సాక్షి, రంగారెడ్డి: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం.. ఛైర్మన్ అనితా హరినాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ శశాంక, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. విద్య, వైద్యంపై అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. అయితే, డీఈవో సమావేశానికి ఆలస్యంగా రావడంపై జడ్పీ ఛైర్మన్ క్లాస్ తీసుకోగా, సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులందరికి డీఈవో బహిరంగ క్షమాపణ చెప్పారు. స్కూల్ యూనిఫామ్స్ విషయంలో చర్చ వల్ల ఆలస్యమైందని డీఈవో వివరణ ఇచ్చారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని ఆపరేషన్ థియేటర్లు, భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిల్లో వైద్యుల కొరత ఉందంటూ మండిపడ్డారు. విద్య, వైద్యంలో అధికారుల డిప్యూటేషన్ల రద్దు చేయాలని రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
డిప్యుటేషన్ల రద్దు కుదరదంటూ కలెక్టర్ వివరించారు. మీ సమస్యను సంబందిత శాఖకు సమగ్రంగా వివరించాలని సూచించారు. డిప్యుటేషన్ల విషయంలో అనేక ఒత్తిళ్లు ఉంటాయని కలెక్టర్ అన్నారు. కందుకూరు మెడికల్ కళాశాల రద్దు కాలేదని.. మెడికల్ కళాశాలకు వేరే ప్రాంతంలో స్థలం కోసం చూస్తున్నామని డీఎంహెచ్‌వో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment