udayagiri
-
టీడీపీలో అసమ్మతి.. ఎమ్మెల్యే ఫ్లెక్సీలు చించేసిన పచ్చ నేతలు
సాక్షి, నెల్లూరు: టీడీపీ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలే తిరగబడుతున్నారు. అసమ్మతి నేతలు టీడీపీ ఎమ్మెల్యే ఫ్లెక్సీలను చించివేయడం ఆసక్తికరంగా మారింది. కాగా, సదరు ఎమ్మెల్యే.. అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమాలే ఇందుకు కారణమని అసమ్మతి వర్గం నేతలు చర్చించుకుంటున్నారు.ఉదయగిరి నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి పీక్ స్టేజ్ చేరుకుంది. ఉదయగిరిలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఫ్లెక్సీలను అసమ్మతి నేతలు చించివేశారు. కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మరో వర్గం టీడీపీ నేతలు చించేయడంతో రాజకీయం వేడెక్కింది. అంతకుముందు.. జలదంకి, వరికుంటపాడుతో పాటు తాజాగా ఉదయగిరిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు.అయితే, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమాలపై సొంత పార్టీ నేతలే ఆగ్రహంగా ఉన్నట్టు స్థానిక నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా తమను పట్టించుకోవడం లేదని కార్యకర్తలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, సొంత పార్టీలోనే ఇలా అసమ్మతి నేతలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే సురేష్‌కు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. -
రాయల నాటి రాజసానికి చిహ్నం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చట్టూరా ప్రకృతి సోయగాలు.. కనువిందు చేసే జలపాతాలు, ప్రాచీన పుణ్యక్షేత్రాలు, కళ్లు తిప్పుకోనివ్వని శిల్పాలతో నిర్మాణాలు, తిరుమల గిరులను పోలిన ఎత్తయిన పర్వత శ్రేణులు.. అడుగడుగున కనిపించే అలనాటి రాచ మందిరాలు.. ఒకటేమిటి ఎన్నో విశిష్టతలతో నిండిన ఉదయగిరి ప్రాంతం పర్యాటక శోభకోసం ఎదురుచూస్తోంది. గత ప్రభుత్వంలో సిద్దేశ్వరం, దుర్గంపల్లి ప్రాంతాలను అటవీశాఖ ఎకో టూరిజం స్పాట్స్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు పంపింది .. ఈ లోపే ప్రభుత్వం మారడంతో ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉదయగిరి దుర్గానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది. చోళులు, పల్లవులు, రెడ్డి రాజులు, గజపతులు, విజయనగర రాజులు, గోల్కోండ నవాబులు ఏలిన ఈ ప్రాంతం ఒకప్పుడు వైభవోపేతంగా విలసిల్లింది. కాలక్రమేణా తన ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయింది. ప్రస్తుతం అలనాటి రాచరిక పాలనకు గుర్తులుగా కనిపించే మొండి గోడలు, శిథిల రాజభవనాలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. జిల్లా కేంద్రానికి వందకిలోమీటర్ల దూరంలో, నీటి వసతిలేని మెట్ట ప్రాంతంగా ఉదయగిరి అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. తొలి సూర్యకిరణాల పడే గిరి.. ఉదయగిరి కోట సముద్ర మట్టానికి 755 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రత గరిష్టంగా 20 డిగ్రీలు మాత్రమే ఉంటుంది. ఉదయగిరి కోట 5 కి.మీ వ్యాసార్ధంతో తిరుమల కొండను పోలి ఉంది. పచ్చని పచ్చిక బయళ్లతో, వన్యప్రాణులతో ఇక్కడ ప్రకృతి సౌందర్యం విరాజిల్లుతూ ఉంటుంది. ఉదయ సూర్యుని తొలికిరణాలు ఈ కొండపైనే ముందుగా పడుతుండటంతో దీన్ని ఉదయగిరిగా విజయనగరం రాజలు పేరుపెట్టారు. ఈ ఉదయగిరి కోటలో శ్రీకృష్ణదేవరాయలు 18 నెలలు ఉండి పాలన సాగించారు.చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి విజయనగర రాజులు ఉదయగిరి ప్రాంతంలో దేవాలయాలు, కోనేరులు నిరి్మంచారు. శ్రీకృష్ణ దేవరాయలు నిరి్మంచిన ఆలయాలు, నవాబులు నిర్మించిన మసీదులు, రాణీ మందిరాలు, ధాన్యాగారాలు, గుర్రపు శాలలు, ఫిరంగి కోటలు, కోనేరులు, సొరంగ మార్గం నేటికీ ఉన్నాయి. ఉదయగిరి దుర్గం కింద పట్టణంలో తల్పగిరి రంగనాయకులస్వామి దేవాలయం, కృష్ణాలయం, కల్యాణమండపం నేటికీ చూపరులను ఆకర్షిస్తున్నాయి. నెల్లూరులో ఉన్న రంగనాయకుల స్వామి విగ్రహం ఉదయగిరి నుంచి తరలించిందే కావటం విశేషం. శ్రీకృష్ణ దేవరాయల పాలనకు గుర్తుగా ఉదయగిరి ట్యాంక్‌బండ్ సమీపంలో కల్యాణ మండపం, కోనేరు అలనాటి శిల్పకళా వైభవాన్ని చాటిచెబుతాయి. ఉదయగిరి నుంచి బండకిందపల్లికి వెళ్లే ఘాట్‌రోడ్డులో పాదచారుల కోసం రాతిలో తవ్విన బావి నేటికీ తానాబావిగా ప్రసిద్ధి చెందింది. అనంతరం బ్రిటిష్ పాలనలో స్టేట్ దొర నిరి్మంచిన ప్రార్థనా మందిరం, తహసీల్దారు కార్యాలయ భవనాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. చూడదగిన ప్రదేశాలు ఉదయగిరికి 33 కి.మీ దూరంలో అత్యంత ప్రాచీనమైన, అతి శక్తివంతమైన ఘటిక సిద్ధేశ్వరం శైవక్షేత్రం ఉంది. అగస్త్య మహాముని తపోపీఠమైన ఈ క్షేత్రం శ్రీకృష్ణ దేవరాయలకు యుద్ధకాలంలో దుర్గంకు దారి చూపించింది. సిద్ధేశ్వరానికి అతి సమీపంలో ఉన్న బూసానాయుడు కోటను అభివృద్ధి చేయవచ్చు. సిద్ధేశ్వరం నుంచి మరో 30 కి.మీ దూరంలో ప్రకృతి సోయగాల నడుమ పయనిస్తూ ముందుకు వెళితే 7, 8 శతాబ్దాల్లో పల్లవుల కాలంలో అద్భుతమైన శిల్పాకళా నైపుణ్యంతో రూపుదిద్దుకున్న ఒకే రాతిపై దేవాలయం, ద్వారపాలకులు, శివలింగాలు, నందీశ్వరుడు కొలువైన భైరవకోన ఉంది. ఇక్కడ ఏడాది పొడవునా జాలువారే జలపాతాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి.. అక్కడి నుంచి మరో 24. కి.మీ ముందుకు వెళితే నారాయణస్వామి ఆలయం ఉంది. అక్కడి నుంచి మరో పది కి.మీ దూరంలో హనుముని కొండ ఉంది. అక్కడి నుంచి మరో 25 కి.మీ ముందుకు వెళితే వెంగమాంబ దేవాలయాన్ని సందర్శించవచ్చు. అభివృద్ధిని మరచిన పాలకులు ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందితే ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశముంది. గత ఐదు దశాబ్దాలుగా ఈ ప్రాంతం అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి. ఉదయగిరి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెబుతున్న పాలకులు ఆచరణలో విఫలమయ్యారు. ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా ఉన్న సమయంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆనాటి కేంద్ర మంత్రులు అనంతకుమార్, సుష్మాస్వరాజ్‌ను ఉదయగిరి పిలిపించి హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. అప్పట్లో ఉదయగిరి ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని అంతా భావించారు. కానీ ఎందుకో ఆ హామీలు నెరవేరలేదు.ప్రతిపాదనలు చేసి.. తిరుమల కొండలను మరిపించే పర్వతశ్రేణులు, పచ్చని ప్రకృతి రమణీయతను పుణికి పుచ్చుకున్న సిద్దేశ్వరం, దుర్గంపల్లి ప్రాంతాలను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం అటవీశాఖ ద్వారా ప్రణాళిక సిద్ధం చేయించింది. చిన్నపిల్లల ఆటలకు అనువుగా పార్కులు, తాగునీటి వసతి, సేదతీరేందుకు గదులు, గార్డెన్స్, జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్లు, యోగా కేంద్రాలు, ప్రకృతి అందాలు వీక్షించేందుకు వాచ్ టవర్లు, సోలార్ షెడ్స్, లైట్లు ఇలా ఒక్కో ప్రాంతంలో 45 రకాల పనులకు రూ.2.78 కోట్ల చొప్పున అంచనాలతో గత ప్రభుత్వంలో ప్రతిపాదనలు పంపించారు. ఆసమయంలో ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఆ ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే మనసుపెట్టి పనులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.వెయ్యేళ్ల చరిత్ర ఉదయగిరి దుర్గానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. గత ఐదు దశాబ్దాలుగా ఉదయగిరి దుర్గాన్ని పర్యాటక కేంద్రంగా చేయాలని ఈప్రాంత ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వాలు పంపిన ప్రతిపాదనలు కాగితాలకేపరిమితమవుతున్నాయి. ఉదయగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్దిచేస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్దిచెందుతుంది.– ఎస్కె.ఎండి.ఖాజా, చరిత్ర కారుడు, ఉదయగిరి -
ఉదయగిరి టీడీపీలో టెన్షన్.. టెన్షన్.. కారణం ఇదేనట!
డబ్బులు ఉన్నాయి కదా అని ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ కొనుక్కుంటే సరిపోతుందా? ఛస్తే సరిపోదు. ఆ విషయమే పాపం ఓ ఎన్.ఆర్.ఐ. కి ఆలస్యంగా తెలిసొచ్చింది. ఇపుడు వెనక్కి వెళ్లలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే పార్టీ ఫండ్ కింద కొంత..టికెట్ కోసం కొంత చొప్పున ఈ ఎన్.ఆర్.ఐ. నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు బానే లాగేశారట. విదేశాల్లో సంపాదించుకున్నది జన్మభూమిలో ఉట్టి పుణ్యాన పోగొట్టుకోవలసి వచ్చిందని ఇపుడా నేత భోరు మంటున్నారు. ఎవరా నేత? ఏమా ఏడుపు కథ? టీడీపీ స్థాపించిన కొత్తలో చాలా మంది డాక్టర్లు, న్యాయవాదులను రాజకీయాల్లోకి తెచ్చారు. వారిలో చాలా మంది తమకున్న అద్భుతమైన ప్రాక్టీసులు వదులుకుని రాజకీయాల్లో అడుగు పెట్టి ఆ తర్వాత ఫెయిల్ అయ్యి రాజకీయాలకూ.. తమ వృత్తులకూ పనికిరాకుండా పోయారు.ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఎన్.ఆర్.ఐ.లపై పగ బట్టినట్లు కనిపిస్తోంది. ప్రవాస భారతీయులను పిలిచి అరచేతిలో రాజకీయ వైకుంఠం చూపించిన చంద్రబాబు కోట్లకు కోట్లు గుంజి టికెట్లు అంటగట్టారు. రాజకీయాల్లో అదరగొట్టేద్దామని వచ్చిన ఎన్.ఆర్.ఐ.లకు ప్రచారం మొదలైన తర్వాత అసలు పిక్చర్ కనిపిస్తోంది. తాము అనవసరంగా టికెట్లు కొన్నామని వారు చిందులు తొక్కుతున్నారు. అటువంటి కొద్ది మంది అభాగ్యుల్లో ఉదయగిరి అసెంబ్లీ నియోజక వర్గం టికెట్‌ను కోట్లు పోసి కొనుక్కున్న ఎన్.ఆర్.ఐ. కాకర్ల సురేష్ అనవసరంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చానని తన అనుచరులతో చెప్పుకుని పెడబొబ్బలు పెడుతున్నారు.ఉదయగిరి నియోజకవర్గంలో ఏళ్ల తరబడి టీడీపీ జెండా మోస్తూ వస్తోన్న మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకట రామారావుకు టికెట్ ఇస్తామని చివరి నిముషం దాకా ఊరించిన చంద్రబాబు చివర్లో సూట్ కేసులతో వచ్చిన ఎన్.ఆర్.ఐ. సురేష్‌కు టికెట్ ప్రకటించారు. దీంతో బొలినేని వర్గం ఆగ్రహంగా ఉంది. సురేష్ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కనిపించడంలేదు. సురేష్ ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు బొలిననేని రావడం లేదు. తన వర్గీయులను కూడా వెళ్లద్దని చెబుతున్నారట. నెల్లూరు ఎంపీ అభ్యర్ధి వేమిరెడ్డి ఉదయగిరిలో ప్రచారానికి వచ్చినపుడు సురేష్‌తో కలిసి తిరిగారు. ఎక్కడా జనం లేకపోవడంతో వేమిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు.రోజులు గడుస్తోన్న కొద్దీ ఉదయగిరిలో గెలిచే పరిస్థితులు కనపడకపోవడంతో సురేష్‌లో టెన్షన్ మొదలైందంటున్నారు. ఓడిపోయే సీటును ఎందుకు కొనుక్కున్నామా అని కాకర్ల సురేష్ తలపట్టుకుంటున్నారట. ఇపుడు టికెట్ వద్దంటే డబ్బులు వెనక్కి రావు. గోడకి కొట్టిన సున్నంలా టీడీపీకి చదివించుకున్న కోట్ల రూపాయలకు రెక్కలు వచ్చినట్లే. -
SPSR Nellore: డబ్బు మూటలతో వస్తే కాకర్లకు సీటు ఇస్తారా?
టీడీపీలో టికెట్ల ఆట మొదలైంది. నేతలు ఆయా నియోజకవర్గాల్లో తామే అభ్యర్థులమంటూ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఎవరికి వారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు తనకే టికెట్ ఇస్తారని, తనని కాదని మరొకరికి ఇవ్వరని చెబుతుండడం గమనార్హం. నేతల సంగతి అటుంచితే కేడర్ మాత్రం టికెట్ ఎవరికిస్తారో అర్థంకాక అయోమయ స్థితిలో ఉన్నారు. ఏ నాయకుడి వద్దకు వెళితే మిగిలిన వారు ఏమనుకుంటారోనని అందరికీ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది సాక్షి ప్రతినిధి, నెల్లూరు : సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో రానున్న నేపథ్యంలో టీడీపీ ఇంకా తమ అభ్యర్థులపై ఎటూ తేల్చుకోలేకపోతోంది. అయితే టికెట్లు ఆశిస్తున్న వారు మాత్రం ఆయా నియోజకవర్గాల్లో తమకే టికెట్ వస్తుందంటూ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో గెలుపు ధీమా లేకపోయినప్పటికీ టీడీపీ అధిష్టానం మాత్రం ఈ దఫా దండిగా పార్టీ ఫండ్‌తోపాటు ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసే వారికే టికెట్ ఇస్తామంటోందని సమాచారం. పైకం తూకంతోనే టికెట్ల కేటాయింపులు ఉంటాయన్న సంకేతంతో ఉదయగిరి టీడీపీలో అలజడి రేగుతోంది. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉపయోగించి టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌కు సాయపడుతున్న తనకే టికెట్ ఖాయం అంటూ ధీమాగా చెబుతున్నట్లు తెలుస్తోంది. కాగా నాలుగైదు రోజులుగా ఉదయగిరి టికెట్ ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్‌కే ఓకే అయిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాను ఇప్పటికే లోకేశ్‌కు డబ్బు సంచులు అందించానని, టికెట్ తనకే అంటూ ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ బాహాటంగానే చెబుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధిష్టానం డబ్బుకే ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఇందులో నిజం ఉంటుందని పార్టీ కేడర్ కూడా బలంగా విశ్వసిస్తోంది. మరి ఆ ఇద్దరి పరిస్థితి అలా ఉంటే వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తనకే టికెట్ అని చెబుతుందగా, బీసీ సామాజికవర్గం నుంచి ఈ దఫా తనకే టికెట్ వస్తుందంటూ బీసీ నేత చెంచలబాబు కూడా ప్రచారం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. డబ్బుకే ప్రాధాన్యమా.. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం డబ్బుకే ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్‌కే అవకాశం ఉంటుందని ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. కాకర్లకు లోకేశ్‌తో సన్నిహిత సంబంధాలతోపాటు ఆశీస్సులు కూడా ఉన్నట్లు సమాచారం. కాకర్ల విదేశాల్లో తనకున్న పరిచయాలతో పార్టీ ఫండ్ కోసం భారీగా వసూలు చేసి ఇచ్చాడనే ప్రచారం ఉంది. ఇప్పటికే లోకేశ్ వద్ద హామీ కూడా పొందినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. లోకేశ్ హామీతోనే సేవా కార్యక్రమాల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నానంటూ కాకర్ల బహిరంగంగానే చెబుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో కూడా అధిష్టానం తనకే టికెట్ ఓకే చేసిందంటూ ప్రచారం ప్రారంభించడంతోపాటు చినబాబు లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా వింజమూరు ప్రాంతంలో భారీగా కార్యకర్తలను పోగేసి విందు ఇచ్చారని తెలుస్తోంది. టికెట్ నాదేనంటూ సందేశమిచ్చి తనకు సాయం చేయాలని కోరడంతో ఇప్పుడు ఉదయగిరి టీడీపీలో టికెట్ల లొల్లి కాక పుట్టిస్తోంది. కాకర్లది కాకమ్మ కబుర్లేనా.. టీడీపీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు మాత్రం సీటు తనదేనంటూ స్పష్టంగా చెబుతున్నారు. చంద్రబాబు కేసుల విషయంలో తాను ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసి సాయం చేశానని చెబుతుండడం గమనార్హం. లోకేశ్‌ను తన పలుకుబడితోనే బీజేపీ పెద్దల వద్దకు తీసుకెళ్లానని, తన సత్తా ఏంటో చినబాబుకు తెలుసునని చెబుతున్నట్లు తెలుస్తోంది. డబ్బుల మూటలతో వస్తే కాకర్లకు సీటు ఇస్తారా అంటూ బొల్లినేని బహిరంగంగానే చెబుతున్నారు. కాకర్లదంతా కాకమ్మ కబుర్లేనంటూ బహిరంగ సమావేశంలోనే చెప్పడం గమనార్హం. గతంలో లోకేశ్ యువగళం పాదయాత్రలో కూడా ఉదయగిరి దరిదాపుల్లో కూడా కాకర్లను రానివ్వకుండా చేశానని చెబుతున్నట్లు తెలుస్తోంది. తనను కాదని కాకర్లకు సీటు ఇచ్చే ధైర్యం కూడా చంద్రబాబు చేయలేరని బొల్లినేని చెబుతున్నట్లు సమాచారం. అయోమయంలో కేడర్ ఉదయగిరి టీడీపీలో నాలుగు స్తంభాలాట ప్రారంభమైంది. దీంతో ఆ నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఓవైపు బొల్లినేని, కాకర్ల ఉదయగిరి టికెట్ తమదేనంటూ ప్రచారం చేసుకొంటుండగా, మరోవైపు వైఎస్సార్సీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తనకు హామీ ఇవ్వడంతోనే పార్టీలోకి వచ్చానని చెబుతున్నారు. చివరకు తనకే టికెట్ ఇస్తారని, ప్రత్యర్థిగా తన సోదరుడే ఉంటారని, అందుకోసమైనా టికెట్ తనకే కేటాయిస్తారంటూ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి బలంగా ప్రచారం చేసుకుంటున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన పి.చెంచలబాబుయాదవ్ ఈ ప్రాంతంలో బీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్నారని, బీసీ కేటగిరీలో తనకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటుండడం గమనార్హం. టీడీపీ కేడర్ ఆ నలుగురు నేతల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. అయోమయంలో ఉన్న కేడర్ ప్రస్తుతం ఎవరి వద్దకు వెళితే ఎవరు ఏమనుకుంటారోనని నేతలకు దూర దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. -
ఉదయగిరి దుర్గం: క్యాన్సర్‌ను సైతం నయం చేసే ఔషధ మొక్కలు!
రూపంలో శేషాచలం కొండలను పోలి ఉండే ఉదయగిరి దుర్గం ఆయుర్వేద వనమూలికలకు నిలయం. అపార ఆయుర్వేద సంపదకు నెలవైన ఈ దుర్గం ఎంతో ప్రాశస్త్యం పొందినది. నల్లమల, వెలిగొండ, శ్రీశైలం అడవుల్లో లభించని అరుదైన అనేక రకాల ఔషధ మొక్కలు ఈ దుర్గంపై ఉన్నట్లు ఆయుర్వేద పరిశోధకులు గుర్తించారు. ఈ వనమూలికలు ఆయుర్వేద వైద్యానికి ఎంతో ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు. ఉదయగిరి: సముద్ర మట్టానికి 938 మీటర్ల ఎత్తులో గల ఉదయగిరి దుర్గం సంజీవకొండగా ప్రసిద్ధి పొందినదని స్థానికులు చెబుతుంటారు. ఈ దుర్గంపై ఆయుర్వేద మొక్కలకు కొదువలేదు. ప్రాచీన వైద్యవిధానాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఆయుర్వేద వైద్యంతో ఎన్నో రోగాలు నయమైనట్లు ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. అందుకే రాజుల కాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు వైద్యులకు కూడా అంతుచిక్కని అనేక రోగాలు ఆయుర్వేద వైద్యం ద్వారా నయమవుతున్నాయి. ఈ వైద్యానికి అవసరమైన ఎంతో విలువైన వనమూలికలు ఉదయగిరి దుర్గంపై ఉన్నప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇటీవల ఆయుర్వేద వైద్యంపై ప్రజల్లో ఆసక్తి పెరగడంతో ఈ వైద్యానికి డిమాండ్ ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయుర్వేద వైద్యానికి ప్రాధాన్యమిస్తూ విలువైన ఆయుర్వేద మందులను తయారు చేస్తూ వైద్యశాలలకు సరఫరా చేస్తోంది. ఆయుర్వేద వైద్యశాలల్లో బెడ్లు కూడా ఏర్పాటు చేసి పసుర్లు, తైలాలతో ప్రాచీన వైద్యసేవలు అందిస్తోంది. దీంతో ఈ వైద్యానికి పూర్వవైభవం తెచ్చేలా అడుగులు పడుతున్నాయి. పరిశోధనలు ఆయుర్వేద సంస్థల ప్రతినిధులు 30 ఏళ్ల క్రితమే ఉదయగిరి దుర్గాన్ని సందర్శించి అనేక ఔషధ మొక్కలను సేకరించారు. అనేక వనమూలికా మొక్కలపై పరిశోధనలు చేశారు. కర్ణాటకకు చెందిన ఆయుర్వేద డాక్టర్ అయ్యంగార్, నెల్లూరుకు చెందిన పి.చెంచలరావు పంతులు ఇక్కడి అడవుల్లో మొక్కలు సేకరించి తమ ఆయుర్వేద చికిత్సాలయాల్లో వినియోగించారని తెలుస్తోంది. ఇప్పటికీ స్థానికంగా ఉన్న అనేక మంది ఆయుర్వేద వైద్యులు కొండల్లో లభించే వనమూలికలను వైద్యానికి ఉపయోగిస్తున్నారు. బ్రిటిష్ కాలంలోనే గుర్తింపు ఉదయగిరి అడవులు, కొండల్లో ఉండే ఔషధ సంపద బ్రిటిష్ పాలకులే గుర్తించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ వనమూలికలపై వారు అనేక పరిశోధనలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. ఉదయగిరిలో ఒక ఆయుర్వేద వైద్యశాలను ఏర్పాటు చేసి వైద్యసేవలను కూడా అందించారు. మాదాల జానకిరామ్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయుర్వేద ఫార్మసీ ఏర్పాటుకు ప్రయత్నం చేసినా కార్యరూపం దాల్చలేదు. అటవీశాఖ ఆధ్వర్యంలో దుర్గంపల్లి పరిసర ప్రాంతాల్లో వనమూలికల మొక్కల సంరక్షణ కోసం కంచె కూడా ఏర్పాటు చేశారు. అయినా ఆశించిన ఫలితం లేదు. ఉదయగిరి దుర్గంలో ఉన్న అపారమైన వనమూలికా సంపదను సక్రమంగా వినియోగించుకోనేందుకు ఉదయగిరిలో ఆయుర్వేద కళాశాల, వైద్యశాల ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అపార సంపద ఆయుర్వేద వైద్యానికి ఉపయోగించే వనమూలికలు ఉదయగిరి అడవుల్లో, కొండల్లో, దుర్గంపై అపారంగా ఉన్నాయని తెలుస్తోంది. వైఎస్సార్ కడప, ప్రకాశం, శ్రీపొటి శ్రీరాములు నెల్లూరు జిల్లాల సరిహద్దులో ఉన్న ఉదయగిరి, సిద్ధేశ్వరం, భైరవకోన అడవులు, కొండలు, కోనలు, గుట్టల్లో 162 రకాలకు పైగా ఔషధ మొక్కలు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఉదరకోశ వ్యాధులు, పక్షవాతం, కామెర్లు, పైత్యం, పోలియో తదితర వ్యాధులను నయం చేసే వనమూలికలు ఈ ప్రాంతాల్లో దొరుకుతున్నాయి. దీర్ఘకాలిక క్యాన్సర్‌ను సైతం నయం చేసే ఔషధ మొక్కలు ఈ దుర్గంపై ఉన్నట్లు పలువురు పరిశోధకులు పేర్కొన్నారు. -
ఉదయగిరి సమన్వయకర్తగా రాజగోపాల్‌రెడ్డి
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: వైఎస్సార్సీపీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా మేకపాటి రాజగోపాల్‌రెడ్డిని పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ప్రకటించింది. ఆయన మేకపాటి రాజమోహన్‌రెడ్డి రెండో సోదరు డు. ఇతను విద్యాపరంగా డిగ్రీ పూర్తి చేశారు. నలభై ఏళ్లుగా కేఎంసీ కన్స్ట్రక్షన్స్లో కాంట్రాక్టర్‌గా ఉంటూ బెంగళూరులో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన కుమారులిద్దరికీ కాంట్రాక్టు బాధ్యతలు అప్పగించారు. 1983లో మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజకీయ ప్రవేశం చేసిన నాటి నుంచి ఆయన ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి కీలకపాత్ర పోషించారు. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మేకపాటి విక్రమ్‌రెడ్డి పోటీ చేసిన సమయాల్లో కూడా ఈయన కీలకపాత్ర పోషించారు. ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిని ఇటీవల వైఎస్సార్సీపీ నుంచి బహిష్కరించిన నేపథ్యంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మేకపాటి కుటుంబం నుంచి ఆదాల రచనారెడ్డి (మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కూతురు)ని బరిలోకి దించాలని భావించారు. అయితే ఆమె రాజకీయా లపై ఆసక్తి చూపకపోవడంతో ఆయన చిన్న తమ్ముడు రాజగోపాల్‌రెడ్డికి అవకాశం కల్పించాలని ఇటీవల ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డితో కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ క్రమంలో రాజగోపాల్‌రెడ్డిని ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. దీంతో పార్టీ కేడర్‌లో నూతనోత్సాహం నెలకొంది. సమన్వయకర్త నియామకంతో పార్టీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తున్న ఎన్ఆర్ఐ
ఆ నియోజకవర్గంలో చంద్రబాబుకు ఇష్టుడైన లాబీయిస్ట్కే చుక్కలు చూపిస్తున్నాడట ఓ ఎన్ఆర్ఐ. చంద్రబాబు తరపున ఢిల్లీలో లాబీయింగ్ చేసే ఆ మాజీ ఎమ్మెల్యేకే ఇప్పుడు టిక్కెట్ కష్టాలు ఎదురవుతున్నాయట. కొత్త నేతల తాకిడితో ఉక్కిరి బిక్కిరవుతున్న ఆ నేత ఎవరో చూద్దాం. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. ఏమి జరుగుతుందో ఊహించడం కష్టమే. కొత్తగా వచ్చే జూనియర్ నేతల వ్యూహాలతో తలపండిపోయిన నాయకులు కూడా ఉక్కిరిబిక్కిరవుతుంటారు. బొల్లినేని రామారావు నెల్లూరు జిల్లా ఉదయగిరికి ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాని ఢిల్లీలో చంద్రబాబు తరపున లాబీయింగ్ చేసే వ్యక్తిగానే నియోజకవర్గంలో చెప్పుకుంటారు. చంద్రబాబు దగ్గర చాలా పలుకుబడి ఉందని చెప్పుకునే బొల్లినేని రామారావును కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఓ ఎన్ఆర్ఐ తన తెలివితేటలతో చిత్తు చేస్తున్నారట. దీంతో బొల్లినేని రామారావు వేసవి ఎండలకు మించి పొగలు..సెగలు కక్కుతున్నారట. ఆయన బాధ చూసి అనుచరులు కూడా ఆందోళన చెందుతున్నారట. ఎన్నికలకు ఏడాది గడువుండగానే ఉదయగిరి టిక్కెట్ కోసం తెలుగుదేశంలో సిగపట్లు మొదలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే బొల్లినేనికి సొంత గ్రామం నుంచే చిక్కులు ఎదురవుతున్నాయి. బాగా డబ్బు సంపాదించుకువచ్చిన ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ దెబ్బకు బొల్లినేని దిక్కుతోచని స్థితిలో పడ్డట్లు టాక్. బొల్లినేని రామారావుకి పార్టీ క్యాడర్లో పరపతి తగ్గిపోయింది. ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి జనాల్లో తిరగక పోవడంతో క్యాడర్‌కు దిక్కు లేకుండా పోయింది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన కాకర్ల సురేష్ మూడు నెలలు నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చదవండి: అక్కడ చంద్రబాబే నిప్పు రాజేస్తున్నారా..? బొల్లినేని వర్గంతో సంబంధం లేకుండా ఆయన స్వంతంగా కార్యక్రమాలు చేస్తున్నారట. పార్టీలో సరైన నాయకుడు లేకపోవడంతో..బొల్లినేని యాంటీ వర్గం కాకర్లకు సహాయ సహకారాలు అందిస్తోందని.. ఇప్పటివరకు జనానికి దూరంగా ఉన్న బొల్లినేనికి కాకర్ల సురేష్ కార్యక్రమాలతో చెమటలు పడుతున్నాయనీ ఉదయగిరిలో టాక్ వినిపిస్తుంది.. ఎన్ఆర్ఐ కావడం.. కొద్దో గొప్పో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండటంతో టీడీపీ నాయకత్వం కూడా సురేష్‌కే మొగ్గు చూపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ గమనించిన మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావ్.. పార్టీలో పూర్వ వైభవం కోసం అగచాట్లు పడుతున్నారట. మొన్నటికి మొన్న వింజమూరులో కాకర్ల సురేష్ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చెయ్యాలని ప్రయత్నాలు ప్రారంభించగా.. అతని కంటే ముందే బొల్లినేని ఆ ప్లాన్‌ను అమలు చేసి తన ఖాతాలో వేసుకున్నారు. మొత్తానికి లాబీయుస్టాగా ముద్రపడ్డ బొల్లినేనికి ఉదయగిరిలో ఓ జూనియర్ ఎన్ఆర్ఐ టిక్కెట్ విషయంలో గట్టి పోటీ ఇస్తున్నారు. చదవండి: పవన్ అంటే ఆటలో అరటి పండే..! -
‘ఎమ్మెల్యే వీడినా నష్టం లేదు.. ఉదయగిరిలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది’
సాక్షి,నెల్లూరు: ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పార్టీలోని ముఖ్యనేతలు ఏకమౌతున్నారు. ఈ సందర్భంగా నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని మండలాల నేతలు భారీగా హాజరయ్యారు. సమావేశం అనంతరం ఉదయగిరి నియోజకవర్గ మాజీ పరిశీలకులు కొడవలూరు ధనుంజయ రెడ్డి దీనిపై మాట్లాడుతూ.. నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ బలంగానే ఉంది.. ఎమ్మెల్యే పార్టీ వీడినా ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి వైఖరి వల్ల నేతలు పార్టీకి దూరమయ్యారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతో వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయని.. మండల కన్వీనర్ పదవులను చంద్రశేఖర్ రెడ్డి డబ్బులకు అమ్ముకున్నారని మండిపడ్డారు. పార్టీ పదవులను ఎమ్మెల్యే అమ్ముకుని అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని.. వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. తన పై చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శల మీద న్యాయ పోరాటం చేస్తానన్నారు. -
‘మా కుటుంబానికి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కళంకం తెచ్చాడు’
సాక్షి, నెల్లూరు: తమ కుటుంబానికి ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కళంకం తెచ్చాడని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. తాము మొదటి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే నడిచామని.. భవిష్యత్తులో కూడా నడుస్తామని స్పష్టం చేశారు. ఆర్ధిక ఇబ్బందులు ఉంటే సాయం చేస్తానని చంద్రశేఖర్‌రెడ్డికి చెప్పానని గుర్తు చేశారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి తమ కుటుంబ పరువు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వైఎస్సార్ హయాంలో నా తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరిని అభివృద్ధి చేశాడు. అతనికి దరిద్రం పట్టి క్రాస్ ఓటింగ్ చేశాడు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజక వర్గాలు మాకు రెండు కళ్ళు లాంటివి. సీఎం జగన్ అడిగితే ఉదయగిరిలో చంద్రశేఖర్ రెడ్డి కూతురు రచనా రెడ్డికి ఇంచార్జీ బాధ్యతలు ఇవ్వమని అడుగుతాను. మా కుటుంబం టీడీపీలోకి వెళ్తున్నారని కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.. అవన్నీ పుకార్లే’ అని మాజీ ఎంపీ స్పష్టం చేశారు. (చదవండి: అక్కడ సెల్ఫీ తీసుకునే దమ్ము ఉందా: చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్) -
ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సవాల్‌ను స్వీకరించిన వైఎస్సార్సీపీ
సాక్షి, నెల్లూరు: ఉదయగిరిలో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సవాల్‌ను వైఎస్సార్సీపీ శ్రేణులు స్వీకరించాయి. వైఎస్సార్సీపీ నేత మూలే వినయ్‌రెడ్డి వర్గీయులు బస్టాండ్ సెంటర్లో కూర్చున్నారు. అవినీతి ఎమ్మెల్యే, పార్టీ ద్రోహి మేకపాటి అంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మేకపాటి తన వద్ద డబ్బులు తీసుకున్నది వాస్తవం కాదా అంటూ మూలే వినయ్‌రెడ్డి సవాల్ విసిరారు. మేకపాటికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. పార్టీ ద్రోహి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి అంటూ నినాదాలు చేశారు. ఉదయగిరి నుంచి చంద్రశేఖర్‌రెడ్డి వెళ్లిపోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కాగా, వైఎస్సార్సీపీ నేతలపై నోరు పారేసుకున్న మేకపాటి.. వారిపై రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేశారు. మేకపాటి చేసిన సవాల్‌తో వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. చదవండి: కోటంరెడ్డి బ్రదర్స్ కోసం సొంతవాళ్లకే టీడీపీ వెన్నుపోటు.. పాపం అజీజ్! -
నేను బాగానే ఉన్నాను: ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి
సాక్షి, నెల్లూరు: తాను బాగానే ఉన్నట్లు ఉదయగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. గుండెనొప్పి రావడంతో అసుపత్రికి వచ్చినట్లు పేర్కొన్నారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారని, మరో టెస్టు కోసం చెన్నై తరలిస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల్లో క్షేమంగా ఇంటికి తిరిగి వస్తావనని అన్నారు. కాగా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గుండెనొప్పితో బుధవారం నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. గుండెలో రెండు వాల్వ్స్ బ్లాక్ అయినట్టు వైద్యులు గుర్తించారు. -
మెట్ట ప్రాంతానికి మణిహారంగా వ్యవసాయ కళాశాల!
ఉదయగిరి కేంద్రంగా వ్యవసాయ విద్యకు బీజం పడింది. మెట్ట ప్రాంతానికి మణిహారంగా వ్యవసాయ కళాశాల మారనుంది. మారుతున్న ప్రపంచీకరణలో తిరిగి వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం పెరుగుతోంది. కంప్యూటర్ కోర్సులు చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా మారిన ఎందరో తిరిగి ఆధునిక వ్యవసాయంపై దృష్టి సారించి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ రంగంలో అవకాశాలు మెండుగా ఉండడంతో ప్రస్తుతం విద్యార్థులు సైతం ఇంజినీరింగ్, మెడిసిన్ తర్వాత వ్యవసాయ విద్యకు ఆకర్షితులు అవుతున్నారు. ఉదయగిరి (పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా): రాచరిక పాలనకు కేంద్రంగా విరాజిల్లిన ఉదయగిరిలో కాలక్రమేణా కరవు రాజ్యమేలింది. అలనాటి రాజుల స్వర్ణయుగం మళ్లీ ఇన్నేళ్ల తర్వాత రాబోతుంది. ఉదయగిరి కేంద్రంగా మేకపాటి గౌతమ్‌రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఈ ఏడాది మే నెలలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందు కోసం ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన రూ.250 కోట్ల ఆస్తులను మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రభుత్వానికి అప్పగించి వ్యవసాయ యూనివర్సిటీగా మార్చాలని కోరారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి ముందుగా వ్యవసాయ కళాశాలను మంజూరు చేసి అందుకు అవసరమైన నిధులు కేటాయించారు. ఈ నెల 18వ తేదీ నుంచి వ్యయసాయ తరగతులు ప్రారంభం కానున్నాయి. త్వరలోనే అగ్రికల్చర్, హార్టికల్చర్ యూనివర్సిటీ మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలను అగ్రికల్చర్, çహార్టికల్చర్ యూనివర్సిటీగా మార్చేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మెట్ట ప్రాంత వ్యవసాయానికి మహర్దశ పట్టనుంది. వ్యవసాయ రంగానికి ఈ ప్రాంత విద్యార్థులు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ఇక్కడి విద్యార్థులు వ్యవసాయ విద్య కోసం సుదూర ప్రాంతాలకు వెళుతున్నారు. ప్రస్తుతం ఉదయగిరికి వ్యవసాయ కళాశాల మంజూరు కావడంతో అగ్రికల్చర్ కోర్సులు ఇక్కడే అభ్యసించే అవకాశం ఏర్పడింది. దీంతో ఉపాధి అవకాశాలు కూడా మరింత మెరుగు పడనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో గుంటూరులో ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ ఉంది. దాని పరిధిలో ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు 25 వరకు ఉన్నాయి. ఉదయగిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన కళాశాల కూడా దీని పరిధిలోకి రానుంది. త్వరలోనే అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్పు చెందితే ఈ కళాశాలలన్నీ కూడా దీని పరిధిలోకి వచ్చే అవకాశముంది. రూ.250 కోట్ల ఆస్తులు ప్రభుత్వానికి అప్పగింత మెట్ట ప్రాంతంలో విద్యను ప్రోత్సహిస్తే అభివృద్ధి త్వరగా జరుగుతుందనేది మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆలోచన. ఆయన అందుకు అనుగుణంగానే ఆది నుంచి విద్యా సంస్థల అభివృద్ధికి ఎంతో తోడ్పాటునందించారు. 25 ప్రభుత్వ పాఠశాలలను హైస్కూల్స్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు ఉదయగిరిలో డిగ్రీ కళాశాలకు సొంత నిధులు ఇచ్చారు. అనంతరం వందెకరాల విశాల ప్రాంగణంలో మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేశారు. దీని విలువ ప్రస్తుతం రూ.250 కోట్ల వరకు ఉంది. ఈ మొత్తం మెట్ట ప్రాంత ప్రజలకు ఉపయోగపడే వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి అప్పగించారు. మెరిట్స్‌లో ప్రస్తుతమున్న సదుపాయాలు 150 ఎకరాల ప్రాంగణంలో ఈ కళాశాల ఉంది. 5 లక్షల చ.అ. అకాడమీ బ్లాక్స్ ఉన్నాయి. సుమారు 1,350 మంది విద్యార్థులు నివాసముండేందుకు హాస్టల్ భవనాలున్నాయి. 89 మంది స్టాఫ్ ఉండేందుకు క్వార్టర్స్, ఓపెన్ ఆడిటోరియం, ఇంజినీరింగ్ ల్యాబ్, విశాలమైన లైబ్రరీలో 27 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. 3 బస్సులు, జనరేటర్లు, క్యాంటిన్, గెస్ట్‌హౌస్, ఎన్ఎస్ఎస్ భవన సముదాయాలు, ప్లేగ్రౌండ్, తదితర వసతులు కూడా ఉన్నాయి. వీటి మొత్తాన్ని కూడా ప్రభుత్వానికి అప్పగించారు. మరో యాభై ఎకరాల్లో ప్లాంటేషన్ చేసేందుకు అవసరమైన భూములు కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీకి అందుబాటులో ఉన్నాయి. ఈ కళాశాలను దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేబినెట్ ఆమోదం రెండ్రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మెరిట్స్ కళాశాలలో పని చేసే 108 మంది బోధన, బోధనేతర సిబ్బందిని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కింద వ్యవసాయ కళాశాలకు తీసుకుంటూ కేబినెట్ ఆమోదించింది. దీంతో మెరిట్స్‌లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం మేలుచేకూర్చినట్టయింది. కేబినెట్ ఆమోదంపై మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సీఎం జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 18 నుంచి తరగతుల ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వం ముందుగా 250 మంది విద్యార్థులకు వ్యవసాయ కళాశాలను మంజూరు చేసింది. ప్రస్తుతం ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఈ నెల 18వ తేదీ నుంచి వ్యవసాయ తరగతులు ప్రారంభం కానున్నాయి. నెల్లూరు, కడప, ప్రకాశం ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఉదయగిరి వ్యవసాయ కళాశాల అందుబాటులో ఉండడంతో ఈ ప్రాంతానికి చెందిన ఎక్కువ మంది విద్యార్థులు ఈ కళాశాలలో చేరేందుకు మక్కువ చూపుతున్నారు. మారుమూల ప్రాంతంలో ఉన్న ఉదయగిరికి వ్యవసాయ కళాశాల రాకతో వ్యాపార ఆర్థిక కలాపాలు మరింత ఊపందుకోనున్నాయి. తరగతుల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి ఈ వ్యవసాయ కళాశాలలో 250 మంది విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే దీనికి సంబంధించి కొంత మంది స్టాఫ్‌ను ప్రభుత్వం కేటాయించింది. ఈ నెల 18 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. మౌలిక వసతులు, వసతి గృహాలు, అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంత అభివృద్ధికి వ్యవసాయ కళాశాల ప్రముఖపాత్ర పోషించే అవకాశముంది. – డాక్టర్ కరుణసాగర్, ప్రిన్సిపల్, వ్యవసాయ కళాశాల, ఉదయగిరి -
ఎమ్మెల్యే కబ్జా పర్వమంటూ కల్లబొల్లి కథనం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహ ప్రాంతాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సొంత నిధులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నంపై పచ్చ మీడియా విషం కక్కింది. టీడీపీ అధికారంలో ఉన్న కాలంలో ఆ పార్టీ నేతలు ఏకంగా రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి, విలువైన భూములను కబ్జా చేశారు. ‘పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు’గా అటవీ ప్రాంతాన్ని తలపిస్తున్న ప్రభుత్వ స్థలంలో ఎమ్మెల్యే సొంత నిధులు వెచ్చించి శుభ్రం చేసి పార్కుగా తీర్చిదిద్దుతుంటే ఆ పచ్చ మీడియాకు కబ్జా పర్వంగా కనిపించింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పచ్చ మీడియా బరితెగించి పైత్యం ప్రదర్శిస్తోంది. కంప చెట్లు, పిచ్చి మొక్కలు, జంతు మల, మూత్రాలతో అపరిశుభ్రంగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సొంత నిధులతో సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా పార్కుగా తీర్చిదిద్దుతున్నారు. అయితే ఆ పచ్చ మీడియా కబ్జాపర్వమంటూ కల్లబొల్లి కుల్లు కథనాన్ని రాసింది. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో రూ.కోట్లాది విలువైన తమ సొంత భూములను ప్రజా అవసరాలకు ప్రభుత్వానికి అప్పగించిన చరిత్ర మేకపాటి సోదరులది. అటువంటిది మార్కెట్ ధర ప్రకారం పట్టుమని పాతిక లక్షల రూపాయల విలువ చేయని ఆ స్థలానికి రూ.2 కోట్ల విలువ కట్టి మేకపాటి కుటుంబంపై బురద జల్లే ప్రయత్నం చేయడాన్ని స్థానిక ప్రజలు సైతం మండి పడుతున్నారు. మండల కేంద్రం మర్రిపాడులో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి భూములు కొనుగోలు చేసి గెస్ట్‌హౌస్ నిర్మించుకున్నారు. ఆ తదనంతర కాలంలో వైఎస్సార్ అకాల మరణం చెందడంతో తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఊరూరా ఆయన విగ్రహాలు ఆవిష్కరించారు. ఇదే సమయంలో మేకపాటి చంద్రశేఖరరెడ్డి తన గెస్ట్‌హౌస్ సమీపంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబరు 428/2లో కొంచెం స్థలంలో 2010లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో ఓదార్పు యాత్రలో జిల్లా పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ తర్వాత ఆ ప్రాంతమంతా కంప చెట్లు, పిచ్చి మొక్కలు, జంతు మలమూత్రాలతో అపరిశుభ్రంగా మారింది. దివంగత సీఎం వైఎస్సార్ వీర భక్తుడు అయిన చంద్రశేఖరరెడ్డి తన గెస్ట్‌హౌస్ పక్కన తానే ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహ ప్రాంతం అపరిశుభ్రంగా మారడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆ ప్రదేశాన్ని సుందరవనంగా వైఎస్సార్ ఘాట్‌గా తీర్చిదిద్దాలని సంకల్పించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి పచ్చదనం పరిఢవిల్లేలా మొక్కలు తెచ్చి నాటారు. తన సొంత నిధులతో పార్కుగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తుంటే ‘వైఎస్సార్ సాక్షిగా భూ కబ్జా’ అంటూ ఎమ్మెల్యేపై దుష్ప్రచారానికి దిగింది. ప్రభుత్వ స్థలాన్ని పార్కుగా మారిస్తే తప్పా? నిరుపయోగంగా ముళ్ల పొదలతో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆహ్లాదకరమైన పార్కుగా తీర్చిదిద్దడం తప్పా. పార్కులను ప్రభుత్వ స్థలాల్లో కాకుండా ప్రైవేట్ స్థలాల్లో నిర్మిస్తారా?. ఎమ్మెల్యే సొంత నిధులతో పార్కు వాతావరణాన్ని కల్పించే విధంగా చేస్తుంటే పచ్చ విషపు రోత రాతలు రాయడం వెనుక పచ్చ మీడియా సొంత అజెండా ఉందనే అర్థమవుతోంది. వైఎస్సార్ విగ్రహ ప్రాంతాన్ని పార్కుగా మలుస్తున్నారే కానీ.. బిల్డింగులు కట్టడం లేదే. నాటిన మొక్కలు పశువుల పాలు కాకుండా చుట్టూ ఫెన్సింగ్ వేస్తే కబ్జా అని వక్రభాష్యం చెబుతారా అని స్థానిక ప్రజలు సైతం మండి పడుతున్నారు. సుందరంగా తీర్చిదిద్దుతున్నా.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజలకు చేసిన మేలు మరువలేనిది. తెలుగువారి గుండెల్లో కొలువై ఉన్నారు. నేను వైఎస్సార్ వీర భక్తుడిని. విగ్రహా ఘాట్‌ను సుందరంగా తీర్చిదిద్దాలనే తపనతో ప్రాంగణాన్ని శుభ్రం చేశాం. గార్డెన్ ఏర్పాటు చేస్తున్నాం. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారు సైతం కాసింత సేద తీరే విధంగా పార్కుగా రూపొందిస్తున్నాం. భూ కబ్జాలు చేయాల్సిన అవసరం తమ కుటుంబానికి లేదు. – మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్యే, ఉదయగిరి -
ఉదయగిరిలో బాలిక కిడ్నాప్ !
ఉదయగిరి (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) : ఉదయగిరి పట్టణంలో సోమవారం ఓ బాలికను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి అడవిలో చెట్టుకు కట్టేశారు. ఆ బాలికను గొర్రెల కాపరులు రక్షించి ఇంటికి చేర్చారు. ఉదయగిరి దిలావర్‌భాయి వీధికి చెందిన రషీద్, నస్రీన్లకు సమ్రీన్, మసీరా అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. స్థానిక నాగులబావి వీధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మసీరా ఐదో తరగతి, సమ్రీన్, ఏడో తరగతి చదువుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఇద్దరూ కలిసి పాఠశాల నుంచి భోజనం కోసం ఇంటికి వచ్చారు. అనంతరం సమ్రీన్ ముందు వెళ్లగా, మసీరా ఇంటి నుంచి ఆలస్యంగా బయలుదేరింది. మార్గమధ్యంలో బైక్‌పై మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు మసీరాను కిడ్నాప్ చేశారు. పట్టణ శివారులోని బండగానిపల్లి వైపు వెళ్లే మార్గంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పొదల్లో ఓ చెట్టుకు బాలికను కట్టేసి వెళ్లిపోయారు. అటవీ ప్రాంతంలో ఉన్న గొర్రెలకాపరులు బాలికను గుర్తించి కట్లు విప్పి వివరాలు తెలుసుకుని ఇంటికి చేర్చారు. అప్పటికే పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన సమ్రీన్.. చెల్లిని ఎందుకు స్కూలుకు పంపలేదని తల్లిని అడిగింది. దీంతో మసీరా పాఠశాలకు వెళ్లకపోవడం, ఇంట్లో లేకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెదకడం ప్రారంభించారు. అదే సమయంలో బాలిక అటవీ ప్రాంతం వైపు నుంచి ఇంటికి రావడంతో కిడ్నాప్ ఉదంతం బయటపడింది. ఈ నేపథ్యంలో బాలిక బంధువులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక నుంచి వివరాలు తెలుసుకున్న ఎస్ఐ జి.అంకమ్మ... నాగులబావి వీధిలోని సీసీ ఫుటేజీలు పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
జైహింద్ స్పెషల్: ఈస్టిండియా కుటిల వ్యూహం
భారతావనిని దోచుకోవడంలో పాశ్చాత్యులు ఒకరిని మించి మరొకరు అన్నట్లు వ్యవహరించారు. ఈస్టిండియా కంపెనీ పాలనలో ఉన్నప్పటి నుంచే ఆక్రమణల పర్వం పతాక స్థాయికి చేరింది. జాగీరులను సొంతం చేసుకోవడానికి బ్రిటిష్ వాళ్లు పన్నిన కుట్రకు ఒక ప్రత్యక్ష నిదర్శనం ఉదయగిరి (నెల్లూరు జిల్లా) జాగీర్ ఆక్రమణ. అందుకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఉదయగిరి నవాబుల వారసురాలు సయ్యద్ ఖాదరున్నీసా బేగం సాక్షి ‘జైహింద్’తో పంచుకున్న ఆనాటి జ్ఞాపకాలివి. దోపిడీకొచ్చిన దొర! ‘‘అవి పందొమ్మిదవ శతాబ్దపు తొలినాళ్లు. భారతదేశంలో రాజ్యాలు, సంస్థానాలు, జాగీర్దార్ల మీద ఈస్ట్ ఇండియా కంపెనీ కన్ను పడటం మొదలైంది. ఒక్కొక్క సంస్థానాన్ని ఏదో ఒక నెపంతో కంపెనీ పాలనలోకి తీసుకోవడం అనే కుట్ర చాపకింద నీరులా ప్రవహిస్తోంది. మద్రాసు ప్రెసిడెన్సీ పరిధిలో ఉంది ఉదయగిరి దుర్గం. ఆ దుర్గం నవాబుల పాలనలో ఉండేది. జాగీర్దారుగా అబ్బాస్ అలీఖాన్ ఆ ప్రాంతాన్ని పాలిస్తున్నారు. ఆ సమయంలో అంటే.. 1803లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉదయగిరి జాగీర్దారుతో ఒప్పందం కుదుర్చుకోడానికి వచ్చింది. చదవండి: జైహింద్ స్పెషల్: గోడలు పేల్చిన అక్షర క్షిపణులు ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున స్ట్రాటన్ అనే అధికారి వచ్చాడు. కంపెనీకి ఉదయగిరి జాగీర్ నుంచి ఏడాదికి 53 వేల రూపాయల పేష్కార్ చెల్లించాలని డిమాండ్ చేశాడు. అంత డబ్బు కంపెనీకి చెల్లించడానికి అబ్బాస్ అలీఖాన్ అంగీకరించలేదు. అంతేకాదు.. వాళ్లతో ఒప్పందాన్ని రద్దు చేసుకునే ఉద్దేశంతో ఐదువేలు మాత్రమే చెల్లించగలనని చెప్పాడు అలీఖాన్. స్ట్రాటన్ దొర చాలా వ్యూహాత్మకంగా అలీఖాన్ చెప్పిన ఆ ఐదువేల మొత్తానికి అంగీకరించాడు. ఆ ఒప్పందం 1837 వరకు కొనసాగింది. ‘కోటలో కుట్ర’ వదంతి! అత్యంత లాభసాటి రాబడి ఉన్న ఉదయగిరి సంస్థానం మీద నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ దృష్టి మరల్చనే లేదు. అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఆ తర్వాత అనుకోకుండా ఒక ప్రచారం తలెత్తింది. ఆ ప్రచారాన్ని సద్దుమణగనివ్వకుండా ఈస్ట్ ఇండియా కంపెనీ జాగ్రత్త పడింది. అప్పుడు నెల్లూరు కలెక్టర్ పేరు స్టోన్‌హౌస్. ఉదయగిరి పాలకుడు అబ్బాస్ అలీఖాన్, అతడి కుమారులు స్టోన్‌హౌస్‌ను హత్య చేయడానికి పథకం రచిస్తున్నారనే వదంతి ఎలా పుట్టిందో తెలియదు, కానీ స్టోన్‌హౌస్ ఆ వదంతిని ఉపయోగించుకున్నాడు. స్టోన్ హౌస్ కుయుక్తితో ఈ పుకారుకి మరింత ఆజ్యం పోస్తూ మద్రాసు ప్రెసిడెన్సీకి ఉత్తరం రాశాడు. ఉదయగిరి కోటలో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయనే అభియోగం అందులో ఉంది. కుట్ర జరుగుతోందని, ఆయుధాలు, తుపాకీ, మందుగుండు సామగ్రిని సిద్ధం చేస్తున్నారని, అబ్బాస్ కుమారులే ఈ చర్యలను ప్రోత్సహిస్తున్నారనీ..’ రాశాడు. నవాబు నిర్బంధం వివాదాన్ని విచారించే నెపంతో కలెక్టర్ మరితంగా విషయాన్ని క్లిష్టపరుస్తూ 70 మందిని అరెస్ట్ చేయించాడు, మరో 40 మంది మీద నేర విచారణ జరపాల్సిందిగా ఆదేశించాడు. ఇలా రకరకాలుగా జాగీర్దారుల కుటుంబీకులు, సమీప బంధువుల మీద అనేక రకాల కేసులు పెట్టి నానా విధాలుగా బాధలు పెట్టాడు కలెక్టర్. కొందరిని చెంగల్పట్టు జైల్లో, మరికొందరిని సైదాపేట జైల్లో బంధించారు. ఇంట్లో ఉన్న వారికి కానీ, జైల్లో ఉన్న వారికి కానీ ఒకరి సమాచారం మరొకరికి తెలియని స్థితి. ఒక్కమాటలో చెప్పాలంటే కుటుంబం కకావికలమైంది. ఆంగ్లేయుల మీద పోరాటం సాగించిన ఉదయగిరి దుర్గం చివరి పాలకుడు అబ్బాస్ అలీఖాన్‌ను చెంగల్పట్టు జైల్లో బంధించారు. ఆయన ఆంగ్లేయుల అధికారానికి తలవంచకుండా, వారి ఆధిపత్యాన్ని అంగీకరించకుండా, వారిచ్చిన ఆహారాన్ని స్వీకరించకుండా 21 రోజుల పాటు ఉగ్గబట్టి ప్రాణాన్ని ఆత్మార్పణం చేసుకున్నారు’’ అని తెలిపారు ఖాదరున్నీసా. కలిసిమెలిసి ఉండేవాళ్లు ‘‘ఉదయగిరి జాగీర్దార్ కుటుంబానికి వారసుల్లో ఒకరైన అబ్దుల్ ఖాదర్ సాహెబ్ అఫ్ఫాన్ (ఛాబుదొర) మా పెద్ద తాతగారు. ఆయన 1953లో మరణించారు. ఆయనకు పిల్లల్లేరు. మమ్మల్ని ఆత్మీయంగా చూసేవారు. ఆయన ఉదయగిరి దుర్గానికి పాశ్చాత్యుల కారణంగా ఎదురైన కష్టాలను, స్వాతంత్య్రోద్యమ కాలంలో జరిగిన అనేక ఘట్టాలను మాకు చెబుతుండేవారు. ఉదయగిరి కోట లోపల మసీదులు, ఆలయాలు ఉండేవి. హిందువులు– ముస్లిమ్‌లు తరతమ భేదాలు లేకుండా సోదరభావంతో మెలిగేవారు. మనమంతా భారతీయులం, తెల్లవాళ్లు మనల్ని దోచుకుంటున్నారనే స్పృహ అందరిలో ఉండేది. అప్పట్లో అది సుసంపన్నమైన జాగీరు కూడా. అలాంటి జాగీరుకు బ్రిటిష్ వాళ్ల దృష్టి పడినప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడది పేరుకే కోట అన్నట్లుగా ఉంది. పరాకాష్టకు చెందిన ఇంగ్లిష్ దొరల అరాచకానికి ఆనవాలుగా మిగిలింది. మా పూర్వికులు ప్రజల గుండెల్లో ఇప్పటికీ జీవించే ఉన్నారు. అబ్బాస్ అలీఖాన్ తండ్రి హజ్రత్ ఖాన్ సాహెబ్ వలి ఉర్సు చేసుకుంటాం. మొహర్రమ్ నెలలో ఉదయగిరి దర్గా ఉరుసులో హిందువులు– ముస్లిమ్‌లు కలిసి పాల్గొంటారు’’ అని ఖాదరున్నీసా తెలిపారు. ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
రూ.250 కోట్ల విలువ చేసే ఆస్తులు అప్పగింత.. ఉదయగిరికి మరో మణిహారం
ఉదయగిరికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ఎందరో రాజులు, శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఇక్కడ స్వర్ణయుగం నడిచినట్లు చెబుతుంటారు. కాలగమనంలో కరువు రాజ్యమేలింది. ఆ తర్వాత పరిస్థితులు మారుతూ వచ్చాయి. మెట్ట ప్రాంతమైన ఉదయగిరికి మరో మణిహారం రానుంది. ఎంఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రాంగణంలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి దాతృత్వంతో ప్రజలకు ఉపయోగపడేలా వర్సిటీని తీర్చిదిద్దనున్నారు. సాక్షి, నెల్లూరు: మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలను అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యూనివర్సిటీగా చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జ్ఞాపకార్థంగా వర్సిటీని నిర్మించి మెట్ట ప్రాంత వ్యవసాయానికి మహర్దశ పట్టించేలా, వ్యవసాయ రంగంపై విద్యార్థుల్లో మరింత మక్కువ పెంచేందుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇక్కడి విద్యార్థులు అగ్రికల్చర్ కోర్సుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇక్కడ వర్సిటీ అందుబాటులో ఉంటే అధిక మంది విద్యనభ్యసించే అవకాశం ఉంటుంది. అలాగే ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం గుంటూరులో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ మాత్రమే ఉంది. దాని పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు సుమారు 25 వరకు ఉన్నాయి. ఉదయగిరిలో ఏర్పాటు కానున్న యూనివర్సిటీకి రాయలసీమ పరిధిలో ఉండే కళాశాలలను అనుసంధానం చేసే అవకాశం ఉంది. మేకపాటి కుటుంబం దాతృత్వం మెట్ట ప్రాంతంలో విద్యను ప్రోత్సహిస్తే అభివృద్ధి తప్పక జరుగుతుందనే ఆశయంతో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇప్పటికే ఎంతో ఉదారంగా సాయం చేశారు. మర్రిపాడు మండలంలో నవోదయ పాఠశాల ఏర్పాటుకు సొంత భూములు కేటాయించారు. సుమారు 25 ప్రభుత్వ పాఠశాలలను హైస్కూల్స్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు సొంత నిధులు సమకూర్చారు. ఎంఆర్ఆర్ డిగ్రీ కళాశాలకు సొంత నిధులిచ్చారు. ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేశారు. మేకపాటి కుటుంబం ప్రస్తుతం అగ్రికల్చర్ యూనివర్సిటీకి సుమారు రూ.250 కోట్ల విలువ చేసే ఆస్తులు అప్పగించడంతో వారి దాతృత్వానికి మెట్ట ప్రాంత ప్రజలు సలాం చేస్తున్నారు. మహర్దశ పట్టించేలా.. చరిత్రకు సాక్ష్యంగా ఉన్న ఉదయగిరిలో ఒకప్పుడు వ్యవసాయ రంగానికి సాగునీరు కరువై బతుకు దెరువు కోసం ఎంతోమంది వలస వెళ్లారు. అలా వెళ్లిన వారిలో శ్రీమంతులైన వారు ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉదయగిరికి సాగునీరందించే బృహత్తరమైన పథకాలకు శ్రీకారం చుట్టారు. వెలిగొండ ప్రాజెక్టు, సోమశిల హై లెవల్ కెనాల్ లాంటి ప్రాజెక్టులతో ఉదయగిరి వలస జీవనానికి కళ్లెం వేసి మోడుబారిన భూములు పచ్చని పైర్లతో కళకళలాడేలా చేయాలనే సంకల్పంతో పనిచేశారు. ఈ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. త్వరలోనే ఆ ప్రాజెక్టులు పూర్తయితే వలసవాసులు తిరిగి వచ్చి సాగుబాట పట్టే అవకాశం ఉంది. దీనికితోడు వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుతో ఇక్కడి అన్నదాతలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఔన్నత్యానికి నిదర్శనం మేకపాటి కుటుంబం ఉదయగిరి లాంటి మెట్ట ప్రాంతంలో విద్యను ప్రోత్సహించి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. రూ.250 కోట్లు సంబంధించిన ఆస్తులు ప్రభుత్వానికి ఇచ్చి అగ్రికల్చర్ యూనివర్సిటీని స్థాపించమని కోరడం వారి ఔన్నత్యానికి నిదర్శనం. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జ్ఞాపకార్థంగా యూనివర్సిటీని ఏర్పాటు చేయనుండడం ఆనందదాయకం. – షేక్ గాజుల ఫారుఖ్‌అలీ, ఉదయగిరి హర్షదాయకం ఈ ప్రాంత రైతులకు ప్రయోజగకరంగా ఉంచేందుకు మెరిట్స్ కళాశాలను అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం హర్షదాయకం. మెరిట్స్ కళాశాల ఉద్యోగులకు అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా ఉద్యోగ భద్రత కల్పించేలా మేకపాటి రాజమోహన్‌రెడ్డి కృషి చేయడం వారి దూరదృష్టికి నిదర్శనం. – డాక్టర్ ఎం.మనోజ్‌కుమార్‌రెడ్డి, మెరిట్స్ కళాశాల ప్రిన్సిపల్ గౌతమ్‌రెడ్డి పేరుతో.. మెరిట్స్ కళాశాల 106 ఎకరాల ప్రాంగణంలో ఉంది. ఐదు లక్షల స్క్వేర్ ఫీట్ సంబంధించిన అకాడమీ బ్లాక్స్, 600 అమ్మాయిలు, 750 అబ్బాయిలుండేలా హాస్టల్ భవవ సదుపాయాలున్నాయి. 89 స్టాఫ్ క్వార్టర్స్, ఓపెన్ ఆడిటోరియం, ఇంజినీరింగ్ ల్యాబ్, లైబ్రరీ 27 వేల పుస్తక సముదాయం, మూడు బస్సులు, జనరేటర్స్, క్యాంటీన్, గెస్ట్ హౌస్, ఫిజికల్ డైరెక్టరీస్, ఎన్ఎస్ఎస్, భవన సముదాయాలు, ప్లే గ్రౌండ్ తదితర ఆస్తులను వ్యవసాయ యూనివర్సిటీ కోసం ప్రభుత్వానికి అప్పగించనున్నారు. అలాగే సుమారు 50 ఎకరాల్లో ప్లాంటేషన్ చేసేందుకు అవసరమైన భూములను కూడా ఇటీవల అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. రూ.కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వానికి ఇచ్చిన ఎంఆర్ఆర్ ట్రస్ట్ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి జ్ఞాపకార్థంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నిర్మాణం చేయాలని కోరింది. అలాగే ప్రస్తుతం మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉద్యోగ భద్రత కల్పించాలన్న వారి విన్నపానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. -
ఉదయగిరి.. చరిత్రలో ప్రత్యేక స్థానం
ఉదయగిరి.. చరిత్రలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. తిరుమల గిరులను పోలిన ఎత్తైన పర్వతశ్రేణులు, ప్రకృతి సోయగాలు, జలపాతాలతో కనువిందు చేస్తున్న ఉదయగిరి దుర్గం చోళులు, పల్లవులు, రెడ్డి రాజులు, గజపతులు, విజయనగర రాజులు, గోల్కొండ నవాబుల పాలనలో వెలుగు వెలిగింది. ఎంతో కళాత్మకంగా నిర్మించిన ఆలయాలు, మసీదులు, కోటలు, బురుజుల ఆనవాళ్లు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. తాజాగా యుద్ధ నౌకకు ఉదయగిరి పేరు పెట్టడంతో జాతీయ స్థాయిలో ఖ్యాతి లభించింది. సాక్షి, నెల్లూరు/ఉదయగిరి: జిల్లాలోని ఉదయగిరి పేరు జాతీయ స్థాయిలో మారుమోగుతోంది. యుద్ధ నౌకకు ఉదయగిరి పర్వతశ్రేణి పేరు పెట్టారు. మాసాయిపేట కొండపై బంగారు, రాగి, వైట్ క్వార్‌ట్టŠజ్ నిక్షేపాలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకునేందుకు డ్రిల్లింగ్ పనులు ముమ్మరంగా చేశారు. ఇంకా ఇక్కడ పర్యాటక రంగ అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఆ కాలంలో.. క్రీ.శ 10 నుంచి 19వ శతాబ్దం వరకు ఇక్కడ ఎంతోమంది రాజుల పాలన సాగింది. ఇందులో విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఉదయగిరి దుర్గానికి ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. అందమైన కట్టడాలు, విశాలమైన తటాకాలు ఈయన కాలంలోనే నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయలు కొన్నినెలలపాటు ఉదయగిరి కోటను కేంద్రంగా చేసుకుని పాలన సాగించినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పటికీ అలనాటి రాజులు, నవాబుల పాలనకు గుర్తుగా ఉదయగిరి కొండపై అద్దాల మేడలు, ఆలయాలు, మసీదులు, కోట బురుజులు దర్శనమిస్తాయి. పేరిలా వచ్చింది సూర్యకిరణాలు ఉదయగిరి కొండ శిఖరంపై ప్రసరించి ప్రకాశవంతంగా దర్శనమిస్తుండడంతో ‘ఉదయ’గిరి పర్వతశ్రేణికి ఉదయగిరిగా పేరు వచ్చినట్లు పెద్దలు చెబుతారు. సముద్రమట్టానికి 3,079 అడుగుల ఎత్తులో ఈ ప్రాంతం ఉంటుంది. తిరుమల గిరులను ఉదయగిరి పర్వతశ్రేణి పోలి ఉంటుంది. ఇందులో 3,600కి పైగా ఔషధ మొక్కలున్నట్లుగా శాస్త్రవేత్తల పరిశోధనలో గుర్తించారు. ఉదయగిరి దుర్గం కోటలు, ఎత్తైన ప్రాకారాలు, దట్టమైన చెట్లు, పక్షుల కిలకిలరావాలు, గలగల పారే జలపాతాలతో నిండి ఉంటుంది. ఓ కోటపైన పర్షియా సంప్రదాయ రీతిలో నిర్మించిన మసీదు ఉంది. దేశంతో ప్రసిద్ధి చెందిన చెక్క నగిషీ బొమ్మల తయారీకి ఉపయోగించే దేవదారు చెక్క ఇక్కడ లభ్యమవుతుంది. పర్యాటకాభివృద్ధి కోసం.. ఉదయగిరిని పర్యాటకరంగ పరంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా కలెక్టర్ చక్రధర్‌బాబు గతంలో ఈ ప్రాంతంలో పర్యటించి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయించారు. హార్సిలీహిల్స్, ఊటీ తరహా వాతావరణం ఉదయగిరి దుర్గంపై ఉంటుంది. అక్కడ పర్యాటకులకు సౌకర్యాలు కల్పించేందుకు సుమారు రూ.100 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర పర్యాటక శాఖకు పంపారు. అభివృద్ధి చెందుతుంది ఉదయగిరి సమీపంలో బంగారు, రాగి నిక్షేపాలు నిక్షిప్తమై ఉన్నాయన్న జాతీయ సర్వే నిపుణుల ప్రకటనలతో ఉదయగిరికి ఖ్యాతి లభించనుంది. ఎక్కడో మారుమూల వెనుకబడి ఉన్న ఈ ప్రాంతంలో బంగారు నిక్షేపాలు వెలుగుచూడడంతో ఈ ప్రాంత అభివృద్ధిపై ఆశాభావం కలుగుతోంది. మొత్తంగా రెండు, మూడురోజల వ్యవధిలో ఉదయగిరికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించడం విశేషం. భవిష్యత్‌లో అభివృద్ధి చెందుతుందనే కాంక్ష ఈ ప్రాంతవాసుల్లో బలంగా ఉంది. – ఎస్కే ఎండీ ఖాజా, ఉపాధ్యాయుడు ఉదయగిరికి జాతీయ కీర్తి ఎంతో చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉన్న ఉదయగిరికి జాతీయ గుర్తింపు లభించడం సంతోషం. జిల్లాలో మారుమూల ప్రాంతంలో ఉన్న ఉదయగిరి దుర్గానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. దీంతో వెనుకబడి ఉదయగిరి ప్రాంతం అభివృద్ధితోపాటు రాష్ట్రంలో ఒక గుర్తింపు తగిన పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి చెందుతుంది. రక్షణ రంగంలో కీలక యుద్ధ నౌకకు ఉదయగిరి పేరు పెట్టడం చారిత్రాత్మకం. – గాజుల ఫారుఖ్ అలీ, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర బాధ్యుడు ఖనిజ నిక్షేపాల కోసం.. ఉదయగిరి మండలంలోని మాసాయిపేట కొండపై ఖనిజ నిక్షేపాల కోసం అన్వేషణ జరిగింది. ఈక్రమంలో ఆ కొండపై రాగి, బంగారం, తెల్లరాయి ఖనిజ నిక్షేపాలున్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాథమికంగా గుర్తించింది.. ప్రస్తుతం ఆ ఖనిజాలు ఏ మేరకు ఉన్నాయో తెలుసుకునేందుకు డ్రిల్లింగ్ పనులు చేపట్టారు. మొత్తంగా ఐదు ప్రాంతాల్లో 500 నుంచి 1,000 అడుగుల మేర డ్రిల్లింగ్ నిర్వహించి 46 నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. సుమారు రెండు వేల ఎకరాల్లో ఖనిజ నిక్షేపాలున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. అగ్రీ యూనివర్సిటీ మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాలను అగ్రికల్చర్ యూనివర్సిటీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇటీవల మంత్రి వర్గ సమావేశంలో కూడా తీర్మానం చేశారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి స్మారకార్ధంగా దీనిని నిర్మించి మెట్ట ప్రాంత వ్యవసాయానికి మహర్దశ పట్టించేలా, వ్యవసాయ రంగంపై విద్యార్థులకు కూడా మక్కువ పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. వర్సిటీ కోసం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సుమారు రూ.250 కోట్ల విలువైన భూములు, ఆస్తులను అప్పగించారు. ఇది ఏర్పాటైతే విద్యార్థులు అగ్రికల్చర్ కోర్సులు చదివేందుకు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. యుద్ధ నౌకకు పేరు ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు యుద్ధ నౌకలను ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ముంబైలో ప్రారంభించారు. పోరాట సామర్థ్యానికి మరింత పదును పెట్టే యుద్ధ నౌకకు ఏపీలోని నెల్లూరు జిల్లా రాయలసీమ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఉదయగిరి పర్వతశ్రేణి పేరు పెట్టడంతో ఈ ప్రాంత ఖ్యాతి మరింత చరిత్రపుటల్లోకెక్కింది. దీనిపై నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డితోపాటు ప్రముఖులు రాజ్‌నాథ్‌సింగ్‌కు ధన్యవాదాలు తెలిపారు. -
రాజ్‌నాథ్‌సింగ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు: మేకపాటి
సాక్షి, నెల్లూరు: ఉదయగిరికి ప్రత్యేక గుర్తింపునిచ్చిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా నెల్లూరు మాజీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు యుద్ధ నౌకలను కేంద్ర మంత్రి మంగళవారం ముంబైలో ప్రారంభించారన్నారు. ఇందులో ఒకదానికి ఆంధ్రప్రదేశ్‌లోని ఉదయగిరి పర్వతశ్రేణి పేరు పెట్టడం హర్షణీయమన్నారు. దేశంలోనే అతి పెద్ద యుద్ధ నౌకకు ఉదయగిరి పేరును పెట్టడడం చాలా సంతోషంగా ఉందని, ఇది జిల్లాకే గర్వకారణంగా ఉందన్నారు. ఉదయగిరిలోని అతిపెద్ద పర్వతాలను పరిగణనలోకి తీసుకుని యుద్ధ నౌకకు ఆ పేరు పెట్టడం మంచిపరిణామమని కొనియాడారు. చదవండి: (ఇతర దేశాల కోసం యుద్ధనౌకలు తయారు చేసే స్థాయికి భారత్: రాజ్‌నాథ్) -
ఇతర దేశాల కోసం యుద్ధనౌకలు తయారు చేసే స్థాయికి భారత్: రాజ్‌నాథ్
ముంబై: ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు యుద్ధ నౌకలు సూరత్, ఉదయగిరిలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. మంగళవారం ముంబైలోని మాజగావ్ డాక్స్‌లో అవి జలప్రవేశం చేశాయి. ఈ యుద్ధ నౌకల డిజైన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ (డీఎన్డీ) రూపొందించింది. నౌకలు, జలాంతర్గాముల తయారు చేసే ముంబైకి చెందిన రక్షణ రంగ అనుబంధం సంస్థ మాజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) వాటిని తయారు చేసింది. దేశీయంగా తయారు చేసిన రెండు యుద్ధ నౌకలను ఒకేసారి ప్రారంభించడం ఇదే తొలిసారని సంస్థ వెల్లడించించి. వీటి రాకతో నావికాదళం మరింత బలోపేతమైందని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ అన్నారు. దేశీయ అవసరాలను తీర్చుకోవడమే గాక మున్ముందు ఇతర దేశాల కోసం యుద్ధనౌకలు తయారు చేసే స్థాయికి భారత్ ఎదుగుతుందని ధీమా వెలిబుచ్చారు. ఆత్మనిర్భర్ భారత్‌లో విక్రాంత్ యుద్ధ విమాన తయారీ ఒక మైలు రాయి అయితే,ఇసూరత్, ఉదయగిరిల తయారీతో మన రక్షణ సామర్థ్యం హిందూ మహా సముద్రం నుంచి ఫసిఫిక్, అట్లాంటిక్ దాకా విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: (బారాత్‌లో తప్పతాగి పెళ్లికొడుకు డ్యాన్సులు.. మరొకరిని పెళ్లాడిన వధువు) ఐఎన్ఎస్ సూరత్ ఐఎన్ఎస్ సూరత్ యుద్ధనౌక పీ15బి క్లాస్‌కు చెందినది. క్షిపణుల్ని ధ్వంసం చేసే సామర్థ్యం దీని సొంతం. దీన్ని బ్లాక్ నిర్మాణ పద్ధతుల్లో తయారు చేశారు. అంటే విడిభాగాలను వేర్వేరు ప్రాంతాల్లో తయారు చేసి వాటిని ఎండీఎల్‌లో జోడించారు. దీనికి గుజరాత్ వాణిజ్య రాజధాని సూరత్ పేరు పెట్టారు. నౌకల తయారీలో సూరత్‌కు ఘనచరిత్ర ఉంది. 16వ శతాబ్దంలోనే ఇక్కడ నౌక నిర్మాణం మొదలైంది. ఇక్కడ తయారైన వందేళ్ల నాటి నౌకలు ఇంకా చెక్కు చెదరలేదు. ఐఎన్ఎస్ సూరత్ దీనికి ఆంధ్రప్రదేశ్‌లోని ఉదయగిరి పర్వతశ్రేణి పేరు పెట్టారు. 17ఏ ఫ్రిగేట్స్ ప్రాజెక్టులో ఇది మూడో యుద్ధ నౌక. పీ17 ఫ్రిగేట్స్ (శివాలిక్ క్లాస్) కంటే దీన్ని మరింత ఆధునీకరించారు. మెరుగైన రహస్య ఫీచర్లు, అత్యాధునిక ఆయుధాలు, సెన్సార్లు, ప్లాట్ఫారం నిర్వహణ వ్యవస్థల్ని పొందుపరిచారు. పీ17ఏ కార్యక్రమం కింద మొత్తం ఏడు నౌకలు నిర్మాణంలో ఉన్నాయి. దీని నిర్మాణంలో తొలిసారిగా కొత్త పద్ధతుల్ని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. -
ఉదయగిరి కొండల్లో బంగారు, రాగి నిక్షేపాలు
సాక్షి, ఉదయగిరి (నెల్లూరు): మండలంలోని మాసాయిపేట కొండపై బంగారు, రాగి, వైట్ క్వార్ట్›్జ నిక్షేపాలు వెలుగులో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం అన్వేషణ సాగించి గుర్తించి ముమ్మరంగా డ్రిల్లింగ్ పనులు చేపట్టింది. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మ్యాపింగ్ నిర్వహించి కొండలో ఎంత మేర ఖనిజ నిక్షేపాలు ఉన్నాయో తెలుసుకునేందుకు కొంత కాలంగా డ్రిల్లింగ్ పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొండపై ఐదు ప్రాంతాల్లో 500 నుంచి 1000 అడుగుల మేర డ్రిల్లింగ్ నిర్వహించి 46 నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు అందజేశారు. ఈ ప్రాంతంలో సుమారు రెండు వేల హెక్టార్లకు పైగా భూముల్లో బంగారు, రాగి, వైట్‌క్వార్‌ట్ట్జ నిక్షేపాలున్నట్లు గుర్తించింది. సోమవారం హైదరాబాద్ నుంచి అధికారుల బృందంతో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాహనంతో డ్రిల్లింగ్ చేసే ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. 150 మీటర్ల మేర డ్రిల్లింగ్ వేసిన ప్రాంతంలో భూగర్భంలోకి సీసీ కెమెరాలు పంపి సేకరిస్తున్నారు. ఖనిజ నిక్షేపాలతోనైనా ఉదయగిరి మెట్ట ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంత వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు.. జూన్ దాటితే మళ్లీ డిసెంబరే) -
గౌతమ్ రెడ్డి ఆశయ సాధనకు మేకపాటి కుటుంబం సిద్ధం
-
చారిత్రాత్మక త్యాగానికి సిద్దమైన మేకపాటి కుటుంబం
-
దాతృత్వాన్ని చాటుకున్న మేకపాటి కుటుంబం
-
గౌతమ్‌రెడ్డి పేరిట అగ్రికల్చర్ యూనివర్సిటీ
సాక్షి, ఉదయగిరి: మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల (మెరిట్స్)ను మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజమోహన్‌రెడ్డి కోరారు. అత్యంత విషాదకర సమయం.. తన ముద్దుల కొడుకు, మేకపాటి కుటుంబ రాజకీయ ఆశాసౌధం హఠాన్మరణం తట్టుకోలేక దుఃఖాన్ని పంటి బిగువున బిగబట్టుకున్న వేళ.. ఇంతటి బాధాతప్త సమయంలో కూడా నెల్లూరు పెద్దాయన రాజమోహన్‌రెడ్డి ఉదయగిరి, ఆత్మకూరు మెట్ట ప్రాంతాల అభివృద్ధిని మరువలేదు. బుధవారం ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన మంత్రి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు సీఎం వైఎస్ జగన్ విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎంతో పెద్దాయన మెట్ట ప్రాంత అభివృద్ధి, పలు విషయాల గురించి మాట్లాడారు. ఉదయగిరిలో వందెకరాల్లో తాను ఏర్పాటుచేసిన ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన రూ.225 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎంతో చెప్పారు. దీనికిగానూ మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చాలని కోరారు. స్పందించిన సీఎం త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే కళాశాల పేరు మార్చడంతోపాటు అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పెద్దాయనకు హామీ ఇచ్చారు. ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలతోపాటు గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన ఒంగోలు మెట్ట ప్రాంతాలకు తాగు, సాగునీరందించే వెలుగొండ ప్రాజెక్టు, సోమశిల హై లెవెల్ కెనాల్, ఫేజ్–1, ఫేజ్–2లను పూర్తి చేసి త్వరగా డెల్టాగా మార్చాలని రాజమోహన్‌రెడ్డి కోరారు. వెలుగొండ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. చదవండి: (పోలీస్ స్టేషన్ల పరిధి మార్పు.. ప్రభుత్వం ఉత్తర్వులు) వీఎస్‌యూలో ఘన నివాళి వెంకటాచలం: మండలం కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ)లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి గురువారం ఘన నివాళులర్పించారు. వీఎస్‌యూ వీసీ జీఎం సుందరవల్లి, రెక్టార్ ఎం.చంద్రయ్య, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్.విజయకృష్ణారెడ్డి తదితరులు గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ మంచి వ్యక్తిత్వం కలిగిన గౌతమ్‌రెడ్డి అకాల మరణం చాలా బాధాకరమన్నారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ ఉన్నత విద్యావంతుడు, వ్యాపారవేత్త అయిన వ్యక్తి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. అనతికాలంలోనే పలు అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చి అభివృద్దిలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ఆయన అకాలమరణం రాష్ట్రానికి తీరనిలోటని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ సాయిప్రసాద్‌రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సుజయ్‌కుమార్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. -
మంత్రి మేకపాటి గౌతంరెడ్డిపై స్పెషల్ సాంగ్
-
మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల్లో సీఎం జగన్
-
గౌతమ్ రెడ్డి తల్లిని ఓదార్చిన వైఎస్ భారతి..
-
ఉదయగిరి చేరుకున్న సీఎం జగన్
-
గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, నెల్లూరు: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కళాశాల వద్ద బుధవారం జరిగిన గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ భారతి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. అశ్రునయనాలతో తుది విడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, వైఎస్సార్ సీపీ కార్యకార్తలు స్వర్గీయ గౌతమ్‌రెడ్డికి అంతిమ వీడ్కోలు పలికారు. అభిమాన నేతను కడసారి చేసేందుకు జనం భారీ ఎత్తున తరలి వచ్చారు. దారి పొడవునా పూలు చల్లుతూ గౌతమ్‌రెడ్డికి నివాళులు అర్పించారు. చదవండి: అశ్రునయనాలతో మంత్రి గౌతమ్‌రెడ్డికి తుది వీడ్కోలు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
దారంతా పూలు.. కన్నుల నిండా కన్నీళ్లు
-
అడుగడుగునా కన్నీటి వీడ్కోలు
-
గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు సీఎం వైఎస్ జగన్
-
Mekapati Goutham Reddy Funeral: పెద్ద ఎత్తున్న తరలి వస్తున్న జనం...
-
గౌతమ్ రెడ్డి విశిష్టతను గుర్తు చేసుకుంటున్న నేతలు, అధికారులు
-
Mekapati Goutham Reddy Funeral: అంతులేని అభిమానం
-
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర (ఫోటోలు)
-
మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు
-
Mekapati Goutham Reddy Funeral: అశ్రునయనాలతో మంత్రి గౌతమ్‌రెడ్డికి తుది వీడ్కోలు
12:05PM అశ్రునయనాల మధ్య మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. సీఎం వైఎస్ జగన్, మంత్రులు, కుటుంబ సభ్యులు, వేలాదిగా తరలి వచ్చిన అభిమానుల అశ్రునయనాలతో మంత్రి గౌతమ్‌రెడ్డికి తుది వీడ్కోలు పలికారు. 11:50AM ►మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియల్లో సీఎం వైఎస్ జగన్ దంపతులు పాల్గొన్నారు. అభిమాన నేతను కడసారి చూసేందుకు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. 11:45AM ►ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజ్ వద్దకు సీఎం జగన్ దంపతులు చేరుకున్నారు. 11:33AM ►మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయగిరి చేరుకున్నారు. 11:00AM ►దివంగత నేత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతక్రియల్లో పాల్గొనేందుకు ఉదయగిరి వెళ్తున్న ముఖ్యమంత్రి ►ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఉదయగిరికి ప్రయాణం అయిన సీఎం ►సీఎంని కడప విమానాశ్రయంలో కలిసిన జిల్లా కలెక్టర్ విజయరామ రాజు, ఎస్పీ అన్బురాజన్ ►అంతక్రియల్లో పాల్గొన్న అనంతరం తిరిగి కడపకు రానున్న ముఖ్యమంత్రి 10:53AM ►కడప విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, భారతమ్మ, వైవీ సుబ్బారెడ్డి 10:50AM ►ఉదయగిరి చేరుకున్న మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర ►కాసేపట్లో మేకపాటి ఇంజనీరింగ్ కళాశాల వద్ద గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు 10:00AM ►గన్నవరం నుండి కడప ఎయిర్ పోర్ట్‌కు బయలుదేరారు. ►తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు, వైవీ సుబ్బారెడ్డి 09:50AM ►స్వగ్రామం బ్రాహ్మణపల్లికి చేరుకున్న మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంతిమయాత్ర ►భౌతికకాయాన్ని చూసి కన్నీటి పర్యంతమైన గ్రామస్థులు ►పుష్పాంజలి ఘటించి ఘననివాళులు అర్పించిన గ్రామస్థులు 09:40AM తాడేపల్లి: సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ దంపతులు ►ఉదయగిరి ఇంజనీరింగ్ కాలేజీలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొననున్న సీఎం ►గన్నవరం నుంచి కడప ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోనున్న సీఎం ►అక్కడ నుంచి హెలికాఫ్టర్‌లో ఉదయగిరి వెళ్లనున్న సీఎం 09:11AM ►మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంతిమ యాత్ర డీసీ పల్లికి చేరుకుంది. ► మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గౌతమ్‌రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ►జనసంద్రం మధ్య, వందలాది వాహనాలతో అంతిమయాత్ర కొనసాగుతోంది. ►గౌతమ్‌రెడ్డి అంతిమ యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. 08:20AM ►ఆత్మకూరు నెల్లూరు పాలెం సెంటర్ చేరుకొన్న మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంతిమ యాత్ర ►అభిమాన నేత భౌతిక ఖాయాన్ని చూసి కన్నీటి పర్యంతమైన ఆత్మకూరు వాసులు ►పెద్దఎత్తున తరలివచ్చి నివాళులు అర్పించి అంతిమ వీడ్కోలు పలికిన అభిమానులు 07:45AM ►ఆత్మకూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అంతిమయాత్ర ►గ్రామగ్రామాన రోడ్డుపై బారులు తీరి అశ్రునయనాలతో నివాళులు అర్పిస్తున్న అభిమానులు దారంతా పూలు.. కన్నుల నిండా కన్నీళ్ళు ►మనసుపొరలను చీల్చుకుని అదుముకున్నా ఉబికి వచ్చే కన్నీటి మధ్య అశ్రునయనాలతో నివాళి అర్పిస్తున్న ప్రజలు ►జోహార్ మంత్రి మేకపాటి, మెట్ట ప్రాంత ముద్దుబిడ్డ అమర్ రహే, అన్నా గౌతమన్నా అంటూ నినాదాలు ►దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్రను చివరి జ్ఞాపకంగా తమ సెల్ఫోన్లో బంధించుకుంటున్న యువతీయువకులు 07:25AM ►మంత్రి మేకపాటి తుది సంస్కారానికి ఏర్పాట్లతో పాటు వీడ్కోలు పలకడానికి బైక్ పై భారీ ర్యాలీ నిర్వహిస్తున్న దివంగత మంత్రి మేకపాటి స్నేహితుడు, హితుడు, సహచర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ►దివంగత మంత్రి మేకపాటి తరహాలో ఆయన దుస్తులనే ధరించిన మంత్రి మేకపాటి వారసులు కుమార్తె సాయిఅనన్య, కుమారుడు కృష్ణార్జున రెడ్డి ►తడిచిన గుండెతో, తడారని కళ్లతో వీడ్కోలు పలుకుతోన్న దివంగత మంత్రి మేకపాటి కుటుంబ సభ్యులు, కుటుంబ సమానమైన అభిమానులు 07:15AM ►మంత్రి మేకపాటి భౌతికకాయానికి జనసంద్రం మధ్య జరుగుతున్న అంతిమయాత్ర ►అంతిమయాత్రలో పాల్గొన్న మంత్రులు ,ఎమ్మెల్యేలు,ఎంపీలు, రాజకీయ ప్రముఖులు ►మీడియాతో పాటు ఓపెన్ టాప్ ఎక్కి అంతిమ యాత్రలో పాల్గొన్న మంత్రి పేర్ని నాని ►జొన్నవాడ మీదగా బుచ్చిరెడ్డిపాలెం, సంగం, నెల్లూరు పాలెం, బ్రాహ్మణపల్లి, నందిపాడు మీదుగా ఉదయగిరి వరకు కొనసాగనున్న మేకపాటి అంతిమయాత్ర ►వందలాది వాహనాలతో భారీగా కొనసాగుతున్న మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర 06:15AM సాక్షి, నెల్లూరు: నెల్లూరులోని మేకపాటి నివాసం నుంచి ఉదయం 6 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమైంది. జొన్నవాడ మీదుగా బుచ్చి, సంగం, నెల్లూరుపాళెం, మర్రిపాడు, బద్వేలు సరిహద్దు జాతీయ రహదారి నుంచి బ్రాహ్మణపల్లి, కృష్ణాపురం, నందిపాడు మీదుగా ఉదయగిరికి చేరుకుంటుంది. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ (మెరిట్స్) ఆవరణలో ఉదయం 11.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. గంధపు చెక్కలతో మంత్రి పార్ధివదేహాన్ని దహనం చేస్తారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్, కలెక్టర్ చక్రధర్‌బాబు అక్కడకు చేరుకుని ఏర్పాట్లు పూర్తి చేశారు. అంత్యక్రియలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో హెలిప్యాడ్‌ను పరిశీలించారు. గుంటూరు ఐజీ త్రివిక్రమ్‌వర్మ, ఎస్పీ విజయారావు పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పలువురు ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉన్నందున ఉదయగిరిలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు సీఎం వైఎస్ జగన్
-
నెల్లూరులోని నివాసంలో గౌతమ్‌రెడ్డి భౌతికకాయం
Updates: Time: 7.05 నెల్లూరు: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పార్థివదేహానికి మంత్రి పేర్ని నాని నివాళులు అర్పించారు. Time: 6:49PM మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంతిమ యాత్ర రూట్ మ్యాప్ నెల్లూరు: బుధవారం ఉదయం 6.00 గంటలకు నెల్లూరులోని డైకాస్ రోడ్‌లోని మంత్రి గౌతమ్‌రెడ్డి నివాసం నుంచి అంతిమ యాత్ర మొదలై జొన్నవాడ మీదుగా బుచ్చి, సంగం, నెల్లూరుపాలెం, మర్రిపాడు, సరిహద్దు, బ్రాహ్మణపల్లి, నందిపాడు మీదుగా ఉదయగిరిలో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వరకు జరుగుతుంది. అనంతరం ఉదయం 11.00 గంటలకు గౌతమ్‌రెడ్డి పార్థివదేహానికి సీఎం వైఎస్ జగన్ నివాళులు అర్పించిన అనంతరం అంత్యక్రియలు జరుగుతాయి. గమనిక: మంత్రి గౌతమ్‌రెడ్డి పార్థివదేహం ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల సందర్శనార్థం నెల్లూరు పాలెం సెంటర్లో ఐదు నిమిషాలు ఉంచబడును. Time: 4:53PM నెల్లూరు: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పార్థివదేహానికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నివాళులు అర్పించారు. Time: 3:28PM నెల్లూరు: అమెరికా నుంచి మంగళవారం రాత్రి వరకు గౌతమ్‌రెడ్డి కుమారుడు అర్జున్‌రెడ్డి నెల్లూరు చేరుకోనున్నారు. రాత్రి 7 గంటలకు చెన్నై విమానాశ్రయానికి రానున్న అర్జున్ రెడ్డి.. చెన్నై నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు చేరుకుంటారు. Time: 3:15PM మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికి కాయానికి ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్, స్పెషల్ సీఎస్ పూనమ్ మాలకొండయ్య నివాళులు అర్పించారు. Time: 3:02PM రేపు (బుధవారం) దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కడప వెళ్లి అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో ఉదయగిరికి సీఎం జగన్‌కు చేరుకోనున్నారు. ఉదయగిరి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్(మెరిట్స్) వద్ద జరిగే అంత్యక్రియల్లో పాల్గొంటారు. అనంతరం సీఎం జగన్ మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. Time: 1:26 PM నెల్లూరు: మంత్రి మేకాపాటి గౌతమ్‌రెడ్డి భౌతికి కాయానికి మంత్రులు మేకతోటి సుచరిత, గుమ్మనూరి జయరాం, శంకర్ నారాయణ, చెరుకువడ శ్రీ రంగనాథ రాజు, నారాయణ స్వామి నివాళులు అర్పించారు. Time: 1:10 PM ఆయన లేరన్న నిజాన్ని నమ్మలేకపోతున్నారు.. నెల్లూరు: గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పరిశ్రమల శాఖకు తీరని లోటని ఐటీ స్పెషల్ సెక్రటరీ వరవన్ అన్నారు. దుబాయ్ ఎక్స్‌పోలో గౌతమ్‌రెడ్డి ప్రజెంటేషన్ అక్కడి పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుందని.. రూ.5 వేల కోట్ల ఒప్పందాలు చేసుకున్నామన్నారు. దుబాయ్ పారిశ్రామిక వేత్తలు సైతం ఆయన లేరన్న నిజాన్ని నమ్మలేకపోతున్నారని వరవన్ అన్నారు. Time: 12:03 PM నెల్లూరులోని నివాసానికి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం.. నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి గౌతమ్‌రెడ్డి నివాసానికి ఆయన భౌతికకాయం తరలించారు. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉంచారు. రేపు(బుధవారం) ఉదయం 11 గంటలకు ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో అధికారిక లాంఛనాలతో గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. Time: 11:52 AM నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు ప్రత్యేక హెలికాఫ్టర్.. నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు ప్రత్యేక హెలికాఫ్టర్ చేరుకుంది. పరేడ్ గ్రౌండ్ నుంచి గౌతమ్‌రెడ్డి నివాసానికి ఆయన భౌతిక కాయాన్ని తరలించనున్నారు. Time: 11:37 AM జీర్ణించుకోలేకపోతున్నాం: మంత్రి అనిల్ గౌతమ్‌రెడ్డి లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. చాల విషయాల్లోనూ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించేవారన్నారు. పెద్దన్నను కోల్పోయినట్లు ఉందన్నారు. అధికారదర్పం ఉండేది కాదని.. అందరితోనూ స్నేహంగా ఉండేవారన్నారు. Time: 11:31 AM గౌతమ్‌రెడ్డి లాంటి మంచినేత మళ్లీ తిరిగిరారు.. శోకసంద్రంలో కార్యకర్తలు గౌతమ్‌రెడ్డి మరణవార్త విని షాక్‌కు గురయ్యామని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తల పట్ల ఆయన ఎంతో ఆప్యాయత, ప్రేమతో ఉండేవారన్నారు. గౌతమ్‌రెడ్డి లాంటి మంచి నేత మళ్లీ తిరిగిరారని కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. Time: 11:22 AM కాసేపట్లో నెల్లూరుకి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం కాసేపట్లో నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు గౌతమ్‌రెడ్డి భౌతికకాయం చేరుకోనుంది. పరేడ్ గ్రౌండ్ నుంచి గౌతమ్‌రెడ్డి నివాసానికి ఆయన భౌతికకాయాన్ని తరలించనున్నారు. గౌతమ్‌రెడ్డి నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. గౌతమ్‌రెడ్డి నివాసానికి భారీగా కార్యకర్తలు, అభిమానులు చేరుకుంటున్నారు. ఆయన మరణంతో అభిమానులు కన్నీటిపర్యంతమవుతున్నారు. Time: 9:43 AM బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నెల్లూరుకు గౌతమ్‌రెడ్డి భౌతికకాయం బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి నెల్లూరుకు ప్రత్యేక హెలికాప్టర్లో గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని తరలిస్తున్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇంటి వద్దకు ప్రజలు,అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. మరికాసేపట్లో పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌కి హెలికాఫ్టర్‌లో మంత్రి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం చేరుకోనుంది. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ నుండి మంత్రి గౌతమ్‌రెడ్డి ఇంటికి ఆయన పార్థివదేహాన్ని అధికారులు తరలించనున్నారు. Time: 9:25 AM కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నెల్లూరుకు గౌతమ్‌రెడ్డి భౌతికకాయం కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాఫ్టర్‌లో నెల్లూరుకు గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని తరలించనున్నారు. ఉదయం 11.25కి డైకాస్ రోడ్‌లోని క్యాంప్ కార్యాలయానికి గౌతమ్‌రెడ్డి భౌతిక కాయం చేరుకోనుంది. ఉదయం 11.30 నుంచి ప్రజలు, అభిమానుల సందర్శనార్థం గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని ఉంచనున్నారు. ఇప్పటికే అమెరికా నుంచి గౌతమ్‌రెడ్డి కుమారుడు కృష్ణార్జునరెడ్డి బయలుదేరారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో కృష్ణార్జునరెడ్డి నెల్లూరు చేరుకునే అవకాశం ఉంది. రేపు ఉదయగిరిలో మేకపాటి ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. అంత్యక్రియల ఏర్పాట్లను మంత్రి అనిల్‌కుమార్ పర్యవేక్షిస్తున్నారు. Time: 8:37 AM హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని తరలించారు. 10 గంటలకు అక్కడ నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాఫ్టర్‌లో నెల్లూరుకు భౌతికకాయం తరలించనున్నారు. Time: 8:10 AM సాక్షి, హైదరాబాద్: నేడు గౌతమ్‌రెడ్డి భౌతికకాయం నెల్లూరుకు తరలించనున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి కాసేపట్లో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం తరలించనున్నారు. ఉదయం 10 గంటలకు అక్కడ నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఆయన భౌతికకాయం తరలిస్తారు. ఉదయం 11 గంటలకు గౌతమ్‌రెడ్డి భౌతికకాయం నెల్లూరు చేరుకోనుంది. చదవండి: శోకసంద్రంలో సింహపురి.. అజాతశత్రువు అకాల మృతితో తీవ్ర విషాదం నేడు(మంగళవారం) నెల్లూరు అభిమానుల సందర్శనార్థం గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని ఉంచనున్నారు. ఈరోజు రాత్రి అమెరికా నుంచి గౌతమ్‌రెడ్డి కుమారుడు అర్జున్‌రెడ్డి రానున్నారు. రేపు(బుధవారం) ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీ ఆవరణలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు అధికారిక లాంఛనాలతో గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కర్రకు ప్రాణం.. కళకు రూపం
ఆ ప్రాంగణంలో కర్రకు ప్రాణం వస్తుంది. అక్కడివారు చెప్పినట్లు హొయలు పోతుంది. వారి చేతుల్లో మెలి తిరుగుతుంది. వారి నైపుణ్యంతో తనువుకు మెరుగులద్దుకుంటుంది. వివిధ ఆకృతుల్లో ఒదుగుతుంది. చూడవచ్చినవారిని ఆకట్టుకుంటుంది. వారి మనసుల్లోకి.. తరువాత చేతుల్లోకి చేరుతుంది. వారి ఇళ్లకు వెళ్లిఅలరిస్తుంది. అందరికీ కనువిందు చేస్తుంది. మాకు కూడా ఇలా ప్రాణమున్న కర్ర కావాలి అనిపిస్తుంది. సాక్షి, నెల్లూరు: ఉదయగిరి.. రాయలేలిన సీమ. కళలకు కాణాచి. నాటి వైభవ చిహ్నాలతో అలరారు తున్న ప్రదేశం. కాలక్రమంలో అనేక కళలు అంతరించినా.. ఒక వ్యక్తి అకుంఠిత దీక్ష కర్రకు ప్రాణంపోసే కళను బతికించింది. జీవం పోసుకున్న కర్ర.. అనేకమందికి జీవనాధారమైంది. ఈ ప్రాంత ఖ్యాతిని ఇనుమడింపజేస్తోంది. రాష్ట్రాధినేతలు, దేశాధినేతల మనసులు కొల్లగొడుతోంది. ఖండాంతర ఖ్యాతి సాధిస్తోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో చెక్క నగిషీ నైపుణ్యం హస్తకళల ప్రాభవానికి ఊపిరి ఊదింది. ఉదయగిరిలోని దిలాపర్ భాయ్ వీధికి చెందిన అబ్దుల్ బషీర్ ఈ కళను బతికించారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా అందిన ఆ నైపుణ్యాన్ని పదిమందికి ఉపాధి మార్చారు. కర్రతో కళాకృతులు చేసే ఈ హస్తకళను స్థానికంగా కొందరు మహిళలకు నేర్పారు. అడవికర్రలతో పలు రకాల వస్తువులను తయారు చేయడంపై వారికి శిక్షణ ఇచ్చారు. తొలుత ఆయన ప్రయత్నానికి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటన్నింటిని అధిగమిస్తూ అడుగులు వేసిన ఆయన మొదట తన కుమార్తెలు గౌసియాబేగం , షాహీదాలకు ఈ కళను నేర్పించారు. ఆ వస్తువుల నైపుణ్యానికి అబ్బురపడిన తిరుపతి లేపాక్షి వారు బషీర్‌ను రాష్ట్రస్థాయి అవార్డుతో సత్కరించారు. దీంతో ఈ కళకు కొంత ప్రాచుర్యం లభించింది. తన తండ్రి నుంచి వారసత్వంగా అందిపుచ్చుకున్న గౌసియాబేగం.. కొందరు మహిళలతో బృందం ఏర్పాటు చేసుకుని.. చైతన్యజ్యోతి వెల్ఫేర్ సొసైటీ సహకారంతో ఉడెన్, కట్లరీ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. హస్తకళలు, జౌళిశాఖ ఆర్థికసాయంతో సొంతంగా ఓ రేకుల షెడ్డు, కొన్ని యంత్రాలు సమకూర్చుకుని నైపుణ్యానికి మరింత పదును పెట్టి ఉత్పత్తి పెంచారు. కొయ్యలతో తయారుచేసిన వివిధ ఆకృతుల వస్తువులు ప్రదర్శనల్లో స్టాల్స్ ఈకళాకారులు ఉదయగిరికి సమీపంలో దుర్గం అటవీ ప్రాంతం నుంచి అవసరమైన ముడి కర్రను తెచ్చుకుంటారు. నర్డి, బిల్ల, బిక్కి, కలివి, దేవదారు, కర్రతో గరిటెలు, ఫోర్క్‌లు, పాత్రలు, ట్రేలు, స్లిక్స్, హెయిర్ క్లిప్స్, బొమ్మలు, చిన్న డైనింగ్ టేబుళ్లు, మ్యాట్లు, చిన్న గ్లాసులు, హాట్ బాక్స్‌లు, ప్లేట్లు, బుట్టలు.. ఇలా 150కి పైగా వస్తువులు తయారు చేస్తున్నారు. గౌసియాబేగం వీటిని వివిధ ప్రాంతాల్లో జరిగే ప్రదర్శనల్లో స్టాల్ ఏర్పాటుచేసి అక్కడ విక్రయించేవారు. వచ్చిన సొమ్మును వస్తువులు తయారు చేసిన మహిళలంతా సమానంగా పంచుకునేవారు. ఈ కృషి ఫలితంగా గౌసియాబేగం రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందారు. ఆమెకు రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. ఈ కళను నేర్చుకునే మహిళల సంఖ్య క్రమంగా పెరిగింది. కాలానుగుణంగా అభిరుచులకు పెద్దపీట వేస్తూ కళను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం నిర్వహణ బాధ్యతను గౌసియాబేగం తన కుమారుడు జాకీర్‌హుస్సేన్‌కు అప్పగించారు. న్యూఢిల్లీలో గతేడాది ఫిబ్రవరిలో జరిగిన ఓ ప్రదర్శనలో జాకీర్‌హుస్సేన్ స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్‌ను సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉదయగిరి హస్తకళను ఆసక్తిగా తిలకించారు. ఆ వస్తువుల తయారీ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంతటి నైపుణ్యవంతమైన ఈ కళకు 2016లో జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ (జీఐ) ట్యాగ్ లభించింది. ఈ వస్తువులను ఆన్లైన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంచుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం మరింత అవసరం 60 ఏళ్ల కిందట ఈ వృత్తిలో ప్రవేశించి ఈ కళను బతికించుకునేందుకు అనేక ఇబ్బందులు పడ్డాను. ఆదాయం లేకపోవడంతో బయటివారు ఎవరూ ముందుకు రాని రోజుల్లో నాకుమార్తెలిద్దరికీ ఈ కళ నేర్పించాను. మా కుటుంబంలో అందరూ ఇదే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం వంద కుటుంబాలకుపైగా దీనిపై ఆధారపడి జీవిస్తున్నాయి. రోజుకు రూ.500 వరకు సంపాదిస్తున్నారు. దీన్ని మరింత విస్తృతపరిచేందుకు ప్రభుత్వ ప్రోత్సాహం ఎంతో అవసరం ఉంది. కొండాపురం మండలం జంగాలపల్లి వద్ద ఏర్పాటుచేసిన స్టాల్‌ను ప్రజాసంకల్ప యాత్రలో ప్రతిపక్షనేత హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సందర్శించి ప్రశంసించారు. ఇటీవల ఢిల్లీలో ఏర్పాటుచేసిన స్టాల్‌ను సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ మా మనుమడు జాకీర్‌ను ప్రోత్సహించారు. దీంతో సీఎం జగన్మోహన్రెడ్డి నుంచి ఆయన్ని కలవాలని జాకీర్‌కు పిలుపొచ్చింది. ఈ కళకు ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సాహం వస్తుందనే నమ్మకం కలిగింది. – షేక్ అబ్దుల్ బషీర్ ఆధునిక యంత్రాలు అందించాలి సంప్రదాయ పద్ధతిలో వస్తువులు తయారుచేయడంతో తగినంత ఆదాయం రావడం లేదు. ఆధునిక యంత్రాలు సమకూరిస్తే వస్తువులు తయారుచేసే సమయం తగ్గుతుంది. ఉత్పత్తి పెరిగి ఆదాయం పెంచుకునే అవకాశముంది. ఈ వృత్తిలో ముస్లిం మహిళలే అత్యధికంగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న కేంద్రం ప్రాంగణంలోనే కొత్త భవనం ఏర్పాటుచేసి ఆధునిక యంత్రపరికరాలు సమకూర్చాలి. తద్వారా ఎక్కువమంది ఈ వృత్తిలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. – షేక్ గౌసియాబేగం -
నెల్లూరు: ఉదయగిరి కోట
ఉదయగిరి దుర్గం... రాజరికం నుంచి ప్రజాస్వామ్యానికి జరిగిన పయనంలో ఈ దుర్గం దాటిన మైలురాళ్లు ఒకటి కాదు రెండు కాదు. గజపతుల పాలనకు ముందు విజయనగర పాలకుల స్వాధీనంలో ఉండేది. పల్లవులు, కాకతీయులు, చోళులు, గోల్కొండ, ఆర్కాటు నవాబులతోపాటు బ్రిటిష్ పాలననూ చూసింది. ప్రతి పాలకులూ ఈ దుర్గంలో తమ ఆనవాళ్లను ప్రతిష్ఠించారు. సూర్యుడి తొలికిరణాలు కొండ మీద ప్రసరిస్తాయి కాబట్టి ఉదయగిరి అనే పేరు వచ్చింది. సుదీర్ఘ యుద్ధం చోళ సంస్కృతికి ప్రతిబింబంగా రంగనాథ మండపం, పల్లవుల నిర్మాణ శైలికి ప్రతీకగా బాలకృష్ణ మందిరం, విజయనగర రాజుల నిర్మించిన పారువేట మండపం ఉన్నాయి. సూఫీ సన్యాసి చొరవతో నిర్మించిన చిన్న మసీదు, పెద్ద మసీదు, బ్రిటిష్ పాలకులు నిర్మించిన అద్దాల మహల్ ఇక్కడ దర్శనీయ స్థలాలు. ఇక కోట పటిష్ఠత గురించి చెప్పాలంటే... గజపతుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడానికి శ్రీకృష్ణదేవరాయల సైన్యం పద్దెనిమిది నెలలు యుద్ధం చేసింది. సంజీవని కొండ ఇక్కడి అడవులు దట్టమైన చెట్లతో ఎప్పుడూ పచ్చగా నిగనిగలాడుతూ ఉంటాయి. ఈ అడవుల్లో సంజీవని వృక్షాలున్నాయని ప్రతీతి. మొలతాడు సామి అనే సన్యాసి సంజీవని వృక్షాలను అన్వేషిస్తూ అడవుల్లో తిరుగుతుండేవాడని, వనమ్మ అనే వైద్యురాలు ఇక్కడి అడవుల్లో దొరికే ఔషధాలతో రోగాలు నయం చేసేదని స్థానికంగా కొన్ని కథనాలు వ్యవహారంలో ఉన్నట్లు పోట్లూరు సుబ్రహ్మణ్యం ‘ఉదయగిరి దుర్గం కథలు’లో ఉంది. సామరస్య సు‘గంధం’ ఉదయగిరి కోట మత సామరస్యానికి వేదిక. ఏటా రబీ ఉల్ అవ్వల్ నెలలో జరిగే గంధం ఉత్సవాన్ని హిందువులు – ముస్లింలు కలిసి పండుగ చేసుకుంటారు. ఉదయగిరి కోట నెల్లూరు నగరానికి వంద కిలోమీటర్ల దూరాన ఉంది. నెల్లూరులో బస చేసి ఉదయం కారులో బయలుదేరితే రెండున్నర గంటల్లో కొండను చేరుకోవచ్చు. కొండ మీద ఉన్న దుర్గం పల్లి గ్రామం, వల్లభరాయ ఆలయం వరకు రోడ్డు ఉంది. అక్కడి నుంచి కోటను చేరడానికి ఉన్నది మెట్ల మార్గమే. ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నరకు పర్యాటకులను అనుమతిస్తారు. -
నీటి కొరతపై అధ్యయనం చేయండి: ఉపరాష్ట్రపతి
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఎదుర్కుంటున్న సాగు, తాగునీటి సమస్యల పరిష్కారంపై అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వ అధికారులకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కోరారు. సోమవారం నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కార్యదర్శి శ్రీ యూపీ సింగ్, కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ తో ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగిన సమావేశంలో ఉదయగిరి ప్రజలు ఎదుర్కుంటున్న నీటి సమస్యలను ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. కరువుపీడిత ప్రాంతమైన ఉదయగిరికి తాగు, సాగునీటిని అందించే సాధ్యాసాధ్యాలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. లాక్ డౌన్ సమయంలో.. ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా (1978లో) ఎన్నికైన ఉదయగిరి ప్రజలతో మాట్లాడుతున్న సందర్భంలో వారు.. అక్కడి నీటి ఎద్దడి పరిస్థితులను ఉపరాష్ట్రపతికి ఏకరువుపెట్టారు. భూగర్భ జలాలు అడుగంటడంతో చెరువులు, బోరుబావులు ఎండిపోయాయని తెలిపారు. వరుసగా ఏడో ఏడాదీ సరిగ్గా వర్షాలు పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణానది నుంచైనా లేదా.. సోమశిల ప్రాజెక్టు నుంచైనా తమకు నీటిని ఇప్పించాలని వారు ఉపరాష్ట్రపతిని కోరారు. ఈ నేపథ్యంలో జరిగిన సోమవారం నాటి సమావేశంలో.. ఉదయగిరికి నీటిని అందించేందుకు సాంకేతిక సంభావ్యత (టెక్నికల్ ఫీజిబిలిటీ), సవివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) అంశాలపై చర్చించాలని అధికారులకు ఉపరాష్ట్రపతి సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నీటి కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల పనితీరును కూడా అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. జల్ శక్తి మంత్రిత్వ శాఖ అధికారులు, నీతి ఆయోగ్ అధికారుల బృందం ఉదయగిరిలో పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రజలతో మాట్లాడితే వాస్తవ పరిస్థితిని సరిగ్గా అంచనా వేసేందుకు వీలవుతుందన్నారు. దీనికి అధికారులు స్పందిస్తూ.. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత, వీలుచూసుకుని ఉదయగిరిలో పర్యటిస్తామని, అక్కడి ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదించి.. సరైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని తెలిపారు. పర్యటన అనంతరం తదుపరి వివరాలతో మరోసారి కలుస్తామని ఉపరాష్ట్రపతికి విన్నవించారు. ఈ కార్యక్రమలో ఉపరాష్ట్రపతి కార్యదర్శి ఐవీ సుబ్బారావు కూడా పాల్గొన్నారు. -
పోలీస్ స్టేషన్ నుంచి వైద్యుడి పరారీ
సాక్షి, నెల్లూరు: స్టాఫ్ నర్స్‌తో అసభ్యంగా ప్రవర్తించిన డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ పోలీస్ స్టేషన్ నుంచి పరారయ్యాడు. గతంలోనూ పలువురిపై వేధింపులకు పాల్పడ్డ ఈ కీచక వైద్యుడిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో అతను రాత్రికి రాత్రే పోలీస్ స్టేషన్ నుంచి అదృశ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక ఇప్పటికే వైద్యుని తీరుపై ఆగ్రహంగా ఉన్న ఎస్పీ భాస్కర్ భూషణ్ ఈ ఘటనపై సీఐ సత్యనారాయణను వివరణ కోరారు. మరోవైపు పరారీలో ఉన్న డాక్టర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా ఉదయగిరి సీహెచ్‌సీ(సామాజిక ఆరోగ్య కేంద్రం)లో వైద్యవృత్తి నిర్వర్తిస్తున్న రవీంద్రనాథ్.. నర్సును లైంగికంగా వేధించిన కేసులో ఆమె బంధువులు సదరు డాక్టర్‌కు దేహశుద్ధి చేసిన విషయం తెలిసిందే. చదవండి: (ఆమ్లెట్ వేసుకురా.. అంటూ నర్స్‌తో) -
ఉదయగిరిలో దిశచట్టంపై అవగాహన ర్యాలీ
-
భూ దందా.!
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను ఉదయగిరి అధికార పార్టీనేతలు పాటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్రభుత్వ భూములకు అధికార ముద్ర వేయించుకుని బినామీల ద్వారా సొంతం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వారం రోజులుగా ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయంలోనే టీడీపీ నేతలు తిష్ట వేసి కాజేసిన భూములను భూ పంపిణీలో పట్టాలు పొందేందుకు పేర్లు నమోదు చేయిస్తున్నారు. సాక్షి, నెల్లూరు: ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఆదేశాలతో పాటు అధికారపార్టీ నేతలు ఇచ్చే తాయిలాలకు ఆశపడిన రెవెన్యూ అధికారులు సైతం నాయకుల బినామీల పేర్లు జాబితాలో నమోదు చేయిస్తున్నారు. ఉదయగిరి ప్రాంతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో పాటు గత కాంగ్రెస్ పాలకుల సహకారంతో సాగునీటి వసతి కల్పించేందుకు చేసిన ప్రయత్నాలు విజయవంతం అయి త్వరలోనే రైతులకు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీనికితోడు ప్రభుత్వ భూములు విస్తారంగా ఉన్నాయి. స్థానిక టీడీపీ నేతలు నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ భూములపై కన్నేసి కబ్జాలకు పాల్పడ్డారు. రెవెన్యూ అధికారులు సహకారంతో అడంగల్‌లో పేర్లు నమోదు చేయించుకుని దర్జాగా ఆక్రమణలకు పాల్పడ్డారు. ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్ది కబ్జా చేసిన భూములకు అధికార ముద్ర వేయించుకుని సొంతం చేసుకునేందుకు భూపంపిణీ కార్యక్రమాన్ని వాడుకుంటున్నారు. వారం రోజులుగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తిష్టవేసి అధికారపార్టీ నేతలు రెవెన్యూ రికార్డులలో బినామీ పేర్లు నమోదుతోపాటు భూపంపిణీ లబ్ధిదారుల జాబితాలో కూడా ఆ పేర్లు నమోదయ్యేలా చేసుకుంటున్నారు. అధికారులపై ఎమ్మెల్యే బొల్లినేని ఒత్తిడి కొండాయపాళెం, గన్నేపల్లి రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూములను టీడీపీ నేత మన్నెటి వెంకటరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు, బినామీ పేర్లతో ఆక్రమణలు చేశారు. ఆ నేత భూకబ్జా విషయం గతంలో పత్రికల ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో çస్పందించిన కలెక్టర్ టీడీపీ నాయకుడి భూకబ్జాపై నివేదిక కోరారు. ఈ క్రమంలో ఆయా భూములను కూడా భూ పంపిణీ జాబితాలో చేర్పించేందుకు సదరు నేత గత వారం రోజులుగా కుస్తీ పడుతున్నారు. ఆ భూముల కబ్జా విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో స్థానిక తహసీల్దార్ మాత్రం ఆ భూములను భూపంపిణీ జాబితాలో చేర్చేందుకు ససేమిరా అనడంతో రూ.1.5 లక్షల నగదు ఆఫర్ చేసినట్లు ఆరోపణలున్నాయి. టీడీపీ నేత ఆఫర్‌ను తహసీల్దార్ తిరస్కరించడంతో స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ద్వారా రెవెన్యూ అధికారులపై తీవ్ర ఒత్తిడి పెంచారు. ఎలాగైనా సదరు నేత చెప్పిన భూముల జాబితా భూపంపిణీ లిస్టులో చేర్చమని ఎమ్మెల్యే ఆదేశాలివ్వడంతో రెవెన్యూ అధికారులు తలలుపట్టుకుంటున్నారు. రెండు రోజులుగా తహసీల్దార్ కార్యాలయంలో అధికారపార్టీనేత కూర్చోని ఎలాగైనా తాము సూచించిన పేర్లు జాబితాలో చేర్చాలంటూ పట్టుబట్టడంతో రెవెన్యూ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఆ భూములు చేర్చేది లేదు టీడీపీ నేతలు సూచించిన భూములు భూపంపిణీ జాబితాలో చేర్చం. అర్హులైన వారికే భూముల పంపిణీ చేస్తాం. భూపంపిణీ జాబితాలో అనర్హులకు చోటు కల్పించం. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి మాపై లేదు. – శ్రీరామకృష్ణ, తహసీల్దార్, ఉదయగిరి 400 ఎకరాలలో బినామీ పేర్లు ఉదయగిరి మండలంలో దాదాపు 800 ఎకరాల అనాదీనం, సీజేఎఫ్ఎస్ భూములను దాదాపు 470 మందికి పంపిణీ చేసేలా భూపంపిణీ జాబితా తయారు చేశారు. అందులో దాదాపు 400 ఎకరాల భూములు స్థానిక టీడీపీ నేతలకు సంబంధించిన బినామీ పేర్లు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. మండలంలోని కొండాయపాళెం, ఆర్లపడియ, గన్నేపల్లి, అప్పసముద్రం, బండగానిపల్లె, పుల్లాయపల్లి, జి.చెరువుపల్లి గ్రామాల రెవెన్యూ పరిధిలో భూపంపిణీ కోసం లబ్ధిదారుల జాబితా తయారు చేస్తున్నారు. ఆయా రెవెన్యూ పరిధిలో ఉన్న భూములను ఆక్రమణ చేసిన నేతలు భూపంపిణీ జాబితాలో తమ బినామీల పేర్లు నమోదు చేయించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఉదయగిరి మార్కెట్ కమిటీ చైర్మన్, మండల టీడీపీ అధ్యక్షుడు మన్నేటి వెంకటరెడ్డి సారథ్యంలో ఉదయగిరికి చెందిన మైనార్టీ నేతతోపాటు మండల స్థాయి నేతలు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు మరికొందరు కలిసి సుమారు 400 ఎకరాల భూములు తమకు చెందిన బినామీలవే జాబితాలో చేర్చినట్లు ఆరోపణలున్నాయి. -
అవినీతి'గిరి'
ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్లినేని రామారావు అండతో అధికార పార్టీ నేతలు అవినీతి అక్రమాలతో చెలరేగిపోయారు. టీడీపీ నాలుగున్నరేళ్ల పాలనలో పలు అభివృద్ధి పనుల్లో అక్రమాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ స్థలాలు, భూములు కబ్జా చేశారు. ఫైబర్ చెక్‌డ్యాంల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడి రూ.కోట్లు దోచుకున్నారు. ఎమ్మెల్యే వెంకటరామారావు మహారాష్ట్రలోని విదర్భ ఇరిగేషన్ డెవలప్మెంట్ పనుల్లో చేసిన అవినీతి ఫార్ములాను ఉదయగిరి నియోజకవర్గంలో పక్కాగా అమలుచేశారు. ఫైబర్ చెక్‌డ్యాంల పేరుతో రూ.కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఉదయగిరి నియోజకవర్గంలో రూ.105 కోట్లతో 280 ఫైబర్ చెక్‌డ్యాంలు నిర్మించారు. రూ.10 లక్షలు అంచనా వ్యయమయ్యే పనులను అమాంతం దాని విలువ రూ.కోటికి పెంచి అడ్డగోలుగా పనులు చేసి భారీ మొత్తంలో జేబులు నింపుకున్నారు. ఈ పనుల్లో పది శాతం ఎమ్మెల్యే కమీషన్ తీసుకుని నియోజకవర్గంలోని వివిధ మండల స్థాయిలో ఉన్న టీడీపీ నేతలకు పనులు కేటాయించారు. సాక్షిప్రతినిధి, నెల్లూరు :టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గాన్ని తెలుగుతమ్ముళ్లు దోచేశారు. ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు అండ చూసుకుని ప్రతి పథకంలోనూ అవినీతికి పాల్పడ్డారు. రూ.కోట్లు స్వాహా చేశారు. చోటా నాయకుడి నుంచి జిల్లా నాయకుడి వరకు అందరూ ప్రజల సొమ్మును హారతి కర్పూరం చేశారు. ప్రభుత్వ స్థలాలు, భూములను కబ్జా చేశారు. పింఛన్ల మంజూరులో చేతివాటం ప్రదర్శించారు. అవసరం లేకపోయినా నీరు – చెట్టు పేరుతో చెక్‌డ్యాంల నిర్మాణం, కాలువలు, చెరువుల్లో పూడికతీత, చెరువుకట్టల అభివృద్ధి తదితర పనులను గ్రామస్థాయి కార్యకర్తలకు కాసులపంట పండించే విధంగా రూపకల్పన చేశారు. ఎక్కడైనా చిన్న వాలు కనిపిస్తే అక్కడ ప్రొక్లెయిన్లు పెట్టి పూడికతీత పనులు తూతూమంత్రంగా చేసి విచ్చలవిడిగా దోచుకున్నారు. జిల్లాలో సంచలనం సృష్టించిన పసుపు కుంభకోణంలో టీడీపీ నేతల ప్రమేయం ఉంది. అవినీతిపై ఎన్ని విమర్శలు వచ్చినా లెక్క చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారు. అవినీతి సంస్థానానికి ఆయనే రాజు ఉదయగిరి నియోజకవర్గంలో ఇసుకతో మొదలుపెట్టి కొత్త టెక్నాలజీ వర్కులుంటూ భారీగా ప్రతి దానిలో దండుకున్నారు. బొల్లినేని రామారావు 2014 ఎన్నికలకు ముందు కాంట్రాక్టర్. ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యాక ఆయన, ఆయన ముఖ్య అనుచరగణంతో పాటు తెలుగుతమ్ముళ్లు ఇక మనకు తిరుగులేదనే రీతిలో అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించారు. బొల్లినేని మహారాష్ట్రలోని నాగపూర్‌లో పనులకు సంబంధించి ఏసీబీ కేసు నమోదైంది. ఆయన అనుచరులు పసుపు కొనుగోళ్లలో రూ.కోట్లు మింగిన క్రమంలో వారందరిపై స్థానికంగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కేసులు పెట్టాక జోరు తగ్గకపోగా రెట్టింపు స్థాయిలో అవినీతి చేయడం గమనార్హం ఎమ్మెల్యేపై ఏసీబీ కేసు 2006 సంవత్సరం నవంబర్ 6వ తేదీన విదర్భలో బొల్లినేని రామారావు, ఆర్.శ్రీనివాసరెడ్డిలు రూ.130 కోట్ల వర్కును ప్రారంభించారు. నిబంధనలకు విరుద్ధంగా 2007లో దాని విలువను రూ.145 కోట్లకు పెంచారు. ఇలా పెంచుకుంటూ పోయి రూ.1,549 కోట్ల వర్కుగా చేసి భారీగా దోచుకున్నారు. ఈ వ్యవహారంపైనే మొదట ఏసీబీ కేసు కూడా నమోదైంది. విచారణలో పనుల విలువ పెంచి భారీగా స్వాహా చేశారని రుజువు కావడంతోనే కేసు నమోదు చేశారు. మొత్తం అక్కడ పనులు నిర్వహించిన ఏడుగురు కాంట్రాక్టర్లపై కేసులు పెట్టారు. తాజాగా కూడా పాత కేసులకు కొనసాగింపుగా ఎఫ్ఐఆర్ నంబర్ 0203/2017 కింద కేసు మçహాæరాష్ట్రలోని నాగపూర్‌లో ఉన్న సర్దార్ పోలీసు స్టేషన్లో ఏసీబీ నివేదిక ఆధారంగా కేసు నమోదుచేసి విచారణ సాగిస్తున్నారు. ఈ కేసులో ప్రభాకరవిఠల్ మోర్గాడే, శ్యాం జగ్గదేవ్ అంబల్కేర్, దీలిప్ పోయేకర్, స్వప్న రామసాత్ సూర్యవంశీ, షాహిదాస్ మారుతీ లగడేలతోపాటు ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, అతని భాగస్వామి రామిరెడ్డి శ్రీనివాసరెడ్డిలుపై కేసు నమోదై విచారణ పర్వం సాగుతోంది. అవసరం లేకున్నా పనులు చేసి.. నియోజకవర్గంలో అధికంగా దోపిడీ జరిగిన వాటిలో నీరు – చెట్టు పథకం ఒకటి. అన్ని మండలాల్లో కలిపి రూ.132 కోట్లు పనులు జరిగాయి. వీటిలో చెక్‌డ్యాంల నిర్మాణం, కాలువలు, చెరువుల్లో పూడికతీత, చెరువుకట్టల అభివృద్ధి తదితర పనులున్నాయి. పనులు నాసిరకంగా చేసి, అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి బిల్లులు చేసుకున్నారు. ♦ సాధారణంగా వర్షాలు పడితే వంకల ద్వారా వాలు ప్రాంతాలకు నీరు చేరుకుంటుంది. కానీ ఆ వంకలనే ఆదాయ వనరులుగా మార్చుకుని పూడికతీత పనుల పేరుతో భారీ దోపిడీకి పాల్పడ్డారు. వరికుంటపాడు మండలంలోని ఇరువూరు, కృష్ణంరాజుపల్లి, కొండాయపాళెం, మహ్మదాపురం, గణేశ్వరాపురం, వరికుంటపాడు, జడదేవి, ఉదయగిరి మండలంలో బిజ్జంపల్లి, కొత్తపల్లి, జీ చెరువుపల్లి. కొండాపురం మండలంలోని గరిమెనపెంట, కొమ్మి, తదితర చోట్ల ఈ విధంగా జరిగింది. ♦ చెరువు పూడికతీత పేరుతో గతంలో ఎప్పుడో రైతులు, స్థానికులు తమ అవసరాల కోసం సొంతంగా తీసుకెళ్లిన మట్టి గుంతలను లెక్కలో చూపించి పెద్దమొత్తంలో దోచేశారు. పనులు చేయకుండానే చేసినట్లుగా అధికారులు రికార్డుల్లో నమోదుచేసి అధికార పార్టీ నేతలకు లాభం చేకూర్చారు. దుత్తలూరు మండలంలోని నందిపాడు చెరువు, కొండాపురం మండలంలోని కొమ్మి చెరువు, వింజమూరు మండలంలోని పాతూరు చెరువుకు సంబంధించి ఈ పరిస్థితి ఉంది. సుమారు రూ.50 లక్షల అవినీతి చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు. ♦ చెరువుకట్టల అభివృద్ధి పేరుతో తూతూమంత్రంగా పనులు చేయడంతో కొద్దిపాటి వర్షానికే కట్ట పనుల్లో డొల్లతనం బయటపడి బీటలు వారాయి. చెక్‌డ్యాంల పేరుతో జరిగిన దోపిడీ అంతాఇంతా కాదు. నిబంధనలు పూర్తిగా గాలికొదిలేసి తూతూమంత్రంగా పనులుచేసి అధికారులపై ఒత్తిడితెచ్చి ఎం బుక్‌లు రికార్డ్ చేయించుకుని నిధులు మింగేశారు. ఈ పనుల్లో చాలావరకు ఏడాది గడవకముందే నాణ్యతా లోపం బయటపడింది. ఉదయగిరి మండలంలోని తిరుమలాపురం చెరువు, కృష్ణంపల్లి చెరువు, లింగాలదొన చెరువు, వరికుంటపాడు మండలంలోని సాతుపల్లి చెరువు, గణేశ్వరరాపురం, నారసింహాపురం చెరువు, తిమ్మారెడ్డిపల్లి చెరువు తదితరచోట్ల పనులను అధ్వానంగా జరిగియి. ఇసుక తవ్వేశారు పిల్లాపేరులో ఇసుకను ఈ నాలుగేళ్లలో అధికార పార్టీ నేతలు హారతి కర్పూరంలా హరించేశారు. పిల్లాపేరుకు అటూ ఇటూ 55 కిలోమీటర్ల మేర తవ్వారు. వేల క్యూబిక్ మీటర్లు తవ్వారు. సగటున ఒక ఒక్కో క్యూబిక్ మీటర్‌కు అతితక్కువ ధర వేసుకున్న ఇసుక రూ.300 వరకు ఉంటుంది. సుమారు రూ.150 కోట్ల మేర అవినీతి చోటుచేసుకున్నట్లు అంచనా. అధికారికంగా ఎలాంటి అనుమతి లేకున్నా ఇసుకకు మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే అనుచరులు, నాయకులు తరలించి సొమ్ము చేసుకున్నారు. దీంతో ప్రస్తుతం పిల్లాపేరు పూర్తి రూపాన్నే కోల్పోయింది. ఇసుకతిన్నెలు మటుమాయయ్యాయి. పిల్లాపేరు పరివాహక ప్రాంతంలో ఇసుక నిల్వలు పూర్తిగా హరించుకుపోవడంతో భూగర్భజలం అడుగంటి నీరు ఊరక వందలాది ఎకరాలు బీడు భూములుగా మారాయి. వింజమూరు, ఉదయగిరి, ప్రకాశం జిల్లా పామూరు తదితర ప్రాంతాలకు ఎక్కువగా ఇసుక తరలివెళ్లింది. మితిమీరిన జన్మభూమి కమిటీల పెత్తనం టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీలను ఏర్పాటుచేసి అర్హులకు పథకాలు అందకుండా చేసింది. గ్రామాల్లో పింఛన్ల మంజూరు, పక్కాఇళ్ల ఎంపిక, అభివృద్ధి పనుల గుర్తింపు సర్వం అధికారాలు వారికే ఇచ్చారు. బ్యాంకు రుణాల లబ్ధిదారుల ఎంపికలో కూడా ఈ కమిటీలకే పెత్తనం కట్టబెట్టారు. దీంతో చాలా గ్రామాల్లో జన్మభూమి కమిటీ సభ్యులు లంచాలు, కమీషన్లు తీసుకుని లబ్ధిదారులను ఎంపిక చేశారు. అన్ని అర్హతలున్న వారికి ప్రజా సంక్షేమ ఫలాలు అందకుండా కమిటీలు చక్రం తిప్పాయి. తమ ఆర్థిక అవసరాలు తీర్చిన వారికి టీడీపీ సానుభూతిపరులకు ప్రభుత్వ పథకాలు అందజేయడంలో కీలకంగా వ్యవహరించారు. యథేచ్ఛగా భూ దోపిడీ టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నాయకులు ప్రభుత్వ భూములు, స్థలాలను ఇష్టానుసారంగా కబ్జా చేశారు. నియోజకవర్గంలో సుమారు 300 ఎకరాల ప్రభుత్వ భూమి అధికార పార్టీ నేతలు, గ్రామస్థాయి నేతలు కబ్జాకు గురిచేశారు. వీటి విలువ సుమారు రూ.20 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ♦ వింజమూరు మండలం లో జిల్లా టీడీపీ అధికార ప్రతి నిధి దంతులూరి వెంకటేశ్వరరావు రావిపాడు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 272, తదితరాల్లో సుమారు 100 ఎకరాలు తమ స్వాధీ నంలో ఉంచుకున్నారు. ఇందులో కొంతభాగం కోర్టు ఉత్తర్వుల మేరకు రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు నోటీసుబోర్డు పెట్టినా ఆ భూమంతా సదరు ఆక్రమణదారుడి చేతుల్లోనే ఉంది. ♦ చాకలికొండకు రోడ్డుకు ఆనుకుని ఉన్న రూ.కోట్ల విలువచేసే విలువైన భూమిలో బత్తాయిచెట్లు సాగులో ఉన్నా దానిజోలికి వెళ్లేందుకు రెవెన్యూ అధికారులు సాహసించడం లేదు. ♦ వింజమూరు మండలం గుండెమడకలకు చెందిన టీడీపీ నేత గాలి నరసపునాయుడు ఆదీనంలో రూ.50 లక్షల విలువచేసే 20 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాహా చేశారు. ♦ కొండాపురం మండలం కొమ్మి ప్రాంతంలోని బంగారప్ప చెరువును దేవినేని వెంకటసుబ్బయ్య రూ.30 లక్షల విలువచేసే పదెకరాల భూమిని స్వాహా చేశారు. ♦ ఉదయగిరి మండలం కొండాయపాళెం పంచాయతీలో టీడీపీ నేత మన్నేటి వెంకటరెడ్డి కొంత స్థలాన్ని ఆక్రమించి ఇళ్లు నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. ♦ వరికుంటపాడు మండలంలోని తూర్పురొంపిదొడ్ల, వేంపాడు, మహ్మదాపురం, విరువూరు, కొండాయపాళెం, కృష్ణంరాజుపల్లి, తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూములను అధికార పార్టీ నేతలు కబ్జాచేసి సాగు చేసుకుంటున్నారు. ♦ కొండాపురం మండలం కొమ్మి, గొట్టిగుండాల, కొండాపురం, చింతలదేవి, తదితర గ్రామాల్లో భూములను ఆక్రమించి సాగుచేస్తున్నారు. కింది చిత్రంలో కనిపిస్తున్న భూమి వరికుంటపాడు మండలం గణేశ్వరాపురం గ్రామంలోని బత్తిని గురవమ్మకు చెందినది. 4.50 విస్తీర్ణం గల ఈసీజేఎఫ్ఎస్ భూమిని అధికార టీడీపీ నేత పేరం సుధాకర్‌రెడ్డి ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు. డీఫారం పట్టా ఇవ్వాలని భూమి హక్కుదారురాలైన గురవమ్మ ప్రభుత్వ అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదు. భూమిలోకి లబ్ధిదారురాలను దిగనివ్వకుండా సదరునేత అడ్డుకుని వరిపైరు సాగుచేస్తున్నారు. సుమారు. రూ.20 లక్షల విలువగల భూమిని అధికారం అడ్డుపెట్టుకుని ఆక్రమించుకున్నారు. సదురు నాయకుడే నీరు – చెట్టులో రూ.2 కోట్లు విలువచేసే పనులను నాసిరకంగా చేసి రూ.50 లక్షలకు పైగా అవినీతికి పాల్పడ్డాడు. ఉపాధిహామీలో మొక్కల పెంపకం పేరుతో రూ.4 లక్షలు స్వాహాచేశాడు. పక్కాగృహాలు, మరుగుదొడ్లు ఫాంపాండ్స్, సిమెంట్‌రోడ్లు తదితర పనుల్లో రూ.30 లక్షలుపైగా అవినీతికి పాల్పడ్డాడనే విమర్శలున్నాయి. ఉపాధి పనుల్లోనూఅదే అవినీతి కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు అందజేసే జాతీయ ఉపాధిహామీ పథకం తెలుగుతమ్ముళ్లకు వరంలా మారింది. లబ్ధిదారులకు చెందాల్సిన నగదు నేతలు తమ జేబుల్లో నింపుకున్నారు. అవెన్యూ ప్లాంటేషన్, మరుగుదొడ్ల నిర్మాణం, నాడెప్‌ల నిర్మాణం, డంపింగ్‌యార్డులు, పంటకుంటలకు సంబంధించి కూలీలకు బదులుగా యంత్రాలతో చేయించి బినామీ మస్టర్లతో మెక్కేశారు. సప్లయ్‌దారుడు పేరుతో తమ్ముళ్లు కాంట్రాక్టర్ల అవతారమెత్తి, మరుగుదొడ్లు, నాడెప్‌లు పలుచోట్ల నిర్మించకుండానే నగదు స్వాహా చేశారు. అవెన్యూ ప్లాంటేషన్ పేరుతో జరిగిన అవినీతి అంతాఇంతా కాదు. తూతూమంత్రంగా రోడ్డుకిరువైపులా మొక్కలు నాటి పర్యవేక్షణ, నీరు పోసే పేరుతో రూ.లక్షలు దిగమింగారు. ఏడాది గడిచిన తర్వాత చూస్తే మొక్కలు కనిపించలేదు. వరికుంటపాడు మండలంలోని గణేశ్వరాపురం, తోటలచెరువుపల్లి, దుత్తలూరు మండలంలోని నాయుడుపల్లి పంచాయతీల్లో అవెన్యూ ప్లాంటేషన్ పేరుతో నిధులు స్వాహా చేశారు. మరుగుదొడ్లను పలుచోట్ల తూతూమంత్రంగా నిర్మించి నిధులు కాజేశారు. ఉదయగిరి మండలంలోని ఉదయగిరి, కొండాయపాళెం, జీ చెరువుపల్లి, దుత్తలూరు మండలంలోని కొత్తపేట, వరికుంటపాడు మండలంలోని గణేశ్వరాపురం, వింజమూరు మండలంలోని లెక్కలవారిపాళెం, జనార్దనపురం పంచాయతీల్లో ఉన్నవాటినే మళ్లీ నిర్మించినట్లుగా చూపించి నిధులు స్వాహా చేశారు. -
వెంకయ్యను ఆదరించిన ఉదయగిరి ప్రజలు
ఉదయగిరి వాసులతో విడదీయరాని అనుబంధం ఉదయగిరి: సామాన్య నిరుపేద రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి న ముప్పవరపు వెం కయ్యనాయుడును అక్కున చేర్చుకుని రాజకీయంగా ఆదరించిన ఘన చరిత్ర ఉదయగిరి నియోజ కవర్గ వాసులది. వి ద్యార్థి నాయకుడిగా నెల్లూరు వీఆర్ కళాశాలలో ఉద్యమాలు చేస్తూ 1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయగిరి నుంచి బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో ఉదయగిరి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన ధనేంకుల నరసింహం వెంకయ్యనాయుడుకు మద్దతుగా నిలిచారు. దీంతో ఆయన విజయం సాధించా రు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మాదాల జానకిరాం, రెడ్డి కాంగ్రెస్ తరపున కూండ్ల చెంచురామయ్య పోటీచేసినప్పటికీ సునాయాసంగా 19,700 ఓట్లతో విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. 1983లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ప్రభంజనం సృష్టించగా ఉదయగిరిలో మాత్రం ఆ పార్టీ తరపున పోటీచేసిన గణపం బాలక్రిష్ణారెడ్డిపై 24,311 ఓట్ల మెజారిటీతో బీజేపీ తరపున పోటీచేసిన వెంకయ్యనాయుడు ఘనవిజయం సాధించారు. ఉదయగిరి ఎమ్మెల్యేగా వెంకయ్య కృషి ఉదయగిరి శాసనసభ్యునిగా పనిచేసిన ఆయన నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషిచేశారు. నియోజకవర్గంలో చెట్లకింద సాగుతున్న చదువులను పక్కా భవనాల్లోకి మార్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన రూరల్ ఎలక్ట్రిక్ స్కీం కింద ఆనాడు నియోజకవర్గంలోని 104 గ్రామ పంచాయతీలకు విద్యుత్ సౌకర్యం కల్పించటమే కాకుండా ఉదయగిరిలో 33/11కెవి విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటుచేశారు. దీంతో నియోజకవర్గంలో విద్యుత్‌పరంగా ఎంతో మేలు చేకూరింది. పరిపాలనా సౌలభ్యం కోసం మేజర్ పంచాయతీలను చిన్న పంచాయతీలుగా విడగొట్టారు. ఆనాటి కలెక్టర్ సుజాతరావు సహాయసహకారాలతో నియోజకవర్గంలో ఎన్నో పక్కాగృహాలు నిర్మించారు. రెండుసార్లు కేంద్రమంత్రిగావున్న వెంకయ్య ఉదయగిరి నియోజకవర్గానికి కొంతమేర మేలు చేకూర్చారు. 1999లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా గ్రామసడక్ యోజన ద్వారా తారురోడ్లు ఏర్పాటుచేశారు. ప్రస్తుత మంత్రిగా కామధేను ప్రాజెక్టు నియోజకవర్గానికి సాధించారు. రూ.550 కోట్లతో శాశ్వత మంచినీటి పథకం ఏర్పాటుకు కృషిచేస్తున్నారు. అసెంబ్లీ టైగర్‌గా గుర్తింపు 1983 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేసిన వెంకయ్య విజయం కోసం ఆనాటి అఖిల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు వాజ్‌పేయి ఉదయగిరి ఎన్నికల ప్రచారానికి వచ్చారు. దీంతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి గణపం బాలక్రిష్ణారెడ్డి తరపున ఎన్టీఆర్ ప్రచారం చేశారు. అయినా వెంకయ్య విజయానికి నియోజకవర్గ ప్రజలు మొగ్గుచూపారు. అప్పుడు అసెంబ్లీలో వెంకయ్యనాయుడు వాగ్ధాటి, చతురత ఎంతో అద్భుతంగా ఉండేది. దీంతో ఆయనకు అసెంబ్లీ టైగర్ పేరుతో ఉదయగిరి ప్రజలు పిలుచుకునే వారు. యువతతోనూ మమేకం ఆయన ఉదయగిరి నియోజకవర్గాన్ని వదిలివెళ్లి 30 ఏళ్లు పైబడినా ఈ ప్రాంత యువతతో అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఆయనతో కలిసి పనిచేసిన ఈ ప్రాంతవాసుల పిల్లలు ఎక్కువగా ఆయన్ను కలుస్తుంటారు. వారు కలిసినప్పుడు ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తుల క్షేమసమాచారాలు వాకబు చేస్తుండేవారు. -
గుప్తనిధుల తవ్వకాల ముఠా అరెస్టు...
ఉదయగిరి : ఉదయగిరి ప్రాంతం చుట్టూపక్కల పరిసర ప్రాంతాల్లో గుప్తనిధుల కోసం ఇటీవల కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం ఉదయగిరికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లుగా తెలిసింది. కొన్నేళ్ల నుంచి ఉదయగిరి కొండపై ఉన్న పురాతన స్థావరాలపై విచ్చలవిడిగా తవ్వకాలు చేస్తున్నారు. గత పది పదిహేను రోజుల నుంచి ఉదయగిరి దుర్గంపై కొంత మంది స్థానికులు, స్థానికేతరులు ముఠాగా ఏర్పడి తవ్వకాలు సాగిస్తున్న విషయం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఈ వ్యవహారంలో ప్రమేయముందని భావిస్తున్న కొంత మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల ఆత్మకూరు ప్రాంతంలో అనంతసాగరం చెరువును గుప్తనిధుల కోసం తవ్వుతూ పోలీసులకు పట్టుబడిన వారిలో ఉదయగిరి వాసులు ఉన్నారు. -
‘వైఎస్సార్సీపీకి ప్రజలే కొండంత అండ’
ఉదయగిరి: అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే టీడీపీ ప్రభుత్వ పాలనపై ప్రజాప్రతినిధులు విసుగుచెందారని, వారు వైఎస్సార్సీపీ వైపు ఆకర్షితులవుతున్నారని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఉదయగిరిలోని మేకపాటి క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగిన పార్టీ ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే అనేకమంది ఎంపీటీసీలు వైఎస్సార్సీపీలో చేరేందుకు ముందుకొస్తున్నారన్నారు. గతంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీలను బెదిరించి, ప్రలోభపెట్టి టీడీపీలోకి చేర్చుకున్నారు. వారికి అక్కడ తగిన న్యాయం జరగక, గుర్తింపు దక్కక తిరిగి సొంతగూటికి చేరుకుంటున్నారన్నారు. ఎన్నికలు దగ్గరపడేకొద్ది జిల్లాలో చాలామంది వైఎస్సార్సీపీలోకి రావడం తథ్యమన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డిని గెలిపించేందుకు ప్రతిఒక్కరూ తమవంతు కృషిచేయాలని కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్‌లో ఎన్నో ఏళ్లు పనిచేసినప్పటికీ తగిన గుర్తింపు లభించలేదన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తనను దగ్గరకు తీసుకుని పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారన్నారు. చాలా ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ పాలనలో ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు కూడా విసుగు చెందారన్నారు. కేవలం అబద్ధాలు, అధికారబలం ఉపయోగించి ఏదో చేయాలని టీడీపీ వారు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజలముందు ఇవేమీ సాగవని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రజలు అండగా నిలుస్తారన్నారు. అంతకుముందు ఉదయగిరి బిట్–1 ఎంపీటీసీ ముర్తుజా హుస్సేన్‌ను టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి ఎంపీ రాజమోహన్‌రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. -
వివాహిత ఆత్మహత్య
కొండాపురం : పొదుపు నగదు విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న పాటి వివాదం నేపథ్యంలో మనస్థాపానికి గురై భార్య ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన స్థానిక బీసీ కాలనీలో బుధవారం రాత్రి జరిగింది. ఎస్ఐ రమేష్‌బాబు కథనం మేరకు.. గ్రామానికి చెందిన షేక్ నజీర్‌కు జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాళెంకు చెందిన జరీనా (25)తో 9 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే ఏడాది కాలంగా భార్యాభర్తల మధ్య కలతలు రేగాయి. తరుచూ గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం జరీనాకు పొదుపు గ్రూపులో రుణం వచ్చింది. ఆ డబ్బుల విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి ఈ గొడవ ఇద్దరి మధ్య తీవ్రస్థాయికి చేరింది. దీంతో మనస్థాపానికి గురైన ఆమె ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహన్ని పోస్ట్మాస్టరం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. జరీనా తల్లి మస్తానమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఆరేళ్ల కుమారై సామీర, మూడేళ్ల కుమారుడు బషీర్ ఉన్నారు. -
అటవీ ప్రాంతంలో తనిఖీలు
సీతారామపురం : మండలంలోని దేవమ్మ చెరువు బీట్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గుంటూరు స్పెషల్ బ్రాంచి స్కా ్వడ్ ఆదివారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ నాగేంద్రం అడవుల నుంచి అక్రమంగా ఎర్రచందనం తరలకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అటవీ సంపద తరలకుండా నిరంతరం అడవుల్లో సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు అటవీ సిబ్బందికి సహకరించి అడవులను కాపాడుకోవాలని ఆ ప్రాంత ప్రజలకు సూచించారు. అటవీ సంపద అక్రమంగా తరలుతుంటే వెంటనే సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌ఓలు వంశీకృష్ణ, రాంబాబు, బాలశంకర్, రామ్మోహన్, ఎఫ్‌బీఓలు నసింహారెడ్డి, రాజు, సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు. -
వ్యక్తి దారుణ హత్య
ఉదయగిరి : ఉదయగిరి పంచాయతీ బస్టాండ్ సమీపంలో బాలాజీ వైన్‌షాపు ఆవరణలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేశారు. ఈ సంఘటన పట్టణంలో సంచలనం రేపింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. పట్టణంలో సంతవ్సరం నుంచి నరిసింహులు అనే వ్యక్తి చిత్తు కాగితాలు ఏరుకుంటూ, యాచిస్తూ జీవనం సాగిస్తున్నాడు. యాచించగా వచ్చిన డబ్బుతో మద్యం సేవించాడు. ఈ క్రమంలో సొమవారం రాత్రి మద్యం సేవించి బాలాజీ వైన్‌షాపు ఆవరణలో ఉన్న ఓ బడ్డీ కొట్టు సమీపంలో నిద్రకు ఉపక్రమించాడు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు రెండు గంటల ప్రాంతంలో అక్కడే ఉన్న బడ్డీకొట్టు తాళాలు పగలగొట్టే ప్రయత్నం చేస్తుండగా నరసింహులు పెద్దగా కేకలు వేస్తూ అడ్డుకోబోయాడు. దీంతో వారు నరసింహలు తలపై బలమైన ఆయుధంతో మోదడంతో తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. బడ్డీ కొట్టులోని 20 మద్యం బాటిళ్లు, కొన్ని సిగరెట్ ప్యాకెట్లు, కొంత చిల్లర నగదు తీసుకెళ్లారు. రంగంలోకి క్లూస్ టీం.. రోజులానే బడ్డీకొట్టు యజమాని మంగళవారం వేకువజామున 4.30 గంటలకు కొట్టుకు వచ్చి నరసింహులు మృతదేహం చూసి పోలీసులకు సమాచారమిచ్చాడు. సీఐ ఏవీ రమణ, ఎస్ఐ ఎన్.ప్రభాకర్ సంఘటనస్థలానికి వెళ్లి పరిశీలించారు. క్లూస్‌టీం వేలిముద్రల నమూనాలు సేకరించింది. అనంతరం పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి ఎవరూ బంధువులు లేకపోవడంతో మృతదేహాన్ని పంచాయతీకి అప్పగించారు. ఘటనకు సంబంధించి పోలీసులు కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలం నుంచి తూర్పువైపు ఉన్న ముళ్లపొదల వైపు వెళ్లింది. అక్కడి నుంచి పంచాయతీ బస్టాండు వద్ద ఉన్న ట్యాంక్‌బండ్ నుంచి పెట్రోలు బంకువైపు కొద్దిదూరం వెళ్లింది. అక్కడి నుంచి వెనుతిరిగి సంఘటన స్థలానికి చేరుకుంది. క్లూస్‌టీం అధికారి, ఏఎస్సై రాజు, హాండ్లర్ సుకుమార్, వెంకటేశ్ పాల్గొన్నారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తనిఖీ
ఉదయగిరి: స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని గురువారం జిల్లా ఆడిట్ రిజిస్ట్రార్ పి.ఉషారాణి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా కార్యాలయాన్ని సందర్శించి, వార్షిక తనిఖీ చేపట్టానన్నారు. ఏడాది కాలంగా జరిగిన రిజిస్ట్రేసన్ల డాక్యుమెంట్లు, రికార్డులు పరిశీలించినట్లు తెలిపారు. పెద్ద నోట్ల రద్దుతో జిల్లాలో రిజిస్ట్రేషన్లు తగ్గాయన్నారు. ఆమె వెంట సబ్ రిజిస్ట్రార్ శ్రీరామమూర్తి ఉన్నారు. -
విద్యుదాఘాతానికి యువకుడి మృతి
వరికుంటపాడు : విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని విరువూరులో ఆలస్యంగా బుధవారం వెలుగు చూసింది. పోలీసుల సమాచారం మేరకు.. మండలంలోని కృష్ణంరాజుపల్లికి చెందిన డి.వెంకటనారాయణ (30) విరువూరులోని వాటర్ ప్లాంట్‌లో పనిచేసే తన సమీప బంధువు దగ్గరకు మంగళవారం ఉదయం వెళ్లాడు. అక్కడ సెల్‌చార్జింగ్ పెడుతున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ సంఘటన ఉదయం జరిగినప్పటికీ రాత్రి బాగా పొద్దుపోయే వరకు బయటకు పొక్కలేదు. రాత్రికి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ ముత్యాలరాజు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. బుధవారం ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతిపై అనుమానాలు వెంకటనారాయణ మృతిపై రకరకాల అనుమానాలు వినిపిస్తున్నాయి. విద్యుత్ షాక్‌తో మృతి చెందలేదని, ఉద్దేశ పూర్వకంగా చంపి విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లుగా చిత్రీకరిస్తున్నారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ షాక్ అయితే తగిలిన ప్రాంతంలోనే గాయాలు ఉండాలి తప్ప తలపై బలమైన గాయం ఉండటంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శరీరంపై కూడా కొన్నిచోట్ల కొట్టిన దెబ్బలున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సాక్షి ఎస్ఐ ముత్యాలరాజు దృష్టికి తీసుకురాగా విద్యుదాఘాతంతోనే మృతి చెందాడని తెలిపారు. అనుమానించాల్సిన అంశం ఏమీ మా దృష్టికి రాలేదన్నారు. తొలుత పోస్టుమార్టం వద్దని బంధువులు చెప్పినప్పటికీ, ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున పోస్టుమార్టం నిర్వహించామని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కలిగిరి: కలిగిరిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మంగళవారం ఆర్టీసీబస్సు, బైకు ఢీ కొన్న సంఘటనలో ఎస్థానిబాషా (19) అనే యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం మేరక.. కలిగిరికి చెందిన ఎస్థానిబాషా, వీరారెడ్డిపాలెంకు చెందిన స్నేహితుడు మనోజ్ ఇద్దరూ హసనాపురంలో ఐటీఐ కాలేజికి వెళుతున్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గేదెలను తప్పించబోయి ఉదయగిరికి వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న ఎస్తానీబాషా తీవ్రంగా గాయపడగా.. మనోజ్‌కు కూడా గాయాలయ్యాయి. బాషా పరిస్థితి విషమంగా ఉండటంతో అతనిని నెల్లూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. సాయంత్రం చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. బస్సు డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే పోలిస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు నమోదు చేసుకున్నారు. -
వినియోగదారులకు మెరుగైన సేవలే లక్ష్యం
బీఎస్ఎన్ఎల్ జిల్లా ప్రిన్సిపల్ జనరల్ మేనేజరు రవిబాబు ఉదయగిరి: జిల్లాలోని బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్నామని బీఎస్ఎన్ఎల్ జిల్లా ప్రిన్సిపల్ జనరల్ మేనేజరు రవిబాబు పేర్కొన్నారు. ఉదయగిరి బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం వినియోగదారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి పరిధిలో 9 ఎక్స్ఛేంజ్ కార్యాలయాలతో పాటు 16 టవర్లు ఉన్నాయన్నారు. త్వరలో ఉదయగిరి మండలం దాసరపల్లి, బండగానిపల్లి, వరికుంటపాడు మండలం విరువూరులో టవర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రైవేటు కంపెనీలకు దీటుగా బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించిందన్నారు. కేవలం రూ.49కే ల్యాండ్‌లైన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. రూ.249, రూ.470, రూ.1149 ప్యాకేజీల్లో బ్రాడ్‌బ్యాండ్‌తో పాటు అన్లిమిటెడ్ డేటా, ఉచిత ఫోన్‌కాల్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులు తమ సమస్యలను పీజీఎం దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎం ప్రభాకర్, కావలి డీఈఈ ఇజ్రాయేలు, సబ్‌డివిజనల్ ఇంజినీరు సురేష్, తదితరులు ఉన్నారు. -
కాలువలోకి దూసుకెళ్లిన మినీ లారీ
క్యాబిన్లో చిక్కుకుని డ్రైవర్ దుర్మరణం దుత్తలూరు : టమాటా లోడ్‌తో ప్రకాశం జిల్లా దర్శికి వెళ్తున్న మినీ లారీకి అడ్డుగా పంది రావడంతో అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయి డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం తెల్లవారు జామున దుత్తలూరు ఏఏ కాలనీ సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల కథనం మేరకు.. అనంతపురం నుంచి ప్రకాశం జిల్లా దర్శికి టమాటా లోడ్‌తో మినీ లారీ వెళ్తుంది. వాహనంలో డ్రైవర్‌తో పాటు ఓనర్ కుమారుడు మాదాసు సుధాకర్, క్లీనర్ యర్రంశెట్టి వెంకటరామయ్య ఉన్నారు. దుత్తలూరు ఏఏ కాలనీ సమీపంలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో రోడ్డుకు అడ్డంగా అడవి పంది అడ్డు రావడంతో తప్పించబోయి రోడ్డు పక్కన కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో వాహనం ముందు భాగం దెబ్బతింది. వాహనం కుడివైపు భాగం నేలకు బలంగా ఆనుకోవడంతో డ్రైవర్ నందిగం చంద్రయ్య(42) క్యాబిన్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. టమాటా బాక్సులు చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న దుత్తలూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తరలించారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉరేసుకుని పుణే వాసి ఆత్మహత్య
జలదంకి : చెట్టుకు ఉరేసుకుని మహారాష్ట్రలోని పుణే జిల్లా వాగోలి తాలూకా తుకారాం నగర్‌కు చెందిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని జమ్మలపాళెం పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. రాజు లక్ష్మణ్ యాదవ్ (33) జమ్మలపాళెం సమీపంలోని చింతచెట్టుకు ఉరేసుకుని ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. జలదంకి ఎస్సై అంజిరెడ్డి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. చెట్టుకు దాదాపు 10 అడుగుల ఎత్తులో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని చెట్టుపై నుంచి కిందకు దించి మృతుడి వద్ద ఆధారాలు కోసం పరిశీలించారు. మృతుడి జేబులో ఉన్న ఆధార్‌కార్డు ఆధారంగా మహారాష్ట్రకు చెందిన లక్ష్మణ్యాదవ్గా గుర్తించారు. అయితే మృతుడు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చాడు. ఇక్కడ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు మహారాష్ట్ర పోలీసులకు తెలిజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి
మృతదేహంతో పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయింపు ఉద్రిక్తత పరిస్థితి ఉదయగిరి : విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని దేకూరుపల్లిలో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని దేకూరుపల్లికి చెందిన గోపిదేశి వెంకటరమణయ్య (30) ఉదయం ఎద్దులను మేత కోసం తోలుకోని గ్రామ సమీపంలో ఉన్న తమ పొలం వద్దకు వెళ్లాడు. పొలంలో పనిచేసుకుంటుండగా, ఎద్దులు పక్కనే ఉన్న పైరును మేస్తుండటంతో వాటిని తోలేందుకు పరుగెత్తుతుండగా అదే పొలంలో తాత్కాలిక కర్రల మీద ఏర్పాటు చేసిన విద్యుత్‌తీగలు తగిలి షాక్‌కు గురయ్యాడు. గ్రామ ఎస్సీ కాలనీ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ నుంచి కిలో మీటరు దూరం వ్యవసాయ పొలాల్లో ఉండగా కర్రల ఆధారంగా సిద్దు నారాయణరెడ్డి, కారుమంచి రసూల్ తమ పొలాల వద్దకు ఏర్పాటు చేసుకున్నారు. ఈ వైర్లు మృతుడి పొలం వద్ద కర్రల మీద నుంచి కిందికి పడిపోయాయి. గమనించని వెంకట రమణయ్య షాక్ తగిలి మృతి చెందారు. నారాయణరెడ్డి, రసూల్ చర్యల వల్లే వెంకట రమణయ్య మృతి చెందాడని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు స్టేషన్ బయట బైఠాయించారు. ఈ క్రమంలో సాయంత్రం 6 గంటల సమయంలో మృతుడి బంధువులకు, ఈ ప్రమాదానికి కారకులుగా ఆరోపిస్తున్న వ్యక్తుల బంధువుల మధ్య మాటామాటా పెరిగి తోపులాటకు దారితీసింది. కొంతమంది పెద్దలు సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. వైద్యులు సంధానిబాషా పోస్టుమార్టం నిర్వహించారు. -
జేసీబీ కింద పడి యువకుడి మృతి
దుత్తలూరు : జేసీబీకి మరమ్మతులు చేస్తున్న ఓ యువకుడు అదే జేసీబీ కింద పడి మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం దుత్తలూరు సెంటర్ సమీపంలో జరిగింది. ఆత్మకూరు మండలం కరటంపాడుకు చెందిన హరీష్ (25) అనే యువకుడు నర్రవాడలో జేసీబీ ఆపరేటర్‌గా నాలుగు నెలల క్రితం చేరాడు. బుధవారం దుత్తలూరు–వింజమూరు మార్గంలోని మూతబడిన పెట్రోల్ బంక్ వద్ద జేసీబీని నిలిపి కిందవైపు మరమ్మతులు చేస్తున్నాడు. అయితే జేసీబీని ఆపరేట్ చేసే గేర్ లివర్లను లాక్ చేయడం మరిచాడు. మరమ్మతులు చేస్తుండగా అటుగా ఆడుకుంటున్న పిల్లలు పొరపాటున వాటిని తగలడంతో జేసీబీ ముందు భాగంలోని తొట్టెవంటి భాగంలో ఇరుక్కుపోయాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం వింజమూరు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు ఆందలేదు. -
పోలీసుల సమక్షంలో ప్రేమజంటకు వివాహం
సీతారామపురం : మండలంలోని చిన్నాగంపల్లి చెందిన అగ్నిగుండాల ఖాజమ్మ, సీఎస్‌పురం మండలం ఆనికేపల్లికి చెందిన హనుమంతు రమేష్‌కు శుక్రవారం ఇరువర్గాల పెద్దల సమక్షంలో స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో పోలీసులు వివాహం జరిపించారు. ఖాజమ్మ, రమేష్ ఇద్దరు చెన్నైలోని పెయింగ్ గెస్ట్‌హౌస్‌లో పని చేస్తుండగా ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని తల్లిదండ్రులకు విషయం వివరించారు. ఖాజమ్మ కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించగా, రమేష్ తన కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరు మేజర్లు అయినందున ఇరువర్గాల పెద్దలకు కౌన్సెలింగ్ నిర్వహించి హిందూ సంప్రదాయం ప్రకారం వారికి వివాహం జరిపించినట్లు పోలీసులు అన్నారు. -
ట్రాక్టరును ఢీకొన్న బైక్
ఇద్దరు యువకుల దుర్మరణం న్యాయం చేయాలని బంధువుల రాస్తారోకో వరికుంటపాడు : మితిమీరిన వేగంతో పక్క రోడ్డులో నుంచి మెయిన్‌రోడ్డుపైకి ట్రాక్టర్ రావడంతో ఓ బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈసంఘటన మండలంలోని రామాపురం సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి మజరా బ్రాహ్మణపల్లికి చెందిన సయ్యద్ బాజీ (23), ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన సయ్యద్ హన్నన్ (23) పామూరు నుంచి బైక్‌పై వరికుంటపాడు తహసీల్దార్ కార్యాలయానికి ధ్రువీకరణ పత్రాల కోసం వెళ్లారు. తిరిగి పామూరుకు వెళ్తుండగా రామాపురం వద్దకు వచ్చే సరికి పక్కరోడ్డులో నుంచి ఒక్కసారిగా ట్రాక్టర్ మెయిన్‌రోడ్డుపైకి వచ్చింది. దీంతో బైక్ అదుపు చేయలేకపోవడంతో ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇద్దరు మృతుల కుటుంబాలు పదిహేనేళ్లుగా పామూరులో ఉంటున్నారు. ఇటీవల బాజీ టీటీసీ పూర్తి చేసి డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్న అతనిపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్న మృతితో ఆవిరయ్యాయి. హన్నన్ బాజీకి మేనమామ కొడుకు. రోడ్డు ప్రమాదంలో ఎదిగివచ్చిన ఇద్దరు బిడ్డలు మృతి చెందటంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. హన్నన్ బెంగళూరులోని ఓ మొబైల్ షాపులో పని చేస్తున్నాడు. బక్రీద్ పండగ కోసం ఇంటికొచ్చాడు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన పలువురు బంధువులు, స్నేహితులు సంఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలను చూసి గుండెలవిసేలా రోదించడం పలువురిని కలిచివేసింది. విషయం తెలుసుకున్న ఎస్సై నాగార్జున తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. న్యాయం చేయాలని జాతీయ రహదారిపై రాస్తారోకో ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని బంధువులు, కుటుంబ సభ్యులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు బాధిత కుటుంబాలు ఆందోళన చేపట్టడంతో ఇరువైపు వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాసరావు, ఎస్సై నాగార్జున సిబ్బందితో అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. -
వైద్యం అందక చిన్నారి మృతి
సీతారామపురం : మండలంలోని అంకిరెడ్డిపల్లికి చెందిన గొల్లపల్లి దావీదు, నిర్మల దంపతుల ఏడాది చిన్నారికి సకాలంలో వైద్యం అందక శనివారం మృతి చెందింది. చిన్నారి న్యూమోనియా కారణంగా శనివారం అస్వస్థకు గురైంది. ఊపిరి ఆడకపోవడంతో ఉదయగిరిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కyì ఆక్సిజన్ లేకపోవడంతో సంబంధిత వైద్యులు వింజమూరు వెళ్లాల్సిదింగా తల్లిదండ్రులకు తెలిపారు. ఉదయగిరి నుంచి 108 వాహనానికి సమాచారం అందించినా వారు ఎంత సేపటికీ స్పందించపోవడంతో ప్రైవేట్ వాహనంలో వింజమూరుకు తరలించారు. ఆసుపత్రికి చేరిన కొద్ది సేపటికే పాప మృతి చెందింది. ఆక్సిజన్ అందటం ఆలస్యం జరగడం వల్లనే పాప మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పాప తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మారుమూల తమ ప్రాంతంలో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడం వలనే తమ పాప మృతి చెందిందని వాపోయారు. వైద్యం కోసం 50 కిలో మీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితుల్లోనే పాప మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
బస్సు బోల్తా: ఆరుగురికి గాయాలు
ఉదయగిరి (నెల్లూరు జిల్లా) : ఉదయగిరి మండలం సర్వరాబాద్ దగ్గర గురువారం మధ్యాహ్నం ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. బస్సు సీతారామపురం నుంచి ఉదయగిరి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాధవ రెడ్డి అనే ప్రయాణికుడి కాలు విరగడంతో అతణ్ని నెల్లూరుకు తరలించారు. -
రైతు ఆత్మహత్యాయత్నం
ఉదయగిరి (నెల్లూరు జిల్లా) : కొండాపురం మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. అడంగల్‌లో తనకున్న పొలం వివరాలు నమోదు చేయనందుకు మనస్తాపం చెంది పురుగుల మందు తాగాడు. పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో కావలి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు తూర్పు ఎర్రవెళ్లి గ్రామానికి చెందిన కొండారెడ్డిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
60 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
-
60 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ఉదయగిరి: నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో కుర్రంపల్లి శివారులో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. ఆదివారం అర్ధరాత్రి పోలీసులు, అటవీ అధికారులు పక్కా సమాచారం మేరకు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఆటోలో తరలిస్తున్న 60 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనాన్ని తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. -
రద్దుకానున్న పాసుపుస్తకం..?
ఇబ్బందులు తప్పవని పలువురి అభిప్రాయం ఉదయగిరి: రెవెన్యూ వ్యవస్థలో అవినీతి పెరుగుతోందని, దీనిని నివారించేందుకు పాస్ పుస్తకం రద్దు ఒక్కటే మార్గమని ప్రస్తుత ప్రభుత్వం పాస్‌పుస్తకం, టైటిల్‌డీడ్‌ను రద్దుచేసేందుకు చేస్తున్న కసరత్తు అసలుకే ముప్పుగా పరిణమించే పరిస్థితి నెలకొంది. రెవెన్యూలో అవినీతిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోకుండా ఇలాంటి చర్యలు చేపట్టడం ఏమిటని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఎలుక పడితే ఇంటికే నిప్పు పెట్టుకున్న చందంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆక్షేపిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కేవీ క్రిష్ణమూర్తి రాష్ట్రంలోని 13 జిల్లాల జాయింట్ కలెక్టర్లతో సమావేశం ఏర్పాటుచేసి పాస్‌పుస్తకాలు, టైటిల్డీడ్లను రద్దుచేసే యోచన విషయమై సుదీర్ఘంగా చర్చించారు. రెవెన్యూలో ప్రతి చిన్న పనికి పెద్ద మొత్తంలో లంచాలు పిండేస్తూ కార్యార్థుల్ని ఇబ్బందిపెడుతున్నందున అతి ముఖ్యమైన పట్టాదారు పాస్‌పుస్తకాల జారీనే రద్దుచేసేందుకు ప్రభుత్వం యోచిస్తుందని తెలియజేశారు. దీనిని వీలైనంత త్వరగా అమలులోకి తేవాలని కూడా ఆయన సూచించారు. పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్డీడ్లు రద్దుచేసి ‘మనభూమి’ వెబ్సైట్లో ఉండే భూమి హక్కుదారులకు టెన్-1, అడంగళ్ కాపీలు ఆధారంగా బ్యాంకులో రుణాలు ఇప్పిస్తామని తెలియజేశారు. ఇంతవరకు బాగానేవున్నా దీంతో తలెత్తే సమస్యలపై మాత్రం సమావేశంలో చర్చించలేదు. మంత్రి చెప్పిన మాటలనే తాపీగా విన్న జాయింట్ కలెక్టర్లు తాపీగా సమావేశం నుంచి వచ్చేశారు. పొంచిఉన్న ప్రమాదం: ప్రభుత్వం మనభూమి వెబ్సైట్లో భూమి హక్కుదారుల పేర్లు ఉంటాయి. వాటి ఆధారంగా రెవెన్యూకు ఎలాంటి సంబంధం లేకుండా హక్కు పత్రాలను పొందవచ్చని చెబుతోంది. దీంతో అధికారులకు లంచం ఇవ్వవలసిన అవసరం ఉండదనేది ప్రభుత్వం వాదన. మనభూమి వెబ్సైట్లో భూమి హక్కుదారులపేర్లు లేకుంటే ఒకసారి నమోదు చేసుకుంటే సరిపోతుందని ప్రభుత్వ పెద్దల యోచన. అయితే ఆచరణలో ఇది అనుకున్నంత తేలిక కాదని అటు అధికారులు, ఇటు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ వెబ్సైట్లో పేర్లను తారుమారు చేయడం పెద్ద సమస్యేమీ కాదని అధికారులే చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న విధానంలో పట్టాదారు పాస్‌పుస్తకం, టైటిల్డీడ్తో పాటు మీసేవలో టెన్-1, అడంగళ్ హక్కుదారుడుకు ఉంటాయి. కొత్త విధానంలో కేవలం అడంగళ్, టెన్-1 మాత్రమే ఉంటాయి. ఈరోజు ఒక సర్వే నంబరుకు సంబంధించి ఒకరి పేరుంటే మరుసటి రోజు అదే సర్వే నంబరులో వేరే వారి పేరు ఉండే అవకాశముంది. అప్పుడు భూసమస్య ఏర్పడి శాంతిభద్రతలకు విఘాతం కలగవచ్చు. పైగా మీసేవలో ప్రైవేటు వ్యక్తులు ఆపరేటర్లుగా ఉండటంతో పేర్లు తారుమారు పెద్ద సమస్య కాదని అధికారులే చెబుతున్నారు. పైగా ప్రభుత్వ భూమికి కూడా టెన్-1 అడంగళ్ పొందే అవకాశం ఉంది. దీని ఆధారంగా కూడా బ్యాంకులు రుణాలు తీసుకునే అవకాశముంది. ప్రస్తుత విధానంలో రెవెన్యూలో ఏ అధికారీ బాధ్యులుగా ఉండే అవకాశం లేకపోవడంతో భూసమస్యలు ఎక్కువగా తలెత్తుతాయని ఓ ఆర్డీవో వ్యాఖ్యానించడం విశేషం. ఇంతటి ప్రాధాన్యత గల వ్యవహారంలో ప్రభుత్వం పిల్లచేష్టలుగా వ్యవహరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తమ్మీద ప్రభుత్వం టైటిల్‌డీడ్, పాస్‌పుస్తకాల రద్దు యోచనను పునఃసమీక్షించాలని పలువురు అధికారులు, రైతులు కోరుతున్నారు. -
నెల్లూరులో స్వల్ప భూకంపం
నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. దీని ప్రభావానికి అక్కడక్కడా ఇళ్లలోని వస్తువులు కొద్దిగా కదలడంతో పాటు కిందపడ్డాయి. జిల్లాలోని ఉదయగిరి, ఎస్.ఆర్ పురం, వరికుంటపాడు మండలాల్లో ఈ ప్రకంపనలు ఎక్కువగా కనిపించాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. -
రుణమాఫీ ఒక మాయ
రుణమాఫీ ఒక మాయ అని తేలిపోయింది. మూడు విడతలుగా విడుదలైన జాబితాలో తప్పులు దొర్లడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆధార్ ఫీడింగ్ లోపాలతో అనేక మంది రైతుల పేర్లు గల్లంతయ్యాయి. అర్హత ఉన్న రైతులను కూడా అనర్హుల జాబితాలో చేర్చడంపై మండిపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఉదయగిరికి చెందిన చిన్నారెడ్డికి ఎనిమిదెకరాల పొలం ఉంది. పంటల సాగు కోసం రూ.3 లక్షలు రుణం తీసుకున్నాడు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ జాబితాలో రూ.1.50 లక్షల రుణం మాఫీ అయిందని వెబ్సైట్లో పేరుంది. అయితే రైతు సాధికారత సదస్సులో రైతులకు ఇచ్చే పత్రాల జాబితాలో చిన్నారెడ్డి పేరు కనిపించలేదు. మండిపడ్డ రైతాంగం రుణమాఫీ జాబితా తప్పుల తడకగా ఉండడంతో జిల్లాలో సోమవారం జరిగిన రైతు సాధికరత సదస్సులు, బ్యాంకుల వద్ద బాధితులు నిరసనలు తెలియజేశారు. రైతు సాధికారత సదస్సు ఫ్లెక్సీలు, కరపత్రాలను తగలబెట్టారు. ‘మాయ మాటలు చెప్పి మోసం చేయవద్దు. ముందుగా గ్రామం విడిచి వెళ్లండి’ అంటూ అధికారులపై తిరగబడ్డారు. రైతులు నిలదీయడంతో బ్యాంకర్లు, అధికారులు ఒకరిపై ఒకరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. రైతులు అధికారులను నిలదీయడంతో జిల్లాలో జరిగిన రైతు సాధికార సదస్సులు రసాభాసగా మారాయి. ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీల్లో రైతురుణమాఫీ ఒకటి. ఆ హామీని అమలు చేయాలంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు హడావుడిగా ప్రకటన చేశారు. అయితే అమలులో చంద్రబాబు నైజాన్ని ప్రదర్శించారనే ప్రచారం సాగుతోంది. గందరగోళంగా జాబితా రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికి మూడు జాబితాలు విడుదల చేసింది. మొదటి జాబితాలో 1.85 లక్షల మందిని తేల్చారు. వీరికి 20 శాతం చొప్పున రూ.206.22 కోట్లు జమచేస్తున్నట్లు ప్రకటించింది. ఆ నగదును రైతుల ఖాతాల్లో జమచేయలేదు. సదస్సులో రైతులకు పత్రాలు ఇచ్చి సరిపెట్టుకుంటున్నారు. అదేవిధంగా మరో రెండు జాబితాలు విడుదల చేసినప్పటికీ వాటిని బ్యాంకర్లు, అధికారులు బయటపెట్టలేదు. మొదటి జాబితానే గందరగోళంగా ఉండడంతో జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మొదటి జాబితాలో వేలాది మంది అర్హుల పేర్లు గల్లంతయ్యాయి. అందుకు నిరసనగా మనోబోలులో జరిగిన రైతు సాధికారత సదస్సును అడ్డుకున్నారు. మాఫీ జాబితాలో కేవలం వందలాది మంది రైతుల పేర్లు గల్లంతయ్యాయని రైతులు అధికారులను నిలదీశారు. వెయ్యి మందికి పైగా అర్హులు ఉంటే మొక్కుబడిగా కొంతమంది పేర్లు మాత్రమే ఉండటమేంటని ప్రశ్నించారు. దీంతో బ్యాంకర్లు, రెవెన్యూ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆగ్రహించిన రైతులు ఫ్లెక్సీలు, కరపత్రాలను చించివేసి తగులబెట్టారు. కుర్చీలు పడేసి, షామియానా కిందకు తోసేసి సదస్సును అడ్డుకున్నారు. అదే విధంగా వాకాడు మండలం ముట్టెంబాక గ్రామంలో రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. అదేవిధంగా తిరుమూరు, వాకాడు, నెల్లిపూడి, దుగ్గరాజుపట్నం గ్రామాల్లోనూ రైతులు ఆందోళన చేశారు. సీతారాంపురం మండల పరిధిలో గతంలో జరిగిన ఆధార్ ఫీడింగ్‌లో పొరబాట్లు చోటు చేసుకోవడంతో రంగనాయుడుపల్లి, నెమళ్లదిన్నె, బెడుసుపల్లి, సింగారెడ్డిపల్లి, సంగసానిపల్లి, గంగవరం గ్రామాలకు చెందిన వందలాది మంది అర్హులైన రైతులను అనర్హులుగా గుర్తించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండాపురం మండలం ఎర్రబల్లి యూనియన్ బ్యాంక్ వద్ద రైతులు ధర్నా చేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా రైతులు ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను మోసం చేశారంటూ మండిపడ్డారు. -
అమ్మకానికి ఉదయగిరి
⇒ సూత్రధారులు రెవెన్యూ అధికారులు ⇒ పాత్రధారులు తెలుగు తమ్ముళ్లు ⇒ యథేచ్ఛగా ఇళ్ల స్థలాల ఆక్రమణ ఉదయగిరి: ఉదయగిరిలో యథేచ్ఛగా భూఆక్రమణలు, దందాలు సాగుతున్నాయి. దీనికి కొందరు రెవెన్యూ అధికారులు సూత్రధారులు కాగా తెలుగుతమ్ముళ్లు పాత్రధారులుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు రెవెన్యూ అధికారుల సహకారంతో అక్కడ కొందరు తెలుగుతమ్ముళ్లు పాగా వేసి ప్లాట్లు వేసి అమ్మకాలు సాగిస్తూ లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. దీంతో పేదలకు జానెడు స్థలం దొరకని దుస్థితి నెలకుంది. ఇంటి స్థలాల కోసం రెవెన్యూ అధికారులు చుట్టూ పేదలు తిరుగుతున్నా ఎలాంటి ఫలితం కానరావడం లేదు. సీఎంగా కిరణ్ ఉన్నప్పుడు సాగిస్తున్న ఈ దందా చంద్రబాబు వచ్చేసరికి తారాస్థాయికి చేరింది. తమకు అండగా నిలుస్తున్న అధికారులకు అక్రమార్కులు భారీగా ముడుపులు ముట్టచెబుతున్నారనే ప్రచారం బలంగా ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం కాకమునుపు ఉదయగిరిలో ప్రభుత్వ భూములకు పెద్దగా విలువ లేదు. కనీసం ఇల్లు కట్టుకునేందుకు కూడా ఆసక్తి చూపేవారు కాదు. ఉదయగిరి దుర్గాన్ని రాజులు ఏలిన ప్రాంతం కావడంతో ఇక్కడ ఇళ్ల స్థలాలకు పట్టాలు లేవు. కొందరు ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్నారు. చాలా వరకు ప్రభుత్వ స్థలాలు అట్లే ఉండిపోయాయి. గత ఆరేడేళ్ల నుంచి ఉదయగిరి పట్టణం క్రమంగా అభివృద్ధి పథంలో పయనించడంతో చుట్టుపక్కల గ్రామీణులు ఇక్కడే ఇళ్లు కట్టుకోవడం ప్రారంభించారు. దీంతో ఇళ్ల స్థలాలకు డిమాండ్ ఏర్పడి ధరలు పెరిగాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు రాజకీయ అండదండలతో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని ప్లాట్లగా విభజించి అమ్మడం ప్రారంభించారు. గతంలో తహశీల్దారుగా పనిచేసిన నారాయణమ్మ ఆక్రమిత స్థలాలను గుర్తించి ప్రభుత్వ స్వాధీనం చేసింది. రెండేళ్లుగా ఇక్కడికి వచ్చిన కొంతమంది తహశీల్దార్లు ప్రభుత్వ స్థలాలను అమ్మకానికి పెట్టారు. పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకొని రికార్డులు తారు మారు చేస్తూ ఆక్రమణదారులకు సహాయ సహకారాలు అందిస్తున్నారనే విమర్శలున్నాయి. ఉదయగిరిలోని బీసీ కాలనీ సమీపంలో సర్వే నం.37లో అధికార పార్టీకి చెందిన ఓ నేత బంధువు వారం కొంత స్థలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నంలో భాగంగా చదును చేశాడు. దీనికి గిరాకీ అధికంగా ఉండటంతో కొంతమంది తహశీల్దారుకు ఫిర్యాదు చేశారు. తహశీల్దారు నామమాత్రంగా స్థల పరిశీలన చేసి మిన్నకుండిపోయారు. అలాగే షబ్బీర్ కాలనీ ప్రాంతంలో ఇటీవల లేఔట్లు వేసిన కొంతమంది నేతలు పక్కనే ఉన్న శ్మశానాన్ని ఆక్రమించి ప్లాట్లు వేసుకునేందుకు కొంత చదును చేశారు. స్థానికులు అభ్యంతరం తెలపడంతో ప్రస్తుతానికి నిలిపివేశారు. ఉదయగిరి-కావలి రోడ్డు మార్గంలో సుమారు రూ.50 లక్షల విలువచేసే ఇళ్ల స్థలాలను కొంతమంది నేతలు ఆక్రమించి అమ్మేశారు. మరికొంత స్థలాన్ని కూడా ఆక్రమించేందుకు పావులు కదుపుతున్నారు. టూరిజం బంగ్లా సమీపంలో గతంలో ఇచ్చిన ప్లాట్లను జాయింట్ కలెక్టర్ సౌరభ్‌గౌర్ రద్దుచేసి దానిని టూరిజం కోసం ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేశారు. అయినా కొంతమంది అధికార పార్టీ నేతలు ఆ స్థలాన్ని ఖాళీ చేయకుండా వివిధ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. ఎక్కువ ఖరీదు చేసే ఈ స్థలాలు కూడా అమ్మకాలు జరిగాయి. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైంది. ఇక్కడ దర్జాగా ఇళ్లు వెలిశాయి. ఇక్కడే ఉన్న మరికొంత ప్రభుత్వ స్థలాలను అధికార నేతలకు కట్టబెట్టేందుకు రెవెన్యూ అధికారులు అవగాహనకు వచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులకు పెద్దమొత్తంలో చేతులు మారినట్టు విమర్శలున్నాయి. అలాగే మోడల్‌కాలనీ పేరుతో గతంలో ఉదయగిరికి చెందిన కొంతమంది పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయగా, ఇళ్లు కట్టుకోలేదన్న ఉద్దేశంతో రెవెన్యూ అధికారులు వాటిని రద్దుచేశారు. ఈ స్థలంలో కొంతమేర కొందరు ఆక్రమించుకొని ఫెన్సింగ్ వేసుకున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు నోరు మెదపడం లేదు. ఈ విధంగా ఉదయగిరి పట్టణంలోని ఇళ్ల మధ్య ప్రభుత్వ స్థలాలు యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతూనే ఉన్నాయి. ఈ వ్యవహారంపై అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు వస్తున్నాయనే ప్రచారం కూడా సాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికావడంపై పట్టణవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి ఆక్రమణ స్థలాలపై సమగ్ర విచారణ జరిపితే కోట్లు విలువైన ప్రభుత్వ స్థలాలు ఆక్రమణదారుల నుంచి విముక్తి అవుతాయని పట్టణవాసులు ఆశిస్తున్నారు. -
‘అంగన్వాడీ’ల్లో పౌష్టికాహారం పక్కదారి
ఉదయగిరి: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు అందాల్సిన పౌష్టికాహారం పక్కదారి పడుతోంది. పేదలు ఉపయోగించే ఈ ఆహారం పక్కదారి పట్టించడంలో ఆ శాఖ సిబ్బంది, అధికారుల పాత్ర ఉందనే విమర్శలున్నాయి. కార్యకర్తల నుంచి కొంతమంది సూపర్వైజర్లు అందినకాడికి దండుకుని నల్లబజారుకు తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మామూళ్లు, సరుకులు ఇవ్వని కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్నారు. దీనికితోడు అంగన్వాడీ కేంద్రం అద్దె, కట్టెల, అమృతహస్తం, రవాణాభత్యం బిల్లుల్లోకూడా అంగన్వాడీల నుంచి కమీషన్లు వసూలుచేస్తున్నారు. కేవలం అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే సరుకుల ద్వారానే స్వాహాచేస్తున్న సొమ్ము నెలకు కోటిరూపాయలకు పైగా ఉందంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో 3,774 అంగన్వాడీ కేంద్రాల్లో 3,400 మంది కార్యకర్తలు పని చేస్తున్నారు. వారితోపాటు మరో 3,100మంది ఆయాలు ఉన్నారు. ఈ అంగన్వాడీల పరిధిలో 2.27 లక్షల మంది పిల్లలు, 26 వేలమంది బాలింతలు, మరో 28,500 మంది గర్భిణులున్నారు. వీరికి ప్రభుత్వం పౌష్టికాహారంతోపాటు, పాలు, గుడ్డు, బియ్యం, పప్పుదినుసులు అందజేస్తోంది. కొన్ని కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. అంగన్వాడీలకు వెళ్లే చిన్నారులకు పప్పుతో కూడిన అన్నం, కోడిగుడ్డు అందిస్తున్నారు. సాయంత్రం అల్పాహారంగా గుగ్గిళ్లు, వడియాలు పెడుతున్నారు. సూపర్వైజర్లను పర్యవేక్షకులుగా ప్రభుత్వం నియమించింది. వీరిలో కొంతమంది సూపర్వైజర్లు అవినీతికి పాల్పడుతూ అంగన్వాడీల నుంచి పప్పు, బియ్యం, కోడిగుడ్లు, నూనె, పౌష్టికాహారం తీసుకుని నల్ల బజార్లకు తరలిస్తూ పెద్ద మొత్తంలో గడిస్తున్నారు. పైగా ఈ అవినీతి సొమ్ము తమకు ఒక్కరికే కాదని కింది స్థాయి నుంచి జిల్లా స్థాయివరకు అందించాలని బుకాయిస్తున్నారు. బిల్లుల్లోనూ స్వాహా.. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు రవాణాభత్యం, కేంద్రాల అద్దె, వంటచెరకు బిల్లులకు సంబంధించి అధికారులు కమీషన్లు వసూలు చేస్తున్నారు. ఒక్క జీతంలో తప్ప మిగతా అన్నింటిలోను వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇదేమిటని అడిగిన కార్యకర్తలపై వేధింపులకు పాల్పడుతున్నారు. వీటితోపాటు అమృతహస్తం పథకం కోసం ఇచ్చే కూరగాయలు, పాలబిల్లుల్లో కూడా తమకు కమీషన్లు ఇవ్వాలని కొంత మంది సూపర్వైజర్లు పట్టుబడుతున్నారు. దీనిని సహించలేని కొంతమంది కార్యకర్తలు సంబంధిత సూపర్వైజర్లపై పై అధికారులకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఇటీవల వరికుంటపాడు మండలంలోని ఓ సూపర్వైజర్ వసూళ్ల దందాను నిరసిస్తూ నేరుగా ఆ ప్రాజెక్టు సీడీపీఓకు ఫిర్యాదు చేశారు. సరుకులు పక్కదారిపట్టిస్తే చర్యలుతప్పవు చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు అందించే సరుకులు పక్కదారి పట్టించే వారిపై చర్యలు తప్పవు. దీనికి ఎవరు బాధ్యులైనా విచారించి తగు చర్యలు తీసుకుంటాం. వెంకటసుబ్బమ్మ, సీడీపీఓ ఉదయగిరి -
పోలీసుల అదుపులో సిరిగోల్డ్ ఎండీ
ఉదయగిరి: తప్పించుకు తిరుగుతున్న సిరిగోల్డ్ ఎండీ వేల సుందరాన్ని బుధవారం ఉదయగిరిలో పక్కా ప్లాన్‌తో ఆ సంస్థ ఏజెంట్లు, లబ్ధిదారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తిరుపతికి చెందిన వేల సుందరం, సత్యవేడు వాసి సుధాకర్, ఒంగోలు నివాసి వెంకయ్య గతంలో అగ్రిగోల్డ్‌లో పనిచేసేవారు. అనంతరం వీరు విడిపోయి 2007లో సిరిగోల్డ్‌ను స్థాపించారు. అతి తక్కువ కాలంలోనే ఈ సంస్థ జిల్లాలోని కావలి, గూడూరు, ఆత్మకూరుతో పాటు ప్రకాశం జిల్లా పామూరు, అద్దంకి, గిద్దలూరు, ఒంగోలు, చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, తిరుపతి, కడప, విజయవాడ, చెన్నై, గుల్బర్గాల్లో 20కి పైగా బ్రాంచీలు ఏర్పాటు చేసి పది వేలమందికి పైగా ఏజెంట్లను నియమించుకుని రెండు లక్షల మంది ఖాతాదారుల నుంచి రూ.120 కోట్లుపైగా వసూలు చేశారు. పలు జిల్లాలలో ప్లాట్లు, ఇళ్ల స్థలాలు, పొలాలను బినామీ పేర్లపై కొనుగోలు చేశారు. జిల్లాలోని నెర్ధనంపాడులో వంద ఎకరాలు, మర్రిపాడు మండలంలో 20 ఎకరాలు, వాసిలిలో 50 ఎకరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో 300 ఎకరాలకు పైగా కొనుగోలు చేశారు. 2013 నవంబరులో బోర్డు తిప్పేశారు. ఈ వ్యవహారంపై సీబీసీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఎండీ ఎలా పట్టుబడ్డాడంటే.. ఒక్క సీతారామపురంలోనే 12 మంది ఏజెంట్లు రూ.1.20 కోట్లు పైగా సేకరించి సిరిగోల్డ్‌లో పెట్టుబడిగా పెట్టారు. సంస్థ మూసివేయడంతో లబ్ధిదారులంతా ఏజెంట్లపై ఒత్తిడి తెచ్చారు. ఎండీ కోసం సీతారామపురం ఏజెంట్లు ఏడాదికిపైగా కాపుకాస్తున్నారు. నెర్ధనంపాడుకు చెందిన భూములను అమ్మకానికి పెట్టారని, రిజిస్ట్రేషన్ చేసేందుకు సిరిగోల్డ్ ఎండీ సుందరం ఉదయగిరి వస్తున్నారని తెలుసుకున్న ఏజెంట్లు మూడు రోజులుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంగణంలో కాపుకాశారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు దస్తావేజులపై సంతకం చేయించుకునేందుకు ఓ హోటల్లో ఉన్న వేల సుందరం వద్దకు సిబ్బంది తీసుకెళుతుండగా ఏజెంట్లు వెంబడించి వేల సుందరాన్ని పట్టుకున్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు లాక్కొచ్చి పోలీసులకు అప్పగించారు. ఈ విషయమై సీఐకి ఎస్ఐ విజయకుమార్ సమాచారం ఇచ్చారు. వేల సుందరాన్ని సీతారామపురం పోలీసులకు అప్పగించి దర్యాప్తు చేయనున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు పెద్ద సంఖ్యలో ఉదయగిరి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. మూడు రోజలు కాపు కాశాం రోజువారీ పనిచేసుకొని జీవనం సాగించే నేను కమీషన్‌కు ఆశపడి ఏజెంట్‌గా చేరి రూ.4 లక్షలు వసూలుచేసి సిరిగోల్డ్‌లో పెట్టాం. తీరా తిరిగి చెల్లించే సమయానికి బోర్డు తిప్పేయడంతో బాధితులు మాపై ఒత్తిడి పెంచారు. ఎండీ వేల సుందరం కోసం ఏడాదినుంచి తిరుగుతూనే ఉన్నాం. ఉదయగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వస్తాడని తెలుసుకొని మూడు రోజులుగా కాపుకాసి బుధవారం పట్టుకున్నాం. పోలీసులు న్యాయం చేసి మా డబ్బు మాకు ఇప్పించాలి. సుజాత, ఏజెంట్, సీతారామపురం న్యాయం చేయాలి సిరిగోల్డ్‌లో ఏజెంట్‌గా చేరి రూ.20 లక్షల డిపాజిట్లు సేకరించి ఇచ్చాను. సీతారామపురంలో రూ.1.2 కోట్లు సిరిగోల్డ్‌లో డిపాజిట్లు సేకరించాం. ఏడాదిన్నర క్రితం బోర్డు తిప్పేయడంతో మా బతుకులు బజారునపడ్డాయి. ఎండీని పట్టుకునేందుకు అనేక ఇబ్బందులుపడ్డాం. మా డబ్బు మాకు ఇప్పించాలి. వెంకటసుబ్బయ్య, ఏజెంట్, సీతారామపురం -
పోలీసుల అదుపులో సిరిగోల్డ్ ఎండీ
ఉదయగిరి: తప్పించుకు తిరుగుతున్న సిరిగోల్డ్ ఎండీ వేల సుందరాన్ని బుధవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఆ సంస్థ ఏజెంట్లు, లబ్ధిదారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తిరుపతికి చెందిన వేల సుందరం, సత్యవేడు వాసి సుధాకర్, ఒంగోలు నివాసి వెంకయ్య 2007లో సిరిగోల్డ్‌ను స్థాపించారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ కడప, కృష్ణా జిల్లాలతోపాటు, చెన్నై, గుల్బర్గాల్లో 20కి పైగా బ్రాంచీలు, పది వేలమందికి పైగా ఏజెంట్లను పెట్టుకుని రెండు లక్షల మంది ఖాతాదారుల నుంచి రూ.120 కోట్లుపైగా వసూలు చేశారు. ఈ డబ్బుతో బినామీ పేర్లపై ఆస్తులు కూడబెట్టాడు. 2013 నవంబర్‌లో ఈ సంస్థ బోర్డు తిప్పేసింది. కాగా, బుధవారం ఉదయగిరి వచ్చిన సుందరాన్ని బాధితులు పోలీసులకు అప్పగించారు. సిరిగోల్డ్ వ్యవహారంపై ఇప్పటికే సీబీసీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. -
‘బంగారు’ రుణమాఫీపై నీలినీడలు
ఉదయగిరి: రుణమాఫీ పేరుతో సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టి అధికారం దక్కించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు హామీ అమలు విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. రకరకాల షరతుల పేరుతో మాఫీకి తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని రకాల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని చెప్పిన బాబు.. ఇప్పుడు కమిటీల పేరుతో కాలయాపన చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు తీరుకు నిరసనగా రైతులు ఆందోళనలకు సిద్ధమౌతున్నారు. మరోవైపు వ్యవసాయం కోసం బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి తీసుకున్న రుణాల విషయంలో కిరికిరిపెట్టే ప్రయత్నం ఆరంభమైంది. అయితే ఎన్నికల సమయంలో మాత్రం మహిళలు, పురుషులు అనే ప్రస్తావన లేకుండా బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టిన రుణాలన్నింటిని రద్దు చేస్తామని టీడీపీ నేతలు ప్రచారం హోరెత్తించారు. ఇప్పుడు మాత్రం మహిళలు వ్యవసాయం కోసం బంగారం కుదువపెట్టి తీసుకున్న రుణాలు ఎన్ని ఉన్నాయో తేల్చాలని కమిటీకి ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో మహిళ పేరుతో నగలు కుదువపెట్టి తీసుకున్న పంటరుణాలకు మాత్రమే మాఫీని వర్తింపచేసే అవకాశముంద ని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా రైతు కుటుంబాల్లో కుటుంబ యజమానులు మాత్రమే బ్యాంకుల్లో బంగారం కుదువపెట్టి రుణాలు తీసుకుంటారు. మహిళలు తీసుకోవడం చాలా అరుదుగా ఉంటుంది. దీనిని పరిగణలోకి తీసుకొని కిరికిరి చేసే ప్రయత్నం చేస్తున్నారని రైతులు అనుమానిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలల్లోనే రైతు కుటుంబాల మహిళలు ఎక్కువగా కుటుంబ పనుల్లో నిమగ్నమై ఉంటారు. బ్యాంకులకు వెళ్లి బంగారం తనఖాపెట్టి రుణాలు తీసుకునే పరిస్థితి చాలా తక్కువగా ఉంటుంది. ఈ విషయం ప్రభుత్వానికి స్పష్టంగా తెలిసినప్పటికీ.. రుణభారాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి కుతంత్రాలకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలి కేబినెట్ సమావేశంలో బంగారంపై తీసుకున్న పంటు రుణాలను మాఫీ చేయాలని కొంతమంది మంత్రులు పట్టుబట్టగా, మరికొంతమంది దానిని వ్యతిరేకించారు. ఎన్నికల మేనిఫెస్టోలో బంగారంపై తీసుకున్న పంట రుణాలను రద్దుచేస్తామని స్పష్టంగా చెప్పినప్పటికీ...కేబినెట్లో ఈ డ్రామా నడవడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. చంద్రబాబు కూడా ఈ అంశంపై స్పష్టమైన వివరణ ఇవ్వకుండా కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత చూద్దాంలే.. అనే రీతిలో వ్యవహరించడం పలు అనుమానాలకు తావి స్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రూ.1 లక్ష లోపు తీసుకున్న రుణాలను మాఫీ చేయడంతో పాటు బంగారంపై తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తామని శుక్రవారం శాసనసభలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చంద్రబాబు ప్రభుత్వం కమిటీ అంటూ కాలయాపన చేయకుండా మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అన్ని రకాల షరతులు లేని రుణమాఫీని అమలుచేయాలని రైతులు కోరుతున్నారు. -
ఫ్యాన్ ప్రభంజనంలో టీడీపీ, కాంగ్రెస్ గల్లంతు
- రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకుందాం: ఎమ్మెల్యే మేకపాటి జలదంకి, న్యూస్‌లైన్: ఫ్యాన్ ప్రభంజనంలో టీడీపీ, కాంగ్రెస్ గల్లంతు కావడం తథ్యమని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని అన్నవరం, తిమ్మసముద్రం, కేశవరం, చింతలపాళెం, గట్టుపల్లి, 9వ మైలు, చిన్నక్రాక, నాగిరెడ్డిపాళెం, కోదండరామాపురం తదితర గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేకపాటి మాట్లాడుతూ రాజన్న రాజ్యం రావాలంటే అందరం వైఎస్సార్సీపీని గెలిపించుకోవాలన్నారు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ఇప్పుడు ప్రజల మధ్యకు వచ్చి ఆల్‌ఫ్రీ అనే మాయమాటలు చెబుతున్నారన్నారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు కుమ్మక్కై ఆ ప్రభుత్వాన్ని కాపాడారని విమర్శించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారని ధ్వజమెత్తారు. మహానేత వైఎస్సార్ పార్టీలకు అతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో కొలువయ్యారన్నారు. వైఎస్సార్ సువర్ణయుగం జగన్‌తోనే సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. జగన్ సీఎం అయితే వృద్ధులు, వికలాంగులు, రైతులు, మహిళల జీవితాలు మారుతాయన్నారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా తన సోదరుడు రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మేదరమెట్ల వెంకటకృష్ణారెడ్డి, మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి, రావిప్రసాద్, ఎస్వీ శేషారెడ్డి, మేకల మహేశ్వరావు, లేటి సుధీర్, గద్దె బ్రహ్మయ్య, గొట్టిపాటి ప్రసాద్‌నాయుడు, ఇస్కామదన్ మోహన్‌రెడ్డి, వాకా మాధవరెడ్డి, గంగపట్ల మాలకొండయ్య, గుర్రం జగ్గయ్య, పులి మాల్యాద్రి, యడ్ల మాల్యాద్రిరెడ్డి, వట్టికాల బాలయ్య, బీవీ కృష్ణారెడ్డి, వాకా పద్మనాభరెడ్డి పాల్గొన్నారు. -
కరువు కోరల్లో ‘పాడి’
ఉదయగిరి, న్యూస్‌లైన్: జిల్లాలోని మెట్ట ప్రాంతం కరువు కోరల్లో చిక్కుకుంది. పంటలు పూర్తిగా ఎండిపోవడంతో కనీసం పాడితోనైనా జీవనం సాగిద్దామనుకున్న రైతుకు కష్టాలు తప్పడం లేదు. నీటి చుక్క నేలరాలక, పశువులకు పచ్చిగడ్డి కరువైంది. తినడానికి మేత లేక, తాగడానికి నీరు లేక పశువుల పొదుగులు ఎండిపోతున్నాయి. పాల దిగుబడి గణనీయంగా పడిపోయింది. పూటకు ఐదు లీటర్ల పాలిచ్చే గేదె..రెండు లీటర్లు ఇవ్వడం కష్టంగా మారింది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిని పాడిరైతు ఎదుర్కొంటున్నాడు. కళ్ల ముందే గేదెలు నీళ్లు లేక, తిండిలేక శుష్కించిపోతుంటే చూడలేక అందినకాడికి కబేళాలకు అమ్ముకుంటున్నారు. ఎక్కువ ధర పెట్టి కొన్న గేదెల్ని కూడా కాలం కలిసిరాక దళారులు అడిగిన రేటుకు తెగనమ్ముతున్నారు. జిల్లాలో వ్యవసాయం తర్వాత పాడి ఆధారంగానే లక్షలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో పంటలు పండక, పాడిగేదెల ద్వారానే భృతి కొనసాగిస్తున్నారు. గత ఏడాది పాలవెల్లువ రావడంతో కొనే వారు లేక రైతులు నష్టపోయారు. ఈ ఏడాది ఉదయగిరి, ఆత్మకూరు, కావలి నియోజకవర్గంలోని పలు మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. పంటల సంగతి దేవుడెరుగు. కనీసం పశువులు, జీవాలకు కూడా మేత, నీరు లేదు. అనేక గ్రామాల్లో బోర్లలో నీరు పూర్తిగా అడుగంటింది. వాగులు, వంకలు,చెరువులు బోసిపోయాయి. ఈ పరిస్థితుల్లో పశువులకు కష్టాలు మొదలయ్యాయి. వీటిని నమ్ముకున్న పాడి రైతుకు ఇబ్బందులు తప్పలేదు. గణనీయంగా తగ్గిన దిగుబడి జిల్లాలో రోజుకు సగటున 2 లక్షలకుపైగా లీటర్ల పాలను విజయ డెయిరీతో పాటు ప్రైవేటు డెయిరీలు సేకరిస్తాయి. రెండు మూడునెలల నుంచి సేకరణ పడిపోతోంది. ప్రస్తుతం జిల్లాలో లక్ష లీటర్లు మాత్రమే పాల సేకరణ జరుగుతోంది. కరువు కారణంగా రెండు నెలలుగా విజయ డెయిరీకి వచ్చే పాలు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం 25 వేల లీటర్ల స్థాయికి పడిపోయింది. మార్చి, ఏప్రిల్‌లో మరింత దిగజారి పది వేల స్థాయికి పడిపోయే అవకాశం ఉంది. పాల రంగంలో చక్రం తిప్పుతున్న తిరుమల, దొడ్ల, హెరిటేజ్, విష్ణుప్రియ తదితర ప్రైవేటు డెయిరీలకూ కరువు పోటు తప్పలేదు. వీటికీ పాలసేకరణ తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో పాడి రైతుల్ని ఆదుకునేందుకు ముందుకు రావాల్సిన ప్రైవేటు, ప్రభుత్వ డెయిరీ యాజమాన్యాలు తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. -
త్వరలో ప్రజారంజక పాలన
దుత్తలూరు : ఎన్నికల తర్వాత జగన్ నాయకత్వంలో ప్రజారంజక పాలన వస్తుందని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. స్థానిక బీసీకాలనీ సమీపంలోని వైఎస్సార్సీపీ కార్యాలయ ఆవరణలో శనివారం పార్టీ మండల కన్వీనర్ చేజర్ల భాస్కర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహానేత వైఎస్సార్ ప్రజలకు మేలు చేసే ఎన్నో పథకాలను దిగ్విజయంగా అమలు చేయడం వల్లే ఇప్పటికీ ప్రజల గుండెల్లో కొలువయ్యారన్నారు. అలాంటి నాయకత్వ లక్షణా లు ప్రస్తుతం ఒక్క జగన్మోహన్రెడ్డికే ఉన్నాయని చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనకు కారకుడు చంద్రబాబేనన్నారు. బాబు రాష్ట్రాన్ని విభజించమని లేఖ ఇస్తే కాంగ్రెస్ నిరంకుశంగా విభజించిందన్నారు. ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే సమైక్యవాదానికి కట్టుబడి చివరి వరకు పోరాడిందన్నారు. తెలంగాణలో కూడా వైఎస్సార్సీపీ అధిక సీట్లు సాధిస్తుందని జోస్యం చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 10 సీట్లు గెలవడం ఖాయమన్నారు. సర్వేలు కూడా జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని చెబుతున్నాయన్నారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీలు గుప్పించిన జిల్లా మంత్రి నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదన్నారు. పైగా తాను తెచ్చిన నిధులతో ఆనం తనతో పాటు అనుచరుల పేర్లు శిలాఫలకాలపై వేసుకుని ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ప్రొటోకాల్ పాటించడం లేదని దుయ్యబట్టారు. ఒక్క మేకపాటి సోదరుల హయాంలోనే నియోజక వర్గ అభివృద్ధి జరిగిన సంగతి ప్రజలకు తెలుసన్నారు. కార్యక్రమంలో సర్పం చ్‌లు లెక్కల పెదమాలకొండారెడ్డి, వడ్లపల్లి పెంచిలమ్మ, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ టీవీఎస్ రాజా, నాయకులు సూరె రమణారెడ్డి, వాశిపల్లి వెంకటేశ్వరరెడ్డి, తుమ్మల వెంగయ్యచౌదరి, బొగ్యం సుబ్బయ్య, వైస్ సర్పంచ్ మౌలాలి, రవీంద్ర, మాల్యాద్రి, వాయల బాలయ్య, ఉప్పలపాటి రమణారెడ్డి, చెంచురెడ్డి, బాలవెంగళరెడ్డి, నెలకుర్తి రమణయ్య, రంగయ్యనాయుడు, గున్నం కృష్ణారెడ్డి, మహలక్ష్మయ్య పాల్గొన్నారు. అనిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కొండాపురం : జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బండ్లమూడి అనిత కుటుంబాన్ని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి శనివారం నెల్లూరులో పరామర్శించారు. ఇటీవల అనిత తండ్రి కందుల దేవదానం అనారోగ్యంతో మరణించారు. ఈ సందర్భంగా అనిత, ఆమె భర్త బండ్లమూడి మాల్యాద్రిని ఎమ్మెల్యే పరామర్శించారు. ‘న్యూస్‌లైన్’తో మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ అనిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. -
ధాన్యం.. దైన్యం
ప్రస్తుత వ్యవసాయ సీజన్లో అన్నదాతను ఆది నుంచి కష్టాలు వెంటాడుతున్నాయి. అష్టకష్టాలు పడి పండించుకున్న పంటను అమ్ముకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. గత ఏడాదితో పోలిస్తే ధరలు భారీగా తగ్గడం, పెట్టుబడి పెరగడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. ఆదుకుంటాయనుకున్న ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అలంకారప్రాయమయ్యాయి. జిలకర మసూరి రకం ధాన్యం పండించిన రైతుల కష్టాలు మరోలా ఉన్నాయి. ఈ ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించలేదని కొనుగోలు కేంద్రాల సిబ్బంది చెబుతుండటంతో వ్యాపారులు, దళారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. ఉదయగిరి, న్యూస్‌లైన్: ఈ ఏడాది ఉదయగిరి నియోజకవర్గంలో వరి సాగు చేసిన రైతులు అప్పులపాలయ్యారు. కనీసం పెట్టుబడులు కూడా చేతికి రాలేదు. అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచక తలలు పట్టుకుంటున్నారు. విం జమూరు సబ్‌డివిజన్ పరిధిలో సాధారణ వరి విస్తీర్ణం 16 వేల హెక్టార్లు. ఈ ఏడాది 13,500 హెక్టార్లలో వరి సాగు చేశారు. ఇందులో సు మారు ఐదు వేల హెక్టార్లలో వరి ఎండిపోయింది. మిగిలిన సాగులో కూడా దిగుబడి దారుణంగా పడిపోయింది. ఉదయగిరి సబ్‌డివిజన్ పరిధిలో సాధారణ వరి విస్తీర్ణం 5,300 హెక్టార్లు కాగా ప్రస్తుతం 2,500 హెక్టార్లలో సాగైంది. ఇందులో 500 హెక్టార్లలో వరి ఎండిపోయింది. మిగిలిన దాంట్లో కూడా దిగుబడి అంతంత మాత్రమే. పెరిగిన పెట్టుబడులు గత ఏడాది కంటే ఈ ఏడాది పెట్టుబడులు 50 శాతంపైగా పెరిగాయి. గత ఏడాది ఎకరాకు రూ.15 వేలు పెట్టుబడి కాగా, ఈ ఏడాది రూ.25 వేలు దాటింది. పైగా వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటను కాపాడుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి నీరు తెచ్చుకునేందుకు జనరేటర్లు, ఇంజిన్లు, పట్టలు, పైపుల కొనుగోలుకు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇది కూడా రైతులకు భారంగా మారింది. తీరా దిగుబడి చూస్తే షాక్ తగిలినట్టైంది. ఎకరాకు 40 బస్తాలు పైగా దిగుబడి రావాల్సి ఉండగా, కేవలం 20 బస్తాలకే పరిమితమై రైతన్నకు అంతులేని శోకాన్ని మిగిల్చింది. ఐదు నెలలు కష్టించగా నష్టం మాత్రమే చేతికి మిగిలింది. మద్దతు హుళక్కే: ప్రభుత్వం పెరిగిన ఖర్చులు, పెట్టుబడులకు అనుగుణంగా వరి ధాన్యానికి మద్దతు పెంచడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. పెట్టుబ డులు భారీగా పెరుగుతున్నా, మద్దతు ధర మాత్రం ఆ మేరకు పెంచడం లేదు. ఏడాదికి రూ.50 లోపు మాత్రమే క్వింటాలుకు పెంచుతోంది. పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. కర్నాటకలో క్వింటాకు మద్దతు ధర రూ.1600 , మహారాష్ట్రలో రూ.1650 ఉంది. ఇక్కడ మాత్రం రూ.1310 మాత్రమే ఉండటం గమనార్హం. పైగా ఆ రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సాహకంగా క్వింటాకు రూ.100-150 అదనంగా చెల్లిస్తోంది. అలంకారప్రాయంగా కొనుగోలు కేంద్రాలు కోట: అధికారులు ఆర్భాటంగా ప్రారంభిం చిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇంకా బో నీ కాలేదు. కోట మండలంలోని తిన్నెలపూడి,సిద్దవరం, ఊనుగుంటపాళెం సహకార సం ఘాల ఆధ్వర్యంలో గత నెలలోనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అయితే ప్ర భుత్వం ప్రకటించిన ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు ఇటువైపు రావడం లే దు. వ్యాపారులు, దళారులు మాత్రం అదనంగా కొంత మొత్తం చెల్లించి కొనుగోళ్లు జరుపుతున్నారు. మరోవైపు సూపర్‌ఫైన్‌గా పరిగణించే జిలకర మసూరి రకానికి ప్రభుత్వం ఇంకా ధర ప్రకటించ లేదని కొనుగోలు కేం ద్రాల సిబ్బంది చెబుతున్నారు. ఈ క్రమంలో వ్యాపారులు ధర దారుణంగా తగ్గించేశారు. గత సీజన్లో పుట్టి రూ.15 వేలు వరకు పలికిన ఈ రకం ధాన్యాన్ని ప్రస్తుతం రూ.13 వేలు లోపే కొనుగోలు చేస్తుండటంతో రైతులకు నష్టాలు తప్పడం లేదు. తగ్గిన దిగుబడులు వాకాడు: వాకాడు మండలంలో సుమారు 15 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా నీళ్లు చాలక 4 వేల ఎకరాల్లో ఎండిపోయింది. గుంతలు, వాగులు, రొయ్యల చెరువులోని వ్యర్థనీటిని ఆయిల్ ఇంజన్లతో తోడుకుని పంటలు పం డించారు. పంటకు సరిపడా నీళ్లు అందించలేకపోవడంతో దిగుబడి బాగా తగ్గింది. ధాన్యం కూడా తేలికగా మారాయి. ఈ పరిస్థితుల్లో ధాన్యానికి మద్దతు ధర లేకపోవడంతో రైతు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండటంతో దళారులు అడిగిన ధరకే విక్రయించేస్తున్నారు. కొందరు రైతులు మాత్రం ఖర్చులకు ఓర్చి ఆరబెట్టుకుంటున్నారు. పొలాల్లోనే నిల్వ చిల్లకూరు: మార్కెట్లో బియ్యం ధరలు చుక్కలు అంటుతుంటే ధాన్యం ధరలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. తీరప్రాంత గ్రామాలైన బల్లవోలు, వేళ్లపాళెం, కాకువారిపాలెం, కోవూరువారిపాళెంలోని సుమారు 500 ఎకరాల్లో జిలకర మసూరి సాగు చేపట్టారు. అప్పట్లో పుట్టి ధాన్యం ధర రూ.14,500 పలుకుతుండటంతో రైతులు ఉ త్సాహంగా పెట్టుబడులు పెట్టారు. పంట చేతి కొచ్చే సరికి ఈ ధర క్రమేణా దిగజారి ప్రస్తు తం రూ.12,500 చేరుకుంది. ఈ ధరకు విక్రయిస్తే పెట్టుబడి కూడా రాకపోతుండటంతో రైతులు ధాన్యాన్ని పొలాల్లోనే ఆరబెట్టుకుంటున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం లోనైనా అమ్ముకుందామంటే అక్కడ మసూరికి ఇంకా ధర నిర్ణయించలేదనే సమాధానం వస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పం దించి అన్ని రకాల ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని అన్నదాతలు కోరుతున్నారు. దళారులే దిక్కు జలదంకి: మండలంలో వరికోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే బ్రాహ్మణక్రాక, జలదంకిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు ఉపయోగపడటం లేదు. ఈ కేంద్రాల్లో సిబ్బంది ఉండటం లేదు. ఉంటే గోతాలు లేవని చెబుతుండటంతో రైతులు విధిలేని పరిస్థితుల్లో దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా అన్నదాతను దళారులు నిలువునా ముంచేస్తున్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి పుట్టికి రూ.11,433, బీ గ్రేడ్‌కు రూ.11,435 మద్దతు ధర ప్రకటించింది. దళారులు మాత్రం ఈ గ్రేడ్ల పరిధిలోకి వచ్చే ఎంటీయూ 1010, ఎన్‌ఎల్‌ఆర్ 145(స్వర్ణముఖి), ఎన్‌ఎల్‌ఆర్ 30491 (భరణి), నెల్లూరు జిలకర, సన్నాలు తదితర రకాలను రూ.11 వేలకు మించి కొనడం లేదు. మళ్లీ తేమ, తాలు పేరుతో కోత విధిస్తున్నారు. మరోవైపు తూకాల్లో మోసం చేస్తూ బస్తాకు రూ.4 కిలోల వరకు మోసం చేస్తున్నారు. అయినా రైతులకు విధిలేని పరిస్థితుల్లో దళారులే దిక్కవుతున్నారు. ధాన్యం ధర తగ్గించి కొనుగోలు చేస్తే కఠినచర్యలు నెల్లూరు(పొగతోట) : రైస్ మిల్లర్లు, దళారులు రైతుల నుంచి ధర తగ్గించి కొనుగోలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు 150 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటివరకు 103 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన 47 కొనుగోలు కేంద్రాలు వారంలోపు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన మద్దతు ధరలకే ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. సూపర్‌ఫైన్ ధాన్యం (క్వింట) రూ.1500, ఏగ్రేడ్ రూ.1345, సాధరణ రకం ధాన్యం రూ.1315లకు కొనుగోలు చేయాలన్నారు. రైతులకు నష్టం కలిగించే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ధాన్యం తక్కువ ధరలకు కొనుగోలు చేస్తే 80083 01500, 90004 00926 ఫోన్ నంబర్లకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. విధిలేకే: వరికోతలు ప్రారంభమైనా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనడం లేదు. మరోదారి లేక దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. వాళ్లు ఇష్టారాజ్యంగా ధరల్లో తేడాలు చెబుతూ కొనుగోలు చేస్తున్నారు. నష్టాలు తప్పేటట్టు లేవు. - అక్కల శ్రీనివాసులరెడ్డి, రైతు, బ్రాహ్మణక్రాక మద్దతు ధరను పెంచాలి : ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎకరాకు రూ.30 వేల వరకు అప్పు తెచ్చి పెట్టుబడులు పెట్టాం. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం మద్దతు ధరను పెంచాలి. -షేక్ రెండో సుభాన్, రైతు, బీకే అగ్రహారం