Mekapati Chandrashekhar Reddy
-
టీడీపీలో అయోమయంగా ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి
-
కక్కిన కూడే పరమాన్నమాయే.. లోకేశ్ కోసమేనా ఇంత హైప్!
మనంతట మనం బెల్లం.. యాలకులు.. చిక్కనిపాలు .. జీడిపప్పు వేసి వండుకుని చేసేదాన్ని పరమాన్నం అంటాం. మరి ఎవరో ఆరగించి కక్కిన కూడు పరమాన్నం అని ఎలా అంటాం?. అంత దిక్కుమాలిన గాచ్చారం ఎవరికీ ఉంటుంది. ఎవరికీ అంటే.. అంతకు మించి మరో మార్గం లేనివాళ్లకు అది తప్ప మరో గతిలేని వాళ్లకు ఆ కక్కిన కూడే మహాభాగ్యం అవుతుంది. టీడీపీ పరిస్థితి సైతం అచ్చం అలాగే ఉంది. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వేసి అనైతికానికి పాల్పడి వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి వెలివేతకు గురైన ఆనం రామనారాయణ రెడ్డి (వేంకటగిరి), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి(ఉదయగిరి), కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్) వరుసగా టీడీపీ లీడర్లతో సమావేశమవుతూ వస్తున్నారు. వాళ్లకు మరి వేరే మార్గం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గెంటేశాక వేరే మార్గం లేదు కాబట్టి టీడీపీ గుమ్మానికి వేలాడక తప్పదు. నెల్లూరులో గత ఎన్నికల్లో ఒక సీట్ కూడా గెలవలేక మొత్తం పది సీట్లూ వైఎస్సార్సీపీకి అప్పగించి బిక్కముఖం వేసిన టీడీపీకి ఇప్పుడు సస్పెండ్ అయిన ఈ ముగ్గురే దిక్కయ్యారు. వీళ్ళను వంద తలలు నరికివచ్చిన కాలభైరవుల్లా కీర్తిస్తూ ఎల్లో మీడియా సైతం విస్తృత కవరేజి ఇవ్వడం చూస్తుంటే టీడీపీ వాళ్ళు ఎంత కరువులో ఉన్నారో అర్థం అవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత లీడర్లు పార్టీ నుంచి అవుట్ గోయింగ్ తప్ప ఇన్ కమింగ్ లేక మొహం వాచిపోయిన టీడీపీ, ఎల్లోమీడియాకు కరువులో ఉన్న కుక్కకు వల్లకాట్లో ఎముక దొరికినట్లయింది. దీంతో వారినే రకరకాలుగా చూపిస్తూ ఆషాఢంలో పండగ చేసుకుంటున్నారు. లోకేశ్ కోసమే హైప్.. త్వరలో నెల్లూరులోకి ప్రవేశించనున్న నారా లోకేష్ పాదయాత్రకు హైప్ తేవడానికి తప్ప ఈ ముగ్గురి చేరిక టీడీపీకి ఎందుకూ పనికిరాదన్న విషయం కార్యకర్తలకు అర్థం అవుతూనే ఉంది. వాస్తవానికి చంద్రబాబుకు, టీడీపీకి ప్రజల్లో ఆమోదం ఉంది. గ్రాఫ్ పెరిగితే కనీసం సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీపీలు ఒక్కరైనా చేరాలి కదా. మరి అలాంటి చేరిక ఒక్కటీ లేదు అంటే గత ఎన్నికల్లోనే సీఎం జగన్ చేతిలో చచ్చి మమ్మీగా మారిన శవానికి ఈ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అనే పట్టు చీర కట్టి ఉత్తుత్తి ముస్తాబు చేయడం తప్ప శవం లేచేది లేదని గ్రామస్థాయిలో కార్యకర్తలు చెవులుకొరుక్కుంటున్నారు టీడీపీలో గొడవల మాటేమిటి.. మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకున్నట్లు ఉంది టీడీపీ తీరు. ఆల్రెడీ టీడీపీలో కొన్నాళ్లుగా ఉంటూ వస్తున్న నాయకుల మధ్య తలెత్తుతున్న గొడవలు సర్దుబాటు చేయడం వదిలేసి వైఎస్సార్సీపీ నుంచి వెలివేతకు గురైన వాళ్ళను చూసి పండగ చేసుకుంటున్నట్లు ఉంది. ఇప్పటికే విజయవాడలో పార్టీకి నిప్పెట్టేసి దూరం నుంచి చలి కాస్తున్న కేశినేని నానిని ఏమీ చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు అటు సత్తెనపల్లిలో కోడెల శివరామ్ చేస్తున్న గాయి గత్తరను సైతం వినే ధైర్యం చేయడం లేదు. ఇక గన్నవరంలో తంగిరాల సౌమ్య ఆర్తనాదాలు అరణ్యరోదనే అవుతున్నాయి. ఇక ఫారిన్ నుంచి నేరుగా సూట్ కేసులతో దిగిపోయి డబ్బుతో చంద్రబాబును కొట్టి చిలకలూరిపేటలో పత్తిపాటి పుల్లారావుకు నిద్రలేని రాత్రులు పరిచయం చేసిన భాష్యం ప్రవీణ్ వ్యవహారం సైతం ఒక తలనొప్పి. రాత్రికి రాత్రి ఫారిన్ నుంచి దిగిపోయి అక్కడక్కడా సేవలు పేరిట ఈవెంట్స్ చేస్తే సరిపోతుందా? మరి మేము ఏమవ్వాలి అని వెక్కివెక్కి ఏడుస్తున్న పుల్లరావు ఆవేదన ఎవరికి వినబడడం లేదు. ప్రస్తుతానికి కొన్నాళ్ళు ఈ వైస్సార్సీపీ ఎమ్మెల్యేలతో ఈవెంట్ నడపడం తప్ప వేరే మార్గం లేదని చంద్రబాబుకు అర్థం అయింది. ఇది కూడా చదవండి: జేపీ నడ్డా వ్యాఖ్యలపై పేర్ని నాని కౌంటర్ -
మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి సవాల్ విసిరిన వినయ్ రెడ్డి
-
‘చంద్రశేఖర్‌రెడ్డి.. మా దెబ్బేంటో చూపిస్తాం ఆగు’
సాక్షి, నెల్లూరు: ఉదయగిరి నియోజకవర్గంలో తాజా పరిణామాలతో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వంచనపై వైఎస్సార్సీపీ శ్రేణులు కన్నెర్ర చేశాయి. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు ధర్నా చేపట్టారు. పార్టీ ద్రోహి చంద్రశేఖర్‌రెడ్డి నియోజకవర్గం వదిలివెళ్లిపో, వైఎస్సార్సీపీ దెబ్బేంటో రుచి చూపిస్తామంటూ అంటూ ఫ్లకార్డులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు ర్యాలీ తీశారు. రోడ్డుపై బైఠాయించారు. చంద్రశేఖర్‌రెడ్డి వర్సెస్ వైఎస్సార్సీపీతో ఉదయగిరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు చంద్రశేఖర్‌రెడ్డిపై పార్టీ నేత మూల వినయ్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రశేఖర్‌రెడ్డి చరిత్ర అంతా అవినీతిమయమేనని అన్నారు. మరో నేత చేజర్ల సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో చంద్రశేఖర్‌రెడ్డికి పది ఓట్లు కూడా రావన్నారు. ఇక జిల్లా ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో గెలిచే దమ్ముందా? అంటూ చంద్రశేఖర్‌రెడ్డిని నిలదీశారు. -
తప్పటడుగు వేసి అడ్డంగా దొరికిపోయారు..
మార్చి 23, 2023. గురువారం రోజున ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరిగింది. ఏడు స్థానాలకు గాను ఆరు ఎమ్మెల్సీలను వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకుంది. ఒక స్థానాన్ని తెలుగుదేశం గెలిచింది. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే.. బలం లేకున్నా తెలుగుదేశం గెలవడం. ఓటుకు కోట్లు గుమ్మరించడంలో బహుశా దేశ రాజకీయాల్లోనే అత్యంత నిష్ణాతుడయిన చంద్రబాబు.. గతానుభవాలతో పాటు తగు జాగ్రత్తలు తీసుకుని నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వల వేసినట్టు స్పష్టమయింది. ఓటుకు కోట్ల వెనక 40 ఇయర్స్ చంద్రబాబు చేసింది సిగ్గు మాలిన పని అని తెలిసినా ఎల్లో మీడియా మాత్రం భలేగా డప్పు కొట్టింది. మా బాబుకు తెలిసిన విద్యలు మరెవరికి తెలియదని, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కాబట్టే బలం లేకున్నా తమ అభ్యర్థిని గెలిపించుకున్నాడని ఘనకీర్తిని అందుకున్నాయి ఎల్లోమీడియా. ఇక్కడ ఒక అడుగు ముందుకేసి కప్పదాటు వేసిన నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపునా సానుభూతి రాగం వినిపించింది ఎల్లో మీడియా. కనీసం సంజాయిషీ అడగకుండా వేటు ఎలా వేస్తారంటూ తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంది. క్రాస్ ఓటింగ్ ఎలా కనిపెట్టవచ్చు? నిజానికి రాజకీయాల్లో ఇలాంటి ఎన్నికలు కొత్తేమీ కాదు. గతంలోనూ జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. చంద్రబాబు లాంటి రాజకీయ బేహారులు వచ్చిన తర్వాత ఎన్నికలేవైనా ఓటుకు కోట్లు దెబ్బకు భ్రష్టు పడుతున్నాయి కాబట్టి పార్టీలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అందుకే వైఎస్సార్సిపి కూడా పూర్తి అవగాహనతో వ్యవహరించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలున్నారు. అందరూ ఓటేశారు. వైఎస్సార్సిపికి 151 మంది ఉన్నారు. ఎన్నిక జరిగింది 7 సీట్లకు కాగా.. పోటీలో ఉన్నది 8 మంది. కాబట్టి.. తన దగ్గర ఉన్న 151 మంది ఎమ్మెల్యేలను 7 టీంలుగా విభజించింది. అంటే ప్రతీ ఎమ్మెల్యే తన తొలి ప్రాధాన్యతగా ఎవరిని ఎంచుకోవాలో ముందే స్పష్టంగా సూచించారు. ఉదాహారణకు వైఎస్సార్సిపి ఎమ్మెల్సీ అభ్యర్థులు A, B, C, D, E, F & G అనుకుందాం. ప్రతి ఎమ్మెల్యేకు కింద ఇచ్చినట్టుగా ఓటు వేయమని చెబుతారు. అలాగే రెండో, మూడో ప్రాధాన్యతకు సంబంధించిన ఆప్షన్లు కూడా ఇస్తారు. అంటే ప్రతీ ఒక్కరికి ఒక యూనిక్ కాంబినేషన్ ఉంటుంది. ఏ ఒక్కరిది కూడా మరొకరితో కలవదు. రెండో, మూడో ప్రాధాన్యత చూడగానే కాంబినేషన్లో ఎక్కడ తేడా వచ్చిందో అర్థమవుతుంది. దీన్ని బట్టి క్రాస్ ఓటింగ్ చేసిన ఎమ్మెల్యేను క్షణాల్లో గుర్తించేస్తారు. ముందుగానే యునిక్ సీక్వెన్స్ ఇవ్వడంతో అమ్ముడుపోయిన ఎమ్మెల్యేల గుట్టు రట్టయింది. విషయం బయటపడడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ సీపీ అధిష్టానం వెంటనే సస్పెండ్ చేసింది. నమ్మక ద్రోహులను ఉపేక్షించేదిలేదని ఓ స్పష్టమైన సందేశాన్ని పంపింది. ఎల్లో మీడియా కక్కుర్తి రాతలు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మొత్తం సీట్లు 58. ప్రస్తుతం అధికార పక్షం వైఎస్సార్సిపికి సభలో 44 మంది సభ్యులున్నారు. తెలుగుదేశం పార్టీ కేవలం 10 స్థానాలకు పరిమితమయింది. ఇద్దరు స్వతంత్రులు కాగా, మరో ఇద్దరు పీడీఎఫ్. సభలో ఏ రకంగా చూసినా వైఎస్సార్‌సిపిదే శక్తిమంతమైన పార్టీ. పైగా ఎమ్మెల్సీ పదవుల కోసం వైఎస్సార్సిపి ఎప్పుడూ ఆరాటపడలేదు. చదవండి: బాబు బ్రోకర్లకు టైం వచ్చింది..! బీజేపీలోని పచ్చ నేతల ప్లాన్ ఏంటి? తమకున్న బలానికి ఎన్ని పదవులు వస్తాయో.. అంత వరకే ఆశించారు. నియోజకవర్గాల్లో పని తీరు సరిగాలేని ఉండవల్లి శ్రీదేవి ,మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలకు కూడా పార్టీ అధిష్టానం స్పష్టంగా తమ ఉద్దేశాన్ని ముందే చెప్పేసింది. మళ్లీ టికెట్ ఇస్తామని కూడా తప్పుడు హామీ ఇవ్వలేదు. ఇవన్నీ తెలిసినా.. నిజాలు దాచిపెట్టిన ఎల్లో మీడియా.. మా బాబు మహా గొప్పోడు, చాణక్యుడి కంటే సమర్థుడంటూ డప్పేసుకుంటోంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
నేను బాగానే ఉన్నాను: ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి
సాక్షి, నెల్లూరు: తాను బాగానే ఉన్నట్లు ఉదయగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. గుండెనొప్పి రావడంతో అసుపత్రికి వచ్చినట్లు పేర్కొన్నారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారని, మరో టెస్టు కోసం చెన్నై తరలిస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల్లో క్షేమంగా ఇంటికి తిరిగి వస్తావనని అన్నారు. కాగా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గుండెనొప్పితో బుధవారం నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. గుండెలో రెండు వాల్వ్స్ బ్లాక్ అయినట్టు వైద్యులు గుర్తించారు. -
ఎమ్మెల్యే కబ్జా పర్వమంటూ కల్లబొల్లి కథనం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ ప్రాంతాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సొంత నిధులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నంపై పచ్చ మీడియా విషం కక్కింది. టీడీపీ అధికారంలో ఉన్న కాలంలో ఆ పార్టీ నేతలు ఏకంగా రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి, విలువైన భూములను కబ్జా చేశారు. ‘పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు’గా అటవీ ప్రాంతాన్ని తలపిస్తున్న ప్రభుత్వ స్థలంలో ఎమ్మెల్యే సొంత నిధులు వెచ్చించి శుభ్రం చేసి పార్కుగా తీర్చిదిద్దుతుంటే ఆ పచ్చ మీడియాకు కబ్జా పర్వంగా కనిపించింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పచ్చ మీడియా బరితెగించి పైత్యం ప్రదర్శిస్తోంది. కంప చెట్లు, పిచ్చి మొక్కలు, జంతు మల, మూత్రాలతో అపరిశుభ్రంగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సొంత నిధులతో సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా పార్కుగా తీర్చిదిద్దుతున్నారు. అయితే ఆ పచ్చ మీడియా కబ్జాపర్వమంటూ కల్లబొల్లి కుల్లు కథనాన్ని రాసింది. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో రూ.కోట్లాది విలువైన తమ సొంత భూములను ప్రజా అవసరాలకు ప్రభుత్వానికి అప్పగించిన చరిత్ర మేకపాటి సోదరులది. అటువంటిది మార్కెట్ ధర ప్రకారం పట్టుమని పాతిక లక్షల రూపాయల విలువ చేయని ఆ స్థలానికి రూ.2 కోట్ల విలువ కట్టి మేకపాటి కుటుంబంపై బురద జల్లే ప్రయత్నం చేయడాన్ని స్థానిక ప్రజలు సైతం మండి పడుతున్నారు. మండల కేంద్రం మర్రిపాడులో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి భూములు కొనుగోలు చేసి గెస్ట్‌హౌస్ నిర్మించుకున్నారు. ఆ తదనంతర కాలంలో వైఎస్సార్ అకాల మరణం చెందడంతో తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఊరూరా ఆయన విగ్రహాలు ఆవిష్కరించారు. ఇదే సమయంలో మేకపాటి చంద్రశేఖరరెడ్డి తన గెస్ట్‌హౌస్ సమీపంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబరు 428/2లో కొంచెం స్థలంలో 2010లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో ఓదార్పు యాత్రలో జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ తర్వాత ఆ ప్రాంతమంతా కంప చెట్లు, పిచ్చి మొక్కలు, జంతు మలమూత్రాలతో అపరిశుభ్రంగా మారింది. దివంగత సీఎం వైఎస్సార్ వీర భక్తుడు అయిన చంద్రశేఖరరెడ్డి తన గెస్ట్‌హౌస్ పక్కన తానే ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహ ప్రాంతం అపరిశుభ్రంగా మారడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ ప్రదేశాన్ని సుందరవనంగా వైఎస్సార్ ఘాట్‌గా తీర్చిదిద్దాలని సంకల్పించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి పచ్చదనం పరిఢవిల్లేలా మొక్కలు తెచ్చి నాటారు. తన సొంత నిధులతో పార్కుగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తుంటే ‘వైఎస్సార్ సాక్షిగా భూ కబ్జా’ అంటూ ఎమ్మెల్యేపై దుష్ప్రచారానికి దిగింది. ప్రభుత్వ స్థలాన్ని పార్కుగా మారిస్తే తప్పా? నిరుపయోగంగా ముళ్ల పొదలతో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆహ్లాదకరమైన పార్కుగా తీర్చిదిద్దడం తప్పా. పార్కులను ప్రభుత్వ స్థలాల్లో కాకుండా ప్రైవేట్ స్థలాల్లో నిర్మిస్తారా?. ఎమ్మెల్యే సొంత నిధులతో పార్కు వాతావరణాన్ని కల్పించే విధంగా చేస్తుంటే పచ్చ విషపు రోత రాతలు రాయడం వెనుక పచ్చ మీడియా సొంత అజెండా ఉందనే అర్థమవుతోంది. వైఎస్సార్ విగ్రహ ప్రాంతాన్ని పార్కుగా మలుస్తున్నారే కానీ.. బిల్డింగులు కట్టడం లేదే. నాటిన మొక్కలు పశువుల పాలు కాకుండా చుట్టూ ఫెన్సింగ్ వేస్తే కబ్జా అని వక్రభాష్యం చెబుతారా అని స్థానిక ప్రజలు సైతం మండి పడుతున్నారు. సుందరంగా తీర్చిదిద్దుతున్నా.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజలకు చేసిన మేలు మరువలేనిది. తెలుగువారి గుండెల్లో కొలువై ఉన్నారు. నేను వైఎస్సార్ వీర భక్తుడిని. విగ్రహా ఘాట్‌ను సుందరంగా తీర్చిదిద్దాలనే తపనతో ప్రాంగణాన్ని శుభ్రం చేశాం. గార్డెన్ ఏర్పాటు చేస్తున్నాం. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారు సైతం కాసింత సేద తీరే విధంగా పార్కుగా రూపొందిస్తున్నాం. భూ కబ్జాలు చేయాల్సిన అవసరం తమ కుటుంబానికి లేదు. – మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్యే, ఉదయగిరి -
గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు సీఎం వైఎస్ జగన్
-
ఇకపై జిల్లాకు మరింత దగ్గరగా..
సాక్షి, నెల్లూరు: ముఖ్యమంత్రి ఆలోచన పరిశ్రమల మంత్రి ఆచరణతో ఏపీలో పారిశ్రామిక విప్లవం ఊపందుకుంది. మంత్రి మేకపాటి ఇలాకాలో ఏపీ పారిశ్రామికాభివృద్ధికి తొలి అడుగు పడింది. సొంత నియోజకవర్గం ఆత్మకూరులో ఆదివారం రోజున పారిశ్రామికవాడకు శ్రీకారం చుట్టారు. మెట్ట ప్రాంత ప్రజల సాక్షిగా పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఆత్మకూరు ప్రజలు, ముఖ్యమంత్రి నమ్మకం వల్లే మంత్రిగా అవకాశం దక్కింది. మెట్ట ప్రాంత ప్రజలు గర్వించేలా ఊహించని స్థాయిలో అభివృద్ధి చేస్తాం. ఏడాది పాలనలోనే ఢిల్లీలో ముఖ్యమంత్రికి కీర్తి ప్రతిష్టలు దక్కాయి. ఉద్యోగాల కోసం ఊరు వదిలే పరిస్థితి రానీయం. పారిశ్రామిక పార్క్ వల్ల భవిష్యత్‌లో 2,000 ఉద్యోగాలు దక్కనున్నాయి. ఎమ్ఎస్ఎమ్ఈ పార్కు రూ.400కోట్లతో అత్యున్నత హంగులతో అభివృద్ధి చేస్తాం. పార్క్ శంకుస్థాపన ఏవిధంగా అయితే వేగంగా జరిగిందో అలాగే.. ఏడాదిన్నరలోగా ఎంఎస్ఎమ్ఈ పార్క్ పూర్తి చేస్తాం. మొత్తం 173 ఎకరాలలో పార్కు నిర్మాణం చేస్తుండగా.. మొదటి దశలో 87 ఎకరాలలో అభివృద్ధి చేయనున్నాము. ప్లాస్టిక్ ఫర్నిచర్ తయారు చేసే పార్కుతోనే స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది. సకల వసతులతో , అన్ని వనరులు పుష్కలంగా ఉండేలా పార్కును తీర్చిదిద్దుతాము. కీలక శాఖలు, ముఖ్యమంత్రి ఇచ్చిన బాధ్యతల వల్ల ప్రత్యక్ష్యంగా మాత్రమే నియోజకవర్గానికి దూరం ఉన్నాను. నేనెక్కడున్నా నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. (ఏపీలో సమగ్ర పరిశ్రమ సర్వే: గౌతమ్‌రెడ్డి) ఎలాంటి సమస్య వచ్చినా పాలనపరంగా నిత్యం అందుబాటులో ఉంటాను. ఎంత కుదరకపోయినా ఎంజీఆర్ హెల్ప్ లైన్, వర్చువల్ మీటింగులతో మీ మధ్యే ఉన్నా. ఇకపై నియోజకవర్గం, జిల్లాకు మరింత దగ్గరగా ఉంటా' అని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్ఎస్ఈఎమ్ఈల నిర్మాణం ఎలా ఉండబోతుందో మంత్రి మేకపాటి వీడియో ద్వారా ప్రజలకు చూపించారు. వీడియోలు, ఫోటోలకు పరిమితమయ్యే పారిశ్రామికాభివృద్ధి మా విధానం కాదు. చెప్పింది చెప్పినట్లు చేసి చూపే నినాదం మా ప్రభుత్వానిది. (2024 నాటికి మద్య రహిత రాష్ట్రంగా ఏపీ) సోమశిల హైలెవల్ కెనాల్ ఫేజ్-2 పనులతో మెట్ట ప్రాంతం పచ్చని మాగాణమవుతుంది. త్వరలోనే ఆ పనులు చేపట్టి పూర్తి చేస్తాం. పాదయాత్రలో చెప్పిన సోమశిల హామీని నెరవేరుస్తాం. ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు 6 టీఎంసీల నీరు అందిస్తాం' అని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో భాగంగా.. 'వైఎస్సార్ ఆసరా' పథకం ద్వారా నియోజకవర్గ మహిళలకు రూ. 13.05 కోట్ల చెక్కును అందించారు. ఉదయగిరిలో పార్క్ ఏర్పాటు చేయండి యువత ఆశయాలను నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి, మంత్రి కృషి చేస్తున్నారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ఒక పార్క్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డిని ఆయన విజ్ఞప్తి చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, ఆత్మకూరు ఆర్డీవో సువర్ణమ్మ, ఏపీఐఐసీ ఈడీ ప్రతాప్ రెడ్డి, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కంచెర్ల శ్రీహరి నాయుడు, ఏఎంసీ ఛైర్మన్ అనసూయమ్మ, ఆత్మకూరు నియోజకవర్గంలోని మండలాల కన్వీనర్లు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. -
సాగునీటి సమస్యలు రాకుండా చర్యలు
సాక్షి, నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో రైతులకు సాగునీటి సమస్యలు రాకుండా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని గౌతం రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశానికి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి కూడా హాజరయ్యారు. -
ఉద్యోగాల విప్లవం తెచ్చాం : ఎమ్మెల్యే మేకపాటి
సాక్షి, వింజమూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించడం ద్వారా ఉద్యోగాల విప్లవం తెచ్చారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. స్థానిక ఆర్ అండ్‌బీ అతిథిగృహంలో ఆదివారం ఆయన పార్టీ నాయకులతో పలు విషయాలపై చర్చించారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను నాయకులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయ వ్యవస్థ పటిష్టం చేస్తూ 1.27 లక్షల పోస్టులను భర్తీ చేయనున్నారని తెలిపారు. అదే విధంగా గ్రామ వలంటీర్లు రెండున్నర లక్ష వరకు భర్తీ చేయనున్నామన్నారు. దీంతో నిరుద్యోగ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చి వారి కుటుంబ అభివృద్ధికి తోడ్పాటునందిస్తాయన్నారు. వింజమూరుకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును త్వరితగతిన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి, నాయకులు మద్దూరి చిన్నికృష్ణారెడ్డి, మద్దూరి లక్ష్మీప్రసాద్‌రెడ్డి, దాట్ల విజయభాస్కర్‌రెడ్డి, చీమల హజరత్‌రెడ్డి, మండాది గోవిందరెడ్డి, అన్నపురెడ్డి బాలిరెడ్డి, నీలం సంజీవరెడ్డి, అన్నపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, సూరం వినోద్‌రెడ్డి, దాట్ల రమేష్‌రెడ్డి, నీచు బాలయ్య, దాట్ల కృష్ణారెడ్డి తదితరులున్నారు. -
బొల్లినేనికి ఓట్లు అడిగే హక్కు లేదు
సాక్షి, ఉదయగిరి: ప్రస్తుత ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు గత ఎన్నికల సమయంలో ఉదయగిరి ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్లీ ప్రస్తుత ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటు అడిగేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని, ప్రజలను ఓటు అడిగే హక్కు ఎమ్మెల్యే బొల్లినేనికి లేదని ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఉదయగిరిలోని బీసీ కాలనీ, చాకలివీధి, పూసలకాలనీ ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం చాకలివీధిలో ఏర్పాటు చేసిన సభలో మేకపాటి మాట్లాడుతూ ప్రచారానికి వచ్చే టీడీపీ నాయకులను ఏం అభివృద్ధి చేశారని ప్రజలు ప్రశ్నించాలన్నారు. గత ఎన్నికల సమయంలో బొల్లినేని అండర్ డ్రైనేజీ సౌకర్యం కల్పిస్తానని, నీటి సమస్య తీరుస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు తీర్చలేదన్నారు. టీడీపీని సాగనంపేందుకు ఓటర్లు నడుం బిగించాలన్నారు. తాను అధికారంలోకొచ్చిన వెంటనే వెలుగొండ, సోమశిల జలాలను ఉదయగిరి ప్రాంతానికి తీసుకొచ్చి సాగు, తాగునీటి సమస్య లేకుండా తనవంతు కృషి చేస్తానన్నారు. టీడీపీ పాలనలో నాయకులు, కార్యకర్తలకు ప్రజాధనాన్ని దోచుకుని దాచుకోవడమే అలవాటై పోయిందన్నారు. వైఎస్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని, ఉదయగిరి ప్రాంతం తమ సోదరుల హయాంలోనే అభివృద్ధి చెందిందని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని మేకపాటి కోరారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాలతో అన్ని కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోటీగా ఎక్కువ అబద్ధాలు చెప్పింది బొల్లినేనినే అని అన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని చాలా గ్రామాల ప్రజలు ఇంతవరకు ఎమ్మెల్యే బొల్లినేని తమ గ్రామాలకు ఒక్కసారి కూడా రాలేదని చెప్పారని, తాము ప్రచారానికి వెళ్లిన పలు గ్రామాల్లో ప్రజలు తమ దృష్టికి తెస్తున్నారని మేకపాటి తెలిపారు. త్వరలో జరిగే ఎన్నికల్లో అందుబాటులో ఉండే సమర్థవంతమైన వ్యక్తిని ఎన్నుకోవాలన్నారు. ఏప్రిల్ 11న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా ఆదాల ప్రభాకర్‌రెడ్డిని, ఉదయగిరి ఎమ్మెల్యేగా తనకు ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం పలువురు మహిళలు స్థానిక సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి, నాయకలు మూలె సుబ్బారెడ్డి, అక్కుల్‌రెడ్డి, షంషీర్, మట్ల లక్ష్మయ్య, వెంగళరెడ్డి, మధు, హరి, సలీం, జబ్బార్, లియాఖత్‌అలీ, ముర్తుజా హుస్సేన్, యు.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నేలటూరులో.. ఉదయగిరి మండలంలోని నేలటూరుకు చెందిన పలువురు టీడీపీ నాయకులు పెండేల లక్ష్మీనరసయ్య ఆధ్వర్యం లో ఆదివారం రాత్రి వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో పెండేల రవీంద్ర, మోహనరావు, సుబ్బారావు, బూరగ లక్ష్మీనరసయ్య, మాల్యాద్రి, పతకమూరి రాములు, జానకిరాం, మేడేపల్లి సుబ్బారావుతోపాటు 30 కుటుంబాల వారు ఉన్నారు. కార్యక్రమంలో రమణయ్య, రత్నం, శ్రీనివాసులు, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
జగన్‌ను ఆశీర్వదించండి మాజీ ఎమ్మెల్యే మేకపాటి
నెల్లూరు , ఉదయగిరి: రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ శ్రామికుడిలా శ్రమిస్తున్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదించాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కోరారు. ఉదయగిరి మండలం జీ చెర్లోపల్లి పంచాయతీ పరిధిలోని వడ్డిపాళేనికి చెందిన పలు కుటుంబాలు శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ నేతలు అక్రమంగా ప్రజాసొమ్మును దోచుకుని సామాన్యులను ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు సమస్యల నుంచి విముక్తి లభించడమే కాకుండా పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో సాగుతున్న రాక్షస పాలనను అంతమొందించేందుకు ప్రతిఒక్కరూ నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జగన్మోహన్రెడ్డి సీఎం అయితే నవరత్నాల పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి రూ.50వేల నుంచి రూ.10లక్షల వరకు లబ్ధి చేకూరుతుందన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉదయగిరి నియోజకవర్గాన్ని శాయాశక్తులా అభివృద్ధి చేశానని, ఈసారి అవకాశం ఇస్తే ఉదయగిరి ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు సోమశిల హైలెవల్ కెనాల్, సీతారాంసాగర్, వెలుగొండ ప్రాజెక్టులు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత ఎమ్మెల్యే అవినీతిలో కూరుకుపోయి ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోవడంలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఆలోచించి ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. మరోసారి టీడీపీకి అవకాశమిస్తే రాష్ట్రం పూర్తిస్థాయిలో దోపిడీకి గురవుతుందన్నారు. పార్టీ నేతలు శ్రీనివాసులురెడ్డి, ఓబుల్‌రెడ్డి, ఏడుకొండలు, కంబాల నరసింహారెడ్డి, రమణారెడ్డి, ఎం శ్రీనివాసులురెడ్డి, మట్ల లక్ష్మయ్య, రాజారెడ్డి, సుజాత, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో భారీగా చేరిక వడ్డిపాళేనికి చెందిన బత్తుల శివనాగులు, బీ నరసింహులు ఆధ్వర్యంలో 50 కుటుంబాలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరాయి. వారికి మేకపాటి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను మేకపాటి దృష్టికి గ్రామస్తులు తీసుకురాగా తక్షణమే సమస్యను తీరుస్తానని, అవసరమైతే సొంత నిధులతో ట్యాంకర్ల ద్వారా తానీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. -
ప్రజలను మోసం చేసిన టీడీపీ, బీజేపీ
ఉదయగిరి (నెల్లూరు): ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్ల నుంచి వైఎస్సార్సీపీ రాజీలేని పోరాటం చేస్తుంటే టీడీపీ హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అని నాలుగేళ్లు కాలం వెళ్లదీసి మళ్లీ యూటర్న్ తీసుకొని ప్రజల్ని మోసం చేసే పన్నాగం పన్నుతోందని ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అ«ధిష్టానం పిలుపుమేరకు ఉదయగిరిలో మంగళవారం ప్రత్యేక హోదా సాధనలో టీడీపీ వైఖరికి నిరసనగా ధర్నా చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ ఆంధ్రరాష్ట్ర ప్రజలను మోసం చేశాయన్నారు. ప్రత్యేక హోదా వస్తే రాయితీలు వచ్చి అధిక సంఖ్యలో కర్మాగారాలు నెలకొల్పబడి యువతకు ఉద్యోగవకాశాలు పెరుగుతాయన్నారు. ప్రత్యేక హోదా ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తూ వైఎస్సార్సీపీ నేత జగన్మోహన్రెడ్డి విభిన్న కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఈ క్రమంలో హోదాపట్ల విద్యార్థులు, నిరుద్యోగులు ప్రజలనుంచి మంచి స్పందన వస్తుండడంతో చంద్రబాబు యూటర్న్ తీసుకొని హోదా కోసం నాటకాలు ఆడుతున్నారన్నారు. ప్రత్యేక హోదాకు వైఎస్సార్సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి ప్రజాభిమానం పొందారన్నారు. టీడీపీ ఎంపీలు దొంగ నాటకాలాడుతూ రాజీనామాలు చేసేందుకు ముందుకు రాలేదన్నారు. 600 అబద్ధాలాడి అధికారంలోకి వచ్చిన బాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా నెరవేర్చలేదన్నారు. ఇప్పటికే ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బాబుకు బుద్ధిచెబుతారన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలంటే వైస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. -
వడివడి.. నడికుడి
ఉదయగిరి : నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. గుంటూరు జిల్లాలో ఇప్పటికే 14 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మాణం పూర్తి కాగా.. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భూసేకరణకు సంబంధించి ముమ్మరంగా గ్రామసభలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ రెండు జిల్లాల్లోనూ పనులు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం పలుచోట్ల నిర్మాణ సామగ్రిని ఇప్పటికే సిద్ధంగా ఉంచారు. మార్గం ఇలా.. నడికుడి నుంచి శ్రీకాళహస్తి వరకు 309 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుంచి మొదలై చావళ్యపురం, నగిరేకల్లు, రొంపిచర్ల, పొదిలి, కనిగిరి, పామూరు, వింజమూరు, ఆత్మకూరు, రాపూరు మీదుగా వెంకటగిరి వద్ద ఈ లైన్ కలుస్తుంది. ఈ మార్గంలో 69 వంతెనలు నిర్మించనున్నారు. రాజుపాళెం మండలం కుండమూరు సమీపంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి, నగిరేకల్లు మండలం అద్దంకి వద్ద, నార్కేడ్‌పల్లి రహదారిపై త్రిపురాంతకం వద్ద అండర్ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. దూరం తగ్గుతుంది ఈ రైల్వే లైన్ వినియోగంలోకి వస్తే హైదరాబాద్–తిరుపతి నగరాల మధ్య దూరం బాగా తగ్గుతుంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎంతో ప్రాముఖ్యత గల ఈ మార్గం నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దష్టి పెట్టింది. 2018 చివరి నాటికి పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 2020 నాటికి పూర్తవుతాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ఫలించిన కషి గుంటూరు జిల్లా నడికుడి జంక్షన్ నుంచి మూడు జిల్లాలను కలుపుతూ మెట్ట ప్రాంతవాసులకు సౌకర్యంగా ఉండేలా శ్రీకాళహస్తి వరకు రైల్వే మార్గం నిర్మించాలని ఈ ప్రాంతానికి చెందిన ఎంతోమంది ఎంపీలు, ప్రజాప్రతినిధులు గళం వినిపిస్తూ వచ్చారు. ముఖ్యంగా కనిగిరి, ఉదయగిరి నియోజకవర్గాలకు చెందిన నేతలు ఈ లైన్ నిర్మాణానికి ఎంతో కషి చేశారు. మాగుంట శ్రీనివాసులురెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి పలుమార్లు పార్లమెంట్లో దీని ప్రాముఖ్యతపై ప్రసంగించారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ లైన్ ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. ఇందుకు అవసరమైన భూమిని తామే సేకరించి ఇస్తామని, ప్రాజెక్ట్ వ్యయంలో 50 శాతం నిధులు భరిస్తామని కేంద్రానికి తెలియజేశారు. అనంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఈ లైన్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సంకల్పించింది. సత్వరమే పూర్తిచేయాలి రైల్వే పనులను ప్రభుత్వం వెంటనే పూర్తిచేస్తే మెట్ట ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఈ మార్గం అందుబాటులోకి వస్తే హైదరాబాద్, తిరుపతి, కేరళ, తమిళనాడు ప్రాంతాలకు దూరం బాగా తగ్గుతుంది. రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు పరిశ్రమలు ఏర్పడి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. – మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే