ఏడాదిలో పదిసార్లు మాత్రమే పాలు.. రెండుసార్లే గుడ్లు
నాణ్యత లేని భోజనంతో పస్తులుండాల్సి వస్తోంది
మా గదులు మేమే శుభ్రం చేసుకుంటున్నాం
ముజాహిద్‌పూర్ మోడల్ స్కూల్ విద్యార్థినుల ఆవేదన
హుటాహుటిన హాస్టల్‌ను సందర్శించిన డీఈఓ
కుల్కచర్ల: ‘విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి పులిహోర ఒక్కటే టిఫిన్‌గా పెడుతున్నారు. ఏడాదిలో పది రోజులు మాత్రమే పాలు ఇచ్చారు. రెండుసార్లే గుడ్లు ఇచ్చారు. భోజనం నాసిరకంగా ఉండడంతో తినలేక పస్తులుంటున్నాం..’అని వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్‌పూర్ మోడల్ స్కూల్ వసతి గృహంలో ఉంటున్న బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తమ హాస్టల్‌ను సందర్శించిన తహసీల్దార్ మురళీధర్‌కు తమ గోడు విని్పంచారు. వసతి గృహంలో గదులను తామే శుభ్రం చేసుకుంటున్నామని, మరుగుదొడ్లలోకి బకెట్లలో నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని తెలిపారు.
చలిపెడుతున్నా నేలపైనే పడుకుంటున్నామని, బెడ్ïÙట్లు కూడా ఇళ్ల నుంచి తెచ్చుకున్నామని వివరించారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో పాములు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఈ విషయాలను ఎంఈఓ హబీబ్ అహ్మద్ వెంటనే డీఈఓకు తెలియజేయడంతో ఆమె వెంటనే వసతి గృహానికి చేరుకున్నారు.
నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు:డీఈఓ
డీఈఓ రేణుకాదేవి మోడల్ స్కూల్ వసతి గృహాన్ని పరిశీలించి, విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నా రు. పాలు, కూరగాయలు, చికెన్, మటన్, గుడ్లు పంపిణీ చేయడంలో నిర్వాహకులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. భోజనం కూడా నాణ్యతతో ఉండటం లేదని తెలిపా రు. దీనిపై డీఈఓ స్పందించారు. మెనూ ప్రకారం భోజన వస్తువులను సరఫరా చేయని టెండరు దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. ఆమె వెంట మిషన్ భగీరథ డీఈ సుబ్రమణ్యం, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతి హెప్సిబా, కేజీబీవీ ప్రత్యేకాధికారి దేవి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment