వరికుంటపాడు: ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి
ఉదయగిరి (నెల్లూరు): ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్ల నుంచి వైఎస్సార్‌సీపీ రాజీలేని పోరాటం చేస్తుంటే టీడీపీ హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అని నాలుగేళ్లు కాలం వెళ్లదీసి మళ్లీ యూటర్న్ తీసుకొని ప్రజల్ని మోసం చేసే పన్నాగం పన్నుతోందని ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అ«ధిష్టానం పిలుపుమేరకు ఉదయగిరిలో మంగళవారం ప్రత్యేక హోదా సాధనలో టీడీపీ వైఖరికి నిరసనగా ధర్నా చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ ఆంధ్రరాష్ట్ర ప్రజలను మోసం చేశాయన్నారు. ప్రత్యేక హోదా వస్తే రాయితీలు వచ్చి అధిక సంఖ్యలో కర్మాగారాలు నెలకొల్పబడి యువతకు ఉద్యోగవకాశాలు పెరుగుతాయన్నారు.
ప్రత్యేక హోదా ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తూ వైఎస్సార్‌సీపీ నేత జగన్‌మోహన్‌రెడ్డి విభిన్న కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఈ క్రమంలో హోదాపట్ల విద్యార్థులు, నిరుద్యోగులు ప్రజలనుంచి మంచి స్పందన వస్తుండడంతో చంద్రబాబు యూటర్న్ తీసుకొని హోదా కోసం నాటకాలు ఆడుతున్నారన్నారు. ప్రత్యేక హోదాకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి ప్రజాభిమానం పొందారన్నారు. టీడీపీ ఎంపీలు దొంగ నాటకాలాడుతూ రాజీనామాలు చేసేందుకు ముందుకు రాలేదన్నారు. 600 అబద్ధాలాడి అధికారంలోకి వచ్చిన బాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా నెరవేర్చలేదన్నారు. ఇప్పటికే ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బాబుకు బుద్ధిచెబుతారన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలంటే వైస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment