PSR Nellore: Minister Mekapati Goutham Reddy Son Arjun Reddy Reached At AP - Sakshi
Sakshi News home page

Mekapati Goutham Reddy Son: తండ్రి భౌతిక కాయాన్ని చూసి కన్నీటి పర్యంతమైన కృష్ణార్జునరెడ్డి

Published Wed, Feb 23 2022 6:39 AM | Last Updated on Wed, Feb 23 2022 5:41 PM

Minister Mekapati Goutham Reddy Son Reached PSR Nellore - Sakshi

Minister Mekapati Goutham Reddy: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి మంగళవారం రాత్రి 11 గంటల తర్వాత నెల్లూరు నగరంలోని నివాసానికి చేరుకున్నారు. అమెరికా నుంచి నేరుగా ఆయన చెన్నై చేరుకుని అక్కడి నుంచి నెల్లూరుకు వచ్చారు. అప్పటికే మంత్రి మేకపాటి భౌతిక కాయాన్ని మంత్రి చాంబర్‌లో ఉంచారు. తన తండ్రి భౌతిక కాయంతో తనను ఏకాంతంగా వదిలేసి అందరూ బయటికెళ్లాలని కృష్ణార్జునరెడ్డి కోరారు. తండ్రి యదపై సున్నితంగా తన చేయితో నిమురుతూ కుమారుడు బోరున విలపించాడు. కృష్ణార్జున రెడ్డిని చూస్తూ పట్టరాని దుఃఖంతో మేకపాటి కుటుంబం గుండెలవిసేలా రోధించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement