12:05PM
అశ్రునయనాల మధ్య మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. సీఎం వైఎస్ జగన్, మంత్రులు, కుటుంబ సభ్యులు, వేలాదిగా తరలి వచ్చిన అభిమానుల అశ్రునయనాలతో మంత్రి గౌతమ్‌రెడ్డికి తుది వీడ్కోలు పలికారు.
11:50AM
►మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియల్లో సీఎం వైఎస్ జగన్ దంపతులు పాల్గొన్నారు. అభిమాన నేతను కడసారి చూసేందుకు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు.
11:45AM
►ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజ్ వద్దకు సీఎం జగన్ దంపతులు చేరుకున్నారు.
11:33AM
►మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయగిరి చేరుకున్నారు.
11:00AM
►దివంగత నేత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతక్రియల్లో పాల్గొనేందుకు ఉదయగిరి వెళ్తున్న ముఖ్యమంత్రి
►ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఉదయగిరికి ప్రయాణం అయిన సీఎం
►సీఎంని కడప విమానాశ్రయంలో కలిసిన జిల్లా కలెక్టర్ విజయరామ రాజు, ఎస్పీ అన్బురాజన్
►అంతక్రియల్లో పాల్గొన్న అనంతరం తిరిగి కడపకు రానున్న ముఖ్యమంత్రి
10:53AM
►కడప విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, భారతమ్మ, వైవీ సుబ్బారెడ్డి
10:50AM
►ఉదయగిరి చేరుకున్న మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర
►కాసేపట్లో మేకపాటి ఇంజనీరింగ్ కళాశాల వద్ద గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు
10:00AM
►గన్నవరం నుండి కడప ఎయిర్ పోర్ట్‌కు బయలుదేరారు.
►తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు, వైవీ సుబ్బారెడ్డి
09:50AM
►స్వగ్రామం బ్రాహ్మణపల్లికి చేరుకున్న మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంతిమయాత్ర
►భౌతికకాయాన్ని చూసి కన్నీటి పర్యంతమైన గ్రామస్థులు
►పుష్పాంజలి ఘటించి ఘననివాళులు అర్పించిన గ్రామస్థులు
09:40AM
తాడేపల్లి: సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్ బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ దంపతులు
►ఉదయగిరి ఇంజనీరింగ్ కాలేజీలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొననున్న సీఎం
►గన్నవరం నుంచి కడప ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోనున్న సీఎం
►అక్కడ నుంచి హెలికాఫ్టర్‌లో ఉదయగిరి వెళ్లనున్న సీఎం
09:11AM
►మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంతిమ యాత్ర డీసీ పల్లికి చేరుకుంది.
► మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గౌతమ్‌రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
►జనసంద్రం మధ్య, వందలాది వాహనాలతో అంతిమయాత్ర కొనసాగుతోంది.
►గౌతమ్‌రెడ్డి అంతిమ యాత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు.
08:20AM
►ఆత్మకూరు నెల్లూరు పాలెం సెంటర్ చేరుకొన్న మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంతిమ యాత్ర
►అభిమాన నేత భౌతిక ఖాయాన్ని చూసి కన్నీటి పర్యంతమైన ఆత్మకూరు వాసులు
►పెద్దఎత్తున తరలివచ్చి నివాళులు అర్పించి అంతిమ వీడ్కోలు పలికిన అభిమానులు
07:45AM
►ఆత్మకూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అంతిమయాత్ర
►గ్రామగ్రామాన రోడ్డుపై బారులు తీరి అశ్రునయనాలతో నివాళులు అర్పిస్తున్న అభిమానులు
దారంతా పూలు.. కన్నుల నిండా కన్నీళ్ళు
►మనసుపొరలను చీల్చుకుని అదుముకున్నా ఉబికి వచ్చే కన్నీటి మధ్య అశ్రునయనాలతో నివాళి అర్పిస్తున్న ప్రజలు
►జోహార్ మంత్రి మేకపాటి, మెట్ట ప్రాంత ముద్దుబిడ్డ అమర్ రహే, అన్నా గౌతమన్నా అంటూ నినాదాలు
►దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్రను చివరి జ్ఞాపకంగా తమ సెల్ఫోన్లో బంధించుకుంటున్న యువతీయువకులు
07:25AM
►మంత్రి మేకపాటి తుది సంస్కారానికి ఏర్పాట్లతో పాటు వీడ్కోలు పలకడానికి బైక్ పై భారీ ర్యాలీ నిర్వహిస్తున్న దివంగత మంత్రి మేకపాటి స్నేహితుడు, హితుడు, సహచర మంత్రి అనిల్ కుమార్ యాదవ్
►దివంగత మంత్రి మేకపాటి తరహాలో ఆయన దుస్తులనే ధరించిన మంత్రి మేకపాటి వారసులు కుమార్తె సాయిఅనన్య, కుమారుడు కృష్ణార్జున రెడ్డి
►తడిచిన గుండెతో, తడారని కళ్లతో వీడ్కోలు పలుకుతోన్న దివంగత మంత్రి మేకపాటి కుటుంబ సభ్యులు, కుటుంబ సమానమైన అభిమానులు
07:15AM
►మంత్రి మేకపాటి భౌతికకాయానికి జనసంద్రం మధ్య జరుగుతున్న అంతిమయాత్ర
►అంతిమయాత్రలో పాల్గొన్న మంత్రులు ,ఎమ్మెల్యేలు,ఎంపీలు, రాజకీయ ప్రముఖులు
►మీడియాతో పాటు ఓపెన్ టాప్ ఎక్కి అంతిమ యాత్రలో పాల్గొన్న మంత్రి పేర్ని నాని
►జొన్నవాడ మీదగా బుచ్చిరెడ్డిపాలెం, సంగం, నెల్లూరు పాలెం, బ్రాహ్మణపల్లి, నందిపాడు మీదుగా ఉదయగిరి వరకు కొనసాగనున్న మేకపాటి అంతిమయాత్ర
►వందలాది వాహనాలతో భారీగా కొనసాగుతున్న మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర
06:15AM
సాక్షి, నెల్లూరు: నెల్లూరులోని మేకపాటి నివాసం నుంచి ఉదయం 6 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమైంది. జొన్నవాడ మీదుగా బుచ్చి, సంగం, నెల్లూరుపాళెం, మర్రిపాడు, బద్వేలు సరిహద్దు జాతీయ రహదారి నుంచి బ్రాహ్మణపల్లి, కృష్ణాపురం, నందిపాడు మీదుగా ఉదయగిరికి చేరుకుంటుంది. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ (మెరిట్స్) ఆవరణలో ఉదయం 11.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. గంధపు చెక్కలతో మంత్రి పార్ధివదేహాన్ని దహనం చేస్తారు.
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్, కలెక్టర్ చక్రధర్‌బాబు అక్కడకు చేరుకుని ఏర్పాట్లు పూర్తి చేశారు. అంత్యక్రియలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో హెలిప్యాడ్‌ను పరిశీలించారు. గుంటూరు ఐజీ త్రివిక్రమ్‌వర్మ, ఎస్పీ విజయారావు పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పలువురు ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉన్నందున ఉదయగిరిలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment