'గుణపాఠంగా భావించండి' | TDP Learn Lesson from Nellore ZP Election, says Ambati Rambabu | Sakshi
Sakshi News home page

'గుణపాఠంగా భావించండి'

Published Sun, Jul 20 2014 3:37 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

'గుణపాఠంగా భావించండి' - Sakshi

'గుణపాఠంగా భావించండి'

హైదరాబాద్: నెల్లూరు జెడ్పీ చైర్మన్ పదవిని తమ పార్టీ కైవశం చేసుకోవడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు హర్షం వ్యక్తం చేశారు. న్యాయం గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక అక్రమాలు పాల్పడిన ప్రభుత్వం రాబోయే కాలంలో ప్రజావ్యతిరేకత ఎదుర్కొబోతోందని ఆయన హెచ్చరించారు.

ప్రశాంతంగా జరగాల్సిన జెడ్పీ చైర్మన్ ఎన్నిక ఉద్రిక్త వాతావరణంలో జరగాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, ఆటవిక సమాజంలో ఉన్నామా అని ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి టీడీపీ నాయకులు  దుర్మార్గంగా వ్యవహించారని విమర్శించారు. అధికార దుర్వినియోగం చేసినా తమ పార్టీ అభ్యర్థికి చైర్మన్ పదవి దక్కడం సంతోషకర పరిణామని అన్నారు. టీడీపీ దీన్ని గుణపాఠంగా భావించాలని అంబటి రాంబాబు హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement