Files
-
కీలక ఫైళ్ల గల్లంతు.. గుజరాత్ హైకోర్టుకు తాత్కాలిక చీఫ్ జస్టిస్!
న్యూఢిల్లీ: పలు కేసులకు సంబంధించిన ఫైల్స్ గల్లంతు అయిన వ్యవహారం గుజరాత్ హైకోర్టు(Gujarat High Court)ను కుదిపేస్తోంది. మరోవైపు చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్‌ను బదిలీ చేయాల్సిందేనంటూ తోటి జడ్జిలు, అడ్వొకేట్లు డిమాండ్ లేవనెత్తారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విమర్శల నేపథ్యంలో ఆమెను సెలవులపై వెళ్లగా.. జస్టిస్ అనిరుధ్ వైష్ణవ్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది.గుజరాత్ హైకోర్టు పరిధి నుంచి పలు కేసులకు సంబంధించిన ఫైల్స్ మాయం(Files Missing) కావడంపై జడ్జి సందీప్ భట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది న్యాయవ్యవస్థలోని పారదర్శకతను, నమ్మకాన్ని దెబ్బ తీసే అంశమని ఆందోళన వ్యక్తం చేశారాయన. ఈ క్రమంలో న్యాయ ప్రక్రియలకు సత్వర సంస్కరణలకు అవసరమని అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. ఫైళ్ల మాయంలో హైకోర్టు రిజిస్ట్రార్ ఏటీ ఉక్రాణి పాత్రపైనా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే.. ఇది ఊహించని పరిణామానికి దారి తీసింది.జస్టిస్ సందీప్ భట్ రోస్టర్‌ను మార్చేస్తూ చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్(Chief Justice Sunitha Agarwal) ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం తీవ్ర అభ్యంతరాలకు కారణం కావడం మాత్రమే కాదు పలు అనుమానాలకూ దారి తీసింది. గుజరాత్ హైకోర్టు అడ్వొకేట్ అసోషియేషన్స్ సోమవారం అత్యవసరంగా సమావేశమై చీఫ్ జస్టిస్ నిర్ణయంపై చర్చించాయి. మరోవైపు.. హైకోర్టు జడ్జిలు, లాయర్లు జస్టిస్ సందీప్ భట్‌కు సంఘీభావం ప్రకటించారు. అయితే.. చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్ ఇలా జడ్జిల విధులకు అడ్డుపడడం ఇదే తొలిసారేం కాదు. ఇంతకు ముందు.. నలుగురు జడ్జిల విషయంలోనూ ఆమె ఇలాగే ప్రవర్తించారు. అలాగే.. న్యాయవాదులతోనూ ఆమె వ్యవహరించే తీరుపైనా తీవ్ర విమర్శలు ఉన్నాయితాజాగా.. మొన్న శుక్రవారం(ఫిబ్రవరి 14)న అక్రమ కట్టడాలకు సంబంధించిన దాఖలైన పిల్‌పై వాదనలు జరిగాయి. చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆ పిల్‌ను విచారించింది. ఆ టైంలో జీహెచ్సీఏఏ అధ్యక్షుడు, సీనియర్ లాయర్ బ్రిజేష్ త్రివేదికి చీఫ్ జస్టిస్‌కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ వాదనలు పూర్తిగా వినాలంటూ తీవ్ర స్వరంతో ఆయన చీఫ్ జస్టిస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ఆమె అవేం పట్టనట్లు గాల్లో చూస్తూ ఉండిపోయారు. దీంతో ఆయన మరోసారి వ్యాఖ్యలు చేయడంతో.. ఆమె మందలించారు. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది కూడా. ఈ పరిణామాలన్నింటిని దృష్ట్యా దీంతో ఆమెను మరో న్యాయస్థానానికి బదిలీ చేయాలంటూ జడ్జిలు, లాయర్లు డిమాండ్ లేవనెత్తారు. ఈ అంశంపై మంగళవారం మరోసారి జీహెచ్సీఏఏ జనరల్ బాడీ అత్యవసర సమావేశం నిర్వహించాలనుకుంది. కానీ ఈలోపు.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్ సెలవులపై వెళ్లగా.. ఆమె స్థానంలో జస్టిస్ బీరెన్ అనిరుధ్ వైష్ణవ్‌ను తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా నియమించింది. ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మార్చి 2వ తేదీదాకా ఆయన ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 223 ప్రకారం ఈ నియామకం చేపట్టినట్లు న్యాయ విభాగం(నియామకాల) కేంద్ర సంయుక్త కార్యదర్శి జగన్నాథ్ శ్రీనివాసన్ పేరిట నోటిఫికేషన్ విడుదలైంది.ఆ పెద్దావిడ పిటిషన్‌తో..జయశ్రీ జోషి(71) 2020లో రాధాన్పూర్ కోర్టులో ఓ కేసు నమోదు చేసింది. అయితే అందుకు సంబంధించిన ఫైల్ కనిపించకుండా పోయిందని హైకోర్టును ఆమె ఆశ్రయించారు. ఈ పిటిషన్ జస్టిస్ సందీప్ భట్ బెంచ్ విచారణ జరిపి.. కనిపించకుండా పోయిన ఆ ఫైల్స్ ఆచూకీ కనిపెట్టాలంటూ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలో..2024 డిసెంబర్లో ఈ పిటిషన్‌కు సంబంధించి సమగ్రమైన నివేదిక అందించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అప్పుడే.. సూరత్ కోర్టుకు సంబంధించిన 15 కేసుల ఫైల్స్ కనిపించకుండా పోయాయనే విషయం వెలుగు చూసింది. కొసమెరుపు ఏంటంటే.. ఆ టైంలో సంబంధిత అధికారిగా, ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న రిజిస్ట్రార్ ఏటీ ఉక్రాణి ఉండడం గమనార్హం. సూరత్ కోర్టులో ఆరేళ్లపాటు పని చేసి.. బదిలీ మీద కోర్టుకు వచ్చారు. ప్రస్తుతం ఫైల్స్ మాయం అయిన వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది.ఎవరీ సునీతా అగర్వాల్ఉత్తర ప్రదేశ్‌కు చెందిన జస్టిస్ సునీతా అగర్వాల్.. గతంలో అలహాబాద్ కోర్టులో జడ్జిగా పని చేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో మానవ హక్కుల గురించి చర్చ ద్వారా ఆమె వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ఆహారం పంచుతున్న కొందరిని పోలీసులు అరెస్ట్ చేయగా.. వాళ్లందరినీ విడుదల చేయాలని ఆమె ఆదేశించారు. అంతేకాదు.. యూపీలో పని చేసే చోట్ల లైంగిక వేధింపుల కట్టడికి ఏర్పాటు చేసిన కీలక కమిటీలోనూ ఆమె సభ్యురాలిగా పని చేశారు. -
Karnataka: మరో కుంభకోణం వెలుగులోకి.. కోవిడ్ వేళ వెయ్యి కోట్ల లూటీ
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ముడా కుంభకోణం తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. తాజాగా మరో భారీ స్కాం వెలుగుచూసింది. కరోనా సమయంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు తేలింది. అప్పటి ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ పాలనలో కోవిడ్‌పై పోరాటానికి కేటాయించిన కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు లేవనెత్తుతున్నాయి.దీనిపై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జాన్ మైఖేల్ కున్హా నేతృత్వంలోని కమిషన్ ప్రాథమిక నివేదికను రూపొందించింది. ఆగస్టు 31వ తేదీన సుమారు 1722 పేజీలతో కూడిన నివేదికను సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వానికి అందజేసింది. ఈ నేపథ్యంలో ఆ రిపోర్టును విశ్లేషించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించేందుకు కమిషన్‌కు ఆరు నెలల అదనపు గడువు ఇచ్చారు.తాజాగా ఈ నివేదికపై చర్చించేందుకు నేడు మంత్రివర్గం సమావేశం నిర్వహించింది. సమావేశంలో ఈ నివేదికపై చర్చించిన సిద్ధరామయ్య.. కొన్ని కీలక విషయాలను గుర్తించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వందల కోట్లు దుర్వినియోగం, కొన్ని కీలక పత్రాలు మిస్ అయ్యాయని కమిటీ గుర్తించిందని సీఎం ఆ సమావేశంలో ప్రస్తావించినట్లు సమాచారం.కొవిడ్ సమయంలో రాష్ట్రం వెచ్చించిన సొమ్ము మొత్తం విలువ రూ.13 వేల కోట్లు. కానీ దానిని అధికారికంగా ఎక్కడా వెల్లడించలేదు. అందులో రూ.1,000 కోట్లు స్వాహా అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇచ్చిన ప్రాథమిక నివేదికకు రానున్న ఆరు నెలల్లో తుదిరూపు ఇవ్వనున్నారు. ఈ క్రమంలో బీజేపీ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలపై చర్యలకు సిద్ధమవుతోంది.పార్లమెంట్ శీతాకాల సమావేశంలో దీనిని సమర్పించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ముడా స్కామ్ వచ్చిన తరుణంలోనే ‘కొవిడ్’ కుంభకోణం నివేదిక తేవడంపై మీడియా అడిగిన ప్రశ్నపై రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ముడా వ్యవహారంపై విమర్శలు రాబట్టి రెండు నెలలు కూడా కావడం లేదు. జస్టిస్ జాన్ మైఖెల్ కమిటీని ఏడాదిక్రితం ఏర్పాటుచేశారు. అసలు రెండింటిని ఎలా పోలుస్తారు. ఇది దురదృష్టకరం’’ అని వ్యాఖ్యానించారు. -
ఒకటా రెండా?.. కాల్చుకు తింటోంది!
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు ఉద్యోగులు, అధికారులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వేధింపులకు గురి చేయడంపై ఆ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే గతంలో ఎన్నడూ లేనివిధంగా 50 మందికిపైగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. నిత్యం డీజీపీ కార్యాలయానికి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకూ అక్కడే కూర్చుని సంతకాలు పెట్టి వెళ్లాలని 16 మంది ఐపీఎస్ అధికారులకు అవమానకరంగా ఒక మెమో జారీ చేయడంపై అధికార యంత్రాంగంపై తీవ్ర విస్మయం వ్యక్తమైంది.ఒక్క సివిల్ సర్వీసు అధికారులే కాకుండా గ్రూప్–1 అధికారులు, కింది స్థాయి ఉద్యోగులను సైతం ప్రభుత్వం అదే రీతిలో వేధింపులకు గురి చేస్తోంది. కొద్ది రోజుల క్రితం అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే ఈ ఘటనను రాజకీయం చేసేందుకు టీడీపీ సర్కారు ప్రయత్నించింది. మదనపల్లెలో ఫైల్స్ దగ్ధం వెనుక కుట్ర కోణం ఉందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాతో ప్రకటన చేయించింది.ప్రస్తుత ఆర్డీవో, పూర్వ ఆర్డీవోతోపాటు సీనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేసింది. కార్యాలయంలోని మిగిలిన ఉద్యోగులను సైతం భయభ్రాంతులకు గురి చేసి తీవ్రంగా వేధించింది. అయితే ఇంతవరకు ఈ ఘటన ఎలా జరిగిందో, అసలు నిజాలు ఏమిటో తేల్చలేకపోయింది. ఇక కొద్దిరోజుల క్రితం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయానికి సంబంధించిన పనికిరాని ఫైళ్లను కిందిస్థాయి ఉద్యోగులు దగ్ధం చేస్తే దానిపైనా రాద్ధాంతం చేసింది. పోలవరానికి సంబంధించి పనికిరాని ఫైళ్లను రాజమహేంద్రవరంలో దగ్ధం చేస్తే దానిపైనా టీడీపీ హడావుడి చేసింది. ఈ ఘటనలన్నింట్లోనూ అధికారులు, ఉద్యోగులను అనుమానంతో వేధించడం మినహా ఆరోపణలను నిరూపించలేకపోయింది.ముద్ర వేసి ఇబ్బందులు..ప్రభుత్వం మారాక అన్ని శాఖల్లో అధికారులు, ఉద్యోగులను అనుమానపు చూపులు చూస్తూ వేధిస్తున్నారు. గ్రామ సచివాలయాల నుంచి రాష్ట్ర సచివాలయం వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర సచివాలయంలో వైఎస్సార్సీపీ కోసం పని చేసిన వారంటూ ఒక జాబితా విడుదల చేసి మరీ కొందరు దుష్ప్రచారానికి దిగారు. ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన నియోజకవర్గంలో పనిచేసే కొందరు పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగులపై పార్టీ ముద్ర వేసి పదోన్నతి లభించినా, బదిలీ అయినా రిలీవ్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. -
ఎల్లో మీడియా డ్రామా.. తుస్సుమనిపించిన అధికారులు
తూర్పుగోదావరి, సాక్షి: ధవళేశ్వరంలో పొలవరం ఆర్ అండ్ ఆర్ కార్యాలయం వద్ద ఫైల్స్ దగ్ధం అంటూ ఉద్దేశపూర్వక కథనాలతో ఎల్లో మీడియా హడావిడి చేసింది. అయితే దీనిపై అధికారులు వివరణ ఇచ్చి గాలి తీసేశారు. అవి ఫైల్స్ కావని, పనికిరాని కాగితాలని, వాటి మీద వచ్చిన కథనాల్లో ఏమాత్రం వాస్తవం లేదని అధికారులు వివరణ ఇచ్చారు.‘‘పోలవరం ఎల్ఎంసీ కార్యాలయంలో బీరువాల్లో నిరుపయోగమైన కాగితాలను మాత్రమే బయటపడేశాం. ఈ పేపర్లు ఆర్ అండ్ ఆర్ కు ఏ మాత్రం సంబంధించినవి కావు. సిబ్బంది తగలబెట్టిన కాగితాలు ఉపయోగం లేనివి మాత్రమే. అని ఆర్ అండ్ ఆర్ స్పెషల్ కలెక్టర్ సరళ తెలిపారు. అయితే పనికి రానివే అయినా అలా తగలబెట్టడం కరెక్ట్ కాదని ఆర్డీవో కేఎన్ జ్యోతి అంటున్నారు. ‘‘అవి ముమ్మాటికీ నిరుపయోగమైనవే. అవి ఫైల్స్ కావు. అన్ని సైన్ లేని జిరాక్స్ కాపీలు మాత్రమే. కార్యాలయంలో నిరుపయోగంగా ఉన్నాయని బయటపడేసి దహనం చేశారు. అయితే అలా నిరుపయోగమైన కాగితాలను సైతం బహిరంగంగా కాల్చకూడదు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తాం. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం’’ అని ఆర్డీవో జ్యోతి తెలిపారు.అనుమానాస్పద రీతిలో కాలి బూడిదైన ఫైల్స్ అంటూ.. సగం కాలిన పేపర్ల ఫొటోలతో ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర కూటమి అనుకూల మీడియా ఛానెల్స్ కథనాలు ఇచ్చాయి. అవి పోలవరం ఎడమ కాలువ భూ పరిహారం ఫైల్స్ అంటూ అందులో రాసుకొచ్చాయి. అధికారులు విషయం బయటకు చెప్పట్లేదని.. పోలీసులు వచ్చారంటూ ఊదరగొట్టాయి. ఈలోపు.. మీడియా ముందుకు వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్‌కు భద్రత లేకుండా పోయిందని.. వైఎస్సార్సీపీ హయాంలోని ఫైల్సే తగలబడి పోతున్నాయంటూ అసలు విషయం తెలియకుండా ఓ స్టేట్మెంట్ ఇచ్చేశారు. చివరకు అధికారుల వివరణతో ఎల్లో మీడియా డ్రామా అంతా ఉత్తదేనని తేలింది. -
ఆ బాక్సుల నిండా ఫైళ్లు!
పిఠాపురం: మూడు రోజులుగా కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్త మూలపేట ఎస్ఈజెడ్ కాలనీలో నిలిపివేసిన సంధ్యా ఆక్వా కంపెనీకి చెందిన బస్సు అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కొత్తపల్లి ఎస్ఐ స్వామినాయుడు సంధ్యా ఆక్వా కంపెనీ ప్రతినిధులను విచారించగా బస్సు బ్రేక్ డౌన్ కావడంతో అక్కడ నిలిపి ఉంచినట్లు చెప్పారు. బస్సులోని అట్ట పెట్టెల్లో పలు ఫైళ్ల కట్టలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద వస్తువులేవీ కనిపించలేదని, ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్న సీబీఐకి తెలియజేస్తామని ఎస్ఐ చెప్పారు. తనిఖీల అనంతరం బస్సును ఆక్వా కంపెనీలోకి తరలించారు. -
మధ్యప్రదేశ్ సెక్రటేరియట్లో మంటలు
భోపాల్: మధ్యప్రదేశ్ సెక్రటేరియట్లో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. సెక్రటేరియట్ భవన సముదాయం ‘వల్లభ భవన్’లోని మూడో అంతస్తులో మొదలైన మంటలు 4, 5 అంతస్తులకు కూడా వ్యాపించాయి. ఆయా అంతస్తుల్లోని ఫైళ్లు, ఇతర ఫరి్నచర్ పూర్తిగా కాలిపోయాయి. నీళ్ల ట్యాంకర్లతోపాటు సుమారు 50 అగ్ని మాపక శకటాలతో వచ్చిన సిబ్బంది దాదాపు ఏడు గంటలపాటు శ్రమించి మంటలను సాయంత్రం 4 గంటల సమయానికి అదుపులోకి తెచ్చారు. శనివారం సెలవు కావడంతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతబడి ఉన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో భవన సముదాయంలో దాదాపుగా ఎవరూ లేరని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఘటనపై సవివర దర్యాప్తు కోసం సీఎం మోహన్ యాదవ్ అదనపు చీఫ్ సెక్రటరీ మహ్మద్ సులెమాన్ సారథ్యంలో ఏడుగురు సభ్యులతో కమిటీ వేశారు. 15 రోజుల్లోగా నివేదిక అందించాలని ఆదేశించారు. 2003లో బీజేపీ అధికారంలోకి వచ్చాక వల్లభ్ భవన్ జరిగిన అయిదో అగ్ని ప్రమాదమని కాంగ్రెస్ ఆరోపించింది. అవినీతి సాక్ష్యాలు బయటపడకుండా చేసేందుకే సెక్రటేరియట్లో అగ్ని ప్రమాదం అంటూ బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని విమర్శించింది. ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తూ ఆపార్టీ నేతలు సెక్రటేరియట్ వెలుపల రెండు గంటలపాటు నిరసన చేపట్టారు. -
రాజధాని ఫైల్స్ ప్రదర్శనను ఆపండి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయాలన్న ఏకైక ఉద్దేశంతో తీసిన ‘రాజధాని ఫైల్స్’ సినిమా ప్రదర్శనను నిలుపుదల చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం ప్రారంభించింది. ఆ సినిమాను థియేటర్లలో ప్రదర్శించేందుకు వీలుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సరి్టఫికేషన్ (సీబీఎఫ్సీ) జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలను రద్దు చేయాలని కోరుతూ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ప్రజల్ని మభ్యపెట్టేందుకే ఈ సినిమా వైఎస్సార్సీపీ తరఫున న్యాయవాది వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. రాజధాని ఫైల్స్ పేరుతో తీసిన సినిమా ఏకైక లక్ష్యం ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయడమేనన్నారు. అవాస్తవాలతో ప్రజలను మ«భ్యపెట్టేందుకే ఈ చిత్రాన్ని నిరి్మంచారని తెలిపారు. ఈ చిత్ర నిర్మాణం వెనుక ప్రజల్లో వైఎస్సార్సీపీని పలుచన చేయాలన్న ఉద్దేశం కూడా ఉందన్నారు. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి సహా పార్టీ పెద్దలందరినీ అప్రతిష్ట పాల్జేయడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని, ఎమ్మెల్యే కొడాలి నాని, ఇతర సభ్యులను పోలి ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పాత్రల పేర్లు కూడా నిజ జీవితంలో ఆయా వ్యక్తుల పేర్లను పోలి ఉన్నాయన్నారు. అమరావతి పేరును ఐరావతి, ప్రధాని పేరును సురేంద్ర మోదీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును రాంబాబు వంటి నిజ జీవితంలో పోలి ఉండే పేర్లను ఆయా పాత్రలకు పెట్టారన్నారు. స్వీయ, రాజకీయ ప్రయోజనాల కోసమే.. ఈ నెల 5వ తేదీన రాజధాని ఫైల్స్ ట్రైలర్ విడుదల చేశారని, అందులో ముఖ్యమంత్రి, ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపించారని న్యాయవాది ప్రశాంత్ వివరించారు. చిత్ర నిర్మాతలు తమ స్వీయ, రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీని బలి పశువును చేస్తున్నారన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఎప్పుడూ కూడా పరిమితులకు లోబడి ఉంటుందని వివరించారు. వైఎస్సార్సీపీ ప్రతిష్టను దెబ్బతీయడం ద్వారా చిత్ర నిర్మాతలు హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ చిత్రాన్ని నిరి్మంచారని వివరించారు. ఈ చిత్రం నిర్మాణం వెనుక ఉన్న వ్యక్తులెవరు, వారి ఉద్దేశాలు ఏమిటి తదితర వివరాలను సీబీఎఫ్సీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. కోర్టు పరిధిలో ఉన్న మూడు రాజధానుల అంశంపై సినిమా తీయడం ఎంతమాత్రం సరికాదని కూడా వివరించామన్నారు. అయినా తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా రాజధాని ఫైల్స్ చిత్ర ప్రదర్శనకు సీబీఎఫ్సీ అధికారులు ధ్రువీకరణ పత్రం జారీ చేశారన్నారు. ఈ నెల 15న సినిమా విడుదల కానుందని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని, చిత్ర ప్రదర్శనను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. కించపరిచేలా సన్నివేశాల్లేవు చిత్ర నిర్మాతల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. మొదట తమ చిత్రాన్ని ఎగ్జామిన్ కమిటీ చూసి పలు సన్నివేశాలను తొలగించాలని చెప్పిందని, దీనిపై తాము రివిజన్ కమిటీని ఆశ్రయించామని చెప్పారు. రివిజన్ కమిటీ కూడా పలు సన్నివేశాలను తొలగించాల్సిందేనని చెప్పిందని, దీంతో ఆ సన్నివేశాలను తొలగించామన్నారు. ఆ తరువాతే సీబీఎఫ్సీ తమకు చిత్ర ప్రదర్శనకు అనుమతినిస్తూ సరి్టఫికెట్ జారీ చేసిందన్నారు. తమకు గత ఏడాది డిసెంబర్లో సర్టిఫికెట్ ఇస్తే వైఎస్సార్సీపీ ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ఉత్తర్వులు జారీ చేశారు. -
సీబీఐ విచారణలో కాకాణికి క్లీన్చిట్
సాక్షి, అమరావతి: నెల్లూరు న్యాయస్థానంలో ఫైళ్లు గల్లంతైన కేసులో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఫైళ్ల గల్లంతు వ్యవహారంతో కాకాణికి ఏమాత్రం సంబంధం లేదని, ఈ కేసులో ఏపీ పోలీసులు సక్రమంగానే దర్యాప్తు చేశారని తేల్చిచెప్పింది. రాష్ట్ర పోలీసులు దర్యాప్తు జరిపి నిందితులుగా పేర్కొన్న సయ్యద్ హయత్, షేక్ ఖాజా అనే ఇద్దరు వ్యక్తులే నెల్లూరు న్యాయస్థానంలో ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతోపాటు ఫైళ్లను కూడా అపహరించినట్లు నిర్ధారించింది. మంత్రి కాకాణి ఆ ఫైళ్లను దొంగతనం చేయించారన్న టీడీపీ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. ఈమేరకు విజయవాడలోని ఐదో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్– మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో సీఐబీ దాఖలు చేసిన చార్జ్‌షీట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. అన్ని కోణాల్లో సమగ్ర విచారణ... నెల్లూరులోని నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ న్యాయస్థానంలో 2022 ఏప్రిల్ 13వతేదీ రాత్రి కొందరు ఆగంతకులు దొంగతనానికి పాల్పడిఎలక్ట్రానిక్ ఉపకరణాలతోపాటు పలు పత్రాలను అపహరించారు. దీనిపై మర్నాడు కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు దర్యాప్తు చేసి దొంగతనానికి పాల్పడ్డ సయ్యద్ హయత్, షేక్ ఖాజాలను అరెస్ట్ చేసి వారి నుంచి ల్యాప్‌టాప్, సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ఆదేశాలతో రిమాండ్‌కు పంపారు. ఈ ఉదంతంపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి వ్యతిరేకంగా న్యాయస్థానంలో దాఖలైన కేసులో ఆధారాలను గల్లంతు చేసేందుకు చోరీకి పురిగొల్పారని అభాండాలు వేశారు. ఈ ఆరోపణలను తిప్పికొట్టిన మంత్రి కాకాణి దీనిపై సీబీఐ విచారణకు సిద్ధమని ప్రకటించారు. ఈ క్రమంలో న్యాయస్థానం ఆదేశాలతో ఈ కేసు విచారణ చేపట్టిన సీఐబీ అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు జరిపింది. రెండేళ్లపాటు దర్యాప్తు చేసి 88 మంది సాక్షులను విచారించి రూపొందించిన 403 పేజీల చార్జ్‌షీట్‌ను న్యాయస్థానానికి సమర్పించింది. ఈ వ్యవహారంతో మంత్రి కాకాణికి ఎలాంటి సంబంధం లేదని సీబీఐ నిర్ధారించింది. ఏపీ పోలీసులు ఈ కేసును సక్రమంగానే విచారించారని స్పష్టం చేసింది. చార్జ్‌షీట్‌లో సీబీఐ ప్రధానంగా పేర్కొన్న అంశాలివీ.. కాకాణికి సంబంధం లేదు... నెల్లూరు న్యాయస్థానంలో ఫైళ్ల గల్లంతు వ్యవహారంతో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. మంత్రి కాకాణి, ఆయన పీఏలు, సన్నిహితుల ఫోన్ కాల్స్ డేటాను సీబీఐ విశ్లేషించింది. న్యాయస్థానం సిబ్బందితోగానీ, ఈ కేసుతో సంబంధం ఉన్న వారితోగానీ, దర్యాప్తు అధికారులతోగానీ మంత్రి కాకాణి, ఆయన అనుచరులు ఫోన్లో మాట్లాడినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదు. పోలీసు అధికారులతో బందోబస్తు ఏర్పాట్ల గురించి అతి స్వల్ప వ్యవధి కాల్స్ మాత్రమే ఉన్నాయి. ఈ దొంగతనం కేసులో అరెస్ట్ చేసిన నిందితులు సయ్యద్ హయత్, ఖాజా రసూల్‌తో మంత్రి కాకాణికి ఎలాంటి సంబంధాలు లేవన్నది నిర్ధారణ అయింది. నిందితుల నుంచి పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లను ఎవరూ ట్యాంపర్ చేయలేదని తిరువనంతపురంలోని సీ–డాక్ పరీక్షల్లో నిర్ధారణ అయింది. దొంగతనాలే ప్రవృత్తి.. ఈ కేసులో ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులు సయ్యద్ హయత్, ఖాజా రసూలే నెల్లూరు న్యాయస్థానంలో దొంగతనానికి పాల్పడ్డారు. నేర చరిత్ర ఉన్న వారిద్దరిపై 15 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఏడు కేసుల్లో శిక్ష పడగా మిగిలిన కేసులు విచారణలో ఉన్నాయి. మద్యం, గంజాయి వ్యసనాలకు అలవాటు పడిన నిందితులిద్దరూ దొంగతనాలనే వృత్తిగా చేసుకున్నారు. నిందితుల భార్యలు కూడా వారికి దూరంగా ఉంటున్నారు. నిందితులు తమ తల్లుల ఫోన్లను మాత్రమే వినియోగిస్తున్నారు. వారిద్దరే నెల్లూరు న్యాయస్థానంలో చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ల్యాప్‌టాప్, ట్యాబ్, మొబైల్ ఫోన్లను తస్కరించి మిగిలిన పత్రాలను సమీపంలోని కాలువలో పారేశారు. తాము అపహరించిన వస్తువులు మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న కేసుకు సంబంధించినవి అనే విషయం నిందితులకు తెలియదు. పోలీసులు వారిద్దరి నుంచి ల్యాప్‌టాప్, ట్యాబ్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాలువలో పారేసిన రబ్బరు స్టాంపులు, రౌండ్ సీళ్లు, స్టాంపు, స్టాంప్ ప్యాడ్లు మాత్రం లభ్యం కాలేదు. సోమిరెడ్డి ఆరోపణలు అవాస్తవం మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, రాష్ట్ర పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సీఐబీ తేల్చి చెప్పింది. ఆయన చేసిన 14 ఆరోపణలను విడివిడిగా ప్రస్తావిస్తూ అవన్నీ నిరాధారణమని పేర్కొంది. నెల్లూరు న్యాయస్థానంలో దొంగతనానికి పాల్పడ్డ సయ్యద్ హయత్, ఖాజా రసూలపై విచారణ కొనసాగించాలని సీఐబీ పేర్కొంది. సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా? పారదర్శకంగా నెల్లూరు పోలీసుల విచారణ: మంత్రి కాకాణి నెల్లూరు(సెంట్రల్): కోర్టులో ఫైల్స్ మిస్సింగ్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలను పటాపంచలు చేస్తూ సీబీఐ క్లీన్చిట్ ఇచ్చిందని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను మంత్రిగా ప్రమాణం చేసిన మూడు రోజులకే కోర్టులో ఫైల్స్ మిస్సింగ్ ఘటన చోటు చేసుకుందని, ఈ కేసును విచారించిన ఎస్పీ విజయారావు పూర్తి వివరాలను వెల్లడించారని గుర్తు చేశారు. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తనపై బురద చల్లేందుకు దీన్ని తనకు ఆపాదిస్తూ ఆరోపణలు చేశారన్నారు. చంద్రబాబు, లోకేశ్ కూడా తనపై ఆరోపణలు చేశారన్నారు. ఏడాదిపాటు క్షుణ్నంగా విచారించిన సీబీఐ అధికారులు 88 మందిని విచారించి స్టేట్మెంట్లు రికార్డు చేశారని చెప్పారు. ఆ ముగ్గురూ సమాధానం చెప్పాలి తనకు సంబంధం లేని ఫైల్స్ చోరీ కేసులో చంద్రబాబు తనపై నిందలు వేశారని, లోకేశ్ కూడా కోర్టు దొంగ అంటూ తనపై నిందలు మోపారని, ప్రజలు నాలుగుసార్లు తిరస్కరించిన సోమిరెడ్డి తనపై దురుద్దేశంతో ఆరోపణలు చేశారని కాకాణి పేర్కొన్నారు. సీబీఐ ఇచ్చిన నివేదికతో ఆ ముగ్గురు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకోకుండా సీపీఐ రామకృష్ణ కూడా విమర్శలు చేశారన్నారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారంటూ లోకేశ్ పలు దఫాలు విమర్శలు చేశారన్నారు. పోలీసులు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా పారదర్శకంగా విచారణ నిర్వహించారనేందుకు ఈ కేసే ఉదాహరణ అని తెలిపారు. బాబు కుమ్మక్కు రాజకీయాలు నిజం గెలవాలంటూ పర్యటిస్తున్న నారా భువనేశ్వరి నిజంగానే అలా కోరుకుంటుంటే చంద్రబాబుపై ఉన్న కేసులపై సీబీఐ విచారణ జరిగితే నిజం గెలుస్తుందని మంత్రి కాకాణి వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధమేనా? అని మంత్రి సవాల్ విసిరారు. తనకు అనుభవం ఉందంటూ ప్రగల్భాలు పలికే చంద్రబాబు నిత్యం అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌తో రాజకీయంగా తలపడలేక కుమ్మక్కు రాజకీయాలకు తెర తీశారని ధ్వజమెత్తారు. -
లబ్ధి చేకూరేలా.. ఫైల్ తొక్కి పెట్టిందెవరు?
కరీంనగర్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అధికారులు కమిషనర్లుగా పదోన్నతి పొందిన వ్యవహారం ఓ ఉన్నతాధికారి మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది. సదరు అధికారులపై చార్జెస్ ఫ్రేమ్ అయి ఉన్నా ఆ ఫైల్‌ను తొక్కి పెట్టి, దొడ్డిదారిన పదోన్నతి వచ్చేట్లు చేయడంలో గతంలో కరీంనగర్లో పనిచేసి, వెళ్లిన ఓ ఉన్నతాధికారి పాత్ర ఉందన్న ఆరోపణలున్నాయి. ‘ఆరోపణలున్నా అందలం’ పేరిట ‘సాక్షి’లో కథనం ప్రచురితమవడంతో విచారణ చేపట్టాలంటూ నగరపాలక సంస్థ కమిషనర్ సీడీఎంఏను కోరిన విషయం విధితమే. రెండున్నరేళ్ల కిందటి ఈ వ్యవహారం ఇప్పటివరకు ఎందుకు వెలుగు చూడలేదు? ఆన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ (ఏసీఆర్)లో తప్పుడు సమాచారాన్ని ఎవరు సీడీఎంఏకు పంపించారన్న అంశాలు ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి. అప్పట్లో ఆదేశించినా లేఖ రాయలే.. 2021లో నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగంలో పని చేస్తున్న అధికారి, అకౌంటెంట్లపై ఆరోపణలు రావడం, అప్పటి కమిషనర్ ఇరువురిపై చార్జెస్ ఫ్రేమ్ చేయడం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టాలని కోరుతూ సీడీఎంఏకు నివేదించాలని అప్పటి కలెక్టర్ నగరపాలక సంస్థను ఆదేశించారు. కానీ ఈ విషయమై నగరపాలక సంస్థ సీడీఎంఏకు ఎలాంటి లేఖ రాయలేదు. దీంతో విచారణ అంశం అటకెక్కింది. అటు చార్జెస్ ఫ్రేమ్ ఫైల్‌ను, ఇటు కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను తొక్కి పెట్టి, అడ్డదారిలో ఇద్దరు అధికారులకు లబ్ధి చేకూరేలా చేయడంలో గతంలో పని చేసిన ఓ ఉన్నతాధికారి కీలకంగా వ్యవహరించారన్న ప్రచారం జరుగుతోంది. ఉద్యోగి పదోన్నతికి ముందు సీడీఎంఏకు పంపించే ఏసీఆర్లోనూ చార్జెస్ ఫ్రేమ్ అంశాన్ని పొందుపరచకుండా, క్లీన్ ఇమేజ్‌తో పంపించడంలోనూ ఆ ఉన్నతాధికారిదే కీలక పాత్ర అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీఆర్ను స్వయంగా ఉద్యోగి పూర్తి చేసినప్పటికీ, సంబంధిత ఉన్నతాధికారే సీడీఎంఏకు పంపించాల్సి ఉంటుంది. అన్నీ తెలిసి, సదరు అధికారులతో కుమ్మక్కవడం వల్లే తప్పుడు సమాచారాన్ని పంపించారన్న ఆరోపణలున్నాయి. నగరపాలక సంస్థ కోరిన మేరకు సీడీఎంఏ ఒకవేళ విచారణకు ఆదేశిస్తే నిజాలు వెల్లడి కానున్నాయి. ఇవి చదవండి: కర్ణాటకనే దిక్కు! ‘ట్రైడెంట్’లో ఊసేలేని చెరకు క్రషింగ్.. -
మేజిక్‌లో ఏ టెక్నిక్ వాడుతున్నారో కాస్త చెబుతారా సార్!
మేజిక్‌లో ఏ టెక్నిక్ వాడుతున్నారో కాస్త చెబుతారా సార్! -
ఫైళ్లు మాయంపై దర్యాప్తు జరగాల్సిందే...
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో ఫైళ్లు మాయం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయించాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బాధ్యులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి ఆఫీసుతో పాటు ఇతర విభాగాల్లో కూడా ఫైళ్లు, ఇతర వస్తువులను తరలించే ప్రయత్నాన్ని ప్రజలందరూ చూశారని, స్థానికులు, పోలీసులు అప్రమత్తమవడంతో వదిలేసి వెళ్లిపోయారని వివరించారు. ఇలాంటి ఘటనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ధీరజ్‌పై రాహుల్‌కు ఎందుకంత ప్రేమ? మూడు రోజులుగా కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు ఇంటిపై ఐటీ అధికారుల దాడులు నిర్వహిస్తున్న తీరు దేశం మొత్తం విస్తుపోయేలా చేసిందని, నగదు దొరకడం చరిత్రలోనే మొదటిసారి అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ధీరజ్ సాహు ఆపార్టీ నేత రాహుల్ గాందీకి అత్యంత సన్నిహితుడని, చిన్న చిన్న విషయాలకు స్పందిస్తూ ట్విట్టర్ లో పోస్టులు పెట్టే రాహుల్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో మూడు సార్లు ఓడిపోయినా కూడా ధీరజ్ సాహును మూడు సార్లు రాజ్యసభ ఎన్నుకున్నారని, ధీరజ్‌పై ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారో రాహుల్ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసే ముఖ్యమంత్రులను, ఎంపీలను ఏటీఎంలుగా మార్చుకుందని, ఆ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అవినీతి మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుందని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం నుంచి రూ. వందల కోట్లను తెలంగాణ ఎన్నికలకు తరలిస్తూ పట్టుబడటం చూశామన్నారు. ధీరజ్ సాహులాగే కర్ణాటకలో మరో నాయకుడు నుండి ఈ డబ్బు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కర్ణాటకలో ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్రంలో బీజేపీ శాసనసభాపక్షనేత ఎంపికపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అదంతా దుష్ప్రచారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి తాను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారని.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి అసత్యాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నవారిపై సోమ వారం పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. -
TS: మాసబ్‌ట్యాంక్ పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ అదృశ్యం?
సాక్షి, హైదరాబాద్: మాసబ్‌ట్యాంక్ పశుసంవర్ధక శాఖలో ఫైల్స్ అదృశ్యమైనట్లు సమాచారం. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ ఆఫీస్‌లో ఫైల్స్ మాయం కావడంపై కలకలం రేగుతోంది. కిటికీ గ్రిల్స్ తొలగించి ఫైల్స్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. ఓఎస్డీ కల్యాణ్, ఆపరేటర్ మోహన్ ఎలిజ, వెంకటేష్, ప్రశాంత్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమైన ఫైల్స్ ఎత్తుకెళ్లినట్లు సమాచారం. నిన్ననే ఫైల్స్ మాయం అయినట్లు అధికారులు గుర్తించారు. సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్‌కు అధికారులు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలంలో ఆధారాలను డీసీపీ సేకరించారు. ఆ శాఖ డైరెక్టర్‌ను సెంట్రల్ జోన్ డీసీపీ.. ప్రశ్నించగా, ఫైల్స్ మాయంపై ఎలాంటి సమాచారం లేదంటూ ఆయన సమాధానం ఇచ్చారు. ఫైల్స్ అదృశ్యంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. కాగా, పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయమైనట్లు వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని పశుసంవర్ధక శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ కల్యాణ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన సచివాలయం ప్రారంభమై 9 నెలలు కావొస్తుందని, మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న నాటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయాన్ని నూతన సచివాలయంలోని రెండో అంతస్తులోకి తరలించి కార్యకలాపాలు నిర్వహించామని తెలిపారు. మంత్రి ఆమోదం కోసం వచ్చిన ఫైల్స్‌ను నిర్దిష్టమైన విధానంలో ఎప్పటికప్పుడు పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో అందజేయడం జరిగిందని వివరించారు. శాఖాపరమైన ఫైల్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ కార్యాలయంలోనే ఉంటాయని తెలిపారు. ఫైల్స్ మాయమైనట్లు వస్తున్న ఆరోపణలు, వార్తలు పూర్తిగా నిరాధారం, అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని కళ్యాణ్ తెలిపారు. ఇదీ చదవండి: TS: సీఎంవో కార్యాలయంలో కేటుగాడు.. ప్రోటోకాల్ ఆఫీసర్ పేరుతో.. -
తెలంగాణ: హుషారుగా నామినేషన్ల జాతర (ఫొటోలు)
-
శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు?
ముంబయి: ఎన్సీపీలో ఇరు వర్గాల మధ్య వివాదం ఇంకా కొనసాగుతోంది. పార్టీలో ఎలాంటి చీలిక రాలేదని సీనియర్ నాయకులు అజిత్ పవార్, శరద్ పవార్లు ప్రకటించినప్పటికీ ఇరుపక్షాల నుంచి ఇంకా విభజనకు సంబంధించిన వివాదాలు కొనసాగుతున్నాయి. శరద్ పవార్ గ్రూప్ ఎమ్మెల్యేలపై అజిత్ పవార్ వర్గం అనర్హత వేటుకు సిద్ధమైంది. ఈ మేరకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గానికి మద్దతు ఇస్తున్నారని ఎమ్మెల్యేల పేర్లు పేర్కొంటూ స్పీకర్‌కు అజిత్ వర్గం ఫిర్యాదు చేసింది. మొదట అజిత్ పవార్ వర్గానికి చెందిన 41 మంది ఎమ్మెల్యేలపై శరద్ పవార్ వర్గం అనర్హత పిటిషన్‌ను దాఖలు చేసింది. దీని తర్వాత అజిత్ పవార్ వర్గం కూడా ఈ చర్యలకు పూనుకుంది. అనర్హత వేటు పిటిషన్లో శరద్ పవార్ వర్గానికి చెందిన జయంత్ పాటిల్, జితేంద్ర అవద్, రోహిత్ పవార్, రాజేష్ తోపే, అనిల్ దేశ్‌ముఖ్, సందీప్ క్షీరసాగర్, మాన్సింగ్ నాయక్, ప్రజక్తా తాన్పురే, రవీంద్ర భూసార, బాలాసాహెబ్ పాటిల్ ఉన్నారు. అనర్హత పిటిషన్ జాబితా నుంచి నవాబ్ మాలిక్, సుమన్ పాటిల్, అశోక్ పవార్, చేతన్ తుపేలను మినహాయించారు. ఎన్సీపీ జాతీయాధ్యక్ష పదవిపై ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ సమక్షంలో ఇరు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. అజిత్ వర్గం పిటిషన్‌పై అక్టోబర్ 6న ఇరువర్గాలను ఈసీ విచారణకు పిలిచింది. పార్టీ జాతీయాధ్యక్షున్ని తాము ఎన్నుకున్నామని అజిత్ వర్గం ఈసీకి పిటిషన్ దాఖలు చేసింది. అజిత్ పవార్ తిరుగుబాటుతో జులైలో ఎన్సీపీలో చీలిక వచ్చింది. తన వర్గం ఎమ్మెల్యేలతో అజిత్ పవార్.. శివ సేన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతునిచ్చారు. అనంతరం తన వర్గమే నిజమైన ఎన్సీపీ అని ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్సీపీలో ఎలాంటి చీలిక రాలేదని ఇటీవల ఇరుపక్షాల నాయకులు చెప్పారు. అయినప్పటికీ తాజాగా ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇదీ చదవండి: చంద్రయాన్ 3: విక్రమ్ ల్యాండర్, రోవర్ మేల్కొలుపు! -
ఐపీవోకి ఆస్క్ ఆటోమోటివ్
న్యూఢిల్లీ: బ్రేక్-షూ, అడ్వాన్స్డ్ బ్రేకింగ్ సిస్టమ్స్ తయారీ సంస్థ ఆస్క్ ఆటోమోటివ్ .. పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా నిధులను సమీకరించనుంది. దీనికి సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలను సమర్పించింది. వీటి ప్రకారం ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ఉండనుంది. ప్రమోటర్లు కుల్దీప్ సింగ్ రాఠీ, విజయ్ రాఠీ 2,95,71,390 షేర్లను విక్రయించనున్నారు. ప్రస్తుతం కుల్దీప్‌నకు 41.33 శాతం, విజయ్‌కి 32.3 శాతం వాటాలు ఉన్నాయి. ఇష్యూ పూర్తిగా ఓఎఫ్ఎస్ విధానంలోనే ఉంటుంద కాబట్టి ఐపీవో నిధులన్నీ ప్రమోటర్లకే లభించ నున్నాయి. కంపెనీకి చెందవు. ఆస్క్ ఆటోమోటివ్కి టీవీఎస్ మోటర్ కంపెనీ, హీరో మోటోకార్ప్, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, బజాజ్ ఆటో వంటివి క్లయింట్లుగా ఉన్నాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ వాటా దాదాపు 50 శాతంగా నమోదైంది. (SaradhaChitFundScam: పెట్టుబడిదారుల సొమ్ము రికవరీకి శారదా ఆస్తుల వేలం) గురుగ్రామ్‌కు చెందిన ఆస్క్ ఆటోమోటివ్ 2022 ఆర్థిక సంవత్సరంలో సుమారు 50 శాతం మార్కెట్ వాటాతో భారతదేశంలో ద్విచక్ర వాహనాల కోసం బ్రేక్-షూ, అధునాతన బ్రేకింగ్ సిస్టమ్‌ల అతిపెద్ద తయారీదారులలో ఒకటిగా ఉంది. (MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ) మరిన్ని ఇంట్రస్టింగ్ వార్తలు, బిజినెస్ వ న్యూస్ కోసం చదవండి: సాక్షిబిజినెస్ -
అనుమతి లేకుండా సచిన్ ఫోటో వాడుకుంటున్న డిగ్రీ కంపెనీ
-
మంత్రులు.. తొలి సంతకాలు
సాక్షి, హైదరాబాద్: నూతన సచివాలయ ప్రారంభం అనంతరం మంత్రులు వారికి కేటాయించిన చాంబర్లకు చేరుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య తమకు కేటాయించిన సీట్లలో కూర్చున్నారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సిద్ధం చేసిన ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు. ఏ మంత్రి.. ఏ ఫైలుపై సంతకం చేశారంటే.. కేటీఆర్ (ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ): డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం. హరీశ్‌రావు (ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి): రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో 1,827 స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీ ఫైలుపై తొలి సంతకం. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు సాయం కింద రూ.151.64 కోట్ల నిధుల విడుదల ఫైలుకూ క్లియరెన్స్. గంగుల కమలాకర్ (పౌరసరఫరాల, బీసీ సంక్షేమ శాఖ): అంగన్వాడీలకు పోషకాలతో కూడి న సన్నబియ్యం పంపిణీ ఫైలుపై తొలి సంతకం. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ల వార్షిక ప్రణాళికల ఫైలుపై మరో సంతకం. తలసాని శ్రీనివాస్ యాదవ్ (పశుసంవర్థక, మత్య్స శాఖ): ఉచిత చేపపిల్లల పంపిణీ ఫైలుపై తొలిసంతకం చేశారు. గొర్రెల పంపిణీ కోసం ఎన్సీడీసీ నిధుల విడుదల, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ సమీపంలో నిర్మిస్తున్న విజయ మెగా డెయిరీ పనులకు రూ.75కోట్ల గ్రాంటు విడుదల ఫైళ్లకు ఆమోదం. సత్యవతి రాథోడ్ (గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ): అంగన్వాడీల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సంపూర్ణ ఆహార పథ కానికి ఇకపై బలవర్ధక సన్నబియ్యంతో కూడిన ఆహారాన్ని అందించే ఫైలుపై తొలి సంతకం. మల్లారెడ్డి (కార్మిక, ఉపాధి కల్పన శాఖ): కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవ్వనున్న శ్రమశక్తి అవార్డుల ఫైలుపై తొలి సంతకం. కొప్పుల ఈశ్వర్ (ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమశాఖ): దళితబంధు పథకం రెండో విడత లబ్దిదారుల ఎంపిక ఫైలుపై తొలి సంతకం. ఎర్రబెల్లి దయాకర్‌రావు (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ): రాష్ట్రంలో ఏర్పాటైన కొత్త మండలాల్లో ఐకేపీ భవన నిర్మాణాలకు సంబంధించిన ఫైల్‌పై తొలి సంతకం. మహమూద్ అలీ (హోంమంత్రి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లలో జోన్ల పునర్వ్యవస్థీకరణ, కొత్త పోలీస్ స్టేషన్లలో పోస్టుల మంజూరు ఫైలుపై తొలి సంతకం. శ్రీనివాస్‌గౌడ్ (ఎక్సైజ్, యువజన సర్వీసుల శాఖ): రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ కప్ క్రీడాపోటీల నిర్వహణ ఫైలుపై తొలి సంతకం. సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (వ్యవసాయ, సహకార శాఖ): రైతులకు రాయితీపై పచి్చరొట్ట విత్తనాల పంపిణీ ఫైలుపై తొలి సంతకం. అసెంబ్లీ నియోజకవర్గాల్లో చెక్‌డ్యాంల నిర్మాణానికి సంబంధించిన ఫైలుపై రెండో సంతకం. వేముల ప్రశాంత్‌రెడ్డి (రోడ్లు, భవనాల శాఖ): రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ పునర్వ్యవస్థీకరణ ఫైలుపై తొలి సంతకం. జగదీశ్‌రెడ్డి (విద్యుత్ శాఖ): వ్యవసాయానికి రూ.958.33 కోట్ల విద్యుత్ రాయితీ విడుదల ఫైలుపై తొలి సంతకం. ఇంద్రకరణ్‌రెడ్డి (దేవాదాయ, న్యాయ, అటవీ, పర్యావరణ శాఖ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాలుగు జిల్లాల్లో వంద ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం వర్తింపజేసే ఫైలుపై తొలి సంతకం. ప్రధాన దేవాలయాల్లో తృణధాన్యాలతో కూడిన ప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చే ఫైలుపై రెండో సంతకం. సబితారెడ్డి (విద్యాశాఖ): ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 19,800 మంది టీచర్లకు రూ. 34. 25 కోట్లతో ట్యాబ్‌లు అందజేసే ఫైలుపై తొలి సంతకం. 5వేల ప్రాథమిక పాఠశాలల్లో లైబ్రరీ కార్నర్ల ఏర్పాటు ఫైలుపై మరో సంతకం. అజయ్‌కుమార్ (రవాణాశాఖ): కొత్త జిల్లాల్లో రవాణాశాఖ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించిన ఫైలుపై తొలి సంతకం. -
ట్విటర్ డీల్ వివాదం: మస్క్ మరో కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్, ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. 44 బిలియన్ డాలర్ల ట్విటర్ కొనుగోలు ఒప్పందంనుంచి తప్పుకోవడంతో ట్విటర్ మస్క్‌పై చట్టపరమైన పోరాటానికి దిగింది. ఈ నేపథ్యంలో మస్క్ శుక్రవారం ట్విటర్‌కు వ్యతిరేకంగా 164 పేజీల కౌంటర్సూట్ దాఖలు చేశారు. ట్విటర్ పిటిషన్‌పై ఈ అక్టోబర్ 17 నుండి ఐదు రోజుల పాటు విచారణ ప్రారంభం కానుందని డెలావేర్ కోర్టు ప్రకటించిన అనంతరం ఈ వ్యాజ్యం దాఖలు చేయడం విశేషం. కాగా నకిలీ ఖాతాల వెల్లడి విషయంలో ట్విటర్ సరియైన సమాచారాన్ని అందించ లేదంటూ వాదించిన ఎలాన్ మాస్క్ ట్విటర్ కొనుగోలు డీల్‌నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. దీంతో మస్క్ నిర్ణయంతో తమ వ్యాపారానికి విఘాతం కలిగిందని, ఒప్పందాన్ని కొనసాగించేలా ఆయనను ఆదేశించాలని కోరుతూ ట్విటర్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజా పరిణామంపై ట్విటర్ ఇంకా స్సందించాల్సి ఉంది. చదవండి: విలీనమా.. నో వే! కావాలంటే వారు వెళ్లిపోవచ్చు! -
‘సెక్రెటరీ నా దగ్గరకు వచ్చి రెండు సంతకాలు చేస్తే 300 కోట్లు వస్తాయన్నాడు’
న్యూఢిల్లీ: తన జీవితంలో అవినీతితో ఎప్పుడూ రాజీ పడలేదని అటువంటి పరిస్థితే వస్తే పదవిని కూడా వదులుకునేందుకు సిద్ధపడినట్లు మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తెలిపారు. రాజస్థాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. కాగా సత్యపాల్ మాలిక్ ఆగష్టు 21, 2018లో జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా నియమితులయ్యారు. సంవత్సరం తరువాత అక్టోబర్ 2019లో గోవాకు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన మేఘాలయకు గవర్నర్‌గా పని చేస్తున్నారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తాను జమ్మూ కాశ్మీర్‌కు పోస్ట్ అయిన వెంటనే, తన టేబుల్‌పై రెండు ఫైళ్లు వచ్చాయని తెలిపారు. అవి దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఆరెస్సెస్‌తో అనుబంధం ఉన్న వ్యక్తికి చెందిన సంస్థలవి. కాకపోతే అందులో ఏదో స్కామ్ ఉందని తనకు తెలిసిందని, అందుకు ఆ రెండు ఒప్పందాలను రద్దు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆ ఫైల్‌లను క్లియర్ చేస్తే రూ.300 కోట్లు వస్తాయని తన సెక్రటరీ చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. దీని వల్ల ఒత్తిళ్లు వస్తాయని కూడా కొందరు తెలపడంతో ఆ పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఆ విషయాన్నే అప్పట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తెలియజేయగా, తన నిర్ణయాన్ని ప్రధాని సమర్థించినట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. मेघालय के राज्यपाल प्रधानमंत्री की पोल खोल रहे हैं. जरूर देखा जाए pic.twitter.com/QnwQUiU8VK — Ranvijay Singh (@ranvijaylive) October 21, 2021 -
గూగుల్ డ్రైవ్ వాడుతున్నారా? ఇది మీకోసమే..
ఫొటోలు, వీడియోస్, పీడీఎఫ్-వర్డ్ డాక్యుమెంట్స్, ఇతరత్రా ఫైల్స్‌ను స్టోర్ చేసుకోవడానికి గూగుల్ అందిస్తున్న ఉచిత క్లౌడ్ స్టోరేజ్ .. గూగుల్ డ్రైవ్. తాజాగా గూగుల్ డ్రైవ్ సేవలను ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో కూడా ఉపయోగించుకోవచ్చని యూజర్లకు గూగుల్ తెలిపింది. ఈ మేరకు యూజర్స్ తమ డ్రైవ్‌లోని ఫైల్స్‌ను.. ఇంటర్నెట్నెట్ కనెక్షన్ లేకున్నా యాక్సెస్ చెసుకోవచ్చని తెలిపింది. ► యూజర్స్ డ్రైవ్‌లో ఫైల్స్‌ను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ► తర్వాత ఫైల్ ఓపెన్ చేసి.. కుడివైపు ఉండే మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. ► అక్కడ ఆఫ్‌లైన్ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే సదరు ఫైల్.. ఆఫ్‌లైన్ మోడ్‌కు వెళ్తుంది. అంటే ఎప్పుడైనా ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా ఆఫ్‌లైన్ సెక్షన్లో కనిపిస్తుంది. ► నిజానికి ఇదేం కొత్త ఆప్షన్ కాదు. 2019లోనే గూగుల్ ఈ ఫీచర్‌ను టెస్టింగ్ కోసం తెచ్చింది. ► గూగుల్ డ్రైవ్ వెబ్ ఉపయోగిచేప్పుడు కొన్ని రకాల ఫైల్స్‌ని యాజర్స్ మార్క్ చేసుకునేందుకు అనుమతించింది. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో యూజర్స్‌కి ఆఫ్‌లైన్ ఫీచర్‌ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం డ్రైవ్‌ను ప్లేస్టోర్‌లో తప్పనిసరిగా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ► ఇక యూజర్స్ మ్యాక్, విండోస్ కంప్యూటర్లలో గూగుల్ డ్రైవ్ డెస్క్‌టాప్ యాప్‌ని ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించింది. ఇందులో డ్రైవ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సపోర్టెడ్ ఫైల్స్‌పై రైట్ క్లిక్ చేస్తే ఆఫ్‌లైన్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. డ్రైవ్ వెబ్ యాప్ ఓపెన్ చేస్తే అందులోని ఫైల్స్ మీకు ఆఫ్‌లైన్‌లో కనిపిస్తాయి. ► ఈ ఫీచర్ గూగుల్ వర్క్‌స్పేస్ ఖాతాదారులతోపాటు క్లౌడ్ ఐడెంటిటీ ఫ్రీ, క్లౌడ్ ఐడెంటిటీ ప్రీమియమ్, జీ సూట్ బేసిక్, జీ సూట్ బిజినెట్, సాధారణ ఖాతాదారులకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. డేటా ఫుల్ అయితే.. ప్రస్తుతం 15జీబీ స్టోరేజ్ డేటాను ఉచితంగా అందిస్తుంది. అంతకుమించి ఎక్కువ స్టోరేజ్ కావాలనుకుంటే డబ్బు చెల్లించాల్సిందే. నెలకు 100జీబీ స్టోరేజ్ కోసం రూ. 130 చెల్లించాల్సి ఉంటుంది. అలానే 200జీబీ స్టోరేజ్‌కి రూ. 200, 2టీబీ స్టోరేజ్‌కి రూ. 650 చెల్లించి కొనుగోలు చేసుకోవాలి. ► డ్రైవ్ నుంచి పొరపాటున ఫొటోలు, వీడియోలు, ఫైల్స్ డిలీట్ అవ్వొచ్చు. లేదంటే డిలీట్ చేయొచ్చు. అలాంటి వాటిని తిరిగి తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ట్రాష్‌లో ఆ ఫొటోలు ఉంటాయి. వాటిని రీస్టోర్ గునక కొడితే తిరిగి.. డ్రైవ్ ఫోల్డర్లోకి వచ్చేస్తాయి. ► ఒకవేళ అలా జరగకపోతే.. గూగుల్‌ను సంప్రదించవచ్చు. అప్పుడు టెక్నిషియన్స్, ఎక్స్పర్ట్స్ ద్వారా వాటిని రికవరీ చేయిస్తారు. ► డిలీట్ చేసిన ఫొటోల్ని.. అవసరమైతే పర్మినెంట్‌గా డిలీట్ చేసేయొచ్చు. ► మల్టీ సెలక్షన్లో ఫొటోల్నిగానీ, ఇతర ఫైల్స్‌ను గానీ డ్రైవ్‌లో స్టోర్ చేసేటప్పుడు.. పూర్తిగా అప్లోడ్ అయ్యేదాకా ఆగాలి. లేకుంటే ఆ ఫైల్స్ డ్రైవ్‌లో స్టోర్ కావు. -
క్యాడ్బరీ ఇండియాకు సీబీఐ భారీ షాక్
సాక్షి, ముంబై: ప్రముఖ చాక్లెట్ సంస్థ క్యాడ్బరీ ఇండియాకు భారీ షాక్ తగిలింది. తాజాగా క్యాడ్బరీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసు నమోదు చేసింది. అవినీతి, మోసం ఆరోపణలతో కేసు నమోదు చేసింది. సంస్థకు చెందిన హరియాణా, హిమాచల్ ప్రదేశ్‌లోని 10 ప్రదేశాలలో బుధవారం సీబీఐ దాడులు నిర్వహించింది. ప్రస్తుతం దీనిని మోండెలెజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలుస్తారు. అవినీతి, వాస్తవాలను తప్పుగా చూపించడం, రికార్డుల తారుమారు లాంటి ఆరోపణలను సీబీఐ నమోదు చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని బడ్డిలో ప్రాంత ఆధారిత పన్ను ప్రయోజనాలను పొందేందుకు వాస్తవాలను తప్పుగా చూపి అవినీతికి పాల్పడిందని ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. 2009-11 మధ్య క్యాడ్బరీ కేంద్ర ఎక్సైజ్ అధికారులతో కుట్ర పన్నిందని, 5 స్టార్, జెమ్స్ చాక్లెట్‌ను తయారు చేస్తున్న హిమాచల్ ప్రదేశ్‌లో తన కొత్త యూనిట్ కోసం 241 కోట్ల రూపాయల పన్ను ప్రయోజనాలను పొందారని సీబీఐ ప్రధాన ఆరోపణ. పన్ను మినహాయింపుల కోసం ఎగ్జిక్యూటివ్ బోర్డులోని కొందరు సభ్యులు, ముఖ్య నిర్వాహకులతో కలిసి, రికార్డులను మార్చాలని, మధ్యవర్తుల ద్వారా లంచాలు ఇవ్వడంతోపాటు ఆధారాలను కప్పిపుచ్చారనేది తమ అంతర్గత దర్యాప్తులో బయటపడిందని తెలిపింది. ఇద్దరు సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు నిర్మల్ సింగ్, జస్ ప్రీత్ కౌర్ సహా అప్పటి క్యాడ్బరీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్ అండ్ కంప్లైయన్స్) విక్రమ్ అరోరా, దాని డైరెక్టర్లు రాజేష్ గార్గ్, జైల్‌బాయ్ ఫిలిప్స్ సహా మొత్తం 12 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. పన్ను ప్రయోజనాలు పొందటానికి అధికారులకు లంచాలు, తప్పుడు సమాచారం అందించిందని తెలిపింది. ఆదాయ పన్ను మినహాయింపు పొందే అర్హత లేదని తెలిసినా, మోసపూరితంగా వ్యవహరించిందని వ్యాఖ్యానించింది. అయితే.. దర్యాప్తు సంస్థ నమోదు చేసిన కేసుకు సంబంధించి తమకు ఇంకా ఎటువంటి అధికారిక సమాచార అందలేదని మోండెలెజ్ ఇండియా ప్రతిధి తెలిపారు. -
సీఎం సంతకం చేశాక ఫైల్లో మార్పులు
సాక్షి, ముంబై: ఓ కీలక ఫైల్లో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంతకం చేసిన అనంతరం మా ర్పులు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మంత్రాలయ కార్యాలయంలో పనిచేస్తున్న కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది వర్గాల్లో కలకలం రేపింది. ఈ ఘటనపై స్థానిక మెరైన్‌డ్రైవ్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. ప్రజా పనుల విభాగానికి చెందిన ఓ సూపరింటెండెంట్ ఇంజినీర్ నానా పవార్‌పై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి అదేశించారు. అందుకు సంబంధించిన ఫైల్లో సీఎం సంతకం చేశారు. కానీ, సంతకం చేసిన తరువాత అందులో మార్పులు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి సంతకం చేసిన చోట పైన విచారణ నిలిపివేయాలని రెడ్ పెన్నుతో రిమార్క్ రాసి ఉంది. అయితే విచారణ నిమిత్తం ఈ ఫైల్‌ను పరిశీలించిన మంత్రి అశోక్ చవాన్‌కు అనుమానం వచ్చింది. సీఎం ఉద్ధవ్ సంతకం చేసిన చోట స్థలం లేదు. అయినప్పటికీ సంతకంపైన చిన్న అక్షరాలతో విచారణ నిలిపివేయాలని రాసి ఉంది. ఒకవేళ ఉద్ధవ్ విచారణ నిలిపివేయాలని రిమార్కు రాస్తే స్థలం ఉండేది. కానీ, అక్కడ ఇరుకైన చోట చిన్న అక్షరాలతో రిమార్కు రాయడంపై చవాన్‌కు అనుమానం వచ్చింది. వెంటనే ఈ ఫైల్‌ను ముఖ్యమంత్రి చాంబర్‌కు పంపించారు. ముఖ్యమంత్రి సంతకం చేసిన ప్రతీ ఫైలు స్కాన్ చేస్తారు. అక్కడ పరిశీలించగా స్కాన్ చేసిన పత్రాలపై రెడ్ పెన్నుతో రాసిన ఎలాంటి రిమార్కు లేదు. దీన్ని బట్టి సంతకం చేసిన తరువాతే ఈ మార్పులు జరిగినట్లు స్పష్టమైంది. దీంతో మంత్రాలయలో ఎవరో ఈ పనిచేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై మెరైన్‌డ్రైవ్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
‘ది కశ్మీరీ ఫైల్స్’.. బెదిరింపులకు భయపడను
వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి, పల్లవి జోషి నిర్మించిన చిత్రం ‘ది కశ్మీరీ ఫైల్స్’. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, ప్రకాశ్ బెల్వాడి, మృణాల్ కులకర్ణి, పునీత్ ఇస్సార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని తీసినవాళ్లను, చూసే ప్రేక్షకులను వదిలేదు లేదంటూ కశ్మీరీ మిలిటెంట్ గ్రూప్ బెదిరించినట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ– ‘‘కశ్మీరీ హిందువులపై సాగిన మారణహోమం గురించిన నిజాలు ఇప్పటి తరంలో చాలామందికి తెలియదు. అందుకే ఈ సినిమా తీయాలనుకున్నాను. ఏప్రిల్‌లో సినిమా రిలీజ్ అనుకుంటున్నాం. ఈ సినిమా షూటింగ్‌ను జమ్మూ–కశ్మీర్లో చేసినప్పుడు ఇబ్బందులు ఎదురవలేదు. కశ్మీరీ మిలిటెంట్ గ్రూప్ నన్ను డైరెక్ట్‌గా బెదిరించలేదు. కానీ బెదిరిస్తున్నట్లు ముంబైలో ఉన్న నా స్నేహితులు చెప్పారు. మా సినిమా పోస్టర్, టీజర్ కూడా రిలీజ్ చేయలేదు. అలాంటప్పుడు సినిమా ఎలా ఉంటుందో వారి కెలా తెలుస్తుంది? ప్రజలకు వాస్తవాలు చూపిస్తున్నప్పుడు భయమెందుకు? ఎవరి బెదిరింపులకూ భయపడి సినిమా రిలీజ్ ఆపం. ఈ సినిమా వెనక ఏ రాజకీయ పార్టీ ప్రోద్బలం లేదు. ఇలాంటి వాస్తవ కథలను తెరకెక్కిస్తున్నప్పుడు ప్రభుత్వాలు అండగా ఉండాలి. అప్పుడే మరిన్ని సినిమాలను ధైర్యంగా తీయగలుగుతాం. ప్రస్తుతం ‘ది కశ్మీరీ ఫైల్స్, ఏ1 ఎక్స్‌ప్రెస్’, ‘రాజ రాజ చోర’ చిత్రాల పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘కార్తికేయ 2, గూఢచారి 2, అబ్దుల్ కలాం బయోపిక్’ త్వరలో ఆరంభమవుతాయి. ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌ని హిందీ–తెలుగులో నిర్మిస్తాం’’ అన్నారు. -
నా బిడ్డకు తండ్రి : చిక్కుల్లో బీజేపీ ఎమ్మెల్యే
డెహ్రాడూన్: బీజేపీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు ఉత్తరాఖండ్ రాజకీయాల్లో సెగలు రేపుతున్నాయి. లైంగికంగా లొంగదీసుకొన్నాడంటూ ద్వారహత్ ఎమ్మెల్యే మహేష్ సింగ్ నేగిపై ఓ వివాహిత మహిళ కేసు నమోదు చేయడం కలకలం రేపింది. తన భర్తపై అత్యాచారం కేసు పేరుతో తప్పుడు ఫిర్యాదు చేస్తామని బెదిరించిందనీ, 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందనీ ఎమ్మెల్యే భార్య రీటా నేగి పోలీసులకు ఫిర్యాదు చేసిన రెండు రోజుల తరువాత ఈ పరిణామం చోటుచేసుకుంది. తనపై పలుమార్లు అత్యాచారం చేశారంటూ డెహ్రాడూన్ కు చెందిన ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పొరుగున ఉండే తాను 2016లో తన తల్లి అనారోగ్యానికి సంబంధించి తొలిసారి అతణ్ని కలిశానని చెప్పారు. ఈ నేపథ్యంలో 2016 - 2018 మధ్య తనను లైంగికంగా లొంగదీసుకున్నాడని, తన పెళ్లి తరువాత కూడా తనపై బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. చివరకు భర్త దగ్గరకు వెళ్లొద్దని ఆదేశించాడని, ఆయన ఒత్తిడి కారణంగానే తన అత్తమామలు,భర్తపై తప్పుడు కేసులు పెట్టానని చెప్పారు. దీంతో విషయాన్ని భర్తకు వివరించడంతో అతను తనతో తెగదెంపులు చేసుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొంది. ఫలితంగా తను ఈ ఏడాది మే18న ఒక బిడ్డకు జన్మనిచ్చానని తెలిపారు. నిజానిజాలను తెలుసుకునేందుకు తన బిడ్డకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు ఈ వ్యవహారంపై నోరువిప్పకుండా ఉండేందుకు ఎమ్మెల్యే భార్య గతంలో తనకు 25లక్షలు రూపాయలు ఆఫర్ చేశారని కూడా ఆమె ఆరోపించారు. అటు తన భర్త రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తానని, తన కొడుకును చంపేస్తానంటూ బెదిరించిందని నేగి భార్య ఆరోపించారు. ఈ ఫిర్యాదులను ధృవీకరించిన డెహ్రాడూన్ డీఐజీ అశోక్ కుమార్ బ్లాక్ మెయిల్ ఆరోపణలపై మహిళ, తల్లి తదితరులపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ రెండు కేసులపై దర్యాప్తు జరుగుతోందన్నారు. మరోవైపు ఈ ఆరోపణలను నిరాధారమైనవంటూ ఎమ్మెల్యే కొట్టిపారేశారు. అడ్డదారిలో డబ్బులు సంపాదించి, రాజకీయ నాయకులుగా మారడానికి ఒక ముఠా పనిచేస్తోందని ఆరోపించారు. త్వరలోనే నిజాలు బహిర్గతమవుతాయన్నారు. పోలీసుల దర్యాప్తు ఫలితాల ఆధారంగా పార్టీ చర్యలు తీసుకుంటుందని ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు బన్సిధర్ భగత్ ప్రకటించారు. దీనిపై రెండేళ్ల తర్వాత ఆ మహిళ ఎందుకు ఫిర్యాదు చేసిందనేది కూడా తేలాల్సి ఉందన్నారు. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రీతమ్ సింగ్ మండిపడుతున్నారు. నిజాలు నిగ్గు తేల్చేందుకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. -
ఎంగిలి వాడకండి.. యూపీ అధికారి ఆదేశాలు
లక్నో : అధికారులు, ఇతర ఉద్యోగులు డాక్యుమెంట్లు, ఫైల్ల పేజీలను తిప్పటానికి ఎంగిలి ఉపయోగించకూడదని రాయబరేలీ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆదేశాలు జారీచేశారు. పేజీలను తిప్పటానికి ఎంగిలి ఉపయోగించే అలవాటును మానేయటం ద్వారా అంటురోగాలను నివారించొచ్చనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీడీఓ(చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్) అభిషేక్ గోయల్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న చాలా మంది డాక్యుమెంట్లు, ఫైల్‌లను తిప్పడానికి ఎంగిలి ఉపయోగిస్తున్నారని, తద్వారా వారు అంటురోగాల బారిన పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అభిషేక్ గోయల్ నిర్ణయం మేరకు జిల్లా స్థాయిలోని అందరు అధికారులు, ఉద్యోగులు పేజీలను తిప్పడానికి ఎంగిలి ఉపయోగించకూడదని, అందుకు బదులుగా వాటర్ స్పాంజ్‌లను వాడాలని ఆదేశారు జారీ అయ్యాయి. ఈ నెల పదవ తేదీన ఆదేశాలు జారీ కాగా, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఆర్డర్స్ కాపీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
చెన్నమనేనికి హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ తీసుకున్న నిర్ణయం అమలును 4 వారాలపాటు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తన పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఈనెల 20 జారీ చేసిన ఉత్తర్వులను ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం విచారించారు. భారత పౌరసత్వ చట్టం–1955లోని సెక్షన్ 10 ప్రకారం చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేయడం చెల్లదని ఆయన న్యాయవాది వాదించారు. కేంద్ర హోం శాఖ 2017 డిసెంబర్ 13న జారీ చేసిన ఆదేశాల తరహాలో తిరిగి సాంకేతికంగానే నిర్ణయం తీసుకుందన్నారు. 2017 నాటి రివ్యూ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిందని, అప్పుడు జారీ చేసిన ఉత్తర్వులను కేంద్రం పట్టించుకోలేదని నివేదించారు. మళ్లీ అదే తరహాలో రద్దు నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. పాస్‌పోర్టు చట్టంలోని సెక్షన్10ని ఉల్లంఘిస్తేనే పౌరసత్వం రద్దు చేయడానికి వీల్లేదని అదే చట్టంలోని సెక్షన్ 10(3) స్పష్టం చేస్తోందని తెలిపారు. భారత పౌర సత్వం కోసం 2008 మార్చి 31న చెన్నమనేని దరఖాస్తు చేసుకుంటే 2009 ఫిబ్రవరి 3న పౌర సత్వం వచ్చిందని, ఈ మధ్యకాలంలో చెన్నమనేని జర్మనీలో పది మాసాలు ఉంటే, భారత్‌లో కేవలం 2 నెలలే ఉన్నారని కేంద్రం తరఫు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వర్‌రావు వాదించారు. చెన్నమనేని పౌరసత్వ రద్దు నిర్ణయంపై జోక్యం చేసుకోవాల్సినదేమీ లేదని, ఇదే విధంగా 2009 నుంచి ఆయన వాదిస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చేతిలో ఓడిపోయిన ఆదిశ్రీనివాస్ తరఫు న్యాయవాది పేర్కొ న్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి చెన్నమనేని పౌరసత్వం కోసం చేసుకున్న దరఖాస్తు, దానిపై జరిగిన లావాదేవీల ఫైళ్లను తమ ముందుంచాలని కేంద్ర హోంశాఖను ఆదేశించారు. అనంతరం విచారణను డిసెంబర్ 16కి వాయిదా వేశారు. -
సచివాలయం ఫైళ్లన్నీ భద్రం
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలోని ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ఫైళ్లన్నీ భద్రంగా ఉన్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. అసెంబ్లీలో పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. సచివాలయం తరలింపులో భాగంగా ఫైళ్లను జాగ్రత్త చేసేందుకు ప్రతి శాఖకు ఓ కస్టోడియన్ అధికారిని నియమించామని, ఫైళ్లన్నీ భద్రపర్చేందుకు అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్, వయోపరిమితి పెంపు అంశం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరిశీలనలో ఉందన్నారు. బాషా పండితులు, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడేషన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఇప్పటివరకు 1.49 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, 1.17 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీకి చర్యలు తీసుకున్నట్లు వివరించారు. కొన్ని కోర్టు కేసుల నేపథ్యంలో ఉద్యోగ ప్రకటనలు ఇవ్వలేకపోయినట్లు తెలిపారు. పోటీ పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్‌లోనే కాకుండా ఉర్దూలో కూడా నిర్వహించాలని ఎమ్మెల్యే ఖాద్రీ ప్రభుత్వాన్ని కోరగా.. మంత్రి స్పందిస్తూ టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహిస్తున్న పరీక్షలను ఉర్దూలో కూడా నిర్వహించినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు గతంలో 42 శాతం పీఆర్సీ అడిగితే కేసీఆర్ 43 శాతం ఇచ్చి రికార్డు సృష్టించారని తెలిపారు. ఈసారి కూడా తప్పకుండా ఉద్యోగులు సంతృప్తిపడేలా ఫిట్మెంట్ ఇస్తారని హామీ ఇచ్చారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా భారీ మొత్తంలో వేతనాలు పెంచారని తెలిపారు. 2018 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 130 ఏసీబీ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. -
ఆలో‘చించే’ పడేశారా?
సాక్షి, హైదరాబాద్ : నిన్న మొన్నటి వరకు విలువైన కాగితాలేనని భద్రంగా దాచిపెట్టుకున్న కాగితాలను ఇప్పుడు ముక్కలుముక్కలుగా చించేసి పడేశారు. ఇది కూల్చివేతకు సిద్ధ మవుతున్న రాష్ట్ర సచివాలయ భవనాల్లోని దృశ్యం. సామాన్య ప్రజలతో పాటు వివిధ వర్గాల నుంచి వందలు, వేల సంఖ్యలో వచ్చిన అర్జీలను ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టిన సచివాలయ అధికారులు.. చివరకు సచివాలయ కార్యాలయాల తరలింపును సాకుగా చూపుతూ ఇలా వదిలించుకుని చేతులు దులుపుకుంటున్నారనే అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల నుంచి వచ్చిన అర్జీలతో పాటు పాత జీవోల కాపీలు, సర్క్యులర్లు, ప్రభుత్వ శాఖల మధ్య అంతర్గత వ్యవహారాలకు సంబంధిం చిన పాత లేఖలు, ప్రభుత్వ సమావేశాలకు సంబంధించిన కాగితాలను ముక్కలు ముక్కలుగా చించి చిందరవందరగా పడేస్తు న్నారు. పాత సచివాలయ భవనమంతా కుప్పలుతెప్పలుగా పడేసిన కాగితాల కుప్పలే దర్శనమిస్తున్నాయి. ఏ రోజైనా తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందని అర్జీలు పెట్టుకున్న వ్యక్తులు ఓ వైపు నిరీక్షిస్తుంటే.. వారికి తెలియకుండానే వీటన్నింటినీ బుట్టదాఖలు చేసేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చించిపడేసిన కాగితాల్లో వివిధ సమస్యలపై సామాన్య ప్రజల నుంచి వచ్చిన అర్జీలే ఎక్కువగా ఉండడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. రోజూ సచివాలయానికి వందల సంఖ్యలో ప్రజలు వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని అర్జీలు పెట్టుకుంటూ ఉంటారని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతస్థాయి వ్యక్తుల సిఫారసులు ఉన్న కొన్నింటికి మాత్రమే పరిష్కార యోగం లభిస్తుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. సాదాసీదా వ్యక్తుల అర్జీలు ఏళ్ల తరబడి సంబంధిత సెక్షన్ల అధికారుల వద్దే పెండింగ్‌లో ఉంటాయని, ఇలా నిర్లక్ష్యానికి గురైన ఫైళ్లను అవసరమైనప్పుడు వెతికినా దొరకని విధంగా వాటిని ఎక్కడో పడేస్తారని ఓ సీనియర్ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఇలా అదృశ్యమైన తమ ఫైళ్లను వెతుక్కుంటూ వచ్చే వారు ఎందరో ఉంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం సచివాలయం ఖాళీ చేస్తున్న తరుణంలో ఇలాంటి ఫైళ్లు, అర్జీలు బయటపడితే వాటిని అక్కడికక్కడే చించిపారేస్తున్నారన్నారు. ఇలా మొత్తం సచివాలయం ఖాళీ చేసేసరికి టన్నుల కొద్దీ కాగితాలు, పాత ఫైళ్లు బుట్టదాఖలు కావడం ఖాయమని సచివాలయ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్కే భవన్‌కు ఫైళ్లు ప్రస్తుత సచివాలయంలోని భవనాలన్నింటినీ కూల్చివేసి అక్కడే ఆధునిక సదుపాయాలతో కొత్త సచివాలయ భవన సముదాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత సచివాలయ భవనాలను ఖాళీ చేసే క్రమంలో.. ఇక్కడి కార్యాలయాలను తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌కు తరలిస్తోంది. గత సోమవారం ప్రారంభమైన సచివాలయం శాఖల కార్యాలయాల తరలింపు వేగవంతమైంది. సాధారణ పరిపాలన శాఖ సూచనల మేరకు ఫైళ్లు, ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర సామగ్రికి సంబంధించిన జాబితాలను అన్ని శాఖలు తయారు చేసుకున్నారు. తరలింపు సమయంలో ఫైళ్లు, ఇతర సామగ్రి గల్లంతు కాకుండా ఈ జాబితాలను ఉపయోగిస్తున్నారు. అయితే, ప్రజల నుంచి వచ్చిన అర్జీల ఫైళ్లను ‘ప్రాధాన్యత లేనివి’గా పరిగణించి వాటిని తాత్కాలిక సచివాలయానికి తరలించకుండా ఇక్కడే వదిలించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సచివాలయం డీ–బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని సంక్షేమ శాఖలు, కమర్షియల్ ట్యాక్సుల శాఖలు, పై అంతస్తుల్లోని రెవెన్యూ, సీ–బ్లాక్ తొలి అంతస్తులో జీఏడీ కార్యాలయాల వద్ద ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా చించిపడేసిన కాగితాలే కనిపిస్తున్నాయి. ప్రధానంగా సంక్షేమ శాఖలు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాల లబ్ధిదారుల నుంచి వచ్చిన అర్జీలను ఏళ్ల తరబడి అపరిష్కృతంగా పెట్టి ఇప్పుడు బుట్టదాఖలు చేశారనే విమర్శలొస్తున్నాయి. తక్షణమే సచివాలయ తరలింపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గడువు విధించడం కూడా ప్రాధాన్యత లేని ఫైళ్లు, కాగితాలపై ఆలోచించకుండానే పడేస్తున్నారన్న చర్చమొదలైంది. -
ఫైల్ ప్లీజ్...
సాక్షి, సిటీబ్యూరో: నగర శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే కావల్సిన ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్, మాస్టర్ ప్లాన్ కరెక్షన్స్ దరఖాస్తుల క్లియరెన్స్ ప్రక్రియ నిలిచిపోవడం ‘మహా’ దరఖాస్తుదారులకు చుక్కలు చూపెడుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దాదాపు ఆరు నెలల పాటు ఈ ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియ ముందుకు జరగకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో కష్టాలకోర్చి కొన్న భూమి ఆగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రియల్ జోన్‌కు మార్చాలంటూ కొందరు, అగ్రికల్చర్ నుంచి రెసిడెన్షియల్ జోన్‌కు మార్చాలంటూ మరికొందరు, ఇండస్ట్రియల్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్‌కు మార్చాలంటూ ఇంకొందరు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు దరఖాస్తులు చేశారు. అయితే హెచ్ఎండీఏ అధికారులు సైట్ ఇన్స్పెక్షన్కు వెళ్లి ఆయా పరిస్థితులను గమనించి నివేదిక తయారుచేసి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్(ఎంఏయూడీ)కి పంపారు. అయితే ఆరు నెలల నుంచి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వల్ల ఆ ఫైళ్ల కదలికలో వేగం లేదు. వీటిని ఆమోదించాల్సిన పురపాలక శాఖ మంత్రి కూడా లేకపోవడం కూడా ఈ ఫైళ్ల ఆలస్యానికి కారణంగా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ పురపాలక శాఖ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఈ ఫైళ్ల క్లియరెన్స్‌కు ప్రత్యేక అధికారాలను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి అప్పగించి త్వరితగతిన క్లియర్ చేసేలా ఆదేశాలివ్వనున్నారని తెలిసింది. సాధ్యమైనంత తొందరగా ఈ ఫైళ్ల క్లియరెన్స్‌లో నిర్ణయం తీసుకోవాలని ఆయా దరఖాస్తుదారులు కోరుతున్నారు. ఆదాయంపై కసరత్తు భవన నిర్మాణ అనుమతుల కోసం చేసిన కొన్ని దరఖాస్తుల్లో మాస్టర్‌ప్లాన్ రోడ్లు ఉన్నవి కూడా చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. మాస్టర్‌ప్లాన్‌లో 300 ఫీట్ల రోడ్డు పోతున్నా క్యాడెస్ట్రియల్ కరెక్షన్ కోసం మున్సిపల్ అడ్మినిస్ట్రేన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కు వచ్చిన వాటిని కూడా త్వరతిగతిన పరిష్కరించాలని అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. దీనివల్ల ప్రభుత్వానికి కోట్ల ఆదాయం సమకూరడటంతో పాటు శివారు ప్రాంతాల అభివృద్ధిలో వేగం పెరుగుతుందన్నారు. దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతుల కోసం చేసుకున్న దరఖాస్తులను క్లియరెన్స్ చేసే పనిపై ప్రస్తుత హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడూ ఆయా ప్లానింగ్ విభాగాధిపతులతో సమీక్షలు చేస్తూ ఎదురవుతున్న సమస్యలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. చాలావరకు దరఖాస్తులు ఎన్వోసీల వల్లే పెండింగ్‌లో ఉండటంతో కామన్ అప్లికేషన్(సింగిల్ విండో పద్ధతి)ని ఆన్లైన్ చేశారు. దీనివల్ల అనుమతుల కోసం హెచ్ఎండీఏకు దరఖాస్తు చేసుకున్న సమయంలోనే ఇరిగేషన్ ఎన్వోసీ కావాలంటూ ఇరిగేషన్ అధికారులకు, నాలా సర్టిఫికెట్ కావాలంటే రెవెన్యూ అధికారులకు వెళ్లేలా తెచ్చిన కొత్త అప్లికేషన్ ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించారు. సాధ్యమైనంత తొందరగా దరఖాస్తుదారులకు అందుబాటులోకి తేనున్నారు. -
నామినేషన్ల జోరు
సాక్షి, నిజామాబాద్: నామినేషన్ల పర్వం జోరందుకుంది. మూడో రోజు జిల్లావ్యాప్తంగా 12 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం మంచి రోజు కావడంతో టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. బాన్సువాడ స్థానానికి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బాల్కొండ స్థానానికి వేముల ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్ అర్బన్ స్థానానికి బిగాల గణేశ్‌గుప్తా, ఆర్మూర్ స్థానానికి ఆశన్నగారి జీవన్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. పోచారం ఉదయం సరస్వతి మాత మందిరం, అయ్యప్పస్వామి మందిరాల్లో కుటుంబసభ్యులతో కలిసి పూజలు చేశారు. మాతృమూర్తి పాపమ్మ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. పార్టీ గుర్తు అంబాసిడర్ కారులో బాన్సువాడ తహసీల్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను అందజేశారు. వేముల ప్రశాంత్‌రెడ్డి లింబాద్రి గుట్టపై లక్ష్మీనర్సింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి బాల్కొండ తహసీల్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు. భీంగల్ చర్చిలో ఫాదర్ ఆశీర్వాదం తీసుకున్నారు. బిగాల గణేశ్‌గుప్తా నిజామాబాద్ నగరంలో అయ్యప్పస్వామి, వాసవీకన్యకాపరమేశ్వరి మాత, విఠలేశ్వరస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం అంబాసిడర్ కారును నడుపుకుంటూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను అందజేశారు. బిగాల గణేశ్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి కూడా టీఆర్ఎస్ పేరుమీద నామినేషన్ వేశారు. ఆర్మూర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన ఆశన్నగారి జీవన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బాన్సువాడ కాంగ్రెస్ టికెట్ ఆశించిన వెల్తుర్ల మల్యాద్రిరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నిజామాబాద్ అర్బన్ స్థానానికి బహుజన సమాజ్‌పార్టీ అభ్యర్థిగా రమేష్ రాశమల్లు, బహుజన లెఫ్ట్ పార్టీ అభ్యర్థిగా హెచ్ఎం ఇస్మాయిల్ మొహమ్మద్ నామినేషన్లు వేశారు. బోధన్ స్థానానికి శివసేన అభ్యర్థిగా పాసులోటి గోపికృష్ణ, ఆర్మూర్ స్థానానికి అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగాఎస్ చరణ్‌కుమార్ నామినేషన్లు వేశారు. నేడు ఎంపీ కవితతో కలిసి.. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితతో కలిసి నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ స్థానాలకు బిగాల గణేశ్‌గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డిలు గురువారం మరోమారు నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించారు. కామారెడ్డి జిల్లాలో.. సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ రెండుసెట్లు వేశారు. బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి తరపున ఆయన అనుచరులు నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక నామినేషన్ దాఖలయ్యింది. టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి తరపున ఆయన బంధువులు, పార్టీ నేతలు నామినేషన్ వేశారు. జుక్కల్ నియోకజ వర్గంలో నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థులుగా సౌదాగర్ గంగారాం, ఆయన భార్య సావిత్రి నామినేషనన్లు వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా శోభావతి షింధే, ఇండిపెండెంట్‌గా ప్రకాశ్‌నాయుడు నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 12న మొదలైన నామినేషన్ల ప్రక్రియ.. 19 వరకు కొనసాగనుంది. తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాని విషయం తెలిసిందే.. రెండో రోజు రెండు నామినేషన్లు రాగా.. మూడో రోజు తొమ్మిది నామినేషన్లు దాఖలయ్యాయి. -
ఐసీఐసీఐకు మరో ‘నీరవ్’ కుచ్చుటోపీ
సాక్షి,ముంబై: ఐసీఐసీఐ బ్యాంకు లిమిటెడ్‌కు ఒక డైమండ్ కంపెనీ టోపీ పెట్టింది. దీంతో ఇప్పటికే వీడియోకాన్ రుణాల వివాదంతో సంక్షోభంలో చిక్కుకున్న బ్యాంకు మరోసారి చిక్కుల్లో పడింది. ముంబైకి చెందిన డైమండ్ కంపెనీ కోట్లాది రూపాయల రుణాన్ని చెల్లించకుండా డీఫాల్ట్ అయింది. దీంతో అక్టోబర్ 4వతేదీన ఆ కంపెనీ పై ఐసీఐసీఐ బ్యాంకు కేసు పెట్టింది. ముంబైకి చెందిన ష్రూంజ్ అండ్ కంపెనీ సుమారు రూ.88.25 కోట్లు(12 మిలియన్ డాలర్లు) చెల్లించాల్సి ఉందని బ్యాంకు ఆరోపించింది. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకుండా మోసం చేసిందని ఆరోపిస్తూ సదరు డైమండ్ కంపెనీ సహా పదకొండు మంది ఎగ్జిక్యూటివ్స్‌పై అమెరికా కోర్టులో కేసులు నమోదు చేసింది. న్యూయర్క్ ఐసీఐసీఐ బ్రాంచ్ ఆర్ఐసీఓ ఉల్లంఘన చట్టం కింద సదరన్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ వేసింది. తీసుకున్న డబ్బు మొత్తాన్ని యూఎస్, యూఏఈ ల్లోని షెల్ కంపెనీల్లోకి మళ్లించారని బ్యాంకు తెలిపింది. తద్వారా ఆర్ఐసీఓ చట్టాన్ని పలుమార్లు ఉల్లంఘించారని బ్యాంకు అధికారులు తెలిపారు. అయితే ఇప్పటివరకు తమకు ఎలాంటి నోటీసులు అందలేదని ష్రూంజ్ & కో. ప్రతినిధి తెలిపారు. కాగా 226 కోట్ల రూపాయల రుణాన్ని ఎగవేసిందని ఆరోపిస్తూ ష్రూంజ్ అండ్ కంపెనీపై బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ ఏడాది ఆగస్టులో ముంబైలోని ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. బీవోఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్షియానికి 1113కోట్ల రూపాయల మొత్తం బకాయి పడిందనీ, దీంతో డైమండ్ సంస్థపై దివాలా చర్యలు తీసుకోవాలని కోరింది. -
ముద్రగడపై చార్జిషీట్ల నమోదుకు రంగం సిద్ధం
రాజమహేంద్రవరం క్రైం : మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంపై కోర్టులో చార్జీషీట్లు దాఖలు చేసేందుకు సీఐడీ పోలీసులు సిద్ధమవుతున్నారు. డీజీపీ సాంబశివరావు ఆదేశాల మేరకు ముద్రగడను అరెస్టు చేసే ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. తునిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దహనం, మరికొన్ని కేసులతో కలిపి 69 కేసులను సీఐడీ అధికారులు నమోదు చేశారు. వీటిని దర్యాప్తు చేసేందుకు సీఐడీ విభాగంలోని విశాఖపట్నం, విజయవాడ, రాజమహేంద్రవరం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరితగతిన దర్యాప్తు జరిగితే మరో రెండు రోజుల్లో కోర్టులో చార్జిషీట్లు దాఖలు చేస్తామని సీఐడీ అధికారులు చెబుతున్నారు. సుమారు 50 నుంచి 60 వరకూ చార్జిషీట్లు దాఖలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ విధంగా ముద్రగడను జైలుకు తరలిస్తే ఉద్యమాన్ని అణిచివేయవచ్చనేది ప్రభుత్వ ప్యూహంలా కనిపిస్తోందని పలువురు నాయకులు అంటున్నారు. -
విచారణ ’పుష్కర’కాలం కొనసాగుతోంది
-
‘వంగవీటి’ సినిమాను నిషేధించాలి
కాపు నేతల డిమాండ్ కొత్తపేటలో థియేటర్ వద్ద ధర్నా కొత్తపేట : కాపు కులస్తులను ప్రదానంగా దివంగత కాపు నాయకుడు వంగవీటి రాధా, మోహనరంగా సోదరులను రౌడీలుగా చిత్రీకరించిన వంగవీటి సినిమాను వెంటనే నిషేధించాలని రాష్ట్ర బీజేపీ కిసా¯ŒS మోర్చా కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం, జిల్లా కాపు యువత సభ్యుడు పెదపూడి బాపిరాజు, మండల కాపు యువత నాయకులు డిమాండ్ చేశారు. సినిమాకు వంగవీటి పేరు పెట్టి వంగవీటి వంశాన్ని రౌడీలుగా చిత్రీకరించి, వారి ప్రత్యర్థి వర్గాన్ని హీరోలుగా చూపించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. కృష్ణా జిల్లా, విజయవాడలో గతంలో జరిగిన వాస్తవ సంఘటనలకు విరుద్ధంగా దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఒక వర్గానికి కొమ్ముకాసి వారు చెప్పినట్టు సినిమా తీశారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో సెన్సార్ బోర్డును, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి కాపు యువత సభ్యులు నాగిరెడ్డి మణికంఠ, బండారు నరేష్ తదితరులు నాయకత్వం వహించారు. -
కనీస వేతనం కోసం వీఆర్ఏల ధర్నా
మచిలీపట్నం (చిలకలపూడి) : గ్రామ స్థాయిలో రెవెన్యూ శాఖలో కీలకంగా పని చేస్తున్న తమకు కనీస వేతనం చెల్లించాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు ఎన్సీహెచ్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో 151 ప్రకారం వీఆర్ఏలకు కనీస వేతనం నెలకు రూ.18 వేలు 010 పద్దు ద్వారా చెల్లించాలని కోరారు. వీఆర్ఏ, అటెండర్, వాచ్‌మన్ తదితర ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. వీటి నియామకంలో వీఆర్ఏలకు 75 శాతం పోస్టులను వీఆర్ఏలతో భర్తీ చేయాలన్నారు. పదవీవిరమణ చేసిన వీఆర్ఏలకు రెవెన్యూ ఉద్యోగులతో సమానంగా పదవీ విరమణ సదుపాయాలను కల్పించాలన్నారు. రాజధాని, ప్రత్యేక ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏలకు అదనపు అలవెన్స్‌లు ఇవ్వాలని కోరారు. అనంతరం కలెక్టర్ బాబు ఏకు వినతిపత్రం అందజేశారు. సంఘ నాయకుడు పి.వి.రాఘవేంద్రరావు, సీఐటీయూ నాయకులు సిహెచ్ రవి, బూర సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. 104 ఉద్యోగుల ధర్నా సీఐటీయూ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం 104 కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సీహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రన్న సంచార చికిత్స పథకంలో ఉద్యోగులందరికీ జీవో 151 ప్రకారం ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని కోరారు. 2016 ఏప్రిల్ నుంచి ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం పీఎస్‌ఎంఆర్‌ఐ సంస్థ వేతనాలు చెల్లించటం లేదన్నారు. సిబ్బందిని అక్రమంగా బదిలీ చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. గ్రామ స్థాయిలో వైద్య సేవలందించే తమకు తగినంత మందులు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కలెక్టర్ బాబుఏకు వినతిపత్రం అందజేశారు. -
రాష్ట్రానికి వారసత్వ హోదా ఫైల్
కడప కల్చరల్ : గండికోటకు ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చేందుకు అవసరమైన వివరాలు సేకరించే ఫైలు మన రాష్ట్రంలోని కేంద్ర పురావస్తు శాఖకు చేరినట్లు విశ్వసనీయ సమాచారం. గండికోటకు ప్రపంచ వారసత్వ హోదా ఇవ్వాలని గుంటూరుకు చెందిన పర్యాటక అభిమాని జాస్తి వీరాంజనేయులు కోరారు. రాష్ట్రంలోని మొత్తం 5పర్యాటక ప్రాంతాలకు హోదా ఇవ్వాలని ఆయన నేరుగా ప్రధానమంత్రి కార్యాలయంలో విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన కార్యాలయం అక్కడి కేంద్ర పర్యాటక శాఖను దీనికి సంబంధించిన వివరాలను సేకరించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా జాస్తి వీరాంజనేయులు వారసత్వ హోదా విషయంలో తొలి ప్రాధాన్యత గండికోటకు ఇవ్వాలని మరో వినతి పత్రమిచ్చారు. దాన్ని కూడా స్వీకరించిన పర్యాటక శాఖ అధికారులు దాన్ని కేంద్ర పురావస్తు శాఖకు బదిలీ చేస్తూ ఆ 5 ప్రాంతాల పూర్తి వివరాలను తమకు అందజేయాలని కోరారు. తొలి ప్రాధాన్యత గండికోటకే ఇస్తూ.. మన రాష్ట్రంలోని కేంద్ర పురావస్తు శాఖ కార్యాలయానికి గండికోటకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలని ఆదేశాలు పంపారు. ప్రస్తుతం ఆ కార్యాలయ అధికారులు గండికోటకు సంబంధించిన భౌగోళిక వివరాలతోపాటు చారిత్రక కట్టడాలు, శాసనాలు, ఇతర పురావస్తుల వివరాల రికార్డును సిద్ధం చేస్తున్నారు. తమ పరిధిలోని మిగతా నాలుగు ప్రాంతాల వివరాలను కూడా పంపేందుకు వివరాలు సేకరిస్తున్నారు. త్వరలో గండికోటకే ప్రత్యేక కన్సల్టెంట్‌ను నియమించనున్నారు. ఆయనతో కలిసి ఈ ప్రాంతంలో కేంద్ర పురావస్తు శాఖ రాష్ట్ర అధికారులు గండికోటకు సంబంధించిన సమగ్రమైన సర్వే, వీడియో, ఫొటోలను సేకరించి కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు. మొత్తానికి గండికోటకు ప్రపంచ వారసత్వ హోదా ఇవ్వాలన్న డిమాండు ఇంత దూరం రావడంపట్ల జిల్లా పర్యాటక అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్ దసరా కానుక
-
కేసీఆర్ దసరా కానుక.
-
టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దసరా కానుక
హైదరాబాద్: టీఆర్ఎస్ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దసరాకానుక ఇచ్చారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టి పార్టీ నేతల్లో ఉత్సాహం నింపారు. ఈ మేరకు ఆదివారం 9 కార్పొరేషన్లకు చైర్మన్ పదవులను భర్తీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పదవులు దక్కింది వీరికే.. ► టీఎస్ ఆగ్రో చైర్మన్‌గా లింగంపల్లి కృష్ణారావు ► సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పెద్ది సుదర్శన్ రెడ్డి ► టీఎస్ ఐఐసీ చైర్మన్‌గా బాలమల్లు ► తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా వెంకటేశ్వర్ రెడ్డి ► కుడా చైర్మన్‌గా మర్రి యాదవ్ రెడ్డి ► ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఈద శంకర్‌రెడ్డి ► ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బండ నరేందర్ రెడ్డి ► వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా మందల శామ్యూల్ ► షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా రాజయ్య యాదవ్ -
వరంగల్ మండలం ఫైళ్ల విభజన
పోచమ్మమైదాన్ : వరంగల్ మండలాన్ని విభజిస్తున్నందున తహసీల్దార్ కార్యాలయంలో ఫైళ్ల విభజన ఆదివారం ప్రారంభమైంది. వరంగల్ మండలంలో 3లక్షల కంటే ఎక్కువ జనాభా ఉండగా పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతుండటంతో నూతనంగా ఖిలావరంగల్ మండల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఖిలావరంగల్ తహసీల్దార్ కార్యాలయాన్ని యాకుబ్పురాలోని ఎస్టీ హాస్టల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. వరంగల్ మండలానికి మట్టెవాడ, రామన్నపేట, లక్ష్మీపురం, దేశాయిపేట గ్రామాలు, ఖిలావరంగల్ మండలానికి ఖిలావరంగల్, రంగశాయిపేట, ఉర్సు గ్రామాలతో ఏర్పాటు చేయనున్నారు. అయితే తహసీల్దార్ కార్యాలయంలో భూముల పహాణీలు, ఆర్సీలు, ఇతర ఫైళ్లు విభజన చేస్తున్నారు. -
ఆ ఫైల్ రాలేదంటే కుదరదు..
ఆన్లైన్లో జిల్లా కార్యాలయాల ఫైళ్ల వివరాలు క్రోడీకరణ నిమగ్నమైన అన్ని శాఖల అధికారులు విభజనకు గురయ్యే డివిజన్లు, మండల కార్యాలయాల్లోనూ ఫైళ్ల విభజన సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాల్లో దసరా పండగ నుంచే పాలన ప్రారంభించాలని ప్రభుత్వం ముందుకెళుతోంది. మరి కొత్త జిల్లాల్లో పరిపాలన షురూ కావాలంటే ఫైల్స్ తప్పనిసరి., ప్రజలు వివిధ పనుల నిమిత్తం కొత్త జిల్లాల్లోని కార్యాలయాలకు వెళితే ఆ అంశానికి సంబంధించి ఫైలు ఇంకా ఇక్కడికి రాలేదు.. ఆ ఫైల్ దొరకడం లేదు.. ఇలా అధికారుల నుంచి సమాధానం వచ్చే అవకాశాలున్నాయి.. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ఫైళ్ల విభజన, కంప్యూటరీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఆయా శాఖలకు సంబంధించి ఏ ఫైల్ ఎక్కడుంది.? అది ఏ ప్రాంతానికి సంబంధించినది.? కరెంట్ ఫైల్స్ ఏవీ.? క్లోజ్డ్ ఫైల్స్ ఏవీ.? ఆయా ఫైళ్ల సబ్జెక్టు ఏందీ.. ఇలా పాలనకు అవసరమైన ఫైళ్లకు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్లో క్రోడీకరించే ప్రక్రియలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ఆయా కార్యాలయాల్లో సర్క్యులేషన్లో ఉన్న ఫైల్ ఏవీ..? రికార్డుల కోసం భద్రపరచాల్సిన పాత ఫైళ్ల వివరాలను ఇలా అన్నింటి సమాచారాన్ని సేకరిస్తున్నారు. వీటన్నింటిని ఆన్లైన్లో క్రోడీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో అన్ని శాఖల్లో ఈ ప్రక్రియ ఊపందుకుంది. తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఈ వివరాలను క్రోడీకరిస్తున్నారు. ఆయా శాఖల జిల్లా ఉన్నతాధికారులకు ఐడీ, పాస్వర్డ్ జారీ చేశారు. ఫైల్ నెం, సబ్జెక్టు, సంవత్సరం, వంటి అన్ని వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. జిల్లా స్థాయి టాస్క్ఫోర్ ఉన్నతాధికారులు ఈ ఫైళ్ల కంప్యూటరీకరణ ప్రక్రియ ప్రగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోనే రెవెన్యూ శాఖలో అత్యధికంగా ఫైళ్లుంటాయి. ఈ రెవెన్యూ, సర్వే, ల్యాండ్ రికార్డు శాఖల్లో కీలకమైన భూములకు సంబంధించిన ఫైళ్లు ఉండడంతో అధికారులు ఈ శాఖలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. విభజనకు గురయ్యే డివిజన్లు, మండలాల్లోనూ.. కేవలం జిల్లా స్థాయి కార్యాలయాలతోపాటు విభజనకు గురయ్యే రెవెన్యూ డివిజన్లు, మండలాల్లోనూ ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. రెండు మూడు రోజుల్లో డివిజన్ స్థాయి కార్యాలయాల్లోనూ ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని కలెక్టరేట్‌కు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో బెల్లంపల్లి, భైంసా రెవెన్యూ డివిజన్లుగా ఏర్పడనున్నాయి. దీంతో ఈ డివిజన్లకు సంబంధించిన కార్యాలయాల్లోనూ ఫైళ్ల విభజన అనివార్యమవుతోంది. అలాగే ఉట్నూర్, ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్లలోని కొన్ని మండలాల పరిధిలో మార్పులు, చేర్పూలు జరుగుతున్నాయి. దీంతో ఈ డివిజన్లలోనూ ఫైళ్ల విభజన చేపట్టనున్నారు. కొత్త మండలాలు ఏర్పడుతున్న మండల కార్యాలయాల్లోనూ ఈ ఫైళ్ల విభజన చేపట్టాల్సిన అవసరం తప్పనిసరిగా మారింది. ముందుగా ఆదిలాబాద్ మండలంలో మావలను, మంచిర్యాల మండలంలో నస్పూర్‌ను కొత్త మండలాలుగా ఏర్పాటు చేయాలని భావించారు. ఈ మేరకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేశాక మరో ఏడు కొత్త మండలాలు తెరపైకి వచ్చాయి. ఆదిలాబాద్ రూరల్, చింతలమానేపల్లి, పెంచికల్పేట్, నార్నూర్ మండలం గాదిగూడ, ఖనాపూర్ మండలం పెంబీ, ముథోల్ మండలం బాసర, నిర్మల్ మండలం సోన్ ఇలా ఏడు కొత్త మండలాలకు జిల్లా ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపారు. దీంతో కొత్తగా ఏర్పడనున్న ఈ మండలాల్లోని అన్ని కార్యాలయాల్లోనూ ఫైళ్ల విభజన ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. -
వేగం పెంచాలి
రెండు రోజుల్లో ఫైళ్ల విభజన పూర్తిచేయాలి ఉన్న భవనాలు మరమ్మతులు చేయించుకోండి ప్రస్తుతానికి రెండు జిల్లాలపైనే స్పష్టత ఉంది భూపాలపల్లిలో ఐటీఐ భవనం తీసుకోండి అధికాలకు కలెక్టర్ కరుణ ఆదేశం హన్మకొండ అర్బన్ : ‘మరో నెల రోజుల్లో అంతా కొత్త జిల్లాల్లో ఉంటారు.. సమయం తక్కువగా ఉంది.. భవనాల పరిశీలన, మరమ్మతులు చేయిచుకోవడం, సామగ్రి చేరవేయడం వంటి పనులు వేగంగా చేయాలి’ అని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ అధికారులతో అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో గురువారం రాత్రి కలెక్టరేట్లో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రసుతం మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలపై మాత్రమే స్పష్టత ఉన్నందున వాటిని దృష్టిలో ఉంచుకుని పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. రెండు రోజుల్లో అన్ని ప్రభుత్వ శాఖలు తమ పరిధిలోని ఫైళ్లు పూర్తి స్థాయిలో అప్లోడ్ చేయాలన్నారు. భూపాలపల్లి ఐటీఐలో కార్యాలయాలు ప్రస్తుతం సింగరేణి భవనాలు ఇవ్వడానికి వారు సుముఖంగా లేనందున ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం ప్రభుత్వ ఐటీ ఐ భవనం కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. శాఖల వారీగా అవసరాన్ని బట్టి భవనంలో గదులు కేటయించినట్లు తెలిపారు. శుక్రవారం అధికారులు శాఖల వారీగా తమకు కేటాయించిన గదులు పరిశీలించి అవసరం మేరకు చిన్నచిన్న మార్పులు చేసుకోవాలన్నారు. కలెక్టరేట్లో ఉద్యోగులకు క్యాబిన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొత్త జిల్లాల్లో పనిచేసే అధికారులకు, ఉద్యోగులకు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పిచే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. విభజన ప్రక్రియలో ప్రతి అధికారి పూర్తి బాధ్యతగా వ్యహరించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, డీఆర్వో శోభ వివిధ శాఖల అధికారులు ఉన్నారు. -
కేసునమోదు
ఆత్మకూరు(ఎం) : తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో కల్యాణలక్ష్మి పథకం కింద ఆర్థికసాయం పొందడానికి దరఖాస్తు చేసుకున్న మండలంలోని కూరెళ్ల గ్రామానికి చెందిన జింజిరాల రామచంద్రు–వరలక్ష్మిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.శివనాగప్రసాద్ బుధవారం విలేకరులకు తెలిపారు. గ్రామానికి చెందిన రామచంద్రు–వరలక్ష్మి ఫిబ్రవరి నెలలో కూతరు వివాహం కాగా ఏప్రిల్‌లో వివాహమైనట్టు వివాహ పత్రికను ముద్రించి కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఆర్ఐ డి.సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
‘గూడెం’.. దస్త్రం
ఫైళ్ల పంపకాలు షురూ కలెక్టర్ పర్యవేక్షణలో చురుగ్గా పనులు ఖమ్మం: ‘కొత్త’ కదలిక జోరందుకుంది. కార్యాలయ భవనాల ఎంపిక, అధికారుల క్వార్టర్ల ప్రక్రియ కొనసాగుతుండగానే.. కీలక దశ అయిన దస్త్రాల విభజన శ్రీకారం చుట్టుకుంటోంది. ‘ఉమ్మడి’ ఖమ్మం నుంచి ‘గూడెం’ జిల్లా ‘వేరు’బడుతుండడంతో ఫైళ్ల పంపకాలు చేసేస్తున్నారు. సిబ్బంది కేటాయింపు జాబితా రూపొందిస్తున్నారు. ప్రస్తుత కలెక్టరేట్లోని ఓఎస్డీ, ఎంహెచ్సీ, లీగల్‌సెల్, ఐటీ, ఎన్నికల విభాగాలు విడిపోనున్నాయి. ఉద్యోగులతో పాటు వాటా కింద వాహనాలు, ఫర్నిచర్ తరలిపోనున్నాయి. దసరా పండగ నుంచి సరి‘కొత్త’ పాలనకు చకచకా పనులు సాగుతున్నాయి. కొత్తగూడెం జిల్లా ఏర్పాటవుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో విభజన మొదలైంది. అన్ని శాఖల ఫైళ్లు విభజిస్తుండగా, రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా నుంచే కొత్త జిల్లాల్లో పూర్తిస్థాయిలో పాలన నిర్వహించాలని ఆదేశించడంతో..కలెక్టర్ లోకేష్‌కుమార్ ప్రత్యేక దృష్టితో ఉన్నతాధికారులకు ఫైళ్ల పంపిణీపై దిశానిర్దేశం చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి బి.శ్రీనివాస్ పర్యవేక్షణలో కలెక్టరేట్లోని ప్రధాన విభాగాల దస్త్రాలను వేరు చేయిస్తున్నారు. ఇక్కడ పూర్తి కాగానే..మిగతా శాఖల్లో చేపట్టనున్నారు. ‘ఇల్లెందు’వైపు కొంత..‘కొత్త’గా అంతా.. ఖమ్మం జిల్లాలోని ఫైళ్లను కొత్తగూడెం జిల్లాలోకి వచ్చే మండలాలకు సంబంధించినవి వేరుగా సిద్ధం చేస్తున్నారు. వరంగల్ నుంచి కొత్తగా ఏర్పడుతున్న మహబూబాబాద్ జిల్లాలోకి ఇల్లెందు నియోజకవర్గం నుంచి గార్ల, బయ్యారం కలవనున్న తరుణంలో..ఆయా మండలాల ఫైళ్లను కూడా విభజిస్తున్నారు. ప్రస్తుతం కొత్తగూడెం జిల్లాకు సంబంధించి కలెక్టరేట్లోని ఏ, బీ, ఓఎస్డీ ,ఎంహెచ్సీ, లీగల్‌సెల్, ఐటీ, ఎలక్షన్ విభాగాల దస్త్రాలను విడదీస్తున్నారు. ప్రతి విభాగం..కానుంది ప్రత్యేకం – ప్రస్తుతం కలెక్టరేట్లో ‘ఏ సెక్షన్‌లోని ఉద్యోగుల బదిలీ, పోస్టింగ్, రీయింబర్స్మెంట్లను వేరు చేస్తున్నారు. – బీ సెక్షన్లో భూముల వివరాలు, ఆర్ఓఆర్, ల్యాండ్ డిస్పుట్స్, ల్యాండ్ ఎలాట్మెంట్ దస్త్రాలు విభజిస్తున్నారు. – ప్రభుత్వ, ప్రైవేట్ భూముల వ్యవహారాలకు సంబంధించిన ఫైళ్లను సిద్ధం చేస్తున్నారు. – ఎంహెచ్సీ సెక్షన్లో (మెజిస్టీరియల్ హెడ్ క్లర్క్), స్వాతంత్య్ర సమరయోధులు, అమరవీరుల వివరాలు, సినిమాహాళ్లు, గన్‌లైసెన్స్ వివరాల జాబితాలు రూపొందిస్తున్నారు. – ఓఎస్డీ సెక్షన్లో ప్రకృతి వైపరీత్యాలు, భూమి శిస్తులు, ఆరోగ్యశ్రీ, ఆపద్బంధు, క్యాస్ట్ ఎంక్వయిరీ, జమాబందీ తదితర అంశాలను వేరు చేస్తున్నారు. – ఎలక్షన్, ఐటీ, లీగల్ సెల్ విభాగాలను రెండు వైపులా విడదీస్తున్నారు. సమీక్షలు..పర్యవేక్షకులు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన హరితహారం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనుల్లో, మరుగుదొడ్ల నిర్మాణాల్లో జిల్లా అగ్రభాగంలో ఉంది. ఇదే ఒరవడిని జిల్లాల పునర్విభజనలోనూ కొనసాగించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఇటీవల కలెక్టర్ లోకేష్‌కుమార్‌కు సూచించారు. దీంతో..కలెక్టర్ ప్రతిరోజూ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి పనుల వేగవంతంపై దిశా నిర్దేశం చేస్తున్నారు. ఏడుగురు జిల్లా అధికారులను విభజన పర్యవేక్షుకులుగా నియమించి ప్రక్రియను వేగిరం చేస్తున్నారు. ఒరిజినలా..? జిరాక్సులా..? – పునర్విభజనలో భాగంగా రెండు జిల్లాల మండలాల ఫైళ్లను వీడదిస్తున్న క్రమంలో..కొత్తగూడెం జిల్లాకు ఒరిజినల్ ఫైళ్లను పంపాలా..? లేక జిరాక్సు ప్రతుల దస్త్రాలను పంపాలా..? అనే అంశంపై స్పష్టత లేదు. – ప్రస్తుతానికైతే..అన్ని ఫైళ్లను స్కానింగ్ చేస్తున్నారు. – మండలాల వారీగా అన్నీ వేరు చేసి ఉంచుతున్నారు. – కొత్త మండలాల ఏర్పాటు ఉహాగానాలు వస్తుండడంతో..దస్త్రాలను ఉంచనున్నట్లు తెలిసింది. -
ఏవియేషన్ శాఖ సరికొత్త నిర్ణయం
న్యూఢిల్లీ :విమానప్రయాణికుల సమస్యల సత్వర పరిష్కార దిశగా ఏవియేషన్ మంత్రిత్వశాఖ అడుగులు వేస్తోంది. విమానసంస్థలకు వ్యతిరేకంగా ప్రయాణికులు తమ ఫిర్యాదులను దాఖలు చేసేందుకు వీలుగా ఓ వెబ్‌సైట్‌ను లాంచ్ చేయాలని ఏవియేషన్ మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఆ ఫిర్యాదులను విమానసంస్థలకు పంపించి, సత్వరమే సమస్య పరిష్కారం అయ్యేలా ఆ వెబ్‌సైట్‌ను రూపొందించనున్నారు. ఏవియేషన్ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఆలోచన మేరకు ఈ ప్లాట్‌ఫాంను ఏర్పాటుచేయనున్నట్టు ఆ మంత్రిత్వశాఖ తెలిపింది. విమానయానం చేసేటప్పుడు ఏదైన సమస్య ఎదురై మనోవేదనకు గురైనప్పుడు.. ఆ సమస్యను విమానసంస్థలకు తెలియజేయడానికి ఇప్పటివరకు సరియైన ప్లాట్ ఫామే లేదు. ఈ నేపథ్యంలో ఏవియేషన్ మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఏవియేషన్ మంత్రిత్వ శాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లోని సభ్యులు ఈ ప్లాట్‌ఫాంను నిర్వహించనున్నట్టు సీనియర్ అధికారులు చెబుతున్నారు. అయితే ఇంకా ఎవరన్నది తెలియరాలేదు. సోషల్ మీడియా లాంటి వివిధ సమాచార మాధ్యమాల ద్వారా విమానసంస్థలకు ఫిర్యాదులను అందిస్తున్న ప్రయాణికులకు, ఈ వెబ్సైట్ సమస్యల సత్వర పరిష్కారానికి ఓ ప్లాట్ఫామ్లాగా దోహదం చేయనుంది. ప్రయాణికులు ఫిర్యాదును విమానసంస్థలకు తెలియజేయాలనుకున్నప్పుడు.. ప్రయాణికుల ఏవియేషన్ అందించే ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయి, ఫిర్యాదును నమోదుచేయాల్సి ఉంటుంది. అనంతరం ఆ ఫిర్యాదును విమానసంస్థకు పంపిస్తారు. నిబంధనలకు అనుగుణంగా ఫిర్యాదును విమానసంస్థలు పరిష్కరిస్తాయి. ఏవియేషన్ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని విమాన ప్రయాణికులు స్వాగతిస్తున్నారు. అయితే ప్రయాణికులు సమస్యలు తెలియజేయడానికి తమ దగ్గర సిస్టమ్స్ ఉన్నాయని విమాన సంస్థలు అంటున్నాయి. సోషల్ మీడియా సైట్ల ద్వారా సమస్యలు తెలుసుకుని, ఫిర్యాదులను పరిష్కృతం చేస్తున్నామని ఓ ఎయిర్‌లైన్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. దానికంటే ఎక్కువగా సమస్యల పరిష్కారానికి ఈ వెబ్సైట్ దోహదం చేయగలదా అని ప్రశ్నిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటుచేయడం అద్భుతమైన అడుగని ఎయిర్ ప్యాసెంజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి తెలిపారు. -
‘పన్ను’కు విరుగుడు పొదుపే!!
♦ ఇన్వెస్ట్‌మెంట్‌కు ఏడాది మొత్తం గడువు ♦ ఆఖరు నిమిషంలో హడావుడి పడితే మొదటికే మోసం ♦ మొదట అవగాహన; ఆ తరవాతే సాధనం ఎంపిక ♦ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే గరిష్టంగా పన్ను ప్రయోజనం రిటర్నుల దాఖలుకు ఆఖరి రోజులివి. మామూలుగా అయితే ఈ సమయానికి గడువు ముగిసిపోయేది. కాకపోతే ఐటీ విభాగం గడువును ఇంకో ఐదు రోజులు పొడిగించింది. నిజానికి చాలామంది రిటర్నులు ఇప్పటికే దాఖలు చేసేశారు. మరికొందరు ‘ఆఖరి నిమిషం’ వ్యక్తులు మాత్రం... గడువు పొడిగించటంతో హమ్మయ్య అంటూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. నిజానికి వాళ్లు కూడా అప్పటివరకూ రిటర్నులు వేసేద్దామని రోజూ అనుకుంటూనే ఉంటారు. కానీ వేసేది మాత్రం చివర్లోనే. ఒక్కటి గుర్తుంచుకుంటే... పన్ను ఆదా చెయ్యటానికి పూర్తి ఏడాది సమయం ఉంటుంది. మరి దాన్నెందుకు ఉపయోగించుకోకూడదు? ఆఖరి నిమిషం వరకూ వాయిదా వెయ్యటమెందుకు? ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే కాస్త ప్రణాళికాబద్ధంగా వ్యవహరించలేమా..? అలా చేసి గరిష్టంగా పన్ను ప్రయోజనాలు పొందలేమా? అదెలాగో చూద్దాం... సాధనాలను పరిశీలించాలి.. పైన చెప్పినవన్నీ తెలుసుకున్నాక... పన్ను ఆదా చేసుకునేందుకు ఏం చేయాలన్నది చూడాలి. అందుబాటులో ఉన్న సాధనాల్ని పరిశీలించాలి. ప్రతిదాన్లో అనుకూల, ప్రతికూల అంశాలుంటాయి. వాటిని బేరీజు వేసుకోవాలి. మీ రిస్కు సామర్థ్యంపై మీకు అవగాహన ఉంటే నిర్దిష్ట సాధనాన్ని ఎంచుకోవడం సులభమవుతుంది. ఏ సాధనాన్ని ఎలా ఉపయోగించుకుంటే గరిష్టంగా పన్ను భారాన్ని తగ్గించుకోగలమనేది తెలిస్తే అత్యధిక ప్రయోజనాలు పొందటం వీలవుతుంది. వ్యూహం వేశాకే ఇన్వెస్ట్మెంట్... ⇔ అందుబాటులో ఉన్న పెట్టు బడి సాధనాలన్నింటినీ పరిశీలించాక ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా పెట్టుబడి వ్యూహాన్ని రూపొందించాలి. ఈ వ్యూహం ఎలా ఉండాలంటే.. ⇔ పన్ను ఆదా చేసే డెట్, ఈక్విటీ సాధనాలు రెండింటి మేళవింపుగా ఉండాలి ⇔ ఆర్థికపరమైన బాధ్యతలను నెరవేర్చేందుకు తగినంత కవరేజీ ఉండేలా బీమాకు ప్రాధాన్యమివ్వాలి ⇔ మీ వ్యూహం దీర్ఘకాలం నిలకడగా కొనసాగించగలిగేదిగా ఉండాలి. ఆదాయంలో 75 శాతం పొదుపునకు కేటాయించేసి... దాంతోనే అన్ని అవసరాలూ తీరాలనుకుంటే కుదరదు. ⇔ దీర్ఘకాలికంగా అవసరాలు తలెత్తినప్పుడు మెచ్యూరిటీ మొత్తాలు చేతికి అందివచ్చేలా ఉండాలి. ఇలాంటి లాకిన్ పీరియడ్ ఉన్న సాధనాలు చూసుకోవాలి. ⇔ పెట్టుబడులు ఆశించిన పనితీరు కనబరచని పక్షంలో అవసరమైతే మార్పులు, చేర్పులు చేసుకునే వెసులుబాటునిచ్చేలా వ్యూహం ఉండాలి. ⇔ అన్నింటికన్నా ముందు తెలుసుకోవాల్సిందేమిటంటే... ⇔ {పణాళికలేమీ లేకపోతే పన్ను భారం ఎంత పడుతుంది? పొదుపు పెట్ట్టుబడులతో ముందుకెళితే ఎంత పన్ను కట్టాలి? ⇔ అందుబాటులో ఉన్న వివిధ పన్ను ప్రణాళిక సాధనాలేంటి? ⇔ అసలు మన పొదుపు సామర్థ్యమెంత? నెలవారీ ఖర్చులు పోనూ మిగిలేదెంత? ⇔ గరిష్టంగా పన్ను ప్రయోజనాలు పొందాలంటే ఎంత పొదుపు చెయ్యాలి? ⇔ రాబోయే ఆర్థిక సంవత్సరం వచ్చే పెద్ద పెద్ద ఖర్చులేంటి? ⇔ ఏడాది మొత్తం ఖర్చులు, పెట్టుబడులు ఎలా ఉండబోతున్నాయి? ⇔ ఇవన్నీ తెలుసుకున్నాక అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవాలి. -
అత్యాచారం కేసు నమోదు
కంబాలరాయుడుపేట (వజ్రపుకొత్తూరు) : మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మండలంలోని కంబారాయుడుపేటకు చెందిన వి.షణ్ముఖరావు అదే గ్రామానికి చెందిన 55 ఏళ్ల వివాహిత ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి అత్యాచారం చేసిన సంఘటనలో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు వి.షణ్ముఖరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వజ్రపుకొత్తూరు ఎస్ఐ సీహెచ్ ప్రసాద్ చెప్పారు. అదే గ్రామంలోని బాధితురాలి భర్త ఆదివారం సముద్రంలో చేపల వేటకు వెళ్లగా ఇంటిలో ఒంటరిగా ఉన్న మహిళపై బలవంతం చేసి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఎస్ఐ చెప్పారు. కాశీబుగ్గ రూరల్ సీఐ ఎన్.సన్యాశినాయుడు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రసాద్ వివరించారు. నిందితుడు షన్ముఖరావు పరారీలో ఉన్నట్లు చెప్పారు. -
ట్యాక్స్ రిటర్న్ సందేహాలను నివృత్తి చేసుకోండి
రిటర్నులు దాఖలుకు ఈ నెలాఖరుతో గడువు పూర్తవుతుంది. త్వరపడి మీ బాధ్యతలను నిర్వర్తించండి. మనంతట మనమే మన ఆదాయ పరిమితి దాటితే స్వచ్ఛందంగా రిటర్నులు దాఖలు చేయాలి. ఈ విషయంలో అసెసీలకు అవగాహన పెంపొందించే దిశగా డిపార్ట్మెంట్ వారు ఎన్నో చర్యలు చేపట్టారు. పత్రికల్లో, టీవీల్లో ఈ మేరకు రిటర్నులు సకాలంలో వేయండంటూ ప్రకటనలు ఇచ్చారు. అంతేకాకుండా ఒక వెబ్సైట్ నిర్వహిస్తూ..ఎప్పటికప్పుడు సమాచారాన్ని పొందుపరుస్తున్నారు. అందులో భాగంగా గతవారం కొన్ని ప్రశ్నలు.. వాటికి సమాధానాలు విడుదల చేశారు. * ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో సమస్త సమాచారం * మీ రిటర్నులు మీరే దాఖలు చేసుకోవచ్చు సాధారణంగా అసెసీలకు సందేహాలుంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ అంటేనే.. ఒకరకమైన భయం. ఎన్నో అపోహలు. ఆపై ఏవేవో ఆలోచనలు. రిటర్నులు ఎలా వేయాలి? ఏ ఫారం తీసుకోవాలి? ఎవరు వేయాలి? ఎక్కడ వేయాలి? గడువు తేదీ? ఇలా ఎన్నో ప్రశ్నలు మన మదిలో మెదులుతూ ఉంటాయి. అలాగే పాన్ ఉంటే వేయాలా? ప్రతి సంవత్సరం వేయాలా? పన్ను కడితే వేయాలా? పన్ను భారం లేకపోతే అవసరం లేదా? ఇలాంటి సందేహాలు వస్తుంటాయి. ఇలాంటి ప్రశ్నలకు సైట్లో సమాధానమిచ్చారు. ప్రశ్నలను పూర్తి సమాచారంతో సమగ్రమైన వివరాలతో చిన్న చిన్న ఉదాహరణలతో వివరించారు. ఒక్కొక్క ప్రశ్న చదువుతుంటే మన ల్ని దృష్టిలో పెట్టుకొనే వేశారా? అనిపిస్తుంది. సమాధానాల్లో భాగంగా వివిధ శ్లాబులు, పన్ను రిటర్నులు పొందుపరిచారు. ఏ ఆదాయం ఉంటే ఏ ఫారం వేయాలి? లేదా ఎవరు ఏ ఫారం వేయాలి? ‘ఎవరు’ అన్న ప్రశ్నకి ఆ అసెసీకి ఏయే ఆదాయం ఉందని అడగాలి?. జీతం/పెన్షన్; ఒక ఇంటి మీదే ఆదాయం (నష్టం కాకుండా); ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఇళ్ల మీద ఆదాయం; ఇతర ఆదాయాలు (లాటరీ, గుర్రప్పందాలు కాకుండా); క్యాపిటల్ గెయిన్స్; వ్యాపారం మీద లాభం/నష్టం; వృత్తి మీద లాభనష్టాలు లాంటివి. ఏ ఫారం మీద విదేశీ ఆస్తులు/ఆదాయం వేయాలో పేర్కొన్నారు. కంపెనీలు, ట్రస్టులు, సొసైటీలు ఇలా నిర్దిష్టంగా విభజించారు. ఇదికాకుండా ఏ ఏ ఫారంలో ఏయే ఆదాయాలు చూపించాలి అని ఎంతో వివరంగా చెప్పారు. రిఫండ్‌ను ఎలా క్లెయిమ్ చేయాలి?. ఇన్కమ్ ట్యాక్ రిటర్నులు, ఈ-ఫైలింగ్ ఎలా వేయాలో తెలియజేశారు. రకరకాల పద్ధతులతోపాటు ఎలా వెరిఫై చేయాలో కూడా చెప్పారు. అంతేకాకుండా కొన్నిసార్లు ఉద్యోగస్తుల విషయంలో యాజమాన్యాలు తప్పులు చేస్తూ ఉంటాయి. వీటిని సరిదిద్దుకోవాలి. వాటినన్నింటినీ సైట్లో వివరించారు. పాస్వర్డ్ మరచిపోతే కొత్త పాస్‌వర్డ్‌ను ఎలా తెచ్చుకోవాలో కూడా తెలిపారు. అందుకే వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌ను దర్శించండి. వివరాలు అర్థం చేసుకోండి. మీ రిటర్నులను మీరే దాఖలు చేసుకోవచ్చు. - ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్.మూర్తి , కె.వి.ఎన్ లావణ్య -
రెండేళ్ల బాలుడిని కదిలే రైల్లో నుంచి విసిరేసి..
ముంబై: రెండేళ్ల బాలుడిని ఓ కసాయి తండ్రి కదిలే రైల్లో నుంచి కిందకు విసిరేసిన దారుణ సంఘటన ముంబైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖదీర్ ఖాన్ (40), సమీనా ఖాన్ (32) దంపతులు రంజాన్ సందర్భంగా వారం క్రితం నగరంలోని చౌకీ మొహల్లా నివాసం ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చారు. వీరికి ఐదుగురు కూతుళ్లతో పాటు రెండేళ్ల కొడుకు కైఫ్ ఉన్నాడు. మంగళవారం మధ్యాహ్నం సమీనా బంధువులతో మాట్లాడుతూ కైఫ్ పిల్లలతో ఆడుకుంటున్నాడనుకుని పట్టించుకోకుండా వదిలేసింది. కాసేపటి తర్వాత కైఫ్ కోసం ఇల్లంతా వెతికినా కనిపించకపోవడంతో భర్తకు ఫోన్ చేసింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఖదీర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో జేజే మార్గ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత సమీనాకు ఫోన్ చేసిన ఖదీర్... తానే కైఫ్ ను బైకుల్లా దగ్గరలో కదిలే రైల్లో నుంచి కిందకు విసిరేసినట్లు చెప్పాడు. ఖదీర్ చెప్పిన సమాచారాన్ని సమీనా పోలీసులకు చేరవేసింది. రంగంలోకి దిగిన అధికారులు రైల్వే పోలీసుల సాయంతో రైల్వే ట్రాక్ వద్ద బిడ్డ శవాన్ని కనుగొన్నారు. నిందితుడి ఆచూకీ లేకుండా పోవడంతో అతని కోసం గాలింపు ప్రారంభించారు. -
‘కొత్త ఫైల్’ రెడీ!
♦ దుమ్ము దులిపి.. స్కాన్ చేసి.. ♦ జేసీ పర్యవేక్షణలో రెవెన్యూ ఫైలింగ్ పనులు సాక్షిప్రతినిధి, ఖమ్మం: కొత్తగూడెం జిల్లా ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. కొత్త జిల్లాలో పాలనాపరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఫైళ్ల స్కానింగ్ పనులకు రెవెన్యూ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. జేసీ దివ్య పర్యవేక్షణలో అధికారులు, సిబ్బంది సోమవారం నుంచి పాత ఫైళ్లన్నింటినీ మండలాలు, గ్రామాలవారీగా నంబర్లను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయడంతోపాటు ఒక్కొక్కటిగా స్కానింగ్ చేస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడితే ఫైళ్లన్నీ భద్రంగా పెట్టాలని సీఎం కేసీఆర్ ఇటీవల ఆదేశించడంతో జిల్లా రెవెన్యూ సిబ్బంది ఆ దిశగా పాత ఫైళ్లను దుమ్ముదులిపి క్రమసంఖ్యలో స్కాన్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. దశాబ్దాల క్రితం ఫైళ్లు కూడా ఉండటంతో అవన్నీ శిథిలావస్థకు చేరి.. చిరిగిపోయి ఉన్నాయి. జేసీ సూచనల మేరకు వీటిని రికార్డు గది నుంచి తీసి.. మండలం పేరు, గ్రామం, ఫైల్ సంఖ్యను ముందుగా కంప్యూటర్లో నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత వీటిని స్కాన్ చేసి మండలాలవారీగా కోడ్ నమోదు చేసి.. కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇలా చేస్తే ఎప్పటికైనా సమాచారం భద్రంగా ఉంటుందని జేసీ సూచించడంతో ఉద్యోగులు ఆ పనిలో మునిగిపోయారు. 20 మండలాల సమాచారం కొత్తగూడెం జిల్లాలోకి వస్తాయని భావిస్తున్న 20 మండలాల సమాచారాన్ని స్కానింగ్ చేసే పనిలో ఉద్యోగులు నిమగ్నమయ్యారు. గ్రామాల సరిహద్దులు, నక్షాలు, చెరువు శిఖం, ప్రభుత్వ భూములు, పహాణీలు తదితర వివరాలతో కూడిన ఫైళ్లను సిద్ధం చేస్తున్నారు. కొత్త జిల్లాకు కొత్త అధికారులు వస్తారనే ఆలోచనతో వారికి గ్రామాలు, మండలాలకు సంబంధించిన వివరాలు సులువుగా దొరకాలనే ఉద్దేశంతో ఈ ఫైళ్లను రెడీ చేస్తున్నారు. మండలాలకు సంబంధించిన వివరాలను కంప్యూటర్లో నమోదు చేయడంతోపాటు ఫైళ్లను స్కాన్ చేసే పని అయిన తర్వాత ఖమ్మం జిల్లాలోకి వచ్చే మండలాల ఫైళ్లను కూడా ఇలాగే చేయనున్నారు. ఫైళ్లన్నీ మాన్యువల్‌గా అందుబాటులో ఉండటంతోపాటు మండలం కోడ్‌తో కంప్యూటర్లో కూడా వివరాలను తెలుసుకునేలా చూస్తున్నారు. కొత్త జిల్లాలో ఫలానా గ్రామంలోని సర్వే నంబర్ చూడాలంటే వెంటనే కంప్యూటర్లో చూసుకునే వెసులుబాటు ఉంటుంది. -
ఎస్సీ, ఎస్టీ రైతులకు ట్రాక్టర్లు ఉచితం
సీఎం వద్దకు ఫైలు... ఆమోదం తర్వాత జీవో విడుదల హైదరాబాద్: తెలంగాణ సర్కారు ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా వ్యవసాయ ట్రాక్టర్లు అందజేయాలని నిర్ణయించింది. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ట్రాక్టర్ల సబ్సిడీని మరింత పెంచింది. ప్రస్తుతం అన్ని వర్గాల రైతులకు 50% సబ్సిడీపై వ్యవసాయ ట్రాక్టర్లను ఇస్తుండగా... ఇకనుంచి ఎస్సీ, ఎస్టీ రైతులకు 100% సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. 95% వ్యవసాయశాఖ ద్వారా, మిగిలిన 5% ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ సొమ్ము అందజేయాలని నిర్ణయించింది. ఇప్పటికే గ్రీన్హౌస్ సబ్సిడీని ఎస్సీ, ఎస్టీ రైతులకు 100% చేయగా... దాంతోపాటు ట్రాక్టర్లకూ అమలు చేయాలని నిర్ణయించడం గమనార్హం. సీఎం ఆమోదించాక రెండింటికీ కలిపి త్వరలో జీవోలు విడుదల కానున్నాయి. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100% సబ్సిడీని వ్యక్తిగతంగా ఇవ్వడంతోపాటు ట్రాక్టర్లను అద్దెకు ఇచ్చుకునేట్లయితే దానికీ 100% సబ్సిడీ ఇస్తారు. ఇతర వ్యవసాయ యంత్రాలతోపాటు వీటినీ సరఫరా చేస్తారు. ఇతర వ్యవసాయ యంత్రాలకు మాత్రం అందరికీ ఉన్న సబ్సిడీ ఎస్సీ, ఎస్టీలకూ కొనసాగుతుంది. -
ఇంత విడ్డూరమా?
ఇద్దరు సీఎస్‌లు తిరస్కరించిన ఫైల్‌ను మళ్లీ కేబినెట్‌కు తీసుకెళ్లడమా? ♦ ఉన్నతాధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ ♦ సంచలనం రేకెత్తించిన ‘సంతకానికి ససేమిరా!’ సాక్షి, హైదరాబాద్: సాగునీటి శాఖలో ‘పెదబాబు’, ‘చినబాబు’ అవినీతి సాగుపై ‘సంతకానికి ససేమిరా!’ శీర్షికన ‘సాక్షి’ శనివారం ప్రచురించిన వార్త ఉన్నతాధికార వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు(సీఎస్‌లు) తిరస్కరించిన ‘అంచనాల పెంపు’ ప్రతిపాదనను రెండోసారి మంత్రివర్గం ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకోవడం పట్ల పలువురు సీనియర్ ఐఏఎస్‌లు విస్మయం వ్యక్తం చేశారు. మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన తర్వాత కూడా ‘అంచనాల పెంపు’పై సంతకం చేయడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తిరస్కరించారంటే.. నిబంధనల ఉల్లంఘన ఎంత అడ్డగోలుగా, అసంబద్ధంగా, యధేచ్ఛగా సాగిందనే అంశంపై ఉన్నతాధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంత విడ్డూరమైన వ్యవహారాన్ని ఎప్పుడూ చూడలేదంటున్నాయి. అవినీతి పె తీవ్రంగా స్పందించాల్సిన ప్రభుత్వం.. దానికి రాజముద్ర వేయడానికి ప్రయత్నిస్తోందని మండిపడుతున్నాయి.ఈ యత్నంలో.. సొమ్ము దిగమింగిన పెద్దలంతా బాగుంటారని, సంతకాలు చేసిన అధికారులే ఇరుక్కుపోతారనే ఆవేదన ఆ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మళ్లీ మంత్రివర్గానికా..: ఒకసారి మంత్రివర్గం ఆమోదించిన అంశాన్ని మరోసారి మంత్రివర్గం ముందుకు తీసుకెళ్లిన చరిత్ర ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనూ లేదని, అడ్డగోలు అవినీతికి మంత్రివర్గం మళ్లీ ఎలా ఆమోదముద్ర వేస్తుందని ఐఏఎస్‌లు ప్రశ్నిస్తున్నారు. సీఎం చంద్రబాబు, నీటిపారుదల మంత్రి దేవినేనిలు.. ఈ అవినీతికి రాజముద్ర వేయడానికి ఎలా అంగీకరిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికే మంత్రివర్గం పరిమితం కావాలని, అవినీతి వ్యవహారాలకు రాజముద్ర వేసే వేదికలుగా మారిస్తే ప్రజలు క్షమించరని అంటున్నాయి. చర్యలే సమంంజసం : ఇద్దరు సీఎస్‌లు తిరస్కరించిన అంశాన్ని లోతుగా విచారించడానికి ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలని, నిబంధనలను ఉల్లంఘించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఐఏఎస్‌లు సూచిస్తున్నారు. -
మాస్టర్ ప్లాన్ మరిచారా..
రెండేళ్లుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫైల్ పెండింగ్ కాలంచెల్లిన ప్రణాళికతో ప్రజల ఇబ్బందులు చారిత్రక నగరం అభివృద్ధికి అడ్డంకులు 1972లో రూపొందించిన మాస్టర్ ప్లానే ప్రస్తుతం అమలులో ఉంది. 1991 నాటికి నగర విస్తీర్ణం, జనాభాను అంచనా వేసి మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. అప్పుడు నగర విస్తీర్ణం 90 చదరపు కిలో మీటర్లు, జనాభా 4,61,123 ఉంటుందని అంచనా వేశారు. హన్మకొండ : వరంగల్ నగరానికి హృదయ్, అమృత్, స్మార్ట్‌సిటీ వంటి ప్రతిష్టాతక పథకాలలో చోటు దక్కుతున్నప్పటికీ.. మహానగర అభివృద్ధిలో ప్రాథమికంగా అవసరమైన మాస్టర్ ప్లాన్‌ను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన వరంగల్ నగర మాస్టర్ ప్లాన్.. ప్రభుత్వ ఆమోదం కోసం వేచి చూస్తోంది. ఓరుగల్లు ఔన్నత్యం, వారసత్వ సంపద, పర్యాటక, పారిశ్రామిక, వాణిజ్య, సాంకేతిక రంగాలకు ప్రాధాన్యమిస్తూ మహానగర అభివృద్ధి ప్రణాళిక (మాస్టర్ ప్లాన్) రూపొందించారు. ఈ ఫైల్ రెండేళ్లుగా ముఖ్యమంత్రి కార్యాలయంలో పెండింగ్‌లో ఉంది. దశాబ్దకాలంలో వరంగల్ నగరం వేగంగా విస్తరించింది. కానీ, మహానగర అభివృద్ధి కోసం ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా మాస్టర్ ప్లాన్ మాత్రం రూపుదిద్దుకోవడం లేదు. 1972 నాటికి మాస్టర్ ప్లాన్ ప్రాతిపదికగా తీసుకునే అన్ని పనులు జరుగుతున్నాయి. కాలంచెల్లిన ఈ మాస్టర్ ప్లాన్‌తో అభివృద్ధి పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నివాస ప్రాంతాల, పారిశ్రామిక ప్రాంతాల వర్గీకరణలో వాస్తవ పరిస్థితలకు పొంతనలేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న భూములు, భవనాల క్రమబద్ధీకరణ పథకాల(ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్) సైతం ఆశించిన స్థాయిలో ప్రజలకు ఉపయోగపడడం లేదు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంపైన కూడా ఇవన్నీ ప్రభావం చూపుతున్నాయి. భూ వినియోగం కేటగిరీలో మార్పులు చేయకపోవడంతో కార్పొరేషన్ అధికారులు ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదు. దీంతో అనుమతి లేని నిర్మాణాలు పెరుగుతున్నాయి. ఫలితంగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌కు, ‘కుడా’ ఆదాయానికి గండిపడుతోంది. ఇప్పటికీ 1972 నాటి ప్లానే.. కాకతీయ పట్టణాభివద్ది సంస్థ(కుడా) 1972లో రూపొందించిన మాస్టర్ ప్లానే ప్రస్తుతం అమలులో ఉంది. 1991 నాటికి నగరం విస్తీర్ణం, జనాభాను అంచనా వేసి మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. అప్పుడు నగర విస్తీర్ణం 90 చదరపు కిలో మీటర్లు, జనాభా 4,61,123 ఉంటుందని అంచనా వేశారు. ఈ గణాంకాల ఆధారంగా నగరంలో రోడ్లు, డ్రెరుునేజీలు, నాలాలు, పరిశ్రమలు, భూముల వినియోగం అంశాలను నిర్ణయించారు. మాస్టర్ ప్లాన్‌ను ప్రతీ 25 ఏళ్లకు ఒకసారి మార్చాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కానీ ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడతో కాలంచెల్లిన మాస్టర్ ప్లానే ఇప్పటికీ అమలవుతోంది. కొత్త మాస్టర్ ప్లాన్ ఇలా.. 2031 వరకు వరంగల్ మహానగరం అవసరాలను ప్రాతిపదికగా చేసుకుని అన్ని వర్గాల సూచనలతో కొత్త మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. 1,805 చదరపు కిలోమీటర్ల పరిధిలో వరంగల్, కరీంనగర్ జిల్లాలోని 171 గ్రామాలను కలుపుతూ 24 లక్షల జనాభాకు అనుగుణంగా ఈ మాస్టర్ ప్లాన్ తయారైంది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ 2013 డిసెంబర్లో కొత్త మాస్టర్‌ప్లాన్‌ను ఆమోదించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించారు. ఈ ఫైల్ అప్పటి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మాస్టర్‌ప్లాన్‌పై నిర్ణయం తీసుకోవాలని వరంగల్ నగర ప్రజలు కోరుతున్నారు. -
మరిన్ని నేతాజీ ఫైళ్లు బహిర్గతం
కోల్‌కతా: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్య ఘటనకు సంబంధించి పశ్చిమబెంగాల్ ప్రభుత్వం మరిన్ని ఫైళ్లను బహిర్గతం చేసింది. సోమవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ వివరాలను వెల్లడించారు. నేతాజీకి సంబంధించి 1937- 47 మధ్య జరిగిన బెంగాల్ రాష్ట్ర కేబినెట్ సమావేశాల్లోని అంశాలను బహిర్గతం చేశారు. నేతాజీకి సంబంధించిన ఫైళ్లను కేంద్ర ప్రభుత్వం కూడా బహిర్గతం చేయాలని మమతా బెనర్జీ కోరారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఇటీవల నేతాజీకి సంబంధించిన 64 పైళ్లను బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. కోల్ కతాలోని పోలీసు మ్యూజియంలో వీటిని ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఫైళ్లతోపాటు కొన్ని డీవీడీలు కూడా బయటపెట్టిన ఆ రాష్ట్ర హోంశాఖ డీవీడీలను నేతాజీ కుటుంబ సభ్యులకు అందజేసింది. ఈ ఫైళ్లలో మొత్తం 12,744 పేజీలు ఉన్నాయి. ఈ ఫైళ్ల ప్రకారం నేతాజీ 1948లో చైనాలో బతికున్నట్టు తెలుస్తోంది. చైనాలోని మంచూరియాలో ప్రాంతంలో ఉన్నట్టు వెల్లడైంది. కాగా 1945 ఆగస్టు 22న విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్టు టోక్యో రేడియో ప్రకటించింది. అయితే ఈ వార్తను బోస్ అనుచరులు ఖండించారు. అప్పటి నుంచి నేతాజీ మరణం, అదృశ్యం మిస్టరీగా మారింది. -
రైల్వేలైన్ పేరిట మట్టి దందా!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పెద్దపల్లి-నిజామాబాద్ న్యూ బ్రాడ్‌గేజ్ రైల్వేలైను నిర్మాణంలో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ప్రాంతంలో జరుగుతున్న పనుల కోసం చేపట్టిన మట్టి, మొరం తవ్వకాల వివాదం ముదురుతోంది. నిబంధనలకు విరుద్ధంగా చెరువుల్లో సాగిన అక్రమ మట్టి, మొరం తవ్వకాలపై ఓ వైపు ‘పిల్’ దాఖలు కాగా.. మరోవైపు ఆ చెరువులను వదిలేసిన కాంట్రాక్టు సంస్థలు ఏకంగా ప్రభుత్వ భూముల్లోనే తవ్వడం వివాదాస్పదం అవుతోంది. ఆర్మూరు-నిజామాబాద్ మధ్య సాగుతున్న ఈ రైల్వేలైను పనుల కోసం నిబంధనలకు విరుద్ధంగా రాంచంద్రపల్లి సింగసముద్రం, ధర్పల్లి మండలం లోలం చెరువుల నుంచి రూ.8 కోట్ల విలువ చేసే 4 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి, మొరం తవ్వకాలు జరిపి ఆ చెరువులను పూర్తిగా విచ్ఛిన్నం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో మాక్లూరు, జక్రాన్‌పల్లి మండలాల్లోని రాంచంద్రపల్లి, మునిపల్లిలలో ప్రభుత్వ స్థలాల్లో అనుమతుల పేరిట నిబంధనలను గాలికి వదిలి తవ్వకాలు చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెరువుల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపారని వరంగల్ జిల్లాకు చెందిన రేవూరి నారాయణ రెడ్డి అండ్ సన్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్, మిలీనియం కన్స్ట్రక్షన్స్, జీవీఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థల జాయింట్ వెంచర్‌పై ప్రజా ప్రయోజనాల వాజ్యం (పిల్) దాఖలైంది. కాంట్రాక్టు సంస్థలతో పాటు అప్పటి జిల్లా కలెక్టర్ సహా నీటిపారుదల, మైనింగ్, రెవెన్యూ అధికారులు14 మందిని కూడా చేర్చారు. ఈ ‘పిల్’పై సీరియస్‌గా స్పందించిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్ సెప్టెంబర్ 7న హైకోర్టుకు హాజరై తగిన ఆధారాలను సమర్పించాలని నోటీసులు జారీ చేశారు. ఇదే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా మాక్లూరు మండలం రాంచంద్రపల్లి, జక్రాన్‌పల్లి మండలం మునిపల్లిల్లో ప్రభుత్వ భూముల్లో తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన రెవెన్యూశాఖ మరో వివాదానికి తెర లేపింది. మట్టి, మొరం తవ్వకాల అనుమతుల విషయంలో రాంచంద్రపల్లి, మునిపల్లి గ్రామాల రైతులపై ఒకతీరుగా వ్యవహరించిన రెవెన్యూ, మైనింగ్ శాఖలు, రైల్వేలైన్ కాంట్రాక్టు సంస్థలకు అనుకూలంగా స్పందించాయి. మునిపల్లికి చెందిన బాయి లింబన్న అనే రైతు 53/1 సర్వేనంబర్ (ప్రస్తుతం కాంట్రాక్టు సంస్థలు తవ్వకాలు జరుపుతున్న ప్రభుత్వ భూమి)లో పంటచేల అవసరాల కోసం కొద్దిపాటి తవ్వకానికి అనుమతించాలని ఐదు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. ఎన్వోసీ ఇచ్చినట్లే ఇచ్చిన రెవెన్యూ అధికారులు.. ఆ పరిసరాల్లో ఉన్న చర్చి, హైస్కూల్, హౌసింగ్‌బోర్డు కాలనీవాసులు వ్యతిరేకిస్తున్నారనే సాకుతో ఆయన ఫైలు డిప్యూటీ డెరైక్టర్ (మైనింగ్ ) కార్యాలయూనికి చేరే స్థాయిలో నిలిపివేశారు. ఇప్పుడు అదే సర్వే నంబర్, అదే భూమిలో పెద్ద ఎత్తున యంత్రాలతో తవ్వకాలు, భారీ వాహనాల్లో మొరం రవాణా చేసేందుకు కాంట్రాక్టు సంస్థలకు ఎన్వోసీ జారీ చేశారు. మునిపల్లి శివారులోని 53/1 సర్వే నంబర్లో 2.16 ఎకరాల్లో తవ్వకాలు జరిపేందుకు అనుమతులు ఇచ్చారు. అదే విధంగా మాక్లూరు మండలం రాంచంద్రపల్లి శివారులో 4.2 ఎకరాల ప్రభుత్వ భూమిలో సైతం తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఈ మేరకు అనుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. -
కార్మిక శాఖలో ఫైళ్లు మాయం
- విచారణ ఫైళ్లకు తిలోదకాలు - విజిలెన్స్ విభాగంలో అవినీతి తిష్ట - ఉన్నతాధికారుల ప్రేక్షక పాత్ర - కమిషనరేట్ అవినీతి మయం సాక్షి, హైదరాబాద్ : కార్మిక శాఖ కమిషనరేట్‌లో ఫైళ్ల మాయమవడం కలకలం రేపుతోంది. సాక్షాత్తూ పరిపాలన, విజిలెన్స్ విభాగాలకు అధికారికంగా అందుతున్న ఫైళ్లే మాయమవుతున్నాయి. మరోవైపు అవినీతి ఆరోపణలకు సంబంధించిన విచారణ ఫైళ్లు ఏళ్ల తరబడి పెండింగ్‌లో మగ్గుతున్నాయి. అధికారులు వాటిపై నివేదికలు తెప్పించుకోవడంలోనూ నిర్లక్ష్యం వహించడం విస్మయానికి గురిచేస్తోంది. విజిలెన్స్ విభాగంలో దీర్ఘకాలంగా తిష్టవేసిన అవినీతి తిమింగలంపై అభియోగాలు వచ్చినా స్థాన చలనం కలుగడం లేదు. కొత్తగా కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ వ్యవహారాలపై ప్రేక్షక పాత్ర పోషించడం కార్మిక శాఖ కమిషనరేట్‌లో చర్చనీయాంశంగా మారింది. లేదని చెబుతూ... కార్మిక శాఖలోని అంతర్గత అవినీతి ఆరోపణలపై రెండేళ్ల క్రితం పరిపాలన, విజిలెన్స్ విభాగానికి అధికారికంగా (లెటర్ నంబర్ ఏ/5002/2013/ తేది. 07-11-2013) ఒక ఫైలు చేరింది. అందులో ‘కార్మిక శాఖలో పోస్టింగ్ ఉత్తర్వులు లేకుండా ఒక అధికారి హైదరాబాద్-2 డీసీఎల్‌గా విధుల్లో చేరి 13 నెలల పాటు జీతాన్ని అక్రమంగా డ్రా చేసుకున్నారు’ అనే అభియోగాలకు సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలతో అధికారికంగా పరిపాలన, విజిలెన్స్ విభాగానికి ఫైలు అందింది. కానీ రెండేళ్లు గడిచినా దానిపై విచారణ జరుగలేదు. తాజాగా ఆ ఫైలు పురోగతిపై ఆరా తీస్తే .. కొం దరి చేతివాటంతో మాయమైనట్లు తెలిసింది. సంబంధిత అధికారులు సైతం ఆ దస్త్రం పరిపాలన, విజిలెన్స్ విభాగాలల్లో లేదని స్పష్టం చేయడం గమనార్హం. నిండా నిర్లక్ష్యమే.. కార్మిక శాఖలో అంతర్గత అవినీతి, అక్రమాలకు సంబంధించిన విచారణ ఫైళ్లు ఏళ్ల తరబడి పెండింగ్‌లో మగ్గుతూనే ఉన్నాయి. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, సంబంధిత విభాగాల పర్యవేక్షకుల అవినీతి, అక్రమాలతో ఇవి కదలడం లేదు. ఉదాహరణకు మూడేళ్ల క్రితం పరిపాలన, విజిలెన్స్ విభాగాలకు (లెటర్ నంబర్ ఏ/ఓపీ1/2012 తేది.25-08-2012) అధికారికంగా ఒక ఫైలు చేరింది. అందులో ‘రంగారెడ్డి జిల్లా డీసీఎల్ అధికారి ఒకరు ఆఫీస్ రికార్డులను ట్యాంపరింగ్ చేసి అక్రమాలకు పాల్పడ్డాడు’ అనే అభియోగాలకు సంబంధించి పూర్తి ఆధారాలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఫైల్ అందిన 15 నెలల తర్వాత సంబంధిత విభాగం నుంచి రంగారెడ్డి జిల్లా జాయింట్ లేబర్ కమిషనర్‌కు ఆఫీస్ మెమో నంబర్ ఏ1/11679/2011. తేదీ 12/11/2013 ద్వారా ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని మెమో జారీ అయింది. ఇప్పటి వరకు దానికి సంబంధించి నివేదిక ఆ విభాగానికి చేరలేదు. దాని కోసం వేచిచూస్తున్నామని సంబంధిత అధికారులు చెబుతుండడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
పంచాయతీల్లోనూ భూగర్భ డ్రైనేజీ
తొలుత ప్రయోగాత్మకంగా ఐరాల పంచాయతీలో.. మరో పది పంచాయతీల్లో భూగర్భ డ్రైనేజీ తర్వాత జిల్లా వ్యాప్తంగా నిర్మాణం వెస్ట్ గోదావరి వెలివెన్ను ఆదర్శం {పణాళికలు సిద్ధం చేసిన అధికారులు చిత్తూరు : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటుకు జిల్లా పంచాయతీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మూమూలుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మాత్రమే భూగర్భ డ్రైనేజీ ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొస్తుంది. అయితే చిత్తూ రు జిల్లాలో ప్రయోగాత్మకంగా చిన్నచిన్న పంచాయతీల్లో భూగర్భ డ్రైనేజీని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం పశ్చిమ గోదావరి జిల్లా వెలివెన్ను గ్రామ పంచాయతీలో ఫైలట్ ప్రాజెక్టుగా నిర్మించిన భూగర్భ డ్రైనేజీని జిల్లా అధికారుల బృందం పరిశీలించి వచ్చింది. ఆ స్పూర్తితో రాష్ట్రంలో ఎక్కడా లేని రీతిలో గ్రామ పంచాయతీల్లో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలవాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలుత పూతలపట్టు నియోజకవర్గంలోని ఐరాల పంచాయతీలో వినాయకపురం, అంచనవారిపల్లి, నయనాంపల్లి గ్రామాల్లో భూగర్భ డ్రైనేజీలను నిర్మించారు. వినాయకపురంలో రూ.5 లక్షలతో నిర్మించగా, అంచనవారిపల్లి, నయనాంపల్లిలో రూ.4 లక్షలతో పూర్తి చేశారు. ఆయా గ్రామాల్లోని అన్ని వీధుల్లో భూగర్భంలోనే పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. వాటిని బయటకు వెళ్లే నీటితో అనుసంధానం చేశారు. ఊరి చివరన సంపు నిర్మించి మురుగు నీటిని అందులోకి వదిలేలా ఏర్పాటు చేశారు. ఇందుకోసం 13వ ఆర్థిక సంఘం నిధులను వెచ్చించారు. మొత్తం పనులను రెండు నెలల్లో పూర్తి చేశారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలో పది గ్రామ పంచాయతీల్లో పూర్తి స్థాయిలో భూగర్భ డ్రైనేజీని నిర్మించేందుకు పంచాయతీ అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం కేంద్ర ఆర్థిక సంఘం నిధులతో పాటు ఉపాధి హామీ నిధులను సైతం వెచ్చించనున్నారు. జిల్లాలో ఆదర్శవంతంగా గ్రామ పంచాయతీల్లో భూగర్భ డ్రైనేజీ పూర్తి చేసి రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లాను ఆదర్శంగా నిలిపేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి కేఎల్ ప్రభాకరరావు సాక్షికి తెలిపారు. తొలుత పది పంచాయతీలలో డ్రైనేజీ పూర్తి స్థాయిలో నిర్మించి, తర్వాత జిల్లాలోని అన్ని పంచాయతీల్లో వీటి నిర్మాణం చేపడతామని చెప్పారు. -
8 మంది డీసీలకు త్వరలో పోస్టింగ్‌లు
సీఎం ఆఫీస్‌లో ఫైల్ పెండింగ్ సాక్షి, హైదరాబాద్: వాణిజ్యపన్నుల శాఖలో ఉన్నతస్థాయి పోస్టులను భర్తీ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ శాఖలో రాష్ట్రస్థాయి కేడర్‌లో పనిచేస్తున్న అధికారుల విభజన ప్రక్రియ ఇటీవల దాదాపుగా పూర్తయింది. ఏపీకి చెందిన 35 మంది అధికారులను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత గల అధికారులు ఇక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, సీటీవోల భర్తీ ప్రక్రియ వేగం అందుకుంది. ఎనిమిది మంది డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులను వివిధ డివిజన్లలో భర్తీ చేసేందుకు కమిషనర్ వి. అనిల్ కుమార్ ఫైలు తయారు చేసి ఇటీవలే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి పంపించారు. ఈ మేరకు ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. ఒకటి రెండు రోజుల్లో సీఎం ఫైలుపై సంతకాలు చేస్తే ఎనిమిది మంది డిప్యూటీ కమిషనర్లుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం డిప్యూటీ కమిషనర్లుగా ఆదిలాబాద్‌కు ఆనంద్ రావు, కరీంనగర్ కు ద్వారకానాథ్ రెడ్డి, హైదరాబాద్ రూరల్- కాశీ విశ్వనాథ్ రెడ్డి, పంజాగుట్ట- లక్ష్మీనారాయణ, సికింద్రాబాద్- కె. హరిత, బేగంపేట- సాయి కిషోర్, వరంగల్ - లావణ్య, నల్లగొండ- గీతలను నియమించనున్నారు. వీరి భర్తీ ప్రక్రియ పూర్తయిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అసిస్టెంట్ కమిషనర్ల ఖాళీలను భర్తీ చేస్తారు. వీటితో సీటీవోల భర్తీకి డీపీసీని ఏర్పాటు చేయాల్సి ఉంది. పదోన్నతుల కోసం ఏర్పాటు చేసే ఈ కమిటీ సీనియారిటీ ఆధారంగా సీటీవోలకు అసిస్టెంట్ కమిషనర్లుగా పదోన్నతి కల్పిస్తుంది. అలాగే డీసీటీవోలు సీనియారిటీ ఆధారంగా సీటీవోలు కానున్నారు. దీనికి సంబంధించి కమిషనర్ స్థాయిలో కసర త్తు సాగుతున్నా, వివిధ కారణాల వల్ల ఓ కొలిక్కి రాలేదు. డీసీల నియామకం పూర్తయిన వెంటనే ఈ ఫైలు కూడా కదులుతుందని ఓ అధికారి తెలిపారు. -
ఐటీ రిటర్న్ లేటయితే?
లేట్ రిటర్నులు ఒకసారి ఫైల్ చేశాక వాటిల్లో మార్పులు చేయడానికి అవకాశం ఉండదు. వ్యాపారం లేదా ట్రేడింగ్‌లో ఏమైనా నష్టాలు చూపిస్తే వాటిని రానున్న సంవత్సరాలకు కొనసాగించే వీలుండదు. ఈ అసెస్మెంట్ ఇయర్ (2015-16) రిటర్నులను మార్చి 31, 2016లోగా దాఖలు చేయకపోతే రూ.5,000 పెనాల్టీ విధించే అవకాశం ఉంది. పాత రిటర్నులకు సంబంధించి ఏమైనా పన్ను చెల్లించాల్సి ఉంటే దానిపై వడ్డీ భారం పడుతుంది. ఓ బహుళజాతి సంస్థలో పనిచేసే కృష్ణమోహన్ ఇంటి రుణం కోసం బ్యాంకులో దరఖాస్తు చేశాడు. రుణం మంజూరు చేయడానికి బ్యాంకు అధికారులు గడిచిన మూడేళ్ళ ఆదాయపు పన్ను రిటర్నులు అడిగారు. కానీ కృష్ణ మోహన్ గత మూడేళ్ళుగా రిటర్నులు వేయటం లేదు. వార్షిక ఆదాయం రూ.4,00,000 ఉన్నా... పొదుపు పథకాలు, ఇతర మినహాయింపులు చూపించడం ద్వారా ఒక్క రూపాయి పన్ను కూడా చెల్లించే అవసరం రావటం లేదు. జీతంలో పన్ను కోతలూ లేవు. దీంతో రిటర్నులు దాఖలు చేయలేదు. ఇప్పుడు రుణం తీసుకోవడానికి అదే సమస్యగా తయారయింది. పన్ను కట్టేశాం కదా... ఆఫీసులో ఎలాగూ కోత కోశారు కదా!! ఇక రిటర్నులతో పనేముంది? అనుకునేవారికీ ఇదే సమస్య. అసలు ఆదాయపు పన్ను రిటర్నుల విషయంలో చట్టాలు ఏం చెపుతున్నాయి? రిటర్నులు దాఖలు చేయకపోతే జరిగే నష్టమేంటి? ఇవన్నీ తెలియజేసేదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం... ఆదాయపు పన్ను మినహాయింపు బేసిక్ లిమిట్ రూ.2.5 లక్షలు. మీ మొత్తం వార్షికాదాయం కనక రూ.2.5 లక్షలు దాటితే తప్పనిసరిగా రిటర్నులు దాఖలు చెయ్యాలి. ఒకవేళ విదేశాల్లో ఆస్తులుంటే మా త్రం ఆదాయంతో సంబంధం లేకుండా రిటర్నులు దాఖలు చేసి తీరాలి. అయితే విదేశాల్లో ఆస్తులున్న వారు, వార్షికాదాయం రూ.10 లక్షలు దాటిన వారు ఆన్లైన్ ద్వారా మాత్రమే రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. వీరంతా 2014-15కు సంబంధించి జూలై 31, 2015లోగా రిటర్నులు వేయాలి. గడువులోగా వేయకపోతే... పన్ను సకాలంలో చెల్లించినా రిటర్నులు మాత్రం ఆలస్యంగా దాఖలు చేస్తే కొన్ని సందర్భాల్లో పెనాల్టీలు పడే అవకాశం ఉంటుంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సకాలంలో దాఖలు చేసినవారికి కలిగే కొన్ని ప్రయోజనాలను ఇలా ఆలస్యంగా వేసినవారు కోల్పోతుంటారు. సకాలంలో దాఖలు చేయని వాటిని లేట్ రిటర్నులుగా భావిస్తారు. అంటే గడిచిన ఆర్థిక సంవత్సరానికి - ప్రస్తుత అసెస్మెంట్ ఇయర్‌కి అన్ని ప్రయోజనాలు పొందాలంటే జూలై 31లోగా రిటర్నులు దాఖలు చేయాలి. ఇలా సకాలంలో వేస్తే రిటర్నుల్లో గనక ఏమైనా తప్పులు దొర్లితే మార్చుకోవడానికి తగినంత సమయం ఉంటుంది. కొన్ని ఆదాయవ్యయాలు చూపించకపోతే వాటిని సవరిస్తూ ఎన్నిసార్లైనా రివైజ్డ్ రిటర్నులు దాఖలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అదే గడువు ముగిసిన తర్వాత రిటర్నులు దాఖలు చేస్తే ఇక రివైజ్డ్ వేయడానికి వీలుండదు. ఇంకో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే.. సకాలంలో రిటర్నులు దాఖలు చేస్తే స్వలకాలిక, దీర్ఘకాలిక మూలధన నష్టాలను రానున్న సంవత్సరాల్లో చూపించుకొని పన్ను భారం తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు 2014-15లో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో నష్టాలు వస్తే వీటిని మీరు ఎనిమిదేళ్ళు... అంటే 2022-23 వరకు చూపించుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగాక గడువు దాటాక రిటర్ను వేస్తే మూలధన నష్టాలను మరుసటి సంవత్సరాల్లో చూపించుకునే అవకాశాన్ని కోల్పోతారు. ఎన్నాళ్ళవి వేయొచ్చు? రెండు మూడు సంవత్సరాలవి కలిపి ఒకేసారి రిటర్నులు దాఖలు చేయొచ్చు. రెండేళ్ళ పాత ఆర్థిక సంవత్సరాలవైతే నేరుగా ఆన్లైన్లోనే దాఖలు చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ సంవత్సరాలవి అయితే మాత్రం ఫిజికల్ రూపంలో దాఖలు చేయా ల్సి ఉంటుంది. ఇలా ఫిజికల్ రూపంలో దాఖలు చేసే రిటర్నులకు అనుమతిచ్చే అంశం డిపార్ట్మెంట్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇలాంటి వాటి విషయంలో పెనాల్టీలు కూడా విధించే అవకాశం ఉంది. ఇలా లేట్‌గా దాఖలు చేసే రిటర్నుల విషయంలో మాత్రం నిపుణుల సలహా తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకసారి రిటర్నులు దాఖలు చేసిన తర్వాత తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉండదు. అందుకే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని తప్పులు లేకుండా దాఖలు చేయాల్సి ఉంటుంది. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
రెండు మూడు రుణాలుంటే.. విముక్తి ఏ ఖాతాకో మీరే చెప్పండి!
ఆ బాధ్యత మాపై పెట్టొద్దు: ప్రభుత్వానికి బ్యాంకర్ల వినతి సాక్షి, హైదరాబాద్: ఒకే సర్వే నంబరుపై పలు బ్యాంకుల్లో పట్టాదారు పాసుపుస్తకం, బంగారం కుదవపెట్టి రుణాలు తీసుకున్న రైతులకు.. ఏ బ్యాంకులో రుణానికి విముక్తి కల్పించాలో ప్రభుత్వమే నిర్ణయించి చెప్పాల్సిందిగా బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంచేశాయి. ఈ విషయంలో బ్యాంకులను బాధ్యులను చేయొద్దని, ఏ రుణానికి విముక్తి కల్పించాలో తాము నిర్ణయించలేమని బ్యాంకర్లు పేర్కొన్నాయి. ఒకే సర్వే నంబర్‌పై రైతులు తొలుత పట్టాదారు పాసుపుస్తకంతో ఒక బ్యాంకులో రుణం తీసుకున్నాక ఆ రుణం సరిపోకపోతే అదే సర్వే నంబ ర్‌పై బంగారం కుదవపెట్టి మరో బ్యాంకులో రుణం తీసుకున్నారు. ఇలాంటి రుణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు ఇటీవల సర్క్యులర్ జారీ చేసింది. ఒకే సర్వే నంబర్‌పై రెండు మూడు బ్యాంకుల్లో రుణం తీసుకుంటే అందులో తొలుత ఏ బ్యాంకులో రుణం తీసుకున్నారో అదే రుణానికి రుణ విముక్తి కల్పించాల ని, మిగతా బ్యాంకుల్లో రుణాలకు విముక్తి కల్పిం చవద్దని ఆ సర్క్యులర్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతటితో ఆగకుండా మిగతా రుణాలకు విముక్తి కల్పిస్తే సంబంధిత బ్యాంకు మేనేజరును బాధ్యుడిని చేయడంతో పాటు అతని నుంచే రికవరీ చేస్తామని సర్క్యులర్‌లో పేర్కొం ది. ఈ అంశంతో పాటు రుణ విముక్తి పథకంలో పలు అంశాలపై ఆర్థికశాఖ ఉన్నతాధికారులు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు శనివారం ఎస్బీఐ, సిండికేట్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, ఆప్కాబ్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏ రుణం విముక్తి కల్పించాలో ప్రభుత్వమే చెప్తే అదే చేస్తామని, ఈ విషయంలో బ్యాంకులను భాగస్వామ్యం చేయద్దని బ్యాంకుల ప్రతినిధులు కోరా రు. అయితే ఇందుకు కుటుంబరావు ససేమిరా అన్నారు. ఇక పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ కలిపినందున ఆ మండలాల్లోని రైతుల రుణాల వివరాలను ఆన్లైన్లో కాకుండా బ్యాంకుల వారీగా సీడీల్లో అందజేయాల్సిందిగా ప్రభుత్వం కోరింది. -
బోదె పద్ధతిలో మొక్కజొన్న
ట్రాఫిక ల్టర్ సహజంగా రైతులు మొక్కజొన్న సాగు చేయడానికి పొలాలు దున్ని సాళ్లుగా చేసి సాళ్లలో విత్తనాలు చల్లి ఎదపెడతారు. ఇది పాత పద్ధతి. వర్షాలు అధికంగా కురిసినప్పుడు సాళ్లలో నీరు నిల్వ ఉండి విత్తనాలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువ . ఒకవేళ వర్షాలు తక్కువగా ఉంటే.. మొక్కలకు నీరందక చనిపోయే ప్రమాదం ఉంది. వీటిని అధిగమించడానికి బోదె పద్ధతి మొక్కజొన్న సాగులో ఇక్రిశాట్ ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఈ బోదెలు చేసే యంత్రాన్ని ట్రాఫికల్టర్ అంటారు. దీన్ని ట్రాక్టర్‌కు అమర్చి ఉపయోగించవచ్చు. బాడుగ భరించలేని రైతులు ఎడ్లతో లాగించి మొక్కజొన్న విత్తనాలు నాటుకోవచ్చు. ముందుగా బోదె పద్ధతిలో మొక్కజొన్న సాగు చేయాలనుకున్న పొలాన్ని ఎంచుకుంటారు. ఈ పద్ధతికి నల్లరేగడి నేలలు బాగా అనుకూలమైనవి. చేను ఎటు వైపు నుంచి ఎత్తుగా ఉంది. ఎటు వైపునకు పల్లంగా ఉం దో చూసుకుని ట్రాక్టరుకు బోదెలు చేసే యంత్రాన్ని తగిలించి నేలను సరిచేస్తారు. బోదెల మధ్య 1.5 మీటర్లు ఖాళీ ఉండే విధంగా సాళ్లు ఏర్పాటు చేస్తారు. అధిక వర్షాలు పడినప్పుడు బోదెలపై ఉన్న నీరు సాళ్లలోకి జారిపోవడమేగాక, సాళ్లలో ట్రాక్టర్లు, ఎడ్లు, చక్రా లు నడవడానికి కూడా పనికి వస్తాయి. ఈ పద్ధతిలో బోదెపై మూడు వరుసలు వస్తాయి. ఎకరానికి 28 వేల మొక్కలు పడతాయి. 8 కిలోల విత్తనాలు సరిపోతాయి. బోదెలు చేసిన తర్వాత విత్తనాలను యంత్రంతోనే నాటుతారు. బోదె పద్ధతి వల్ల ఉపయోగాలు బోదె పద్ధతిలో మొక్కజొన్న సాగు చేస్తే మామూలు విధానంలో కన్నా 20 శాతం అధికంగా దిగుబడి వస్తుందని ఇక్రిశాట్ పరిశోధనలో తేలింది. ఈ పద్ధతిలో మొక్కజొన్న, కంది, శనగ, వేరుశనగ, సోయాబీన్ సాగు చేసుకోవచ్చు. వర్షపాతం ఎక్కువగా ఉన్నప్పుడు పంట దెబ్బ తినకుండా బోదెలపైన ఉన్న నీరు వెంటనే సాళ్ల ద్వారా బయటకు వెళ్తుంది. వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు బోదెల్లో ఉన్న తేమ పంట దెబ్బతినకుండా కాపాడుతుంది. పొలం వాలు, ఎత్తు పల్లాలను కొలిచి బోదెలు చేసుకుంటాం కాబట్టి నేల కోతకు గురికాకుండా కాపాడుతుంది. బోదెల్లో నీరు ఇంకిపోయేలా చేయడం ద్వారా పంట బెట్టకు వచ్చే అవకాశం తక్కువ. =సాళ్ల మధ్య దూరం 18 అంగుళాలు ఉంటుంది. అదే మామూలు పద్ధతిలో సాగు చేస్తే 22 అంగుళాలు ఉంటుంది. దీని వల్ల స్థలం కలిసి వస్తుంది. బోదెలు పెరుగుతాయి. మొక్కల సంఖ్య పెరుగుతుంది -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా అలుముకోవటంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాంతో విమానాశ్రయ అధికారులు శంషాబాద్‌కు వచ్చే పలు విమానాలను దారి మళ్లించారు. షార్జా, మస్కట్, అబుదాబి నుంచి వచ్చే విమానాలను బెంగళూరుకు మళ్లించారు. మరోవైపు ఢిల్లీ, దుబాయి వెళ్లాల్సిన విమానాలను రద్దు చేశారు. దాంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. -
భలే ఆప్స్
డిజిఫై... ఇదో ఫైల్ షేరింగ్ అప్లికేషన్. డ్రాప్బాక్స్తో కలిసి పనిచేస్తుంది. మామూలుగానైతే డ్రాప్‌బాక్స్‌లోకి ఫైల్స్ వేసిన తరువాత వాటిని నియంత్రించలేము. డిజిఫైతో ఈ ఇబ్బంది ఉండదు. ఎవరెవరు ఫైల్స్ చూశారు... ఎవరు మార్పులు చేర్పులు చేశారు. ఎంతకాలంపాటు ఫైల్స్ డ్రాప్‌బాక్స్‌లో అందరికీ కనిపించేలా ఉంచాలి? వంటి ఫీచర్లను మీరు కంట్రోల్ చేయవచ్చు. వీటితోపాటు ఫైల్‌ను కొంతకాలం తరువాత తనంతట తానే నాశనమై పోయేలా కూడా చేయవచ్చు. అన్ క్లౌడెడ్... స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లలోని మెమరీతోపాటు క్లౌడ్ మెమరీ వాడకం కూడా పెరిగిపోతున్న రోజులివి. ఈ నేపథ్యంలో స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ల మెమరీ మాదిరిగానే క్లౌడ్ మెమరీని కూడా శుభ్రం చేసుకునేందుకు ఒక అప్లికేషన్ కావాలి. అన్ క్లౌడెడ్ అచ్చంగా ఇదే పని చేస్తుంది. క్లౌడ్ మెమరీలో ఎక్కువ మోతాదు ఉపయోగిస్తున్న ఫైల్స్ ఏవి? ఫోల్డర్లు ఎన్ని ఉన్నాయి? వాటిలోని ఫైళ్ల పరిస్థితి ఏమిటన్నది తెలుసుకునేందుకు ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా క్లౌడ్ మెమరీకి సంబంధించినంతవరకూ ఇదో సెర్చ్ ఇంజిన్‌లా, ఫైల్స్ మేనేజర్లా, ఎక్స్ప్లోరర్లానూ పనికొస్తుంది ఈ అన్ క్లౌడెడ్ అప్లికేషన్. ‘డ్రాప్‌బాక్స్’ అప్డేట్ అయ్యింది..! ఐ డివైజ్‌ల రూపురేఖలను మార్చేసిన ఐఓఎస్8కి అనుగుణంగా అప్లికేషన్లు కూడా అప్డేట్ అవుతున్నాయి. ఐ డివైజ్‌లను వాడే వారికి ఎంతో సౌకర్యమైన డ్రాప్‌బాక్స్ అప్లికేషన్‌తో ఈ అప్డేషన్ మొదలైంది. ఫైల్‌షేరింగ్ విషయంలో సౌకర్యంగా ఉండే డ్రాప్‌బాక్స్ అప్లికేషన్‌ను ఐఓఎస్8 ఫీచర్లకు అనుగుణంగా మార్చారు. తాజాగా ఈ అప్లికేషన్లో కొత్త సదుపాయాలు రావడంతో పాటు నోటిఫికేషన్ల ఫీచర్‌ను కూడా మొదలు పెట్టారు. ఈ నోటిఫికేషన్ ఫీచర్ ద్వారా డ్రాప్బాక్స్కు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్‌లోని మార్పునకు అనుగుణంగా అప్లికేషన్లను కూడా అప్డేట్ చేసుకోవాలని భావించే వారు ఈ మార్పును స్వాగతించవచ్చు. -
దొరికింది
అమలాపురం టౌన్ : అమలాపురం మున్సిపల్ కార్యాలయంలో గల్లంతైన వివాదాస్పద ఫైలు ఎట్టకేలకు దొరికింది. కమిషనర్ శివనాగిరెడ్డి ఏసీబీకి దొరికేందుకు కారణమైన ఈ ఫైలు అదృశ్యమైన సంగతి తెలిసిందే. మున్సిపల్ కార్యాలయంలోని ఇంజనీరింగ్ విభాగంలో ఓ మూలన ఎవరూ ఉపయోగించని తాళం లేని పాత బీరువాలో ఆ ఫైలు ప్రత్యక్షం కావడం అనుమానాలకు తావిస్తోంది. ఏసీబీ అధికారులు ఇంజనీర్లు కాంట్రాక్టరు బాబి పనికి సంబంధించిన ఫైలు కమిషనర్ వద్దే ఉందని, ఆయనకే పంపించేశామని చెప్పుకొచ్చారు. ఏసీబీ విచారణలో కమిషనర్ ఆ ఫైలు తన వద్ద లేదని... రిమార్కు రాసి ఇంజనీరింగ్ విభాగానికి పంపించానని చెప్పారు. ఇలా భిన్న వాదనలతో ఏసీబీ అధికారులు ఆఫైలు కోసం గాలించారు. అయితే దొరకలేదు. దీంతో ఏసీబీ అధికారులు, మున్సిపల్ రీజనల్ డెరైక్టర్ కూడా ఫైలు గల్లంతుకు ఇంజనీర్లే కారణమన్న అభిప్రాయానికి వచ్చారు. అనుమానాలు... సందేహాలు ఇదే సమయంలో ‘సాక్షి’లో ఫైలు గల్లంతుపై ‘అసలేమైనట్టు..’? శీర్షికన సోమవారం ప్రచురితమైన కథనంలో ఫైలు ఎందుకు అదృశ్యమైంది? అంటూ మూడు కోణాల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. కమిషనర్‌పై ఏసీబీ దాడి జరిగిన రోజు రాత్రి వరకూ ఆ ఫైలు కోసం ఏసీబీ కానిస్టేబుళ్లు, రీజనల్ డెరైక్టర్ సమక్షంలో ఇంజనీరింగ్ సిబ్బంది అంగుళం అంగుళం గాలించారు. అయితే ఆ సమయంలో కనిపించిన ఫైలు సోమవారం మధ్యాహ్నం ప్రత్యక్షమైంది. వర్క్ ఇన్స్పెక్టర్ భాస్కరరావు కుర్చీ వద్ద ఉన్న ఆ పాత బీరువా తలుపుతీసి ఉండడాన్ని గమనించి దానిలో ఫైలును గుర్తించారు. ఆ సమాచారాన్ని డీఈఈ త్రినాథరావు రీజనల్ డైరక్టర్ రవీంద్రబాబుకు అందించారు. అయితే ఈ ఫైలు అక్కడికి ఎలా చేరింది. దానికి అక్కడ ఎవరు ఉంచారు అనే విషయాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితులకు భయపడే ఫైలు ప్రత్యక్షం ఏసీబీ అధికారులు, మున్సిపల్ రీజనల్ డెరైక్టర్ల విచారణల్లో ఫైలు గల్లంతుకు ఇంజనీర్ల నిర్లక్ష్యమే కారణమన్న అభిప్రాయానికి వచ్చారు. దీనికి తోడు రీజనల్ డెరైక్టర్ కూడా ఇదే విషయమై హైదరాబాద్ డీఎంఏకు నివేదిక ఇచ్చారు. దీంతో తమపై చర్యలు తీసుకునే పరిస్థితులు ఎదురవుతుండటంతో ఇంజనీరింగ్ విభాగం సిబ్బందిలో భయం పట్టుకుంది. ఈ విషయమై డీఈఈ త్రినాథరావును ‘సాక్షి’ వివరణ కోరగా ఇలా చెప్పుకొచ్చారు... ‘‘అదృశ్యమైన ఫైలు.. వెతికిన బీరువాలోనే దొరకడం మాకూ ఆశ్చర్యంగా ఉంది. కాంట్రాక్టర్ బాబి చేసిన పనికి సంబంధించిన ఫైలుపై కమిషనర్ రిమార్కు రాసి... ఇంజనీరింగ్ విభాగానికి పంపారు. దానిపై మళ్లీ ఇంజనీర్లు రిమార్కులకు సమాధానం చెబుతూ కమిషనర్‌కు పంపించారన్న పరిణామాల్లో స్పష్టత వచ్చింది.’’ -
ఈ నెలాఖరులో మోడల్ స్కూల్ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: మోడల్ స్కూళ్లలో నిలిచిపోయిన పీజీటీ, టీజీటీ పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ ను ఈ నెలాఖరులో నిర్వహించేందుకు పాఠశాల విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. భర్తీ ప్రక్రియ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను 25 లేదా 26 తేదీల్లో జారీ చేయనున్నారు. ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని మోడల్ స్కూ ల్స్ ఎక్స్అఫీషియో పీడీ జగదీశ్వర్ తెలిపారు. ఈ పోస్టుల భర్తీలో తెలుగు మీడియం అభ్యర్థులను అనుమతించని కారణంగా న్యాయ వివాదం ఏర్పడి ఆలస్యమైన సంగతి తెలిసిందే. దీంతో 1000 పీజీటీ, 600 వరకు టీజీటీ పోస్టుల భర్తీ ఆగిపోయింది. -
ఇంటర్వ్యూతో మేనేజ్మెంట్ సీట్ల భర్తీ
ఇంజనీరింగ్ సీట్లపై మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ఉన్నత విద్యా మండలి విద్యార్థుల ఆర్థికస్థితి తెలుసుకునేందుకే ఇంటర్వ్యూలు చెల్లిస్తారనుకుంటేనే సీట్ల కేటాయింపు 23 నుంచి మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ 15 శాతానికి మించకుండా ఎన్ఆర్ఐ కోటా సీట్లు సాక్షి, హైదరాబాద్: ‘‘ఇంజనీరింగ్ కోర్సుల్లో 30 శాతం మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. విద్యార్థుల ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని, వారు ఫీజు చెల్లిస్తారనే నమ్మకం కలిగితేనే సీట్లు ఇస్తారు. యాజమాన్యానికి నమ్మకం కుదరకపోతే సీటు ఇవ్వడానికి నిరాకరించవచ్చు. అయితే అందుకు కారణాలను తెలియజే యాలి’’.. అని ఏపీ ఉన్నత విద్యా మండలి బుధవారం జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈనెల 22 లేదా 23వ తేదీ నుంచి 15 రోజుల పాటు మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించనుంది. దీనికి సంబంధించి విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఉన్నత విద్యా వుండలి ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేయునుంది. అలాగే విద్యార్థులు నేరుగా కాలేజీలోనూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఉన్నత విద్యా మండలి ఈ చర్యలు చేపట్టింది. 5 శాతం ఉన్న ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) కోటాను 15 శాతానికి పెంచింది. మేనేజ్మెంట్ కోటా ప్రవేశాల నిబంధనలు ఇవీ.. 30 శాతం మేనే జ్మెంట్ కోటా సీట్లలో 15 శాతానికి మించకుండా సీట్లను ఎన్ఆర్ఐ పిల్లలకు ఇవ్వొచ్చు. అర్హత పరీక్షలో వారు 50 శాతం మార్కులను పొంది ఉండాలి. మిగతా సీట్లను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలి. జేఈఈలో ర్యాంకు సాధించిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించవచ్చు. వారు అర్హత పరీక్ష గ్రూపు సబ్జెక్టుల్లో 45 శాతానికి తగ్గకుండా మార్కులు సాధించి ఉండాలి. ఆ తరువాత ఎంసెట్‌లో అర్హత సాధించిన వారికి మెరిట్ ఆధారంగా కేటాయించాలి. అప్పటికీ సీట్లు మిగిలిపోతే ఇంటర్మీడియెట్ గ్రూపు సబ్జెక్టుల్లో 45 శాతం మార్కులు (రిజర్వేషన్ కేటగిరీ వారికి 40 శాతం) సాధించిన వారికి కేటాయించవచ్చు. ప్రవేశాల విధానం.. ఉన్నత విద్యా మండలి వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేస్తుంది. ప్రతి కళాశాలకు యూనిక్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. యాజమాన్య కోటా సీట్ల వివరాలను అందులో అప్లోడ్ చేయాలి. విద్యార్థులు ఆ వెబ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులకు ఎలక్ట్రానిక్ అక్నాలెడ్జ్మెంట్ వచ్చేలా చర్యలు చేపడతారు. విద్యార్థులు వ్యక్తిగతంగా కాలేజీకి వెళ్లి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. యాజమాన్యం విద్యార్థులకు రసీదు లేదా అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి. నిర్ణీత సమయంలో సీట్ల భర్తీని పూర్తి చేయాలి. విద్యార్థులు ఎన్నికాలేజీల్లోనైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తరువాత మెరిట్ జాబితాలను కాలేజీలకు అందజేస్తారు. యాజమాన్యాలు ఇంటర్వ్యూ చేసి సీట్లు కేటాయిస్తారుు. డబ్బు చెల్లిస్తారనే నమ్మకం కుదరకపోతే సీటు నిరాకరించవచ్చు. నిరాకరణ కారణాలతో ఎంపిక జాబితాలను మండలికి అందజేయాలి. నిర్ణీత ఫీజు కంటే ఎక్కువ ఫీజు వసూలు చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టే అధికారం కౌన్సిల్‌కు ఉంటుంది. -
చెరిపేయండి... శాశ్వతంగా!
పీసీలోంచి ఫైళ్లు తొలగించాలంటే మీరు ఏం చేస్తారు? ఆ... ఏముంది.. ట్రాష్‌లో పడేస్తేసరి అంటున్నారా? బాగానే ఉంటుంది కానీ దీనిద్వారా ఫైల్ పూర్తిగా తొలగిపోదు!! హార్డ్డ్రై వ్‌లో ఎక్కడో ఓ మూలన అలాగే పడి ఉంటుంది. కాలం గడిచేకొద్దీ ఇలాంటి చెత్త అంతా పేరుకుపోయి... పీసీ నత్తనడకన నడవడం మొదలవుతుంది. ఈ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఎంచక్కా ఈ పద్ధతులు పాటించండి! ట్రాష్‌లో పడేసి, క్లీన్ చేసిన ప్రతిసారి హమ్మయ్యా.. కొంత చెత్త వదిలించుకున్నామని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి మన పని సగమే అయినట్లు లెక్క. ఎందుకంటే ట్రాష్‌ను క్లీన్ చేసినప్పుడు ఫైల్ తాలూకూ వర్చువల్ పాథ్ మాత్రమే డిలీట్ అవుతుంది. ఫైల్ అలాగే స్టోర్ అవుతుంది. కొంచెం కష్టమైనప్పటికీ వీటిని మళ్లీ రికవర్ చేసే అవకాశం ఉంటుంది. మామూలు ఫైళ్ల విషయంలో ఫర్వాలేదేమోగానీ.... సున్నితమైన వివరాలున్న ఫైళ్ల విషయంలో మాత్రం మరింత జాగ్రత్త అవసరం. ఈ సమస్యను అధిగమించేందుకు అదే ఫైల్‌పై మళ్లీ సమాచారాన్ని స్టోర్ చేయడం ఒక్కటే మార్గం. కానీ ఇది చేతులతో చేసే పని కాదు. మార్కెట్లో ఉచితంగా లభించే సాఫ్ట్వేర్లను ఉపయోగించాల్సి ఉంటుంది. అలాంటివి ఏమేమి ఉన్నాయో, అవెలా పనిచేస్తాయో చూడండి... ఇరేజర్... ఈ సాఫ్ట్వేర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే కంప్యూటర్ల కోసం మాత్రమే. ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తరువాత డిలీట్ చేయాల్సిన ఫైల్‌పై రైట్ క్లిక్ చేస్తే చాలు... కనిపించే ఆప్షన్లలో ఇరేజర్ ఐకాన్‌ను ఎంచుకోవడం ద్వారా ఫైల్‌ను శాశ్వతంగా చెరిపేయవచ్చు. ఒక్కో ఫైల్‌ను ఎన్నిసార్లు ఓవర్‌రైట్ చేయవచ్చో మీరే నిర్ణయించుకోవచ్చు. అంతేకాకుండా ట్రాష్‌లో పడేసే ప్రతిఫైల్‌ను ఇలా ఓవర్‌రైట్ చేసి డిలీట్ చేసేలా ఇరేజర్ను ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. సీసీ క్లీనర్... దీని గురించి మీరు వినే ఉంటారు. హార్డ్‌డిస్క్‌లో స్పేస్‌ను ఆదా చేసేందుకు తరచూ వాడే సాఫ్ట్వేర్ ఇది. సాధారణ పద్ధతుల్లో ఫైళ్లను డిలీట్ చేసిన తరువాత వాటిని గుర్తులను చెరిపేసేందుకు చక్కగా ఉపయోగపడుతుంది ఈ సాఫ్ట్వేర్. పీసీలో నిర్దిష్టంగా ఫలానా ప్రాంతాల్లోని అనవసరమైన ఫైళ్లను ఓవర్‌రైట్ చేయమని సూచించే అవకాశం ఉంటుంది సీసీక్లీనర్ సాఫ్ట్‌వేర్‌తో. దీంట్లోనూ ఎన్నిసార్లు ఓవర్‌రైట్ చేయాలన్నది మనమే నిర్ణయించుకోవచ్చు. సోర్స్ ఎమ్టీ ట్రాష్.. ఈ సాఫ్ట్వేర్ ఆపిల్ కంప్యూటర్ల కోసం ఉద్దేశించింది. కొనుక్కున్నప్పుడే ట్రాష్ బిన్‌కు అనుసంధానంగా ఏర్పాటై వస్తుంది. కాకపోతే ఫైల్స్ ట్రాష్‌లో పడేసిన తరువాత ఫైండర్ ఆప్షన్‌లోకి వెళ్లి సెక్యూర్ ఎమ్టీ ట్రాష్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. హార్డ్‌డ్రైవ్ మొత్తాన్ని ఓవర్‌రైట్ చేయాలనుకుంటే డిస్క్ యుటిలిటీ ఆప్‌లోకి వెళ్లి ఇరేజ్ అప్షన్‌ను క్లిక్ చేయాలి. ఆ తరువాత ‘సెక్యూరిటీ ఆప్షన్’ను సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేస్తే సరి. విండోస్, ఆపిల్ పీసీలు రెండింటిలోనూ ట్రాష్బిన్ను పూర్తిగా పక్కనబెట్టి ఫైళ్లను డిలీట్ చేయాలంటే ఫైల్ ష్రెడ్డర్ సాఫ్ట్‌వేర్‌ను కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు ఫైళ్లను ఓవర్‌రైట్ చేసి శాశ్వతంగా డిలీట్ చేయవచ్చు. ఒక ఫైల్‌ను ఎన్నిసార్లు ఓవర్‌రైట్ చేయాలన్నది సాఫ్ట్‌వేరే నిర్ణయించుకుంటుంది. -
హెచ్ఎండీఏలో అనిశ్చితి
- వెంటాడుతున్న బదిలీ భయం - ఫైళ్ల కియరెన్స్కు కమిషనర్ విముఖత - అటకెక్కిన అనుమతుల జారీ సాక్షి, హైదరాబాద్: ‘మహా’ నగరాభివృద్ధి సంస్థలో ప్రస్తుతం అనిశ్చితి రాజ్యమేలుతోంది. కొత్త లేఅవుట్లు, భవనాలు, భూ వినియోగ మార్పిడికి సంబంధించిన ఫైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోవడమే ఇందుకు నిదర్శనం. హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్‌ను త్వరలో బదిలీ చేస్తారన్న సంకేతాలు రావడంతో ఆ ప్రభావం ఫైళ్ల క్లియరెన్స్‌పై పడిందని సిబ్బంది బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. రొటీన్ ఫైళ్లు తప్ప వివిధ కొత్త పర్మిషన్లు, పాలసీ నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్ల ఆయా సెక్షన్లలోనే మగ్గుతుండటం ప్రస్తుత పరిస్థితికి అద్దంపడుతోంది. ప్రత్యేకించి ప్లానింగ్ విభాగానికి చెందిన ఫైళ్లు తనకు పంపవద్దని ఇటీవల కమిషనర్ ఆదేశించడం కింది స్థాయి అధికారులను విస్మయానికి గురిచేసింది. స్వయంగా ఉన్నతాధికారి వద్దనడంతో కిందిస్థాయిలో ప్రాసెస్ జరిగిన ఫైళ్లు కూడా ఎక్కడివక్కడే ఆగిపోయాయి. 15 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో ఏం చేయాలో తెలియక కిందిస్థాయి అధికారులు తల పట్టుకొంటున్నారు. నగరాభివృద్ధిలో కీలక భూమిక పోషించే హెచ్ఎండీఏలో అవినీతి వేళ్లూనుకొందని, దీన్ని సంస్కరించేందుకు తొలుత కమిషనర్‌ను తప్పించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిందన్న ఊహాగానాలు ఇప్పుడు హెచ్ఎండీఏలో జోరందుకొన్నాయి. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్న తరుణంలో దేనికి అనుమతి ఇచ్చినా... ప్రభుత్వం నుంచి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి ప్లానింగ్ ఫైళ్ల విషయంలో ఏదైనా పొరపాట్లు జరిగితే భవిష్యత్‌లో అవి మెడకు చుట్టుకొనే ప్రమాదం ఉండటంతో కమిషనర్ కావాలనే ఆ ఫైళ్లను పక్కకు పెట్టేశారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. అయితే... కొందరు అధికారుల వాదన మరోలా ఉంది. నిత్యం సచివాలయంలో మీటింగ్‌లకు హాజరవుతున్న కారణంగా కమిషనర్ కొన్ని ఫైళ్లను చూడలేక పోతున్నారని, రొటీన్ ఫైళ్లు ఏరోజుకారోజు క్లియర్ అవుతున్నాయని చెబుతున్నారు. పడిపోయిన ఆదాయం... వివిధ అనుమతులకు సంబంధించిన ఫైళ్లు క్లియర్ కాకపోవడంతో ఫీజుల రూపంలో హెచ్ఎండీఏకు రావాల్సిన ఆదాయం గణనీయంగా పడిపోయింది. గతంలో తక్కువలో తక్కువ అంటే కొత్త లేఅవుట్స్ కోసం నెలకు 10-15 దరఖాస్తులు, నూతన భవనాల అనుమతులు కోరుతూ 25-30, భూ వినియోగ మార్పిడి కోరుతూ 5-10 దరఖాస్తులు హెచ్ఎండీఏకు వచ్చేవి. నిబంధనల మేరకున్న దరఖాస్తులను క్లియర్ చేసి అనుమతులిస్తే ఫీజుల రూపంలో నెలకు రూ.12-15 కోట్ల మేర ఆదాయం వచ్చేది. అయితే... ఇప్పుడు ఆ ఆదాయం రూ.2కోట్లకు పడిపోయింది. కొత్త దరఖాస్తులు రాకపోవడంతో పనిలేక ఖాళీగా కూర్చోవాల్సి వస్తోందని సిబ్బంది అంటున్నారు. నగరంలోని పార్కులు, కాంప్లెక్స్‌ల అద్దె, లీజ్‌ల రూపంలో నెలవారీగా వచ్చే రూ.12కోట్లు ఆదాయంతోనే హెచ్ఎండీఏ మనుగడ సాగిస్తోంది. ఈ తరుణంలో కీలక ఫైళ్లను పరిష్కరించకుండా పక్కన పెట్టేసి సంస్థను అనిశ్చితిలోకి నెట్టేసిన ఉన్నతాధికారుల తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. -
‘టెండర్’.. వండర్!
- ముగిసిన మద్యం దుకాణాలకు దరఖాస్తు దాఖలు ప్రక్రియ - పోటెత్తిన దరఖాస్తులు - 194 షాపులకు 1922..ప్రభుత్వానికి రూ.4.80కోట్ల ఆదాయం - 23న లాటరీ ద్వారా షాపుల ఎంపిక మహబూబ్‌నగర్ క్రైం: 2014-15కోసం మద్యం దుకాణాలను కేటాయించేందుకు గతవారం రోజుల క్రితం జిల్లా గెజిట్ జారీఅయింది. జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. జిల్లాలోని 194 మద్యం దుకాణాలకు నిర్వహించిన టెండర్ల ప్రక్రియ శనివారం నాటితో ముగిసింది. జిల్లావ్యాప్తంగా టెండర్లు వేసేందుకు వ్యాపారులు ఎక్కువసంఖ్యలో తరలొచ్చారు. ప్రక్రియ మొదలైననాటి నుంచి పలువురు టెండర్లను దాఖలు చేయడంలోనే తలమునకలయ్యారు. చివరిరోజు ఎటువంటి ఆటంకం జరగకుండా జాగ్రత్త వహించి దరఖాస్తు ఫారాలను అందించారు. డివిజన్ల వారీగా.. మహబూబ్‌నగర్ పట్టణంలో 68 దుకాణాలకు 106, జడ్చర్ల 19, కొడంగల్ 187, షాద్‌నగర్ లో 256 దరఖాస్తులు వచ్చాయి. గద్వాల డివిజన్లోని 68 దుకాణాలకు గద్వాలలో 172, నారాయణపేట్‌లో 119, వనపర్తిలో 38, కొత్తకోటలో 84, అలంపూర్‌లో 173, ఆత్మకూర్ 93లో దరఖాస్తులు వచ్చాయి. నాగర్‌కర్నూల్ డివిజన్లోని 58 షాపులకు తెల్కపల్లిలో 40, ఆమనగల్లులో 48, నాగర్‌కర్నూల్‌లో 131, కల్వకుర్తిలో 90, కొల్లాపూర్‌లో 128 దుకాణాలకు వ్యాపారస్తులు టెండర్లు వేశారు. అచ్చంపేటలో 125దరఖాస్తు వచ్చాయి. మొత్తంగా రాత్రి 10గంటల వరకు 1922 దరఖాస్తులు వచ్చాయి. అయితే గత 2012-13 సంవత్సరానికి జిల్లావ్యాప్తంగా 184 షాపులకు 1288 దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది మాత్రం మద్యం షాపులను దక్కించుకునేందుకు వ్యాపారులు ఉత్సాహం చూపారు. మూడు స్లాబ్‌ల విధానంలో.. జిల్లాలో మూడు స్లాబ్‌ల విధానంలో లెసైన్స్ ఫీజులను నిర్ధారించారు. పదివేల జనాభా ఉన్నచోట రూ.32.50 లక్షలు, 10వేల నుంచి 50 వేల జనాభా ఉన్న ప్రాంతంలో రూ.34 లక్షలు, 50వేల నుంచి 3 లక్షల జనాభా ఉన్నచోట రూ.42 లక్షల ఫీజును నిర్ణయించారు. దరఖాస్తుదారుడు 25వేల నాన్ రిఫండబుల్ చలాన్, లెసైన్స్ఫీజుపైన 1/3శాతం ధరావత్తు(ఈఎండీ), డీడీ తీయాలి. అదేవిధంగా ఏ1, ఏ2, ఏ3, ఏ4 ఫారాలను నింపాలి. పూర్తి చేసిన దరఖాస్తులను చలాన్, డీడీ, రెండు కలర్ పాస్‌పోర్టు సైజ్‌ఫొటోలను ఫారాలకు జత పరిచి టెండర్లను దాఖలుచేశారు. 194 షాపులకు టెండర్లుదాఖలు గతంలో జిల్లాలో 194 షాపులకు టెండర్లు వేసిన వాటిలో 185 మద్యం షాపులకు మాత్రమే వ్యాపారులు టెండర్లు వేశారు. మిగతా 9 షాపులకు ఆయా ప్రాంతాల్లో లాభాసాటిగా లేదని ఇతర కారణాలతో అక్కడ టెండర్ల వేసేందుకు వెనకడుగు వేశారు. ఈ వార్షిక సంవత్సరానికి అధికారులు కచ్చితంగా 194 షాపులకు మద్యం వ్యాపారులను టెండర్లు వేసేలా కృషిచేశారు. రెండేళ్లక్రితం వైన్‌షాపుల కేటాయింపుల్లో తీసుకొచ్చిన కొత్త నిబంధనలు, ఎంఆర్పీ రేట్లకే అమ్మకాలు, లెసైన్స్ఫీజుకు ఏడు రెట్ల మొత్తానికి కన్నా ఎక్కవ విలువైన మద్యాన్ని అమ్మితే 13.06శాతం ప్రివిలేజ్ఫీజు వంటి నిబంధనలు, మార్జిన్లోకోత తదితర అంశలన్నీ ఈసారి కూడా ఉన్నాయి. దీంతో మద్యం దుకాణాదారులు వేరే వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ వ్యాపారంలో దశాబ్దాలుగా ఉన్న వారు మాత్రమే ఈ సారి కూడా దుకాణాలను దక్కించుకునే ప్రయత్నంలో ఉన్నారు. 23న లాటరీ పద్ధతిన ఎంపిక దాఖలు ప్రక్రియ ముగియడంతో ఈనెల 23న జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్‌లో 194 మద్యం దుకాణాలకు సంబంధించిన టెండర్లను కలెక్టర్ సమక్షంలో లక్కీడ్రా ద్వారా ఎంపికచే యనున్నారు. -
'ప్రభుత్వాలు ఏర్పాటైయే వరకు ఫైళ్లను ఆపండి'
-
'ప్రభుత్వాలు ఏర్పడే వరకు ఫైళ్లకు ఫుల్స్టాప్'
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యేంత వరకు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఫైళ్లను ఆపివేయాలని ప్రభుత్వ అధికారులకు రాజ్ భవన్ లేఖ రాసింది. అయితే రాష్ట్ర విభజనకు సంబంధించిన ఫైళ్లను మాత్రం పంపవచ్చని లేఖలో సూచించారు. ప్రభుత్వ పాలనకు సంబంధించిన ఫైళ్లు పంపొద్దని చీఫ్ సెక్రటరీ, గవర్నర్ సలహాదారులకు రాజ్‌భవన్ అధికారులు లేఖ రాశారు. జూన్ 2 తేదిన అధికారికంగా 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించనుంది. ఇప్పటికే ఎన్నికల ఫలితాల తర్వాత ఏర్పడబోయే రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రాజ్ భవన్ అధికారులు సంధించిన లేఖ ప్రకారం జూన్ 2 తేది తర్వాతే పాలన సంబంధిత ఫైళ్లకు మోక్షం లభించే అవకాశం కనిపిస్తోంది. -
ఇక ఫైళ్ల డిజిటైజేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనలో కీలకమైన ఫైళ్ల విభజనను పూర్తి చేసిన అన్ని శాఖలు ఇప్పుడు ఆ ఫైళ్ల డిజిటైజేషన్‌పై దృష్టి సారించాయి. ఏ ఫైళ్లు ఎప్పటినుంచి డిజిటైజ్ చేయాలి, ఏ ఫైళ్ల డిజిటైజేషన్ అవసరం లేదనే వివరాలతో విభజనకు సంబంధించిన అపెక్స్ కమిటీ చైర్మన్ టక్కర్ అన్ని శాఖలకు గురువారం సర్క్యులర్ జారీ చేశారు. దీంతో రెండురోజుల్లో అన్ని శాఖల్లో ఫైళ్ల డిజిటైజేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రూ.6 కోట్ల వ్యయం కాగల ఈ కార్యక్రమాన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు. 30వ తేదీలో గా పూర్తి చేయాలని ఆదేశించారు. సర్క్యులర్ వివరాలు.. ఇరు రాష్ట్రాలకు చెందిన 2008 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2014 మార్చి 31 వరకు గల డిస్పోజల్ ఫైళ్లను మాత్రమే డిజిటైజ్ చేయాలి. అలాగే 2008 ఏప్రిల్ 1 నుంచి 2014 జూన్ 1వ తేదీ వరకు గల కరెంట్ ఫైళ్లను కూడా చేయాలి. విధానపరమైన ప్రధాన అంశాలకు చెందిన ఫైళ్లను, చట్ట సవరణలు, నియమ నిబంధనలు, ప్రాజెక్టులు, క్రమశిక్షణ కేసులు, విజిలెన్స్ అంశాలు, కోర్టు కేసులకు సంబంధించి 2008 ఏప్రిల్ 1కి ముందున్న ఫైళ్లను డిజిటైజ్ చేయాలి. అన్ని చెల్లింపులకు సంబంధించిన పాత బిల్లులను డిజిటైజ్ చేయాలి. హార్డ్ కాపీలను రికార్డ్ రూమ్‌లకు పంపాలి. ఏ రకమైన ఫైళ్లను జిరాక్స్ తీయరాదు. 2014 జూన్ 1 తర్వాత కొనసాగే కరెంట్ ఫైళ్ల జిరాక్స్‌లకే అనుమతి. ఇవి అవసరం లేదు..: సెలవు మంజూరు, ఇంక్రిమెంట్-వేతన స్థిరీకరణ, అడ్మిషన్-రిలీవింగ్-రిటైర్మెంట్ ఆర్డర్లు, సబ్జెక్టుల పంపిణీ, టూర్ల అనుమతి, లీవ్ ట్రావెల్ అలవెన్స్, గేట్ ఎంట్రీ పాస్, టెలిఫోన్ బిల్లులు, అద్దెకు వాహనాలు, ఆడిట్ జరిగిన స్టేషనరీ కొనుగోళ్లు, గత సంవత్సరాలకు చెందిన ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల వేతనాల బిల్లులు, సర్వీసు రిజిస్టర్లో నమోదైన జీపీఎఫ్ విత్‌డ్రా, శా ఖలకు సమాచారం కోసం జారీ చేసిన మెమోలు, బదిలీలు, పోస్టింగులు, అదనపు బాధ్యతల అలెవెన్సులు, పరిష్కృత వైద్య బిల్లులు ఇతర చిన్నచిన్న అంశాలకు చెందిన ఫైళ్లు. -
విభజన లెక్కలు కొలిక్కి
ఫైళ్లు, స్థిరాస్తులు, చరాస్తుల లెక్కలు పూర్తి చరాస్తుల సంఖ్య 1,23,200 స్థిరాస్తుల సంఖ్య 29,700 మొత్తం ఫైళ్లు 19.20 లక్షలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి పలు రంగాల్లో లెక్కలు ఓ కొలిక్కి వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన ఫైళ్లు, చరాస్తులు, స్థిరాస్తులు, కోర్టు కేసులు, చట్టాలు, నిబంధనలు, వాహనాల లెక్కలను అన్ని శాఖలు ఇప్పటికే సేకరిం చాయి. ఆ లెక్కలను అధికారులు గుడ్ గవర్నెన్స్ వెబ్సైట్లో పొందుపరిచారు. దీంతో విభజనకు సంబంధించి తొలి అంకం ముగిసిట్లేనని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఏ రాష్ట్రానికి చెందిన ఫైళ్లను ఆ రాష్ట్రానికి విభజించే పనిని ఆయా శాఖలు ఇప్పటికే పూర్తి చేశాయి. ప్రధానంగా ఫైళ్ల విభజన విషయంలోనే జాప్యం జరుగుతోందని అధికార యంత్రాంగం తొలుత భావించినప్పటికీ.. ఊహించిన దానికన్నా ముందుగానే చాలా శాఖలు ఫైళ్ల విభజనను పూర్తి చేశారుు. కీలకమైన ఫైళ్లను స్కానింగ్ చేయడం ఒకటే మిగిలి ఉంది. ఆ ప్రక్రియను కూడా వారంలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. గుడ్ గవర్నెన్స్‌కు ఇప్పటివరకు అందిన విభజన లెక్కల ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో చరాస్తుల (కంప్యూటర్లు, కుర్చీలు, టేబుళ్లు, టెలిఫోన్లు, ఎయిర్‌కూలర్లు, ఫ్రిజ్‌లు మొదలైనవి) సంఖ్య 1,23,200గా లెక్క తేలింది. ఇక స్థిరాస్తుల (భూములు, భవనాలు తదితరాలు) సంఖ్య 29,700గా తేలింది. మొత్తం ప్రభుత్వ వాహనాల సంఖ్యను 19,628గా, ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన చట్టాలు, రూల్స్ 6,300గా, ప్రభుత్వానికి చెందిన కోర్టు కేసులు 30 వేలుగా లెక్కకట్టారు. వీటిని కూడా ఏ రాష్ట్రానికి చెందిన వాటిని ఆ రాష్ట్రానికి విభజించే పని కొనసాగుతోంది. ఇలావుండగా అన్ని శాఖలు, కార్పొరేషన్లు, వివిధ ప్రభుత్వ సంస్థల్లో కలిపి కరెంట్, డిస్పోజల్ ఫైళ్లు 19.20 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. వీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి రాష్ట్రం వారీగా కూడా విభజించారు. -
రెవెన్యూలో చకచకా ఫైళ్ల విభజన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రెవెన్యూ శాఖలో ఫైళ్ల విభజన ప్రక్రియ చకచకా సాగుతోంది. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో అసైన్మెంటు (భూ వ్యవహారాలకు)కు సంబంధించి ఏడు సెక్షన్లు ఉన్నాయి. అసైన్మెంట్ సెక్షన్-3లో తప్ప మిగిలిన అన్ని సెక్షన్లలో సీమాంధ్ర, తెలంగాణ జిల్లాలు ఉన్నాయి. అందువల్ల అన్ని సెక్షన్లలో భూ కేటాయింపులకు సంబంధించిన ఫైళ్లను సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు విభజించాల్సి ఉంది. భూమి వ్యవహారం చాలా ముఖ్యమైనదైనందున సెక్షన్ల వారీగా తెలంగాణ, సీమాంధ్ర ఫైళ్లను వేరుచేసే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. కొన్ని ఫైళ్లు చాలా పురాతనమైనవి ఉన్నాయి. ఇవి మట్టి పట్టి ఉండటంతో వీటిని వేరు చేసే సమయంలో ముక్కు, నోటి ద్వారా మట్టి వెళుతుందనే భావంతో ఉద్యోగులు ముక్కుకు, నోటికి రక్షణగా మాస్క్‌లు కట్టుకుని మరీ పనిచేస్తున్నారు. సెక్షన్ల వారీగా ఉన్న జిల్లాలు అసైన్మెంట్ సెక్షన్ -1: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, మహబూబ్‌నగర్. అసైన్మెంట్ సెక్షన్ -2: కృష్ణా, నెల్లూరు, వరంగల్, నిజామాబాద్. అసైన్మెంట్ సెక్షన్ -3: హైదరాబాద్, సికింద్రాబాద్. అసైన్మెంట్ సెక్షన్ -4 : ఆదిలాబాద్, నల్లగొండ, మెదక్, చిత్తూరు, వైఎస్సార్. అసైన్మెంట్ సెక్షన్ 5 : గుంటూరు, అనంతపురం, కర్నూలు, రంగారెడ్డి. అసైన్మెంట్ సెక్షన్ 6 : తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కరీంనగర్. అసైన్మెంట్ పీఓటీ ఈ సెక్షన్ కింద ఖమ్మం జిల్లాతోపాటు 1/70 చట్టం కిందకు వచ్చే భూములన్నీ వస్తాయి. ప్రస్తుతం ఈ సెక్షన్లలోని సిబ్బంది తెలంగాణ, సీమాంధ్ర జిల్లాల ఫైళ్లను వేరు చేస్తూ ప్రత్యేకంగా కంప్యూటర్లలో వాటికి కొత్త ఇండెక్స్ ఇస్తున్నారు. -
సచివాలయంలో నిలిచిపోయిన ఫైళ్ల పరిశీలన
-
ఫైళ్ల విభజన షురూ
సచివాలయంలో నిలిచిపోయిన ఫైళ్ల పరిశీలన పనులు, నిధుల మంజూరుకూ బ్రేక్! సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునకు సంబంధించి రాష్ట్రపతి ఇంకా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనప్పటికీ రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలో విభజన ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం సీఎస్ జారీ చేసిన ఆదేశాలతో బుధవారం అన్ని శాఖల ఉన్నతాధికారులు ఆయా శాఖల్లోని సిబ్బందికి ఫైళ్ల విభజనపై మౌకిక ఆదేశాలను జారీ చేశారు. ఎక్కడి ఫైళ్లు అక్కడే నిలుపుదల చేయాలని, పరిశీలించరాదని స్పష్టం చేశారు. దీంతో విభజన ప్రక్రియ పూర్తయ్యేవరకు ఇక ఏ ప్రభుత్వ కార్యాలయంలోనూ ఎలాంటి ఫైళ్ల కదలిక ఉండదు. ఎటువంటి పనికి గానీ, సహాయానికి గానీ చేసుకున్న దరఖాస్తులు సైతం ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలు, కార్యక్రమాలకు నిధులు విడుదల తప్ప కొత్తగా ఏ పనులకు, కార్యక్రమాలకు నిధులు విడుదల గానీ పనులు మంజూరు గానీ నిలిచిపోనుంది. రెవెన్యూ శాఖలో కొన్ని జిల్లాలకు కలిపి ఐదారు సెక్షన్లు ఉన్నాయి. దీంతో విభజన సులభతరం కానుంది. ప్రణాళిక, ఆర్థిక శాఖల్లో మాత్రం జిల్లాల వారీగా ఫైళ్ల విభజన క్లిష్టతరం కానుంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి, ప్రధానమైన సర్వీసు అంశాలకు చెందిన ఫైళ్లను నోట్ ఫైళ్లతో సహా నకలు ప్రతులు (జిరాక్స్‌లు) తీయాలని అధికారులు తెలిపారు. చాలా శాఖల్లో ఏదో పది పేపర్లు మాత్రం జిరాక్స్ తీసే సామర్ధ్యంగల యంత్రాలే ఉన్నాయి. దీంతో చాలా శాఖలు ఫైళ్ల జిరాక్స్‌ల కోసం ఏపీటీఎస్‌ను ఆశ్రయిస్తున్నారు. సీఎం సహాయనిధి కోసం తిప్పలు: సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేయడంతో సీఎం సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి నిధుల మంజూరు నిలిచిపోయింది. ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పటికీ ఎటువంటి ఫైళ్లు చూడబోనని, తన వద్దకు పంపించవద్దని కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. మరోవైపు సీఎం తప్ప మిగతా ఎవరూ ఈ నిధులను మంజూరు చేయడానికి వీల్లేని పరిస్థితి ఉంది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. -
ఫైళ్ల క్లియరెన్స్‌లో సీఎం బిజీ బిజీ
సాక్షి, హైదరాబాద్: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే నానుడికి అనుగుణంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ శుక్రవారం సాయంత్రం ఆమోద ముద్ర వేస్తుందని తెలియడంతో సీఎం ఉదయం నుంచే ఫైళ్ల క్లియరెన్స్‌లో బిజీ అయిపోయారు. సీఎం కార్యాలయ అధికారులతో పాటు కొన్ని ప్రధాన శాఖల ఉన్నతాధికారులను క్యాంపు కార్యాలయానికి పిలిపించి పెండింగ్‌లో ఉన్న పలు ముఖ్యమైన ఫైళ్లను వెంటనే ఆమోదానికి పంపాల్సిందిగా కిరణ్ ఆదేశించారు. దీంతో ఉదయం నుంచే ఆయన ఫైళ్ల క్లియరెన్స్‌లో పడ్డారు. భూముల కేటాయింపులకు సంబంధించిన ఫైళ్లపై ఎడాపెడా సంతకాలను కానిచ్చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో మిగులు భూములు, జాగీర్దార్ భూముల కేటాయింపునకు చెందిన పలు ఫైళ్లకు సీఎం ఆమోదం తెలిపారు. అలాగే పలు శాఖల్లో పోస్టింగ్‌లు, బదిలీలు కోరుకుంటున్న వారి ఫైళ్లను క్లియర్ చేశారు. తనకు కావాల్సిన వారికి సంబంధించి అన్ని రకాల ఫైళ్లను క్లియర్ చేయడంపైన ఆయన దృష్టి సారించారు. రెవెన్యూ శాఖకైతే వెంటనే సంబంధిత ఫైళ్లను సర్క్యులేట్ చేయాలంటూ ఆదేశాలు జారీ అవుతున్నాయి. అలాగే పట్టణాభివృద్ధికి చెందిన ఫైళ్లతో పాటు తనకు సంబంధించిన ఎమ్మెల్యేలకు విచక్షణాధికారంతో మంజూరు చేసే ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి ఆయా పనులకు నిధులు ఇవ్వడం పైనా కిరణ్ దృష్టి సారించారు. సీఎం నెల రోజుల నుంచి సచివాలయానికి రావడం లేదు. దీంతో సచివాలయానికి సందర్శకుల తాకిడి కూడా గురువారం వరకు అంతంత మాత్రంగానే ఉంది. అయితే శుక్రవారం మాత్రం సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంది. ఇక ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడుతున్నాయని, వీలైనంత త్వరగా పనులు చేయించేసుకోవాలనే ఆత్రుతతో సందర్శకులు, పైరవీకారులు సచివాలయంలో హడావుడి చేశారు. సీఎం కార్యాలయం చేస్తున్న హడావుడితో అధికార యంత్రాంగం కూడా ప్రభుత్వానికి ఇక రోజులు దగ్గర పడ్డాయనే భావనకు వచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమకు చెందిన ఫైళ్లను క్లియర్ చేయించుకోవడానికి క్యూకట్టారు. -
‘బొగ్గు’ ఫైళ్ల మాయంపై కాంగ్రెస్ కోర్ గ్రూప్ భేటీ
న్యూఢిల్లీ: బొగ్గు బ్లాకుల కేటాయింపుల ఫైళ్లు మాయం కావడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన ప్రతివ్యూహంపై బుధవారం కాంగ్రెస్ అగ్రనాయకత్వం చర్చించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్సింగ్, న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్, బొగ్గు శాఖ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్‌తోకూడిన కోర్ గ్రూప్ ఈ మేరకు విస్తృతంగా చర్చలు జరిపింది. మాయమైన ఫైళ్లలో చాలా ఫైళ్లు దొరికాయని, కేవలం ఎనిమిది ఫైళ్లు మాత్రమే లేవని సమావేశంలో జైస్వాల్ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బొగ్గు కేటాయింపులకు సంబంధించిన కేసులో దర్యాప్తు ప్రారంభించగానే సీబీఐకి 769 ఫైళ్లు, ఇతర పత్రాలు, దరఖాస్తులను బొగ్గు మంత్రిత్వ శాఖ అప్పగించిందని జైస్వాల్ సమావేశంలో తెలిపారు. అయితే ఆగస్టు 14న మరిన్ని ఫైళ్లు కావాలని సీబీఐ అడగడంతో 43 ఫైళ్లు, 176 దరఖాస్తులు లేవని గుర్తించారు. ఈ 43 ఫైళ్లలో ఇప్పటికే దొరికిన 21 ఫైళ్లను సీబీఐకి ఇచ్చారని, ఇంకో 14 ఫైళ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని, మరో 8 ఫైళ్లు మాత్రం ఎక్కడున్నాయో తెలియడం లేదని ఆ వర్గాలు తెలిపాయి. 176 దరఖాస్తుల్లో చాలావరకూ తిరస్కరించినవే ఉన్నాయని, మూడు మాత్రమే దొరకగా వాటిని సీబీఐకి ఇచ్చినట్లు చెప్పాయి. అయితే ఈ దరఖాస్తుల వివరాలన్నీ బొగ్గు బ్లాకులపై నిర్ణయం తీసుకున్న స్క్రీనింగ్ కమిటీ మినిట్స్‌లో ఉంటాయని సమాచారం. అలాగే, పార్లమెంటు సమావేశాల్లో అంతరాయాల వల్ల ఆహారభద్రత బిల్లు ఆమోదానికి ఇబ్బందులు ఎదురవుతున్నందున తాజా ఆర్డినెన్స్ జారీచేయడంపై కూడా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. కోల్గేట్ పత్రాలు సీబీఐ వద్ద ఉన్నాయి: బొగ్గు మంత్రిత్వ శాఖ మాయమైన బొగ్గు కేటాయింపుల ఫైళ్లు సీబీఐ వద్ద ఉన్నాయని సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద దాఖలైన దరఖాస్తులకు బొగ్గు మంత్రిత్వ శాఖ సమాధానమిచ్చింది. బొగ్గు కేటాయింపులకు కంపెనీలు చేసుకున్న దరఖాస్తుల ప్రతులు ఇవ్వాలంటూ ‘ఎన్జీవో గ్రీన్‌పీస్’, ఇతర కార్యకర్తలు ఆర్టీఐ కింద కోరగా అవన్నీ సీబీఐ వద్ద ఉన్నాయని కేంద్రం ఈ మేరకు జవాబిచ్చింది. -
‘బొగ్గు’ ఫైళ్ల మిస్సింగ్ వెనుక కుట్ర: బీజేపీ
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణానికి సంబంధించిన ఫైళ్లు కనిపించకపోవడానికి వెనుక కుట్ర, కుమ్మక్కు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. 2006-09 మధ్య బొగ్గు శాఖ నిర్వహించిన ప్రధాని మన్మోహన్ సింగ్‌ను రక్షించడానికే వాటిని మాయం చేశారని విమర్శించింది. రాజ్యసభలో బీజేపీకి చెందిన ఉప నాయకుడు రవి శంకర్ ప్రసాద్ సోమవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మాయమైన బొగ్గు శాఖ ఫైళ్ల గురించి అడిగితే ప్రభుత్వం నుంచి స్పందనే లేదు. ఆ ఫైళ్లన్నీ 2006-09 మధ్య కాలానివి. కాంగ్రెస్ నాయకులు చేసిన అన్ని రాజకీయ సిఫార్సులతో ఉన్న కీలక ఫైళ్లన్నీ కనిపించడం లేదు. 157 ప్రైవేటు కంపెనీలకు చెందిన రికార్డులూ కనిపించడం లేదు’’ అని ప్రసాద్ అన్నారు. ఇందులో కుట్ర ఉందని తాము బలంగా విశ్వసిస్తున్నామన్నారు. క్రిమినల్ కేసుల్లో నిందితులు మొదట చేసే పని ఆధారాలను, సాక్ష్యాలనూ మాయం చేయడమేనని గుర్తుచేశారు. ఫైళ్ల మిస్సింగ్‌పై బొగ్గు శాఖ మంత్రి శ్రీ ప్రకాశ్ జైస్వాల్ ఇంతవరకు పార్లమెంటులో ఎలాంటి ప్రకటన చేయలేదని, ఆయన కచ్చితంగా ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.