deo
-
మద్యం తాగి.. విద్యార్థులపై దాడి
హొళగుంద: కర్నూలు జిల్లా హొళగుంద మండలం ముద్దటమాగి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం జయరాజ్ విధులు నిర్వర్తిస్తున్నారు. జయరాజ్ సోమవారం తనవెంట తెచ్చుకున్న మద్యం బాటిల్ తీసుకుని పాఠశాల టాయిలెట్లోకి వెళ్లారు. మద్యం బాటిల్ తీసుకుని వెళుతుండటాన్ని విద్యార్థులు గమనించి బాత్రూం దగ్గరకు వెళ్లి చూశారు.దీంతో హెచ్ఎం కోపంతో ఊగిపోతూ ప్లాస్టిక్ పైప్‌తో విద్యార్థులను ఇష్టానుసారంగా కొట్టాడు. కొందరు విద్యార్థులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. హెచ్ఎం మద్యం మత్తులో ఊగుతుండడాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఈవో–2 జగన్నాథం అక్కడికి చేరుకోవడంతో గ్రామస్తులు హెచ్ఎంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు పాఠశాలకు తాళాలు వేశారు. ఈ నేపథ్యంలో హెచ్ఎంను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్‌పాల్ ఉత్తర్వులిచ్చారు. -
AI జనరేటెడ్ ఫొటో కాదు.. ప్రభుత్వ అధికారి ఇంట్లో దొరికిన నోట్ల కట్టలు
పాట్నా : ఈ నోట్ల కట్టల్ని చూసి ఏఐ జనరేటెడ్ ఫొటో అనుకునేరు. ఓ జిల్లా విద్యాశాఖ అధికారి ఇంట్లో దొరికిన నోట్ల కట్టలు. బెడ్ కింద, సోఫా కింద ఇలా ఎక్కడ పెట్టినా నోట్ట కట్టలే దర్శనమిస్తున్నారు. దీంతో నోట్ల ఈ నోట్ల కట్టల్ని చూసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు సైతం ముక్కున వేలేసేకుంటున్నారు. ఇంతకీ ఆ విద్యాశాఖ అవినీతి అధికారి ఎవరనుకుంటున్నారా?జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ (DEO).రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతిష్ఠాత్మక ఉద్యోగాల్లో ఒకటి. డీఈవోగా జిల్లాల్లో విద్యా నాణ్యతను మెరుగుపరచడం, పర్యవేక్షణ, నిర్వహణ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. అలాంటి అత్యున్నత పదవిలో ఉన్న రజనీకాంత్ ప్రవీణ్. భారీ అవినీతికి పాల్పడ్డారు. బీహార్ రాష్ట్రం బెతియా జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న సీనియర్ అధికారి రజనీకాంత్ ప్రవీణ్ ఇంటిపై విజిలెన్స్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ మొత్తంలో నగదును వెలుగులోకి వచ్చింది.అవినీతి ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ శాఖ చేసిన దాడిలో ప్రవీణ్ ఇంటి బెడ్రూమ్,సోఫాల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ప్రస్తుతం సంబంధిత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాగా ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.KE PAISA BOLTA HAIBihar: Mountain of cash found at DEO’s residence, vigilance dept orders machines to count currency notes pic.twitter.com/kaCw2coEfR— Shakeel Yasar Ullah (@yasarullah) January 24, 2025 -
ఐదు నెలలుగా పులిహోరనే దిక్కు
కుల్కచర్ల: ‘విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి పులిహోర ఒక్కటే టిఫిన్‌గా పెడుతున్నారు. ఏడాదిలో పది రోజులు మాత్రమే పాలు ఇచ్చారు. రెండుసార్లే గుడ్లు ఇచ్చారు. భోజనం నాసిరకంగా ఉండడంతో తినలేక పస్తులుంటున్నాం..’అని వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్పూర్ మోడల్ స్కూల్ వసతి గృహంలో ఉంటున్న బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తమ హాస్టల్‌ను సందర్శించిన తహసీల్దార్ మురళీధర్‌కు తమ గోడు విని్పంచారు. వసతి గృహంలో గదులను తామే శుభ్రం చేసుకుంటున్నామని, మరుగుదొడ్లలోకి బకెట్లలో నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని తెలిపారు.చలిపెడుతున్నా నేలపైనే పడుకుంటున్నామని, బెడ్ïÙట్లు కూడా ఇళ్ల నుంచి తెచ్చుకున్నామని వివరించారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో పాములు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఈ విషయాలను ఎంఈఓ హబీబ్ అహ్మద్ వెంటనే డీఈఓకు తెలియజేయడంతో ఆమె వెంటనే వసతి గృహానికి చేరుకున్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు:డీఈఓ డీఈఓ రేణుకాదేవి మోడల్ స్కూల్ వసతి గృహాన్ని పరిశీలించి, విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నా రు. పాలు, కూరగాయలు, చికెన్, మటన్, గుడ్లు పంపిణీ చేయడంలో నిర్వాహకులు నిర్లక్ష్యంగా ఉంటున్నారని విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. భోజనం కూడా నాణ్యతతో ఉండటం లేదని తెలిపా రు. దీనిపై డీఈఓ స్పందించారు. మెనూ ప్రకారం భోజన వస్తువులను సరఫరా చేయని టెండరు దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. ఆమె వెంట మిషన్ భగీరథ డీఈ సుబ్రమణ్యం, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతి హెప్సిబా, కేజీబీవీ ప్రత్యేకాధికారి దేవి తదితరులు ఉన్నారు. -
రంగారెడ్డి: డీఈవో లేట్.. జడ్పీ ఛైర్మన్ క్లాస్
సాక్షి, రంగారెడ్డి: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం.. ఛైర్మన్ అనితా హరినాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ శశాంక, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. విద్య, వైద్యంపై అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. అయితే, డీఈవో సమావేశానికి ఆలస్యంగా రావడంపై జడ్పీ ఛైర్మన్ క్లాస్ తీసుకోగా, సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులందరికి డీఈవో బహిరంగ క్షమాపణ చెప్పారు. స్కూల్ యూనిఫామ్స్ విషయంలో చర్చ వల్ల ఆలస్యమైందని డీఈవో వివరణ ఇచ్చారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని ఆపరేషన్ థియేటర్లు, భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిల్లో వైద్యుల కొరత ఉందంటూ మండిపడ్డారు. విద్య, వైద్యంలో అధికారుల డిప్యూటేషన్ల రద్దు చేయాలని రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.డిప్యుటేషన్ల రద్దు కుదరదంటూ కలెక్టర్ వివరించారు. మీ సమస్యను సంబందిత శాఖకు సమగ్రంగా వివరించాలని సూచించారు. డిప్యుటేషన్ల విషయంలో అనేక ఒత్తిళ్లు ఉంటాయని కలెక్టర్ అన్నారు. కందుకూరు మెడికల్ కళాశాల రద్దు కాలేదని.. మెడికల్ కళాశాలకు వేరే ప్రాంతంలో స్థలం కోసం చూస్తున్నామని డీఎంహెచ్‌వో తెలిపారు. -
దశాబ్ది.. సాగులో నూతన ఒరవడి..
కరీంనగర్ అర్బన్: ఒకప్పుడు నీళ్లు దొరకని దుస్థితి నుంచి సాగుకు సమృద్ధిగా నీరుదొరికే పరిస్థితికి జిల్లా చేరింది. దశాబ్దకాలంలో సాగురంగంలో అనే క మార్పులు చోటుచేసుకోగా సేద్యం కొత్త పుంతలు తొక్కుతోంది. వర్షాధార పంటలకే పరిమితమైన జిల్లా నేడు వర్షాలు లేకున్నా పంటలు సాగు చేసేలా నీటి వనరులు పెరిగాయి. జిల్లాలో 3.36లక్షల ఎకరాల సాగుభూమి ఉండగా 3,05,775 ఎకరాలు వివిధ రకాల నీటి వనరులను కలిగి ఉండటం శుభ పరిణామం.కేవలం 30,300ల ఎకరాలు మాత్రమే వర్షాధార భూములు ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి బత్తిని శ్రీనివాస్ వెల్లడించారు. ఒకప్పుడు 50వేల ఎకరాల వరకు బీడు భూములుండగా సాగులోకి వచ్చాయి. దశాబ్దకాలంలో సాగురంగంలో వచ్చిన మార్పులు, ఏ ఏ పంటలు పండిస్తున్నా రు. సమగ్ర వివరాలు.. జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ..మిషన్ కాకతీయతో పెరుగుదలచెరువుల కింద అంతంత మాత్రమే సాగవుతు ఉండగా మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల్లో పూడిక తీత, ఇతర మరమ్మతులు చేపట్టడంతో సాగుపెరిగింది. ప్రస్తు తం జిల్లావ్యాప్తంగా ఆ యా చెరువుల కింద 18,888ఎకరాల ఆయక ట్టు ఉంది. కరీంనగర్ రూరల్ మండలంలో అత్యధికంగా చెరువుల కింద 4వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. చిన్నచిన్న కుంటల చెరువుల ద్వారా 14,715 ఎకరాల సాగుభూమికి నీరందుతోంది. మానకొండూరు, శంకరపట్నం, చిగురుమామిడి, సైదాపూర్, గంగాధరలో చెరువులు ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా చెరువులు, కుంటల ద్వారా 33,603 ఎకరాల్లో సాగునీరు అందుతోంది.బోర్‌వెల్స్, బావులతో 1,55,888 ఎకరాలుజిల్లాలో మెట్ట ప్రాంతాలైనా గంగాధర, రామడుగు, చొప్పదండి, గన్నేరువరం, ఇల్లందకుంట వంటి మండలాల్లో బోర్‌వెల్స్, బావులు ఎక్కువ. బోర్‌వె ల్స్ ద్వారా సాగునీరు లభిస్తుండగా 13,888 ఎకరా లను సాగు చేస్తున్నారు. ఇక బావుల ద్వారా 1,42, 000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. జిల్లాలో అత్యధిక సాగు బావుల ద్వారానే సాగవుతోందని గణాంకాలు చాటుతున్నాయి. గతంలో వర్షాలు సమృద్ధిగా కురియడంతో భూగర్భజలాలు ౖపైపెకి చేరడంతో నీటికి ఢోకా లేదు. ఈ సారీ వర్షాలు సమృద్ధిగా ఉంటాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది.ప్రాజెక్టులతో 1.16లక్షల ఎకరాలుజిల్లాలో బావుల తరువాత అత్యధిక సాగువిస్తీర్ణం ప్రాజెక్టుల కిందే సాగవుతోంది. జిల్లాకు ఆయువుపట్టుగా ఎల్ఎండీ జలాశయం ఉండగా మిడ్‌మానేరు ద్వారా నీరందుతోంది. శ్రీరాంసాగర్, కాళేశ్వరం ప్రాజెక్టుల తిమ్మాపూర్, మానకొండూరు, శంకరపట్నం, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లోని రైతులకు సాగునీరందుతోంది. గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాల్లోని పలు గ్రామాలకు వరద కాలువ ద్వారా సాగునీరు అందుతోంది. 1,16,280 ఎకరాలకు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు లభిస్తోందని సర్వేలో తేలింది.అపరాలు, కూరగాయల సాగు పెంపుకు కృషిజిల్లాలో పప్పుల సాగు, కూరగాయల సాగు తగ్గింది. ఇతర జిల్లాలపై ఆధారపడాల్సి వస్తోంది. రైతులు వాణిజ్య పంటలకే మొగ్గు చూపుతున్నారు. కందులు, పెసలు, మినుములు, రాగులు, సజ్జలు, జొన్నలు వంటి పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. జిల్లాలో 2వేల ఎకరాల్లో కూరగాయలు సాగవుతున్నాయి. ప్రజల అవసరాల దృష్ట్యా కూరగాయల సాగు విస్తీర్ణం రెట్టింపు చేసేలా ప్రయత్నిస్తున్నాం.– బత్తిని శ్రీనివాస్, డీఏవో, కరంనగర్ -
బదిలీలకు 1,920 దరఖాస్తులు
నిర్మల్: జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతుల ప్రక్రియ వేగవంతమైంది. బదిలీ కోసం 1,920 మంది ఉపాధ్యాయులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. గతంలో 1,780 మంది దరఖాస్తు చేసుకోగా తాజాగా 140 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా ఎంఈవోల ద్వారా తమ హార్డు కాపీలను డీఈఓ కార్యాలయానికి పంపించారు. ఆ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించేందుకు అధికారులు సీనియర్ పీజీ ప్రధానోపాధ్యాయులతోపా టు, ఉపాధ్యాయులను కమిటీగా నియమించారు. -
డీఈఓ సాయిరామ్‌కు గుండెపోటు
రాప్తాడురూరల్: జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఎం.సాయిరామ్ శనివారం గుండెపోటుకు గురయ్యారు. ఉదయం నుంచి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటికి చేరుకున్నారు. తనకు కడుపు నొప్పిగా ఉందని భార్య ఉమాకు చెప్పి బెడ్రూమ్లో విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో భార్య పిలిచినా డీఈఓ నుంచి స్పందన లేదు. అప్పటికే ఆయన కోమాలోకి వెళ్లారు. గట్టిగా కేకలు వేయడంతో ఇంటివద్దే ఉన్న ఏపీఓ నారాయణస్వామి, కంప్యూటర్ ఆపరేటర్ హరికృష్ణ, డ్రైవరు హుటాహుటిన కారులో తీసుకొచ్చి నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న కలెక్టర్ గౌతమి, జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ తదితరులు ఆస్పత్రికి వచ్చి డీఈఓ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో అడిగి తెలుసుకున్నారు. రోదిస్తున్న భార్య ఉమాను ఓదార్చారు. గుండెకు రక్తం సరఫరా అయ్యే వాల్వ్ బ్లాక్ కావడం, ఊపిరిత్తుల్లోకి ఆహారం చేరుకోవడంతో కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్, జెడ్పీ చైర్పర్సన్ వైద్యులకు సూచించారు. డీఈఓ అస్వస్థతకు గురయ్యారనే సమాచారంతో డీఈఓ, సమగ్ర శిక్ష కార్యాలయాల సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, ఎంఈఓలు, హెచ్ఎంలు ఆస్పత్రికి తరలివచ్చారు. ఉదయమంతా సరదాగా గడిపిన డీఈఓ.. ఉదయం నుంచి డీఈఓ సాయిరామ్ సరదాగా గడిపారు. నగర శివారులోని టీటీడీసీలో జరుగుతున్న రీజనల్‌స్థాయి ప్రధానోపాధ్యాయుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరయ్యారు. గాయకుడైన డీఈఓ ఈ సందర్భంగా ‘ఇదే కదా ఇదే కదా నీకథ...ముగింపు లేనిదై సదా సాగదా’ అంటూ మహర్షి సినిమాలో పాట పాడి అందరినీ ఆకర్షించారు. అక్కడి నుంచి సమగ్ర శిక్ష కార్యాలయానికి చేరుకుని ఎంఈఓల సమావేశంలో పాల్గొన్నారు. అందరితో హుషారుగా గడిపారు. ఇక్కడి నుంచి 3 గంటల సమయంలో ఇంటికి బయల్దేరారు. కాగా... డీఈఓ గతంలోనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇప్పటికే స్టంట్‌కూడా వేయించుకున్నారు. డీఈఓ త్వరగా కోలుకోవాలని విద్యాశాఖ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆకాంక్షిస్తున్నారు. -
షాకింగ్ ఘటన: మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్న బాలికలు... సీరియస్ అయిన మంత్రి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో చక్‌దేపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో కొంతమంది విద్యార్థినులు మరుగుదొడ్లను శుభ్రం చేస్తూ కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్థానిక మీడియాలో వైరల్ అయ్యాయి. పైగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలల్లో మరుగుదొడ్డను శుభ్రం చేయమని బలవంతం చేశారంటూ వార్తలు గుప్పుమన్నాయి. వారంతా ఐదు, ఆరు తరగతులు చదువుతున్న విద్యార్థినులంటూ పలు కథనలు వచ్చాయి. ఐతే ఆ వార్తన్నింటిని జిల్లా విధ్యాధికారి సోనమ్ జైన్ ఖండించారు. విచారణలో ఆ బాలికలు తాము మరుగుదొడ్లు శుభ్రం చేయలేదని, వర్షాల కారణంగా మరుగుదొడ్లు మురికిగా ఉన్నందున చేతిపంపు నుంచి నీటిని తెచ్చిపోశామని చెప్పినట్లు తెలిపారు. అలాగే ఆ బాలికలు, వారి తల్లిదండ్రుల స్టేట్మెంట్ను రికార్డు చేసినట్లు జైన్ వెల్లడించారు. ఐతే ఈ ఘటనపై సీరియస్ అయిన రాష్ట్ర పంచాయతీ మంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా ఈ విషయంపై గుణ జిల్లా కలెక్టర్‌ను విచారణ చేయమని ఆదేశించినట్లు సమాచారం. దీంతో పాఠశాల విదయాశాఖ బృదం పాఠశాలకు చేరుకుని ప్రత్యేక విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అంతేగాతు ఈ ఘటనలో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ సిసోడియా పేర్కొన్నారు. यह तस्वीरें बेहद आपत्तिजनक है… मामाजी की सरकार में स्कूल में भाँजियो से शौचालय साफ़ करवाया जा रहा है.. तस्वीरें गुना ज़िले के बमोरी के चकदेवपुर के प्राथमिक- माध्यमिक स्कूल की है…. “ बेटी पढ़ाओ “ अभियान की हक़ीक़त… pic.twitter.com/UweK7emh8l — Narendra Saluja (@NarendraSaluja) September 22, 2022 (చదవండి: భారీ వర్షాలు..స్కూల్స్ బంద్, ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోం) -
స్కూళ్లలో బాలలపై లైంగిక వేధింపులకు చెక్
సాక్షి అమరావతి: సుప్రీంకోర్టు, హైకోర్టు జువెనైల్ జస్టిస్ కమిటీ ఆదేశాల మేరకు సూళ్లలో పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు పాఠశాల విద్యాశాఖ కఠిన చర్యలు చేపట్టింది. లైంగిక వేధింపులు, పోక్సో చట్టం గురించి పిల్లల్లో అవగాహన కల్పించాలని ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యా శాఖాధికారులను ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలల్లో పోస్టర్లు, ఫిర్యాదు పెట్టెలు ఉంచాలని తెలిపింది. విద్యార్థులందరికీ కనిపించేలా పోస్టర్లు ఉంచాలని, తగిన పరిమాణంలో తగిన మెటీరియల్‌తో కూడిన ఫిర్యాదు పెట్టె హెడ్మాస్టర్ గది వెలుపల ఉంచాలని సూచించింది. ఫిర్యాదులను ఈ పెట్టెలో వేయవచ్చు. ఇతర ప్రధాన సూచనలు పోస్టర్లలో ఏకరూపత ఉండాలి. పోస్టర్ల ముద్రణ, ఫిర్యాదు పెట్టె కోసం పాఠశాల నిర్వహణ గ్రాంట్ నుండి నిధులు తీసుకోవచ్చు. తాళం ఉండే ఏదైనా చిన్న పెట్టెను ఫిర్యాదు పెట్టెగా ఉపయోగించవచ్చు మండల విద్యాధికారి, ఇతర విభాగాల అధికారుల సమక్షంలో సమీపంలోని పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్, ఏఎన్ఎం 15 రోజులకు ఒకసారి ఫిర్యాదు పెట్టెను తెరిచి, అందులో ఉన్న ఫిర్యాదులను చదవాలి ఫిర్యాదుపై అవసరమైన చర్యలకు వారు సంబంధిత శాఖకు తెలపాలి ఏ విధంగానూ, ఏ సమయంలోనూ ఫిర్యాదుదారు వివరాలను బహిర్గతం చేయకూడదు. అత్యంత గోప్యంగా ఉంచాలి. ఎంఈవోలు డీఈవోలకు రెగ్యులర్ రిపోర్టును పంపాలి డీఈవో ప్రతి నెలా 1, 15 తేదీల్లో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌కి నివేదిక పంపాలి (చదవండి: ‘డిజిటల్’ ఫిష్: ‘ఫిష్ ఆంధ్ర’కు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం ) -
ట్రైనింగ్ విద్యార్థిని.. ఇంటికి వస్తేనే సంతకాలు పెడతానంటూ..
సాక్షి,సూర్యాపేటటౌన్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కొంత మంది గురువులు వక్రబుద్ధి ప్రదర్శిస్తున్నారు. శిక్షణ కోసం వచ్చిన బీఈడీ విద్యార్థినిని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లైంగికంగా వేధించిన సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. సదరు విద్యార్థిని బుధవారం డీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన విద్యార్థిని సూర్యాపేట సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీఈడీ చదువుతోంది. బీఈడీ టీచింగ్ ట్రైనింగ్‌లో భాగంగా 20రోజులుగా జిల్లా కేంద్రంలోని నంబర్ 2 ప్రభుత్వ పాఠశాలకు వస్తోంది. ట్రైనింగ్ పూర్తవ్వడంతో çసంబంధిత పాఠశాల హెచ్ఎం ట్రైనింగ్ పూర్తిచేసినట్లు రికార్డులపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. అయితే సదరు విద్యార్థిని రెండు మూడు సార్లు హెచ్ఎం దగ్గరకు వెళ్లగా అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో సంప్రదించింది. తన రికార్డులపై సంతకాలు చేయాలని కోరగా ఇంటికి వస్తే గాని సంతకాలు చేయనని హెచ్ఎం ఫోన్లోనే అసభ్యంగా మాట్లాడినట్లు ఆ విద్యార్థిని డీఈఓ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ట్రైనింగ్‌కు వచ్చిన దగ్గర నుంచి హెచ్ఎం తనను లైంగికంగా వేధిస్తున్నాడని విద్యార్థిని తెలిపింది. హెచ్ఎంపై దాడి..? హెచ్ఎం చేష్టలకు విసిగిపోయిన సదరు విద్యార్థిని జరిగిన విషయాన్ని తన బంధువులకు తెలియజేయడంతో వారు హెచ్ఎంపై దాడి చేసినట్లు సమాచారం. హెచ్ఎంపై దాడి చేసి అక్కడ నుంచి వచ్చి డీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ హెచ్ఎంపై బీఈడీ విద్యార్థిని డీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు సంబంధిత హెచ్ఎంపై విచారణ చేపట్టి.. ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు తీసుకుంటాం. –అశోక్, డీఈఓ చదవండి: వివాహేతర సంబంధం: తెల్లవారుజామున ఇళ్ల నుంచి బయటకు వచ్చి.. -
పనికొద్దు.. ఆ డబ్బులు నేనే ఇస్తా..
తగరపువలస (భీమిలి)/విశాఖపట్నం: ఇంటిలో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో స్కూల్‌కు వెళ్లకుండా వెల్డింగ్ పనికి వెళ్లిన ఓ విద్యార్థికి డీఈవో చంద్రకళ అండగా నిలిచారు. పనికెళ్తే వచ్చే డబ్బులు తానే ఇస్తానని, చక్కగా చదువుకోవాలని హితవు పలికారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆనందపురం జెడ్పీ హైస్కూల్‌ను డీఈవో చంద్రకళ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో వసతులు, సిలబస్ బోధనపై అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం, నాణ్యత, రుచిపై ఆరా తీశారు. చదవండి: కిరాతక దుశ్చర్య.. కూరతో భోజనం పెట్టలేదని.. అనంతరం పదో తరగతి విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. హాజరుకాని వారి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా గొంప లోకేశ్వరరావు అనే విద్యార్థి ఆర్థిక ఇబ్బందులతో వెల్డింగ్ షాపులో పనికి వెళ్తున్నట్టు తెలుసుకున్నారు. వెంటనే ఆనందపురం కూడలిలో లోకేశ్వరరావు పనిచేస్తున్న వెల్డింగ్‌షాపు వద్దకు ఉపాధ్యాయులు సాయంతో వెళ్లి మాట్లాడారు. చదువు కోసం ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను వివరించారు. మధ్యలో చదువు ఆపేయవద్దని కోరారు. పదో తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు వెల్డింగ్ పనులకు వెళ్తే ఎంత వేతనం వస్తుందో ఆ మొత్తం తాను సమకూరుస్తానని ఆమె భరోసా కల్పించారు. అలాగే హాస్టల్లో ఉండి చదువుకునేలా చర్యలు తీసుకుంటానని లోకేశ్వరరావుకు హామీ ఇచ్చారు. ఆమె వెంట ప్రధానోపాధ్యాయుడు బి.శ్రీనివాసరావు ఉన్నారు. -
వారంలో పీజీ!.. లాడ్జీల్లో పరీక్షలు
సాక్షి,అనంతపురం: రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సు వారం రోజుల్లో పూర్తి చేయడం సాధ్యమా?.. తాము తలచుకుంటే సాధ్యమేనని నిరూపించారు జిల్లాలోని కొందరు ఉపాధ్యాయులు. పైగా ఆ సర్టిఫికెట్లతో పదోన్నతులు కూడా పొందారు. 2009 ఫిబ్రవరిలో ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి దక్కించుకున్న వారిలో ఎక్కువ మంది ఇలా నకిలీ పీజీ సర్టిఫికెట్లతోనే కథ నడిపించినట్లు తెలుస్తోంది. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై తాజాగా ‘సాక్షి’ కథనాలు ప్రచురిస్తుండగా..అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. లాడ్జీల్లో పరీక్షలు ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఎంఏ ఇంగ్లిష్ చదివి ఉండాలన్నది నిబంధన. దీంతో కొందరు ఎస్జీటీలు అడ్డదారుల్లో సర్టిఫికెట్లు పుట్టించారు. ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీల అధికారులకు కాసులు సమర్పించారు. వారి సహకారంతో రాత్రిళ్లు లాడ్జీల్లో పరీక్షలు రాసేశారు. వారంలో సర్టిఫికెట్లు తెచ్చేసుకుని.. విద్యాశాఖ అధికారులకు సమర్పించారు. ఇలా 77 మంది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుర్తింపు లేని రాజస్థాన్‌లోని విహబ్ యూనివర్సిటీ సర్టిఫికెట్లు సమర్పించి పదోన్నతులు పొందినట్లు సమాచారం. గుడ్డిగా పదోన్నతులిచ్చిన విద్యాశాఖ పదోన్నతి కోసం సదరు ఉపాధ్యాయులు ఇచ్చిన సర్టిఫికెట్లు నిజమైనవా..కావా అన్న అంశాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు ధ్రువీకరించుకోవాలి. ఇందుకోసం సదరు యూనివర్సిటీల అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. కానీ ఎస్ఏ ఇంగ్లిష్ పోస్టు కోసం సమర్పించిన సర్టిఫికెట్ల గురించి ఏ అధికారీ ఆరా తీయలేదు. అసలు సదరు యూనివర్సిటీ దేశంలో ఉందా..లేదా అని కూడా నిర్ధారించుకోలేదు. తీరా ఇప్పుడు ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏ సెక్షన్, బీ సెక్షన్ అధికారులు ఒకరిపై మరొకరు నెపం నెట్టుకుంటున్నారు. మరోవైపు వారం రోజుల్లోనే పీజీ సర్టిఫికెట్లు తెప్పించుకుని సర్వీసు రిజిష్టర్ (ఎస్ఆర్)లో నమోదు చేయించుకున్న కొందరు ఉపాధ్యాయులు.. ఈ వ్యవహారం రచ్చ కావడంతో అదే సబ్జెక్టుకు సంబంధించి మరో వర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. తిరిగి ఆ సర్టిఫికెట్ ఆధారంగా ఎస్‌ఆర్‌లో నమోదు చేయించుకున్నారు. అయినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై తెరవెనుక భారీగానే మంత్రాంగం నడిచినట్లు తెలుస్తోంది. -
రైతు కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగి..
చిత్తూరు కలెక్టరేట్ : పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం వరికుంటపాడులో రైతు కుటుంబానికి చెందిన పెంచలయ్య, కొండమ్మ దంపతులకు నరసింహారెడ్డి జన్మించారు. ఒకటో తరగతి నుంచి పీహెచ్డీ వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదివారు. సెకండరీ గ్రేడ్ టీచర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన డీఈవో స్థాయికి ఎదిగారు. నెల్లూరు డైట్ కళాశాల లెక్చరర్‌గా, బీఈడీ కళాశాల లెక్చరర్‌గా, ఎస్సీఈఆర్టీ ఐఈడీ కోఆర్డినేటర్‌గా, సహిత విద్య కోఆర్డినేటర్‌గా, రాష్ట్ర స్థాయి లీడర్షిప్ ట్రైనింగ్ కోఆర్డినేటర్‌గా, పాఠ్యపుస్తకాల రచయితగా అనేక హోదాల్లో పనిచేశారు. విధుల పట్ల నిబద్ధత, అంకితభావంతో పనిచేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. శిథిలావస్థకు చేరిన డీఈవో కార్యాలయం రూపురేఖలను మార్చడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సొంత నిధులతో మరమ్మతులు చేయించారు. టీచర్ల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించారు. ఈ–ఆఫీస్‌ను పకడ్బందీగా నిర్వహించి ఫైళ్లు పెండింగ్ లేకుండా చర్యలు తీసుకున్నారు. ప్రశంసలు ప్రభుత్వం చిత్తూరు నుంచి ప్రారంభించిన అమ్మఒడి పథకం విజయవంతానికి కృషి చేశారు. కేజీబీవీ బాలికలు నాసా కార్యక్రమానికి వెళ్లడంలో ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఇన్‌స్పైర్‌లో రాష్ట్రస్థాయిలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపారు. ఉయ్ లవ్ రీడింగ్‌ను పకడ్బందీగా అమలు చేసి కమిషనర్ చినవీరభద్రుడు నుంచి ప్రశంసలు పొందారు. బయోమెట్రిక్ అమలులో జిల్లా మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేశారు. నాడు– నేడు అమలులో మంచి పురోగతి చూపించి ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ నుంచి ప్రశంసలు పొందారు. చదవండి: రేపటి నుంచి స్కూళ్లకు ఉపాధ్యాయులు -
Telangana: భారీగా జిల్లా విద్యాశాఖ అధికారుల బదిలీలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు డీఈవోలను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం డీఈవోగా ఎస్.యాదయ్య, భద్రాద్రి కొత్తగూడెం డీఈవోగా పి.అనురాధరెడ్డి, ఎస్సీఈఆర్టీ డిప్యూటీ డైరెక్టర్ గా చైతన్య జైనీ దీంతోపాటు యాదాద్రి భువనగిరి డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మోడల్ స్కూల్స్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎస్.ఎస్.సూర్యప్రసాద్, మేడ్చల్ మల్కాజ్గిరి డీఈవోగా సూర్యప్రసాద్(అదనపు బాధ్యతలు), సంగారెడ్డి డీఈవోగా నాంపల్లి రాజేశ్, కరీంనగర్ డీఈవోగా సీహెచ్.వి.ఎస్.జనార్దన్‌రావు, రంగారెడ్డి డీఈవోగా పి.సుశీంద్రరావు, నారాయణపేట డీఈవోగా లియాఖత్ అలీ, వనపర్తి డీఈవోగా ఎ.రవీందర్, జోగులాంబ గద్వాల డీఈవోగా మహ్మద్ సిరాజుద్దీన్, జనగాం డీఈవోగా టి.రాము(అదనపు బాధ్యలు) నియమించారు. మేడ్చల్ జిల్లా డీఈవోగా ఉన్న విజయకుమారిని స్కూల్ ఎడ్యూకేషన్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. చదవండి: TS: సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు.. ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు ప్రమోట్ -
పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు తప్పనిసరి..
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు అమలు జరిగేలా చర్యలు చేపట్టారు. పాఠశాల ప్రారంభానికి ముందే ప్రతి విద్యార్థి చేతులు శానిటేషన్తో శుభ్రం చేసుకున్న తర్వాతే లోపలికి అనుమతిస్తారు. అదే సమయంలో ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి టెంపరేచర్‌ను కూడా పరీక్షిస్తారు. అనుమానిత లక్షణాలు ఉంటే దగ్గరలో ఉన్న ప్రాథమిక వైద్య కేంద్రానికి కూడా తల్లిదండ్రుల ద్వారా తీసుకువెళ్లే ఏర్పాట్లు కూడా చేశారు. జిల్లాలోని 942 ప్రభుత్వ పాఠశాలలో ఈ చర్యలు చేపట్టారు. తాజా అంచనాల బట్టి దాదాపు 98 వేల మంది విద్యార్థులు సగటున ప్రతి రోజు తరగతులకు హాజరవుతున్నట్టు విద్యా శాఖ చెబుతోంది. అదే సమయంలో ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఇప్పటికే వివిధ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు నిర్వహించుకోవాలని కూడా అధికారులు ఆదేశించారు. ప్రతిరోజు కోవిడ్ నిబంధనల అమలుపై జిల్లా విద్యాశాఖ అధికారి తనిఖీలు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం పెందుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో డీఈవో లింగేశ్వర రెడ్డి తనిఖీలు చేపట్టి కోవిడ్ నిబంధనలు అమలు తీరుపై ఆరా తీశారు. -
గైర్హాజరైతే వెంటనే తొలగింపు
సాక్షి, అమరావతి: అధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా, సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరయ్యే బోధన, బోధనేతర సిబ్బందిని గుర్తించి, వారిని వెంటనే సర్వీసు నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఈ మేరకు డీఈవోలకు అంతర్గత ఉత్తర్వులు జారీచేశారు. ఎవరెవరిని సర్వీసు నుంచి తొలగిస్తారంటే.. అనుమతులు లేకుండా ఏడాదికి మించి విధులకు హాజరుకాకుండా ఉన్నవారు, సెలవు పెట్టి అయినా, పెట్టకుండా అయినా ఐదేళ్లుగా విధులకు హాజరుకాకుండా ఉన్నవారు, ప్రభుత్వం అనుమతించిన కాలపరిమితి దాటిపోయినా ఇతర విభాగాల్లో కొనసాగుతూ స్కూళ్ల విధులకు గైర్హాజరవుతున్న వారికి షోకాజ్ నోటీసు ఇచ్చి వివరణ తీసుకున్న అనంతరం చర్యలు చేపడతారు. అనుమతిలేకుండా గైర్హాజరైన కాలాన్ని రెగ్యులరైజ్ చేయాలని హెచ్ఎంలు, ఎంఈవోలు, టీచర్లు, నాన్‌టీచింగ్ స్టాఫ్ నుంచివినతులు వస్తున్నాయి. అయితే గైర్హాజరవ్వడం సర్వీస్ రూల్సు ప్రకారం మిస్‌కాండక్టుగా పరిగణించి వారిపై చర్యలు తీసుకోవలసిందేనని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 30 రోజులకుపైగా అనధికారికంగా ఆబ్సెంటులో ఉన్న హెడ్మాస్టర్లు, ఎంఈవోలు, టీచర్లు, నాన్‌టీచింగ్ సిబ్బందిని గుర్తించి వారికి షోకాజ్ నోటీసులు జారీచేయాలి. ఎవరైనా ఏడాదికి మించి రిపోర్టు చేయకుండా ఉన్న వారుంటే వారి పేర్లను పత్రికల్లో ముద్రించేలా చర్యలు చేపట్టాలి. అనంతరం వారి పేర్లను గెజిట్‌లో ముద్రించి చర్యలు చేపట్టాలి. (ఆ లిమిట్స్ దాటితే అనేక సమస్యలు వస్తాయి) -
స్పందించిన అధికారులు
సాక్షి, ఆదిలాబాద్: ‘చెప్పని చదువుకు ఫీజులు’ అనే శీర్షికన గురువారం సాక్షి జిల్లా టాబ్లాయిడ్లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఓ ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు చేపట్టారు. లాక్డౌన్ సమయంలో పాఠశాలలు నడవకున్నా నెలవారీ ఫీజులు, పెనాల్టీ వసూలు చేస్తున్న పాఠశాలల గుర్తింపును రద్దు చేయడం జరుగుతుందని డీఈవో రవీందర్‌రెడ్డి తెలిపారు. ఫీజులు, పెనాల్టీలు కట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులపై పాఠశాల యాజమాన్యాలు ఒత్తిడి తీసుకువస్తే తన దృష్టి తీసుకురావాలని పేర్కొన్నారు. శుక్రవారం ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఆత్రం నగేష్, అన్నమొల్ల కిరణ్, తోట కపిల్ కలెక్టరేట్లోని చాంబర్లో అదనపు కలెక్టర్ సంద్యారాణిని కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ విచ్చలవిడిగా ఫీజులు వసూళ్లు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీకి గురి చేస్తున్న ఓ ప్రైవేటు పాఠశాల గుర్తింపును రద్దు చేయాలన్నారు. లాక్డౌన్ కాలానికి కూడా ఫీజులు వసూళ్లు చేస్తోందని, ప్రభుత్వం ఆన్లైన్ పాఠాలు చెప్పడానికి అనుమతి ఇవ్వకముందే ఆన్లైన్ పాఠాలు బోధించిందని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఫీజులు చెల్లించాలని సెల్ఫోన్లో మేసేజ్‌లు పంపుతోందని, ఆలస్యమైతే పెనాల్టీలు కూడా చెల్లించాల్సి వస్తుందని భయపెడుతున్నట్లు వివరించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్ విచారణ జరిపించాల్సిందిగా డీఈవోను ఆదేశించారు. దీంతో డీఈవో ఎంఈవో జయశీలను విచారణ అధికారిగా నియమించారు. విచారణ జరిపిన ఎంఈవో ఫీజులు, పెనాల్టీల వసూలు చేస్తున్నట్లుగా గుర్తించి డీఈవోకు నివేదించారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు సదరు పాఠశాలకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. -
‘జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్’ దొరికిపోయింది!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు స్కూల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో డీఈఓ తనిఖీలు నిర్వహిస్తుంటే స్కూల్ ముందు యాజమాన్యం నిఘా పెట్టింది. స్కూల్ గురించి మీడియా, తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునేందుకు యాజమాన్యం కెమెరాలలో రికార్డ్ చేసుకుంటోంది. స్కూల్ ఆవరణంలో ముగ్గురు మనుషులతో నిఘా పెట్టగా, వారిలో ఇద్దరు కెమెరాలతో రికార్డు చేస్తుంటే మరొకరు వాకీటాకీలతో అక్కడ జరుగుతున్న సమాచారాన్ని స్కూల్ యాజమాన్యానికి చేరవేస్తున్నారు. మీడియా స్కూల్ పేరెంట్స్‌తో మాట్లాడిస్తున్న సందర్భంలో వారి కెమెరాలతో రికార్డు చేస్తున్నారు. ఈ దృశ్యాలు చిత్రీకరిస్తున్న సమయంలో మీడియాకు అడ్డంగా దొరికిపోయారు. (జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో విద్యాశాఖ అధికారుల విచారణ) -
ఏపీవోపై చర్యలు తీసుకోండి!
సాక్షి, ఒంగోలు : జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ ఆళ్ల శేషయ్యను ఆ పోస్టు నుంచి తొలగించి చర్యలు తీసుకోవాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ నాయకులు కోరారు. బుధవారం సాయంత్రం జిల్లా విద్యాశాఖాధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. దశాబ్ద కాలంగా శేషయ్య అనే ఉపాధ్యాయుడు బోధనేతర కార్యక్రమంలో అక్రమంగా కొనసాగుతున్నారన్నారు. గతంలో తర్లుపాడులో ఎస్జీటీగా పనిచేస్తూ పాఠశాలకు హాజరు కాకుండా కార్యాలయానికి హాజరవుతుండేవారన్నారు. పదేళ్ల నుంచి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల్లో అక్రమాలకు పాల్పడ్డారన్నారు. అధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తూ ఉపాధ్యాయుల పదోన్నతుల జాబితా నిబంధనలకు విరుద్ధంగా తయారు చేసి కౌన్సిలింగ్‌కు పది నిమిషాల ముందు డీఈవోకు అందజేస్తారన్నారు. మెరిట్ కం రోస్టర్ విధానంలో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలు తయారు చేయల్సి ఉండగా ఒక సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయులకు మేలుచేసే విధంగా రూపొందించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉపాధ్యాయులకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. జీవోలను వక్రీకరిస్తూ, అధికారులను సైతం తప్పుదోవ పట్టిస్నుత్న ఏపీవోపై ప్రివెన్షన్ ఆఫ్ ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని కోరారు. డీఈవోను కలిసిన వారిలో బీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్రె వెంకట్రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిరాల శరత్చంద్రబాబు, జిల్లా గౌరవాధ్యక్షుడు పేరాబత్తిన జాలరామయ్య, జిల్లా కార్యదర్శి పాలేటి సువర్ణబాబు, నాయకుడు పల్లె కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
ఆరు నెలలైనా జీతం రాకపాయే..
పాఠశాలలో కిచెన్ గార్డెన్లో ఉద్యోగం అంటే సంతోషించిన. హైదరాబాద్‌కు చెందిన ఏజెన్సీ వారు ఇది ఔట్సోర్సింగ్ ఉద్యోగం.. నెలకు రూ.6 వేల జీతం. భవిష్యత్‌లో జీతం పెరుగుతుంది అని అన్నారు. రూ.60 వేలు తీసుకొని కనగల్ మోడల్ స్కూల్లో ఆర్డర్ ఇచ్చారు. 5 నెలలకు ఎక్కువగానే పనిచేశా. కానీ జీతం ఇవ్వలేదు. మేము ఇచ్చిన డబ్బులు మాకు ఇవ్వలేదు. క్యాన్సిల్ చేశారు. తిరిగి మళ్లీ అనుమతి రాగానే తీసుకుంటామని చెప్పారు. డీఈఓ ఆఫీసుకు పోతే మాకు తెలియదన్నారు. హైదరాబాద్‌లోని ఏజెన్సీ వారిదగ్గరికి వెళ్లినా ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. నాతోపాటు చాలా మంది వద్ద డబ్బులు తీసుకున్నారు. మోసపోయాం. మాకు న్యాయం చేయాలి. – అనూష, కనగల్ సాక్షి, నల్లగొండ : జిల్లా విద్యాశాఖలో గుట్టు చప్పుడు కాకుండా తెరవెనుక జరిగిన వ్యవహారంలో ఒక్కోటి బయటపడుతున్నాయి. నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన ఓ స్వచ్ఛంద సంస్థకు సహకరించేలా విద్యాశాఖ అధికారి జారీ చేసిన ఉత్తర్వులు వెలుగులోకి వచ్చాయి. వివాదాస్పద వ్యవహారాలతో ఇటీవల జిల్లా విద్యాశాఖాధికారి బదిలీ అయ్యారు. ఆ అధికారి పనిచేసిన సమయంలో తీసుకున్న ఓ నిర్ణయం వంద మందికి పైగా నిరుద్యోగులకు నష్టం చేకూర్చి పెట్టింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉన్నత పాఠశాలలు, కేజీబీవీల్లో కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకుని విద్యార్థులు, అక్కడి సిబ్బంది సహకారంతో వీటిని నిర్వహించుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లాలను ఆదేశించారు. దీనికోసం ఎలాంటి బడ్జెట్ ఉండదని కూడా పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు రసాయన రహితమైన తాజా కూరగాయలను అందించేందుకు కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసుకోవాలన్నది అసలు లక్ష్యం. అయితే, ఉన్నతాధికారులు ఆశించింది ఒకటి కాగా, జిల్లాలో జరిగింది మరొకటి. చక్రం తిప్పిన మహిళా అధికారి ! జిల్లా విద్యాశాఖలోనే ఇటీవల దాకా జిల్లాస్థాయి ఇన్చార్జి పోస్టులో పనిచేసిన ఓ మహిళా అధికారి తనకు సంబంధాలు ఉన్న ‘సుచిత్ర ఎడ్యుకేషన్ సొసైటీ’అనే స్వచ్ఛంద సంస్థను రంగంలోకి దింపారు. జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో, కేజీబీవీల్లో కిచెన్ గార్డెన్లను ఉచితంగా అభివృద్ధి చేసి ఇస్తామన్న నెపంతో రంగప్రవేశం చేశారు. కిచెన్ గార్డెన్ల ఇన్చార్జులుగా (కిచెన్ గార్డియన్లు) ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు గాలం వేశారు. వీరికి నెలకు రూ.7,500 వేతనం ఇస్తామని కూడా నమ్మబలికారు. కిచెన్ గార్డియన్లతో పా టు బ్యూటీషియన్ కోర్సులు బోధించడానికి కూడా ఉద్యోగాలు ఇస్తామని ప్ర చారం చేశారు. ఇవన్నీ కూడా ఔట్ సో ర్సింగ్ విధానంలో చేసుకున్న నియామకాలే. కానీ, ఇలా పోస్టులు ఇవ్వడానికి కిచెన్ గార్డియన్ల పోస్టు కోసం రూ.50వేలు, రూ.60వేలు, 80వేలు మొదలు రూ.1.20లక్షలు, బ్యూటీషియన్ క్రాఫ్ట్ టీచర్ కోసం రూ.1.50లక్షలు వసూలు చేశారు. ఇలా మొత్తంగా జిల్లాలో 280 పోస్టులను భర్తీ చేయాలని భావించి సు మారు వంద మంది నుంచి డబ్బులు వ సూలు చేసి పోస్టింగులు కూడా ఇచ్చా రు. ఇలా మొత్తంగా కనీసం రూ.కోటి దాకా వసూలు చేశారని సమాచారం. హైదరాబాద్‌కు చెందిన ఈ స్వచ్ఛంద సంస్థ నేరుగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది. వారికి ఆయా స్కూళ్ల వారీగా పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చింది. కానీ, పాఠశాలల ప్రధానోపాధ్యాయలు వీరిని విధుల్లో చేర్చుకోలేదు. తమకు ఎలాంటి ఆదేశాలూ లేవని, విధుల్లో ఎలా చేర్చుకంటామని పేచీ పెట్టారు. దీంతో చేసేది లేక ఉద్యోగాలు పొందిన వారంతా తిరిగి ఆ ఎన్జీఓ నిర్వాహకులను కలిశారు. ఈ ఎన్జీఓకు సహకరిస్తున్న ఓ మహిళా అధికారి రంగంలోకి దిగి జిల్లా విద్యాశాఖాధికారితో జిల్లాలోని అందరు హెచ్ఎంలు, మండల విద్యాశాఖాధికారులకు ఉత్తర్వులు ఇప్పించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన ఈ ఉత్తర్వులు ఇచ్చారు. తమ పోస్టింగ్ ఆర్డర్‌కు సపోర్టుగా డీఈఓ ఉత్తర్వులు కూడా ఉండడంతో ఈ రెండు కాపీలను జత చేసి నిరుద్యోగులకు అందజేయడంతో వారు పనుల్లో కుదిరిపోయారు. అయితే, వీరంతా కనీసం ఆరు నెలలు ఎలాంటి జీత భత్యాలు లేకుండా పనిచేశారు. దీంతోపాటు కిచెన్ గార్డెన్‌కు అవసరమైన విత్తనాలు సొంతంగా సమకూర్చారు. నేలను దున్నడం వంటిపనులన్నీ చేశారు. అయినా, వేతనాలు అందకపోవడంతో జిల్లా విద్యాశాఖ అధికారులను నిలదీశారు. తమ నుంచి వేలాది రూపాయలు వసూలు చేశారని, వేతనాల మాటటుంచి తాము చెల్లించిన డబ్బులు ఇప్పించాలని గొడవకు దిగారు. ఇది ఎటొచ్చి ఎటు దారితీస్తుందోనని కిచెన్ గార్డెన్లు నిలిపివేయాలంటూ డీఈఓ మరో ఉత్తర్వు సెప్టెంబర్ 17వ తేదీన ఇచ్చారు. నిండా మునిగిన నిరుద్యోగులు జిల్లా విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులను నమ్మి తమకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం వచ్చినట్టేనని సొమ్ములు పోగొట్టుకున్న నిరుద్యోగులు ఇప్పుడు నిండా మునిగినట్లు అయ్యింది. వీరికి నెలనెలా రావాల్సిన వేతనాలు రాకపోవడంతో పాటు ఉద్యోగం కోసం చెలించుకున్న సొమ్ములు కూడా పోయాయి. వారంతా జిల్లా విద్యాశాఖ కార్యాలయం చుట్టూ తిరిగిపోతున్నా, తమకు ఎలాంటి సంబంధం లేదని పోస్టింగ్ ఇచ్చిన ఎన్జీఓనే నిలదీయాలని చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు. అయితే, డీఈఓ సపోర్టు ఆర్డర్‌తోనే తాము నమ్మి డబ్బులు చెల్లించుకున్నామని వీరు పేర్కొంటున్నారు. ఇంతా జరిగినా, తమ డబ్బులు రావన్న కారణంతో ఎవరూ ఆ స్వచ్ఛంద సంస్థపైన పోలీసులకు ఫిర్యాదు చేయలేదని చెబుతున్నారు. నేను కొత్తగా విధుల్లో చేరా నేను రెండు రోజుల క్రితం విధుల్లో చేరాను. ఈ కిచెన్ గార్డెన్ల గురించి నాకు తెలియదు. ఏం జరిగింది అన్నది తెలుసుకుంటాను. ఉత్తర్వులు, నియామకాలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడుతాను. బాధితులకు ఏ విధంగా న్యాయం చేయాలో చూస్తాను. – డీఈఓ భిక్షపతి -
భారీ వర్ష సూచన: సెలవు ప్రకటన
సాక్షి, విశాఖపట్నం : భారీ వర్షసూచన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్టు జిల్లా విద్యాధికారి ఒక ప్రకటన విడుదల చేశారు. రేపు (అక్టోబర్ 24) విద్యాలయాలకు సెలవు ప్రకటించిన విషయాన్ని తల్లిదండ్రుల కమిటీలు, విద్యార్థులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులకు పాఠశాలలు చేరవేసి ఒక్క విద్యార్థి పాఠశాలకు హాజరు కాకుండా చూడాలని చెప్పారు. జిల్లా విద్యాశాఖ ఉత్తర్వులను పట్టించుకోకుండా పాఠాశాలలు తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే సంబంధిత స్కూలు యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పదవ తరగతిలో వందశాతం ఫలితాలే లక్ష్యం
సాక్షి, మహబూబ్‌నగర్ : కొన్ని సంవత్సరాలుగా జిల్లా పదవ తరగతి ఫలితాల్లో 28వ స్థానంలో కొనసాగుతోంది. ఈ ఏడాది పక్కా ప్రణాళికను రచించి అందరి సహకారంతో జిల్లాను ముందంజలో నిలుపుదామని డీఈఓ ఉషారాణి కోరారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి ఉత్తీర్ణత శాతం పెంచడానికి కృషి చేస్తామని అన్నారు. నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా డీఈఓ ఉషారాణి ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. టెన్త్ ఫలితాలపై శ్రద్ధ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటినుంచే పూర్తి స్థాయిలో పదో తరగతి పరీక్షలకు సిద్ధమయ్యేలా చర్యలు తీసుకుటుంన్నాం. మరీ ముఖ్యంగా సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. నిర్ణీత సమయంలో సిలబస్ పూర్తి చేసి, విద్యార్థులను ప్రిపరేషన్‌కు సిద్ధమయ్యేలా ఆదేశిస్తాం. సైన్స్, గణిత ఉపాధ్యాయులకు ఈనెలాఖరులోకానీ, వచ్చే నెల మొదటి వారంలో కానీ ఓరియంటేషన్ తరగతులు నిర్వహించి సబ్జెక్టుపై అవగాహన పెంచుతాం. విద్యానైపుణ్యాలు పెంచేలా చర్యలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పూర్తి స్థాయిలో వివిధ సబ్జెక్టు పరంగా నైపుణ్యాలు పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా త్రీఆర్స్ కార్యక్రమం గతంలోనే ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఏబీసీ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో 60 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. వివిధ సబ్జెక్టులు చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం వంటి అనేక రకాల అంశాలపై విద్యార్థులకు అవగాహన పెంచి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తాం. నాణ్యతగా మధాహ్న భోజనం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో చదువుతున్న వారికి నాణ్యమైన భోజనం అందిం చే విధంగా చర్యలు తీసుకుంటాం. కచ్చితంగా మెనూ పాటించేలా మండల విద్యాశాఖ అధికారులు, ప్రిన్సిపాళ్లు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మధ్యాహ్న భోజనంలో నాణ్యత, శుభ్రతను పాటించి విద్యార్థులకు మంచి పౌష్టికాహారాన్ని కూడా అందిస్తాం. ప్రైవేటు విద్యా సంస్థలు తీరుమార్చుకోవాలి జిల్లాలోని అధిక ఫీజులు వసూలు చేస్తున్న వివిధ ప్రైవేటు సంస్థల వివరాలను, గుర్తింపు లేని పాఠశాలల వివరాలను మండల విద్యాశాఖ అధికారుల నుంచి సేకరిస్తాం. పూర్తి ఫీజులు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తీసుకోవాల్సి ఉం ది. ఇక గుర్తింపు లేని పాఠశాలలకు గుర్తింపు తీ సుకునే విధంగా నోటీసులు జారీ చేస్తాం. పూర్తి స్థాయిలో సిబ్బంది, వసతులు, అనుమతుల గు రించి సమీక్షిస్తాం. విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తాం. ఆ ఉపాధ్యాయులపై చర్యలు గతంలో పలువురు ఉపాధ్యాయులపై ఆరోపణలు వచ్చిన విషయం గురించి తెలుసుకున్నాం. తప్పు చేసినట్లు తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. దీర్ఘకాలంగా ఫిర్యాదులు వచ్చిన వారి వివరాలు సేకరించి కలెక్టర్‌కు నివేదిస్తాం. వారి ఆదేశాల ప్రకారం చర్యలు ఉంటాయి. -
ఫోర్జరీతో కదులుతున్న.. డొంక!
ఓపెన్ స్కూల్స్ జిల్లా కోఆర్డినేటర్ పోస్టు కోసం మంగళ సృష్టించిన ఫోర్జరీ లేఖ వ్యవహారంలో తీగలాగితే డొంక కదులుతోంది. ఆమెకు సంబంధించి ఒక్కో అంశం వెలుగులోకి వస్తోంది. ఆమెను ఈ పోస్టులో కొనసాగించేందుకు రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్, డైరెక్టరేట్ కార్యాలయం నుంచి జిల్లావిద్యాశాఖకు అందిన లేఖ కూడా ఫోర్జరీదేనని తెలుస్తోంది. సాక్షి, నల్లగొండ : ఓపెన్ స్కూల్స్ జిల్లా కో ఆర్డినేటర్‌గా కొనసాగేందుకు ఏకంగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి సృష్టించిన నకిలీ రికమెండేషన్ లేఖ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై శుక్రవారం ‘సాక్షి’ మినీలో ప్రచురించిన ‘పోస్టింగ్ కోసం .. ఫోర్జరీ’ ప్రత్యేక కథనం సంచలనం రేపింది. జిల్లా ఉన్నతాధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. రావులపెంట జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ఎం.మంగళను ఓపెన్స్ స్కూల్స్ కో ఆర్డినేటర్ పోస్టులో కొనసాగించేందుకు అధికారికంగా జరిగిన ‘కరస్పాండెన్సు’కు సంబంధించిన ఫైళ్లను కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తెప్పించుకున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారిని పిలిపించి మాట్లాడాలని కలెక్టర్ ప్రయత్నించినా, కోర్టు కేసు విషయంలో డీఈఓ సరోజీనిదేవి హైదరాబాద్ వెళ్లడంతో కుదరలేదు. అదే మాదిరిగా, స్థానిక వన్ టౌన్ సీఐ సురేష్ సైతం డీఈఓ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు తీసుకోవడానికి ప్రయత్నించినా, డీఈఓ లేని కారణంగా వీలుపడలేదు. జిల్లా నిఘా విభాగం అధికారులు సైతం మంత్రి కేటీఆర్ సంతకం ఫోర్జరీ వ్యవహారంపై పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. పరీక్షల నిర్వహణలో అవినీతి..? మరోవైపు జిల్లా ఓపెన్ స్కూల్స్ నిర్వహణతోపాటు, పరీక్షల నిర్వహణలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పరీక్షల సమయంలో ఒక్కో విద్యార్థి నుంచి కనీసం రూ. వెయ్యి చొప్పున వసూలు చేశారని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ఓపెన్స్ స్కూల్స్ సొసైటీ అధికారులతో పాటు, జిల్లా విద్యాశాఖ అధికారులకూ ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో విచారణ జరి పితే మరిన్ని నిజాలు బయట పడతాయని జిల్లా ఉన్నతాధికారులను కోరారు. సస్పెండ్ చేయాలి : డీటీఎఫ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ మంగళను సస్పెండ్ చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ఖుర్షీద్‌మియా, ప్రధాన కార్యదర్శి వెంకులు, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, అడ్‌హక్ కమిటీ కన్వీనర్ కె.వీరయ్య శుక్రవారం ప్రకటనలో కోరారు. విద్యాశాఖ కార్యాలయం అవినీతి అక్రమాలకు నిలయమైందని, అక్రమ డిప్యుటేషన్లు ఇస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వీటిపై కూడా విచారణ చేసి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డీఈఓపై చర్యలు తీసుకోవాలి : ఎస్ఎఫ్ఐ ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ పోస్టింగ్ విషయంలో మంత్రి కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి రికమెండేషన్ లెటర్ సృష్టించిన మంగళపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆ లేఖను సరైన విధంగా పరిశీలించని విద్యాశాఖాధికారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేశ్ అధికారులను ఒక ప్రకటనలో కోరారు. -
సెల్‌ఫోన్‌తో కనిపిస్తే ఫిర్యాదు చేయొచ్చు
‘‘పాఠశాల సమయంలో టీచర్లు సెల్‌ఫోన్ వినియోగించడం వల్ల ఆ ప్రభావం పిల్లల చదువుపై పడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో తరగతి గదిలో టీచరు చేతిలో సెల్‌ఫోన్ కనిపించకూడదు. ఇందుకు ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి. తరగతి గదిలో టీచరు సెల్‌ఫోన్‌తో కనిపిస్తే ఆయనతో పాటు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయున్ని కూడా బాధ్యుడిని చేస్తా. ఇద్దరిపైనా చర్యలుంటాయి. ఎవరైనా టీచరు తరగతి గదిలో సెల్‌ఫోన్ పట్టుకున్నట్లు కనిపిస్తే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా నేరుగా నాకు ఫిర్యాదు చేయవచ్చు.’’ – శామ్యూల్, జిల్లా విద్యా శాఖ అధికారి నాణ్యమైన విద్యకు అత్యంత ప్రాధాన్యత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తాం. ఈ విషయంలో కలెక్టర్ సత్యనారాయణ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చాలా స్కూళ్లలో ఐదో తరగతి పిల్లలకు కూడా రాయడం, చదవడం రాకపోవడం బాధాకరం. ప్రైమరీ విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు పెంపొందించేలా చర్యలు తీసుకుంటా. ఇక ఉన్నత పాఠశాలల్లో ఆయా తరగతులకు సంబంధించిన పాఠ్యాంశాల్లో పిల్లలకు కనీస పరిజ్ఞానం ఉండేలా చూడాల్సిన బాధ్యత టీచర్లపై ఉంది. సాక్షి, అనంతపురం ఎడ్యుకేషన్ : ‘అనంత’ కరువుకు చిరునామా.. వ్యవసాయమే జీవనాధారం. పంటలు సరిగా పండవు. ఆర్థిక ఇబ్బందులున్న కుటుంబాలే అధికం. అందుకే అందరూ తమ పిల్లలను ప్రభుత్వ బడులకే పంపుతారు. నూతన సర్కార్ కూడా విద్యారంగాన్ని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సిద్ధమైంది. పాఠశాలల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యమిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 5.50 లక్షల మంది విద్యార్థుల భవిత, ఉపాధ్యాయుల పనితీరు, ఉపాధ్యాయ సంఘాల నేతల వ్యవహారం, డీఈఓ కార్యాలయ సిబ్బందిపై వస్తున్న ఆరోపణలు తదితరాలపై ఇటీవలే జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన కాగిత శామ్యూల్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. విద్యార్థుల సంక్షేమానికి, ప్రభుత్వ విద్య బలోపేతానికి తీసుకోనున్న చర్యలు ఆయన మాటల్లోనే.. విద్యార్థుల సంఖ్యను పెంచుతాం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడం కూడా ప్రాధాన్యతగా తీసు కుంటా. ఈ విద్యా సంవత్సరం ఇప్పటిదాకా అందిన సమాచారం మేరకు 13 వేల మందికిపైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. మరింతమంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్ల బాట పట్టేలా చర్యలు తీసుకుంటాం. షెడ్యూలు ప్రకారం ఫార్మేటివ్ పరీక్షలు ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ప్రతి స్కూల్లోనూ ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించాలి. టీచర్లు రిజిష్టర్లు పక్కాగా నిర్వహించాలి. టీచర్లు డైరీలు రాయాలి. లెసన్ ప్లాన్ తప్పకుండా రావాలి. ఎంఈఓలు, డిప్యుటీ డీఈఓలు తరచూ తనిఖీలు నిర్వహించి ఈ అంశాలన్నీ పరిశీలించాలి. అవినీతి రహిత పాలన డీఈఓ కార్యాలయంలో అవినీతికి తావులేకుండా పాలన సాగిస్తా. ప్రతి ఫైలుకూ ఒక రేటు ఫిక్స్ చేశారనే వార్తలు రావడం దారుణం. ఇప్పటిదాకా ఎలా జరిగిందో నాకు తెలీదు. ఇకపై ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఉంటా. పెండింగ్ ఫైళ్ల విషయమై బాధితులెవరైనా నన్ను కలిసి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. బయోమెట్రిక్ పక్కాగా అమలు పది రోజులు గడువు పెట్టుకున్నా. జిల్లాలో అన్ని కేడర్ల టీచర్లు 18 వేలమంది దాకా ఉన్నారు. వారంతా వందశాతం బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాల్సిందే. కుంటిసాకులు చెబితే ఒప్పుకోను. ఏవైనా సాంకేతికపరమైన ఇబ్బందులుంటే ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. 1,700 డివైజ్‌లు కొత్తగా వచ్చాయి. అవసరమైన స్కూళ్లకు వాటిని అందజేస్తాం. అప్పటికీ అటెండెన్స్ శాతం పెరగకపోతే మాత్రం కఠినంగా వ్యవహరిస్తా. ‘నవ ప్రయాస్’కు నోటీసులు పెనుకొండ, రొద్దం, సోమందేపల్లి మండలాల్లోని పాఠశాలలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తున్న ‘నవ ప్రయాస్’ ఏజెన్సీపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయి. భోజనం సరిగా లేకపోవడంతో మూడు మండలాల్లోని స్కూళ్లలో 50 శాతం మంది విద్యార్థులు కూడా భోజనం తినడం లేదు. దీనిపై ఏజెన్సీకి నోటీసులిచ్చాం. నవ ప్రయాస్ సంస్థ సరఫరా చేస్తున్న భోజనం నాణ్యతపై ఆహారభద్రత అధికారులతో విచారణ చేయిస్తున్నాం. వారి నివేదిక రాగానే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం. అందరూ సమానమే స్కూల్ పనివేళల్లో ప్రతి టీచరూ బడిలోనే ఉండాలి. ఈ విషయంలో సామాన్య టీచర్లయినా, ఉపాధ్యాయ సంఘాల నాయకులైనా ఒకటే. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే మాత్రం... ఎవరినీ ఉపేక్షించను. పనివేళల్లో టీచర్లు ఎవరూ కూడా నన్ను కలిసేందుకు కార్యాలయానికి రావొద్దు. వారంలో మూడు రోజులు సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు కార్యాలయంలో అందుబాటులో ఉంటా. ఏదైనా సమస్య ఉంటే ఆ సమయంలో నన్ను కలవవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న కొందరు టీచర్లపై పక్కా ఆధారాలతో ఫిర్యాదులు అందాయి. అలాంటి వారి భరతం పడతా. -
సర్దుబాటా.. సౌకర్యంబాటా..?
సాక్షి, కరీంనగర్: టీచర్ల సర్దుబాటు ప్రక్రియ వ్యవహారం జిల్లాలో గందరగోళంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా, ఇష్టారాజ్యంగా సర్దుబాటు ప్రక్రియ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సర్దుబాటు జరిగిన టీచర్లంతా తమకు అన్యాయం జరిగిందంటూ డీఈవో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. కొంత మంది అర్జీలు సమర్పిస్తున్నారు. మరికొంత మంది చోటామోటా నాయకులతో సర్దుబాటును రద్దు చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాల నుంచి విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలకు 114 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు తక్కువగా ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారనే నెపంతో ఆయా పాఠశాలలకు సర్దుబాటు చేసిన ప్రక్రియపై ఉపాధ్యాయ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. సర్దుబాటులో జరిగిన టీచర్ల వ్యవహరంపై మచ్చుకు కొన్ని ఉదాహరణలు.. చిగురుమామిడి మండలంలో ప్రాథమిక పాఠశాల సుందరగిరి నుంచి ఒక టీచర్‌ను బొల్లోనిపల్లి ప్రాథమిక పాఠశాలకు డిప్యూటేషన్ పెట్టారు. తిరిగి అదే సుందరగిరి ప్రాథమిక పాఠశాలకు లాలయ్యపల్లె ప్రాథమిక పాఠశాల నుంచి టీచర్‌ను డిప్యూటేషన్ పెట్టారు. నిబంధనలు పాటించారా, ఏమైనా కొత్త నిబంధనలు వచ్చాయా అంటే అదేమిలేదు. విద్యార్థులు తక్కువ ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉంటే విద్యార్థులు ఎక్కువ ఉండి ఉపాధ్యాయులు తక్కువ ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయాలి. పై సర్దుబాటు విషయంలో మండల విద్యాధికారి నిబంధనలు పాటించకుండా పై అధికారులకు తప్పుడుగా పంపించడం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కూడా చూసీచూడనట్లుగా ఉత్తర్వులు జారీ చేయడం ఇంకా ఈ ఉత్తర్వులను కలెక్టర్ ఆమోదం పొందడం విడ్డూరంగా ఉంది. అధికారులు ఇలాంటి తప్పిదాలను వెంటనే సరి చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. టీచర్స్ సర్దుబాటు జాబితా పరిశీలిస్తే చాలా పొరపాట్లు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. గంగాధర మండలంలో ప్రాథమికోన్నత పాఠశాల కొండన్నపల్లి నుంచి ఒక టీచరు అవసరం లేకున్నా కూడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గంగాధరకు ఉపనియుక్తం చేశారు. మండలంలో చాలా ప్రాథమిక పాఠశాలలకు ఎస్జీటీలు అవసరం ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఉన్నత పాఠశాలలకు సర్దుబాటు చేయడమేమిటని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. రామడుగు మండలంలో ప్రాథమిక పాఠశాల చిప్పకుర్తి నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామడుగుకు ఎస్జీటీ టీచరును డిప్యూటేషన్ చేశారు. ఉన్నత పాఠశాల రామడుగులో అన్ని పోస్టులు ఉన్నాయి. కేవలం హెడ్మాస్టర్ పోస్టు మాత్రమే ఖాళీగా ఉన్నది. మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉన్న స్థానంలో ఒక టీచర్‌ను అదనంగా ఇచ్చినట్లయితే జిల్లా అంతటా కూడా హెడ్మాస్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నచోట ఒక టీచర్‌ను సర్దుబాటులో ఎందుకు ఇవ్వలేదు. టీచర్ల సర్దుబాటు విషయంలో మండల విద్యాధికారులు జిల్లా విద్యాధికారికి సరైన వివరాలు అందించలేదు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎక్కువగా ఉన్న పోస్టులను గుర్తించక సర్దుబాటు వివరాలు పంపారు. రామడుగు మండలం తిర్మలాపూర్ నుంచి ఒక స్కూల్ అసిస్టెంట్‌ను జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్ హైస్కూల్లో సర్దుబాటు చేశారు. అదే మండలంలోని తిర్మలాపూర్ హైస్కూల్ నుంచి ఒక ఉపాధ్యాయుడిని చిగురుమామిడి మండలం రామంచకు సర్దుబాటు చేయడంపై కూడా అనుమానాలు తావిస్తున్నాయి. మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లిలో 400 మంది విద్యార్థులు ఉండగా ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే పనిచేస్తున్నారు. అక్కడే పనిచేసే తెలుగు పండిట్ ఉపాధ్యాయుడిని మానకొండూర్ మండల కేంద్రంలోని హైస్కూల్లో ముగ్గురు తెలుగు పండిట్లు ఉన్నా మరో తెలుగు పండిట్‌ను సర్దుబాటు చేయడంపై ఉపాధ్యాయ సంఘాల నేతలు నివ్వెరపోతున్నారు. ఒక హైస్కూల్లో రెండు మీడియంలో నడుస్తున్నప్పటికీ అక్కడ ఒకే సబ్జెక్టుకు సంబంధించిన టీచర్లు ముగ్గురు, నలుగురు ఉన్న సందర్భంలో వారిని సర్దుబాటు చేయడాన్ని అధికారులు విస్మరించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ గందరగోళంగా జరిగింది. -
జిల్లా విద్యాశాఖ అధికారిగా శామ్యూల్
సాక్షి, అనంతపురం ఎడ్యుకేషన్: చిత్తూరు జిల్లా మదనపల్లి డెప్యూటీ డీఈఓగా పని చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి (ఎఫ్ఏసీ)గా రెండుసార్లు పని చేసిన శామ్యూల్‌ను ప్రస్తుతం అనంతపురం జిల్లా రెగ్యులర్ డీఈఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ డీఈఓగా పని చేస్తున్న జనార్దనాచార్యులును సరెండర్ చేసిన సంగతి తెలిసిందే. తాజా బదిలీల్లో జనార్దనాచార్యులును నెల్లూరుకు బదిలీ చేశారు. అక్కడ పని చేస్తున్న శామ్యూల్‌ను ఇక్కడికి నియమించారు. కాగా శామ్యూల్ గతంలో ఇక్కడ పని చేసిన సమయంలో జిల్లాపై తనదైన ముద్ర వేసుకున్నారు. తొలిసారి 2012 ఆగస్టు 2 నుంచి 2013 ఏప్రిల్ 25 వరకు జిల్లా విద్యాశాఖ అధికారిగా పని చేశారు. అలాగే రెండోమారు 2016 నవంబరు 2 నుంచి 2017 జనవరి 24 వరకు పని చేశారు. ఆయన పని చేసినంతకాలమూ ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా బడికి వెళ్లకుండా ఎగనామం పెట్టే టీచర్ల భరతం పట్టారు. సాధారణ ఉపాధ్యాయులే కాదు బడులు ఎగ్గొట్టి పైరవీలు చేసే కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులకు సైతం వణుకు పుట్టించారు. ప్రతి టీచరూ బడివేళల్లో బడిలోనే ఉండాలనే సిద్ధాంతం అమలుకు గట్టి చర్యలు తీసుకున్నారు. అంతకుముందు వేళాపాళా లేకుండా టీచర్లు, సంఘాల నాయకలు డీఈఓ కార్యాలయం చుట్టూ తిరిగేవారు. శామ్యూల్ వచ్చిన తర్వాత వారి తీరు మారింది. బడివేళల్లో ఒక్కరంటే ఒక్క టీచరు కూడా ఈ దరిదాపుల్లో కనిపించలేదంటే ఆయన ఎంత కఠినంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. సొంత వ్యాపారాలపైనే మక్కువ కొందరు టీచర్లు బడికి డుమ్మా కొడుతూ చీటీలు, రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాలు చేసుకుంటున్నారు. అలాగే ఎస్జీటీల అక్రమాలకు కొందరు ఎంఈఓలు అండగా నిలుస్తున్నారు. వారానికి, పదిరోజులకోసారి బడికి వెళ్లి సంతకాలు చేస్తున్నారు. నెలనాడు జీతం రాగానే ఎంఈఓలకు వాటా ఇస్తుండటంతో చూసీచూడనట్లు వెళ్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. మరికొన్ని పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లు వంతులు వేసుకుని మరీ బడులకు వెళ్తున్నారని చెబుతున్నారు. కొందరు టీచర్లు వారంలో తొలి మూడు రోజులు వెళ్తే తర్వాత మూడు రోజులు తక్కిన టీచర్లు వెళ్తున్నారు. ఉదయం బడికి గంట ఆలస్యంగా, సాయంత్రం ఇంటికి గంట ముందు వెళ్లే టీచర్లూ చాలాచోట్ల ఉన్నారు. ఇలాంటి వారిపై కొత్త డీఈఓ దృష్టి సారించి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
డీవైఈఓ పోస్టుల భర్తీ ఎప్పుడో?
సాక్షి, ఒంగోలు టౌన్: నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. పాఠశాలల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. పాఠశాల పనితీరును పర్యవేక్షించేందుకు డీవైఈఓలు కరువయ్యారు. జిల్లా విద్యాశాఖలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఉప విద్యాశాఖాధికారుల పోస్టుల భర్తీ ఎప్పుడా అని పలువురు ఉపాధ్యాయులు నేటికీ ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని సీనియర్ ఉపాధ్యాయులు, విద్యావేత్తలు కోరుతున్నారు. ఇదీ పరిస్థితి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒంగోలు, కందుకూరు, పర్చూరు, మార్కాపురం ఉప విద్యాశాఖాధికారి పోస్టులు ఉన్నాయి. ఒంగోలు ఉప విద్యాశాఖాధికారిగా విధులు నిర్వర్తిస్తున్న దయానందం ఈ ఏడాది జూన్ 30వ తేదీ ఉద్యోగ విరమణ చేశారు. కందుకూరు ఉప విద్యాశాఖాధికారి పోస్టు గత కొన్నేళ్ల నుంచి ఖాళీగా ఉండటంతో లక్ష్మయ్య ఇన్చార్జి ఉప విద్యాశాఖాధికారిగా నియమించారు. ఆయన ఏడాదిన్నర క్రితం ఉద్యోగ విరమణ చేశారు. పర్చూరు ఉప విద్యాశాఖాధికారి పోస్టు ఖాళీగా ఉండటంతో రామ్మోహనరావును ఇన్చార్జి ఉప విద్యాశాఖాధికారిగా నియమించారు. ఆయన గత ఏడాది ఉద్యోగ విరమణ చేశారు. మార్కాపురం ఉప విద్యాశాఖాధికారి పోస్టు ఖాళీగా ఉండటంతో కాశీశ్వరరావును నియమించారు. ఆయన గత ఏడాది ఉద్యోగ విరమణ చేశారు. జిల్లా విద్యాశాఖ పరిధిలోని కీలకమైన నాలుగు ఉప విద్యాశాఖాధికారి పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రస్తుత జిల్లా విద్యాశాఖాధికారి వీఎస్ సుబ్బారావుపై అదనపు బాధ్యతలు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫిర్యాదులపై నివేదిక ఇచ్చేదెవరు? జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు వచ్చినా, ఉపాధ్యాయుల మధ్య వివాదాలు తలెత్తి ఫిర్యాదులు చేసుకున్నా, పాఠశాలలకు కేటాయించిన నిధులు దుర్వినియోగమైనా ఉప విద్యాశాఖాధికారి అక్కడకు వెళ్లి ఎంక్వయిరీ చేసి, అందుకు సంబంధించిన రిపోర్టును జిల్లా విద్యాశాఖాధికారికి అందించాల్సి ఉంటుంది. ఆ నివేదికను ఆధారం చేసుకుని జిల్లా విద్యాశాఖాధికారి చర్యలు(జడ్జిమెంట్) తీసుకుంటారు. అయితే ప్రస్తుతం జిల్లాలోని నాలుగు ఉప విద్యాశాఖాధికారి పోస్టులకు జిల్లా విద్యాశాఖాధికారే ఇన్చార్జిగా వ్యవహరిస్తుండటంతో ఏమైనా ఫిర్యాదులు వస్తే స్వయంగా డీఈఓ వెళ్లి ఎంక్వయిరీ చేసి, ఆ ఎంక్వయిరీపై జడ్జిమెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్వీస్ రూల్స్ లేకపోవడమే జిల్లాలో కీలకమైన ఉప విద్యాశాఖాధికారుల పోస్టుల భర్తీ గత కొన్నేళ్ల నుంచి నిలిచిపోయింది. అందుకు కారణం వారికి సంబంధించిన సర్వీస్ రూల్స్ లేకపోవడమే. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల మధ్య ఆధిపత్య పోరు కూడా కీలకమైన ఇలాంటి పోస్టులకు విఘాతం కలిగిస్తోంది. సర్వీస్ రూల్స్‌కు సంబంధించి ఆ రెండు యాజమాన్యాలకు చెందినవారు ఒకరి తర్వాత ఒకరు కోర్టులను ఆశ్రయిస్తుండటంతో సమస్యకు పరిష్కారం లేకుండా పోయింది. ఉపాధ్యాయులకు సంబంధించిన పదోన్నతుల విషయంలో నెలకొన్న రగడ ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉంది. అప్పటి ప్రభుత్వాల చేతులు దాటిపోయి చివరకు కోర్టుల వరకు వెళ్లడంతో కీలకమైన ఉప విద్యాశాఖాధికారుల పోస్టుల భర్తీపై ప్రభావం చూపుతోంది. విద్యాశాఖ మంత్రి జోక్యం తప్పనిసరి జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు ఉప విద్యాశాఖాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతంలో ఇన్చార్జిలను నియమించినప్పటికీ వారు జీత భత్యాల బిల్లులకు సంబంధించిన విషయాలకే ఎక్కువగా పరిమితమవుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో, జిల్లా విద్యాశాఖలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఉప విద్యాశాఖాధికారుల పోస్టుల భర్తీకి ప్రత్యేక చొరవ తీసుకోవాలని సీనియర్ ఉపాధ్యాయులు, విద్యావేత్తలు కోరుతున్నారు. విజిట్స్..ఇన్స్పెక్షన్స్ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలోని ఉప విద్యాశాఖాధికారులు తమ పరిధిలోని ఉన్నత పాఠశాలలను క్రమం తప్పకుండా విజిట్స్, ఇన్స్పెక్షన్స్ చేయాల్సి ఉంటుంది. ► ప్రాథమిక పాఠశాలలు మండల విద్యాశాఖాధికారుల పర్యవేక్షణలో ఉండగా, ఉన్నత పాఠశాలల పనితీరును ఉప విద్యాశాఖాధికారులు చూసుకోవాల్సి ఉంటుంది. ► ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో వసతులు సమకూరుతున్నాయా, వారికి పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందించారా, మ«ధ్యాహ్న భోజనం సక్రమంగా అందుతుందా, విద్యార్థుల పాఠశాలలకు సక్రమంగా హాజరవుతున్నారా తదితరాలన్నింటిని ఉప విద్యాశాఖాధికారులు చూసుకోవాల్సి ఉంటుంది. ► అంతేగాక ఉన్నత పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయులు çసకాలంలో పాఠశాలలకు హాజరవుతున్నారా, తరగతులు ఏవిధంగా చెబుతున్నారు, విద్యార్థులకు పాఠ్యాంశాలు ఎలా బోధిస్తున్నారు తదితర వాటిని కూడా ఉప విద్యాశాఖాధికారులు చూడాల్సి ఉంటుంది. ► ఉన్నత పాఠశాలలకు సంబంధించి విద్యార్థులకు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు అందుతున్నాయా, ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అన్న విషయాలను పరిశీలించి జిల్లా విద్యాశాఖాధికారికి నివేదిక అందించాల్సి ఉంటుంది. ► ఇక ఉన్నత పాఠశాలలకు విడుదలవుతున్న నిధులు సక్రమంగా వినియోగిస్తున్నారా, నిధులు సరిపోక ఎక్కడైనా ఇబ్బందులు పడుతున్నారా అన్న విషయాలను కూడా తెలుసుకుని జిల్లా విద్యాశాఖాధికారికి నివేదించడం జరుగుతుంది. వీటితోపాటు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సంబంధించిన సెలవులు, ఇంక్రిమెంట్లను కూడా ఉప విద్యాశాఖాధికారులే చూడాల్సి ఉంటుంది. -
రూ.120 కోట్లు కావాలి !
సాక్షి, ఆదిలాబాద్ : జిల్లాలోని సర్కారు బడుల్లో సమస్యలు వేధిస్తున్నాయి. చాలా పాఠశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అనేక పాఠశాలల్లో అదనపు తరగతి గదుల కొరత, ప్రహరీలు లేకపోవడం, మరుగుదొడ్లు, నీటి సౌకర్యం తదితర సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఏటా సరిపడా నిధులు విడుదల కాకపోవడంతో సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందగా ఉన్నాయి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల పరిష్కారం కోసం, వసతుల కల్పనకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. 2019– 20 విద్యాసంవత్సరానికి అవసరం అయ్యే నిధుల కోసం అధికారులు ప్రణాళిక తయారు చేసి ఇటీవల ప్రభుత్వానికి పంపించారు. రూ.120 కోట్లతో ప్రతిపాదనలు జిల్లాలో 1,282 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 970 ప్రాథమిక పాఠశాలలు, 122 ప్రాథమికోన్నత, 195 ఉన్నత పాఠశాలలు ఉన్నా యి. వీటిలో 94,737 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కాగా విద్యాశాఖ అధికారులు విద్యాసంవత్సరంలో పాఠశాలల నిర్వహణ, వాటిలో నెలకొన్న సమస్యలు, మౌలిక వసతుల కల్పనకు అవసరమయ్యే నిధుల కోసం కలెక్టర్ ఆమోదంతో ప్రభుత్వానికి రూ.120.55 కోట్ల ప్రతిపాదనలు పంపిం చారు. ఏయే అవసరాలకు ఎన్ని లక్షల నిధులు అవసరమవుతాయనే వివరాలతో సమగ్ర నివేదికను తయారు చేశారు. ఇటీవల హైదరాబాద్‌లోని రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి నివేదిక పంపారు. ఈ నివేదికను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ ఆమోదిస్తే నిధులు విడుదల అవుతాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాటా కలిపి నిధులు విడుదల చేస్తుంది. నిధులు మంజూరు కాగానే పాఠశాలల్లో మౌలిక వసతులు, తదితర అభివృద్ధి కార్యక్రమాలను విద్యాశాఖ అధికారులు చేపడుతారు. కాగా అధికారులు ప్రతిపాదనలు పంపిన వాటిలో పాఠశాలల బలో పేతం కోసం రూ.40 కోట్లు, విద్యార్థుల రవాణాభత్యం కోసం రూ.37లక్షలు, ఉచిత పాఠ్యపుస్తకాల కోసం రూ.2.36 కోట్లు, వసతిగృహల నిర్వహణ కోసం రూ.46 లక్షలు, గుణాత్మక విద్యకురూ.18 కోట్లు, స్కూల్ గ్రాంటు కోసం రూ.4 కోట్లు, డిజిటల్ తరగతులు, ఉపాధ్యాయుల శిక్షణ, మధ్యాహ్న భోజ న పథకం, ఉచిత యూనిఫాం, మౌలిక వసతులు కోసం ప్రణాళిక తయారు. అలాగే కేజీబీవీల కోసం రూ.37.44 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. వేధిస్తున్న సమస్యలు.. జిల్లాలోని చాలా పాఠశాలల్లో సమస్యలు వేధిస్తున్నాయి. పాఠశాలల్లో వంట గదులు లేకపోవడంతో నిర్వాహకులు వర్షాకాలంలో వంట చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మరుగుదొడ్లు ఉన్నా నీటిసౌకర్యం లేకపోవడంతో మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. కొన్ని పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం కూడా లేదు. అదేవిధంగా ప్రహరీలు లేవు, కొన్ని పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేకపోవడంతో చెట్ల కింద చదువులు సాగుతున్నాయి. గతంలో ఆర్వీఎం పథకం ద్వారా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం నిధులు అధిక మొత్తంలో విడుదలయ్యేవి. ఈ నిధులతో పాఠశాలల్లో మౌలిక వసతులు, తదితర కార్యక్రమాలు నిర్వహించే వారు. అయితే ఆర్వీఎంను సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో విలీనం చేయడంతో తక్కువ మొత్తంలో నిధులు విడుదల అవుతున్నాయి. విద్యాశాఖ అధికారులు పంపిన ప్రతిపాదనల్లో దాదాపు 60 శాతం నిధులను మాత్రమే ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో పాఠశాలల్లో సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలకు గురవుతున్నారు. కాగా ఈ విద్యాసంవత్సరం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,644 కోట్ల విడుదల చేసిందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే జిల్లాకు రూ.70కోట్ల నిధుల వరకు విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రతిపాదనలు పంపించాం విద్యావార్షిక ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించాం. రూ.120కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. విడుదలైన నిధులతో పాఠశాలలో మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, యూనిఫాం, విద్యార్థులకు వసతులు కల్పిస్తాం. కలెక్టర్ ఆదేశాల మేరకు విడుదలైన నిధులు ఖర్చు చేస్తాం. – రవీందర్‌రెడ్డి, డీఈవో -
నాణ్యమైన బోధన.. ఉత్తమ ఫలితాలు
‘ప్రభుత్వ బడులను పునఃప్రారంభానికి సిద్ధం చేశాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీచేశాం. ప్రభుత్వ బడుల్లో చేరిన ప్రతి విద్యార్థికి నాణ్యమైన బోధన అందించడంతోపాటు ఉత్తమ ఫలితాలు రాబట్టడమే 2019–20 విద్యా సంవత్సరం లక్ష్యం’ అని జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాణరెడ్డి చెప్పారు. పాఠశాలల పునఃప్రారంభం రోజునే ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేస్తామని, పుస్తకాలు ఇప్పటికే పాఠశాలలకు చేరాయన్నారు. బుధవారం పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరంలో చేపట్టే కార్యాచరణను వివరించారు. సాక్షి, రంగారెడ్డి: జిల్లాప్రభుత్వ బడులను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాం. గతేడాది కంటే ఈసారి సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచడంపై దృష్టిసారించాం. తాజాగా పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాం. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ బడుల్లో చదువుకున్న విద్యార్థులు రాణించారు. ఈ ఫలితాలను రుజువుగా చూపిస్తూ ప్రభుత్వ బడులకు తమ పిల్లలను పంపించేలా తల్లిదండ్రులను ప్రోత్సహిస్తాం. బడి ఈడు పిల్లలు తప్పనిసరిగా పాఠశాలల్లో ఉండేలా చూస్తాం. సర్కారు బడుల్లో నాణ్యమైన బోధన అందిస్తున్నాం. అనుభవం, నైపుణ్యం గల టీచర్లు ఉన్నారు. ఫీజు లేదు. ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందజేస్తాం. అలాగే మధ్యాహ్న భోజనం వడ్డిస్తాం. ఈ సానుకూలతలు.. ప్రైవేటు బడుల పిల్లలను కూడా ఆకర్షిస్తుండటం విశేషం. ప్రైవేటు ఫీజులు భరించలేని తల్లిదండ్రులు కొందరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకే తిరిగి పంపించారు. ఇలాంటి పరిస్థితులు ఈ ఏడాది కూడా ఉంటాయని ఆశిస్తున్నాం. ప్రభుత్వ బడుల్లో 585 ఉపాధ్యాయ ఖాళీలు ఉండగా.. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరో రెండు వందలకు పైగా టీచర్లు అవసరం. అయితే, ఈ ఖాళీల్లో శాశ్వత టీచర్లు వచ్చేవరకు గతేడాది పనిచేసిన విద్యావలంటీర్లనే విధుల్లోకి తీసుకోవాలి ఆదేశాలు అందాయి. ఫలితంగా బోధనకు ఆటంకం కలి గే పరిస్థితి లేకపోవడం సంతోషకరం. రె గ్యులర్ టీచర్లకు పోస్టింగ్‌లు ఇచ్చేవరకు వలంటీర్లే కొనసాగుతారని ప్రభుత్వం పేర్కొంది. సరిపడా పుస్తకాలు.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,304 ప్రభుత్వ బడుల్లో నమోదైన విద్యార్థులకు దాదాపుగా సరిపడ పాఠ్యపుస్తకాలు వచ్చాయి. కేవలం 15వేల పుస్తకాలు రావాల్సి ఉంది. వారం రోజుల్లో ఇవి కూడా జిల్లాకు చేరుతాయి. వచ్చిన పుస్తకాలను అన్ని పాఠశాలలకు అందజేశాం. బుధవారం (12న) పిల్లలకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశాం. యూనిఫాం అందజేతకు మరికొంత సమయం పడుతుంది. జిల్లాకు ఇంకా వస్త్రం రాలేదు. పది రోజుల్లో జిల్లాకు చేరే వీలుంది. ఆ వెంటనే కుట్టించి విద్యార్థులకు అందజేస్తాం. మరుగుదొడ్లు, మూత్రశాలలను వినియోగంలోకి తీసుకరావాలని హెచ్ఎంలకు సూచించాం. వీటి నిర్వహణలో కీలకమైన నీటి వసతి ఉండేలా చూడాలని చెప్పాం. దాదాపు అన్ని స్కూళ్లలో తాగునీటి సౌకర్యం ఉంది. ఇంగ్లిష్ మీడియంలో బోధన ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాం. ప్రస్తుతం 258 ప్రాథమిక, 95 ప్రాథమికోన్నత, 123 ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన సా గుతోంది. దీంతో చాలా మంది విద్యార్థులు స ర్కారు బడుల వైపు మళ్లుతున్నారు. ఈ ఏడాది విద్యార్థుల డిమాండ్‌ని బట్టి ఈ స్కూళ్ల సం ఖ్యను పెంచే అంశాన్ని పరిశీలిస్తాం. దీనికి అనుగుణంగా ప్రతిపాదనలు పంపించాలని ఎంఈఓలకు సూచించాం. ప్రైవేటుపై నిక్కచ్చిగా.. ప్రతి స్కూల్ ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగానే పనిచేయాలి. ప్రై వేటు స్కూళ్ల నిర్వహణపై నిక్కచ్చిగా వ్యవహరిస్తాం. అనుమతులు లేని పాఠశాలల జాబితా రూపొందించి ఇప్పటికే వాటి యాజమాన్యాలకు నోటీసులు జారీచేశాం. ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందకుండా బడులు తెరిస్తే సీజ్ చేస్తాం. 25 స్కూళ్లు తమ గుర్తింపును రె న్యూవల్ చేసుకోవాల్సి ఉంది. అలాగే ఫైర్‌సేఫ్టీ సర్టిఫికెట్ అందజేయాల్సి ఉంది. దీనికితోడు ఇ ప్పటివరకు అసలు గుర్తింపు లేకుండా 12 స్కూ ళ్లు నిర్వహిస్తున్నట్లు మా పరిశీలనలో తేలింది. అలాగే కొన్ని పాఠశాలలు పరిమిత స్థాయి తరగతుల వరకే అనుమతులు పొందాయి. కానీ, వాస్తవంగా అంతకుమించి తరగుతులు నిర్వహిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వీటన్నింటినీ ఆకస్మికంగా తనిఖీలు చేస్తాం. తమ పిల్లలను చేర్పించే ముందు సదరు స్కూళ్లకు గుర్తింపు ఉందో.. లేదో తల్లిదండ్రులు తెలుసుకోవాలి. దీనికితోడు గుర్తింపు లేని స్కూళ్ల జాబితాను ఆయా మండల విద్యాధికారి కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతాం. నిర్ధిష్ట అర్హతలు ఉన్న టీచర్లే ప్రైవేటు స్కూళ్లలో బోధించాలి. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు డీఎడ్ చేసి, హైస్కూల్ స్థాయి పిల్లలకు బీఎడ్ చేసిన టీచర్లే బోధించాలి. డొనేషన్లు లేవు.. విద్యార్థుల చేరిక సమయంలో ప్రైవేటు పాఠశాలలు డొనేషన్లు, క్యాపిటేషన్ ఫీజును తీసుకోవద్దు. ఒకవేళ వసూలు చేసినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు మా దృష్టికి తీసుకువస్తే సదరు స్కూల్‌పై చర్యలు తీసుకుంటాం. పాఠశాలల్లో యూనిఫాంలు, నోట్‌బుక్స్, షూ, టై, బెల్టులు అమ్మడానికి వీల్లేదు. ప్రభుత్వ నిర్దేశించిన పని వేళలను తప్పనిసరిగా ప్రైవేటు స్కూళ్లు పాటించాలి. స్టేట్ సిలబస్ బోధించే బడుల్లో ఐదు నుంచి పదో తరగతుల వరకు విద్యాశాఖ రూపొందించిన పాఠ్య పుస్తకాలనే వినియోగించాలి. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ప్రభుత్వం ఆమోదించిన పాఠ్య పుస్తకాలనే బోధించాలి. ప్రైవేటు బడుల్లో చదివే విద్యార్థులకు పాఠ్య పుస్తకాల కొరత లేదు. వీరికోసం జిల్లావ్యాప్తంగా విద్యాశాఖ గుర్తించిన 23 బుక్స్ స్టోర్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. అంతేగాక హైదరాబాద్ మింట్ కాంపౌండ్ వద్ద ఉన్న ప్రభుత్వ ప్రచురణ కేంద్రంలోనూ అందుబాటులో ఉంటాయి. ఇక్కడికి వెళ్లి కొనుగోలు చేయవచ్చు. బుక్స్ స్టోర్లలో పుస్తకాలను ఎమ్మార్పీకే విక్రయించాలి. ఆ ధరకు మించి అమ్మితే మాకు ఫిర్యాదు చేస్తే.. సదరు స్టోర్‌పై చర్యలు తీసుకుంటాం. వచ్చేనెల ఒకటి నుంచి ప్రత్యేక తరగతులు పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు, ప్రతి విద్యార్థిలో విషయ పరిజ్ఙానం పెంచేందుకు కార్యాచరణ రూపొందిస్తాం. జూలై ఒకటో తేదీ నుంచే టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించాం. వార్షిక పరీక్షలు వచ్చే వరకు విద్యార్థులను అన్ని సబ్జెక్టుల్లో పట్టు సాధించేలా చేయడంతోపాటు పరీక్షల పట్ల భయం తొలగించడానికి ప్రాధాన్యత ఇస్తాం. తద్వారా చదువులో వెనుకడిన విద్యార్థి కూడా కనీసం ఉత్తీర్ణత సాధించేలా సంసిద్ధత చేస్తాం. మొన్నటి కంటే మెరుగైన ఫలితాలు సాధించడంతోపాటు వంద శాతం ఉత్తీర్ణత స్కూళ్ల సంఖ్యను పెంచుతాం. 14 నుంచి బడిబాట ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడం, బడిఈడు పిల్లలకు ప్రతి ఒక్కరిని అక్షరాస్యులుగా మార్చడం కోసం ఈనెల 14 నుంచి 19 వరకు బడిబాట నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా.. మధ్యలో బడిమానేసిన, బడి ఈడు వయసున్న విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించడమే లక్ష్యం. విద్యాశాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను ఇందులో భాగస్వామ్యం చేస్తాం. ఆరు రోజుల పాటు నిత్యం ఏడు నుంచి 11 గంటల వరకు అన్ని గ్రామాల్లో బడిబాట నిర్వహిస్తాం. చదువు ప్రాముఖ్యత తెలియజేయడంతోపాటు ప్రభుత్వ బడుల్లో పిల్లలు చేర్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం. అంగన్వాడీ కేంద్రాల్లో నమోదై ఐదేళ్లు నిండిన 13వేలకుపైగా పిల్లలను బడిబాట ద్వారా స్కూళ్లలో చేర్పిస్తాం. అలాగే సీఆర్పీలు గుర్తించిన 448 బాల కార్మికులను స్కూళ్లలో చేర్చుతాం. -
ప్రేమికుల దినోత్సవానికి రెడీ
కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘దేవ్’. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. లక్ష్మణ్ కుమార్, ‘ఠాగూర్’ మధు తెలుగు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి రజత్ రవిశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు . ఇప్పటికే విడుదలైన ‘దేవ్’ ఫస్ట్ లుక్కు మంచి స్పందన వచ్చిం ది. షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు. ‘ఖాకీ’ చిత్రం తర్వాత కార్తీ, రకుల్ మరోసారి జత కట్టారు. ప్రేమికుల దినోవత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ ¯ð ల 14న చిత్రం ఆడియో వేడుక జరగనుంది. ‘‘ఇప్పటికే విడుదలైన తమిళ ఆడియోకు మంచి స్పందన లభించింది. తెలుగు పాటలకు కూడా మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: హారీశ్ జయరాజ్, కెమెరా: వేల్రాజ్. -
‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
వాంకిడి(ఆసిఫాబాద్): పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను సిద్ధం చేయాలని డీఈవో భిక్షపతి అన్నారు. మండలంలోని ఇందాని జెడ్పీ ఉన్నత పాఠశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో వసతులు, విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల పనితీరు పై అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించారు. బోధన అంశాలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థులపై శ్రద్ధ వహించాలన్నారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం ఇవ్వాలన్నారు. అనంతరం మొదటి సారిగా పాఠశాలకు వచ్చిన డీఈవోను పాఠశాల ఉపాధ్యాయులు సన్మానించారు. కార్యక్రమంలో హెచ్ఎం రాథోడ్ సుభాష్, ఉపాధ్యాయులు మహేశ్, సూర్యభాను తదితరులు ఉన్నారు. -
రాజ్ భవన్ స్కూల్.. నావల్ల కాదు బాబోయ్!
సోమాజిగూడ: సిటీలోని ప్రభుత్వ పాఠశాలల్లో తొలిస్థానంలో ఉన్న రాజ్‌భవన్ స్కూల్ ఇన్చార్జి హెచ్ఎం సుమన్ విధులు నిర్వహించలేనని చేతులెత్తేశారు. ఈ స్కూల్లో హెచ్ఎంకు కనీసం రూమ్ కూడా లేదని, రెండు నెలలుగా పిల్లల మధ్యే కూర్చోవాల్సి వస్తోందని వాపోయారు. ఇక్కడ విధులు నిర్వహించడం తనవల్ల కాదంటూ.. తనను ఆ స్కూలు నుంచి రిలీవ్ చేయాలని కోరుతూ డీఈఓ వెంకటనర్సమ్మకు రాత పూర్వకంగా విజ్ఞప్తి చేశారు. అయితే డీఈఓ విజ్ఞప్తిని ఇప్పటికీ అంగీకరించలేదు. అయినప్పటికీ ఆయన గత 10 రోజుల నుంచే పేరెంట్ స్కూలు (బేగంపేట్–2)కు హాజరవుతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా రాజ్‌భవన్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ ఇతర ప్రాంతాల్లోని పాఠశాలలకు బదిలీపై వెళ్లిన విషయం విదితమే. ఇక్కడ పనిచేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గవర్నర్ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. దీంతో జిల్లా విద్యాశాఖ 20మంది విద్యా వలంటీర్లతో పాటు సమీప పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులను తాత్కాలికంగా ఇక్కడ నియమించింది. ఇదే సమయంలో హెచ్ఎంగా బేగంపేట్–2 పాఠశాలకు చెందిన సుమన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం పాఠశాలలో 1,300 మంది విద్యార్థులుడగా.. 10 మంది ప్రభుత్వ రెగ్యులర్ ఉపాధ్యాయులు, 15 మంది విద్యా వలంటీర్లు ఉన్నారు. ఇక ప్రైమరీ సెక్షన్లో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు 10 మంది విద్యా వలంటీర్లు పని చేస్తున్నారు. తాజాగా హైస్కూల్ ఇన్చార్జి హెచ్ఎం సుమన్ తానిక్కడ విధులు నిర్వర్తించలేనని, పేరెంట్ స్కూలుకు వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ ఇటీవల డీఈఓకు లేఖ రాశారు. దీనిపై డీఈఓ వెంకటనర్సమ్మ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఆయన మాత్రం గత పది రోజులుగా స్కూలు రావడం మానేశారు. కనీసం రూమ్ కూడా లేదు... ఈ విషయంపై ఇన్చార్జి హెచ్ఎం సుమన్‌ను వివరణ కోరగా... తాను బేగంపేట్–2 స్కూలుకు వెళ్తున్నట్లు చెప్పారు. అదేమంటే రాజ్‌భవన్ స్కూల్లో హెచ్ఎం కూర్చునేందుకు కనీసం రూమ్ కూడా లేదని, గత రెండు నెలలుగా పిల్లల మధ్యే కూర్చోవాల్సి వస్తోందని చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని, విధిలేని పరిస్థితుల్లోనే రాజ్‌భవన్ స్కూలును వీడి బేగంపేట్ స్కూలుకు వెళ్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. -
ఇన్‌చార్జిలే దిక్కు..
సాక్షి, వరంగల్ రూరల్: పాఠశాల విద్యను పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషించే డీఈఓతోపాటు ఎంఈఓల్లో ఇన్‌చార్జిలే అధికంగా ఉన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న నారాయణరెడ్డికి ఇటీవల డైట్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పదోన్నతిని కల్పించి బదిలీ చేశారు. ఆయనకే వరంగల్ రూరల్ జిల్లా ఇన్చార్జి విద్యాశాఖాధికారిగా బాధ్యతలు అప్పగించారు. రెగ్యులర్ ఎంఈఓలు లేక ఆయా మండలాల్లోని గెజిటెడ్ హెచ్ఎంలను ఇన్చార్జి ఎంఈఓలుగా నియమించారు. 16 మండలాల్లో ఒక్కరే రెగ్యులర్ ఎంఈఓ జిల్లాలోని 16 మండలాలకుగాను ఒక్కరే రెగ్యులర్ ఎంఈఓ ఉన్నారు. నల్లబెల్లి మండల విద్యాశాఖ అధికారిగా దేవా మినహా మిగతా మండలాలకు ఇన్‌చార్జీలే కొనసాగుతున్నారు. ఖానాపు రం, నర్సంపేటకు ఇన్చార్జి ఎంఈఓగా దేవా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మిగతా చోట్ల సీనియర్ ప్రధానోపాధ్యాయులు ఇన్చార్జీ ఎంఈ ఓలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సొంత పాఠశాల పర్యవేక్షణతోపాటు మిగతా పాఠశాలల పర్యవేక్షణ వారికి అదనపు భారంగా మారింది. దీంతో ఆయా మండలాల్లోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయుల విధుల నిర్వహణపై పర్యవేక్షణ కరువైంది. దీంతో పలు పాఠశాలలు గాడి తప్పుతున్నాయనే ఆరోపణలున్నాయి. దీంతో చాలాచోట్ల విద్యార్థుల సంఖ్య సైతం తగ్గుముఖం పడుతోంది. రెండు చోట్ల పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నారు. పనిచేసే మండలంలో కాకుండా ఇతర మండలాల్లో.. ఇటీవల ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయి. దీంతో ఎంఈఓలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారు ఇతర మండలాలకు బదిలీ అయ్యారు. దుగ్గొండి ఇన్చార్జి ఎంఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వాసంతి హసన్‌పర్తి మండలంలోని చింతగట్టు జెడ్పీ హైస్కూల్‌కు, చెన్నారావుపేట ఎంఈఓగా పని చేస్తున్న పర్వేజ్ ధర్మసాగర్ మండలం కూనూరు జెడ్పీ హైస్కూల్‌కు, గీసుకొండ ఇన్చార్జి ఎంఈఓ సృజన్‌తేజ నెక్కొండ మండలం సూరిపల్లి జెడ్పీ హైస్కూల్‌కు హెచ్ఎంలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలో పని చేస్తున్న వారు ఇంచార్జీలుగా వ్యవహరిస్తున్నారు. వారు పనిచేస్తున్న పాఠశాలకు, ఇన్చార్జి ఎంఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మండలానికి మధ్య సుమారు 50 కిలోమీటర్లపైనే దూరం ఉంటుంది. దీంతో పర్యవేక్షణ కష్టంగా మారింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయిలో ఎంఈఓలను నియమించాలని కోరుతున్నారు. -
భయ‘బడి’ !
రామన్నపేట(నకిరేకల్) : ప్రమాదం పొంచి ఉం దని చెవిలో జోరిగలాగా పదేపదే అధికారులకు విన్నవించినా పట్టించుకున్న పాపానా పోలేదు. విద్యార్థుల ప్రాణం మీదికి వస్తుందని తెలిసినా అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరించారు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి రామన్నపేట మండలం సిరిపురం ఉన్నత పాఠశాలలోని తరగతిగది పైకప్పు కూలింది. రాత్రి సమయం కావడంతో విద్యార్థులకు ప్రాణా పాయం తప్పింది. అదే పగలు అయితే పరిస్థితి ఘోరంగా ఉండేది. రామన్నపేట మండలంలోని సిరిపురం ఉన్నత పాఠశాల భవనాన్ని 1970లో నిర్మించారు. అప్పట్టో ఇటుక గోడలపై కొయ్యదూలాలపైన సున్నం రాయితో కప్పువేశారు. భవన నిర్మాణం జరిగి 50 ఏళ్లు కావొస్తుండడంతో తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. పాత భవనాల్లోనే ఆఫీస్, స్టాఫ్ రూం, ల్యాబ్, ఒక తరగతిని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 150మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే విద్యార్దులు ఉపాధ్యాయులు భయంభయంగా గడుపుతుంటారు. పాఠశాలను సందర్శించిన డీఈఓ సిరిపురం ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారి రోహిణి గురువారం సందర్శించారు. స్థానిక ఎంఈఓ సల్వాది దుర్గయ్యతో కలిసి కూలిపోయిన తరగతి గదితోపాటు శిథిలావస్థకు చేరిన ఇతర గదులను పరిశీలించారు. ప్రమాదకరంగా ఉన్నటు వంటి గదులలో తరగతులను నిర్వహించరాదని ఆదేశించారు. అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. కొత్తగదులు కట్టించాలి పాఠశాలలోని మూడు గదులు మినహా మిగిలిన తరగతి గదులన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. గదులు సరిపడా లేక శిథిలావస్థకు చేరిన గదుల్లోనే ఆఫీస్, ల్యాబ్‌లు నిర్వహిస్తున్నారు. పాత భవన సముదాయాన్ని పూర్తిగా కూల్చివేసి కొత్త గదులు నిర్మించాలి. – పరశురాం, 7వ తరగతి విద్యార్థి -
మాస్‌కాపీయింగ్ వెనక డీఈవో హస్తం
జగిత్యాలటౌన్: జిల్లాలోని కొడిమ్యాల ప్రభుత్వ పాఠశాలలో జరిగిన మాస్ కాపీయింగ్ వెనక డీఈవో హస్తం ఉందని.. అనవసరంగా ఉపాధ్యాయులను బలి చేశారని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గోదా సత్యనారాయణ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఏబీవీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నిబంధనలు పాటించని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా డీఈవో పట్టించుకోలేదన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. పాఠశాలల అవకతవలపై రాష్ట్ర అధికారికి ఫిర్యాదు చేస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్య సమితి సభ్యులు రెంటం జగదీశ్, జిల్లా కన్వీనర్ చింత అనిల్, మహిళా జిల్లా ఇన్చార్జి రాధ, జ్యోతి, నిఖిల్, శ్రీను, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మ్యూజికల్ చైర్
జిల్లాలో కలెక్టర్ నుంచి మొదలుకొని మండల స్థాయి ఎంఈఓల వరకు అందరూ అంతటా ఇన్చార్జిల పాలనే. ఎక్కడ కూడా రెగ్యులర్ అధికారులు కనిపించరు. ముఖ్యంగా జిల్లా విద్యాధికారులను మార్చుతున్న తీరు జిల్లా ప్రజలకు విస్మయం కలిగిస్తోంది. కేవలం 16 నెలల్లో ఐదుగురు ఇన్చార్జి డీఈఓలు మారారంటే అర్థం చేసుకోవచ్చు జిల్లాలోని విద్యావ్యవస్థ ఏ విధంగా ఉందో? దీంతో పాటు జిల్లాలోని 20 మండలాలకు ఎక్కడా కూడా రెగ్యులర్ ఎంఈఓలు లేరు. ఉన్న తొమ్మిది మంది ఎంఈలతో 20 మండలాలను పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల డీఆర్డీఓ పీడీ కూడా దీర్ఘకాలిక సెలవులపై వెళ్లారు. ఇలా ఇన్చార్జిలతో జిల్లా పాలనంతా అస్తవ్యస్తంగా తయారైంది. వేగంగా మారుతున్న జిల్లా విద్యాధికారులపై‘సాక్షి’ ప్రత్యేక కథనం.. సాక్షి,మెదక్: జిల్లాలోని విద్యార్థుల చదువులతో సర్కార్ ఆటలాడుతోంది. జిల్లా విద్యాధికారి పోస్టు మ్యూజికల్ చైర్ ఆటలాగా మారింది. ఏ క్షణాన ఎవరు వస్తారో..? ఏ రోజుకు ఎవరు మారుతారో ? తెలియని పరిస్థితి. పరీక్షల వేళ రాష్ట్ర విద్యాశాఖ చేస్తున్న బదిలీ ప్రయోగాలు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నెల 17న సంగారెడ్డి ఇన్చార్జి డీఈఓ విజయకుమారిని మెదక్ జిల్లా పూర్తిస్థాయి డీఈఓగా నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ 24 గంటల్లోనే ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకొని సవరణ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా కేవలం 16 నెలల కాలంలో 5మంది డీఈఓలు నియామకం కావడంతో ఒక్కో డీఈఓ పదవి కాలం కేవలం 3 నెలలకే మించి లేదు. వచ్చిన వారు కనీసం జిల్లాలోని పాఠశాలల పరిస్థితిని అవగాహన చేసుకునేలోగానే వారిపై బదిలీ వేటు పడుతోంది.దీంతో జిల్లా విద్యాశాఖలో గందరగోళ పరిస్థితి నెలకొంది. పనితీరుపై అసంతృప్తి.. జిల్లా కేంద్రం కావాలన్న ఇక్కడి ప్రజల 50 యేళ్ల పోరాటం 10 అక్టోబర్ 2016లో సాకారమైంది. దీంతో జిల్లాకు మొట్ట మొదటి డీఈఓగా రేణుకదేవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆమె నూతన జిల్లా ఏర్పడిన రోజునే పదవి బాధ్యతలు స్వీకరించారు. కానీ ఇక్కడి పరిస్థితులను తట్టుకోలేక నెలరోజుల వ్యవధిలోనే దీర్ఘకాలికపై సెలవుపై వెళ్లారు. అనంతరం 2016 అక్టోబర్ 27 నుంచి సిద్దిపేట డీఈఓ కృష్ణారెడ్డికి జిల్లా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఆయన కాలంలోనే అప్పటి పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. 10 నెలల అనంతరం ఆయన రిటైర్మెంట్ అయ్యాడు. దీంతో ఆయన స్థానంలో సరోజినిదేవిని ఇన్చార్జి డీఈఓగా నియమించారు. ఆ కొద్దిరోజుల్లోనే కలెక్టర్ ఆమె పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తరుణంలో సరోజిని ఆమె మాతృసంస్థకు వెళ్లిపోయారు. అనంతరం సంగారెడ్డి ఇన్చార్జి డీఈఓ విజయకుమారికి మెదక్ జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించారు. అనంతరం ఈనెల 17న సిద్దిపేట డీఈఓ విజయలక్ష్మిని సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారిగా నియమిస్తూ సంగారెడ్డి ఇన్చార్జి విజయకుమారికి మెదక్‌జిల్లా డీఈఓగా పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ మెదక్ జిల్లాలో పనిచేయడం ఇష్టంలేని విజయకుమారి కేవలం 24గంటల్లోనే తన బదిలీని రద్దు చేయించుకొని మేడ్చల్ డీఈఓగా పోస్టింగ్ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో సంగారెడ్డి డీఈఓ విజయలక్ష్మికి మళ్లీ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే మెదక్ బాధ్యతలను స్వీకరించేందుకు ఆమె ఇష్టపడటం లేదని సమాచారం. ఒక్కోరికి మూడు మండలాలు.. అలాగే మెదక్‌లో 20 మండలాలు ఉండగా ఒక్క రెగ్యులర్ ఎంఈఓ కూడా లేకపోగా 9మంది ఇన్చార్జి ఎంఈఓలు 20 మండలాల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇందులో ఒక్కో ఎంఈఓగా మూడు మండలాల అదనపు బాధ్యతలు ఉండటంతో రెంటికి చెడ్డ రేవడిగా వారి పరిస్థితి మారుతోంది. ఇటీవల కమిషనర్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కిషన్ తీసుకున్న నిర్ణయాలు నిలకడలేని నీటిమీది రాతలుగా మారుతున్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని టీచర్లు సెలవులు తీసుకోవాలంటే కాంప్లెక్స్ హెడ్ మాస్టర్, ఎంఈఓల అనుమతి తప్పనిసరి అని జీఓ నం.83 విడుదల చేశారు. కానీ ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలతో ఆ జీఓను వెనక్కి తీసుకున్నారు. అలాగే మోడల్ స్కూటీచర్ల ఇంక్రిమెంట్ మంజూరీ అధికారాలు సంబంధిత ప్రిన్సిపాల్ కాకుండా డీఈఓలకే ఉండాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. మళ్లీ ఉపాధ్యాయ సంఘాల ఆందోళనతో వీటిని సైతం ఉపసంహరించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈనెల 17న జారీ చేసిన డీఈఓల బదిలీ ఉత్తర్వులు సైతం 24గంటల్లోనే మార్పులు చోటు చేసుకోవడం గమనార్హం. జిల్లాకు ఇన్‌చార్జిలే దిక్కా? మెదక్ జిల్లాలో మొదటి నుంచి ఇన్చార్జిల పాలనే కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన డీఈఓలంతా ఇన్‌చార్జిలే కావడం గమనార్హం. ప్రస్తుతం కలెక్టర్ పోస్టు కూడా ఇన్చార్జితోనే కొనసాగుతుంది. డీఆర్డీఏ పీడీ కూడా ఇటీవల దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఇల్లా పాలనంతా ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. పదో తరగతి పరీక్షలు ఎలా? జిల్లాకు పూర్తిస్థాయి విద్యాశాఖ అధికారి లేకుండా పదో తరగతి పరీక్షలు నిర్వహించడం కత్తిమీద సాములాంటిదే. మార్చి 15 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో ఫిబ్రవరి నెల విద్యార్థులకు అత్యంత కీలకమైంది. పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖ లోగడ రూపొందిం చిన ప్రణాళికను పక్కాగా అమలు చేయాల్సిన తరుణమి ది. కానీ రెండు జిల్లాలకు ఒకే డీఈఓ ఉండటంతో రెండు పడవలపై సాగే ప్రయాణం సత్ఫలితాలు ఇచ్చే అవకాశం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పెద్ద సారూ.. పాఠం చెప్పరు!
పెద్ద సార్లు పని తప్పించుకుంటున్నారు! పాఠాలు బోధించకుండా వేరే వ్యాపకాల్లో మునిగి తేలుతున్నారు. పలువురు హెడ్మాస్టర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పుస్తకాలు పట్టట్లేదు.. పిల్లలకు పాఠాలు చెప్పట్లేదు. వాస్తవానికి ఇతర ఉపాధ్యాయులతో పాటు ప్రధానోపాధ్యాయుడు సైతం విద్యార్థులకు తప్పనిసరిగా పాఠాలు బోధించాలి. కానీ జిల్లాలో చాలా పాఠశాలల్లో హెచ్ఎంలు బోధనకు దూరంగా ఉంటున్నారు. ఇతర వ్యాపకాల్లో బిజీగా మారడంతో విద్యాబోధన గాడి తప్పుతోంది. ఫలితంగా విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే, వివిధ పనుల ఒత్తిళ్ల కారణంగా పాఠాలు బోధించడం లేదని కొందరు హెచ్ఎంలు బహిరంగంగానే చెబుతుండడం విశేషం. కామారెడ్డి టౌన్: హెడ్మాస్టర్లు పాఠ్యాంశాల బోధనకు మంగళం పాడేశారు. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన హెచ్ఎంలు.. ఇతర వ్యాపకాలతో గడుపుతున్నారు. జిల్లాలో దాదాపు 80 శాతం మంది ప్రధానోపాధ్యా యులు బోధనకు దూరంగా ఉంటుండగా, కేవలం 20 శాతం మంది మాత్రమే నిజాయతీగా పాఠాలు చెబుతున్నట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు. ఎనిమిది పీరియడ్లు బోధించాలి జిల్లాలో 730 ప్రాథమిక, 217 ప్రాథమికోన్నత, 314 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 4,916 టీచర్ పోస్టులకు గాను 4,077 మంది విధులు నిర్వహిస్తున్నారు. 819 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్నత పాఠశాలల్లో 307 మంది హెడ్మాస్టర్లు పని చేస్తున్నారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం ప్రతీ ప్రధానోపాధ్యాయుడు తప్పనిసరిగా వారానికి 8 పీరియడ్లు బోధించాలి. 6 నుంచి 10వ తరగతి వరకు ఏదో ఒక పీరియడ్ 45 నిమిషాల పాటు బోధించాల్సి ఉంటుంది. అయితే, స్కూల్ టైం టేబుల్లో తమకు పీరియడ్లు ఉన్నాయని చూపించుకుంటున్నారే తప్పితే చాక్‌పీస్ పట్టి పాఠాలు చెప్పింది లేదు. కొందరు ఒకటి, రెండుపీరియడ్లు బోధించి మమ అనిపిస్తుంటే, మరికొందరైతే, తరగతి గదుల ముఖమే చూడట్లేదు. 307 మంది హెచ్‌ఎంలలో 80 శాతం మంది అసలు పాఠ్యపుస్తకాలు, బ్లాక్‌బోర్డు, చాక్పీస్ను పట్టడం లేదని ఆరోపణలున్నాయి. కేవలం 20 శాతం మంది మాత్రమే పాఠాలు బోధిస్తున్నట్లు సమాచారం. ఉపాధ్యాయులు రానప్పుడు వారి స్థానంలో బోధిస్తూ తమ పీరియడ్లుగా బోధించినట్లుగా రికార్డుల్లో చూపిస్తున్నారు కానీ ప్రత్యేకంగా వారు తీసుకోవాల్సిన పీరియడ్లును మాత్రం తీసుకోవడం లేదు. ఉపాధ్యాయ సంఘాలు, ఇతర పనుల్లో..... జిల్లాలో పదికి పైగానే ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల్లో హెచ్ఎంలు సైతం పెద్ద నాయకులుగా ఉన్నారు. దీంతో సంఘాల పనుల్లో బిజీబిజీగా ఉంటున్న హెడ్మాస్టర్లు పాఠాలు ఎగ్గొడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంఘాల పేరుతో ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని విధులను విస్మరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, కొందరు హెచ్ఎంలు వ్యాపారాలు, ఫైనాన్స్‌లు, రియల్ దందాలను నిర్వహిస్తున్నారు. తమ సొంత పనుల్లో బిజీగా ఉంటూ బోధనలను విస్మరిస్తున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పట్టించుకోని ఉన్నతాధికారులు ఉపాధ్యాయ సంఘాల పేరుతో ఉన్నతాధికారులనే శాసించే స్థాయికి కొందరు చేరడంతో వారి విషయంలో అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో అసలు హెచ్ఎంలు పాఠాలను బోధించకున్నా పట్టనట్లు వ్యవహిస్తున్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క స్కూల్లోనూ హెచ్ఎంలు బోధించేలా చర్యలు తీసుకున్నట్లు లేదు. వాస్తవానికి విద్యా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి విద్యార్థులు, ఉపాధ్యాయులను విచారిస్తే హెచ్ఎంల బండారం బట్టబయలవుతుంది. కానీ, అధికారులు మాత్రం విచారణకు వెనుకడుగు వేస్తున్నారు. హెచ్ఎంలు తప్పనిసరిగా బోధించాలి ప్రభుత్వ పాఠశాలల్లో హెచ్ఎంలు సైతం వారానికి తప్పకుండా ఎనిమిది పీరియడ్లు బోధించాలి. కొత్త జిల్లా కావడంతో వారు కాస్త పని ఒత్తిడిలో ఉన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తప్పనిసరిగా పాఠాలు బోధించాలి. పాఠాలు చెప్పని వారిపై చర్యలు తీసుకుంటాం. – మదన్మోహన్, డీఈవో, కామారెడ్డి -
విద్యాశాఖలో గంజాయి మొక్క!
కొత్తగూడెం: క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే, విద్యాబుద్ధులు నేర్పే పవిత్రబాధ్యతల విభాగంగా కీర్తించుకునే విద్యాశాఖలో గంజాయి మొక్క మాదిరిగా కొత్తగూడెంలో ఓ ఉద్యోగి వ్యవహరించాడు. సాక్షాత్తూ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న కట్టగురు సైదులు రూ.25వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు సోమవారం పట్టుబడ్డాడు. పాల్వంచకు చెందిన శ్రీలక్ష్మీ చిల్డ్రన్స్ స్కూల్ రిజిస్ట్రేషన్ గడువు 2015–16కు ముగియడంతో..పునరుద్ధరించాలని యజమాని బతుత్లు ఆంథోని డిసౌజ జిల్లా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. పూర్తి స్థాయి డీఈఓ లేకపోవడంతో.. ఆ ఫైల్ సీనియర్ అసిస్టెంట్ కట్టగురు సైదులు వద్దకు రాగా..ఐదేళ్లు రెన్యువల్ చేసేందుకు రూ. 25వేలు లంచం డిమాండ్ చేశాడు. కేవలం 30 మంది విద్యార్థులే ఉన్నారని, అంత ఇచ్చుకోలేనని అనడంతో ఏడాదిగా తిప్పుకుంటూ ఇబ్బంది పెడుతున్నాడు. విసిగిపోయిన బాధితుడు..ఏసీబీ ఖమ్మం, వరంగల్ డీఎస్పీ బీవీ.సత్యనారాయణను ఆశ్రయించాడు. ఆయన సూచన ల మేరకు..సైదులుకు పాఠశాల యజమాని ఫోన్ చేసి డబ్బు ఇచ్చేందుకు అంగీకరించగా డీఈఓ ఆఫీస్ మార్గం లోని ఆలయం వద్దకు రమ్మనడంతో అక్కడ డబ్బు ముట్టజెప్తుండగా ఉదయం 11గంటల సమయంలో రెడ్ హ్యాం డెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం డీఈఓ ఆఫీస్‌కు తరలించి..విచారించారు. కేసు నమోదు చేసి, ఏసీబీ కోర్టుకు రిమాండ్ చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ బీవీ.సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగితే 94404 46146 సెల్‌నంబర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. ప్రతి పనికో రేటు.. ఖమ్మం జిల్లా డీఈఓనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. పూర్తిస్థాయిలో ఇక్కడ ఉండని కారణంగా పర్యవేక్షణ కొరవడింది. సీనియర్ అసిస్టెంట్ కట్టగురు సైదులు..లంచం తీసుకుంటూ పట్టుబడడంతో విద్యాశాఖ కార్యాలయంలో లొసుగులపై చర్చ జరుగుతోంది. ఉద్యోగులు సమయ పాలన పాటించకపోవడం నుంచి మొదలు..ప్రతి పనికీ ఇక్కడ ఓ రేటు మాట్లాడుకుంటారని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు, ప్రైవేట్ పాఠశాలల పనులకు కచ్చితంగా డబ్బు చెల్లించుకోవాల్సిందేననే ఆరోపణలు ఉన్నాయి. కస్తూర్బా పాఠశాలల బిల్లుల మంజూరులోనూ అంతోఇంతో ఇచ్చుకోవాల్సిందేనట. అవినీతి మరకలు పడడం బాధాకరమని, ఇకపై ఇలా జరగకుండా, పద్ధతిగా వ్యవహరించుకోవాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రామాచారి, ఇతర ఉపాధ్యాయ సంఘాల నేతలు సూచించారు. ఇటు కార్యాలయ పాలన గాడిలో పెట్టాలన్నా, అటు జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల పనితీరుపై పర్యవేక్షణ పెరగాలన్నా పూర్తిస్థాయి డీఈఓ నియామకం చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
ఏసీబీ వలలో మరో అవినీతి చేప
సాక్షి, కొత్తగూడెం: అవినీతి నిరోధక శాఖ వలలో మరో అవినీతి చేప చిక్కింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం (డి.ఇ.ఓ) కార్యాలయంలో సైదులు అనే వ్యక్తి సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఓ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం నుంచి రూ.25వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. తమ స్కూల్ రెన్యువల్ కోసం లంచం డిమాండ్ చేశారని ఆ పాఠశాల యాజమాన్యం లిఖితపూర్వకంగా ఏసీబీకీ ఫిర్యాదు చేసింది. దీనిపై ఏసీబీ అధికారులు వలపన్ని లంచం తీసుకుంటుండగా వలపన్ని సీనియర్ అసిస్టెంట్‌ను పట్టుకున్నారు. -
మాతృమూర్తి సేవలు మరువలేనివి
ఓర్వకల్లు : మాతృమూర్తి సేవలు మరువలేనివని.. ప్రతి ఒక్కరూ తల్లులను గౌరవించాలని మండల విద్యాశాఖాధికారిణి ఫైజున్నిపాబేగం అన్నారు. వసంత పంచమి సందర్భంగా సోమవారం కన్నమడకల, పూడిచెర్ల, కేతవరం, శకునాల, హుసేనాపురం, లొద్దిపల్లె, ఉప్పలపాడు, ఉయ్యాలవాడ ఉన్నత పాఠశాలల్లో అమ్మకు వందనం కార్యక్రమం నిర్వహించారు. కన్నమడకల గ్రామంలో ఓ మహిళ మాట్లాడుతూ.. తాను చిన్నతనంలో ఉండగానే తల్లిని కోల్పోయానని, ఇలాంటి దుస్థితి ఎవరికీ రాకూడదని విలపించారు. ఓర్వకల్లు జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ఎంఈవో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎఈంతో మాట్లాడుతూ..తల్లితండ్రులు దేవుళ్లతో సమానమన్నారు. బిడ్డల పెంపకంలో తల్లి పాత్ర చాలా గొప్పదని పేర్కొన్నారు. అనంతరం పిల్లచేత తల్లులకు పాదాభివందనం చేయించారు. అమ్మకు వందనం పాణ్యం : వసంత పంచమిని పురస్కరించుకొని సోమవారం.. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అమ్మకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ అనురాధ మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులపైన గౌరవం పెంచుకొని క్రమశిక్షణతో మెలగాలన్నారు. అనంతరం విద్యార్థులు తల్లిదండ్రులకు పాదపూజ నిర్వహించి నిర్వహించారు. ఎంపీడీఓ చంద్రశేఖర్‌రావు, ఎంఈఓ కోటయ్య, పాఠశాల చైర్మన్ జయరాముడు, హెచ్ఎం జ్యోత్స్న పాల్గొన్నారు. గడివేములలో... గడివేములు : వసంత పంచమి సందర్భంగా మండలంలోని 50 పాఠశాలల్లో సోమవారం అమ్మకు వందనం, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. రాజరాజేశ్వరి పాఠశాల కరస్పాండెంట్ రామేశ్వరరావు దంపతులు సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా 22 మంది చిన్నారులతో అక్షరాభ్యాసాలు చేయించారు. మాతృమూర్తికి విద్యార్థులు పాదపూజ చేశారు. -
విద్యా శాఖలో ప్రక్షాళన పర్వం
♦ డీఈఓ సస్పెన్షన్‌కు సిఫార్సు ♦ ముగ్గురు ఏడీలకు షోకాజ్ నోటీసులు ♦ పాఠశాల ఇన్చార్జి కమిషనర్ శ్రీనివాసులు నెల్లూరు (టౌన్) : జిల్లా విద్యాశాఖలో ప్రక్షాళన పర్వం మొదలు కానుందా.. అవుననే చెబుతున్నారు పాఠశాల విద్యా శాఖ ఇన్చార్జి కమిషనర్ గుర్రాల శ్రీనివాసులు. సర్వశిక్షాభియాన్ ప్రాజెక్ట్ రాష్ట్ర అధికారిగా, పాఠశాల విద్యా శాఖ ఇన్చార్జి కమిషనర్‌గా వ్యవహరిస్తున్న శ్రీనివాసులు బుధవారం డీఈఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. సర్వశిక్షాభియాన్ బృందంతో కలిసి కార్యాలయంలోని అన్ని సెక్షన్లలో రికార్డులను పరిశీ లించారు. రికార్డులన్నీ అస్తవ్యస్తంగా ఉండటంతో పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందనే నిర్ధారణకు వచ్చారు. జిల్లా విద్యాశాఖకు ఏటా ప్రభుత్వం నుంచి ఏ మేరకు నిధులొస్తున్నాయి, ఎంత ఖర్చు పెడుతున్నారన్న దానిపై ఎలాంటి వివరాలు లేవు. మెడికల్ బిల్లులు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. సాధారణంగా బిల్లులను ఐదు రోజుల్లోగా క్లియిర్ చేయాల్సి ఉన్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కార్యాలయంలో వ్యక్తిగత రిజిసర్లు నిర్వహించాల్సి ఉండగా, అవి ఖాళీగా ఉండటాన్ని కమిషనర్ బృందం గుర్తించింది. బి, బి–1 సెక్షన్లలో ఎంట్రీలు చేయలేదు. కొత్త పాఠశాలల ఏర్పాటు, పాత అనుమతుల పునరుద్ధరణకు సంబంధించి అందిన దరఖాస్తులు గత ఏడాది అక్టోబర్ నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. ఇదేమని అడిగితే ఎంఈఓల నుంచి నివేదికలు రాలేదని ఏడీఈలు సమాధానం ఇచ్చారు. కావలిలో ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో 7, 8, 9 తరగతుల ఏర్పాటుకు 2016లో దరఖాస్తు రాగా, అక్కడి ఎంఈఓ ఇంతవరకు నివేదిక ఇవ్వలేదు. ఈ విషయాన్ని డీఈఓ పట్టించుకోకపోవడాన్ని ఎస్ఎస్ఏ బృందం తప్పుపట్టింది. లోపాల పుట్ట 2015 అక్టోబర్‌లో అప్పటి విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి మూడు రోజులపాటు తనిఖీలు నిర్వహించి.. 478 లోపాలను కనుగొన్నారు. ఆ తరువాత మరో 25 లోపాలను గుర్తించారు. మొత్తం 503 లోపాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా డీఈఓను ఆదేశించారు. ఇంతవరకు వాటిపై ఎలాంటి సమాధానం లేకపోవడంపై ఇన్చార్జి కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పనిచేసే ఉద్యోగులు ఎక్కడికి వెళుతున్నారన్న దానిపై మూవ్మెంట్ రిజిస్టర్లో వివరాలు నమోదు చేయాల్సి ఉండగా.. మూడేళ్ల కాలంలో కొన్ని నెలల వివరాలు మాత్రమే చూపించారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి నికర చెల్లింపులు జరగటం లేదని, పౌర సరఫరాల అధికారులు పెట్టిన బిల్లులకు యథాతథంగా చెల్లింపులు చేయడం తప్ప తప్ప పర్యవేక్షించిన దాఖలాలు లేవని గుర్తించారు. కొన్నిచోట్ల కేటాయిం చిన దానికంటే ఎక్కువ డ్రా చేశారని తనిఖీల్లో వెల్లడైంది. సామగ్రి కొనుగోళ్లు, కాంట్రాక్ట్ బిల్లులకు సంబంధించి ఎం.బుక్, సాంకేతిక మంజూరు పుస్తకాలు లేకపోవడాన్ని గుర్తించారు. చర్యలకు సిఫార్సు చేస్తాం పాలనలో లోపాలు, పర్యవేక్షణ కొరవడటం, గతంలో గుర్తించిన లోపాలపై చర్యలు తీసుకోకపోవడం వంటి పరిస్థితులపై పాఠశాల విద్యాశాఖ ఇన్చార్జి కమిషనర్ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల అనంతరం విలేకరులతో మాట్లాడుతూ డీఈఓ ఎం.రామలింగంను సస్పెండ్ చేయాలని సూచిస్తూ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని చెప్పారు. కార్యాలయ ఏడీలు విజయ, సుబ్రçహ్మణ్యం, నాగేశ్వరరావులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించామన్నారు. అనంతరం వారిచ్చిన సమాధానాల ఆధారంగా చర్యలు ఉంటాయని చెప్పారు. డీఈఓ కార్యాలయాన్ని తనిఖీ చేసిన వారిలో ఎస్ఎస్ఏ అడిషనల్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గురుమూర్తి, డిప్యూటీ డైరెక్టర్ కృష్ణమోహన్, అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం ఉన్నారు. -
డీఈఓగా డైట్ ప్రిన్సిపాల్ రాఘవరెడ్డి?
– జిల్లాకు డీఈఓగా వచ్చేందుకు ఆసక్తి చూపని అధికారులు – పీఓగా తాహెరా సుల్తానాను నియమించే అవకాశం? కర్నూలు సిటీ: జిల్లా విద్యాశాఖ అధికారిగా పదోన్నతుల ద్వారా వచ్చేందుకు అధికారులు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. గతంలో జరిగిన సంఘటనలు, కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకుల తీరు, రాజకీయ నాయకుల జోక్యం అధికంగా ఉండడమే అందుకు కారణమనే విమర్శలున్నాయి. అయితే నిన్న, మొన్నటి వరకు డీఈఓగా గతంలో జిల్లాలో డిప్యూటీ ఈఓగా పని చేసిన సుబ్బారావు వస్తారని విద్యాశాఖ వర్గాల్లో చర్చ జరిగింది. ఇక్కడికి డీఈఓగా రావాలంటే అమరావతిలోని అధికారి పార్టీ నేతలకు కనీసం రూ.25 లక్షలు చెల్లించాలనే షరతు పెట్టడంతో అంతా మొత్తంలో చెల్లించలేనని చెప్పినట్లు తెలిసింది. కడప, అనంతపురం జిల్లాల్లో ఏదో ఓ జిల్లాకు ఆయన డీఈఓగా వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. 28మందికి పదోన్నతులకు ఆమోదం డిప్యూటీ ఈఓ, ప్రభుత్వ డైట్, బీఈడీ కాలేజీ ప్రిన్సిపాళ్లకు డీఈఓలుగా పదోన్నతులు కల్పించేందుకు మంగళవారం విజయవాడలో జరిగిన మంత్రి సమావేశంలో 28 మంది జాబితాతో డీపీసీ ఆమోదం పొందింది. మొదట్లో 14 మందితో జాబితా తయారు చేశారు. అయితే సర్వశిక్ష అభియాన్ పీఓలుగా కూడా డీఈఓ స్థాయి అధికారులుగా పని చేయాలనే ఉద్దేశం, విద్యాశాఖతో సంబంధంలేని వారు పీఓలుగా వస్తుండడం వల్ల ప్రయోజనం ఉండడం లేదని, అందుకే విద్యాశాఖతో సంబంధం ఉన్న వారిని డీఈఓ స్థాయి వారిని పీఓలుగా నియమించేందుకు మరో 14 మంది జాబితాను తయారు చేసి మొత్తంగా 28 మందికి డీపీసీ ఆమోదం తెలిపింది. ఈ కారణంతోనే ప్రస్తుత డీఈఓ ఎస్.తాహెరా సుల్తానా మంగళవారం విజయవాడకు వెళ్లారు. డైట్ ప్రిన్సిపాల్ రాఘవరెడ్డికి పదోన్నతి అధికార పార్టీ నేతలు నిర్ణయించినంత సొమ్ము ఇచ్చి డీఈఓగా జిల్లాకు వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో పదోన్నతుల జాబితాలో ఉన్నటువంటి కర్నూలు ప్రభుత్వ డైట్ ప్రిన్సిపాల్ రాఘవరెడ్డిని డీఈఓగా నియమించేందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ అంగీకరించినట్లు సమాచారం. అయితే మంత్రి మరో రెండు రోజులు వేచి చూసి నిర్ణయించుదామని చెప్పినట్లు తెలిసింది. కాగా ప్రస్తుత డీఈఓ తాహెరా సుల్తానా కూడా తననే కొనసాగించాలని అధికార పార్టీ నాయకుల ద్వారా ప్రయత్నించినా, అధికారులు మాత్రం పీఓగా నియమించేందుకే నిర్ణయించినట్లు చర్చ జరుగుతోంది. ఏదిఏమైనా రెండు, మూడు రోజుల్లో కొత్త డీఈఓ నియమాకంపై ఉత్తర్వులు రానున్నాయి. -
మూడంచెల ముడుపులు
విద్యాశాఖ సిబ్బంది బలవంతపు వసూళ్లు పదోన్నతికి రూ. 50 వేలు చెల్లించుకోవాల్సిందే.. అప్పుడే డీవైఈఓ, డీఈఓ, ఆర్జేడీ కార్యాలయాల్లో దస్త్రం కదలిక గగ్గోలు పెడుతున్న ఎయిడెడ్ ఉపాధ్యాయులు.. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో మూడంచెలు, ఐదంచెల కార్యక్రమాల అమలు విధానం చూశాం.. మరి ఈ మూడంచెల ముడుపుల విధానం ఏమిటి అనుకుంటున్నారా.. ఇది విద్యాశాఖ సిబ్బంది ప్రవేశపెట్టిన విధానం. ఎయిడెడ్ ఉపాధ్యాయుల పదోన్నతుల్లో నిషేధం ఎత్తివేయడం ఆ శాఖ ఉద్యోగులకు అనుకోని వరంగా పరిణమించింది. అదెలాగో ఒకసారి చూద్దాం.. ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులను నిషేధిస్తూ 2004వ సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన పాఠశాల విద్యాశాఖ అధికారులు మెమో నెం. 18836ను జారీ చేశారు. దానిపై ఎయిడెడ్ ఉపాధ్యాయులు 2005వ సంవత్సరంలో కోర్టులో సవాల్ చేశారు. అప్పటి నుంచి కోర్టులో మగ్గిపోయిన ఈ ఫైల్‌కు ఈ ఏడాది కదలిక వచ్చింది. కోర్టు తీర్పు ఎయిడెడ్ ఉపాధ్యాయులకు అనుకూలంగా వచ్చింది. దీంతో గత జూన్ 30న ఎయిడెడ్ ఉపాధ్యాయుల పదోన్నతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ జీఓ ఎంఎస్ నెంబర్ 40ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది పదోన్నతులకు మార్గం సుగమమయింది. జీఓ నెం 40 ప్రకారం ఈ నెల 3వ తేదీ నుండి 7వ తేదీ లోపు పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఈ నెల14వ తేదీ లోపు పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు కొత్త పోస్టుల్లో చేరాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకూ ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ వ్యవహారంతో తలమునకలై ఉన్న విద్యాశాఖాధికారులు ఈ విషయంలో కాస్త అశ్రద్ధ వహించారని ఎయిడెడ్ ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొనసాగుతున్న ప్రక్రియ.. ఎయిడెడ్ ఉపాధ్యాయులు, సిబ్బంది పదోన్నతుల ప్రక్రియను గత వారం రోజులుగా విద్యాశాఖాధికారులు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికీ వారి వద్ద పూర్తి సమాచారం అందుబాటులో లేదు. ఎయిడెడ్ పాఠశాలల విషయానికొస్తే జిల్లాలో 222 ప్రాథమిక, 14 ప్రాథమికోన్నత, 37 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు పదోన్నతులు వచ్చే అవకాశం లేదు. కేవలం ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లోనే సీనియారిటీ ఉన్న ఉపాధ్యాయులు పదోన్నతులు పొందనున్నారు. ఈ పదోన్నతుల్లో ఎంతమందికి అవకాశం ఉంది అనే విషయంలో విద్యాశాఖాధికారుల్లో ఇప్పటికీ స్పష్టత లేకపోయినప్పటికీ సుమారు 80 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది పదోన్నతులు పొందవచ్చని చెబుతున్నారు. మూడంచెల ముడుపుల విధానం ఇలా.. సుమారు 13 సంవత్సరాల తరువాత పదోన్నతులకు అవకాశం వచ్చిందని ఎయిడెడ్ ఉపాధ్యాయులు సంతోషపడుతున్న సమయంలో వారికి విద్యా శాఖాధికారులు ఝలక్ ఇచ్చారు. పదోన్నతులు ఊరికే రావు, మీ పదోన్నతుల దస్త్రం కదలాలంటే ’మాకేంటి’ అంటున్నారని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఈ మేరకు ముందుగా డీవైఈఓ కార్యాలయం నుంచి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి దస్త్రం చేరాలంటే డీవైఈఓ కార్యాలయానికి రూ. 5 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని చెబుతున్నారు. అక్కడి నుంచి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి చేరుకుని ఆర్జేడీ కార్యాలయానికి చేరాలంటే విద్యాశాఖలో ఎయిడెడ్ ఉపాధ్యాయుల దస్త్రాలను పరిశీలించే నలుగురు ఉద్యోగులు రూ. 20 వేలు అడుగుతున్నారని అది కేవలం తమకు మాత్రమే కాదని, జిల్లా విద్యాశాఖాధికారికి కూడా అందులో వాటా వెళుతుందని చెబుతున్నారని వాపోతున్నారు. అక్కడితో తమకు పదోన్నతులు వచ్చేసినట్టే అనుకుంటే తిరిగి ఆర్జేడీ కార్యాలయంలో పదోన్నతులకు ఆమోద ముద్ర పడడానికి మరో రూ. 25 వేలు సమర్పించుకోవాల్సి ఉంటుందని జిల్లా విద్యాశాఖ కార్యాలయ సిబ్బందే చెబుతున్నారంటున్నారు. అంటే పదోన్నతి కావాలంటే ఒక్కో ఉపాధ్యాయుడూ సుమారు రూ. 50 వేలు సమర్పించుకోవాన్నమాట. బేరసారాల్లో ఉపాధ్యాయులు.. ఎంతోకొంత సమర్పించకపోతే పదోన్నతి పొందడం కష్టమని ఆలోచిస్తున్న ఉపాధ్యాయులు మామూళ్లు ఇవ్వడానికి ఆయా కార్యాలయాల సిబ్బందితో బేరసారాలకు దిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏలూరులోని కేపీడీటీ స్కూల్ ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయంలోని ఉద్యోగులకు రూ. 8 వేలు ఇవ్వగలమని చెప్పినట్లు తెలిసింది. డెల్టా ప్రాంతమైన భీమవరం, నరసాపురం, పాలకొల్లు తదితర ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయులు మాత్రం తాము ముడుపులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించినట్టు, ముడుపులు ఇవ్వకపోతే ఏమి చేస్తారో మేమూ చూస్తాం అనే ధోరణిని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. నా దృష్టికి తీసుకురండి.. ఆర్ఎస్ గంగాభవాని, జిల్లా విద్యాశాఖాధికారి.. ఇప్పటి వరకూ ఈ విషయం నా దృష్టికి రాలేదు. పదోన్నతుల ఫైలు కదలడానికి ఒక్క రూపాయి కూడా ఎవరికీ ఇవ్వనక్కరలేదు. అలా ఎవరైనా డిమాండ్ చేస్తే నా దృష్టికి తీసుకురావాలి. ఉపాధ్యాయులు ఫిర్యాదు చేస్తే సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఉపాధ్యాయుల నుంచి వినిపిస్తున్న ఆరోపణలపై విచారణ చేపడతాం. -
వికలాంగ బ్యాక్లాగ్ టీచర్ పోస్టుల భర్తీ
అనంతపురం ఎడ్యుకేషన్: 2008, 2012 డీఎస్సీల్లో మిగిలిపోయిన వికలాంగ అభ్యర్థుల బ్యాక్లాగ్ టీచర్ పోస్టుల భర్తీకి శనివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. స్థానిక కేఎస్ఆర్ బాలికల పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ జరిగింది. 2014 డీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థులతో ఈ పోస్టులు భర్తీ చేశారు. మొత్తం 18 పోస్టులు భర్తీకి చర్యలు తీసుకున్నారు. వీటిలో ఎస్జీటీ తెలుగు 11, ఎల్పీటీ 4, ఎల్‌పీహెచ్ 2, ఎల్పీ ఉర్దూ ఒకపోస్టు ఉన్నాయి. -
ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి చర్యలు
అనంతపురం రూరల్: నాణ్యమైన విద్యాబోధనతో ప్రభుత్వ విద్యాసంస్థలను మరింత బలోపేతం చేసేందుకు శ్రీకారం చుట్టినట్లు జిల్లా విద్యాశాఖాధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. ఇందులో భాగంగా ఆనందలహరి అభ్యసన (ఏఎల్ఏ) కార్యక్రమాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందని పేర్కొన్నారు. అనంతపురం రూరల్ మండలంలోని ఎ.నారాయణపురం గ్రామ పంచాయతీ, సుఖదేవ్‌నగర్‌లో రివర్టైడ్ బోధనా పద్ధతిని ఆయన మంగళవారం ప్రారంభించి, మాట్లాడారు. మల్టీగ్రేడ్, మల్టీలెవల్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఒకే తరగతి గదిలో వివిధ తరగతుల విద్యార్థులకు విద్యాబోధన ఉంటుందన్నారు. ప్రతిఒక్కరిపై ప్రత్యేక దృష్టి సారించి ఉత్తమ విద్యార్థిగా తీర్చిదిద్దేందుగా ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో దశల వారీగా ఏఎల్ఏ బోధనా పద్ధతులను అమలు చేయన్నుట్లు చెప్పారు. ఎస్ఎస్ఏ పీఓ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ... ఈ ఏడాది 1, 2తరగతుల విద్యార్థులకు డిజిటల్ విధానంలో బోధన ఉంటుందన్నారు. అనంతరం 3, 4, 5 తరగతుల విద్యార్థులకు విస్తరించనున్నట్లు తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అత్యుత్తమైన విద్యను అందించడం కోసం ఏఎల్ఎ దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఏఎంఓ చెన్నక్రిష్ణారెడ్డి, ఎస్ఎస్ఏ అధికారులు రవినాయక్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాయల్ మురళీ, ఎంపీడీఓ ఓబులమ్మ, ఎంఈఓ వెంకటస్వామి, రిషివేలీ ఇన్స్టిట్యూట్ కో ఆర్డినేటర్స్ కళావతి, పూజ, ప్రతిమ పాల్గొన్నారు. -
పదిలో నూరు శాతం ఫలితాలు సాధించాలి
ఎంఈఓలు, హెచ్ఎంలకు డీఈఓ సూచన ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): ఈ ఏడాది పదవ తరగతిలో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించేలా ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.ఎస్.గంగాభవాని సూచించారు. సోమవారం ఏలూరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఒలతో స్థానిక సెయింట్ థెరిస్సా బాలికోన్నత పాఠశాలలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు ప్రతీ రోజూ సాయంత్రం ఒక గంట అదనంగా తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. 8వ తరగతి విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. అలాగే ప్లేఫీల్డ్స్కి ప్రధానోపాధ్యాయులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఏలూరు డీవైఈఓ ఉదయ కుమార్ మాట్లాడుతూ 10వ తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు ఈ నెల 10వ తేదీ నుండి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. 6వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, తరగతి గదులను ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలని, వారాంతపు సమీక్షలు నిర్వహించి, విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలపై తగు సలహాలు ఇవ్వాలని సూచించారు. అలాగే బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, ప్రతీ పాఠశాలలో కిచెన్గార్డెన్లు ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజన పథకానికి కూరగాయలు పండించాలన్నారు. అనంతరం రిటైర్డ్ డీవైఈఓ ఏడీవీ ప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సమీక్షా సమావేశంలో ఏలూరు డివిజన్లోని మండల విద్యాశాఖాధికారులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
బదిలీ టీచర్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభం
ప్రక్రియ ముగిసేదాకా ఎంఈఓలు, హెచ్ఎంలకు సెలవుల్లేవ్ జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నత పాఠశాలల టీచర్ల దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. వెరిఫికేషన్‌కు 20 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ దగ్గరుండి పర్యవేక్షించారు. వివిధ ధ్రువీకరణ పత్రాలు పక్కాగా పరిశీలించాలని ఆదేశించారు. ముఖ్యంగా స్పౌజ్, ప్రిపరెన్షియల్ కేటగిరీలకు సంబంధించిన వారి విషయాల్లో చాలా జాగ్రత్తగా చూడాలన్నారు. ఏమాత్రం తేడా వచ్చినా బాధిత టీచర్లతో పాటు పరిశీలించిన అధికారులపై చర్యలుంటాయని హెచ్చరించారు. తాత్కాలిక సీనియార్టీ జాబితా ప్రకటించిన తర్వాత ఏవైనా అభ్యంతరాలుంటే ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే వాటిని పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తామన్నారు. సాయంత్రం వరకు ఈ ప్రక్రియ సాగింది. ఇదిలాఉండగా టీచర్ల బదిలీలపై ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉందని, ఈ ప్రక్రియ ముగిసేదాకా మండల విద్యాశాఖ అధికారులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సెలవులు ఉండవని స్పష్టం చేశారు. -
10లోపు పండిట్ కోర్సు పరీక్ష ఫీజు చెల్లించాలి
అనంతపురం ఎడ్యుకేషన్ : భాషాపండిట్ కోర్సు (టీపీటీ, హెచ్‌పీటీ) పరీక్షలకు సంబంధించి రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు ఈనెల 10లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా కళాశాలల ప్రధానోపాధ్యాయులు 11న ట్రెజరీ లేదా బ్యాంకులో చెల్లించాలన్నారు. రూ. 50 అపరాధ రుసుంతో ఈనెల 17 వరకు ఫీజు చెల్లించొచ్చని, ప్రధానోపాధ్యాయులు 18న బ్యాంకులో చెల్లించాలన్నారు. నామినల్ రోల్స్, దరఖాస్తులను ఈనెల 21న పంపాలన్నారు. మూడు సబ్జెక్టులకు రూ. 100, ఆపైన సబ్జెక్టులకు రూ.150 చలానా రూపంలో చెల్లించాలని స్పష్టం చేశారు. వివరాలకు ఠీఠీఠీ.bట్ఛ్చp.ౌటజ వెబ్‌సైట్‌ను పరిశీలించాలన్నారు. -
ప్లాస్టిక్ లంచ్ బాక్సులతో అనర్థాలు
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు: 3,295 ప్రాథమికోన్నత పాఠశాలలు: 500 ఉన్నత పాఠశాలలు: 610 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు: 3.45 లక్షలు (వివరాలు 2016–17 నాటివి) నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఇదే తరుణంలో బడికి వెళ్లే పిల్లల ఆహార విషయంలో అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులకు నిపుణులు సూచిస్తున్నారు. వారు తీసుకెళ్లే లంచ్ బాక్సులతో మొదలు.. బయట కొనిపెట్టే ఇతర తిండి పదార్థాల వరకూ అన్నింటా ఎన్నో సమస్యలు అంటిపెట్టుకుని ఉన్నాయి. లంచ్ బాక్సులను సరిగ్గా శుభ్రం చేయకుండా ఆహార పదార్ధాలు ఉంచితే, ఆహారం విషతుల్యమై వాంతులు, విరేచనాల బారిన పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. - గుమ్మఘట్ట ప్యాకింగ్ పదార్థాలు వద్దు బడికి వెళ్లే పిల్లలకు సాధ్యమైనంత వరకూ ఇంటిలో తయారు చేసిన పదార్థాలనే ఇస్తే బాగుంటుంది. హోటళ్ల నుంచి తెప్పించి లంచ్ బాక్స్‌లో సర్ది ఇవ్వడం మంచిది కాదు. పిల్లలు తినే సమయానికి అవి పాడైపోతుంటాయి. దీని ఫుడ్‌పాయిజన్ అవుతుంది. ప్లాస్టిక్ కవర్లలో ఆహారాన్ని ప్యాక్ చేయడం వల్ల అందులో ధూళి చేరి పిల్లలు అనారోగ్యం బారిన పడే ప్రమాదముంది. ప్లాస్టిక్ బాక్స్‌ల్లో ఆహార పదార్థాలను తీసుకెళ్లడం మంచిది కాదు. ఎందుకంటే ప్లాస్టిక్ బాక్స్‌లకు రసాయనిక రంగులు వాడుతుంటారు. అంతేకాదు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు 30 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరుకుంటే సూక్ష్మజీవులు చేరేందుకు అవకాశం ఉంది. ఫలితంగా ఆహారం విషతుల్యమవుతుంది. హాట్‌బాక్స్‌లు లేదా స్టీల్ బాక్స్‌ల్లో ఆహారాన్ని తీసుకెళ్లడం మంచిది. అయితే వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. లంచ్ బాక్స్‌లు ఇలా.. పిల్లలకు ఆహారాన్ని అందించే లంచ్ బాక్స్‌లు నాణ్యమైనవిగా ఉండాలి. రసాయనిక రంగులు వాడిన బాక్స్‌లు వద్దు. పోషకాలు ఉన్న ఆహారాన్ని అందించండి. భోజనానికి ముందు చేతులు శుభ్రం చేసుకునేలా చైతన్య పరచండి. తొలివిడతగా పది లక్షల పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచాం. మరో పది లక్షల పుస్తకాలు ఒకటిరెండ్రోజుల్లో రానున్నాయి. – లక్ష్మినారాయణ, జిల్లా విద్యాధికారి, అనంతపురం శుభ్రం అవసరం వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలి. నిర్లక్ష్యం చేయకూడదు ఈగలు, దోమలు పెరిగి ఇళ్లలో ఉండే ఆహార పదార్ధాలపై చేరుతాయి. వీటిని పిల్లలకు అందించడం వల్ల పలు రకాల జబ్బుల బారిన పడతారు. పిల్లల పట్ల ప్రత్యే శ్రద్ద వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – డాక్టర్ సత్యనారాయణ, ప్రభుత్వ వైద్యుడు, రాయదుర్గం -
ముగిసిన గడువు
► వీవీ పోస్టులకు వెయ్యికి పైగా దరఖాస్తులు ► జిల్లాలో 236 పోస్టులు ► నేడు, రేపు సర్టిఫికెట్ల పరిశీలన ► 8న మెరిట్ జాబితా ∙10న తుది దశ ఎంపిక ► 12న పాఠశాలల్లో చేరిక సాక్షి, నిర్మల్: విద్యావాలంటీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు సోమవారంతో ముగిసింది. ప్రభుత్వ వెబ్సైట్లో ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడంతో పూర్తిస్థాయిలో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారన్న వివరాలు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి ఇంకా అందలేదు. అయితే ఒక్క నిర్మల్ మండలం పరిధిలోనే చివరి రోజు 300లకు పైగా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా వెయ్యి మందికిపైగా దరఖాస్తు చేసుకుని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్ 12న పాఠశాలల్లో చేరేలా... జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1,011 ఉండగా సుమారు 1.15 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లాలో 236 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 162 ఎస్జీటీ, 74 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అందులో ఉన్నాయి. విద్యావాలంటీర్ల ద్వారా ఆ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ఈ నెల మొదట్లో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. జూన్ 2 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించారు. సోమవారంతో గడువు ముగిసింది. వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవడంతో సంఖ్య పరంగా విద్యాశాఖకు ఇంకా వివరాలు అందలేదు. కాగా మంగళ, బుధవారాల్లో సర్టిఫికెట్ల పరిశీలన జరుగనుంది. ఈ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తుతో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు 3 పాస్‌పోర్టు సైజ్‌ఫొటోలతో సంబంధిత ఎంఈవో కార్యాలయాల్లో సంప్రదించాలని విద్యాశాఖ అధికారులు తెలుపుతున్నారు. జూన్ 8న తాత్కాలిక మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. 9న ఆ జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. జూన్ 10న తుది సెలక్షన్ జాబితాను విడుదల చేస్తారు. 12న పాఠశాలల పునఃప్రారంభం రోజు వీవీలు విధుల్లో చేరాల్సి ఉంటుంది. గతంలో ఆలస్యం ప్రభుత్వం ప్రతీ విద్యాసంవత్సరం ఆలస్యంగా విద్యావాలంటీర్ల నియామకాలు చేపట్టేది. దీంతో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నచోట విద్యార్థులకు సరైన బోధన జరగక నష్టపోయే పరిస్థితులు ఉండేవి. ప్రతీ ఏడాది జూలై, ఆగస్టు నెలల వరకు నియామక ప్రక్రియ జరగకపోవడంతో మూడు నెలల పాటు విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడేది. ఈ ఏడాది జూన్ మాసం వరకు డీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించనప్పటికీ ఇంకా దానికి సంబంధించిన నోటిఫికేషనే విడుదల చేయలేదు. మరో వారం రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగకుండా జూన్‌లోనే వీవీ నియామకాలు పూర్తి చేయాలనే ఉద్దేశంతో తాత్కాలిక పద్ధతిన పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ఉపాధ్యాయుల కొరత సమస్యకు తాత్కాలికంగా ఉపశమనం కలగనుంది. విద్యావాలంటీర్లకు గతేడాది రూ.8వేల చొప్పున చెల్లించగా, ఈ విద్యాసంవత్సరం నెలకు రూ.12 వేలు చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పలువురు టీటీసీ, బీఈడీ పట్టాఉన్న నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా యూనిట్‌గా రోస్టర్ పాయింట్ జిల్లా యూనిట్‌గా మండలం వారీగా రోస్టర్ పాయింట్‌ను సిద్ధం చేశాం. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మంగళ, బుధవారాల్లో సంబంధిత ఎంఈవోల వద్ద సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలి. జూన్ 12వ తేదీలోగా వీవీ పోస్టులను భర్తీ చేస్తాం. – ప్రణీత, డీఈవో -
‘రియల్’ టీచర్లపై చర్యలు
అనంతపురం ఎడ్యుకేషన్ : కొందరు టీచర్లు పిల్లలకు చదువు చెప్పడం మానేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మునిగి తేలుతున్నారని, అలాంటి వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని డీఈఓ పగడాల లక్ష్మీనారాయణ హెచ్చరించారు. శనివారం స్థానిక సైన్స్ సెంటర్లో నిర్వహించిన ఎంఈఓల సమావేశంలో డీఈఓ మాట్లాడారు. గోరంట్లలో ఇద్దరు టీచర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ పాఠశాలలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఫిర్యాదులు అందాయన్నారు. విచారించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎంఈఓలు, డీవైఈఓలు చొరవ తీసుకుని ఇలాంటి వారిపై నిఘా ఉంచాలన్నారు. వారిని సస్పెండ్ చేస్తూ నివేదికలు పంపాలని ఆదేశించారు. -
ఆటలో ఆల్‌రౌండర్‌నే..
హాయ్ పిల్లలూ.. రోజూ చేస్తున్న రోటిన్ వర్క్‌ను పక్కనపెట్టి కాసేపు మీతో సరదాగా గడిపేందుకు వచ్చాను. ఇంతకూ నేనెవరో చెప్పలేదు కదూ.. నాపేరు పగడాల లక్ష్మీనారాయణ. మీ చదువుకుంటున్న అన్ని పాఠశాలలు అంటే ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లన్నింటీనీ పర్యవేక్షిస్తుంటాను. నేను చేస్తున్న పని వల్ల నాకు జిల్లా విద్యాధికారి అనే హోదా ఉంటుంది. ఇక నేను పుట్టింది... పెరిగింది.. చదువుకున్నది.. అంతా అనంతపురంలోనే. మా నాన్న వెంకటేశ్వర్లు పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు. ఇక అమ్మ కృష్ణవేణమ్మ ఇంటి పట్టునే ఉంటూ మా బాగుగోలు చూసుకునేది. మేము ఆరుగురంఅన్నదమ్ములం. అందులో నేనే చిన్నవాణ్ని. హైస్కూల్ వరకూ ఇక్కడే గిల్డ్ ఆఫ్ సర్వీస్ స్కూల్లో చదువుకున్నా.. తర్వాత ఇంటర్మీడియట్‌ను కొత్తూరు జూనియర్ కళాశాలలో, డిగ్రీని ఆర్ట్స్ కళాశాలలో, పీజీని ఎస్కేయూలో చేశాను. ఇక ఆటలంటరా... చిన్నప్పుడు స్నేహితులతో కలిసి చాలా ఆటలు ఆడుకునేవాళ్లం. అందులో నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా, మీడియం పేస్ బౌలర్‌గా.. రాణించాను. ఒక విధంగా చెప్పాలంటే క్రికెట్లో నేను ఆల్రౌండరిని అన్నమాట. అప్పట్లో ఎమరాల్డ్స్ 11 అనే జట్టుకు నేనే కెప్టెన్‌ని. అప్పుడు రాష్ట్ర స్థాయిలో జరిగిన ఓ టోర్నీ విన్నర్‌గా మా జట్టు నిలిచింది. ఆ రోజు ఇప్పటికీ నేను మరిచిపోలేను. ఎందుకంటే ఆ సమయంలో విజేత జట్టు కెప్టెన్‌గా అప్పటి జిల్లా కలెక్టర్ చంద్రమౌళీ గారి చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవడం ఓ మధుర జ్ఞాపకం. ఇక నా హాబీలంటారా.. చిన్నప్పటి నుంచి రచనలు చేసేవాణ్ని. 1977లో నేను 8వ తరగతి చదువుతున్న సమయంలో అప్పటి పాపులర్ దినపత్రిక ‘ఆంధ్రపత్రిక’లో నేను రాసిన ‘విద్యారంగం - నేటి సమస్య’ అనే కాలమ్‌ను ప్రచురించారు. ఇది కేవలం ఆటెండెన్స్ ఆధారంగా విద్యార్థులను పాస్ చేసే పద్ధతిని విమర్శిస్తూ రాసిన నా తొలి వ్యాసం. దీనిని ప్రచురణకు స్వీకరిస్తున్నట్లు ఆంధ్రపత్రిక యాజమాన్యం మా ఇంటికి ఓ ఉత్తరాన్ని పంపింది. ఇప్పటికీ ఆ ఉత్తరం నా దగ్గర భద్రంగా ఉంది. అలాగే నేను రాసిన కథ కూడా ‘హాస్యప్రభ’లో ప్రచురితమైంది. ఆ పత్రిక నుంచి వచ్చిన ఉత్తరాన్ని కూడా పదిలంగా దాచుకున్నాను. మీ కోసం ఇలాంటి కొన్ని ఉత్తరాలను చూపుతున్నాను. సాత్విక్ పేరుతో నేను రాసిన దాదాపు పది సీరియల్ నవలలు, 50 కథలు వివిధ వార, మాస పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఐదు సార్లు నవలా రచయితగా, 15 సార్లు కథా రచయితగా ఉత్తమ అవార్డులు స్వాతి వారపత్రిక నుంచి అందుకున్నాను. - అనంతపురం ఎడ్యుకేషన్ -
విద్యార్థులపై పోలీస్ జులుం
డీఈవో కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ధర్నా ఈడ్చుకెళ్లిన పోలీసులు కాకినాడ : కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్రయోజనం కలిగేలా రేషనలైజేషన్ పేరిట ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డీఈవో కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసులు జులుం ప్రదర్శించి పోలీసుస్టేషన్‌కు ఈడ్చుకెళ్లడంతో గందరగోళం నెలకొంది. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా కాకినాడ మెయిన్‌రోడ్డులోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు సోమవారం ధర్నా చేశారు. పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన షేక్ సలాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా విద్యార్థుల సంఖ్య తక్కువ ఉందన్న కారణంతో ప్రస్తుతం ఉన్న మూడు అంచెల పాఠశాలల విధానానికి చరమగీతం పాడడం సరికాదన్నారు. ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్టును ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. పాఠశాలలను కుదిస్తే డ్రాప్ అవుట్స్ పెరిగి కార్పొరేట్ పాఠశాలలకు ప్రయోజనం కలిగేలా ఉందన్నారు. ఫలితంగా ఫీజుల భారం మోయలేక పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి కిరణ్ మాట్లాడుతూ పురాతన భవనాలకు మరమ్మతులు చేపట్టి కనీస మౌలిక సదుపాయలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ నియామకాలు భర్తీచేసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కార్పొరేట్ స్కూల్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంతోపాటు తెలుగుమీడియం కూడా కొనసాగించాలన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి చింతపల్లి మధుసూదనరెడ్డి, మొగలమూరి అజయ్, ముద్రగడ నాయుడు కార్తీక్, కాకినాడ నగర విద్యార్థి విభాగం అధ్యక్షుడు రోకళ్ల సత్యనారాయణ, విద్యార్థి విభాగం నాయకులు పసుపులేటి మణీష్, చిట్నీడి మణికుమార్, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం ధర్నా అనంతరం వినతిపత్రం ఇచ్చేందుకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోకి వెళ్తున్న విద్యార్థులపై పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. లోపలికి వెళ్లేందుకు వీలులేదంటూ రెండో అంతస్తులో ఉన్న విద్యార్థులను మెట్లపై నుంచి బలవంతంగా తోసివేశారు. దీనిని అడ్డుకున్న రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సలాంబాబు, జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి కిరణ్ సహా పలువురు విద్యార్థి నేతలపై కూడా పోలీసులు అదే రీతిలో వ్యవహరించి బలవంతంగా పోలీసుస్టేషన్‌కు తరలించారు. చొక్కా పట్టుకుని ఈడ్చుకువెళ్లిన తీరుతో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ కాకినాడ నగరాధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. సంఘటన వివరాలను జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కన్నబాబు పోలీసులతో మాట్లాడారు. అనంతరం అదుపులోకి తీసుకున్న విద్యార్థి నేతలను విడిచిపెట్టారు. -
టెన్త్ స్పాట్ వాల్యుయేషన్‌కు ఏర్పాట్లు
- నేటి నుంచి 16 వరకు మూల్యాంకనం - స్పాట్ అధికారులతో డీఈఓ సమావేశం కర్నూలు సిటీ: పదవ తరగతి స్పాట్ వాల్యుయేషన్ సోమవారం ప్రారంభం కానుంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గత నెల17వ తేదీన మొదలైన పరీక్షలు 30తో ముగిశాయి. ఈ క్రమంలో వెంటనే స్పాట్ వాల్యుయేషన్ మొదలెట్టి వీలైనంత తొందరగానే ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వం ఇప్పటీకే అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు ఆదేశాలు ఇచ్చింది. స్కూల్ విద్యార్థులకు సవరణాత్మకమైన బోధన జరుగుతోంది. ఇందుకు ఇబ్బందులు లేకుండా స్పాట్‌కు సిబ్బందిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆదే అంశంపై ఆదివారం డీఈఓ తాహెరా సుల్తానా తన ఛాంబర్లో స్పాట్ అధికారులతో సమావేశమయ్యారు. మూల్యాంకనానికి మొత్తం 1987 మందిని నియమించామని తెలిపారు. 19 మంది ఏసీఓలు, 236 మంది సీఈలు, 1651 మంది ఏఈలు, 336 మంది స్పెషల్ అసిస్టెంట్లు పని చేస్తారన్నారు. ముల్యాంకనంలో అవకతవకలు చోటు చేసుకోకుండా పగద్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు రెమ్యునరేషన్ ఇస్తామన్నారు. ఈనెల16వ తేదీ వరకు స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుందన్నారు. సమావేశంలో డీసీఈబీ సెక్రటరీ ఓంకార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా పదో తరగతి పరీక్షలు
-మాస్ కాపీయింగ్ నిరోధానికి పటిష్ట చర్యలు -డీఈఓ అబ్రహం మామిడికుదురు : జిల్లాలో పదో తరగతి పరీక్షలు పారదర్శకంగా జరుగుతున్నాయని డీఈఓ ఎస్.అబ్రహం తెలిపారు. ఆయన సోమవారం మామిడికుదురు, మొగలికుదురు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. మొగలికుదురు పరీక్షా కేంద్రంపై పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆ కేంద్రాన్ని స్వయంగా పరిశీలించానని, అక్కడ ఏవిధమైన మాస్ కాపీయింగ్ జరగడం లేదని చెప్పారు. నిరంతర సమగ్ర మూల్యాంకన వి«ధానం వల్ల విద్యార్థులు ఏ విధమైన ఇబ్బందులూ పడడం లేదన్నారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం పెరిగేందుకు పలు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ప్రత్యేక తరగతుల నిర్వహణ, వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చదివించామన్నారు. ఈ ఏడాది జిల్లాలో ఉత్తీర్ణత శాతం కూడా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇంత వరకు ముగ్గురు విద్యార్థులను డీబార్ చేశామని, ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డీఓ, ఆరుగురు ఇన్విజిలేటర్లపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. -
‘గురువులు లేని సర్కారు బడులు’
శ్రీకాకుళం: జిల్లాలోని సర్కారు బడుల్లో ఉపాధ్యాయులు లేకపోతే విద్యార్థులకు ఏ విధంగా విద్యాబోధన జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాశరావు ప్రశ్నించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాలని కలెక్ట ర్ లక్ష్మీనరసింహం పిలుపునివ్వడం అభినందనీయమేనన్నా రు. కానీ విద్యావ్యవస్థలో సమూల మార్పులు జరగాలన్నా రు. కొంతమంది ఉపాధ్యాయులు తప్పు చేసినపుడు ఆ ప్ర భావం విద్యావ్యవస్థపై పడుతుందన్నారు. కోటబొమ్మాళి మండలం సరియాపల్లి యూపీ స్కూల్లో పనిచేస్తున్న హెడ్మాస్టర్ ఆర్.రమేష్, ఉపాధ్యాయుడు చల్లా ప్రేమానంద్‌లు తమ విధులను సరిగా నిర్వహించడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. డీఈఓ ఆ స్కూల్‌కి వెళ్లి ఆకస్మిక తనిఖీ చేసే సమయంలో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూ శాయన్నారు. ఆ సమయంలో ప్రధానోపాధ్యాయుడు గైర్హాజ రీలో ఉన్నారని, ఎలాంటి సీఎల్‌గానీ, లీవ్‌లెటర్‌గానీ పెట్టలేదన్నారు. అలాగే ఆ పాఠశాలలో పనిచేస్తున్న చల్లా దేవా నం దం అనే ఉపాధ్యాయుడు కూడా విధులకు డుమ్మా కొడుతున్నట్లు తెలిసిందన్నారు. ప్రేమానందం అనే ఉపాధ్యాయుడు నెలకొకసారి వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోతుంటారని ఆ స్కూల్ పిల్లలు, తోటి ఉపాధ్యాయులే డీఈవోకు లిఖిత రూపంలో వాగ్మూలం కూడా ఇచ్చినట్లు పత్రికల్లో కూడా కథనా లు వచ్చాయన్నారు. చల్లా దేవానందం అనే ఉపాధ్యాయుడు కోటబొమ్మాళి మండలం కిష్టప్పాడులో పనిచేసేవాడని, డిప్యుటేషన్ ఈ స్కూల్‌కు వేయించుకున్నారన్నారు. ఫిబ్రవరి 25 వ తేదీ నుంచి ఆయన స్కూల్‌కు రాకుండా ఉండడంతో సంతకాలు కూడా చేయలేదన్నారు. చల్లా ప్రేమానందం మాజీ ఎం పీపీ బంధువు కావడంతోనే ఈ స్కూల్లో ఖాళీలు లేకపోయినప్పటికీ రాజకీయ పైరవీలు చేయించి ఎంఈవోతో కుమ్మక్కై పోస్టింగ్ కల్పించి డిప్యుటేషన్ పై పనిచేస్తున్నారని ఆరోపించారు. సరియాపల్లి ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు ప్రేమానందంలు కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు హాజరుకానప్పటికీ ప్రభుత్వం లక్షలాది రూపాయల జీతాలను ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. దీనికి బాధ్యులు హెచ్ఎం, ఎంఈవోలేనన్నారు. డీఈవో పరిశీలించి నివేదికను కలెక్టర్‌కు ఇచ్చారని, దీనిపై కలెక్టర్ కఠిన చర్యలు తీసుకుని విద్యావ్యవస్థను మెరుగుపరచాలన్నారు. సమావేశంలో పార్టీ నేతలు యజ్జల గురుమూర్తి, కోరాడ రమేష్, ఆర్ఆర్ మూర్తి, తంగుడు నాగేశ్వరరావు, గుడ్ల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
తప్పులు సరిదిద్దుకునే అవకాశం
అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి విద్యార్థులకు సంబంధించి హాల్ టికెట్లలో విద్యార్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ తదితర వాటిల్లో తప్పులను సరిదిద్దుకునేందకు చివరి అవకాశం కల్పించినట్లు డీఈఓ లక్ష్మీనారాయణ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. బోర్డు నుంచి వచ్చిన కంప్యూటర్ ఎన్ఆర్లో తప్పులు సరిచేసి సంబంధిత పాఠశాల హెచ్ఎం సంతకం చేయించి వాటిని ఈ నెల 28లోగా ఎస్. వరలక్ష్మి, డైరెక్టర్ ఆఫ్ ప్రభుత్వ పరీక్షలు, చాపెల్‌రోడ్డు, నాంపల్లి, హైదరాబాద్ చిరునామాకు పంపాలని సూచించారు. ఫొటోలు మార్పులు పడిన వారు డీఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
నేల‘రాత’లకు స్వస్తి
పకడ్బందీగా ‘పది’ పరీక్షలు అన్ని కేంద్రాల్లోనూ ఫర్నీచరు ఏర్పాటు అక్రమాలకు పాల్పడితే జైలుకే 25 యాక్ట్ పక్కాగా అమలు జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ ‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించనున్నాం.. ఇకపై నేల ‘రాత’లకు స్వస్తి పలకనున్నాం. ఈ ఏడాది విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించనున్నాం. ఫర్నీచరు సదుపాయంపై ప్రత్యేక ప్రాధాన్యత తీసుకున్నాం.. ఇప్పటికే విద్యాశాఖ కమిషనరు, జిల్లా కలెక్టర్, ఆర్జేడీ తదితర అధికారులు పలుమార్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని జిల్లా విద్యాశాఖాధికారి పగడాల లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క పరీక్ష కేంద్రంలోనూ విద్యార్థులు కింద కూర్చొని పరీక్ష రాయకూడదన్న లక్ష్యంతో ఏర్పాట్లు చేసినట్లు ఆయన ‘సాక్షి’ కి మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 193 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 49,555 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. సాక్షి : చాలా కేంద్రాల్లో ఫర్నీచర్ సమస్య ఉంది. ఈ సమస్యను ఎలా అధిగమిస్తారు? డీఈఓ : ఫర్నీచరు కొరత వాస్తవమే కొన్ని కేంద్రాల్లో ఫర్నీచర్ అసలే లేదు. అలాంటి కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల నుంచి సర్దుబాటు చేస్తున్నాం. పరీక్ష ప్రారంభమయ్యే నాటికి ఏ ఒక్క కేంద్రంలోనూ సమస్య ఉత్పన్నం కాదు. సాక్షి : దూర ప్రాంతాల్లో ఉన్న కేంద్రాలకు చేరుకోవాలంటే రవాణా సౌకర్యం సరిగా లేదు. విద్యార్థుల సమస్యలపై మీరేమంటారు? డీఈఓ : ఈ విషయంలో ఆర్టీసీ అధికారులకు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏ కేంద్రానికి ఏఏ గ్రామాల నుంచి విద్యార్థులు వస్తారనే వివరాలు ఆర్టీసీ అధికారులు తీసుకున్నారు. విద్యార్థులకు అనుకూలంగా ఆయా రూట్లలో బస్సులు నడుపుతారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాక్షి : సీఓలు, డీఓలు, ఇన్విజిలేషన్ డ్యూటీలు పూర్తయ్యాయా? డీఈఓ : చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులను నియమించాం. అవసరం కంటే కూడా పది శాతం అదనంగా నియమించాం. వివరాలను హైదరాబాద్‌కు పంపాం. ఇన్విజిలేటర్ల నియామకాలు పూర్తయ్యాయి. సెంటర్ కాపీలు, వ్యక్తిగత కాపీలు ఆయా ఎంఈఓలకు అందజేశాం. పరీక్ష ముందురోజు వారికి అందజేస్తారు. విధులకు నియమించిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా పని చేయాల్సిందే. నియామక ఉత్తర్వులను ఎట్టిపరిస్థితుల్లోనూ రద్దు చేయం. సాక్షి : మాస్ కాపీయింగ్, చూచిరాతను నియంత్రిస్తారా? డీఈఓ : ఈ విషయంలో ప్రభుత్వం ఈసారి చాలా సీరియస్‌గా ఉంది. పరీక్షల విధుల్లో ఉన్న ఏ స్థాయివారైనా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే జైలుకు పంపడం ఖాయం. ఇంతకాలమూ పరీక్షల విధుల్లో అలసత్వం ప్రదర్శించే వారిని సస్పెండ్ చేయడం.. లేదంటే పరీక్షల విధుల నుంచి తప్పించడం.. మహా అయితే ఇంక్రిమెంట్లలో కోత విధించడం వంటి చర్యలు ఉండేవి. ఈసారి అలాకాదు..1997 నాటి యాక్ట్ 25 సెక్షన్ 10లోని నిబంధనలను అమలు చేయనున్నాం. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదుతో పాటు ఆర్నెళ్ల నుంచి మూడేళ్ల వరకు జైలుశిక్ష, రూ.5 వేలు నుంచి రూ. లక్ష వరకు జరిమానా ఉంటుంది. సాక్షి : డీఈఓ స్థాయిలో తొలిసారి ‘పది’ పరీక్షలు నిర్వహిస్తున్నారు కదా? ఎలాంటి అనుభూతి ఉంది? డీఈఓ : డిప్యూటీ డీఈఓగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా అనేకమార్లు పదో తరగతి పరీక్షల నిర్వహణలో పాలుపంచుకున్నాను. ఆ అనుభవం చాలా ఉపయోగపడుతోంది. అందరి సహకారంతో ఎలాంటి ఇబ్బందీ లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చూస్తాననే నమ్మకం ఉంది. సాక్షి : గతేడాది జిల్లాలో మంచి ఫలితాలొచ్చాయి. ఈసారి ఎలా ఎలాంటి ఫలితాలు వస్తాయి? డీఈఓ : గతేడాదికంటే ఈసారి మెరుగైనా ఫలితాలు వస్తాయనే నమ్మకం ఉంది. ఎందుకంటే తొలిసారి నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానం అమలవుతోంది. దీనిపై విషయ నిపుణులు, ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు విస్త్రత అవగాహన కల్పించారు. అది చాలా ఉపయోగపడుతుందనే నమ్మకం ఉంది. -
పక్కాగా పది పరీక్షలు
మార్గదర్శకాలు విడుదల చేసిన డీఈవో నిడమర్రు: పదో తరగతి పరీక్షలకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈనెల 17 నుంచి పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలోని 246 పరీక్ష కేంద్రాల్లో. 46,682 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కాపీయింగ్‌కు బ్రేక్ పరీక్షల నిర్వహణ ఏపీ పబ్లిక్ పరీక్షల యాక్ట్1997, ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్‌కు లోబడి నిర్వహించేలా చర్యలు తీసుకున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికా ఆర్ఎస్ గంగాభవానీ తెలిపారు. అలానే చూచీరాత నిరోధక చట్టం1997ను సమర్థవంతంగా అమలు చేసేలా ఉత్తర్వులు జారీ చేశామన్నారు. టెన్త్ పరీక్షల్లో కాపీయింగ్‌కు పాల్పడినా, ప్రోత్సహించినా వారిని దోషులుగా గుర్తించి చర్యలు తీసుకోవాలని హైకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. పరీక్షల్లో విధులు నిర్వహించే సిబ్బంది అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుని వ్యవహరించాలని, లేకపోతే చట్టప్రకారం తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు. చీఫ్, డీవో చేయాల్సినవి పరీక్ష కేంద్రాన్ని ముందుగా సందర్శించి ఫర్నీచర్, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు, పరిశుభ్రత పరిశీలించాలి. తహసీల్దార్, ఎస్పీహెచ్లకు పరీక్షల విషయం తెలియజెప్పాలి. వారి ఫోన్ నంబర్లు తీసుకోవాలి. పరీక్షల నిర్వహణకు అన్ని ఫారాలు సిద్ధం చేసుకోవాలి. డిఫార్, ఓఎంఆర్ షీట్స్, పేపర్ సీల్, అంటెండెన్స్ షీట్స్ సరిపడా అందాయో లేదో చూసుకోవాలి. ట్రక్ పెట్టెలు, క్లాత్ బ్యాగ్స్ వంటి కంటిజెన్స్ సామగ్రి సిద్ధం చేసుకోవాలి. ఽఈనెల 16న పరీక్ష విధులు నిర్వహించే సిబ్బందితో సమావేశం నిర్వహించాలి. సిబ్బంది నుంచి వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరూ పరీక్ష రాయడం లేదని నో రిలేషన్ సర్టిఫికెట్స్ తీసుకోవాలి. సిబ్బందికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. బాలికలను చెక్ చేయడానికి మహిళా సిబ్బందిని ఏర్పాటుచేసుకోవాలి. పరీక్ష జరుగుతున్న రోజుల్లో ఇలా.. రోజూ ఉదయం 7.45 గంటలకు సెట్ కాన్ఫెరెన్స్‌కు హాజరుకావాలి. నిర్దేశించిన సమాయాని కన్నా ముందు సీఎస్, డీవో, ఇద్దరు సంతకాలతో పరీక్ష కట్టల సీల్ తెరవాలి. లాటరీ పద్ధతిలోనే ఇన్విజిలేటర్‌కు తరగతి గదులు కేటాయించాలి. ఇన్విజిలేటర్లకు సూచనలు ఇన్విజిలేటర్లు పరీక్షల ప్రారంభానికి ముందురోజున చీఫ్ సూపరింటెండెంట్ (సీఎస్) నిర్వహించు శిక్షణ సమావేశానికి విధిగా హాజరుకావాలి. ఫొటో గుర్తింపు కార్డు తీసుకోవాలి. రోజూ తప్పకుండా ఐడీ కార్డు ధరించాలి. పరీక్ష పేపర్ల కోడ్స్, సరైన కాంబినేషన్ గురించి విధిగా తెలుసుకోవాలి. పరీక్ష రోజు ఉదయం 8 గంటలకు కేంద్రం వద్దకు హాజరుకావాలి. 9 గంటలకు విద్యార్థులను పరీక్ష గదిలో కూర్చోబెట్టాలి. 10 గంటల తర్వాత విద్యార్థులను పరీక్షకు అనుమతించరాదు. ప్రతి విద్యార్థిని సోదా చేసి, ఎటుంవటి ఫర్బిడెన్ మెటీరియల్ లేదని నిర్ధారించాలి. విద్యార్థినులను మహిళా ఇన్విజిలేటర్లు మాత్రమే సోదా చేయాలి. పరీక్షలు జంబ్లింగ్ విధానంలో జరుగుతాయి. అందువల్ల సీఎస్ నిర్ధారించిన సీటింగ్ అరేంజ్‌మెంట్‌ను గాని, విద్యార్థులను గదులు మార్చడం గాని చేయరాదు. విద్యార్థులకు, ఫొటో, అన్ని వివరాలతో కూడిన హాల్‌టికెట్ అందిస్తారు. విద్యార్థిని హాల్ టికెట్, అటెండెన్స్ షీట్‌లోని ఫొటోతో పోల్చి నిర్ధారించుకోవాలి, అభ్యర్థిపై అనుమానం ఉంటే వెంటనే సీఎస్ దృష్టికి తీసుకురావాలి. అన్ని పరీక్షలు బార్ కోడింగ్ విధానంలో జరుగుతాయి. ఉదయం 8.45 గంటలకు ఓఎంఆర్ ప్రధాన/అదనపు సమాధాన పత్రాలు సీఎస్ నుంచి పొందాలి. ప్రధాన సమాధాన పత్రంలోని సూచనలను, ఓఎంఆర్ షీట్ వెసుక భాగంలో విద్యార్థులకు వివరించాలి. ఓఎంఆర్ షీట్ మినహా ఏ పేపర్‌పైనా కూడా హాల్‌టికెట్ నంబర్, పేరు రాయించకూడదు. ఓఎంఆర్ షీటు ఏదైనా కారణంతో పాడైతే, వెంటనే సీఎస్ దృష్టికి తీసుకువెళ్లి, నాన్ స్టాండర్డ్ ఓఎంఆర్ షీట్ పొందాలి. ఓఎంఆర్ షీట్‌పై ఉన్న బార్‌కోడ్‌పై రాయడం గాని, నలపడం గాని చేయకుండా విద్యార్థులను హెచ్చరించాలి. 9.25 గంటలలోపు ఇన్విజిలేటర్ అన్ని పనులు ముగించుకుని 9.30 గంటలకు కచ్చితంగా ప్రశ్నపత్రాలు ఇవ్వాలి. ప్రశ్నపత్రాలు తీసుకొన్న వెంటనే చాలినన్ని ఉన్నాయో/ ఆరోజుకు సంబంధించిన సబ్జెక్/ పేపర్‌కోడ్ / మీడియం సరిచూసుకోవాలి. పేపరు ఏమాత్రం తప్పుగా ఇచ్చినా సంబంధిత ఇన్విజిలేటర్‌పై తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. అన్ని ద్వితీయ భాష పేపర్లకు, అన్ని భాషేతర పేపర్లకు పార్ట్బి బిట్ పేపర్ పరీక్ష చివరి అరగంట ముందుగా ఇవ్వవలెను. మిగిలిన పేపర్లకు పార్టీఎ తోపాటే పార్ట్బి ఇవ్వాలి. ఇంగ్లిష్ మీడియం ఇంగ్లిష్ సబ్జెక్ట్‌కు పేపర్బి ఉండదు. గైర్హాజరైన విద్యార్థుల ఓఎంఆర్ షీట్‌ను ఎర్ర సిరా పెన్‌తో క్యాన్సిల్ చేస్తారు. పరీక్ష ముగిసాక సమాధాన పత్రాలు, అడిషనల్ షీట్స్ అన్ని సరిచూసుకున్నాకే విద్యార్థులను బయటకు పంపాలి. -
నేడు ‘పది’ పరీక్షల ఏర్పాట్లపై సమావేశం
అనంతపురం ఎడ్యుకేషన్ : ఈనెల 17 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై చర్చించేందుకు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక ఆర్ట్స్ కళాశాలలోని డ్రామా హాలులో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు డీఈఓ లక్ష్మీనారాయణ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. నియమించబడిన సీఎస్‌లు, డీఓలు అందరూ హాజరుకావాలన్నారు. -
సిలబస్ కాకుండా పరీక్షలు సరికాదు
డీఈఓకు బీఈడీ ఉపాధ్యాయ సంఘం వినతి అనంతపురం ఎడ్యుకేషన్ : సిలబస్ పూర్తి కాకుండా 6 – 9 తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించడం సరికాదని బీఈడీ ఉపాధ్యాయ సంఘం నాయకులు సోమవారం డీఈఓ లక్ష్మీనారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ 6 – 9 తరగతుల విద్యార్థులకు ఈనెల 14 నుంచి వార్షిక పరీక్షలు నిర్వహించడం సరికాదన్నారు. ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం ఈనెల చివరి వరకు సమయం ఉందన్నారు. అయినప్పటికీ సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు పెట్టాలని ఎలా నిర్ణయించారని ప్రశ్నించారు. దీనికితోడు పదో తరగతి పరీక్షలు కూడా అదే సమయంలో ఉన్నందున ఎక్కువమంది టీచర్లు డీఓ, సీఓ, ఇన్విజిలేటర్లుగా వెళతారన్నారు. ఈ పరిస్థితుల్లో 6 – 9 తరగతులకు పరీక్షలు పెట్టడానికి టీచర్ల కొరత ఉంటుందన్నారు. అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి పరీక్షలు పెట్టడం వల్ల ఎండ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. మరి పిల్లలు ఈ సమయంలో కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు ఎలా వస్తారో అధి కారులు ఆలోచించాలన్నారు. ఎండకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పూర్వకాలం నుంచీ ఒంటిపూట బడులు నడుపుతున్నారన్నారు. ఇలాంటి వాటిని పక్కనబెట్టి విద్యార్థులు ఇక్కట్లు పడేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పునరాలోచించాలని విజ్ఞప్తి చేశా రు. పదో తరగతి స్పాట్ వాల్యూయేష¯ŒSకు బోధన చేస్తున్న హెచ్ఎంలను మాత్రమే సీఎస్‌లుగా నియమించాని కోరారు. డీఈఓను కలిసిన వారిలో బీఈ డీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారా యణస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి శివశంకరయ్య, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ తదితరులున్నారు. -
1 నుంచి 9 తరగతులకు 7 నుంచి వార్షిక పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఒకటి నుంచి 9వ తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించేందుకు విద్యా శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. 7, 10, 13, 14, 15, 16 తేదీల్లో పరీక్షలను నిర్వహించేలా గురువారం డీఈవోలకు టైం టేబుల్‌తో కూడిన ఆదేశాలు జారీ చేసింది. జవాబు పత్రాల మూల్యాంకనం కూడా 7వ తేదీ నుంచే ప్రారంభించి 17లోగా పూర్తి చేయాలని, 18న జవాబు పత్రాలను విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు పంపించాలని పేర్కొంది. 7వ తేదీ నుంచి 19వ తేదీలోగా వాటిని రికార్డుల్లో నమోదు చేయాలని, 20న తల్లిదం డ్రులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చిం చాలని చెప్పింది. 21వ తేదీ నుంచి పై తరగతుల బోధనను ప్రారంభించాలని విద్యా శాఖ స్పష్టం చేసింది. -
దేశాభివృద్ధిలో శాస్త్రవేత్తల కృషి ఎనలేనిది
డీఈఓ తాహెరా సుల్తానా నంద్యాల: మనదేశాభివృద్ధిలో శాస్త్రవేత్తల కృషి ఎనలేనిదని డీఈఓ తాహెరా సుల్తానా అన్నారు. స్థానిక ఎన్జీఓ కాలనీలోని గురురాజ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో ఆదివారం సైన్స్‌డే ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆమెతో పాటు గురురాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ దస్తగిరి రెడ్డి శాస్త్రవేత్త సీవీ రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనం ముందున్నామని చెప్పారు. దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ చిన్నారులు బాల్యం నుంచే సైన్స్‌పై ఆసక్తి పెంచుకొని శాస్త్రవేత్తలు కావాలని కోరారు. భూగర్భ శాస్త్రవేత్త కేవీ రమణయ్య, రాయలసీమ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు రామయ్య, సెంథిల్ రాజు, డాక్టర్ మధుసూదనరావులను సన్మానించారు. అనంతరం సైన్స్‌పై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీల్లో రాణించిన చిన్నారులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ సుమతి, గురు రాఘవేంద్ర విద్యాసంస్థల కో డైరెక్టర్లు మౌలాలి రెడ్డి, షేక్షావలి రెడ్డి పాల్గొన్నారు. -
పరీక్షలయ్యాక బడికెళ్లాల్సిందే
నల్లజర్ల : వార్షిక పరీక్షలు పూర్తవ్వగానే వేసవి సెలవులు వచ్చేసేవి. ఇకపై ఆ పరిస్థితి లేదు. షెడ్యూల్ ప్రకారమే వేసవి సెలవులు ఇచ్చేందుకు నిర్ణయించినా.. పరీక్షల షెడ్యూల్ మాత్రం మారింది. మరోవైపు వేసవి సెలవులకు నెల రోజుల ముందుగానే విద్యార్థులకు పై తరగతిలో ప్రవేశం కల్పించి.. ఆ పాఠాలను బోధించనున్నారు. ఈ విధానం ఈ ఏడాది నుంచే అమల్లోకి వస్తోంది. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి జి.గంగాభవాని తెలిపారు. బుధవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. విద్యావిధానంలో కొత్త పద్ధతులు అమల్లోకి రానున్నాయని..ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో విడుదల కానున్నాయని చెప్పారు. విద్యార్థుల్లో అభ్యసన లోపాలను సరిచేసి నైపుణ్యాలకు మరింత మెరుగులు దిద్దే దిశగా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షల అనంతరం కూడా తరగతులు కొనసాగుతాయన్నారు. ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థులకు విద్యా సంవత్సరం చివరి నెల రోజుల్లో రెండో తరగతి పాఠ్యాంశాలు బోధిస్తామని, ఇలా 1నుంచి 9వ తరగతి విద్యార్థులందరికీ పై పాఠాల బోధన ఉంటుందని వివరించారు. దీనివల్ల విద్యార్థులు పై తరగతిలోకి వెళ్లేసరికి వారికి పాఠ్యాం శాలు కొట్టిన పిండిలా మారతాయన్నారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 22వ తేదీ నాటికి అన్ని పరీక్షలు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పారు. ఏప్రిల్ 23వ తేదీ పాఠశాలలకు చివరి పని దినమని, అప్పటివరకు దాదాపు నెల రోజులపాటు సంసిద్ధత తరగతులు నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు. ఈ సమయంలో తదుపరి తరగతులకు సన్నద్ధం చేస్తూ చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి సారించనున్నామన్నారు. సీబీఎస్ఈ విధానంలోనూ ఇదే పద్ధతి అమల్లోకి వస్తుందన్నారు. తొలిసారి సమగ్ర మూల్యాంకనం 10వ తరగతి వార్షిక పరీక్షల్లో తొలిసారి నిరంతర సమగ్ర మూల్యాంకనం చేపట్టేందుకు రంగం సిద్ధమైందని డీఈఓ చెప్పారు. 10వ తరగతి వార్షిక పరీక్షలలో అన్ని సబ్జెక్ట్‌లకు 80 మార్కులకే ప్రశ్నపత్రాలు ఉంటాయన్నారు. మిగిలిన 20 మార్కులకు విద్యార్థులు అంతకు ముందు రాసిన పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్నెల్ మార్కులు కలపనున్నట్టు చెప్పారు. వీటన్నింటిని ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తుండటం వల్ల ఎటువంటి అవకతవకలకు అవకాశం ఉండబోదన్నారు. టెన్త పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు జిల్లాలో ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు జరిగే అన్ని కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు డీఈఓ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 246 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని, కలెక్టర్ ఆదేశాల మేరకు అన్నిచోట్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. జిల్లాలో దాదాపు 60వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతారన్నారు. పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధులను చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. ఆమె వెంట కొయ్యలగూడెం డీవైఈవో తిరుమల దాసు ఉన్నారు. -
ఇన్చార్జ్ డీఈఓకే పూర్తి బాధ్యతలు?
– నేడు అధికారికంగా ఉత్తర్వులు వచ్చే అవకాశం కర్నూలు సిటీ: ఇన్చార్జ్ డీఈఓ తాహెరా సుల్తానాకే పూర్తి బాధ్యతలు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండగా.. 11 చోట్ల ఇన్చార్జ్ డీఈఓలు పనిచేస్తున్నారు. శాసన మండలి ఎన్నికల కోడ్ ఉండడంతో రెగ్యులర్ డీఈఓలు వచ్చేందుకు సుమారు రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. పదో తరగతి పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఇన్‌చార్జీలకే పూర్తి బాధ్యతలు ఇవ్వనున్నారు. -
నేడు ఇన్స్పైర్–2017పై అవగాహన
అనంతపురం ఎడ్యుకేషన్ : ఇన్స్పైర్–2017పై గురువారం అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 27లోగా ఇన్స్పైర్ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నామినేషన్ల ప్రక్రియపై అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఉదయం 10 గంటలకు గుత్తి డివిజన్, మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం డివిజన్ పరిధిలోని ఉపాధ్యాయులు హాజరుకావాలన్నారు. అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల నుంచి కంప్యూటర్ పరిజ్ఞానం కల్గిన ఒక్కో సైన్స్ ఉపాధ్యాయుడిని పంపాలని డీఈఓ ఆదేశించారు. -
ఇన్చార్జీ డీఈఓగా తాహెరా సుల్తానా
కర్నూలు సిటీ: డీఈఓగా ఇన్చార్జ్ బాధ్యతలను తాత్కాలికంగా డిప్యూటీ ఈఓ తహేరా సుల్తానాకు అప్పగిస్తూ విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ బీఎడ్ కాలేజీ ప్రిన్సిపల్‌గా పని చేస్తున్న కె.రవీంద్రనాథ్‌రెడ్డికి అనూహ్య పరిణామాల మధ్య 2015లో డీఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు చేపట్టి ఉపాధ్యాయ వర్గాల్లో రవీంద్రనాథ్‌రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కడ కూడా వివాదాలు లేకుండా ఏడాదికిపైగా పని చేసిన డీఈఓగా కూడా గుర్తింపు పొందినట్లు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. మరో 40 రోజుల్లో 10వ తరగతి పరీక్షలు జరుగనున్న సమయంలో డీఈఓకు జేడీగా పదోన్నతి వరించింది. దీంతో ఆయన ప్రభుత్వ బీఎడ్ కాలేజీ ప్రిన్సిపల్, డీఈఓ పూర్తి అదనపు బాధ్యతల నుంచి రీలివ్ అయ్యారు. ఈ క్రమంలో రెగ్యులర్ డీఈఓ వచ్చేంత వరకు ఈ రెండు స్థానాల ఇన్చార్జ్ బాధ్యతలను డిప్యూటీ ఈఓగా తాహెరా సుల్తానా తీసుకున్నారు. ఈ మేరకు ఆమె మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. పదోన్నతి వరిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలో కేవలం 2 జిల్లాలకు మాత్రమే రెగ్యులర్ డీఈఓలున్నారు. మిగిలిన 11 జిల్లాలకు ఇన్‌చార్జీలే పని చేస్తున్న క్రమంలో డిప్యూటీ ఈఓలకు పదోన్నతులు కల్పించే అవకాశం ఉంది. అదే జరిగితే మహిళా కోటాలో సీనియార్టీ పరంగా తహేరా సుల్తానాకు ముందు వరుసలో డీఈఓ పదవి వరించే అవకాశం ఉంది. అయితే డీఈఓగా కొత్త అధికారిని తెచ్చుకునే ప్రయత్నంలో కలెక్టర్ ఉన్నట్లు తెలిసింది. లేనిపక్షంలో జేడీ హోదాలో డీఈఓగా విద్యా సంవత్సరం చివరి వరకు రవీంద్రనాథ్‌రెడ్డిని పని చేయించుకునేందుకు ప్రభుత్వ నుంచి అనుమతి తెచ్చుకుంటానని చెబుతున్నట్లు సమాచారం. -
డీఈఓకు పదోన్నతి కల్పిస్తూ జీఓ జారీ
కర్నూలు(సిటీ): ప్రభుత్వ బీఈడీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా పని చేస్తూ, డీఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న కె.రవీంద్రనాథ్‌రెడ్డికి పదోన్నతి కల్పిస్తూ విద్యాశాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాసు జీఓ ఆర్టీ నెం.23 జారీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈయనకు ఒకేషనల్ విద్య జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ అమరావతికి బదిలీ చేశారు. డీఈఓ ఇన్చార్జి బాధ్యతలను ఇతరులకు అప్పగించేందుకు కలెక్టర్ సుముఖంగా లేకపోవడంతో జేడీగా బాధ్యతలు తీసుకున్నా పదో తరగతి పరీక్షలు ముగిసే వరకు డీఈఓగా రవీంద్రనాథ్‌రెడ్డినే కొనసాగించేందుకు కలెక్టర్ ప్రత్యేకంగా ప్రభుత్వ అనుమతి కోరనున్నట్లు తెలిసింది. -
పదిలో వంద శాతం ఫలితాలు సాధించాలి
–హెచ్ఎంలతో డీఈఓ రవీంద్రనాథరెడ్డి గూడూరు: పదోతరగతిలో వంద శాతం ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.రవీంద్రనా«ద్‌రెడ్డి వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో గూడూరు, సి.బెళగల్ మండలాల జెడ్పీ, మోడల్, కస్తూర్బా పాఠశాలల హెచ్ఎంలతో ఆయన సమావేశం నిర్వహించారు. పాఠశాలల వారీగా హెచ్ఎంతో పదోతరగతి విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను గ్రేడ్లుగా విభజించి తక్కువ గ్రేడ్ ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఫలితాలు తక్కువ వస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. సమావేశంలో విదా్యశాఖ డిప్యూటీ ఈఓ తాహెరాసుల్తాన, డీసీఈబీ ఓంకార్‌యాదవ్, ఇన్చార్జి ఎంఈఓ నాగభూపాల్నాయుడు పాల్గొన్నారు. -
‘పది’ ఉత్తీర్ణతపై దృష్టి సారించాలి
అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి ఉత్తీర్ణత శాతం పెంపుపై ›ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని డీఈఓ శామ్యూల్ అన్నారు. హెచ్ఎం అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2017 క్యాలెండర్‌ను బుధవారం సాయంత్రం ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో హెచ్ఎం అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశులు, జయరామిరెడ్డి, గౌరవాధ్యక్షుడు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పదిలో వందశాతం ఉత్తీర్ణతకు కృషి
– జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథరెడ్డి నంద్యాలరూరల్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథరెడ్డి తెలిపారు. శుక్రవారం కానాల మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని హైస్కూల్ కొట్టాల వద్ద ఉన్న శ్రీ పోశంపాపిరెడ్డి పూదోట సంస్కృతోన్నత పాఠశాలను డీఈఓ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక విద్యా విధానానికి అనుగుణంగా విదా్యర్థులకు బోధన చేస్తున్న పాఠశాల అధ్యక్షుడు జగదీశ్వరరెడ్డి, కరస్పాండెంట్ విజయశేఖర్రెడ్డిలను అభినందించారు. వరుసగా ఐదో సంవత్సరం కూడా పదవ తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు డీఈఓను సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ఏఓ రమణారెడ్డి, ప్రధానోపాధ్యాయుడు తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. -
ఒపెన్ స్కూల్లో చేరేందుకు మరో అవకాశం
కర్నూలు సిటీ: జిల్లాలోని ఒపెన్ స్కూళ్లలో ఎస్ఎస్సీ, ఇంటర్లో చేరేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు డీఈఓ కె.రవీంద్రనాథ్‌రెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26 నుంచి 28 వతేదీలలోపు డీఈఓ లాగిల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు 8008403639, 9640331168 నంబర్లను సంప్రదించాలని డీఈఓ తెలిపారు.. -
హెచ్ఎం, ఇద్దరు టీచర్లపై సస్పెన్షన్ వేటు
అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక భగత్‌సింగ్‌నగర్‌లోని ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవిచంద్రకుమార్, టీచర్లు స్వర్ణలత, శ్రీలక్ష్మిలను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈఓ ప్రకటించారు. వివరాల్లోకెళ్తే.. డీఈఓ శామ్యూల్ గురువారం ఉదయం 9:50 గంటలకు పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. డీఈఓ వెళ్లిన సమయానికి హెచ్ఎం, మరో టీచర్ మాత్రమే ఉన్నారు. వీరు కూడా తరగతి గదులో కాకుండా హెచ్ఎం గదిలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో పాఠశాలకు సంబంధం లేని ఒక ప్రైవేటు వ్యక్తి పిల్లలకు చదువు చెబుతున్నాడు. ఆ వ్యక్తి గురించి డీఈఓ ఆరా తీశారు. 10.10 గంటల దాకా డీఈఓ అక్కడే ఉన్నా టీచర్లు స్వర్ణలత, శ్రీలక్ష్మి బడికి రాలేదు. హాజరు పట్టికను పరిశీలించగా వారు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. స్కూల్లో మొత్తం నలుగురు టీచర్లు పనిచేస్తుండగా వంతులు వారీగా స్కూల్‌కు వస్తున్నట్లు కొందరు స్థానికులు డీఈఓకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై డీఈఓ తీవ్రంగా స్పందించారు. ప్రైవేటు వ్యక్తితో బోధన చేయిస్తున్నందుకు హెచ్ఎంను, అనుమతులు లేకుండా విధులకు గైర్హాజరైనందుకు టీచర్లపై చర్య తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. -
గుర్తింపు ఏకం.. బడులు అనేకం!
► ఒకే గుర్తింపుపై రెండు.. అంతకన్నా ఎక్కువ ప్రైవేటు పాఠశాలలు ► ప్రమాణాలు లేకున్నా అనుమతినిచ్చిన డీఈవో, సిబ్బంది ► హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రైవేటు స్కూళ్ల భాగోతం సాక్షి, హైదరాబాద్: ఒక పాఠశాలకు ఒక గుర్తింపు మాత్రమే ఇస్తారు. కానీ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో ఒకే గుర్తింపు పత్రంపై రెండు కంటే ఎక్కువ పాఠశాలలు దర్జాగా కొనసాగుతారుు. ఒక పేరుతో ప్రభుత్వ గుర్తింపు పొంది.. ఆదే గుర్తింపు పత్రంతో రెండు, అంతకంటే ఎక్కువ స్కూళ్లను వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహిస్తారు. ఇలా వేర్వేరు పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు చివరకు ప్రభుత్వం ఆమోదించిన పాఠశాల చిరునామాతో ధ్రువపత్రాలు జారీ చేస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రైవేటు ఉన్నత పాఠశాలల ఘనకార్యమిది. పట్టణ ప్రాంతాల్లో కొన్ని యాజమాన్యాలు ఇలా ఒకే అనుమతి పత్రంతో రెండుకుపైగా స్కూళ్లు నిర్వహిస్తూ నిబంధనలకు పాతరేస్తున్నాయి. ఆయా యాజమాన్యాలకు విద్యా శాఖ అధికారుల సహకారం అందుతుండటంతో వాటిపై చర్యలకు తావులేకుండా పోతోంది. ప్రస్తుతం ఈ మూడు జిల్లాల పరిధిలో 4,550 ప్రైవేటు స్కూళ్లు ఉండగా.. వీటిలో 1,866 ఉన్నత పాఠశాలలున్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నారుు. హైదరాబాద్ జిల్లాలో 972, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 894 హైస్కూళ్లు ఉన్నారుు. విద్యార్థుల వివరాలు ఇవ్వడంతో.. ప్రస్తుతం పదో తరగతి విద్యార్థుల వార్షిక పరీక్షలకు సంబంధించి ఫీజు స్వీకరణ ప్రక్రియ ముగిసింది. ఈ మేరకు ఆయా పాఠశాల యాజమాన్యాలు ఫీజు చెల్లించిన విద్యార్థుల ఎన్ఆర్ (నామినల్ రోల్స్)లను విద్యా శాఖకు సమర్పించాల్సి ఉంది. ఈ క్రమంలో పలు పాఠశాలల్లో నిబంధనలకు మించి విద్యార్థుల సంఖ్యను పేర్కొంటూ విద్యా శాఖ అధికారులకు ఎన్ఆర్లు సమర్పిస్తుండడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 60 మంది విద్యార్థులకు మించకూడదు సాధారణంగా ఒక పాఠశాలలో ఒక తరగతికి గరిష్టంగా 60 మంది విద్యార్థుల కు మించకూడదు. ఈ సంఖ్యను మించి తే ప్రతి సెక్షన్ (40 మంది విద్యార్థులు)కు ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. అయితే చాలా పాఠశాలలు ఈ నిబంధనలను పట్టించుకోకుండా విద్యార్థుల అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. ఒకే పేరుతో మరో ప్రాంతంలో పాఠశాల శాఖ (బ్రాంచ్)ను స్థాపించి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. రెండురోజుల కిందట హైదరాబాద్ జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో కొన్ని ప్రైవేటు పాఠశాలలు లెక్కకు మించి విద్యార్థుల సంఖ్యను చూపుతూ ఎన్ఆర్లు సమర్పించాయి. దీంతో విద్యార్థుల సంఖ్యపై అధికారులు ఆరా తీయగా.. గుర్తింపు లేకుండా స్కూళ్లు నిర్వహిస్తున్నట్లు తేలింది. కొన్ని పాఠశాల లు కనీస ప్రమాణాలు లేకున్నా.. డీఈఓ కార్యాలయంలోని సిబ్బందితో కుమ్మక్కై దర్జాగా అనుమతులు పొందినట్లు స్పష్టమైంది. అక్రమ అనుమతులు, గుర్తింపు లేకుండా కొనసాగుతున్న పాఠశాలలపై రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంలోని ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు అందాయి. దీంతో జిల్లాల అధికారుల నుంచి సమాచారం తెప్పించుకునేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. వారిచ్చే సమాచారం ఆధారంగా విజిలెన్స విభాగంతో తనిఖీలు చేపట్టనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. -
ఈ నెల 15, 16 తేదీల్లో సైన్స్ ఎగ్జిబిషన్
కర్నూలు సిటీ: జిల్లా స్థాయి సైన్స్ మ్యాథమాటిక్స్, ఎన్విరాన్మెంటల్ ఎగ్జిబిషన్ ప్రదర్శనలు ఈనెల15, 16 తేదీల్లో నిర్వహించనున్నట్లు డీఈఓ కె.రవీంద్రనాథ్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ ప్రదర్శనలు దిన్నెదేవరపాడు వద్దనున్న కట్టమంచి జనార్ధన్‌రెడ్డి హైస్కూల్ నందు నిర్వహించనున్నామని, జిల్లాలోని అన్ని యాజమాన్యాల కింద ఉన్న స్కూళ్ల హెచ్ఎంలు వారి స్కూళ్లు కచ్చితంగా పాల్గొనేలా చూడాలని ఆయన పేర్కొన్నారు. -
ప్రయోగాత్మక విద్యతో మంచి భవిష్యత్
– సహజ వనరులను కాపాడుదాం – డబ్బు కంటే ప్రకృతి సంపద కీలకం – 24వ జిల్లా స్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌లో డీఈఓ కర్నూలు సిటీ: ప్రయోగాత్మక విద్యతో మంచి భవిష్యత్ సొంతమవుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఏ క్యాంపులోని మాంటిస్సోరి స్కూల్లో 24వ జిల్లా స్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రదర్శనలను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి ముఖ్య అతిధిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఢిల్లీలో వాతావరణంలో కార్బైన్ డయాక్సైడ్ శాతం పెరిగి పొగమంచు తీవ్రమై స్కూళ్లకు కొద్ది రోజులు సెలవులు ఇచ్చారన్నారు. ప్రతి ఒక్కరు భవిష్యత్తు తరాలకు ఆస్తుల కన్నా మెరుగైన సహజ వనరులను, వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఐఐటీ, నీట్, ట్రిపుల్ఐటీ సీట్లు 3100 మందికి వచ్చాయన్నారు. దేశంలోని 29 రాష్ట్రాలకు చెందిన వారికి రాని సీట్లు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు సీట్లు దక్కడం ప్రతిభకు నిదర్శనమన్నారు. అయితే సీట్లు అయితే సాధిస్తున్నారని, కానీ పరిశోధన చదువులకు మాత్రం చాలా తక్కువ మంది ఎంపిక అవుతున్నారన్నారు. ఇందుకు విద్యార్థి దశ నుంచే పాఠ్యాంశాలను నిజ జీవితంతో సంబంధం ఉండేటట్లు ప్రయోగాల ద్వారా అభ్యసిస్తేనే రీసెర్చ్ స్డడీస్కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థుల ప్రదర్శనలలో 10 జిల్లా స్థాయిలో ఎంపిక చేశారు. వీరు వచ్చే నెల 3,4 తేదీలో్ల విజయవాడలో నిర్వహించే రాష్థ్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో మాంటిస్సోరి విద్యా సంస్థల అధినేత డాక్టర్ రాజశేఖర్, అబ్జర్వరర్స్ డీవీఎస్ నాయుడు, మురళీకృష్ణ, సైన్స్ కో–ఆర్డినేటర్లు కేవీ సుబ్బారెడ్డి, రంగమ్మ తదితరులు పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా ప్రభుత్వ పురుషుల, కేవీఆర్ డిగ్రీ కాలేజీ, సిల్వర్ జూబ్లీ కాలేజీలకు చెందిన అధ్యాపకులు వ్యవహారించారు. రాష్ట్ర స్థాయికి 10 ప్రాజెక్టులు ఎంపిక జిల్లా స్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌కు జిల్లాలోని నలుమూలల నుంచి మొత్తం 174 ప్రాజెక్టులు వచ్చాయి. వీటిలో 10 ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయి ప్రదర్శనలకు ఎంపిక చేశారు. ఎంపికైనా వారు.. – బీఎస్. పరహానా, జెడ్పీ హైస్కూల్, ఆత్మకూరు – బి.సౌమ్య, సిస్టర్ స్టాన్సిలా స్కూల్ కర్నూలు – ఉషాశ్రీ, గుడ్ షెప్పర్డ్ హైస్కూల్, కర్నూలు – ఎస్.బాలయ్య, జెడ్పీ హైస్కూల్, బనగానపల్లె – సి.నరేష్, నెహ్రూ హైస్కూల్, బనగానపల్లె – జె. చైతన్య నాయుడు, కట్టమంచి రామలింగారెడ్డి హైస్కూల్, కర్నూలు – ఏ.అనన్య రెడ్డి, మాంటిస్సోరి, ఏ క్యాంపు, కర్నూలు – ఏ.నందిని, కస్తూర్బాగాంధీ విద్యాలయ, సంజామల – బీవీ. సుమంత్ కూమార్ రెడ్డి, గురురాజా కాన్సెప్ట్ స్కూల్, నంద్యాల – పీవీ.సాల్మా, ఇండస్ హైస్కూల్, కర్నూలు -
వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
–డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి పాములపాడు: 10వ తరగతిలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి సూచించారు. గురువారం స్థానిక ఏఎన్ఆర్ జిల్లా పరిషత్ హైస్కూలు, తుమ్మలూరు జెడ్పీ హైస్కూలును తనిఖీ చేశారు. విద్యార్థుల చేత పాఠాలు చదివించారు. ఓ విద్యార్థిని తెలుగు చదవకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల రోజుల తరువాత మళ్లీ వస్తానని, పిల్లలు చదవకపోతే చర్యలు తప్పవని ఉపాధ్యాయులను హెచ్చరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రతి వారం మ«ధ్యాహ్న భోజనంలో 3 గుడ్లు ఇవ్వాలన్నారు. ఇందుకు బిల్లులు సైతం పెంచినట్లు తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో స్టడీ అవర్స్ నిర్వహించాలన్నారు. మార్చి 7నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. విద్యార్థుల ప్రోగ్రెస్ పెంచేందుకు çప్రతి మండలం నుంచి తెలుగు, ఆంగ్లమాధ్యమాల్లో ప్రావీణ్యులైన ఉపాధ్యాయులను సబ్జెక్టుల వారిగా 7గురిని ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. వీరి పర్యవేక్షణలో విద్యార్థులను తీర్చి దిద్ది అధిక చి మార్కులతో ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లాలో 279 సక్సెస్ స్కూళ్లు, 35 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయన్నారు. విద్యార్థి తల్లితండ్రులు కోరితే ఆ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన వెంట డిప్యూటీ ఈఓ సుమతి, ఎంఈఓ బాలాజీనాయక్, హెచ్ఎం పుల్లారెడ్డి ఉన్నారు. -
డిప్యూటీఈవోల బాధ్యతలు ఇక డీఈవోలకే!
సాక్షి, హైదరాబాద్: డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (డిప్యూటీఈవో)లు నిర్వహించిన బాధ్యతలను ఇకపై డీఈవోలే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఇప్పటివరకు డిప్యూటీఈవోలుగా ఉన్న వారంతా ఇన్‌ఛార్జి డీఈవోలు అయిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఖాళీగా ఉన్న డిప్యూటీఈవో పోస్టులను విద్యాశాఖ భర్తీ చేయడం ఆపేసింది. దీంతో డిప్యూటీఈవోలు నిర్వర్తించాల్సిన బాధ్యతలు నిర్వర్తించేవారు లేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీఈవోల బాధ్యతలను ఇకపై డీఈవోలే చూడాలని విద్యాశాఖ ఆదేశించింది. మరోవైపు కొత్త మండలాల్లో ఎంఈవోల బాధ్యతలు కూడా వాటి పరిసర మండలాలకు (పాత మండలాలకు) చెందిన ఎంఈవోలకు అప్పగించాలని డీఈవోలను ఆదేశించినట్లు సమాచారం. -
మంచి ఫలితాల సాధనకు కృషి
కడప ఎడ్యుకేషన్: వచ్చే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి ఫలితాలు తీసుకువచ్చేందుకు ప్రతి ప్రధానోపాధ్యాయుడు కృషి చేయాలని డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి సూచించారు. ప్రతి పాఠశాల నుంచి పదికి పది ఒకరికైనా రావాలని తెలిపారు. కడపలోని డీసీఈబీలో మంగళవారం నిర్వహించిన కడప డివిజన్ ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశంలో డీఈఓ మాట్లాడారు.ప్రభుత్వ పరీక్షలకు సంబంధించి డీప్యూటీ ఈఓ ఉత్తర్వులను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. పిల్లలందరికీ వారం వారం పరీక్షలను నిర్వహించాలని ఆదేశించారు. డీసీఈబీ వారు ఇచ్చిన మెటీరియల్‌ను పిల్లలకు అందజేయాలన్నారు. చదువుతోపాటు పిల్లలను క్రీడల్లో కూడా ప్రోత్సహించాలన్నారు. త్వరలో కడపలో రాష్ట్ర ఇన్‌స్పైర్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు పిల్లలను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఈఓ ప్రసన్నాంజనేయులు, రంగారెడ్డి, ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, డీసీఈబీ సెక్రటరీ నారాయణరెడ్డి హెచ్ఎం సంఘం జిల్లా అ««ధ్యక్షుడు రామసుబ్బరాజు, ప్రధాన కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి, కడప ఎంఈఓ నారాయణ, కడప నగరపాలక విద్యాధికారి సుబ్బారెడ్డి, ఆర్‌ఐపీఈ భానుమూర్తిరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీ వెళ్లిన డీఈఓ
కర్నూలు సిటీ: ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు జాతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు కేంద్ర మానవ వనరులల శాఖ ఆధ్వర్యంలలో వర్క్‌షాపు నిర్వహించనున్నారు. దీనికి ఒక్కో రాష్ట్రం నుంచి ఒక డీఈఓ, ఒక డిప్యూటీ ఈఓ హాజరుకావాలి. ఏపీ నుంచి కర్నూలు జిల్లా విద్యాధికారి వెళ్లారు. తిరిగి ఈ నెల 12వ తేదీ ఈయన జిల్లాకు రానున్నారు. -
హెచ్ఎం అకౌంట్ టెస్ట్‌కు దరఖాస్తుల ఆహ్వానం
ఏలూరు సిటీ : ప్రధానోపాధ్యాయుల అకౌంట్ టెస్ట్ రాసేందుకు దరఖాస్తులు సమర్పించాలని డీఈవో డి.మధుసూదనరావు మంగళవారం తెలిపారు. పరీక్ష ఫీజు అపరా«ద రుసుం లేకుండా నవంబర్ 7వ తేదీలోగా రూ.150 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రూ.60 అపరాధ రుసుంతో 14వతేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. పరీక్ష డిసెంబర్ 30, 31 తేదీల్లో ఉదయం 11.30 గంటల నుంచి 2.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్ష రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్టణం, కాకినాడ, గుంటూరు, వైఎస్సార్ కడప కేంద్రాల్లో నిర్వహిస్తారని తెలిపారు. -
ఎస్జీఎఫ్ కబడ్డీ జట్ల ఎంపిక
కడప స్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో అండర్–14, అండర్–17 బాలబాలికల విభాగాల్లో జిల్లాస్థాయి కబడ్డీ ఎంపికలు నిర్వహించారు. కడప నగరంలోని గాంధీనగర్ నగరపాలకోన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ ఎంపికలకు డీఈఓ బి. ప్రతాప్‌రెడ్డి విచ్చేసి క్రీడాకారులను పరిచయం చేసుకుని ఎంపికలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో చక్కటి ఆటతీరును కనబరిచి విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఆర్‌ఐపీఈ భానుమూర్తిరాజు, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎల్.ఎ. సునీల్ మాట్లాడుతూ జిల్లా జట్టుకు ఎంపికైన అండర్–14 క్రీడాకారులు కర్నూలులో, అండర్–17 విభాగం క్రీడాకారులు విజయనగరంలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సత్యసుజాతమ్మ, సుబ్బానాయుడు, వ్యాయామ ఉపాధ్యాయులు శివశంకర్‌రెడ్డి, వి. కేశవ, సంపత్‌కుమార్, నాగార్జున, రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు. అండర్–14 బాలుర జట్టు : పి. సతీష్‌కుమార్, పి.నాగరాజు, టి.మురళీకృష్ణ, ఎం.రంజింత్కుమార్, ఎం.వేణు, వి.నరేన్యాదవ్, డి.సుదర్శన్‌రెడ్డి, మధుకల్యాణ్, మహమ్మద్సలీం, మురళీమోహన్, చంద్రశేఖర్, రామాంజినేయులు. స్టాండ్‌బై : ఎస్.కె. సలీం, ఎం. శివకృష్ణ, కె.హరినాథ్, వి.వంశీ, ఎస్.మాబూహుస్సేన్. అండర్–14 బాలికల జట్టు : ఎం. సుకుమారి, జె.నాగసుధామణి, ఎం.శిల్ప, కె.సుస్మిత, ఎస్.మహబూబ్‌చాన్, సి. స్పందన, కె.సౌజన్య, ఎస్.నాగజ్యోతి, ఎస్.పల్లవి, ఎం. వెంకటనందిని, ఐ. కీర్తి, ఎ.పుష్పలత. స్టాండ్‌బై : ఎం. ప్రగతి, కె.శ్రీదేవి, ఎస్.దీప్తి, డి.మీనాక్షి, ఎల్.అపర్ణ. అండర్–17 బాలుర జట్టు : ఆర్. వెంకటేష్‌నాయక్, డి. శ్రీనివాసులు, కె.ప్రసన్న, కె.సురేంద్ర, ఎం.కిరణ్‌కుమార్, జి.సుధీర్‌కుమార్‌రెడ్డి, టి.చరణ్‌కుమార్, ఆర్.గోవర్ధన్‌రెడ్డి, ఎం.నందకుమార్, కె.దేవారెడ్డి, డి.విష్ణువర్ధన్, డి.కల్యాణ్యాదవ్. స్టాండ్‌బై : వై. రాధాకృష్ణారెడ్డి, ఎస్.శివప్రసాద్, జె.నవీన్‌కుమార్, పి. వినోద్‌కుమార్, పి.మహబూబ్‌బాషా. అండర్–17 బాలికల జట్టు : ఎస్.పూజ, వి.లక్ష్మిదేవి, పి.లక్ష్మిప్రసన్న, జి.అప్సర, కె.వెంకటపద్మజ, పి.చంద్రిక, వి.లక్ష్మిప్రసన్న, ఎం.ధనలక్ష్మి, డి.చిట్టెమ్మ, పి.మైనా, పి.సుభాషిణి, ఎ.సైదా. స్టాండ్‌బై : సి.హరిత, ఇ.అశ్విని, ఎన్.అజయ్‌కుమారి, డి. దీపిక. -
డిజిటల్ విద్యా విధానానికి నాంది
–జిల్లాలో 90పాఠశాలల్లో త్వరలో ప్రారంభం. –డీ.ఈ.ఓ మధుసూధనరావు. నల్లజర్ల: మారుతున్న విధ్యావిధానానికి అనుగుణంగా ప్రభుత్వం విద్యారంగంలో సాంకేతికతను జోడించి విద్యార్ధులను ఆకట్టుకునే రీతిలో నూతన బోధనా విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూధనరావు వెల్లడించారు.శుక్రవారం ఆయన సాక్షితో మాట్లాడారు.జిల్లా వ్యాప్తంగా 90 పాఠశాలల్లో ఈవిధానం అమల్లోకి తీసుకువచ్చామని ఈనెల 15 నుండి ప్రారంభం కావాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్టు ఆయన వివరించారు.ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈసిస్టమ్ అమర్చడం జరిగిందన్నారు.నూతన విద్యా విధానంలో 6నుండి 10తరగతుల వరకు అన్ని పాఠ్యాంశాలకు సంబంధించి 500 జీబీ సామర్ధ్యంతో లోడ్ చేసినట్టు చెప్పారు. డిజిటల్ తరగతుల వల్ల విద్యార్ధులకు అవగాహన,ఏకాగ్రత,జ్ణాపక శక్తి పెరుగుతుందన్నారు.జిల్లాలోని మిగిలిన పాఠశాలల్లో ఈవిద్యా విధానం ప్రవేశపెట్టడానికి సన్నాహలు జరుగుతున్నాయన్నారు. –కొత్త విధానానికి ఆహ్వనం. స్మార్ట్ తగరతి గదుల ఏర్పాటు వల్ల కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ నూతన సాంకేతిక పరిజ్ణా అందించి ఆధునిక బోధనా పద్ధతుల్లో విద్యార్ధులకు పాఠాలు బోధించే అవకాశం కల్గుతుంది.డిజిటల్ విధానానికి స్వాగతం పలుకుతున్నాం.ప్రాధమిక స్ధాయి నుంచే ఈవిధానం ప్రవేశపెడితే విద్యా ప్రమాణాలు పెరుగడుతాయి.పోటీ పరీక్షలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు ధీటుగా ఎదుర్కొని విజయాలు సాధిస్తారు. నెక్కలపూడి ప్రతాప్.పాధ్యాయుడు.నల్లజర్ల జడ్పీహైస్కూలు. -
నేడు రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు ప్రారంభం
కల్లూరు : జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అండర్ 14 బాల బాలికల రాష్ట్ర స్థాయి హాకీ పోటీలు నగర శివారులోని ఇండస్ స్కూల్ ఆవరణలో ప్రారంభమవుతున్నాయని ఫెడరేషన్ కార్యదర్శి పవన్‌కుమార్ గురువారం తెలిపారు. డీఈఓ రవీంద్రనాథ్ రెడ్డి శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. జట్టు క్రీడాకారులను అభినందించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని 13 జిల్లాల క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. అనంతరం క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ ప్రతినిధి నరసయ్య, సంఘం కార్యదర్శి సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త జిల్లాల్లో విధుల్లో చేరిన డీఈవోలు
అధికారుల జాబితాలో 19 మంది స్థానాల మార్పు సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల్లో విద్యాశాఖ అధికారులుగా (డీఈవో) నియమితులైన వారంతా విధుల్లో చేరారు. ఈ జిల్లాలకు గాను డీఈవోలుగా విద్యాశాఖ అధికారులు తొలుత రూపొందించిన జాబితాలోని 19 మంది అధికారుల స్థానాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మార్చేశారు. మార్పు చేసిన జాబితాలోని అధికారులకు ఆర్డర్లు ఇవ్వడంతో వారంతా మంగళవారం విజయదశమి రోజున విధుల్లో చేరారు. ‘ఆరోపణలు ఉన్న వారికి అందలం’ శీర్షికన ఈనెల 10వ తేదీన ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. వెనువెంటనే విద్యాశాఖ అధికారులను పిలిపించుకుని జాబితాలో మార్పులు చేశారు. అవినీతి, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు మొదటి జాబితాలో హైదరాబాద్, రంగారెడ్డి వంటి కీలకమైన జిల్లాలను కేటాయించగా, కడియం శ్రీహరి వారికి చెక్ పెట్టి, మార్పులు చేశారు. నల్లగొండ మినహా ఇతర పాత జిల్లాల్లో డీఈవోలుగా పని చేస్తున్న అధికారులను మార్చేశారు. కొత్తగా నియమితులైన డీఈవోలకు, ఆర్జేడీలకు ఈ నెల 15,16వ తేదీల్లో అవగాహన తరగతులను నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ తెలిపారు. మార్పుల ప్రకారం కొత్త జిల్లాల్లో డీఈవోలుగా విధుల్లో చేరిన వారు వీరే.. ఆదిలాబాద్: కె.లింగయ్య (నిజామాబాద్ డీఈవో), నిర్మల్: టి.ప్రణీత (ఏడీ ఆదిలాబాద్), మంచిర్యాల: రవికాంత్‌రావు (ఎస్సీఈఆర్టీ లెక్చరర్), కొమురంభీం (ఆసిఫాబాద్): అబ్దుల్ రఫీఖ్ (ఏడీ నిజామాబాద్), కరీంనగర్: పి.రాజీవ్ (వరంగల్ డీఈవో), జగిత్యాల: వెంకటేశ్వర్లు (హైదరాబాద్ డిప్యూటీఈవో), రాజన్న (సిరిసిల్ల): రాధాకిషన్ (సీటీఈ వరంగల్ లెక్చరర్), పెద్దపల్లి: వెంకటేశ్వర్రావు (ఏడీ కరీంనగర్), వరంగల్ అర్బన్: ఎస్.శ్రీనివాసాచారి (కరీంనగర్ డీఈవో), వరంగల్ రూరల్: నారాయణరెడ్డి (ఎస్సీఈఆర్టీ లెక్చరర్), మహబూబాబాద్: డి.వాసంతి (డిప్యూటీఈవో వరంగల్), జనగాం: ఎస్. యాదయ్య (ఏడీ వరంగల్), జయశంకర్ (భూపాలపల్లి): సహదేవుడు (వరంగల్ సీటీఈ ప్రిన్సిపల్), ఖమ్మం: విజయలక్ష్మీబాయి (మహబూబ్‌నగర్ డీఈవో), భద్రాద్రి (కొత్తగూడెం): హయగ్రీవాచారి (హైదరాబాద్ ఆర్జేడీ ఆఫీస్ ఏడీ), నల్లగొండ: వై.చంద్రమోహన్ (నల్లగొండ డీఈవో), సూర్యాపేట్: బీవీ నర్సమ్మ (ఖమ్మం డిప్యూటీఈవో), యాదాద్రి: రోహిణి (డిప్యూటీఈవో రంగారెడ్డి.), నిజామాబాద్: ఎన్.రాజేశ్ (ఖమ్మం డీఈవో), కామారెడ్డి: మదన్మోహన్ (డిప్యూటీఈవో భువనగిరి), మహబూబ్‌నగర్: సోమిరెడ్డి (హైదరాబాద్ డీఈవో), నాగర్‌కర్నూల్: జనార్దన్‌రావు (ఏడీ మహబూబ్‌నగర్), వనపర్తి: సుశీంద్రరావు (డిప్యూటీఈవో హైదరాబాద్), జోగుళాంబ (గద్వాల): పి.వేణుగోపాల్ (సీటీఈ వరంగల్ లెక్చరర్), మెదక్: రేణుకాదేవీ (డిప్యూటీఈవో వరంగల్), సిద్ధిపేట్: కృష్ణారెడ్డి (ఏడీ రంగారెడ్డి), సంగారెడ్డి: చంద్రకళ (డిప్యూటీఈవో రంగారెడ్డి), హైదరాబాద్: జి.రమేష్ (రంగారెడ్డి డీఈవో), రంగారెడ్డి: సత్యనారాయణరెడ్డి (ఆదిలాబాద్ డీఈవో), మేడ్చల్: ఉషారాణి (డిప్యూటీఈవో రంగారెడ్డి), వికారాబాద్: దీపిక (ఎస్సీఈఆర్టీ లెక్చరర్). ∙బ్రాకెట్లో ఉన్నది పాత స్థానం -
ఆరోపణలు ఉన్న అధికారులకు చెక్!
డీఈవో జాబితాల్లో మార్పులు చేసిన డిప్యూటీ సీఎం కడియం సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారుల (డీఈవో) జాబితాను సోమవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుత్వం ఖరారు చేసింది. అవినీతి ఆరోపణలు ఉన్న అధికారులను కీలకమైన జిల్లాల్లో డీఈవోలుగా నియమించేందుకు విద్యాశాఖ ప్రతిపాదించిన జాబితాను ఊటంకిస్తూ సోమవారం ‘ఆరోపణలు ఉన్న వారికి అందలం!’ శీర్షికన సాక్షి ప్రచురించిన కథనంపై కడియం శ్రీహరి స్పందించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కీలకమైన జిల్లాల్లో డీఈవోలుగా నియమించేందుకు ఎలా ప్రతిపాదనలు పంపించారని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విద్యాశాఖ పంపిన జాబితాలోని జిల్లాల కేటాయింపులకు ఆయన మార్పులు చేశారు. ఆరోపణలు ఉన్న అధికారులకు చెక్ పెడుతూ తాజా జాబితాను రూపొందించి ఆమోదించారు. అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. -
ప్రతిభా పురస్కారాలకు 306 మంది ఎంపిక
కడప ఎడ్యుకేషన్: పదవ తరగతి మార్చి 2016లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మండలానికి 6 మంది చొప్పున 306 మందిని ప్రతిభా పురస్కారాలకు ప్రభుత్వం ఎంపిక చేసినట్లు డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి తెలిపారు. సంబంధిత విద్యార్థులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మానవ వనరుల అభివద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుల చేతుల మీదుగా ఈనెల 15వ తేదీ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్లో అందజే యనున్నారు. ప్రతిభా పురస్కారాల జాబితాలో పేర్లు ఉన్న విద్యార్థులందరూ తల్లి లేదా తండ్రి లేదా సంరక్షుడితో హాజరుకావాలని సూచించారు. ప్రతిభా పురస్కారం కింద ఒక మెడల్, ధ్రువీకరణ పత్రంలోపాటు 20 వేల నగదు బహుమతిని విదార్థుల బ్యాంకు ఖాతాలో జమచేయనున్నట్లు తెలిపారు. -
పదోన్నతులు త్వరగా కేటాయించాలి
డీఈఓకు వైఎస్సార్‌టీఎఫ్ వినతి ఒంగోలు: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీచేయాలని వైఎస్సార్‌టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.జాలిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తిచేశారు. పదోన్నతులు కల్పించే సమయంలో అక్టోబరు 2016 మాసాంతానికి ఖాళీ అయ్యే స్థానాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పదోన్నతుల కారణంగా ఖాళీ అయ్యే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను డీఈవో పూల్‌లో ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఇవ్వాలని పేర్కొన్నారు. గత ఏడాది విలీనం జరిగిన పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్‌టీచర్లు ఇన్ఫర్మేషన్ డేటాలలో జాయినింగ్ తేదీని రకరకాలుగా నమోదుచేశారన్నారు. జిల్లా మొత్తం ఒకే తేదీ ఉండేలా చర్యలు చేపట్టకపోతే రాబోవు బదిలీల్లో ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని విజ్ఞప్తిచేశారు. డీఈవోను కలిసిన వారిలో జిల్లా గౌరవ అధ్యక్షులు డీసీహెచ్.మాలకొండయ్య, ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, బొజ్జా సురేష్‌లు ఉన్నారు. -
విద్యార్థుల వివరాలను పక్కాగా
నిజామాబాద్‌అర్బన్ : పాఠశాలల్లోని విద్యార్థుల వివరాలను పక్కాగా నమోదు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి లింగయ్య సూచించారు. జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో శుక్రవారం యూ డైస్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థుల వివరాలను పాఠశాలలు, తరగతుల వారీగా నమోదు చేయాలన్నారు. విద్యార్థులకు సంబంధించి 38 అంశాలను పకడ్బందీగా నమోదు చేసి కంప్యూటరీకరణ చేయాలని సూచించారు. యూ డైస్‌ను పూర్తి స్థాయిలో నిర్వహించాలని సీఆర్పీలకు వివరించారు. ప్రతి విద్యార్థి వివరాలు, ఆధార్‌కార్డు నంబర్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకునే విధానం ఉంటుందన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన సీఆర్పీలు, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లకు డీఈవో ప్రశంసపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఆర్వీఎం పీవో శ్రీనివాస్ సీఆర్పీలు ఎం.ఎస్. కో–ఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
15,16 తేదీల్లో ఇన్స్పైర్ ఎగ్జిబిషన్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి కర్నూలు, ఆదోని డివిజన్ల విద్యార్థులకు ఆక్టోబర్ 15,16 తేదీల్లో ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, డీవైఈఓలు సమన్వయంతో విద్యార్థులు ఎగ్జిబిట్లను తయారు చేసుకోవడానికి సహకారం అందించాలన్నారు. -
డీఈఓ ఆఫీస్, ఎస్ఎస్ఏ ఉద్యోగుల విభజన
కలిపేసి సీనియార్టీ ప్రాతిపదికన కేటాయింపు పలువురు ఉద్యోగుల ఆందోళన విద్యారణ్యపురి : హన్మకొండలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఉద్యోగులు, సర్వశిక్షాభియాన్(ఎస్ఎస్ఏ) జిల్లా ప్రాజెక్టు ఉద్యోగులను కలిపి సీనియారిటీ ప్రాతిపదికన నాలు గు జిల్లాలకు కేటాయించారు. దీంతో కొంతమంది ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. డీఈఓ కార్యాలయం, ఎస్ఎస్ఏలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లను ఈనెల 26న రాత్రి డీఈఓ పీ.రాజీవ్ తన చాంబర్లోకి పిలిచి సీనియార్టీ ప్రతిపదికన పిలిచి జిల్లాలకు కేటాయించారు. అంతకుముందే సూపరింటెండెంట్లు 8 మందిని కూడా కలిపి సీనియార్టీ ప్రకారం కేటాయించారు. వరంగల్ జిల్లాను భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలుగా పునర్విభజన చేస్తున్న విషయం తెలిసిందే. డీఈఓ కార్యాలయంలోని 14 సీనియర్ అసిస్టెంట్లతోపాటు సర్వశిక్షాభియాన్ జిల్లా ప్రాజెక్టులో పనిచేస్తున్న ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లు కూడా కలుపగా మొత్తం 21మంది సీనియర్ అసిస్టెంట్లతో సీనియార్టీ రూపొందించి వారిని జిల్లాలకు కేటాయిం చారు. దీంతో పలువురు ఎస్ఎస్ఏలోని సీనియర్ అసిస్టెంట్లు తమను ఎలా డీఈఓ కార్యాలయం ఉద్యోగులతో కలిపి సీనియా ర్టీ రూపొందిస్తారని, దీంతో తాము భూపాలపల్లి జిల్లాకు వెళ్లాల్సి వస్తోందని పలువురు డీఈఓ పి.రాజీవ్‌తో వాగ్వాదానికి ది గారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మౌఖిక ఆదేశాలతోనే కలిపి సీనియారిటీ ప్రాతిపదికను జిల్లాలకు కేటాయిస్తున్నామని డీఈవో పేర్కొన్నారు. అసలు సర్వశిక్షాభియాన్ జిల్లా ప్రాజెక్టును డీఈవో పరిధిలోకి విలీనం చేసినట్లుగా ప్రభుత్వం నుంచి జీవో జారీ కాలేదని, ఆ రెండుశాఖల ఉద్యోగులను కలిపి సీనియారిటీ రూపొం దించాలని కూడా ఉత్తర్వులు రాలేదని, అయినా ఇలా ఎలా కేటాయిస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ ఎస్ఎస్ఏను డీఈఓ పరిధిలోకి చేర్చినా కూడా అందులో పని చేసే వారిని సీనియార్టీ ప్రకారంగానే జిల్లాలకు కేటాయించాలని అన్నారు. ఈమేరకు పలువురు మహిళా ఉద్యోగులు జిల్లా కలెక్టర్ ను విన్నవించేందుకు సన్నద్ధమవుతున్నా రు. ఈ విషయంపై మంగళవారం ‘సాక్షి’ డీఈవో పి.రాజీవ్‌ను వివరణ కోరగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మౌఖిక ఆదేశాల మేరకు రెండు రకాలుగా ఉద్యోగులను విభజించి జిల్లాలకు సీనియారిటీ ప్రాతిపదికను కేటాయిస్తూ వారి పేర్లు ప్రతిపాదించినట్లు చెప్పారు. డీఈఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల సీనియార్టీ ప్రాతిపదికన జిల్లాలను కేటాయిస్తూ ఒక జాబితా, డీఈఓ కార్యాలయం, ఎస్ఎస్ఏలోని ఉద్యోగులను కలిపి సీని యార్టీ ప్రతిపదికన మరో జాబితా రూపొం దించి ప్రభుత్వానికి ప్రతిపాదించామని తెలి పారు. వీటిలో దేన్ని అమలు చేస్తారో వేచి చూడాలని తెలిపారు. పలుమార్లు వీడియో కాన్ఫరెన్లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, సర్వశిక్షాభియాన్ ప్రాజెక్టును డీఈవో పరిధిలోకే విలీనం చేస్తారని చెప్పారని పేర్కొన్నారు. అందుకే రెండూ కలిపి సినియారిటీ ప్రాతిపదిన కేటాయించామన్నారు. -
12మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
జమ్మికుంట రూరల్ : గతేడాది పదోతరగతి పరీక్షల్లో 60శాతం కన్నా తక్కువ ఫలితాలు వచ్చిన మండలంలోని పలు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు డీఈవో కార్యాలయం నుంచి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. తనుగుల హెచ్ఎం దామెర సుధాకర్ (ప్రస్తుత ఇంచార్జీ ఎంఈవో), వావిలాల హెచ్ఎం మల్లికార్జునరావు, ఎన్. సదయ్య, ఎ.శ్రీనివాస్, కోరపల్లి హెచ్ఎం కాత్యాయని, చంద్రమౌళి, రమేశాచార్యులు, ఆబాదిజమ్మికుంట హెచ్ఎం భావనరుషి, జయప్రద, కనగర్తి హెచ్ఎం కిషన్‌రావుకు గురువారం డీఈవో కార్యాలయం నుంచి వచ్చిన నోటీసులను వారికి జారీ చేసినట్లు ఎంఈవో తెలిపారు. -
క్రీడాకారులను తయారు చేయాలి
రామచంద్రపురం: ప్రతీ పాఠశాలలో క్రీడాకారులను తయారు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్. నరసింహారావు అన్నారు. స్థానిక అరిగెల కాపు కల్యాణ మండపంలో గురువారం అమలాపురం, రామచంద్రపురం విద్యా డివిజన్ల పరిధిలోగల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారుల సమావేశం డీవైఈఓ ఆర్ఎస్ గంగాభవాని అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ గ్రిగ్, పైకా పోటీల వంటివాటిలో తప్పనిసరిగా ప్రతీ పాఠశాల ప్రాతినిధ్యం ఉండేలా చూడాలన్నారు. వివి«ద అంశాలపై ఆయన హెచ్ఎంలకు, ఎంఈఓలకు దిశానిర్దేశం చేశారు. ఆర్‌ఎంఎస్‌ఏ నిధులను వినియోగించుకుని వెంటనే నిర్మాణాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్‌లను వినియోగిస్తు ఎప్పటికప్పడు సమాచారాన్ని అందించాలన్నారు. పాఠశాలల్లో యూనిఫాం, తాగునీరు, బయోఫెన్సింగ్, స్వచ్ఛ సంకల్పం, పదవతరగతి యాక్షన్ ప్లాన్, వెబ్సైట్లో ఫార్మటివ్ 1 మార్కుల నమోదు, శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాల తొలగింపు తదితర అంశాలపై చర్చించారు. ఆర్‌ఎంఎస్‌ఏ డీవైఈఓ వరదాచార్యులు 9, 10 తరగతుల సీడబ్లు్య.ఎస్.ఎన్ విద్యార్దులకు స్కాలర్షిప్ ఏవిధంగా ఆన్లైన్లో రిజిస్టరు చేయాలో అవగాహన గావించారు. దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రతలపై విద్యార్థులు, గ్రామస్తులను ఏవి«దంగా చైతన్య పరచాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విశదీకరించారు. దోమల నివారణ, వాటి వలన సంక్రమించే వ్యాధులపై ఈనెల 24న విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించాలని డీఈఓ ఆదేశించారు. -
మినిగురుకుల పాఠశాలను తనిఖీ చేసిన డీఈఓ
చివ్వెంల: మండల కేంద్రంలోని మినిగురుల పాఠశాలను జిల్లా విద్యాధికారి చంద్రమోహన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పాఠశాలలో విద్యార్థుల వసతులను, హజరుపట్టికను పరిశీలించారు. సిబ్బంది వివరాలను ప్రిన్సిపల్ సుజాతను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందిచాలని, క్రమతప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించాలని సూచించారు. మూత్రశాలలలను, మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, వాటర్ ట్యాంకులను బ్లీచింగ్ ఫౌడర్‌తో శుభ్రం చేయాలని సూచించారు. ఆయన వెంట మండల విద్యాధికారి కట్టా యల్లారెడ్డి తదితరులు ఉన్నారు. -
22 నుంచి ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లు
డీఈఓ రాజీవ్ విద్యారణ్యపురి: జిల్లాలో 22 నుంచి జిల్లాస్థాయి ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.రాజీవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 22, 23, 24 తేదీల్లో మహబూబాబాద్ డివిజన్లో, ఖమ్మం జిల్లాలో ఇన్స్పైర్ అవార్డులు పొందిన విద్యార్థులకు మహబూబాబాద్ అనంతారం రోడ్డులోని మోడల్ స్కూల్లో ఎగ్జిబిషన్లు నిర్వహించబోతున్నామన్నారు. 25, 26, 27 తేదీల్లో వరంగల్, ములుగు, జనగామ, నల్గొండ జిల్లాలో ఇన్స్పైర్ అవార్డులు పొందిన విద్యార్థులకు స్టేషన్ ఘనపూర్ పట్టణం సమీపంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తామన్నారు. ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లో పాల్గొనే విద్యార్థులకు, గైడ్ టీచర్లకు మూడు రోజులపాటు భోజన, వసతి ఏర్పాటు ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ల నిర్వహణకు మండల విద్యాశాఖాధికారులు, పీజీహెచ్‌ఎంలను కన్వీనర్లుగా, కో కన్వీనర్లుగా నియమించామన్నారు. అలాగే 16 రకాల కమిటీలను కూడా ఏర్పాటు చేశామని డీఈఓ తెలిపారు. -
ప్రజాప్రతినిధుల నుంచి ఉపాధ్యాయుల రిలీవ్
విద్యారణ్యపురి: జిల్లాలో ప్రజాప్రతినిధుల వద్ద డిప్యూటేషన్‌పై పీఏ, పీఎస్లుగా పనిచేస్తున్న ఐదుగురు టీచర్లను ఆ పోస్టుల నుంచి రిలీవ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి రాజీవ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన చేశారు. ఎంఎల్సీ వెంకటేశ్వర్లు వద్ద ఉన్న మరిపెడ మండలం విసంపెల్లి ఎంపీయూపీఎస్ ఉపాధ్యాయుడు ఎం. రవీందర్‌ను, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వద్ద ఉన్న పి నరేంద్రస్వామిని (రంగశాయిపేట పీఎస్) రాజ్యసభ మాజీ సభ్యురాలు గుండు సుధారాణి వద్ద ఉన్న ఆర్.రాంరెడ్డి (అలంకానిపేటపీఎస్), పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వద్ద ఉన్న తవటం శ్రీనివాస్‌ను(బద్రిగూడెం తండా పాఠశాల), ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్వద్ద ఉన్న పి వెంకటేశ్వర్రావు (మామునూర్ జెడ్పీఎస్ఎస్)ను, జిల్లా సైన్స్‌సెంటర్‌లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న రావుల శ్రీధర్ (గవిచర్ల హైస్కూల్) డిప్యూటేషన్‌ను రద్దుచేసినట్లు వివరించారు. ఆయా ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో విధుల్లో చేరాలని కోరారు. -
ప్రజాప్రతినిధుల నుంచి ఉపాధ్యాయుల రిలీవ్
విద్యారణ్యపురి: జిల్లాలో ప్రజాప్రతినిధుల వద్ద డిప్యూటేషన్‌పై పీఏ, పీఎస్లుగా పనిచేస్తున్న ఐదుగురు టీచర్లను ఆ పోస్టుల నుంచి రిలీవ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి రాజీవ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన చేశారు. ఎంఎల్సీ వెంకటేశ్వర్లు వద్ద ఉన్న మరిపెడ మండలం విసంపెల్లి ఎంపీయూపీఎస్ ఉపాధ్యాయుడు ఎం. రవీందర్‌ను, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వద్ద ఉన్న పి నరేంద్రస్వామిని (రంగశాయిపేట పీఎస్) రాజ్యసభ మాజీ సభ్యురాలు గుండు సుధారాణి వద్ద ఉన్న ఆర్.రాంరెడ్డి (అలంకానిపేటపీఎస్), పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వద్ద ఉన్న తవటం శ్రీనివాస్‌ను(బద్రిగూడెం తండా పాఠశాల), ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్వద్ద ఉన్న పి వెంకటేశ్వర్రావు (మామునూర్ జెడ్పీఎస్ఎస్)ను, జిల్లా సైన్స్‌సెంటర్‌లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న రావుల శ్రీధర్ (గవిచర్ల హైస్కూల్) డిప్యూటేషన్‌ను రద్దుచేసినట్లు వివరించారు. ఆయా ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో విధుల్లో చేరాలని కోరారు. -
ఉపాధ్యాయుల సమస్యలు పట్టవా..?
వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులపతి గార్లదిన్నె : ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులపతి పేర్కొన్నారు. వైఎస్సార్‌టీఎఫ్ ఆధ్వర్యంలో తలపెట్టిన విద్యాపరిరక్షణ యాత్రలో భాగంగా బుధవారం మండల వ్యాప్తం గా ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో సమావేశాలు నిర్వహిం చారు. కొప్పలకొండలో డీఇఓ అంజయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణయాత్రకు సంబంధించి కరపత్రాలు విడుదల చేశారు. ఓబుళపతి మాట్లాడుతూఉపాధ్యాయ సాహర్థ్య పరీక్షలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేయడమే లక్ష్యంగా వైఎస్సార్‌టీఎఫ్ పని చేస్తుందని తె లిపారు. వైఎస్సార్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అశోక్‌కుమార్‌రెడ్డి , వైఎస్సార్‌టీఎఫ్ జిల్లా నాయకులు అజీమొద్దీన్, పవన్‌కుమార్, శివప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఉత్తమ ఉపాధ్యాయులు 70 మంది
నిజామాబాద్ అర్బన్ : జిల్లాలో 70 మంది ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను డీఈవో లింగయ్య బుధవారం ప్రకటించారు. వీరికి గురువారం జిల్లా కేంద్రంలోని న్యూఅంబేద్కర్ భవన్లో నిర్వహించనున్న కార్యక్రమంలో అవార్డులను అందించనున్నారు. ‘ఉత్తములు’ వీరే.. పేరు హోదా పాఠశాల మండలం రమేశ్ ఎస్ఏ, సైన్స్ రాంమందిరం ఆర్మూర్ నర్సయ్య పీజీ హెచ్ఎం కోమన్‌పల్లి ఆర్మూర్ విజయకుమారి ఎస్ఏ, హిందీ ఆలూరు ఆర్మూర్ ప్రవీణ్‌కుమార్ ఎస్ఏ, ఇంగ్లిష్ ఆలూరు ఆర్మూర్ పి.నవీన్ ఎస్ఏ, గణితం మిర్ధాపల్లి ఆర్మూర్ ఆనంద్‌కుమార్ ఎస్ఏ, గణితం ఆలూరు ఆర్మూర్ అబ్దుల్‌అలీ ఎస్ఎ బయోసైన్స్ ఆలూరు ఆర్మూర్ శ్రీనివాస్‌రెడ్డి ఎస్ఏ పీ.సైన్స్ ఆలూరు ఆర్మూర్ ఎల్.పద్మ ఎస్ఏ, హిందీ ఆలూరు ఆర్మూర్ నరేందర్ పీజీ హెచ్ఎం మచ్చర్ల ఆర్మూర్ రాజేంద్రప్రసాద్ పీజీ హెచ్ఎం చేపూర్ ఆర్మూర్ సంపత్‌కుమార్ పీజీ హెచ్ఎం మిర్ధాపల్లి ఆర్మూర్ జె.లింగం పీజీ హెచ్ఎం ఆలూరు ఆర్మూర్ రఘునాథ్ ఎస్ఏ, పీ.సైన్స్ సుర్బియ్యాల్ ఆర్మూర్ గణేష్ పీజీ హెచ్ఎం పిప్రి ఆర్మూర్ సాయన్న పీజీ హెచ్ఎం సావెల్ బాల్కొండ అంజద్‌ఖాన్ ఎస్ఏ, హిందీ ముప్కాల్ బాల్కొండ డి.రేణుక ఎస్ఏ, తెలుగు ముప్కాల్ బాల్కొండ డి.శ్రీనివాస్ పీజీ హెచ్ఎం ముప్కాల్ బాల్కొండ లక్ష్మణ్ పీజీ హెచ్ఎం వన్నెల్(బి) బాల్కొండ ఇందిర పీజీ హెచ్ఎం గొనుగొప్పుల భీంగల్ మహేందర్ ఎస్ఏ బి.సైన్స్ మెండోరా భీంగల్ డి.సుజాత పీజీ హెచ్ఎం మెండోరా భీంగల్ వి.రమేశ్ ఎస్ఏ, తెలుగు తలమడ్ల భిక్కనూరు పి.శ్రీనాథ్ పీజీ హెచ్ఎం భిక్కనూరు భిక్కనూరు గగన్‌కుమార్ ఎస్ఏ, పి.సైన్స్ మిర్జాపూర్ బీర్కూరు పి.రవి ఎస్ఏ, తెలుగు అమ్దాపూర్ బోధన్ నాగయ్య పీజీ హెచ్ఎం ఎరాజ్‌పల్లి బోధన్ జ్ఞానేశ్వర్ ఎస్ఏ, గణితం దుబ్బాక ధర్పల్లి రాంచంద్ర పీజీ హెచ్ఎం ముత్యంపేట్ దోమకొండ శ్రీనివాసులు ఎస్ఏ, పి.సైన్స్ మహ్మద్‌పుర్ దోమకొండ పి.శ్రీనివాస్ ఎస్ఏ, సోషల్ మహ్మద్‌పుర్ దోమకొండ నారాయణగౌడ్ పీజీ హెచ్ఎం మహ్మద్‌పుర్ దోమకొండ వాయిద్పాషా ఎస్ఏ, పీ.సైన్స్ దోమకొండ దోమకొండ ఎ.గంగాధర్ పీజీ హెచ్ఎం పడకల్ జక్రాన్‌పల్లి జి.సదాశివ్ ఎస్ఏ, బి.సైన్స్ జక్రాన్‌పల్లి జక్రాన్‌పల్లి బస్వంత్‌రావు ఎస్ఏ, సోషల్ జుక్కల్ జుక్కల్ ఎస్.దానయ్య పీడీ కౌలాస్ జుక్కల్ హీరా పీజీ హెచ్ఎం కౌలాస్ జుక్కల్ ఆనందరావు పీజీ హెచ్ఎం దేవన్‌పల్లి కామారెడ్డి భగత్ ఎస్ఏ, బి.సైన్స్ లింగాపూర్ కామారెడ్డి కె.బన్సీలాల్ ఎస్ఏ, తెలుగు బషీరాబాద్ కమ్మర్పల్లి కె.ప్రభాకర్ ఎస్ఏ, సోషల్ కోనసముందర్ కమ్మర్పల్లి మోహన్ ఎస్ఏ, పి.సైన్స్ కోటగిరి కోటగిరి ఎన్.శ్రీనివాసరావు పీజీ హెచ్ఎం కోటగిరి కోటగిరి ఎం.డి.అతీకుల్లా పీఈటీ గుత్ప మాక్లూర్ విద్యాకర్ ఎస్ఏ, సోషల్ ఎర్గట్ల మోర్తాడ్ రమేశ్వర్ పీజీ హెచ్ఎం తడపాకల్ మోర్తాడ్ బి.పండరి పీజీ హెచ్ఎం సుంకెట్ మోర్తాడ్ మహేందర్‌రెడ్డి పీజీ హెచ్ఎం నందిపేట నందిపేట ధృపత్కుమార్ పీజీ హెచ్ఎం డొంకేశ్వర్ నందిపేట డి.జె.జ్యోతి టీచర్ నాగేపూర్ నవీపేట లక్ష్మాగౌడ్ హెచ్ఎం నాళేశ్వర్ నవీపేట స్వరూపరాణి ఎస్ఏ, బి.సైన్స్ కులాస్పూర్ నిజామాబాద్ కె.సత్యనారాయణ పీజీ హెచ్ఎం మల్కాపూర్ నిజామాబాద్ గంగకిషన్ ఎస్ఏ, బి.సైన్స్ ఖిల్లా నిజామాబాద్ రామారావు పీజీ హెచ్ఎం బోర్గాం(పి) నిజామాబాద్ బి.సాయిలు ఎస్ఏ, బి.సైన్స్ లింగంపల్లి సదాశివనగర్ వల్లభరావ్ ఎస్ఏ, బి.సైన్స్ ఆడ్లూరు ఎల్లారెడ్డి సదాశివనగర్ గోవర్ధన్‌రెడ్డి పీజీ హెచ్ఎం ఉప్పలవాయి సదాశివనగర్ బిl.వెంకట్‌రెడ్డి పీజీ హెచ్ఎం కల్వారాల్ సదాశివనగర్ అనిల్‌కుమార్ ఎస్ఏ, పీ.సైన్స్ ఉప్పల్వాయి సదాశివనగర్ సి.హెచ్.శంకర్ పీజీ హెచ్ఎం ఓన్నాజీపేట సిరికొండ జి.గంగామోహన్ ఎస్ఏ, పీ.సైన్స్ పల్లికొండ సిరికొండ ఫృథ్వీరాజ్ ఎస్ఏ, పీ.సైన్స్ కృష్ణాజీవాడి తాడ్వాయి సంతోష్ పీజీ హెచ్ఎం పచ్చలనడ్కుడ వేల్పూరు సత్యనారాయణ పీజీ హెచ్ఎం జానకంపేట ఎడపల్లి శ్రీనివాస్‌రెడ్డి పీజీ హెచ్ఎం ఎల్లారెడ్డి(బి) ఎల్లారెడ్డి -
స్కూల్ గేమ్స్‌కు రాజకీయ గ్రహణం
– కార్యదర్శి ఎంపికలో డీఈవోపై అధికార పార్టీ ఒత్తిడి – కలెక్టర్ నుంచి డీఎస్‌డీవోకు చేరిన ఎంపిక ఫైల్ – ఒత్తిడి తట్టుకోలేక సెలవుపై వెళ్లిన డీఎస్డీవో – స్కూల్ గేమ్స్ దగ్గర పడుతున్నా పూర్తిగాని క్రీడాకారుల ఎంపిక తిరుపతి సెంట్రల్: పీవీ.సింధు ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే ‘ఆ గొప్ప నాది అంటే నాది’ అంటూ మన నాయకులు చేసిన ఆర్భాటం నిన్నమొన్నటి వరకు చూశాం. క్షేత్ర స్థాయిలో ప్రోత్సహిస్తే ఇలాంటి సింధులు ఎంతోమంది పుట్టుకొస్తారనే విషయం తెలిసినా ఏ నాయకుడూ ఆ దిశగా చర్యలు తీసుకోరు. స్కూల్ గేమ్స్ విషయంలో జిల్లా నాయకులు వ్యవహరిస్తున్న తీరే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. తిరుపతి ఎంఆర్‌పల్లికి చెందిన మంజు గత ఏడాది రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో గోల్డ్‌మెడల్ సాధించింది. మహారాష్ట్రలో నిర్వహించిన 62వ స్కూల్ గేమ్స్‌లో రజత పతకం సాధించింది. అంతటి ప్రతిభావంతురాలు ఈ నెల 12 నుంచి గన్నవరంలో నిర్వహించనున్న స్కూల్‌గేమ్స్ రెజ్లింగ్ స్టేట్‌మీట్‌లో పాల్గొనలేని పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ఇంతవరకు జిల్లా క్రీడాజట్టును ఎంపిక చేయకపోవడమే. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి జిల్లాలో స్కూల్ గేమ్స్‌లో పాల్గొనాలని అనుకున్న క్రీడాకారులకు ఆశాభంగం తప్పలేదు. కార్యదర్శినే ఎంపిక చేయలేదు.. గ్రామీణ స్థాయిలో ప్రతిభ ఉన్న నిరుపేద క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దీనికోసం జిల్లాకో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శిని డీఈవో ఎంపిక చేయాలి. కార్యదర్శి నేతత్వంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభగల పేద క్రీడాకారులను గుర్తించి, స్కూల్ గేమ్స్‌కు జిల్లా జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. 2016–17 విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడిచినా ఇంతవరకు కార్యదర్శిని ఎంపిక చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కార్యదర్శి పోస్టుకు జిల్లా నుంచి దాదాపు 10 మంది పీఈటీలు పోటీపడుతున్నారు. ఈ పోస్టుకు అధికార పార్టీ నాయకులు ఒత్తిడి తేవడంతో ఎంపిక ఆలస్యమయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నష్టపోతున్న క్రీడాకారులు.. స్కూల్‌గేమ్స్ కార్యదర్శి లేకపోవడంతో ఈ ఏడాది ప్రతిభగల క్రీడాకారులు నష్టపోతున్నారు. సాధారణంగా స్కూల్ గేమ్స్‌కు 15 నుంచి 20 రోజుల ముందు అన్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి పేద క్రీడాకారులను ఎంపిక చేస్తారు. వారి సర్టిఫికెట్లు పరిశీలించి కార్యదర్శి సంతకం చేస్తేనే రైల్వే కన్సెషన్ ఫాం వర్తిస్తుంది. అంతా ఓకే అయ్యాక క్రీడాకారులకు కనీసం రెండు వారాలైనా శిక్షణ ఇవ్వాలి. గన్నవరంలో ఈ నెల 12 నుంచి జరిగే స్కూల్ గేమ్స్ పంపించాలంటే 11వ తేదీన అక్కడికి చేరుకోవాల్సిన జిల్లా రెజ్లింగ్ జట్టును ఇంతవరకు ఎంపిక చేయలేదు. పేద క్రీడాకారులపై వివక్ష.. జిల్లాకు వన్నె తెస్తున్న క్రీడాకారులను ప్రభుత్వం విస్మరిస్తోంది. గత ఏడాది రెజ్లింగ్‌లో జాతీయ స్థాయిలో బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చిన క్రీడాకారులను గుర్తించడంలేదు. పేద క్రీడాకారులు వారి సొంత ఖర్చులతో పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నా ఎంపిక చేయలేదు. తక్షణమే కలెక్టర్ చొరవ తీసుకోవాలి. – చీనేపల్లి కిరణ్‌కుమార్, కార్యదర్శి, జెన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అకాడమీ, తిరుపతి. -
10 లోగా ఆర్వోటీలు ఏర్పాటు చేసుకోవాలి
కరీంనగర్‌ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఆదర్శ, కస్తూరిబా, రెసిడెన్షియల్, ప్రైవేట్ పాఠశాలల్లో ఈనెల 10వ తేదీలోగా రేడియో ఓరియంటేషన్ ట్రాన్స్మిషన్(ఆర్‌ఓటీ)ను ఏర్పాటు చేసుకోవాలని డీఈఓ శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో సూచించారు. ఆర్‌ఓటీలు కలిగి ఉన్న పాఠశాలల్లో సెటాప్ బాక్స్‌లు అమర్చుకోవాలని సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసుకునే పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆర్‌ఎంఎస్‌ఏ నిధులను వినియోగించుకోవాలని సూచించారు. -
ఎంఈఓ భవనంలోనే డీఈఓ కార్యాలయం
భవనాన్ని పరిశీలించిన ఇంజనీర్లు, అధికారులు రెండు డిప్యూటీ ఈఓ ఆఫీస్‌లు ఏర్పడే అవకాశం మహబూబాబాద్ : జిల్లాల పునర్విభజనతో మానుకోట జిల్లాకు డీఈఓ కార్యాలయాన్ని మండలకేంద్రంలో ఎంఈఓ కార్యాలయంలోనే ఏర్పాటు చేయనున్నారు. ఇక డిప్యూటీ ఈఓ కార్యాలయం పరిధిలోని కొన్ని మండలాలు ఇతర జిల్లాల పరిధిలోకి వెళ్లాయి. మరో డిప్యూ టీ ఈఓ కార్యాలయం ఏర్పాటయ్యే అవకాశం ఉన్నాయి. మానుకోట ఎంఈఓ కార్యాలయంలో 8 గదులు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి ఎంఈఓకు కేటాయించగా రెండు గదులు డిప్యూటీ ఈఓ కార్యాలయానికి వినియోగిస్తున్నారు. ఒక గది స్టోర్ రూమ్‌గా, మరో గది హాల్ కోసం ఉంది. ఇంకా మూడు గదులే మిగిలి ఉన్నాయి. దీంతో ఈ భవనం పైఅంతస్తు నిర్మిం చాలా.. లేక ఖాళీ స్థలంలో మరికొన్ని గదులు నిర్మించాలా.. అనే విషయంపై శుక్రవారం విద్యాశాఖ ఇంజనీర్లు పరిశీలించారు. డిప్యూటీ ఈఓ పరిధిలోకి 19 మండలాలు డిప్యూటీ ఈఓ కార్యాలయ పరిధిలోకి 19 మండలాలు వెళ్లాయి. చెన్నారావుపేట, డోర్నకల్, దుగ్గొండి, గీసుకొండ, గూడూరు, ఖానాపూర్, కొత్తగూడ, కేసముద్రం, కురవి, మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, నర్సంపేట, నర్సింహులపేట, నెక్కొండ, నెల్లికుదురు, పర్వతగిరి, సంగెం, రాయపర్తి మండలాలు ఉన్నాయి. కాగా చెన్నారావుపేట మండలం, దుగ్గొండి, గీసుకొండ, ఖానాపూర్, నర్సంపేట, నెక్కొండ, పర్వతగిరి, సంగెం మండలాలు వరంగల్ జిల్లా పరిధిలోకి వెళ్లాయి. రాయపర్తి మండలం హన్మకొండ జిల్లాలో చేరింది. కొత్తగా రెండు మండలాల చేరిక డిప్యూటీ ఈఓ కార్యాలయ పరిధిలోకి కొత్తగా బయ్యారం, గార్ల మండలాలు చేరాయి. డీఇఓ కార్యాలయం పరిధిలోనూ రెండు మండలాలు ఉంటాయి. కాగా గూడూరు, కొత్తగూడ, బయ్యారం, గార్ల ఏజెన్సీ మండలాలు ఉండటంతో మరో డిప్యూటీ ఈఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంటున్నారు. -
డీఎడ్ విద్యార్థులు 15లోగా ఫీజులు చెల్లించాలి
డీఈవో మధుసూదనరావు ఏలూరు సిటీ : డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) 2014–16 విద్యాసంవత్సరానికి సంబంధించి ఫీజు, నామినల్ రోల్స్ సమర్పించాల్సిన తేదీలను డీఈవో డి.మధుసూదనరావు శుక్రవారం తెలిపారు. అభ్యర్థులు ఫీజులను ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 15లోగా చెల్లించాలని, నామినల్ రోల్స్‌ను కాలేజీ యాజమాన్యాలు ఈనెల 17లోగా డీఈవో కార్యాలయానికి సమర్పించాలని కోరారు. రూ.50 అపరాధ రుసుముతో ఈనెల 22 వరకు ఫీజులు చెల్లించవచ్చని, నామినల్ రోల్స్ వివరాలు 24 తేదీలోగా డీఈవో కార్యాలయానికి సమర్పించాలని తెలిపారు. రెగ్యులర్ అభ్యర్థులు రూ.250, ఫెయిల్ అయిన అభ్యర్థులు నాలుగు లేదా ఐదు పరీక్షలకు రూ.250, మూడు పేపర్లకు రూ.175, రెండు పేపర్లకు రూ.150, ఒక పేపర్‌కు రూ.125 చెల్లించాలని తెలిపారు. డీఏ డ్రాకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ఏపీ ట్రెజరీ వెబ్సైట్లో నూతన డీఏను డ్రా చేసుకునేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వం అప్డేట్ చేసిందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జయకర్, బి.గోపీమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 5 నుంచి 8వ తేదీల్లో డీఏ అరియర్స్ బిల్లులను డీడీవోలు అంతా బిల్లులు చేసి ట్రెజరీలకు పంపాలని కోరారు. -
ఉద్యమానికి ఉపాధ్యాయులు సై
ఏలూరు సిటీ : ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ క్యాలెండర్‌ను విస్మరించి సొంత అజెండాతో ఉపాధ్యాయులపై పనిభారం మోపుతూ ఇష్టారాజ్యంగా జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూదనరావు వ్యవహరిస్తున్నారంటూ 12 ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమించాయి. వేలాది మంది ఉపాధ్యాయులతో గురువారం స్థానిక డీఈవో కార్యాలయం ఎదురుగా రోడ్డుపై ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ ఉపాధ్యాయులు డీఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. మధ్యాహ్నం నుంచి ఉపాధ్యాయ సంఘాల నేతలు డీఈవోతో జరిపిన చర్చల్లో జేఏసీ ఇచ్చిన నోటీసులో పేర్కొన్న 8 అంశాల్లో 7 అంశాలపై డీఈవో సానుకూలంగా స్పందించారు. బేస్మెంట్ పరీక్ష విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. బేస్మెంట్ పరీక్షను రద్దు చేయాలని ఉపాధ్యాయులు పట్టుబట్టగా డీఈవో ససేమీరా అన్నారు. మరోదఫా జరిపిన చర్చలతో జేఏసీ నాయకులు డీఈవోను ఒప్పించారు. ధర్నా శిబిరం వద్ద డిమాండ్లను ఒప్పుకున్నట్టుగా ప్రకటించేందుకు జేఏసీ నేతలు డీఈవోను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బడిగంటల కార్యక్రమంపై ఉపాధ్యాయులు మరోసారి పట్టుబట్టడంతో డీఈవో ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టేజి నుంచి దిగివెళ్లిపోయారు. చర్చలు విఫలం కావడంతో ఉద్యమానికి సిద్ధపడుతున్నట్టు ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రకటించారు. 2న జిల్లాలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో పనిచేయాలని, 3 నుంచి రిలే నిరాహారదీక్షలు, 7 నుంచి నిరవధిక నిరాహారదీక్షలు చేస్తున్నట్టు జేఏసీ ప్రకటించింది. డీఈవోతో జరిగిన చర్చల్లో ఫ్యాప్టో చైర్మన్ పి.బాబురెడ్డి, జాక్టో చైర్మన్ ఎం.కమలాకర్, ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వెంకటేశ్వరరావు, రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్వీ సాగర్, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్ఎస్ హరనా«ద్, కార్యదర్శి సీహెచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉపాధ్యాయుల ధర్నా శిబిరానికి బి.గోపీమూర్తి, పి.వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ధర్నాలో ఎమ్మెల్సీలు రాము సూర్యారావు, బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో అధికారుల మెప్పు కోసం రకరకాల కార్యక్రమాలతో ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేయటం సమంజసం కాదన్నారు. డీఈవో వైఖరిపై శాసనమండలిలో విద్యశాఖ కమిషనర్‌తో చర్చిస్తామని తెలిపారు. ఏపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు బాపిరాజు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్‌సాబ్జీ, పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి పి.ఆంజనేయులు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.జయకర్, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీ సుబ్బారావు, ఏపీటీఎఫ్ 1938 జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌వీవీఎం శ్రీనివాస్, గుగ్గులోతు కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీవీ రామకృష్ణ, వైఎస్సార్ టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి.సుధీర్, డీటీఎఫ్ నాయకులు కె.నరహరి, ఎన్.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
డీఈఓ కార్యాలయ ఉద్యోగుల విభజనకు ప్రతిపాదన
విద్యారణ్యపురి : జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని వివిధ కేటగిరీల ఉద్యోగులను నాలుగు జిల్లాలకు విభజిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు డీఈఓ పి.రాజీవ్ ప్రతిపాదనలు పంపించారు. వరంగల్ జిల్లా డీఈఓ కార్యాలయంలో కేడర్ స్ట్రెంత్ ప్రకారం వివిధ కేటగిరీల్లో 60 పోస్టులు ఉండగా, ప్రస్తుతం 54 మంది పనిచేస్తున్నారు.అందులో సూపరింటెండెంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు ఉన్నారు. వీరితో సమావేశం నిర్వహించి ఆయా కేటగిరీలో సీనియారిటీప్రకారం వారినుంచి జిల్లాల ఆప్షన్ తీసుకున్నారు. సీనియర్లు వరంగల్, హన్మకొండ జిల్లాలు కోరుకోగా మిగిలిన వారు మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలు ఎంచుకున్నారు. జూనియర్లు తమకు ఇష్టం లేకు న్నా భూపాలపల్లి ఆప్షన్ ఇవ్వక తప్పలేదని డీఈవో కార్యాలయంలో బుధవారం చర్చ జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్లు ఇద్దరే ఉండటంతో వారు రెండు జిల్లాలకు ఆప్షన్ ఇచ్చుకోగా మిగితా రెండు జిల్లాలకు కొరత ఉం డనుంది. సూపరింటెండెంట్లకే తాత్కాలిక ఏడీలుగా ఇన్చార్జి బాధ్యతలను అప్పగిస్తారని సమాచారం. ఇక ప్రస్తుతం డీఈఓ కార్యాలయం హన్మకొండలో ఉన్నందున వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని వరంగల్ ఎంఆర్సీ భవన్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అయితే ఆ భవనం సరిపోదని తెలుస్తోంది. దీంతో అక్కడే ఏదైనా ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయాలనే యోచన కూడా ఉంది. లేదంటే కొంతకాలం పాటు ప్రస్తుత కార్యాలయంలోనే కొనసాగించి హన్మకొండ జిల్లా కార్యాలయానికి ఎస్ఎస్ఏ భవనాన్ని కేటాయిస్తారే చర్చ కూడా సాగుతోంది. మహబూబాబాద్, భూపాలపల్లి డీఈఓ కార్యాలయాలను అక్కడి ఎమ్మార్సీ భవనాల్లో కొనసాగించాలని డీఈఓ రాజీవ్ ఉన్నతాధికారులకు ప్రతిపాదించినట్లు సమాచారం. -
వారంలో మూడు రోజులు గుడ్లు ఇవ్వాలి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులకు వారంలో మూడు రోజులు గుడ్లు ఇచ్చే విధానం ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మిబాయి మంగళవారం ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, మోడల్, ఎయిడెడ్ స్కూళ్లలో సోమ, బుధ, శుక్రవారాల్లో విద్యార్థులకు గుడ్లు ఇచ్చేవిధంగా డిప్యూటీ ఈఓలు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు చర్యలు -
ఎస్ఎంఎస్లో ‘మధ్యాహ్న’ వివరాలు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మధ్యాహ్న భోజన పథకం వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా పాఠశాల సంచాలకుడికి పంపాలని ఎంఈఓలను డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి ఆదేశించారు. శనివారం ఎస్ఎస్ఏ సమావేశ మందిరంలో ఎంఈఓల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతిరోజు పాఠశాలకు హాజరైన విద్యార్థుల సంఖ్య, భోజనం చేసిన విద్యార్థుల సంఖ్యను పాఠశాల సంచాలకుడికి ఎస్ఎంఎస్ చేయాలని సూచించారు. సర్కార్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులందరికీ పుస్తకాలు పంపిణీ చేయాలన్నారు. ఎంఈఓలు నిరంతరం పాఠశాలలను తనిఖీ చేయాలని ఆదేశించారు. సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు ఏఎంఓ హుస్సేన్ సాహెబ్ మాట్లాడుతూ..గతేడాది స్కూల్ గ్రాంట్ల నిధులకు సంబంధించిన ఈసీలను ఈనెల 31వ తేదీలోపు సమర్పించాలన్నారు. లేకుంటే ఈ యేడాది గ్రాంట్లను కేటాయించబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో డీవైఈఓలు తహెరాసుల్తానా, శివరాముడు పాల్గొన్నారు. -
అమ్మనబోలు హైస్కూల్ తనిఖీ చేసిన డీఈఓ
నార్కట్‌పల్లి: పాఠశాలలో వార్షిక ప్రణాళికలు క్రమబద్ధంగా ఉండాలని డీఈఓ చంద్రమోహన్ పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం మండలంలోని అమ్మనబోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు రిజిస్టర్లను పరిశీలించి, హరితహారంలో నాటిన మొక్కలు, పాఠశాలలో మౌలిక వసతులు ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు సృజన కుమారిని అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట పీఆర్టీయూ మండల ప్రధాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య ఉన్నారు. -
పాఠశాలకు రూ. 10 లక్షల విరాళం
మాక్లూర్ : పాఠశాలల అభివృద్ధి కోసం అవసరమైన నిధులు ఇవ్వడానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని డీఈవో లింగయ్య పేర్కొన్నారు. పాఠశాలల అభివృద్ధి కోసం గొట్టుముక్కుల మాజీ సర్పంచ్ బీరెల్లి రాజేశ్వర్‌రావు రూ. 10,00,501 చెక్కును అందించారు. ఈ నేపథ్యంలో బుధవారం గ్రామంలో రాజేశ్వర్‌రావు కుటుంబ సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ రాజేశ్వర్‌రావు గొట్టుముక్కుల గ్రామ ఉన్నత పాఠశాల అభివృద్ధికి రూ. 9 లక్షలు, రాంపూర్, మాందాపూర్, ధర్మోరా, మెట్పల్లి, గొట్టుముక్కుల, బొంకన్పల్లి ప్రాథమిక పాఠశాలలకు రూ. 1,00,501 అందించారన్నారు. దాతలు అందిస్తున్న సహకారంతో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు గంగాధర్, డిప్యూటీ ఈవో కృష్ణారావు, హెచ్ఎం రాజేశ్వర్‌గౌడ్, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కమలాకర్‌రావు, మండల అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ ఒడ్డెన్న తదితరులు పాల్గొన్నారు. -
గీతాలాపానికి విద్యార్థులను సన్నద్ధం చేయండి డీఈఓ
అనంతపురం ఎడ్యుకేషన్ : కేంద్ర ప్రభుత్వం ‘ఆజాది 70–యాద్ కరో కురబానీ’గా నిర్ణయించిన నేపథ్యంలో మంగళవారం 11 గంటలకు విద్యార్థులతో ఒకేసారి జాతీయ గీతాలాపన చేయాలని నిర్ణయించిందని ఈ క్రమంలో విద్యార్థులను సన్నద్ధం చేయాలని డీఈఓ అంజయ్య ఉప, మండల విద్యాశాఖ అధికారులతో పాటు హెచ్ఎంలకు ఓ ప్రకటనలో సూచించారు. -
నేటి నుంచి డీఆర్జీలకు శిక్షణ
విద్యారణ్యపురి : జిల్లాలో ఎంపిక చేసిన డిస్ట్రిక్ట్ రిసోర్స్ గ్రూప్ (డీఆర్ జీ) ఉపాధ్యాయులకు సోమవారం నుంచి హన్మకొండలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో శిక్షణ ఇస్తున్నట్లు డీ ఈఓ పి.రాజీవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఈఓలు, ఉన్న త పాఠశాల హెచ్ఎంలు.. ఎంపిక చేసిన డీఆర్‌జీలను రిలీవ్ చేయాల న్నారు. కోర్సు కో ఆర్డినేటర్, డైట్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ సారంగపాణి అయ్యంగార్‌కు 22న ఉద యం రిపోర్టు చేయాలన్నారు. ఐదు రోజుల పాటు శిక్షణ పొందిన డీఆర్‌జీలు మండల స్థాయిలో ఆంగ్ల మా ధ్యమ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులకు త్వరలో ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నా రు. డీఆర్జీలకు స్టేట్ రిసోర్స్ గ్రూప్స్‌లో ఎంపికైన వారు శిక్షణ ఇస్తారని చెప్పారు. -
ఉపాధ్యాయుల పనితీరుపై డీఈఓకు ఫిర్యాదు
ధన్వాడ : మోడల్ పాఠశాలల్లో విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయుల పనితీరుపై శనివారం డీఈఓకు ఫిర్యాదు చేసినట్లు ఏబీవీపీ నాయకులు విష్ణు, రాజు, కురుమూర్తి తెలిపారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వడ్డించడం లేదని ఆరోపించారు. కూరగాయల టెండర్లలో జరిగిన అక్రమాలపై, విద్యార్థులకు రావాల్సిన కాస్మొటికి చార్జీలపై విచారణ జరిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలి
జిల్లా విద్యాశాఖాధికారి రాజీవ్ మహబూబాబాద్ : విద్యార్థులు చదువుతోపాటు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని డీఈఓ పి.రాజీవ్ సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికల)లో శుక్రవారం ‘సుస్థిర ఆహార భద్రతకు పప్పు ధాన్యాలు, అవకాశాలు–సవాళ్లు’ అంశంపై డివిజన్ స్థాయి సైన్స్ సెమినార్ నిర్వహించారు. ఈ సం ద ర్భంగా డీఈఓ సెమినార్‌ను సందర్శించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ రాణిం చాలన్నారు. విద్యార్థులు ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకున్నప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారన్నారు. కష్టపడి చదివిన విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. కాగా, డివిజన్‌స్థాయిలో ప్రతిభ కనబరిచినందుకు 5గురు విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపికచేశారు. హన్మకొండ డైట్ కళాశాలలో ఈనెల 24న జిల్లాస్థాయి సైన్స్ సెమినార్ జరుగుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ పీజే.వివేకానంద, పాఠశాల హెచ్ఎం మరియం మాణిక్యమ్మ, జి.కృష్ణమూర్తి, ఎం.వెంకట్రాంనర్సయ్య, గురునాథరావు, బి.అప్పారావు, టి.శ్రీనాథ్, భార్గవి, జి.నారాయణ, జి.కమల్‌కుమార్ పాల్గొన్నారు. -
డీఈఓ ఆకస్మిక తనిఖీ
గూడూరు(పాలకుర్తి) : మండలంలోని గూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను డీఈఓ పి.రాజీవ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైస్కూల్లో ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఒకే రోజు సెలవు పెట్టడంపై ఆగ్రహించారు. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల పనితీరును అభినందించారు. విద్యార్థులకు ప్రొగ్రెస్ రిపోర్టు అందజేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. జనగామ డిప్యూటీ ఈవో యాదయ్య, సర్పంచ్ మాచర్ల పుల్లయ్య, ఎంఈవో పోతుగంటి నర్సయ్య, ప్రధానోపాధ్యాయులు రాంచందర్ పాల్గొన్నారు. -
12 నుంచి సెలువులు రద్దు
అనంతపురం ఎడ్యుకేషన్ : కృష్ణా పుష్కరాల నేపథ్యంలో 12, 13, 14 తేదీల్లో అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలలకు ఎలాంటి సెలవులు లేవని యథావిధిగా నిర్వహించాలని అంజయ్య ఓ ప్రకటనలో ఎంఈవోలు, హెచ్ఎంలను ఆదేశించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా 12 అంశాలపై విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్, పోటీలు నిర్వహించాలని సూచించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఈ నిబంధనలు వర్తించని పేర్కొన్నారు. -
టీఎన్ఐ పరీక్ష కేంద్రాలకు ఆప్షన్లు ఇవ్వండి
అనంతపురం ఎడ్యుకేషన్ : ట్రైనింగ్ నీడ్స్ ఐడింటిఫికేషన్ టెస్ట్ (టీఎన్‌ఐటీ)కు హాజరయ్యే ఉపాధ్యాయులు తమకు అందుబాటులో ఉన్న పరీక్ష కేంద్రాల ఎంపిక కోసం ఆప్షన్లు ఇచ్చుకోవాలని డీఈఓ అంజయ్య ఓ ప్రకటనలో సూచించారు. ఈ నెల 20, 21 తేదీల్లో ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. కేంద్రాల ఎంపిక కోసం శుక్రవారం నుంచి ఈనెల 16 వరకు cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆప్షన్లు నమోదు చేయాలని సూచించారు. ఈ వెబ్‌సైట్‌కు సంబందించిన లింకు జిల్లా విద్యాశాఖ అధికారి బ్లాగు ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే సబ్జెక్టు టీచర్లు రూ. 300 చలానా చెల్లించాలని సూచించారు. -
హైడ్రామా
డీఈఓ బాధ్యతల స్వీకరణ నెల్లూరు (టౌన్) : నూతన జిల్లా విద్యాశాఖాధికారిగా నియమితులైన మువ్వా రామలింగం బాధ్యతల స్వీకరణ హైడ్రామా మధ్యన సాగింది. బుధవారం ఉదయం 7 గంటలకు డీఈఓగా బాధ్యతలు స్వీకరించేందుకు రామలింగం జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయంలోని డీఈఓ చాంబరులో ఆశీనులై రిజిస్టర్లో సంతకం చేశారు. అనంతరం అభినందనల కార్యక్రమాల్లో మునిగిపోయారు. అయితే ఇన్చార్జి డీఈఓ విజయలక్ష్మి ఆయనకు బాధ్యతలు అప్పగించలేదు. కలెక్టర్ ముత్యాలరాజు సాయంత్రం వరకు వేచి ఉండాలని సూచించినట్లు తెలిసింది. రామలింగానికి సంబంధించిన గత రికార్డులను తెప్పించుకుని పరిశీలించినట్లు సమాచారం. రామలింగంకు పోస్టింగ్‌పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సైతం వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు పలువురు చెబుతున్నారు. అయితే జిల్లా మంత్రి నారాయణ విద్యాశాఖ మంత్రిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావడంతో విధిలేని పరిస్థితుల్లో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రామలింగానికి డీఈఓ బాధ్యతలను ఇన్చార్జి డీఈఓ విజయలక్ష్మి సాయంత్రం 5గంటలకు అప్పగించారు. కాగా డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన మువ్వాకు పలువురు అభినందనలు తెలిపారు. బీసీ సంఘం నేతలు కార్యాలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉపాధ్యాయ సంఘాలతో పాటు విద్యార్థి సంఘాల నాయుకులు అభినందనలు తెలిపారు. యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం మాత్రం అభినందలకు దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిచడమే తన లక్ష్యమని డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన మువ్వా రామలింగం తెలిపారు. ఐఐటీ ఫౌండేషన్ అమల్లో జిల్లాలను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలుపుతామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 2.70 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. వచ్చే ఏడాది 3లక్షలకుపైగా విద్యార్థులు చదివేలా కృషి చేస్తామన్నారు. ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలలు నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, మౌలిక వసతుల కల్పనపై తల్లిదండ్రులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అప్పుడే ఉత్తమ విద్య అందుతుందన్నారు. -
మళ్లీ వచ్చిన మువ్వా
డీఈవోగా రామలింగం నియామకం టీడీపీ ముఖ్యనేత తీవ్ర ప్రయత్నంతో రాక ఆయన నియామకాన్ని వ్యతిరేకించిన టీడీపీలోని ఒక వర్గం సాక్షి ప్రతినిధి, నెల్లూరు : విద్యాశాఖలో వివాదాస్పద అధికారిగా పేరు తెచ్చుకున్న మువ్వా రామలింగం మరోసారి జిల్లా విద్యాశాఖ అధికారిగా నియమితులయ్యారు. వివాదాలకు నెలవైన ఆయనను మళ్లీ జిల్లాకు తీసుకు రావడం వెనుక తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ముఖ్య నాయకుడు కీలక పాత్ర పోషించారు. టీడీపీలోని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఆ ముఖ్య నాయకుడు తన భుజాల మీద బాధ్యత వేసుకుని జిల్లాకు రప్పించారు. మువ్వా రామలింగం 2006లో చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేశారు. ఆయన వివాదాస్పద తీరుపై అప్పట్లో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వానికి సరెండర్ చేసింది. అక్కడి నుంచి 2007లో గుంటూరు డీఈవోగా బదిలీ అయ్యారు. అక్కడ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల నుంచి గుర్తింపు కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికి సస్పెండ్ అయ్యారు. 2008లో కర్నూలు డీఈవోగా పోస్టు సంపాదించిన ఆయన అక్కడ డీయస్సీ నియామకాలు, ఉపాధ్యాయ సంఘాలతో గొడవల నేపధ్యంలో వివాదాస్పద పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. కొంతకాలం పోస్టింగ్ లేకుండా గడిపిన మువ్వా రామలింగం నెల్లూరుకు బదిలీ అయ్యారు. 2011 జూన్, 18వ తేదీ నెల్లూరు డీఈవోగా బదిలీ మీద వచ్చిన రామలింగం 2014 ఏప్రిల్, 19వ తేదీ దాకా ఇక్కడ పనిచేశారు. విధి నిర్వహణలో అరోపణలతో పాటు, ఉపాధ్యాయ సంఘాలతో గొడవల కారణంగా జిల్లాలోని ఒకటి, రెండు మినహా మిగిలిన ఉపాధ్యాయ సంఘాలన్నీ ఆయనకు వ్యతిరేకంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట నెల రోజల పాటు రిలే నిరాహార దీక్షలు చేశాయి. సూళ్లూరు పేటలో నిర్వహించిన సైన్స్ ఫేర్‌కు షార్ నుంచి శాస్త్ర వేత్తలు వచ్చినట్లు బోగస్ సంతకాలు చేయించి నిధులు స్వాహా చేశారనే ఆరోపణలు వచ్చాయి. కావలిలో నిర్వహించిన సైన్స్ ఫేర్‌కు అప్పటి ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు రూ.1.20 లక్షలు విరాళం ఇస్తే ఆ సొమ్ము తన సొంత ఖాతాలో వేసుకున్నారు. రామలింగం తీరుపై ఆగ్రహించిన అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ సిఫారసుతో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. సుమారు ఏడాది పాటు సస్పెన్షన్‌లో ఉన్న ఆయన, ఆ తర్వాత ఒంగోలు డీఈవోగా పోస్టింగ్ తెచ్చుకున్నారు. అక్కడ ఆరేడు నెలలు పనిచేసిన తర్వాత టీడీపీ నాయకులతో ఏర్పడిన గొడవల కారణంగా ఆయన మున్సిపల్ పాఠశాలల్లో ఐఐటీ ఫౌండేషన్ కోర్సు పరిపాలనాధికారిగా నియమితులయ్యారు. అక్కడి నుంచి బలమైన రాజకీయ సిఫారసులు చేయించి నెల్లూరు జిల్లాకు పోస్టింగ్ దక్కించుకున్నారు. ఈ విషయం తెలిసి కొన్ని ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. -
హైస్కూళ్లను తనిఖీ చేసిన డీఈఓ
విద్యారణ్యపురి : జిల్లాలోని గంగదేవిపల్లి జెడ్పీఎస్ఎస్, గొర్రెకుంట జెడ్పీఎస్‌ఎస్‌లను సోమవారం జిల్లా విద్యాశాఖాధికారి పి.రాజీవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గంగదేవిపల్లిలో ప్రార్ధన సమయానికి వెళ్లి ప్రార్థనలో కూడా ఆయన పాల్గొన్నారు. ఆ పాఠశాలలో నలుగురు టీచర్లు శనివారం లీవ్ పెట్టినట్లు లేఖలు ఉండగా సోమవారం కూడా విధులకు గైర్హాజరయ్యారు. ఫోన్ ద్వారా సోమవారం కూడా లీవ్‌ను కొనసాగించుకుంటున్నట్లు నలుగురు టీచర్లు తెలిపారని హెచ్ఎం జ్యోతిర్మయి డీఈఓకు వివరించారు. ఈ పాఠశాలలో 8 మంది స్కూల్ అసిస్టెంట్లు ఉండగా అందులో నలుగురికి లీవ్‌లు ఒకేసారి ఇవ్వటం సరికాదని విద్యార్థులకు విద్యాబోధన ఎలా అందుతుందని డీఈవో హెచ్ఎంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. శనివారం లీవ్‌లెటర్ పెడితే సోమవారం నలుగురికి లీవ్‌ను ఎలా కొనసాగిస్తారని జ్యోతిర్మయిని ప్రశ్నించారు. అనంతరం పలు సూచనలు చేసిన డీఈవో సోమవారం సాయంత్రం గంగదేవిపల్లి హెచ్ఎం జ్యోతిర్మయి, నలుగురు స్కూల్ అసిస్టెంట్లు శ్యామ్‌కుమార్, ఎం.రమాదేవి, వి.మమత, కె.అండాలుకు మోమోలు జారీ చేశారు. రెండు మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఇక గొర్రెకుంట జెడ్పీఎస్‌ఎస్‌లో తనిఖీ చేయగా నిహారిక ఈనెల 2న లీవ్ పెట్టినట్లు ఉన్నప్పటికీ ఆ తర్వాత ఇక సోమవారం వరకు కూడా విధులకు గైర్జాజరైందని డీఈవో గుర్తించారు. నిహారిక తన లీవ్‌ను ఫోన్ ద్వారా హెచ్ఎంకు తెలిపి కొనసాగించుకుంటున్నారని హెచ్ఎం ద్వారా తెలుసుకున్న డీఈవో ఆమెకు మోమో జారీ చేశారు. రెండు పాఠశాలు కలిపి మొత్తంగా ఆరుగురికి మోమోలు జారీ చేశారు. -
అవకతవకలకు పాల్పడితే చర్యలు
హెచ్ఎంలకు విద్యాశాఖ ఆదేశాలు భక్తి ముసుగులో చేస్తున్న వ్యాపారాన్ని ఆపాలి: ఎస్ఎఫ్ఐ ‘సాక్షి’ కథనాలకు స్పందన కంబాలచెరువు : స్కూలు పిల్లలకు ఇస్కాన్ అందిస్తున్న మధ్యాహ్నం భోజనంలో అవకతవకలకు పాల్పడితే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖా«ధికారులు ఆదేశించారు. జిల్లా విద్యాశాఖాధికారి నర్సింహరావు ఆదేశాల మేరకు మ«ధ్యాహ్న భోజనం అమలవుతున్న స్కూల్ హెచ్.ఎం.లతో స్థానిక విద్యాశాఖ కార్యాలయంలో ఇస్కాన్ భోజ నం అమలు తీరుపై సమీక్షించారు. ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాల నేపథ్యంలో శనివా రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీవైఈవో ఎస్.అబ్రహాం మాట్లాడుతూ పాఠశాల విద్యార్థుల భోజనం విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే ఊరుకునేది లేదన్నారు. ఇస్కాన్ భోజనం అమలుతీరు, నాణ్యత, ఇతర సమస్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులకు ఖచ్చితంగా నిర్వహించాలని, దీన్ని మ«ధ్యా హ్న భోజన కమిటీలు పర్యవేక్షించాలన్నా రు. తొమ్మిది, పదో తరగతి వేరే స్కూళ్లలో చేరిన వి ద్యార్థుల జాబితాలను వెంటనే అందజేయాలన్నారు. కార్యక్రమంలో అర్బన్ స్కూల్ డీఐ అయ్యం కి తులసీదాస్, విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు. భక్తి ముసుగులో... భక్తి ముసుగులో పిల్లల కడుపు మాడుస్తున్న ఇస్కాన్ భోజనాన్ని రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ‘సాక్షి’లో వస్తున్న కథనాలను చూసిన విద్యార్థి సంఘాలు ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు ఉద్యమ కార్యచరణ ప్రారంభించారు. దీనిలో భాగంగా స్థానిక ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.రాజులోవ, జిల్లా అధ్యక్షుడు బి.పవన్ మాట్లాడుతూ అ«ధ్యాత్మిక సంస్థ పేరుతో గత ఏడాది వరకు పౌష్టికాహారమైన గుడ్డు ఇవ్వాలని, ప్రభుత్వ నిబంధన ఉన్నా నాసిరకం అరటిపండు, ముద్ద అన్నం, నీళ్ల సాంబారు, నీళ్ల మజ్జిగ స్కూళ్ల వద్ద ఇస్కాన్ సిబ్బంది పడేసి వెళ్లిపోతున్నారన్నారు. ఆ భోజనం బాగోలేకపోయినా బాగుందని హెచ్ఎమ్లు నివేదికలు పంపడం సరికాదన్నారు. ఈ విషయంపై గతంలోను పలు ఫిర్యాదు వచ్చి నా విద్యాశాఖాధికారులు చర్యలు చేపట్టలేదన్నారు. మీడియా వచ్చిన కథనాలు చూసి మేయర్ పంతం రజనీశేషసాయి ప్రత్యక్షంగా చూసి «ధ్రువీకరించారంటే ఇంతకంటే సాక్ష్యం ఏమికావాలన్నారు. చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామన్నారు. -
విద్యార్థులు ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయాలి
విద్యారణ్యపురి : జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవే ట్ యాజమాన్యాల పాఠశాలల విద్యార్థుల ఆధార్ నంబర్‌ను చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్లో అనుసంధానం చేయాలని డీఈఓ పి.రాజీవ్ కోరారు. ఆధార్‌కార్డు నంబర్ కలిగి ఉంటేనే టెన్త్ విద్యార్థులకు నామినల్ రోల్స్, ప్రభుత్వం నుంచి లభించే ప్రోత్సహాకాలు అందిస్తారన్నారు. జిల్లాలో 47,658 మంది విద్యార్థులకు ఆధార్ నంబర్లు లేవన్నారు. వీటిల్లో అత్యధికంగా హన్మకొండ మండలంలో ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో 14,620మంది విద్యార్థులకు 8,899 మంది విద్యార్థులు మాత్రమే ఆధార్ నం బర్లు కలిగి ఉన్నారన్నారు. ఇక ప్రైవేట్ విద్యాసంస్థల్లో 56,035 మంది విద్యార్థులకు గాను 40,971 మంది విద్యార్థులకు ఆధార్ నంబర్ కలిగి ఉన్నారని చెప్పారు. వరంగల్ మండలంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో 10,617మందికి గాను 6,870 మంది విద్యార్థులు మాత్రమే ఆధార్ నంబర్ కలిగి ఉన్నారని తెలిపారు. ఆధార్‌నంబర్ లేని విద్యార్థు వివరాలన్నీ ఆయా ఎంఈవోల ద్వారా అన్ని పాఠశాలలకు పంపించామన్నారు. ఆధార్ కార్డు నంబ ర్ లేని విద్యార్థులు ఈనెల 31తేదీ వరకు మీసేవా కేంద్రంలో నంబర్‌ను పొందాలని కోరారు. -
14మంది ఎంఈఓలకు షోకాజ్ నోటీసులు
విద్యారణ్యపురి : జిల్లాలో డీఈఓ కార్యాలయంలోని సమావేశానికి గైర్హాజరైన 14మంది ఎం ఈవోలకు డీఈఓ పి.రాజీవ్ గురువారం షోకాజ్ నోటీసులు జారీచేశారు. టీచర్ల వర్క్‌అడ్జస్ట్‌మెంట్ విషయంపై చర్చించేందుకు సమావేశానికి రావాలని వారికి సమాచారం ఇచ్చారు. కాగా 51మంది ఎంఈఓలు ఉండగా 14మంది గైర్హాజరయ్యారు. డీఈఓ కార్యాలయంలో సా యంత్రం 4గంటలకు సమావేశం అనంతరం జిల్లా కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలోని స మావేశానికి సైతం కేవలం 20మంది ఎంఈవో లు మాత్రమే హాజరయ్యారు. ఆగ్రహంచిన కలెక్టర్ వాకాటి కరుణ డీఈఓ రాజీవ్‌ను ప్రశ్నించి గైర్హాజరైన వారిని సస్పెండ్‌చేయాలని డీఈ వోను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో డీఈఓ ముందుగా వివేకానంద (మహబూబాబాద్), వి.ప్రభాకర్(మొగుళ్లపల్లి), రత్నమాల (నెక్కొండ), ఎన్.రంగయ్య(రాయపర్తి), ఎం. బుచ్చయ్య (తొర్రూరు), ఐలయ్య (వెంకటాపూర్), కె.సదానందం(వరంగల్), బి.సోమయ్య (వర్ధన్నపేట), సారయ్య (నర్సంపేట), డి. జనార్ధన్(బచ్చన్నపేట), జి.లక్ష్మీనారాయణ(కొత్తగూడ), సీహెచ్. బిక్షపతి (గూడూరు), కె.ప్రకాశం(దుగ్గొండి), కె.మధులత(డోర్నకల్)కు మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నోటీసుల సమాచారం తెలుసుకున్న కొంత మంది ఎంఈఓలు డీఈఓ కార్యాలయంలో వివరణ ఇచ్చారు. -
ప్రధానోపాధ్యాయుల భర్తీకి రంగం సిద్ధం
– జిల్లాలో 100 హెచ్ఎం పోస్టుల ఖాళీ – పదోన్నతుల ద్వారా నియమించేందుకు చర్యలు – ఇక నుంచి నెలనెలా పదోన్నతులు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసేందుకు విద్యాశాఖాధికారులు సన్నద్ధమవుతున్నారు. పది రోజుల్లో పదోన్నతుల ద్వారా నియమించేందుకు విధివిధానాలను రూపొందిస్తున్నారు. రెండేళ్ల నుంచి హెచ్ఎం పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిచిపోవడంతో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో 100 హెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో ఇన్చార్జి హెచ్ఎంలు పని చేస్తుండడంతో సహ ఉపాధ్యాయులు వారి మాటను లెక్క చేయడం లేదు. దీంతో బోధనాభ్యాస కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. జిల్లా వ్యాప్తంగా 1791 ప్రాథమిక, 454 ప్రాథమికోన్నత, 376 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రై మరీ విభాగంలో 60, హయ్యర్ విభాగంలో 40 హెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని రెండేళ్ల నుంచి భర్తీ చేయడం లేదు. దీంతో ఆయా పాఠశాలలకు ఇన్చార్జ్ హెచ్ఎంలు ఉన్నారు. రెండేళ్ల నుంచి పదోన్నతులకు నో రెండేళ్ల నుంచి జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులను చేపట్టడం లేదు. గతంలో నెలనెలా పదోన్నతుల ప్రక్రియ ద్వారా ఖాళీ పోస్టులను భర్తీ చేసేవారు. అయితే రెండేళ్ల క్రితం ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సును ప్రభుత్వం అదనంగా రెండేళ్లు పొడిగించింది. దీంతో ఒక్క ప్రధానోపాధ్యాయుడు పదవీ విరమణ చేయలేదు. ఈ నేపథ్యంలో పదోన్నతుల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఈ డాది జూన్ ఒకటో తేదీ నుంచి ఉపాధ్యాయుల పదవీ విరమణలు ప్రారంభం కావడంతో మళ్లీ నెలనెలా పదోన్నతుల ద్వారా ఖాళీగా ఉన్న హెచ్ఎం పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పదవీ విరమణ చేసి ఖాళీగా ఉన్న పోస్టుల్లో పదోన్నతుల ద్వారా హెచ్ఎంలను నియమిస్తారు. ప్రాథమిక పాఠశాలల హెచ్ఎం పోస్టులను ఎస్జీటీ ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాలల హెచ్ఎంలకు స్కూల్ అసిస్టెంటు ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించి భర్తీ చేస్తారు. ఈ మేరకు ఎంఈఓలు, డీవైఈఓలకు ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను ఇవ్వాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు సీనియారిటీ జాబితాను డీఈఓ బ్లాగ్‌లో ఉంచి అభ్యంతరాలకు కూడా పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియ మొత్తం దాదాపుగా పది రోజుల్లో పూర్తి కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ వెంటనే ఖాళీ హెచ్ఎం పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసేందుకు రంగం అంతా సిద్ధమైంది. ఆర్‌ఎంఎస్‌ఏ పోస్టులను భర్తీ చేయాలి గతంలో 31 మంది స్కూల్ అసిస్టెంట్లకు ఆర్‌ఎంఎస్‌ఏ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి కల్పించారు. దీంతో ఆయా పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. వీటిని కూడా పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. పది రోజుల్లో హెచ్ఎం పోస్టులను భర్తీ చేస్తాం: రవీంద్రనాథ్‌రెడ్డి, డీఈఓ జిల్లాలో ఖాళీగా ఉన్న హెచ్ఎం పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పది రోజుల్లో పదోన్నతుల ద్వారా నియమిస్తాం. ఇప్పటికే ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు కోరాం. ఆ ప్రక్రియ పూర్తవ్వగానే పదోన్నతులు చేపడుతున్నాం. రెండేళ్ల నుంచి పదవీ విరమణలు లేకపోవడంతోనే ఖాళీ హెచ్ఎం పోస్టులను భర్తీ చేయలేకపోయాం. -
బోధనలో మార్పు అవసరం
– పక్కాగా సీసీఈ మెథడ్ అమలు – హెచ్ఎంల సమావేశంలో డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : కంటిన్యూవస్ కాంప్రెహెన్సివ్ ఎవాల్యేషన్(సీసీఈ) పద్ధతిని పకడ్బందీగా అమలు చేయాలని డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. సీసీఈ మెథడ్ అమలు నేపథ్యంలో విద్యార్థులు బట్టి విధానానికి స్వస్తి పలకాల్సి ఉంటుందని, ఇందుకోసం ఉపాధ్యాయుల బోధన తీరులో మార్పు రావాలన్నారు. బీక్యాంపు బాలికోన్నత పాఠశాలలో శనివారం కర్నూలు డివిజన్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సీసీఈ పద్ధతిపై అవగాహన కల్పించారు. సీసీఈ పద్ధతిలో 80 మార్కులు రాత పరీక్షకు(ఎక్సట్రనల్స్), 20 మార్కులు ప్రాజెక్టువర్కుకు(ఇంటర్నల్స్) ఉంటాయన్నారు. ఇందులో ఇంటర్నల్ మార్కులను నిబంధనల మేరకు సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయుడే ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వాటిపై డిసెంబర్, జనవరినెలల్లో ప్రత్యేక బందాలతో విచారణ జరిపిస్తామని తెలిపారు. విద్యార్థులు బట్టీ విధానం నుంచి బయట పడేలా చూడాలన్నారు. ఇందుకోసం సబ్జెక్టుపై విద్యార్థికి పూర్తిస్థాయి అవగాహన కల్గేలా బోధించాలన్నారు. అప్పుడే వారు పరీక్షల్లో మంచిమార్కులు తెచ్చుకొని ముందుకు వెళ్తారన్నారు. మెరిట్ విద్యార్థులను దత్తత తీసుకోండి.. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో ప్రతి పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులు పదికి పది గ్రేడ్ తెచ్చుకునేలా చర్యలు తీసుకోవాలని, అలాంటి విద్యార్థులను దత్తత తీసుకుని చదివించాలని డీఈఓ.. హెచ్ఎలకు సూచించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను గాడిలో పెట్టాలన్నారు. ప్రతిరోజు ఎంతమంది విద్యార్థులు భోజనం చేశారన్న వివరాలను ఫోన్ ద్వారా సీఎం డ్యాస్ బోర్డుకు పంపాలన్నారు. పాఠశాల ఆవరణాలు, మైదానాల్లో మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. అనంతరం రిసోర్సు పర్సన్లు గోవిందరెడ్డి, తైమూరు సీసీఈ పద్ధతిపై అవగాహన కల్పించారు. డీవైఈఓలు మౌలాలి, తహెరాసుల్తానా, డీసీఈబీ కార్యదర్శి ఓంకార్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
2లక్షల73వేల మొక్కలు నాటాం : డీఈఓ
నార్కట్‌పల్లి: హరితహారం కార్యక్రమంలో విద్యా శాఖ అధ్వర్యంలో జిలాల్లో 2లక్షల 66 వేల మొక్కలు నాటవలసి ఉండగా ప్రస్తుతానికి 2లక్షల 73 వేల 4వందల మొక్కలు నాటినాట్లు డీఈఓ చంద్రమోహన్ తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని చిన్ననారయణపురం గ్రామంలోని ప్రా«థమిక పాఠశాలలో మొక్కలు నాటి మాట్లాడారు. వీరి వెంట ఎంపీపీ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, ఎంపీడీఓ గుర్రం సురేశ్, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎపీఓ వెంకటేశం, సర్పంచ్ రాములు, ఉప సర్పంచ్ లింగయ్యలున్నారు, -
ఎన్ఎంఎంఎస్ విద్యార్థుల ఆధార్ నంబర్‌ను బ్యాంకులో సమర్పించాలి
విద్యారణ్యపురి : నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్ష 2014, 2015 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల ఆధార్ నంబర్లను బ్యాంక్ అకౌంట్ నంబర్‌కు లింకు చేసేందుకు సంబంధిత బ్యాంకు మేనేజర్‌ను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సం ప్రదించాలని డీఈఓ పి.రాజీవ్ కోరారు. ఈ నెల 28వ తేదీ వరకు బ్యాంక్ అకౌంట్ నంబర్ తో విద్యార్థి ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయాలన్నారు. మెరిట్ స్కాలర్షిప్స్ ప్రభుత్వం ద్వారా ఆయా విద్యార్థుల బ్యాంకు ఖాతా లో జమ చేస్తారని అన్నారు. -
డీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు
ఏలూరు సిటీ : డీసెట్–16 ప్రవేశ పరీక్ష రాసిన అభ్యర్థులకు వెబ్ ఆప్షన్స్, మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లో మార్పులు చేశారని, కొత్తగా జారీ చేసిన షెడ్యూల్‌ను అభ్యర్థులు గమనించాలని డీఈవో డి.మధుసూదనరావు మంగళవారం విలేకరులకు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ప్రభుత్వంచే ఆమోదం పొందిన ప్రై వేటు కాలేజీలు 492, ప్రభుత్వ Mలేజీలు 14 ఉన్నాయన్నారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్స్ వచ్చేనెల 1వ తేదీ వరకు నిర్వహిస్తారని, సీట్ల కేటాయింపు 2వ తేదీ నుంచి 5 వరకు నిర్వహిస్తారన్నారు. సీట్ల కేటాయింపు పత్రాలు 6వ తేదీన డౌన్లోడ్ చేసుకోవాలని, 7, 8 తేదీల్లో ప్రభుత్వ డైట్ కాలేజీల్లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలని తెలిపారు. కళాశాలల్లో తరగతులు ఆగస్టు 9వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు. రెండో విడతకౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఆగస్టు 12వ తేదీ నాటికి జిల్లాలో ఖాళీల జాబితాను డైట్ కాలేజీ ప్రిన్సిపల్స్ తెలియజేయాల్సి ఉంటుందని చెప్పారు. 11వ తేదీ నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్స్, 16 నుంచి 18 వరకు సీట్ల కేటాయింపు, 19న సీట్లు కేటాయిస్తూ పత్రాల జారీ, 20వ తేదీ నుంచి 22 వరకు డైట్ కాలేజీల్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు మొదటి విడత కౌన్సిలింగ్‌కు హాజరై ఏదైనా కళాశాలలో సీటు కేటాయింపు జరిగితే కళాశాల మార్పుకు రెండో విడత కౌన్సిలింగ్లో అనుమతి ఉండదని డీఈవో స్పష్టం చేశారు. -
జర్నలిస్టు పిల్లలందరికి 50 శాతం రాయితీ
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో పత్రికల్లో పనిచేసే జర్నలిస్టు పిల్లలందరికి ప్రైవేటు పాఠశాలలో 50 శాతం రాయితీ ఇప్పించేందుకు కృషి చేస్తానని డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక డీసీఈబీలో మంగళవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిçస్టులతో నిర్వహించిన సమావేశంలో డీఈఓ మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేసే జర్నలిస్టులకు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యం మానవతా సహృదంతో 50 శాతం రాయితీ ఇవ్వాలని కోరారు. జిల్లాలో గతేడాదే కొంతమేర అమలు అయ్యిందని ఈ ఏడాది పూర్థిస్థాయిలో అమలు చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఎక్కడైనా 50 శాతం రాయితీ ఇవ్వకుంటే తమదృష్టికి తీసుకు రావాలన్నారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ డీఈఓ ప్రతాప్‌రెడ్డి చిత్తూరు జిల్లాలో పనిచేసేటప్పుడే ఆ జిల్లాలో జర్నలిస్టు పిల్లలకు 50 శాతం రాయితీ ఇప్పించారన్నారు. సమావేశానంతరం పలు పత్రికల ప్రతినిధులకు రాయితీకి సంబంధిచిన పత్రాలను అందజేశారు. ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు రామాంజనేయరెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
విద్యావలంటీర్ల ఎంపిక జాబితా వెల్లడి
విద్యారణ్యపురి : జిల్లాలో 48 మండలాల్లో పాఠశాలల్లో విద్యా వలంటీర్ల నియమాకం కోసం ఎంపిక జాబితాను సోమవారం డీఈఓ పి.రాజీవ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయా మండలాల్లోని ఎమ్మార్సీ భవనాల్లో ఎంపిక జాబితా ప్రదర్శించారు. జిల్లాలో 493 మంది విద్యావలంటీర్ల నియామకం కోసం నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో 465 మందిని ఎంపిక చేసి జాబితాను వెల్లడించారు. మరో 26 మంది ఏజెన్సీ పాఠశాలలకు సంబంధించిన వా టిని పలు కారణాలతో పెండింగ్ పెట్టారు. మరో రెండు చోట్ల ఇద్దరు ఉర్దూ మీడియంలో విద్యావలంటీర్లు లభించలేదు. కాగా, ఎంపికైన విద్యావలంటీర్లు ఈనెల 26న తమకు కేటాయిం చిన పాఠశాలల్లో చేరాలని డీఈఓ కోరారు. -
విద్యావలంటీర్ల ఎంపిక జాబితా వెల్లడి
విద్యారణ్యపురి : జిల్లాలో 48 మండలాల్లో పాఠశాలల్లో విద్యా వలంటీర్ల నియమాకం కోసం ఎంపిక జాబితాను సోమవారం డీఈఓ పి.రాజీవ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయా మండలాల్లోని ఎమ్మార్సీ భవనాల్లో ఎంపిక జాబితా ప్రదర్శించారు. జిల్లాలో 493 మంది విద్యావలంటీర్ల నియామకం కోసం నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో 465 మందిని ఎంపిక చేసి జాబితాను వెల్లడించారు. మరో 26 మంది ఏజెన్సీ పాఠశాలలకు సంబంధించిన వా టిని పలు కారణాలతో పెండింగ్ పెట్టారు. మరో రెండు చోట్ల ఇద్దరు ఉర్దూ మీడియంలో విద్యావలంటీర్లు లభించలేదు. కాగా, ఎంపికైన విద్యావలంటీర్లు ఈనెల 26న తమకు కేటాయిం చిన పాఠశాలల్లో చేరాలని డీఈఓ కోరారు. -
నాణ్యమైన విద్యనందించాలి
బోధన్ : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన అందించాలని డీఈవో లింగయ్య ఆదేశించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలన్నారు. శనివారం బోధన్ మండలంలో సుడిగాలి పర్యటన చేసిన ఆయన.. ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని, మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అమలు చేయాలన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయా పాఠశాలలో విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సామర్థ్యాలను పరిశీలించారు. జాడిజమాల్‌పూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల హజరు రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. రాంపూర్ ప్రాథమిక పాఠశాల, కల్దుర్కి జెడ్పీ హైస్కూళ్లను పరిశీలించారు. తరగతి గదుల తీర్చాలని కల్దుర్కి వాసులు డీఈవోను కోరారు. అనారోగ్యానికి గురైన టెన్త్ విద్యార్థి శ్రీకాంత్ వైద్య ఖర్చుల కోసం ఉపాధ్యాయ బృందం, పూర్వ విద్యార్థులు పోగు చేసిన రూ.21 వేల నగదును డీఈవో విద్యార్థికి అందజేశారు. ఆయన వెంట ఎంఈవో కందారే శంకర్, సర్పంచ్ మరయ్య, విశ్రాంత హెచ్ఎం గోపాల్‌రెడ్డి తదితరులున్నారు. ‘మీలాగే డీఈవోనవుతా..’ ఖండ్గాం యూపీఎస్‌ను తనిఖీ చేసిన డీఈవో అక్కడి నుంచి బిక్నెల్లి తెలుగు మీడియం ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు. అక్కడి విద్యార్థులతో ముచ్చటించిన డీఈవో.. బడికి ఎందుకు వస్తున్నారని ప్రశ్నించగా, చదువుకునేందుకు వస్తున్నామని సమాధానమిచ్చారు. చదువుకుని ఏమి కావాలనుకుంటున్నారని అడిగితే.. మీలాగే డీఈవోనవుతానని ఓ బాలిక సమాధానం ఇవ్వడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఆమెకు తన పెన్నును బహుమతిగా ఇచ్చారు. -
బోన్ క్యాన్సర్ విద్యార్థికి ఆర్థిక సహాయం
నిజామాబాద్‌అర్బన్ : బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న విద్యార్థికి పాఠశాల అధ్యాపక బృందం, డీఈవో లింగయ్య సంయుక్త ఆధ్వర్యంలో రూ. 21 వేల ఆర్థిక సహాయం చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కి జడ్పీహెచ్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి శ్రీకాంత్ బోన్‌క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇతనికి జిల్లా విద్యాశాఖ అధికారి రూ. 21 వేలు అందించారు. కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ చంద్రశేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులు సమయాన్ని పాటించాలి
జిల్లా విద్యాశాఖాధికారిణి విజయలక్ష్మి రాపూరు: ఉపాధ్యాయులు సమయాన్ని పాటించాలని జిల్లా విద్యాశాఖాధికారిణి విజయలక్ష్మి సూచించారు. రాపూరులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమయాన్ని పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధ్యాయులు సమయాన్ని పాటిస్తే విద్యార్థులు గంట కొట్టకముందే వస్తారన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లకు నీటి వసతి లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని విలేకరులు ఆమె దృష్టికి తీసుకురాగా, నీటి సదుపాయాన్ని కల్పించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ఎస్ఎంసీ ఎన్నికలు పూర్తయితే కమిటీ చైర్మన్ బాధ్యత వహిస్తారన్నారు. కంప్యూటర్లు నిరుపయోగంగా ఉన్నాయని ఆమె దృష్టికి తీసుకురాగా కంప్యూటర్ విద్యను అందిస్తామన్నారు. రాపూరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బాలికలు మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని, కనీసం తలుపులు కూడా సక్రమంగా లేవని, మరమ్మత్తులు చేయించాలని డీఈఓను కోరారు. స్పందించిన ఆమె తలుపులకు వెంటే మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. తొలుత పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటినారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖాధికారి శ్రీనివాసులురెడ్డి, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు పాల్గొన్నారు. -
సమాజంపై అవగాహన పెంచుకోవాలి
రెంజల్ : విద్యార్థులు విద్యతోపాటు సమాజంపైనా అవగాహన పెంచుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి లింగయ్య సూచించారు. రెంజల్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వందేమాతరం, మై విలేజ్ మోడల్ విలేజ్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఇస్తున్న శిక్షణ తరగతులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని 20 కేజీబీవీలనుంచి విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నామన్నారు. పది రోజులపాటు శిక్షణ కొనసాగుతుందన్నారు. ‘‘లిటిల్ లీడర్స్.. లిటిల్ టీచర్స్’’ అనే అంశం ఆధారంగా శిక్షణ కొనసాగుతోందన్నారు. శిక్షణ పొందినవారు తమ విద్యాలయంలో తోటి విద్యార్థులకు ఆయా అంశాలపై అవగాహన కల్పించాల్సి ఉంటుందన్నారు. దసరా, సంక్రాత్రి, వేసవి సెలవుల్లో ఈ పద్ధతులను విస్తరిస్తామన్నారు. ‘‘లిటిల్ లీడర్స్.. లిటిల్ టీచర్స్’’ అంశంపై కామారెడ్డి ప్రాంతానికి చెందిన 42 మంది బాలికలకు మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో శిక్షణ ఇప్పించామని వందేమాతరం ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీపతిరెడ్డి, మై విలేజ్ మోడల్ విలేజ్ వ్యవస్థాపకుడు బాల్‌రాజ్‌గౌడ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన రెంజల్ కస్తూర్బా విద్యాలయంలో శిక్షణ పొందుతున్న 300 మంది బాలికలకు వారే శిక్షణ ఇస్తున్నారన్నారు. శిక్షణకు అవసరమైన మెటీరియల్‌ను తమ ఫౌండేషన్ అందిస్తోందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో పద్మనాభన్, బోధన్ రూరల్ సీఐ శ్రీనివాసులు, ఎంఈవో సంజీవ్‌రెడ్డి, సర్పంచ్ సవిత, ఎంపీటీసీ సభ్యురాలు కవిత, ఎస్సై రవికుమార్, పాఠశాల నిర్వాహకురాలు మమత తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ వర్సెస్ డీఈవో
అక్రమ పదోన్నతులపై డీఈవోను నిలదీసిన ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గుంటూరు వెస్ట్: జిల్లాలో ముగ్గురు ఉపాధ్యాయులకు నిబంధనలకు విరుద్ధంగా ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులుగా కల్పించిన పదోన్నతుల అంశాన్ని ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు శుక్రవారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో లేవనెత్తారు. పోస్టు ఖాళీ కావడానికి రెండు రోజుల ముందే అపాయింట్మెంట్ ఇచ్చారని, తర్వాత తప్పును సరిదిద్దుకుని మరో తేదీతో పోస్టింగ్ ఇచ్చారని తెలిపారు. ఈ విషయంలో రాజకీయ ఒత్తిళ్లు లేకపోయినా, కౌన్సెలింగ్‌తో సంబంధం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు కల్పించడంలో ఉన్న మతలబు ఏమిటో చెప్పాలని డీఈవో కేవీ శ్రీనివాసులరెడ్డిని నిలదీశారు. నిబంధనల ప్రకారమే పదోన్నతులు కల్పించానని, ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదంటూ డీఈవో సమాధానం ఇచ్చారు. ఈ విషయంలో వారిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. డీఈవో చాలా నిర్లక్ష్యంగా ఎమ్మెల్సీకి సమాధానం చెప్పడంతో సభ్యులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టమని, ఎంతదూరమైనా వెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని, నిబంధనలను ఉల్లంఘించిన మీరు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదంటూ ఎమ్మెల్సీ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. -
‘డిజిటల్’ చదువులు
► ఉన్నత పాఠశాలల్లో పకడ్బందీగా అమలు చేయాలి ► వీడియో కాన్ఫరెన్స్‌లో హెచ్ఎంలకు డీఈఓ ఆదేశం తెలంగాణలోనే మొదటిసారిగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ క్లాసుల బోధన సోమవారం జిల్లాలో ప్రారంభమైంది. ప్రైవేట్‌కు తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలతోపాటు విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు డీఈఓ రమేష్ డిజిటల్ క్లాసుల బోధనకు శ్రీకారం చుట్టారు. - తాండూరు తాండూరు: తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో దృశ్యశ్రవణం ద్వారా పాఠ్యాంశాల (డిజిటల్ క్లాసుల) బోధ న జిల్లాలో సోమవారం మొదలైంది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలతోపాటు విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు జిల్లా విద్యాధికారి రమేష్ డిజిటల్ క్లాసుల బోధనకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని ఈనెల 15న ‘సాక్షి’ దినపత్రికలో జిల్లాలో ఇక ‘డిజిట ల్ చదువులు’ శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. రాష్ట్ర మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) నుంచి ఇందుకోసం సుమారు రూ.50 వేల నిధులను కేటాయించారు. ఇందులో భాగంగా వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హైదరాబాద్ నుంచి తెర, ప్రొజెక్టర్, రెండు స్పీకర్లు తదితర సాంకేతిక పరికరాలను కొనుగోలు చేశారు. కొన్ని ఉన్నత పాఠశాలల్లో సోమవారం లాంఛనంగా డిజిటల్ క్లాసులను ప్రధానోపాధ్యాయులు ప్రారంభించారు. డిజిటల్ క్లాసుల అమలుపై డీఈఓ రమేష్ సోమవారం ప్రధానోపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిజిటల్ క్లాసులను ప్రధానోపాధ్యాయులు పక్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. తాండూరులోని ప్రభుత్వ నంబ ర్-1 పాఠశాలలో డిజిటల్ క్లాసులను ప్రధానోపాధ్యాయుడు ప్రారంభించారు. యాలాల బా లుర ఉన్నత పాఠశాలలో ఎంఈఓ ప్రారంభిం చారు. బషీరాబాద్, యాలాల, తాండూరు, పెద్దేముల్ మండలాల పరిధిలోని దామర్‌చెడ్, బెన్నూర్, యాలాల (బాలికల), దేవనూర్, రెడ్డిఘనాపూర్, మంతట్టి, బషీరాబాద్ (ఉర్దూమీడియం), నవల్గ, గోటిగ, జీవన్గీ, పెద్దేముల్ పాఠశాలలకు సాంకేతిక పరికరాలు వచ్చాయి. అందరికీ డిజిటల్ విద్య అవసరం: యాంకర్ సుమ శంషాబాద్: నేటి సమాజంలో అందరికీ డిజి టల్ విద్య అవసరమని యాంకర్ సుమ అ న్నారు. శంషాబాద్ పట్టణంలోని జిల్లా పరి షత్ బాలికల ఉన్నత పాఠశాలకు సోమవా రం సొంత ఖర్చులతో డిజిటల్ విద్యకు సం బంధించిన పరికరాలను ఆమె అందజేశారు. గతంలో పాఠశాలలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న యాంకర్ సుమ పాఠశాల అభివృద్ధికి చేయూతనందించేం దుకు సిద్ధమయ్యారు. ఇటీవలే పాఠశాలకు కొంత మొత్తాన్ని ఆర్థిక సాయంగా అందజేసిన సుమ తాజాగా డిజిటల్ పరికరాలను అందజేయడంతో పాఠశాల హెచ్ఎం ఉమామహేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మేలు.. డిజిటల్ క్లాసులతో ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు మేలు జరుగుతుంది. దృశ్యశ్రవణబోధనతో విద్యార్థులకు పాఠ్యాంశాలపై అవగాహన పెరుగుతుంది. త ద్వారా విద్యాప్రమాణాలు మెరుగుపడతాయి. - డి.రమేష్, హెచ్ఎం, రెడ్డి ఘనాపూర్, ఉన్నత పాఠశాల -
డీఈవో సమక్షంలో పరీక్ష: విద్యార్థులకు సున్నాలు
లావేరు (శ్రీకాకుళం) : జిల్లా విద్యాశాఖ అధికారి జరిపిన ఆకస్మిక తనిఖీల్లో భాగంగా నిర్వహించిన పరీక్షలో పలువురు విద్యార్థులకు సున్నా మార్కులు రావడంతో ఆయన విస్తుపోయారు. శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) దేవానంద్‌రెడ్డి సోమవారం లావేరులోని ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో 4,5 తరగతుల విద్యార్థుల విద్యా ప్రమాణాలను తెలుసుకునేందుకు పరీక్ష నిర్వహించగా.. 9 మందికి సున్నా మార్కులు వచ్చాయి. మరో ఏడుగురు విద్యార్థులకీ అత్తెసరు మార్కులే. 4, 5 వ తరగతులు చదువుతున్న 28 మంది విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. కొంతమందికి సున్నామార్కులు రాగా, మరికొంతమందికి 40 శాతం లోపే వచ్చాయి. దీంతో డీఈవో అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. ప్రధానోపాధ్యాయుడు రమేశ్, ముగ్గురు టీచర్లు, లావేరు క్లస్టర్ విద్యాశాఖ సీఆర్పీ పద్మావతిలకు వెంటనే షోకాజు నోటీసులు జారీ చేశారు. -
ఇద్దరు టీచర్ల సస్పెన్షన్
శ్రీకాకుళం జిల్లా రాజాం మండలంలో ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాకాధికారి దేవానందరెడ్డి సోమవారం సాయంత్రం తెలిపారు. 9 వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రాజాం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు వి. రామ్మూర్తి నాయుడు ని సస్పెండ్ చేశారు. కాగా.. విధులకు సరిగా హాజరుకాని మరో టీచర్ పై కూడా సస్పెన్షన్ వేటు పడింది. రాజాం మండలం గోపాలపురం ప్రాధమిక పాఠశాలలో పనిచేస్తున్న సీహెచ్ మురళి స్కూలుకు హాజరుకాకుండా డుమ్మా కొడుతుండటంతో.. ఆతనిని సస్పెండ్ చేసిన ట్లు డీఈవో తెలిపారు. -
సస్పెండైన డీఈవోలకు తిరిగి పోస్టింగ్‌లు
హైదరాబాద్: సస్పెన్షన్‌కు గురైనా ఇద్దరు మాజీ డీఈవోలకు తిరిగి పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. గత సెప్టెంబరులో జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో మెదక్, వరంగల్ జిల్లాల విద్యాశాఖాధికారులు నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపణలొచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. మెదక్ జిల్లా డీఈవోగా పనిచేసిన రాజేశ్వర్‌రావుకు టెట్ డెరైక్టర్ కార్యాలయంలో డిప్యూటి డెరైక్టర్‌గానూ, వరంగల్ డీఈవోగా పనిచేసిన చంద్రమోహన్‌కు ఎస్సీఈఆర్టీలో డిప్యూటి డెరైక్టర్‌గానూ పోస్టింగులు లభించాయి. -
రెండు వారాల్లో డీఎస్సీ నియామకాలు
కోర్టు కేసులు వీలైనంత సత్వరం పరిష్కరించి.. రెండు వారాల్లో డీఎస్పీ నియామకాలు జరుపుతామని ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు డీఈవోలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలియజేశారు. రేషనలైజేషన్ అవకతవకలకు పాల్పడ్డ కృష్ణా జిల్లా డీఈవో.. మహిళలపై వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నూలు డీఈవోలపై సస్పెన్షన్ వేటు పడింది. మరో వైపు 9,10 తరగతులకు సంబంధించి పాత విధానమే కొనసాగుతుందని గంటా స్పష్టంచేశారు. -
కర్నూలులో ఉపాధ్యాయుల ధర్నా
అవినీతికి పాల్పడుతున్న జిల్లా విద్యా శాఖ అధికారిని సస్పెండ్ చేయాలంటూ బుధవారం ఉపాధ్యాయ సంఘాలు రోడ్డుకెక్కాయి. తనిఖీల పేరుతో డీఈవో ప్రతి పాఠశాల నుంచి రూ 10వేల నుంచి రూ.20 వేల రూపాయలు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగిన వారు.. డీఈవో పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఎస్టీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలకు చెందిన టీచర్లు పాల్గొన్నారు. -
200 మంది టీచర్లపై సైబర్ క్రైం కంప్లైంట్
సైబర్ నేరానికి పాల్పడ్డారంటూ.. జిల్లాకు చెందిన 200 మంది ఉపాధ్యాయులపై జిల్లా విద్యాశాఖ అధికారి మధుసూదనరావు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయులు ఇతరుల అకౌంట్ కు లాగిన్ అయ్యి తప్పుడు ఫిర్యాదులు, అభ్యంతరాలు వ్యక్తం చేశారని.. దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని ఆయన వివరించారు. జిల్లాలో ఇప్పటికి 800 అభ్యంతరాలు అందాయని.. వీటిలో అర్హత గల 500 అభ్యంతరాలను స్వీకరించామని చెప్పారు. పూర్తి విచారణ అనంతరం తప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఉపాధ్యాయులను గుర్తించామని.. అన్నారు. బదిలీలకు సంబంధించి జిల్లాలో 4,573 దరఖాస్తులు అందాయని తెలియజేశారు. -
బదిలీ టీచర్లలో వెబ్..డబ్..
- 7 వేల మందికి తప్పని స్థానచలనం - పనితీరు ప్రతిభ ఆధారంగా బదిలీ పాయింట్లు - వెబ్ కౌన్సెలింగ్‌లో ఆరు స్టేజ్‌లు - కౌన్సెలింగ్ నిర్వహణకు సిద్ధం డీఈఓ విజయనగరం అర్బన్: గంటకో ప్రకటన, రోజుకొక జీవో రావడంతో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ గందరగోళంగా తయారయింది. విద్యాసంత్సరం ప్రారంభం నాటికి టీచర్ల బదిలీ పూర్తిచేస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పటికీ బదిలీల స్పష్టత ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. ప్రాథమిక పాఠశాలల్లో రెండేళ్లుగా బదిలీలు చేపట్టలేదు. మూడేళ్లుగా హేతుబద్ధీకరణ లేదు. రెండింటినీ కలిపి ప్రస్తుతం నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపధ్యంలో బదిలీల కోసం ఎదురుచూస్తున్న వారు కొందరైతే.. నిబంధనలకు లోబడి తప్పనిసరిగా మారాల్సిన వారు మరికొందరు ఉన్నారు. విద్యాసంవత్సరం మధ్యలో జరపడం వల్ల ఎక్కడికి వెళ్లాల్సిన ఉంటుందోనని దాదాపుగా అందరూ ఆందోళన చెందుతున్నారు. ఏడువేల మందికి స్థాన చలనం ! జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పరిధిలో 13 వేలమంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో ప్రస్తుతం సుమారు ఏడు వేల మందికి బదిలీలు, హేతుబద్ధీకరణ ప్రక్రియలో స్థానచలనం ఖాయమని విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంచనా వేస్తున్నారు. ఉపాధ్యాయుల బదిలీలను ఈ నెల రెండవ వారంలోనే నిర్వహించాలని భావించి, షెడ్యూల్ కూడా విడుదల చేశారు. ఆ తరువాత వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలంటూ మంత్రి గంటా ప్రకటించారు. వెనువెంటనే మరో ప్రకటనలో ఉపాధ్యాయుల వృత్తిప్రతిభ ప్రాధిపతికన పాటించాలంటూ సీఎం పేర్కొన్నారు. దీంతో త్వరలోనే బదిలీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అకాశం ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. తక్కువ మంది విద్యార్థులున్న కిలోమీటరు పరిధిలోని ప్రాథమిక పాఠశాలలను ఆదర్శపాఠశాల పేరుతో విలీనం చేసేందుకు ప్రభుత్వం జీఓ నంబర్ 45ని విడుదల చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 30 లోపు విద్యార్థులున్న 194 పాఠశాలలను 262 పాఠశాలల్లో విలీనం చేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. వీటిల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించినున్నారు. కేవలం హేతుబద్ధీకరణ పేరుతోనే సూమారు 800 మందికిపైగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయనున్నారు. ఈ నేపధ్యంలో అధిక సంఖ్యల్లో ఉపాధ్యాయులకు స్థానచలనం తప్పదని స్పష్టమవుతోంది. పనితీరు ప్రతిభ ఆధారంగా బదిలీ పాయింట్లు సీఎం ప్రకటన నేపధ్యంలో ముందుగా ఉపాధ్యాయుల పనితీరును వివరాలను సిద్ధం చేసుకొని బదిలీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ఉపాధ్యాయ పనితీరును గుర్తించే ప్రక్రియలో విద్యార్థి ఉత్తీర్ణత శాతంతోపాటు, స్థానిక నివాసం, టీచర్ పిల్లలను వాళ్లు పనిచేసిన స్కూళ్లలో చదివించడం వంటి టీచర్ వ్యక్తగత వృత్తిప్రమాణాలకు మార్కులు వేసి వారికి ప్రాధాన్యం ఇస్తారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇలాంటి పద్ధతిని పాటించడంతో టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ఆరు స్థాయిల్లో ... బదిలీల ప్రక్రియను మొత్తం ఆరు స్థాయిల్లో నిర్వహించనున్నారు. ముందుగా .. ఇప్పటికే ఉన్న ఖాళీలు, ఎనిదేళ్లు ఒకేచోట సర్వీసు కలిగిన వారి ఖాళీలు, హేతుబద్ధీకరణ ఖాళీలను ప్రదర్శిస్తారు. అనంతరం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు మూడు రోజులు సమయం ఇస్తారు. ఉపాధ్యాయుడు దరఖాస్తు చేసిన ప్రింట్‌ను తీసుకొని సంబంధిత ధ్రువీకరణవపత్రాలతో మండల విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయులకు సమర్పించి నిర్ణరించుకోవాలి. వారు వాటిని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి పంపుతారు. అనంతరం తాత్కాలిక సీనియార్టీ జాబితాను ఎన్టైటిల్మెంట్ పాయింట్లతో వెబ్సైట్లో ఉంచుతారు. దీనిపై దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల సెల్‌ఫోన్‌కు పాస్వర్డ్ వస్తుంది. అనంతరం ఆన్లైన్లోనే తాము పనిచేదలుచుకున్న, కోరుకున్న పాఠశాలల వివరాలను నమోదు చేయాలి. అవసరమైతే రెండుసార్లు వాటిని మార్చుకొనే అవకాశం కూడా కల్పిస్తున్నారు. వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా సీనియారిటీలో తమ కిందనున్న వారు ఖాళీ చేసిన స్థానాలను సైతం ఎంపిక చేసుకొనే వెసులుబాటు కల్పిస్తారు. గతంలో ఈ తరహా సదుపాయం ఉండేదికాదు. ఆంగ్ల మాధ్యమం పాఠశాలలను కోరుకున్న వారు ఇకపై ఆ పాఠశాలలోనే పనిచేయాల్సి ఉంటుంది. వెబ్‌కౌన్సెలింగ్ ముగిసిన ఐదు రోజుల్లో బదిలీ ఉత్తర్వులు పంపుతారు. ఉపాధ్యాయుల సెల్‌నంబర్లకు కూడా సంక్షిప్త సమాచారం పంపే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కౌన్సెలింగ్ నిర్వహణకు సిద్ధం డీఈఓ హేతుబద్ధీకరణ, వెబ్‌కౌన్సెలింగ్ ప్రక్రియలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు డీఈఓ జి.కృష్ణారావు తెలిపారు. తొలిసారి వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు నిర్వహిస్తుండటంతో కొందరికి అవగాహనలేదని ముందుగానే టీచర్లకు శిక్షణ ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. కౌన్సెలింగ్‌పై స్పష్టమైన సెడ్యూల్ రానందున ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నామని తెలిపారు. ఎప్పుడు కౌన్సెలింగ్ నిర్వహించమన్నా సిద్ధం ఉన్నామని డీఈఓ స్పష్టం చేశారు. -
ఉంటావో.. వెళ్తావో తేల్చుకో..!
డీఈవో శ్రీనివాసాచారిపైఓ ముఖ్య ప్రజాప్రతినిధి ఆగ్రహం సెలవులో వెళ్లిన డీఈవో.. అదేబాటలో ఏడీ ఇన్చార్జి డీఈవోగా జెడ్పీ ఉప విద్యాధికారి కట్టా ఆనందం కరీంనగర్ : జిల్లా విద్యాశాఖ అధికారులపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లు ఎక్కువ అయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లో తన నియోజకవర్గం నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన ఉపాధ్యాయులను తిరిగి యథాస్థానాల్లో కొనసాగించాలని డీఈవోను ఆదేశించినట్టు తెలిసింది. డీఈవో అందుకు ససేమిరా అనడంతో సదరు ప్రజాప్రతినిధి తన మాటే వినడం లేదని తీవ్రంగా మండిపడ్డట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే డీఈవో బదిలీపై వెళ్లినట్లు విద్యాశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లా విద్యాశాఖ అధికారిగా జూన్ 19న బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసాచారి వచ్చి రాగానే ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, రేషనలైజేషన్ షెడ్యూల్ వెలువడడంతో ప్రజాప్రతినిధుల ఒత్తిడి తాకిడి అక్కడి నుంచే మొదలైంది. ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలకు తలొగ్గకుండా నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్ ప్రక్రియను ముగించారు. రేషనలైజేషన్ ద్వారా ఉన్న చోట నుంచి దూరప్రాంత పాఠశాలలకు బదిలీ అయిన ఉపాధ్యాయులను యథా స్థానాల్లోనే కొనసాగించాలని ఒత్తిళ్లు రావడం, డీఈఓ అందుకు ససేమిరా అనడంతో వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. చివరకు డీఈవో సెలవుపై వెళ్లేంత వరకు వెళ్లింది. విశ్వసనీయ సమాచారం మేరకు... ఓ ముఖ్య ప్రజాప్రతినిధి తన నియోజకవర్గంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో ఒకరు మహదేవపూర్‌కు, మరొకరు మెట్‌పల్లికి, ఇంకొకరు కథలాపూర్ మండలానికి బదిలీ అయ్యారు. సదరు ప్రజాప్రతినిధి ఈ ఉపాధ్యాయులు యథా స్థానంలోనే కొనసాగేలా కొద్దిరోజులుగా చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొట్టడంతో డీఈఓపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒక దశలో 'నేను చెబితే పని చెయ్యవా... ఉంటావో.. వెళ్తావో తేల్చుకో... రెండు రోజుల్లో వారి బదిలీని రద్దు చేసి యథా స్థానాలకు పంపాలి..'అంటూ హుకుం జారీ చేశారని తెలిసింది. దీనికి డీఈఓ తలొగ్గకపోవడంతో 'బ్లడీపూల్... నేను చెబితే చెయ్యవా..'అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక చేసేదేమీ లేక డీఈవో సెలవు పెట్టి అధికారిక సిమ్‌కార్డు, సెల్‌ఫోన్‌ను సైతం వదిలివెళ్లడం గమనార్హం. డీఈఓ శ్రీనివాసాచారికి కొద్దిరోజుల్లోనే ఆర్జేడీగా ప్రమోషన్ వచ్చే ఆవకాశం ఉండడంతో ఇలాంటి తప్పిదాలకు పాల్పడి ఆనవసర వివాదాల్లో తలదూర్చడం కన్నా కొద్దిరోజుల పాటు సెలవులో ఉండడమే మంచిదని తన సన్నిహితులతో చెప్పి సెలవులో వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం నాలుగు రోజులే సెలవు పెట్టినా మళ్లీ సెలవులను పొడగించుకొని ఇక్కడికి రాకుండా ఉండేందుకే హైదరాబాద్ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూనే అధికారులపై ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏడీ కూడా సెలవులోనే... అంతా ఇన్‌చార్జీలే... డీఈఓ తరువాత విద్యాశాఖలో కీలకంగా ఉండే ఏడీ ప్రసాద్ కూడా ఐదు రోజుల క్రితమే సెలవు పెట్టి కరీంనగర్ నుంచి బదిలీ చేయించుకునే ప్రయత్నాల్లో హైదరాబాద్ ఉన్నట్లు సమాచారం. దీంతో విద్యాశాఖను గాడిలో పెట్టాల్సిన డీఈఓ, ఏడీలు లేకపోవడంతో విద్యాశాఖ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అటు ఉప విద్యాధికారులు ఆరుగురు, ఇటు మండల విద్యాధికారులు 54 మంది ఇన్‌చార్జీలే కావడంతో విద్యాశాఖ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. ఇన్చార్జి డీఈఓగా కట్టా ఆనందం... జిల్లా ఇన్చార్జి విద్యాశాఖ అధికారిగా జెడ్పీ ఉప విద్యాధికారిగా పనిచేస్తున్న కట్టా ఆనందం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే ఆనందంకు హుజూరాబాద్ ఉప విద్యాధికారిగా, జెడ్పీ ఉప విద్యాధికారిగా, కరీంనగర్ ఉప విద్యాధికారిగా, ఇటు ఇన్చార్జి డీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తుండడంతో ఏ మేరకు విద్యాశాఖకు న్యాయం జరుగుతుందో వేచి చూడాల్సిందే. -
మెదక్ డీఈవోపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్: మెదక్ డీఈవో ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఉద్యోగుల బదిలీల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ మెదక్ డీఈవో ఏ రాజేశ్వరరావుపై ఆరోపణలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేస్తూ వేటు వేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం. ఆయన స్థానంలో మెదక్ డీఈవోగా నజీముద్దీన్ ను నియమించగా, ఖమ్మం డీఈవోగా ఎన్ రాజేశ్ ను నియమించారు. -
బదిలీల్లో డీఈవోల అక్రమాలు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల్లో డీఈవోలు విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారు. కౌన్సెలింగ్‌లో కొన్ని ముఖ్యమైన పోస్టులను చూపకుండా అవినీతికి బాట వేసుకున్నారు. ముడుపులు ఇచ్చినవారికి, రాజకీయ పలుకుబడి ఉన్నవారికి తొలుత ఓ చోట పోస్టు ఇచ్చారు. కౌన్సెలింగ్ పూర్తయ్యాక ఆర్డర్లను మార్చేసి.. దాచిపెట్టిన పోస్టుల్లో ‘తమ’వారిని నియమించేసుకున్నారు. కౌన్సెలింగ్ సమయంలోనూ ముందు వచ్చిన సీనియర్ టీచర్లకు కొన్ని ఖాళీ పోస్టులను చూపకుండా... ఆ తర్వాత వచ్చిన‘తమ’వారికి కట్టబెట్టేసుకున్నారు. ఇప్పుడీ వ్యవహారం బయటకు పొక్కడంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే వరంగల్ డీఈవోపై వచ్చిన ఆరోపణలపై విద్యాశాఖ శాఖాపరమైన విచారణ చేపట్టింది. అక్కడ రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఏడుగురు టీచర్లకు సంబంధించి బదిలీలు పూర్తయ్యాక... వెళ్లాల్సిన స్థానాలను మార్చేసినట్లు తేలింది. దీంతో ఆయనపై శాఖాపరమైన చర్యల కోసం గురువారం విద్యాశాఖ ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. ఒకటీ రెండు రోజుల్లో ఆయనపై చర్యలను ఖరారు చేయనున్నట్లు సమాచారం. మెదక్ డీఈవోపైనా తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆయనపై శుక్రవారం విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టనున్నారు. ముడుపుల బాగోతమే అక్కడి అక్రమాలకు కారణమని తెలిసింది. అలాగే హైదరాబాద్, కరీంనగర్ జిల్లాల్లోనూ ముడుపులు ముట్టజెప్పిన వారికి నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని చోట్లా: హైదరాబాద్ జిల్లాలో ఒక టీచర్ తనకు గతంలో అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లగా... దీనిని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు విద్యాశాఖకు సూచించింది. అయితే ప్రస్తుత జాబితాలో ఆ టీచర్ కంటే సీనియర్లు ఉన్నప్పటికీ పదోన్నతి కల్పించినట్లు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు గత నెల 12తో పదోన్నతుల ప్రక్రియ ముగిసినా... 13న కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకున్న మరో టీచర్‌కు 12వ తేదీతో 16న పదోన్నతి ఉత్తర్వులు ఇచ్చినట్లు పేర్కొంటున్నాయి. ఇక ఏ మేనేజ్మెంట్ టీచర్లకు ఆ మేనేజ్‌మెంట్‌లోనే పదోన్నతులు కల్పించాల్సి ఉన్నా కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లలోని పోస్టుల్లోకి జిల్లా పరిషత్ టీచర్లను బదిలీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. డీఈవోలు ముడుపులు పుచ్చుకుని ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ మండలంలో స్పౌజ్ కేటగిరీలో వచ్చిన ఓ టీచర్‌కు ఆమె కోరుకున్న స్థానాన్ని ఇవ్వలేదు, ఖాళీ లేదని చెప్పి పక్కనున్న మండలంలో పోస్టింగ్ ఇచ్చారు. కానీ ఈ ఖాళీ లేదన్న స్థానాన్నే ఆ తరువాత మరో టీచర్‌కు ఇచ్చారు. మరో మండలంలో ఎస్సీ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయ పోస్టును తమకు ముడుపులిచ్చిన వారి కోసం ఓసీ పోస్టుగా మార్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటన్నింటి నేపథ్యంలో మిగతా జిల్లాల్లోని డీఈవోలపై వచ్చిన ఆరోపణలపైనా శాఖాపర విచారణకు విద్యాశాఖ సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. విద్యాశాఖ బాధ్యతలు చూస్తున కడియం శ్రీహరి ఈ అక్రమాలపై సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. -
డీఈఓ ఘెరావ్
సిద్దిపేట జోన్ : పట్టణంలో శుక్రవారం పాఠశాలల ఆకస్మిక తనిఖీకి వచ్చిన డీఈఓ రాజేశ్వరరావును పలు విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకుని ఘెరావ్ చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజు లను నియంత్రించాలని డిమాండ్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని పలు విద్యా సంస్థలు విపరీతంగా ఫీజులను పెంచాయం టూ ఆరోపిస్తూ పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసి నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో డీఈఓ సిద్దిపేటకు వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు ముందుగా స్థానిక హైస్కూల్ ప్రధాన గేటు ఎదుట బైఠాయించి డీఈఓ కారును అడ్డుకుని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశా రు. అక్కడి నుంచి పట్టణంలోని పలు ప్రైవే టు విద్యా సంస్థలను సందర్శించిన డీఈఓకు రెం డో సారి శ్రీచైతన్య స్కూల్ వద్ద విద్యార్థి సంఘా ల నుంచి నిరసన వ్యక్తమైంది. ఫీజు నియంత్రణ కమిటీ మండలి ఆధ్వర్యంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ ఎదుట ధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఈఓకు రెండోసారి అందజేశారు. డీఈఓ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ సమస్యపై సత్వరం స్పందిస్తామని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫీజు నియంత్రణ కమిటీ ప్రతినిధులు రమేష్, శ్రీకాంత్, కుమార్, పురుషోత్తం, ప్రభాకర్, యాదగిరి, సంపత్, భరత్, ఏబీవీపీ నాయకులు నాగరాజు, లింగం, సాయి, తిరుమలేష్, నవీన్‌లు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల తీరుపై డీఈఓ అసంతృప్తి పట్టణంలోని ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయుల తీరుపై డీఈఓ రాజేశ్వరరావు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆకస్మిక తనిఖీలో భాగంగా శుక్రవారం ఆయన స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సమయంలో పాఠశాలలో ఉర్దూ మీడియానికి సంబంధించి ఐదు తరగతులకు గాను ఆరుగురు విద్యార్థులే ఉండడం (రిజిస్టర్ 12 మంది ఉన్నారు), వీరికి బోధించేందుకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉండడంపై డీఈఓ రాజేశ్వర రావు అసంతృప్తిని వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న ఎంఈఓ నాగరాజును, పాఠశాల ఇన్చార్జ్ జమీర్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వెంటనే సంబంధిత ఉర్దూ మీడియం విద్యార్థులను పట్టణంలోని ఉర్దూ పాఠశాలలోకి మార్పు చేసేలా దరఖాస్తు అందజేయాలని సూచించారు. అవసరమైతే ఉపాధ్యాయులను కూడా అక్కడికి బదిలీ చేయాలని ఆదేశించారు. పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను తనిఖీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రైవేటు విద్యా సంస్థల వైఖరి తనకు అసంతృప్తి కలిగించిందని, ఇదే చివరి గడువుగా ఆయన అల్టిమేటం జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థలన్నీ ఈ యేడు ప్రభుత్వం ముద్రించిన పాఠ్యపుస్తకాలనే వినియోగించాలని స్పష్టం చేశారు. ప్రైవేటు విద్యా సంస్థలను తాను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని ఈ సందర్భంగా ప్రైవేటు పుస్తకాలు తన దృష్టికి వస్తే అవసరమైతే పాఠశాల సీజ్ చేయడానికి కూడా వెనుకాడేది లేదన్నారు. ఆయన వెంట సంగారెడ్డి, సిద్దిపేట డిప్యూటీ డీఈఓలు శ్యాంప్రసాద్‌రెడ్డి, మోహన్, సిద్దిపేట ఎంఈఓ నాగరాజు, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు తిరుపతిరెడ్డి తదితరులున్నారు. డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా సంగారెడ్డి మున్సిపాలిటీ : ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనిల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ, ఎంఈఓ, డిప్యూటీ ఈఓ పోస్టులను భర్తీ చేయకుండా విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థి సంఘనేతలపై కేసు నమోదు... జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వరరావును అడ్డుకుని విధులకు ఆటంకం కలిగించినందుకు 13 మంది విద్యార్థి సంఘ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మండల విద్యాధికారి నాగరాజు ఫిర్యాదు మేరకు విద్యార్థి సంఘ నేతలు రమేష్, యాదగిరి, భరత్, పురుషోత్తం, సంపత్, కుమార్, ప్రభాకర్, అంజి, నవీన్, సాయి, లింగం, లక్ష్మణ్, నాగరాజులపై వన్‌టౌన్ సీఐ సురేందర్‌రెడ్డి కేసు నమోదు చేశారు. -
అంతా గోప్యం
నల్లగొండ : జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అసలు ఏం జరుగుతోంది...? ఉపాధ్యాయ బది లీలు, పోస్టుల హేతుబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం షెడ్యూల్ జారీచేసి మూడు రోజులు దాటి నా ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. షెడ్యూల్ ప్రకారం పోస్టుల హేతుబద్ధీకరణ ఈ నెల 22వ తేదీ నాటికి పూర్తిచేసి అదే రోజున ఖాళీల వివరాలు ప్రకటించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలకు అనేక అవరోధాలు అడ్డొస్తున్నాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో మిగులు పోస్టులను గుర్తించే ప్రక్రియ వేగంగానేపూర్తయినప్పటికీ ఆ తర్వాత జరగాల్సిన మిగతా కార్యక్రమాలు నె మ్మదించాయి. వివాదస్పదమైన అంశాలకు కేంద్ర బిందువుగా మారుతున్న విద్యాశాఖ...గతంలో చేపట్టిన బదిలీలు, రేషనలైజేషన్ విధానంలో అనేక విమర్శలు ఎదుర్కొంది. దీంతో ప్రస్తుతం చేపడుతున్న బదిలీలు, రేషనలైజేషన్ అత్యంత పకడ్బందీగా చేయాలని భావిస్తున్నప్పటికీ శాఖాపరమైన సమస్యలు వేధిస్తున్నట్లు తెలుస్తోంది. డీఈఓ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చితో ముగుస్తుడడంతో ఎలాంటి విమర్శలకూ తావులేకుండా బదిలీలు పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు. కానీ అందుకు పరిస్థితులు అనుకూలించేలా కనిపించకపోవడంతో ఆయనకు ఎటూ పాలుపోవడం లేదు. శాఖపరమైన సవాళ్లు.... రేషనలైజేషన్ వ్యవహారం అంత ఆషామాషీగా ఉండదనేది ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయం. గతంలో కాకుండా ఇప్పుడు మారిన మార్గదర్శకాల ప్రకారం చేయాలంటే అందుకు నైపుణ్యం కలిగిన ఉద్యోగుల సహకారం చాలా అవసరం. కానీ డీఈఓ కార్యాలయంలో తాజా పరిస్థితులను పరిశీలిస్తే ఇద్దరు ఏడీలు ఉన్నప్పటికీ వారినుంచి ఎలాంటి సాయమూ పొందలేని స్థితిలో అధికారులు ఉన్నారు. గతంలో అనుభవం కలిగిన కొంతమంది ఉద్యోగులు ఉన్నప్పటికీ వారిని వేర్వేరు విభాగాలకు మార్చారు. దీంతో ఒకరిద్దరుపైనే ఆధారపడాల్సి వస్తోంది. రేషనలైజేషన్, ఖాళీల గుర్తింపు, పోస్టుల సర్దుబాటు ఇవన్నీ కూడా ఒకరిద్దరు చేతుల మీదుగానే నడుస్తోంది. దీంతో రేషనలైజేషన్ కసరత్తు షెడ్యూల్ ప్రకారం పూర్తవుతుందా..! అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉంటే బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించడం విద్యాశాఖకు పెనుసవాల్‌గా మారింది. జిల్లాలో భువనగిరి మినహా నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ డివి జన్ల డిప్యూటీ డీఈఓల పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. చిలుకూరు మండలం మినహా మిగిలిన 58 మండలాలకు హెచ్ఎంలే ఇన్చార్జ్ ఎంఈఓలుగా వ్యవహరిస్తున్నారు. అదీగాక ఈసారి వినూత్నరీతిలో బదిలీల కౌన్సెలింగ్ జిల్లా కేంద్రంలో ఒకేచోట కాకుండా నాలుగు చోట్ల చేయాలని యోచిస్తున్నారు. ఇలాంటి సం క్లిష్ట పరిస్థితులను దాటుకుని కౌన్సెలింగ్ సజావుగా సాగుతుందా...! అన్నదే ప్రశ్నార్థకమే. స్పందించని డీఈఓ.. ఓ వైపు బదిలీల కసరత్తు జరుగుతుండగానే మరోవైపు పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. డీఈఓకు అదనంగా రాజీవ్ విద్యామిషన్ పీఓ బాధ్యతలు ఉన్నాయి. వీటిన్నింటినీ దాటుకుని ముందుకు పోయేందుకు ఆయన శత విధాలా ప్రయత్నిస్తున్నారు. శాఖాపరంగా కీలక పోస్టులు ఖాళీగా ఉండడం...కౌన్సెలింగ్, రేషనలైజేషన్ చేపట్టడంలో అనుభవం కలిగిన ఉద్యోగులు, అధికారులు సరిపడా లేకపోవడంతో డీఈఓ మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని కార్యాలయ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన కొద్ది రోజులుగా బయటి వ్యక్తులనుంచి వస్తున్న ఫోన్లకు ఎలాంటి స్పందన ఇవ్వడం లేదని ఉపాధ్యాయ సంఘాలు ఫిర్యాదు చేస్తున్నాయి. బదిలీలకు సంబంధించిన ఎలాంటి సమాచారం కూడా బయటకు పొక్కనివ్వకుండా గుట్టచప్పుడు కాకుండా చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అధికారిక సెల్‌నంబర్‌కు ఎవరు కాల్చేసినా తప్పని సరిగా స్పందించాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది. కానీ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న డీఈఓ అత్యవసరమని భావించిన ఫోన్‌కాల్స్‌కు మాత్రమే స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం అనుకున్న విధంగా ముందుకు సాగాలంటే కలెక్టర్ దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. -
డీఎస్సీ మార్కుల్లో భారీ తేడా ?
శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డీఎస్సీ ఫలితాల్లో అభ్యర్థుల మార్కుల్లో భారీ వ్యత్యాసాలున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై అభ్యర్థులు గడచిన రెండురోజులుగా డీఈవో కార్యాలయానికి వస్తున్నా సమాధానం చెప్పేవారే కరువయ్యారు. తుది కీ పై అభ్యంతరాలను పరిశీలించకుండానే ఫలితాలు వెల్లడించాలని ప్రభుత్వం యోచించ గా అభ్యర్థుల ఆందోళనతో ప్రభుత్వం దిగివచ్చి గత ఆదివారం ఉదయం అభ్యంతరాలను పరిశీలన జరిపినట్లు ప్రకటించి అదే రోజు సాయంత్రం తుది కీ విడుదల చేసింది. సోమవారం సాయంత్రం ఫలితాలను వెల్లడించింది. చివరగా విడుదల చేసిన కీ ద్వారా పొందిన మార్కులకు, ఫలితాల్లో అభ్యర్థుల మార్కులకు పొంతన లేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. బుదవారం ఎస్జీటీ విభాగానికి చెందిన ఓ మహిళా అభ్యర్థి డీఈవో కార్యాలయానికి వచ్చి తుది కీ ద్వారా 120 మార్కులు పొందానని ఫలితాల్లో 106 మార్కులు మాత్రమే వచ్చాయని తెలిపారు. గురువారం హిందీ, తెలుగు, సాంఘిక శాస్త్రం విభాగాలకు చెందిన పలువురు వచ్చి తమకు మార్కుల్లో వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. ఈ సారి డీఎస్సీ అభ్యర్ధులకు ఓఎంఆర్ షీట్ల నకళ్లను పరిశీలన నిమిత్తం ఇస్తామని చెప్పిన నేపథ్యంలో దాని గురించి ఆరా తీశారు. దీనిపై డీఈవో కార్యాలయంలో కూడా స్పష్టత కరువైంది. నకలు అసలు ఇస్తారో లేదో తెలియడంలేదు. ఒక్కో అభ్యర్థి ఏడు నుంచి పదహారు మార్కుల వరకు వత్యాసాలు ఉన్నాయని చెబుతున్నారు. ఓఎంఆర్ షీట్లు ఇస్తే జరిగిన అక్రమాలు, పొరపాట్లు బయటపడతాయని భావించే ప్రభుత్వ పెద్దలు ఇలా చేస్తున్నారన్న ఆక్షేపణలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఓ మాల్‌ప్రాక్టీస్ చేస్తూ నమోదు కావడం, పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రి ఇంట్లో నగదు తో పాటు డీఎస్సీ హాల్‌టిక్కట్లు, అభ్యర్థి ధ్రువీకరణ పత్రాలు దొరకడంతో డీఎస్సీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలకు మరింత ఊతం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో డీఎస్సీ రద్దు చేస్తే ప్రభుత్వ పరువు పోవడంతోపాటు, పెద్ద ఎత్తున మరోసారి అక్రమాలు చేయించలేమని భావించి కొందరు పెద్దలు కొందరు ప్రజాప్రతినిధులు ఆగమేఘాలపై పోస్టుల భర్తీ చేయించాలని చూస్తున్నారని తెలుస్తోంది. పొరపాట్లను సరిచేయకుండా భర్తీ చేస్తే తమకు రావల్సిన అవకాశం చేజారిపోతుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తుది కీ ప్రకారం మార్కులను సరిచేస్తే అక్రమాలకు పాల్పడిన అభ్యర్థులు 15 మార్కులకు పైగా కోల్పోతారని అందువల్లనే తుది కీ ప్రకారం మార్కులను సరిచేయలేదన్న మరో వాదన కూడా ఉంది. ఏది ఏమైనా మార్కులను సరిచేయకుంటే అభ్యర్థుల తలరాతలు తారుమారవుతాయనడంలో సందేహం లేదు. విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి దేవానందరెడ్డి వద్ద సాక్షి ప్రస్తావించగా కొందరు అభ్యర్థులు తమ కార్యాలయానికి వస్తుండడం నిజమేనన్నారు. అయితే మార్కులలో తేడాలు ఉన్నాయో లేదో గుర్తించడం జిల్లా స్థాయిలో సాద్యం కాదని చెప్పారు. ఓఎంఆర్ షీట్లు నకలు ఇస్తారన్నదానిపై తమకు ఎటువంటి సమాచారం లేదని తెలిపారు. -
సాక్షి కథనానికి స్పందన
ఒంగోలు : ప్రకాశం జిల్లాలో 'గురువుపై రాజకీయ పంజా' అంటూ సాక్షి కథనానికి స్పందన లభించింది. సీఎస్ పురం మండలం అంబవరానికి చెందిన ఉపాధ్యాయుడు కమ్మనేటి వెంకటేశ్వర్లుకు జీతం ఇవ్వకుండా రాజకీయంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ సాక్షి టీవీ వరుస కథనాలు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ కథనాలపై డీఈవో కార్యాలయం స్పందించింది. ఉపాధ్యాయుడికి తక్షణమే జీతం చెల్లించాల్సిందిగా డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. గత అయిదు నెలలుగా బకాయి పడ్డ జీతాన్ని వెంకటేశ్వర్లుకు చెల్లించారు.