నెల్లూరు: నెల్లూరు జిల్లాలో గురువారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. పొదలకురు, వింజమురు, ఆత్మకూరు, దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. 3 సెకన్ల పాటూ భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా తరచుగా నెల్లూరు జిల్లాలో భూమి కంపిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల వ్యవధిలో ఇప్పటికే పలుమార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.