సాక్షి, హైదరాబాద్: మోడల్ స్కూళ్లలో నిలిచిపోయిన పీజీటీ, టీజీటీ పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ ను ఈ నెలాఖరులో నిర్వహించేందుకు పాఠశాల విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. భర్తీ ప్రక్రియ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను 25 లేదా 26 తేదీల్లో జారీ చేయనున్నారు. ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని మోడల్ స్కూ ల్స్ ఎక్స్‌అఫీషియో పీడీ జగదీశ్వర్ తెలిపారు. ఈ పోస్టుల భర్తీలో తెలుగు మీడియం అభ్యర్థులను అనుమతించని కారణంగా న్యాయ వివాదం ఏర్పడి ఆలస్యమైన సంగతి తెలిసిందే. దీంతో 1000 పీజీటీ, 600 వరకు టీజీటీ పోస్టుల భర్తీ ఆగిపోయింది.
ఈ నెలాఖరులో మోడల్ స్కూల్ పోస్టుల భర్తీ
Published Sat, Aug 23 2014 2:36 AM | Last Updated on Tue, Oct 2 2018 4:01 PM
Advertisement
Advertisement