నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది.
నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. దీని ప్రభావానికి అక్కడక్కడా ఇళ్లలోని వస్తువులు కొద్దిగా కదలడంతో పాటు కిందపడ్డాయి. జిల్లాలోని ఉదయగిరి, ఎస్.ఆర్ పురం, వరికుంటపాడు మండలాల్లో ఈ ప్రకంపనలు ఎక్కువగా కనిపించాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.