అనంతపురం ఎడ్యుకేషన్ : సిలబస్ పూర్తి కాకుండా 6 – 9 తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించడం సరికాదని బీఈడీ ఉపాధ్యాయ సంఘం నాయకులు సోమవారం డీఈఓ లక్ష్మీనారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ 6 – 9 తరగతుల విద్యార్థులకు ఈనెల 14 నుంచి వార్షిక పరీక్షలు నిర్వహించడం సరికాదన్నారు. ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం ఈనెల చివరి వరకు సమయం ఉందన్నారు. అయినప్పటికీ సిలబస్ పూర్తి కాకుండానే పరీక్షలు పెట్టాలని ఎలా నిర్ణయించారని ప్రశ్నించారు. దీనికితోడు పదో తరగతి పరీక్షలు కూడా అదే సమయంలో ఉన్నందున ఎక్కువమంది టీచర్లు డీఓ, సీఓ, ఇన్విజిలేటర్లుగా వెళతారన్నారు.
ఈ పరిస్థితుల్లో 6 – 9 తరగతులకు పరీక్షలు పెట్టడానికి టీచర్ల కొరత ఉంటుందన్నారు. అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి పరీక్షలు పెట్టడం వల్ల ఎండ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. మరి పిల్లలు ఈ సమయంలో కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు ఎలా వస్తారో అధి కారులు ఆలోచించాలన్నారు. ఎండకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పూర్వకాలం నుంచీ ఒంటిపూట బడులు నడుపుతున్నారన్నారు. ఇలాంటి వాటిని పక్కనబెట్టి విద్యార్థులు ఇక్కట్లు పడేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పునరాలోచించాలని విజ్ఞప్తి చేశా రు. పదో తరగతి స్పాట్ వాల్యూయేష¯ŒSకు బోధన చేస్తున్న హెచ్‌ఎంలను మాత్రమే సీఎస్‌లుగా నియమించాని కోరారు. డీఈఓను కలిసిన వారిలో బీఈ డీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారా యణస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి శివశంకరయ్య, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ తదితరులున్నారు.