
సాక్షి, నెల్లూరు: తాను బాగానే ఉన్నట్లు ఉదయగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. గుండెనొప్పి రావడంతో అసుపత్రికి వచ్చినట్లు పేర్కొన్నారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారని, మరో టెస్టు కోసం చెన్నై తరలిస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల్లో క్షేమంగా ఇంటికి తిరిగి వస్తావనని అన్నారు.
కాగా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గుండెనొప్పితో బుధవారం నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. గుండెలో రెండు వాల్వ్స్ బ్లాక్ అయినట్టు వైద్యులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment