొలాలకు ఆర్వోఆర్, పాసుబుక్కులు ఇవ్వాలని జూలై 14న తహసీల్దార్ కార్యాలయంలో ఆంజనేయులు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే వీఆర్వో వెంకటరమణ ఈ పని చేసేందుకు రూ.10వేలు డిమాండ్ చేశాడు. ఆంజనేయులు రూ.6 వేలు ఇస్తానని ఒప్పుకుని ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారు రైతుకు డబ్బులిచ్చి అతని వద్దకు పంపారు. వీఆర్వో వెంకటరమణ రైతు వద్ద నగదు తీసుకుని పంపించాడు. కార్యాలయం బయట ఉన్న ఏసీబీ డీఎస్పీ క్రిష్ణయ్యగౌడ్, ఇన్స్పెక్టర్లు లింగస్వామి, ప్రవీణ్‌లు వెంటనే కార్యాలయంలోకి వెళ్లి వీఆర్వో తీసుకున్న డబ్బులను పరిశీలించారు. నోట్లకు, అతని చేతులు, ప్యాంట్ జేబుకు పింక్ కలర్ ఉండటాన్ని గుర్తించారు. విచారణ చేసి వీఆర్వోను అదుపులోకి తీసుకున్నారు.దాడుల్లో ఏసీబీ సిబ్బంది 10మంది ఉన్నారు. -
అవినీతిపరులపై నజర్
గద్వాల క్రైం: ఉన్నతహోదాలోని కొందరు ఉద్యోగులు వేలల్లో జీతాలు తీసుకుంటూ ప్రజలకు జవాబుదారీగా ఉండలేకపోతున్నారు. డబ్బులిస్తేనే ఫైల్స్‌కు మోక్షం కలుగుతుందని ఖరాకండిగా చెబుతున్నారు. అడిగినంత ఇస్తేనే పనులు పూర్తి అవుతాయని మొండికేస్తున్నారు. విసిగివేసారిన బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడిజిల్లాలోని మహబుబ్‌నగర్, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాల్లో ఆరునెలల్లో ఆరుగురు అధికారులు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కారు. వారి వద్ద నుంచి రూ.1,34,000నగదును సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. విపత్కర సమయంలో కక్కుర్తే... ప్రభుత్వ శాఖల్లో వైద్యం, రెవెన్యూ, కార్మిక, ఆహార నియంత్రణ శాఖలు కీలకంగా ఉన్నాయి. వీటిలో పనిచేస్తున్న అధికారులు కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల్లో కూడా చేయి తడపనిదే పనులు చేయడం లేదు. గద్వాల జిల్లాలో అత్యవసర వైద్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. దీన్ని ఆసరాగా చేసుకుని తప్పుడు నివేదికలను తయారు చేసి పెద్ద మొత్తంలో సొమ్ము కాజేసినట్లు ఆరోపణలున్నాయి. రోగులకు పౌష్టికాహారం, మందులు, ఇతర సదుపాయాలు అందలేదని ఏసీబీ అధికారుల దాడుల్లో బయటపడినట్లు సమాచారం. నడిగడ్డలో వైద్యశాఖలో జరుగుతున్న అవినీతిపై ప్రభుత్వం దృష్టి సారించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. కొరవడిన పర్యవేక్షణ ఉమ్మడి జిల్లాలోని అన్ని ముఖ్యశాఖల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఏ శాఖలోనైనా పనులు కావాలంటే లంచం ఇవ్వాలని అధికారులు నిర్మోహమాటంగా అడుగుతున్నారు. వాణిజ్యం, వస్త్ర, బంగారం వ్యాపారాల్లో బిల్లులు ఇవ్వకుండానే సామాన్యు నుంచి నగదును వసూలు చేస్తున్నారు. తనిఖీలు నిర్వహించాల్సిన వాణిజ్య, ఇన్‌కాంట్యాక్స్ అధికారులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అవినీతి అధికారుల జాబితా సిద్ధం జిల్లాలోని ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్‌తో పాటు వివిధశాఖల్లో విధులు నిర్వహిస్తున్న అవినీతి అధికారుల జాబితాను ఏసీబీ అధికారులు సిద్ధం చేసినట్లు సమాచారం. వారిపై నిరంతరం ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. తమ పేర్లు ఏసీబీ అధికారుల జాబితాలో తమ పేర్లు ఉన్నాయో అని తెలిసిన వ్యక్తులతో సమాచారం తెలుసుకునేందుకు అవినీతి అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన ఉద్యోగులు ⇒ గతనెల 23వ తేదీ జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి పీహెచ్సీలో విధులు నిర్వహిస్తున్న వైద్యురాలు మంజూలకు పీజీ సీటు వచ్చింది. విధులు నుంచి రిలీవ్ చేయాలని జిల్లా ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ భీమ్నాయక్కు దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో రూ.7వేలు లంచంగా ఇస్తే రిలీవ్ చేస్తానని హుకూం జారీ చేశాడు. సదరు బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. డీఎంహెచ్ఓకు లంచం ఇస్తుండగా ఏసీబి అధికారులు పట్టుకున్నారు. ⇒ 17.02.2020వ తేదీన గద్వాలకు చెందిన భానుప్రకాష్ ఫుడ్లైసన్స్ రెన్యూవల్ కోసం జిల్లా ఆహార కల్తీ నియంత్రణ కార్యాలయంకు వెళ్లాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న మహ్మద్ వాజీద్ రూ.4వేలు లంచం డిమాండ్ చేశాడు. ఏసీబీని ఆశ్రయించగా రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అ«ధికారులు పట్టుకున్నారు. ⇒ 24.02.2020న తిమ్మాజిపేట మండలం మారెపల్లి వెంకటయ్య 2.25ఎకరాల భూమిని కొనుగోలు చేసి మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. డిప్యూటీ తహసీల్దార్ జయలక్ష్మి రూ.లక్ష ఇస్తేనే పని పూర్తి చేస్తానని చెప్పింది. సదరు భాదితుడు ఏసీబి అధికారులను ఆశ్రయించాడు. ఉద్యోగికి లంచం ఇస్తున్న క్రమంలో పట్టుబడింది. ⇒ 06.03.2020న దుప్పట్పల్లి గ్రామానికి చెందిన వెంకటప్ప 5.14ఎకరాల భూమిని విరాసత్ చేయించుకునేందుకు వీఆర్వో అనంత పద్మానాభంకు దరఖాస్తు చేసుకున్నాడు. రూ.8వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. ⇒ 16.03.2020న అచ్చంపేట జిల్లాకు చెందిన వెంకటరాంనాయక్కు అక్రమ మద్యం తరలిస్తూ 2018లో పట్టుబడ్డాడు. పట్టుబడిన కారును రిలీజ్ కోసం ఎక్సైజ్ సీఐ శ్రావణ్‌కుమార్, జూనియర్ అసిస్టెంట్ దేవేందర్ రూ.9వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ⇒ 02.07.2020న నవాబుపేట, వెల్కచర్ల మండలానికి చెందిన ఇద్దరు ఉపాధిహామీ కూలీలు వివాహం ప్రోత్సాహక నగదుకు దరఖాస్తు చేసుకున్నారు. మహబుబ్‌నగర్ కార్మికశాఖలోని లెబర్ అసిస్టెంట్ కోటేశ్వర్రావు ఒక్కొక్కరి నుంచి లంచంగా రూ.3వేలు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు. -
ఇద్దరు హెచ్డీఎఫ్సీ అధికారులు అరెస్ట్
ముంబై: లంచం వసూలు చేసిన ఇద్దరు హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధికారులను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. లంచం డిమాండ్ చేస్తున్నరనే ఫిర్యాదుతో సీబీఐ అధికారులు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజర్, రూరల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అధికారిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. మహారాష్ట్ర పుణే జిల్లాలోని బారామతి శాఖ హెచ్డీఎఫ్సీ బ్యాంకులో పని చేస్తున్న మేనేజర్ రూ. 99 లక్షల లోన్ మంజూరు విషయంలో ఓ వ్యక్తి వద్ద రూ. 2.70లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో డిమాండ్ చేసిన డబ్బును వసూలు చేసుకురమ్మని బ్యాంక్‌లో పనిచేసే రూరల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అధికారిని సదరు వ్యక్తి వద్దకు పంపాడు. (ఉద్యోగమిస్తామని ఊబిలోకి నెట్టారు) సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు సేల్స్ ఎగ్జిక్యూటివ్ అధికారిని లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అతని వద్ద పట్టుబడిన నగదును అధికారులు సీజ్ చేశారు. బ్యాంకు మేనేజర్‌పై కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ కేసుపై పూర్తిగా స్థాయిలో దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు -
ఏసీబీ వలలో డీఎంహెచ్ఓ
గద్వాల న్యూటౌన్: ప్రభుత్వ వైద్యురాలికి పీజీలో సీటులో వచ్చింది. రిలీవ్ చేయమని ఇన్చార్జ్ డీఎంహెచ్ఓను అడిగింది. సాటి ఉద్యోగికి పీజీలో సీటు వచ్చింది కదా అని సంతోషించి రిలీవ్ చేయాల్సింది పోయి ఏకంగా పైసల్ డిమాండ్ చేశారు. వైద్యురాలు మరోసారి వెళ్లి అడిగినా అదే డిమాండ్‌ను ఆమె ముందు ఉంచారు. దీంతో చేసేదిలేక వైద్యురాలు, భర్త సాయంతో ఏసీబీని ఆశ్రయించింది. నెలరోజులుగా ఏసీబీ అధికారులు ఆయనపై దృష్టి సారించారు. బుద్ధిపోనిచ్చుకోని ఆ జిల్లా అధికారి ఎట్టకేలకు గురువారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో రూ.7వేలు లంచం తీసుకొని రిలీవింగ్ ఆర్డర్ చేతికి ఇస్తుండగా ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. కరీంనగర్‌కు చెందిన మంజుల అనే పీహెచ్సీ వైద్యురాలు గత నెల 17న జిల్లాలోని వడ్డేపల్లి పీహెచ్‌సీకి బదిలీపై వచ్చింది. విధుల్లో చేరిన మరుసటి రోజే ఆమెకు కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీలో సీటు వచ్చింది. పీజీలో జాయిన్ అయ్యేందుకు నిబంధనల ప్రకారం తనను రిలీవ్ చేయమని జోగుళాంబ గద్వాల జిల్లా ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ భీమ్‌నాయక్‌ను కోరింది. ఆయన డబ్బు డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని ఆమె భర్త అశోక్ తెలిపింది. జూన్ 22న ఆయన మహబూబ్‌నగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అప్పటినుంచి వారు ఈ కేసుపై దృష్టి సారించి నాలుగుసార్లు గద్వాలకు వచ్చి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ కార్యాల యంలో ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ చాంబర్లో వైద్యురాలు మంజుల నుంచి రూ.7వేలు తీసుకొని రిలీవింగ్ ఆర్డర్ ఇచ్చాడు. తీసుకున్న డబ్బును తన ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. అదే సమయంలో డీఎస్పీ కృష్ణగౌడ్, మహబూబ్‌నగర్, నల్గొండ ఏసీబీ అధికారులు ప్రవీణ్‌కుమార్, లింగస్వా మి, ఎస్ఐలు రమేష్‌బాబు, వెంకట్రావ్‌లు మరో 10మంది సిబ్బందితో కలిసి రైడ్ చేశారు. కార్యాలయంలో ఉన్న అధికారులందరినీ ఎక్కడివారిని అక్కడే కూర్చోబెట్టారు. నేరుగా డీఎంహెచ్ఓ చాంబర్‌కు వెళ్లి డీఎంహెచ్ఓను తనిఖీ చేశారు. ఆయన ప్యాంట్ జేబులో రూ.7వేలు లభించాయి. ఆ నోట్లను పరిశీలించి లంచం తీసుకున్నట్లు నిర్ధారించారు. లంచం అడిగితే సమాచారం ఇవ్వండి.. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ మీడియాతో మాట్లాడారు. ఏదేని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులు లంచం అడిగితే ఏసీబీ 1064కు కాల్ చేయాలన్నారు. పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చిన కొద్దిరోజులకే.. ఇబ్రహీంపట్నంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా ఉన్న భీమ్‌నాయక్ జూన్ 3న ఇన్చార్జ్ డీఎంహెచ్‌ఓగా జిల్లాకు బదిలీపై వచ్చాడు. వచ్చిన కొద్దిరోజులకే ఆయనపై పలు ఫిర్యాదులొచ్చాయి. వివిధ విభాగాల్లో ఉన్న ముగ్గురు ఉద్యోగులను డిప్యూటేషన్‌పై వారు కోరిన పీహెచ్‌సీలకు ఉద్దేశపూర్వకంగా మార్చాడని ఆశాఖ అధికారులే తెలిపారు. అయిజలో రెండు ప్రైవేట్ ఆసుపత్రులను సందర్శించి, డబ్బులు డిమాండ్ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. తనకు నచ్చిన నలుగురు ఉద్యోగులతో ఓ మాదిరి, మిగిలిన ఉద్యోగులతో మరో మాదిరిగా వ్యవహరించేవారని వైద్యులు తెలిపారు. సదరు నలుగురు ఉద్యోగులే పలు వ్యవహారాలు చక్కబెట్టావారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. -
శంకరయ్య.. 4.58 కోట్లు.. 11 ప్లాట్లు..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూతగాదాల కేసులో రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన షాబాద్ సీఐ శంకరయ్యపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కసరత్తు చేస్తోంది. గత శుక్రవారం శంకరయ్య ఇంట్లో సోదాల సందర్భంగా రూ.4.58 కోట్ల ఆస్తులను గుర్తించిన అధికారులు వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు, నగలు, నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. శంకరయ్యకు హైదరాబాద్, పూర్వ నల్లగొండ జిల్లాలో బినామీల పేరిట పలు ఆస్తులు ఉన్నట్లు తేలింది. సోదాల సందర్భంగా ఆయన ఇంట్లో రూ.17.88 లక్షల నగదు లభ్యంకాగా.. డాక్యుమెంట్ల ఆధారంగా11 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ రూ.2.28 కోట్లు. నిజామాబాద్ జిల్లా రెంజల్‌తో పాటు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యాల, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ తదితర ప్రాంతాల్లో 41.3 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. వీటి విలువ రూ.77 లక్షలని ఏసీబీ వెల్లడించింది. రూ.7 లక్షల విలువ చేసే కారు, రూ.21.44 లక్షల ఖరీదైన బంగారు ఆభరణాలు, రూ.6.13 లక్షల విలువ చేసే గృహోపకరణాలు, రూ.81వేల విలువ చేసే వెండి సామగ్రిని ఏసీబీ అధికారులు గుర్తించారు. నగరంలో రెండు ఇళ్లు ఉండగా, వాటి విలువ రూ.1.05 కోట్లుగా నిర్ధారించారు. సీఐ స్థాయి అధికారికి ఇంత ఆస్తులు కూడబెట్టడంతో.. ఇవి అక్రమాస్తులుగా ఏసీబీ పరిగణించిందని, అందుకే ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు రంగం సిద్ధం చేస్తోందని సమాచారం. -
శంకరయ్య బాగోతాలు బట్టబయలు
-
శంకరయ్య బాగోతాలు బట్టబయలు
సాక్షి, హైదరాబాద్: షాబాద్ సీఐ శంకరయ్య ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాల్లో కీలక సమాచారం వెల్లడవుతోంది. ఇప్పటికే సోదాల్లో భారీ స్థాయిలో కూడబెట్టిన ఆస్తులను అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో నిందితుడు రాకేష్‌రెడ్డితోనూ శంకరయ్యకు సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో దుండిగల్ సీఐగా పనిచేస్తున్న సమయంలో శంకరయ్యకు రాకేశ్‌రెడ్డితో పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి వారి మధ్య లావాదేవీలు కొనసాగుతున్నట్టు తెలిసింది. ఇక జయరాం, శిఖ చౌదరీల కాల్ డేటాను సీఐ శంకరయ్య ద్వారా రాకేష్‌రెడ్డి రాబట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. శంకరయ్య ఇలా దొరికిపోయారు షాబాద్ సీఐగా పని చేస్టున్న శంకరయ్య జయరాంరెడ్డి అనే వ్యక్తి వద్ద రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు. ఏసీబీ అధికారులు అతని నివాసాల్లో సోదాలు చేపట్టడంతో విస్మయకర విషయాలు తెలుస్తున్నాయి. ఇక శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. శంకరయ్య అతని బందువుల ఇళ్లలో కొనసాగిన ఏసీబీ సోదాల్లో ఈ ఆస్తులను గుర్తించారు. ఒక కోటి 5 లక్షల విలువ చేసే రెండు ఇళ్లు రెండు కోట్ల 28 లక్షల విలువచేసే 11 ఇంటి ప్లాట్స్. 77 లక్షల విలువచేసే 41 ఎకరాల 3 గుంటల వ్యవసాయ భూమి నిజామాద్, చేవెళ్ల, మిర్యాల గూడలో ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 7 లక్షల విలువ చేసే మారుతి స్విప్ట్ కారు. 21 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు 17 లక్షల 88 వేల నగదు 6 లక్షల విలువ చేసే ఇతర వస్తువులు 81 వేల వెండి వస్తువులను ఏసీబీ అధికారులు గుర్తించారు. -
సీఐ శంకరయ్య ఇంట్లో విస్తుపోయే ఆస్తులు
సాక్షి, హైదరాబాద్: షాబాద్ సీఐ బి. శంకరయ్య ఇంట్లో సోదాలు చేసిన ఏసీపీ అధికారాలు విస్తుపోయే విషయాలను బయటపెట్టారు. శంకరయ్య బినామీల పేరుతో భారీగా ఆస్తుల కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. భూ తగాదా కేసులో రూ.లక్షా 20వేలు లంచం తీసుకుంటూ సీఐ శంకరయ్య పట్టుబడిన విషయం తెలిసిందే. రెవెన్యూ విలువ లెక్కల ప్రకారం రూ.4.58 కోట్ల ఆస్తులుగా గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇక బహిరంగ మార్కెట్లో రూ.10కోట్లకు పైనే ఆస్తుల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో రూ.కోటి ఐదు లక్షలు విలువ చేసే రెండు నివాసాలు ఉన్నట్లు తెలిపారు. రూ.2 కోట్ల 25 లక్షల విలువ చేసే 11 ప్లాట్ల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దాంతో పాటు నిజామాబాద్, చేవెళ్ల, మిర్యాలగూడలో 41 ఎకరాల వ్యవసాయ భూమి, కారు ఉన్నాయని తెలిపారు. రూ. 22 లక్షలు విలువ చేసే బంగారం, నగలు, రూ.17 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారలు పేర్కొన్నారు. అనంతరం శంకరయ్యకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టినట్లు అధికారులు చెప్పారు. శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్‌లకు రిమాండ్ విధిస్తూ, చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. -
శంకరయ్య ఇంట్లో సోదాలు.. భారీగా ఆస్తులు
సాక్షి, హైదరాబాద్: భూతగాదా కేసులో లక్షా 20వేల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన షాబాద్ సీఐ శంకరయ్య ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. గురువారం మధ్యాహ్నం నుంచి జరిపిన సోదాల్లో భారీగా ఆస్తులను గుర్తించినట్లు శుక్రవారం రోజున ఏసీబీ అధికారులు వెల్లడించారు. రూ. 4కోట్ల విలువైన ఆస్తులను గుర్తించడంతో పాటు, విలువైన ఆస్తులకు సంబంధించిన పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా.. ఇప్పటికే సీఐ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్‌లకు ఏసీబీ కరోనా పరీక్షలు నిర్వహించింది. అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం సీఐ, ఏఎస్ఐలను ఏసీబీ న్యాయమూర్తి ఎదుట ఏసీబీ అధికారులు ప్రవేశపెట్టారు. ఏసీబీ న్యాయమూర్తి షాబాద్ సీఐ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్‌లకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో వీరిద్దరిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. చదవండి: ఏసీబీ వలలో సీఐ, ఏఎస్ఐ -
ఏసీబీ వలలో సీఐ, ఏఎస్ఐ
షాబాద్(చేవెళ్ల): భూతగాదా కేసులో రూ.1.2 లక్షల లంచం తీసుకుంటుండగా సీఐ, ఏఎస్ఐని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీసు స్టేషన్ ఆవరణలో గురువారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన మేరకు.. షాబాద్ మండల పరిధిలోని చిన్న సోలిపేట్‌కు చెందిన వెంకన్నగారి విజయ్‌మోహన్‌రెడ్డి అలియాస్ (జయరాంరెడ్డి), ఇదే గ్రామానికి చెందిన భారతమ్మ మధ్య.. కొన్నేళ్లుగా భూ వివాదం కొనసాగుతోంది. ఈ విషయంలో విజయ్‌మోహన్‌రెడ్డిపై పోలీస్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఈ వివాదంలో తనకు సాయం చేస్తామని సూచించిన.. షాబాద్ సీఐ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్ తమకు డబ్బు ఇవ్వాలని విజయ్‌మోహన్‌రెడ్డిని డిమాండ్ చేశారు. ఇందుకోసం వీరి మధ్య రూ.1.20 లక్షలకు ఒప్పందం కుదిరింది. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం విజయ్‌మోహన్‌రెడ్డి ఏఎస్ఐ రాజేందర్‌తో కలిసి సీఐకి లంచం ఇచ్చేందుకు వెళ్లాడు. బయట ఏఎస్ఐకి డబ్బు ఇవ్వాల్సిందిగా సూచించడంతో పీఎస్ ఆవరణలోనే విజయ్‌మోహన్‌రెడ్డి నగదు అందించాడు. వెంటనే ఏసీబీ అధికారులు దాడిచేసి డబ్బు స్వాధీనం చేసుకుని సీఐ, ఏఎస్ఐని అదుపులోకి తీసుకున్నారు. -
ఏసీబీ వలలో ఏఈ
ఇల్లెందు: నీటిపారుదల(ఇరిగేషన్) శాఖలో ఏఈగా పనిచేస్తున్న నవీన్‌కుమార్ ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ వలకు చిక్కాడు. ఏసీబీ వరంగల్ డీఎస్పీ మధుసూదన్ విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. ఇల్లెందు మండలం మర్రిగూడెం పంచాయతీ కోటన్ననగర్ గ్రామంలోని అనంతారం చెరువును మిషన్ కాకతీయ ట్రిపుల్ ఆర్ పథకం కింద ఇల్లెందుకు చెందిన కాంట్రాక్టర్ గుండ్ల రమేష్ మరమ్మతు చేశారు. ఈ పనులు గత వేసవిలోనే పూర్తయ్యాయి. ఈ మేరకు ఏఈ నవీన్‌కుమార్ ఎంబీ కూడా పూర్తి చేశాడు. వీటికి సంబంధించి రమేష్‌కు రూ.20 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. క్వాలిటీ కంట్రోల్ అధికారులు పనులను తనిఖీ చేశాకే బిల్లులు మంజూరవుతాయి. అయితే పనులు తనిఖీ చేసే అధికారులను తీసుకొస్తానని, అందుకు రూ.1.20 లక్షలు లంచం ఇవ్వాలని నవీన్‌కుమార్ డిమాండ్ చేశాడు. రమేష్ పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా అతడిలో మార్పు రాకపోవడంతో విసుగు చెంది ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఇల్లెందుకు చేరుకున్న ఏసీబీ అధికారులు.. రమేష్ నుంచి రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటుండగా నవీన్‌కుమార్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి, రిమాండ్కుతరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. అవినీతి, లంచగొండితనాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజలపై ఉందని అన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే ఏసీబీని సంప్రదించాలని కోరారు. అవసరమైతే టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని సూచించారు. ఆయన వెంట ఏసీబీ సీఐలు రమణమూర్తి, రవీందర్, సిబ్బంది ఉన్నారు. ప్రైవేట్ కార్యాలయం నుంచే కార్యకలాపాలు... ఇల్లెందులో పని చేస్తున్న కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు తమ అవినీతి సామ్రాజ్యాన్ని కొనసాగించేందుకు ప్రైవేటు కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇరిగేషన్ ఏఈ నవీన్‌కుమార్ కూడా ఇల్లెందు సుభాష్‌నగర్‌లో పాల కేంద్రం వెనుక గల్లీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడి నుంచే తన అవినీతి కార్యకలాపాలను కొనసాగించాడు. ఏసీబీ అధికారులకు పట్టుబడింది కూడా ఈ ప్రైవేట్ కార్యాలయంలోనే. ఏఈ ఒక్కరే కాదు.. ఇతర విభాగాల్లో పని చేస్తున్న ఏఈలు, పలు శాఖల అధికారులు కూడా ప్రైవేట్ కార్యాలయాల నుంచే కార్యకలాపాలు సాగిస్తుండడం గమనార్హం. ఏడాదిలో ఏసీబీకి చిక్కిన ముగ్గురు ఏఈలు.. ఇల్లెందులో ఏడాది కాలంలో ముగ్గురు ఏఈలు ఏసీబీ వలలో చిక్కారు. గత ఏడాది జూలై 29న మున్సిపల్ ఏఈ అనిల్, ఈ ఏడాది ఫిబ్రవరి 9న అదే మున్సిపాల్టీలో పని చేస్తున్న ఇన్చార్జ్ ఏఈ, టెక్నికల్ అసిస్టెంట్ బాబురావు ఏసీబీకి పట్టుబడ్డారు. ఇప్పుడు నీటిపారుదల విభాగం ఏఈ నవీన్‌కుమార్ దొరికిపోయాడు. ఏడాది కాలంలోనే ముగ్గురు ఏఈలు ఏసీబీ వలలో చిక్కడం చర్చనీయాంశంగా మారింది. -
కలెక్టరేట్ ఏ– సెక్షన్లో అవినీతి బాగోతం..
జిల్లాలోని అన్ని శాఖలకు ఆదర్శంగా ఉండాల్సిన కలెక్టరేట్లో అవినీతి దర్శన మిస్తోంది. కలెక్టరేట్లోని ఏ–సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ అవినీతి బాగోతం వాట్సాప్ మెసేజ్‌ల ఆధారాలతో బట్టబయలైంది. అసలే కుటుంబ యజమాని మృతి చెంది దీనస్థితిలో ఉంటూ..కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న బాధితులనే ఈ ఉద్యోగి లంచం డిమాండ్ చేయడం ఆ శాఖకే మచ్చ తెస్తోంది. కలెక్టర్ కార్యాలయంలో అతి ముఖ్యమైన ఏ–సెక్షన్లో అవినీతి వ్యవహారం బయటపడడం చర్చనీయాంశమైంది. చిత్తూరు కలెక్టరేట్ : కలెక్టరేట్లో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి అవినీతిరహిత పాలన అందజేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అవినీతికి పాల్పడే ఎంతటి అధికారినైనా, ఉద్యోగినైనా సహించేది లేదని కఠిన చర్యలుంటాయని పలు మార్లు హెచ్చస్తున్నారు. అయినా కలెక్టరేట్ కార్యాలయంలోనే అవి నీతి తంతు విస్మయానికి గురి చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఆకస్మికంగా మృతిచెందితే వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలివ్వాల్సి ఉంటుంది. జిల్లాలోని పలు శాఖల్లో ఆకస్మికంగా మృతి చెందిన ఉద్యోగుల కుటుంబీకులకు ఉద్యోగాలిచ్చే నివేదికలు కలెక్టరేట్‌కు వచ్చాయి. ఈ నివేదికలను పర్యవేక్షించే ఏ–సెక్షన్‌లోని ఏ–7 జూనియర్ అసిస్టెంట్ అవినీతిని పాల్పడేందుకు స్కెచ్ వేశారు. వచ్చిన నివేదికల్లోని చిరునామాల ఆధారంగా గుట్టుచప్పుడు కాకుండా లంచం కోసం ప్రయత్నించారు. వారి నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. కారుణ్య నియామకానికి అర్హత ఉన్న ఓ బాధితుడు సంవత్సరకాలంగా ఉద్యోగం కోసం కాళ్లరిగేలా కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షణ చేస్తున్నాడు. కరుణించని కలెక్టరేట్ ఏ–సెక్షన్ అధికారుల తీరుతో ఆ బాధితుడు విసిగిపోయాడు. చిట్టచివరిగా ఏ–7 సెక్షన్ చూసే సిబ్బందికి లంచం ఇచ్చేనా ఉద్యోగం పొందేందుకు సిద్ధమయ్యాడు. ఏ–7 ఉద్యోగి ఫోన్ నంబర్‌ను తీసుకుని వాట్సాప్ ద్వారా సంభాషణ జరిపాడు. దొరికాడు ఇలా.... ఆ ఉద్యోగికి లంచం ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్న బాధితుడు చివరికి ఇలా చేశాడు.. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ల మెయిల్ ఐడీలను ఆ బాధితుడు తెలుసుకున్నాడు. ఏ7 ఉద్యోగితో జరిపిన వాట్సాప్ సంభాషణల ఆధారాలను ఆ మెయిల్ ఐడీలకు పంపాడు. ఈ విషయం సాక్షి దృష్టికి వచ్చింది. పూర్తిస్థాయి వివరాల కోసం సాక్షి మరింత సమా చారాన్ని సేకరించింది. సంవత్సరాల కొద్దీ పాతుకుపోయారు కలెక్టరేట్లోని పలు విభాగాల్లో కొంతమంది ఉద్యోగులు సంవత్సరాల కొద్దీ పాతుకుపోయారు. ఏళ్లు గడుస్తున్నా వారు మాత్రం మరో చోటకు బదిలీ అయిన దాఖలాలు లేవు. ముఖ్యంగా ఏ–సెక్షన్లో కొందరు ఏళ్ల తరబడి ఒకే సీటులో తిష్ట వేశారు. ఇలాంటి పరిస్థితుల వల్లే అవినీతికి తావిస్తోంది. కొందరు చేస్తున్న తప్పులకు ఆ శాఖ మొత్తానికి చెడ్డ పేరు వస్తోంది. కలెక్టర్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి కలెక్టరేట్లో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాట్సాప్ సంభాషణ ఇలా.. బాధితుడు : సార్, చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం తిరుగుతున్నాను. ఏ7 ఉద్యోగి : ఒక సంవత్సరమా.. రెండు సంవత్సరాలా... బాధితుడు : ఒక సంవత్సరానికి పైగా సార్... ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారా సార్... ఏ7 ఉద్యోగి : ఎస్... నువ్వు అనుకుంటే త్వరగా అవుతుంది... మంచి డిపార్టుమెంట్ కూడా బాధితుడు : నేను ఏమీ చేయాలి సార్.. ఏ7 ఉద్యోగి : రూ.80వేలు బాధితుడు : సార్, నేను చాలా పేదవాణ్ణి... నా పరిస్థితిని, కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకోండి ఏ7 ఉద్యోగి : రూ.65 వేలు బాధితుడు : సార్, ప్లీజ్ దండం పెడుతాను.. ప్రస్తుతం నా కుటుంబ పరిస్థితులకు ఉద్యోగం చాలా ముఖ్యం సార్, ఏ7 ఉద్యోగి : ఓకే, రూ.50 వేలు ఫైనల్ ఏ7 ఉద్యోగి : ప్రశ్న గుర్తును పెడుతూ... ఓకే.. ఇక నీఇష్టం... గుడ్‌లక్ చర్యలుంటాయ్ అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోను సహించేది లేదు. ఏ–సెక్షన్‌లోని ఏ7 ఉద్యోగిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేస్తాం. తప్పు తేలితే కఠినచర్యలు ఉంటాయ్. ఉద్యోగాల కోసం ఎవ్వరూ ఏ అధికారికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా లంచం అడిగితే నిర్భయంగా నాకు ఫిర్యాదు చేయవచ్చు. – నారాయణభరత్‌గుప్తా, కలెక్టర్ -
అమ్మా డాడీని లెమ్మను..
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: ‘అమ్మా.. డాడీని లెమ్మను.. నేనేమి తప్పుచేశానని నన్ను వదిలిపెట్టి పోయాడంటూ తహసీల్దార్ సుజాత కుమారుడు భరత్ రోధిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఎంత ఓదార్చినా భరత్ ఊరుకోకుండా డాడీ లే.. అంటూ రోదిస్తూనే ఉన్నాడు. మా డాడీకి ఫోన్ చేసింది ఎవరు..? బెదిరించింది ఎవరు...? అతనికి కూడా శిక్ష పడాలంటూ భరత్ అన్న మాటలు పలువురిని ఆలోచింపజేశాయి. వివరాల్లోకి వెళితే.... అవినీతి కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న షేక్‌పేట్ తహసీల్దార్ సుజాత భర్త అజయ్‌కుమార్ అంత్యక్రియలు గురువారం అంబర్‌పేట స్మశానవాటికలో ముగిశాయి. అజయ్‌కుమార్ బుధవారం ఉదయం చిక్కడపల్లిలోని లలిత మ్యాన్షన్ అపార్ట్మెంట్ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఆయన మృతదేహానికి అదే రోజు సాయంత్రం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి రాత్రి మార్చురీలో భద్రపరిచారు. గురువారం మధ్యాహ్నం మృతదేహాన్ని చిక్కడపల్లిలోని ఆయన సోదరి గోక మంగళ నివాసానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మృతదేహాన్ని చూసిన తహసీల్దార్ సుజాత, కుమారుడు భరత్‌ల రోధన పలువురికి కంటతడి పెట్టించింది. నాయకులు, అధికారుల నివాళి.. అజయ్ కుమార్ భౌతికకాయాన్ని పలువురు నాయకులు, అధికారులు సందర్శించి నివాళులు అర్పించారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే,కె. లక్ష్మణ్, బీజేపీ నాయకురాలు ‡ విజయలక్ష్మీ, ఉన్నత విద్యామండలి కార్యదర్శి లింబాద్రి, ఓయూ రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్, లక్ష్మీనారాయణ, థామస్, రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళతో పాటు పలువురు తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు సుజాత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. -
రెవెన్యూ కార్యాలయం లంచాలకు అడ్డా..
తిరుమలగిరి(నాగార్జునసాగర్) : నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండల రెవెన్యూ కార్యాలయంలంచాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ చేయి తడపనిదే పనికాదని... ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించినట్లు చెబుతున్నారు. తాజాగా ఓ మహిళకు వారసత్వంగా వచ్చిన భూమికి డబ్బులు తీసుకుని ధ్రువీకరణపత్రం, పట్టాపాస్‌పుస్తకం కూడా ఇచ్చారు. ఆమె భర్త బంధువులు రంగప్రవేశం చేసి అధిక డబ్బులు ఆశచూపడంతో సదరు అధికారి ఆ భూమిపై మెలిక పెట్టి వివాదాస్పదంగా ఉందని హక్కుదారుకు నోటీసులు ఇచ్చారు. దీంతో బాధితురాలు కార్యాలయానికి చేరుకుని అధికారిని నిలదీసింది. దీనికి సంబంధించి బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. అనుముల మండలం మల్గిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మల్గిరెడ్డి లక్ష్మమ్మకు తిరుమలగిరి శివారులో సుమారు 7 ఎకరాల భూమి ఉంది. దీంతోపాటు సర్వేనంబర్లు 82, 83లో 2.28గుంటల భూమి వంశపారంపర్యంగా సంక్రమించింది. సర్వేనంబర్ 84లో 1.20 గుంటలను సొంతంగా కొనుగోలు చేసింది. మొత్తం 4 ఎకరాల 8 గుంటల భూమిని పట్టా చేసేందుకు మండల రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగింది. అయినప్పటికీ అధికారులు స్పందించలేదు. చివరకు రూ.లక్షకు బేరం కుదిరింది. దీంతో లక్ష్మమ్మకు భూమికి సంబంధించి ప్రొసీడింగ్ ఆర్డర్, ధ్రువీకరణపత్రం ఇచ్చారు. మొత్తం 4ఎకరాల8గుంటల భూమిని పట్టా చేయించుకుంది. పాస్‌పుస్తకం కూడా ఇచ్చారు. విషయం తెలుసుకున్నలక్ష్మమ్మ బంధువులు రంగంలోకి దిగారు. భూమిపై మెలిక పెట్టేందుకు సదరు రెవెన్యూ అధికారిని కలిసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే 82, 83 సర్వేనంబర్లలోని 2ఎకరాల 28 గుంటల భూమి వివాదాస్పదంగా ఉందని ఈ నెల 11వ తేదీన మల్గిరెడ్డి లక్ష్మమ్మకు తహసీల్దార్ నోటీసులు అందజేసింది. దీంతో బాధితురాలు తన కూతురుతో కలిసి శుక్రవారం కార్యాలయానికి వెళ్లి సదరు అధికారిని ప్రశ్నించింది. ప్రొసీడింగ్స్ ఇచ్చింది మీరే కదా అని అడగగా ‘నేను చూడకుండా పెట్టానని, ఆ భూమిపై నీకు హక్కు లేదని, ఎవరికి ఫిర్యాదు చేస్తావో చేసుకో’’ అంటూ దబాయించింది. ఇదే అదునుగా స్థానిక నేతలు రంగంలోకి దిగారు. బేరసారాలకు తెరలేపారు. బాధితురాలు ఎంతకీ ఒప్పుకోలేదు. తాను రూ.లక్ష నష్టపోవడమే కాకుండా ఉన్న భూమిని కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని బాధితురాలు అక్కడే ఉన్న అధికారులు, విలేకరుల ఎదుట వాపోయింది. తనకు డబ్బు ముఖ్యం కాదని, తన భూమి తనకు ఉంటే చాలని కన్నీటిపర్యంతమైంది. మా భూమి మాకే కావాలి నా భర్త అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో రైతుబంధు సాయం ప్రభుత్వం ప్రకటించడంతో మేము గ్రామానికి వచ్చాం. నా భర్త చనిపోయిన తరువాత భూమి సర్వే నంబర్ల వివరాలు తెలియక రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగాం. రూ. లక్ష లంచం తీసుకొని ప్రొసీడింగ్ కాపీని అందజేశారు. పట్టాదార్ పాస్‌పుస్తకం కూడా వచ్చింది. ఇప్పుడు ప్రొసీడింగ్ నేను ఇవ్వలేదంటూ తహసీల్దార్ ఇబ్బందులకు గురిచేస్తున్నారు.– మల్గిరెడ్డి లక్ష్మమ్మ, బాధితురాలు, మల్గిరెడ్డిగూడెం నిబంధనల ప్రకారమే నడుచుకున్నా.. పట్టా్టదారు జమీన్లకు పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నా. నేను ఎక్కడా అవినీతికి పాల్పడలేదు. అన్ని పనులు నిబంధనల ప్రకారమే పూర్తి చేస్తున్నా. మల్గిరెడ్డి లక్ష్మమ్మఎవరో నాకు తెలియదు. నాపై నింద వేస్తున్నారు. ఎలాంటి విచారణకు అయినా సిద్ధమే.– కేసీ ప్రమీల తహసీల్దార్, తిరుమలగిరి -
ఏసీబీ వలలో మున్సిపల్ ఉద్యోగి
నెల్లూరు, కావలి: కావలి మున్సిపాలిటీ సీనియర్ అసిస్టెంట్ సయ్యద్ జంషీద్ బాషా మున్సిపల్ లీగల్ అడ్వైజర్ వద్ద రూ.లక్ష లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ దేవానంద్ శాంతో కథనం మేరకు.. కావలి మున్సిపాలిటీ తరఫున కోర్టు వ్యవహారాలను చూసుకునేందుకు న్యాయవాది సీహెచ్ రమేష్ 2017 మే నెలలో నియమితులయ్యారు. అతనికి నెలకు రూ.15 వేల జీతంగా చెల్లించడానికి నిర్ణయించారు. అప్పటి నుంచి జీతం ఇవ్వలేదు. జీతం కోసం ఈ ఏడాది జనవరిలో బిల్లులు మున్సిపల్ అధికారులకు అందజేశారు. ఇందుకు సంబంధించిన కార్యాలయ ప్రక్రియను పూర్తి చేయాల్సిన సీనియర్ అసిస్టెంట్ సయ్యద్ జంషీద్ బాషా ఫైల్ బాగాలేదని జీతం ఇవ్వడానికి కుదరదని ఫైల్‌ను తిరస్కరించారు. ఆ తర్వాత రూ.1.20 లక్షలు లంచంగా ఇస్తేనే ఫైల్‌కు సంంధించిన కార్యాలయ లాంఛనాలు పూర్తి చేస్తానని న్యాయవాదితో బేరానికి దిగాడు. న్యాయవాది జీతం రూ.4.80 లక్షలు కాగా, అందులో 25 శాతం లంచంగా డిమాండ్ చేశాడు. అందుకు న్యాయవాది అంగీకరించడంతో సీనియర్ అసిస్టెంట్ సయ్యద్ జంషీద్ బాషా తాను చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసి కార్యాలయంలోని అకౌంట్ సెక్షన్‌కు పంపాడు. ఈ నెల 16వ తేదీ న్యాయవాది అకౌంట్లో రూ.4.32 జమ అయింది. మధ్యాహ్నం 12 గంటలకు నగదు జమఅయితే, సాయంత్రం 4 గంటలకు న్యాయవాదికి ఉద్యోగి ఫోన్ చేసి తన లంచం నగదు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మళ్లీ ఈ నెల 17వ తేది ఫోన్ చేసి రూ.1.20 లక్షలు లంచంలో రూ.20 తగ్గించుకుని రూ. లక్ష ఇవ్వాలని సూచించాడు. దీంతో న్యాయవాది ఏసీబీకి ఫిర్యాదు చేయగా, బుధవారం లంచం నగదు రూ. లక్ష సయ్యద్ జంషీద్ బాషాకు కార్యాలయంలో అందజేస్తుండగా ఏసీబీ డీఎస్పీ దేవానంద్ శాంతో నేతృత్వంలోని సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. -
ఏసీబీ వలలో కమర్షియల్ ట్యాక్స్ అధికారి
రాజమహేంద్రవరం క్రైం: నగరంలోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ ఉండ్రాజపు రాజేంద్ర ప్రసాద్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ పి.రామచంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం.. రాజానగరం మండలం కృష్ణపట్నం వద్ద ఉన్న యర్త్ గిఫ్ట్ కమ్యూలిటీస్ ఫ్యాక్టరీ (జీడిపిక్కల ప్రోసెసింగ్ ఇండస్ట్రీ) యాజమాని కర్రి రామచంద్రారెడ్డి నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేశారు. నిందితుడు రాజేంద్రప్రసాద్‌ను ఏసీబీ డీజీ పి.ఎస్.ఆర్.ఆంజనేయులు ఆదేశాల మేరకు అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రా రెడ్డి మన రాష్ట్రంతో పాటు కేరళ, మహారాష్ట్రలకు జీడిపప్పు ఎగుమతి చేస్తుంటారు. ఎగుమతి చేసిన జీడి పప్పుకు రాష్ట్రంలో 2 శాతం కమర్షియల్ ట్యాక్స్ చెల్లిస్తారు. ఇతర రాష్ట్రాలలో 3 శాతం ట్యాక్స్ చెల్లిస్తారు. ఇతర రాష్ట్రాలలో చెల్లించిన ట్యాక్స్‌కు సీ ఫారం సమర్పించాల్సి ఉంటుంది. 2016 –17 సంవత్సరాలకు గాను రామచంద్రా రెడ్డి రూ.3 కోట్ల విలువైన జీడిపప్పును ఎగుమతి చేశారు. దీనికి సంబంధించి ఆయన అన్ని ట్యాక్స్‌లు చెల్లించినప్పటికీ మరో రూ.9 లక్షలు చెల్లించాలంటూ గత నెల 7న కమర్షియల్ ట్యాక్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు. తాను అన్ని ట్యాక్స్‌లు చెల్లించానని, మరో సారి పరిశీలించాలంటూ రామచంద్రారెడ్డి అధికారుల నోటీసుకు సమాధానం పంపారు. అయినప్పటికీ రూ.9 లక్షలు చెల్లించాల్సిందే అంటూ అధికారులు అతడిపై ఒత్తిడి తెచ్చారు. నష్టాలు కారణంగా చాలా కాలంగా తాను జీడిపప్పు వ్యాపారం చేయడం మానేశానని రామచంద్రా రెడ్డి చెప్పినా పట్టించుకోకుండా రూ.9 లక్షలు చెల్లించకుండా ఉండాలంటే కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు రూ.2 లక్షల లంచం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. దీనిపై రామచంద్రా రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి రూ.60 వేలు ఇచ్చేలా కమర్షియల్ ట్యాక్స్ అధికారులను ఒప్పించేలా పథకం రచించారు. లంచం సొమ్ము రూ.60 వేలు బుధవారం మధ్యాహ్నం కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయానికి తీసుకువచ్చి ఇస్తానని సీనియర్ అసిస్టెంట్ రాజేంద్రప్రసాద్‌కు రామచంద్రా రెడ్డి ఫోన్ చేసి చెప్పారు. తమ కార్యాలయానికి రావొద్దని, తానే బయటకు వచ్చి తీసుకుంటానని రాజేంద్రప్రసాద్ చెప్పారు. కార్యాలయం సమీపంలోని ఐశ్వర్య అపార్ట్మెంట్ వద్దకు వచ్చి రామచంద్రా రెడ్డి నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా రాజేంద్ర ప్రసాద్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచంగా తీసుకున్న నగదుతో పాటు కార్యాలయానికి తీసుకువచ్చి విచారణ చేపట్టారు. సీటీఓకూ సంబంధం! ఈ సంఘటనలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఆర్.త్రినాథరావుకు కూడా సంబంధం ఉందని బాధితుడు చెబుతున్నారు. తనకు ఏవిధమైన సంబంధం లేదని సీటీఓ త్రినాథరావు ఏసీబీ అధికారుల విచారణలో చెప్పారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి లంచం తీసుకోవడంలో ఎవరి ప్రమేయం ఉందో గుర్తిస్తామని ఏసీబీ డిఎస్సీ పి.రామచంద్రరావు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. ఈ దాడులలో ఏసీబీ సీఐలు వి.పుల్లారావు, పి.వి.జి.తిలక్, సూర్యమోహనరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన డిప్యూటి తహసీల్దార్
సాక్షి, నాగర్‌కర్నూల్ : కలెక్టరేట్లోని సి–సెక్షన్లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డిప్యూటి తహసీల్దార్ జయలక్ష్మి సోమవారం సాయంత్రం రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. వివరాలిలా.. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం మారెపల్లికి చెందిన దోమ వెంకటయ్య అనే రైతు అదే గ్రామానికి చెందిన బంధువులు విమల, విప్లవ, వికాస్ అనే వ్యక్తుల వద్ద 3 ఎకరాల 15 గుంటల భూమిని 2016లో కొనుగోలు చేశాడు. ఆ భూమిని తన పేరుపై పట్టా మార్చుకునేందుకు తిమ్మాజీపేట తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తి 2006లో విమల, విప్లవ, వికాస్‌ల తాతయ్య బృంగి తిర్పతయ్య తనకు ఆ భూమిని ముందే అమ్మాడని, దోమ వెంకటయ్యకు పట్టా చేయవద్దంటూ తిమ్మాజీపేట తహసీల్దార్ కార్యాలయంలో పిటిషన్ వేశాడు. అప్పటినుంచి వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదే విషయమై నాగర్‌కర్నూల్ ఆర్డీఓ కార్యాలయంలో కేసు కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే వెంకటయ్య జేసీకి పిటిషన్ ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు వచ్చిన క్రమంలో సి–సెక్షన్లో ఇన్చార్జ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న జయలక్ష్మీతో పరిచయం ఏర్పడింది. ఈ వ్యవహారాన్ని తాను చక్కబెట్టి వెంకటయ్యకు అనుకూలంగా కేసు వచ్చేలా చూస్తానని డీటీ రూ.13లక్షలు డిమాండ్ చేసింది. చివరకు రూ.10 లక్షలకు బేరం కుదిరింది. ఒకేసారి అంత నగదు ఇవ్వలేకపోతే విడతలవారీగా ఇవ్వాలని జయలక్ష్మి కోరడంతో తన వద్ద అంత డబ్బు లేదని వెంకటయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పట్టుబడిందిలా.. ఫిర్యాదు స్వీకరించిన ఏసీబీ అధికారులు అవినీతి చేపను పట్టేందుకు వలపన్నారు. సోమవారం రూ.లక్ష అడ్వాన్స్‌గా డీటీ జయలక్షి్మకి వెంకటయ్య ఇచ్చేలా పతకం రచించారు. ముందుగా డీటీని వెంకటయ్య కలిసి డబ్బులు తెచ్చానని కోరగా కాసేపు అటుఇటు తిప్పి కలెక్టరేట్లోని ఓ గదిలో తీసుకరావాలని కోరారు. అనుకున్నట్టుగా డబ్బులు ఇచ్చి బయటకు వచ్చి ఏసీబీ అధికారులకు చెప్పాడు. వెంటనే వారు దాడిచేసి రెడ్ హ్యాడెడ్‌గా çపట్టుకుని డబ్బును స్వాధీనం చేసుకున్నారు . కోర్టులో హాజరు పరుస్తాం రైతు వద్ద రూ.లక్ష లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించామని, మంగళవారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు ఫిర్యాదును స్వీకరించి దాడులు చేశామని, అనుకున్నట్టుగానే డబ్బులు తీసుకుంటూ డీటీ పట్టుబడ్డారని తెలిపారు. ఇదే సమయంలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆమె నివాసంలో కూడా మరో బృందం తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీనెంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని కోరారు. దాడుల్లో ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. పాలమూరులో తనిఖీలు మహబూబ్‌నగర్ క్రైం: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లోని డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న జయలక్ష్మీ సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సరిగ్గా అదే సమయంలో పాలమూరులోని ఆమె ఇంట్లో సైతం తనిఖీలు జరిగాయి. జయలక్ష్మీ నివాసం ఉండే మర్లులోని మహాలక్ష్మీ టవర్స్‌లోని 203 ఫ్లాట్‌లో ఏసీబీ సీఐ శివకుమార్ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు ఇంటిని మొత్తం తనిఖీలు చేశారు. ఇంట్లో ఉన్న ప్రతి గదిని, బీరువాలు, ఇతర స్థలాలు అన్నింటిని పరిశీలించారు. ఇంట్లో దొరికిన డాక్యుమెంట్స్, ల్యాప్‌టాప్‌ను స్వా«దీనం చేసుకున్నారు. -
ముట్టజెప్తేనే.. ముందుకు!
కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్‌నగర్ పైపులైన్ రోడ్డులోఓ ప్రైవేట్ స్కూల్ పక్కన మూడు పర్మిషన్లు తీసుకొనిఒకే నిర్మాణం చేపట్టారు. అయితే అధికారులు చూసీ చూడనట్లు వదిలేశారు. ఈ నిర్మాణం ద్వారా దాదాపు రూ. 20 లక్షల వరకుజీహెచ్ఎంసీకిగండిపడింది. సాక్షి, సిటీబ్యూరో: లంచం.. లంచం.. లంచం..! జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల్లో ఇది ఇవ్వనిదే పనులు జరగని పరిస్థితి. అన్ని విభాగాలదొక ఎత్తయితే టౌన్ ప్లానింగ్ విభాగంలోని లంచం మరో ఎత్తు. పేరుకు డీపీఎంఎస్ ద్వారా ఆన్లైన్లోనే దరఖాస్తుల స్వీకరణ, అనుమతుల జారీ అని చెబుతున్నప్పటికీ పైసలు లేనిదే ఫైలు కదలడం లేదు. దరఖాస్తును ప్లాన్‌తో సహా ఎలా అప్లోడ్ చేయాలో తెలియని ప్రజలు ఆర్కిటెక్టులను ఆశ్రయిస్తున్నారు. అందుకు ఆర్కిటెక్టులు అందినకాడికి దండుకుంటున్నారు. అంతటితో ఆగకుండా ఏదో ఒక లోపంతో అప్లోడ్ చేస్తూ.. దాన్ని సరిచేసేందుకు అ‘ధనం’ కావాలని, లేదా అధికారులకు ముడుపులు ముట్టజెప్పనిదే పని కాదంటూ మరింత దండుకుంటున్నారు. అధికారులకు, ఆర్కిటెక్టులకు లోపాయికారీ సంబంధాల వల్లే ఇది అప్రతిహతంగా సాగుతోంది. అధికారులు సైతం మీనుంచి కాదు.. ఫలానా ఆర్కిటెక్టును సంప్రదించండి అంటూ సలహాలిస్తున్నారు. ఒకవేళ ఎలాగోలా దరఖాస్తు అప్లోడ్ అయినా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లరు. అదో తంతు.. ఎటొచ్చీ ఆమ్యామ్యాలు ముట్టజెప్పనిదే అనుమతులు రావడం లేదు. గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లోనూ భవన నిర్మాణాలు జరుగుతున్నా శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఎల్బీనగర్, ఉప్పల్, అల్వాల్ సర్కిళ్లలో నిర్మాణాల జోరు ఎక్కువగా ఉంది. ముడుపుల దారిలో.. చెక్లిస్టుకనుగుణంగా అన్ని పత్రాలు సవ్యంగా లేవని, షార్ట్‌ఫాల్స్ ఉన్నాయంటూ బేరసారాలు మొదలవుతాయి. వివిధ ప్రాంతాల్లో చేతులు మారే లంచాల అంచనాతో చెల్లించుకోవాల్సిన ముడుపులు వివిధ స్థాయిల్లో సగటున ఇలా ఉన్నాయి. దరఖాస్తు ఆన్లైన్లో సమర్పించేందుకు ఆర్కిటెక్టు కోరినంత. ఆ తర్వాత సైట్ తనిఖీకి రావాలంటే సర్కిల్,జోన్లలో రూ. 50 వేల నుంచి లక్షరూపాయలు చెల్లించుకోవాలి. లోటుపాట్లున్నాయంటూ మరికొంత దండుకుంటారు. ఇవి అనుమతి పొందేందుకు. ఇక అనుమతి తీసుకోకుండానే జరుగుతున్న నిర్మాణాలకు లెక్కేలేదు. నగరంలో దాదాపు 80 శాతం మంది అనుమతి పొందిన దానికంటే అదనంగాఒకటినుంచి మూడు నాలుగంతస్తుల వరకు నిర్మిస్తున్నారు. ఇలాంటి వాటికి ప్రాంతం డిమాండ్, బిల్టప్ ఏరియాను బట్టి లక్ష నుంచి రూ.5 లక్షల వరకు చేతులు మారుతున్నాయని విషయం తెలిసిన వారుచెబుతున్నారు. అపాయానికి తరుణోపాయం.. ఇక అక్రమ సెల్లార్లకు, పెంట్‌హౌస్‌లకు స్పెషల్ రేట్లు. అధికారులతో మిలాఖత్ అయితే అక్రమ నిర్మాణాలు కూల్చివేయకుండా తరుణోపాయాలు కూడా వారే వివరించడం చాలామందికి తెలిసిన విషయం. ఫిర్యాదులు రాగానే అప్రమత్తం చేస్తారు. ఫిర్యాదుదారుతో బేరసారాలకు దిగేలా చేస్తారు. వినకపోతే.. కోర్టులకు వెళ్లి ఎలా స్టేలు తెచ్చుకోవచ్చో వివరిస్తారు. సంబంధిత లాయర్‌నూ తామే సూచిస్తారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్లలోనూ మెజారిటీ లాయర్లు అక్రమ నిర్మాణదారులకు సహకరిస్తారనే ఆరోపణలున్నాయి. వారివల్లే భారీ ఆదాయం వస్తుంది కనుక జీహెచ్ఎంసీకి అనుకూలంగా వాదించరు. చాలామంది ‘స్థానిక’ ప్రజాప్రతినిధులు సైతం అక్రమ నిర్మాణాలకే తమవంతు చేయూతనిస్తారు. అధికారులతో మాట్లాడి తమ వాటా తాము తీసుకుంటారు. ఇక గురుకుల్ ట్రస్ట్ వంటి వివాదాల ప్రాంతాల్లో అధికారులకు ఎప్పుడు డబ్బులవసరమైతే అప్పుడు అవి కామధేనువులవుతాయి. కూల్చివేతలంటూ బెదిరించి అందినకాడికి దండుకుంటారనే ఆరోపణలున్నాయి. ఇలా ఎవరికి అవకాశం ఉన్నంత మేరకు వారు జేబులు నింపుకొంటున్నారు. భారీ నిర్మాణాలు, బహుళ అంతస్తులు తప్ప ఐదంతస్తుల వరకు జోన్లు, సర్కిళ్లలోనే అనుమతుల అధికారం ఉండటంతో అక్కడి అధికారులు ఆడింది ఆటగా.. పాడింది పాటగా సాగుతోంది. మరోవైపు దరఖాస్తును అప్లోడ్ చేసేటప్పుడు ఆర్కిటెక్టులు యజమాని ఫోన్‌నంబర్ బదులు తమ ఫోన్‌నంబర్లే ఇస్తున్నారు. దీంతో తదుపరి సమాచారం వారికే వెళ్తుంది. దీనిని ఆసరా చేసుకుని అందినకాడికి దండుకుంటున్నారు. మాయాజాలం.. ఆన్లైన్ వచ్చినా అధికారులు, ఆర్కిటెక్టుల మాయాజాలంతో అవినీతి ఆగడంలేదు. జోన్లు, సర్కిళ్లలో పరిస్థితి అలా ఉండగా, ప్రధాన కార్యాలయానికి సాధారణంగా బడా బిల్డర్లే వస్తారు కనుక అధికారులకు, వారికి నడుమ పరస్పర సహకారం, అవినాభావ సంబంధాలు కొనసాగుతుంటాయి. అక్రమ నిర్మాణదారులకు అండగా.. ప్రజల కళ్ల ఎదుటే అనుమతి లేని భవనాలు అంతస్తులకు అంతస్తులుగా వెలుస్తుండటం కనిపిస్తున్నా టౌన్‌ప్లానింగ్ అధికారులకు మాత్రం ఇవేవీ పట్టవు. జీహెచ్ఎంసీకి అందే ఫిర్యాదుల్లో 90 శాతం ఈ విభాగానివే. మున్సిపల్ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ఆదేశిస్తేనో, కోర్టులు అక్షింతలు వేస్తేనో లేదా సామాజిక కార్యకర్తలు వదలకుండా వెంటపడి, విస్తృతంగా ప్రచారం చేస్తేనే తప్ప అక్రమ నిర్మాణాలను కూల్చడం లేరు. హుస్సేన్‌సాగర్ ఎఫ్టీఎల్లో ఓ భారీ సంస్థ నిర్మించిన భవనాలను కూల్చడం ఇటీవలి నిదర్శనం. దాని సమీపప్రాంతాల్లో ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయరాదని రెవెన్యూశాఖ ఆదేశాలు ఉన్నా దర్జాగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదులకు స్పందనగా తూతూమంత్రంగా కేవలం చిన్నపాటి రంధ్రాలు చేసి, అక్రమ నిర్మాణాలకు దన్నుగా నిలవడం సంప్రదాయంగా మారింది. ఈ వ్యవహారాల్లో ఉన్నతాధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. ఆన్లైన్లోనే అనుమతులైనా, నోటీసులు ఆన్లైన్ ద్వారానే జారీ అయినా శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు ఎక్కడ జరగాల్సిన తతంగం అక్కడ గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
చేయి చాపాడు... ఏసీబీకి చిక్కాడు
తూర్పుగోదావరి, అయినవిల్లి: ప్రభుత్వ సేవలు అందించాల్సిన ఉద్యోగి చేయి చాపాడు.. ఆ సొమ్ము ఇచ్చుకోలేక బాధితుడు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబరును ఆశ్రయించాడు... దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. లంచం తీసుకుంటుండగా ఆ అవినీతి ఉద్యోగిని వల పన్ని రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... అయినవిల్లిలంక వీఆర్వో పట్టేం నాగేశ్వరరావు వీరవల్లిపాలెం గ్రామ పంచాయతీకి ఇన్చార్జ్ వీఆర్వోగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే వీరవల్లిపాలెం గ్రామానికి చెందిన వట్టికూటి సత్యనారాయణ పేరున పది సెంట్ల కొబ్బరి తోట ఉంది. మ్యుటేషన్ చేసి తన కుమారుడు కట్టికూటి కేదారేశ్వరరావు పేరున పట్టాదారు పాస్‌పుస్తకం ఇప్పించాలని 2019 అక్టోబర్ 22న మీసేవ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. దీనిపై విచారణ చేసిన వీఆర్వో నాగేశ్వరరావు పాసు పుస్తకం ఇవ్వడానికి రూ.5 వేలు లంచంగా ఇవ్వాలని అడిగాడు. ఆ సొమ్ము ఇవ్వడానికి ఇష్టపడని వట్టికూటి సత్యనారాయణ కుమారుడు కేదారేశ్వరరావు స్పందనలో టోల్‌ఫ్రీ నంబర్ 14400కు ఈ నెల 10న ఫిర్యాదు చేశాడు. దీంతో కేదారేశ్వరరావుతో ఏసీబీ అధికారులు సంప్రదింపులు జరిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం మంగళవారం ఏసీబీ రాజమహేంద్రవరం డీఎస్పీ పి.రామచంద్రరావు, సీఐలు వి.పుల్లారావు, తిలక్, మోహనరావులతో అయినవిల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ ట్రాప్ నిర్వహించారు. అక్కడ కేదారేశ్వరరావు నుంచి వీఆర్వో నాగేశ్వరరావు రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా డీఎస్పీ రామచంద్రరావు తన సిబ్బందితో కలిసి రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. సంబంధిత రికార్డులు సీజ్ చేశారు. నాగేశ్వరరావు తీసుకున్న రూ.5 వేలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వివరాలు నమోదు చేసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం ఏసీబీ కోర్టుకు అప్పగిస్తామన్నారు. -
ఈ స్టేషన్‌కు ఏమైంది..?
బంజారాహిల్స్: లంచం తీసుకుంటూ పట్టుబడుతున్న అధికారులు... అటాచ్మెంట్లు.. సస్పెన్షన్లు.. గడువు తీరకుండానే అర్థాంతరపు బదిలీలు... సిబ్బందిపై కోల్పోతున్న పట్టు... ఎవరికివారే యుమునాతీరే చందంగా వసూల్ రాజాలు... ఇదీ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ తాజా పరిస్థితి. గత రెండేళ్లుగా పోలీస్‌స్టేషన్‌ను వివాదాలు పట్టి పీడిస్తున్నాయి. మూడురోజుల క్రితం ఇన్స్పెక్టర్, ఎస్ఐలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడటంతో ఈ పోలీస్‌స్టేషన్ మరోసారి వార్తల్లోకెక్కింది. ఇటీవలే పోలీస్‌స్టేషన్ నుంచి ఒకేసారి ముగ్గురు ఎస్ఐలు అటాచ్ అయ్యారు. ప్రస్తుతం ఇన్స్పెక్టర్ లేకుండానే స్టేషన్ కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ పోలీస్‌స్టేషన్ అప్రతిష్టపాలవుతోంది. ఉన్నతాధికారులు తరచూ క్లాస్‌లు తీసుకుంటున్నా ఇక్కడి సిబ్బందిలో మాత్రం మార్పు కనిపించడంలేదు. ప్రతిరోజూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పనిచేయాలంటేనే ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు వణికిపోతున్నారు. ఇటీవలే ఇద్దరు ఎస్ఐలు ఇక్కడ పనిచేయలేమంటూ బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా స్టేషన్‌కు పదిమంది ఎస్ఐలు అవసరం. ప్రస్తుతం ఓ ఎస్ఐ ఏసీబీకి పట్టుబడి సస్పెండ్‌కాగా కేవలం నలుగురు మాత్రమే మిగిలారు. ఆరు ఎస్ఐ పోస్టులతో పాటు ఒక సీఐ పోస్టు ఖాళీగా ఉంది. అడ్మిన్ ఎస్ఐ పదవి నాలుగు నెలలుగా ఖాళీగా ఉంది. క్రైమ్ ఎస్ఐ పోస్టు ఏడాదిగా ఖాళీగా ఉంది. సరిపడ సిబ్బంది లేక పోవడంతో ఉన్నవారిపై అదనపు భారం పడుతోంది. దీనికితోడు ఉపరాష్ట్రపతి ఇదే పీఎస్ పరిధిలో ఉండటంతో నిత్యం వీవీఐపీల రాకపోకలు జరుగుతుంటాయి. ప్రముఖులపై కేసులు, పబ్‌లలో గొడవలు నిత్యకృత్యం. అయితే ఇంటికి కీలకమైన పోలీస్స్టేషన్లోనూ అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రక్షాళన చేయాల్సిన ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇక్కడ క్రైమ్ విభాగం కూడా పడకేసింది. కేసులు ముందుకు సాగడంలేదు. ఎక్కడి ఫైళ్లు అక్కడే పేరుకుపోతున్నాయి. మరి అధికారులు ఈ స్టేషన్‌ను ఎలా బతికిస్తారో..? వేచి చూడాల్సిందే. -
ఉపాధ్యాయా... ఇదేం పని!
ఆయనో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయుడు. దూర విద్య కేంద్రం కోఆర్డినేటర్‌గా పని చేస్తున్నాడు. సమాజానికి దిక్సూచిగా నిలవాల్సిన ఆయన పక్కదారిలో పయనించాడు. విద్యార్థుల పట్ల ప్రేమను పంచి సన్మార్గంలో నడిపించే బోధనలు చేయాల్సిన ఆయన తన వృత్తి ధర్మాన్ని విస్మరించి అక్రమార్జనకు కక్కుర్తి పడ్డాడు. విద్యార్థులకు ఇవ్వాల్సిన ధ్రువపత్రాల విషయంలో లంచం డిమాండ్ చేశాడు. బేరం కుదర్లేదు... తాను అడిగినంత ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. విద్యార్థులు ప్రాధేయపడ్డారు. కొద్దిగా లంచం తగ్గించి మిగతా మొత్తాన్ని ఇమ్మన్నాడు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని అరికట్టేందుకు ఇటీవల ప్రవేశపెట్టిన 11440 టోల్‌ఫ్రీ నంబరును ఓ విద్యార్థిని ఆశ్రయించింది. అంతే...ఏసీబీ రంగంలోకి దిగింది. పక్కా స్కెచ్‌తో అక్రమార్జనకు అలవాటు పడ్డ ఉపాధ్యాయుడును పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... విజయనగరం, లక్కవరపుకోట: ఏసీబీ వలకు ఓ ఉపాధ్యాయుడు చిక్కాడు. మండలంలోని చందులూరు గ్రామంలో విద్యార్థులకు సంబంధించిన పదో తరగతి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు రూ.7వేలు లంచం తీసుకుంటుండగా ఉపాధ్యాయుడు ఈదుబిల్లి సాయికృష్ణను ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ నాగేశ్వరరావు సిబ్బందితో కలిసి శుక్రవారం పట్టుకున్నారు. దీనికి సంబంధించి డీఎస్పీ నాగేశ్వరరావు అందించిన వివరాలు... ఈదుబిల్లి సాయికృష్ణ ఎల్.కోట జెడ్పీ ఉన్నత పాఠశాలలో సార్వత్రిక విద్యాపీఠం(దూర విద్య) కో ఆర్డినేటర్‌గా పని చేస్తున్నారు. కొత్తవలస మండలంలోని ప్రఖ్యాత ట్యుటోరియల్ ప్రైవేటు తరగతులు చెబుతున్న ఆర్.వెంకటరమణ దగ్గర కొందరు విద్యార్థులు ప్రైవేటుగా పదో తరగతి చదువుతున్నారు. ఈ క్రమంలో దూర విద్యలో భాగంగా 2017 – 18 సంవత్సరంలో తొమ్మిది మంది విద్యార్థులు వెంకటరమణ ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్షలను రాశారు. పరీక్షలు రాసిన వారంతా ఉత్తీర్ణులయ్యారు. ఈ క్రమంలో ఉత్తీర్ణత ధ్రువపత్రాలను అందజేయాలని దూర విద్య కోఆర్డినేటర్ సాయికృష్ణను విద్యార్థులు కోరగా ఒక్కో విద్యార్థికి వెయ్యి రూపాయిలు చొప్పున తొమ్మిది వేలు లంచం డిమాండ్ చేశాడు. తొమ్మిది మందిలో సంతోషి అనే విద్యార్థిని రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని అరికట్టేందుకు ఇటీవల నూతనంగా ప్రవేశపెట్టిన 11440 టోల్‌ఫ్రీ నంబరుకు ఈ నెల 7న ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసింది. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ట్యుటోరియల్‌లో పని చేస్తున్న వెంకటరావును సంప్రదించి వివరాలను సేకరించారు. వెంకటరావు కోఆర్డినేటర్ సాయికృష్ణకు ఫోన్ చేసి రూ.తొమ్మిది వేలు ఇవ్వలేమని చెప్పడంతో రూ.7వేలు తీసుకురావాలని డిమాండ్ చేశాడు. దీంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏసీబీ అధికారులు ఇచ్చిన నోట్లును సాయికృష్ణకు తన గృహంలోనే అందజేసి విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్లు తీసుకుంటుండగా మాటు వేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సాయికృష్ణను విచారించగా లంచం తీసుకున్నట్టు ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసి సాయికృష్ణను అరెస్టు చేసి విజయనగరం తరలించారు. దాడుల్లో ఏసీబీ సీఐలు కె.సతీష్‌కుమార్, ఎం.మహేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. -
ఏసీబీ ఉచ్చులో ఇద్దరు సర్వే అధికారులు
అమరావతి, సత్తెనపల్లి: పట్టా భూమిని అసైన్డ్‌లో చూపి లంచం డిమాండ్ చేసిన సర్వే అధికారులపై ఏసీబీ అధికారులు గురువారం దాడి చేశారు. రూ. 27 వేలు తీసుకుంటూ సత్తెనపల్లి మండల సర్వేయర్ ఎం.రాజు, చైన్‌మెన్ చిత్తరంజన్ పట్టుబడ్డారు. వారిద్దరినీ ఏసీబీ అడిషనల్ ఎస్పీ ఎ.సురేష్‌బాబు నేతృత్వంలో అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి పట్టణంలోని రఘురామ్‌నగర్‌కు చెందిన శ్యామల సురేష్‌రెడ్డి తన భార్య శ్యామల నాగలక్ష్మి పేరు మీద పట్టణంలోని ఎఫ్‌సీఐ సమీపంలో 2,102 గజాల (43.5 సెంట్ల) స్థలం ఉంది. ఇది పక్కా పట్టా భూమిగా ఉండటంతో 2006 డిసెంబరులో కొనుగోలు చేశారు. సురేష్‌రెడ్డి కుమారుడు శ్యామల సాయిఅచ్యుత రెడ్డి ఎంఎస్ చేయడానికి నగదు అవసరమైంది. ఈ క్రమంలో ఆ భూమిని పట్టణంలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో పెట్టి విద్యా రుణం కింద నగదు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. లీగల్, ఇంజినీర్ రిపోర్టు అయిపోయాయి. స్థలాన్ని మార్ట్గేజ్కోసం సబ్ రిజిస్ట్రారు కార్యాల యానికివెళ్లగా 49/1ఏలో 3.25 ఎకరాలు కెనాల్ అసైన్డ్ భూమిగా చూపారు. దాని లోనే శ్యామల నాగలక్ష్మికి చెందిన 2,102 గజాల స్థలం కూడా ఉన్నట్లు చూపారు. దీంతో మార్ట్గేజ్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ అంగీకరించలేదు. 2019 అక్టోబరు 10న సురేష్‌రెడ్డి తహసీల్దారుకు అర్జీ పెట్టుకున్నాడు. 1960 నుంచి అడంగల్ కాపీ కోసం అర్జీ పెట్టగా 2019 నవంబరు 12న అడంగల్ ఇచ్చారు. పట్టా భూమిని కెనాల్ అసైన్డ్ భూమిగా చూపుతున్నారని, తనది పట్టా భూమి కనుక తన పని త్వరితగతిన పూర్తి చేయాలని 2019 నవంబరు 20న జిల్లా కలెక్టర్‌ను సురేష్‌రెడ్డి కలిసి విన్నవించుకున్నాడు. పట్టాభూమిని అసైన్డ్‌లో వేశారని ఫిర్యాదు చేయగా స్పందించిన కలెక్టర్ వెంటనే తహసీల్దారు కార్యాలయానికి ఫోన్ చేసి త్వరితగతిన రిపోర్టు పంపాలని ఆదేశించారు. సర్వే అధికారుల బేరసారాలు..... పని కోసం సురేష్‌రెడ్డి తహశీల్దార్ కార్యాలయానికి వచ్చి సర్వేయర్ ఎం.రాజును కలువగా తనతో ఏదైనా పని ఉంటే చైన్‌మెన్ చిత్తరంజన్‌ను కలవమని సర్వేయర్ రాజు సూచించారు. రోజుల తరబడి సురేష్‌రెడ్డి తిరుగుతున్నప్పటికీ సర్వే అధికారులు పట్టించుకోలేదు. చైన్‌మెన్ చిత్తరంజన్‌ను కలిసి పని చేసి పెట్టాలని కోరడంతో విలువైన స్థలంగా భావించి ఎకరానికి ఎంత ఇస్తావంటూ చిత్తరంజన్ బేరసారాలకు దిగాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని సురేష్‌రెడ్డి 1440 స్పందన కాల్‌కు ఫోన్ చేసి సర్వే అధికారుల అవినీతి గురించి వివరించాడు. దీంతో ఏసీబీ అధికారులు పక్కా పథకం రచించారు. ఆ ప్రకారం గురువారం సురేష్‌రెడ్డికి డబ్బు ఇచ్చి పంపగా చైన్‌మెన్ చిత్తరంజన్‌ను సురేష్‌రెడ్డి కలిశాడు. డబ్బు తీసుకుని ప్రస్తుత తహసీల్దారు కార్యాలయం వెనుక నిర్మాణంలో ఉన్న కార్యాలయం వద్దకు రమ్మని సురేష్‌రెడ్డికి చిత్తరంజన్ చెప్పాడు. సురేష్‌రెడ్డి అక్కడకు వెళ్లగా సర్వేయర్‌కు పని చేసేందుకు రూ. 15 వేలు, ఇతర ఆఫీసు ఖర్చుల నిమిత్తం మరో రూ. 12 వేలు ఇవ్వాలని చైన్‌మెన్ చిత్తరంజన్ డిమాండ్ చేశాడు. దీంతో రూ. 27 వేలు చిత్తరంజన్‌కు అందజేయగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ సీఐలు సి.హెచ్. రవిబాబు, జి.శ్రీదర్, ఎస్సై శ్రీనివాసమూర్తి, మరో నలుగురు సిబ్బంది ఉన్నారు. -
ఏసీబీ వలలో గోగులపల్లి వీఆర్వో
నెల్లూరు, అల్లూరు: అల్లూరు మండలం గోగులపల్లి వీఆర్వో కె.సుధాకర్‌ను ఓ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డిజిటల్ పాసుపుస్తకం కోసం వీఆర్వోను ఆశ్రయించిన రైతు నుంచి రూ.17 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ దేవానంద్ శాంతో తెలిపిన వివరాల మేరకు అల్లూరు మండలం గోగులపల్లికి చెందిన రైతు మల్లికార్జున, అతని తల్లి, తమ్ముడు చెందిన సుమారు ఎనిమిది ఎకరాల 57 సెంట్ల వ్యవసాయ భూమి వివరాలను మీసేవ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. పాసు పుస్తకాల కోసం గత నెల 10వ తేదీన దరఖాస్తు చేసుకుని అల్లూరు మండల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి వీఆర్వోను కలిశారు. వీఆర్వో సుధాకర్ ఆ రైతును ఎకరాకు రూ.2 వేల చొప్పున ఖర్చు అవుతుందని చెప్పాడు. పొలానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ సరిగ్గా ఉన్నాయి.. లంచం ఇవ్వలేనని రైతు మల్లికార్జున చెప్పాడు. లంచం ఇవ్వనిదే కాగితం ముందుకు కదలదని వీఆర్వో చెప్పడంతో సదరు విషయాన్ని రైతు మూడు రోజుల క్రితం ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకొచ్చాడు. మంగళవారం రైతు మల్లికార్జున్ నుంచి అల్లూరులోని వాటర్ ట్యాంక్ సెంటర్ రోడ్డులో వీఆర్వో సుధాకర్ రూ.17వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ప్రణాళిక ప్రకారం పట్టుకున్నారు. అతని నుంచి నగదు రికవరీ చేసి తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. లంచం తీసుకుంటే కఠిన చర్యలు ప్రభుత్వ అధికారులు ఎవరైనా రైతులు, ప్రజల వద్ద నుంచి లంచం డిమాండ్ చేస్తే ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్ 14400కు లేదా ఏసీబీ నెల్లూరు వారికి గాని సమాచారం అందించాలని ఏసీబీ డీఎస్పీ దేవానంద్ శాంతో పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచి, లంచం తీసుకున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై రమేష్ బాబు, అధికారులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
పెద్దఅంబర్‌పేట: ఇంటి నిర్మాణ అనుమతులకు లంచం అడిగిన పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు చిక్కాడు. పంచాయతీ కార్యాలయంలో రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గౌరెల్లికి చెందిన చింతకాయల రాజు తన ఇంటి నిర్మాణం కోసం పంచాయతీకి దరఖాస్తు చేసుకున్నాడు. అనుమతులు కావాలంటే తనకు రూ.25 వేలు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ కోరాడు. దీంతో రాజు వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం మధ్యాహ్నం చంద్రశేఖర్‌కు రూ.25వేలు డబ్బులు ఇచ్చాడు. ఆ సమయంలోనే అధికారులు కార్యాలయంలోకి వచ్చి చంద్రశేఖర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
ఏసీబీ వలలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ
నెల్లూరు(క్రైమ్): బిల్లులు మంజూరు చేసేందుకు ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటున్న గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం ఏఈని నెల్లూరు ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల సమాచారం మేరకు.. కలిగిరి మండలం వీర్నకొల్లుకు చెందిన ఎం.తిరుపాల్‌రెడ్డి రైతు. ఆయన వ్యవసాయంతోపాటు చిన్నచిన్న కాంట్రాక్టు పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆ గ్రామంలో ఈ ఏడాది జూలై నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం నుంచి రూ.5.30 లక్షలకు వర్క్‌ఆర్డర్‌ను తిరుపాల్‌రెడ్డి పొందారు. నిర్ధేశించిన గడువు వరకు నీటిని సరఫరా చేశారు. బిల్లు మంజూరుకు గాను సంబంధిత మండలస్థాయి అధికారులను సంప్రదించగా వారు పరిశీలించి ఎంబుక్‌పై సంతకం చేసి తదుపరి చర్యల నిమిత్తం నెల్లూరు పాత జెడ్పీ భవనంలోని ఈఈ కార్యాలయానికి పంపారు. అప్పటి నుంచి తిరుపాల్‌రెడ్డి బిల్లు మంజూరు కోసం కార్యాలయంలోని ఏఈ కె.శ్రీనివాసులు చుట్టూ తిరగసాగారు. కారణం చెప్పకుండా ఆయన తిరుపాల్‌రెడ్డిని రేపు, మాపు అంటూ తిప్పుకోసాగారు. వారం రోజుల క్రితం బిల్లులోని మొత్తానికి 2 పర్సంట్(రూ.10,600) లంచం ఇస్తే బిల్లు మంజూరు చేస్తామని ఏఈ డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని ఫోన్లో తెలియజేయడంతో బాధితుడు కాల్ రికార్డు చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు నెల్లూరు ఏసీబీ డీఎస్పీ సీహెచ్‌డీ శాంతోకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ సూచనల మేరకు సోమవారం మధ్యాహ్నం బాధితుడు లంచం తాలూకు నగదును ఏఈ శ్రీనివాసులుకు(ఆయన కార్యాలయంలోనే) ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా çపట్టుకుని ఆయనకు రసాయన పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఏఈని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఏసీబీ అధికారుల రాకతో ఆర్‌డబ్ల్యూఎస్‌లోని పలువురు అధికారులు కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు. లంచం తాలూకు నగదుతో ఏఈ , బాధితుడు తిరుపాల్‌రెడ్డి ప్రతి పనికీ పర్సంటేజ్ తాజాగా ఏసీబీ అధికారులకు చిక్కిన ఏఈ శ్రీనివాసులు ప్రతి పనికి పర్సంటేజ్ వసూలు చేస్తున్నారని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయనను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న సమయంలో కలిగిరి మండలం పాపనముసలి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ రామకృష్ణారెడ్డి ఏసీబీ అధికారులను కలిశారు. తాను ఈ ఏడాది పాపనముసలి గ్రామంలో నీరు సరఫరా చేశానని, అందుకు సంబంధించి రూ.4.90 లక్షలు బిల్లు రావాల్సి ఉండగా ఏఈని సంప్రదించడంతో 2 పర్సంట్ లంచం ఇవ్వాలని, లేకుంటే బిల్లుపై సంతకం పెట్టేదిలేదని బెదిరించాడని ఏఈ శ్రీనివాసులుపై డీఎస్పీకి ఫిర్యాదు చేశాడు. అదేక్రమంలో వింజమూరుకు చెందిన గంగాధర్ అనే కాంట్రాక్టర్‌కు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు సైతం రూ.2.47 లక్షల బిల్లు మంజూరు చేయించుకునేందుకు కార్యాలయానికి వచ్చారు. వారు సైతం తమను గత కొంతకాలంగా తిప్పించుకుంటున్నారని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వర్క్ ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరి.. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన కె.శ్రీనివాసులు 1987లో వర్క్ ఇన్స్పెక్టర్(ఎన్ఎంఆర్)గా విధుల్లో చేరారు. 2002లో ఏఈగా పదోన్నతి పొందారు. 2018 నుంచి నెల్లూరు గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం కార్యనిర్వహక ఇంజినీరు వారి(ఈఈ) కార్యాలయంలో ఏఈగా విధులు నిర్వహిస్తున్నారు. విధులకు సైతం సరిగా హాజరుకాడని సహచర ఉద్యోగులు తెలిపారు. -
ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ
కృష్ణాజిల్లా, తిరువూరు: ఓ రైతుకు పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయడానికి డబ్బులు డిమాండ్ చేసిన గ్రామ రెవెన్యూ అధికారిని అవినీతి నిరోధక శాఖాధికారులు బుధవారం పట్టుకున్నారు. వివరాలు.. తిరువూరు లయోలా స్కూలు సమీపంలో నివసిస్తున్న రాజుపేట వీఆర్వో పోతురాజు జయకృష్ణ, వావిలాల గ్రామ వీఆర్ఓగా ఇన్చార్జి బాధ్యతలు చూస్తున్నారు. వావిలాల శివారు రాజుగూడెం గ్రామానికి చెందిన కొమ్మినేని చంద్రమౌళి తన భార్య లక్ష్మి, కుమార్తె నాదెండ్ల రమ్యకృష్ణ పేరుతో పట్టాదారు పాస్ పుస్తకాల జారీ కోసం 4 నెలల క్రితం దరఖాస్తు చేశాడు. అడంగళ్ 1బీలో మార్పు చేర్పులు చేయకుండా వీఆర్‌లో జాప్యం చేస్తున్నారు. ఇటీవల పట్టాదారు పాసు పుస్తకాల జారీకి రూ.16వేలు వీఆర్ఓ డిమాండ్ చేయగా, చంద్రమౌళి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వీఆర్ఓ ఇంటి వద్ద రైతు నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కనకరాజు ఆధ్వర్యంలో సిబ్బంది పట్టుకున్నారు. వీఆర్వో నుంచి నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు మధ్యవర్తుల సమక్షంలో పంచనామా చేసి కేసు నమోదు చేశారు. గురువారం జయకృష్ణను ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు. -
అవినీతి పాపం పండింది
నాలుగేళ్లుగా అక్కడే తిష్ట వేశాడు. ప్రతి వ్యవహారంలో తలదూర్చి ప్రైవేట్ పంచాయితీలు నెరుపుతున్నాడు. కేసులొస్తే.. కాసులు పుచ్చుకుని రాజీ చేసి పంపుతున్నాడు. రెండేళ్లుగా అవినీతి ఆరోపణలు వచ్చినా తన పలుకుబడి ఉపయోగించి సీటును పదిలం చేసుకున్నాడు. వెయ్యి గొడ్లను తిన్న రాబంధు.. ఒక్క గాలివానకు కూలినట్లు.. ఓ సివిల్ పంచాయితీతో అవినీతి పోలీస్ అధికారి పాపం పండింది. అక్షరాల రూ.లక్ష లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయాడు. సూళ్లూరుపేట/వరదయ్యపాళెం: ప్రపంచ స్థాయి పరిశ్రమలకు కేంద్రం శ్రీసిటీ పారిశ్రామికవాడలో ఏర్పాటు చేసిన హైటెక్ పోలీస్‌స్టేషన్ అవినీతికి కేరాఫ్‌గా మారింది. కాసులు ఇస్తే.. కేసులు మాఫీ అయిపోతున్నాయి. ఎఫ్ఐఆర్లు నమోదు చేయకుండా రాజీ మార్గంతో కేసులు సరిపుచ్చుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్ర–తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన ఇక్కడ పని చేసిన వారికి కాసుల పంట. ఇసుక,గ్రావెల్ తరలించడానికి ఇక్కడ భారీగా ముడుపులు అందుతున్నట్టు సమాచారం. టీడీపీ ప్రభుత్వంలో జిల్లా నుంచి ఇసుక, గ్రావెల్ తమిళనాడుకు భారీగా అక్రమ రవాణా జరిగేది. ఈ అక్రమ రవాణాకు ఒక్కో టిప్పర్ లారీకి నెలవారీ మామూళ్లు పెద్ద ఎత్తున అందుతున్నట్లు సమాచారం. పరిశ్రమల్లో తలెత్తే వివాదాల్లోనూ భారీగా ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఓ సివిల్ పంచాయితీలో తలదూర్చి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన ఎస్సై సుబ్బారెడ్డి తీరు సంచలనం సృష్టించింది. సివిల్ పంచాయితీలో తల దూర్చి సూళ్లూరుపేట పట్టణంలో స్థిరపడిన ఎస్సై బీ సుబ్బారెడ్డి చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం శ్రీసిటీ సెజ్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్నారు. ఓ సివిల్ కేసులో ప్రత్యర్థిని వేధించి రూ.లక్ష లంచం తీసుకుంటూ తిరుపతి ఏసీబీ ఆధికారులకు చిక్కాడు. అవినీతికి బాగా అలవాటు పడిపోయిన ఎస్సై పాపం ఎప్పుడు పండుతుందా అని స్థానిక ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో బుధవారం ఏసీబీ అధికారులు పథకం ప్రకారం ట్రాప్ చేసి పట్టుకోవడంతో సర్వత్రా ఆనందం వెల్లివిరిసింది. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం చిలమత్తూరు గ్రామానికి చెందిన కే మస్తాన్‌నాయుడు సూళ్లూరుపేట పట్టణంలోని షార్ బస్టాండ్ సెంటర్లో మెడికల్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి మత్తేరిమిట్ట, చిలమత్తూరు వద్ద కొంత పొలాలు ఉన్నాయి. అయితే మత్తేరిమిట్ట గ్రామానికి చెందిన శేషప్రియ అనే మహిళ తన భూములను అదే గ్రామానికి చెందిన వారు ఆక్రమించుకున్నారని, ఐదారు మందిపై నవంబర్ 3వ తేదీన శ్రీసిటీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో మస్తాన్‌నాయుడు పేరు కూడా ఉంది. అయితే ఈ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని, బాధితురాలు శేషప్రియ ఇచ్చిన సర్వే నంబర్లకు తన భూములకు చెందిన సర్వే నంబర్లకు ఎలాంటి సంబంధం లేదని ఎస్సై సుబ్బారెడ్డికి అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను కూడా అందజేశాడు. సుమారు నెలల పాటు మిన్నకుండిపోయిన ఎస్సై ఈ నెల 3న మస్తాన్‌నాయుడుకు ఫోన్ చేసి నీపై కేసు ఉంది అరెస్ట్ చేయాలని బెదిరిస్తూ వచ్చాడు. 10వ తేదీన ఏకంగా సూళ్లూరుపేటలోని మెడికల్ షాపు వద్దకొచ్చి స్టేషన్‌కు వచ్చి మాట్లాడమని చెప్పి వెళ్లిపోయాడు. మస్తాన్ నాయుడు అదే రోజు శ్రీసిటీ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఆ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వినకుండా బేరం మాట్లాడారు. నీ అరెస్ట్ ఆపేసి కేసులో లేకుండా చేస్తాను రూ.5 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేయడం, చివరకు రూ.2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బుధవారం సూళ్లూరుపేటలో డబ్బులు ఇచ్చేలా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో బా«ధితుడు తిరుపతి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శ్రీసిటీ ఎస్సై సుబ్బారెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు ఉండడంతో తిరుపతి ఇన్చార్జి ఏసీబీ డీఎస్పీ సీహెచ్‌డీ శాంతో రూ.లక్ష (రూ.2వేలు నోట్లు) ఇచ్చి ట్రాప్ చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశారు. బాధితుడు మస్తాన్‌నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సైను సస్పెండ్ చేసేందుకు కూడా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ దాడిలో తిరుపతి ఏసీబీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నాలుగేళ్లుగా శ్రీసిటీ హైటెక్ పోలీస్ స్టేషన్లోనే.. అవినీతి నిరోధకశాఖకు అడ్డంగా దొరికిన ఎస్సై సుబ్బారెడ్డి నాలుగేళ్ల క్రితం శ్రీసిటీ హైటెక్ పోలీస్‌స్టేషన్‌లో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఔట్‌పోస్టుగా ఉండి హైటెక్ పోలీస్‌స్టేషన్‌గా స్థాయి పెరిగిన నాటి నుంచి మొదటి ఎస్సైగా సుబ్బారెడ్డి విధులు నిర్వహిస్తున్నాడు. అయితే రెండేళ్లుగా ఆయనపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయనకున్న పలుకుబడితో నాలుగేళ్లుగా ఒకే పోలీస్‌స్టేషన్‌లో కొనసాగాడు. ఆయన ధాటికి ఇక్కడ ఎస్సైలుగా వచ్చిన మరో ముగ్గురు కూడా అనధికారంగానే బదిలీ కావడం విశేషం. -
ఏసీబీకి చిక్కిన అవినీతి ఖాకీ
ప్రకాశం, మద్దిపాడు: మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో రైటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జి.వీర్రాజు మంగళవారం ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. ట్రాన్స్‌పోర్టు కంపెనీ లారీకి యాక్సిడెంట్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే రూ.5 వేలు డిమాండ్ చేయడంతో విధిలేని పరిస్థితిలో ఏసీబీని సదరు కంపెనీ మేనేజర్ ఆశ్రయించాడు. అందిన వివరాల ప్రకారం మండల పరిధిలోని దొడ్డవరప్పాడు సమీపంలో ఈనెల 15 తేదీ తెల్లవారు జామున లారీ ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు లారీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ వద్దకు తరలించారు. ఈ నేపథ్యంలో ముందు వెళ్తున్న వాహనానికి సంబంధించిన వ్యక్తి తనకు కేసు అవసరం లేదంటూ వెళ్లిపోయాడు. లారీ డ్రైవర్ ట్రాన్స్‌పోర్టు కంపెనీ మేనేజర్ కరీమ్ ఖాన్‌కు ఫోన్ చేయగా అతను 15వ తేదీ, సాయంత్రం వచ్చి స్టేషన్లో విచారించాడు. ఈక్రమంలో లారీ ముందు భాగం దెబ్బతినడంతో ఇన్‌స్రూెన్స్ నిమిత్తం యాక్సిడెంట్ సర్టిఫికెట్ కోసం స్టేషన్ రైటర్ వీర్రాజును సంప్రదించగా అతను సర్టిఫికెట్ ఇవ్వాలంటే రూ.6 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. స్టేషన్ రైటర్ మాట్లాడిన మాటలను వీడియో రికార్డింగ్ చేసి తాను అంత ఇవ్వలేనని తెలుపగా రూ.5 వేలు లేకపోతే నీపని కాదని రైటర్ కరాఖండిగా చెప్పడంతో కరీంఖాన్ నేరుగా ఒంగోలు చేరుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించి వీడియో క్లిప్పింగ్‌లు చూపాడు. వారు విషయాలను పరిశీలించి నిర్ధారణకు వచ్చిని ఏసీబీ అధికారులు కరీంఖాన్కు ఐదు వేల రూపాయల నగదు ఇచ్చి మంగళవారం ఉదయం మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌కు పంపారు. అతను నగదు రైటర్‌కు ఇచ్చిన వెంటనే ఏసీబీ అడిషనల్ ఎస్పీ గుంటూరు, ప్రకాశం జిల్లా ఇన్చార్జి ఏ సురేష్‌బాబు తన సిబ్బందితో కలిసి దాడిచేసి రైటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదుదారుడు ఇచ్చిన నగదును రైటర్ టైబుల్ డ్రాయర్లో నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో స్టేషన్ ఎస్ఐ ఖాదర్‌బాషా వేరే కేసు నిమిత్తం ఘటనా స్థలికి వెళ్లగా ఎస్ఐను పిలిపించి విషయం తెలిపారు. వీర్రాజును కస్టడీలోకి తీసుకుని నెల్లూరు ఏసీబీ కోర్టులో బుధవారం ప్రవేశ పెట్టనున్నట్లు ఏసీబీ ఏఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఆయన వెంట ఎన్.రాఘవరావు ఎ.వెంకటేశ్వర్లు ఏసీబీ సిబ్బంది పలువురు ఉన్నారు. దాదాపుగా 8 సంవత్సరాల తరువాత మద్దిపాడు మండలంలో ఏసీబీ అధికారులు దాడి చేయడం ఇదే ప్రథమం. గతంలో రెవెన్యూశాఖలో పని చేస్తున్న ఆర్ఐ రామానాయుడు ఇసుక ట్రాక్టర్ యజమాని వద్ద డబ్బులు డిమాండ్ చేసి లంచం తీసుకుంటున్న సమయంలో ఒంగోలులోని లింగయ్య భవనం సమీపంలో ఏసీబీ అధికారులు మాటు వేసి పట్టుకున్నారు. ఆ తరువాత తాజాగా మంగళవారం ఏసీబీ అధికారులు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో రైటర్‌ను పట్టుకోవడం మండల ప్రజల్లో చర్చనీయాంశమైంది. రెండు రోజులు స్టేషన్ చుట్టూ తిప్పిబెదిరించాడు రోజుల నుంచి స్టేషన్ చుట్టూ తిప్పి బెదిరించాడు. ఎస్ఐ సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పినా రైటర్ డబ్బు డిమాండ్ చేసి ఇస్తేనే సర్టిఫికెట్ ఇస్తాననడంతో ఏసీబీని ఆశ్రయించాల్సి వచ్చింది.– కరీంఖాన్,విజయవాడ ట్రాన్స్‌పోర్టు కంపెనీ మేనేజర్ బాధితులు ఎవరైనా ఫిర్యాదుచేయవచ్చు ఎవరైనా ఏసీబీకి ఫిర్యా దు చేయవచ్చు. తగిన ఆధారాలతో వారిని అరెస్టు చేస్తాం. ఎవరైనా అధికారులు అవినీతి పనులు చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తే మాకు తెలియచేయండి. ఏ సమయంలోనైనా సిద్ధంగా ఉంటాం.– ఏ.సురేష్‌బాబు, ఏసీబీ అడిషనల్ ఎస్పీ ప్రకాశం జిల్లా ఇన్చార్జి -
ఏసీబీకి చిక్కిన నలుగురు అధికారులు
సాక్షి, అమరావతి/కర్నూలు/కొత్తవలస: రాష్ట్రంలో కర్నూలు, విజయనగరం జిల్లాల్లో సోమవారం లంచం తీసుకుంటున్న నలుగురిని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీజీ కుమార్ విశ్వజిత్ మీడియాకు విడుదల చేశారు. కర్నూలులోని భూపాల్ కాంప్లెక్స్‌లో ఉన్న చంద్రకాంత్ చిట్‌ఫండ్స్ నిర్వాహకులు గోపాల్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డిపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. దీని దర్యాప్తును సీసీఎస్ సీఐ రామయ్య నాయుడుకు అప్పగించారు. ఆదినారాయణరెడ్డిని అరెస్టు చేయకుండా ఉండేందుకు, తనపై రౌడీషీటు తెరవకుండా ఉండేందుకు గతంలో రూ.లక్ష తీసుకున్న సీఐ మళ్లీ లంచం డిమాండ్ చేస్తున్నాడని గోపాల్‌రెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే స్థానిక వెంకటరమణ కాలనీలోని హరిత హోటల్లో న్యాయవాది చంద్రశేఖర్‌రెడ్డి సీఐ తరఫున లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ నాగభూషణం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో వీరిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలకు కూరగాయలు, కిరాణా సరుకులు అందించే ఒప్పందాన్ని కొనసాగించేందుకు ఆదారి సురేష్‌కుమార్, ఎస్.రమణబాబు నుంచి విజయనగరం జిల్లా, కొత్తవలస మండలం వియ్యంపేట ఐసీడీఎస్ సీడీపీవో పోతల మణెమ్మ లంచం డిమాండ్ చేసింది. దీంతో వారు ఏసీబీని ఆశ్రయించారు. సీడీపీవో మణెమ్మ ఆదేశాల మేరకు సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ రూ.85 వేలు లంచం తీసుకుని టేబుల్ సొరుగులో పెడుతుండగా ఏసీబీ డీఎస్పీ నాగేశ్వరరావు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, మంగళవారం విశాఖపట్నం ఏసీబీ కోర్టుకు తరలిస్తామని ఆయన చెప్పారు. వియ్యంపేట ఐసీడీఎస్ సీడీపీవో మణెమ్మ వేణుగోపాల్ -
ఆక్వా చెరువుల్లో కాసుల వేట
వివిధ శాఖల్లో వక్రమార్గం పట్టిన కొందరు అధికారులు ఆక్వా చెరువుల్లో అక్రమాల పంటపండిస్తున్నారు. ఒక్కో స్థాయిలో ఒక్కో రేటు నిర్ణయించి కాసులు దండుకుంటున్నారు. అసలు చేయి తడపందే ఆక్వా చెరువులకు అనుమతులే ఇవ్వబోమంటున్నారు. సొమ్ములెందుకివ్వాలని ఎవరైనా ఎదురు తిరిగి అడిగితే పాత ‘నకిలీ’లను బయటపెట్టి బెదిరింపులకు దిగుతున్నారు.దీంతో ఎందుకొచ్చిన గొడవంటూ ఆ అధికారులు అడిగినంతా ఆక్వా రైతులు ముట్టజెబుతున్నారు. ఆక్వా సాగవుతున్న దాదాపు అన్ని మండలాల్లోనూ ఈ ఆమ్యామ్యాల బాగోతం యథేచ్ఛగా సాగుతోంది. ఆక్వా చెరువులకు అనుమతి ఉన్నట్టుగా నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి ప్రభుత్వ విద్యుత్తు రాయితీ పొందిన రైతులే అధికంగా ఉండడంతో ఆయా అధికారులు అడిగిన మొత్తం కిమ్మనకుండా సమర్పించుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: జిల్లాలో రొయ్యల చెరువులకు అనుమతి పత్రాల కోసం వివిధ శాఖల్లోని కొందరు అధికారులు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆక్వా సాగులో నాణ్యమైన ఉత్పత్తుల కోసం కేంద్ర ప్రభుత్వం రొయ్యలు, చేపల చెరువులను సాగు చేసేందుకు చెన్నై కేంద్రంగా కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ సర్టిఫికెట్ (సీసీఏ) తప్పనిసరి చేసింది. ఈ సర్టి ఫికెట్ లేకుండా చెరువులు తవ్వకానికి, ఆక్వా సా గు చేపట్టడానికి వీలు లేదు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆక్వా చెరువుల సా గుకు వినియోగించే విద్యుత్తుకు రాయితీని పెంచింది. గత ప్రభుత్వంలో రూ.3.60 ఉన్న యూని ట్ విద్యుత్‌ను ప్రస్తుతం రూ.1.50కే అందిస్తోంది. ఈ క్రమంలో విద్యుత్ రాయితీ కొట్టేసేందుకు కొందరు ఆక్వా రైతుల బుద్ధి వక్రమార్గం పట్టింది. ఎటువంటి అధికారిక అనుమతులూ లేకపోయినా చెరువులు తవ్వేసి రాయితీ మొత్తం కాజేస్తున్నారు. ఈ విషయాన్ని రెండు నెలల కిందట ‘సాక్షి’ వెలుగులోకితెచ్చింది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి నకిలీ సర్టిఫికెట్లతో విద్యుత్తు కనెక్షన్లు పొందిన చెరువుల వివరాలను మత్స్యశాఖ ద్వారా సేకరించారు. వాటి కనెక్షన్లను రద్దు చేయించారు. అలా రద్దు చేసిన సర్టిఫికెట్లను పునరుద్ధరించుకునేందుకు రైతులకు 2020 జనవరి 4వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. ఆ గడువు దగ్గర పడుతున్న క్రమంలో రైతులు అనుమతుల కోసం తొందరపడుతున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని క్షేత్ర స్థాయిలో పలు శాఖల అధికారులు లంచాలు డిమాండ్ చేస్తూ రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. విద్యుత్ కనెక్షన్ లేకుండా ఆక్వా సాగు అసాధ్యం. దీంతో చెరువుల సాగుకు అనుమతి పత్రాల కోసం అధికారుల చుట్టూ యజమానులు తిరుగుతున్నారు. కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ çసర్టిఫికెట్ పొందాలంటే తొలుత మండల స్థాయి, ఆ తరువాత జిల్లా స్థాయి కమిటీల్లో అనుమతి తప్పనిసరి. ‘స్పందన’ ఫిర్యాదుతో కలెక్టర్ అప్రమత్తం కాకినాడ కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ‘స్పందన’కు ఆక్వా సాగుపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో కలెక్టర్ మురళీధర్‌రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. వ్యవసాయం, నివాస ప్రాంతాలు, మంచినీటి వనరులు కలుషితం కాకూడదనే ఉద్దేశంతో మండల స్థాయి, జిల్లా స్థాయి కమిటీలను మరింత పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. కలెక్టర్ చైర్మన్‌గా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కన్వీనర్‌గా, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్, నీటిపారుదల, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సభ్యులుగా జిల్లా స్థాయి కమిటీ ఉంది. మండల స్థాయి కమిటీలో తహసీల్దార్, మత్స్య, ఇరిగేషన్, వ్యవసాయ, ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు సభ్యులుగా ఉన్నారు. ఆక్వా సాగు కోసం రైతుల దరఖాస్తులపై మండల కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి జిల్లా కమిటీకి సిఫారసు చేయాలి. ఆ కమిటీ అనుమతించిన తరువాతే చెన్నైలోని ఆక్వా కల్చర్ అథారిటీకి పంపిస్తారు. ఈ ప్రక్రియ క్షేత్రస్థాయిలో పక్కతోవ పట్టిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముడుపులు ముట్టకుంటే కింది స్థాయి అధికారులు ఫైళ్లను ముందుకు కదపడం లేదని రైతులు లబోదిబోమంటున్నారు. ఈ ముడుపుల వ్యవహారంపై కోనసీమలోని పలు మండలాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. నాడు విద్యుత్తు రాయితీల కోసం కక్కుర్తిపడి, నకిలీ సర్టిఫికెట్లతో సాగు చేయడాన్ని బూచిగా చూపించి, ముడుపులు డిమాండ్ చేస్తున్నారని, అడిగినంతా ముట్టజెప్పందే తమ అర్జీలను జిల్లాస్థాయికి పంపడం లేదని అంటున్నారు. కోనసీమలోని ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లి, పెదమడి, బాణాపురం, కేశనకుర్రుపాలెం, మురమళ్ల; కాట్రేనికోన మండలం చెయ్యేరు, చెయ్యేరు అగ్రహారం, కాట్రేనికోన, కందికుప్ప; అల్లవరం మండలం కొమరగిరిపట్నం, గోడి, గోడిలంక; ఇంకా ఉప్పలగుప్తం, అయినవిల్లి తదితర మండలాల్లో కూడా ఈ ముడుపుల దందా నడుస్తోందంటున్నారు. ఇందుకు మరో కారణం కూడా లేకపోలేదు. కోస్టల్ ఆక్వా అథారిటీ సర్టిఫికెట్ లేని చెరువుల విద్యుత్తు కనెక్షన్ తొలగించేందుకు ఏపీఈపీడీసీఎల్ సమాయత్తమవుతోంది. దీంతో హడావిడి పడుతున్న రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని మండల స్థాయిలో మత్స్య, వ్యవసాయ శాఖ అధికారులు వసూళ్లకు తెగబడతున్నారు. ఈ మండలాల్లో ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల చొప్పున గుంజుతున్నారు. ఈ ముడుపులను మండల స్థాయిలో శాఖల వారీగా తలా రూ.3 వేల చొప్పున పంపకాలు చేసుకుంటున్నారు. చేయి తడపనిదే జిల్లాస్థాయి కమిటీకి సిఫారసు చేయడం లేదని కాట్రేనికోన, ఐ.పోలవరం మండలాలకు చెందిన పలువురు రైతులు, ఒక మండల స్థాయి అధికారి చెప్పారు. సీఏఏ సర్టిఫికెట్ విద్యుత్తు శాఖకు అందజేస్తే రాయితీ వస్తుందనే ఆశతో వారు డిమాండ్ చేసినంతా ఆక్వా రైతులు ఇచ్చుకుంటున్నారు. రాయితీ ఇలా.. జిల్లాలో చెరువులకు ఉన్న 7,111 విద్యుత్తు కనెక్షన్లకు ప్రభుత్వం రాయితీపై విద్యుత్ సరఫరా చేస్తూ వస్తోంది. వీటిలో 3,583 చెరువులకు మాత్రమే సీఏఏ సర్టిఫికెట్లున్నాయి. మిగిలిన 3,528 విద్యుత్తు కనెక్షన్లున్న చెరువులకు పొందిన సర్టిఫికెట్లు నకిలీవేనని తేల్చి, వాటిని రెండు నెలల కిందట కలెక్టర్ రద్దు చేశారు. వీటితోపాటు రద్దు చేస్తారనే భయంతో కొందరు రైతులు ముందస్తుగా సీఏఏ సర్టిఫికెట్లు పునరుద్ధరించుకునేందుకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇదే అదునుగా వారి నుంచి అధికారులు ముడుపులు గుంజేస్తున్నారు. మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులు సర్టిఫికెట్ల కోసం మండలాల వారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలిలా ఉన్నాయి. అత్యధికంగా అల్లవరం మండలంలో 603, కాజులూరులో 533, ఐ.పోలవరంలో 447, ఉప్పలగుప్తంలో 316, సఖినేటిపల్లి మండలంలో 265, కాట్రేనికోనలో 256, తాళ్లరేవులో 200 దరఖాస్తులు వచ్చాయి. అమలాపురంలో 98, అయినవిల్లిలో 82, ముమ్మిడివరంలో 167, మలికిపురంలో 56, రాజోలు 47, మామిడికుదురులో 46, కొత్తపల్లిలో 95, కరపలో 104, పెదపూడిలో 45, కె.గంగవరంలో 49, రామచంద్రపురంలో 44 దరఖాస్తులు వచ్చాయి. ఇవి కాకుండా రెండు నుంచి 20 వరకూ దరఖాస్తులు వచ్చిన మండలాలు మరో 10 వరకూ ఉన్నాయి. విచారణ జరిపించిచర్యలు తీసుకుంటాం ముడుపుల విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటాం. రైతుల నుంచి నిర్దిష్టంగా ఫిర్యాదులు వస్తే కచ్చితంగా విచారణ జరిపించి, చర్యలు తీసుకుంటాం. ఇంతవరకూ ఎవరూ ఫిర్యాదు చేయలేదు. నకిలీ సర్టిఫికెట్లతో కనెక్షన్లు పొందిన రైతులు ఇటీవల మంత్రులను కలిసి పునరుద్ధరించాల్సిందిగా అభ్యర్థించారు. కానీ, అన్ని అనుమతులూ తీసుకున్న వాటిని మాత్రమే గుర్తించి, పునరుద్ధరిస్తామని వారు రైతులకు చెప్పారు. లంచాల విషయం మా దృష్టికి రాలేదు. ఏయే మండలాల్లో ఇలాంటి పరిస్థితి ఉందో స్వయంగా తెలుసుకుంటాం. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అటువంటి వాటిని కట్టడి చేస్తాం.– పి.కోటేశ్వరరావు, జేడీ ఇన్చార్జి, అదనపు డైరెక్టర్, ప్రిన్సిపాల్, రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ కార్యాలయం (ఎస్‌ఐఎఫ్‌టీ), కాకినాడ -
కమీషన్.. డిస్కం
సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అవినీతికి నిలయంగా మారింది. పైసా విదల్చనిదే ఫైలు కదలని పరిస్థితి నెలకొంది. ట్రాన్స్ఫార్మర్, కొత్త వెంచర్లో లైన్ల ఏర్పాటు, లైన్ల మార్పిడి, ప్యానల్ బోర్డు, కరెంట్ మీటర్....ఇలా ప్రతి పనికీ ఓ రేట్ ఫిక్స్ చేశారు. అడిగినంత ఇస్తే సరి..లేదంటే వినియోగదారులకు చుక్కలు చూపుతున్నారు. ఇంజినీర్ల తీరుతో విసిగిపోయిన వినియోగదారులు, విద్యుత్ కాంట్రాక్టర్లు చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తుండటంతో వారు వలపన్ని అవినీతి తిమింగలాలను పట్టుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఒక సారి ఏసీబీ కేసులో అరెస్టై కేసు విచారణలో ఉన్న అధికారులు కూడా ఏడాది తిరక్క ముందే అంత కంటే మంచి పోస్టులో చేరిపోతుండటంపై విశేషం. ఏసీబీ కేసులున్న అధికారులను నాన్ ఫోకల్ పోస్టుల్లో నియమించాల్సి ఉండగా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఇందుకు విరుద్ధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి పెద్దపీట వేస్తుండటం గమనార్హం. ఆ డివిజన్లు అవినీతికి నిలయాలు: నగర శివార్లలో కొత్తగా అనేక వెంచర్లు వెలుస్తున్నాయి. కొత్తలైన్లు, మీటర్లు కరెంటోళ్లకు కామధేనువులా మారాయి. నిజానికి నాలుగు మీటర్లకు మించితే ప్యానల్ బోర్డు ఏర్పాటు చేసుకోవాలి. అయితే పలవురు వినియోగదారులు జీహెచ్ఎంసీ అనుమతి తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. ఒక వేళ అనుమతి తీసుకున్నా..సెట్‌బ్యాక్, పార్కింగ్, ఫైర్‌సేఫ్టీ తదితర నిబంధనలు పాటించకపోవడంతో వాటికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వరు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, చంపాపేట్, హబ్సిగూడ, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, మియాపూర్, కూకట్పల్లి, కొండాపూర్, మాదాపూర్ డివిజన్లలో పని చేస్తున్న కొందరు అధికారులు వినియోగదారుల బలహీనతను ఆసరాగా చేసుకుని అందినకాడికి దండుకుంటున్నారు. అధికారికంగా ఎలాంటి ఎస్టిమేషన్లు లేకుండానే కొత్తలైన్లు, ప్యానల్‌బోర్డులు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జీడిమెట్ల సుభాష్‌నగర్, ప్రగతినగర్, షాపూర్‌నగర్, డీపీపల్లి, ప్రగతినగర్‌లోని క్షేత్రస్థాయి సిబ్బందిపై ఇటీవల పెద్దత్తున ఆరోపణలు వెల్లువెత్తడంతో ఇద్దరు క్షేత్రస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి భవనం, వెంచర్ యజమానులు కొత్త లైన్లు, కనెక్షన్ల కోసం ఆయా డివిజన్ల పరిధిలోని వినియోగదారుల సేవాకేంద్రంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కేంద్రం నుంచి దరఖాస్తు సంబంధిత సెక్షన్ ఏఈ, ఏడీఈ, డీఈ,ఎస్ఈకి వెళుతుంది. వర్క్ ఎస్టిమేషన్ దగ్గరి నుంచి మెటీరియల్ సరఫరా, వర్క్ పూర్తయిన తర్వాత తనిఖీ చేసే వరకు ఆయా విభాగాల అధికారులకు అడిగినంత ఇచ్చుకోవాల్సిందే. లేనిపక్షంలో రోజుల తరబడి తిరిగినా పనులు కావడం లేదు. క్షేత్రస్థాయి ఇంజినీర్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో విసుగెత్తిన వినియోగదారులు, విద్యుత్ కాంట్రాక్టర్లు గత్యంతరం లేర ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. ఏసీబీకి చిక్కిన ఇద్దరు డీఈలు కీసర విలేజ్, నాగారం పరిధిలో ఇటీవల కొత్తగా ఓ వెంచర్ వెలసింది. కొత్తలైన్కోసం యజమానులు డిస్కంకు దరఖాస్తు చేశారు. వర్క్ ఎస్టిమేషన్, అనుమతులు మంజూరు చేసేందుకు మేడ్చల్ డీఈ ప్రసాదరావు సంబంధిత కాంట్రాక్టర్ బొల్లారం బాలనరసింహను రూ.50 వేలు డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం ఆయనకు రూ.25 వేలు చెల్లించారు. అయినా వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా ఆఫీసు చుట్టూ తిప్పుకుంటుండటంతో విసుగుచెందిన కాంట్రాక్టర్ నరసింహ ఏసీబీని ఆశ్రయించారు. గురువారం మధ్యాహ్నం తన కార్యాలయంలోనే డీఈ ప్రసాదరావు కాంట్రాక్టర్ నుంచి రూ. 5000 లంచంగా తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. సదరు అధికారి ఇటీవలే కార్పొరేట్ ఆఫీసు(నాన్‌ఫోకల్ ఫోస్టు) నుంచి మేడ్చల్ డీఈ (ఫోకల్ పోస్టు)కు బదిలీ కావడం విశేషం. ♦ మణికొండలోని ఓ బహుళ అంతస్తుల భవనానికి విద్యుత్ కనెక్షన్ కోసం వర్క్స్ ఎస్టిమేషన్కు భవన యజమాని రవీందర్‌రెడ్డి దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకుగాను సైబర్‌సిటీ డీఈ టెక్నికల్ ముత్యం వెంకటరమణ రూ.25 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆ భవనం పనులు దక్కించుకున్న విద్యుత్ కాంట్రాక్టర్ శివకుమార్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం సాయంత్రం డీఈ వెంకటరమణ కాంట్రాక్టర్ నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మచ్చుకు కొన్ని కేసులు: ♦ సెప్టెంబర్‌లో లైన్మెన్ రాజేందర్ గచ్చిబౌలిలోని నిర్మాణంలో ఉన్న భవనానికి మీటర్ బిగించేందుకు రూ.60వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. ♦ నవంబర్‌లో కొండాపూర్ ఏడీఈ డి.శ్యాంమనోహర్ రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ట్రాన్స్ఫార్మర్, ఆరు మీటర్లు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేశారు. ♦ మియాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌కు మీటర్ అమర్చేందుకు ఓ సోలార్ విద్యుత్ సంస్థ ప్రతినిధి నుంచి లంచం తీసుకుంటున్న మియాపూర్ ఏడీఈ రమేష్, సబ్ ఇంజినీర్ పాండులను ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఏడీఈ రమేష్‌పై 2008లోనే ఏసీబీ కేసు నమోదైంది. కేసు విచారణలో ఉన్న సమయంలోనే ఆయన మరోసారి పట్టుబడటం విశేషం. ♦ షాపూర్‌నగర్ ఏఈ చిత్తరంజన్ సహా యూసఫ్‌గూడ ఏఈ సుధాకర్ కూడా ఇటీవల ఏసీబీకి పట్టుబడ్డవారిలో ఉన్నారు. ♦ 2017 జూన్‌లో అసెస్మెంట్స్ ఎస్ఈ శివాజీ రాఠోడ్ ఐమ్యాక్స్ థియేటర్లో వినియోగదారుల నుంచి రూ.80వేలు లంచం తీసుకుంటూ దొరికాడు. ♦ గత ఏడాది ఏప్రిల్‌లో షేక్‌పేట ఏఏఈ షేక్‌బాబా మెహిదీపట్నంలోని అపార్ట్‌మెంట్‌కు ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసేందుకు రూ.30వేలు తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది. -
ఏసీబీ వలలో జాడుపల్లి వీఆర్వో
శ్రీకాకుళం, పాతపట్నం: జిల్లాలో ఓ వైపు ఏసీబీ దాడుల్లో అవినీతిపరులు భరతం పడుతున్నా కొంతమంది అధికారుల్లో ఎటువంటి నిర్భీతి లేదు. దర్జాగా లంచాల మేత మేస్తున్నారు. దీన్ని రుచి మరిగిన సోంపేట, ఎచ్చెర్ల, మందస మండలాల్లో ముగ్గురు వీఆర్వోలు ఇటీవల ఏసీబీ అధికారులు చిక్కిన విషయం విదితమే. ఈ ఉదంతాలు మరువక ముందే తాజాగా మెళియాపుట్టి మండలం జాడుపల్లి గ్రామ రెవెన్యూ అధికారి సవిరిగాన బానోజీరావు అడ్డంగా దొరికిపోయారు. రూ.3 వేలు లంచం తీసుకుంటుండగా పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు. ఈ ఘటన రెవెన్యూ వర్గాల్లో అవినీతిపరులను చెమటలు పట్టించింది. మండల చరిత్రలో రెండో ఏసీబీ కేసుగా నమోదైంది. గతంలో ఓ ఎస్ఐ అద్దె ఇంటిపై ఏసీబీ దాడులు చేశారు. ప్రస్తుతం వీఆర్వో బానోజీరావు దొరికిపోయారు. పాతపట్నం మండలం బోరుబద్ర గ్రామానికి చెందిన ఈయన 2008లో నామిని గ్రామ రెవెన్యూ అధికారిగా మెళియాపుట్టి మండలం గొప్పిలి గ్రామ రెవెన్యూలో ఉద్యోగంలో చేరాడు. 11 ఏళ్లపాటు పలు రెవెన్యూ గ్రామాల్లో పనిచేసి, ప్రస్తుతం జాడుపల్లి వీఆర్వోగా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాణాపురం పంచాయతీ సుజ్జని గ్రామానికి చెందిన బమ్మిడి కృష్ణారావు సెప్టెంబర్‌లో 82 సెంట్లు భూమి కొనుగోలు చేశాడు. దానికి సంబంధించి మ్యూటేషన్, పాస్‌పుస్తకానికి దరఖాస్తు పెట్టాడు. తహసీల్దార్ దామోదరావును కలిసినా ఇవ్వలేదు. చివరకు వీఆర్వోను సంప్రదించగా పలుమార్లు తిప్పించుకుంటూ రూ.3 వేలు ఇస్తే పాస్‌పుస్తకం ఇస్తానని తేల్చి చెప్పాడు. ఈ విషయమై ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయించాడు. శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ఎస్ రమణమూర్తి ఆధ్వర్యంలో సీఐలు భాస్కరరావు, హరి, ఎస్ఐలు సుబ్బారావు, చిన్నంనాయుడు శుక్రవారం అవినీతి చేపను పట్టుకోవడానికి రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా కృష్ణారావుతో ఫోన్ చేయించగా, తహసీల్దార్ కార్యాలయం సమీపాన అద్దె ఇంట్లో ఉన్నానని, వచ్చి కలవాలని వీఆర్వో సూచించాడు. అక్కడ రూ.3 వేలు తీసుకుంటుండగా, అప్పటికే మాటు వేసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకుని, ఫింగర్ ప్రింట్‌ను తీసుకున్నారు. వీఆర్వో ఉంటున్న ఇంట్లో తనిఖీలు చేయగా 70 పాస్‌పుస్తకాలు దొరికాయి. వాటిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ ఎస్ దామోదరావును, డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్‌ను రప్పించి విచారణ చేశారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ మ్యూటేషన్, పాస్‌పుస్తకాల కోసం రూ.3 వేలు లంచం డిమాండ్ చేశారని, పక్కా ప్రణాళికతో వీఆర్వోను పట్టుకుని కేసు నమోదు చేశామన్నారు. విశాఖపట్నం ప్రత్యేక ఏసీబీ కోర్టులో శనివారం హాజరు పరుస్తామన్నారు. నెలలుగా తిరిగినా∙పుస్తకాలు ఇవ్వలేదు మూణ్నెల్ల క్రితం మ్యూటేషన్, పాస్‌పుస్తకం కోసం దరఖాస్తు చేశాను. ఇంత వరకు వీఆర్వో పాస్‌పుస్తకం ఇవ్వలేదు. నెలల తరబడి తిరిగినా పట్టించుకోలేదు. పాస్‌పుస్తకం కోసం రూ.3 వేలు డిమాండ్ చేయడంతోనే దిక్కులేక ఏసీబీని ఆశ్రయించాను.– బమ్మిడి కృష్ణారావు, రైతు,సుజ్జని గ్రామం, పాతపట్నం -
హన్నన్నా...ఆర్ఐఓ గారూ?
వాళ్లు ఎప్పటి నుంచి మామూళ్లు చెల్లిస్తున్నారో? ఈయన గారు ఎన్నాళ్ల నుంచి తీసుకోవడం అలవాటుగా మార్చుకున్నారో గానీ చివరికి బేరసారాల సమన్వయం కుదరలేదు. ఇన్నాళ్లూ ఓపికతో అడిగిందంతా సమర్పించిన వారు విసిగిపోయారు. ఏం జరిగితే జరగనీ అనుకున్నారు. అయ్యగారి అజమాయిషీకి తెరదించాలనుకున్నారు. మంగళవారం అన్నంత పనే చేశారు. ఇంటర్మీడియెట్ పర్యవేక్షణ అధికారి ఏసీబీకి పట్టుబడిన ఉదంతమిది. సాక్షి, శ్రీకాకుళం : జిల్లా ఇంటర్మీడియెట్ రీజనల్ పర్యవేక్షణ అధికారి (ఆర్ఐఓ) గుంతుకు రమణారావు మంగళవారం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖాధికారులకు పట్టుబడ్డారు. సోంపేటలోని కృష్ణసాయి ప్రైవేట్ జూని యర్ కళాశాల యాజమాన్యం ఆయన్ను పట్టించింది. 221 మంది ఇంటర్ విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలంటూ గత నెల 30న ఆర్ఐఓకు నివేదించగా, పెద్దమొత్తంలో ముడుపులు ముట్టజెప్పాలని డిమాండ్ చేశారు. కళాశాల యాజమాన్య కరస్పాండెంట్ తమ్మినేని కృష్ణారావు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, ప్రణాళిక ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఆర్ఐఓ కార్యాలయంలో రమణారావును పట్టుకున్నారు. ఇన్నాళ్లూ విద్యార్థుల పరీక్షల అనుమతికి అడిగింది చెల్లించిన యాజమాన్యం ఇంతటి సాహసోపేతమైన చర్యకు పాల్పడడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఆర్ఐఓ స్థాయి అధికారి ఏసీబీకి చిక్కడమూ ఇదే ప్రథమం కావడం విశేషం. ఇది వారికి ‘మామూలే’.. ఆర్ఐఓ రమణారావు తీరుపై జిల్లాలోని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఎప్పటి నుంచో గుర్రుగా ఉన్నాయి. అడిగినంత ఇస్తే గానీ ఏ ఫైలూ కదలదని అక్కడి ఉద్యోగులే చెబుతుంటారు. విద్యార్థుల భవిష్యత్ ముడి పడి ఉండడం, పర్యవేక్షణ కూడా అంతంతమాత్రం కావడంతో అవినీతి అధికారుల ఆటలు సాగేవి. ఇన్నాళ్లకు ఒక యాజమాన్యం ఎదురు తిరగడంతో రమణారావు బండారం బట్టబయలైంది. దీనికి తోడు ప్రభుత్వం తాజాగా ఇంటర్ విద్యలో ఆన్లైన్లోనే ఫీజు లు, రుసుములు చెల్లించేలా సంస్కరణలు ప్రవేశపెట్టింది. తాజా సంస్కరణల వల్లనే అవినీతి అధికారి ఏసీబీకి సులభంగా చిక్కారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంస్కరణల ఫలితమే.. కొన్నాళ్ల కిందటి వరకు విద్యార్థుల నుంచి కళాశాల యాజమాన్యాలే ఫీజులను వసూలు చేసేవి. నిబంధనలను అతిక్రమించి రెండు మూడు రెట్లు అధికంగా ఫీజులు వసూలు చేసేవారు. అందులోనే ఇంటర్ ఉన్నతాధికారులకు మామూళ్లు అందేవి. నిబంధనల మేరకు ఇంటర్మీడియెట్ అధికారులు ఏటా కళాశాలను పరిశీలించి, రికార్డులు, సదుపాయాలు తనిఖీ చేసి సంతృప్తి చెందితేనే ఆ కాలేజీ విద్యార్థులను అనుమతించేవారు. జిల్లాలో వంద ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉండగా, అందులో ఎనభై శాతం కాలేజీలకు మౌలిక సదుపా యాలు లేవన్నది అందరికీ తెలిసిన నిజం. కానీ పర్యవేక్షణ అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో పడి పరిశీలన లేకుండానే తనిఖీల తంతు పూర్తి చేసేవారు. అప్పటి ప్రభుత్వం కూడా ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చర్యలేమీ తీసుకోకపోవడంతో వసూళ్ల కార్యక్రమం ఆటంకాలు లేకుండా సాగిపోయింది. తాజా గా ప్రభుత్వం ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టింది. ఆన్లైన్లో ఫీజులు చెల్లించే వెసులుబాటును తీసుకువచ్చింది. ఫలితంగా యాజమాన్యాలు అధికంగా ఫీజులు వసూలు చేయడం తగ్గించాయి. పైవారికి మామూళ్లు ఇవ్వడం కూడా తగ్గిపోయింది. అప్పటివరకు బల్ల కింద ఆదాయానికి అలవాటు పడిన అధికారులు అదనపు మొత్తం డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ఎదురు తిరగడం మొదలుపెట్టాయి. ఆ ఫలితంగానే ఆర్ఐఓ స్థాయి అధికారి ఏసీబీకి దొరికిపోయారు. -
లంచగొండులారా.. ఖబడ్ధార్
భువనేశ్వర్: ప్రభుత్వ సిబ్బందిలో అవినీతి ఏమాత్రం సహించేది లేదని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తరచూ ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అవినీతికి పాల్పడిన 11 మంది ప్రభుత్వ సిబ్బందికి వ్యతిరేకంగా కఠిన చర్యలు చేపట్టారు. వారిలో ఆరుగురిని విధుల నుంచి బహిష్కరించారు. మరో ఐదుగురు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్ నిలిపివేశారు. వీరందరికీ వ్యతిరేకంగా రాష్ట్ర విజిలెన్స్ విభాగం దాఖలు చేసిన దర్యాప్తు నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి ఉత్తర్వుల మేరకు విజిలెన్స్ విభాగం నివేదికను కార్యాచరణలో పెట్టారు. అవినీతి ఆరోపణల ఆధారంతో ముగ్గురు ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ అధికారులు (ఓఏఎస్), ఇద్దరు ఇంజినీర్ల పింఛన్ నిలిపివేశారు. ఒడిశా అడ్మినిస్ట్రేటివ్ అధికారుల్లో నవీన్ సేతు, సనాతన్ శెట్టి, పురంధర పూజారి ఉన్నారు. నిరంజన్ జెనా, పీతాంబర ప్రతిహారి ఇంజినీర్ల జాబితాలో ఉన్నారు. అవినీతి ఆరోపణలకు గురైన వారికి వ్యతిరేకంగా విచారణ, దర్యాప్తు 2 నెలల స్వల్ప వ్యవధిలో ముగించి ఇప్పటి వరకు 44 మంది ప్రభుత్వ సిబ్బందిని ఉద్యోగాల నుంచి బహిష్కరించారు. మరో 10 మందికి అనివార్య ఉద్యోగ విరామం మంజూరు చేశారు. 11 మంది విరామం పొందిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల పింఛన్ నిలిపివేశారు. -
ఏసీబీకి పట్టుబడ్డ డ్రగ్ ఇన్స్పెక్టర్
సాక్షి, హైదరాబాద్: లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరణాలను లంచంగా తీసుకుంటున్న డ్రగ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) శనివారం అరెస్ట్ చేసింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. నగరంలోని ఓ బ్లడ్ బ్యాంక్‌కు అనుకూలంగా రిపోర్టు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసింది. దీంతో సదరు వ్యక్తులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో లక్ష్మీ లంచం తీసుకుంటూ.. ఏసీబీ అధికారులకు పట్టుబడింది. కాగా గతంలోనూ ఆమె ఇదే బ్లడ్ బ్యాంకు నుంచి 50 వేలు లంచం తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. -
పోలీస్‌శాఖపై నజర్; పెరుగుతున్న ఏసీబీ దాడులు
ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోదన్నట్లుగా కొంతమంది అధికారులు, ఉద్యోగులు అవినీతికి తెగబడుతున్నారు. పని ఏదైనా పైసలిస్తేనే చేస్తామని తెగేసి చెబుతున్నారు. ప్రజలతో సత్సంబంధాలు అధికంగా ఉండే రెవెన్యూ, పోలీసుశాఖలోనే అవినీతి తిమింగలాలు ఎక్కువగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు కూడా ఈ శాఖలపైనే ఎక్కువగా వస్తుండటంతో ఏసీబీ అధికారులు దృష్టిసారించి పట్టుకుంటున్నారు. సాక్షి, నాగర్‌కర్నూల్: సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను, అవినీతి దందాలను అరికట్టాల్సిన పోలీసుశాఖకు కొంతమంది చెడ్డపేరు తెస్తున్నారు. వారి వ్యవహారశైలి కారణంగా మొత్తం పోలీసుశాఖకు మచ్చ తెచ్చిపెడుతోంది. ప్రభుత్వ శాఖల్లో ఉచితంగా ప్రజలకు సేవలు అందాల్సి ఉండగా కొంతమంది అధికారులు, ఉద్యోగులు అక్రమ సంపాదనకు అలవాటుపడి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో ఎంతోకొంత ముట్టజెప్పినా అది సరిపోదన్నట్టుగా అత్యాశకు పోయి ఇంకా ఇవ్వాలని వేధింపులకు గురి చేస్తుండటంతో విసిగిపోతున్న బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఏసీబీ దాడుల్లో 8 మంది అధికారులు పట్టుబడ్డారు. వారిలో పోలీసు, రెవెన్యూశాఖల అధికారులే ఎక్కువగా ఉన్నారు. ఏడు నెలల్లో 8 ఏసీబీ కేసులు.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఏడు నెలల్లో 8మంది ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డారు. ఫిబ్రవరి 19వ తేదీన అయిజ మండలం చిన్నతాండ్రపాడుకు చెందిన వీఆర్ఓ రైతు నుంచి రూ.10వేలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. మార్చి 5వ తేదీన దామరగిద్దలో రూ.20వేలు లంచం డిమాండ్ చేసిన హెచ్ఎం ఏసీబీకి పట్టుబడ్డారు. మార్చి 12న మల్దకల్ మండలం ఎల్కూరు గ్రామానికి చెందిన వీఆర్ఏ రూ.15వేలు లంచం రైతు నుంచి తీసుకుంటుండగా ఏసీబీ వలలో పడ్డాడు. ఇసుక ట్రాక్టర్ యజమానులతో రూ.20వేలు పుచ్చుకుంటూ బల్మూర్ ఎస్ఐ, కానిస్టేబుల్ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డారు. ఆగష్టు 8వ తేదీన రూ.12వేలు లంచం తీసుకుంటూ మిడ్జిల్ ఎలక్ట్రిసిటీ ఏఈ ఏసీబీకి దాడిలో పట్టుబడ్డాడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకున్న మరుసటి రోజే మహబూబ్‌నగర్ వన్ టౌన్ పోలీసుస్టేషన్లో ఇసుక వ్యాపారి నుంచి రూ.17వేలు లంచం తీసుకుంటూ తిరుపతిరెడ్డి అనే కానిస్టేబుల్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈనెల 4వ తేదీన వనపర్తి జిల్లా కేం ద్రం లో ఓ క్వారీ పేరు మార్చేందుకు రూ. 20 వేలు డిమాండ్ చేసిన మైనింగ్ ఏడీ సా మ్యూల్ జాకబ్, ఆర్ఐ సాయిరాంలు ఏసీబీ కి చిక్కారు. గతంలోనే రూ.లక్ష లంచంగా తీసుకున్నప్పటికి, మళ్లీ రూ. 20 వేలు డిమాండ్ చేయడంతో చేసేది లేక బా ధితులు దిలిపాచారీ ఏసీబీని ఆశ్రయించాడు. తాజాగా తెల్కపల్లి మండల కేంద్రానికి చెందిన పశువుల సంత కాంట్రాక్టర్‌ను ప్రతినెలా డబ్బులు ఇవ్వాలంటూ ఎస్ఐ వెంకటేష్ వేధిస్తుండటంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. నేరుగా డబ్బులను తన ఇంటికి వచ్చి ఇవ్వాలని చెప్పగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. రూ.15వేలు తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డాడు. పోలీసుశాఖపై దృష్టి సమాజానికి ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసుశాఖలో అవినీతి పెచ్చుమీరుతుం దన్న విమర్శలు లేకపోలేదు. ప్రతినెలా ఇసుక, మద్యం, ఇతర వ్యాపారుల నుంచి మామూళ్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, అదేవిధంగా పోలీసుస్టేషన్లలో పంచాయతీలు నిర్వహిస్తూ డబ్బులు వసూ లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. స్టేషన్ పరిధిలో ఏ వ్యాపారం జరిగినా తన వాటా ముట్టజెప్పాల్సిందేనన్న తీరుగా కొంతమంది ఎస్ఐలు వ్యవహరిస్తున్నారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. సివిల్ కేసు ల్లోనూ తలదూర్చుతూ తమకు అనుకూలమైన వారికి సెటిల్మెంట్లు చేస్తున్నారని ప్రజలనుంచి బహిరంగంగా విమర్శిలున్నా యి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అటాచ్ చేయడమో, బదిలీ చేయడం, సస్పెండ్ చేయడం వంటి సంఘటన లు నిత్యం జరుగుతూనే ఉన్నా వారిలో మా ర్పు రావడంలేదు. ఈ మధ్య ఫిర్యాదుల సంఖ్య పెరిగిపోవడంతో ఏసీబీ అధికారు లు పోలీసుశాఖపై వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఏడు నెలల్లో ఏసీబీకి పట్టుబడి న 8 కేసుల్లో ఉమ్మడి జిల్లాలో మూడు కేసు లు పోలీసుశాఖకు చెందిన వారిపైనే ఉన్నాయి. -
మనోళ్లు ‘మామూలోళ్లే’!
నిజామాబాద్ నగరంలో హైదరాబాద్ రోడ్డులోని వంశీ వైన్స్, ద్వారకామాయి వైన్స్‌లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తుండగా హైదరాబాద్ నుంచి వచ్చిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) బృందం శనివారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. నిర్వాహకులపై కేసు నమోదు చేసి, రూ.2 లక్షల జరిమానా విధించింది. ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ కేసులు నమోదు చేస్తుంటే.. మరి జిల్లాలోని ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు ఏం చేస్తున్నట్లు..? సాక్షి, నిజామాబాద్: జిల్లాలో మద్యం వ్యాపారులు దండుకుంటున్నారు. ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మార్పీ కంటే అధనంగా వసూలు చేస్తున్నారు. అయినా జిల్లా ఎక్సైజ్ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఎంతైనా వాళ్లు కూడా ‘మామూలోళ్లే’ కదా! అందుకే అధికారులు, సిబ్బంది కార్యాలయాలకే పరిమితమయ్యారు. అయితే, పైనున్న వారు వీళ్లలా ‘మామూలు’ అధికారులు కారు కదా..! జిల్లాలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న దుకాణాలపై దాడులు చేసి, కేసులు నమోదు చేశారు. అయితే, క్షేత్ర స్థాయిలో పూర్తి బలగం ఉన్న జిల్లా ఎక్సైజ్ యంత్రాంగం ఎందుకు దాడులు చేయలేదనే దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఐదు ఎక్సైజ్ స్టేషన్లున్నాయి. ఒక్కో స్టేషన్లో సీఐ, ఎస్సై, ఇతర సిబ్బంది పని చేస్తున్నారు. నిజామాబాద్ స్టేషన్లో అదనంగా మరో ఎస్సై, వీటికి తోడు అసిస్టెంట్ కమిషనర్ నేతృత్వంలోని ఓ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఉంది. దీనికి అదనంగా మరో టాస్క్‌ఫోర్స్ విభాగం పని చేస్తోంది. ఇవి కాకుండా ఓ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం, ఉమ్మడి జిల్లాలకు కలిపి మరో డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఉంది. జిల్లా వ్యాప్తంగా మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి బహిరంగంగా అడ్డ్డగోలుగా రూ.కోట్లలో దోపిడీకి పాల్పడుతుంటే, ఇంత యంత్రాంగం ఉన్న ఎక్సైజ్‌శాఖ ఏం చేసినట్లు? కేవలం వారికి వచ్చే మామూళ్ల వసూళ్లకే పరిమితమయ్యారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దసరా వరకు దండుకున్నారు.. మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారి అధిక ధరలకు మద్యం విక్రయించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పట్టణాలతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని వైన్సుల్లో క్వార్టర్‌పై రూ.10, హాఫ్ బాటిల్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.40 వరకు ధర పెంచేసి అడ్డుగోలుగా దోపిడీకి పాల్పడ్డారు. ఇలా ఒక్కో రోజు రూ.లక్షల్లో దండుకున్నారు. జిల్లా వ్యాప్తంగా పది రోజుల్లో రూ.కోట్లలో వెనకేసుకున్నారు. నెల వారీగా లైసెన్సు ఫీజు భారమవుతోందంటూ హడావుడి చేసిన మద్యం వ్యాపారులు చివరి నెల అందిన కాడికి దండుకుంటున్నారు. వీరితో జిల్లాలోని ఎక్సైజ్ ఉన్నతాధికారులు చేతులు కలపడంతో దోపిడీ యథేచ్ఛగా కొనసాగింది. ఈ క్రమంలో మందు బాబుల జేబులకు చిల్లు పడింది. జిల్లా వ్యాప్తంగా 95 వైన్సులుంటే దాదాపు అన్ని వైన్సులు దసరా వరకు ఎమ్మార్పీ నిబంధనలను ఉల్లంఘించారు. దసరా తర్వాత కూడా కొన్ని వైన్సుల్లో యథేచ్ఛగా ఎమ్మార్పీ నిబంధన ఉల్లంఘన జరుగుతోంది. కొత్త లైసెన్సుల సిండికేట్‌కు బాటలు.. నవంబర్ ఒకటో తేదీ నుంచి కొత్త వైన్సులు ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని ఎక్సైజ్ ఉ న్నతాధికారుల తాజా నిర్వాకం కారణంగా కొత్త వైన్సులు ప్రారంభమయ్యాక కూడా సిండికేట్ దోపిడీ కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. అధికారులు మామూళ్ల మత్తులో ఇలాగే వ్యవహరిస్తే మద్యం దోపిడీ యథేచ్ఛగా కొనసాగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసులు సైతం తారుమారు.. నవ్వి పోదురుగానీ నాకేటి సిగ్గు అన్న చందంగా తయారైంది ఎక్సైజ్ అధికారుల పనితీరు. మూడు నెలల క్రితం ఓ కల్లు దుకాణం నిర్వాహకుడి వద్ద లంచం డిమాండ్ చేస్తూ ఎక్సైజ్‌శాఖ టాస్క్‌ఫోర్స్ సీఐ వెంకట్‌రెడ్డి, ఎస్సై స్రవంతి ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌ను కూడా తనిఖీ చేశారు. కేసులను తారుమారు చేసేందుకు ఏ ఒక్క రికార్డును కూడా నమోదు చేయలేదని ఉన్నట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. అయితే, ఈ స్టేషన్లో ఉండాల్సిన జనరల్ డైరీ, ఈ–2 రిజిస్టర్, కాంట్రవన్ రిజిస్టర్లను ప్రతిరోజు నమోదు చేయాల్సి ఉండగా, వారం రోజులుగా పెండింగ్‌లో పెట్టినట్లు తేటతెల్లమైంది. ఈ అడ్డగోలు వ్యవహారంపై ఏసీబీ ఎక్సైజ్‌శాఖ రాష్ట్ర కమిషనరేట్‌కు, రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి నివేదిక ఇచ్చింది. కానీ దానిపై ఇప్పటివరకు రాష్ట్ర ఎక్సైజ్ అధికారులు కనీస చర్యలు తీసుకోక పోవడంతో ఇలాంటి అడ్డగోలు దందాలు యథేచ్చగా కొనసాగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాకు ఫిర్యాదు అందలేదు.. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు మాకు ఒక్కరు కూడా ఫిర్యాదు చేయక పోవడంతో జిల్లా ఎక్సైజ్ అధికార యంత్రాంగం కేసులు నమోదు చేయలేక పోయింది. హైదరాబాద్‌కు ఫిర్యాదులు చేస్తే హైదరాబాద్ టీం వచ్చి కేసులు చేసింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అధిక ధరలకు మద్యం విక్రయాలు ఆపేశారు. – డేవిడ్ రవికాంత్, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్‌శాఖ -
ఏసీబీ వలలో అవినీతి చేప
సాక్షి, పాల్వంచ: పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్) 5,6 దశల చీఫ్ ఇంజ నీర్ కె.ఆనందం ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఎసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. గురువారం మధ్యా హ్నం 12.45 నిమిషాలకు ఏసీబీ డీఎస్పీ ప్రతా ప్ ఆధ్వర్యంలో సిబ్బంది చేపట్టిన ఆపరేషన్‌లో రూ.3లక్షల నగదు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు ఏకకాలంలో సీఈ కార్యాలయంతో పాటు ఆయన నివాసం ఉండే జెన్కో గెస్ట్‌హౌస్‌లోనూ సోదాలు చేశారు. డీఎ స్పీ ప్రతాప్ కథనం ప్రకారం.. కేటీపీఎస్ 5, 6 దశల కర్మాగారంలో మెటీరియల్æ(మిషనరీ స్పేర్ పార్ట్స్) సప్లయ్ కాంట్రాక్ట్‌ను పాల్వంచకు చెందిన వాహిని ఇంజనీరింగ్ సర్వీసెస్ కాంట్రాక్టర్ లలిత్ మోహన్ నిర్వహిస్తున్నాడు. గత జూ లైలో టెండర్లకు నోటిఫికేషన్ ఇవ్వగా, అదే నెల చివరి వారంలో 21 రకాల పనులను రూ.71లక్షలకు దక్కించుకున్నాడు. మెటీరియల్ సప్లయ్ చేసినందుకు 7 పనులకు రూ.28లక్షల బిల్లులు ఇచ్చారు. మిగిలిన రూ.43లక్షల బిల్లులు చేయా ల్సిఉంది. ఈక్రమంలో ఈనెల 1న సీఈ ఆనం దం కాంట్రాక్టర్ లలిత్ మోహన్‌ను పిలిపించి టెండర్ల బిల్లులు చేసినందుకు తనకు రూ.10 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకుంటే వర్క్ ఆర్డర్‌ను రద్దు చేసేలా చూస్తానని బెదిరించాడు. దీంతో లలిత్ మోహన్ రూ.2లక్షల లంచం ఇచ్చాడు. మరో రూ.3లక్షలు 10వ తేదీన ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్.. మెటీరియల్ సప్లయ్ పనుల్లో తనకు వచ్చే లాభం డబ్బును సీఈ అడగడంతో లలిత్ మోహన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఖమ్మం డీఎస్పీ ప్రతాప్ సూచనల మేరకు రూ.3లక్షలు తీసుకుని సీఈ కె.ఆనందంకు గురువారం అందించాడు. కాగా, ముందస్తు పధకం ప్రకారం అక్కడికి వచ్చిన డీఎస్పీ ప్రతాప్, సీఐలు రవి, రమణమూర్తి, పీఆర్ ఏఈ ఇర్ఫాన్, సీనియర్ అసిస్టెంట్ కె.వి.రాఘవేందర్, మరో పది మంది సిబ్బంది కలిసి ఆనందం లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. సీఈని అదుపులోకి తీసుకుని, శుక్రవారం హైదరాబాద్ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ఏకకాలంలో సోదాలు.. సీఈ కార్యాలయంలో అతడిని పట్టుకోవడంతో పాటు జెన్కో కాలనీలో సీఈ నివాసం ఉంటున్న గెస్ట్ హౌస్‌లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయన కంప్యూటర్లో ఉన్న వివరాలను సైతం పరిశీలించారు. ఏసీబీ అధికారుల సోదాలతో ఒక్కసారిగా కేటీపీఎస్ కాంప్లెక్స్‌లోని ఉద్యోగుల్లో కలకలం రేపింది. ప్రజాహిత బ్రహ్మకుమారీస్ సంస్థ కీలక బాధ్యుడిగా, కర్మాగారంలో నిత్యం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న సీఈ లంచావతారంలో దొరకడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కర్మాగారంలో కార్మికులకు సైతం ఆధ్యాత్మిక పుస్తకాలు, కరపత్రాలు, జ్ఞాపికలు పంపిణీ చేయడం, వారికి దైవ సూక్తులు బోధించడం వంటి పనులు చేసే వ్యక్తి ఇలా చేయడం ఏంటని చర్చించుకుంటున్నారు. ఇబ్బంది వల్లే ఏసీబీని ఆశ్రయించా కేటీపీఎస్ 5, 6 దశల కర్మాగారంలో మెటీరియల్ సప్లయ్ చేసేందుకు రూ.71లక్షల పనులను టెండర్ల ద్వారా దక్కించుకున్నాం. 7 పనులకు రూ.28లక్షల బిల్లులు చేశారు. మిగిలిన రూ.43లక్షల బిల్లులకు సీఈ రూ.10లక్షలు లంచం అడిగాడు. లేదంటే మిగితా బిల్లులు ఆపేస్తానని, భూపాలపల్లిలో కూడా బిల్లులు రాకుండా చేస్తానని బెదిరించాడు. ఈ పనులన్నీ గత సీఈ టీఎస్ఎన్ మూర్తి హయాంలోనే నాకు దక్కాయి. 15 సంవత్సరాలుగా నేను పనులు చేస్తున్నా.. ఏనాడూ ఏ అధికారీ డబ్బులు అడగలేదు. ఇప్పుడు సీఈ ఆనందం పెద్ద మొత్తంలో అడగడం ఇబ్బంది కలిగించింది. అందుకే ఏసీబీ వారిని ఆశ్రయించా. – లలిత్ మోహన్, కాంట్రాక్టర్ లంచం అడిగితే 1064కు కాల్ చేయండి ఎవరైనా ప్రభుత్వ అధికారులు లేదా సిబ్బంది లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయండి. ఈ నంబర్ 24 గంటలూ అందుబాటులో ఉంటుంది. ఫోన్ చేసిన బాధితులకు తప్పక సహకరిస్తాం. అవసరమైతే వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అవినీతికి పాల్పడితే ఎవరినైనా వదిలే ప్రసక్తి లేదు. – ప్రతాప్, ఏసీబీ డీఎస్పీ -
ఇక్కడ అన్ని సౌకర్యాలూ కలవు (డబ్బులిస్తేనే..)
ధర్మవరం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఓ కేసులో రిమాండ్ ఖైదీగా నెల రోజుల పాటు ధర్మవరం సబ్జైల్లో ఉన్నాడు. జైల్లో ఇబ్బంది లేకుండా ఉండేందుకు సౌకర్యాల కోసం జైలు ఉన్నతాధికారితో రూ.50వేలకు ఒప్పందం కుదర్చుకున్నాడు. అంతే ఇంకేముంది రోజూ బిర్యానీ, లిక్కర్ జైలులోనికి అనుమతి ఇచ్చారు. వాట్సాప్ కాల్ ద్వారా కుటుంబ సభ్యులతో ప్రతి రోజు జైలు నుండే సదరు ఖైదీ సంభాషణలు జరిపాడు. నేరం చేసి రిమాండ్‌లో ఉన్న ఖైదీకి ఇంట్లో కంటే మంచి సౌకర్యాలనే జైలు అధికారులు కల్పించారు. ధర్మవరం మండలానికి చెందిన మరో వ్యక్తి కేసు నిమిత్తం 25రోజుల రిమాండ్‌కు ధర్మవరం సబ్‌జైలుకు వచ్చాడు. సదరు ఖైదీ కుటుంబ సభ్యులు ములాఖత్ కోసం జైలుకు వస్తే ఒక్కొక్కరితో రూ.1000లు వసూలు చేశారు. మా దగ్గర డబ్బులు లేవు సార్.. అంటూ వారు వేడుకుంటే రూ.500 లైనా ఇవ్వందే లోపలికి పంపించం అంటూ జైలు అధికారులు దౌర్జన్యం చేశారు. చేసేది లేక ముడుపులు ముట్టజెప్పి తమవారిని కలుసుకున్నారు. ధర్మవరం: ధర్మవరం సబ్‌జైలు.. డబ్బులున్న వారికి ఓ లాడ్జిలాగా కనపడుతుంటే సాధారణ నిరుపేద ఖైదీలు మాత్రం సబ్‌జైలులో వసూళ్ల పర్వం చూసి జడుసుకుంటున్నారు. జైలులో పని చేస్తున్న ఉన్నతాధికారి ధనధాహానికి కింద సిబ్బంది సైతం బలవంతంగా అయినా సరే డబ్బులు వసూలు చేస్తున్నారు. చేసిన నేరం కంటే సబ్‌జైలులో వాతావరణమే ఎక్కువగా బాధిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్మవరం కోర్టు పరిధిలోని రిమాండ్ ఖైదీలను ఇక్కడి సబ్‌జైలుకు తరలిస్తుంటారు. ఖైదీలను సత్ప్రవర్తన కోసం రిమాండ్‌కు న్యాయ స్థానం పంపితే ఆ ఉద్దేశ్యాన్ని జైలు అధికారులు పక్కదోవ పట్టిస్తున్నారు. డబ్బులిస్తే సకల సౌకర్యాలు సబ్‌జైలులో ఉన్న రిమాండ్ ఖైదీలు డబ్బులు ముట్టజెబితే అధికారులు వారికి సకల సౌకార్యలనూ కల్పిస్తున్నారు. ఖైదీ ఇచ్చే డబ్బును బట్టీ సౌకర్యాలు ఉంటాయి. బయట నుంచి బిర్యానీ, టిఫిన్ వంటి ఆహార పదార్థాలను సమకూర్చుతున్నారు. అంతేకాదు బడాబాబులు ఎవరైనా జైల్‌కు వస్తే వారికి లిక్కర్, సిగరెట్లు వంటి వాటిని కూడా అనుమతిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సెల్ఫోన్లు జైల్లోకి అనుమతించకూడదన్న నిబంధన ఉంది. అయితే డబ్బులు ఇచ్చిన ఖైదీలకు మాత్రం సెల్ఫోన్లను అధికారులు అనుమతిస్తున్నారు. దీంతో ఖైదీలు ఏకంగా వాట్సాప్, వీడియో కాల్స్ చేసుకుంటున్న విషయం గుప్పు మంటోంది. ఇదిలా ఉంటే డబ్బులు లేని సాధారణ ఖైదీలు మాత్రం నరకయాతన అనుమతిస్తున్నారు. వీరికి కనీసం మస్కిటో కాయిల్స్ కూడా అందుబాటులో ఉంచడం లేదు. అంతేకాదు రోజు వడ్డించే అన్నం, కూరలు చాలా నాశిరకంగా ఉంటున్నాయని పలువురు రిమాండ్ ఖైదీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములాఖత్‌కు ముట్టజెప్పాల్సిందే.. సాధారణంగా జైలులో ఆదివారం, పండుగ రోజులలో సెలవు ఉంటుంది. ఈ సమయాల్లో బయట వారిని ములాఖత్‌కు అనుమతించరు. మిగతా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆ తర్వాత మధ్యాహ్నం 3గంటల నుంచి 5వరకు రిమాండ్ ఖైదీలను కలిసేందుకు సంబంధీకులకు అనుమతి ఉంటుంది. అయితే ములాఖత్‌కు వచ్చిన కుటుంబ సభ్యులు జైలు సిబ్బందికి లోపలికి వెళ్లగానే రూ.1000లు ముట్టజెప్పాల్సి ఉంది. డబ్బులు ఇవ్వక పోతే ఖైదీని పిలిచే పరిస్థితి లేదు. డబ్బులు ముట్టజెప్పిన ఖైదీ కుటుంబ సభ్యులు ఎంత సేపైనా ప్రాంగణంలో ఖైదీతో మాట్లాడే అవకాశం కల్పిస్తారు. అంతేకాదు డబ్బులు ముట్టజెబితే సెలవురోజుల్లో కూడా ములాఖత్‌కు అనుమతి ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జైలు ఉన్నతాధికారికనుసన్నల్లోనే.. ముడుపుల తతంగం అంతా జైలు ఉన్నతాధికారి కనుసన్నల్లోనే జరుగుతున్నట్లుగా సమాచారం. ప్రతి రోజు సిబ్బందికి టార్గెట్ విధించి మరీ వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వచ్చిన వసూళ్లలో కొంత మేర సిబ్బంది పంచుకొని మిగిలిన మొత్తాన్ని సదరు ఉన్నతాధాకారికి అందజేస్తున్నట్లు సిబ్బంది బాహాటంగానే చెప్పుకుంటున్నారు. ఉన్నతాధికారులు స్పం దించి ముడుపుల వసూళ్లపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. -
అత్యాశే కొంపముంచింది
సాక్షి, వనపర్తి: అత్యాశ పతనానికి దారితీస్తుందన్న విషయం మరోసారి నిరూపితమైంది. రూ.వేలల్లో జీతాలు తీసుకునే ప్రభుత్వ అధికారులు అక్రమార్జనకు అలవాటుపడిన కొందరు అధికారులు పేద, ధనిక అనే తేడా లేకుండా లంచం కోసం వేధించటం ఈ రోజుల్లో పరిపాటిగా మారింది. ఓ చిన్న పనికోసం ఇదివరకే రూ.ఒక లక్ష లంచం తీసుకున్న వనపర్తి మైన్స్‌శాఖ ఏడీ జాకబ్ మరో రూ.20 వేల కోసం అత్యాశపడి చివరికి ఏసీబీ వలకు శుక్రవారం చిక్కిన సంఘటన వనపర్తిలో సంచలనం రేకెత్తిస్తోంది. ఏసీబీ డీఎస్పీలు ఫయాజ్, శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన దిలీపాచారికి వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్దారంలో మినరల్స్ క్వారీ ఉంది. దానిని మరో కంపెనీకి విక్రయించిన దిలీపాచారి మైన్స్‌క్వారీని శ్రీ సాయి మినరల్స్ అండ్ మైన్స్ నుంచి మరో సంస్థ పేరున మార్చాలని కోరుతూ దరఖాస్తు చేశాడు. తనిఖీ.. ఐదురెట్లు అదనంగా ఫైన్ ఇదిలాఉండగా, క్వారీని తనిఖీ చేసిన మైన్స్ ఏడీ జాకబ్ చెల్లించాల్సిన రాయల్టీకి ఐదురెట్లు అదనంగా ఫైన్ వేస్తూ షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఫై న్ వేసేందుకు కారణమేంటి నేను ప్రభుత్వ నిబంధనల మేరకే క్వారీ నిర్వహణ చేస్తున్నానని బాధితుడు అధికారిని అభ్యర్థించగా రూ.ఒక లక్ష లంచం ఇవ్వమని ఏడీ కోరాడు. దీంతో సె ప్టెంబర్ 27వ తేదీన స్థానికంగా ఉన్న మైన్స్ ఏడీ జాకబ్ దిలీపాచారిని తన ఇంటికి పిలిపించుకుని రూ.ఒక లక్ష లంచం తీసుకున్నాడు. అయినా కూడా పనిచేయకుండా ఇబ్బందులకు గురిచేస్తూ వచ్చాడు. శుక్రవారం ఆర్ఐకి ఇవ్వాలంటూ మరో రూ.20వేలు తీసుకురమ్మని ఏడీ కోరాడు. దీంతో బాధితుడు దిలీపాచారి తమను ఆశ్రయించాడని ఏసీబీ అధికారులు తెలిపారు. పథకం ప్రకారం పట్టుకున్నారు.. ఇదివరకే రూ.ఒక లక్ష లంచం తీసుకుని పనిచేయకుండా రోజూ ప్రదక్షణలు చేయిస్తూ ఇంకా లంచం కావాలని వేధించటంతో బాధితుడు దిలాపాచారి ఏబీసీ అధికారులను ఆశ్రయించారు. వారు పౌడర్ చల్లిన నోట్లను బాధితుడికి ఇచ్చారు. మైన్స్‌ఏడీ జాకబ్ ఆ నోట్లని తెలియక లంచంగా తీసుకుని రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. బాధితుడితో లంచం తీసుకున్న వెంటనే వనపర్తిలోని కార్యాలయం సమీపంలో కాచుకుని ఉన్న సుమారు 20 మంది ఏసీబీ అధికారులు సిబ్బంది ఒక్కసారిగా.. దాడి చేసి జాకబ్‌ను పట్టుకున్నారు. జాకబ్‌తో పాటు లంచంలో భాగస్వామ్యం ఉన్న సాయిరాంను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న సెల్ఫోన్లను లాక్కున్నారు. ఇల్లు, కార్యాలయంలో సోదాలు మైన్స్ ఏడీ లంచావతారంపై ఫిర్యాదు రాగానే ఏసీబీ అధికారులు ఆఫీస్‌తో పాటు అతని ఇంట్లోను సోదాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక్కడ లంచం తీసుకుంటూ పట్టుబడగానే హైదరాబాద్‌లోని తన నివాసంలోనూ సోదాలు ప్రా రంభించినట్లు ఏబీసీ అధికారులు తెలిపారు. -
అవినీతికి రిజిస్ట్రేషన్
తిరుపతి అర్బన్: రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతి చేపలు ఏసీబీ వలలో పడ్డాయి. పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు సోమవారం మెరుపుదాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లెక్కల్లో లేని రూ.2.07లక్షల సొమ్మును గుర్తించారు. తిరుపతి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతి అక్రమాలు తారస్థాయికి చేరుకున్నట్లు సమాచారం అందడంతో తిరుపతి ఏసీబీ డీఎస్పీ దేవా నంద్ శాంత్ తమ బృందంతో కలసిసోమవారం తనిఖీలు నిర్వహించారు. పలు అంశాలపై సబ్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లతో పాటు పలువురు ఉద్యోగులను విచారించారు. ఈ సందర్భంగా దేవానంద్ శాంత్ మాట్లాడుతూ లెక్క చూపని రూ.2.07లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 20 మంది డాక్యుమెంట్ రైటర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రతి రిజిస్ట్రేషన్‌కు లంచం డిమాండ్ చేస్తున్నారని పక్కా సమాచారం ఉందన్నారు. దాంతోనే దాడులు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ సీఐలు విజయశేఖర్, ప్రసాద్‌రెడ్డి, రవి ఎస్ఐ సూర్యనారాయణ, ఉద్యోగులు పాల్గొన్నారు. విచారణ ఇలా కొనసాగింపు ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు విచారణ కొనసాగించారు. సబ్ రిజిస్ట్రార్ నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఒక్కొక్కరిని కార్యాలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఆరా తీశారు. రోజుకు ఎన్ని రిజిస్టేషన్లు జరుగుతున్నాయి. సక్రమంగా ఉంటే ఎంత డిమాండ్ చేస్తున్నారు.. అక్రమంగా ఉన్న వాటిని రిజిస్ట్రేషన్ చేయడానికి ఏ స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్స్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారా.. అనే అంశాలపై నిశితంగా విచారణ కొనసాగించారు. ఉన్నత ఉద్యోగుల డైరెక్షన్లోనే లంచాలు? డాక్యుమెంట్స్ అన్నీ సక్రమంగా ఉంటే పెద్దగా డిమాండ్ చేయకుండా కొంతమేరకు లంచాలు తీసుకుంటున్నట్లు అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అయితే డాక్యుమెంట్లు సక్రమంగా లేకుంటే వాటిని రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని అధికారులు తేల్చి చెప్పేస్తున్నారు. ఆ తర్వాత మధ్యవర్తులు క్రయ, విక్రయదారులతో సంప్రదించి పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేసి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారని తెలిసింది. -
ఏసీబీకి చిక్కిన లైన్‌మన్
శంషాబాద్: గృహ వినియోగ విద్యుత్ మీటర్ కోసం లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు లైన్మెన్ చిక్కాడు. పెద్దషాపూర్ సబ్‌స్టేషన్ పరిధిలోని తొండుపల్లి, ఊట్పల్లి, చౌదరిగూడ లైన్మెన్గా కాశీరాం పనిచేస్తున్నాడు. ఊట్పల్లి పరిధిలోని సదరన్ వెంచర్లో ఇంటిని నిర్మించుకుంటున్న తిరుపతిరెడ్డికి గృహ వినియోగ విద్యుత్ మీటర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఈ పనికోసం లైన్మెన్ రూ.40 వేలు లంచం డిమాండ్ చేశాడు. తాను డబ్బులు ఇవ్వలేనని తిరుపతిరెడ్డి చెప్పడంతో లైన్మెన్ మీటర్ బిగించకుండా ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో తిరుపతిరెడ్డి ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఒప్పందం మేరకు ఇటీవల రూ.20 వేలు ఇవ్వడానికి అంగీకరించాడు. ఈ సమాచారాన్ని ఏసీబీకి తెలపడంతో సోమ వారం ఆ నగదు కాశీరాంకు ఇస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు. ఏసీపీబీ డీఎస్పీ సూర్యనారాయణ, సీఐలు మాజీద్ అలీ, నాగేందర్‌గౌడ్ కేసు దర్యాప్తు చేపడుతున్నారు. కాశీరాం గతంలో పనిచేసిన శంషాబాద్, పాలమాకుల పరిధిలో కూడా అనేకమంది గృహ, పారిశ్రామిక యజమానులకు లంచాల కోసం ఇబ్బందులు పెట్టేవాడని ఆరోపణలు ఉన్నాయి. -
అవినీతిలో 'సహకారం'!
సాక్షి, మెదక్: జిల్లా సహకార శాఖలో కాసులకు కక్కుర్తి పడిన ఓ అధికారి అక్రమార్కుల అవినీతికి ‘సహకారం’ అందిస్తూ అండగా నిలుస్తున్నారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు జారీ చేసిన సర్క్యులర్‌ను బుట్టదాఖలు చేస్తూ దోపిడీ పర్వానికి తెరలేపారు. పర్సన్ ఇన్చార్జిలతో కుమ్మక్కై పర్సంటేజీల ప్రకారం నిధుల విడుదలకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. రైతులకు రుణాలందించి చేయూతనివ్వడం.. ధాన్యం, ఇతర పంటల కొనుగోలు, ఎరువులు పంపిణీ చేయడం వంటి కార్యకలాపాల నిర్వహణతోపాటు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే సహకార శాఖ లక్ష్యం. ఈ మేరకు పీఏసీఎస్‌ల డైరెక్టర్లు, చైర్మన్లు, అధికారులు కృషి చేయాలి. అయితే.. పలువురి స్వలాభాపేక్షతో ప్రజాధనం భారీ ఎత్తున దుర్వినియోగమవుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అక్రమార్కుల హవా నడుస్తోంది. పీఏసీఎస్ పాలకవర్గాల పొడిగింపు సాకుతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. పీఏసీఎస్ నిధుల విడుదల పాపన్నపేట రూ.5.50 లక్షలు కొత్తపల్లి రూ.1.16 లక్షలు జంగరాయి రూ.50 వేలు పర్సన్ ఇన్చార్జిలతో కుమ్మక్కు ? జిల్లాలో 37 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉన్నాయి. 2013 ఫిబ్రవరిలో చివరిసారిగా వీటికి ఎన్నికలు జరిగి పాలక వర్గాలు కొలువుదీరాయి. ఈ పాలకవర్గాల పదవీ కాలం 2018 ఫిబ్రవరితో ముగిసినప్పటికీ.. అనేక అవాంతరాలు చోటుచేసుకోగా ఎన్నికలు జరగలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకోసారి పీఏసీఎస్‌ల పాలకవర్గాల పదవీ కాలం పొడిగిస్తూ వస్తోంది. 2018 నుంచి మూడు పర్యాయాలు పదవీ కాలం పొడిగిస్తూ ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయా పీఏసీఎస్‌లకు పర్సన్ ఇన్చార్జిలను నియమించక తప్పని పరిస్థితి సహకార శాఖలో నెలకొంది. దీన్నే ఆసరాగా చేసుకుని ఓ అధికారి అక్రమాలకు తెరలేపాడు. తాను నియమించిన పర్సన్ ఇన్చార్జిలతో కుమ్మక్కై దోపిడీ దందాకు తెగబడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్క్యులర్ పట్టించుకోకుండా.. పీఏసీఎస్‌లకు పర్సన్ ఇన్చార్జిల నియామకాల్లోనే నిబంధనలు ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రుణాలు తీసుకుని చెల్లించకుండా బకాయి ఉన్న వారికి సైతం పర్సన్ ఇన్చార్జిలుగా అవకాశం కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. పాలక వర్గాల పదవీ కాలం పొడిగింపు సమయంలో నిధుల కేటాయింపు, మంజూరు, విడుదలకు సంబంధించి సహకార శాఖ కమిషనర్ 2018 జనవరిలో ఓ సర్క్యులర్‌ను జారీచేశారు. పర్సన్ ఇన్చార్జిల హయాం లో అవకతవకలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తగా పెద్దఎత్తున నిధులు విడుదల చేయొద్దని అందులో స్పష్టంగా ఉంది. దీన్ని అధికారు లు పట్టించుకోకుండా వివిధ పనులు, ఖర్చుల పేరిట పర్సన్ ఇన్చార్జిలు నిధులు మంజూరు చేయాలని దరఖాస్తు పెట్టుకోవడంతో నిధుల విడుదల చకచకా జరిగిపోతుంది. పర్సంటేజీల కక్కుర్తితోనేనా.. ఎలాంటి రికార్డులు లేకుండానే అధికారులు పీఏసీఎస్‌లకు అక్రమంగా నిధులు మంజూరు చేసినట్లు ఆ శాఖలో ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు. పర్సన్ ఇన్చార్జిలతో ఓ అధికారి కుమ్మక్కై దందా నడిపిస్తున్నట్లు సమాచారం. రూ.50 వేలు, రూ.లక్ష, రూ.2 లక్షలకు.. ఇలా విడుదల చేసే మొత్తానికి 4 నుంచి 20 శాతం మేర పర్సంటేజీల రూపంలో ముందస్తుగా వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. మరోవైపు అభివృద్ధి పనుల పేరిట విడుదలైన నిధులకు సంబంధించిన పనుల్లో సైతం భారీగా అవినీతి చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. టెండర్లు పిలవకుండానే తూతూమంత్రంగా పనులు చేపట్టి.. భారీగా నిధులు స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విచారణ జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కొన్ని ఉదాహరణలు.. జిల్లాలో దాదాపుగా 80 శాతం పీఏసీఎస్‌లలో నిధులు దుర్వినియోగమైనట్లు సమాచారం. ప్రత్యేక మరమ్మతులకు (స్పెషల్ రిపేర్స్) నిధులు మంజూరు చేయాలని పాపన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పర్సన్ ఇన్చార్జి ఈ ఏడాది జూలై 15వ తేదీన సహకారశాఖకు అర్జీ పెట్టుకున్నాడు. దీనికి సంబంధించి మేనేజింగ్ కమిటీ ఆమోదం తెలిపిందని.. సర్వసభ్య సమావేశం ఈ ఏడాది మార్చి 27న నిర్వహించినట్లు అందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఈ ఏడాది జూలై 18న నిధుల విడుదలకు గ్రీన్‌సిగ్నల్ పడింది. ఈ క్రమంలో సహకార శాఖ కమిషనర్ సర్క్యులర్‌లోని నిబంధనలు అతిక్రమించి నిధులు విడుదల చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలో నిధులు మంజూరు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా కొత్తపల్లి పీఏసీఎస్‌కు సంబంధించి టాయిలెట్లు, సైడ్ వాల్స్ నిర్మాణానికి రూ.1.16 లక్షలు, జంగరాయి పీఏసీఎస్ కాంపౌండ్‌వాల్ నిర్మాణానికి రూ.50 వేలు విడుదల చేశారు. నిబంధనల ప్రకారమే.. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు నిబంధనల ప్రకారమే నిధుల విడుదల జరుగుతోంది. గతంలో ఆమోదం పొంది, పెండింగ్‌లో ఉన్న వాటిని మాత్రమే విడుదల చేస్తున్నాం. కొత్తగా నిధుల విడుదలకు ఎలాంటి మంజూరు ఇవ్వడం లేదు. – ఈశ్వరయ్య, జిల్లా సహకార అధికారి -
కార్మిక శాఖలో వసూల్ రాజా
సాక్షి, దురాజ్‌పల్లి (సూర్యాపేట): లంచం అడిగితే అధికారిని నిలదీయండి అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెప్తున్నా అధికారుల తీరు మారడం లేదు. లంచం మహమ్మారి ఏదో ఒకే శాఖకు పరిమితం కాకుండా అన్నీ శాఖలకు అంటుకుంది. జిల్లా కార్మిక శాఖలో పైసలిస్తేనే ఫైలు కదులుతుందని గతంలో వెల్లువెత్తిన ఆరోపణలు నేడు నిజమని తేలింది. కార్మికశాఖ డివిజన్ అధికారి ఓ మహిళ నుంచి రూ.500 లంచంగా తీసుకుని ఇవేం సరిపోతాయని అడుగుతున్న వీడియో సామాజిక మాద్యమాల్లో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. కార్మిక శాఖలో సభ్యత్వం తీసుకుంటే.. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండి భవన నిర్మాణ రంగం లేదా ఇతర రంగాల్లో కార్మికులుగా పనిచేస్తూ రూ.110 బ్యాంకుల్లో చెల్లించి కార్మిక శాఖలో సభ్యత్వ నమోదు చేసుకున్న కార్మికుడికి ప్రమాదం, డెలివరీ, వివాహ కానుకలకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించే పథకం అమలులో ఉంది. కార్మిక శాఖలో నమోదైన కార్మికుడు ప్రమాదంలో మరణిస్తే రూ.6లక్షలు, శాశ్వత అంగవైకల్యానికి రూ.5లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.4లక్షలు ఆర్థిక సహాయం అందనుంది. అదే విధంగా మహిళా కార్మికురాలు లేదా కార్మికుడికి కుమార్తెల వివాహాలకు వివాహ కానుకగా రూ.60వేలు ప్రసూతి సహాయంగా రూ.30వేల చొప్పున రెండు కాన్పులకు అందనున్నాయి. డబ్బులివ్వకుంటే కదలని ఫైలు ! జిల్లా కార్మికశాఖలో పైసలేనిదే ఫైలు కదలడం లేదని బహిరంగంగానే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా పెన్‌పహాడ్ మండల మహ్మదాపురం గ్రామానికి చెందిన ఒక మహిళ నుంచి కార్మిక శాఖ డివిజన్ అధికారి లంచం తీసుకున్నట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. కార్మిక శాఖలో సభ్యత్వం కలిగి ఉన్న తన భర్త ఇటీవల మరణించాడని ప్రభుత్వం నుంచి అందే ఆర్థికసాయాన్ని ఇప్పించాలని దరఖాస్తు చేసుకోగా విచారణకు వెళ్లిన అధికారి కార్యాలయంలో తనను సంప్రదించాలని తెలిపినట్లు సమాచారం. కార్యాలయానికి వచ్చిన ఆమె నుంచి ఆన్లైన్ పేరుతో డబ్బులు ఇవ్వాలని అధికారి స్వయంగా అడిగినట్లు వీడియోలో తెలుస్తోంది. ఆమె రూ.500 ఇచ్చి నేను పేదరాలినని ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేనని అధికారి వద్ద మొరపెట్టుకుంది. ఇవేం సరిపోతాయని అధికారి స్వయంగా అన్నట్లు వీడియోలో తెలుస్తోంది. ఈ విషయంపై సదరు గ్రామానికి చెందిన ఎంపీటీసీ అధికారి లంచం తీసుకుంటున్న వీడియోను జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్‌కు సైతం పంపినట్లు సమాచారం. కార్మికశాఖ అధికారి లంచాలకు కక్కుర్తి పడి గ్రామాల్లోకి వెళ్లి పరిశీలన పేరుతో లబ్ధిదారులను వేధిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఎవరి నుంచి లంచం తీసుకోలేదు లేబర్ కార్డు ఉన్న లబ్ధిదారుల్లో ఎవరి నుంచి నేను లంచం తీసుకోలేదు. ప్రభుత్వం మార్చిన నిబంధనల మేరకు లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో పొందుపరచవలసి ఉన్నందున ఆన్లైన్ ఖర్చుల నిమిత్తం మాత్రమే డబ్బులు తీసుకున్నాను. కావాలనే కొందరు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. – వాల్యానాయక్, కార్మికశాఖ డివిజన్ అధికారి ఉన్నతాధికారులకు నివేదించాం కార్మిక శాఖ డివిజన్ అధికారిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ నల్లగొండ, జాయింట్ కమిషనర్ హైదరాబాద్ వారికి చర్యల నిమిత్తం నివేదికలు అందించాం. విచారించి ఆరోపణలు రుజువైతే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. – శివశంకర్, సహాయ కమిషనర్, సూర్యాపేట -
ఈ పోలీస్ ‘మామూలోడు’ కాదు!
జైపూర్: వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది. అందుకే ఓ పోలీస్ అధికారి తన ప్రీ వెడ్డింగ్‌ను అంతే వినూత్నంగా ప్లాన్ చేసుకున్నారు. కానీ అది కాస్తా బెడిసి కొట్టింది. పోలీస్ యూనిఫామ్‌లోనే షూటింగ్ చేయడంపై కేసు నమోదైంది. రాజస్తాన్‌కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) ధన్పత్ సింగ్ వివాహం నిశ్చయమైంది. అందుకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ షూట్‌ను మూడు నెలల కిందట జరిపారు. ఇది కాస్తా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయింది. ఈ వీడియోలో తనకు కాబోయే భార్య స్కూటీపై వెళ్తుండగా ఆ ఎస్సై ఆమెను ఆపుతాడు. హెల్మెట్ పెట్టుకోనందుకు ఫైన్ కట్టమంటాడు. దీంతో అతని చొక్కా జేబులో కొంత డబ్బు పెట్టి వెళ్లిపోతుంది. ఇదంతా ఎస్సై పోలీస్ యూనిఫాంలోనే షూట్ చేయడంతో ఉన్నతాధికారులు ఆయనపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. యూనిఫాంలో ఉండి లంచం తీసుకోవడం దాన్ని ప్రోత్సహించేలా ఉందని మందలిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు నమోదైందని, దర్యాప్తు చేస్తామని ఐజీ హవా సింగ్ గుమారియా తెలిపారు. దీనిపై ఎస్సై ధన్పత్ స్పందిస్తూ.. ‘ఈ వీడియో కావాలని తీసింది కాదు. నేను యూనిఫాంలో ఉన్న సన్నివేశాన్ని తీసేయాల్సిందిగా వీడియో గ్రాఫర్‌కు చెప్పాను. కానీ తాను మొత్తం వీడియోను అలాగే సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు’అని చెప్పారు. -
అంగట్లో హాస్టల్ సీట్లు..!
సాక్షి, నిజామాబాద్: మొన్నటి వరకు బీసీ పోస్టు మెట్రిక్ హాస్టళ్లలో సీట్ల కోసం మంత్రులు, ఎమ్మెల్యేల రికమండేషన్ లేఖలు ఇవ్వడంతో చాల మంది పేద విద్యార్థులకు సీట్లు దక్కని పరిస్థితి నెలకొంది. కానీ తాజాగా బీసీ సంక్షేమ శాఖ మరో కొత్త కోణం వెలుగు చూసింది. హాస్టల్ సీట్లకు డిమాండ్ పెరగడంతో సీట్లు ఇప్పిస్తానంటూ ఓ అధికారి వసూళ్ల దందాకు తెరలేపినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి హాస్టళ్లలో సీట్లు ఇప్పించడానికి తెలిసిన వారితో భేరసారాలకు దిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. డబ్బులకైతే ఓకే.. నందిపేట్ నూత్పల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని ఇంటర్ 940 మార్కులతో పాసైంది. జిల్లా కేంద్రాంలోని గిరిరాజ్ కళాశాలలో సీటు రావడంతో బీసీ హాస్టల్లోనే ఉండి చదువుకోవడానికి తనకు తెలిసిన ఓ హాస్టల్ వర్కర్‌తో వెళ్లి దరఖాస్తు చేసుకుంది. ఇంటర్ ప్రైవేటు కళాశాలలో చదవడంతో సీటు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిన ఓ అధికారి డబ్బులకైతే సీటు వస్తుందని హాస్టల్ వర్కర్‌తో భేరం కుదిర్చాడు. ఆ విద్యార్థని తల్లిదండ్రులు నుంచి కొంత డబ్బులు తీసుకొని సదరు అధికారికి ముట్టజెప్పాడు. కానీ ఇంత వరకు హాస్టల్లో సీటు ఇవ్వలేదు. అక్రమంగా జేబులు నింపుకుంటున్న అధికారిసీటు కోసం కార్యాలయానికి వచ్చిన చాల మంది దగ్గర డబ్బులకు సీట్లు ఇచ్చారనే ఆరోపణలు ఆ అధికారిపై ప్రచారంలోకి వస్తున్నాయి. అందినకాడికి దండుకుని అక్రమంగా జేబులు నింపుకుంటున్న సదరు అధికారిపై తీరుపై శాఖలోని ఉద్యోగులు కూడా చర్చించుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో డిమాండ్ ఎక్కువ జిల్లాలో బీసీ పోస్టు మెట్రిక్ హాస్టళ్లు 7 బాలికల, 6 బాలుర మొత్తం 13 హాస్టళ్లున్నాయి. ఒక్కో హాస్టల్లో ప్రభుత్వం నుంచి 100 సీట్లు మాత్రమే మంజూరు ఉంటాయి. అయితే జిల్లా కేంద్రంలో కళాశాలలు అధికంగా ఉండడంతో జిల్లా కేంద్రంలోని హాస్టళ్లకు డిమాండ్ బాగా పెరిగిపోవడంతో సీట్ల సమస్యగా ఎక్కువగా ఉంది. జిల్లా కేంద్రంలో రెండు బాలికలు, రెండు బాలుర హాస్టళ్లు మాత్రమే ఉన్నాయి.దీంతో సీట్ల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఆందోళనలో వార్డెన్లు జిల్లా కేంద్రంలో ఉన్న బీసీ హాస్టళ్లలో అదనంగా సీట్లు మంజూరు చేసుకుని భర్తీ చేసుకుంటున్న వార్డెన్లకు సదరు అధికారి వైఖరిపై గుబులు పట్టుకుంది. అదనంగా మంజూరు ఇస్తున్న సదరు అధికారి ఆర్డర్ కాపీలపై సంతకాలు లేకుండా వార్డెన్లకు ఇస్తున్నారు. సంతకాలు లేకుండా సీట్ల కేటాయింపులు చేయడంతో వార్డెన్లు ఆందోళన చెందుతున్నారు. జరిగిన సీట్ల కేటాయింపులో రేపటినాడు ఏదైనా తేడా వస్తే తామే బాధ్యులవుతామని భయంలో ఉన్నారు. -
ఏసీబీ వలలో ట్రాన్స్‌కో ఏఈ
సాక్షి, జడ్చర్ల: మరో అవినీతి అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన మిడ్జిల్‌లో చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ కథనం ప్రకారం.. మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన రైతు బోంపెల్లి రాజేందర్‌రెడ్డి తన వ్యవసాయ పొలం దగ్గర విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం ముగ్గురు రైతుల పేరిట గత రెండు నెలల క్రితం డీడీ తీసి జడ్చర్ల విద్యుత్ కార్యాలయంలో అందజేశాడు. ఆ తర్వాత మిడ్జిల్ ఏఈ పర్వతాలును సంప్రదించగా.. రూ.15 వేలు ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ ఇస్తానని చెప్పడంతో రైతు రూ.12 వేలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఈ విషయమై గత నెల 30న ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ జరిపిన ఏసీబీ అధికారులు ఏఈ డబ్బులు డిమాండ్ చేసినట్లు తేలింది. దీంతో వారి సూచన మేరకు గురువారం మధ్యాహ్నం రైతు నుంచి రూ.12 వేలు ఏఈ పర్వతాలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏఈపై కేసు నమోదు చేశామని, శుక్రవారం హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. దాడుల్లో ఇన్స్పెక్టర్లు లింగస్వామి, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. వివరాలు వెల్లడిస్తున్న ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ రెండు నెలలు తిరిగా.. గ్రామ శివారులోని సర్వే నంబర్లు 116, 117లో తొమ్మిది ఎకరాల భూమి ఉండగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం గత రెండు నెలల క్రితం తన తల్లి అలివేలు, తమ్ముడు రవీందర్‌రెడ్డి, పక్క పొలం రైతు గజేందర్‌రెడ్డి పేరిట డీడీ తీసి తీసి జడ్చర్ల సబ్‌డివిజన్ కార్యాలయంలో ఇచ్చానని రైతు రాజేందర్‌రెడ్డి తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ కోసం గత రెండు నెలల నుంచి ఏఈ దగ్గరకు వస్తే డబ్బులు ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ ఇస్తామని, రూ.15 వేలు డిమాండ్ చేయగా అంత ఇవ్వలేనని రూ.12 వేలకు ఒప్పందం చేసుకొని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశానన్నారు. వారి సూచనల మేరకు గురువారం మధ్యాహ్నం ఏఈ కార్యాలయంలో ఏఈ పర్వతాలుకు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారన్నారు. మండలంలో నలుగురు ఉద్యోగులు రైతులకు పనులు చేసిపెట్టడానికి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు విద్యుత్ శాఖలో ఇద్దరు అధికారులు పట్టుబడ్డారు. మొదట 1995లో బో యిన్‌పల్లికి చెందిన ఓ రైతు పేరిట పొలం మార్చడానికి రెవెన్యూ శాఖలో పనిచేసే ఆర్ఐ పెంటయ్య లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత 1997లో ముచ్చర్లపల్లికి చెందిన రైతు శ్యాంసుందర్‌రెడ్డికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడాని కి రూ.3 వేలు లంచం తీసుకుంటూ విద్యుత్ సబ్ ఇంజనీర్ అబ్దుల్‌రబ్ పట్టుబడ్డాడు. అలాగే 2013 ఏప్రిల్ 1న జకినాలపల్లికి చెందిన పోలే శంకర్‌ను ఓ కేసు విషయంలో రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఎస్ఐ సాయిచంద్రప్రసాద్ ఏసీబీ అధికారులకు పట్టుబడగా.. తాజాగా విద్యుత్ ఏఈ పర్వతాలు రైతు నుంచి రూ.12 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏడాది క్రితమే ఇక్కడికి.. విద్యుత్ ఏఈ పర్వతాలు కేఎల్ఐ కాల్వ సమీపంలో రైతుల పొలాలు లేకపోవడంతో, అదే అదునుగా చూపించి ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయడానికి రైతుల నుంచి భారీగా లంచాలు వసూలు చేసినట్లు తెలిసింది. గతేడాది జూలై మొదటి వారంలో బాలానగర్ నుంచి బదిలీపై ఏఈ పర్వతాలు ఇక్కడికి వచ్చారు. ఆయన వచ్చి న తర్వాత కేఎల్ఐ కాల్వ పరిసర ప్రాంతాల్లో దాదాపు 30 ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చినట్లు తెలిసింది. అయితే ప్రతి రైతు నుంచి డబ్బులు వసూలు చేసినా ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా రైతు రాజేందర్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఈయన బాగోతం బయటపడింది. -
గల్ఫ్ శవ పేటికలపై అంబులెన్స్ సంస్థల దోపిడీ
సాక్షి, బోథ్: గల్ఫ్ దేశాల్లో చనిపోయిన కార్మికుల శవపేటికల్ని స్వగ్రామానికి రవాణా చేయడానికి అంబులెన్స్ సంస్థలు అందిన కాడికి బాధితుల నుంచి దోచుకుంటున్నాయి. గల్ఫ్ దేశాలలో వివిధ కారణాలు, ప్రమాదాలలో చనిపోయిన వలస కార్మికుల శవాలు స్వగ్రామానికి రావడానికి నెలల తరబడి వేచి చూస్తున్న కుటుంబాల బలహీనతలు ఆసరా చేసుకొని అంబులెన్స్‌ల నిర్వాహకులు అందిన కాడికి దండుకుంటూ డబ్బుల దందా కొనసాగిస్తున్నారు. అదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని గిర్నూర్ గ్రామానికి చెందిన హరీష్ అనే బాధిత కుటుంబ సభ్యుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అదే గ్రామానికి చెందిన జలెందర్(38) ఉపాధి కోసం మూడు సంవత్సరాల క్రితం బహ్రెయిన్‌కు వెళ్లాడు. ఈ నెల 1వ తేదీన ప్రమాదవశాత్తు బాత్రూంలో కాలుజారి పడడంతో తలకు బలమైన గాయాలు అయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అక్కడి కంపెనీ వారు ఈ నెల 3వ తేదీన జలెందర్ శవపేటికను హైదరాబాద్‌కు పంపారు. ఆధికారులు మృతుని అన్న కుమారుడు హరీష్‌కుమార్‌కు శవపేటికను అప్పగించి, ఉచిత అంబులెన్స్‌లో సాగనంపారు. హైదరాబాద్ నుంచి శవపేటికతో వెళ్లిన అంబులెన్స్‌లో నుంచి శవాన్ని గ్రామాస్థులు దించుకున్నారు. ప్రభుత్వానికి కిరాయికి సరఫరా చేసే శ్రీసాయి అంబులెన్స్ సర్వీసెస్ డ్రైవర్ జలెందర్ బంధువుల నుంచి బలవంతంగా రూ. 1500 వసూలు చేశాడు. మరుసటి రోజు విషయం తెలుసుకున్న హరీష్ కేసీఆర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అంబులెన్స్ సర్వీసు సంస్థ ప్రతినిధి గూగుల్ పేలో డబ్బు వాపస్ ఇచ్చినట్లు హరీష్‌కుమార్ తెలిపారు. -
దొరికితే దొంగ.. లేకుంటే దొర
ఆయన చేయి తడిపితే చాలు భవనాల విస్తీర్ణం తగ్గిపోతుంది. పన్నుల భారం నుంచి విముక్తి కలుగుతుంది. సర్కారు ఆదాయానికి గండికొట్టడమే తన విద్యుక్త ధర్మంగా భావిస్తున్న ఆ అధికారి ఉన్న పళంగా ఆస్తులు కూడబెట్టేశారు. సునాయాసంగా లక్షల్లో లంచాలు తీసుకుంటున్నారు. ఆయన పాపం పండింది. ఓ భవన యజమాని నుంచి లంచం ఆశించిన ఆయన అవినీతి అధికారుల వలలో చిక్కారు. ఆయనే పార్వతీపురం మునిసిపాలిటీలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శంకరరావు. సాక్షి, పార్వతీపురం: పార్వతీపురం మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్రావు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు మంగళవారం పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ నాగేశ్వరరావుకు అందిన సమాచారం మేరకు మాటు వేసి మున్సిపల్ కార్యాలయం ముందు కారులో ఆర్.శ్రీనివాసరావు అనే వ్యక్తి నుంచి అపార్టుమెంట్ అసెస్మెంట్ను తగ్గించి ట్యాక్స్ వేసేందుకు రూ.2.80లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇంత పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వ్యక్తుల్లో ఆర్ఐ శంకర్రావు పార్వతీపురం చరిత్రలో మొదటి వ్యక్తి కావడం విశేషం. లంచం అడిగిన శంకర్రావు విషయమై భవన యజమాని శ్రీనివాసరావు ఏసీబీ అధికారులకు తెలియజేసి పథకం ప్రకారం పట్టించారు. ఏసీబీ అధికారులు శంకర్రావుపై కేసు నమోదు చేశారు. పెచ్చుమీరిన అవినీతి వరుస ఏసీబీ దాడులు జరుగుతున్నా లంచగొండుల తీరు మారడం లేదు. ఈ శాఖ ఆ శాఖ అన్న తేడా లేకుండా పని జరగాలంటే చేయి తడపాల్సిందే. ముఖ్యంగా రెవెన్యూ, పురపాలక శాఖలో లంచగొండితనం పెట్రేగిపోతుంది. దొరికిన వాడు దొంగగా ముద్ర వేసుకుంటున్నాడు. దొరకని వాడు దొరలా దర్జాగా తిరుగుతున్నాడు. లంచం ఇచ్చేవారు కూడా తమ పని అయిపోతే సరిపోతుంది అధికారుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు అన్న కోణంలో ఆలోచన చేస్తూ అధికారుల చేయి తడుపుతూ పనులు చేయించుకుంటున్నారు. మున్సిపల్ కార్యాలయంలో.. పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ, పట్టణ ప్రణాళికా విభాగంలో అవినీతి పెట్రేగిపోతుంది. రెవెన్యూ శాఖలో పన్నులు వసూలు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా నివాస గృహాలు, వాణిజ్య సముదాయాల మొండి బకాయిలు చెల్లించకుండా ఉండే వారిని బెదిరించి వారి నుంచి లంచాలు తీసుకుని వారికి లబ్ధి చేయడం పరిపాటిగా మారింది. సంవత్సరాల తరబడి పన్నులు చెల్లించని వారు ఉంటే అటువంటి వారిని టార్గెట్ చేసి పన్ను కడతారా? లేక ఆస్తులు జప్తు చేయమంటారా? అని బెదిరించి ఎంతోకొంత చేతికి ముట్ట చెబితే విడిచిపెడతామని బెదిరించి లంచాలు తీసుకుంటున్నారు. అయినా వీరు ఏసీబీ అధికారులకు చిక్కకుండా సత్యహరిశ్చంద్రుల్లా దర్జాగా తిరుగుతున్నారు. పట్టణ ప్రణాళికా విభాగం లంచగొండి తనానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలో ఎన్నో అనధికార భవనాలు ఉన్నాయి. కానీ వాటిపై చర్యలు ఉండవు. ఎందుకుంటే పాలకుల నుంచి అధికారుల వరకు భారీగా ముడుపులు తీసుకుని చూసీచూడనట్టు వ్యవహరిస్తుంటారు. బిల్డింగ్ ప్లాన్ కావాలంటే లంచం, భవనం విస్తీర్ణం తగ్గించాలంటే లంచం, లేఔట్ రెగ్యులైజేషన్ చేయాలంటే లంచం, కొత్త లేఔట్ వేయడానికి అనుమతులు ఇవ్వాలంటే లంచం ఇలా ప్రతీ పనికి ఒక రేటు నిర్ణయించి లంచం తీసుకుంటుంటారు. వరుస సంఘటనలు... ► మూడేళ్ల కిందట పార్వతీపురం రెవెన్యూ శాఖలో ఆర్ఐగా పని చేసిన కిరీటి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ► పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలోని పట్టణ ప్రణాళికా విభాగంలో టీపీఎస్‌గా పని చేసిన జనార్ధన్ లంచం తీసుకుంటు పట్టుబడ్డారు. ► పార్వతీపురం పట్టణంలోని జేపీ అపార్ట్మెంట్లో లంచం తీసుకుంటూ జియ్యమ్మవలసకు చెందిన తహసీల్దార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ► ఐటీడీఏ డీఈగా పని చేసి మూడేళ్లు క్రితం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ► ఇటుక బట్టీకి విద్యుత్ సరఫరా ఇవ్వడానికి లంచం తీసకుంటూ గరుగుబిల్లి ఏఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. -
ఏసీబీకి చిక్కిన అవినీతి ఆర్ఐ
సాక్షి, విజయనగరం : పార్వతీపురం మున్సిపాలిటీలో లంచం తీసుకుంటూ ఓ ఆర్ఐ.. ఏసీబీకీ పట్టుబడ్డాడు. దరఖాస్తు దారుని నుంచి లంచం తీసుకుంటూ ఆర్ఐ శంకరరావు అడ్డంగా దొరికిపోయాడు. పట్టణంలోని బహుళ అంతస్తు భవనానికి అసెస్మెంట్ ట్యాక్స్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తి నుంచి 2.80 లక్షల భారీ మొత్తం డిమాండ్ చేశాడు. దీంతో ఆ వ్యక్తి ఏసీబీని ఆశ్రయించటంతో పక్కా ప్రణాళికతో నిఘా వేసిన ఏసీబీ.. మున్సిపల్ ఆర్ఐ శంకరరావును లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. -
అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డాగా 'ఆ' సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్
సాక్షి, షాద్‌నగర్: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టి, పారదర్శకంగా సేవలందించేందుకుగాను ప్రభుత్వం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అయితే ఆ నిఘా కెమెరాల కన్నుకప్పి షాద్‌నగర్, ఫరూఖ్‌నగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో దగా జరుగుతోంది. డబ్బులు ఇస్తేగాని దస్తావేజులు రిజిస్ట్రేషన్ కావడం లేదు. ప్లాట్లు, భూముల కొనుగోలుకు వేర్వేరుగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రతి దస్తావేజుకు విధిగా డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్లాటు రిజిస్ట్రేషన్‌కు ఐదు వందల రూపాయల వరకు, భూముల రిజిస్ట్రేషన్‌కు ఎకరాకు రెండువేల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక సమస్యలున్న భూములు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ అయితే అధికారులు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందేనని ఆరోపణలు ఉన్నాయి. మధ్యవర్తుల సహాయంతో డబ్బులు వసూలు చేయడంతో పాటు, సబ్రిజిస్ట్రార్లు ప్రత్యేకంగా డబ్బులు వసూలు చేసేందుకు సిబ్బందిని కూడా నియమించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారికి డబ్బులు ముట్టినట్లు సమాచారం అందిన తర్వాతనే కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరుగుతోందని బాహాటంగా చెప్పుకుంటున్నారు. నామమాత్రంగానే సీసీ కెమెరాలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పారదర్శకత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్ వ్యవహారాలను కెమెరాల్లో చిత్రీకరించేందుకు ప్రభుత్వం సీసీ కెమెరాల విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఈ సీసీ కెమెరాలు కేవలం కార్యాలయానికి వచ్చి వెళ్లే వారిని రికార్డింగ్ చేసేందుకే ఉపయోగిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిఘా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. ‘చటాన్‌పల్లి’పై కొనసాగుతున్న దర్యాప్తు ఇటీవల చటాన్‌పల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 717లో ప్లాట్ నెంబర్ 147, 148లో 236 గజాల విస్తీర్ణం గల స్థలానికి సంబంధించి ఫోర్జరీ డాక్యుమెంట్లతో ప్లాటు రిజిస్ట్రేషన్ జరిగిన వ్యవహారంలో షాద్‌నగర్ పోలీసులు దర్యాప్తు వేగవంతంగా చేశారు. ప్లాటు అసలు యజమాని గడగమ్మ రాఘవరావు ఫిర్యాదుతో పోలీసులు ఫరూఖ్‌నగర్ సబ్‌రిజిస్ట్రార్, ప్లాటు కొనుగోలుదారులు జి.శ్రీనివాసులుపై కేసు నమోదు చేశారు. ఈ ఫోర్జరీ వ్యవహారంలో అసలు సూత్రదారులు, పాత్రదారులు ఎవరు అన్న విషయాన్ని పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని పోలీసులు విచారించినట్లు సమాచారం. చటాన్‌పల్లికి చెందిన ఓవ్యక్తితో పాటు, కేశంపేట రోడ్డుకు చెందిన మరో వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. వీరిని కూడా పోలీసులు విచారించినట్లు తెలిసింది. ఫోర్జరీ కేసు నమోదైనప్పటి నుంచి సబ్‌రిజిస్ట్రార్ తన కార్యాలయానికి రాకపోవడంతో అన్ని వ్యవహారాలు కింది స్థాయి సిబ్బందే చూసుకుంటున్నారు. ఆన్‌లైన్‌తో సమస్యలు కల్పితమా..? ఫోర్జరీ డాక్యుమెంట్ వ్యవహారం బయటికొచ్చిన రోజు నుంచి ఫరూఖ్‌నగర్ సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆన్లైన్ సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే ఆన్లైన్ సమస్యలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కావాలనే ఆన్‌లైన్‌ను బంద్ చేస్తున్నారని, కార్యాలయానికి క్రమం తప్పకుండా వచ్చే వ్యాపారులు, మధ్యవర్తుల పనులను మాత్రమే అధికారులు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఆన్లైన్ సమస్యతో గత నాలుగు రోజులుగా భూముల కొనుగోలు, అమ్మకందార్లు ఇబ్బందులు పడుతున్నారు. దస్తావేజుల రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏసీబీ దృష్టి సారిస్తే... అవినీతి రాజ్యమేలుతున్న షాద్‌నగర్ సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే గత రెండు నెలల క్రితం షాద్‌నగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ శేఖర్‌రెడ్డి, అదేవిధంగా కేశంపేట తహసీల్దార్ లావణ్య, వీఆర్ఓ అనంతయ్యలు పెద్ద ఎత్తున లంచం డబ్బులు తీసుకుంటూ ఏబీసీ అధికారులకు పట్టుపడ్డారు. ఏడాది క్రితం షాద్‌నగర్ ఎంవీఐ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నా రిజిస్ట్రేషన్ శాఖలో అధికారులు ఆరోపణలు ఉన్న అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఏసీబీ అధికారులు స్పందించి సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయంపై నిఘా వేస్తే అవినీతి చేపలు దొరకే అవకాశాలు ఉన్నాయి. -
పైసా ఉంటే ఏ పనైనా..
సాక్షి, మెదక్: మెదక్ మున్సిపాలిటీ అవినీతికి కేరాఫ్‌గా నిలుస్తోంది. గతంలో ఆసరా పింఛన్లు, అక్రమ లేఅవుట్ల వంటి పలురకాల కుంభకోణాలు వెలుగుచూడగా.. తాజాగా బల్దియాలోని రెవెన్యూ విభాగం మాయాజాలం బయటపడింది. పట్టణ పరిధిలో లక్షలాది రూపాయలు విలువచేసే ఓ ఇంటికి దొంగచాటుగా మ్యూటేషన్ చేశారు. అధికారులే సూత్రధారులుగా నిలిచిన ఈ వ్యవహారంలో చాలా మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు తెలుస్తోంది. మెదక్ పట్టణ పరిధిలోని వడ్డెర కాలనీలోని ఓ ఖాళీ స్థలంలో ఆరు సంవత్సరాల క్రితం బోదాసు నాగమ్మ అనే మహిళ రేకుల ఇల్లు నిర్మించుకొని జీవిస్తోంది. ఈ భూమికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేవు. ఈ క్రమంలో 2012–13లో ఇంటి నంబర్ కోసం మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకుంది. అధికారులు పరిశీలించి ఇంటి నంబర్ 1–10–82/1ను కేటాయించారు. ఆ తర్వాత ఆమె కరెంట్ కనెక్షన్ తీసుకుంది. ఈ ఇంటికి మాత్రమే ఆమె కబ్జాదారుగా(ప్రజెంట్ ఆక్యుపై) ఉన్నారు. మున్సిపల్ నిబంధనల ప్రకారం ఎలాంటి పత్రాలు లేని ఇల్లు, భూమిని విక్రయించొద్దు. ఆమెకు కేవలం కరెంట్ కనెక్షన్ కోసమే ఇంటి నంబర్ కేటాయించారు. మరొకరి చేతికి.. మున్సిపాలిటీ రికార్డుల ప్రకారం బోదాసు నాగమ్మ ఆ ఇంటికి కబ్జాదారు మాత్రమే. సదరు భూమి, ఇల్లుకు సంబంధించి ఎలాంటి అమ్మకాలు చేయరాదు. ఇందుకనుగుణంగా ఆమె పెట్టుకున్న అర్జీ మేరకు మున్సిపల్ రెవెన్యూ అధికారులు మ్యానువల్ రికార్డులో ఆమె పేరుతో ఇంటినంబర్ కేటాయించారు. రికార్డులో ప్రజెంట్ అక్యుపయ్యర్(కబ్జాదారు మాత్రమే) అని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ క్రమంలో బోదాసు నాగమ్మ నిబంధనలకు విరుద్ధంగా మరో మహిళ గిరిగల్ల సుజాతకు విక్రయించారు. పేరు తారుమారు.. భారీగా ఆమ్యామ్యాలు ఈ ఇల్లుకు సంబంధించి మ్యానువల్‌గా బోదాసు నాగమ్మ పేరు ఉండగా.. ఆన్లైన్లో మాత్రం వేరే వారి పేరు ఉంది. 2016కు ముందు మున్సిపాలిటీ కార్యకలాపాలు మ్యానువల్‌గా సాగేవి. ఆ తర్వాత కంప్యూటరీకరణతో అంతా ఆన్లైన్లోనే సాగుతోంది. 2012–13లో సదరు ఇల్లు బోదాసు నాగమ్మ పేరు మీద ఉండగా.. 2018కి వచ్చే సరికి ఆన్లైన్లో ఆ భూమి గిరిగల్ల సుజాత పేరు మీదకు మారింది. ఆన్లైన్ రికార్డులను పరిశీలిస్తే 2018 మే 31న ఈ ఇల్లును సుజాత పేరు మీద మార్పిడి చేసినట్లు స్పష్టమవుతోంది. ప్రజెంట్ ఆక్యుపయ్యర్ పేరు మీద ఉన్న ఇంటిని ఇతరుల పేరిట చేయడానికి వీల్లేదు. కానీ.. అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వేరే వారి పేరుపై చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఇక్కడే పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఇలాంటివి ఇంకెన్నో.. మ్యానువల్‌లో నాగమ్మ పేరు ఉండగా.. ఆన్లైన్లో గిరిగల్ల సుజాత పేరు ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణ పరిధిలో విలువైన భూమి కావడం.. దీనికి సంబంధించి లొసుగులు ఉండడంతో మున్సిపాలిటీలో అవినీతికి అలవాటు పడిన పలువురు అధికారులు సూత్రధారులుగా వ్యవహరించి అన్నీ చక్కబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్షలాది రూపాయల విలువైన భూమిని ఇతరులకు కట్టబెట్టి వారి నుంచి సుమారు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా.. అలాంటి పత్రాలు లేని ఇళ్లు పట్టణంలో కోకొల్లలు. చాలా ఉన్నట్లు తెలుస్తోంది. అందరిని ప్రజెంట్ ఆక్యుపయ్యర్‌లో పెట్టారు. వీటిలో సైతం ఇలాంటి బాగోతమే నడిచినట్లు పట్టణంలో చర్చ జరుగుతోంది. ఎన్నో అనుమానాలు ఎలాంటి పత్రాలు లేని భూమికి రిజిస్ట్రేషన్ ఎలా అయిందో.. ఎవరు తతంగం నడిపించారో అంతుబట్టని పరిస్థితి ఉంది. పేరు మార్పిడికి సంబంధించి మున్సిపల్ రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా చేశామని చెబుతున్నారు. కానీ.. నిబంధనల ప్రకారం ప్రజెంట్ ఆక్యుపయ్యర్ పేరు మీద ఉన్న ఇంటిని మరొకరి పేరుపై మార్పిడి చేయడానికి వీల్లేదు. ఇక్కడే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ చేపడతాం మాన్యువల్‌లో ఒకరు, ఆన్లైన్లోన్లో మరో పేరు ఉండడంపై మున్సిపల్ కమిషనర్ వి.సమ్మయ్యను వివరణ కోరగా.. ‘దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం. ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని పేర్కొన్నారు. -
నోటు పడితేనే..
నగరంలోని ఖైరతాబాద్ తహసీల్ పరిధిలో మమతాదేవి (పేరు మార్చాం) కుటుంబం ‘ఫ్యామిలీ మెంబర్షిప్ సర్టిఫికెట్’ కోసం ఏప్రిల్‌లో ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. ఇప్పటి వరకు ఆ దరఖాస్తుపై కనీసం విచారణ కూడా చేయలేదు. ఆమె అప్పటి నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ‘మళ్లీ వారం’ అంటూ తిప్పి పంపడం సర్వసాధారణమైంది. గ్రేటర్‌లోని ఇతర తహసీల్దార్ కార్యాలయాల్లో సైతం పరిస్థితి దీనికి భిన్నంగా ఏం లేదు. ప్రజలు కుల, ఆదాయ, నివాస, ఫ్యామిలీ మెంబర్షిప్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తులు చేసుకుని నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. సాక్షాత్తు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్య తీరుకు ఇది నిలువుటద్దం. ప్రభుత్వ భూముల పర్యవేక్షణ పక్కన పెడితే కనీసం వివిధ ధ్రువీకరణ పత్రాల జారీలో కూడా సిబ్బంది నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: రాజధాని నగరంలో గల మండల రెవెన్యూ (తహసీల్దార్) కార్యాలయాలకు అందుతున్న వివిధ ధ్రువీకరణ పత్రాల దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పెండింగ్‌లో పడిపోతున్నాయి. కనీసం క్షేత్ర స్థాయి విచారణకు నోచుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కింది స్థాయి విభాగాల సిబ్బందికి చేయి తడిపనిదే దరఖాస్తుల్లో కదలిక తేవవడం లేదనే విమర్శలు అధికమవుతున్నాయి. ప్రతి తహసీల్దార్ ఆఫీసు ముందు దళారులు తిష్ట వేయడం.. వారి ద్వారా అందిన దరఖాస్తులపైనే విభాగాల సిబ్బంది దృష్టి సారించడం బహిరంగ రహస్యంగా మారింది. దీంతో కుల, ఆదాయ, నివాస, ఫ్యామిలీ మెంబర్షిప్ తదితర దరఖాస్తులకు నిర్ణీత వ్యవధిలో మోక్షం లభించడం లేదు. మరోవైపు దరఖాస్తుల అత్యవసరాలను బట్టి మీసేవా, ఈసేవా కేంద్రాల నిర్వాహకుల్లో కొందరు అక్రమ మార్గాలను అవలంబిస్తున్న సంఘటనలు కూడా ఇటీవల వెలుగు చూస్తున్నాయి. ఉన్నతాధికారులు పర్యవేక్షణ కొరవడంతో రెవెన్యూ సిబ్బంది పనితీరు అధ్వానంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆన్లైన్ ద్వారా.. విద్యార్థులు, నిరుద్యోగులు, పేద కుటుంబాలు వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవా, ఈసేవా కేంద్రాల ద్వారా మండల తహసీల్దార్లకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని సంబంధిత పత్రాల కాపీలను కార్యాలయాల్లో అందిస్తున్నారు. దరఖాస్తుల పత్రులు అందిన వెంటనే వాటిపై క్షేత్ర స్థాయి విచారణ చేసి సంబంధిత వీఆర్వోలు రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు సిఫార్సు చేయాలి. రెవెన్యూ ఇన్స్పెక్టర్ల నివేదక ఆధారంగా సంబంధిత అధికారి దరఖాస్తులపై నిర్ణయం తీసుకుంటారు. అయితే, దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ సకాలంలో చేయకుండా పెండింగ్‌లో పెడుతున్నారు. ధ్రువీకరణ పత్రాలను సిటిజన్ చార్టర్ వ్యవధి లోపల విచారణ పూర్తిచేసి ఆమోదమో.. లేక తిరస్కరణో చేయాలి. కానీ వాటి అమలు మాత్రం కానరావడంలేదు. దీంతో దరఖాస్తుదారులు ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండడం లేదు. రోజుకు 50 దరఖాస్తులు హైదరాబాద్ రెవెన్యూ జిల్లా పరిధిలో 16 తహసీల్దార్ కార్యాలయాలు ఉన్నాయి. మీసేవా, ఈసేవా ద్వారా ఆన్లైన్లో నమోదైన వివిధ ధ్రువీకరణ పత్రాల దరఖాస్తులు కాపీలు నిత్యం సగటున 30 నుంచి 50 తగ్గకుండా ప్రతి కార్యాలయానికి అందుతున్నాయి. సంబందిత బాధ్యులు దరఖాస్తులపై సిటిజన్ చార్టర్ వ్యవధిలోగా విచారణ పూర్తి చేయాల్సి ఉండగా, పెండింగ్‌లో పడేయడం సాధారణమైంది. దరఖాస్తు దారులు నేరుగా సమర్పించే దరఖాస్తులపై సిబ్బంది దృష్టిపెట్టకపోవడం గమనార్హం. గత రెండు నెలల వ్యవధిలో మీ సేవా, ఈసేవాల ద్వారా 10 వేలకు పైగా దరఖాస్తులు తహసీల్దార్ల లాగిన్‌కు అందితే అందులో కేవలం 4 వేల దరఖాస్తులు మాత్రమే క్షేత్ర స్థాయి విచారణ, అమోదం, తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన దరఖాస్తులు పెండింగ్‌లోనే పడిపోయాయి. ఆయా కార్యాలయాల ముందు తిష్ట వేసిన దళారులు దరఖాస్తుదారుడి వసరాన్ని బట్టి రూ.500 నుంచి రూ.2 వేల వరకు వస్తూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అవినీతి జబ్బు!
సాక్షి, మెదక్: ‘‘ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల చేతులు తడపనిదే ఏ పనీ జరగడం లేదు. న్యాయంగా రావాల్సిన ప్రభుత్వ లబ్ధిని కూడా.. ఎంతో కొంత ముట్ట జెప్పకపోతే ఫైల్ కదలని పరిస్థితి నెలకొంది. తాజాగా జిల్లాలో డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేసి మృతి చెందిన ఓ మహిళ కుటుంబానికి న్యాయంగా రావాల్సిన బెనిఫిట్స్‌ను అందించడానికి రూ.30వేలు లంచం అడిగిన సీనియర్ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ’’ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడి చేసి సీనియర్ అసిస్టెంట్ షౌకత్ అలీ లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు బాధితుడు పూర్ణచందర్ తెలిపిన వివారాలు ఇలా ఉన్నాయి. డబ్బులిస్తేనే పని.. శివ్వంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రైమరీ హెడ్‌నర్స్‌గా పనిచేస్తున్న లలిత అనే ఉద్యోగస్తురాలు ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన బెన్ఫిట్స్ కోసం ఆమె కుమారుడు పూర్ణచందర్ అక్కడి ఆస్పత్రి అధికారులకు అర్జీ పెట్టుకున్నాడు. దీంతో అక్కడ విధులు నిర్వహించే యూడీసీ నర్సింలు మెదక్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ షౌకత్ అలీని కలవాలని, అతడు అడిగిన మొత్తం ఇస్తేనే పని జరుగుతుందని చెప్పాడని బాధితుడు పూర్ణచందర్ తెలిపారు. ఈ విషయంపై పూర్ణచందర్ సీనియర్ అసిస్టెంట్ షౌకత్ అలీని కలువగా తనకు రూ.30వేలు ఇస్తేనే పనులు జరుగుతాయని చెప్పడంతో బాధితుడు రూ.15వేలకు ఒప్పుకొని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పట్టుకున్న ఏసీబీ అధికారులు.. దీంతో మంగళవారం ఏసీబీ అధికారులు చెప్పిన విధంగా పూర్ణచందర్ సీనియర్ అసిస్టెంట్ షౌకత్ అలీకి రూ.15వేల లంచం ఇచ్చాడు. లంచం డబ్బులు తీసుకోగానే సీనియర్ అసిస్టెంట్ తన వాహనంపై ఐసీఐసీఐ బ్యాంకు వద్ద ఆగాడు. అతన్ని వాహనాన్ని వెంబడించిన ఏసీబీ అధికారులు షౌకత్‌అలీని డీఎంహెచ్ఓ కార్యాలయానికి తీసుకొచ్చి లంచం డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. లంచం కోసం వేధించారు: పూర్ణచందర్ మా అమ్మ లలిత 30 సంవత్సరాల వైద్యశాఖలో విధులు నిర్వహించి ఆరు నెలల క్రితం గుండెపోటుతో మరణించింది. ఆమెతోపాటు విధులు నిర్వహించిన యూడీసీ నర్సింలు కనికరం చూపాల్సింది పోయి అమ్మకు రావాల్సిన బెన్ఫిట్స్ ఇవ్వాలంటే లంచం ఇవ్వాల్సిందేనని వేధించాడని బాధితుడు పూర్ణచందర్ వాపోయాడు. ఆయనతోపాటు మెదక్‌లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో విధులు నిర్వహించే సీనియర్ అసిస్టెంట్ షౌకత్అలీలు కలిసి రూ.30వేలు డిమాండ్ చేశారు. వారి వేధింపులు భరించలేకనే ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. ఉలిక్కిపడ్డ ప్రభుత్వ ఉద్యోగులు.. మెదక్ డీఎంహెచ్ఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు మంగళవారం పట్టుకోవడంతో జిల్లాలోని ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గత రెండేళ్ల క్రితం న్యాయస్థానమైన మెదక్ కోర్టులో ఓ ఉద్యోగి లంచం తీసుకుంటుండగా పట్టుబడిన విషయం విధితమే. నాటి నుంచి నేటి వరకు జిల్లాలో ఎలాంటి ఏసీబీ దాడులు జరగలేదు. తిరిగి రెండేళ్ల తరువాత ఏసీబీ దాడితో జిల్లాలోని ఉద్యోగస్తులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. లంచం అడిగితే సమాచారం ఇవ్వండి లంచం ఎవరు అడిగినా వెంటనే 94405 56149కు ఫోన్‌చేసి సమాచారం అందించాలని ఏసీబి డీఎస్పీ రవికుమార్ తెలిపారు. మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ షౌకత్ అలీ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండ్‌గా పట్టుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎవరు లంచం అడిగినా తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని చెప్పారు. సంపాదనకు మించి అక్రమంగా ఆస్తులు కలిగి ఉన్నా..వారిపై దాడులు చేసే అధికారం తమకు ఉందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయించుకునేందుకు ఎవరు లంచం ఇవ్వకూడదని, ఎవరైన లంచం డిమాండ్‌చేస్తే మాకు సమాచారం ఇవ్వాలన్నారు. – రవికుమార్, ఏసీబీ డీఎస్పీ -
పోలీసులే మహిళతో..
సాక్షి ప్రతినిధి, చెన్నై: నేరస్థులను పోలీసులు పట్టుకుంటారు. పోలీసులే నేరస్థులుగా మారితే....లంచం సొమ్ము కోసం నేరాలు చేయిస్తే దిక్కెవరు. నామక్కల్ జిల్లాలో అదే జరిగింది. మహిళ చేత బలవంతంగా గంజాయి అమ్మించిన నేరంపై ఇద్దరు పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారి ఒకరు ఏసీబీ కేసుల్లో చిక్కుకున్నారు. నామక్కల్ జిల్లా తిరుచెంగోట్టైకి చెందిన కుమార్ (24) గంజాయి వ్యాపారం చేస్తున్న కారణంగా గతంలో పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అతడి నుంచి 1,300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని గూండా చట్టం కింద కేసులు పెట్టారు. భర్తను జైలు నుంచి బెయిలుపై విడుదల చేసేందుకు సేలంలోని మత్తుపదార్థాల నిరోధక విభాగ డీఎస్పీ కుమార్‌ను జైల్లో ఉన్న కుమార్ భార్య రాణి కలుసుకున్నారు. ఇతని పరిధిలో సేలం, నామక్కల్, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాలు ఉన్నాయి. డీఎస్పీ కుమార్ 2014లో రాణిని కలుసుకుని గంజాయి అమ్మకాల ద్వారా నెలకు లక్ష రూపాయల చొప్పున లంచం ఇస్తేనే నీ భర్త బెయిలుపై విడుదలకు సహకరిస్తానని చెప్పాడు. అయితే అంతమొత్తం చెల్లించలేను, రూ. 25 వేలయితే సంపాదించగలనని చెప్పి గంజాయి అమ్మకాలు చేయసాగింది.. ఆ తర్వాత రాణి, ఆమెకు తెలిసిన మురుగన్ అనే వ్యక్తితో డీఎస్పీని పలు చోట్ల కలుసుకుంటూ అనేక వాయిదాల్లో సొమ్మును చెల్లిస్తూ వచ్చింది. ఒక సందర్భంలో ఆ మొత్తాన్ని సీపీ చక్రవర్తి అనే వ్యక్తి బ్యాంకు ఖాతాలో వేయాలని డీఎస్పీ తెలిపాడు. ఆ సీపీ చక్రవర్త తంజావూరులో ప్రభుత్వ గణాంకాలు, ట్రెజరీలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. అతను డీఎస్పీకి సన్నిహితుడు. ఇదిలా ఉండగా 2017 నవంబర్‌లో మత్తుపదార్థాల నిరోధక విభాగం ఇన్స్పెక్టర్ శాంత అనే మహిళ రాణిని బెదిరించి డబ్బులు గుంజే ప్రయత్నం చేసింది. లంచం ఇవ్వకుంటే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని బెదిరించింది. దీంతో భయపడిపోయిన రాణి ఇన్స్పెక్టర్ శాంతకు రూ.45 వేలను మురుగన్ ద్వారా పంపింది. లంచం ముట్టజెపుతున్నా నెలరోజుల తర్వాత రాణిని, మురుగన్‌ను గంజాయి కేసులో ఇన్స్పెక్టర్ శాంత అదుపులోకి తీసుకుంది. కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ. 2 లక్షలు చెల్లించాలని ఒత్తిడి తేవడంతో రూ. 80 వేలు చెల్లించింది. మిగతా రూ. 1.20 లక్షలు త్వరలో చెల్లించాలని హెచ్చరించి వారిని పంపివేసింది. పోలీసుల వేధింపులు భరించలేని రాణి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి తలదాచుకుంది. అయినా కూడా రాణీని వదలని డీఎస్పీ కుమార్ సెల్‌ఫోన్ ద్వారా మిగిలిన సొమ్ము ఇవ్వకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో విరక్తి చెందిన రాణి సేలంలోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో డీఎస్పీ కుమార్, ఇన్స్పెక్టర్ శాంత, గణాంకాల అధికారి సీపీ చక్రవర్తిలపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. -
ఏసీబీ వలలో సీనియర్ అసిస్టెంట్
సీతమ్మధార(విశాఖ ఉత్తర): ఆలయ పరిసరాల్లో టిఫిన్ సెంటర్ నిర్వహణకు తాళాలిచ్చేందుకు రూ.15వేలు డిమాండ్ చేసిన దేవదాయ శాఖ సీనియర్ అసిస్టెంట్ ఏసీబీ వలకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ రంగరాజు తెలిపిన వివరాల ప్రకారం... అక్కయ్యపాలెంకు చెందిన బి.శేషానంద్ 2017లో టిఫిన్ సెంటర్ నిర్వహణ కోసం ఆలయ పరిసరాల్లోని షాపు అద్దెకు తీసుకుని 2018 వరకు నడిపించాడు. అనంతరం అతని భార్య అనారోగ్యానికి గురికావడంతో కొద్దికాలంగా షాపు తీయలేదు. మరలా ఈ ఏడాది ఏప్రిల్‌లో అప్పటి వరకు ఆలయానికి ఉన్న అద్దె బకాయి తీర్చేశాడు. అలాగే టిఫిన్ షాపు నిర్వహణకు షెడ్ తాళాలు ఇవ్వాలని కోరాడు. అయితే సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణామాచార్యులు షెడ్‌కు సంబంధించి తాళాలు ఇవ్వాలంటే రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో శేషానంద్ ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు డబ్బులు ఇస్తానని సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులను షాపు వద్దకు సోమవారం రాత్రి ఏడు గంటల సమయంలో పిలిచాడు. కృష్ణమాచార్యులు డబ్బులు తీసుకుంటుండగా అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకొని, రూ.15 వేలు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. ఆలయంలోని పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వేపగుంటలోని కృష్ణమాచార్యులు ఇంటిలో ఏసీబీ సీఐ అప్పారావు సోదాలు చేశారు. సోదాల్లో సీఐలు గణేష్, అప్పారావు, రమేష్, గఫూర్ సిబ్బంది పాల్గొన్నారు. -
వసూల్ రాజా.!
కుత్బుల్లాపూర్: ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ప్రచారం చేసుకుంటూ బాధితుడు నేరు గా స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే తప్పకుండా న్యాయం చేస్తామని హామీలిస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ఓ వైపు సైబరాబాద్ పోలీసులు కసరత్తు చేస్తుండగా మరో వైపు కొందరు అవినీతి పోలీసు అధికారులు చేతులు తడపనిదే పని కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే బాలానగర్ పరిధిలో పని చేసిన ఇద్దరు అధికారులు అవినీతి ఆరోపణలపై బదిలీపై వెళ్లగా, కొత్తగా వచ్చిన మూడో అధికారి కూడా లంచాలకు ఒత్తిడి చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఓ హెడ్ కానిస్టేబుల్ ఫోన్లో బెదిరిస్తూ సీఐ రమ్మన్నాడని హుకుం చేస్తే.. తీరా స్టేషన్‌కు వెళ్లి తామేమీ కేసుల్లో లేమని వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వకుండా మీ జాతకాలు నా దగ్గర ఉన్నాయి.. మీ సంగతి చూస్తా.. రేపు రండి అంటూ ఆదేశాలు. ఇంతలో సదరు సీఐకి వత్తాసు పలికే ఓ నేతవారి వద్దకు వెళ్లి ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకోండి లేకుంటే కేసులు తప్పవంటూ మధ్యవరి ్తత్వం చేస్తూఅందిన కాడికి దోచుకుంటున్నా డు. బాలానగర్ డీసీపీ పరిదిలోని ఓ పోలీస్‌స్టేషన్ ఎస్హెచ్ఓ దీపం ఉండగానే‘ఇళ్లు’ చక్కదిద్దుకుంటూ తాను నిర్మిస్తున్న భవనానికి పక్కా ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. నెల రోజులుగా స్థానికులకు చుక్కలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో అత్యధిక శాతం నిర్మాణాలు ప్రభుత్వ స్థలాల్లో నిర్మించినవే ఉన్నాయి. వీటికి ప్రభుత్వం పట్టాలు జారీ చేయగా మిగిలిన స్థలాలను పలువురు కబ్జా చేశారు. ఇటీవల తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్‌కుమార్ వారికి అడ్డుకట్ట వేశారు. పలువురిపై ఇటీవల కేసులు నమోదు చేయగా వీటిని ఆసరాగా చేసుకుని సదరు ఎస్హెచ్ఓ నెల రోజులుగా ఆయా ప్రాంతాల్లో కబ్జాదారులుగా ముద్ర పడిన వారిని స్టేషన్‌కు పిలిపించి తనదైన శైలిలో క్లాస్‌లు తీసుకుంటూ అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.సదరు అధికారి బాలాపూర్‌లో కొత్తగా నిర్మిస్తున్న భవనానికి కుత్బుల్లాపూర్ నుంచే ఇసుక, కంకర, సిమెంట్, స్టీల్ తరలిస్తుండటం గమనార్హం. స్టేషన్‌కు వెళ్లిన వారంతా ఏదో ఒకటి సమర్పించుకుని తిరిగి వెళ్లాల్సి వస్తోంది. హెడ్‌కానిస్టేబుల్ నుంచి ఫోన్లు.. మధ్యాహ్న సమయంలో స్టేషన్లో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ పలువురికి ఫోన్లు చేసి సాయంత్రం సీఐ రమ్మన్నాడని కబురు పెడతాడు. తీరా వచ్చిన తరువాత గుంపులో ఉన్న ఒకరు లేక ఇద్దరికి బెల్టు దెబ్బలు రుచి చూపిస్తాడు. దీంతో పక్కనే ఉన్నవారు భయంతో అతడికి సరెండర్ అవుతారు. కేవలం ఆరోపణలు ఉన్నాయి కాబట్టే తీసుకు వచ్చి వార్నింగ్ ఇచ్చామని.. రేపు వస్తే మీపై ఉన్న కేసులను పరిశీలిస్తామంటూ పంపిస్తారు. ఇంతలో సీఐకి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఓ నేత వచ్చి వీరితో రాయభారం నడిపి కేసులు నమోదు కాకుండా బేరసారాలకు దిగుతాడు. ఈ తతంగం నెల రోజులుగా కొనసాగుతోంది. సదరు అధికారి దేవేందర్‌నగర్, రావినారాయణరెడ్డి నగర్, కైసర్‌నగర్, బాలయ్యనగర్, మహదేవపురం, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాలకు చెందిన నాయకులను రోజుకు ఐదు నుంచి పది మంది చొప్పున స్టేషన్‌కు పిలిపించి, బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురి నుంచి డబ్బులు, భవన నిర్మాణ సామాగ్రి తరలించిన అతను రెండు రోజుల క్రితం దేవేందర్‌నగర్ ప్రాంతానికి చెందిన పలువురిని స్టేషన్‌కు రప్పించి రూ.6 వేల చొప్పున రూ. 48 వేలు వసూలు చేయడమేగాక బాలానగర్‌లో లారీలు ఆర్డర్ ఇచ్చి ఒక లోడు ఇసుకను బాలాపూర్‌కు తరలించడం విశేషం.మరో వ్యక్తిని పిలిచి నీపై ఆరోపణలున్నాయంటూ రూ. 30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా రూ. 10వేలు ఇచ్చేందుకు అతను అంగీకరించాడు. ఇలా ప్రతి ఒక్కరూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మామూళ్లు సమర్పించుకోవడం పరిపాటిగా మారింది. భారీగా వసూళ్లు.. దేవేందర్‌నగర్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులపై ఇటీవల ల్యాండ్ గ్రాబింగ్ కేసులు నమోదయ్యాయి. వీరి వద్ద నుంచి సదరు అధికారి రూ. లక్షల్లో వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బాలయ్యనగర్‌కు చెందిన ఓ నేత ఇదే తరహాలో ముడుపులు సమర్పించుకోగా, దేవేందర్‌నగర్‌కు చెందిన ముగ్గురు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్ట జెప్పినట్లు తెలిసింది. ఏది ఏమైనా సదరు అధికారి వ్యవహార శైలి స్థానికంగా చర్చానీయాంశంగా మారింది. -
అడ్డదారులు తొక్కుతున్న కొందరు మహిళా ఎస్ఐలు!
సాక్షి, గుంటూరు: కొత్తగా పోలీస్ శాఖలోకి ప్రవేశించిన నాలుగో సింహాలు తడబడుతున్నాయి. అనతికాలంలోనే తప్పటడుగులు వేస్తున్నాయి. కింది స్థాయి సిబ్బంది ప్రోత్సాహంతో వసూళ్లకు పాల్పడుతున్నాయి. ప్రజా సేవ చేయాలనే తలంపుతో పోలీస్ శాఖలోకి వచ్చిన యువ ఎస్ఐలను కింది స్థాయి సిబ్బంది తప్పుదోవ పట్టిస్తున్నారు. దీంతో వారు అవినీతి ముద్ర వేసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం గుంటూరు అర్బన్ జిల్లాలో 11, రూరల్ జిల్లాలో 36 మంది ప్రొహిబిషన్ ముగించుకున్న కొత్త ఎస్ఐలకు అప్పటి ఎస్పీలు స్టేషన్ పోస్టింగ్‌లు ఇచ్చారు. వీరిలో కొంత మంది తప్పటడుగులు వేస్తున్నారు. కేసుల్లో రాజీ కుదురుస్తూ నిందితుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల కుటుంబంపై కే–ట్యాక్స్, ఉద్యోగాల్లో మోసాలు చేసిన కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. కోడెల కుటుంబంపై నమోదైన ఓ కేసులో కొత్తగా నియమితులైన ఓ మహిళా ఎస్ఐ రూ.లక్ష వసూలు చేసినట్టు సమాచారం. సత్తెనపల్లి సబ్ డివిజన్లో పని చేస్తున్న మహిళా ఎస్ఐ కోడెల కుటుంబంపై నమోదైన ఓ కేసులో రాజీ కుదిర్చి రూ.25 లక్షల నగదు ఫిర్యాదుదారునికి వెనక్కి ఇప్పించారు. నగదు వెనక్కు ఇప్పించిన ఎస్ఐ.. కేసు తీసేయాలని యత్నిస్తుండటంతో ఆ విషయం ఉన్నతాధికారికి తెలిసి మందలించారు. కేసులో బాధితునికి డబ్బు తిరిగి ఇప్పించిన ఈమె రూ.లక్ష కోడెల తరఫు వ్యక్తి నుంచి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. మరో సందర్భంలో తన పట్ల యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనపై వివాహిత ఫిర్యాదు చేయగా నిందితుడి నుంచి డబ్బు తీసుకుని సదరు మహిళా ఎస్ఐ నామమాత్రపు కేస నమోదు చేసి వదిలేశారు. ఆ మరుసటి రోజే బహిర్భూమికి వెళుతున్న వివాహితపై యువకుడు లైంగికదాడియత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం వివాహిత.. భర్తకు చెప్పడంతో ఆయన తరఫు బంధువులు ఆ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. దాడి ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో గుంటూరులోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఇదే తరహాలో వెలుగు చూడని మరికొన్ని ఆరోపణలు మహిళా ఎస్ఐపై ఉన్నట్టు తెలుస్తోంది. బియ్యం, గ్రానైట్ లారీలు చూసీచూడనట్టు.. నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలోని వినుకొండ నియోజకవర్గంలో ప్రొహిబిషన్ పూర్తి చేసుకుని పోస్టింగ్ పొందిన మరో మహిళా ఎస్ఐ బియ్యం, గ్రానైట్, ఇసుక అక్రమ రవాణాలను చూసీచూడనట్లు వ్యవహరిస్తూ మామూళ్లు రాబడుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వినుకొండ టీడీపీకి చెందిన ఓ రేషన్ మాఫియా సభ్యుడు తరలిస్తున్న బియ్యం లారీని పట్టుకున్న మహిళా ఎస్ఐ అతని నుంచి డబ్బులు తీసుకుని వదిలేసినట్టు విశ్వసనీయ సమాచారం. చిన్న చిన్న ఆటోల్లో తరలిస్తున్న బియ్యాన్ని మాత్రం పట్టుకుంటూ లారీల్లో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మాత్రం ఈమె వదిలేస్తున్నారు. ఇదే తరహాలో ప్రకాశం జిల్లా చీమకుర్తి నుంచి అనధికారికంగా గ్రానైట్ తరలిస్తున్న వారి నుంచి, గుండ్లకమ్మ నది నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేసే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. గురజాల సబ్ డివిజన్ పరిధిలో పని చేస్తున్న మరో మహిళా ఎస్ఐ సివిల్ వివాదంలో తల దూర్చి తనను బెదిరిస్తున్నారని ఓ బాధితురాలు స్పందనలో రూరల్ ఎస్సీకి ఫిర్యాదు చేసింది. వీరి తరహాలోనే మరి కొందరు కొత్త ఎస్ఐ అడ్డదారులు తొక్కుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షేత్ర స్థాయి సిబ్బంది ప్రోత్సాహంతోనే.. కొత్తగా స్టేషన్ పోస్టింగ్ పొందిన ఎస్ఐలను క్షేత్ర స్థాయి సిబ్బంది తప్పుదోవ పట్టిస్తున్నారు. కొందరు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు నిందితుల నుంచి డబ్బు వసూలు చేసి కేసుల్లో రాజీ కుదర్చడం, సివిల్ సెటిల్మెంట్లు చేయించడం వంటి కార్యకలాపాలకు ఎస్ఐలను ప్రోత్సహిస్తున్నారు. వీరే మధ్యవర్తులుగా వ్యవహరించి ఎస్ఐలకు డబ్బులు వసూలు చేసి పెడుతున్నారు. మరి కొన్ని సందర్భాల్లో యువ ఎస్ఐలు దూకుడుగా వ్యవహరిస్తూ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులపై సైతం చేయి చేసుకుంటున్నారు. ప్రతి చిన్న విషయానికి లాఠీ ఝుళిపిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు తూట్లు పొడుస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీస్ బాస్‌లు దృష్టి సారించి యువ ఎస్ఐలను గాడిలో పెట్టాలన్న ప్రజలు కోరుతున్నారు. -
సీబీఐ వలలో ఎక్సైజ్ అధికారి
సాక్షి, పశ్చిమ గోదావరి: లంచం తీసుకుంటున్న సెంట్రల్ ఎక్సైజ్ అధికారి బుధవారం సీబీఐకి చిక్కాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరిలోని తణుకులో కొమ్మోజు హరికృష్ణ ఆదిత్య కమ్యూనికేషన్ పేరుతో ఐడియా సంస్థ సిమ్‌కార్డులు అమ్మటానికి కేంద్ర ప్రభుత్వ జిఎస్టి లైసెన్స్ తీసుకున్నారు. అయితే గత ఆరునెలలుగా వ్యాపారంలో వృద్ధి లేకపోవటంతో జిఎస్టి లైసెన్స్‌ను రద్దు చేయాల్సిందిగా దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తును పరిశీలించిన సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ కళ్యాణ చక్రవర్తి రూ.2 వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు హరికృష్ణ సీబీఐ అధికారులను ఆశ్రయించాడు. విషయం తెలుసుకున్న సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. హరికృష్ణ సెంట్రల్ ఎక్సైజ్ అధికారి కళ్యాణ చక్రవర్తి కి రెండు వేల రూపాయలు లంచం ఇస్తుండగా సిబిఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి కళ్యాణ చక్రవర్తిని సీబీఐ కోర్టుకు తరలించారు. కాగా అధికారి వేధింపులు భరించలేకే సీబీఐని ఆశ్రయించానని హరికృష్ణ తెలిపాడు. -
ఏసీబీ వలలో అసిస్టెంట్ పెన్షన్ ఆఫీసర్
మల్కాజిగిరి: పెన్షన్ బకాయిలు విడుదల చేసేందుకు లంచం డిమాండ్ చేసిన అసిస్టెంట్ పెన్షన్ ఆఫీసర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ బీవీ సత్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తార్నాకలోని ప్రశాంత్‌నగర్ రైల్వే క్వార్టర్స్‌లో పెన్సన్ పేమెంట్ కార్యాలయంలో బీఎన్ రెడ్డి నగర్‌కు చెందిన కేపీ నాయక్ అసిస్టెంట్ పెన్సన్ పేమెంట్ అధికారిగా పనిచేస్తున్నాడు. మల్కాజిగిరికి చెందిన అనూషాబాయి భర్త ఆర్.సుబ్బూలాల్ ఆర్ అండ్‌బీ విభాగంలో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తూ 2012 సెప్టెంబర్‌లో మృతి చెందాడు. తన భర్త పెన్షన్ బకాయి రూ.1.10 లక్షలు విడుదల చేయాలని కోరుతూ ఆమె కె.పి.నాయక్‌ను సంప్రదించింది. అయితే బకాయిలు విడుదల చేయాలంటే అందులో 15 శాతం లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను అంత ఇవ్వలేనని రూ.7 వేలు ఇస్తానని చెప్పడంతో కేపీ నాయక్ అందుకు అంగీకరించాడు. ఈ నెల 8న అనూషాబాయి తన కుమారుడు కిరణ్‌కుమార్‌తో కలిసి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం గురువారం మధ్యాహ్నం కార్యాలయంలో కిరణ్‌కుమార్ నుంచి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి కేపీ నాయక్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వరరావు, రవీంద్రారెడ్డి, రఘునందన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
పైసలివ్వందే ఇక్కడ పని జరగదు!
సాక్షి, నంద్యాల : నంద్యాల పట్టణ శివారులోని కర్నూలు–కడప జాతీయ రహదారి పక్కనున్న రవాణా శాఖ (ఆర్టీఓ) కార్యాలయంలో పైసలివ్వందే ఏ పనీ జరగడం లేదు. డ్రైవింగ్ లైసెన్స్ మొదలుకుని ప్రతి పనికీ ఓ రేటు కట్టి మరీ వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏజెంట్ల వ్యవస్థను రద్దు చేసినప్పటికీ ఇక్కడి అధికారులు అనధికారికంగా ఏజెంట్లను నియమించుకుని వసూళ్ల దందా సాగిస్తున్నారు. వారి ఆగడాలు శ్రుతిమించడంతో వ్యవహారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాకా వెళ్లింది. దీంతో ఏసీబీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించి..క్లర్క్‌తో పాటు నలుగురు అనధికారిక ఏజెంట్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.39 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన క్లర్క్ దత్తాత్రేయ నంద్యాల పట్టణానికి చెందిన కరీం అనే వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం అనధికారిక ఏజెంట్ల ద్వారా కాకుండా నేరుగా దరఖాస్తు చేసుకున్నాడు. అతను అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పని కాలేదు. చివరకు కార్యాలయంలో క్లర్క్‌గా పని చేస్తున్న దత్తాత్రేయను కలిశాడు. డబ్బు ఇస్తేనే పని అవుతుందని ఆయన కరాఖండీగా చెప్పాడు. రూ.2,500 ఇవ్వడానికి అతను అంగీకరించగా.. అది చాలదని, అదనంగా ఇవ్వాలని క్లర్క్ డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు వల పన్ని పట్టుకోవడానికి ప్రణాళిక రచించారు. ఈ క్రమంలో బుధవారం కార్యాలయంలోకి బాధితుడిని పంపారు. అతను క్లర్క్ దత్తాత్రేయను కలిసి రూ.2,500 ఇచ్చాడు. మిగతా డబ్బు ఏదని క్లర్క్ అడగ్గా.. బయటకు వెళ్లి తీసుకొని వస్తానని చెప్పాడు. ఇంతలోనే ఏసీబీ అధికారులు కార్యాలయంలోకి వచ్చి క్లర్క్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలోకి ఎవరినీ రానివ్వకుండా, లోపలున్న వారిని బయటకు పంపించకుండా సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆర్టీఓ కార్యాలయ అధికారులు అనధికారికంగా నియమించుకున్న ఏజెంట్లు నరసింహ, సోమేశ్వరరెడ్డి, రమేష్, బాషాలను అదుపులోకి తీసుకుని విచారించారు. వీరి వద్ద రూ.39,020 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో బాషా అనే ఏజెంట్ ఏసీబీ అధికారుల కన్నుగప్పి బయటకు పారిపోయాడు. క్లర్క్‌తో పాటు మిగతా ముగ్గురిని తమ అదుపులో ఉంచుకున్నారు. సోమేశ్వరరెడ్డి అనే ఏజెంట్ స్వయాన బ్రేక్ ఇన్స్పెక్టర్ వాహన డ్రైవర్ కావడం గమనార్హం. -
విద్యుత్ మీటరుకు రూ.10,000 లంచం డిమాండ్
సాక్షి, గుంటూరు: విద్యుత్ మీటరుకు వినియోగదారుడి నుంచి రూ.10 వేలు డిమాండ్ చేసి, అతని నుంచి రూ.5000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి లైన్‌మన్‌ను అదుపులోకి తీసుకున్న సంఘటన సోమవారం మండలంలోని తురకపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు తురకపాలెం గ్రామానికి చెందిన కావూరి పూర్ణచంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కావూరి పూర్ణచంద్రరావు తన ఇంటికి విద్యుత్ మీటరు కోసం లైన్‌మన్ డేవిడ్‌ను సంప్రదించారు. విద్యుత్ మీటరు కావాలంటే రూ.10 వేలు మీటరు బిల్లుకు అదనంగా చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీంతో మూడు నెలలుగా లైన్‌మన్ చుట్టూ తిరిగిన పూర్ణచంద్రరావు తాను కూలీ పనులు చేసుకునే వాడినని, అంత ఇవ్వలేనని చెప్పగా అందుకు ససేమిరా అని లైన్‌మన్ చెప్పటంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో బాధితుడు లైన్‌మన్‌ను బతిమాలుకుని రూ.5వేలు ముందు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నాడు. దీంతో సోమవారం సాయంత్రం గ్రామంలోని తన ఇంటి వద్దకు రావాలని లైన్‌మన్ చెప్పటంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో ఏసీబీ అడిషనల్ ఎస్పీ అల్లంగి సురేష్‌బాబు, సీఐ శ్రీధర్ సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకుని బాధితుడి నుంచి లైన్‌మన్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. లైన్‌మన్‌పై కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించారు. -
ఏసీబీ వలలో కో ఆపరేటివ్ ఇన్స్పెక్టర్
బాలానగర్: రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారుల వలలో ఓ అవినీతి చేప పడింది. ఏసీబీ డీఎస్పీ సూర్య నారాయణ తెలిపిన వివరాల ప్రకారం... గండిమైసమ్మ సాయినగర్ కో ఆపరేటివ్ సొసైటీలో ఏడాదికోసారి ఆడిటింగ్ చేసి కోఆపరేటìవ్ అధికారులు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు గాను సాయినగర్ సొసైటీ చైర్మన్ భూమిరెడ్డి దగ్గర మేడ్చల్ జిల్లా కోఆపరేటివ్ సీనియర్ ఇన్స్పెక్టర్ చంద్రకిరణ్ లంచం డిమాండ్ చేయగా.. అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. లంచం అడిగిన సదరు కో ఆపరేటివ్ ఇన్స్పెక్టర్ను పట్టుకొనేందుకు ఏసీబీ అధికారులు వల పన్నారు. వారి సూచన మేరకు సోమవారం హెచ్‌ఏఎల్‌లోని సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ కార్యాలయానికి డబ్బు తీసుకొనేందుకు రావాలని కో ఆపరేటివ్ ఇన్స్పెక్టర్ చంద్రకిరణ్‌ను భూమిరెడ్డి పిలిచాడు. చంద్రకిరణ్ వచ్చి రూ. 20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. విచారణ అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. దాడుల్లో ఆరుగురు సీఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
రూ.లక్ష ఇస్తే పీటిన్!
సాక్షి, సిటీబ్యూరో: భారీ మొత్తం తీసుకుని ఒకరి ఇంటిపై వేరే వారికి అక్రమంగా ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (పీటిన్) సృష్టించి ఇచ్చిన జీహెచ్ఎంసీ ఉద్యోగితో పాటు అతడికి సహకరించిన వ్యక్తినీ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. 2016లో అప్పటి రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. ఏదైనా ఓ ప్లాట్‌లో ఇల్లు కట్టిన తర్వాత ఇంటి నంబర్ ఇవ్వడానికి ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (పీటిన్) జీహెచ్ఎంసీ క్రియేట్ చేస్తుంది. అందుకు గాను సదరు యజమాని సేల్‌డీడ్ తదితరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ప్రాసెసింగ్ జరిగి, అధికారులు అన్నీ సరిచూసిన తర్వాతే పీటిన్ కేటాయిస్తారు. రాజేంద్రనగర్‌లోని ప్రేమావతిపేటలో ఉన్న ఓ ఆస్తిపై కొందరి మధ్య వివాదం ఉంది. దీనిని కాజేయాలని చూసిన ముగ్గురు బోగస్ పత్రాల సాయంతో రాజేంద్రనగర్ అధికారులను సంప్రదించి పీటిన్ కోసం దరఖాస్తు చేశారు. ఇది తిరస్కారానికి గురికావడంతో వీరు అల్వాల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ విధానంలో కంప్యూటర్æ ఆపరేటర్‌గా పని చేస్తున్న జయ చంద్ర వెలగను సంప్రదించారు. రూ.లక్ష తీసుకున్న అతగాడు అక్రమంగా రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ సర్వర్లోకి చొరబడి ఆ ముగ్గురి పేరుతో ఆస్తి ఉన్నట్లు పీటిన్ సృష్టించి ఇచ్చాడు. ఇలా పొందిన పత్రంతో వారు సదరు స్థలాన్ని విక్రయించారు. ఈ విషయం తెలిసిన ఆస్తి యజమాని రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 2016లో కేసు నమోదైంది. సైబర్ క్రైమ్ ఏసీపీ సీహెచ్‌వై శ్రీనివాస్‌కుమార్ నేతృత్వం లోని బృందం దీన్ని దర్యాప్తు చేసింది. ఈ స్కామ్‌కు బాధ్యుడైన జయ చంద్ర వెలగతో పాటు అతడికి సహకరించిన నాగేంద్ర బాబులను శుక్రవారం అరెస్టు చేశారు. -
మీ స్థలం దక్కాలంటే.. ముడుపు చెల్లించాల్సిందే..
సాక్షి, జగదాంబ / ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): మీ సొసైటీకి సంబంధించిన భూమిపై నిత్యం ఫిర్యాదులు వస్తున్నాయి... వాటిని పరిష్కరించి మీ స్థలాలు మీకు దక్కేలా చేయాలంటే... ఓ 200 గజాల స్థలం నా తమ్ముడి పేరున రిజిస్ట్రేషన్ చేయించండి... లేదంటే మీ ఇష్టం... మీ స్థలాలు ఇబ్బందుల్లో పడతాయి... వాటిని రద్దు చేస్తానని బెదిరించిన సహకార శాఖ రిజిస్ట్రార్ బి.మోషా ఏసీబీ అధికారులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే... పశు సంవర్థక శాఖ కో ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీకి హనుమంతువాక సమీపంలో 18 ఎకరాల 78 సెంట్లు స్థలం ఉంది. ఈ సొసైటీలో 284 మంది సభ్యులున్నారు. అయితే ఆ సొసైటీలో తన పేరు చేర్చలేదని ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ప్రసాద్ అనే వ్యక్తి సహకార శాఖ రిజిస్ట్రార్ బి.మోషాకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేయించిన మోషా సదరు సొసైటీ ప్రెసిడెంట్ సింహాద్రి అప్పడు, సెక్రటరీలను తన కార్యాలయానికి పిలిపించుకున్నాడు. మీ సొసైటీ స్థలాలకు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయని... మీ స్థలాలు మీకు దక్కాలంటే 200 గజాలు స్థలం తన తమ్ముడి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాలని డిమాండ్ చేశాడు. లేకుంటే వాటిని రద్దు చేస్తానని బెదిరించాడు. దీంతో రిజిస్ట్రేషన్‌కు ఏర్పాట్లు చేస్తూనే బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మంగళవారం టర్నర్ చౌల్ట్రీ వద్ద ఉన్న రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయిస్తుండగా ఏసీబీ డీఎస్పీ రంగరాజు నేతృత్వంలో సిబ్బంది మోషాను, అతని సోదరుడు మల్లిఖార్జునరావును అదుపులోకి తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్లను సీజ్ చేశారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి ఎంవీపీ జోన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరిని బుధవారం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ రంగరాజు తెలిపారు. ఆ స్థలం విలువ మార్కెట్లో కోటి రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రిజిస్ట్రార్ మోషా ఇంటిలో సోదాలు సొసైటీ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ ఏసీబీకి చిక్కిన సహకార శాఖ రిజిస్ట్రార్ బి.మోషా ఇంటిలో ఏసీబీ సీఐ అప్పారావు మంగళవారం సోదాలు నిర్వహించారు. లాసెన్స్ బే కాలనీలో ఉన్న నివాసంలో అతని మేనల్లుడుని విచారించి, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. పలు ఖాళీ డాక్యుమెంట్లతోపాటు బినామీలు, బంధువులు పేరు మీద ఉన్న డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. -
నాలుగో సింహం... అడుగడుగునా లంచం!
సాక్షి, సిటీబ్యూరో: ఫ్రెండ్లీ పోలీసింగ్ సహా ఉన్నతాధికారులు ఎన్ని విధానాలు అమలులోకి తీసుకువస్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది తీరులో మాత్రం మార్పు రావడం లేదు. అదును చూసుకుని లంచాలు లాగిస్తున్నారు. ఓ విధానానికి చెక్ పడితే మరో పంథాలో తమ ‘పని’ పూర్తి చేసుకుంటున్నారు. నగర పోలీసు కమిషనÆóరేట్ పరిధిలో వరుసగా జరుగుతున్న ఏసీబీ దాడులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. బొల్లారం ఠాణా సబ్–ఇన్స్పెక్టర్ (ఎస్సై), కానిస్టేబుళ్లను ఏసీబీ అధికారులు సోమవారం ట్రాప్ చేశారు. ఈ ఘటన మరిచిపోకముందే గురువారం మొఘల్‌పుర ఎస్సై బాబు రూ.30 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. సకల సౌకర్యాలు కల్పించినా... ఒకప్పుడు పోలీసుస్టేషన్లు భూత్ బంగ్లాలను తలపించేవి. అధికారులు, సిబ్బంది తిరిగేందుకు సరైన వాహనాలు కూడా ఉండేవి కాదు. కీలక కేసుల దర్యాప్తు కోసం ఆర్థిక సహాయం దొరికేది కాదు. ఈ పరిస్థితులకు తోడు ‘స్వకార్యం’లో భాగంగా అవినీతి రాజ్యమేలేది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన నిందితుడే కాకుండా బాధితుడూ బోరుమనే పరిస్థితులు ఉండేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు విభాగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఓ పక్క మౌళిక వసతులు మెరుగవడంతో పాటు టెక్నాలజీ వినియోగం, నెలసరి ఠాణాల నిర్వహణ ఖర్చులు అందించడం తదితర చర్యలు చేపట్టారు. దీనికి తోడు పనితీరును మందించడం, ఎక్కడిక్కడ పరిశీలనలతో అధికారులు, సిబ్బంది తీరులో మార్పు వస్తుందని భావించారు. సిటీ నుంచే ఏరివేత... రాష్ట్రం ఏర్పడిన తర్వాత నగర పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి సిబ్బంది, అధికారుల అవినీతిపై దృష్టి సారించారు. స్టేషన్ ఖర్చుల నిమిత్తం ప్రతి నెలా రూ.75 వేలు మంజూరు చేస్తూ ‘కలెక్షన్స్’ విధానాన్ని పారద్రోలాలని భావించారు. అంతేగాక 2015లోనే అవినీతి నిరోధక చర్యలు ప్రారంభించిన ఆయన సిటీలో ఉన్న వసూల్ రాజాలపై దృష్టి పెట్టారు. నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్ ద్వారా లోతుగా ఆరా తీయించి, దాదాపు 100 మందితో కూడిన జాబితాను రూపొందించారు. వీరిని సిటీ ఆరŠడ్మ్ రిజర్వ్ విభాగానికి బదిలీ చేయించారు. దీంతో మామూళ్లు, వసూళ్లు కొంత మేరకు తగ్గాయి. అయితే ‘అధిక సొమ్ముకు’ అలవాటుపడిన కొందరు కింది స్థాయి అధికారులుతమ పని తీరును మార్చుకోవట్లేదు. డబ్బు కోసం కేసుల్లోనే కక్కుర్తి దందాలు ప్రారంభించారు. బాధితులు, నిందితులు అనే తేడా లేకుండా చాన్స్ దొరికినప్పుడల్లా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏసీబీ అదుపులో మొఘల్‌పురా ఎస్సై యాకుత్‌పురా: బైండోవర్ కాకుండా చూసేందుకు రూ.30 వేలు లంచం డిమాండ్ చేసిన మొఘల్‌పురా ఎస్సై బాబును గురువారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీలు శ్రీనివాసులు, శ్రీకాంత్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అత్తాపూర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ రహీం శాలిబండలో మెన్స్‌వేర్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా రహీంకు కాంప్లెక్స్‌లోని ఇతర దుకాణదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇరు వర్గాలు ఇటీవల ఘర్షణ పడటంతో మొఘల్‌పురా పోలీసులు మహ్మద్ అబ్దుల్ రహీం, సోదరుడు ఖయ్యూంపై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా రహీంను ఆర్డీఓ కోర్టులో బైండోవర్ చేయాల్సి ఉంది. బైండోవర్ చేయకుండా చూసేందుకుగాను రహీం మొఘల్‌పురా ఎస్సై బాబును ఆశ్రయించగా, అతను రూ.30 వేలు డిమాండ్ చేశాడు. రహీం దీనిపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో గురువారం మధ్యాహ్నం పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై బాబు రహీం నుంచి రూ.30 వేలు నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు శ్రీధర్, హరీష్ పాల్గొన్నారు. కాదేదీ వసూలుకు అనర్హం... ♦ ఈ లంచాలు తీసుకోవడంలో అధికారులు కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. కేసును బట్టి, నిందితులు, బాధితుల తీరుతెన్నులను బట్టి వసూళ్లు ఉంటున్నాయి. గడిచిన ఏడాది కాలంలో ఏసీబీకి చిక్కిన వారి కేస్‌స్టడీలే ఇందుకు నిదర్శనం. ♦ ఆసిఫ్‌నగర్ ఎస్సై గౌస్ ఖాన్ రూ.25 వేలు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డాడు. పాన్‌మసాలాలు సరఫరా చేసే వ్యాపారిని నెలవారీ మామూళ్లు డిమాండ్ చేసిన గౌస్ ఖాన్ కొంత మొత్తం తీసుకున్నప్పటికీ అదనంగా డిమాండ్ చేసి అడ్డంగా దొరికేశాడు. ♦ పాతబస్తీలోని మహిళా ఠాణాలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రవికుమార్ భార్యభర్తల మధ్య పంచాయితీకి సంబంధించి నమోదైన కేసులో భర్తకు స్టేషన్ బెయిల్ ఇప్పిస్తానంటూ చెప్పి రూ.30 వేలు డిమాండ్ చేసి ఏసీబీ చిక్కారు. ♦ చిలకలగూడ ఠాణా డిటెక్టివ్ ఎస్సై సీహెచ్ వెంకటాద్రి, కానిస్టేబుల్ రాజేష్ గత జూలైలో ఓ చోరీ కేసులో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించడంతో పాటు రికవరీ చేసిన బైక్‌ను ఫిర్యాదుదారులకు తిరిగి ఇవ్వడానికీ డబ్బు డిమాండ్ చేసి అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. ♦ హుమాయూన్‌నగర్ పోలీసుస్టేషన్ ఎస్సై సీహెచ్ శ్రీకాంత్, కానిస్టేబుల్ మహ్మద్ రహీం పాషా రూ.20 వేలు లంచం తీసుకుంటూ దొరికారు. ఓ కేసులో నిందితుడిని అరెస్టు చేసిన తర్వాత పోలీసు కస్టడీకి తీసుకున్నప్పుడు అతడికి కొట్టకుండా ఉండటానికి, బెయిల్ పొందడానికి సహకరించడానికీ రూ.లక్ష డిమాండ్ చేశారు. ♦ రూ.80 వేలు తీసుకున్నప్పటికీ మిగిలిన మొత్తం కోసం వేధించి పట్టుబడ్డారు. ♦ చైతన్యపురి ఎస్సై ఈరోజి రూ.20 వేలు తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు. ఓ మైనర్ బాలికను వేధిస్తున్న కేసులో న్యాయ వాదిపై కేసు నమోదైంది. దీని దర్యాప్తు పూర్తి చేసి, న్యాయస్థానం అభియోగపత్రాలు దాఖలు చేయడానికి ఈరోజి లంచం డిమాండ్ చేశాడు. ♦ బొల్లారం ఎస్సై బ్రహ్మచారి, కానిస్టేబుల్ నగేష్ ఓ దాడి కేసులో ముందస్తు బెయిల్ తీసుకునే విషయంలో నిందితుడికి సహకరించడానికి రూ.20 వేలు డిమాండ్ చేసి పట్టుబడ్డారు. ♦ ఓ వ్యక్తిని బైండోవర్ చేసే విషయంలో అతడికి అనుకూలంగా వ్యవహరించడానికి మొఘల్‌పుర ఎస్సై బాబు రూ.30 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికేశారు. -
ఏసీబీ వలలో బొల్లారం ఎస్ఐ, కానిస్టేబుల్
తిరుమలగిరి: ఓ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.20 వేలు లంచం తీసుకున్న బొల్లారం ఎస్సై బ్రహ్మచారి, కానిస్టేబుల్ నగేష్‌లను సోమవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ హైదరాబాద్ రేంజ్–2 డీఎస్పీ అచ్చేశ్వర్ రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బొల్లారం, ఆదర్శనగర్‌కు చెందిన నర్సింగ్‌రావు బ్యాండ్‌మేళం నిర్వహించేవాడు. గతంలో అతడి వద్ద పనిచేసే వర్గల్‌కు చెందిన గోపి అనే వ్యక్తి ఏడాది క్రితం రూ.18 వేలు అడ్వాన్స్‌గా తీసుకుని పనిలోకి రావడం లేదు. ఈ నెల 2న అతను రోడ్డుపై కనిపించడంతో నర్సింగ్ రావు పనికి ఎందుకు రావడం లేదని నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో నర్సింగ్‌రావు అతడిపై చేయిచేసుకున్నాడు. దీంతో గోపి ఈ నెల 3న బొల్లారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ నిమిత్తం అతడిని స్టేషన్‌కు పిలిచినా రాకుండా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేశాడు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ నగేష్ ద్వారా ఎస్సై బ్రహ్మచారితో సంప్రదింపులు జరపగా ఎస్ఐ రూ. 20వేలు డిమాండ్ చేశాడు. ఈ నెల 13న కానిస్టేబుల్ నగేష్‌కు నర్సింగ్ రావు భార్య అంబికా మొదటి విడతగా రూ.10వేల నగదు అందజేసింది. రెండు రోజుల్లో మిగతా మొత్తాన్ని ఫోన్ పే ద్వారా చెల్లించాలని సూచిస్తూ వాట్సాప్‌లో అకౌంట్ నంబర్ పంపాడు. దీంతో ఆమె రూ.10వేలు బదిలీ చేసింది. అనంతరం కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి ఈ విషయాన్ని ఎస్సైకి చెప్పాలని కోరగా, నగేష్, ఎస్సైతో కాన్ఫరెన్స్ కాల్ ఏర్పాటు చేయడంతో ఆమె నేరుగా ఈ విషయాన్ని ఎస్ఐ బ్రహ్మాచారికి చెప్పింది. అయితే డబ్బులు తీసుకున్నా బెయిల్ ఇవ్వకపోగా టీఆర్ఎస్ నేత వేణుగోపాల్‌రెడ్డిని తీసుకుని స్టేషన్‌కు రావాలని ఎస్సై సూచించాడు. దీనికితోడు మరోసారి అతడి ఇంటికి వచ్చిన కానిస్టేబుల్ నాగేష్ రూ.5వేలు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సీసీ కెమెరా పుటేజీతో పాటు ఫోన్లోని వాట్సాప్, ఆడియోల ఆధారంగా సోమవారం బొల్లారం పోలీస్ స్టేషన్లో ఎస్సై బ్రహ్మాచారి, కానిస్టేబుల్ నగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ కక్షతోనే కేసు ... రాజకీయంగా కక్షతోనే తన భర్తపై ఎస్సై కేసు నమోదు చేశారని నర్సింగ్‌రావు భార్య అంబిక ఆరోపించింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినందునే తమపై అక్రమంగా కేసు బనాయించారని పేర్కొంది. ఫిర్యాదుదారుడు గోపి రాజీకి వచ్చినా, ఎస్సై కుట్రపూరితంగా వ్యవహరించాడని ఆరోపించింది. స్టేషన్ బెయిల్ రావాలంటే టీఆర్ఎస్ నాయకులను తీసుకుని రావాలని చెప్పడంతో తాము ఏసీబీని ఆశ్రయించినట్లు ఆమె పేర్కొంది. -
ఏసీబీకి చిక్కిన కానిస్టేబుళ్లు
ఎన్ఏడీ జంక్షన్ (విశాఖ పశ్చిమ): రక్షక భటులు భక్షక భటులుగా మారిపోతున్నారు. ఏమాత్రం అవకాశం దొరికినా బాధితుల నుంచి దోచుకునేందుకు వెనుకాడడం లేదు. ఇందుకు మంగళవారం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో వెలుగుచూసిన ఘటనే నిదర్శనం. కేసు పెట్టడానికి ఏమాత్రం అవకాశం లేని ఆనంద్ అనే వ్యక్తిని బెదిరించి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా కానిస్టేబుల్ బంగారు నాయుడు, రైటర్ మహంతి శ్రీనువాసరావులను ఏసీబీ అధికారులు రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఎస్.రంగరాజు తెలిపిన వివరాల ప్రకారం... ఇటీవల గోంగూర హోటల్ వద్ద ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఆనంద్ కుమార్‌ను పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. ఆనంద్‌కుమార్‌పై స్టీల్‌ప్లాంట్‌లో చీటింగ్ కేసులున్నాయి. అక్కడి వారికి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడని ఫిర్యాదు ఉంది. దీనిపై గోంగూర హోటల్ వద్ద గొడవ జరిగింది. అయితే ఆనంద్‌కుమార్‌పై ఇక్కడ కూడా కేసులు పెడతామని ఎయిర్పోర్ట్ స్టేషన్ పోలీసులు బెదిరించారు. కేసులు పెట్టకుండా ఉండాలంటే రూ.30 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మే 31న రూ.15వేలు ఆనంద్ ఇచ్చాడు. మిగిలిన రూ.15వేలు ఇవ్వాలంటూ వేధిస్తుండడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్రణాలిక ప్రకారం ఏసీబీ అధికారులు సమకూర్చిన రూ.15వేలును కానిస్టేబుల్ బంగారు నాయుడుకు ఆనంద్ ఇచ్చాడు. ఆ సొమ్మును రైటర్ శ్రీనుకి బంగారునాయుడు ఇచ్చాడు. దీంతో ఏసీబీ అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనిపై విచారించగా సీఐ జెర్రిపోతుల శ్రీనివాసరావు చెప్పిన ప్రకారమే డబ్బులు తీసుకున్నామని మహంతి శ్రీను, బంగారునాయుడు చెబుతున్నారు. సీఐ ప్రమేయంపై విచారణ చేపడుతున్నామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరినీ అరెస్ట్ చేశామని తెలిపారు. -
అవినీతి అధికారుల ఆటకట్టు
నగరంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు కొరడా ఝలిపించారు.మంగళవారం ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో డబ్బులు డిమాండ్ చేసిన ముగ్గురు అవినీతి అధికారులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు. వివరాల్లోకి వెళితే.. మియాపూర్ : విద్యుత్ మీటర్ మంజూరుకుగాను డబ్బులు డిమాండ్ చేసిన మియాపూర్ ట్రాన్స్‌కో ఏడీఈ, సబ్ ఇంజినీర్‌ను మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ రేంజ్ అధికారి డీఎస్పీ సూర్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హెలియోస్ సోలార్ రూప్ ట్యాప్ ప్యానల్స్ సంస్థ మియాపూర్‌లోని భవ్య శ్రీ సూర్య అపార్ట్మెంట్లో సోలార్ రూప్ ట్యాప్ ప్యానల్స్ ఏర్పాటు చేసేందుకుగాను సంస్థ ప్రతినిథి కిషోర్ నెట్ మీటర్ కోసం ఏడీఈ ధరావత్ రమేష్‌ను సంప్రదించాడు. ఇందుకు అతను రూ.3500 ఇవ్వాలని డిమాండ్ చేయడంతో కిషోర్ ఏసీపీ అధికారులను సంప్రదించాడు. ఏసీపీ అధికారుల సూచనమేరకు పథకం ప్రకారం మంగళవారం ఉదయం కిషోర్ ఏడీఈకి రూ.3500 నగదు ఇచ్చేందుకు కార్యాలయానికి రాగా, సబ్ ఇంజినీర్ పాండుకు ఇవ్వాలని సూచించాడు. దీంతో కిషోర్ పాండుకు డబ్బులు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సబ్ ఇంజనీర్ పాండును విచారించగా ఏడీఈ రమేష్ సూచన మేరకే నగదు తీసుకున్నట్లు తెలిపాడు. దీంతో అధికారులు ఏడీఈని విచారించగా నేరం అంగీకరించాడు. దీంతో వారిద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు. దాడుల్లో సీఐలు నాగేంద్రబాబు, రామలింగారెడ్డి, గంగాధర్, మజీద్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. 2008లోనే అరెస్ట్ గోదావరిఖనికి చెందిన దరావత్ రమేష్ గతంలో బాచుపల్లి ఏఈగా, ఎర్రగడ్డలో మాస్టర్ ప్లాన్ అధికారిగా విధులు నిర్వహించారు. మూడు నెలల క్రితం మియాపూర్ మదీనాగూడలోని సబ్ స్టేషన్‌లోని ఏడీఈగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2008లో బాచుపల్లిలో ఏఈగా పనిచేస్తుండగా రూ.2 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీకి చిక్కినజలమండలి అధికారి అబిడ్స్: ఓ ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటున్న జలమండలి అకౌంట్స్ విభాగం సూపరింటెండెంట్‌ను ఏసీబీ అధికారులు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జలమండలి మొగల్పురా సెక్షన్లో బొల్లిశ్రీహరి జనరల్ పర్పస్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అతను గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న వేతనం, పీఆర్సీ బకాయిల కోసం గోషామహాల్ జలమండలి అకౌంట్ సెక్షన్లో సూపరింటెండెంట్ మహ్మద్ అహ్మద్‌ను సంప్రదించాడు. బిల్లు మంజూరు చేసేందుకు అహ్మద్‌తో రూ. 4 వేలు డిమాండ్ చేశాడు. బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. వారి సూచన మేరకు మంగళవారం శ్రీహరి అహ్మద్‌కు రూ. 4 వేలు నగదు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.4 వేలు స్వాధీనం చేసుకుని ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. -
ఖాకీ.. ఇదేం పని..?
అనంతపురం సెంట్రల్: అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాల్సిన పోలీసుల్లో కొందరు సొమ్ములకు ఆశపడి దిగజారుడుగా వ్యవహరిస్తూ పోలీసు శాఖకు తలవంపులు తీసుకొస్తున్నారు. ఓ లాడ్జిలో కనిపించిన ఇద్దరు మహిళలను కేసుల పేరుతో బెదిరించి, నగదు డిమాండ్ చేసి.. చివరికి వారి చేతుల్లో ఉన్న బంగారు గాజులు లాక్కుని వదిలేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరంలోని సరోజినీ రోడ్డులో గల ప్రముఖ లాడ్జిలోకి సోమవారం ఇద్దరు మహిళా ఉద్యోగులు వెళ్లారు. వీరు గౌరవప్రదమైన వృత్తుల్లో కొనసాగుతున్నారు. సదరు మహిళలు లాడ్జిలోకి ప్రవేశించి లిఫ్ట్ గది వద్ద వేచి చూస్తున్నారు. అంతలోగా మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి లిఫ్ట్‌లో వెళ్లడానికి సిద్ధమయ్యారు. అప్పటికే అక్కడ నిఘా వేసి ఉన్న టూటౌన్ పోలీసుస్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు గమనించారు. కానిస్టేబుళ్లను చూడగానే ఇద్దరు వ్యక్తులు లాడ్జి నుంచి పారిపోయారు. కానీ మహిళలు పారిపోయేందుకు వీలు కాకపోవడంతో లాడ్జిలోంచి బయటకు వచ్చి వెనుక వైపు ఓ షాపింగ్‌మాల్‌కు చెందిన వాహనాల పార్కింగ్ స్థలంలోకి వెళ్లారు. కానిస్టేబుళ్లు కూడా వారి వద్దకు చేరుకున్నారు. బెదిరించి.. గాజులు లాక్కుని.. మీరు స్టేషన్‌కు రావాల్సి ఉంటుందని సదరు మహిళలను కానిస్టేబుళ్లు బెదిరించారు. సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతున్న ప్రభుత్వ ఉద్యోగినులు బెంబేలెత్తిపోయారు. స్టేషన్ వరకు వెళ్తే జీవితాలు నాశనం అవుతాయని, కుటుంబాలు వీధిన పడతాయని ప్రాధేయపడ్డారు. ఇదే అదనుగా భావించిన కానిస్టేబుళ్లు వారి నుంచి డబ్బు డిమాండ్ చేశారు. ఆ క్షణంలో వారి వద్ద నగదు లేకపోవడంతో చేతుల్లోని బంగారు గాజులను కానిస్టేబుళ్లు లాగేసుకుని వదిలేశారు. చర్చనీయాంశమైన కానిస్టేబుళ్ల తీరు మహిళా ఉద్యోగులు లాడ్జిలో తప్పు చేస్తూ రెడ్‌హ్యాండ్‌గా ఏమీ పట్టుబడలేదు. కేవలం లిఫ్ట్‌లో మాత్రమే ప్రయాణించారు. ఒకవేళ వారికి వివాహేతర సంబంధాలున్నట్లు అనుమానం ఉంటే స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేయాలి. తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ కానిస్టేబుళ్లు బంగారు గాజులు లాక్కుని వారిని వదిలేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపితే అసలు నిందుతులు బయటపడే అవకాశాలు ఉన్నాయి. దిగజారుడుగా వ్యవహరించిన కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకుంటారా? లేదా అన్నది కూడా వేచి చూడాలి. -
ఆగని అక్రమాలు
సాక్షి, సిటీబ్యూరో: అవినీతికి పాల్పడినా, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినా తగిన చర్యలంటూ లేకపోవడంతో జీహెచ్ఎంసీలో అక్రమాలు ఆగడం లేదు. ఇందుకు ఊతమిస్తూ తాజాగా సోమవారం కూకట్పల్లి బిల్ కలెక్టర్ మహేంద్రనాయక్ రూ.36 వేలు లంచంతీసుకుంటూ ఏసీబీకి దొరికాడు. ఓ ఎలక్ట్రానిక్ దుకాణానికి ఆస్తి పన్ను తగ్గించేందుకు ఈ మొత్తం డిమాండ్ చేశాడు. ఇటీవల ఆస్తి పన్ను మదింపు, మ్యుటేషన్ల పేరుతో ఆయా సర్కిళ్లలో పలువురు పట్టుబడినప్పటికీ ట్యాక్స్ సెక్షన్ సిబ్బంది మారలేదని చెప్పడానికి ఇదే ఉదాహరణ. వసూళ్లలో వ్యత్యాసాన్ని తగ్గించేందుకు రూ.1200 నుంచి రూ.లక్ష వరకు ఆస్తి పన్ను ఉన్న దుకాణాలను తనిఖీలు చేసి చెల్లింపుల్లో తేడాలుంటే సవరించాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ ఈ నెల తొలి వారంలో ఆదేశించారు. నెలాఖరులోగా తనిఖీలు పూర్తి చేయాలన్నారు. ఆయా దుకాణదారుల నుంచి డబ్బులు తీసుకుంటున్న పలువురు ట్యాక్స్ సెక్షన్ సిబ్బంది... ఈ చర్యలతో తమ పై ఆదాయానికి అడ్డుకట్ట పడుతుందని భావించారు. ఈ నేపథ్యంలో ఎండలు ఎక్కువగా ఉన్నాయనే సాకుతో తనిఖీలు చేయలేమని, వచ్చే నెలలో చేస్తామని కమిషనర్‌కు విన్నవించారు. అయినప్పటికీ ఉదయం, సాయంత్రం వేళల్లో తనిఖీలు చేయాలని ఆయన సూచించారు. చేతివాటానికి అలవాటు పడిన సిబ్బంది తమకు అప్పగించిన బాధ్యతల్ని నెరవేర్చే క్రమంలోనూ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏళ్లుగా ఇంతే... జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను మదింపులో అక్రమాలు ఏళ్ల తరబడిగా సాగుతున్నాయి. వారి అక్రమాలతో జీహెచ్ఎంసీకి ఏటా కనీసం రూ.500 కోట్ల వరకు గండి పడుతోందని అంచనా. దుకాణం అసలు విస్తీర్ణం తక్కువగా చూపడం, వాణిజ్య భవనాలను నివాస గృహాలుగా పేర్కొనడం తదితర పనులతో జీహెచ్ఎంసీని ముంచుతున్నారు. ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు తాము చేయాల్సిన పనులకు ప్రైవేటు వ్యక్తుల్ని వినియోగించుకుంటూ వేతనాలు కూడా చెల్లిస్తున్నారంటే వారి ఆదాయమెంతో అంచనా వేసుకోవచ్చు. ఇలా ఈజీ మనీతో ముజ్రా పార్టీల్లో పోలీసులకు పట్టుబడిన సంఘటనలు కూడా గతంలో ఉన్నాయి. ఆస్తిపన్ను మదింపు సక్రమంగా జరిగితే ప్రజలపై భారం మోపకుండానే వెయ్యి కోట్ల వరకు ఆస్తి పన్ను వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. అందులో భాగంగానే తొలుత వాణిజ్య దుకాణాలను తనిఖీ చేయాల్సిందిగా కమిషనర్ ఆదేశించారు. అడ్డుకట్ట పడేనా? జీహెచ్ఎంసీలో 20లక్షలకు పైగా భవనాలున్నాయి. ఇందులో 16లక్షల భవనాల నుంచి మాత్రమే ఆస్తిపన్ను వసూలవుతోంది. అందులోనూ వాణిజ్య భవనాలు కేవలం 2.07 లక్షలే ఉండడం, బహుళ వినియోగ భవనాలు దాదాపు 26వేలే ఉండడం నమ్మశక్యంగా లేదు. వీటి యజమానుల నుంచి ఏటా మామూళ్లు తీసుకుంటున్న ట్యాక్స్ సెక్షన్ సిబ్బంది చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విస్తీర్ణాన్ని అసలు కంటే ఎక్కువగా చూపుతూ ఆస్తి పన్ను ఎక్కువ పడుతోందని బెదిరించి, వారి నుంచి మామూళ్లు ముడితే వాస్తవ విస్తీర్ణానికే ఆస్తిపన్ను వేసేవారు ఒకరైతే... ఉన్న విస్తీర్ణం కంటే తక్కువ విస్తీర్ణానికి ఆస్తిపన్ను విధిస్తూ జీహెచ్ఎంసీ కొంపముంచేవారు మరికొందరున్నారు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకే కమిషనర్ వాణిజ్య భవనాల రీసర్వేకు ఆదేశించారు. ఏ రోజుకారోజు తనిఖీలు నిర్వహించి క్షేత్రస్థాయి నుంచే అప్లోడ్ చేసేందుకు మొబైల్ యాప్‌ను కూడా వినియోగంలోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఎన్ని చేసినా జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను విభాగంలో అవినీతికి అడ్డుకట్ట పడుతుంతో లేదోననే అనుమానాలున్నాయి. ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ బిల్ కలెక్టర్ కూకట్పల్లి: ఆస్తి పన్ను తగ్గించేందుకు ఓ షాపు యజమాని వద్ద డబ్బులు డిమాండ్ చేసిన ఓ బిల్ కలెక్టర్‌ను ఏసీబీ అధికారులు సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కూకట్పల్లి సర్కిల్–24లోని ఆస్‌బెస్టాస్‌కాలనీ ప్రాంతంలో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న మహేంద్రనాయక్ కాలనీలోని రాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంకు సంబంధించి ఆస్తి పన్నును తగ్గించేందుకు రూ.36 వేలు డిమాండ్ చేశాడు. దీంతో షాపు యజమాని నాగరాజు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. అధికారుల సూచన మేరకు సోమవారం నాగరాజు మహేంద్రనాయక్‌కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ముడుపులు ఇస్తేనే బండి కదిలేది !
సాక్షి, విజయవాడ: వాణిజ్య పన్నులశాఖ అధికారులు చేసే వాహనాల తనిఖీ(వీటీ)లలో అవినీతి రాజ్యమేలుతోంది. తనిఖీలపై ఉన్నతాధికారుల నియంత్రణ లేకపోవడంతో.. కిందిస్థాయి అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. నిబంధనలు తూ.చ తప్పకుండా పాటించిన డీలర్ల వద్ద డబ్బులు గుంజుతూ ఉండటంతో వారు లబోదిబోమంటున్నారు. ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్‌ను బాదేశారు... విజయవాడ–1 డివిజన్ పరిధిలో ఇబ్రహీంపట్నం సీటీఓ కార్యాలయం అధికారులు సోమవారం రాత్రి ఐరన్ యార్డు వద్ద వీటీ చేశారు. రాజమండ్రికి చెందిన ఒక ఎలక్ట్రికల్ వర్క్స్ చేసే కాంట్రాక్టర్ మహారాష్ట్రలో పనులు చేయిస్తుంటారు. దీనికి చెందిన సరుకు విజయవాడ నుంచి తీసుకెళుతూ బిల్లులన్ని సరిగానే ఉండేటట్లు చూసుకున్నారు. అయితే ఇబ్రహీంపట్నంకు చెందిన ఒక డీసీటీఓ స్థాయి అధికారి ఆ కాంట్రాక్టర్‌ను ఇబ్బంది పెట్టి రూ.40వేలు ముడుపులు తీసుకున్నట్లు సమాచారం. అర్ధరాత్రి డబ్బులు ఇచ్చేదాకా వదిలిపెట్టకపోవడంతో ఆ డీలరు నానా ఇబ్బంది పడి డబ్బులు ఇచ్చి వాహనాన్ని తీసుకువెళ్లారు. తాను ఎంత నిజాయితీగా వున్నా.. తన వద్ద డబ్బులు గుంజడంతో ఆయన ఏసీబీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గతంలో బిల్లులు లేని వాహనాలను వదిలేసి.. గతంలో ఇదే వన్డివిజన్ పరిధిలో నందిగామ సర్కిల్లో డీసీటీఓ సీజ్ చేసిన వాహనాన్నే అక్కడ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి తప్పించిన విషయం విధితమే. అంతకు ముందు బిల్లులు లేకుండా ఉన్న వాహనాల వద్ద ముడుపులు తీసుకుని వదిలివేశారు. నిబంధనలు పాటించని, పాటించిన డీలర్లను ఒకేగాట కట్టేసి ముడుపులు వసూలు చేయడాన్ని డీలర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారులకు వాటాలు ! వాస్తవంగా జీఎస్టీ వచ్చిన కొత్తలో వాహనాల తనిఖీలు(వీటీ)లను రద్దు చేశారు. అయితే తమ ఆదాయం గండిపడటంతో తిరిగి వీటిలకు అనుమతులు ప్రారంభించారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం వరకు వీటీలు చేసినా నామమాత్రంగా జరిమానాలు కట్టిస్తున్నారే తప్ప ప్రభుత్వానికి ఆదాయం వచ్చేడట్లు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. వాహనాలను తనిఖీల పేరుతో తమ జేబుల్ని నింపుకొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా వచ్చిన సొమ్ములో ఉన్నతాధికారులకు వాటాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఉన్నతాధికారులు కూడా వీటిలో జరిగే అవినీతిని పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వాణిజ్యపన్నులశాఖలో ఐదేళ్లుగా బదిలీలు లేకపోవడం సిబ్బందికి అవకాశంగా మారింది. దీర్ఘకాలంగా ఒకే హోదాలో ఒకే చోట పాతుకుపోవడంతో డీలర్ల నుంచి ఏ విధంగా రాబట్టాలో క్షుణంగా తెలియడంతో అందిన కాడికి దండుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. సిబ్బంది పై వచ్చే ఆరోపణలను విచారణ చేయించి చర్యలు తీసుకున్న దాఖాలాలు మాత్రం కనపడటం లేదు.