అక్కన్నపేట తహసీల్దార్ కార్యాలయం
అక్కన్నపేట(హుస్నాబాద్) : రెవెన్యూ లీలలు ఒక్కొకటిగా బయట పడుతున్నాయి. భూ రికార్డుల ప్రక్షాళన శుద్ధీకరణ–నవీకరణ కార్యక్రమంలో వీఆర్వోలు చేతివాటంను ప్రదర్శించారు. గుంట భూమితో సహా రైతుల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేసిన బాగోతంపై రైతులే స్వయంగా ఫిర్యాదులు చేయడం విశేషం. అక్కన్నపేట మండల కేంద్రంతో పాటు పోతారం(జే),రామవరం గ్రామాలకు చెందిన రైతులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేసిన విషయాలు తెలిసిందే.
ఇదిలా ఉండగా మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన విట్టల మల్లయ్య అనే రైతు భూమి సర్వే నెంబర్ 5ఏలో 25గుంటల భూమి ఉంది. పట్టా చేయాలని భూ ప్రక్షాళన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నాడు. రూ.10వేలు ఇస్తే కానీ పట్టా చేయనని వీఆర్వో డిమాండ్ చేయడంతో సదరు రైతు మల్లయ్య రూ.10వేలను సైతం అప్పగించా డు. కానీ నేటికి రైతుకు పట్టా పాసుపుస్తకం ఇవ్వకుండా ఇంకా పైసలు ఇవ్వాలని వీఆర్వో డిమాండ్ చేస్తున్నాడని రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు.
ఆందోళనలతో మోమో
ఏఐవైఎఫ్ నాయకులు ఇటీవల పోతారం(జే) వీఆర్వోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తు తహసీల్ధార్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తహసీల్ధార్ సదరు వీఆర్వోకు మోమోను జారీ చేశాడు. ఒక్క రోజులో వివరణ ఇవ్వాలని, లేకపోతే కలెక్టర్‌కు సమాచారం అందించనున్నట్లు తెలిసింది.పట్టా పాసుపుస్తకం కావాలంటే డబ్బులు అడిగిండు
నాకు 18ఎకరాల 6గుంటల వ్యవసాయ భూమి ఉంది.
రైతుబంధు పథకం ద్వారా కొత్త పట్టా పాసుపుస్తకాలు ఇస్తుండ్రు. కానీ నాకు చెక్కు ఇచ్చారు. పట్టా పాసుపుస్తకం కావాలంటే వీఆర్వో రూ.1500 ఇస్తేనే ఇస్తానంటుండ్రు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకవెళ్లిన, ఎవ్వరు పట్టించుకోవడం లేదు. నాకు న్యాయం చేయాలి. ఎండీ ఖాసీం, రామవరం
Comments
Please login to add a commentAdd a comment