నెల్లూరు : నెల్లూరు జిల్లా దుత్తలూరు, వరికుంటపాడు మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై... ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. సదరు మండలాల్లోని నర్రవాడ, లక్ష్మీపురం, కమ్మరిపాలెం, బండకింద పల్లి, బోడెవారిపల్లి తదితర గ్రామాల్లో ఈ రోజు ఉదయం 9.10 గంటల ప్రాంతంలో భూమి రెండు సెకన్ల పాటు కంపించింది.
వారం రోజుల వ్యవధిలో రెండోసారి సదరు ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.