సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రెవెన్యూ శాఖలో ఫైళ్ల విభజన ప్రక్రియ చకచకా సాగుతోంది. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో అసైన్‌మెంటు (భూ వ్యవహారాలకు)కు సంబంధించి ఏడు సెక్షన్లు ఉన్నాయి. అసైన్‌మెంట్ సెక్షన్-3లో తప్ప మిగిలిన అన్ని సెక్షన్లలో సీమాంధ్ర, తెలంగాణ జిల్లాలు ఉన్నాయి. అందువల్ల అన్ని సెక్షన్లలో భూ కేటాయింపులకు సంబంధించిన ఫైళ్లను సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు విభజించాల్సి ఉంది.
భూమి వ్యవహారం చాలా ముఖ్యమైనదైనందున సెక్షన్ల వారీగా తెలంగాణ, సీమాంధ్ర ఫైళ్లను వేరుచేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. కొన్ని ఫైళ్లు చాలా పురాతనమైనవి ఉన్నాయి. ఇవి మట్టి పట్టి ఉండటంతో వీటిని వేరు చేసే సమయంలో ముక్కు, నోటి ద్వారా మట్టి వెళుతుందనే భావంతో ఉద్యోగులు ముక్కుకు, నోటికి రక్షణగా మాస్క్‌లు కట్టుకుని మరీ పనిచేస్తున్నారు.
సెక్షన్ల వారీగా ఉన్న జిల్లాలు
అసైన్‌మెంట్ సెక్షన్ -1: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, మహబూబ్‌నగర్.
అసైన్‌మెంట్ సెక్షన్ -2: కృష్ణా, నెల్లూరు, వరంగల్, నిజామాబాద్.
అసైన్‌మెంట్ సెక్షన్ -3: హైదరాబాద్, సికింద్రాబాద్.
అసైన్‌మెంట్ సెక్షన్ -4 : ఆదిలాబాద్, నల్లగొండ, మెదక్, చిత్తూరు, వైఎస్సార్.
అసైన్‌మెంట్ సెక్షన్ 5 : గుంటూరు, అనంతపురం, కర్నూలు, రంగారెడ్డి.
అసైన్‌మెంట్ సెక్షన్ 6 : తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కరీంనగర్.
అసైన్‌మెంట్ పీఓటీ
ఈ సెక్షన్ కింద ఖమ్మం జిల్లాతోపాటు 1/70 చట్టం కిందకు వచ్చే భూములన్నీ వస్తాయి. ప్రస్తుతం ఈ సెక్షన్లలోని సిబ్బంది తెలంగాణ, సీమాంధ్ర జిల్లాల ఫైళ్లను వేరు చేస్తూ ప్రత్యేకంగా కంప్యూటర్లలో వాటికి కొత్త ఇండెక్స్ ఇస్తున్నారు.
రెవెన్యూలో చకచకా ఫైళ్ల విభజన
Published Thu, Mar 13 2014 1:59 AM | Last Updated on Tue, Oct 2 2018 4:01 PM
Advertisement
Advertisement