
సాక్షి, నెల్లూరు: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కళాశాల వద్ద బుధవారం జరిగిన గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ భారతి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. అశ్రునయనాలతో తుది విడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, వైఎస్సార్ సీపీ కార్యకార్తలు స్వర్గీయ గౌతమ్‌రెడ్డికి అంతిమ వీడ్కోలు పలికారు. అభిమాన నేతను కడసారి చేసేందుకు జనం భారీ ఎత్తున తరలి వచ్చారు. దారి పొడవునా పూలు చల్లుతూ గౌతమ్‌రెడ్డికి నివాళులు అర్పించారు.
చదవండి: అశ్రునయనాలతో మంత్రి గౌతమ్‌రెడ్డికి తుది వీడ్కోలు