Revenue department
-
ఊరులేని ఊరు: భూముల ధరలు మాత్రం ఆకాశానికి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ఆ ఊరికో పేరుంది. ఊరి పేరున వందల ఎకరాల భూములు రికార్డుల్లో నమోదయ్యాయి. కానీ ఆ ఊళ్లలో ఇళ్లు ఉండవు. మనుషులూ నివసించరు. జనావాసాలు లేకున్నా అవి ఊళ్లే అంటే నమ్మాలి మరి. రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ అవి గ్రామాలుగానే కొనసాగుతున్నాయి. మరికొన్ని ఊళ్లకు పేర్లున్నా.. రికార్డుల్లో మాత్రం లేవు. తాతల కాలం కిందట అక్కడ ఊళ్లు ఉండేవని చెబుతుంటారు. కొన్ని ఊళ్లల్లో ఇళ్లు, కోటలున్న ఆనవాళ్లు ఉండగా, మరికొన్ని చోట్ల ఆలయాలున్నాయి. కామారెడ్డి జిల్లాలోని ఇలాంటి ఊళ్లపై ‘సాక్షి’కథనమిది.⇒ మాచారెడ్డి మండల కేంద్రం పరిధిలో పోలోనిపల్లి అనే పేరుతో ఓ ఊరుంది. అక్కడ అప్పట్లో కొన్ని కుటుంబాలు నివసించేవి. కాలక్రమేణ వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. వ్యవసాయ భూ ములున్నాయి. అక్కడి పురాతన రామాలయం వద్ద తపోవనాశ్రమానికి భక్తులు వచ్చిపోతుంటారు. ⇒ బిచ్కుంద మండలంలో 200 ఏళ్ల కిందట మల్కాపూర్ గ్రామం ఉంండేది. ఇప్పుడు అక్కడ గ్రామం లేదు. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం నమోదైంది. బిచ్కుంద మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలోని ఆ ఊరిలో హనుమాన్ ఆలయం ఉంది. ఏటా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ⇒ గాంధారి మండలంలో బంగారువాడి, కోనాయిపల్లి గ్రామాలుగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. కానీ అక్కడ జనాలెవరూ నివసించరు. వ్యవసాయ భూముల్లో పంటలు మాత్రం సాగవుతున్నాయి. వందల ఏళ్ల కిందట అక్కడ ఊళ్లు ఉండేవని చెబుతారు. ⇒కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని తాడ్వాయి మండలంలో అబ్దుల్లానగర్ పేరుతో రెవెన్యూ రికార్డుల్లో ఊరుంది. వందల ఎకరాల భూములున్నాయి. అక్కడ అన్ని పంట చేలు, గుట్టలు, చెట్లు ఉన్నాయి. ఈమధ్య ఆ ప్రాంతంలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములు కొనుగోలు చేసి వెంచర్లు మొదలుపెట్టారు.⇒ కామారెడ్డి పట్టణ శివార్లలో సరంపల్లి గ్రామ పరిధిలో భూకన్పల్లి అనే ఊరుంది. అక్కడ ప్రఖ్యాత హనుమాన్ ఆలయం ఉంది. సరంపల్లి గ్రామ పరిధిలోకి వచ్చే భూకన్పల్లి హనుమాన్ ఆలయం వద్దకు భక్తులు వస్తుంటారు. సరంపల్లి గ్రామస్తులకు ఇంటి దైవం కూడా. చాలామంది ఆ ఊరి జనం తమ పిల్లలకు అంజయ్య, ఆంజనేయులు, అంజవ్వ, అంజమ్మ అనే పేర్లు పెట్టుకున్నారు. కొన్ని కుటుంబాల్లో అయితే పెద్ద అంజయ్య, చిన్న అంజయ్య అన్న పేర్లు కూడా ఉండడం విశేషం. ⇒ బాన్సువాడలో వాసుదేవునిపల్లి ఉంది. చింతల నాగారం పేర్లతో ఊళ్లున్నాయి. కానీ అక్కడ ఇళ్లు లేవు. మనుషులు ఉండరు. పొలాలు మాత్రమే ఉన్నాయి.⇒ దోమకొండ మండలం లింగుపల్లి సమీపంలో కుందారం అనే గ్రామం రికార్డుల్లో ఉంది. ఇక్కడ ఎలాంటి ఇళ్లు లేవు. ⇒ నస్రుల్లాబాద్ మండలం తిమ్మానగర్ పేరుతో రెవెన్యూ రికార్డుల్లో ఊరుంది. అక్కడ ఎలాంటి నివాసాలు లేవు. పూర్వ కాలంలో కోట ఉన్న ఆనవాళ్లున్నాయి. పాత గుడి ఉండగా, కొత్తగా నిర్మాణం మొదలుపెట్టారు. ⇒ ఇదే మండలంలోని పోశెట్టిపల్లి అనే పేరుతో రికార్డుల్లో ఊరుంది. అక్కడ ఇళ్లు లేవు. వ్యవసాయ భూములున్నాయి. ఈ రెండు ఊళ్ల పరిధిలోని భూములు బొమ్మన్‌దేవ్‌పల్లి గ్రామానికి చెందిన వారికే ఉన్నాయి. కాగా ఆయా గ్రామాలు ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. ఆ గ్రామాల పేరుతోనే పట్టా పాస్ పుస్తకాలు జారీ అవుతాయి.యాభైకి పైగా ఉనికిలో లేని గ్రామాలు కామారెడ్డి జిల్లాలో ఉనికిలో లేని రెవెన్యూ గ్రామాలు యాభైకి పైగా ఉంటాయని అంచనా. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఉనికి కోల్పోయిన ఆ ఊళ్లలో వ్యవసాయం మాత్రం కొనసాగుతోంది. కామారెడ్డి పట్టణానికి సమీపంలోని గ్రామాల్లో అయితే భూముల విలువ విపరీతంగా ఉంది. ఊరులేని ఊరిలో భూముల ధరలు మాత్రం ఆకాశాన్నంటడం విశేషం. -
మళ్లీ ‘రియల్’ డౌన్.. తెలంగాణ వ్యాప్తంగా తగ్గిన రిజిస్ట్రేషన్లు, రాబడులు
సాక్షి, హైదరాబాద్: వరుసగా మూడో నెలలోనూ తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ లావాదేవీలు తగ్గుముఖం పట్టాయి. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో ఏకంగా రూ. 140 కోట్ల ఆదాయం తగ్గిందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే గతేడాదితో పోలిస్తే ఆదాయం విషయంలో రూ. 1,000 కోట్లకుపైగా వెనుకబడి ఉన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ.. గత 3 నెలలుగా తగ్గుతున్న ఆదాయంతో తల పట్టుకుంటోంది. వరుసగా రిజిస్ట్రేషన్ల కార్యకలాపాలు మందగించడంపై ఆందోళన చెందుతోంది. అన్ని జిల్లాల్లోనూ అదే వరుస.. అక్టోబర్ నెలలో పరిస్థితిని చూస్తే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు మందగించాయి. ఆదిలాబాద్ మొదలు హైదరాబాద్ (సౌత్) వరకు 12 రిజిస్ట్రేషన్ జిల్లాల్లో లావాదేవీల సంఖ్య, రాబడి తగ్గింది. గతేడాది అక్టోబర్ కంటే ఈ ఏడాది అక్టోబర్‌లో దాదాపు 12 వేల లావాదేవీలు తగ్గిపోయాయి. అంటే సగటున రోజుకు 400 లావాదేవీలు తగ్గాయన్న మాట. గతేడాది అక్టోబర్‌లో మొత్తం 91,619 రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరగ్గా ఈ ఏడాది 79,562 డాక్యుమెంట్లు మాత్రమే రిజిస్టర్ కావడం గమనార్హం. ఇక జిల్లాలవారీగా పరిశీలిస్తే రంగారెడ్డిలో గతేడాది అక్టోబర్ కంటే ఈ ఏడాది అక్టోబర్‌లో రూ. 94 కోట్ల మేర ఆదాయం తగ్గింది. ఈ జిల్లాలో సుమారు 1,600 లావాదేవీలు కూడా తగ్గాయి. హైదరాబాద్, హైదరాబాద్ (సౌత్), మేడ్చల్, వరంగల్, కరీంనగర్, నల్లగొండ లాంటి జిల్లాల్లోనూ లావాదేవీల గణాంకాలు తగ్గుముఖం పట్టాయి. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలున్నాయని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో ‘హైడ్రా’అక్రమ కట్టడాల కూల్చివేతల కారణంగా రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు, ఆస్తుల కొనుగోళ్లు మందగించాయని అంటున్నారు. దీనికితోడు దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం గడ్డుకాలం ఎదుర్కొంటోందని.. ఈ నేపథ్యంలోనే ఇతర జిల్లాల్లోనూ లావాదేవీలు తగ్గుముఖం పట్టాయని చెబుతున్నారు. -
హైడ్రా.. రిజిస్ట్రేషన్లు విత్‌డ్రా
సాక్షి, హైదరాబాద్: చెరువులు, నీటి వనరుల పరిరక్షణ, ఆక్రమణల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైడ్రా’తో.. భూములు, ఆస్తుల కొనుగోళ్లపై ప్రభావం పడింది. జిల్లాల్లోనూ హైడ్రా తరహాలో కూల్చివేతలు చేపట్టడంతో.. రాష్ట్రవ్యాప్తంగా కూడా రిజిస్ట్రేషన్ లావాదేవీలు తగ్గాయి. సుమారు రెండు నెలలుగా ఈ పరిస్థితి కొనసాగుతోంది. ముఖ్యంగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఏకంగా 30శాతానికిపైగా తగ్గింది. 20వేలకుపైగా లావాదేవీలు తగ్గినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, పరిసర జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఒక్క నెలలో రూ.300 కోట్లు తగ్గిపోయి.. రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాల ప్రకారం.. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే, ఈ ఏడాది సెప్టెంబర్ ఒక్క నెలలోనే రూ.300 కోట్ల ఆదాయం తగ్గింది. గత ఏడాది సెప్టెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా 99,528 రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగి, ప్రభుత్వానికి రూ.955.12 కోట్ల ఆదాయం సమకూరింది. అదే ఈసారి సెప్టెంబర్‌లో 80,115 లావాదేవీలు జరిగి, రూ.650.80 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హైడ్రా ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 2023 సెప్టెంబర్‌లో 21,407 లావాదేవీలు జరిగితే.. ఈసారి సెప్టెంబర్‌లో 16,687 లావాదేవీలే జరిగాయి. సుమారు ఐదువేల లావాదేవీలు తగ్గాయి. మేడ్చల్, పటాన్చెరు రిజిస్ట్రేషన్ జిల్లాల్లోనూ 4 వేల చొప్పున లావాదేవీలు తగ్గడం గమనార్హం. మొదట బాగానే ఉన్నా.. రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 10.04 లక్షల రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగి.. ప్రభుత్వానికి రూ.7,229.88 కోట్లు రాబడి సమకూరింది. అదే ఈ ఏడాది తొలి ఆరునెలల్లో 9.19 లక్షల లావాదేవీలతో రూ.7,291.28 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది కంటే స్వల్పంగా రూ.61.4 కోట్ల పెరుగుదల కనిపిస్తున్నా.. అది ఆస్తుల రేట్లు పెరగడం, తొలి నాలుగు నెలల్లో రిజిస్ట్రేషన్లు గణనీయంగా జరగడం వల్ల సమకూరినదేనని రిజిస్ట్రేషన్ వర్గాలు చెప్తున్నాయి. అంటే ఆర్థిక సంవత్సరం మొదట్లో రిజిస్ట్రేషన్లు, ఆదాయం గణనీయంగా పెరిగినా.. తర్వాత ఒక్కసారిగా తగ్గిపోయిందని స్పష్టమవుతోంది. ధరల పెంపు.. హైడ్రా దెబ్బ.. ఎల్ఆర్ఎస్ పేరుతో ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తున్న కారణంగా.. చాలా మంది డీటీసీపీ లేఔట్ల వైపు చూస్తున్నారని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక డాక్యుమెంట్ రైటర్ తెలిపారు. డీటీసీపీ ఫీజులు కూడా భారీగా పెరగడంతో చాలా మంది వెంచర్లు చేయడం లేదని.. వెంచర్లు చేసినా యుటిలిటీస్, కమ్యూనిటీ, పార్కుల పేరిట ఎక్కువగా భూమి వదలాల్సి రావడంతో రియల్ ఎస్టేట్ కంపెనీలు ధరలు పెంచేశాయని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ‘హైడ్రా’ పేరిట కూల్చివేతలు చేపట్టడంతో.. కొనుగోలుదారుల్లో తెలియని భయం నెలకొందని వివరించారు. ప్లాట్లు అమ్ముదామంటే కొనేవాళ్లు లేరని.. చదరపు గజం ధర రూ.5 వేలకు మించి ఉన్న ప్లాట్ల విషయంలో ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ వంటి విషయాలను పరిశీలించుకునేలోపు కొనుగోలు దారుల మనసు మారిపోతోందని చెప్పారు. ఈ క్రమంలో ప్రస్తుతానికి కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోందని వెల్లడించారు. ఇది ఇప్పటితో అయిపోలేదని, రిజిస్ట్రేషన్ లావాదేవీలు మరింత తగ్గుతాయని అంచనా వేశారు. ఇందుకు చాలా కారణాలున్నా.. ‘హైడ్రా’ ప్రభావం కూడా గణనీయంగా ఉందని పేర్కొన్నారు. హైడ్రాతో తారుమారురాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరిట చేస్తున్న హడావుడితో ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది. చెరువుల పరిరక్షణ కోసం ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే హైడ్రాను తీసుకొచ్చినా..యుద్ధ ప్రాతిపదికన కూల్చివేతలు చేపట్టడంతో కొనుగోళ్లపై ప్రభావం పడింది. అటు కొనుగోలుదారుల్లో, ఇటు డెవలపర్లలో గుబులు కనిపిస్తోంది. కొనుగోలుదారులు కొంతకాలం వేచి చూసే ధోరణితో ఉండటంతో అమ్మకాలు తగ్గాయి. రియల్ ఎస్టేట్ రంగం ఇబ్బందుల్లో పడటంతో దీనిపై ఆధారపడిన ఇతర రంగాలు కూడా కుదేలవుతున్నాయి. స్థిరాస్తి వ్యాపారాన్ని గాడిన పెట్టేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.– రావుల గోపాల్ యాదవ్, మోకిలా, శంకర్పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా -
హైడ్రా ఎఫెక్ట్.. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్ మూసీ కార్యక్రమంలో రెండో రోజు కొనసాగుతోంది. రెవెన్యూ అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే చేస్తున్నారు. దీంతో, అక్కడ ఉద్రికత్త చోటుచేసుకుంది. బాధితులు.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను సర్వే చేస్తూ రెవెన్యూ అధికారులు రెండో రోజు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో మార్కింగ్ చేస్తున్నారు. కూల్చివేయబోయే ఇళ్లకు నెంబరింగ్ ఇస్తూ మార్క్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అధికారులు సర్వేను ముమ్మరం చేశారు. గురువారం దాదాపు 12 ఇళ్లను ఖాళీ చేయించారు. ఈ క్రమంలో తమ ఇళ్లకు మార్క్ చేయకుండా అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. తమ ఇళ్లను కూల్చే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. దీంతో, పలు చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి.మరోవైపు.. శని, ఆదివారాల్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా ప్లాన్ చేసింది. అక్కడ నిర్మించిన అక్రమ నిర్మాణాలను రెండు రోజుల్లో కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు సిద్ధమవుతున్నారు. దీని కోసం అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. ఇది కూడా చదవండి: నిజాం కన్నా దుర్మార్గుడు రేవంత్: ఎంపీ ఈటల ఫైర్ -
ముసాయిదానే.. కొత్త చట్టం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల రికార్డులకు సంబంధించిన ‘రికార్డ్ ఆఫ్ రైట్స్–2024 (ఆర్వోఆర్)’ చట్టం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయానికి వచ్చింది. ఒకట్రెండు చిన్న చిన్న మార్పులు మినహా ముసాయిదా కింద రూపొందించిన అంశాలనే చట్టం రూపంలో అమల్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రెవెన్యూమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి త్వరలోనే దీనిపై ఓ స్పష్టత ఇస్తారని.. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించాక తుది నిర్ణయం ప్రకటిస్తారని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. దాంతోపాటు ఈ చట్టాన్ని వెంటనే అమల్లోకి తెచ్చేందుకు మంత్రివర్గం ఆమోదంతో ఆర్డినెన్స్ జారీ చేస్తారా? లేక అసెంబ్లీలో పెట్టిన బిల్లుపై విస్తృతంగా చర్చించి చట్టంగా చేస్తారా? అన్న దానిపై మాత్రం తర్జనభర్జన కొనసాగుతున్నట్టు వెల్లడించాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈనెల 20న జరిగే కేబినెట్ సమావేశం ముందుకు ఆర్డినెన్స్ వచ్చే అవకాశం లేదని అంటున్నాయి. అయితే కేబినెట్ ఎజెండాపై బుధవారం స్పష్టత వస్తుందని, ఎజెండాలో భూముల చట్టం ఆర్డినెన్స్ ఉంటే రూపకల్పన, జారీ ఏర్పాట్లకు సిద్ధంగానే ఉన్నామని రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. ముసాయిదా బిల్లు ఇదే.. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 2న రాష్ట్ర ప్రభుత్వం ‘ఆర్వోఆర్–2024’ ముసాయిదాను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్వోఆర్–2020 చట్టంలో పరిష్కరించలేని అనేక సమస్యలకు పరిష్కారం చూపుతూ 20 సెక్షన్లతో ఈ ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. 1936, 1948, 1971, 2020 నాటి ఆర్ఓఆర్ చట్టాలను పరిశీలించి, వాటి అమలుతో చేకూరిన ఫలితాలను బేరీజు వేసి కొత్త చట్టం ముసాయిదాను తయారు చేసింది. తెలంగాణలో ఆర్వోఆర్ చట్టాల అమలు చరిత్ర, ప్రస్తుత సమస్యలు, రాబోయే అవసరాల అంచనాల ప్రకారం రూపొందించిన ఈ ముసాయిదాలో పాస్ పుస్తకాలు రాని భూముల సమస్యల పరిష్కారం, కొత్త రికార్డును ఎప్పుడైనా తయారు చేసుకునే అధికారాన్ని కల్పించడం, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, భూఆధార్, ఆబాదీలకు ప్రత్యేక హక్కుల రికార్డు, అప్పీల్, రివిజన్ లాంటి వెసులుబాట్లు కల్పిస్తూ అనేక అంశాలను ముసాయిదాలో పొందుపరిచారు. బిల్లు పెట్టిన తర్వాత ఏం జరిగిందంటే.. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఆర్వోఆర్ చట్టానికి రెండోసారి మార్పు జరుగుతోంది. 2020లో బీఆర్ఎస్ హయాంలో ఆర్వోఆర్–2020 చట్టం అమల్లోకి తెచ్చారు. అందులోని అనేక అంశాలకు సవరణలు, మార్పు చేర్పులతో ఆర్వోఆర్–2024ను కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ముందు పెట్టింది. ముసాయిదాపై ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి 23 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. మంత్రులు, రెవెన్యూ శాఖ సీనియర్ అధికారులు, భూచట్టాల నిపుణులు, మేధావులు, సామాన్యులు.. ఇలా అన్ని వర్గాలు అభిప్రాయాలు స్వీకరించింది. ఈ వివరాలతో జిల్లాల కలెక్టర్లు నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ఆ మూడు అంశాలే కీలకం ప్రజలతోపాటు భూచట్టాల నిపుణుల నుంచి వచ్చిన అనేక సూచనలు, సలహాల్లో మూడు అంశాలు కీలకమని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ ట్రిబ్యునళ్ల ఏర్పాటు ప్రతిపాదన ముసాయిదా చట్టంలో లేదని.. భూసమస్యల పరిష్కారం కోసం ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని పలువురు సూచించారు. అయితే రెవెన్యూ ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు, ఆర్ఓఆర్ చట్టానికి సంబంధం లేదని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. అయితే భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా పార్ట్–బీలో పెట్టిన 18లక్షల ఎకరాల భూముల సమస్యలను పరిష్కరించేందుకు ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి కూడా ఉందని అంటున్నాయి. ఇందుకోసం ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వొచ్చని, లేదా ముసాయిదా చట్టంలోని సెక్షన్–4 ప్రకారం కూడా ఏర్పాటు చేయవచ్చని పేర్కొంటున్నాయి. ఇక అప్పీల్, రివిజన్లకు సంబంధించిన అంశంలోనూ చాలా సూచనలు వచ్చాయి. తహసీల్దార్లు, ఆర్డీవోలు చేసే రిజిస్రే్టషన్లు, మ్యుటేషన్లకు సంబంధించి వివాదాలు వస్తే అప్పీల్‌ను కలెక్టర్లు లేదా అడిషనల్ కలెక్టర్‌కు చేసుకోవాలని.. సెకండ్ అప్పీల్‌ను సీసీఎల్ఏకు, రివిజన్ కోసం ప్రభుత్వానికి లేదంటే సీసీఎల్ఏకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చట్టంలో ప్రతిపాదించారు. అయితే ఈ అప్పీల్ అవకాశం ఆర్డీవో స్థాయిలోనూ ఉండాలని పలువురు సూచించారు. రిజిస్రే్టషన్, మ్యుటేషన్ చేసేటప్పుడు సర్వే మ్యాప్ తప్పనిసరి అని.. ప్రతి భూకమతానికి తాత్కాలిక, శాశ్వత భూఆధార్ (ప్రత్యేక గుర్తింపు సంఖ్య) ఇస్తామన్న ప్రతిపాదనలపైనా పలు సూచనలు వచ్చాయి. వీటి విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో తేలాల్సి ఉంది. సాదాబైనామాలకు అవకాశం ఆర్వోఆర్–2024 చట్టం అమల్లోకి వస్తే పెండింగ్‌లో ఉన్న 9.4 లక్షల సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం కలగనుంది. ఈ సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారాన్ని ప్రత్యేక సెక్షన్లో ప్రతిపాదించారు. ఇక అసైన్డ్ భూముల సమస్య పరిష్కారానికి ఈ చట్టంలో ఎలాంటి ప్రస్తావన లేదనే విమర్శలున్నాయి. అయితే అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడానికి, ఆర్వోఆర్ చట్టానికి సంబంధం లేదని.. అసైన్డ్ భూములపై హక్కులు రావాలంటే హక్కుల బదలాయింపు నిషేధిత చట్టాన్ని (పీవోటీ) సవరించాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలు వివరిస్తున్నాయి. మొత్తమ్మీద ముసాయిదా చట్టంలో ఒకట్రెండు అంశాల్లోనే మార్పు ఉంటుందని.. అది కూడా మార్గదర్శకాలు తయారు చేసినప్పుడు వాటిలో పొందుపరుస్తారని పేర్కొంటున్నాయి. -
భూమికి ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాల్సిందే..
సాక్షి, అమరావతి: చట్ట ప్రకారం భూ సేకరణ చేయకుండా రోడ్డు విస్తరణ కోసం భూమి తీసేసుకున్న అధికారులు, తీసుకున్న ఆ భూమికి ప్రత్యామ్నాయంగా మరో చోట భూమి ఇస్తామని బాధిత కుటుంబానికి వాగ్దానం చేసి ఆ తరువాత పట్టించుకోకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాన్ని అనవసరంగా కోర్టుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చినందుకు రెవెన్యూ, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులకు, పురపాలక శాఖ డైరెక్టర్, అనంతపురం మునిసిపల్ కమిషనర్లకు రూ.50వేలను ఖర్చులు కింద జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లో పిటిషనర్లకు చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ఇటీవల తీర్పు వెలువరించారు.ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా... ప్రత్యామ్నాయ భూమి ఇవ్వని అధికారులుఅనంతపురం పట్టణంలోని సర్వే నంబర్ 1940/4లో టి.నిజాముద్దీన్‌కు చెందిన 0.02 సెంట్ల భూమిని 1996లో మునిసిపల్ అధికారులు రోడ్డు విస్తరణ కోసం తీసుకున్నారు. చట్ట ప్రకారం భూ సేకరణ చేయకుండా భూమిని తీసుకున్న అధికారులు, తీసుకున్న భూమికి ప్రత్యామ్నాయంగా మరో చోట భూమి ఇస్తామని చెప్పారు. నిజాముద్దీన్ ప్రత్యామ్నాయ భూమి కోసం పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగారు. దీంతో చివరకు మునిసిపల్ కార్పొరేషన్ ప్రత్యామ్నాయ భూమి ఇచ్చేందుకు తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ éనిజాముద్దీన్‌కు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలంటూ 2001లో జీవో జారీ చేసింది. అయినప్పటికీ పలు కారణాలరీత్యా అధికారులు ఆ భూమిని నిజాముద్దీన్‌కు కేటాయించలేదు. ఈ లోపు ఆయన మరణించారు. వారి హక్కులను హరించడమే.. ఆయన వారసులు న్యాయ పోరాటం ప్రారంభించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య ఇటీవల తీర్పు వెలువరించారు. పరిహారం ఇవ్వకుండా భూమి తీసుకోవడమే కాకుండా, ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని ప్రభుత్వం జీవో జారీ చేసిన తరువాత పిటిషనర్లకు భూమి ఇవ్వకపోవడం వారి హక్కులను హరించడమేనని తేల్చి చెప్పారు. అంతేకాక అలా చేయడం రాజ్యాంగ విరుద్ధం కూడానని స్పష్టం చేశారు. ప్రభుత్వం సానుకూల జీవో జారీ చేసినా కూడా నిజాముద్దీన్ తన జీవిత కాలంలో ప్రత్యామ్నాయ భూమిని పొందలేకపోయారని తెలిపారు.భూ సేకరణ చేయకుండా భూమిని తీసుకోవడాన్ని దోపిడీగా అభివర్ణించిన న్యాయమూర్తి..అధికారుల తీరు కోర్టుని షాక్‌కు గురిచేసిందని తన తీర్పులో పేర్కొన్నారు. తీసుకున్న 0.02 సెంట్ల భూమికి 2013 భూ సేకరణ చట్టం కింద పిటిషనర్లకు గరిష్టంగా 8 వారాల్లోపు పరిహారం చెల్లించాలని, పిటిషనర్లకు రూ.50వేలను ఖర్చుల కింద చెల్లించాలని అధికారులను ఆదేశించారు. -
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి MLRIT కాలేజీకి రెవిన్యూశాఖ నోటీసులు
-
మళ్లీ భూసర్వే.. పహాణీల నమోదు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల రికా ర్డులను పారదర్శకంగా నిర్వహించడం కోసం ‘రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)–2024’ పేరిట ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకు రానుంది. దీనికి సంబంధించి ముసాయిదా ప్రతిని ప్రజలకు అందుబాటులో ఉంచింది. అందులోని అంశాలపై ప్రజల నుంచి సల హాలు, సూచనలను ఆహ్వానించింది. దీనితో వేలాది మంది నుంచి స్పందన వస్తోంది. కానీ ఇందులో సలహాలు, సూచనల కన్నా సందేహాలే ఎక్కువగా ఉంటున్నాయని రెవెన్యూ వర్గాల సమాచారం. ముసాయిదాపై ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. సందేహాలకు అధికారికంగా జవాబు ఇచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ‘ఆర్వోఆర్–2024’ ముసాయిదా చట్టంలోని అంశాలపై ప్రజల నుంచి ఎక్కువగా వస్తున్న సందేహాలను ‘సాక్షి’ సేకరించింది. వాటిని భూచట్టాల నిపుణుడు ఎం.సునీల్‌కుమార్, ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డితోపాటు కొందరు రెవెన్యూ అధికారుల ముందుపెట్టి.. ఆయా సందేహాలకు సమాధానాలను రాబట్టింది. ఆ సందేహాలు, సమాధానాలు ఇవీ..సందేహం: కొత్త ఆర్వోఆర్ చట్టం తేవాల్సిన అవసరమేంటి?సమాధానం: ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం లోపభూయిష్టంగా ఉంది. చాలా సమస్యలకు అందులో పరిష్కారం లేదు. సాదాబైనామాల పరిష్కార నిబంధన లేదు. అప్పీలు వ్యవస్థ లేదు. రికార్డులో ఏ సమస్య వచ్చినా కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి. ధరణి పోర్టల్‌లో సవరణలు చేసే అధికారాన్ని కూడా ఆ చట్టం ఎవరికీ కల్పించలేదు. ధరణి సవరణలకు చట్టబద్ధత కావాలంటే చట్టం మారాల్సిందే.ధరణి సమస్యలను ఈ చట్టం ఎలా పరిష్కరిస్తుంది?– ధరణి పోర్టల్‌లో చేర్చకుండా పార్ట్–బి పేరిట పక్కన పెట్టిన భూములను రికార్డుల్లోకి ఎక్కించడానికి కొత్త చట్టంలో నిబంధన ఉంది. దాదాపు 18లక్షల ఎకరాల భూమికి ఈ చట్టం ద్వారా మోక్షం కలుగుతుంది. ధరణిలో చేర్చిన తర్వాత నమోదైన తప్పుల సవరణకు కూడా చట్టబద్ధత ఏర్పడుతుంది.రైతుల వద్ద ఉన్న పాస్‌బుక్‌లు రద్దవుతాయా?– రద్దు కావు. ప్రస్తుతమున్న ధరణి రికార్డు కొనసాగుతుంది. కానీ తప్పొప్పులను సవరించవచ్చు. భవిష్యత్తులో ప్రభుత్వం భూముల రీసర్వే చేపట్టి, కొత్త రికార్డు తయారు చేయాలనుకుంటే మాత్రం కొత్త రికార్డుతోపాటు కొత్త పాస్‌బుక్‌లు వస్తాయి. ముసాయిదా చట్టంలో ఈ మేరకు నిబంధన ఉంది.ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్ వస్తుందా?– ధరణి పోర్టల్ స్థానంలో కొత్త పోర్టల్ వస్తుంది. అయితే భూమాత అనే పేరు ఏదీ ముసాయిదా చట్టంలో లేదు. ధరణి అనేది ఆర్వోఆర్ రికార్డు నిర్వహించే పోర్టల్. ఈ పోర్టల్ స్థానంలో కొత్త పోర్టల్ వస్తుంది. దానికి ప్రభుత్వం ఇష్ట్రపకారం ఏ పేరైనా పెట్టవచ్చు.ఇప్పుడు జరుగుతున్న రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఎలాంటి మార్పులొస్తాయి?– స్లాట్ బుకింగ్ కొనసాగుతుంది. కానీ రిజిస్ట్రేషన్ అనంతరం మ్యుటేషన్ ప్రక్రియలో కొన్ని మార్పులుంటాయి.ఆటోమేటిక్ మ్యుటేషన్ రద్దు అవుతుందా?– పాత చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ జరిగితే ఆటోమేటిగ్గా మ్యుటేషన్ జరిగిపోతుంది. కొత్త చట్టం ముసాయిదా ప్రకారం ఈ మ్యుటేషన్ ఆగిపోదు. కానీ సరైన కారణాలుంటే మ్యుటేషన్ నిలిపేయవచ్చు. డబుల్ రిజిస్ట్రేషన్లకు, మోసపు లావాదేవీలకు ఈ నిబంధనతో చెక్ పడుతుంది. వారసత్వం, భాగం పంపకాలు, కోర్టు కేసులు, ఇతర మార్గాల్లో వచ్చే భూములపైనా విచారణ జరిపి మ్యుటేషన్ చేస్తారు.ఈ చట్టం అమల్లోకి వస్తే భూముల సర్వే మళ్లీ నిర్వహిస్తారా?– భూములను మళ్లీ సర్వే చేయాలనే చట్టం చెబుతోంది. ముసాయిదా చట్టం ప్రకారం భూఆధార్ కార్డు జారీ చేయాలంటే సర్వే చేయాల్సిందే. తాత్కాలిక భూఆధార్ ఇవ్వాలన్నా రికార్డుల ప్రక్షాళన చేయాల్సిందే. భూఆధార్ కార్డు ఇవ్వాలా, వద్దా అన్నది ప్రభుత్వ అభీష్టం. ఈ మేరకు చట్టంలోని నిబంధనల్లో వెసులుబాటు ఉంది.ఈ చట్టం వస్తే మళ్లీ పహాణీ రాస్తారా?– పహాణీలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్న నిబంధన 1971 చట్టంలో ఉంది. కానీ 2020లో తొలగించారు. మళ్లీ ఇప్పుడు అప్డేట్ చేసే నిబంధన పెట్టారు. ముసాయిదాలోని సెక్షన్ 13 దీని గురించే చెబుతోంది.ఈ చట్టంతో అసైన్డ్ భూములకు హక్కులు వస్తాయా?– ఆర్వోఆర్ చట్టం అన్ని సమస్యలకు పరిష్కారం చూపదు. అసైన్డ్ భూములకు పట్టా హక్కు కావాలంటే మారాల్సింది ఆర్వోఆర్ చట్టం కాదు.. పీవోటీ చట్టం. కాబట్టి ఈ చట్టం ద్వారా అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు రావు.కౌలు రైతుల పేర్లు నమోదు చేస్తారా?– కౌలుదారుల నమోదు ప్రక్రియ కూడా ఆర్వోఆర్ చట్టం పరిధిలోకి రాదు. కౌలుదార్ల చట్టం–1950, రుణ అర్హత కార్డుల చట్టం– 2011 ప్రకారం కౌలుదారుల నమోదు జరుగుతుంది. ఆ చట్టాల పరిధిలో కౌలుదారుల గుర్తింపు జరుగుతుంది.ఈ చట్టం ప్రకారం కాస్తు కాలం నమోదు ఉంటుందా?– 1996లో గ్రామ రెవెన్యూ లెక్కల నిర్వహణ గురించి ప్రత్యేక జీవో వచ్చింది. ఆ జీవో ప్రకారం పహాణీల నిర్వహణ ఉంటుంది. ఆర్వోఆర్ చట్టం పరిధిలోకి ఈ అంశం రాదు. కాస్తు కాలం ఉంచాలా, వద్దా అన్నదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు.ఈ చట్టం ద్వారా టైటిల్ గ్యారంటీ ఇస్తారా?– కొత్త చట్టానికి ల్యాండ్ టైటిల్‌కు సంబంధం లేదు. ఈ చట్టం హక్కులకు స్పష్టత మాత్రమే ఇస్తుంది. టైటిల్ గ్యారంటీ ఇచ్చేది వేరే చట్టం.మ్యుటేషన్ సమయంలో మ్యాప్ కావాలన్న నిబంధన రైతులను ఇబ్బంది పెట్టేది కాదా?– ఆర్వోఆర్ చట్టంలోని అన్ని నిబంధనలు వెంటనే అమల్లోకి వచ్చేవి కాదు. కొన్ని వెంటనే అమల్లోకి వస్తే.. మరికొన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొందుపర్చినవి. ఈ మ్యాప్ నిబంధనను అమలు విషయంలో ప్రభుత్వానికి సమయం ఉంటుంది. వ్యవస్థ పూర్తిస్థాయిలో ఏర్పాటైన తర్వాతే ఇది అమల్లోకి వస్తుంది. ఒకవేళ మ్యాప్ నిబంధన అమల్లోకి రావాలంటే సర్వేయర్ల వ్యవస్థను పటిష్టం చేయాల్సి ఉంటుంది.(సాదాబైనామాలు, భూఆధార్కార్డులు, కోర్టులు, అప్పీళ్లు, ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు సంబంధించిన సమాచారం రేపటి సంచికలో..) -
సీటుకు నోటు! టీడీపీ నేతల వసూళ్ల పర్వం
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వ పెద్దలు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంటే పచ్చముఠాలు ఇసుక దోపిడీ నుంచి భూ దందాలతో బరి తెగిస్తున్నాయి. అంతటితో సంతృప్తి చెందకుండా ఇది బదిలీల సీజన్ కావడంతో అందులోనూ సొమ్ము చేసుకుంటున్నాయి. వేలం పాటల తరహాలో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున సాగిపోతోంది. బదిలీలలో పైరవీలు నడుస్తుండడంతో అధికారులంతా అక్కడి ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఆర్డీవోలు, డీఎస్పీలు, సీఐలు తదితర ముఖ్యమైన పోస్టింగులన్నీ పూర్తిగా మంత్రి నారా లోకేశ్ కనుసన్నల్లో జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఒకపక్క దాడులు, దౌర్జన్యాలు, హత్యాకాండ, మహిళలపై అఘాయిత్యాలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిస్థితి దారుణంగా ఉండగా మరోపక్క అధికార పార్టీ నేతలు బదిలీలలో అందినకాడికి వసూలు చేసుకుంటున్నారు! ప్రధానంగా రెవెన్యూ, పోలీసు శాఖల్లో బదిలీలను అవకాశంగా మార్చుకుని వసూళ్ల పర్వానికి తెరతీశారు. ఉద్యోగుల బదిలీలు జరుగుతుండటంతో హోదాను బట్టి రేటు నిర్ణయించి వసూళ్లకు దిగారు. తమ్ముడు తమ్ముడే..! పేకాట పేకాటే! అన్నట్లుగా తమకు కొమ్ము కాసే ఖాకీలను నియమించుకోవడంతోపాటు పోలీస్ స్టేషన్లకు అందే నెలవారీ మామూళ్లపైనా కన్నేశారు. ఇకపై నేరుగా తమకే ఇవ్వాలంటూ హుకుం జారీ చేశారు. రూ.కోట్లలో బేరసారాలు..కొత్త సర్కారు కొలువుదీరిన వెంటనే బదిలీలపై కూటమి నేతలు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తమకు అనుకూలంగా వ్యవహరించే వారికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ప్రస్తుతం ఉన్నవారిని కొనసాగించాలన్నా, కోరుకున్న చోటకు పోస్టింగ్ ఇవ్వాలన్నా అధికారి స్థాయి, పరిధిని బట్టి మామూళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఆర్డీవోల నుంచి ఎమ్మార్వోల దాకా ఎస్ఐ నుంచి సీఐ దాకా రేట్లు నిర్ణయించి మరీ వసూలు చేస్తున్నారు. తిరుపతి ఆర్డీవో పోస్టు కోసం ఎవరు ఎక్కువ కోట్ చేస్తే వారికి ఇస్తామంటూ అధికార పార్టీ నేతలు బంపర్ ఆఫర్ ఇచ్చారు. దీర్ఘకాలం జిల్లాలో పనిచేసిన ఓ అధికారి రూ.3 కోట్లు ముట్టజెప్పేందుకు సిద్ధపడ్డారు. ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ఓ తహశీల్దార్ తిరుపతి రూరల్ ఎమ్మార్వో పోస్టు కోసం భారీ మొత్తం ఇస్తానంటూ అధికార పార్టీ నేతలను ఆశ్రయించారు. కొమ్ము కాయాల్సిందే...!కూటమి నేతలకు కొమ్ము కాయడంతోపాటు మామూళ్లు అందించే ఖాకీలపై కన్నేసి ఉంచారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఓ సీఐ పోస్టు కోసం స్థానిక ఎమ్మెల్యే రూ.40 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. తమిళనాడు సరిహద్దు ప్రాంతం కావటంతో గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం ఉన్నవారిని కొనసాగించేందుకు సైతం రేట్లు నిర్ణయించడంతో పోలీసులు తల పట్టుకుంటున్నారు. ⇒ కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి కోసం ఓ సీఐ రూ.15 లక్షలకు బేరం కుదుర్చుకోగా ప్రస్తుతం రూ.10 లక్షలు ఇచ్చారు. లెటర్, డీవో (డ్యూటీ ఆర్డర్) రాగానే మిగతాది చెల్లించేలా ఒప్పందం కుదిరింది. ఈ సర్కిల్‌కు భారీ ఆదాయం ఉంది. కర్నూలు చుట్టుపక్కల రియల్ ఎస్టేట్‌తో పాటు మట్కా, పేకాట, రేషన్ బియ్యం అక్రమ రవాణా తదితర వ్యవహారాలతో పాటు నిత్యం స్టేషన్లో పంచాయతీలు జరుగుతుంటాయి. దీంతో డబ్బులు కట్టినా ఇక్కడ సంపాదనకు ఢోకా లేదనే భరోసాతో ఆఫర్ ఇచ్చారు. ⇒ ఎమ్మిగనూరు రూరల్ స్టేషన్ కోసం ఓ సీఐ రూ.20 లక్షలు స్థానిక నేతకు ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఆదోనిలో పని చేసిన ఆయన ప్రస్తుతం లూప్లైన్లో ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే ఆయనకు లెటర్ ఇవ్వగా త్రిసభ్య కమిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. ఇక ఎమ్మిగనూరు టౌన్ సర్కిల్‌కు కూడా రూ.20 లక్షలకు స్థానిక నేతతో బేరం కుదిరినట్లు సమాచారం. ⇒ నంద్యాలలో ఆర్డీవో, తహసీల్దార్ కుర్చీ కోసం ఈసారి పోటీ తీవ్రంగా ఉంది. నంద్యాల లోని రెవెన్యూ శాఖ అధికారి కుర్చీ కోసం రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఇక్కడ పని చేసి వేరే ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగి వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో డివిజన్ స్థాయి పోస్టు కోసం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు చెల్లించేందుకు పలువురు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆళ్లగడ్డలో డీఎస్పీ పోస్టు కోసం రూ.10 లక్షలు, చాగలమర్రి ఎస్ఐ పోస్టుకు రూ.5 లక్షల చొప్పున స్థానిక ప్రజాప్రతినిధి డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ⇒ కాకినాడ జిల్లాలో కాకినాడ సహా ప్రధాన సర్కిళ్లలో అధికార పార్టీ నేతల జోక్యం మితిమీరింది. ప్రత్తిపాడు, పెద్దాపురం, కాకినాడ డివిజన్లోని సర్కిల్స్‌లో నియోజక వర్గ నాయకుల ప్రమేయం ఎక్కువగా ఉండగా పిఠాపురం సమీప సర్కిల్స్‌లో స్థానిక నేతల అనుచరుల హవా రాజ్యమేలుతోంది. గతంలో పలు వివాదాలు మూటగట్టుకుని బదిలీపై పొరుగు సర్కిల్స్‌కు వెళ్లిన ఇన్స్పెక్టర్లు డబ్బు కట్టలతో నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం కాకినాడ టూ టౌన్ నుంచి బదిలీపై వెళ్లిన ఓ సీఐ లక్షలు సమర్పించైనా తిరిగి వచ్చేయాలనే పట్టుదలతో నియోజకవర్గ నేతతో సంప్రదింపులు జరుపుతున్నారు. జిల్లాలో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు బదిలీల కోసం ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ప్రాంతాలను బట్టి రూ.30 నుంచి రూ.40 లక్షలు ఇచ్చుకునేలా బేరసారాలు జరుగుతున్నాయి. పలువురు పంచాయతీ సెక్రటరీలు ప్రస్తుతం ఉన్న మండలంలోనే కొనసాగేందుకు మధ్యవర్తుల ద్వారా ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖలో పని చేస్తున్న ఓ మహిళా అధికారి కాకినాడ జిల్లాలో అదే పోస్టులో కొనసాగేందుకు ఓ ప్రజాప్రతినిధికి రూ.20 లక్షలు ఆఫర్ చేసినట్లు సమాచారం. జిల్లా పరిషత్‌లో ముఖ్య కార్య నిర్వహణాధికారిగా పని చేసిన ఒక అధికారి తిరిగి అదే పోస్టు కోసం రూ.20 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు!⇒ అనంతపురంలో ఆదాయం బాగున్న ఓ పోలీస్‌స్టేషన్‌కు సీఐగా వచ్చేందుకు ఓ అధికారి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మరో డిపార్ట్మెంట్లో ఉన్న ఆయన నియోజకవర్గ అధికార పార్టీ ముఖ్య నేత అనుచరుడి ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నారు. రూ.5 లక్షల దాకా ఇస్తానని చెప్పడంతో గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు జోరుగా చర్చ సాగుతోంది. అనంతపురం జిల్లాకే చెందిన ఓ అధికారి పుట్టపర్తి బదిలీ అయ్యేందుకు పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్నారు. పరిటాల కుటుంబానికి సన్నిహితుడైన ఆయన పుట్టపర్తిలో ఓ జిల్లా శాఖ ఇన్‌చార్జీగా వచ్చేందుకు లాబీయింగ్ చేస్తున్నట్లు తెలిసింది. రూ.15 లక్షలు ఇస్తానని పరిటాల కుటుంబం ద్వారా ఓ మంత్రిని ఆశ్రయించినట్లు చెబుతున్నారు. కందికుంట వెంకట ప్రసాద్, పరిటాల సునీతకు తొత్తుగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న చిత్తూరు జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి కదిరి లేదా ధర్మవరం సబ్ డివిజన్లో సీఐ పోస్టు కోసం రూ.10 లక్షలు చెల్లించేందుకు రెడీగా ఉన్నారు.⇒ శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ తమకు కావాల్సిన ఎమ్మార్వో, ఎస్ఐ, సీఐల జాబితా తయారు చేసుకున్నారు. ఇక అచ్చెన్నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం!⇒ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆచంట, ఉండి, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో తమ వద్దకు వచ్చిన అధికారుల పేర్లు నమోదు చేసుకుంటున్న ఎమ్మెల్యేలు తమ అనుచరుల ద్వారా వారి గురించి ఆరా తీస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తమకు అనుకూలంగా పనిచేసిన అధికారులను తిరిగి తెచ్చుకునే పనిలో ఉన్నారు. చేపల చెరువులతోపాటు పందాలు, పేకాట ఎక్కువగా జరిగే భీమవరం, ఉండి, ఆచంటలో పోస్టింగ్‌కు భారీగా డిమాండ్ ఉంది. అమలాపురం రూరల్ సీఐ బదిలీ వ్యవహారం టీడీపీలో అంతర్గత కుమ్ములాటకు దారి తీయటంతో ఈ పంచాయతీ టీడీపీ అధిష్టానం, డీజీపీ వద్దకు వెళ్లింది. ⇒ ఏపీఈపీడీసీఎల్ రాజమహేంద్రవరంలో ఎస్ఈ పోస్టు కోసం ఐదుగురు పోటీ పడుతుండగా మాజీ మంత్రి జవహర్ బావమరిది కూడా లైన్లో ఉన్నారు. పోస్టు కోసం రూ.50 లక్షల ఇచ్చేందుకు సైతం వెనుకాడటం లేదు. ⇒ అనకాపల్లి జిల్లాలో పాయకరావుపేట, యలమంచిలి, చోడవరం, అనకాపల్లి ప్రాంతాల్లో పని చేసేందుకు అధికారులు ఆసక్తి చూపుతున్నారు. మాడుగుల, యలమంచిలి, అనకాపల్లి నియోజకవర్గాల్లో రెండు జాబితాలు సిద్ధం చేశారు.⇒ విశాఖ పరిధిలో పెందుర్తి, సబ్బవరం, పరవాడలో తహశీల్దారు, ఎస్ఐ, సీఐ పోస్టులకు గిరాకీ ఉంది. జనసేన ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జీ రెండు జాబితాలు సిద్ధం చేసుకున్నారు. భీమిలిలోనూ అధికార పార్టీకి చెందిన కీలక నేత బేరాలు కుదుర్చుకున్నారు. ఆనందపురం, భీమిలి, పద్మనాభంలో చేరేవారి జాబితా సిద్ధమైంది.⇒ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కందుకూరు, గుడ్లూరు, కావలి రూరల్, కొడవలూరు, కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం, సంగం, ఆత్మకూరు, పొదలకూరు, నెల్లూరు వేదాయపాలెం, నవాబుపేట, నెల్లూరు రూరల్, వెంకటాచలం అర్బన్ పోలీసుస్టేషన్లలో పోస్టింగ్‌లకు భారీ డిమాండ్ ఉంది. ⇒ ప్రకాశం జిల్లాలో టీడీపీ పెద్దల సామాజిక వర్గానికి చెందిన అధికారులను నియమించాలని కొన్ని సర్కిళ్ల పరిధిలో తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. తహసీల్దార్లు ప్రజా ప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ⇒ విజయనగరం జిల్లాలో ఏ పదవిలోనూ లేకపోయినా టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు తన బంగ్లా నుంచే యంత్రాంగాన్ని శాసిస్తున్నారు. ఆయన కుమార్తె అదితి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో అధికారులు ఆమె అనుచరుల చుట్టూ తిరుగుతున్నారు. కీలక స్థానాల కోసం అదితి కొన్ని పేర్లు కలెక్టరుకు సిఫారసు చేసినట్లు తెలిసింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజపతినగరం నియోజకవర్గంలో దాదాపుగా తమ కులం వారికే పోస్టింగ్‌లు ఇచ్చేలా ఆయన తండ్రి కొండలరావు ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, నెల్లిమర్ల (జనసేన) ఎమ్మెల్యే లోకం మాధవి కూడా తమకు అనుకూలమైన తహసీల్దార్ల పేర్లను కలెక్టరేట్‌కు పంపినట్లు సమాచారం. కిమిడి కళావెంకట్రావు, కోండ్రు మురళీమోహన్, కోళ్ల లలితకుమారి సైతం ఇప్పటికే సిఫారసు లేఖలను కలెక్టరేట్‌కు పంపించారు. ⇒ గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి కొత్తపేట, లాలాపేట పోలీసు స్టేషన్లలో పోస్టింగ్‌లన్నీ పూర్తిగా మంత్రి నారా లోకేష్ కనుసన్నల్లో జరుగుతున్నాయి. కొత్తపేటకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీఐని, లాలాపేటకు కాపు సామాజిక వర్గానికి చెందిన సీఐని నియమించండంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పాత గుంటూరు స్టేషన్‌కు మాత్రమే సీఐ నియామకాన్ని స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌కు అప్పగించినట్లు చెబుతున్నారు. -
ఆదాయం పెంచాల్సిందే.. ఖజానా నింపేందుకు సంస్కరణలు: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచేందుకు వీలైనన్ని సంస్కరణలు తీసుకుని రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకు వచ్చిన ఆదాయంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రతిపాదించిన మేరకు ఆదాయం రావాలంటే ఆయా శాఖలు లక్ష్యాలు నిర్దేశించుకుని పనిచేయాలని స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, స్టాంపులు రిజిస్ట్రేటేషన్లు, రవాణా శాఖల ఉన్నతాధికారులతో సీఎం దాదాపు నాలుగు గంటలపాటు సమీక్షించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరగాలని, పన్నుల ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ప్రతి విభాగం నెలవారీగా లక్ష్యాలను రూపొందించుకుని, ఆ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఆదాయం వచ్చే వనరులపై, పన్నుల వసూళ్లపై అధికారులు నిక్కచ్చిగా ఉండాలని స్పష్టంచేశారు. సంబంధిత విభాగాన్ని అవసరమైతే పునర్వ్యవస్థీకరించుకోవాలని దిశా నిర్దేశం చేశారు. జీఎస్టీ రాబడిపై దృష్టి పెట్టండి నిర్దేశించిన వార్షిక లక్ష్యంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకు వచ్చిన ఆదాయం అంత ఆశాజనకంగా లేదని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ నెలకానెల లక్ష్యాలను నిర్దేశించుకొని రాబడి సాధించాలన్నారు. ఇకపై ప్రతి నెలా మొదటి వారంలో నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై తాను సమీక్షిస్తానని, అలాగే, ప్రతి శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సంబంధిత శాఖల లక్ష్య సాధన పురోగతిపై సమావేశమవుతారని చెప్పారు. ప్రధానంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే జీఎస్టీని పెంచుకునే చర్యలు వెంటనే చేపట్టాలని సీఎం చెప్పారు. వాణిజ్య పన్నుల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, పక్కాగా ఆడిటింగ్ చేయాలని ఆదేశించారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిందని, ప్రత్యామ్నాయంగా విమాన ఇంధనంపై ఉన్న పన్నును సవరించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. మద్యం ఆదాయం ఎందుకు పెరగలేదు? ఎన్నికలప్పుడు మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగినప్పటికీ అంతమేరకు ఆదాయం పెరగకపోవటానికి కారణమేంటని సీఎం రేవంత్ ఆరా తీశారు. అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేయాలని, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను అరికడితే ఆదాయం పెరిగే అవకాశముందని ఈ సందర్భంగా చర్చ జరిగింది. డిస్టిలరీస్ నుంచి మద్యం అడ్డదారి పట్టకుండా నిఘా పెట్టాలని, అందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పరిమిత కాలం పన్ను సబ్సిడీ అమలైందని, తిరిగి పన్ను వసూలు చేయటం ద్వారా వాహనాల అమ్మకాలపై ఏమైనా ప్రభావం పడిందా అన్న అంశంపై అధ్యయనం చేయాలని సీఎం నిర్దేశించారు. రియల్ ఎస్టేట్‌కు అనుకూలం రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులతోపాటు ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందన్న అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. ఈ ఆరు నెలల్లో వాణిజ్య నిర్మాణాలు పెరిగాయని, గృహ నిర్మాణాలు కూడా అదే మాదిరి పుంజుకుంటాయని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, అదే స్థాయిలో రిజిస్ట్రేటేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరిగేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇసుక, ఖనిజ వనరుల ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను అరికట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. -
తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం... సీఎం ప్రజావాణి దరఖాస్తుల్లో 70 శాతానికి పైగా పెండింగ్‌లోనే.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఎకరం రూ.4 లక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువల సవరణ కసరత్తు కొలిక్కి వస్తోంది. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియలో భాగంగా వ్యవసాయ భూముల కనీస విలువపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఓ అభిప్రాయానికి వచ్చింది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోని ప్రతి ఎకరా వ్యవసాయ భూమి కనీస విలువను రూ.4 లక్షలుగా నిర్ధారించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. వాస్తవానికి ఈ విలువను రూ.4–5 లక్షలుగా నిర్ణయించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మౌఖికంగా సూచించింది. అయితే ఏజెన్సీ ఏరియాల్లో ఈ విలువలు సరిపోయే అవకాశం లేనందున భద్రాచలం, ములుగు, ఆసిఫాబాద్ లాంటి ఏజెన్సీ ప్రాంతాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూమి కనీస రిజిస్ట్రేషన్ విలువను రూ.4 లక్షలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదే విధంగా నివాస స్థలాల కనీస విలువ ప్రతి చదరపు గజానికి రూ.1,000, అపార్ట్మెంట్ల కంపోజిట్ విలువ (చదరపు అడుగు) రూ.1,500గా ప్రతిపాదించాలని నిర్ణయించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చదరపు గజం కనీస విలువ రూ.500గా ప్రతిపాదించనున్నారు. ఈ మేరకు జరుగుతున్న కసరత్తు 90 శాతం పూర్తయిందని, సోమవారం సాయంత్రానికి రిజిస్ట్రేషన్ విలువల సవరణ ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు సమరి్పంచనున్నాయని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రతిపాదనలపై ఈ నెల 25వ తేదీన ఆ శాఖ ఐజీ సమీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే ఆర్సీసీ నిర్మాణాలు, రేకుల షెడ్లకు సంబంధించిన కనీస విలువల నిర్ధారణకు సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా వెలువడాల్సి ఉందని, ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. మూడు కేటగిరీల్లో వ్యవసాయ భూముల విలువల సవరణ రాష్ట్రంలోని భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువను సవరించే ప్రక్రియలో భాగంగా వ్యవసాయ భూముల విలువలను మూడు కేటగిరీలుగా నిర్ధారించనున్నారు. గ్రామాల్లోని వ్యవసాయ భూములు (ఎక్కువ సర్వే నంబర్లలో ఇదే విలువ ఉంటుంది), రాష్ట్ర, జాతీయ రహదారుల పక్కన ఉండే వ్యవసాయ భూములు, వ్యవసాయేతర అవసరాలకు (వెంచర్లకు) వినియోగించేందుకు సిద్ధంగా ఉన్న భూములు..ఇలా మూడు కేటగిరీల్లో విలువలను నిర్ణయించనున్నారు. హైవేల పక్కన వ్యవసాయ భూముల విలువను రూ.40–50 లక్షల వరకు సవరించే అవకాశముందని, వ్యవసాయేతర అవసరాలకు సిద్ధంగా ఉన్న (ప్లాట్లుగా చేసేందుకు) భూమి విలువను రూ.కోటి వరకు సవరిస్తారని తెలుస్తోంది. అయితే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమీపంలో ఉన్న భూములకు, హైవేల పక్కనే ఉన్న నివాస ప్రాంతాలకు దూరంగా ఉండే భూములకు విలువల్లో తేడా ఉంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. సబ్ డివిజన్ సర్వే నంబర్లు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలు, హెచ్ఎండీఏ, ఇతర నగర అభివృద్ధి సంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ప్రాతిపదికన వ్యవసాయ భూములు, ఆస్తుల సవరణ ప్రక్రియ సాగుతోందని అంటున్నారు. వాణిజ్య ప్రాంతాలు మిస్ కాకుండా ప్రత్యేక దృష్టి తాజాగా జరుగుతున్న రిజిస్ట్రేషన్ విలువల సవరణ ప్రక్రియలో భాగంగా వాణిజ్య ప్రాంతాలపై రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. గతంలో సవరణ జరిగినప్పుడు అప్పటివరకు వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టుగా నిర్ధారణ అయిన డోర్ నంబర్ల విలువలను మాత్రమే వాణిజ్య కేటగిరీలో పరిగణనలోకి తీసుకున్నారు. కానీ ఇప్పుడు వాణిజ్య డోర్ నంబర్లను ముందే ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. నగర, పట్టణ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉండే వాణిజ్య సముదాయాలన్నింటికీ సంబంధించిన విలువల సవరణ ఆటోమేటిక్‌గా జరిగేలా ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలోని ఏ ఒక్క కమర్షియల్ డోర్ నంబర్ తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని క్షేత్రస్థాయి కమిటీలకు వచ్చిన ఆదేశాల మేరకు చాలా పకడ్బందీగా వాణిజ్య ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్ విలువల సవరణ జరుగుతోంది. తక్కువ ఉన్న చోట భారీగా.. సవరణ ప్రక్రియకు రిజిస్ట్రేషన్ల శాఖ కొన్ని నిబంధనలను రూపొందించుకుంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులు, నివాస స్థలాలకు సంబంధించి బహిరంగ మార్కెట్లో ఉన్న విలువను ప్రాతిపదికగా తీసుకుంటోంది. బహిరంగ మార్కెట్ విలువకు, ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రభుత్వ విలువకు భారీగా వ్యత్యాసం ఉన్న చోట (ప్రస్తుతం రిజిస్ట్రేషన్ విలువ తక్కువ ఉన్న ప్రాంతాల్లో) ఈసారి విలువలు భారీగా పెరగనున్నాయి. ఇందుకోసం రియల్ ఎస్టేట్ సంస్థల బ్రోచర్లు, ప్రకటనలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు రెవెన్యూ, మున్సిపల్ వర్గాల నుంచి సమాచారాన్ని తీసుకుంటున్నారు. ఇలాంటి చోట్ల 40 నుంచి 100 శాతం విలువలు పెరగనున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ విలువ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఓ మోస్తరు సవరణలుండే అవకాశముంది. ఈ ప్రాంతాల్లో కనిష్టంగా 10 నుంచి గరిష్టంగా 20 శాతం వరకు మాత్రమే విలువలు సవరించనున్నారు. మొత్తం మీద ఈ విలువల సవరణ ప్రక్రియ ఈ నెల 29వ తేదీతో పూర్తి కానుండగా, అదే రోజు క్షేత్రస్థాయి కమిటీలు ఆ విలువను నిర్ధారించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నాయి. ఆ తర్వాత ఈ విలువలను ప్రభుత్వ వెబ్సైట్లో అప్లోడ్ చేసి ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం మరోమారు విలువల్లో మార్పులు, చేర్పులు చేసి ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలను అమల్లోకి తెచ్చేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సిద్ధమవుతోంది. -
పరిపాలనలో ‘రెవెన్యూ’ కీలకం
కుత్బుల్లాపూర్: రెవెన్యూ శాఖ పరిపాలనలో కీలకమని, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడానికి రెవెన్యూ ఉద్యోగులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న తీరు అభినందనీయమని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం కొంపల్లిలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్విసెస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రెవెన్యూ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, గత ప్రభుత్వం ఆ శాఖను నిర్విర్యం చేసిందని, భూరికార్డులను ధరణి పేరుతో అస్తవ్యస్తంగా నిర్వహించడంతో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ శాఖను పటిష్టపరిచి రైతులకు న్యాయం చేస్తామని, రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం రవీందర్‌రెడ్డి మాట్లాడారు. ట్రెసా ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ స్థాయిలో సేవలకు ఆటంకం కలగకుండా క్షేత్రస్థాయిలో సిబ్బందిని నియమించాలని కోరారు. కార్యక్రమానికి సుమారు 5వేలకు పైగా రెవెన్యూ ఉద్యోగులు తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
భూ చరిత్రలో కొత్త శకం
ఈ చట్టం అమలైతే అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ వస్తుంది. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి, ఆ భూమి ఏ శాఖదైనా, ఏ వ్యక్తిదైనా, ఏ భూమైనా సరే దాని హక్కుదారు ఎవరనేది ఒకే రిజిస్టర్లో ఉంటుంది. వేర్వేరు రికార్డుల్లో ఉన్న పేర్లలో పలు వ్యత్యాసాలు, తేడాలు, తప్పులు, ఇతర సమస్యలన్నీ కొత్త చట్టం వస్తే పరిష్కారమవుతాయి. ఈ టైటిల్ రిజిస్టర్నే చట్ట పరంగా కన్‌క్లూజివ్ రికార్డు అని పిలుస్తారు. అదే తుది రికార్డు కింద లెక్క. ప్రస్తుతం ఉన్నవన్నీ ప్రిజెంటివ్ రికార్డులు మాత్రమే. వాటిని ఎవరైనా తమదని చెప్పి కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకసారి కన్‌క్లూజివ్ రికార్డు తయారైతే దానిపై ఎవరూ అభ్యంతరం చెప్పడానికి ఆస్కారం ఉండదు. సాక్షి, అమరావతి: దేశంలోనే మొట్ట మొదటిసారిగా వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టంతో రాష్ట్రంలో భూముల చరిత్రలో కొత్త శకం నమోదు కానుంది. భూ యజమానులకు భరోసా ఇచ్చే ఈ చట్టాన్ని తేవడానికి దేశంలోని పలు రాష్ట్రాలు చాలా ఏళ్లుగా చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో దీన్ని సాధ్యం చేసి చూపించింది. అత్యంత సంక్లిష్టమైన భూ హక్కుల చట్టం తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2019 జూలైలో ల్యాండ్ టైట్లింగ్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపింది. పలు మార్పుల తర్వాత ఇటీవలే దానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది. వాస్తవానికి అన్ని రాష్ట్రాల్లో ల్యాండ్ టైట్లింగ్ చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా చెబుతోంది. ఈ ఆలోచనలను అందిపుచ్చుకుని దాన్ని ఆచరణలోకి తీసుకు రావడంలో ఆంధ్రప్రదేశ్ సఫలీకృతమైంది. గత నెల అక్టోబర్ 31వ తేదీ నుంచి ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్–2023 అమల్లోకి వచ్చింది. ప్రస్తుత వ్యవస్థలో భూమి హక్కులకు సంబంధించి రాష్ట్రంలో 30కిపైగా రికార్డులున్నాయి. గ్రామ స్థాయిలో 1బీ, అసైన్మెంట్, ఈనాం వంటి 11 రిజిష్టర్లు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొన్ని, సర్వే కార్యాలయంలో మరికొన్ని, సబ్ రిజిస్ట్రార్, పంచాయతీ, మున్సిపాల్టీ కార్యాలయాల్లో భూములకు సంబంధించి వివిధ రికార్డులను నిర్వహిస్తున్నారు. అటవీ, దేవాదాయ, వక్ఫ్ వంటి పలు శాఖల్లోనూ భూముల రికార్డులు ఉన్నాయి. ఇన్ని రికార్డులు ఉన్నా, చట్టపరంగా ఏదీ కూడా తుది రికార్డు కాదు. ఈ రికార్డుల్లో పేరున్నా వేరే వాళ్లు అది తనదని అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. భూ యజమానికి తన భూమి తనదనే పూర్తి భరోసా లేదు. టైట్లింగ్ చట్టంలో భూ యజమానులకు తమ భూములపై భరోసా వస్తుంది. వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్ల వ్యవస్థ ► భూములకు సంబంధించి ఏవైనా వివాదాలు ఉంటే వాటిని ప్రత్యేకంగా వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఎటువంటి అభ్యంతరాలు లేని పేర్లే టైటిల్ రిజిస్టర్లో ఉంటాయి. వివాదం ఉన్న భూముల వివరాలను వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఈ చట్టం ప్రకారం టైటిల్ నిర్ధారించే క్రమంలో భూ సమస్యలు ఏర్పడితే పరిష్కారం కోసం ట్రిబ్యునళ్ల వ్యవస్థ ఏర్పాటవుతుంది. ► ప్రస్తుత వ్యవస్థ మాదిరిగా రెవెన్యూ, సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదు. జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటవుతుంది. రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ తీర్పు మీద అభ్యంతరం వస్తే అప్పుడు హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అంతేతప్ప కింది స్థాయిలో ఏ రెవెన్యూ అధికారికి, ఏ సివిల్ కోర్టుకీ వివాదాన్ని పరిష్కరించే అధికారాలు ఉండవు. ► ఈ చట్టం ప్రకారం భూమి యజమానిగా ఒకసారి నిర్ధారణ అయితే అదే ఫైనల్. ఆ భూమి వివాదంలో పడి భూములు కోల్పోయే పరిస్థితులు ఉండవు. టైటిల్ రిజిస్టర్లో పేరు నమోదయ్యాక ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రెండు సంవత్సరాల లోపే చెప్పాలి. రెండేళ్ల లోపు ఎటువంటి అభ్యంతరం రాకపోతే ఆ తర్వాత కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదు. టైటిల్ నిర్థారణ అయిన రెండేళ్లలోపే దాన్ని ఛాలెంజ్ చేయాలి. అలా చేయని పక్షంలో టైటిల్ రిజిస్టర్లో ఉన్న పేరే ఖరారవుతుంది. భూ యజమాని హక్కులకు పూచీ ప్రభుత్వానిదే ► టైటిల్ రిజిష్టర్‌లో నమోదైన వివరాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుంది. ప్రస్తుతం రికార్డులో ఉన్న వివరాలకు ప్రభుత్వ గ్యారంటీ లేదు. 1బిలో ఉన్నా, అడంగల్‌లో ఉన్నా, ఆర్‌ఎస్‌ఆర్‌లో ఉన్నా ప్రభుత్వ గ్యారంటీ ఉండదు. ఈ గ్యారంటీ లేకపోవడాన్నే ప్రిజెంటివ్ రైట్స్ అనేవారు. 1బిలో ఉన్న పేరుపైన ఎవరైనా కోర్టుకు వెళ్లి అది తప్పని నిరూపించే వరకు అది కరెక్ట్ అని భావించేవారు. ► ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పుల్లో రెవెన్యూ రికార్డుల్లో పేరున్నంత మాత్రాన అతను భూ యజమాని కాదని, రెవెన్యూ రికార్డులు యాజమాన్య హక్కులకు సాక్ష్యంగా పనికి రావని స్పష్టం చేసింది. ఎందుకంటే అవన్నీ శిస్తు వసూలు చేయడానికి బ్రిటీష్ హయాం నుంచి రాసిన లెక్కల పుస్తకాలు. అందులో పన్ను ఎంత కట్టాలో ఉంటుంది తప్ప ఆ భూమి ఎవరిదో ఉండదు. ► టైటిలింగ్ చట్టం కింద రూపొందిన రిజిస్టర్ ప్రకారం ప్రిజెంటివ్ రికార్డు వ్యవస్థ స్థానంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ వస్తుంది. పాత రికార్డులేవీ చెల్లవు. భూమి హక్కుల చరిత్ర కొత్తగా మొదలవుతుంది. ఒకసారి టైటిల్ రిజిస్టర్లో పేరు వచ్చిన తర్వాత ఏదైనా నష్టం జరిగిందని భూ యజమాని నిరూపించుకోగలిగితే బీమా సైతం ఇస్తారు. భూమి హక్కులకు ఇబ్బంది కలిగితే టైటిల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చట్టంలో పేర్కొన్నారు. టైటిల్ రిజిస్టర్‌గా మారనున్న ఆర్ఓఆర్ రికార్డు ► ఈ చట్టం అమలు కోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఆ శాఖలను పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో టైటిల్ గ్యారంటీ అథారిటీలు ఏర్పాటవుతాయి. టైటిల్ రిజిస్టర్లను నిర్ధిష్ట విధానంలో ఈ అథారిటీలే ఖరారు చేస్తాయి. వారి ఆధ్వర్యంలోనే రిజిస్టర్లు నిర్వహిస్తారు. భూముల రిజిస్ట్రేషన్ ఎక్కడైనా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్పటి వరకు సబ్ రిజి్రస్టార్ కార్యాలయాల్లో దస్తావేజుల రిజిస్ట్రేషన్ మాత్రమే జరుగుతోంది. హక్కుల రిజిస్ట్రేషన్ జరగడం లేదు. ► పాత వ్యవస్థ స్థానంలో టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ వస్తుంది. భూముల రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడే టైటిల్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అమ్మేవాడికి టైటిల్ ఉంటేనే కొనేవాడికి వస్తుంది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో టైట్లింగ్ అథారిటీలు, గ్రామ స్థాయి నుంచి పై వరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, భూ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ వ్యవస్థలు ఏర్పాటవుతాయి. ► రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న భూముల రీ సర్వేలో తయారవుతున్న కొత్త రికార్డులను ల్యాండ్ టైట్లింగ్ చట్టం కింద నోటిఫై చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రీ సర్వేలో రూపొందించిన డిజిటల్ రికార్డులను ఆర్ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) చట్టం కింద నోటిఫై చేస్తున్నారు. టైటిల్ గ్యారంటీ చట్టం ప్రకారం ఆర్ఓఆర్ రికార్డు టైటిల్ రిజిస్టర్‌గా మారుతుందని చెబుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ చట్టం ఇప్పటికే అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరలో విధివిధానాలు రూపొందించనుంది. గొప్ప ముందడుగు ల్యాండ్ టైట్లింగ్ చట్టం తేవడం చాలా గొప్ప ముందడుగు. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. టైటిల్‌కు భద్రత ఉంది కాబట్టి వేరే ప్రాంతంలో ఉన్న వాళ్లు కూడా ఆంధ్రాలో భూమి కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. వివాదాలు తగ్గిపోయి ఆర్థిక ప్రగతి బాగా పుంజుకుంటుంది. భూ యజమానికి భరోసా ఉంటుంది. ఈ ఫలితాలు అందరికీ దక్కాలంటే ప్రభుత్వం పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. దీనిపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాలి. ఇది ఒక ల్యాండ్ మార్క్ చట్టం కాబట్టి ఇందులో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. చట్టం అమలులో పేదల కోసం పారా లీగల్ వ్యవస్థ వంటిది ఏర్పాటు చేసుకోవాలి. ఈ చట్టాన్ని అమలు చేసే యంత్రాంగానికి పూర్తి స్థాయిలో రీఓరియెంటేషన్ అవసరం. ఇది ఆర్ఓఆర్ చట్టం లాంటిది కాదు. దీనిపై అధికారులకు పూర్తి అవగాహన కల్పించాలి. ఇవన్నీ చేస్తే ఐదేళ్లలో ఆర్థిక ప్రగతిలో ఏపీ అద్భుతంగా దూసుకుపోయే అవకాశం ఉంటుంది. – ఎం సునీల్‌కుమార్, భూ చట్టాల నిపుణుడు, నల్సార్ లా వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ -
ఆదాయార్జన శాఖలపై సీఎం జగన్ సమీక్ష
-
రక్షణ విస్మరించి.. అడ్డగించి.. ‘కోట్‌పల్లి’కి పర్యాటకులు రాకుండా అడ్డుకుంటున్న అధికారులు
ధారూరు: కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద పర్యాటకులకు రక్షణ కల్పించాల్సిన అధికారులు ఆ విషయాన్ని మరచి.. అక్కడికి ఎవ్వరూ రాకుండా నిషేధం విధించడం విమర్శలకు తావిస్తోంది. జనవరి 16న పూడూర్ మండలం మన్నెగూడకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు యువకులు ఈత కోసం ప్రాజెక్టుకు వచ్చి నీట మునిగి చనిపోయారు. దీన్ని సాకుగా చూపి పోలీసు, ఫారెస్టు, రెవెన్యూ శాఖల అధికారులు ప్రాజెక్టు వద్దకు పర్యాటకులు రాకుండా అడ్డుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే వారికి సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు రక్షణ చర్యలు చేపట్టాల్సిన అధికారులు ఆ విషయాన్ని విస్మరించి ఇలా నిషేధం విధించడం ఏమిటని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఆదివారం, సెలవు దినాల్లో కోట్‌పల్లికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ నీటిలో సరదాగా ఆడుకొని సేద తీరుతారు. యువతీ యువకులు గంటల తరబడి నీటిలో సరదాగా ఈత కొడతారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకే తలమానికమైన ఈ ప్రాజెక్టును పర్యాటక రంగానికి దూరం చేయడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నించారు. ప్రాజెక్టు వద్ద కాయ కింగ్ బోటింగ్ సైతం నిషేధించారు. 6 నెలల గడిచినా బోటింగ్ సంస్థకు అనుమతి ఇవ్వకపోవడంతో వారు హైకోర్టుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికై నా ప్రభుత్వం చొరవ తీసుకొని కోట్‌పల్లి ప్రాజెక్టు వద్ద ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టడంతోపాటు పర్యాటకులు, బోటింగ్‌కు అనుమతి ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. -
రిజిస్ట్రేషన్ కాగానే యాజమాన్య హక్కు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆటో మ్యుటేషన్ విధానం త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న మ్యుటేషన్ (యాజమాన్య హక్కు బదిలీ) విధానాన్ని సులభతరం చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీసుకురానుంది. స్థిరాస్తుల క్రయవిక్రయాలు జరిగిన తర్వాత వాటిని తమ పేరు మీదకు మార్చుకోవడం ఇప్పుడున్న విధానంలో క్లిష్టతరంగా ఉంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మళ్లీ మ్యుటేషన్ కోసం రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకోవడం, నిర్దిష్ట గడువులో ఆ శాఖ దాన్ని పూర్తి చేయడానికి కొంత సమయం పడుతోంది. మధ్యలో కొన్ని వివాదాలకు సైతం ఆస్కారం ఏర్పడుతోంది. గతంలో ఎంతో ప్రహసనంగా ఉన్న మ్యుటేషన్ ప్రక్రియను వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక నిరంతరం సమీక్షలతో ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నా.. మరింత సులభతరం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఎంతోకాలం నుంచి కాగితాలకే పరిమితమైన ఆటో మ్యుటేషన్ ప్రతిపాదనను వాస్తవ రూపంలోకి తీసుకు రానున్నారు. రూపొందిన ప్రత్యేక అప్లికేషన్.. ఇందుకోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్‌వేర్‌కు, రెవెన్యూ శాఖ వెబ్‌ల్యాండ్ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేస్తున్నారు. ఇందుకోసం ఒక ప్రత్యేక అప్లికేషన్‌ను రూపొందించారు. తత్ఫలితంగా ఏదైనా ఆస్తి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ జరిగిపోతుంది. రిజిస్ట్రేషన్ జరిగిందంటే రెవెన్యూ రికార్డుల్లోనూ యాజమాన్య హక్కు దానంతట అదే మారిపోతుంది. రెవెన్యూ వ్యవస్థలో ఇది అత్యంత కీలకమైన మార్పుగా చెబుతున్నారు. ఆటో మ్యుటేషన్ విధానాన్ని తొలుత భూముల రీ సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో అమల్లోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన టెస్టింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఆటో మ్యుటేషన్‌ను అందుబాటులోకి తీసుకురావాలనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
ప్రభుత్వ భూమిని రక్షించడం కోసమే పెన్సింగ్:ఆర్డీవో
-
ములుగు జాతీయ రహదారి పనుల్లో ఫారెస్ట్ X రెవెన్యూ
ములుగు: జాతీయ రహదారి విస్తరణ పనుల్లో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు పొంతన కుదరడం లేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతున్నాయి. ఆరెపల్లి నుంచి ములుగు మండలం గట్టమ్మ ఆలయం వరకు రోడ్డు విస్తరణకు అనుమతులు రావడంతో సంబంధిత శాఖ టెండర్ పిలిచి పనులు చేపట్టింది. ములుగు మండల పరిధిలోని మహ్మద్‌గౌస్ పల్లి నుంచి మల్లంపల్లి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కెనాల్ వరకు పనులు శరవేగంగా సాగుతున్నాయి. జాకారం ఫారెస్ట్ కంపార్ట్మెంట్ 598, 599, 680 పరిధిలోని కెనాల్ నుంచి జాకారం సాంఘీక సంక్షేమ గురుకులం పక్కన ఉన్న నాగిరెడ్డికుంట వరకు, గట్టమ్మ ఆలయం నుంచి పానేస కాల్వ వరకు పనులు నిలిచిపోయాయి. ఈ భూమి మాదంటే మాది అంటూ అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు భీష్మించుకుని కూర్చోవడంతో సమస్య ఉత్పన్నం అయ్యింది. వేరే దగ్గర భూమి ఇవ్వాలని.. వాస్తవానికి కెనాల్ నుంచి ఇరువైపులా ఉన్న భూమి అన్యాక్రాంతం కాకుండా కొన్ని సంవత్సరాలుగా అటవీ శాఖ సంరక్షించుకుంటూ వస్తోంది. ఎన్‌హెచ్ రోడ్డు పక్కన విలువైన టేకు, కొడిశ, నల్లమద్ది, ఏరుమద్ది, బిలుగు, సండ్ర, గుల్మోహర్, సిస్సు, నెమలినార, నారేప, చిందుగ వంటి చెట్లను ఇతరులు కొట్టకుండా ఈ ప్రదేశం చుట్టూ ట్రెంచ్ వేసింది. అయితే ఇప్పుడు రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 53/2, 53/19 భూమి రెవెన్యూకు సంబంధించిన ఆస్తి అని పంచాయతీని మొదటికి తీసుకువచ్చింది. ఈ క్రమంలో ఇరు శాఖల అధికారులు తమతమ దగ్గర ఉన్న ఆధారాలతో పలుమార్లు చర్చలు జరిపారు. అయినా విషయం కొలిక్కి రాలేదు. జాతీయ రహదారి పక్కన ఉన్న భూమి మా దేనని, ఒక వేళ విస్తరణకు భూమిని తీసుకుంటే ఇరువైపులా 12.5 మీటర్ల చొప్పున 11.34 ఎకరాల భూమిని మరోచోట అప్పగించాలని అటవీ శాఖ ప్రపోజల్ పెట్టింది. అయితే దీనికి రెవెన్యూ శాఖ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఉన్న చెట్లను కొట్టేసే క్రమంలో కాంపన్స్ట్రేషనరీ ఎఫారెస్ట్రేషన్ కింద రూ.16 లక్షలు చెల్లించాలని పెట్టిన ప్రపోజల్స్‌కు సైతం ససేమీరా ఒప్పుకోకపోవడంతో అప్పటి డీఎఫ్ఓ కిష్టాగౌడ్ పలుమార్లు పనులకు అడ్డుతగిలినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో డీఎఫ్‌ఓపై ఫిర్యాదులు అందాయని, ఆయన బదిలీకి ఇది ఒక కారణమని తెలుస్తుంది. గతంలోనూ అంతే.. సమీకృత కలెక్టరేట్ కార్యాలయ పనుల్లో భాగంగా స్థల సేకరణ సమయంలో రెవెన్యూ–అటవీ అధికారులకు భూమి హద్దుల విషయంలో ఇదే విధంగా జరిగింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేపట్టడం అటవీ అధికారులు అడ్డుకోవడం పలుమార్లు జరిగింది. దీంతో అటవీ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్, అధికారులపై ఎఫ్‌సీ–1980 చట్టం కింద కేసు పెట్టారు. ప్రస్తుతం అది కొనసాగుతోంది. ఎన్‌హెచ్ అధికారులకు నోటీసులు ఎన్‌హెచ్ విస్తరణ విషయం లోలోపల చిలికిచిలికి గాలివానగా మారుతుందని ఇరుశాఖల మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులతో ఇటు పీసీసీఎఫ్, అటు సీఎస్‌కు ఫైల్స్ అందాయని సమాచారం. దీంతో స్పందించిన పీసీసీఎఫ్ నేషనల్ హైవే వరంగల్ డివిజన్ అధికారులకు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్(ఎఫ్‌సీ)–1980 ప్రకారం నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు నేషనల్ హైవే ఇరువైపులా చెట్లకు సంబంధించిన సర్వే చేపట్టకూడదని సిరికల్చర్, హార్టికల్చర్ అధికారులకు ఎఫ్‌సీ యాక్ట్ ప్రకారం నోటీసులు ఇచ్చింది. అయినా అధికారులు చెట్లకు నంబరింగ్ ఇస్తున్నట్లుగా అటవీ అధికారవర్గాలు చెబుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడితే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని అటవీ అధికారులు పట్టుపట్టి కూర్చున్నారు. ఈ విషయంలో ఇరుశాఖల రాష్ట్రస్థాయి అధికారులు రాజీకి వస్తే తప్పా కెనాల్ నుంచి నాగిరెడ్డి కుంట వరకు, డీబీఎం–38 కెనాల్(పానేసా కాల్వ) నుంచి గట్టమ్మ మధ్యలో విస్తరణ పనులు జరిగేలా కనిపించడం లేదు. -
81 శాతం భూరికార్డుల స్వచ్ఛీకరణ
సాక్షి, అమరావతి: భూముల రీసర్వే నేపథ్యంలో నిర్వహిస్తున్న భూ రికార్డుల స్వచ్చికరణ (ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్) రాష్ట్రవ్యాప్తంగా 81 శాతం పూర్తయింది. రాష్ట్రంలో వందేళ్ల తర్వాత వైఎస్సార్ జగనన్న భూరక్ష, శాశ్వత భూహక్కు పథకం పేరుతో నిర్వహిస్తున్న రీసర్వేలో రికార్డుల ప్రక్షాళన అత్యంత కీలకంగా మారింది. రీసర్వే ప్రారంభించాలంటే రికార్డులను అప్డేట్ చేయడం తప్పనిసరి. వెబ్‌ల్యాండ్ అడంగల్‌లను ఆర్ఎస్ఆర్తో పోల్చి చూడడం, అడంగల్‌లో పట్టాదారు వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చూసి సరిచేయడం, పట్టాదారు, అనుభవదారుల వివరాల కరెక్షన్, అప్డేషన్, పట్టాదారు డేటాబేస్‌ను అప్డేట్ చేయడం వంటివన్నీ కచ్చితంగా పూర్తిచేయాల్సి ఉంది. రెవెన్యూ యంత్రాంగం ఇవన్నీ పూర్తిచేసిన తర్వాతే సర్వే బృందాలు రీసర్వే ప్రక్రియను ప్రారంభిస్తాయి. ఈ నేపథ్యంలోనే రికార్డుల స్వచ్చికరణపై ప్రత్యేకదృష్టి సారించి చేస్తున్నారు. 26 జిల్లాల్లోని 17,564 గ్రామాలను మూడు కేటగిరీలుగా విభజించి స్వచ్ఛీకరణ చేపట్టారు. ఇప్పటివరకు 14,235 గ్రామాల్లో (81 శాతం) పూర్తయింది. అల్లూరి జిల్లాలో 25 శాతం మాత్రమే అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వందశాతం రికార్డుల స్వచ్చికరణను పూర్తిచేశారు. అనంతపురం జిల్లాలో 504 గ్రామాలకు 504, కర్నూలు జిల్లాలో 472కి 472, నంద్యాల జిల్లాలో 441కి 441 గ్రామాల్లో స్వచ్చికరణ పూర్తయింది. చిత్తూరు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో 99 శాతం స్వచ్చికరణ పూర్తయింది. ఈ జిల్లాల్లో రెండేసి గ్రామాల్లో మాత్రమే ఇంకా పూర్తికావాల్సి ఉంది. సత్యసాయి, తూర్పుగోదావరి, ప శ్చిమగోదావరి, కృష్ణాజిల్లాల్లో 98 శాతం స్వచ్ఛీకరణ పూర్తయింది. అతి తక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 25 శాతం స్వచ్ఛీకరణనే పూర్తిచేయగలిగారు. ఆ తర్వాత విశాఖపట్నం జిల్లాలో 44 శాతం, పార్వతీపురం మన్యం జిల్లాలో 61 శాతం స్వచ్చికరణ పూర్తయింది. రెండునెలల్లో అన్ని జిల్లాల్లో వందశాతం రికార్డుల స్వచ్చికరణ పూర్తిచేసేందుకు రెవెన్యూశాఖ ప్రణాళిక రూపొందించి పనిచేస్తోంది. -
30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం చరిత్ర : మంత్రి ధర్మాన
-
ఆదాయార్జన శాఖలపై సీఎం జగన్ సమీక్ష
-
రెవెన్యూ, ద్రవ్య లోటు తగ్గింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రెవెన్యూ, ద్రవ్యలోటును తగ్గించడమే లక్ష్యంగా ఆర్థిక శాఖ అడుగులేస్తోంది. ఇందులో భాగంగా ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం)లో ఇటీవల సవరణలు చేసింది. ప్రస్తుత సంవత్సరపు ఆర్థిక విధాన వ్యూహం, మధ్యకాలిక ఆర్థిక విధానాన్ని ఎఫ్ఆర్బీఎం పత్రంలో ఆర్థిక శాఖ దీనిని వెల్లడించింది. 2025–26 ఏడాది నాటికి రెవెన్యూ లోటును 2.4 శాతానికి.. ద్రవ్యలోటును 3.5 శాతానికి తగ్గించనున్నట్లు అందులో పేర్కొంది. అప్పుల శాతం కూడా తగ్గింపు ఇక రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులను 2025–26 నాటికి 35.5 శాతానికి తగ్గించాలని కూడా ఆర్థిక శాఖ లక్ష్యంగా నిర్ధారించింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది (2022–23)లో ఎఫ్ఆర్బీఎం ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం 36.30గా ఉంది. అయితే, దీనిని 32.79 శాతానికే పరిమితం చేయనున్నట్లు రాష్ట్ర ద్రవ్య విధాన పత్రంలో ఆర్థికశాఖ పేర్కొంది. అంతకుముందు 2021–22 బడ్జెట్ అంచనాల్లో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 35% ఉంటాయని అంచనా వేయగా సవరించిన అంచనాల మేరకు అప్పులు 32.51 శాతానికి తగ్గాయి. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ద్రవ్యలోటు 5% ఉంటుందని అంచనా వేయగా సవరించిన అంచనాల మేరకు ద్రవ్యలోటు 3.18 శాతానికి తగ్గింది. కోవిడ్ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ సూచనల మేరకు అన్ని రాష్ట్రాలు ఎఫ్ఆర్బీఎం చట్టాల్లో సవరణలు చేసుకున్నాయి. అదే తరహాలో ఏపీ కూడా సవరణలు చేయడమే కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో ద్రవ్య, రెవెన్యూ లోటును తగ్గించాలని లక్ష్యంగా నిర్ధారించుకుంది. పన్ను ఎగవేతలను, లీకేజీలను నిరోధించడం ద్వారా రాష్ట్ర సొంత ఆదాయం పెంచుకోవాలని, లావాదేవీల వ్యయాన్ని తగ్గించడంతో పాటు మరింత సమర్ధవంతంగా పన్ను, పన్నేతర ఆదాయాలను రాబట్టుకోవాలని నిర్ణయించింది. -
సర్వే బాధ్యతలు గ్రామ సర్వేయర్లకు..
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సర్వేయర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. భూముల సర్వే సహా ఇతర ముఖ్యమైన మండల సర్వేయర్ల బాధ్యతలను వీరికి బదలాయించింది. సర్వేను వేగంగా నిర్వహించి దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మండల సర్వేయర్లు మండలానికి ఒక్కరే ఉండడంతో సర్వే వ్యవహారాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. సర్వే కోసం భూయజమానులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది. దీనిపై ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సర్వే పనులు వేగంగా పూర్తి చేసేందుకు మండల సర్వేయర్ల బాధ్యతలను గ్రామ, వార్డు సర్వేయర్లకు అప్పగించింది. 1983 తర్వాత.. గ్రామ స్థాయికి సర్వే సర్వీసు ప్రధానంగా రికార్డుల ప్రకారం భూముల సరిహద్దుల్ని నిర్ధారించే ఎఫ్.లైన్ సర్వీసును గ్రామ సర్వేయర్లకు బదలాయించారు. ఎఫ్ఎంబీ (ఫీల్డ్ మెజర్మెంట్ బుక్), ఎల్పీఎం (ల్యాండ్ పార్సిల్ మ్యాప్), పీపీఎం (ప్రోపర్టీ పార్సిల్ మ్యాప్) ప్రకారం భౌతికంగా క్షేత్రస్థాయిలో హద్దుల్ని తెలిపేదాన్ని ఎఫ్ లైన్ సర్వీసుగా చెబుతారు. ఎవరైనా తమ భూములు, స్థలాల్ని విక్రయించినప్పుడు, భూమి హద్దుల్ని తనిఖీ చేసుకోవాలనుకున్నప్పుడు సర్వే కోసం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకుంటారు. 1983కి ముందు సర్వే శాఖలో కింది స్థాయిలో ఉన్న తాలూకా సర్వేయర్ ఈ పని చేసేవారు. ఆ తర్వాత మండల వ్యవస్థ రావడంతో మండల సర్వేయర్లు ఆ బాధ్యత నిర్వహిస్తున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిపాలనను గ్రామ స్థాయికి తీసుకువచ్చి గ్రామ, వార్డు సచివాలయాలు నెలకొల్పారు. సచివాలయాల్లో ప్రత్యేకంగా 11 వేల మంది సర్వేయర్లను ప్రభుత్వం నియమించింది. ఇప్పుడు మండల సర్వేయర్ల బాధ్యతల్ని వాళ్లకి అప్పగించి సర్వే సర్వీసుల్ని ప్రజలకు మరింత దగ్గరకు చేర్చింది. ఇందుకనుగుణంగా సర్వే ప్రక్రియలో మార్పులు చేసింది. 15 రోజుల్లో సర్వే దరఖాస్తును పరిష్కరించాలని నిర్దేశించింది. గ్రామ సర్వేయర్ సర్వే నిర్వహించాల్సిన విధానం, అభ్యంతరాల పరిశీలన, దరఖాస్తును తిరస్కరిస్తే ఏ కారణాలతో తిరస్కరించాలో మార్గదర్శకాలు ఇచ్చింది. సాధారణంగా నిర్వహించే భూముల రికార్డుల నిర్వహణను కూడా వారికే అప్పగించింది. (క్లిక్: సంక్షేమాభివృద్ధి పథకాలు ఆపేయాలట!) 27 రోజుల్లో సబ్ డివిజన్ పూర్తి చేయాలి భూముల సబ్ డివిజన్ బాధ్యతను కూడా మండల సర్వేయర్ నుంచి గ్రామ సర్వేయర్లకు బదలాయించింది. భూముల రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యుటేషన్, సబ్ డివిజన్ చేసుకోవాలని ఇటీవల ప్రభుత్వం నిర్దేశించింది. ఈ క్రమంలో సబ్ డివిజన్ కేసుల్ని వేగంగా పూర్తి చేసేందుకు ఆ బాధ్యతలు గ్రామ సర్వేయర్లకు అప్పగించింది. స్క్రుటినీ బాధ్యతల్ని మాత్రం మండల సర్వేయర్లు చేస్తారు. 27 రోజుల్లో సర్వే సబ్ డివిజన్ పూర్తి చేయాలని నిర్దేశించింది. సర్వే దరఖాస్తుల తిరస్కరణ ఆర్డీవో, సబ్ కలెక్టర్ స్థాయిలోనే చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి రెండు వేర్వేరు సర్క్యులర్లను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూపరిపాలనా ప్రధాన కమిషనర్ సాయి ప్రసాద్ విడుదల చేశారు. (క్లిక్: ఏపీలో 4 వేల ‘ఈవీ’ చార్జింగ్ స్టేషన్లు) -
రిజిస్ట్రేషన్లు, ఆదాయంలో... రాష్ట్రం రియల్ రికార్డు
సాక్షి, అమరావతి: స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు, ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు సృష్టించింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 2021–22లో ఏకంగా రూ.7,327.24 కోట్ల ఆదాయాన్ని (35 శాతం వృద్ధి) అర్జించింది. ఒక్క మార్చి నెలలోనే రూ.1,000 కోట్ల ఆదాయం సమకూరడం గమనార్హం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఇది నిదర్శనంగా ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. రియల్ బూమ్‌తో రికార్డులు సృష్టించామని గొప్పలు చెప్పుకున్న టీడీపీ హయాంతో పోల్చితే ఈ ఆదాయం చాలా ఎక్కువ కావడం విశేషం. కోవిడ్‌తో ఆర్థిక పరిస్థితులు తల్లకిందులైనా 35 శాతం వృద్ధి రేటు నమోదైంది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళుతుందనేందుకు ఇదే ఉదాహరణ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ పాలనలో ఏ సంవత్సరమూ రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.5 వేల కోట్లు దాటలేదు. 2014లో 13.70 లక్షలు మాత్రమే ఉన్న రిజిస్ట్రేషన్లు తాజాగా 20.76 లక్షలు దాటాయి. దీన్నిబట్టి స్థిరాస్తి లావాదేవీలు భారీగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. దూకుడు ఇలా.. రిజిస్ట్రేషన్ల ఆదాయంలో 59.15% వృద్ధి రేటుతో నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో నిలవగా 7.40 శాతం వృద్ధితో అనంతపురం చివరి స్థానంలో ఉంది. ఎక్కువ ఆదాయం విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి లభించింది. విశాఖపట్నం జిల్లా నుంచి రూ.1,117.45 కోట్ల అత్యధిక ఆదాయం లభించింది. శ్రీకాకుళం జిల్లా నుంచి అతి తక్కువగా రూ.203.61 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి నిదర్శనం రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం పెరగడం శుభ పరిణామం. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఇది నిదర్శనం. రిజిస్ట్రేషన్ల శాఖలో పలు మార్పులు తెచ్చాం. ప్రజల సంక్షేమం, మెరుగైన సేవలందించేందుకు కట్టుబడి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. అందువల్లే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంతగా రూ.7327.24 కోట్ల ఆదాయం రిజిస్ట్రేషన్ల ద్వారా సమకూరింది. – రజత్ భార్గవ, ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ (స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్) సత్వర సేవలతోపాటు ఆదాయం ప్రజలకు సత్వర సేవలు అందించడంతో పాటు మెరుగైన ఆదాయాన్ని సాధించాం. ఆదాయానికి గండి పడుతున్న చోట కొద్దిపాటి మార్పులతో సత్ఫలితాలు వచ్చాయి. – వి.రామకృష్ణ, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ (చదవండి: చైనా చదువులపై తస్మాత్ జాగ్రత్త) -
ఆందోళనలో ఆ 22 వేల మంది ఉద్యోగులు.. కేసీఆర్ కనికరిస్తారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ రెవెన్యూ సహాయకులుగా (వీఆర్ఏ) పని చేస్తున్న 22 వేల మంది సిబ్బంది పరిస్థితి డోలాయమానంలో పడింది. ఏళ్ల తరబడి వేతనాలు పెరగకపోవడం, పదోన్నతులు రాకపోవడంతో పాటు వీఆర్వోల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో తమ భవిష్యత్తు ఏంటనే బెంగ వీఆర్ఏలు, వారి కుటుంబ సభ్యులకు పట్టుకుంది. తమను రెవెన్యూలోనే కొనసాగిస్తారా? ఎంతమందిని కొనసాగిస్తారు? ఇతర శాఖలకు పంపుతారా? అసలు ఉద్యోగాలను ఉంచుతారా? తీసేస్తా రా? అనే సందేహాలు వీఆర్ఏ వర్గాల్లో వ్యక్తమ వుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమకు పేస్కే ల్ వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో హామీ ఇచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా అమలు కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు ఆందోళన బాట పట్టారు. అన్నీ పెండింగ్‌లోనే.. క్షేత్రస్థాయిలో జరిగే రెవెన్యూ కార్యకలాపాలకు సహాయకులుగా ఉండేందుకు ప్రభుత్వం వీఆర్ఏలను నియమించింది. వీరిలో కొందరిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయగా, చాలామందిని నేరుగానే నియమించింది. 2007 నుంచి వీరికి నెలకు రూ.10,500 వేతనం ఇస్తున్నారు. టీఏ, డీఏలు కలిపి గ్రామీణ ప్రాంతాల్లో రూ.11,400, పట్టణ ప్రాంతాల్లో రూ.11,500 చొప్పున వేతనం వస్తోంది. అయితే తమకు ఉద్యోగ భద్రత కోసం పేస్కేల్ వర్తింపజేయాలని వీఆర్ఏలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. పేస్కేల్ అమల్లోకి వస్తే హెల్త్‌కార్డులు వస్తాయని, టీఏ, డీఏలతో పాటు అన్ని అల వెన్సులు క్రమం తప్పకుండా పెరుగుతాయనే ఆలోచనతో వీఆర్ఏలు ఈ డిమాండ్ చేస్తు న్నారు. వాస్తవానికి వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చారు. పదోన్నతులు ఇస్తామని, వారసత్వ ఉద్యోగాలకు అవకాశమిస్తామని కూడా హామీ ఇచ్చారు. వీటితో పాటు డైరెక్ట్ వీఆర్ఏల సర్వీసులను క్రమబద్ధీకరించే అంశం కూడా పెండింగ్‌లోనే ఉంది. మూడు రకాలుగా వర్గీకరణ! విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తోన్న వీఆర్ఏలను మూడు రకాలుగా వర్గీకరించాలని ఉన్నతస్థాయిలో ప్రతిపాదనలు వచ్చినట్టు సమాచారం. అందులో 3,300 మందికి పైగా వీఆర్ఏలను సాగునీటి శాఖలో లష్కర్లుగా పంపాలన్న దానిపై దాదాపు ఏకాభిప్రాయం వచ్చిందని తెలుస్తోంది. ఇక మిగిలిన వారిని స్కిల్డ్, అన్‌స్కిల్డ్ పేరుతో వర్గీకరించారు. స్కిల్డ్ ఉద్యోగులను రెవెన్యూలోనే కొనసాగించాలని, గ్రామానికొకరిని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక, మిగిలిన 8–9 వేల మందిని అన్‌స్కిల్డ్ కేటగిరీలో చేర్చగా, వీరిని ఏం చేస్తారన్నదే తెలియడం లేదు. ఈ నేపథ్యంలోనే వీఆర్ఏలు సోమ, మంగళ వారాల్లో ధర్నాలకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వీఆర్ఏ, వీఆర్వోల సమస్యలను పరిష్కరించాలని డైరెక్ట్ రిక్రూట్ మెంట్ వీఆర్ఏల సంఘం గౌరవాధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్ కోరారు. వీఆర్ఏల డిమాండ్లివే.. ♦సీఎం హామీ ఇచ్చిన విధంగా పేస్కేల్ వర్తింపజేయాలి. ♦55 ఏళ్లు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ♦అర్హులైన వీఆర్ఏలకు వెంటనే పదోన్నతులు కల్పించాలి. ♦అందరికీ సొంత గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. ♦విధుల్లో భాగంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. -
ఐఏఎస్‌లకు జైలు శిక్ష నిలుపుదల
సాక్షి, అమరావతి: పలువురు ఐఏఎస్ అధికారులకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం నిలుపుదల చేసింది. కోర్టు ధిక్కార కేసులో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్‌కు నాలుగు వారాల జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్‌కు నెల జైలు, రూ.2 వేల జరిమానా, అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజుకు రెండు వారాల జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా, అప్పటి మరో కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు, ప్రస్తుత కలెక్టర్ ఎన్వీ చక్రధర్‌లకు రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం ఈ ఉత్తర్వులను ధర్మాసనం నిలుపుదల చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది. నెల్లూరు జిల్లాలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్‌కు భూమి కేటాయించేందుకు వెంకటాచలం మండలం ఎర్రగుంటకు చెందిన తాళ్లపాక సావిత్రమ్మకు చెందిన మూడెకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే సావిత్రమ్మకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. దీంతో ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు. పరిహారం ఇవ్వాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. చదవండి: తెలంగాణ శాసన సభాసమరానికి సర్వం సిద్ధం అయినా కూడా పరిహారం ఇవ్వకపోవడంతో ఆమె కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ విచారణ జరిపారు. చివరకు ఈ ఏడాది మార్చి 3న పరిహారం మొత్తాన్ని సావిత్రమ్మ బ్యాంకు ఖాతాలో వేశారు. కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన నాలుగేళ్ల తర్వాత పరిహారం డిపాజిట్ చేయడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం చెల్లింపులో జరిగిన జాప్యానికి రెవెన్యూ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, అప్పటి, ప్రస్తుత కలెక్టర్లే బాధ్యులని తేల్చి వారికి జైలుశిక్ష, జరిమానా విధించారు. ఈ తీర్పుపై ముత్యాలరాజు, మన్మోహన్ సింగ్లతోపాటు మిగిలిన అధికారులు కోర్టు ధిక్కార అప్పీళ్లు దాఖలు చేశారు. -
పోడు..‘గోడు’ వినే వారేరీ?
ఈ ఫొటోలో కనిపిస్తున్న గ్రామం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వేలుబెల్లి. కాకతీయుల కాలం నుంచే ఉన్న ఈ గ్రామంలో సామంత రాజులు అప్పట్లోనే వేలుబెల్లి పెద్ద చెరువును తవ్వించారు. 600 కుటుం బాలు, 2 వేల జనాభా ఉన్న ఈ గ్రామంలోని గిరిజనులు, గిరిజనేతరులు కలిసి.. 3వేల ఎకరాల భూమిని సాగుచేసుకుంటున్నారు. అందులో 200 ఎకరాలకు 1/70 ద్వారా పట్టాలు ఇవ్వగా.. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 36 మంది గిరిజనులకు మరో 200 ఎకరాలకు హక్కుపత్రాలు ఇచ్చారు. మిగతా 2,600 ఎకరాలకు పట్టాలు లేవు. 2018 తర్వాత నిర్వహించిన రెవెన్యూ– ఫారెస్టు సరిహద్దుల గుర్తింపులో భాగంగా.. ఈ గ్రామస్తులు సాగుచేసుకుంటున్న భూమి అడవిపరిధిలో ఉందని రికార్డుల్లో నమోదు చేశారు. అటవీశాఖ అధికారులు సరిహద్దు గుర్తులు పెట్టి ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వందల ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమి అటవీశాఖదేనని అంటుండటం తో.. గ్రామస్తులకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. కేసులు భరించలేక వలస బాట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మొండికట్ట గ్రామంలో గిరిజనేతర రైతులు సుమారు 250 ఎకరాల పోడు భూముల్లో రెండేళ్ల కిందటి వరకు వ్యవసాయం చేశారు. కానీ అటవీశాఖ అధికారులు రైతులను అడ్డుకున్నారు. మొదట 22 మందిపై, తర్వాత మరో 18 మందిపై కేసులు పెట్టారు. ఆ రైతులు కోర్టు చుట్టూ తిరగలేక, కేసులను ఎదుర్కొనే ధైర్యం లేక.. ఆ గ్రామం వదిలి జీవనోపా«ధి కోసం వలస పోయారు. అటవీశాఖ సిబ్బంది ఆ పోడు భూముల్లో హరితహారం మొక్కలు నాటారు. .. ఇలా ఒకటి రెండు చోట్ల కాదు.. రాష్ట్రంలోని ఆదిలాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం దాకా అటవీ ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తున్న గిరిజనుల పరిస్థితి ఇది. అవి ఫారెస్టు భూములంటూ స్వాధీనం చేసుకోవడానికి అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తుండగా.. అడవినే నమ్ముకొని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములపై తమకు హక్కు ఉందని, వాటిని వదిలి ఎక్కడికి వెళ్లాలని గిరిజనులు వాపోతున్నారు. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ పోడు భూమి సమస్య ఎప్పుడు తీరుతుందా అని ఎదురుచూస్తున్నారు. గూగుల్ సర్వేతో.. ప్రభుత్వం భూప్రక్షాళన, అటవీ భూముల క్రమబద్ధీకరణ, అడవుల సంరక్షణ పేర్లతో గూగుల్ సర్వే నిర్వహించి.. ఆ డేటాను జీఏఆర్‌ఎస్ (గ్లోబల్ ఏరి యా రిఫరెన్స్ సిస్టమ్)కు అనుసంధానం చేసింది. వందల ఏళ్ల నాటి అడవుల సరిహద్దులను నిక్షిప్తం చేసింది. ఈ క్రమంలో గిరిజనులు ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములు కూడా అడవుల పరిధిలోనే ఉన్నాయని చూపిస్తోంది. ఆయా ప్రాంతాల్లో ట్రెంచ్‌లు వేస్తున్నారు. ఇదేమిటంటూ గిరిజనులు ఆందోళనలో మునిగిపోతున్నారు. 3,31,070 ఎకరాలకు పట్టాలిచ్చిన వైఎస్సార్ 2004 సార్వత్రిక ఎన్నికల ముందు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రలో భాగంగా ఆదివాసీ, గిరిజన గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పోడు సమస్యను గుర్తించి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక 2006లో తెలంగాణలో హైదరాబాద్ మినహా ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో 99,486 మంది రైతులు సాగుచేసుకునే 3,31,070 ఎకరాల భూములకు భూమిహక్కు పత్రాలను ఇచ్చారు. ఆ తర్వాత పట్టించుకున్న వారే లేరు 2006 ఏడాదిలో, ఆ తర్వాత కూడా కొందరు గిరిజన రైతులు పోడు వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. దానికితోడు అప్పటికే పోడు చేస్తున్నా దరఖాస్తు చేసుకోని వారు కూడా ఉన్నట్టు అప్పట్లో అధికారులు గుర్తించారు. వారందరికీ హక్కు పత్రాలివ్వాలన్న ప్రతిపాదన వచ్చింది. కానీ, పలు కారణాలతో జాప్యం జరిగింది. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కలిపి 8 లక్షల ఎకరాల మేర పోడు భూముల సమస్య ఉందని గిరిజన సంఘాల నేతలు చెప్తున్నారు. ఈ భూములకు హక్కుపత్రాలిచ్చి అడవుల అభివృద్ధిలో భాగంగా పండ్ల తోటలను పెంచేలా ప్రోత్సహిస్తే.. ఇటు ప్రభుత్వ లక్ష్యం, ఇటు గిరిజనులకు ఉపాధి రెండూ నెరవేరుతాయని అంటున్నారు. – సాక్షి, మహబూబాబాద్ -
బల్దియాపై ఏసీబీ దాడులు.. రికార్డులు మాయం..
సాక్షి, జగిత్యాల: ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం.. అధికారుల ధనదాహం.. వెరసి జగిత్యాల మున్సిపాలిటీలో తవ్విన కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. నల్లా బిల్లులు, ఆస్తిపన్నులు, మ్యుటేషన్ల ద్వారా వచ్చిన సొమ్మును బల్దియా ఖజానాకు జమచేయడంలో కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈవిషయంలో బాధితులు కొందరు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఉప్పందించారు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. మున్సిపాలిటీలోని రెవెన్యూ విభాగంలో పలు దఫాలుగా తనిఖీలు చేస్తూనే ఉన్నారు. తాజగా మంగళవారం మరోసారి దాడులు చేయడం కలకలం సృష్టించింది. ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్.. బల్దియాలోని రెవెన్యూ విభాగంలో ఈనెల 13న ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. మ్యుటేషన్ రశీదుల్లో వ్యత్యాసం రావడంతో విచారణ జరిపారు. బాధ్యులైన సీనియర్ అసిస్టెంట్ అనూక్ కుమార్, బిల్‌కలెక్టర్ అనిల్‌ను 17న సస్పెండ్ చేశారు. ఇదే అంశంపై లోతుగా విచారణ జరిపేందుకు మంగళవారం ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో మరోసారి తనిఖీలు చేపట్టారు. రికార్డులు నిశితంగా ప రిశీలించారు. అయితే, కొన్ని కీలకమైన ఫైళ్లు, రికార్టులు సిబ్బంది మాయం చేసినట్లు సమాచారం. తీరు మారని మున్సిపాలిటీ.. మున్సిపాలిటీలో చోటుచేసుకుంటున్న అక్రమాలపై ఈ ఏడాది జనవరి 12న “అక్రమాల పర్వం’ శీర్షికన “సాక్షి’ కథనం ప్రచురించింది. రెవెన్యూ విభాగంలో అక్రమాలను నిగ్గుతేల్చింది. దీంతో ఫిబ్రవరి 9న ఏసీబీ అధికారులు దాడులు చేశారు. టౌన్‌ప్లానింగ్ అధికారితో పాటు అవుట్సోర్సింగ్ సిబ్బంది, లైసెన్స్డ్ ఇంజినీర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇంటి నిర్మాణ అనుమతుల కోసం ఓ ప్రభుత్వ వైద్యుడి నుంచి టౌన్‌ప్లానింగ్ అధికారి బాలానందస్వామి, అవుట్సోర్సింగ్ సిబ్బంది రాము, లైసెన్స్డ్ ఇంజినీర్ నాగరాజు కలసి రూ.లక్ష డిమాండ్ చేశారు. రూ.95 వేలకు ఒప్పందం చేసుకున్నారు. దీంతో సదరు వైద్యుడు ఏసీబీని ఆశ్రయించారు. తనిఖీల్లో 12 మందితో కూడిన బృందం ► బల్దియాలో అక్రమాలు భారీగా ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు.. మంగళవారం విస్తృతంగా తనిఖీలు చేశారు. ► ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో 12 మంది సభ్యులుగల బృందం రెవెన్యూ సెక్షన్లో రికార్డులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ► ఈ ప్రక్రియ అర్ధరాత్రి వరకూ కొనసాగుతూనే ఉంది. అన్నీ అక్రమాలే.. బల్దియాలోని రెవెన్యూ విభాగంలో మ్యుటేషన్ ప్రక్రియ అక్రమాలకు అనుకూలంగా మారింది. 2016లో ఆస్తుల మార్కెట్ వాల్యు ప్రకారం మ్యుటేషన్ కోసం 1.5 శాతం ఫీజు చెల్లించాలి. గత అక్టోబర్‌లో ప్రభుత్వం మ్యుటేషన్ ఫీజు 0.1శాతానికి తగ్గించింది. దీనిని ఆసరాగా చేసుకున్న సిబ్బంది 1990–95 మధ్య మ్యుటేషన్ కోసం వచ్చిన దరఖాస్తు దారుల నుంచి 1.5 శాతం ఫీజు వసూలు చేయాల్సి ఉంది. కానీ ఇక్కడే దందాకు తెరలేపారు. మ్యుటేషన్ ఫీజు 0.1శాతం తగ్గిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను ఆధారంగా చేసుకుని 1.5 శాతం ఫీజు తీసుకున్నారు. కానీ, 0.1శాతం ఫీజు తీసుకున్నట్లు ఆన్లైన్లో నమోదు చేశారు. మిగతా సొమ్ము నొక్కేశారు. శ్రీధర్ అనే వ్యక్తి తన ఆస్తి మ్యుటేషన్ కోసం ఇటీవల దరఖాస్తు చేశాడు. ఆస్తి విలువలో 1.5శాతం ఫీజు తీసుకుని 0.1శాతం రశీదు ఇచ్చారు. అనుమానం వచ్చిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రెవెన్యూ సెక్షన్‌పై ప్రత్యేక నజర్ ► రెవెన్యూ సెక్షన్లో 2016 నుంచి మ్యుటేషన్లకు సంబంధించిన రికార్డులను ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ► 2016 వరకు 1.5శాతం ఫీజు వసూలు చేయాల్సి ఉండగా, అధికారులు ఎంత వసూలు చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు. ► రశీదులు, ఆన్లైన్లో నమోదు చేసిన వివరాలన్నింటినీ చెక్ చేస్తున్నారు. ► మధ్యాహ్నం తనిఖీలు ప్రారంభించామని, ఏ సమయం వరకైనా విచారణ చేస్తామని ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు. రికార్డులు మాయం! రెవెన్యూ విభాగంలోని మ్యుటేషన్ ఫైళ్లు 2016 సంవత్సరం నుంచి తమకు ఇవ్వాలని ఏసీబీ అధికారులు మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. 2016 నుంచి ఇప్పటిదాకా నమోదు చేసిన ఫైళ్లు లభించడంలేదని తెలుస్తోంది. అప్పట్నుంచి అసలు రికార్డులు రాశారా? లేదా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ మొత్తం ఫైళ్లు లభించకుంటే సిబ్బందిపై తగిన చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రికార్డులు పరిశీలిస్తున్నారు. రెవెన్యూ సెక్షన్లో పనిచేస్తున్న వారే మాయం చేశారా? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. చదవండి: కేసీఆర్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తా -
‘ఆంధ్రజ్యోతి’ ఆక్రమణ అసలు కథ ఇదీ..
సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విశాఖలో భూబకాసురుల కబంద హస్తాల్లో చిక్కుకున్న భూములను అధికారులు ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటున్నారు. అధికారం అండతో టీడీపీ నేతలు గతంలో చేసిన దురాక్రమణలపై ఇప్పుడు అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాజకీయాలకు అతీతంగా ఆక్రమిత భూములు ఎవరి చేతుల్లో ఉన్నా వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలకు బదులు గోడౌన్లు నిర్మించి సొమ్ము చేసుకుంటున్న వాటిపైనా కొరడా ఝుళిపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ ఆక్రమణల్ని తొలగించారే తప్ప.. ఉద్దేశపూర్వక, కక్షపూరిత వ్యవహారాలేమీ లేవని అధికారులు స్పష్టంచేస్తున్నారు. నిజానికి.. విశాఖలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పచ్చ నేతల భూదందాల బాగోతం రాష్ట్రమంతటా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇలా దురాక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను వారి చెర నుంచి విడిపించేందుకు ప్రస్తుత సర్కారు సిద్ధమైంది. ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురయ్యాయో అధికారులు సర్వేచేసి వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. గత కొంతకాలంగా.. విశాఖ అర్బన్, రూరల్ పరిధిలో రూ.1,800 కోట్ల విలువైన వందల ఎకరాలు ఆక్రమిత భూముల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్న అక్రమ నిర్మాణంపైనా చర్యలు తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్నవి ఇవీ.. 2020 నవంబర్‌లో విశాఖ రూరల్ మండలం విజయరామపురం అగ్రహారం గ్రామంలో టైటిల్ డీడ్ నం.1180లోని సుమారు రూ.256 కోట్లు విలువైన 64 ఎకరాలు.. గీతం డీమ్డ్ యూనివర్సిటీ చెరలో ఉన్న రూ.1,100 కోట్లు విలువైన సుమారు 40 ఎకరాలు.. ఆనందపురం మండలం భీమన్నదొర పాలెంలో సర్వే నం.156లో టీడీపీకి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌కి చెందిన రూ.300 కోట్లు విలువైన సుమారు 60 ఎకరాల్ని.. విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి భార్య పేరిట ఆక్రమించిన రుషికొండలోని సర్వే నం.21లోని సుమారు రూ.2.50 కోట్లు విలువైన 6 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని.. కొమ్మాదిలోని సర్వే నం.66/2లో ఉన్న సుమారు రూ.98 కోట్ల విలువైన 11.25 ఎకరాల భూముల్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక.. సాగర్‌నగర్ సమీపంలో మంత్రి బొత్స సమీప బంధువులకు చెందిన స్థలాన్ని 2020 డిసెంబర్లో స్వాధీనం చేసుకున్నారు. ఇలా రాజకీయాలకు అతీతంగా.. పార్టీలతో పనిలేకుండా.. ఆక్రమణల్ని తొలగిస్తున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ ఆక్రమణ అసలు కథ ఇదీ.. అక్షరానికి వక్రభాష్యం చెబుతూ అధికారులు తీసుకున్న చర్యల్ని తప్పుబడుతూ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి.. ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులు అమలుచేసిన నిర్ణయాలకు పొంతనలేదు. వాస్తవానికి అక్కడ ఏం జరిగిందంటే.. మింది పారిశ్రామిక ప్రాంతంలో ఏపీఐఐసీ కేటాయించిన స్థలాల్లో 18 ఎకరాల విస్తీర్ణంలో ఏటీఆర్ పేరుతో 8 గోడౌన్లు నిర్మించారు. 2007లో 24,249.66 చ.మీకు ప్లాన్ తీసుకున్నారు. దీనికి తోడు 16,534.05 చ.మీటర్ల మేర ఆక్రమించేసి అనధికారికంగా గోడౌన్లు నిర్మించారు. కాగా, ఇటీవల నిర్వహించిన సర్వేలో అనధికార నిర్మాణాన్ని గుర్తించిన ఐలా అధికారులు షెడ్ యజమానికి 2020 డిసెంబర్ 15న నోటీసులు జారీచేశారు. ఇందుకు స్పందించకపోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 25న కన్ఫర్మేషన్ నోటీసులు జారీచేశారు. అయినా స్పందించకపోవడంతో ఆక్రమిత స్థలంలో ఉన్న నిర్మాణాల్ని తొలగించే ప్రక్రియని చేపట్టారు. అనధికారికంగా నిర్మించిన షెడ్ నం.5లో ఆమోద పబ్లికేషన్‌కు సంబంధించిన ప్రింటింగ్ ప్రెస్‌తో పాటు మరో నాలుగు కంపెనీలు అనధికారికంగా నడుస్తున్నట్లు గుర్తించారు. ఈ షెడ్ నెం.5ను ఉషా ట్యూబ్స్ అండ్ పైప్స్ ప్రై.లిమిటెడ్ పేరుతో స్టీల్ పైపులు, ట్యూబులు నిల్వచేసే గోడౌన్‌గా తీసుకున్నారు. అయితే, ఇందులో ఆమోదా పబ్లికేషన్స్‌తోపాటు హోంటౌన్ ఫర్నిచర్, రాఘవ వేర్‌హౌసింగ్ అండ్ లాజిస్టిక్స్, హైవ్లూప్ లాజిస్టిక్స్, ఈకామ్ ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన గోడౌన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. వీటిని పరిశీలించిన అనంతరం.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రహరీలని బుధవారం కూల్చివేశారు. ఐలా నిబంధనలకు విరుద్ధంగా గోడౌన్ని నిర్మించడమే ఒక అక్రమమైతే.. అందులో ప్రింటింగ్ సెక్షన్ ఏర్పాటుచేయడం కూడా మరో అక్రమమని అధికారులు చెబుతున్నారు. ఏపీఐఐసీ, కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల శాఖకు సంబంధించిన నిబంధనల్ని పాటించకుండా, వివిధ శాఖల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ప్రింటింగ్ ప్రెస్ నడుపుతున్నట్లు ఐలా (ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ) అధికారులు స్పష్టంచేస్తున్నారు. అందుకే చర్యలు తీసుకున్నారు తప్ప.. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిదనడం పూర్తి సత్యదూరమని చెబుతున్నారు. ఆక్రమణలు వెలుగుచూసింది ఇలా.. ఇదిలా ఉంటే.. గత డిసెంబర్లో కురిసిన వర్షాలకు షెడ్ నెం.5కు సంబంధించిన ప్రహరీ డ్రెయిన్‌లో కూలిపోయింది. దీంతో అక్కడ మురుగునీరు స్తంభించిపోవడంతో స్థానికుల ఫిర్యాదు చేశారు. ఐలా అధికారులు పరిశీలించగా ఆక్రమణల బాగోతం వెలుగుచూసింది. ఆ తర్వాత నోటీసులు జారీచేశారు. అఫిడవిట్ దాఖలు చేస్తున్నాం.. అనధికార నిర్మాణం చేపట్టడమే కాకుండా అందులో నిబంధనలకు విరుద్ధంగా సంస్థల్ని నడిపిస్తున్నారంటూ రెండుసార్లు నోటీసులు జారీచేశాం. అయినా గోడౌన్ యజమాని స్పందించకపోవడంతో అక్రమ నిర్మాణం చేపట్టిన షెడ్ నం.5 కూల్చివేత ప్రక్రియ చేపట్టాం. అయితే, కోర్టు నుంచి స్టేటస్కో తీసుకొచ్చారు. మేం అఫిడవిట్ దాఖలు చేస్తున్నాం. ఆక్రమించి నిర్మించిన 5వ నంబర్ షెడ్లోనే ఆమోద పబ్లికేషన్స్ ప్రింటింగ్ ప్రెస్ నడుస్తోంది. అందుకే చర్యలు తీసుకున్నాం. – డా. ఎ.శామ్యూల్, ఐలా కమిషనర్ రాజకీయ ప్రమేయం లేకుండా.. విశాఖ భూ ఆక్రమణలపై రెవెన్యూ యంత్రాంగం ఏడాదిన్నర కాలంగా చర్యలకు ఉపక్రమించింది. రెవెన్యూ విభాగం నిర్వహిస్తున్న సర్వేలో ఆక్రమిత భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకుంటున్నాం. ఇప్పటివరకు సుమారూ 300 ఎకరాల వరకూ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్నాం. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ఈ డ్రైవ్ వెనుక రాజకీయ ప్రమేయం ఏమాత్రం లేదు. ఆక్రమణల వెనుక ఎవరున్నా వాటిని విడిచిపెట్టడంలేదు. ఆక్రమణలున్నట్లు గుర్తించి ఆమోద పబ్లికేషన్స్ షెడ్స్‌ని తొలగించామే తప్ప.. దీని వెనుక ఎలాంటి ఒత్తిళ్లు లేవు. – పెంచల్ కిశోర్, ఆర్డీవో, విశాఖ జిల్లా -
‘ఆదాయ పెంపు’పై ప్రభుత్వం తర్జనభర్జన
సాక్షి, హైదరాబాద్: గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే తాజా బడ్జెట్లో ప్రభుత్వం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయాన్ని రెట్టింపుకన్నా ఎక్కువ చేసి చూపించడటంతో ఆ శాఖకు ఉన్న ఆదాయ మార్గాలు ఏమిటన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాబడులు పెంచుకునేందుకు భూముల మార్కెట్ విలువల సవరణతో లేదా స్టాంపు డ్యూటీ పెంపు లేదా రెండు ప్రతిపాదనలను అమలు చేయడం తప్పనిసరి కానుందనే చర్చ ఆ శాఖలో జరుగుతోంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలోని భూముల మార్కెట్ విలువలను సవరించకపోవడం, స్టాంపు డ్యూటీని పెంచకపోవడంతో ఇప్పుడు ఈ రెండింటిలో ఒకదాన్ని లేదా రెండింటినీ అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. నేటికీ 2013 విలువలతోనే.. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకోసారి, పట్టణ ప్రాంతాల్లో ఏటా భూముల మార్కెట్ విలువలను సవరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ లెక్కన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఏడుసార్లు, పట్టణ ప్రాంతాల్లో కనీసం మూడు దఫాలు మార్కెట్ విలువల సవరణ జరగాల్సి ఉంది. సవరణలు జరిగిన ఏడాది ఆగస్టు 1 నుంచి ఆ విలువలు అమల్లోకి వచ్చేవి. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ ప్రక్రియ జరగలేదు. 2013లో జరిగిన సవరణల విలువల ఆధారంగానే ఇప్పటికీ రిజిస్ట్రేషన్ల రుసుము వసూలు చేస్తున్నారు. ఇందులో స్టాంపు డ్యూటీ కింద 6 శాతం వసూలు చేస్తున్నారు. ఈ స్టాంపు డ్యూటీని కూడా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పెంచలేదు. దీంతో ఈ రెండు ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలను రూ.6 వేల కోట్ల నుంచి రూ.12,500 కోట్లకు పెంచారని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం స్టాంపు డ్యూటీ మన పొరుగు రాష్ట్రాల్లో 7 శాతం వరకు ఉంది. దీనికి సమానంగా ఇక్కడ కూడా స్టాంపు డ్యూటీని పెంచే ఆలోచన సీఎం కేసీఆర్ మదిలో ఉందనే చర్చ రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల్లో జరుగుతోంది. దీంతోపాటు మార్కెట్ విలువల సవరణ తప్పనిసరిగా ఉంటుందని, ప్రాంతాన్ని బట్టి ఈ విలువలు 50 శాతం నుంచి 200 శాతం వరకు పెంచుతారని సమాచారం. అయితే కేవలం స్టాంపు డ్యూటీ పెంచితే మాత్రం 6 శాతం నుంచి 10 శాతానికి పెంచినా ఆశ్చర్యం లేదన్న చర్చ కూడా నడుస్తోంది. మొత్తంమీద ప్రభుత్వం ఆశించిన మేర వచ్చే ఏడాదికి రెట్టింపు ఆదాయం రావాలంటే మార్కెట్ విలువల సవరణ, స్టాంపు డ్యూటీల పెంపు అనివార్యమని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. సవరణే... ఉత్తమం.. అయితే స్టాంపు డ్యూటీ పెంపు సాధారణ ప్రజానీకంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని స్టాంపుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. కరోనా నేపథ్యంలో ప్రజలపై భారం పడకుండా ఉండేందుకు కర్ణాటకలో ఉన్న 5 శాతం ఉన్న స్టాంపు డ్యూటీని 3 శాతానికి తగ్గించారు. మహారాష్ట్రలో కూడా స్టాంపు డ్యూటీ తగ్గించారని అధికారుల ద్వారా తెలుస్తోంది. స్టాంపు డ్యూటీ పెంచితే రుణాలు తీసుకొని ప్లాట్లు, ఫ్లాట్లు కొనుక్కొనే వారిపై అదనపు భారం పడుతుందని, స్టాంపు డ్యూటీ పెంపు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకే ఉపకరిస్తుందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మార్కెట్ విలువలను సవరించాల్సిన అనివార్యత ఉంది కాబట్టి ఈ విలువలను అవసరమైతే 300 శాతం పెంచినా ప్రజానీకంపై ప్రత్యక్ష భారం ఉండదని, తద్వారా భూముల బహిరంగ విలువలు కూడా తగ్గే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మార్కెట్ విలువల సవరణ వైపే మొగ్గుచూపడం ద్వారా ప్రజలపై భారం మోపకుండా ఆదాయం పెంచుకోవచ్చని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. -
హెచ్ఎండీఏ మినహా..రాష్ట్రమంతా భూముల సర్వే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ భూముల పూర్తిస్థాయి సర్వేకు ప్రభుత్వం పకడ్బందీగా సిద్ధమవుతోంది. భవిష్యత్తులో మళ్లీ ఎలాంటి సమస్యలు కూడా రాకుండా ఉండేలా అత్యాధునిక పద్ధతుల్లో సర్వే నిర్వహించేందుకు రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వెరీ హైరిజల్యూషన్ శాటిలైట్ ఇమేజరీ (వీహెచ్‌ఆర్‌ఎస్‌ఐ) వ్యవస్థను వినియోగించి సర్వే చేపట్టేందుకు ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.400 కోట్లు కేటాయించింది కూడా. ఈ సర్వే ప్రక్రియలో చట్టపరమైన సమస్యలు రాకుండా ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. సర్వే అయ్యాక భూముల రికార్డులను తనిఖీ చేసి యజమానులకు నోటీసులు జారీ చేయాలని, అప్పీళ్లు వస్తే వాటన్నింటినీ పరిష్కరించాకే తుది రికార్డులను నమోదు చేయాలని భావిస్తోంది. జియో రిఫరెన్స్.. ఫోటోగ్రామెట్రీ సాఫ్ట్వేర్లతో.. రాష్ట్రంలో మొత్తం భూవిస్తీర్ణం 1.12 లక్షల చదరపు కిలోమీటర్లుకాగా.. అందులో 77,916 చదరపు కిలోమీటర్ల పరిధిలోని వ్యవసాయ భూములను సర్వే చేయనున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలోనికి వచ్చే ప్రాంతాల్లో, అటవీ భూముల్లో ఎలాగూ వ్యవసాయ భూములుండే అవకాశం లేనందున.. ఈ ప్రాంతాలను మినహాయించి మిగిలిన భూములను సర్వే చేయనున్నారు. ఇందుకోసం వీహెచ్‌ఆర్‌ఎస్‌ఐ విధానాన్ని వినియోగించాలని గతంలోనే నిర్ణయించారు. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్) ద్వారా నిరంతరం పనిచేసేలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 రిఫరెన్స్ స్టేషన్లను ఏర్పాటు చేసి, కచ్చితమైన భూనియంత్రణ పాయింట్లను నిర్ధారించనున్నారు. ఈ పాయింట్ల నుంచి 28 సెంటీమీటర్ల స్థాయి వరకు రిజల్యూషన్ ఉండే శాటిలైట్ ఇమేజ్‌లను సేకరించి.. వాటిని జియో రిఫరెన్స్, ఫోటోగ్రామెట్రీ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి ఆర్థోఫోటోలను తయారు చేస్తారు. ఆ ఫోటోల ఆధారంగా ట్యాబ్‌లు, స్మార్ట్ఫోన్లలో కమతాల సరిహద్దులను క్యాప్చర్ చేసి.. భూహక్కుల రికార్డుల్లోని (ఆర్ఓఆర్) ఆధారంగా సదరు కమతానికి అనుసంధానం చేస్తారు. ఈ వివరాలను ఏకీకృత భూసమాచార వ్యవస్థకు అనుసంధానం చేసి.. రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్, భూరికార్డుల శాఖల సమక్షంలో తనిఖీ చేస్తారు. ఆ తర్వాత తుది సర్వే రికార్డులు నమోదు చేస్తారు. దేనికెంత ఖర్చు? రాష్ట్రంలో డిజిటల్ విధానంలో భూముల సర్వేకు అయ్యే ఖర్చు వివరాలను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రెవెన్యూ శాఖ అవుట్‌కమ్ బడ్జెట్లో పేర్కొన్నారు. ఒక చదరపు కిలోమీటర్లో 28 సెంటీమీటర్ల రిజల్యూషన్ ఉన్న శాటిలైట్ ఇమేజ్‌ల కోసం రూ.4,000 చొప్పున ఖర్చవుతుందని.. దాదాపు 80వేల చదరపు కిలోమీటర్లకు గాను రూ.32 కోట్లు అవసరమని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఇక అటవీ సరిహద్దు ప్రాంతాలను లైడార్ పద్ధతిలో స్కానింగ్ చేసేందుకు రూ.11 కోట్లు ఖర్చవుతాయని.. మండలానికో రిఫరెన్స్ స్టేషన్ ఏర్పాటు చేసి సీవోఆర్‌ఎస్ నెట్వర్క్ సాయంతో 600 రోవర్స్ సమకూర్చేందుకు రూ.30 కోట్లు వ్యయం కావచ్చని అంటున్నాయి. మరోవైపు భూనియంత్రణ పాయింట్ నెట్వర్క్ ఏర్పాటు, గ్రౌండ్ టూతింగ్ కోసం చరదపు కిలోమీటర్‌కు రూ.42 వేల చొప్పున మొత్తం రూ.327 కోట్లు కానుందని అంచనా వేస్తున్నారు. మొత్తమ్మీద రూ.400 కోట్ల మేర వ్యయం అవుతుందని చెబుతున్నారు. బడ్జెట్లో నిధులు కూడా కేటాయించన నేపథ్యంలో.. ఈ ఏడాదిలోనే వ్యవసాయ భూముల డిజిటల్ రీసర్వే చేసే చాన్స్ ఉందని రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. సర్వే కోసం ప్రభుత్వం తీసుకున్న భూవిస్తీర్ణ గణాంకాలు (చదరపు కిలోమీటర్లలో) రాష్ట్రం మొత్తం విస్తీర్ణం: 1,12,077 అటవీ ప్రాంతం: 26,904 మిగిలిన ప్రాంతం: 85,173 హెచ్ఎండీఏ ప్రాంతం: 7,257 ఇమేజరీ సేకరించాల్సిన ప్రాంతం: 77,916 (హెచ్ఎండీఏ, అటవీ ప్రాంతాలు మినహా) -
ఏసీబీ వలలో రెవెన్యూ చేప!
పాల్వంచరూరల్: కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం జారీ చేసేందుకు రూ.3,500 లంచం తీసుకుంటూ ఓ రెవెన్యూ ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పాల్వంచ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆనంద్ మోహన్ చక్రవర్తి పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి కోట అరుణ్‌సాయి ఫ్యామిలీ మెంబర్ల సర్టిఫికెట్ కోసం గత ఫిబ్రవరి 12న మీ సేవ కేంద్రం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటి నుంచి సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయినా అధికారులు స్పందించడంలేదు. సర్టిఫికెట్ ఇవ్వాలంటే కొంత ముట్టజెప్పాలంటూ జూనియర్ అసిస్టెంట్ ఆనంద్ మోహన్ చక్రవర్తి వేధించాడు. దీంతో బాధితుడు అవినీతి నిరోధకశాఖ( ఏసీబీ) అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు శనివారం తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఆనంద్‌కు రూ.3,500 లంచం ఇచ్చాడు. అప్పటికే నిఘావేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండడ్‌గా పట్టుకున్నారు. అవినీతికి పాల్పడిన ఆనంద్‌పై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ ఖమ్మం ఇన్చార్జి డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. దాడిలో ఖమ్మం ఏసీబీ ఇన్స్పెక్టర్లు రమణమూర్తి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. పాల్వంచ తహశీల్‌లో పెచ్చుమీరుతున్న అవినీతి పాల్వంచ తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగుల అవినీతి రోజురోజుకూ మితిమీరిపోతోంది. లంచం ఇవ్వనిదే ఏపనీ చేయడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కనీసం ధ్రువీకరణ పత్రాలు కూడా జారీ చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఆగస్ట్‌లో ఇదే తహసీల్దార్ కార్యాలయంలో యానంబైల్‌కు చెందిన ఓ మహిళ కల్యాణలక్ష్మి పథకం మంజూరు కోసం వీఆర్వో పద్మను సంప్రదించగా.. రూ. 10 వేలు డిమాండ్ చేసింది. విసిగిపోయిన బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. వీఆర్వో సదరు మహిళ నుంచి రూ.7 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తాజాగా జూనియర్ అసిస్టెంట్ ఆనంద్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇతను ఇసుక ట్రాక్టర్లదారుల నుంచి అధిక మొత్తంలో డిమాండ్ చేస్తూ, భారీగా అవినీతికి పాల్పడుతున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. -
రెవెన్యూకు కొత్త పేరు!
సాక్షి, హైదరాబాద్: ‘మారిన పరిస్థితుల్లో రెవెన్యూ శాఖ స్వరూపం కూడా మారింది. విధులు, బాధ్యతల్లో మార్పులు వచ్చాయి. గతంలో భూమి శిస్తు వసూలు చేసినప్పుడు రెవెన్యూ అనే పదం, శాఖ వచ్చాయి. ఇప్పుడు రెవెన్యూ వసూలు చేయకపోగా, ప్రభుత్వమే రైతు బంధు ద్వారా ఎకరానికి ఏటా రూ.10 వేల సాయం అందిస్తు న్నది. కాబట్టి రెవెన్యూ అనే పేరు ఇప్పుడు సరిపోదు. పేరు మారే అవకాశం ఉంది. ధరణి పోర్టల్, డిజిటల్ సర్వే తదితర కారణాల వల్ల భూ రికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు కూడా సులభంగా, అధికా రుల ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. రైతులు తహశీల్దార్ కార్యా లయాల చుట్టూ తిరిగే ప్రయాస ఉండదు. ఇదే ధరణి ప్రధాన లక్ష్యం. కాబట్టి రెవెన్యూ శాఖ విధుల్లో మార్పులు అనివార్యం. రెవెన్యూ శాఖలో ఎవరే పని చేయాలనే విషయంలో ప్రభుత్వం త్వరలోనే జాబ్ చార్టు రూపొందిస్తుంది. ఆర్ఐ ఏం చేయాలి? తహశీల్దార్ ఏం చేయాలి? ఆర్డీవో ఏం చేయాలి? అనే విషయాల్లో స్పష్టత ఇస్తాం. రెవెన్యూ అధికారులను పనిచేయగలిగే, పని అవ సరం ఉండే చోట ప్రభుత్వం వాడుకుం టుంది’ అని సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. రెనెన్యూ సంస్కర ణలు, ధరణి పోర్టల్ పనితీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ గురు వారం ప్రగతిభవన్‌లో సమీక్షించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో డిజిటల్ సర్వే నిర్వహించి, వ్యవసాయ భూము లకు కో ఆర్డినేట్స్ (అక్షాంశ, రేఖాంశాలు) ఇస్తామని ప్రకటించారు. సర్వే కోసం వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. ‘ఏమైనా సమ స్యలు, సందేహాలుంటే రైతులు ఇకపై కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలి. కలెక్టర్లు ఆ దరఖాస్తులను పరిశీలించాలి. సీఎస్ నుంచి వచ్చే మార్గదర్శ కాలకు అనుగుణంగా వాటిని పరిష్కరించాలి’అని సీఎం ఆదేశించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి పారదర్శకంగా జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ధరణి పోర్టల్ వంద శాతం విజయవంతమైందని సంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యలన్నీ కొలిక్కి వస్తాయి.. ‘ప్రభుత్వం జరిపిన సమగ్ర భూరికార్డుల ప్రక్షాళన, కొత్త పాసు పుస్తకాలు, ధరణి పోర్టల్ తదితర సంస్కరణ వల్ల వ్యవసాయ భూములకు సంబంధించిన చాలా సమస్యలు పరిష్కారం అయ్యాయి. అసెంబ్లీలో ప్రకటించినట్లు త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ సర్వే నిర్వహిస్తాం. ప్రతి భూమికి కో–ఆర్డినేట్స్ ఇస్తాం. వాటిని ఎవరూ మార్చలేరు. గందరగోళానికి, తారుమారు చేయడానికి ఆస్కారం ఉండదు. ఒకసారి సర్వే పూర్తయితే అన్ని విషయాలపై స్పష్టత వస్తుంది. రైతుల భూముల మధ్య, అటవీ– ప్రభుత్వ భూముల మధ్య, అటవీ–ప్రైవేటు భూముల మధ్య హద్దుల పంచాయతీ కూడా పరిష్కారం అవుతుంది. పోడు భూముల సమస్య కూడా పరిష్కారం అవుతుంది. మూడు, నాలుగు నెలల్లో మొత్తం సమస్యలు కొలిక్కి వస్తాయి’అని సీఎం స్పష్టం చేశారు. రెవెన్యూలో అవినీతి అంతమైంది.. ‘ధరణి పోర్టల్‌తో రెవెన్యూలో అవినీతి అంతమైంది. నోరులేని, అమాయక రైతులకు న్యాయం జరిగింది. ఒకరి భూమిని ఇంకొకరి పేరు మీద రాసే అరాచకం ఆగింది. జుట్టుకు జుట్టుకు ముడేసి పంచాయతీ పెట్టే దుష్ట సంప్రదాయం ఆగింది. డాక్యుమెంట్లు గోల్మాల్ చేసి, రెవెన్యూ కోర్టుల పేరిట జరిగే దుర్మార్గం పోయింది. దేశంలో మరెక్కడా లేనివిధంగా, చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ప్రభుత్వం ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి మూడేళ్లు కసరత్తు చేసి కొత్త చట్టం తెచ్చింది. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పారదర్శకంగా, అవినీతికి అవకాశం లేకుండా జరిగిపోతున్నాయి. ఎలాంటి గందరగోళం, అస్తవ్యస్తం లేకుండా భూముల అమ్మకాలు, కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతున్నది. బయోమెట్రిక్, ఆధార్ ఆధారంగా అమ్మేవారు, కొనేవారు వస్తేనే భూముల రిజిస్ట్రేషన్ జరుగుతున్నది. ధరణిలో నమోదైన భూములను మాత్రమే అమ్మే, కొనే వీలున్నది. ఆ భూములు మాత్రమే వారసత్వం ద్వారా, గిఫ్ట్ డీడ్ ద్వారా మరొకరికి సంక్రమించే అవకాశం ఉన్నది. ప్రభుత్వం అనుసరిస్తున్న పకడ్బందీ వ్యూహం వల్ల ఎవరూ ధరణిలో వేలుపెట్టి మార్పులు చేసే అవకాశం లేదు. చివరికి సీసీఎల్ఏ, సీఎస్ కూడా రికార్డులను మార్చలేరు. అంతా వ్యవస్థానుగతంగా మానవ ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతున్నది. రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇంత సజావుగా సాగడం కొందమందికి మింగుడు పడుతలేదు. లేని సమస్యలు సృష్టించి, పైరవీలు చేసి అక్రమంగా సంపాదించుకునే వారు ఇప్పుడు అవకాశం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వారే అపోహలు సృష్టించి గందరగోళపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు తికమక పడొద్దు. కొన్ని పత్రికలు కావాలని తప్పుడు వార్తలు, అసంబద్ధమైన కథనాలు ప్రచురిస్తున్నాయి. ఈ వార్తలపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు స్పందించి సంపూర్ణ వివరాలు అందించాలి. సందేహాలను నివృత్తి చేయాలి’అని సీఎం చెప్పారు. -
వీఆర్వోల ‘సర్దుబాటు’
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)ను ఇతర ప్రభుత్వశాఖల్లో సర్దుబాటు చేసే ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు రాష్ట్రంలో పనిచేస్తున్న వీఆర్వోల పూర్తి వివరాలను భూపరి పాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) కార్యాల యం మళ్లీ సేకరిస్తోంది. మూడు ఫార్మాట్లలో వారి సమగ్ర సమాచారాన్ని పంపాలని జిల్లా కలెక్టర్లకు లేఖలు రాసింది. వీఆర్వోలందరి వివరాలను 18 కాలమ్‌ల ఫార్మాట్లో పంపాలని, వారిపై ఉన్న కేసులు, సస్పెన్షన్లు, దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నవారి వివరాలు మరో ఫార్మాట్లో, వీఆర్వోల కులం, మతం, విద్యార్హతలు, ఉద్యోగ ఎంపికల గురించి ఇంకో ఫార్మాట్లో నమోదు చేసి పంపాలని కలెక్టర్లకు సూచించింది. వీలైనంత త్వరగా ఈ వివ రాలను చేరవేయాలని ఆ లేఖలో పేర్కొంది. కాగా, వీఆర్వోలను జూనియర్ అసిస్టెంట్ల హోదాలో పలు ప్రభుత్వశాఖల్లో సర్దుబాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారి సర్వీసు, విద్యార్హతల ఆధారంగా వివిధ శాఖలకు ఇవ్వాలని, ఆ తర్వాత వారికి పదోన్నతుల ప్రకియ్ర చేపట్టాలని యోచిస్తున్నామని సీసీఎల్ఏ వర్గాలు తెలిపాయి. డైరెక్ట్ రిక్రూటీ వీఆర్వోలను రెవెన్యూలోనే కొనసాగించాలని ఆలోచిస్తున్నట్టు వెల్లడించాయి. తప్పులున్నాయి.. సరిపోలడంలేదు వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 5,485 మంది వీఆర్వోలు పనిచేస్తున్నారు. ఈ వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత వీరందరి వివరాలను ఇప్పటికే రెండుసార్లు సీసీఎల్ఏ వర్గాలు తెప్పించుకున్నాయి. గత ఏడాది డిసెంబర్లో తెప్పించిన వివరాల్లో వీఆర్వోల విద్యార్హత, కులం, ఉద్యోగ ఎంపికలకు సంబంధిం చిన వివరాలు సరిగా లేవని, ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో తెప్పించిన వివరాల్లో డిసెంబర్లో వచ్చిన సమాచారానికి, మళ్లీ పంపిన సమాచా రానికి తేడా ఉందని గుర్తించాయి. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి వీఆర్వోల వివరాలను సమగ్రంగా పంపాలని జిల్లా కలెక్టర్లను కోరుతూ సీసీఎల్ఏ లేఖలు రాయడం గమనార్హం. -
అగ్రి సెస్‌తో రాష్ట్రాలకు నష్టం
న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పన కోసం తాజా బడ్జెట్లో ‘అగ్రి సెస్ (అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్–ఏఐడీసీ)’ను ప్రవేశపెట్టారు. పెట్రోలు, డీజిల్‌లతో పాటు బంగారం, వెండి తదితర 12 వస్తువులపై ఈ సెస్ విధించనున్నారు. ఈ సెస్ కారణంగా వినియోగదారులపై భారం పడకుండా కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలలో సర్దుబాటు చేస్తామని ఆర్థికమంత్రి బడ్జెట్ సందర్భంగా వివరణ ఇచ్చారు. సాధారణంగా కేంద్ర పన్నుల్లో 41% రాష్ట్రాల వాటాగా ఉంటుంది. కానీ, సర్‌చార్జ్‌లు, సెస్లలో రాష్ట్రాలకు వాటా లభించదు. దాంతో, అగ్రి సెస్ కారణంగా కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలలో వాటా ద్వారా లభించే ఆదాయాన్ని రాష్ట్రాలు కోల్పోతాయి. అగ్రి సెస్ నుంచి రాష్ట్రాలకు ప్రత్యక్ష ప్రయోజనం ఉండదు. అగ్రిసెస్ ద్వారా రూ. 30 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి పాండే వెల్లడించారు. తాత్కాలిక, ప్రత్యేక లక్ష్యాల కోసమే సెస్ విధించాలని, వ్యవసాయ మౌలిక వసతుల వంటి సాధారణ లక్ష్యాలకు సెస్ సరికాదని గణాంక నిపుణుడు ప్రణబ్ సేన్ వ్యాఖ్యానించారు. ఈ సెస్ వల్ల కేంద్రం సేకరించే కస్టమ్స్ డ్యూటీ నుంచి రాష్ట్రాలు తమ వాటా ఆదాయాన్ని కోల్పోతాయన్నారు. అయితే, సాధారణంగా కేంద్రం పెట్రోలు, డీజిల్‌లపై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా లభించిన ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకోదని, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీలో సర్దుబాటు చేసే అగ్రిసెస్ ద్వారా రాష్ట్రాలకు ఆదాయ పరంగా నష్టం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో... గత ఆర్థిక సంవత్సరం అమ్మకాలు పరిగణలోకి తీసుకుంటే అగ్రి సెస్ రూపంలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు ద్వారా కేంద్రానికి రూ.2,016.33 కోట్ల ఆదాయం సమకూరనుంది. 2019–20 లో రాష్ట్రంలో 401.27 కోట్ల డీజిల్, 164.42 కోట్ల పెట్రోల్ అమ్మకాలు జరిగాయి. దీని ప్రకారం డీజిల్ పై లీటరుకు రూ.4 అగ్రి సెస్ పరిగణలోకి తీసుకుంటే ఏటా రూ.1,605.33 కోట్లు సమకూరనున్నాయి. ఇదేసమయంలో 164.54 కోట్ల లీటర్ల పెట్రోలు అమ్మకాలు జరిగాయి. లీటరు పెట్రోలు పై విధించిన రూ.2.50 అగ్రిసెస్ పరిగణలోకి తీసుకుంటే రూ.411.25 కోట్లు కేంద్రానికి ఆదాయం గా రానున్నది. తెలంగాణలో.. తెలంగాణ విషయానికొస్తే ఏటా రూ.237 కోట్లకుపైగా నష్టం ఉంటుందని అంచనా. రాష్ట్రంలో నెలకు సగటున (2020, డిసెంబర్ అమ్మకాల ప్రకారం) 12.23 కోట్ల లీటర్ల పెట్రోల్, 23.11 కోట్ల డీజిల్ వినియోగం జరుగుతుంది. ఈ విక్రయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు పలు రూపాల్లో ఉంటాయి. రాష్ట్ర పన్నుల రాబడులు నేరుగా మన ఖజానాకు చేరితే కేంద్రం విధించే పన్నుల్లో మనకు వాటా వస్తుంది. తాజా బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం డీజిల్‌పై లీటర్‌కు రూ.4, పెట్రోల్‌పై రూ.2 ఎక్సైజ్ డ్యూటీని తగ్గించి, ఆ మేరకు సెస్ పెంచింది. ఎక్సైజ్ డ్యూటీలో రాష్ట్రాలకు పన్నుల్లో వాటా ఉంటుంది కానీ, సెస్ ద్వారా వసూలు చేసుకునే దానిలో రాష్ట్రాలకు రూపాయి రాదు. ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో నెలకు జరిగే మొత్తం విక్రయాల్లో డీజిల్‌పై లీటర్‌కు రూ.4 చొప్పున రూ.92.44 కోట్లు, పెట్రోల్‌పై రూ.2 చొప్పున రూ.24.46 కోట్లు ఎక్సైజ్డ్యూటీ తగ్గిపోతుంది. అదే సంవత్సరానికి వస్తే డీజిల్‌పై రూ.1109.28 కోట్లు, పెట్రోల్‌పై 293.52 కోట్లు డ్యూటీ రాదు. దీంతో ఈ డ్యూటీలో రాష్ట్రానికి వచ్చే వాటా రాకుండా పోతుంది. కేంద్ర పన్నుల్లో వాటా ప్రకారం మన రాష్ట్రానికి ఈ మొత్తం రూ.1402.80 కోట్లలో రావాల్సిన 2.4 శాతం వాటా రాకుండా పోతోంది. ఇది రూ. 33.64 కోట్లు ఉంటుందని అంచనా. అదే విధంగా కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీపై రాష్ట్రం అదనంగా 14.5 శాతం పన్ను వసూలు చేసుకుంటుంది. ఇప్పుడు రూ.1402 కోట్ల మేర డ్యూటీ తగ్గిపోవడంతో ఆ మేరకు రాష్ట్ర ఖజానాకు గండిపడనుంది. ఈ మొత్తం రూ.203.40 కోట్లు ఉంటుందని వాణిజ్య పన్నుల అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే అటు ఎక్సైజ్ డ్యూటీ వచ్చే వాటా, ఇటు ఎక్సైజ్ డ్యూటీపై విధించే రాష్ట్ర పన్ను కలిపితే మొత్తం రూ. 237.04 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేటా నష్టపోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. -
బూరుగిద్దకు భరోసా
లింగంపేట(ఎల్లారెడ్డి) : కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం బూరుగిద్ద గ్రామాన్ని అక్రమంగా పట్టా చేసుకున్న వివాదంపై ‘సాక్షి’లో సోమవారం ‘ఊరినే అమ్మేశారు’ శీర్షికన ప్రచురితమైన వార్తకు రెవెన్యూ యంత్రాంగం కదలివచ్చింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి ఆర్డీవో శ్రీనివాస్ నాయక్ తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. సర్వేయర్‌ను గ్రామానికి పంపి కొలతలు తీయించారు. అనంతరం ఆర్డీవో శ్రీనివాస్‌నాయక్ బూరుగిద్ద గ్రామానికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడారు. అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ధ్రువపత్రాలను రద్దు చేస్తున్నామని ఆర్డీవో వెల్లడించారు. గ్రామస్తులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఆయన భరోసా ఇచ్చారు. 311 సర్వే నంబరులో 29 గుంటల భూమి ఉన్న ట్లు రికార్డులో ఉన్నందున తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిపారు. మోకా మీద ఇళ్లు ఉన్న ట్లు రికార్డుల్లో లేదన్నారు. రికార్డులను సరిచేసి, ఆబాది కింద మార్చి 13 కుటుంబాలకు వెంటనే ఇల్లు, స్థలాలకు ధ్రువపత్రాలు అందజేస్తామన్నారు. ఎక్కడ పొరపాటు జరిగిందో గుర్తిస్తామన్నారు. అయితే భూమి కొనుగోలు చేసిన వారు తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వారు ఇకపై ఎలాంటి ఒత్తిళ్లు కలుగజేయబోమని ఒప్పుకున్నట్లు, మళ్లీ ఘర్షణకు వస్తే చర్యలు తీసుకుంటామని ఆర్డీ వో గ్రామస్తులకు హామీ ఇచ్చారు. సమగ్ర విచారణ చేయాలి 311 సర్వే నంబరులో 29 గుంటల భూమిని తాము ఎవ్వరికీ అమ్మలేదని పట్టాదారు పేర్కొనడం విశేషం. అలాంటప్పుడు ఇద్దరి పేర్లపైకి అధికారులు పట్టా మార్పిడి ఎలా చేశారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. పట్టా మార్పిడి జరిగితే గ్రామానికి ఉన్న హద్దులు తప్పుగా నమోదు చేయడం పట్ల కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులను తప్పుదోవ పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆర్డీవో వెంట తహసీల్దార్ నారాయణ ఉన్నారు. -
సాహసోపేతం.. రీసర్వే మహాయజ్ఞం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని భూములు, స్థిరాస్తుల రీసర్వే అత్యంత క్లిష్టమైన పని. రాష్ట్రంలో 17,460 రెవెన్యూ గ్రామాలు, 47,861 ఆవాసాలు, 110 పట్టణ, నగరపాలక సంస్థల పరిధిలోని భూములు, స్థలాలు, ఇళ్లు సర్వేచేసి హద్దులు నిర్ణయించి హక్కుపత్రాలు ఇవ్వడమనేది ఆషామాషీ వ్యవహారం కాదు. అస్తవ్యస్తంగా ఉన్న భూ రికార్డులు, నకిలీ రికార్డులు వంటి ఎన్నో చిక్కుముళ్లున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక పరిజ్ఞానం వినియోగించినా కొలతల్లో వచ్చే అతిసూక్ష్మ తేడా, వాస్తవ భూమికి, రికార్డుల్లోని గణాంకాలకు మధ్య ఉన్న భారీ తేడా, డ్యూయల్ రిజిస్ట్రేషన్లు, ట్యాంపరింగైన రికార్డులు వంటి సమస్యల్ని రీసర్వే క్రతువులో అధిగమించాల్సి ఉంటుంది. అందుకే రీసర్వేని రెవెన్యూ నిపుణులు మహాయజ్ఞంగా అభివర్నిస్తున్నారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ విషయంలో దేశానికే మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ మహాక్రతువులో భాగస్వామ్యం కల్పించినందుకు వ్యక్తిగతంగా, సంస్థ తరఫున సీఎం జగన్‌కు, ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని దేశంలోనే అతి పురాతన, ప్రపంచంలోనే అతిపెద్ద సర్వే సంస్థ.. సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ గిరీష్‌కుమార్ బహిరంగంగానే చెప్పారంటే ఈ సర్వేకి ఎంత ప్రాధాన్యం ఉందో అర్థమవుతోంది. క్లిష్టమైన సమస్యలను అధిగమించి రీసర్వే పూర్తిచేస్తే గోల్డెన్ రికార్డులు రూపుదిద్దుకుంటాయి. భూతగాదాలు, పొలం గట్ల వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. తర్వాత క్రయవిక్రయాలు, చట్టబద్ధమైన వారసత్వం ప్రకారం కేవలం మ్యుటేషన్లు చేసుకుంటూ వెళితే వచ్చే 40 నుంచి 50 ఏళ్లపాటు ఈ రికార్డులు అద్భుతంగా ఉంటాయి. ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రకారం భూ యజమానులకు శాశ్వత భూహక్కులు కల్పించిన మొదటి రాష్ట్రంగా ఏపీ చరిత్రలో నిలుస్తుంది. రికార్డుల స్వచ్చికరణ, రీసర్వే ప్రక్రియలను అంకితభావంతో పూర్తిచేయాల్సిన గురుతర బాధ్యత రెవెన్యూ సిబ్బందిపై ఉంది. కొలతల్లో తేడాలు దుకాణానికి వెళ్లి బంగారం కొని వెంటనే పక్క షాపునకు వెళ్లి తూకం వేయిస్తే 10 నుంచి 20 మిల్లీగ్రాముల వరకు తేడా వస్తుంది. దీన్ని తప్పుగా పరిగణించడానికి వీలులేని అతిసూక్ష్మ తేడా అంటారు. తూకాల్లో లాగే భూమి కొలతల్లో కూడా అతిసూక్ష్మ తేడాలు వస్తాయి. ప్రపంచంలోనే అత్యాధునిక కార్స్ టెక్నాలజీతో సర్వేచేసినా ఇవి వస్తాయి. ఒక పాయింట్‌ను బేస్‌గా తీసుకుని కొలత వేసిన తర్వాత మరోసారి అలాగే తీసుకుని చూస్తే గరిష్టంగా ఐదు సెంటీమీటర్ల వరకు ఎక్కువ లేదా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే సర్వే పరిభాషలో ప్లస్ ఆర్ మైనస్ 5 సెంటీమీటర్ల ఎర్రర్ అని అంటారు. సాధారణంగా రెండు సెంటీమీటర్లు మించి తేడా రాదు. కొన్నిచోట్ల ఐదు సెంటీమీటర్ల వరకు రావచ్చని సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ తెలిపారు. ఇది పరిగణనలోకి తీసుకోవాల్సిన దానికంటే తక్కువని అర్థం. ఇలాంటి తేడాలను కూడా అంగీకరించనివారికి వాస్తవాలు వివరించడం, ప్రత్యామ్నాయ మార్గాల్లోనూ కొలిచి చూపడం ద్వారా ఒప్పించాల్సి ఉంటుంది. తక్కెళ్లపాడులో నాలుగెకరాల తేడా కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడులో పైలెట్ ప్రాతిపదికన నిర్వహించిన రీసర్వేలో ఆర్ఎస్ఆర్కు, వాస్తవ కొలతలకు మధ్య నాలుగెకరాల తేడా వచ్చింది. తమ భూముల కొలతల విషయంలో 35 మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు వాస్తవాలు వివరించడం ద్వారా వారిని ఒప్పించారు. నేటి నుంచి అవగాహన రీసర్వేని పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం బ్లూప్రింట్ సిద్ధం చేసింది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 14 వేల మంది సర్వేయర్లను నియమించారు. వీరిలో 9,400 మందికి శిక్షణ ఇవ్వగా మిగిలిన వారికి వచ్చేనెల 26 నాటికి శిక్షణ పూర్తి చేయనున్నారు. రీసర్వేపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోమవారం నుంచి గ్రామసభలు నిర్వహించనున్నారు. డ్రోన్ సర్వేలో తేడా వచ్చిందని యజమానులు భావిస్తే రోవర్‌తో చేస్తారు. అందులోనూ సంతృప్తి చెందకపోతే చెయిన్‌తో మాన్యువల్ విధానంలో కొలిపించి హద్దులు నిర్ణయిస్తారు. దీన్ని కూడా అంగీకరించని పక్షంలో సివిల్ ఇంజినీరింగ్ విధానంలో కొలుస్తారు. వివాదాలను పరిష్కరించేందుకు మండలానికి ఒకటి చొప్పున 660 మొబైల్ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇది గొప్ప సంస్కరణ ప్రజలకు మేలు చేయాలని ఏ కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టినా కొన్ని సమస్యలు వస్తాయి. రీసర్వేలోనూ ఇలాంటి సమస్యలుంటాయి. ఏయే సమస్యలు వస్తాయో లిస్టు రూపొందించుకున్నాం. ఏయే అంశాల్లో ఎలా ముందుకెళ్లాలో ఇప్పటికే నాలుగు సర్క్యులర్లు పంపించాం. మరోదాన్ని పంపనున్నాం. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక విధానంలో సర్వే చేయడమే కాకుండా స్థిరాస్తుల యజమానులకు శాశ్వత హక్కులతో కూడిన డిజిటల్ కార్డులు ఇచ్చే దిశగా ప్రభుత్వం ముందుకెళుతోంది. ఇది దేశంలో ఎక్కడా లేని గొప్ప సంస్కరణ. ప్రజలపై నయాపైసా భారం పెట్టకుండా ప్రభుత్వమే భరించి సర్వే చేయడంతోపాటు శాశ్వత హక్కు పత్రాలు ఇవ్వాలని సీఎం జగన్ ఎంతో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దీని అమలుకు సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. – నీరబ్‌కుమార్‌ప్రసాద్, భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) -
టీడీపీ అండతో ఇదీ ‘గీతం’ బాగోతం
సాక్షి , విశాఖపట్నం/కొమ్మాది: గీతం విద్యా సంస్థల అక్రమాలపై విశాఖ జిల్లా రెవిన్యూ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. గత టీడీపీ ప్రభుత్వం అండతో అడ్డగోలుగా ఎండాడ, రుషికొండ పరిసర ప్రాంతాల భూముల్ని ఆక్రమించుకున్న ‘గీతం’కు చెక్ పెట్టడానికి అధికారులు శ్రీకారం చుట్టారు. భూముల్ని ఆక్రమించి గీతం విశ్వవిద్యాలయం నిర్మించిన రక్షణ గోడ, గ్రావెల్ బండ్, గార్డెనింగ్ తదితర అక్రమ నిర్మాణాల్ని శనివారం రెవిన్యూ అధికారులు తొలగించారు. ఆర్డీవో పెంచల్ కిశోర్, నార్త్ ఏసీపీ రవిశంకర్ రెడ్డి, రెవిన్యూ సిబ్బంది, పోలీసులు గీతం క్యాంపస్‌కు తెల్లవారుజామున 4 గంటలకు చేరుకుని ఉదయం 11.30 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. 40.51 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించి, అందులో 38.53 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎండాడ పరిసరాల్లో సర్వే నంబర్ 15, 16, 17, 18, 19, 20, 55, 61లోని 18.53 ఎకరాలు, రుషికొండలో సర్వే నంబర్ 34, 35, 37, 38లో 20 ఎకరాల భూమి ఉంది. కోర్టు కేసుల పరిధిలో ఉన్నవి మినహా మిగిలిన భూముల్లోని అక్రమ నిర్మాణాల్ని కూలగొట్టారు. స్వాధీనం చేసుకున్న భూముల్లో ప్రభుత్వ భూములుగా బోర్డులు పెట్టారు. టీడీపీ అండతో ఇదీ ‘గీతం’ బాగోతం ► రుషికొండ, ఎండాడలో సర్వే నంబర్ 17/1, 5, 17/7 నుంచి 28 వరకు 71.15 ఎకరాలను భూమిలేని నిరుపేదలకు ఇచ్చారు. గీతం విద్యా సంస్థను ఏర్పాటు చేసేందుకు ఈ భూములు ఇవ్వాలని 1981లో అప్పటి ప్రభుత్వాన్ని గీతం యజమాని, టీడీపీ నేత, బాలకృష్ణ వియ్యంకుడు దివంగత ఎంవీఎస్ మూర్తి కోరారు. ► ఈ భూములపై కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండడంతో ఆ«ధీన పత్రాలు దక్కించుకునే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని నిబంధన విధిస్తూ ఆ స్థలాన్ని విద్యా సంస్థకు అప్పగించింది. ఆ తర్వాత ఈ సంస్థ కోర్టుకు వెళ్లి తమకు అనుకూలంగా తీర్పు తెచ్చుకుంది. ► గీతం సంస్థ నిబంధనలకు విరుద్ధంగా 14 ఎకరాల్లో మాత్రమే శాశ్వత నిర్మాణాలు చేపట్టి, మిగిలిన 57.15 ఎకరాల్ని 15 ఏళ్లుగా ఖాళీగా ఉంచింది. 1996లో అప్పటి జాయింట్ కలెక్టర్ ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించారు. ► 1998 జూన్ 12న అప్పటి టీడీపీ ప్రభుత్వం కేవలం రూ.34,94,200 మాత్రమే ప్రభుత్వానికి చెల్లించేలా చక్రం తిప్పి.. కారుచౌకగా ఆ భూముల్లో 49 ఎకరాలను గీతంకు అడ్డగోలుగా కట్టబెట్టేసింది. మిగిలిన 8.15 ఎకరాల భూమి కూడా ప్రస్తుతం ‘గీతం’ ఆధీనంలోనే ఉంది. పక్కనున్న 40 ఎకరాలపై కన్ను ► 71.15 ఎకరాలను తన చేతుల్లో ఉంచుకున్నది చాలక, పక్కనే ఉన్న 40.51 ఎకరాల ప్రభుత్వ భూమిపై ‘గీతం’ కన్ను పడింది. క్రమక్రమంగా ఆక్రమణల పర్వానికి తెరతీసింది. ► అధికారులు ఆక్రమణలను గుర్తించిన ప్రతిసారీ.. కోర్టుకు వెళ్లి రిట్ పిటిషన్ దాఖలు చేయడం గీతం యాజమాన్యానికి పరిపాటిగా మారింది. ► సర్వే నంబర్ 15, 37, 38(పీ), 15(పీ)లోని 35 ఎకరాల భూమిని ప్రభుత్వం వీఎంఆర్డీఏ, ఇగ్నో, సోషల్ వెల్ఫేర్, ఐటీడీఏ, స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్, ఆదాయపు పన్ను శాఖ తదితర ప్రభుత్వ సంస్థల కార్యాలయాల కోసం కేటాయిస్తూ 2014 ఫిబ్రవరి 26న సీసీఎల్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. గీతం సంస్థ దీనిపై కూడా కోర్టుకు వెళ్లింది. ► మార్కెట్ ధర ప్రకారం ఈ భూమిని కొనుగోలు చేయొచ్చని ప్రభుత్వం సూచించినా, గీతం యాజమాన్యం స్పందించలేదు. దీంతో అధికారులు రంగంలోకి దిగి ఆ భూములను స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. ఐదు నెలల క్రితమే నోటీసులు గీతం క్యాంపస్ పరిధిలో 40.51 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించాం. వారు బదలాయింపు కోసం దరఖాస్తు చేసుకున్నా, ప్రభుత్వం ఆమోదించ లేదు. ఖాళీగా ఉన్న స్థలాల్ని ముందుగా స్వాధీనం చేసుకున్నాం. 5 నెలల క్రితమే ఆక్రమణలపై యాజమాన్యం సమక్షంలో సర్వే నిర్వహించి, మార్కింగ్ చేసి, నోటీసులిచ్చాం. ఆక్రమించిన భూముల్లో శాశ్వత భవనాలు కూడా ఉన్నాయి. వీటికి కూడా మార్కింగ్ చేశాం. త్వరలో ఆ ప్రాంతాల్నీ స్వాధీనం చేసుకుంటాం. – పెంచల్ కిశోర్, ఆర్డీవో -
అటవీ, రెవెన్యూ శాఖల మధ్య భూ పంచాయితీ
సాక్షి, నెన్నెల: రెవెన్యూ, అటవీ శాఖల భూములకు సంబంధించి సరైన రికార్డులు లేకపోవడం.. ఇరుశాఖల మధ్య సమన్వయలోపంతో పేద రైతులు నష్టపోతున్నారు. ఇరు శాఖల సంయుక్త సర్వేతో సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉన్నా.. ఆ దిశగా సరైన కార్యాచరణ లేక ఏళ్ల తరబడి భూముల సమస్య ఎడతెగడం లేదు. జిల్లాలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన భూములు పలుచోట్ల వివాదాల్లో చిక్కుకున్నాయి. రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చిన తర్వాత భూమిని సాగు చేసుకునేందుకు వెళ్లిన లబ్ధిదారులను అటవీ శాఖ సిబ్బంది అడ్డుకుంటున్నారు. ఆ భూమి రిజర్వు ఫారెస్ట్‌కు చెందినదని, ఎవరూ సాగు చేయవద్దని అభ్యంతరాలు తెలుపుతున్నారు. కొన్నిచోట్ల కేసులు కూడా నమోదు చేస్తున్నారు. రిజర్వు ఫారెస్ట్‌ను ఆనుకొని ఉన్న మండలాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు జాయింట్ సర్వే నిర్వహిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. కా ని రెండు శాఖల అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య జిల్లాలో దాదాపు 25 వేల ఎకరాల భూములు వివాదంలో చిక్కుకున్నాయి. ఫలితంగా 10 వేల మంది పేదలు ఇబ్బంది పడుతున్నారు. కొరవడిన సమన్వయం రెవెన్యూ శాఖ జిల్లాలోని మిగులు భూములను గుర్తించి.. పేదలకు పట్టాలు ఇచ్చి.. సాగు చేసుకోవచ్చని రైతులకు భ రోసా ఇచ్చింది. అయితే ఆ భూములన్నీ రిజర్వు ఫారెస్ట్‌వని, అందులో పంటలు ఎలా వేస్తారని అటవీ శాఖ అధికారులు కేసులు పెడుతున్నారు. దీంతో పట్టాలు పొందిన నిరుపేదల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వ శాఖల్లో సరైన రికార్డులు లేకపోవడమే ఈ వివాదాలకు కారణమవుతోంది. వివాదం ఎందుకు..? రైతులకు పంపిణీ చేసిన భూములు వివాదాస్పదం కావడానికి పలు కారణాలు ఉన్నాయి. రిజర్వు ఫారెస్ట్ భూములకు హద్దులు లేకపోవడం ఒక కారణమైతే.. రైతులకు పట్టాలు పంపిణీ చేస్తున్న రెవెన్యూ అధికారులు వారికి పొజిషన్ చూపించకపోవడం మరో కారణం. ఈ సమస్యతో ప్రభుత్వం నుంచి పట్టాలు పొందిన రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇరు శాఖల ఆధ్వర్యంలో సంయుక్త సర్వే నిర్వహిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆ దిశగా చర్యలు లేకపోవడంతో ఏళ్ల తరబడి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయింది. తమ సమస్య పరిష్కరించాలంటూ బాధితులు తహసీల్దార్లు మొదలు కలెక్టర్ వరకు, ఎంపీపీ మొదలు ఎమ్మెల్యే వరకు మొరపెట్టుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. వివాదంలో 25 వేల ఎకరాలు జిల్లాలోని 18 మండలాల్లో దాదాపు 25 వేల ఎకరాల భూములు అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో చిక్కుకుని ఉన్నాయి. అత్యధికంగా ప్రభుత్వ భూములు ఉన్న నెన్నెల మండలంలో 7,600 ఎకరాలు, నెన్నెల, బొప్పారం గ్రామాల మధ్య ఉన్న సర్వే నంబర్ 671, 672, 674లో 1200 ఎకరాలు, నెన్నెల మండలం సింగాపూర్‌లో సర్వే నంబర్ 34, 36లో 950 ఎకరాలు, కొంపెల్లి, పొట్యాల, కొత్తూర్ శివారు సర్వే నంబర్ 4/2,4/3లో 600 ఎకరాలు, కోనంపేట సమీపంలోని చీమరేగళ్ల వద్ద సర్వే నంబర్ 660లో 700 ఎకరాలు, పుప్పాలవానిపేటలో సర్వే నంబర్ 165/82, 125/82లో 600 ఎకరాలు, కుశ్నపల్లిలో సర్వే నంబర్ 67లో 400 ఎకరాలు, సీతానగర్లోని సర్వే నంబర్ 1లో 1425 ఎకరాలు, జంగల్‌పేటలోని సర్వే నంబర్ 22, 24, 27, 55లో 600 ఎకరాలు, జైపూర్ మండలం గుత్తేదారిపల్లి శివారులోని సర్వే నంబర్ 368, 369/12లో 200 ఎకరాలు, వేమనపల్లి మండలం గోదుంపేటలోని సర్వే నంబర్ 3లో 350 ఎకరాలు, శ్రావణ్‌పల్లి శివారులోని సర్వే నంబర్ 61లో వంద ఎకరాలు, సూరారంలో మరో 200 ఎకరాలు, చెన్నూర్ మండలం కన్నెపల్లి, బుద్దారం, కంకారం గ్రామాలకు ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 354లో 800 ఎకరాలు, మందమర్రి మండలం సారంగపల్లిలో సర్వే నంబర్ 33లో 220 ఎకరాలు, కన్నెపల్లి మండలం రెబ్బెనలో సర్వే నంబర్ 247లో 250 ఎకరాలు, ఆనందాపూర్‌లోని సర్వే నంబర్ 101లో 120 ఎకరాలు, మెట్‌పల్లిలోని సర్వే నంబర్ 20, 22లో 150 ఎకరాలు, జజ్జరవెల్లి సర్వే నంబర్ 88, 89లో 400 ఎకరాల భూమి వివాదంలో ఉంది. కోటపల్లి మండలం కొండంపేట, పారిపల్లిలో దాదాపు 800 ఎకరాలు, సిర్పూర్లో 6800 ఎకరాలు, ఉట్నూర్‌లో 4300 ఎకరాలు, కౌటాలలో 3600, రెబ్బెనలో 2900, దహెగాంలో 580 ఎకరాలు వివాదంలో ఉన్నాయి. తాండూర్, బెజ్జూర్, సిర్పూర్(టీ), ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, కడెం, ఖానాపూర్, ఇంద్రవెల్లి మండలాల్లో సమస్య తీవ్రంగా ఉంది. భూమి తమదంటే తమదని ఇరు శాఖల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. దీంతో వేల ఎకరాల భూములు బీళ్లుగా మారాయి. జాయింట్ సర్వేపై జాప్యం ఆర్భాటంగా పట్టాలు అందజేసిన అధికారులు, ప్ర జాప్రతినిధులు ఆ తర్వాత పేదల సమస్యలను ప ట్టించుకోవడం లేదు. కేటాయించిన భూములు ఏ శాఖకు చెందుతాయో నిర్ధారించాల్సిన జాయింట్ స ర్వేలో జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం కేటాయించిన భూమి మోకా (పొజిషియన్) ఎక్కడుందనేది చూపకపోవడంతో ఆ నంబర్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ దున్నడం ప్రారంభించారు. రైతులు సర్వే నంబర్ ఆ«ధారంగా ప్రభుత్వ భూమిలోనే సాగు చేసుకుంటున్నారు. కొన్నాళ్లు సాగు చేసుకున్నాక ఆ భూ ములు రిజర్వు ఫారెస్ట్‌కు చెందినవని అటవీ శాఖ అడ్డుకుంటోంది. రికార్డులో మాత్రం పీపీ ల్యాండ్‌కు పట్టాలు ఇస్తున్నామని రెవెన్యూ అధికారులు వాదిస్తున్నారు. పట్టాల పేరిట అటవీ భూములను కబ్జా చే స్తున్నారని ఫారెస్ట్ అధికారులు ఆరోపిస్తున్నారు. అట వీ భూములు నిర్ధారించేందుకు చాలా ప్రాంతాల్లో సరైన హద్దులు లేవు. దీంతో రిజర్వు ఫారెస్ట్ సరిహద్దులేవో తెలియడం లేదు. ప్రభుత్వం జిల్లాలో రక్షిత అటవీ ప్రాంతాన్ని గుర్తించినప్పుడు అందుకు అనుగుణంగా రికార్డుల్లో మార్పులు చేయలేదు. దీంతో మిగులు భూములపై వివాదం కొనసాగుతోంది. ముల్కల్లలో భూముల పరిశీలన మంచిర్యాలరూరల్(హాజీపూర్): అటవీ, రెవె న్యూ శాఖల మధ్య నలుగుతున్న హాజీపూర్ మండలం ముల్కల్లలోని భూములను అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. 1991లో ఏసీసీ పరిధిలోని 11 ఎకరాలను అటవీశాఖకు కేటాయించారు. తమ శాఖ భూములను అటవీ శాఖ ఆక్రమించుకుంద ని రెవెన్యూ అధికారులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, అటవీశాఖల వద్ద ఉన్న రికార్డుల ను ఆమె పరిశీలించారు. 205 సర్వే నంబర్లోని 23.10 ఎకరాలు అటవీశాఖ కబ్జాలో ఉండగా.. అటవీ శాఖకు 11, మిగిలిన 12 ఎకరాలు రెవెన్యూ శాఖకు రికార్డుల్లో ఉన్నట్లు గుర్తించారు. సమగ్ర సర్వే జరిపి రెండురోజుల్లో ఇరు శా ఖల భూ హద్దులు నిర్ణయించాలని అధికారులకు జారీ చేశారు. ఆమె వెంట తహసీల్దార్ మహ్మద్ జమీర్, ఎంపీడీఓ అబ్దుల్‌హై, లక్సెట్టిపేట అటవీ రేంజ్ అధికారి నాగావత్ స్వామి, గిర్దావర్ రాజ్‌మహ్మద్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ముల్కల్ల బీట్ అధికారి తిరుపతి ఉన్నారు. -
రెవెన్యూ అనకొండలు
సాక్షి, హైదరాబాద్ : గతేడాది జూలైలో కేశంపేట తహసీల్దార్ లావణ్యపై ఏసీబీ అధికారులు దాడులు చేసిన సమయంలో రూ.93 లక్షల నగదు దొరికితే అక్కడికి వెళ్లిన వారి కళ్లు తిరిగాయి. తాజాగా లావణ్య రికార్డును బద్దలు కొట్టేలా కీసర తహసీల్దార్ నాగరాజు ఏకంగా రూ.1.10 లక్షల నోట్ల కట్టలతో పట్టుబడడంతో అంతా నోరెళ్లబెట్టారు. రెవెన్యూశాఖలో వేళ్లూనుకున్న అవినీతికి ఈ రెండు ఘటనలూ నిదర్శనం. అవినీతికి చిరునామాగా మారిన రెవెన్యూ వ్యవస్థను సంస్కరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఒకవైపు ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు లంచావ తారాల లీలలకు మాత్రం బ్రేకులు పడడంలేదు. భూ ముల విలువలకు రెక్కలు రావడం.. భూ వివాదాలు పెరిగిపోవడాన్ని ఆసరా చేసుకుంటున్న కొందరు అధికారులు డబ్బు మూటలకు ఆశపడుతున్నారు. దాయాదులు వివాదమైనా, సరిహద్దు తగాదైనా, న్యాయపరమైన చిక్కులైనా, సాంకేతిక సమస్యలైనా జాన్తానై అంటూ అందినకాడికి దండుకుంటున్నారు. తాజాగా ‘షాక్’పేట రెవెన్యూశాఖను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో హైదరాబాద్‌లోని షేక్‌పేట మండల తహసీల్దార్ వివాదాస్పద భూ వ్యవహారంలో తలదూర్చి ఏసీబీకి చిక్కారు. తహసీల్దార్ సుజాత ఇంటిపై దాడి చేసిన అధికారులు.. సుమారు రూ.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇదే భూ వివాదంలో ప్రైవేటు వ్యక్తులకు అండగా నిలిచిన ఆర్ఐ కూడా భారీ నగదుతో ఏసీబీకి పట్టుబట్టారు. ఆ కేసులో సుజాత భర్త ఆత్మహత్య చేసుకోవడం, ఫిర్యాదుదారుడిపై కూడా ఆరోపణలు రావడంతో ఆ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రెవెన్యూశాఖలో లంచాల ఆరోపణల నేపథ్యంలో అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ హత్య అనంతరం కూడా రెవెన్యూశాఖపై ఆరోపణలు, ఏసీబీ కేసుల విషయంలో ఎలాంటి మార్పులు రాకపోగా.. అందరూ తిరిగి పాతబాటే పట్టడం గమనార్హం. క్షేత్రస్థాయిలో పనిచేసే వీఆర్వో నుంచి జాయింట్ కలెక్టర్ల వరకు అవినీతిపర్వాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆ మూడు జిల్లాల్లోనే తిష్ట.. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులు అక్కడి నుంచి కదలడానికి ఇష్టపడరు. అలాగే వారిని కదలించడానికి ఎవరూ సాహసించరు. దశాబ్దాల కాలంగా నయాబ్ తహసీల్దార్ నుంచి అదనపు కలెక్టర్ల వరకు అదే జిల్లాలో కొలువులు చేస్తున్నారు. రంగారెడ్డి నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి మేడ్చల్, మేడ్చల్ నుంచి రంగారెడ్డి ఇలా ఈ మూడు జిల్లాల్లోనే సర్వీసు పూర్తి చేసుకుం టున్నా.. ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది. విలువైన భూములను డీల్ చేసే క్రమం లో బడాబాబులు, ప్రజాప్రతినిధులతో ఏర్పడిన పరిచయాన్ని పలుకుబడిగా మార్చుకొని ప్రభుత్వ స్థాయిలో చక్రం తిప్పుతున్న అధికారులు తమ కుర్చీలకు ఎసరు రాకుండా చూసుకుంటున్నారు. ఒకవేళ కాదూ కూడదని ప్రభుత్వం ఇతర జిల్లాలకు బదిలీ చేసినా.. సెలవుపై వెలుతున్నారే తప్ప బాధ్యతలు తీసుకోవడంలేదు. -
తాత ఒకరికి... మనవడు మరొకరికి !
వరంగల్ అర్బన్ ,హసన్‌పర్తి : జిల్లా కేంద్రం శివార్లలోని భూముల ధరలకు రెక్కలు రావడంతో అదే స్థాయిలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. పూర్వీకులు అమ్మిన భూములపై కన్నేసిన వారి వారసులు, సిబ్బందితో కుమ్మక్కై రికార్డుల్లో తమ పేర్లు చేర్పించుకుంటున్నారు. ఆ తర్వాత మళ్లీ అదే భూములను ఇంకొకరికి విక్రయిస్తుండడంతో తొలుత కొనుగోలు చేసిన వారు నష్టపోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. జిల్లాలోని హసన్‌పర్తి రెవెన్యూ పరిధిలోని చింతగట్టు శివారులో ఇలాంటి ఘటన వెలుగు చూసింది. 1968లో తొలి విక్రయం హసన్‌పర్తి మండలం చింతగట్టు శివారులోని సర్వే నంబర్ 53/ఏలో 2.11ఎకరాల భూమిని పట్టాదారులు బిల్లా జగన్నాథరెడ్డి నుంచి జనగాని కనకయ్య 1968(డాక్యుమెంట్ నంబర్ 607/1968)లో కొనుగోలు చేశారు. ఈ భూమిని కనకయ్య మరణాంతరం ఆయన వారసులు జనగాని రామస్వామి డాక్యుమెంట్ నంబర్ 156/1994 ద్వారా బిల్లా ప్రభాకర్‌రావుకు జీపీఏ ఇచ్చారు. అనంతరం 1994లోనే భూమిని ప్రభాకర్‌రావు ప్లాట్లుగా విభజించగా ఎంజీఎం ఆస్పత్రిలో పనిచేస్తున్న 34మంది ఉద్యోగులు కొనుగోలు చేశారు. అప్పటి నుంచి 2010 వరకు సదరు ఉద్యోగులే మోఖాపై ఉన్నారు. అయితే, పహాణీలో మాత్రం 2010 వరకు జగన్నాథరెడ్డి కొనసాగుతూ రాగా, ఖరీదు చేసిన కనకయ్య పేరు కనిపించలేదు. 2010లో రికార్డుల్లో పేరు మార్పిడి మొదట జగన్నాథరెడ్డి పేరిట రికార్డుల్లో ఉండగా, 2010లో మాత్రం రెవెన్యూ రికార్డుల్లో ఆయన మనవడు బిల్లా రవీందర్‌రెడ్డి పేరు నమోదైంది. దీంతో రవీందర్‌రెడ్డి ఆ భూమిని నగరానికి చెందిన సాయిరెడ్డికి విక్రయించినట్లు బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సాయిరెడ్డి కోర్టును ఆశ్రయించగా, ఆయన ఓఎస్ నంబర్ 824/2011 ప్రకారం ఆయన ఫైల్‌ను కోర్టు తిరస్కరించినట్లు బాధితులు తెలిపారు.ఓఎస్ నంబర్496/2011 ప్ర కారం తాము రవీందర్‌రెడ్డిపై కోర్టును ఆశయించగా, కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఆ భూమిపై 23–03–2018న శా శ్వ త ఇంజక్షన్ ఆర్డర్ పొందినట్లు బాధితులు క లెక్టర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. అ యితే సాయిరెడ్డి మాత్రం మరోవ్యక్తి ద్వారా త మకు తప్పుడు కేసుబనాయించాడని వాపోయారు.శాశ్వత ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా తమను మోఖాపైకి రానివ్వడం లేదని, కోర్టు ఉత్తర్వుల మేరకు పహాణీలో రవీందర్‌రెడ్డి పేరుతొలగించి తమ పేర్లు చేర్చాలని వారు కోరారు.ఈవిషయ మై కలెక్టర్‌తోపాటు హసన్‌పర్తి రెవెన్యూ అ ధికా రులు,కేయూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలిస్తున్నాం... చింతగట్టు శివారులో భూమికి సంబంధించి మాకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఎంజీఎం ఉద్యోగులు కొనుగోలు చేసినప్పటి పత్రాలను పరిశీలిస్తున్నాం. దర్యాప్తు చేపట్టి కేసు నమోదు విషయమై నిర్ణయం తీసుకుంటాం.– డేవిడ్‌రాజు, పోలీస్ ఇన్స్పెక్టర్, కేయూసీ -
డబుల్ బెడ్రూం ఇళ్లపై అధికారుల జులుం!!
ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు లతీఫాబీ. వయసు 90 ఏళ్లు. పాతబస్తీలోని డబీర్‌పురా బిడ్జ్రి సమీపంలోని మురికివాడ సయ్యద్ సాబ్‌కా బాడలో నివసిస్తోంది. పిల్లలు పెళ్లిళ్లు చేసుకుని వేరుగా ఉంటున్నారు. భర్త మహ్మద్ ఖాసీం కొన్నాళ్ల క్రితమే మృతి చెందారు. లతీఫాబీ జీవనోపాధి కోసం స్థానికంగా ఓ చిల్లర కొట్టు పెట్టుకుని ఒంటరిగా జీవిస్తోంది. గతంలో ఆమెకు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరైంది. భవన సముదాయంలోని రెండో అంతస్తులోని ఎస్ఎఫ్/11లో లతీఫాబీ ఒంటరిగా నివసిస్తోంది. కాలక్షేపం కోసం ఆమె అప్పుడప్పుడూ భవన సముదాయంలోని కింది అంతస్తులోని ఫ్లాట్స్‌కు వెళ్లి వస్తూ ఉంటుంది. ఈ నెల 6న రెవెన్యూ అధికారులు భవన సముదాయంలోని ఒక ఇంటి వివాదం విషయంలో వచ్చి లతీఫాబీ ఇంటిని సీజ్ చేసి వెళ్లిపోయారు. గూడు లేని పక్షిగా మారడంతో చుట్టుపక్కల వారు పెట్టింది తింటూ.. పదిహేను రోజులుగా భవన సముదాయం వరండాలోదిగులుతో అలమటిస్తోంది ఆ దీనురాలు. సాక్షి, సిటీబ్యూరో: దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదనే చందంగా మారింది డబుల్ బెడ్రూం లబ్ధిదారుల పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మురికివాడల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లు పేదలకు శాశ్వత గూడు పరిష్కారం చూపిస్తున్నా.. ఆ తర్వాత చీటికీ మాటికీ రెవెన్యూ సిబ్బంది వేధింపులు మాత్రం తప్పడం లేదు. ఉన్నతాధికారులు ఆదేశాలు లేనప్పటికీ డబుల్ బెడ్రూం ఇళ్ల భవన సముదాయంలోని ఒకటి రెండు ఇళ్ల వివాదాలను బూచిగా చూపిస్తూ అందరినీ ఒకే గాటన కడుతున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా లబ్ధిదారుల ఇళ్లను సీజ్ చేస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది. ఇదే అదనుగా కొందరు దళారులు రంగంలోకి దిగి ‘రెవెన్యూ’తో సమస్య లేకుండా చేస్తామంటూ లబ్ధిదారులతో బేరసారాలకు దిగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదీ విషయం.. పాతబస్తీలోని డబీర్‌పురా బిడ్జ్రీ సమీపంలోని ఉంది సయ్యద్ సాబ్‌కా బాడా ప్రాంతం. నిజాం హయాం నుంచే కొన్ని కుటుంబాలు ఇళ్లు నిర్మించుకొని ఏళ్ల తరబడి నివాసం ఉంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం భవన సముదాయాల కోసం అక్కడి నివాసం ఉంటున్న పేద కుటుంబాలందరికీ శాశ్వత గూడు కల్పిస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. ఉమ్మడి కుటుంబాల వారికి సైతం ఏ,బీ, సీ కేటగిరీగా విభజించి దశలవారీగా ఇళ్లు కేటాయిస్తామని భరోసా కల్పించడంతో అక్కడి పేదలు తమ ఇళ్లను ఖాళీ చేశారు. సయ్యద్ సాబ్‌కా బాడలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. మొదటి విడతలో 34 మంది లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించారు. లబ్ధిదారులు ఏడాది నుంచి ఇళ్లలో నివాసం ఉంటున్నారు. అధికారుల అత్యుత్సాహం.. సయ్యద్ సాబ్ బడా డబుల్ బెడ్రూం ఇళ్ల భవన సముదాయంలో తన పేరుమీద కేటాయించిన ఇంటిని మరొకరు అక్రమించి నివాసం ఉంటున్నారంటూ ఇటీవల ఓ మహిళ స్థానిక ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లింది. ఆయన సిఫార్సుతో రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారంతో ఆ ఇంటిని ఖాళీ చేయించి సదరు మహిళకు అప్పగించారు. ఇక్కడితో కథ సుఖాంతమైంది. కానీ, ఇదే అదనుగా రెవెన్యూ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆ ఇంటి వివాదాన్ని బూచిగా చేసుకొని మిగతా లబ్ధిదారుల ఇళ్లపైనా ప్రతాపం చూపిస్తున్నారు. ఎలాంటి నోటీసులు, స్పష్టమైన ఆరోపణల ఆధారాలు చూపకుండా టార్గెట్ చేసిన కొన్ని ఇళ్లను సీజ్ చేశారు. దీంతో పలు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇదేమని ప్రశ్నిస్తే ఆరోపణలున్నాయంటున్నారు. అసలు విషయాలు చెప్పకుండా దాటవేస్తున్నారంటూ బాధితులు పేర్కొంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పలువురు బాధితులు కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. వాస్తవంగా జిల్లా స్ధాయి అధికారుల ఉదాసీన వైఖరి, పర్యవేక్షణ లోపంతో కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
‘రెవెన్యూ’కు కొత్తరూపు కోసం సర్కారు కసరత్తు
సాక్షి, హైదరాబాద్ : రెవెన్యూ శాఖలో కీలక సంస్కరణలకు నడుం బిగించిన ప్రభుత్వం.. భూములపై తహసీల్దార్లు, రెవెన్యూ డివిజనల్ అధికారుల (ఆర్డీఓ) పెత్తనానికి చెక్ పెట్టబోతోంది. కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం భూ పరిపాలన పగ్గాలను పూర్తిగా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు అప్పగించాలని, క్షేత్రస్థాయి సమస్యలు రాకుండా తహసీల్దార్లు, ఆర్డీవోలను ఈ అధికారాల నుంచి తప్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ముఖ్యంగా రికార్డుల మార్పుచేర్పులు, మ్యుటేషన్ల జారీ అధికారాలను అదనపు కలెక్టర్లకు బదలాయించనుంది. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు తేల్చొద్దని అధికారికంగా ఆర్డీవోలు, తహసీల్దార్లకు ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ప్రతివారం మండల, డివిజన్ స్థాయిలో జరిగే రెవెన్యూ కోర్టులకు బ్రేక్‌పడింది. భూ వివాదాలపై మండల, డివిజన్, జిల్లా (అదనపు కలెక్టర్) స్థాయిలో రెవెన్యూ కోర్టులు జరుగుతాయి. రంగారెడ్డి జిల్లాలో విలువైన ప్రభుత్వ భూములపై నెలకొన్న వివాదాలపై ఒకరిద్దరు తహసీల్దార్లు అడ్డగోలుగా తీర్పులిచ్చారని, తద్వారా భూములపై న్యాయపరమైన చిక్కులు ఏర్పడటమే కాక విలువైన భూములు పరాధీనమయ్యే పరిస్థితి నెలకొందని, దీంతో పెండింగ్‌లో ఉన్న కేసులను మరోసారి క్షుణ్ణంగా సమీక్షించాలనే ఉద్దేశంతో రెవెన్యూ కోర్టులను తాత్కాలికంగా నిలిపివేసినట్టు అధికారులు చెబుతున్నారు. భూ రికార్డులు ఫ్రీజ్! రెవెన్యూ రికార్డులు తారుమారు కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా తయారుచేసిన వివాదరహిత రికార్డులను ఫ్రీజ్ చేయాలని యోచిస్తోంది. ఇదే అంశాన్ని ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఎజెండాలోనూ చేర్చడం గమనార్హం. భూములకు సంబంధించిన ఎలాంటి రికార్డులు ఇకపై ట్యాంపర్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనుందని తెలుస్తోంది. ఇప్పటికే సీసీఎల్ఏ అధికారులు భూరికార్డుల నిక్షిప్తంపై మార్గదర్శకాలు తయారు చేస్తున్నారు. రాష్ట్రంలోని ఇనాం, వక్ఫ్, దేవాదాయ, భూదాన్ కేటగిరీల్లో ఉన్న కోర్టు కేసుల వివరాలనూ సేకరిస్తున్నారు. వీటితోపాటు కౌలు వివాదాల్లో ఉన్న భూముల వివరాలను కూడా తెలపాలని ఇటీవలే క్షేత్రస్థాయికి సీసీఎల్ఏ ఆదేశాలు జారీ చేసింది. 24 గంటల్లో భూముల మ్యుటేషన్ భూముల మ్యుటేషన్లు 24 గంటల్లో పూర్తి చేయాలన్న సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు మ్యుటేషన్ ప్రొసీడింగ్స్ (ఆటోమేటిక్ డిజిటల్ సంతకం జరిగేలా) ఇవ్వడమేగాకుండా.. ఆన్లైన్ పహాణీలో నమోదుచేసేలా చట్టంలో పొందుపరిచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. అధికారాలే కాదు.. అధికారులకూ కోత రెవెన్యూ చట్టంలో మరో కీలక నిర్ణయానికి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ శాఖను సంస్కరించడం చట్టంతో సరిపోదని భావిస్తున్న సీఎం కేసీఆర్.. పాలన వ్యవహారాలను గాడిలో పెట్టేందుకు అధికారాలకు కోత పెట్టడమేకాక ఆరో వేలులాంటి కొన్ని అధికార వ్యవస్థలనూ రద్దుచేయాలని నిర్ణయించారు. జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో), గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) వ్యవస్థను రద్దు చేయాలనే నిర్ణయానికొచ్చారు. అదనపు కలెక్టర్ (సాధారణ) పోస్టుల్లో అత్యధికం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు/ డిప్యూటీ కలెక్టర్లను నియమించింది. వీరిలో చాలామంది డీఆర్వోలుగా పనిచేస్తున్నారు. డీఆర్వో పోస్టు వల్ల పెద్దగా ప్రయోజనంలేదని భావిస్తోన్న సర్కారు.. దీనికి మంగళం పాడి ప్రస్తుతం డీఆర్వోలు నిర్వహిస్తోన్న విధులను కలెక్టరేట్లోని ఆ తర్వాతి స్థాయి అధికారికి అప్పగించనుంది. గ్రామస్థాయిలో రెవెన్యూకు ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించేది వీఆర్వోలే. రెవెన్యూ అవినీతిలో వీరిదే అందెవేసిన చేయి అని పలుమార్లు సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు కూడా. తాజాగా జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లోనూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. దీంతో ఈ వ్యవస్థను రద్దుచేసే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వీఆర్వోలుగా పనిచేస్తున్న వారిని వారి అర్హత, పనితీరు ప్రామాణికంగా తీసుకొని క్వాలిఫైడ్ వీఆర్వోలను జూనియర్ అసిస్టెంట్లుగా రెవెన్యూలోనే అంతర్గత సర్దుబాటు చేయడమా? లేదా పంచాయతీరాజ్, వ్యవసాయశాఖలో విలీనం చేయడమా? అనేది రెవెన్యూ యంత్రాంగం పరిశీలిస్తోంది. రెవెన్యూలో అవినీతికి సర్వేయర్లు కూడా ప్రధాన కారణమని అంచనాకొచ్చిన సర్కారు.. ఆ వ్యవస్థను ప్రైవేటీకరించే యోచన చేస్తోంది. ఈ మేరకు ప్రైవేటు సర్వేయర్లకు లైసెన్సులు జారీ చేయనుంది. గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ)ను కూడా పంచాయతీరాజ్ పరిధిలో విలీనంచేసే అవకాశం ఉంది. -
తెలంగాణ రెవెన్యూ కోడ్..!
సాక్షి, హైదరాబాద్ : భూ పరిపాలన, హక్కులపై ఉన్న గందరగోళాలకు తెరదించుతూ, దీనికి సంబంధించిన అన్ని చట్టాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ఉత్తరప్రదేశ్ తరహాలో తెలంగాణ రెవెన్యూ కోడ్‌ను తేవాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు యూపీ సర్కారు 2016లో అమల్లోకి తెచ్చిన రెవెన్యూ కోడ్‌ను సమగ్రంగా అధ్యయనం చేసి రాష్ట్రం కోసం కొత్త రెవెన్యూ కోడ్‌కు రూపకల్పన చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ యూపీ కోడ్ అధ్యయనం చేసే పనిలో పడినట్లు సమాచారం. వాస్తవానికి, నిజాం రాష్ట్రంలో ‘ఫస్లీ–1317’చట్టాన్ని రూపొందించారు. ఈ ఫస్లీయే ఇప్పటివరకు అమల్లోకి వచ్చిన అన్ని రెవెన్యూ చట్టాలకు భూమికగా వస్తోంది. భూ పరిపాలనకు సంబంధించిన అన్ని చట్టాలు, భాగాలు, అధ్యాయాలు, సెక్షన్లు అన్నీ ఈ చట్టంలో సమగ్రంగా ఉండేవి. అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత భూపాలన, హక్కులకు సంబంధించిన ఒక్కో అంశంపై ఒక్కో చట్టం చేశారు. లేదంటే చట్టంలోనే సబ్ సెక్షన్లుగా నియమ నిబంధనలను విడగొట్టారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 124 రెవెన్యూ చట్టాలు/రూల్స్ అమల్లో ఉన్నాయి. ఇబ్బడిముబ్బడిగా ఉన్న వీటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి యూపీ తరహాలో తెలంగాణ రెవెన్యూ కోడ్ అమల్లోకి తేవాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. అదే తరహాలో కాలంచెల్లిన చట్టాలకు చరమగీతం పాడాలని యోచిస్తోంది. మరోవైపు పాశ్చాత్య దేశాలే కాకుండా, పొరుగు రాష్ట్రంలోనూ అమలు చేస్తున్న టైటిల్ గ్యారంటీ చట్టాన్ని ఇక్కడ కూడా ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నా, ఇది అమల్లో కష్టసాధ్యమని, న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయనే మీమాంసలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘తెలంగాణ రెవెన్యూ కోడ్ లేదా తెలంగాణ భూచట్టం’వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కోడ్‌కు తుదిరూపు ఇచ్చేముందుకు ప్రత్యేకంగా కలెక్టర్ల సమావేశం నిర్వహించి కోడ్‌పై విస్తృతంగా చర్చించాలని కూడా ఆయన నిర్ణయించినట్లు సమాచారం. యూపీ చట్టం ఇది... దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో కూడా రెవెన్యూ వ్యవస్థ గందరగోళంగా ఉండేది. భూ చట్టాల అమల్లో ఉన్న ఇబ్బందులకు పరిష్కారంగా రెవెన్యూ కోడ్ రూపొందించాలని ఆ రాష్ట్ర లా కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ సిఫారసు మేరకు 2006 సంవత్సంలో యూపీ రెవెన్యూ కోడ్‌కు అక్కడి ప్రభుత్వం రూపకల్పన చేసింది. 2012లో దీన్ని అసెంబ్లీ ఆమోదించింది. ఆ తర్వాత 2016 నుంచి ఈ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ కోడ్‌లో మొత్తం 16 అధ్యాయాలు, 234 సెక్షన్లు ఉన్నాయి. భూపరిపాలన, భూహక్కులకు సంబంధించిన అన్ని చట్టపరమైన అంశాలు ఈ కోడ్‌లోనే పొందుపరిచారు. అంతకుముందు మనుగడలో ఉన్న 32 చట్టాలను కోడ్ రాకతో అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. ఇదే తరహాలో 1999లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ కోడ్ రూపొందించారు. అప్పటికే ఉన్న 191 చట్టాలను క్రోడీకరించి ఆంధ్రప్రదేశ్ భూమి రెవెన్యూ కోడ్–1999 పేరుతో తయారు చేశారు. ఇందులో 17 భాగాలు, 47 అధ్యాయాలు, 260 సెక్షన్లను పొందుపరిచారు. భూపాలనకు సంబంధించిన చట్టాలన్నింటినీ ఒకే చోటకు తెచ్చే ప్రయత్నానికి కేంద్రం మోకాలడ్డింది. శాసనసభ ఆమోదముద్ర వేసిన బిల్లును కేంద్రానికి పంపగా 146 ప్రశ్నలతో తిప్పి పంపింది. దీంతో కోడ్ అటకెక్కింది. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో తెలంగాణ రెవెన్యూ కోడ్‌ను యూపీ కోడ్ ఆధారంగా తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. మా దోస్త్‌ను కూడా వదలలేదు? కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ మరోసారి రెవెన్యూశాఖపై అసహనం వ్యక్తం చేశారు. డబ్బులివ్వందే పనులు కావడం లేదని మండిపడ్డారు. ‘పాస్ పుస్తకం కోసం మా దోస్తు పోతే వీఆర్వో పైసలు అడిగిండు. అసలేం జరుగుతోంది. విజయారెడ్డిని అన్యాయంగా పోగొట్టుకున్నం. చిన్న పిల్లలు అన్యాయమైపోయారు. ఇలాంటి సంఘటనల తర్వాత కూడా రెవెన్యూ వాళ్లు మారరా? కనువిప్పు కలగాలి. ఇప్పటికే రెవెన్యూ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. భూ రికార్డుల ప్రక్షాళనను లోపభూయిష్టంగా చేశారు. భూ రికార్డులు సరిగ్గా ఉన్న ప్రాంతాల్లో 3 శాతం జీడీపీ అదనంగా వస్తోందని రుజువైంది. ఇప్పటికైనా మార్పు రావాలి’అని సీఎం కేసీఆర్ కలెక్టర్ల సమావేశంలో వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
వివాదాస్పదం అవుతున్న రెవెన్యూ శాఖ
పాల్వంచ: పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలో ఇటీవల పలు సర్వే నంబర్లలోని భూముల స్వాధీన ప్రక్రియ వివాదాస్పదంగా మారుతోంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం పాల్వంచ పరిధిలో నిర్మిస్తున్న తరుణంలో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వ భూముల రక్షణ పేరుతో రెవెన్యూ శాఖ పలు సర్వే నంబర్లలో వందలాది ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటుండడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. రైతుల పట్టా భూములతో పాటు రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్న ఇళ్ల స్థలాలు సైతం ప్రభుత్వ భూమి అంటూ అధికారులు ఫెన్సింగ్ వేస్తున్నారు. బహుళ అంతస్తుల ఇళ్లు నిర్మించుకున్న వారికి సైతం నోటీసులు జారీ చేయడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. రెవెన్యూ శాఖకు, ప్రజలకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసు బందోబస్తు నడుమ భూముల స్వాధీన పరంపర కొనసాగిస్తున్నారు. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయిస్తున్నారు. నాలుగు రోజులుగా ఉద్రిక్తత.. నవభారత్ సమీపంలోని కేఎస్ఎం బంక్ వెనుక భాగంలో 444/1 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉందంటూ రెవెన్యూ అధికారులు 1932 సంవత్సరం నాటి నక్ష ప్రకారం సర్వే చేసి ఆరెకరాల భూమికి ఫెన్సింగ్ పనులు ప్రారంభించారు. బహుళ అంతస్తులు కట్టుకున్న సుమారు 100 మందికి సైతం ఫిబ్రవరి 3 వరకు వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. అయితే ఇందులో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకుని ఇళ్లు నిర్మించుకున్న వారే ఎక్కువ. ఎస్ఎఫ్సీ వారు రుణాలు ఇచ్చేముందు ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలపాలని బహిరంగ పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. కానీ అప్పుడేమీ మాట్లాడని రెవెన్యూ అధికారులు.. ఇప్పుడు ప్రభుత్వ భూములంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడ గత నాలుగు రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నవభారత్ దాబాల వద్ద రెవెన్యూ అధికారులు ఫెన్సింగ్ వేసిన దృశ్యం రెవెన్యూ అధికారుల తీరుకు నిరసనగా ఓ మహిళ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. పది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమ, మంగళవారాల్లో కూడా బాధితులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. అలాగే పాల్వంచలోని కుంటినాగుల గూడెంలో 817, 842, 822, 821, 826, 835 సర్వే నంబర్లలో గిరిజన రైతులకు చెందిన సుమారు 40 ఎకరాల సాగు భూమి ఉంది. వీటిలో కొన్నింటికి 1975, 1995, 2007 సంవత్సరాల్లో సోషల్ వెల్ఫేర్ పట్టాలు ఇచ్చారు. ఇక్కడ 12 ఎకరాల వరకు స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేశారు. నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మంచికంటి నగర్, శేఖరం బంజర, పాలకోయ తండా ఏరియాల్లో సుమారు 24 ఎకరాలకు ఫెన్సింగ్ వేశారు. సాగు భూములు అమ్ముకున్నారని... నిరుపేద ఎస్సీ, ఎస్టీలు సాగు చేసుకుని జీవనోపాధి పొందాలంటూ గతంలో ప్రభుత్వం ఒక్కొక్కరికి ఎకరం, రెండెకరాల చొప్పున సోషల్ వెల్ఫేర్ పట్టాలు ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆ భూములు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించారంటూ పలు ప్లాట్లలో నిర్మించిన బేస్ మట్టాలను తొలగించారు. మరోవైపున నవభారత్ దాబాల నుంచి అన్నపూర్ణ మెస్ వరకు రోడ్డు పొడవునా 100 ఎకరాల్లో ‘ఇవి ప్రభుత్వ భూములు’ అంటూ 22 హెచ్చరిక బోర్డులు పాతారు. నవభారత్ ఆలయం ఎదుట సర్వే నంబర్ 444లో 4.35 ఎకరాల స్థలంలో చేపట్టిన పలు నిర్మాణాలకు అనుమతి లేదంటూ కూల్చివేశారు. లక్ష్మీదేవిపల్లి పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 60/1లో సుమారు 12 ఎకరాలు స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేశారు. ఉల్వనూరులో సుమారు 20 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. పాండురంగాపురంలో ఓ రైతుకు చెందిన ఐదెకరాల భూమి స్వాధీనం చేసుకునేందుకు యత్నించగా రైతు అడ్డుకోవడంతో తాత్కాలింగా ఆ పనులు నిలిపివేశారు. మధువన్ గార్డెన్‌కు చెందిన సర్వే నంబర్ 406/1లో సుమారు ఏడెకరాల భూమికి కూడా ఫెన్సింగ్ వేశారు. అయితే చీఫ్ కమిషనర్ ఆఫ్ లాండ్ అండ్ అడ్మినిస్ట్రేషన్(సీసీఎల్ఏ) నుంచి అనుమతులు ఉన్నా ఫెన్సింగ్ వేశారంటూ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. ఇంకా శ్రీనివాస కాలనీ, మసీదుగుట్ట, వెంగళరావు కాలనీలోని భూములను కూడా స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధమవుతోంది. కోర్టును ఆశ్రయిస్తున్న బాధితులు.. రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుంటున్న భూములన్నీ కొత్తగూడెం – పాల్వంచ రహదారితో పాటు, ములకలపల్లి రోడ్లో ఉండటంతో వాటి విలువ ఇప్పుడు భారీగా పెరిగింది. ఈ భూములు దశాబ్దాల తరబడి పట్టాదారుల ఆధీనంలోనే ఉన్నాయి. అందుకు సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయి. అయినా రెవెన్యూ అధికారులు భవిష్యత్ భూ అవసరాల పేరుతో స్వాధీనం చేసుకోవడం పట్ల బాధితులు ఆందోళన చెందుతున్నారు. గ్రీవెన్స్ డేలో కలెక్టర్‌కు వందల మంది ఆర్జీలు పెట్టుకుంటున్నారు. మరి కొందరు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. 444 సర్వే నంబర్‌లోనే 32 ఫిర్యాదులు హైకోర్టులో ఉండడం గమనార్హం. ఎంతో కష్టపడి కొనుగోలు చేసిన భూములకు రక్షణ లేకపోవడంతో కోర్టుకు వెళ్లాల్సి వస్తోందని, దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బందులకు గురి చేస్తున్నారు కేఎస్ఎం బంక్ వెనుక సర్వే నంబర్ 444/13,17,18లో అన్ని రకాల అనుమతులు ఉన్న వెంచర్లో దశాబ్దాల క్రితం ప్లాట్లు కొనుగోలు చేశాం. అందులో అనేక మంది బహుళ అంతస్తులు కూడా నిర్మించుకున్నారు. ఇప్పుడు రెవెన్యూ అధికారులు వచ్చి సర్వే నంబర్ 444/1 అని, ఇవి ప్రభుత్వ భూములు అంటూ ఫెన్సింగ్ వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కె.రవికుమార్, బాధితుడు ఇంటికి కూడా నోటీసు ఇచ్చారు. లక్షల రుపాయలు ఖర్చు పెట్టి ఇళ్లు నిర్మించుకున్న వారికి అధికారులు నోటీసులు ఇవ్వడం బాధాకరం. అన్ని అనుమతులతో, పదేళ్ల క్రితమే ఇక్కడ ఇళ్లు నిర్మించుకున్నాం. ఇంతకాలం పట్టించుకోని అధికారులు ఇప్పుడు సర్కారు భూములంటూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం అన్యాయం. మేం కోర్టును ఆశ్రయిస్తాం. - శ్రీనివాస్, బాధితుడు పత్రాలు ఇస్తే పరిశీలిస్తాం మా నక్షా ప్రకారం ప్రభుత్వ భూమి అని ఉన్న వాటిని మాత్రమే స్వాధీనం చేసుకుంటున్నాం. కొందరు కోర్టుకు వెళ్లారు. అయితే వారి నంబర్లు ఉన్న చోట భూములు ఉండటం లేదు. బాధితులు వారి పత్రాలు సమర్పిస్తే తప్పకుండా పరిశీలించి న్యాయం చేస్తాం. అవసరమైతే వారి భూములను కూడా చూపిస్తాం. - జి.నవీన్‌కుమార్ శర్మ, పాల్వంచ తహసీల్దార్ -
తమకో నీతి... ఇతరులకో నీతా..
పశ్చిమగోదావరి, ఏలూరు (మెట్రో): గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని విషయంలో చేసిందే నీతిగా.. ప్రస్తుత ప్రభుత్వం చేసేది నీతిలేని పనిగా.. ఉద్యోగ సంఘాలను, ఉద్యోగులను అవమానించేలా తెలుగుదేశం నేతలు మాట్లాడం సరికాదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ చైర్మన్ కె.రమేష్‌కుమార్ అన్నారు. మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా ఉద్యోగ సంఘాల రాష్ట్ర నేత బొప్పరాజు వెంకటేశ్వర్లుపై ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడటాన్ని ఆయన ఖండించారు. రాజధాని విషయంలో ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా ఉద్యోగులుగా సహకరిస్తామని ఆయన చెప్పారు. స్థానిక రెవెన్యూ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తక్షణమే దేవినేని ఉమా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉన్నా టీడీపీ ప్రభుత్వం ఏడాదిలోనే అమరావతికి రావాలని కోరితే కట్టుబట్టలతో ఉద్యోగులు తరలివచ్చారని గుర్తుచేశారు. రాజధాని మారినా, రాష్ట్రాలు విడిపోయినా మొదట నష్టపోయేది ఉద్యోగులేనన్నారు. ఉద్యోగ సంఘాలను రాజకీయ ఉచ్చులోనికి లాగొద్దని హితవు పలికారు. సమావేశంలో ఏపీ అమరావతి జేఏసీ కో చైర్మన్ కృష్ణమోహన్, జనరల్ సెక్రటరీ వెంకట రాజేష్, జిల్లా కార్యదర్శి ప్రమోద్ కుమార్, లేబర్ డిపార్టుమెంటు రాష్ట్ర అధ్యక్షులు రాజేష్, డ్రైవర్ సంఘ జిల్లా అధ్యక్షులు నారాయణ పాల్గొన్నారు. -
ఎమ్మార్వోలకు ‘పార్ట్–బీ’ బాధ్యత!
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం తేరుకుంది. చిక్కుముడిగా మారిన పార్ట్–బీ భూములను పరిష్కరించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇన్నాళ్లు జాయింట్ కలెక్టర్, ఆర్డీవోల పేరిట కాలయాపన చేసిన రెవెన్యూశాఖ.. ఈ భూ వివాదాలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు వీలుగా.. సవరణ అధికారాన్ని తహసీల్దార్లకు ఇవ్వాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. దీనిపై వారం రోజుల్లో తుది నిర్ణయం వెలువడనుంది. వివాదాస్పద/అభ్యంతరకర భూములుగా పరిగణించిన వాటిని పార్ట్–బీ కేటగిరీగా పరిగణించిన ప్రభుత్వం.. పట్టాదార్ పాస్పుస్త కాలు ఇవ్వకుండా పక్కనపెట్టింది. కోర్టు కేసులు, అటవీ, దేవాదాయ, వక్ఫ్, భూదాన్ భూములు, భూవిస్తీర్ణంలో తేడా, అన్నదమ్ముల భూ పంపకాల విస్తీర్ణంలో వ్యత్యాసం, అసైన్డ్ చేసిన భూమికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడా, ఫారెస్టు–రెవెన్యూ శాఖల మధ్య తగాదా, ఫారెస్టు, ప్రైవేటు భూముల మధ్య వివాదాస్పదంగా ఉన్నవాటిని కూడా ఈ కేటగిరీలో నమోదు చేసింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఎకరాల మేర భూము లకు పార్ట్–బీ కేటగిరీలో చేర్చింది. అయితే, వీటిని సకాలంలో పరిష్కరించడంలో రెవె న్యూ యంత్రాంగం ఎడతెగని జాప్యం ప్రదర్శించింది. సాఫ్ట్వేర్ సమస్యలు, తప్పొప్పు లను సవరించే అధికారం జేసీలకు కట్టబెట్టడంతో పార్ట్–బీ భూముల వ్యవహారం జటిలమైంది. ఈ భూములకు పాస్‌పుస్తకాలు నిలిపేయడంతో ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ రైతులు తిరగడం.. ఆ వివాదాలను పరిష్క రించే అధికారం తమకు లేదని తహసీల్దార్లు చెప్పినా వినకపోవడంతో ఉద్దేశపూర్వంగా రెవెన్యూ ఉద్యోగులే చేయడం లేదనే భావన రైతాంగంలో నెలకొంది. ఈ వివాదాలు మొ దలు. భౌతిక దాడులు వరకు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఇటీవల అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు గురికావడంతో ప్రభుత్వం మేలుకుంది. సాం కేతిక సమస్యలను పరిష్కరించేందుకు ఒక వైపు చర్యలు తీసుకుంటునే.. పార్ట్–బీ భూ ములను కూడా సాధ్యమైనంత త్వరగా కొలి క్కి తేవాలని నిర్ణయించింది. ఇందులో భా గంగా ఈ భూములను పరిశీలించి.. పరిష్క రించే అధికారాన్ని తహసీల్దార్లకు అప్ప గిం చాలని యోచిస్తోంది. తాజాగా తహసీ ల్దార్ల బదిలీ ప్రక్రియ ముగిసినందున.. కొత్త తహసీల్దార్లు కుదురుకోగానే స్పష్టమైన మార్గ దర్శకాలను వెలువరించ నున్నట్లు రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. త్వరలో సీఎంతో భేటీ! రెవెన్యూ సమస్యలపై త్వరలో సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో రెవెన్యూ ఉద్యోగ సంఘాల సమావేశం ఏర్పాటు చేయ నున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీ ఆర్ హామీ ఇచ్చారు. రెవెన్యూ ఉద్యోగుల సమ స్యలను పరిష్కరించాలని కోరుతూ.. మం గళవారం రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌ను కలసింది. ఈ సందర్భంగా రెవెన్యూ కార్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన, ఉద్యోగుల కొరత తదితర అంశాలపై చర్చించింది. అలాగే తాజా పరిణామాలను వివరించింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు సీఎంతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్.. త్వరలోనే సమావేశ తేదీని ఖరారు చేస్తానని హామీ ఇచ్చినట్లు రవీందర్‌రెడ్డి తెలిపారు. అలాగే తహసీల్దార్ల బదిలీకి కృషి చేసినందున కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. -
విజయారెడ్డి హత్యకు నిరసనగా విధుల బహిష్కరణ
సాక్షి, విజయవాడ: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా విజయవాడ గొల్లపూడిలో రెవెన్యూ ఉద్యోగులు విధులను బహిష్కరించారు. మహిళా తహశీల్దార్ హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ సభ్యులు.. గొల్లపూడి సెంటర్ నుంచి వై జంక్షన్ వరుకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాసేవ చేసే ఉద్యోగులపై పాశవిక దాడి అత్యంత దారుణమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు.. ప్రజలకు రక్షణ కల్పించే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
తహశీల్ధార్ హత్య.. అత్యంత పాశవికం
సాక్షి, అమరావతి: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనను ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. మహిళా తహశీల్ధారుపై ఇటువంటి చర్య అత్యంత దారుణమని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఈ ఘటనను దేశ రెవెన్యూ చరిత్రలోనే అత్యంత దుర్మార్గమైనదిగా పేర్కొన్నారు. ప్రభుత్వాలు రెవెన్యూ శాఖకు సంబంధం లేని పనులు అంటగట్టడం వల్ల శాఖా సంబంధమైన పనులు చేయడంలో జాప్యం జరుగుతుందన్నారు. రెవెన్యూ ఉద్యోగులు రాత్రి, పగలు కష్టపడి పనిచేస్తున్నా.. ప్రజల దృష్టిలో మన్ననలు పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరిద్దరు చేసే తప్పులను అందరికి ఆపాదించడం వలన రెవెన్యూ ఉద్యోగులందరూ దోషులుగా నిలబడాల్సి వస్తోందన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కే రక్షణ కరువైతే సాధారణ పౌరుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. విజయారెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ ప్రభుతాన్ని వెంకటేశ్వర్లు కోరారు. -
రెవెన్యూ భూములు గందరగోళం
జిల్లా రెవెన్యూ రికార్డులు గందరగోళంగా తయారయ్యాయి. ఉన్న భూమిని లేనట్లు, లేని భూమి ఉన్నట్లు ఇష్టారీతిన రికార్డులను మార్చివేశారు. ఒకటి కాదు రెండు కాదు వేలాది ఎకరాల భూములకు సంబంధించిన రికార్డులు తారుమారయ్యాయి. దీంతో జిల్లాలో రికార్డుల ప్రకారం ఉండాల్సిన భూమి కంటే దాదాపు 49,352.16 ఎకరాల భూమిని అధికంగా వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. రికార్డుల్లో లేని ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాని పరిస్థితి. సాక్షి, కందుకూరు(ప్రకాశం) : జిల్లాలో భూముల లెక్కలకు మదర్ రికార్డు అయిన ఆర్ఎస్ఆర్ రికార్డుకు, ఆన్లైన్లో నమోదు చేసిన భూములకు ఎక్కడా పొంతన ఉండడం లేదు. జిల్లాలోని 56 మండలాల్లో ఇదే పరిస్థితి. ఒక్క మండలానికి సంబంధించిన రికార్డు కూడా సక్రమంగా లేదు. కొన్ని మండలాల్లో భూములు అధికంగా ఉంటే మరికొన్ని మండలాల్లో రికార్డు కంటే భూములు తక్కువగా ఉన్నాయి. దీంతో రికార్డు ప్రక్షాళన కార్యక్రమానికి కలెక్టర్ పోల భాస్కర్ లింగసముద్రం మండలం నుంచి శ్రీకారం చుట్టారు. అయితే ఇది ఎంత వరకు విజయవంతం అవుతుందో వేచిచూడాల్సిందే. ► ఆర్ఎస్ఆర్ రికార్డు ప్రకారం ఉండాల్సిన భూమి: 32,90,765.40 ఎకరాలు ► వెబ్‌ల్యాండ్‌లో నమోదు నమోదు చేసిన భూమి: 33,40,117.56 ఎకరాలు ఆర్ఎస్ఆర్ ప్రకారం 32,90,765.40 లక్షల ఎకరాల భూమి: ఆర్ఎస్ఆర్ రికార్డు ప్రకారం జిల్లాలో అన్ని రకాల భూములు కలుపుకుని 32,90,765.40 లక్షల ఎకరాల భూమి ఉంది. అయితే ప్రస్తుతం వెబ్‌ల్యాండ్ ప్రకారం 33,40,117.56 లక్షల ఎకరాలున్నాయి. వెబ్‌ల్యాండ్ ప్రకారం జిల్లాలో ప్రభుత్వ భూమి 11,99,686.63 లక్షల ఎకరాలు, ప్రైవేట్ భూమి 20,91,689.45 లక్షల ఎకరాలున్నాయి. అలాగే ఇనామ్ భూములు 25,886.61 ఎకరాలు, 22854.22 ఎకరాల ఇతర భూములున్నాయి. మొత్తం మీద ఆర్ఎస్ఆర్ రికార్డుకి, వెబ్‌ల్యాండ్‌లో నమోదైన భూములకు మధ్య తేడా 49,352.16 ఎకరాలు అధికంగా ఉంది. ఇంత పెద్ద మొత్తంలో లేని భూమిని ఉన్నట్లు చూపించారు. 40 మండలాల రికార్డుల్లో భూములు అధికంగా నమోదు కాగా, మిగిలిన 16 మండలాల రికార్డుల్లో ఉన్న భూమి కంటే తక్కువగా వెబ్‌ల్యాండ్‌లో నమోదైంది. ఆర్ఎస్ఆర్ రికార్డు కంటే అధికంగా భూమి నమోదైన మండలాల జాబితాలో మర్రిపూడి మండలం మొదటి స్థానంలో ఉంది. 33,315.33 ఎకరాల భూమి అధికంగా నమోదైంది. తరువాత స్థానంలో దర్శి 25225.58 ఎకరాలు, కొనకనమిట్ల 24716.61 ఎకరాలు అధికంగా నమోదు చేశారు. ఇక భూములు తక్కువగా నమోదు చేసిన మండలాల్లో కురిచేడు మండలం మొదటి స్థానంలో ఉంది. ఈ మండలంలో వెబ్‌ల్యాండ్ ప్రకారం .. మొత్తం భూములు 730002.89 ఎకరాలు ఉంటే, ఆర్ఎస్ఆర్ ప్రకారం 1,45,650.43 ఎకరాల భూములున్నాయి. అంటే దాదాపు 72,647.54 ఎకరాల భూములు తక్కువగా నమోదు చేశారు. అంటే ఇక్కడ ఆన్లైన్ సమస్యలు అధికంగా ఉన్నాయని అర్థమవుతోంది. తరువాత స్థానంలో బేస్తవారిపేట మండలంలో 41,225.16 ఎకరాలు, హనుమంతునిపాడు 18,365.64 ఎకరాల భూములు తక్కువగా నమోదు చేశారు. అలాగే ఆర్ఎస్ఆర్ రికార్డుకు, వెబ్‌ల్యాండ్‌కు దాదాపుగా సమానంగా ఉన్న మండలాలు కూడా ఉన్నాయి. వీటిలో సంతనూతలపాడు 0.48 సెంట్లు, కొరిశపాడు 6.94 ఎకరాలు తక్కువగా ఉంటే, సింగరాయకొండ 26.52 ఎకరాల భూములు అధికంగా ఉన్నాయి. ఈ మూడు మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాల రికార్డులు భారీ స్థాయిలో మార్ఫింగ్‌కు గురయ్యాయి. వందల ఎకరాల భూముల వివరాలు తారుమారయ్యాయి. లింగసముద్రంతో ప్రక్షాళన ప్రారంభం: ప్రభుత్వ రెవెన్యూ రికార్డు ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో కలెక్టర్ పోల భాస్కర్ ప్రత్యేక శ్రద్ధతో కందుకూరు నియోజకవర్గంలోని లింగసముద్రం మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి భూముల రీ సర్వే ప్రారంభించారు. దాదాపు 70 మంది రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో బృందాలుగా ఏర్పడి రికార్డులను తనిఖీ చేస్తున్నారు. ఈ పరిశీలనలో అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, నకిలీ పాస్‌పుస్తకాలతో బ్యాంకు లోన్లు పొందిన సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. దీంతో తమ బండారం బయటపడుతుండడంతో కొందరు అక్రమార్కులు ఏకంగా తహసీల్దార్‌నే చంపుతామని బెదిరింపులకు దిగడం గమనార్హం. అయితే ఇప్పటి వరకు కేవలం 50 శాతం సర్వే మాత్రమే అధికారులు అక్కడ పూర్తి చేయగలిగారు. అక్రమాలైతే వెలుగులోకి వస్తున్నాయి గానీ వాటిపై చర్యలు ఎంత వరకు ఉంటాయనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకుంటారా లేదా బ్యాంకుల్లో రుణాలు పొందిన వారిపై చర్యలు ఉంటాయా ఉండవా అనేది చూడాలి. ప్రస్తుతం ఈ రికార్డులను మార్పుచేయడం అంత సులభరమైన ప్రక్రియేమీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయి సిబ్బందిదే కీలక పాత్ర: ఇలా రికార్డులు తారుమారు కావడంలో క్షేత్ర స్థాయిలో పనిచేసే రెవెన్యూ అధికారులతే కీలక పాత్ర అని తెలుస్తోంది. ప్రధానంగా ఆన్లైన్ ప్రక్రియను అడ్డంపెట్టుకుని అక్రమాలకు పాల్ప డుతున్నట్లు రెవెన్యూ ఉన్నతాధికారులు గుర్తిస్తున్నారు. కొందరు రైతులకు ఉన్న భూమి కంటే ఆన్లైన్లో అధికంగా నమోదు చేయడం, అడంగల్, 1బి వంటి రికార్డులను మార్చడం, పాస్‌పుస్తకాల్లో అధికంగా భూములు నమోదు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. దీని వల్లే రికార్డుల కంటే అధికంగా భూములు నమోదవుతున్నాయి. ఇలా బ్యాంకుల్లో రుణాలు పొందడం ఇంకా మోసం. ఇలా కొంత కాలంగా రెవెన్యూ అధికారుల లీలలకు అడ్డూఅదుపు లేకుండా పోవడంతో రికార్డులు మొత్తం గందరగోళంగా తయారయ్యాయి. దీంతో భూ సమస్యలు అధికంగా నమోదవుతున్నాయి. ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీల్లో 90 శాతం భూములకు సంబంధించిన సమస్యలే ఉండడం గమనార్హం. సంవత్సరాలు, నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే రికార్డులు సక్రమంగా లేకపోవడమే. ప్రస్తుతం ప్రభుత్వం ఈ రికార్డులను సరిచేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం పట్ల అభినందనలు వ్యక్తమవుతున్నాయి. -
మంత్రి గారూ... ఆలకించండి
తిరుపతి డివిజన్లోని అకారంపల్లె రెవెన్యూ దాఖలాల్లో గొల్లవానిగుంట పరిధిలో మాజీ సైనికుడికి 1993లో 72/12 సర్వే నంబర్లో మూడు సెంట్ల ఇంటి పట్టా ఇచ్చారు. టీడీపీ పాలనలో ఓ వ్యక్తి దొంగపట్టాలు సృష్టించి ఆ భూమిని కబ్జా చేశాడు. ఈ సమస్యపై బాధితులు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన స్పందనలో అర్జీని జూలై 22న అందజేశారు. అయితే ఇప్పటివరకు వారి సమస్య సమస్యగానే ఉంది. రెవెన్యూ సమస్యలను పరిశీలించి పరిష్కరించాలన్న సదుద్దేశంతో ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ నెల 24వ తేదీన జిల్లాకు విచ్చేశారు. ఈ నెల 25న తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆయన దృష్టికి జిల్లాలోని రెవెన్యూ శాఖలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకెళ్లేందుకు ‘సాక్షి’ ఇస్తున్న ప్రత్యేక కథనం. చిత్తూరు రూరల్ మండలంలోని బండపల్లె గ్రామానికి చెందిన రైతు రామయ్య తన భూమికి సరిహద్దులు కొలవాలని దరఖాస్తు చేసుకున్నాడు. చిత్తూరు తహసీల్దార్ కార్యాలయంలోని సర్వేయర్ ఆ రైతు భూమిని కొలవకుండా అలసత్వం చేస్తూనే వచ్చాడు. రైతు ఒత్తిడి తెచ్చేసరికి ప్రభుత్వ సర్వేయర్ అసిస్టెంట్‌గా పెట్టుకున్న ప్రైవేటు సర్వేయర్‌ను రైతు గ్రామానికి పంపి సరిహద్దులు కొలిపించారు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రజలకు సేవలు అందించాల్సిన రెవెన్యూ ఉద్యోగి బినామీ ఉద్యోగులతో కుమ్మకైఇలాంటి పనులు చేయ డంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షి, చిత్తూరు కలెక్టరేట్ : క్షేత్రస్థాయిలో ప్రజలకు రెవెన్యూ శాఖ ద్వారా అందే సేవలను పారదర్శకంగా అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పదే పదే అధికారులకు సూచిస్తున్నారు. రెవెన్యూ శాఖలో అవినీతికి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తున్నారు. రెవెన్యూ సేవలు పొందాలంటే ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని, ఎవరైన లంచం అడిగితే నేరుగా ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక నంబర్‌ను ప్రారంభించారు. సమస్యల పరిష్కారంపై అలసత్వం ఈ నెల 23వ తేదీ వరకు జిల్లాలో జరిగిన స్పందన కార్యక్రమాలకు రెవెన్యూ సమస్యలపై 10,242 అర్జీలను ప్రజలు అందజేశారు. అందులో అధికారులు 35 శాతం వరకు మాత్రమే సమస్యలను పరిష్కరించారు. మిగిలిన 65 శా తం సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఉద్యోగుల విచారణ కేసులు పెండింగ్ జిల్లాలోని రెవెన్యూశాఖల్లో చిన్న చిన్న ఆరోపణలతో సస్పెండైన రెవెన్యూ ఉద్యోగుల విచారణ కేసులు సంవత్సరాల కొద్ది పెండింగ్‌లో ఉంటున్నాయి. జిల్లావ్యాప్తంగా దాదాపు 122 వరకు ఉద్యోగుల సస్పెండ్ కేసుల విచారణ పూర్తి కాని పరిస్థితి. అస్తవ్యస్తంగా రికార్డులు రెవెన్యూ శాఖలో భూమి రికార్డులను సరిగ్గా నిర్వహించలేకపోతుండడంతో భూ సమస్యలు రోజురోజుకు అధికమవుతున్నాయి. రికార్డులను డిజిటలైజేషన్ చేసినప్పటికీ సమగ్ర సమాచారం లేకపోవడంతో బోగస్ పట్టాలు పుట్టుకొస్తున్నాయి. జిల్లాలో పలు చోట్ల మృతి చెందిన పట్టాదారులు ఇప్పటికీ పట్టాదారులుగానే చెలామణి అవుతున్నారు. వెబ్‌ల్యాండ్, మ్యూటేషన్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తే రైతులకు, పౌరులకు మేలు జరుగుతుందని రెవెన్యూ నిపుణులు చెబుతున్నారు. ఆరోపణలు వచ్చినా.. చర్యలు శూన్యం రెండు నెలల క్రితం జిల్లావ్యాప్తంగా పెద్ద ఎ త్తున ఆర్ఐ, డిప్యూటీ తహసీల్దార్ల పదోన్నతులు, వీఆర్వో, వీఆర్ఏల బదిలీలను నిర్వహించారు. ఈ బదిలీలను కలెక్టరేట్ అధికారులు నిబంధనల ప్రకారం నిర్వహించకపోవడంతో పలు ఆరోపణలు వెలువెత్తాయి. వీఆర్వో, వీఆర్ఏ బదిలీల్లో కలెక్టరేట్ లోని ఓ అధికారి చేతివాటంతో ఇష్టానుసారం బదిలీల ప్రక్రియ నిర్వహించారు. ఈ వ్యవహారంపై అప్పట్లో సాక్షి దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమైనప్పటికీ ఉన్నతాధికారులు నోరుమెదపని పరిస్థితి. నిబంధనల ప్రకా రం బదిలీలు చేసి ఉంటే ఆ కొరత ఉండేది కాదు. -
అప్పు.. సంపదకే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో తెచ్చిన అప్పులను మూలధన వ్యయం కింద సంపద సృష్టి కోసం ఖర్చు చేస్తోందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) కితాబు ఇచ్చింది. సమీకరించిన రుణాలేగాకుండా.. కొంత రెవెన్యూ ఆదాయాన్ని కూడా పెట్టుబడి వ్యయం కింద వెచ్చించిందని తేల్చింది. ఈ మేరకు 2017–18 ఆర్థిక సంవత్సరానికిగాను ఆదివారం శాసనసభ ముందుంచిన కాగ్ నివేదికలో ప్రభుత్వ అప్పులను ఖర్చు చేసే విధానం ఉపయుక్తంగానే ఉందని అభిప్రాయపడింది. అప్పులను సంపద సృష్టి కోసం వెచ్చించడ వివేకంతో కూడిన ఆర్థిక నిర్వహణ కిందకు వస్తుందని వ్యాఖ్యానించింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కింద రూ.26,231 కోట్లు తీసుకొచ్చిందని కాగ్ తన లెక్కల్లో తేల్చింది. ఈ అప్పుల కింద తెచ్చినవాటికి అదనంగా మరో రూ.3,880 కోట్లు కలిపి మొత్తం రూ.30,111 కోట్లు మూలధన వ్యయం కింద ఖర్చు పెట్టిందని వెల్లడించింది. 2017–18 ఆర్థిక సంవత్సరమేగాక అంతకుముందు మూడేళ్లు కూడా రుణాలను ఇదేరీతిలో ఖర్చు పెట్టినట్లు కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. -
పాస్‌బుక్ కావాలంటే ‘రెవెన్యూ’ ఇచ్చుకోవాల్సిందే!
శ్రీకాళహస్తి మండలం చుక్కలనిడిగల్లుకు చెందిన గురవమ్మకు నలుగురు కుమారులు. వృద్ధురాలు కావడంతో తనపేరున ఉన్న ఎకరం పొలాన్ని కుమారులకు భాగపరిష్కారం చేయాలని భావించారు. పాసుపుస్తకాల కోసం ఇప్పటికే రెండు దఫాలు మీ–సేవలో ఆన్లైన్ చేశారు. సంబంధిత దరఖాస్తులను ఓ రెవెన్యూ ఉద్యోగికి ఇవ్వగా ఆయన వాటిని అప్రూవల్ చేయడానికి రూ.8 వేల వరకు డిమాండ్ చేశాడు. అంత మొత్తం ఇచ్చుకోలేకపోవడంతో ఫైలు పెండింగ్‌లో పడింది. ఆ ఉద్యోగిని ఒత్తిడి చేయగా తన పైఅధికారితో మాట్లాడుకోమని ఉచిత సలహా ఇచ్చాడు. రెండు వారాల నుంచి తిరుగుతున్నా ఆయన కూడా కరుణించడంలేదు. అడిగిన మొత్తం ఇవ్వకపోవడంతో కష్టమని చిర్రుబుర్రులాడినట్లు బాధితురాలు కన్నీళ్లు పెట్టుకున్నారు. తల్లిదండ్రుల పేరున ఉన్న భూమిని భాగపరిష్కారం చేయడానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదని కొందరు రెవెన్యూ అధికారులు చెప్పడం కొసమెరుపు. సాక్షి, చిత్తూరు : పట్టాదారు పాసుపుస్తకాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న రైతులు ప్రతి మండలంలో వందలాది మంది ఉన్నారు. పట్టాదారు పాసుపుస్తకం కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నా సకాలంలో చేతికందడం లేదు. దీంతో రెవెన్యూ సిబ్బంది, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. ప్రతి పట్టాదారు పుస్తకానికి రూ.2 వేల నుంచి రూ.10 వేల వరకు రెవెన్యూ అధికారులకు ముట్టజెప్పుకోవాల్సిన దుస్థితి. అంతపెద్ద మొత్తంలో నగదు ఇచ్చుకోలేని రైతులకు పక్కాగా రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నా పట్టాదారు పుస్తకాలను పొందలేక అవస్థలు పడుతున్నారు. రెవెన్యూలో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు మామూళ్లు ఇవ్వందే ఫైళ్లు కదలడం లేదు. వీఆర్ఓ నుంచి తహసీల్దారు వరకు ఆమోదం పొందాల్సి ఉన్నందున అవినీతి తారస్థాయికి చేరుకుంది. జిల్లాలో మొత్తం 6.48 లక్షల మంది రైతులు ఉండగా, రైతు కుటుంబాలు దాదాపు 3.80 లక్షల మేరకు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా భూ విస్తీర్ణంలో మొత్తం 5.40 లక్షల మేరకు సర్వే నంబర్లు ఉన్నాయి. వాటిలో సబ్ డివిజన్లు దాదాపు 7.20 లక్షల మేరకు ఉన్నాయి. వీటిలో వ్యవసాయ భూములకు సంబంధించి 4.30 లక్షల మేరకు రైతులు పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉన్నారు. వెబ్‌ల్యాండ్‌లో మాత్రం 5.48 లక్షల మేరకు 1బీ ఖాతాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 40 శాతం మేరకు 1బీల్లో సర్వే నంబర్ల తప్పులు, విస్తీర్ణంలో వ్యత్యాసాలు ఉన్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రిజిస్ట్రేషన్ దస్తావేజులతో పనిలేకుండానే, కేవలం 1బీల ఆధారంగా భూముల రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించింది. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు స్వార్థపరులు, టీడీపీ నాయకులు వెబ్‌ల్యాండ్‌లో ఇష్టానుసారంగా సర్వే నంబర్లను నమోదు చేసుకున్నారు. అదేగాక 1బీ ఆధారంగా ఏకంగా ఆ భూములను విక్రయించేశారు. దీంతో వెబ్‌ల్యాండ్‌లోని భూముల వివరాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. చేయి తడపాల్సిందే.. వెబ్‌ల్యాండ్‌లో చోటుచేసుకున్న అవకతవకలను సరిదిద్దుకోవాలన్నా, పట్టాదారు పాసుపుస్తకాలు పొందాలన్నా రెవెన్యూ సిబ్బందికి లంచం ఇచ్చుకోవాల్సిందే. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న తప్పులను సరిచేసుకోవాలంటే భూముల హక్కుదారులకు తిప్పలు తప్పడం లేదు. మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న 40 రోజుల్లో రెవెన్యూ అధికారులు సమస్యను పరిష్కరించాల్సి ఉంది. అయితే గడువు పూర్తయినా రెవెన్యూ సిబ్బంది, అధికా రులు పనులు చేయడం లేదు. దీనిపై రైతులు రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి అధికారులు, సిబ్బందిని కలిస్తే, ఒక్కో సర్వే నంబరుకు రూ.2వేల నుంచి రూ.10 వేల వరకు ఇస్తేగాని పనులు చేయడానికి ససేమిరా అంటున్నారు. అదేగాక విలువైన భూములకు సంబంధించి సర్వే నంబరుకు ఒక్కింటికి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ఇస్తేనే సమస్యను పరిష్కరి స్తున్నారు. ఇక కొందరు రైతులు ఉమ్మడి కుటుంబం నుంచి భూములను భాగ పరి ష్కారం చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నా పట్టాదారు పాసుపుస్తకం కోసం అవస్థలు తప్పడం లేదు. మీసేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకున్నా రెవెన్యూ సిబ్బందికి ఒక్కో పట్టాదారు పుస్తకానికి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ముట్టజెప్పుకోవాల్సిందే. ఒకవేళ విలువైన భూములైతే రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు సమర్పించాల్సిందే. ఇంటి యజమాని మరణిస్తే, ఆయనకు సంబం ధించిన పట్టాదారు పాసుపుస్తకంలో సంబంధీకుల పేరుకు మార్పు చేయాలంటే ఒక్కో పుస్తకానికి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు సమర్పించుకోవాల్సిందే. కోర్టులు ఆదేశించినా.. తగాదాలు ఉన్న భూములకు సంబంధించి కోర్టులు తీర్పులిచ్చినా పట్టాదారు పుస్తకాలు పొందలేక రైతులు అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో నెలకొన్న వెబ్‌ల్యాండ్‌లో అక్రమాల కారణంగా పలువురు రైతులు కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చింది. కొందరు స్వార్థపరులు తమకు భూములు లేకున్నా, ఇతరుల భూములను రెవెన్యూ సిబ్బంది సహకారంతో Ððð బ్ల్యాండ్లో నమోదు చేయించుకున్న దాఖలాలు కోకొల్లలు. దీంతో రిజిస్టర్ దస్తావేజులు ఉన్న భూ యజమానులు ప్రశ్నిస్తే ఆక్రమణదారులు ఏకంగా 1బీ మేరకు అన్‌రిజిస్టర్ డాక్యుమెంట్లు సృష్టించి ఏకంగా కోర్టులను ఆశ్రయించారు. దీంతో అసలైన భూ యజమానులు ఆర్డీఓ, జేసీ కోర్టులను ఆశ్రయించి నకిలీ పట్టాదారు పుస్తకాలను రద్దుచేస్తూ తీర్పులను తెచ్చుకుంటున్నారు. ఈ తీర్పుల మేరకు రెవెన్యూ సిబ్బంది భూ యజమానులకు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలన్నా ముడుపులు ఇచ్చుకోవాల్సిన దుస్థితి. ఒక్కో పట్టాదారు పాసుపుస్తకానికి రూ.10 వేల నుంచి రూ.20 వేలు ఇవ్వాల్సిందే. లేదంటే ఇచ్చిన తీర్పులపై కూడా పలు సాకులు చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నారు. ఎవరైనా గట్టిగా నిలదీస్తే ఏకంగా వారి ప్రత్యర్థులను రెవెన్యూ కోర్టులు ఇచ్చిన తీర్పుపై మరో ఉన్నత కోర్టును ఆశ్రయించేలా సలహాలు ఇచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. -
‘రెవెన్యూ’లో ఇష్టారాజ్యం..!
సాక్షి, వనపర్తి: రెవెన్యూ శాఖలో కొందరు అధికారులు లాభాపేక్షతో నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. సదరు భూయజమానికి తెలియకుండానే.. అసలు నోటీసులు కూడా జారీ చేయకుండా.. కేవలం బయానా అగ్రిమెంట్ కాపీని ఆధారంగా చేసుకొని అతని భూమిని మరొకరి పేరుపై పట్టామార్పిడి(మ్యూటేషన్) చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ నిబంధనలు ఎంత పక్కాగా పాటించారో. ఇలాంటి సంఘటన ఒకటి జిల్లాలోని ఖిల్లాఘనపురం మండలంలో వెలుగు చూసింది. ఈ విషయంపై బాధితుడు 2019 అగస్టు 19వ తేదిన కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశాడు. భూమి కొనుగోలుకు కొంత బయానా.. జడ్చర్ల మండలం ఆలూరులో నివాసం ఉండే తెలుగు శ్రీనివాసులుకు ఖిల్లాఘనపురం మండలంలోని కమాలోద్దీన్పూర్లో కొంత భూమి ఉంది. ఆ భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కొనుగోలు చేసేందుకు మాట కుదుర్చుకున్నారు. మొత్తం భూమిని రూ.2.40 లక్షలకు విక్రయించేందుకు తెలుగు శ్రీనివాసులు సిద్ధమయ్యాడు. అగ్రిమెంటు చేసుకుని రూ.1.30 లక్షలు అడ్వాన్స్ (బయానా) ఇచ్చారు. మిగతా డబ్బులకు కొంత గడువు పెట్టుకున్నారు. గడువు తీరుతున్నా డబ్బులు ఇవ్వకపోవటంతో భూమిని అమ్మిన తెలుగు శ్రీనివాసులును డబ్బుల కోసం అడగగా.. దాటవేస్తూ వచ్చారు. బయాన ఇచ్చిన వెంటనే భూమిని కబ్జాలోకి తీసుకున్న కొనుగోలు దారులు అధికారులను మచ్చిక చేసుకుని రహస్యంగా బయానా ఇచ్చిన భూమిని మొత్తం డబ్బులు చెల్లించకుండానే ముగ్గురి పేర్లపై మార్చారు. కారణం రాయని అధికారులు నిబంధనల ప్రకారం పట్టామార్పిడి చేసే సమయంలో తహసీల్దార్ కార్యాలయంలో ఒక ఫైల్ తయారు చేసి భూమిని విక్రయించిన వారికి నో టీసులు జారీ చేయాలి. వారికి పట్టామార్పిడి చేస్తున్నట్లు సమాచారం ఇచ్చి ముటేషన్ చేయా లి. పట్టామార్పిడి చేస్తున్నప్పుడు కొత్తగా భూ మిపై హక్కు పొందుతున్న వారికి అట్టి భూమి ఎలా వచ్చిందనే విషయాన్ని మ్యానువల్ రికా ర్డులో తప్పనిసరిగా.. రాయాల్సి ఉంటుంది. కానీ ఈ కేసు విషయంలో రికార్డులో ఎలాంటి వివరాలు రాయలేదు. కనీసం పట్టామార్పిడి చేసిన అధికారి సంతకం చేయలేదు. ఈ ముటేషన్‌కు సంబంధించిన ఫైల్ నంబర్ వేయలేదు. గుడ్డిగా రూ.లక్షల విలువ చేసే భూమి హక్కులను అధికారులు ఇతరుల పేరుకు మార్చారు. దీంతో విషయం తెలుసుకున్న బాధితుడు లబోదిబోమంటూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయటంతో విషయం బయటకు పొక్కింది. తప్పుల తడకగా అగ్రిమెంట్ భూమిని కొనుగోలు చేస్తున్నట్లు రాయించిన అగ్రిమెంట్‌లోనూ తప్పులు చాలా ఉన్నట్లు తెలుస్తోంది. అగ్రిమెంటు కోసం ఉపయోగించిన రూ.100 స్టాంప్ పేపర్‌ను 2014 నవంబర్ 29వ తేదీన కొనుగోలు చేశారు. కానీ అగ్రిమెంటు మాత్రం 2012 జూన్ 6వ తేదీన చేసినట్లు రాశారు. అలాంటి తప్పుల అగ్రిమెంటును ఆధారం చేసుకుని అ«ధికారులు విలువైన భూమి హక్కులను ఎలా మార్చారు అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. న్యాయం చేయాలి నా భూమిని సదరు వ్యక్తులు కొనుగోలు చేసేందుకు కొద్ది మొత్తంలో మాత్రమే డబ్బులు ఇచ్చారు. మిగతా డబ్బులు ఇవ్వలేదు. రిజిస్టేషన్ చేయించుకోలేదు. అగ్రిమెంటు కాగితం ఆధారంగా పట్టామార్పిడి చేయించుకున్నారు. 2018 ఫిబ్రవరి వరకు నా పేరునే 1బీ ఉంది. తర్వాత మార్పులు చేసినట్లు తెలిసింది. – తెలుగు శ్రీనివాసులు, భూ యజమాని పరిశీలిస్తాం పట్టామార్పిడి ఎలా చేశారనే విషయాన్ని రికార్డుల్లో పరిశీలిస్తాం. ఉన్నతాధికారుల సూచన మేరకు చర్యలు తీసుకుంటాం. ఇటీవలే తహసీల్దార్‌గా వచ్చాను. ఈ విషయంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. – వెంకటకృష్ణ, తహసీల్దార్, ఖిల్లాఘనపురం. -
రైతుబంధు డబ్బు కాజేసేందుకు అడ్డదారులు
సాక్షి, కామారెడ్డి: అస్తవ్యస్తంగా ఉన్న దశాబ్దాల నాటి భూ రికార్డులను సరిచేయడం కోసం చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం కొందరు రెవెన్యూ సిబ్బందికి కాసుల పంట పండించింది. రైతుబంధు డబ్బులు నొక్కేసేందుకు అడ్డదారులు తొక్కిన పలువురు రెవెన్యూ అధికారులు.. ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వ భూమిని తమ సంబంధికుల పేర్లపై రాసేశారు. కొన్ని సంఘటనలు రుజువు కావడంతో ఉన్నతాధికారులు బాధ్యులపై చర్యలు కూడా తీసుకున్నారు. అక్రమాలపై ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. భూ రికార్డులు అస్తవ్యస్తంగా ఉండడం వల్లే భూ వివాదాలు తలెత్తుతున్నాయని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ప్రస్తుత రికార్డులను సరిచేయడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా చూడాలన్నది ఈ కార్యక్రమ ఉద్దేశం. 2017 సెప్టెంబర్ 15న ఈ ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు అన్ని గ్రామాలలో రైతుల సమక్షంలో రికార్డుల ప్రక్షాళన చేపట్టారు. కొందరు అవినీతి అధికారులకు ఈ కార్యక్రమం వరంలా మారింది. అధికారులు రైతుల వద్దనుంచి డబ్బులు తీసుకుని, రికార్డుల ప్రక్షాళన చేశారన్న ఆరోపణలు వచ్చాయి. రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా రైతుల వద్ద డబ్బులు డిమాండ్ చేసి, అక్రమాలకు పాల్పడి జిల్లావ్యాప్తంగా పలువురు తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐ స్థాయి అధికారులు సైతం సస్పెండయ్యారు. ఒక తహసీల్దార్, ఒక ఆర్ఐ, ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లు, 20 మంది వీఆర్వోలు, వీఆర్ఏలపై సస్పెన్షన్ వేటు పడింది. పలువురిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. బంధువుల పేర్లమీదకు.. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని భూ వివాదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమానికి రెవెన్యూ అధికారులు, సిబ్బంది చెదలు పట్టించారు. రికార్డుల్లో ఉన్న వివరాలు, తప్పొప్పులను సరి చేయడం, ఫౌతి, వారసత్వ భూముల బదలాయింపు, పట్టామార్పిడీ, సవరణల కోసం అనేక మంది కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పనిభారం ఎక్కువగా ఉండడంతో ఆయా మండలాల్లో తహసీల్దార్లు ఆన్లైన్లో లాగిన్ తీసుకుని వీఆర్వోలకు, వీఆర్ఏలకు పనులు అప్పగించారు. సరైన పద్ధతిలో రికార్డులను నిర్వహించాల్సిన సిబ్బంది.. అవకాశం దొరకడంతో అవకతవకలకు పాల్పడినట్లు చాలా సంఘటనల్లో వెల్లడైంది. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో రికార్డులు తారుమారు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటి వరకు కొన్ని వ్యవహారాలు మాత్రమే అధికారుల దృష్టికి వచ్చాయి. మాచారెడ్డి మండలం ఇసాయిపేట, ఎల్లంపేట గ్రామాలకు చెందిన వీఆర్ఏలు, తమ పేర్లమీద, తమ బంధువుల పేర్ల మీద ప్రభుత్వ భూములను రికార్డులలో నమోదు చేయించినట్లు అధికారులు గుర్తించారు. వాడి వీఆర్ఏ సైతం రికార్డుల నమోదులో అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో సస్పెండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల పరిధిలో ప్రభుత్వ భూములను తమ బంధువులు, సన్నిహితుల పేరిట వీఆర్వోలు, వీఆర్ఏలు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. జిల్లాలో రికార్డుల ప్రక్షాళన వివరాల ప్రకారం 20 వేలకు పైగా ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయి. రైతుబంధు పథకం డబ్బులను కాజేసేందుకే ఆయా గ్రామాల్లో వీఆర్ఏలు, వీఆర్వోలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. జిల్లాలోని అన్ని గ్రామాల పరిధిలో ఇలాంటి వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన ఆవసరం ఉంది. ఫోన్‌ఇన్ ద్వారా వెలుగులోకి.. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని వందశాతం పూర్తి చేయాలనే సంకల్పంతో కలెక్టర్ సత్యనారాయణ రెండు నెలల క్రితం ఫోన్ ఇన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన జేసీతో కలిసి రోజూ ఉదయం గంట పాటు ఫోన్ ద్వారా రైతులనుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత మండలాల అధికారులను ఆదేశిస్తున్నారు. ఫోన్ఇన్లో భాగంగా జిల్లాలోని ఆయా గ్రామాల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో ఎక్కువ అధికారుల అక్రమాలు, నిర్లక్ష్యంపైనే ఉంటున్నాయి. ఫోన్‌ఇన్ ప్రారంభమయ్యాక వీఆర్వోలు, వీఆర్ఏలు పాల్పడిన అవినీతిని కలెక్టర్, జేసీల దృష్టికి తీసుకువస్తున్నారు. దీంతో ఉన్నతాధికారులు ఆ ఫిర్యాదులపై విచారణ జరిపిస్తున్నారు. ఇలా నలుగురు వీఆర్వోలు, పలువురు వీఆర్ఏలపై వచ్చిన ఫిర్యాదుల మీద విచారణకు ఆదేశించడంతో జరుగుతున్న అవకతవకలు నిర్ధారణ అయ్యాయి. మాచారెడ్డి మండలం బండరామేశ్వర్‌పల్లి వీఆర్వో సూర్యవర్ధన్ను వసూళ్లు, అవినీతి ఆరోపణలపై సస్పెండ్ చేస్తు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమార్పేట్ వీఆర్వో మల్లేశ్ విధుల్లో నిర్లక్ష్యం కనబరచడం, ఇతర ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇసాయిపేట, ఎల్లంపేట వీఆర్ఏలు ప్రభుత్వ భూములను తమ బంధువుల పేర్ల మీదకు మార్చినట్లు రుజువు కావడంతో అధికారులు సస్పెండ్ చేశారు. వాడి వీఆర్ఏ కూడా గతంలో రికార్డుల నమోదులో అక్రమాలకు పాల్పడ్డట్లు నిర్ధారణ కావడంతో ఇటీవల సస్పెండ్ చేశారు. భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి వీఆర్ఏ నర్సింలు సైతం రికార్డులలో తప్పులు, అనుచిత ప్రవర్తన కారణంగా çసస్పెన్షన్‌కు గురయ్యారు. నెలరోజుల క్రితం రామారెడ్డి మం డలం మోషంపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు వీఆర్ఏలు గ్రామానికి చెందిన మరొకరి భూమిని వారి పేర్ల మీదకు మార్చేందుకు ప్ర యత్నించగా అధికారులకు ఫిరఘ్యదులు వచ్చా యి. విచారణలో వాస్తవమేనని తేలడంతో స స్పెండ్ చేశారు. వీఆర్ఏల పనితీరుపై దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఫిర్యాదులు వస్తున్నాయి. పక్షం రోజుల్లో.. పక్షం రోజుల్లో పలు మండలాలకు చెందిన ఐదుగురు వీఆర్ఏలు, ఇద్దరు వీఆర్వోలు అవినీతి ఆరోపణలపై సస్పెండ్ కావడం చూస్తుంటే రెవెన్యూశాఖలో అవినీతి ఏ స్థాయిలో పెరిగిందో తెలుస్తుంది. జిల్లాలోని మరో వీఆర్వో ఏకంగా ఏసీబీకి పట్టుబడ్డాడు. అంతేగాకుండా రైతుల పేరిట రికార్డులను నమోదు చేయడం, పట్టాదారు పాసుపుస్తకాలను ఇప్పించడంలోనూ జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నట్లు అనేక ఫిర్యాదులు ఉన్నతాధికారుల దృష్టికి వస్తున్నాయి. చర్యలు తప్పవు గతంలో రెవెన్యూ రికార్డుల నమోదులో జరిగిన అవకతవకలు మా దృష్టికి వచ్చాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిపించాం. తప్పిదాలకు పాల్పడిన వారిపై విచారణ జరిపి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, తహసీల్దార్, మాచారెడ్డి -
సర్కారీ మద్యం దుకాణాలు సిద్ధం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) ఆధ్వర్యంలో అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలు నిర్వహించనున్నారు. డిస్టలరీలు, బ్రూవరీస్‌లలో తయారైన మద్యాన్ని కొనుగోలు చేసి.. దాన్ని మద్యం దుకాణాల లైసెన్సుదారులకు విక్రయించటానికే ఇప్పటి వరకూ పరిమితమైన ఈ సంస్థ ఇకపై స్వయంగా మద్యం దుకాణాలను నడపనుంది. తొలి అడుగు.. రాష్ట్రంలో దశలవారీ మద్య నిషేధం అమల్లో భాగంగా.. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. నూతన మద్యం విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నూతన మద్యం విధానాన్ని రూపొందించి అక్టోబరు ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులు మద్యం షాపుల అద్దెకు, డిపోల నుంచి మద్యం సరఫరా, ఫర్నీచర్ ఏర్పాటు తదితరాలపై ఆసక్తిదారుల నుంచి టెండర్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా బుధవారం విజయవాడలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో టెండర్లను జేసీ మాధవీలత ఆధ్వర్యంలో ఖరారు చేశారు. మచిలీపట్నంలో 112 షాపులు ఖరారు.. మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 117 షాపులకు టెండర్లను ఆహ్వానించారు. బుధవారం ఆయా షాపులకు సంబంధించి 112 మంది దరఖాస్తులను ఖరారు చేశారు. ఉయ్యూరులో 1, కైకలూరులో 3, మువ్వలో 1 షాపునకు వచ్చిన దరఖాస్తులు నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో వాటిని రద్దు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన అద్దెలతో పోలిస్తే కైకలూరులో అతి తక్కువగా 5 వేలు అద్దె ఖరారు అయ్యింది. అత్యధికంగా మచిలీపట్నం పట్టణంలో ఒక షాపునకు రూ. 45 వేలు అద్దె పలికింది. విజయవాడ యూనిట్లో.. విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 126 షాపులకు టెండర్లను ఆహ్వానించగా 116 ఖరారు చేశారు. వీటిలో నందిగామ, పెనుగంచిప్రోలు, గంపలగూడెం ఊటుకూరులో 9 షాపులకు ఎటువంటి అద్దె తీసుకోకుండా ఉచితంగా షాపు యజమానులు ఇవ్వడం విశేషం. ఇందులో నందిగామలో 5 షాపులకు తొలుత 24 మంది దరఖాస్తు చేశారు. ఇందులో ఒక షాపునకు అత్యధికంగా 60 వేలు అద్దెను కోట్ చేశారు. దీంతో జేసీ మాధవీలత, ఎక్సైజ్ అధికారులు వారితో సంప్రదింపులు జరపగా.. చివరకు వారిలో నల్లాని అయ్యన్న, పెద్దినేని చందు, వేలది నరసింహారావు, నల్లాని శ్రీనివాసరావు, వీబీ ప్రతాప్‌లు ఉచితంగా తమ షాపులను అప్పగించేందుకు ముందుకు వచ్చారు. పెనుగంచిప్రోలులో మూడు షాపులకు 16 మంది దరఖాస్తు చేయగా వారిలో ఒక షాపునకు దరఖాస్తుదారుడు అత్యధికంగా రూ. 41 అద్దె కోట్ చేశారు. వీరితోనూ అధికారులు మాట్లాడగా.. చివరకు వీరందరూ ఉచితంగా తమ షాపులను ఇవ్వడానికి ముందుకొచ్చారు. దాంతో లాటరీ పద్ధతి ద్వారా జి.పద్మావతి, ఆర్.దుర్గాప్రసాద్, జి.గోపిచంద్‌లను ఎంపిక చే శారు.గంపలగూడెం, ఊటుకూరులో ఒక షాపునకు రెండు దరఖాస్తులు రాగా.. పసుపులేటి వెంకటేశ్వరరావు ఉచితంగా తన షాపును ఇచ్చారు. ఇక్కడ అత్యధికంగా రూ. 30 అద్దె కోట్ చేశారు. సెప్టెంబరు 1 నుంచి మొదటి దశ ఇటీవల విజయవాడ, మచిలీపట్నం యూనిట్లలో రెన్యువల్ చేసుకోని 59 మద్యం షాపులకు ప్రభుత్వం టెండర్లను ఖరారు చేసింది. వీటిని ప్రభుత్వ ఆధ్వర్యంలో మొదటి దశలో భాగంగా సెప్టెంబరు 1వ తేదీ నుంచి సర్కారే వీటిని నిర్వహించనుంది. ప్రైవేటు మద్యం వ్యాపారులైతే అధికాదాయం కోసం ఎక్కువ సరకు విక్రయించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే గ్రామగ్రామాన మద్యం గొలుసు దుకాణాలూ వెలిసేవి. దీంతో ఎక్కడ కావాలంటే అక్కడ మద్యం లభించి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రభుత్వమే దుకాణాలు నిర్వహించటం వల్ల గొలుసు దుకాణాలకు అవకాశమే ఉండదు. ఎమ్మార్పీ, సమయపాలన ఉల్లంఘనలు వంటివి తగ్గుతాయి. మద్యం అందుబాటు, లభ్యత తగ్గటం వల్ల కొంతమందైనా ఈ వ్యసనం నుంచి దూరమయ్యేందుకు, కొత్తవారు దీని బారిన పడకుండా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయని ఎక్సైజ్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
జీఎస్టీ ఆదాయానికి గండి
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో నడుస్తుండటంతో ఆ ప్రభావం మన రాష్ట్ర జీఎస్టీ ఆదాయంపై కూడా పడింది. గత నాలుగు నెలల్లో రెండు నెలలు కనీస నెలవారీ రక్షిత ఆదాయాన్ని రాష్ట్రం పొందలేకపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం (2019–20) ప్రతి నెలా కనీస నిర్దేశిత రక్షిత ఆదాయాన్ని రూ.1,892.99 కోట్లుగా నిర్ణయించారు. దీని కంటే ఎంత తక్కువ వస్తే అంత నష్టాన్ని కేంద్ర ప్రభుత్వంభర్తీ చేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెల ఏప్రిల్‌లో ఆదాయ వృద్ధి బాగున్నా మరుసటి నెలల్లో ఆదాయం తగ్గింది. మే, జూన్ నెలలు నిర్దేశిత రక్షిత ఆదాయాన్ని అందుకోకపోవడంతో ఈ రెండు నెలలకు కలిపి రూ.516.6 కోట్ల నష్టపరిహారాన్ని కేంద్రం నుంచి కోరినట్లు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వెల్లడించారు. 2018–19లో ఏప్రిల్, మే, జూన్, జూలైల్లో రూ.6,896.56 కోట్ల ఆదాయం వస్తే అది ఈ ఏడాది కేవలం 6.51 శాతం వృద్ధితో రూ.7,345.69 కోట్లకు మాత్రమే పరిమితమైంది. ఆటోమొబైల్ అమ్మకాలు భారీగా క్షీణించడం, ఉక్కు రేట్లు 10 నుంచి 15 శాతం తగ్గడం, సిమెంట్ బస్తాకు రూ.20 వరకు తగ్గడంతో ఆదాయం తగ్గిందని అధికారులు అంటున్నారు. ఇదే సమయంలో రుతుపవనాలు సకాలంలో రాకపోవడంతో ఎరువుల అమ్మకాలు కూడా పడిపోయాయి. జూలైలో ఆదాయం నిర్దేశిత లక్ష్యానికి మించి రూ.1,962.77 కోట్లు వచ్చినా ఆగస్టుకు సంబంధించి ఇప్పటివరకు వస్తున్న గణాంకాలు అంత ఆశాజనకంగా లేవంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఏడాది ఆదాయంలో రెండంకెల వృద్ధిని నమోదు చేయడం కూడా కష్టమేనంటున్నారు. నిర్దేశిత రక్షిత ఆదాయం ప్రకారం చూసుకున్నా ఈ ఏడాది కనీసం రూ.22,715.88 కోట్లు రావాల్సి ఉందని, కానీ ప్రస్తుత గణాంకాలను బట్టి చూస్తే ఈ మొత్తాన్ని దాటడం సాధ్యం కాకపోవచ్చుంటున్నారు. -
కొత్త చట్టం.. జనహితం
సాక్షి, హైదరాబాద్: ‘బూజు పట్టిన పాత రెవెన్యూ చట్టాలు రైతులు, ప్రజలకు అపార నష్టం కలిగించాయి. ఈ నష్టాన్ని నివారించుకునేందుకు కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించడంలో ప్రభుత్వం నిమగ్నమైంది. అవినీతికి, అలసత్వానికి అవకాశం లేని నూతన రెవెన్యూ చట్టాన్ని త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశ పెడతాం’అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ‘పరిపాలనా సంస్కరణలతోనే ప్రజలకు మెరుగైన పాలన అందించడం సాధ్యమవుతుంది. అవినీతిరహిత సుపరిపాలన అందించడానికి ప్రస్తుతమున్న చట్టాలు సరిపోవు. పాత చట్టాలను సమూలంగా మార్చాల్సిన అవసరమొచ్చింది. అందుకే ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని, నూతన పురపాలక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పరిశుభ్రమైన, పచ్చదనం వెల్లివిరిసే గ్రామాలు, మునిసిపాలిటీలను తయారు చేసుకోగలం’అని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం చరిత్రాత్మక గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సరైన దిశలో పెట్టేందుకు గడిచిన ఐదేళ్ళలో చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయని ఆయన తెలిపారు. ‘తెలంగాణలో గత ఐదేళ్ళలో పునర్నిర్మాణ ప్రణాళికను ఒక యజ్ఞంలా నిర్వహించాం. ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడం కోసం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేశాం. విద్యుత్తు, తాగునీరు, రహదారుల నిర్మాణం తదితర మౌలిక సదుపాయాల కల్పన జరిగింది. తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రంగా దేశం ముందు గర్వంగా నిలబడింది’అని తెలియజేశారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. సుస్థిర ఆర్థికాభివృద్ధి గత ఐదేళ్లుగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి స్థిరంగా కొనసాగుతోంది. పటిష్టమైన క్రమశిక్షణ వల్ల అవినీతికి ఆస్కారం లేకుండా సత్వరమైన నిర్ణయాలతో ఈ లక్ష్యాన్ని మనం సాధించగలిగాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నివేదిక ప్రకారం, 2018–19 ఆర్థిక సంవత్సరంలో 14.84% వృద్ధిరేటుతో స్థూల రాష్ట్రీయ జాతీయోత్పత్తి (జీఎస్డీపీ)లో మన రాష్ట్రం ముందు వరుసలో ఉంది. ఆదాయవృద్ధిలో స్థిరత్వం వల్ల సమకూరిన వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగించడం వల్ల రాష్ట్ర సంపద ఐదేళ్లలో రెట్టింపైంది. రాష్ట్రం ఏర్పడిన నాడు తెలంగాణలో రూ.4లక్షల కోట్ల విలువైన సంపదుంటే, నేడు రూ.8.66లక్షల కోట్లకు చేరుకోవడం మన ఆర్థిక ప్రగతికి సంకేతంగా నిలుస్తుంది. గడిచిన ఐదేళ్ళలో ఐటీ ఎగుమతులు రూ.52వేల కోట్ల నుంచి లక్షా పదివేల కోట్ల రూపాయలకు చేరుకోవడం మనం సాధించిన ప్రగతికి అద్దం పడుతుంది. గురువారం గోల్కొండలో జరిగిన 73వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో గౌరవ వందనం చేస్తున్న పోలీసులు. జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు. చిత్రంలో సీఎస్ ఎస్కే జోషి 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక కొత్త పంచాయతీరాజ్, మునిసిపల్ చట్టాల అమలుతో నూతన ఒరవడిని ప్రవేశ పెట్టడానికి 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తోంది. ఫైనాన్స్ కమిషన్ల గ్రాంటు నిధులను ఈ ప్రణాళిక అమలుకు ముందే స్థానిక సంస్థలకు విడుదల చేయాలని నిర్ణయించింది. 60రోజుల ప్రణాళికలో ప్రజాప్రతినిధులు, అధికారులు.. ప్రజల భాగస్వామ్యం ద్వారా గ్రామాలు, పట్టణాల రూపురేఖల్ని మార్చాలి. మొదటిదశలో గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలి. ప్రజాసంఘాలు, ప్రజల భాగస్వామ్యంతో సమగ్రంగా చెత్తనిర్మూలనకు నడుంకట్టాలి. ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోయిన పిచ్చిమొక్కలు. కూలిపోయిన ఇండ్ల శిథిలాలు. పాడుబడ్డ పశువుల కొట్టాలు. మురుగునీటి నిల్వతో దోమలను సృష్టిస్తున్న గుంతలు, పాడుపడిన బావులు.. ఇవీ రాష్ట్ర వ్యాప్తంగా కనినిపిస్తున్న దృశ్యాలు. వీటన్నింటినీ ఈ 60 రోజుల్లో తొలగించుకోవాలి. నిరుపయోగంగా ఉన్న బోరు బావులను వెంటనే పూడ్చివేయాలి. విద్యుత్ వారోత్సవాలు విద్యుత్ సమస్యల పరిష్కారానికి 60 రోజుల ప్రణాళికలో భాగంగా విద్యుత్‌శాఖ ప్రజల భాగస్వామ్యంతో పవర్ వీక్ నిర్వహించుకోవాలి. వంగిన కరెంట్ పోల్స్‌ను, వేలాడే వైర్లను సరిచేయాలి. తుప్పుపట్టిన పాత స్తంభాల స్థానంలో కొత్త పోల్స్ వేయాలి. అన్ని గ్రామాలు, పట్టణాలకు అవసరమైన స్తంభాలు, వైర్లను ప్రభుత్వమే సమకూరుస్తుంది. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు రాష్ట్రంలోని ప్రతి పట్టణం, ప్రతి గ్రామం తమకు అవసరమైన నర్సరీలను 60 రోజుల కార్యాచరణలో భాగంగా స్థానికసంస్థల ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేసుకోవాలి. మొక్కల సంఖ్యను, మొక్కల రకాలను, ఇతర విషయాలలో జిల్లా గ్రీన్ కమిటీ (హరిత కమిటీ) అందించే సూచనలను కచ్చితంగా పాటించాలి. పట్టణ, గ్రామబడ్జెట్లో 10% నిధులను పచ్చదనం పెంచే పనుల కోసం కేటాయించాలి. నిర్దిష్టమైన విధానంలో గ్రీన్ కమిటీ సూచనల మేరకు మొక్కలు నాటాలి. ప్రజల చేత నాటించాలి. పట్టణాల్లో, గ్రామాల్లో ప్రతీ ఇంటికీ ప్రజలు కోరుకునే 6మొక్కలను సరఫరా చేయాలి. ప్రజలంతా ఆ మొక్కలను చక్కగా కాపాడి జాగ్రత్తగా పెంచేలా ప్రేరణ కలిగించాలి. కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కేసీఆర్ పంచాయతీరాజ్‌లో ఖాళీలన్నీ భర్తీ పల్లెలను ప్రగతి కేంద్రాలుగా, ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పంచాయతీరాజ్ విభాగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్ణయించింది. 60రోజుల ప్రత్యేక కార్యాచరణలో ఒక ఆదర్శవంతమైన విధానాన్ని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఈ విధానాన్ని అనుసరించి గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి వార్షిక, పంచవర్ష ప్రణాళికలను ఆయా పాలక మండళ్లు రూపొందించాలి. ఈ ప్రణాళికలు ఖచ్చితంగా గ్రామసభల ఆమోదం పొందాలి. దానికి అనుగుణంగానే స్థానిక సంస్థలు నిధులు ఖర్చు చేయాలి. తద్వారా పల్లెలు, పట్టణాలు ఓ పద్ధతి ప్రకారం ప్రగతిపథంలో పయనించేందకు వీలుంటుంది. పంచాయతీరాజ్ శాఖలోని అన్ని విభాగాల్లో అన్ని ఖాళీలను వేగవంతంగా భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చి ఉద్యోగ నియామకాల్లో స్థానిక కోటాను 95 శాతానికి పెంచాం. మన రైతాంగ విధానం దేశానికే ఆదర్శం తెలంగాణ ప్రభుత్వ రైతాంగ విధానం యావద్భారతానికి ఆదర్శంగా మారింది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు రైతుబంధు పథకం ద్వారా ఇచ్చే ఆర్థిక సహాయాన్ని ఎకరానికి ఏడాదికి 8వేల నుంచి 10వేల రూపాయలకు పెంచి, అందిస్తున్నాం. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుబీమా పథకాన్ని కొనసాగిస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల వరకున్న పంట రుణాలను మాఫీ చేయడం కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదనంగా 575 టీఎంసీలు గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల వచ్చే జూన్ నుంచి తెలంగాణ రైతాంగం అదనంగా 575 టీఎంసీల నీటిని నికరంగా ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతీ ఏటా 400 టీఎంసీల నీరు లభిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సీతారామ ప్రాజెక్టు ద్వారా 100 టీంఎసీలు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు దేవాదుల ద్వారా 75టీఎంసీల నీటిని నికరంగా వాడుకోవడానికి వీలుంటుంది. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఏడాది నుంచే సాగునీరు అందించడానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. జూరాలతో కలిపి పాలమూరు జిల్లాలో నేడు 11లక్షల 20వేల ఎకరాలకు సాగునీరందేలా చేసుకోగలుగుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వీలైనంత వేగంగా నిర్మించి ఉమ్మడి పాలమూరుతోపాటు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు అందిస్తామని తెలియచేస్తున్నాను. ఆరోగ్య తెలంగాణ దిశగా.. ప్రజలందరికీ సంపూర్ణంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి.. వీటి ఫలితాల ఆధారంగా తెలంగాణ ఆరోగ్య సూచిక ‘హెల్త్ ప్రొఫైల్’తయారు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. జంటనగరాల్లో బస్తీ దవాఖానాల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. తండాల్లో తొలిసారిగా జెండా వందనం గిరిజన తండాలు, ఆదివాసీ గూడాలు, మారుమూల పల్లెలను ప్రభుత్వం గ్రామపంచాయతీలుగా మార్చడంతో ఇవాళ మొదటి సారిగా అక్కడ సర్పంచ్‌లు సగర్వంగా జాతీయ పతాకాన్ని ఎగురేసుకుంటున్న దృశ్యం ఆవిష్కృతమైంది. పింఛన్లు రెట్టింపు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆసరా పింఛన్లను రెట్టింపు చేసుకున్నాం. దివ్యాంగులకు 3,016 రూపాయలు, ఇతరులకు 2,016 రూపాయల పింఛన్ ఇస్తున్నాం. వృద్ధాప్య పింఛన్ వయో పరిమితిని 65 ఏళ్ల నుంచి 57ఏళ్లకరు తగ్గించి పింఛన్‌ను అందించాలని నిర్ణయించాం. ఈ మేరకు అర్హుల జాబితా రూపొందించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. గోల్కొండ ‘కళ’కళ ! సాక్షి, హైదరాబాద్ : గోల్కొండ కోట వేదికగా స్వాతంత్య్ర దినోత్సవం కన్నులపండువగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వందల మంది కళాకారులు గోల్కొండ కోటపై తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే కళారూపాలను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించడానికి సీఎం కేసీఆర్ వస్తున్న తరుణంలో డప్పు చప్పుళ్ల హోరుతో 16 కళారూపాలను ఏకకాలంలో ప్రదర్శిస్తూ స్వాగతం పలికారు. సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాల విద్యార్థినులతో ఏర్పాటు చేసిన ప్రదర్శన సైతం ఆకట్టుకుంది. ప్రగతి భవన్లో జెండా వందనం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయమైన ప్రగతిభవన్‌లో జెండాను ఆవిష్కరించారు. అనంతరం సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానానికి చేరుకుని అక్కడి సైనిక స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్చం వుంచి నివాళి అర్పించా రు. అక్కడి విజిటర్స్ బుక్‌లో సంతకం చేశారు. అనంతరం గోల్కొండ కోటలో జెండా ఆవిష్కరించారు. 15వ బెటాలియన్ సహాయ కమాండెంట్ శ్రీధర్ రాజా, మంచిర్యాల డీసీపీ నేతృత్వంలో నిర్వహించిన కవాతు అందరినీ ఆకట్టుకుంది. కవాతులో పాల్గొన్న ఒడిశా పోలీసు కాంటింజెంట్‌కు కేసీఆర్ ప్రత్యేక జ్ఞాపికను బహూకరించారు. -
పైసా ఉంటే ఏ పనైనా..
సాక్షి, మెదక్: మెదక్ మున్సిపాలిటీ అవినీతికి కేరాఫ్‌గా నిలుస్తోంది. గతంలో ఆసరా పింఛన్లు, అక్రమ లేఅవుట్ల వంటి పలురకాల కుంభకోణాలు వెలుగుచూడగా.. తాజాగా బల్దియాలోని రెవెన్యూ విభాగం మాయాజాలం బయటపడింది. పట్టణ పరిధిలో లక్షలాది రూపాయలు విలువచేసే ఓ ఇంటికి దొంగచాటుగా మ్యూటేషన్ చేశారు. అధికారులే సూత్రధారులుగా నిలిచిన ఈ వ్యవహారంలో చాలా మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు తెలుస్తోంది. మెదక్ పట్టణ పరిధిలోని వడ్డెర కాలనీలోని ఓ ఖాళీ స్థలంలో ఆరు సంవత్సరాల క్రితం బోదాసు నాగమ్మ అనే మహిళ రేకుల ఇల్లు నిర్మించుకొని జీవిస్తోంది. ఈ భూమికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేవు. ఈ క్రమంలో 2012–13లో ఇంటి నంబర్ కోసం మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకుంది. అధికారులు పరిశీలించి ఇంటి నంబర్ 1–10–82/1ను కేటాయించారు. ఆ తర్వాత ఆమె కరెంట్ కనెక్షన్ తీసుకుంది. ఈ ఇంటికి మాత్రమే ఆమె కబ్జాదారుగా(ప్రజెంట్ ఆక్యుపై) ఉన్నారు. మున్సిపల్ నిబంధనల ప్రకారం ఎలాంటి పత్రాలు లేని ఇల్లు, భూమిని విక్రయించొద్దు. ఆమెకు కేవలం కరెంట్ కనెక్షన్ కోసమే ఇంటి నంబర్ కేటాయించారు. మరొకరి చేతికి.. మున్సిపాలిటీ రికార్డుల ప్రకారం బోదాసు నాగమ్మ ఆ ఇంటికి కబ్జాదారు మాత్రమే. సదరు భూమి, ఇల్లుకు సంబంధించి ఎలాంటి అమ్మకాలు చేయరాదు. ఇందుకనుగుణంగా ఆమె పెట్టుకున్న అర్జీ మేరకు మున్సిపల్ రెవెన్యూ అధికారులు మ్యానువల్ రికార్డులో ఆమె పేరుతో ఇంటినంబర్ కేటాయించారు. రికార్డులో ప్రజెంట్ అక్యుపయ్యర్(కబ్జాదారు మాత్రమే) అని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ క్రమంలో బోదాసు నాగమ్మ నిబంధనలకు విరుద్ధంగా మరో మహిళ గిరిగల్ల సుజాతకు విక్రయించారు. పేరు తారుమారు.. భారీగా ఆమ్యామ్యాలు ఈ ఇల్లుకు సంబంధించి మ్యానువల్‌గా బోదాసు నాగమ్మ పేరు ఉండగా.. ఆన్లైన్లో మాత్రం వేరే వారి పేరు ఉంది. 2016కు ముందు మున్సిపాలిటీ కార్యకలాపాలు మ్యానువల్‌గా సాగేవి. ఆ తర్వాత కంప్యూటరీకరణతో అంతా ఆన్లైన్లోనే సాగుతోంది. 2012–13లో సదరు ఇల్లు బోదాసు నాగమ్మ పేరు మీద ఉండగా.. 2018కి వచ్చే సరికి ఆన్లైన్లో ఆ భూమి గిరిగల్ల సుజాత పేరు మీదకు మారింది. ఆన్లైన్ రికార్డులను పరిశీలిస్తే 2018 మే 31న ఈ ఇల్లును సుజాత పేరు మీద మార్పిడి చేసినట్లు స్పష్టమవుతోంది. ప్రజెంట్ ఆక్యుపయ్యర్ పేరు మీద ఉన్న ఇంటిని ఇతరుల పేరిట చేయడానికి వీల్లేదు. కానీ.. అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వేరే వారి పేరుపై చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఇక్కడే పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఇలాంటివి ఇంకెన్నో.. మ్యానువల్‌లో నాగమ్మ పేరు ఉండగా.. ఆన్లైన్లో గిరిగల్ల సుజాత పేరు ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణ పరిధిలో విలువైన భూమి కావడం.. దీనికి సంబంధించి లొసుగులు ఉండడంతో మున్సిపాలిటీలో అవినీతికి అలవాటు పడిన పలువురు అధికారులు సూత్రధారులుగా వ్యవహరించి అన్నీ చక్కబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్షలాది రూపాయల విలువైన భూమిని ఇతరులకు కట్టబెట్టి వారి నుంచి సుమారు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా.. అలాంటి పత్రాలు లేని ఇళ్లు పట్టణంలో కోకొల్లలు. చాలా ఉన్నట్లు తెలుస్తోంది. అందరిని ప్రజెంట్ ఆక్యుపయ్యర్‌లో పెట్టారు. వీటిలో సైతం ఇలాంటి బాగోతమే నడిచినట్లు పట్టణంలో చర్చ జరుగుతోంది. ఎన్నో అనుమానాలు ఎలాంటి పత్రాలు లేని భూమికి రిజిస్ట్రేషన్ ఎలా అయిందో.. ఎవరు తతంగం నడిపించారో అంతుబట్టని పరిస్థితి ఉంది. పేరు మార్పిడికి సంబంధించి మున్సిపల్ రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా చేశామని చెబుతున్నారు. కానీ.. నిబంధనల ప్రకారం ప్రజెంట్ ఆక్యుపయ్యర్ పేరు మీద ఉన్న ఇంటిని మరొకరి పేరుపై మార్పిడి చేయడానికి వీల్లేదు. ఇక్కడే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ చేపడతాం మాన్యువల్‌లో ఒకరు, ఆన్లైన్లోన్లో మరో పేరు ఉండడంపై మున్సిపల్ కమిషనర్ వి.సమ్మయ్యను వివరణ కోరగా.. ‘దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం. ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని పేర్కొన్నారు. -
పైసలిస్తేనే సర్టిఫికెట్!
సాక్షి, భైంసా (ఆదిలాబాద్) : ప్రభుత్వ కార్యాలయాల్లో దళారుల రాజ్యం నడుస్తోంది. ముఖ్యంగా రెవెన్యూ కార్యాలయాల్లో... సామాన్యులు రోజులు, నెలల తరబడి తిరిగినా కాని పనులు, వీరిని ఆశ్రయిస్తే మాత్రం గంటలు, రోజుల వ్యవధిలోనే పూర్తవుతున్నాయి. అధికారులకు, దళారులకు మధ్య సంబంధాలు ఉండడంతో వారు దగ్గరుండి మరీ పనులు చేయించుకుంటున్నారని విమర్శలున్నాయి. సామాన్య ప్రజలు అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా రేపు, మాపు అని తిప్పుతుండడంతో విసిగి వేసారి దళారులను ఆశ్రయిస్తున్నారు. వారికి అడిగినంత సమర్పించుకుని పనులు చేయించుకుంటున్నారు. కొందరు దళారులు అధికారులకు తెలియకుండానే నకిలీ స్టాంపులు, ఫోర్జరీ సంతకాలతో ప్రభుత్వ భూములను ప్రైవేట్ పరం చేస్తున్నారని కూడా ఆరోపణలున్నాయి. రెవెన్యూ అధికారుల వద్ద కంటే దళారుల వద్దే అధిక సంఖ్యలో దరఖాస్తులు ఉంటున్నాయనేది బహిరంగ రహస్యం పనికో రేటు.. ఆదాయం, నివాసం, కుల, జనన, మరణ ధ్రువీకరణపత్రాలతోపాటు రైతులకు పట్టాదారుపాస్ బుక్‌లు, పహనీలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల మంజూరు.. ఇలా పని ఏదైనా తహసీల్దార్ కార్యాలయానికి రావల్సిందే. పట్టణ ప్రజలతోపాటు మండల పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిత్యం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. కొందరు దళారులు ఏళ్లుగా ఇదే పనిలో పాతుకుపోయి ఉండడంతో.. ఏ అధికారి వచ్చినా వారిని మచ్చిక చేసుకుని పనులు చేసుకుంటారని ఆరోపణలున్నాయి. దీంతో ప్రజలు కూడా దళారులను ఆశ్రయిస్తేనే పనులు త్వరగా పూర్తవుతాయని వారినే సంప్రదిస్తున్నారు. దీంతో దళారులు ప్రతి పనికి ఓ రేటు చొప్పున దరఖాస్తు దారుల నుంచి వసూలు చేసి అధికారులకు వాటాలు అందిస్తారని సమాచారం. దళారుల వద్దే ఎక్కువ దరఖాస్తులు.. దళారులను సంప్రదిస్తే త్వరగా పనులు పూర్తవుతుండడంతో చాలామంది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేక దళారులను ఆశ్రయిస్తున్నారు. రెవెన్యూ అధికారుల వద్ద కంటే దళారుల వద్దే ఎక్కువ దరఖాస్తులు ఉండడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. పెద్దమొత్తంలో వేతనాలు అందుకునే అధికారుల కంటే దళారులే కోటీశ్వరులుగా మారుతున్నారని, అధికారుల సంపాదన కంటే దళారుల సంపాదనే ఎక్కువగా ఉంటోందని రెవెన్యూ సిబ్బందే చర్చించుకుంటున్నారు. పట్టాపాస్‌బుక్‌ల కోసం పాట్లు.. రైతులకు ఏడాదిలో ఎకరానికి రూ.8వేల పెట్టుబడి సాయం అందించేందుకుగాను రైతుబంధు పథకం ప్రవేశపెట్టింది. ఇందుకుగాను భూరికార్డుల ప్రక్షాళన చేపట్టి కొత్త పట్టాదారు పుస్తకాలను అందించింది. అయితే ఈ ప్రక్రియలో ఇప్పటికీ చాలామంది రైతులకు కొత్త పాస్‌పుస్తకాలు రాలేదు. పహనీలో పేరు రాయాలన్నా, రిజిస్ట్రేషన్ అయిన భూమికి మ్యుటేషన్ చేయాలన్నా, కొత్త పాస్‌బుక్ ఇవ్వాలన్నా వీఆర్వోల చేయి తడపాల్సిందే. తాము డబ్బులు పెట్టి కొన్న భూమికి రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నా వీఆర్వోకు లంచం ముట్టనిదే పేరు మార్చడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కొత్త పట్టాదారుపాస్బుక్లకోసం నెలల తరబడి తిప్పించుకుంటున్నారని వాపోతున్నారు. భూమి కొలవాలన్నా సర్వేయర్లు రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మీసేవలోనే దరఖాస్తు చేసుకోవాలి ప్రజలు కుల, ఆదాయ, ఇతర సర్టిఫికెట్ల కోసం తహసీల్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. మీసేవ కేంద్రాల్లోనే దరఖాస్తు చేసుకోవాలి. గడువులోపు మీసేవ ద్వారానే ధ్రువపత్రాలు అందుతాయి. దరఖాస్తుదారులు దళారులను ఆశ్రయించవద్దు. వారికి డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. – రాజేందర్, తహసీల్దార్ -
అవినీతిలో అందెవేసిన చేయి
చేయి తడపందే ఆయన దగ్గరనుంచి ఏ ఫైల్ కదలదంట... పనిచేసిన ప్రతిచోటా కలెక్షన్ చేయడంలో సిద్ధహస్తుడంట... ఈయన దాహానికి అంతులేకపోవడంతో ఇటీవలే ఓ అధికారి సైతం జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారంట... అయినా ఆయన తన సహజ ధోరణితో వ్యవహరించడంతో మళ్లీ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపైనా ఓసారి కేసు నమోదై... ఇంకా విచారణ కొనసాగుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ వైపు అవినీతిపై ఉక్కుపాదం మోపాలని హెచ్చరిస్తుంటే... ఇంకా ఇలాంటి తిమింగలాలు తమ వైఖరి మార్చుకోకపోవడం రెవెన్యూ శాఖకే మాయని మచ్చగా మారుతోంది. సాక్షి, విజయనగరం : రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రెవెన్యూశాఖలో అవినీతి పై రెండు నెలలుగా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా రెవెన్యూశాఖ అధికారుల తీరు మారడంలేదు. ఎన్నోఏళ్లుగా లంచాలకు అలవాటు పడ్డ కొందరు వాటిని మానుకోలేకపోతున్నారు. గంట్యాడ మండల తహసీల్దార్ డి.శేఖర్ అవినీతి నిరోధక శాఖ అధికా>రులకు మంగళవారం చిక్కడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అవినీతి శేఖరం ఏసీబీ అధికారులకు చిక్కిన గంట్యాడ తహసీల్దార్ డి.శేఖర్‌కు అవినీతి చరిత్ర పెద్దదే ఉంది. కాసులివ్వనదే పని చేయడన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈయన విశాఖపట్నంలో రెవెన్యూశాఖలో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. డిప్యూటీ తహసీల్దారు కేడరు వరకు అక్కడే పని చేశారు. ఏడాది క్రితం తహసీల్దారుగా పదోన్నతి ఇచ్చిన రాష్ట్ర భూపరిపాలన ముఖ్య కార్యదర్శి విజయనగరం జిల్లా కేటాయించారు. జిల్లా కలెక్టర్ ఈయన్ను మొదట బొండపల్లి తహసీల్దారుగా నియమించారు. ఎన్నికల సమయంలో బదిలీల్లో అక్కడి నుంచి సీతానగరం బదిలీ చేశారు. తాజాగా 20రోజుల క్రితం సీతానగరం నుంచి గంట్యాడకు బదిలీపై వచ్చారు. ఈ నెల 10వ తేదీనే అక్కడ విధుల్లో చేరారు. సుదీర్ఘకాలం రెవెన్యూశాఖలో సేవలందించిన శేఖర్‌పై జిల్లాలో అనేక ఆరోపణలున్నాయి. జిల్లాకు వచ్చిన ఏడాది కాలంలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్న పేరు కూడా ఉంది. ఎక్కడ పని చేసినా డబ్బులు ఇవ్వనిదే పనులు చేయరన్నది ప్రతీతి. పట్టాదారు పాసుపుస్తకాలు, పలు ధ్రువీకరణపత్రాల జారీకి పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేశారని బొండపల్లి, సీతానగరం, గంట్యాడ వాసులు చెబుతున్న మాట. బొండపల్లిలో ఉండగా లంచా ల విషయంలో సిబ్బందికి, ఆయనకు మధ్య పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకున్నాయి. గంట్యా డ వెళ్లిన 20రోజుల్లోనే అనేక పనులకు డబ్బులు డిమాండ్ చేయడం, ఇచ్చిన వారికి సంతకాలు చేయడం, ఇవ్వనివారిని తిప్పించడం చేస్తున్నారని ప్రచారం సాగింది. కొందరు అధికారులు ఏమీ ఆశించకుండా ఇచ్చే ఎఫ్సీవో కాపీ కోసం రూ.2వేలు డిమాండ్ చేస్తున్నారని ఆ శాఖ అధికారుల్లోనే చర్చ జరుగుతోంది. ఈ విషయం జిల్లా అధికా రుల వరకూ చేరడంతో జాగ్రత్తగా ఉండాలని మూడు రోజుల క్రితమే ఓ జిల్లా అధికారి హెచ్చరించినట్టు కూడా తెలిసింది. అయినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. విశాఖపట్నంలో పని చేసినపుడు కూడా ఆయనపై అనేక అవినీతి అభియోగాలు న్నాయి. విశాఖపట్నంలో పని చేస్తుండగా ఆరేళ్ల క్రి తం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేయగా ఇంకా కేసు నడుస్తోంది. ఎన్ఓసీకోసం రూ. 50వేలు లంచం... విజయనగరానికి చెందిన రొంగలి శ్రీనివాసరావు రామవరం పంచాయతీ కరకవలస సమీపంలో సర్వేనంబర్ 32/6లో 20 సెంట్ల స్థలాన్ని ల్యాండ్ కన్వర్షన్, పెట్రోల్‌బంకు ఏర్పాటుకు ఎన్ఓసీ ఇవ్వాలని రెవెన్యూ శాఖతో పాటు 4 శాఖలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే పోలీస్, ఫైర్ తదితర శాఖలు ఎన్ఓసీ ఇవ్వగా రెవెన్యూమాత్రం ఇవ్వలేదు. దీనిపై తహసీల్దార్ బి.శేఖర్‌ను సంప్రదించగా రూ 50వేలు లంచం డిమాండ్ చేశారు. చేసేది లేక ఆయన ఏసీబీ అధికారులకు ఫిర్యాదుచేయగా ఏసీబీ డీఎస్పీ డి.వి.ఎస్.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మాటువేసి తహసీల్దార్ కార్యాలయంలోనే లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. వెంటనే ఆయనపై కేసు నమోదుచేసి, విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్టు డీఎస్పీ తెలిపారు. గంట్యాడలో గతంలో విద్యుత్ శాఖ జేఈ జ్యోతీశ్వరరావు, సర్వేయర్ శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ జేఈ గోవిందరావు ఏసీబీ వలలో చిక్కుకున్నారు. ముఖ్యమంత్రి ఎంతగా హెచ్చరిస్తున్నా... రెవెన్యూశాఖపై ఇప్పటికే జనంలో చెడ్డ పేరుంది. ఇక్కడ ఏ పనీ లంచం ఇవ్వనిదే జరగదన్న ఓ అపవాదు కూడా ఉంది. ఈ విషయం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టిలో ఉండటంతో అవినీతి తగ్గాలని కలెక్టర్ల సమావేశం, వీడియో కాన్ఫరెన్సులో చెబుతూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం జరిగిన వీడియోకాన్ఫరెన్సులోనూ ఈ విషయం కలెక్టర్ ప్రస్తావించారు. అయినా తహసీల్దారు శేఖర్ తీరు మారకపోవడం విశేషం. ఇలాంటి పనుల వల్ల డిపార్టుమెంటు పరువు పోతోందని ఆ శాఖలోని అధికారులే వ్యాఖ్యానించడం గమనార్హం. -
బదిలీల్లో రెవెన్యూ
బదిలీల ప్రక్రియను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపే పూర్తిచేయాలన్న నిబంధన ఉంది. జిల్లాలోని అన్ని శాఖల్లో బదిలీల ప్రక్రియ పూర్తయినప్పటికీ రెవెన్యూ శాఖలో మాత్రం ఇప్పటివరకు పూర్తి కాని పరిస్థితి. ప్రస్తుతం నిర్వహించిన బదిలీల్లో అవకతవకలు, చేతివాటం జరిగిందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. బదిలీల తీరును చూసి తోటి రెవెన్యూ సిబ్బందే ముక్కున వేలు వేసుకుంటున్నారు. అదేవిధంగా డీటీల పదోన్నతుల్లో కూడా అవకవతవకలు జరిగినట్లు తెలుస్తోంది. సాక్షి, చిత్తూరు కలెక్టరేట్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రెవెన్యూ బదిలీలు పూర్తయిపోయాయి. అయితే ఈ జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు బదిలీలు పూర్తి కాని దుస్థితి. కలెక్టరేట్ అధికారులు నిబంధనలను పాటించకపోవడం, ఇష్టానుసారంగా బదిలీల పోస్టింగ్‌లు ఇవ్వడం గందరగోళానికి దారితీసింది. దీంతో ఇప్పటికీ రెవెన్యూ శాఖలోని ఉద్యోగులకు బదిలీలు పూర్తికాని పరిస్థితి. కలెక్టరేట్ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో కింది స్థాయి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. జిల్లాలో రెవెన్యూ బదిలీలు ఎప్పటికి పూర్తవుతాయో దిక్కు తోచని పరిస్థితి నెలకొంది. పాత తేదీలు వేసి.. బదిలీల ఉత్తర్వుల్లో పాత తేదీలు వేసి, రోజుకో ఉత్తర్వులను విడుదల చేస్తున్నారు. కలెక్టరేట్ అధికారులు రోజుకో ఉత్తర్వులను విడుదల చేస్తుండడంతో ఉద్యోగుల్లో గందరగోళం మొదలైంది. నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టమొచ్చిన వారికి, ఇష్టానుసారంగా పోస్టింగ్‌లను కేటాయిస్తున్నారు. బదిలీలకు గడువు ముగిసి 15 రోజులవుతోంది. అయితే ఇప్పటికీ బదిలీల ప్రక్రియను పూర్తి చేయకపోవడం జిల్లా యంత్రాంగం వైఫల్యమేనని తెలుస్తోంది. పదోన్నతుల్లో అవకతవకలు జిల్లాలోని సీనియర్లుగా ఉన్న సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్థాయి ఉద్యోగులకు డీటీలుగా పదోన్నతి కల్పించారు. అందులో మొదటి విడతలో 34 మందికి, ఈ నెల 25న 20 మందికి డీటీగా పదోన్నతులు ఇచ్చారు. ఈ పదోన్నతుల్లో అవకతవకలకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 24న ఇచ్చిన పదోన్నతుల్లో పలమనేరులో ఆర్ఐగా పనిచేస్తున్న రిషివర్మకు పదోన్నతి కల్పించాల్సి ఉంది. అయితే ఆయనకంటే జూనియర్ అయిన సోమల ఆర్ఐ బాబ్జికి పదోన్నతి కల్పించారు. ముడుపులు తీసుకుని అర్హత లేనివారికి పదోన్నతులు కల్పించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనకు జరిగిన అన్యాయంపై రిషివర్మ శుక్రవారం కలెక్టరేట్లోని అధికారులకు వినతిపత్రాన్ని ఇచ్చారు. అప్పుడు ఏం చేయాలో తెలియక అధికారులు బాబ్జిని సంప్రదించి తన పదోన్నతిని వెనక్కి తీసుకుంటున్నానని లిఖితపూర్వకంగా రాసిఇవ్వాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. అందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక కలెక్టరేట్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా యంత్రాంగం చేస్తున్న తప్పిదాలకు అర్హులైన ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రెవెన్యూ బదిలీలను పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పారదర్శకత లోపం రెవెన్యూ బదిలీల్లో పారదర్శకత ఏమాత్రం లేదని కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. బదిలీలకు అర్హత ఉన్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించి చేపట్టాల్సిన బదిలీలు తమకు ఇష్టమొచ్చినట్లు నిర్వహిస్తున్నారు. ఈ బదిలీల్లో ముడుపులు స్వీకరించి పోస్టింగులిస్తున్నారనే చర్చ మొదలైంది. గత 15 రోజులుగా బదిలీలు పూర్తికాకపోవడంతో దాదాపు 700 మంది పలు కేడర్ల ఉద్యోగులు ఎటూ కాకుండా గాల్లో ఉన్నారు. జిల్లా యంత్రాంగం చేసిన తప్పిదాలకు ఆ ఉద్యోగులకు బదిలీ ప్రక్రియ పూర్తయ్యే వరకు జీతాన్ని ఉచితంగా ఇవ్వాల్సిన పరిస్థితి. -
రైతుల పడరాని పాట్లు..
సాక్షి, సిద్దిపేట: నిజాం కాలం నాటి భూముల రికార్డులను సరిచేసి భూ సమస్యను తీర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రికార్డుల ప్రక్షాళనకు పూనుకుంది. ఆలోచనకు అనుగుణంగా అధికారులు పనిచేయకపోడంతో కొత్తపాస్ పుస్తకాలు రావడమేమో కాని ఉన్న భూమి వేరేవారి పేరున మారిపోయింది. చిన్న చిన్న తగాదాలను అడ్డం పెట్టుకొని పలువురు రెవెన్యూ అధికారులు డబ్బులు దండుకుంటున్నారు. అన్నీ సక్రమంగా ఉన్నా.. పాస్ పుస్తకం ఇవ్వాలంటే ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఎందుకు డబ్బులు ఇవ్వాలని గట్టిగా అడిగితే వారి భూమికి మరిన్ని కొర్రీలు అంటగట్టడం, కంప్యూటర్లో తప్పుగా నమోదు చేయడం, ఫైల్ మాయం చేయడం పరిపాటిగా మారింది. ఇలాంటి చర్యలతో అనేక మంది రైతులు తమ సమస్యల పరిష్కారానికి చెప్పులరిగేలా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. దీంతో వారంతా రైతుబంధు, రైతుబీమాకు దూరమవుతున్నారు. చిన్న చిన్న సమస్యలను కూడా సవరించకుండా.. అమ్మిన వారి, కొన్నవారి కాగితాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నా.. ఎవరో ఫిర్యాదులు చేశారని పలువురు రైతులకు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా అధికారులు జాప్యం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,33,432 ఖాతాలు ఉన్నాయి. ఇందులో 2,64,062 ఖాతాలు సక్రమంగా ఉన్నాయని అధికారులు డిజిటల్ సంతకం చేశారు. ఇందులో ఇప్పటి వరకు 2,63,018 మంది రైతులకు పాస్‌పుస్తకాలు అందజేశారు. మరో 1,044 మంది పాస్‌పుస్తకాలు ప్రింటింగ్ కాకుండా నిలిచిపోయాయి. అదేవిధంగా 19,591 ఖాతాలు ఆధార్ కార్డు నంబర్లలో తప్పులు, సర్వే నంబర్లో తేడాలు, డబుల్ నంబర్ ఇలా అనేక కారణాలతో ప్రాససింగ్ నిలిచిపోయాయి. మిగిలిన 15,441 ఖాతాలు పట్టణాల సమీపంలో ఉండటంతో వ్యవసాయేతర భూమిగా మార్చడంతో వాటికి పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదు. అదేవిధంగా 32,438 ఖాతాలు ప్రభుత్వ భూముల్లో ఉన్నాయి. ఇవిపోగా 1,900 ఖాతాలు ఫార్ట్–బీలో పెట్టారు. దీంతో పాస్‌పుస్తకాలు రాలేదు. అదేవిధంగా ప్రభుత్వం అందచేసే రైతు బంధు, రైతు బీమా సౌకర్యంతోపాటు బ్యాంకు రుణాలు కూడా ఇవ్వడం లేదు. అధికారులకు వరంగా.. ప్రభుత్వం శ్రీకారం చుట్టిన భూ రికార్డుల ప్రక్షాళన పలువురు రెవెన్యూ అధికారులు, ఉద్యోగులకు వరంగా మారింది. తల్లిదండ్రుల నుంచి సంక్రమించే ఆస్తులు, ఒకరి దగ్గరి నుంచి మరొకరు కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నా రెవెన్యూ పహానీలో నమోదు చేసేందుకు అంగీకరించడం లేదు. అదేవిధంగా అన్నదమ్ముల పంపకాలు, ఇతర విషయాల్లో పైసలు ఇవ్వనిదే దస్త్రం కదలని దుస్థితి. ప్రధానంగా 1900 ఖాతాలు పార్ట్–బిలో ఉన్నాయి. వీటిని సరిచేస్తున్నామనే నెపంతో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. డబ్బులు ఇచ్చిన వారికి ఏ అడ్డంకులు లేకుండా పాస్‌పుస్తకాలు అందజేశారని, ఇవ్వని వారిని ఇప్పటి వరకు సతాయిస్తున్నారని రైతులు ఆదేవన వ్యక్తం చేస్తున్నారు. పాస్‌పుస్తకాలు ఎందుకు రాలేదు అంటే సర్వే నంబర్లు తప్పులు పడ్డాయని, మీ సర్వేనంబర్‌లో భూమిలేదని ఇలా సాకులు చెబుతూ డబ్బులు వసూళ్లు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. రెవెన్యూ కార్యాలయానికి సాధారణంగా రైతులు తమ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాల కోసం, వారసత్వంగా తాతలు, తండ్రుల నుంచి వచ్చిన భూమిని తమ పేరు మీదకు మార్చుకోవడానికి, మ్యూటేషన్ కోసం, భూమిని కొలిపించుకోవడానికి దరఖాస్తు చేయడం కోసం వస్తుంటారు. వీటిలో ఏ పని చేయాలన్నా అధికారులకు డబ్బులు ఇవ్వాల్సిందేనని పలువురు రైతులు వాపోతున్నారు. పట్టాదారు పాసు పుస్తకాల కోసం ఎకరానికి రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు, మ్యూటేషన్ కోసం ఎకరానికి రూ. 10 వేల వరకు, వారసత్వ భూమిని తమ పేరు మీద మార్చుకోవడానికి రూ. 20 వేలు, ఇతరుల నుంచి కొనుగోలు చేసిన భూమిని తమ రికార్డుల్లో ఎక్కించుకోవడానికి, కొత్త పాసు పుస్తకం కోసం రూ. 20 వేల నుంచి రూ. లక్ష వరకు అధికారులకు ముట్ట జెప్పాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లోని వ్యవసాయ భూములకు తక్కువగా, రియల్ ఎస్టేట్‌కు అనుకూలంగా ఉండి డిమాండ్ ఉన్న భూములకు లక్షల్లో వసూలు చేస్తున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ఇవే కాకుండా పట్టణ ప్రాంతాలకు, రాష్ట్ర, జాతీయ రహదారులకు దగ్గర ఉన్న భూములకు రూ. అక్ష నుంచి ఆపైన వసూలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా అంతే సంగతులు నంగునూరు మండలం పాలమాకుల గ్రామానికి చెందిన వర్దోలు శ్రీనివాస్‌కు 2008లో 112 సర్వే నంబర్లోని రెండు బిట్లు, 2010లో ఇదే సర్వే నంబర్లో భూమి కొనుగోలు చేశాడు. అప్పుడు అధికారులు పాస్‌పుస్తకం అందజేశారు. నాటి నుంచి 2017 వరకు పహానీలు అందజేసి బ్యాంక్‌లో రుణాలు పొందాడు. ప్రభుత్వం రైతులకు కొత్త పాసు పుస్తకాలు ఇవ్వగా తన పేరిట ఉన్న సర్వే నంబర్లు ఎగిరిపోవడంతో పాటు బుక్కు రాలేదు. 2018లో వీఆర్ఓకు దరఖాస్తు చేసుకుంటే మూడు నెలల్లో అందజేస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఇవ్వలేదు. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లకు వినతి పత్రం అందజేసినా ఫలితంలేదు. కొత్త పుస్తకాలు రాకపోవడంతో ప్రభుత్వం అందిస్తున్న పంట పెట్టుబడి సహాయం రాకపోగా రైతుబీమా బాండ్ కూడా రాలేదు. –శ్రీనివాస్, పాలమాకుల, నంగునూరు మండలం పైరవీకారుల పనులు మాత్రమే చేస్తుండ్రు.. కోహెడ మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన రైతు మందడి బుచ్చిరెడ్డి. ఇతడు 2013లో అదే గ్రామానికి చెందిన తగ్గరి బంధువు హన్మంతరెడ్డి అనే రైతు వద్ద 106 సర్వే నెంబర్లోని 2 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్ సైతం బుచ్చిరెడ్డి పేరిట చేయించుకున్నాడు. అప్పటి నుంచి కార్యాలయం చూట్టు తిరుగుతున్నాడు. ఇప్పటికే నాలుగుసార్లు మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాడు. ప్రతి రోజు కారాలయం చూట్టు తిరుగుతున్నడు. రేపు రా..మాపు రా అంటూ అధికారులు మాట దాటివేస్తున్నారు. ఇప్పగికి 6 సంవత్సరాలు అయన పరిష్కరించడం లేదు. వారం రోజుల క్రితం గట్టిగ ఆడిగితే నీ ఫైలు పోయింది. మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకొమ్మని నీర్లక్ష్యం సమాధానం చెబుతూ బెదిరిస్తున్నారు. ప్రతి రోజు ఎలాంటి పని పేట్టుకోకుండా కేవలం తహసీల్దార్ కార్యలయం చుట్టూ తిరుగుతున్నాడు. పైరవీకారులకు పనులు మాత్రమే చేస్తున్నరని అధికారులపై రైతు మండిపడ్డరు. –బుచ్చిరెడ్డి, నారాయణపూర్, కోహెడ మండలం ముడుపులిస్తేనే పనులు అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన గంగధారి సుగుణ. సర్వే నంబర్ 155లో సదా భైనామా ద్వార 0.38 గుంటలు కొనుగోలు చేసి సాగు చేసుకుంటుంది. ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళనకు అవకాశం ఇవ్వడంతో ఏడాదిన్నర కిందట ఊరుకు వచ్చిన రెవెన్యూ అధికారులకు భూమి పట్టా చేయాలని దరఖాస్తు పెట్టింది. మోక మీద విచారణ చేసిన అధికారులు పట్టా చేస్తామని చెప్పిన అధికారులు ఇప్పటి వరకు పాస్ పుస్తకం అందచేయడం లేదు. ఎందుకు పాస్‌పుస్తకం ఇవ్వడంలేదు అని నిలదీస్తే ఇదే ఖాత నంబరులో జి.మల్లయ్యకు నాలుగు గుంటల భూమి అది సర్వే చేసిన తర్వాత చేస్తామని చెబుతున్నాడు. ఏడాది కిందనే భూ సర్వే కోసం ఫీజులు కట్టిన సర్వేయర్ రాని దుస్థితి. వీఆర్ఏ శ్రీనివాస్ డిప్యూటీ తహసీల్దార్ తిరుపతిరెడ్డికి దగ్గర ఉండి ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్లకు చెప్పి అమ్మిన పట్టేదారు పేరును పట్టా కాలం నుంచి తొలగించారు. భూ రికార్డుల ప్రక్షాళన మొదలు పెట్టిన అధికారులు తిరిగి భూమి అమ్మిన వ్యక్తి పేరున వస్తుంది. అమ్మిన సదరు వ్యక్తిని తీసుకవచ్చి అధికారులకు చెప్పించినా వారు పని చేయడం లేదు. శీఆర్ఏ శ్రీనివాస్ అధికారులకు తప్పుడు సమాచారం అందించి భూ సమస్య తీరకుండా చేస్తున్నాడని బాదితురాలు ఆరోపిస్తోంది. ఆయకు ముడుపులు అప్పగిస్తేనే పనులు చేస్తున్నారు. - గంగాధరి సుగుణ, చౌటపల్లి, అక్కన్నపేట మండలం -
డబ్బులు తీసుకున్నారు.. పుస్తకాలివ్వలేదు..
తల్లాడ: పట్టాదారు పాసు పుస్తకాలకు చలాన తీయాలని రైతుల వద్దనుంచి పెద్ద మొత్తంలో రెవెన్యూ సిబ్బంది డబ్బులు తీసుకొని పాసు పుస్తకాలివ్వకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం రైతులు ధర్నా నిర్వహించారు. ఇక్కడి ఆర్ఐలు ప్రసన్న, శ్రీనివాస్‌లు బదిలీ అయ్యారు. విషయం తెలుసుకున్న తల్లాడ, అన్నారుగూడెం, మల్లారం, కుర్నవల్లి, మిట్టపల్లి, బిల్లుపాడు, గోపాలపేట, కొత్త వెంకటగిరి, బాలపేట, నూతనకల్, పినపాక గ్రామాలకు చెందిన రైతులు తహసీల్‌కు చేరుకున్నారు. కార్యాలయానికి తహసీల్దార్ డీఎస్.వెంకన్న, ఆర్ఐలు ప్రసన్న, శ్రీనివాస్‌లు రాక పోవటంతో.. రైతులు ఆందోళనకు దిగారు. వచ్చే వరకు కదలబోమని భీష్మించారు. అన్నారుగూడెం వీఆర్ఓ నాగేశ్వర్రావు కార్యాలయానికి రాగా రైతులు ఆయన్ను చుట్టుముట్టి ఆర్ఐల గదిలో ఉంచి తలుపులు వేసి నిర్బంధించారు. చలాన పేరుతో డబ్బులు తీసుకొని పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నట్లు వాపోయారు. తహసీల్దార్‌కుకు రైతులు ఫోన్ చేయగా.. తాను ఖమ్మంలో మీటింగులో ఉన్నానని, సమస్యను పరిష్కరిస్తామని, ఆందోళన చేయవద్దని చెప్పారు. దీంతో రైతులు ఇద్దరు ఆర్ఐలు, వీఆర్ఓలపై తల్లాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది సివిల్ మ్యాటర్ అని కలెక్టర్, ఆర్డీఓలకు ఫిర్యాదు చేసుకోవాలని ఎస్.ఐ. వరాల శ్రీనివాస్ సూచించారు. దీంతో కొందరు రైతులు కల్లూరు ఆర్డీఓ శివాజీకీ ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఎకరానికి రూ.5 వేల నుంచి 25 వేల వరకు వసూళ్లు తల్లాడ రెవెన్యూ సిబ్బంది పట్టాదారు పాసు పుస్తకాల్లో రైతుల పేర్లు నమోదు చేసేందకు, 1బీ ఖాతాలో పేరు చేర్చేందుకు ఎకరానికి రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు చలానా పేరుతో వసూలు చేసినట్లు రైతులు పేర్కొన్నారు. గత మూడేళ్లలో లక్షలాది రూపాయలు మామూళ్లు తీసుకొని పాసు పుస్తకాలివ్వకుండా తిప్పుకుంటున్నారని ఆరోపించారు. ఆర్ఐలు ఇద్దరు బదిలీ అవ్వటం వల్ల ఇప్పుడు తమ భూములు ఎవరు ఆన్లైన్ చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. వీఆర్ఓలు, ఆర్‌ఐలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఆ వీఆర్ఓ.. అన్నింటా సిద్ధహస్తుడు..
సాక్షి, అనంతపురం టౌన్: అనంతపురం రూరల్ మండలం చియ్యేడు రెవెన్యూ గ్రామ వీఆర్ఓ 10ఏళ్లుగా అనంతపురం తహసీల్దారు కార్యాలయంలోనే పనిచేస్తున్నాడు. సాధారణ బ దిలీల సందర్భంలో బదిలీ అయినా తిరిగి యథాస్థానంలో ఉండేలా చక్రం తిప్పుతున్నాడు. చియ్యేడు నుంచి ఏ నారాయణపురానికి బదిలీ చేయించుకొని తిరిగి అనంతపురం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నాడు. మరో ఐదేళ్లు ఆయన నిశ్చింతంగా ఇక్కడే పనిచేస్తాడు. తన సర్వీస్‌లో దాదాపు 15 ఏళ్లు ఇక్కడే పనిచేస్తున్నాడంటే ఆయన సత్తా ఏమిటో తెలుస్తోంది. ఓ వీఆర్ఓ 2008నుంచి ఇప్పటి వరకు అనంతపురం తహసీల్దారు కార్యాలయ పరిధిలోనే విధులు నిర్వహిస్తున్నాడు. ప్ర స్తుతం అర్బన్‌లో మూడవ వార్డుకు వీఆర్ఓగా పని చేస్తున్నాడు. తాజా బదిల్లీలో 5వ వార్డుకు బదిలీ చేశారు. ఇతను ఇప్పటికే దాదాపు 11 ఏళ్లు సర్వీస్ అనంతపురం తహసీల్దారు కార్యాలయంలోనే పూర్తి చే శాడు. ఇప్పుడు మరో 5 ఏళ్ల పాటు ఇక్కడే కొనసాగనున్నాడు. ఇలాంటి వీఆర్ఓలు అనంతపురం తహసీల్దారు కార్యాలయంలో అనేక మంది ఉన్నారు. వివరాల్లో కెళ్తే... అనంతపురం తహసీల్దార్ కార్యాలయంలో అనేక మంది గ్రామ రెవెన్యూ అధికారులు కొన్నేళ్లుగా తిష్టవేసి వ్యవహారాలు చక్కబెడ్తున్నారు. సాధారణ బదిలీల సమయంలో వీరు కలెక్టరేట్లోని ఓ డిప్యూటీ తహసీల్దార్‌ను ఆశ్రయిస్తారు. బదిలీలు చేసినా తిరిగి వారు యథాస్థానంలో ఉండేలా ఆయన చక్రం తిప్పుతున్నారన్నది బహిరంగ రహస్యం.అనంతపురం త హసీల్దారు కార్యాలయంలో 25 మంది వీ ఆర్ఓలు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో దాదాపు 10 మందికి పైగా వీఆర్ఓలు కొ న్నేళ్లుగా ఇక్కడ పాతుకుపోయారు. ప్రతి బదిల్లీలోనూ అర్బన్ నుంచి రూరల్‌కు, రూరల్ నుంచి అర్బన్‌కు మారుతూ తమ సర్వీస్ మొత్తం ఇక్కడే పూర్తి చేయనున్నారు. వీఆర్ఓలపై ఆరోపణలు ఎన్నో: ప్రభుత్వ భూములకు పట్టాలను జారీ చేయడంలో అనంతపురం తహసీల్దారు కార్యాలయంలో పని చేస్తున్న కొందరు వీఆర్ఓలు సిద్ధహస్తులు. వీరిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వందల ఎకరాల ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేశారు. అయినా వీరిని బదిలీ చేయకపోవడం గమనార్హం. అనంతపురం రూరల్ మండలం నగరానికి దగ్గరలో ఉంది.. దీంతో ఇక్కడి భూములకు మార్కెట్లో మంచి విలువ ఉంది. గతంలో అర్బన్‌లో పన చేస్తున్న ముగ్గరు వీఆర్ఓ దేవుని మాన్యానికే ఎసర పెట్టేందుకు శ్రీకారం చుట్టారు. కొడిమి గ్రామంలోని 15 ఎకరాల ఆంజనేయస్వామి మాన్యాన్ని కాజేసేందుకు ప్రయత్నం చేశారు. దీంతోపాటు పంచాయతీ ఓపెన్ స్థలాలకు సైతం డి.పట్టాలను మంజూరు చేశారు. దీనిపై అప్పట్లోనే ‘సాక్షి’ పత్రికలో వరుస కథనాలు ప్రచురించడంతో విరమించుకున్నారు. ఏళ్ల తరబడి ఒకేచోట తిష్టవేసి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వీఆర్ఓలకు ఇకనైనా చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు. బదిలీ నిబంధనలు గాలికి వీఆర్ఓల బదిలీల్లో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని 5 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న వీఆర్ఓలను పనిచేసే చోటు నుంచి మరో మండలానికి బదిలీ చేయాలి. అనంతపురం తహసీల్దారు కార్యాలయంలో కొందరు వీఆర్ఓలను మాత్రమే ఇతర మండలాలకు బదిలీ చేశారు. అయితే 10 మందికిపైగా వీఆర్ఓలను అటు నుంచి ఇటు మార్చి తహసీల్దారు కార్యాలయంలోనే ఉంచారు. ఉదాహరణకు అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి, ఆకుతోటపల్లిలో వీఆర్ఓలు 5 ఏళ్ల సర్వీస్ పూర్తిచేసుకున్నారు. అయితే వీరిని మరో మండలానికి బదిలీ చేయకుండా ఇక్కడే ఉంచారు. -
ఉద్యోగుల జేబులు నింపిన ప్రక్షాళన
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూ రికార్డుల ప్రక్షాళన రెవెన్యూ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. జిల్లాలో ఎక్కవ సంఖ్యలో భూ వివాదాలు ఉండటం, అధికారులు, సిబ్బంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం, కొన్నిసార్లు పొరపాటుగా పడటం తదితర లోటుపాట్లను అధికారులు అవకాశంగా మల్చుకున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా భూ ప్రక్షాళన మొదలైనప్పటి నుంచే రెవెన్యూ అధికారులు రాబడి పది రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది. ప్రతి పనిలో అధికారులు డబ్బులు ఆశించడం సంప్రదాయంగా మారింది. ఆమ్యామ్యాలు ఇవ్వంది పని జరగడం గగణమే. చేయి తడపకుంటే నెలల తరబడి బాధితులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. ఇదంతా ఎందుకుని భావించే కొందరు.. ఎంతోకొంత డబ్బు ఇచ్చి పనులు చక్కబెట్టుకుంటున్నారు. నగరంలో జిల్లా ఒక వైపు కలిసి ఉండటంతోపాటు శివారు ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. పల్లెలు.. పట్టణాల్లా రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత భూముల ధరలు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. నగదు చేతిలో పెట్టుకోకుండా దాదాపు అందరూ వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలపై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో రియల్ భూం ఊపందుకుంది. మారుమూల మండల కేంద్రాల్లోనూ ఎకరా భూమి ధర రూ.కోటి వరకు పలుకుతోంది. కొనుగోలుదారుల డిమాండ్‌తో పల్లె పల్లెనా రియల్ వెంచర్లు వెలుస్తున్నాయి. ఈ క్రమంలో భూములు చేతులు మారుతుండటంతో రెవెన్యూ ఉద్యోగులకు కాసుల పంట పండుతోంది. ‘నాలా’.. కల్పతరువు వ్యవసాయ భూములు రియల్ వెంచర్లుగా మారుతున్నాయి. అంతకంటే ముందు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాల్సి ఉంటుంది. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులకు భారీ ఎత్తున డబ్బులు ముడుతున్నాయి. నాలా సర్టిఫికెట్ జారీ చేయడంలో తహసీల్దార్, ఆర్డీఓలది కీలక పాత్ర. దీన్ని అడ్డంపెట్టుకుని అధికారులు పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేస్తున్నారు. లేదంటే పలు సాకులతో తీవ్ర జాప్యం చేస్తున్నారు. కేశంపేట తహసీల్దార్ కూడా నాలా వ్యవహారంలో భారీగా డబ్బు వెనకేశారని తెలుస్తోంది. ఇందుకు అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు సహకరించినట్లు సమాచారం. ఇద్దరి మధ్యన లోపాయికారీ ఒప్పందం ఉండటంతో ‘నాలా’ని దందాగా మార్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోస్టుకు భలే డిమాండ్ జిల్లా రెవెన్యూ శాఖలో పోస్టింగ్ పొందడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. పలు రకాలుగా డబ్బు దండుకునే అవకాశం ఉండటంతో జిల్లాలో పనిచేసేందుకు ఉద్యోగులు పోటీ పడుతున్నారు. ఉన్నత స్థాయిలో పైరవీలు చేయించుకోవడం, లేదంటే డబ్బు ముట్టజెప్పి నచ్చిన మండలంలో పోస్టింగ్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో రాజేంద్రనగర్, చేవెళ్ల డివిజన్ల పరిధిలో తనకు కావాల్సిన మండలం కోసం ఒక తహసీల్దార్ సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చు చేసినట్లు చర్చ జరుగుతోంది. ఇదే కోవలో ఏసీబీ కేసులో చిక్కుకున్న తహసీల్దార్ లావణ్య కూడా ప్రయత్నించినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. మెదక్ జిల్లా కొండాపూర్ మండలం నుంచి జిల్లాలో పోస్టింగ్ కోసం భారీగానే ఖర్చు చేసినట్లు వినికిడి. ఇంకొన్ని మండలాల్లో పనిచేస్తున్న స్థానాన్ని కాపాడుకునేందుకూ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతలను అనుకూలంగా వ్యవహరించడంతోపాటు ఉన్నతస్థాయి అధికారులకూ అడపాదడపా మర్యాదలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
‘మీసేవ’లో చేతివాటం!
సాక్షి, నిర్మల్(ఆదిలాబాద్) : మామడ మండలంలోని పొన్కల్ గ్రామానికి చెందిన ఓ రైతు మ్యుటేషన్ కోసం జిల్లాకేంద్రంలోని ఓ మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేశాడు. అయితే మీసేవ నిర్వాహకుడు అతడికి రూ.145 రశీదు ఇచ్చి రూ.300 వసూలు చేశాడు. పదే పదే తిరిగే పరిస్థితి లేకపోవడంతో అడిగిన మొత్తం ఇచ్చి పని కానిచ్చుకున్నాడు ఆ రైతు. మీసేవలో పని కోసం వెళ్లే ప్రతీ ఒక్కరూ ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొంటున్నారు. మీసేవలో ప్రభుత్వం నిర్దేశించిన చార్జీకి మించి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇదేంటని ప్రశ్నిస్తే, ప్రభుత్వం ఇచ్చే కమీషన్ తక్కువగా ఉండడంతోనే కాస్త ఎక్కువగా వసూలు చేయాల్సి వస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పలురకాల సేవలను ప్రజలకు పారదర్శకంగా, సులభంగా, వేగంగా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మీ సేవ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే వీటిపై పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలోని మీ సేవ కేంద్రాల నిర్వాహకులు దరఖాస్తుదారుల వద్ద నుంచి ప్రభుత్వం నిర్దేశించిన దానికి మించి అదనంగా ఫీజు వసూలు చేస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. ఇదేంటని అడిగితే స్టేషనరీ, ఇతర ఖర్చుల నిమిత్తం సర్వీస్‌చార్జీ విధిస్తున్నామని చెబుతున్నారు. ఇదంతా బహిరంగంగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదీ ఇదీ అని కాకుండా ప్రతీ సర్టిఫికెట్‌కు అదనపు చార్జీ వసూలు చేస్తున్నారు. చార్జీలకు సంబంధించిన నిర్దేశిత చార్టు మీసేవలో కళ్లముందు ఉన్నా అవి అలంకారప్రాయంగానే మారాయనే విమర్శలున్నాయి. అదనంగా ఇస్తేనే పని... మీ సేవ కేంద్రాల ద్వారా 300కు పైగా వివిధ ప్ర భుత్వశాఖల సేవలు ప్రజలకు అందుతున్నాయి. ఇందులో ప్రధానంగా విద్యార్థులకు సంబంధించిన వివిధ ధ్రువీకరణ పత్రాలతో పాటు భూము లు, వ్యవసాయానికి సంబంధించిన పత్రాల కోసం ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటారు. ప్రతీ ధ్రువీకరణపత్రం జారీకి ప్రభుత్వం సర్వీస్‌చార్జీ కింద కొంత మొత్తం ఫీజును నిర్దేశించింది. విద్యార్థులకు ఎక్కువగా నివాసం, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతా యి. ప్రభుత్వం వీటికి రూ.45 ఫీజు విధించింది. అయితే విద్యార్థుల అవసరాన్ని బట్టి నిర్వాహకులు ఇష్టారీతిన అదనపు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పలువురు మీసేవ నిర్వాహకులు తహసీల్దార్ కార్యాలయాల్లో తమ వారి ద్వారా కూడా పనులు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రైతులకు కావాల్సిన పహణీ, 1బీ వంటి వాటికి రూ.35 మాత్రమే వసూలు చేయాలి. కానీ అమాయక రైతుల పరిస్థితిని ఆసరా చేసుకుని నిర్వాహకులు వీటికి రూ.100 వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. తనిఖీలు శూన్యం... మీసేవ కేంద్రాలపై అధికారుల తనిఖీలు లేకపోవడంతో కేంద్రాల నిర్వాహకులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అలాగే ఇటీవల ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన మీ సేవ 2.0 యాప్‌పై ప్రజలకు అవగాహన కల్పించ డంలో అధికారులు విఫలమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా 72మీసేవ కేంద్రాలున్నాయి. ప్రతీరోజు ఒక్కో కేంద్రానికి దాదాపు 50 వరకు దరఖాస్తులు వస్తాయి. ఈ కేంద్రాల తనిఖీల బాధ్యత సంబంధిత తహసీల్దార్లకు ఉం టుంది. కానీ ఆ శాఖ అధికారులు ఎన్నికలు, వివిధ పనుల్లో బిజీగా ఉండడంతో తనిఖీలు చేపట్టడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని మీసేవ కేంద్రాల నిర్వాహకులు ఇష్టారీతిన అదనంగా సర్వీస్‌చార్జీ వసూలు చేస్తున్నారు. అదనంగా వసూలు చేస్తే చర్యలు మీసేవ కేంద్రాల తనిఖీలు రెవెన్యూ అధికారుల పరిధిలో ఉంది. సంబంధిత తహసీల్దార్ తన పరిధిలోని మీసేవ కేంద్రాలను పర్యవేక్షిస్తారు. కేంద్రాల్లో అదనంగా వసూలు చేస్తే దరఖాస్తుదారులు 1100 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అధికంగా ఫీజు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు వస్తే సదరు మీసేవ కేంద్రంపై తగిన చర్యలు తీసుకుంటాం. – నదీం, జిల్లా ఈ– మేనేజర్, నిర్మల్ -
దత్తతన్నాడు.. దోపిడీకొచ్చాడు..!
సాక్షి, ఎర్రావారిపాళెం : విదేశాల్లో సంపాదించాను.. ఊర్లన్నీ దత్తత తీసుకుని అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానంటూ నమ్మబలికి మోసగించాడంటూ రైతులు ఎన్ఆర్ఐ అబ్దుల్ అలీపై తిరుగుబాటు చేస్తున్నారు. అబ్దుల్‌అలీబలవంతపు భూసేకరణపై రైతులు బుధవారం ఎర్రావారిపాళెం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన విషయం విదితమే. ఈ విషయంపై మరికొంత మంది రైతులతో కలిసి కౌంటర్ ఇప్పించడానికి అబ్దుల్ అలీ గురువారం ప్రయత్నించాడు. అయితే ఈ ప్రయత్నం విఫలమైంది. మీడియా, ఇతర మండలాలకు చెందిన రైతుల సమక్షంలోనే బాధిత తిరుగుబాటు చేసి, తమ భూములు ఆక్రమించుకున్నారంటూ వాగ్వాదానికి దిగారు. జీవనాధారంగా ఉన్న మామిడి చెట్లు, భూముల ఆక్రమణతో వీధినపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అబ్దుల్ అలీపై రైతుల వ్యతిరేక వాదనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆయన అనుచరులు, రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ భూములు తిరిగి అప్పజెప్పాల్సిందేనంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలీ పెకలించి వేయించిన మామిడి మొక్కలు దౌర్జన్యంగా భూములు లాక్కున్నారు.. అధికారులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యంగా మా భూములు లాక్కున్నారు. ఎర్రావారిపాళెం మబ్బుతోపు సమీపంలో పందిమల్లచెరువు కింద ఉన్న పొలాలన్నీ బలవంతంగా లాక్కున్నవే. అక్కడ భూముల్లో సర్వే నెం.1923/1, 1923–1ఎలో రెండున్నర ఎకరాలు మాకు ఉండేది. భూమిలో సుమారు 200పైగా మామిడి చెట్లు ఉండేవి. 20 ఏళ్ల నుంచి కాయకష్టం చేసి మామిడి చెట్లు పెంచుకున్నాం. ఏడాదికి మామిడి కాపు ద్వారా లక్షన్నరపైగా ఆదాయం వచ్చేది. అటువంటి భూములను బెదిరించి లాక్కున్నారు. అధికారులు కూడా వత్తాసు పలకడంతో చేసేది లేక ఒప్పుకున్నాం. – చిన్నరెడ్డెమ్మ, ఎర్రావారిపాళెం, మహిళా రైతు అధికారులూ వత్తాసుపలకడం బాధాకరం.. అబ్దుల్ అలీ ఆక్రమిత భూముల్లో సర్వే నెం.1190లోని భూమి 40 ఏళ్లుగా మా అనుభవంలో ఉండేది. నిరుపేదలైన మేము పలుమార్లు పట్టా ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ప్రాధేయపడ్డాం. అక్కడ మాకు పట్టాచేయడానికి వీలు లేదని మా అభ్యర్థనను తిరస్కరించారు. సదరు సర్వే నంబరు భూమిని అబ్దుల్ అలీకి కట్టబెట్టారు. పేదవాడు పొట్టగడుపుకోవడం కోసం అభ్యర్థిస్తే ఇవ్వని పట్టా.. ఎన్ఆర్ఐకి అధికారులు కట్టబెట్టడం దారుణం. – మల్లూరి మధు, ఎర్రావారిపాళెం -
పైసలిస్తే.. పట్టా చేసేస్తారు!
సాక్షి, భూత్పూర్ (దేవరకద్ర): పట్టాదారు ఎవరైనా సరే.. పైసలిస్తే ఎవరి పేరుపైనైనా పట్టా ఇచ్చేస్తారు.. తమ్ముడి జైలుకి వెళ్తే.. అన్న పేరిట పట్టా చేస్తారు.. భూత్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో రెండు రోజుల క్రితం వీఆర్ఓల బదిలీలతో ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. వీఆర్ఓలు గ్రామాల్లో రికార్డు అనుభవం ఉన్న వ్యక్తులను మధ్యవర్తిత్వంగా పెట్టుకొని అక్షర జ్ఞానం లేని నిరక్షరాస్యులైన రైతుల భూములను రికార్డుల్లో మార్పు చేస్తున్నారు. భూ రికార్డుల్లో నమోదు చేయాలంటే భూమి కొనుగోలు చేసిన రోజు నుంచి 45 రోజుల తర్వాత మీసేవలో డాక్యుమెంట్ స్కాన్ చేసిన తర్వాత జిరాక్స్ డాక్యుమెంట్, ఆధార్ కార్డులను తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలనే నిబంధనలను తుంగలో తొక్కి విక్రయ పత్రాలు లేకుండానే, ఇళ్ల స్థలాల భూమిని ఏకంగా పట్టాభూమిగా మార్చి రికార్డులోకి ఎక్కించారు. ఈ విషయం విలేకరుల దృష్టికి వచ్చిందని తెలుసుకున్న అధికారులు పట్టా మార్పిడి నంబరును ఆన్లైన్లో తొలగించారు. గండేడ్ తరహాలో ఇక్కడ కూడా విచారణ చేపడితే మరిన్ని అక్రమ భాగోతాలు బయటపడే అవకాశం ఉంది. తేదీ లేకుండానే ప్రొసీడింగ్స్ మండలంలోని కొత్తమొల్గరలో సర్వే నంబరు 379లో ఇళ్ల స్థలాల పేరిట రికార్డుల్లో నమోదు చేశారు. ఇదే సర్వే నంబరులో ఎకరా భూమి ప్రభుత్వం గతంలో పేదలకు ఇవ్వడానికి కొనుగోలు చేశారు. ప్రభుత్వ భూమి, ఇళ్ల స్థలాలు ఉండటంతో డిజిటల్ సైన్ ఆన్లైన్లో పెండింగ్ ఉంచారు. కొత్త మొల్గరకు చెందిన కె.తిమ్మయ్య, నర్సమ్మ పేరు మీద ఒక్కొక్కరికి గాను 0.0250 గుంటల భూమిని పట్టా చేశారు. 60073, 60074 ఖాతా నంబర్లు సైతం ఆన్లైన్లో ఎక్కించారు. భూత్పూర్ తహసీల్దార్ మహేందర్‌రెడ్డి కె.తిమ్మయ్య, నర్సమ్మలపై ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అయితే ప్రొసీడింగ్స్ జారీ చేసిన తేదీ లేకపోవడం గమనార్హం. ఈ భూమికి సంబంధించిన రికార్డులను తహసీల్దార్ కార్యాలయంలో పరిశీలిస్తే ఎలాంటి ఆధారాలు లేకుండానే పట్టా మార్పు చేసినట్లు తెలిసింది. ప్రజావాణిలో ఫిర్యాదుతో.. అలాగే మండలంలోని పోతులమడుగు అనుబంధ గ్రామమైన గోపన్నపల్లిలో సర్వే నంబరు 165లో ఎకరా భూమిని కొనుగోలు చేసుకొని పట్టా చేసుకున్నారు. చెన్నయ్య 2012లో మృతి చెందడంతో భార్య మాల ఊషమ్మ పేరు మీద రెవెన్యూ రికార్డుల్లో మార్చారు. భర్త మృతి చెందిన కొద్ది నెలలకే మాల ఊషమ్మ సైతం మృతిచెందింది. ఈమెకు మాల శంకరయ్య, వెంకటయ్య అనే ఇద్దరు కుమారులున్నారు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి తమ తల్లి పేరు మీద ఉన్న సర్వే నంబరు 165లో ఉన్న ఒక ఎకరా భూమిని విరాసత్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజులకే వెంకటయ్య భార్య మరణించిన కేసులో ఆయనకు మూడు నెలల జైలుశిక్ష పడింది. వెంకటయ్య జైలులో ఉన్న సమయంలోనే ఆయన అన్న శంకరయ్య, తహసీల్దార్ కార్యాలయంలోని సిబ్బంది, సంబంధిత అధికారులతో కుమ్మక్కై మొత్తం తన పేరిట పట్టా చేయించుకున్నాడు. జైలును శిక్ష అనుభవించి వచ్చిన వెంకటయ్య ఆర్థిక పరిస్థితుల కారణంగా కొన్నేళ్లు వలస వెళ్లాడు. ఏడాది క్రితం భూమి విషయమై అన్న శంకరయ్యను అడగగా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకొని తిరగడంతో అనుమానం వచ్చిన వెంకటయ్య గత నెల 24న ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. కలెక్టర్ స్థానిక తహసీల్దార్‌కు శంకరయ్య ఫిర్యాదును పరిశీలించి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. న్యాయం చేయాలి.. నేను నా భార్య మృతి కేసులో మూడు నెలలు జైలు జీవితం అనుభవించే సమయంలో రెవెన్యూ అధికారులు లంచం తీసుకొని మా అన్న పేరిట పట్టా చేశారు. అమ్మ చనిపోయిన తర్వాత మా అన్న శంకరయ్యతో కలిసి విరాసత్ కోసం దరఖాస్తు చేసుకున్నాం. పంచనామాలో ఇద్దరు పేర్లు రాసిచ్చాం. ఇద్దరికి భూమి చేయకుండా మా అన్న శంకరయ్య పేరిటే విరాసత్ చేశారు. విచారణ చేసి అధికారులపై చర్యలు తీసుకోవాలి. విరాసత్ ప్రకారం నా భాగం నాకు పట్టా చేయాలి. -
అక్రమంగా ఎంజాయ్
భూరాబందులకు కొందరు అధికారులు అనుభవ ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేశారు. ఆ తరువాత అమ్మి సొమ్ముచేసుకున్నారు. వాటిని రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. కొన్నాళ్లకు వాటికి పట్టాలు ఇచ్చారు. రేణిగుంట మండల పరిధిలో రెవెన్యూ అధికారులు, టీడీపీ నాయకులు కుమ్మక్కై చేసిన అక్రమాలు ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నాయి. జిల్లా కలెక్టర్ నియమించిన కమిటీ విచారణలో వాస్తవాలు బయటపడుతున్నాయి. మొత్తం 70 ఎకరాల ప్రభుత్వ భూమిని 3,470 ప్లాట్లుగా విక్రయించినట్లు తెలిసింది. వాటన్నింటికీ ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్లు కూడా జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. సాక్షి, తిరుపతి: గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై చేపట్టిన భూకుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. రేణిగుంట మండల పరిధిలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్త బుధవారం విచారణ కమిటీని నియమించారు. ఏడుగురు తహశీల్దార్లు, మరో ఏడుగురు సర్వేయర్లు ఉన్న ఈ కమిటీ విచారణను వేగవంతంచేసింది. రేణిగుంట మండల పరిధిలో కరకంబాడి పంచాయతీ తారకరామ నగర్లో గురువారం పర్యటించింది. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ల ప్రకారం ఒక్కొక్కరిని విచారించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల కాలంలో జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలు, వంక, మేత, డీకేటీ భూములు ఆక్రమణకు గురైన విషయం తెలిసిందే. టీడీపీ నేతలు ప్రభుత్వ, పోరంబోకు భూములను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారు. సందట్లో సడేమియా అంటూ.. కొందరు రెవెన్యూ అధికారులు సైతం ప్రభుత్వ, పోరంబోకు భూములను ఇతరులకు కట్టబెట్టి జేబులు నింపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భూ ఆక్రమణలపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. అంగట్లో ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్లు గత ప్రభుత్వంలో అధికార పార్టీకి చెందిన నాయకులు, మరికొందరు అధికారులు అక్రమాలను సక్రమం చేసుకునేందుకు ఆక్రమిత భూముల్లో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు. అయితే అవన్నీ ఆక్రమించుకున్న భూములే అని ఎన్నికలకు ముందే పత్రికల్లో కథనాలు రావడంతో కొనుగోలు చేసిన వారు నాయకులు, అధికారులను నిలదీశారు. తాము నిర్మించుకున్న నివాస స్థలాలు ఆక్రమించుకున్నవని పత్రికల్లో వస్తున్నాయని, ఇచ్చిన డబ్బులు వెనక్కు ఇచ్చేయమని గట్టిగా అడగడం మొదలు పెట్టారు. డబ్బులు ఇవ్వకపోతే తమ స్థలాలకు పట్టాలు ఇప్పించమని, లేదంటే కేసులు పెడుతామని హెచ్చరించారు. ఓ వైపు కొనుగోలు చేసిన వారు.. మరో వైపు పత్రికలో వస్తున్న కథనాలతో ఇటు టీడీపీ నేతలకు, అటు అధికారులకు దిక్కు తోచడం లేదు. ఎన్నికలు సమీపించే ముందు ఇబ్బందులు ఎదురవుతా యని గ్రహించిన నాయకులు, అధికారులు తాత్కాలిక షెడ్లు నిర్మించుకున్న వాటన్నింటికీ ‘ఎంజాయ్మెంట్’ సర్టిఫికెట్లు ఇచ్చేశారు. ప్లాటుకు రూ.2 లక్షలు, ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్‌కు రూ.50వేల చొప్పున వసూలు చేసినట్లు బాధితులు కమిటీ సభ్యులకు వివరించినట్లు తెలిసింది. ఈ లెక్కన రేణిగుంట పరిధిలో మొత్తం 70 ఎకరాల ప్రభుత్వ భూమిని రూ.86.75 కోట్లకు అమ్మి సొమ్ము చేసుకున్నట్లు అధికారులు అంచనా వేసినట్లు విశ్వసనీయ సమాచారం. అక్కడితో ఆగని అక్రమార్కులు కొన్ని ప్లాట్లను రెండో వ్యక్తికి విక్రయించారు. అతనికి ఏకంగా రిజిస్ట్రేషన్ కూడా చేసి అప్పజెప్పారు. ఆ తరువాత పట్టా కూడా ఇచ్చి పక్కా పట్టా అని నమ్మించడం గమనార్హం. ఈ విషయంపై కొందరు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే టీడీపీ పెద్దల ఒత్తిడి మేరకు అక్రమార్కులపై ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ నారాయణ భరత్ గుప్త భూ అక్రమాలపై ఫిర్యాదులు అందడంతో వెంటనే 14 మందితో కూడిన కమిటీని వేసి విచారణ మొదలు పెట్టారు. ఈ విచారణలో నాయకులు, రెవెన్యూ అధికారుల బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నట్లు తెలిసింది. కమిటీ సభ్యులు విచారణ పూర్తయ్యాక కలెక్టర్‌కు నివేదిక సమర్పించనున్నారు. -
ఇచ్చట ‘మీసేవ’ తిరస్కరించబడును!
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడుకు చెందిన రైతు శివప్రసాద్‌రెడ్డికి వారసత్వంగా వచ్చిన భూమి ఉంది. ఒక సర్వే నంబరు వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాకపోవడంతో మీసేవలో దరఖాస్తు చేసుకున్నాడు. ముడుపులు ఇవ్వకపోవడంతో ఆయన దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. వైఎస్సార్ జిల్లా పుల్లంపేట మండలానికి చెందిన శంకర్‌రెడ్డి (బాధితుడి విజ్ఞపి మేరకు పేరు మార్చాం) మ్యుటేషన్ కోసం రెవెన్యూ రికార్డుల్లో తన పేరు నమోదు చేయాలంటూ నిర్దిష్ట రుసుము చెల్లించి అన్ని ఆధారాల జిరాక్స్ కాపీలతో ‘మీసేవ’ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఎలాంటి కారణాలు చూపకుండానే ఆయన దరఖాస్తును తిరస్కరించారు. సంబంధిత అధికారిని కలవగా ముడుపుల కింద కొంత సొమ్ము తీసుకుని మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంత చేసినా ఇప్పటికీ ఆయన పేరుతో మ్యుటేషన్ కాలేదు. సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లుగా తిరస్కరించిన ‘మీసేవ’ దరఖాస్తుల సంఖ్య 71 లక్షలకుపైమాటే. ఒక్కో దరఖాస్తుకు ప్రజలు సగటున రూ.300 చొప్పున చెల్లించినట్లు లెక్క వేసినా 71 లక్షల అర్జీలను తిరస్కరించడం ద్వారా సర్కారు వసూలు చేసిన సొమ్ము రూ.213 కోట్లకు పైమాటే! ఇక బాధితులు నష్టపోయింది దీనికంటే ఎక్కువే ఉంటుంది. పౌరులకు పనులు జరగని మీసేవ అర్జీలతో ఎవరికి ఉపయోగం? అనే ప్రశ్నలు వస్తున్నాయి. మీసేవలో దరఖాస్తు చేసినా మళ్లీ సంబంధిత కార్యాలయాలకు వెళ్లి ముడుపులు చెల్లిస్తే తప్ప పరిష్కారం కావడం లేదు. రెవెన్యూ, పురపాలక శాఖల్లో ఇలాంటి పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. దీంతో ‘ఎందుకొచ్చిన మీసేవ..?’ అంటూ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనం పారదర్శకతకు మారుపేరంటూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకునే ‘మీసేవ’ తిరస్కరణ సేవగా మారింది. భూముల మ్యుటేషన్, కొలతలు, అదనపు సర్వే నంబరు చేర్పు, వ్యవసాయ ఆదాయ ధ్రువీకరణ పత్రం, భవన నిర్మాణ ప్లాన్ అప్రూవల్ తదితరాల కోసం ‘మీసేవ’ ద్వారా అందే దరఖాస్తులను అధికారులు పెద్ద ఎత్తున తిరస్కరిస్తూ చెత్తబుట్టలో పడేస్తున్నారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మీసేవ తిరస్కరణ అర్జీలు 71 లక్షలు దాటిపోవడం సర్కారు నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. గడువుదాకా పట్టించుకోని సిబ్బంది.. ఏ పని కావాలన్నా లంచాలు చెల్లించాల్సిన పనిలేదని, నిర్దిష్ట రుసుము కట్టి మీసేవ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుంటే చాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలు ఉత్త డొల్ల అనేందుకు ప్రభుత్వ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్న పౌరులే నిదర్శనం. ఏ శాఖల కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా సమస్యలు తీరలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీసేవలో దరఖాస్తు ఇచ్చినా పట్టించుకునే దిక్కులేక గ్రీవెన్స్‌సెల్‌లో అర్జీలు ఇస్తున్నారు. మీసేవ ద్వారా అందే అర్జీలను చాలామంది సిబ్బంది నిర్దిష్ట గడువు వరకు పట్టించుకోకుండా తీరా రెండు మూడు రోజుల ముందు చిన్న చిన్న కారణాలతో తిరస్కరిస్తున్నారు. కొంతమంది సిబ్బంది కనీసం కారణం కూడా చూపకుండానే పక్కన పడేస్తున్నారు. పక్కవారికి పంపితే పరిష్కారమైనట్లా? కొందరు సిబ్బంది తమ వద్దకు వచ్చే అర్జీలను ఇతర ఉద్యోగుల వద్దకు పంపుతూ పరిష్కారమైనట్లు జాబితాలో చేర్చేస్తున్నారు. దీనివల్ల పరిష్కారమైన అర్జీలు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ తంతును చూసి ఉన్నతాధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో వినతులను తిరస్కరించడం దారుణమైతే, ఫైలును పక్క ఉద్యోగికి పంపి పరిష్కారమైనట్లు నమోదు చేయడం మరీ ఘోరమని పేర్కొంటున్నారు. ‘ఈ పరిణామాలు ఏమాత్రం సరికాదు. సరైన కారణాలు చూపకుండా కొందరు, అసలు కారణం పేర్కొనకుండానే మరికొందరు వినతులను తిరస్కరిస్తున్నట్లు నా దృష్టికి కూడా వచ్చింది. నిర్దిష్ట సమయంలో దరఖాస్తు పరిష్కరించకుంటే సంబంధిత ఉద్యోగి పేరు రికార్డుల్లో నమోదవుతుంది. దీని నుంచి తప్పించుకునేందుకు దురుద్దేశపూర్వకంగా తిరస్కరిస్తున్నారని గుర్తించాం. ఇలా జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంది’ అని స్పెషల్ ఛీప్ సెక్రటరీ స్థాయి అధికారి ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. చేతి చమురు వదులుతోంది ‘మీసేవ’ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు రుసుములు, సర్వీసు చార్జీల రూపంలో రూ.వందల్లో చెల్లిస్తున్నారు. అయితే దరఖాస్తుతో పని అయిపోతుం దనుకుంటే పొరపాటే. మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తుకు జత చేసిన పత్రాలు స్పష్టంగా లేవంటూ, జిరాక్స్ కాపీలు ఇవ్వాలని ప్రభుత్వ కార్యాలయాల నుంచి సమాధానం వస్తోంది. దీనికి మరికొంత సొమ్ము చెల్లించాలి. ఇలా మీసేవలో దరఖాస్తు చేసుకుంటే ఒక్కో అర్జీకి సుమారు రూ. 400 దాకా చేతి చమురు వదులుతోంది. ఇవీ ‘మీసేవా’ గణాంకాలు... - 2014 జూన్ నుంచి ఇప్పటివరకు రెవెన్యూ వెబ్సైట్ వెబ్‌ల్యాండ్‌లో అదనపు సర్వే నంబరు చేర్పు కోసం 2,41,447 వినతులు రాగా 1,57,365 అర్జీలను తిరస్కరించారు. 82,557 దరఖాస్తులను మాత్రమే అధికారులు ఆమోదించారు. - వ్యవసాయ ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం 69,274 మంది దరఖాస్తు చేసుకోగా 50,913 అర్జీలను ఆమోదించారు. 17,576 వినతులను తిరస్కరించి చెత్తబుట్టలో పడేశారు. - 500 చదరపు అడుగులలోపు ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో కట్టడాల క్రమబద్ధీకరణ కోసం 32,056 అర్జీలు రాగా 3,562 వినతులను మాత్రమే ఆమోదించారు. 20361 దరఖాస్తులను తిరస్కరించారు. - ఆక్రమిత ప్రభుత్వ భూమిలో కట్టడాల క్రమబద్ధీకరణ కోసం 73,783 వినతులు రాగా 3401 అర్జీలు మాత్రమే ఆమోదం పొందాయి. 70,382 దరఖాస్తులను తిరస్కరించారు. - ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం 8,60,440 దరఖాస్తులు రాగా 6,20,070 అర్జీలను ఆమోదించారు. 2,25,711 వినతులు తిరస్కరించారు. - కంప్యూటరైజ్డ్ అడంగల్‌లో కరెక్షన్ కోసం 40,74,721 వినతులు రాగా 26,97,255 మాత్రమే ఆమోదం పొందాయి. మిగిలిన 13,37,732 అర్జీలు చెత్తబుట్టపాలయ్యాయి. -
రైతుల బాధను అర్థం చేసుకోండి
మెదక్ రూరల్ : ప్రతీ రెవెన్యూ అధికారి రైతుల స్థానంలో ఉండి ఆలోచించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. బుధవారం మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలోని ఆడిటోరియంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను తరచూ కార్యాలయాల చుట్టూ అధికారులు తిప్పుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. ఎంతో మంది రైతుల భూములను ఇతరుల పేర్ల మీదికి మారుస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అధికారుల పేర్ల మీద ఉన్న భూములను సైతం ఇతరుల పేర్ల మీదికి రాస్తే ఊరుకుంటారా అని సూటిగా ప్రశ్నించారు. రికార్డులపై అధికారులకు కనీస అవగాహన లేదన్నారు. ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించడమే అధికారుల కనీస బాధ్యత అనే విషయాన్ని అధికారులు విస్మరిస్తున్నారన్నారు. ప్రతీ అధికారి ప్రజలతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నారు. కొన్ని మండలాల్లో వీఆర్వోలపై తహసీల్దార్ల పర్యవేక్షణ కొరవడిందన్నారు. వీఆర్వోల పనితీరును ఎప్పటికప్పుడు తహసీల్దార్లు పర్యవేక్షించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. రెండేళ్ల నుండి పౌతి కేసులు సైతం పరిష్కరించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అంతకుముందు జాయింట్ కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ రెవెన్యూ అధికారుల పనితీరు జిల్లాలో సంతృప్తికరంగా లేదని, అధికారులు తమ పని తీరును మార్చుకొని ప్రజలకు నిస్వార్థమైన సేవలను అందించాలన్నారు. జిల్లాలో ఉన్న వీఆర్వోల్లో కొద్ది మంది మాత్రమే విజయవంతమయ్యారని తెలిపారు. ప్రతీ సమస్యను చిత్తశుద్ధితో అధ్యయనం చేసుకొని పరిష్కారం దిశగా కృషి చేయాలన్నారు. రైతుల భూములకు సంబంధించిన ప్రొసీడింగ్‌పై తహసీల్దార్లు సంతకం చేసేటప్పుడు ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ప్రతీ మండలంలో ఉన్న ఫారెస్ట్, రెవెన్యూ భూములకు సంబంధించిన జాయింట్ సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసినా కొన్ని మండలాల్లో ఇంకా పూర్తి చేయలేదని, వాటిని సత్వరమే పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు సాయిరాం, అరుణారెడ్డి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ గంగయ్యతోపాటు తహసీల్దార్లు, ఆర్ఐలు, వీర్వోలు, సర్వేయర్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. సీడ్ హబ్‌గా మారనున్న రాష్ట్రం కౌడిపల్లి(నర్సాపూర్): మన రాష్ట్రం త్వరలో సీడ్ హబ్‌గా మారనుందని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే సాగులో మరింత అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. బుధవారం కౌడిపల్లి మండలం తునికి వద్ద ఉన్న డాక్టర్ డి రామానాయుడు విజ్ఞానజ్యోతి గ్రామీణాభివృద్ధి విద్యా సంస్థ వ్యవసాయ కళాశాల 15వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ధర్మారెడ్డి, ఏడీఏ పరశురాంనాయక్, విజ్ఞానజ్యోతి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అర్జునరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంస్కరణలతో రాష్ట్రంలో వ్యవసాయం అభివృద్ధి జరుగుతోందన్నారు. త్వరలో రాష్ట్రం సీడ్ హబ్‌గా మారుతుందన్నారు. ఇజ్రాయిల్ వ్యవసాయంలో ఎన్నో అద్భుతాలు చేస్తోందన్నారు. మన దేశంలో అన్ని రకాల నేలలు, వాతావరణం ఉన్నాయని తెలిపారు. రసాయన ఎరువుల వాడకంతో భూమి నిస్సారంగా మారిందన్నారు. ఐటీఐ, పాల్టెక్నిక్ కన్నా వ్యవసాయ విద్యలో మంచి భవిష్యత్తు ఉందన్నారు. విజ్ఞానజ్యోతి విద్యార్థులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో రాణించాలని అన్నారు. జిల్లాలో వ్యవసాయ అభివృద్ధి : డీఏఓ పరశురాంనాయక్ జిల్లాతోపాటు రాష్ట్రంలో వ్యవసాయానికి మంచి రోజులు ఉన్నాయని, విద్యార్థులు ప్రభుత్వం ఉద్యోగం కంటే వ్యవసాయంలో మంచిగా రాణించాలని డీఏఓ పరశురాంనాయక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ విజ్ఞానజ్యోతి విద్యార్థులు అన్ని రంగాలలో ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. ఇక్కడ చదివిన కౌడిపల్లి ఏఈఓ రాజశేఖర్‌గౌడ్ జిల్లాస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్నారని గుర్తుచేశారు. అనంతరం విద్యార్థులు సాగు చేసిన పంటలకు వచ్చిన లాభాలను ఒక్కో విద్యార్థికి రూ. 635 చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజ్ఞానజ్యోతి ప్రతినిధులు డీఎన్‌రావు, రాజశేఖర్, అచ్యుతరాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘రెవెన్యూ శాఖను ఏ శాఖలోనూ విలీనం చేయరు’
హైదరాబాద్: రెవెన్యూ శాఖను ఏ శాఖలోనూ విలీనం చేయరని, ఆ విషయం ప్రభుత్వం ఎక్కడా కూడా చెప్పలేదని టీజీటీఏ వ్యవస్థాపక అధ్యక్షులు లచ్చిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం లచ్చిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ‘ రెవెన్యూ శాఖలో కొత్త సంస్కరణలు వస్తున్నాయి. మనం స్వాగతించాలి. మనం ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేసి ముందుకు వెళ్దాం. రెవెన్యూ ఉద్యోగులందరికోసం కలిసి పని చేద్దాం. రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొత్త చట్టం తెస్తామని చెప్పలేదు. ఉద్యమంలో కేసీఆర్‌తో మనం కూడా పని చేశాం. మన బాధలన్నీ కేసీఆర్‌కు తెలుసు. రెవెన్యూ ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకున్నా నేను ముందు ఉంటాను. కొత్త చట్టం వచ్చినా మనమే పనిచేస్తాం. ఇప్పటివరకు రెవెన్యూ శాఖను ఇతర శాఖలో కలుపుతామనలేదు. కొత్త చట్టాలు వస్తే స్వాగతించాలి. కొత్త చట్టాలు వస్తే ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గదు. రెవెన్యూ శాఖపై వస్తున్న అపోహలు ఖండించాలి. ప్రభుత్వం పెద్దలు అన్నట్లు మనం కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజలకు మేలు చెయ్యాలి. ప్రతి గ్రామంలో భూ సమస్యలు లేకుండా చెయ్యాలి. ఒకవేళ సమస్యలు ఉంటే బోర్డుపై రాయాలి. రెవెన్యూ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. పై అధికారుల ఒత్తిడికి మనం బలికావద్ద’ని వ్యాఖ్యానించారు. రెవెన్యూ శాఖ రద్దు తప్పుడు ప్రచారం: ఈశ్వర్(వీఆర్ఎ సంఘం అధ్యక్షులు) నిన్న తాము ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిశామని, ఎక్కడ కూడా శాఖ మార్పు జరగడం లేదని ఆయన చెప్పినట్లు ఈశ్వర్ తెలిపారు. కొత్త చట్టం అనేది ప్రణాళికల్లో మార్పు మాత్రమేనని, కొంత కఠినంగా ఉంటుందని చెప్పారు. కొన్ని సంఘాలు స్వలాభం కోసం రెవెన్యూ శాఖను రద్దు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మరికొంతమంది రెవెన్యూ ఉద్యోగులు పదవులకు ఆశపడి ఇతర ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు మంత్రులను ఎలా కలుస్తారని ప్రశ్నించారు. కావాలనే ఇలా ఆరోపణలు చేస్తున్నారు..మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నట్లు తెలిపారు. తమకు గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్నారని, ఉద్యోగం రెగ్యులర్ చేస్తే మరింత కష్టపడి చేస్తామని తెలిపారు. కొత్త చట్టం వస్తే స్వాగతిస్తాం: గౌతమ్(టీజీటీఏ అధ్యక్షులు) కొత్త చట్టం వస్తే స్వాగతిస్తామని, కొత్త చట్టంలో కూడా మనం పని చెయ్యాలని గౌతమ్ వ్యాఖ్యానించారు. రెవెన్యూ శాఖ రద్దు వార్తలను ఖండించాలని కోరారు. ప్రజలకు మనం జవాబుదారీతనంగా పని చేయాలని సూచించారు. కొత్త చట్టంలో మనం కీలక పాత్ర పోషించి ముందుకు వెళదామని కోరారు. -
మళ్లీ తెరపైకి నయీం అనుచరుల ఆగడాలు
సాక్షి, యాదాద్రి : గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరుల ఆగడాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. వీరిని అదుపుచేయలేక పోతున్నారని భువనగిరిజోన్ డీసీపీ ఈ.రామచంద్రారెడ్డి, భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ వెంకన్నపై రాచకొండ సీపీ మహేష్ భగవత్ శనివారం సాయంత్రం హుటాహుటిన చర్యలు తీసుకున్నారు. కొందరు ఇటీవల సీఎం కార్యాలయంలో నయీమ్ అనుచరుల అగడాలు, పోలీ స్ల వైఖరిపై ఫిర్యాదు చేయడంతో మరోసారి అధికార యంత్రాంగం శాఖపరమైన చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా డీసీపీ రామచంద్రారెడ్డిని రాచకొండ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేశారు. యూసుఫ్‌గూడ పీఎంటీ, పీఈటీ ఫస్ట్ బెటాలియన్ చీఫ్ సూపరింటెండెంట్‌కు రిపోర్టు చేసి పోలీస్ రిక్రూట్మెంట్ పూర్త య్యే వరకు పనిచేయాలని ఆదేశాలు జారీచేయగా, భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ వెంకన్నగౌడ్‌ను రాచకొండ సీపీ కార్యాలయానికి అటాచ్ చేసి ఆయన స్థానంలో భువనగిరి ట్రాíఫిక్–2 ఇన్స్పెక్టర్ సురేందర్‌కు బాధ్యతలు అప్పగించారు. భువనగిరి శివారులో గల సర్వే నంబర్ 730లో 5.20 ఎకరాల భూమిని నయీమ్ అనుచరులైన పాశం శ్రీను, ఎండీ నాసర్‌లు భువనగిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇటీవల రిజిష్ట్రేషన్ చేయించారని సీపీకి అందిన ఫిర్యాదుపై విచారణ జరిపారు. సిట్ ఆదేశాలతో పోలీస్‌లపై వెంటనే చర్యలు తీసుకున్నారు. నయీమ్ అనుచరులపై భువగగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీస్ అధికారి అండదండలతోనే నయీ మ్ అనుచరుల ఆగడాలు మళ్లీ మొదలయ్యాయన్న ఫిర్యాదుతోనే సీపీ సీరియస్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. భువనగిరి కేంద్రంగా నేర సామ్రాజ్యాన్ని ప్రారంభించిన నయీం ప్రస్థానం 2016 ఆగస్టు 8న మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌తో ముగిసింది. ఎన్కౌంటర్ అనంతరం అతని ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగుచూశాయి. నేర సామ్రాజ్యంలో ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు ఇలా అన్ని వర్గాల ప్రాతినిధ్యం బయటపడింది. ప్రధానంగా భువనగిరి కేంద్రంగా నయీం, అతని అనుచరులు సాగించిన ఆకృత్యాలు, బలవంతపు వసూళ్లు, వ్యవసాయ భూములు, ఇళ్ల ప్లాట్ల బాధితులు పోలీసులు ముందుకు వచ్చారు. వారు ఇచ్చిన ఫిర్యాదులతో అప్పట్లో నయీమ్ అనుచరులపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించారు. సిట్ ఏర్పాటు నయీంఎన్కౌంటర్తో వెలుగులోకి వచ్చిన వందలాది మంది బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం సిట్ దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాపితంగా 230కిపైగా సిట్ కేసులు నమోదు చేసింది. జిల్లాలో భువనగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో 121, రూరల్ పోలీస్‌స్టేషన్‌లో 25, యాదగిరిగుట్టలో 21, వలిగొండలో 4, చౌటుప్పల్‌లో 1 కేసు నమోదైంది. భువనగిరి పట్టణంలో సుమారు 50 బలవంతపు వసూళ్ల కేసులు కాగా, మిగతావన్నీ భూ కబ్జాల కేసులు నమెదయ్యాయి. టీచర్స్ కాలనీలో ప్లాట్ల కేసు భువనగిరి టీచర్స్ కాలనీ సమీపంలోని శ్రీ లక్ష్మినర్సింహస్వామి నగర్ ప్లాట్ల అక్రమణ కేసులో నయీం అనుచరులు, కుటుంబ సభ్యులపై 2016లో కేసు నమోదైంది. 1994లో భువనగిరి పట్టణ శివారు, బొమ్మాయిపల్లి శివారులోని సర్వేనంబర్లు 722, 723, 724, 726, 727, 728, 729, 730, 731, 732, 733లలో మూడు దశల్లో వెంచర్లు చేసి ప్లాట్లు విక్రయించారు. 154 ఎకరాల భూమిలో 1756 ఓపెన్ ప్లాట్ల వెంచర్లో భువనగిరి, హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు చెందిన వందలాది మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. 2003– 2004 నుంచి ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులకు తెలియకుండా నయీం, అతని అనుచరులు భూ యజమాని పట్టాదారు పాస్‌పుస్తకాలతో తమకు సంబంధించిన వ్యక్తుల పేరుమీద డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అనంతరం మరికొందరికి విక్రయించారు. ఈ విషయంలో 2010లో బాధితులు పెద్ద ఎత్తున భువనగిరిలో, హైదరాబాద్‌లో ఆందోళన చేశారు. కానీ నయీం అనుచరులు బెదిరించడంతో పాటు అధికారులనుంచి సరైన సహకారం లభించకపోవడంతో ఈ విషయం కాస్త అటకెక్కింది. నయీం ఎన్కౌంటర్ జరగడంతో బాధితులంతా తమ ప్లాట్లను తమకు ఇప్పించాలని ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. కేసు భువనగిరి ఆర్డీఓ కార్యాలయంలో పెండింగ్‌లో ఉంది. పోలీస్‌లు కుమ్మక్కు అయ్యారా? నయీమ్ అనుచరులతో పోలీస్‌లు కుమ్మక్కు అయయ్యారన్న ఆరోపణలపైనే సీపీ తీవ్రమైన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రిటైర్మెంట్కు చేరువలో ఉన్న డీసీపీ రామచంద్రారెడ్డి జిల్లాలో విధుల్లో చేరిన నాటినుంచి రియల్ఎస్టేట్ సెటిల్మెంట్లు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తనకింది ఉద్యోగులు కొందరితో కలిసి ఇటీవల నయీమ్ అనుచరులకు భూ సెటిల్మెంట్లకు సహకరిస్తున్నాడన్న ఫిర్యాదులు అందాయి. భువనగిరి శివారులోగల సర్వేనంబర్ 730లో ఎ5.20గుంటల భూమి అక్రమంగా ఇటీవల నయిమ్ అనుచరులు పాశం శ్రీను, అబ్దుల్ నాసర్‌లు కలిసి భువనగిరి, బీబీనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నయీమ్‌కు సంబంధించిన బినామీ ఆస్తులను రిజిస్ట్రేషన్‌కు సిద్ధం చేసినట్లు సమాచారం. దీంతో బాధితులు సీపీని కలిసి తమను పోలీస్‌లు పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదు చేయడంతో ఆయన సిట్ విచారణకు ఆదేశించారు. దీంతో శనివారం సిట్ అధికారులు భువనగిరి రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. హార్డ్‌డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు జిల్లా రిజిస్ట్రార్‌తోపాటు సబ్ రిజిస్ట్రార్లను విచారించారు. పాశం శ్రీను, అబ్దుల్నాసర్లతోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. -
రెండు రోజుల్లో ఆర్డీఓగా ప్రమోషన్.. కానీ ఇంతలోనే..
సాక్షి, కావలి: కావలి టీడీపీ నాయకులు బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్రల అడ్డమైన దోపిడీకి ఉద్యోగాన్ని పోగొట్టుకున్న దగదర్తి తహసీల్దార్ డి.జయప్రకాష్ కేవలం రెండు రోజుల్లో ఆర్డీఓగా పదోన్నత పొందాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఇందుకు సంబంధించిన ఫైలు చాలా కాలంగా ఉంది. అయితే ప్రాధాన్యతల వారీగా రాష్ట్ర రెవెన్యూశాఖ కార్యదర్శిగా ఉండే సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ ఫైలుపై సంతకాలు చేయాల్సి ఉంది. ఇంతలో టీడీపీ నాయకుల భూ దందాలో చిక్కుకుని బలైపోయారు. అసలు భూములు కథ ఏమిటంటే.. దగదర్తి మండలంలో ప్రభుత్వ భూములు వేల ఎకరాలు ఉండటం, ఆ ప్రాంతానికి చెందిన వారు ఇతర ప్రాంతాలకు జీవనోపాధి కోసం వలసలు పోవడం, సంపన్నులు తమ ఆస్తులు పెంచుకునే క్రమంలో మండలంలోని భూములపై కన్ను పడటం, వలస వెళ్లిపోయిన మండలానికి చెందిన ప్రజలు ఆర్థికంగా స్థిరత్వం పొందడంతో వారి గ్రామాల్లో ని భూములపై ఆసక్తి కనపరిచారు. అలాగే మండలంలో విమానాశ్రయం నిర్మించడానికి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవడం, పరిశ్రమలు స్థాపనకు మండలంలోని భూములను గుర్తించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇవన్నీ కూడా జరిగేసరికి 2014 సంవత్సరం వచ్చింది. అప్పుడే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, కావలి నియోజకవర్గంలో అధికార టీడీపీ నాయకులుగా బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్రలు అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో తమ అదుపులోకి తెచ్చుకున్నారు. బీద సోదరులు తమ ఆక్వా సామ్రాజ్యాన్ని అల్లూరు మండలంలోని సముద్రతీరం వెంబడి వందల ఎకరాల ప్రభుత్వ భూముల్లో విస్తరించుకున్నారు. అక్కడికి ఆగక విస్తరణను దగదర్తి మండలంలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములు వరకు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఒక పక్క విమానాశ్రయ భూములు, మరో పక్క పరిశ్రమలకు భూములు అంటూ టీడీపీ ప్రభుత్వం దగదర్తి మండలంలో భూసేకరణకు తెరతీసింది. ఇవన్నీ ముందస్తుగానే తెలిసిన బీద సోదరులు దగదర్తి తహసీల్దార్‌గా తమ కనుసన్నల్లో ఉన్న వారినే నియమించుకోసాగారు. విలేజ్ అసిస్టెంట్ నుంచి.. రెవెన్యూ శాఖలో విలేజ్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరిన డి.జయ ప్రకాష్, ప్రమోషన్లతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) అయిన, ప్రస్తుతం తాహసీల్దార్ వరకు చేరుకున్నారు. మరో రెండు రోజుల్లో ఆర్డీఓగా ప్రమోషన్ ఉత్తర్వులను అందుకోవాల్సి ఉండగా, టీడీపీ నాయకులతో కలిసి చేసిన భూదందాల పాపంలో పాలు పంచుకుని వాటాలు మింగడంతో సస్పెండ్ ఉత్తర్వులు అందుకున్నారు. 2019 ఏప్రిల్ 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్న డి.జయప్రకాప్‌ను, ఎన్నికల బదిలీల్లో జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్లను బదిలీ చేసినా ఆయన్ను చేయలేదు. ఉద్యోగ విరమణకు దగ్గర్లో ఉండటంతో డి.జయప్రకాస్ సేవలు దగదర్తి తాహసీల్దార్‌గానే అందిస్తారని టీడీపీ నాయకులు బీద మస్తన్‌రావు, బీద రవిచంద్ర చేసిన ఒత్తిళ్లకు ఉన్నత స్థాయి అధికారులు తలొగ్గి ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎన్నికల సంఘం ఆ పప్పులు ఉడకవని హెచ్చరించడంతో డి.జయప్రకాష్‌ను కోనేరు రంగారావు కమిటీలో విధులు నిర్వర్తించేలా ఆదేశాలు జారీ చేశారు. ఇంతలో కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు ఆదేశాలతో కావలి సబ్ కలెక్టర్ చామకూరు శ్రీధర్ కొన్ని భూదందా ఫిర్యాదులపై చేసిన విచారణలో దగదర్తి తాహసీల్దార్ హోదాలో డి.జయప్రకాష్ చేసిన అక్రమాలు వెలుగులోకి రావడంతో సస్పెండ్ అయ్యారు. ఆర్డీఓ హోదాలో ఉద్యోగ విరమణ చేయాల్సిన డి.జయప్రకాష్, టీడీపీ నాయకులు అక్రమాల దందాల్లో భాగస్వామ్యం కావడంతో ఆ ఉత్తర్వులు అందుకోకుండానే తాహసీల్దార్‌గానే పదవీ విరమణ చేయనున్నారు. ఇది ఇలా ఉండగా తమ అక్రమాలకు తాహసీల్దార్ హోదాలో ఉన్న డి.జయప్రకాష్‌ను అన్ని రకాలుగా వాడుకున్న టీడీపీ నాయకులు బీద సోదరులు కనీసం సస్పెండ్ ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఆయన్ను పలకరించలేదు. దీంతో ఆయన పలువురి వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించి క్షోభకు గురి అవుతాన్నట్లు సమాచారం. -
ఏసీబీ ఉచ్చు.. సొమ్ములతోనే చిచ్చు
వరంగల్‌లోని హన్మకొండలో సర్వశిక్షాభియాన్ ఈఈ రవీందర్రావు ఫర్నిచర్ కాంట్రాక్టర్ కోసం బాధితుడు వన్నాల కన్నా నుంచి రూ.3 లక్షలు డిమాండ్ చేశారు. బాధితులు ఏసీబీని ఆశ్రయించి 2018, ఫిబ్రవరి 26న వల వేయించి పట్టించారు. అయితే ఇందుకోసం కన్నా ఇచ్చిన సొమ్ము విషయం ఏసీబీ అధికారులను అడిగితే వారు పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు. ఆరు నెలలు దాటిపోతున్నా తమకు బడ్జెట్ రాలేదని, తమ ఉన్నతాధికారులను కలవాలని సలహాలు ఇచ్చి పంపేస్తున్నారు. ఇది ఒక తాజా ఉదాహరణ మాత్రమే. ఇలాంటి బాధితుల చిట్టా చాలానే ఉంది. సాక్షి, హైదరాబాద్: అవినీతికి పాల్పడే అధికారుల భరతం పట్టేందుకు తమతో కలసి రావాలని ఏసీబీ పిలుపునిస్తోంది. అక్రమార్కులను పట్టించిన బాధితులు వినియోగించే సొమ్ములు తిరిగి చెల్లించే విషయంలో ఎగనామం పెడుతోంది. ఉచితంగా అందాల్సిన సేవలకు లంచాలు ఇవ్వలేక కొంతమంది బాధితులు పౌరవిజ్ఞతతో ఏసీబీకి ఫిర్యాదు చేస్తుంటారు.లంచగొండులను వల వేసే సమయంలో ఎక్కడో ఒక దగ్గరి నుంచి డబ్బులు అప్పుతెచ్చి ఏసీబీ ద్వారా పట్టిస్తుంటారు. ఇలా ట్రాప్ వేసిన కేసుల్లో బాధితులిచ్చిన మొత్తాన్ని కొద్ది రోజుల్లోపల కోర్టు వ్యవహారాలను పరిష్కరింపజేసుకొని బాధితులకు వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అవినీతి నిరోధకశాఖలో ఈ ప్రక్రియ సజావుగా సాగక ఏళ్ల తరబడిగా బాధితులు తమ డబ్బు కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నారు. లంచంకోసం వెచ్చించిన మొత్తాలు వారి కుటుంబాల్లో చిచ్చురగిలిస్తోంది. 10 రోజుల్లో డిపాజిట్లు రావాల్సి ఉన్నా.. వాస్తవానికి ఏసీబీ ఇస్తున్న చైతన్యపూరితమైన ప్రకటనలతో బాధితులు వలపన్ని లంచమడిగిన అధికారులను పట్టించేందుకు రూ.5వేల నుంచి రూ.50వేల వరకు అప్పుచేసి ఆ మొత్తాలను ఇస్తున్నారు. ఇలా ఇచ్చిన లంచాన్ని ఏసీబీ పది రోజుల్లో కోర్టు డిపాజిట్ నుంచి విడుదల చేయించి ఫిర్యాదుదారుకు ఆ మొత్తం వచ్చేలా చేయాలి. ఇది జరగకపోవడంతో అవినీతి నియంత్రణ కోసం కృషిచేస్తున్న ఉత్సాహవంతులు నీరుగారిపోతున్నారు. అప్పు తెచ్చిన మొత్తాలకు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వాంగ్మూల లోపమంటున్న ఏసీబీ.. ఇలాంటి కేసుల్లో వలపన్నేందుకు వినియోగించే మొత్తాలను వెనక్కు తేవాలంటే బాధితులు ఇచ్చిన కోర్టు వాంగ్మూలం సరిగ్గా ఉండనికారణంగానే అవి కోర్టులనుంచి విడిపించలేకున్నామని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. దీనితో బాధితులు విభేదిస్తూ తాము సక్రమంగానే స్టేట్మెంట్లు ఇస్తున్నామని అంటున్నారు.ట్రాప్ తర్వాత దర్యాప్తు అధికారులు సరిగ్గా పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం కారణమని న్యాయనిపుణులు చెప్తున్నారు. ఇలా పరస్పర విరుద్ధమైన కారణాల వల్ల చివరికి నష్టపోయేది ఏసీబీని ఆశ్రయించి సహకరించిన బాధితులే కావడం విశేషం.ఏసీబీకి పట్టుబడ్డ అధికారి మాత్రం అరెస్టవ్వడం, రిమాండ్‌కు వెళ్లడం, బెయిల్‌పై బయటకు వచ్చి, వీలుంటే మళ్లీ పోస్టింగ్‌లు కూడా పొంది దర్జాగా ఉంటున్నారు. ఫిర్యాదుదారులే దిక్కుతోచని స్థితిలో చిక్కుకొని కొత్త ఆర్థిక చిక్కుల్లో పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. మరికొంతమంది బాధితుల చిట్టా.. - భూపాలపల్లి జిల్లాలో అసైన్‌ల్యాండ్ పట్టాకోసం వీఆర్వో జాకీర్ హుస్సేన్ (75)నుంచి రూ. 5వేలు లంచం డిమాండ్ చేశారు. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసి పట్టించాడు. ఇది జరిగి ఐదేళ్లు గడిచిపోయింది. రూ.5వేల కోసం తిరిగి తిరిగి రూ.10వేలు ఖర్చైందని బాధితుడు వాపోతున్నాడు. - ఇదే భూపాలపల్లి జిల్లా జంగేడు గ్రామానికి చెందిన రఘునా«థాచారి తన భూమి పట్టాకోసం ఆర్డీఓ ఆఫీసు జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రూ.50వేలు లంచం డిమాండ్ చేశాడు. దీనిపై ఈ ఏడాది ఏప్రిల్ 11న ఈ వలపన్నారు. ఇతడికి ఇప్పటివరకు ట్రాప్ మొత్తం తిరిగి రాలేదు. - మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సై కమలాకర్ చార్జిషీట్ దాఖలుకు ఫిర్యాదు దారుడు శ్రీనివాస్ నుంచి రూ. 10వేలు డిమాండ్ చేసి మార్చి10, 2018న ఏసీబీకి చిక్కారు. ఈ కేసులో మొత్తానిదీ అదే పరిస్థితి. - వరంగల్ నర్సంపేట మండలం ఇంటి ఓనర్ షిప్ సర్టిఫికెట్ కోసం జడల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నుంచి రెవెన్యూ అధికారి మురళి రూ.10వేలు లంచం డిమాండ్ చేశాడు. ఫిబ్రవరిలో ఏసీబీ అధికారులు ట్రాప్ చేసి మురళిని అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు వెంకటేశ్వర్లు డబ్బు తిరిగి చేతికి రాలేదు. -
రెవె‘న్యూ’ తప్పులు..!
ఆదిలాబాద్‌అర్బన్ : భూముల రికార్డుల్లో ఉన్న రెవె‘న్యూ’ తప్పులు బయటపడ్డాయి. కింది స్థాయి అధికారులు చేసిన తప్పుల వల్ల రైతులు ఇబ్బందులు పడడంతో రెవెన్యూ తప్పుల దిద్దుబాటుపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం అమలులో భాగంగా భూ రికార్డుల్లో జరిగిన తప్పులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. క్షేత్ర స్థాయిలోనే ఈ తప్పులు అధికంగా జరగడంతో ఇప్పటికీ కొంతమంది రైతులకు పాసు పుస్తకాలు, రైతుబంధు చెక్కులు అందలేదు. గత నెల రోజుల నుంచి రెవెన్యూ యంత్రాంగం కొత్త పాసు పుస్తకాల్లో దొర్లిన తప్పులను సరి చేస్తోంది. అయినా ఇంకా పూర్తి స్థాయిలో దిద్దుబాటు కాలేదు. రికార్డుల్లో భూముల వివరాలు సరిగ్గా లేక తమకు వచ్చిన పాస్‌బుక్‌ల్లో తప్పులున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇది లా ఉండగా, భూ ప్రక్షాళన తర్వాత కూడా భూ వివరాల్లో తప్పులు ఉండడంతో కొత్త పాసుపుస్తకాలు, చెక్కులు రాని రైతులు చాలామంది ఉన్నారని సమాచారం. పట్టాపాసు పుస్తకాల్లో పేర్లు మొదలుకొని సర్వే నంబర్, ఖాతా నంబర్, చిరునామాలు, ఉన్న భూమి ఎంత..? అనే వివరాలు భూ రికార్డుల్లో సరిగా లేకపోవడంతో పట్టాదార్లకు కొత్త పాసు పుస్తకాలు అందడం లేదని తెలుస్తోంది. రెవెన్యూ తప్పులు ఇలా.. జిల్లాలో మొత్తం 18 మండలాల్లో 509 రెవెన్యూ గ్రామాలున్నాయి. జిల్లాకు మొత్తం 1,07,379 పట్టా పాసుపుస్తకాలు వచ్చాయి. ఇందులో 6,884 పాసు పుస్తకాలు వివిధ కారణాలతో పంపిణీ కాకుండా నిలిచిపోయాయి. ఇలా నిలిచిపోయిన 5,836 పాస్‌పుస్తకాల్లో తప్పులున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 154 పాసుపుస్తకాల్లో సర్వేనంబర్లు తప్పుగా ఉండగా, 893 పాస్‌బుక్‌లు డబుల్ సర్వే నంబర్లతో తప్పుగా ఉన్నాయి. 164 బుక్కుల్లో పట్టాదారులు తప్పుగా ఉండగా, మరో 64 పాసుపుస్తకాల్లోనే తప్పులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మిగతా పాసుపుస్తకాల్లో వివిధ రకాల తప్పులున్నట్లు అధికారులు భావిస్తున్నారు. పంపిణీ కాకుండా నిలిచిపోయిన పాసు పుస్తకాల్లోని తప్పులను సరి చేస్తున్నారు. దీంతోపాటు పంపిణీ చేసిన పాసుపుస్తకాల్లో సైతం తప్పులుంటే అధికారులు వెనక్కి తీసుకుంటున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా దాదాపు 1540 పాసు పుస్తకాలు తహసీల్దార్ల వద్దకు సరి చేసుకునేందుకు వచ్చాయని సమాచారం. తప్పులను సరి చేసి ప్రింటింగ్ పూర్తయి కొత్త పాసు పుస్తకాలు రావాలంటే కొంత సమయం పడుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. ప్రక్షాళన అనంతరం కూడా.. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం కూడా భూ రికార్డుల్లో చాలా తప్పులు ఉన్నాయని, వాటిని సరి చేసేందుకు అధికారులంతా సమష్టిగా కృషి చేయాలని గతంలో హైదరాబాద్‌లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం గతేడాదిలో వంద రోజులపాటు భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం చేపట్టింది. వీఆర్ఏ స్థాయి నుంచి తహసీల్దార్, ఆర్డీవో, జేసీ స్థాయి అధికారుల వరకు పాల్గొని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి భూ సమస్యలు లేకుండా రికార్డులను ప్రక్షాళన చేశారు. ఇందులో వివాదాలు, సమస్యలు గల భూములను పక్కన(పార్ట్–బీలో)పెట్టగా, తప్పులున్న భూ రికార్డులను సరి చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చేశారు. దీంతో ఏ భూములకు సమస్యలున్నాయి.. ఏ భూములకు సమస్యలు లేవో స్పష్టంగా లెక్కేసుకుంది రెవెన్యూ యంత్రాంగం. భూ రికార్డుల ప్రక్షాళనతో కొలిక్కి వచ్చిన సమస్యలు లేని భూముల వివరాలను ప్రభుత్వానికి నివేదించింది. ఆ వివరాల ప్రకారం ఎంత మంది రైతులకు కొత్త పాసు పుస్తకాలు, చెక్కులు ఇయ్యాలో భావించి గత నెలలో కొత్త పాసు పుస్తకాలను ప్రభుత్వం జిల్లాకు పంపించింది. అలా వచ్చిన కొత్త పాసు పుస్తకాల్లో సైతం తప్పులుండడం, భూ రికార్డుల శుద్ధీకరణ తర్వాత కూడా పేర్లు, ఫొటోలు తప్పులుగా ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సరి చేయాలని రైతులు కోరుతున్నారు. -
ఆగని రెవెన్యూ లీలలు
అక్కన్నపేట(హుస్నాబాద్) : రెవెన్యూ లీలలు ఒక్కొకటిగా బయట పడుతున్నాయి. భూ రికార్డుల ప్రక్షాళన శుద్ధీకరణ–నవీకరణ కార్యక్రమంలో వీఆర్వోలు చేతివాటంను ప్రదర్శించారు. గుంట భూమితో సహా రైతుల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేసిన బాగోతంపై రైతులే స్వయంగా ఫిర్యాదులు చేయడం విశేషం. అక్కన్నపేట మండల కేంద్రంతో పాటు పోతారం(జే),రామవరం గ్రామాలకు చెందిన రైతులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేసిన విషయాలు తెలిసిందే. ఇదిలా ఉండగా మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన విట్టల మల్లయ్య అనే రైతు భూమి సర్వే నెంబర్ 5ఏలో 25గుంటల భూమి ఉంది. పట్టా చేయాలని భూ ప్రక్షాళన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్నాడు. రూ.10వేలు ఇస్తే కానీ పట్టా చేయనని వీఆర్వో డిమాండ్ చేయడంతో సదరు రైతు మల్లయ్య రూ.10వేలను సైతం అప్పగించా డు. కానీ నేటికి రైతుకు పట్టా పాసుపుస్తకం ఇవ్వకుండా ఇంకా పైసలు ఇవ్వాలని వీఆర్వో డిమాండ్ చేస్తున్నాడని రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు. ఆందోళనలతో మోమో ఏఐవైఎఫ్ నాయకులు ఇటీవల పోతారం(జే) వీఆర్వోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తు తహసీల్ధార్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తహసీల్ధార్ సదరు వీఆర్వోకు మోమోను జారీ చేశాడు. ఒక్క రోజులో వివరణ ఇవ్వాలని, లేకపోతే కలెక్టర్‌కు సమాచారం అందించనున్నట్లు తెలిసింది.పట్టా పాసుపుస్తకం కావాలంటే డబ్బులు అడిగిండు నాకు 18ఎకరాల 6గుంటల వ్యవసాయ భూమి ఉంది. రైతుబంధు పథకం ద్వారా కొత్త పట్టా పాసుపుస్తకాలు ఇస్తుండ్రు. కానీ నాకు చెక్కు ఇచ్చారు. పట్టా పాసుపుస్తకం కావాలంటే వీఆర్వో రూ.1500 ఇస్తేనే ఇస్తానంటుండ్రు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకవెళ్లిన, ఎవ్వరు పట్టించుకోవడం లేదు. నాకు న్యాయం చేయాలి. ఎండీ ఖాసీం, రామవరం -
రెవెన్యూలో మాయగాళ్లు
అసైన్డ్, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతుంటాయి. కానీ ప్రైవేటు భూములను కూడా ఆక్రమించేసి రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేయించి ఆ భూములు తమవే నంటూ ఏకంగా పంటలు సాగు చేస్తున్నారు. అసలు హక్కుదారులు విషయం తెలుసుకుని వచ్చి అదేంటని అడిగినా ఆ భూములు తమవేనంటూ బుకాయిస్తున్నారు. ఇలా ఒక్క గిద్దలూరు నియోజకవర్గంలోనే వేలాది ఎకరాల భూములు పరులపాలయ్యాయి. ఈ అక్రమాల్లో రెవెన్యూ సిబ్బందిదే కీలకపాత్ర. గిద్దలూరు : తమకు భూమి ఉంది...పాసు పుస్తకం కూడా ఉంది. నిశ్చింతగా ఉండొచ్చనుకుంటే పొరబడినట్టే. గ్రామాల్లో పనిచేస్తున్న వీఆర్ఏలకు పలానా ప్రాంతంలో భూమి బీడుగా ఉందని గుర్తించారంటే ఆ భూమి వారి ఖాతాలోకి చేరుతుంది. రెవెన్యూ శాఖలో కొందరు అధికారులతో జతకట్టి ప్రభుత్వ, ప్రైవేటు భూములను అన్యాక్రాంతం చేసేస్తున్నారు. రికార్డులను సైతం మార్చేసి వారి పేర్లు, వారి బంధువుల పేర్లను ఎక్కించేసుకుంటున్నారు. కొందరు వీఆర్వోలు వారికి సహకరిస్తూ పాత అడంగళ్లు, వన్ బీ రికార్డుల్లోనూ పదేళ్ల ముందు నుంచి అనుభవంలో ఉన్నట్లు నమోదు చేసేస్తున్నారు. ఇలా తమ అనుభవంలో ఉన్న భూమిని తహశీల్దారు ద్వారా వారి పేరుతో ఆన్లైన్ చేసేసుకుంటున్నారు. కొన్ని రోజులు గడిచాక రికార్డుల్లో తమ పేరు ఉందంటూ భూమిని దున్నేసి పంటలు సాగు చేసుకుంటారు. పంటలు సాగుచేసే సమయంలో గుర్తించి ఇదేమని ప్రశ్నిస్తే ఈ పొలం మాదనుకున్నాము. ఈ ఏడాది పంట వేసుకుంటాం. వచ్చే ఏడాది మీరే తీసుకోండని నమ్మబలికిస్తారు. వచ్చే ఏడాది భూమి నాదే, గతేడాది నేనే పంట సాగు చేసుకున్నాను. రికార్డుల్లో పేర్లు నావే ఉన్నాయంటూ ఘర్షణకు దిగుతారు. వారిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే రికార్డులను మార్చింది వారే కాబట్టి. ఇలా రెవెన్యూ అధికారులు పేద రైతులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములను, అమాయకంగా ఉండే రైతుల స్వంత భూములను సైతం కాజేస్తున్నారు. మండలంలోని ముండ్లపాడు గ్రామానికి చెందిన తల్లపురెడ్డి వెంకటరెడ్డికి చెందిన 1481వ సర్వే నంబర్లోని భూమిని ఇదే విధంగా గ్రామానికి చెందిన వీఆర్ఏ తన బంధువుల పేర్లతో ఆక్రమించేశారు. వీఆర్ఏకు మద్దతునిస్తూ వీఆర్వో 8 సంవత్సరాల అడంగళ్‌ను ట్యాంపరింగ్ చేసినట్లు స్వయంగా ఆర్ఐ విచారణలో తేలింది. ఆయన తహశీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా వీఆర్ఓస్పందించడంలేదనిరైతువాపోతున్నాడు. ఇదే గ్రామానికి చెందిన మోడి పుల్లయ్య స్వంత భూమిని ఇతరుల పేరుతో ఆన్లైన్ చేసేశారు. ముండ్లపాడు గ్రామానికి చెందిన ఓ వీఆర్ఓ గ్రామ రికార్డులను తన వద్ద పెట్టుకుని ఒకరి పేరును మరొకరికి రాస్తూ తారుమారు చేస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. 20 వేల ఎకరాలకు పైగా అనర్హులకు చేరిన ప్రభుత్వ భూములు: నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 20 వేల ఎకరాలకు పైగా అసైన్మెంట్ భూములు అనర్హులకు అప్పగించి రెవెన్యూ అధికారులు కోట్లు సంపాదించారు. అధికారులకు డబ్బు ఆశచూపి ఒక్కొక్కరు పది ఎకరాలకు పైగా భూములను కొల్లగొట్టేశారు. గ్రామాల్లో వ్యవసాయ కూలీలు, పేదలు పెంచుకునే పశువులు, గొర్రెలు మేసేందుకు అవసరమైన గ్రాసం కనిపించకుండా మేత బీడు భూములను సైతం అన్యాక్రాంతం చేసేశారు. ప్రభుత్వ భూములు అక్రమంగా పొందిన కొన్ని సంఘటనలు... కొమరోలు మండలంలోని దద్దవాడ రెవెన్యూలో అధికార పార్టీకి చెందిన ఓ డీలర్ 130 ఎకరాలు ఆక్రమించేశాడు. రాజుపాలెంలో 34 ఎకరాలకు ముగ్గురు పాసు పుస్తకాలు పొందారు. అనంతరం రూ.10 లక్షల వరకు బ్యాంకు రుణం పొందారు. ఇప్పుడు ఆ భూమిని ఆన్లైన్లో రస్తా పోరంబోకు భూమిగా చూపిస్తున్నారు. రాచర్ల మండలంలోని యడవల్లి రెవెన్యూలో గిద్దలూరుకు చెందిన టీడీపీ నాయకులకు అసైన్డ్ భూములు ఇచ్చారు. రిజిస్ట్రేషన్ లేకుండానే ప్రైవేటు భూములను సైతం ఆన్లైన్ చేసి ఈ–పాసు పుస్తకాలు ఇచ్చారు. సత్యవోలుకు చెందిన ఓ ఉద్యోగి తన భార్య పేరుతో అసైన్డ్ భూములను పొందాడు. యడవల్లికి చెందిన ఆలయ భూములను ఉద్యోగులు ఆక్రమించుకున్నా రెవెన్యూ, దేవాదాయ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గిద్దలూరు మండలంలోని వెల్లుపల్లెలో 1015 సర్వే నంబరులో ఆరు ఎకరాలు ఉన్న నాలుగుపాటి కుంటను క్రిష్ణా జిల్లాకు చెందిన సాంబశివరావు ఆక్రమించి కట్టను తొలగించి చదును చేసుకున్నాడు. ముండ్లపాడు రెవెన్యూలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు భూములను సైతం అన్యాక్రాంతం చేస్తూ ఆన్లైన్లో ఒకరి భూమిని మరొకరికి పేర్లు మార్చి అక్రమాలకు పాల్పడ్డారు. చనిపోయిన వారి ఖాతాలను కేటాయించి ఆన్లైన్లో ఇతరులుగా నమోదు కాబడిన ప్రభుత్వ భూమిని బినామీదార్ల పేర్లతో నమోదు చేస్తూ బ్యాంకుల్లో భారీ గా రుణాలు పొందినట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నా భూమిని ఇంకొకరికి రాసిచ్చారు తన పూర్వీకులకు చెందిన 4.16 ఎకరాల భూమిని నేను అనుభవిస్తున్నాను. పాసు పుస్తకం ఇచ్చారు. రెండేళ్లుగా వర్షాలు కురవలేదని బీడు పెట్టడంతో వీఆర్ఏ బంధువులు ఆక్రమించుకున్నారు. తహశీల్దారుకు, ఆర్డీఓకు, ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా వీఆర్వో పలకడం లేదు. ఆర్ఐ వచ్చి పరిశీలించి రికార్డుల్లో పేర్లు మార్చారని చెబుతున్నారు. – టి.వెంకటరెడ్డి, బాధితుడు, ముండ్లపాడు గ్రామం. మా భూమిని పక్కనున్న వారికి ఆన్లైన్ చేశారు మానాన్న యల్లా రాజేంద్రప్రసాద్ పేరుతో 702–2 సర్వే నంబర్లో ఉన్న 24 సెంట్ల భూమిని పక్కనే ఉన్న వారికి ఆన్లైన్ చేశారు. 1978 సంవత్సరం నుంచి మా అనుభవంలో ఉన్న 99 సెంట్ల భూమిని మానాన్న పేరున ఆన్లైన్ చేశారు. మాకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే 24 సెంట్ల భూమిని పక్కనే ఉన్న యల్లా సరస్వతి పేరున ఆన్లైన్ చేశారు. – యల్లా వెంకటమణికంఠ, గిద్దలూరు. ఫిర్యాదు అందిస్తే విచారించి చర్యలు తీసుకుంటాం రెవెన్యూ రికార్డులు ట్యాంపరింగ్ జరిగినట్లు మాకు ఫిర్యాదులు అందలేదు. బాధితులు నేరుగా ఫిర్యాదు చేస్తే బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటాం. భూమిపై ఎవరికి హక్కు ఉందో విచారించి వారి భూములను వారికి ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎక్కడెక్కడ ట్యాంపరింగ్ జరిగిందో చెబితే సంబంధిత అధికారులను విచారించి చర్యలు చేపడతాం – పెంచల కిషోర్, ఆర్డీఓ, మార్కాపురం