ఉదయగిరి ప్రాంతం చుట్టూపక్కల పరిసర ప్రాంతాల్లో గుప్తనిధుల కోసం ఇటీవల కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరుపుతున్నారు.
ఉదయగిరి : ఉదయగిరి ప్రాంతం చుట్టూపక్కల పరిసర ప్రాంతాల్లో గుప్తనిధుల కోసం ఇటీవల కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం
ఉదయగిరికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లుగా తెలిసింది. కొన్నేళ్ల నుంచి ఉదయగిరి కొండపై ఉన్న పురాతన స్థావరాలపై విచ్చలవిడిగా తవ్వకాలు చేస్తున్నారు. గత పది పదిహేను రోజుల నుంచి ఉదయగిరి దుర్గంపై కొంత మంది స్థానికులు, స్థానికేతరులు ముఠాగా ఏర్పడి తవ్వకాలు సాగిస్తున్న విషయం పోలీసులకు సమాచారం అందింది.
దీంతో ఈ వ్యవహారంలో ప్రమేయముందని భావిస్తున్న కొంత మంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల ఆత్మకూరు ప్రాంతంలో అనంతసాగరం చెరువును గుప్తనిధుల కోసం తవ్వుతూ పోలీసులకు పట్టుబడిన వారిలో ఉదయగిరి వాసులు ఉన్నారు.